చిప్ దిగ్గజంపై ఆపిల్ న్యాయపోరాటం
చిప్ దిగ్గజంపై ఆపిల్ న్యాయపోరాటం
Published Thu, Jan 26 2017 5:53 PM | Last Updated on Mon, Aug 20 2018 2:55 PM
శాన్ఫ్రాన్సిస్కో : చిప్ తయారీదారి క్వాల్కామ్కు, టెక్ దిగ్గజం ఆపిల్కు న్యాయపోరాటం ఉధృతమవుతోంది. పేటెంట్ లైన్సెసింగ్ విధానంపై ఈ రెండు కంపెనీలు ఒకదానిపై ఒకటి విమర్శలు గుప్పించుకుంటున్నాయి. గతవారమే అమెరికాలో క్వాల్కామ్పై ఫిర్యాదు దాఖలు చేసిన ఆపిల్, ప్రస్తుతం చైనాలో కూడా ఆ కంపెనీపై దావా వేసింది. ఈ చిప్ తయారీదారి కంపెనీ మోనోపలీ అధికారాలను చెల్లాయిస్తుందని ఆపిల్ పేర్కొంటోంది. 1 బిలియన్ డాలర్ల(రూ.6,808కోట్లకు పైగా) దావాను క్వాల్కామ్ వ్యతిరేకంగా దాఖలు చేసినట్టు ఆపిల్ ధృవీకరించింది. ప్రస్తుతం ఈ చిప్ మేకర్ పేటెంట్ లైసెన్సింగ్ దోపిడీ విధానాన్ని చేపడుతుందని ఆపిల్ తన దావాలో పేర్కొంది.
బీజింగ్ ఇంటెలెచ్యువల్ ప్రాపర్టీ కోర్టులో మరో రెండు దావాలు వేసినట్టు ఆపిల్ తెలిపింది. నమ్మకద్రోహం కింద గతవారమే ఆపిల్, క్వాల్కామ్పై ఫిర్యాదు నమోదుచేసింది. చాలాఏళ్ల నుంచి క్వాల్కామ్ టెక్నాలజీస్పై అన్యాయంగా రాయల్టీలను వసూలు చేస్తుందని ఆపిల్ ఆరోపిస్తోంది. దీనిపై తామేమీ చేయలేకపోతున్నామని ఆపిల్ పేర్కొంటోంది.క్వాల్కామ్, ఆపిల్ రెండు కంపెనీలు కాలిఫోర్నియాకు చెందినవి. చైనా యాంటీ-మోనోపలీ చట్టాలను కంపెనీ ఉల్లంఘిస్తుందని ఫిర్యాదు దాఖలైనట్టు బీజింగ్ కోర్టు పేర్కొంది. ఈ రెండు దిగ్గజాల వివాదం గడిచేకొద్ది తీవ్ర స్థాయికి చేరుతోందని టెక్ విశ్లేషకులంటున్నారు.
Advertisement
Advertisement