legal fight
-
ట్విటర్‌పై మరో బాంబు వేసిన ఎలాన్ మస్క్
న్యూఢిల్లీ: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ట్విటర్‌పై మరో బాంబు వేశారు. తన 44 బిలియన్ డాలర్ల కొనుగోలు డీల్‌నుంచి బయటికి రావడాన్ని మరోసారి గట్టిగా సమర్ధించుకున్నారు. దీనికి సంబంధించిన కారణం చూపుతూ ట్విటర్‌కు ఒక లేఖ రాశారు. జూలైలో ట్విటర్ డీల్‌ను ఉపసంహరించు కుంటున్నట్టు ప్రకటించారు. ఆ తరువాత ఆగస్టులో మరొక లేఖలో, పీటర్ జాట్కో కోర్టుకు హాజరు కావాలని మస్క్ డిమాండ్ చేశారు. తాజాగా మూడో లేఖ రాయడం గమనార్హం. ట్విటర్ మాజీ సెక్యూరిటీ హెడ్ , విజిల్‌బ్లోయర్ పీటర్ జాట్కోకు మిలియన్ డాలర్లను చెల్లించిన విషయాన్ని తన వద్ద దాచిపెట్టిందని మండి పడ్డారు. దీనిపై ట్విటర్ మూడో లేఖను కూడా పంపించారు. ఈ మేరకు ట్విటర్ చీఫ్ లీగల్ ఆఫీసర్ విజయ గాడేకు సెప్టెంబర్ 9న లేఖ రాశారు. జాట్కోకు నెలల తరబడి జీతం ఇవ్వకపోవడం, ఇతర పరిహారం కింద సుమారు 7 మిలియన్ల డాలర్లు సెవెరెన్స్ పేమెంట్ చేసిందట. మరోవైపు మస్క్ ఆరోపణలపై ట్విటర్ ఇంకా స్పందించలేదు. (Dolo-650: వెయ్యికోట్ల ఫ్రీబీస్,ఐపీఏ సంచలన రిపోర్టు) కాగా ట్విటర్ నకిలీ ఖాతాలపై సమాచారం అందించలేదని ఆరోపించిన మస్క్ ట్విటర్ కొనుగోలు డీల్‌నుంచి జూలైలో వైదొలిగారు. దీన్ని వ్యతిరేకించిన ట్విటర్ కోర్టును ఆశ్రయించింది. ఈ వివాదంపై డెలావర్ కోర్టులో అక్టోబర్ 17న విచారణ ప్రారంభమవుతుంది. -
ఆపరేషన్ బ్లూస్టార్ హీరో న్యాయపోరాటం
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ‘దిశ’దుర్ఘటనకు నేటి(గురువారం)తో ఏడాది పూర్తయింది. వైద్యురాలైన దిశను శంషాబాద్ సమీపంలోని తొండుపల్లి గేటు వద్ద లారీ డ్రైవర్లు, క్లీనర్లు అపహరించి, లైంగికదాడి జరిపి దారుణంగా హతమార్చి, దహనం చేసిన ఘటనపై దేశం భగ్గుమంది. తర్వాత దిశను దహనం చేసిన షాద్‌నగర్ సమీపంలోని చటాన్‌పల్లి బ్రిడ్జి వద్దనే పోలీసుల ఎదురుకాల్పుల్లో నిందితులు మరణించిన సంగతి తెలిసిందే. దిశ మరణం తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, ఆమె జీవితంలో జరిగిన అత్యంత విషాద క్షణాలను సినిమాగా తీయడంపై ఆమె తండ్రి, మాజీ సైనికుడు శ్రీధర్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సినిమాను చట్టపరంగా ఆపేందుకు న్యాయస్థానంలో పోరాటం చేస్తున్నారు. రిజర్వ్ ఫోర్స్‌లో సేవలు! న్యాయపోరాటం చేస్తున్న నేపథ్యంలో దిశ తండ్రి, మాజీ సైనికుడు శ్రీధర్‌రెడ్డితో ‘సాక్షి’మాట్లాడింది. 1981 నుంచి 1987 వరకు శ్రీధర్‌రెడ్డి సైన్యంలో పనిచేశారు. పంజాబ్ కపుర్తలాలోని 12 ఆర్మ్డ్ రెజిమెంట్‌లో ఆయన విధులు నిర్వహించారు. 1984లో అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో దాక్కున్న ఉగ్రవాదులను ఏరిపారేసేందుకు సైన్యం ఆపరేషన్ బ్లూస్టార్ చేపట్టింది. ఈ పోరులో ఎంతోమంది సైనికులు అమరులయ్యారు. ఓ వైపు యుద్ధం జరుగుతుండగానే రిజర్వ్ ఫోర్స్ కింద 12వ ఆర్మ్డ్ రెజిమెంట్ పనిచేసింది. నేరుగా యుద్ధక్షేత్రంలోకి వెళ్లకపోయినా ఆ క్షణంలో అవసరమైతే ప్రాణాలర్పించేందుకు ఈ రెజిమెంట్ సిద్ధమైంది. అలాంటి తనకు ఈ సమాజం ఏమిచ్చిందని శ్రీధర్‌రెడ్డి వాపోయారు. ఇలాంటి మృగాల కోసమా తాను సరిహద్దులో గుండెలడ్డుపెట్టి పహారా కాసింది? అని ఆవేదన వ్యక్తం చేశారు. నోరులేని ఎన్నో మృగాలకు వైద్యం చేసి ప్రాణం పోసిన తన కూతురు మానవ మృగాల చేతిలో ప్రాణాలు కోల్పోతుందని ఎన్నడూ ఊహించలేదని కన్నీటి పర్యంతమయ్యారు. -
పరిహారం.. పరిహాసం
భూమి కోల్పోయిన రైతు పరిహారం కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. ముడుపులు ఇవ్వని కారణంగా ఫైలు ముందుకు కదలలేదు. కలెక్టరేట్ అధికారులు పరిహాసం ఆడుతున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అనంతపురం సిటీ: పెనుకొండలో నివాసముంటున్న బాబయ్యకు సంబంధించి సర్వేనంబరు 279లో ఉన్న 3.52 ఎకరాల భూమిని 2007లో జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ప్రభుత్వం తీసుకుంది. ఇందుకు గాను రూ. 2,93,473 ప్రభుత్వం పరిహారం కింద చెల్లించాల్సి ఉంది. బాబయ్య భూమిలో తనకు వాటా ఉందని సమీప బంధువు కోర్టును ఆశ్రయించాడు. ఈ ఫిర్యాదుతో పరిహారం చెల్లింపు ఆగిపోయింది. బాధిత కుటుంబ సభ్యులు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. జాతీయ రహదారికి ఇచ్చిన భూమి బాబయ్యదేనని పెనుకొండ న్యాయస్థానం తీర్పు నిచ్చింది. కోర్టు తీర్పు ప్రతితో పాటు పలు ఆధారాలతో కుటుంబ సభ్యులు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) అధికారుల చుట్టూ తిరిగారు. పరిహారం మంజూరైందని, కలెక్టర్ కార్యాలయంలోని ఓ సెక్షన్లో ఆగిందని ఎన్హెచ్ఏఐ అధికారులు తెలిపారు. లంచమిస్తే క్షణాల్లో ఇచ్చేస్తారట! దీంతో ఆ ఫైలును తీసుకుని బాధితుడు సెక్షన్ అధికారులను కలిశాడు. అక్కడ అధికారులు ఏడాదిన్నర కాలంగా డబ్బు చెల్లించకుండా.. ఏమైందో కారణాలు చెప్పకుండా నాన్చుతూ వచ్చారు. సహనం కోల్పోయిన బాధిత కుటుంబ సభ్యులు నేరుగా అధికారిని కలిసి ఏదో ఒక ‘మార్గం’ చెప్పండని అడిగారు. ‘పరిహారం మొత్తంలో సగం ఇస్తే క్షణాల్లో పని పూర్తీచేస్తాన’ని చెప్పడంతో కంగుతిన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని, లంచం ఇచ్చుకోలేమని, దయ చూపి పరిహారం ఇప్పించండి అని వేడుకున్నారు. కాదు.. కూడదూ అంటే ఉన్నతాధికారులను కలిసి తమ గోడు వెళ్లబోసుకుంటామని చెప్పారు. అయినా ఆ అధికారి కనికరించలేదు. ఈ కష్టం ఏ రైతుకూ రాకూడదు.. ప్రస్తుతం రైతు బాబయ్య ఆరోగ్యం నిలకడగా లేకపోవడంతో కుమారుడు వెంకటేష్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. పరిహారం డబ్బయినా చెల్లించండి.. లేదంటే తమ పొలమైనా తిరిగిస్తే పంట సాగు చేసుకుంటామని వారు కన్నీటి పర్యంతమయ్యారు. అన్నం పెట్టే పొలాన్ని వదులుకుని ఆ పొలం డబ్బు కోసం కోర్టుల చుట్టూ తిరిగే దుస్థితి ఏ రైతుకూ రాకూడదని వాపోతున్నారు. అధికారులు ఇకనైనా మా దీనస్థితిని అర్థం చేసుకుని న్యాయం చేయాలని కోరుతున్నారు. పరిహారమడిగితే పరిహాసమాడారు.. భూమి కోల్పోయిన తమకు పరిహారం ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలని బాబయ్య కుటుంబ సభ్యులు కలెక్టరేట్లో జరిగే ‘మీ కోసం’లో 12 సార్లు ఫిర్యాదు చేశారు. ‘ఏ ఒక్క ఫిర్యాదుపైనైనా ఎవరైనా స్పందించారా? ఎందుకు వృథా ప్రయాస చెప్పండం’టూ సదరు సెక్షన్ అధికారి పరిహాసం చేశాడు. మీరు ఎవరి వద్దకు వెళ్లినా పని చేయాల్సింది నేనే అన్న విషయాన్ని గుర్తెరగాలని పరోక్షంగా హెచ్చరించి పంపించేశాడు. -
నలభై రెండేళ్ల పోరాటం... దళిత రైతుల విజయం
► పూర్వీకుల భూమి కోసం ఫలించిన న్యాయ పోరాటం ► అసైన్మెంట్ రద్దు చెల్లదంటూ హైకోర్టు తీర్పు సాక్షి, హైదరాబాద్: తాతల నాటి భూమి... వారస త్వంగా వస్తుందనుకున్నది అసైన్మెంట్ రద్దు చేయడంతో వారికి కాకుండా పోయింది. తహసీల్దార్ మొదలు... హైకోర్టు వరకు... ముగ్గురు దళిత రైతులు నాలుగు దశాబ్దాలకు పైగా ధర్మ యుద్ధమే చేశారు. 1975 నుంచి కొనసాగుతున్న వీరి న్యాయ పోరాటం లో నలభై రెండేళ్ల తరువాత ఎట్టకేలకు విజయం సాధించారు. ఈ రైతుల పూర్వీకులకిచ్చిన అసైన్ మెంట్‌ను రద్దు చేస్తూ ఇన్చార్జి కలెక్టర్ హోదాలో అప్పటి జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. ఆ ఉత్తర్వులు చట్టవిరుద్ధమని తేల్చిచెప్పడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ అధికారం డీఆర్వోకు లేదు... అసైన్మెంట్ రద్దు చేసే అధికారం డీఆర్వోకు లేదని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. అంతేకాక భూమి స్వాధీనం విషయంలో అధికారులు సింగిల్ జడ్జిని సైతం తప్పుదోవ పట్టించారంది. రైతులకు వ్యతిరే కంగా సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్ర మణియన్, జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. ఆదిలా బాద్ జిల్లా, దస్నాపూర్ గ్రామంలో లంకా మోహన్, లంకా రాజారాం, లంకా ఆశన్నల పూర్వీకులకు రెవెన్యూ అధికారులు ఐదెకరాల వ్యవసాయ భూమిని 1961లో అసైన్మెంట్ కింద ఇచ్చారు. 1972లో అసైన్మెంట్ రద్దు నిమిత్తం అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 1975లో అప్పటి డీఆర్వో ఇన్చార్జి కలెక్టర్ హోదాలో అసైన్మెంట్ను రద్దు చేశారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ బాధితులు కలెక్టర్ ముందు అప్పీల్ చేశారు. అప్పీల్ పెండింగ్‌లో ఉండగానే, కొందరు అధికారులు వారిని ఆ భూముల నుంచి ఖాళీ చేయించేందుకు ప్రయత్నించగా లంకా మోహన్ తదితరులు 1987లో హైకోర్టును ఆశ్రయించారు. కమిషనర్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ సైతం కింది స్థాయి అధికారుల ఉత్తర్వులను సమర్థిస్తూ 2000లో ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ లంకా మోహన్, రాజాం, ఆశన్నలు హైకోర్టును ఆశ్రయించారు. తప్పుదోవ పట్టించారు... విచారణ జరిపిన సింగిల్ జడ్జి, అధికారులు చెప్పిన వివరాలను పరిగణనలోకి తీసుకుని పిటిష న్ను కొట్టేశారు. దీనిపై వారు ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌పై విచారణ జరిపిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించిం ది. అధికారులు ఇచ్చిన ఉత్తర్వులు ఆంధ్రప్రదేశ్ (తెలంగాణ ఏరియా) ల్యాండ్ రెవెన్యూ చట్టానికి విరుద్ధమని ధర్మాసనం స్పష్టం చేసింది. గడువు ముగిసిన తరువాత అసైన్మెంట్ను రద్దు చేశారం ది. 1979కి ముందే పిటిషనర్ల భూములను స్వాధీ నం చేసుకున్నామని అధికారులు సింగిల్ జడ్జిని నమ్మించారని, దాని ఆధారంగా ఆయన తీర్పుని చ్చారని తెలిపింది. కానీ రికార్డులను పరిశీలిస్తే అందుకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించామంది. -
చిప్ దిగ్గజంపై ఆపిల్ న్యాయపోరాటం
శాన్ఫ్రాన్సిస్కో : చిప్ తయారీదారి క్వాల్‌కామ్‌కు, టెక్ దిగ్గజం ఆపిల్‌కు న్యాయపోరాటం ఉధృతమవుతోంది. పేటెంట్ లైన్సెసింగ్ విధానంపై ఈ రెండు కంపెనీలు ఒకదానిపై ఒకటి విమర్శలు గుప్పించుకుంటున్నాయి. గతవారమే అమెరికాలో క్వాల్‌కామ్‌పై ఫిర్యాదు దాఖలు చేసిన ఆపిల్, ప్రస్తుతం చైనాలో కూడా ఆ కంపెనీపై దావా వేసింది. ఈ చిప్ తయారీదారి కంపెనీ మోనోపలీ అధికారాలను చెల్లాయిస్తుందని ఆపిల్ పేర్కొంటోంది. 1 బిలియన్ డాలర్ల(రూ.6,808కోట్లకు పైగా) దావాను క్వాల్కామ్ వ్యతిరేకంగా దాఖలు చేసినట్టు ఆపిల్ ధృవీకరించింది. ప్రస్తుతం ఈ చిప్ మేకర్ పేటెంట్ లైసెన్సింగ్ దోపిడీ విధానాన్ని చేపడుతుందని ఆపిల్ తన దావాలో పేర్కొంది. బీజింగ్ ఇంటెలెచ్యువల్ ప్రాపర్టీ కోర్టులో మరో రెండు దావాలు వేసినట్టు ఆపిల్ తెలిపింది. నమ్మకద్రోహం కింద గతవారమే ఆపిల్, క్వాల్‌కామ్‌పై ఫిర్యాదు నమోదుచేసింది. చాలాఏళ్ల నుంచి క్వాల్కామ్ టెక్నాలజీస్‌పై అన్యాయంగా రాయల్టీలను వసూలు చేస్తుందని ఆపిల్ ఆరోపిస్తోంది. దీనిపై తామేమీ చేయలేకపోతున్నామని ఆపిల్ పేర్కొంటోంది.క్వాల్కామ్, ఆపిల్ రెండు కంపెనీలు కాలిఫోర్నియాకు చెందినవి. చైనా యాంటీ-మోనోపలీ చట్టాలను కంపెనీ ఉల్లంఘిస్తుందని ఫిర్యాదు దాఖలైనట్టు బీజింగ్ కోర్టు పేర్కొంది. ఈ రెండు దిగ్గజాల వివాదం గడిచేకొద్ది తీవ్ర స్థాయికి చేరుతోందని టెక్ విశ్లేషకులంటున్నారు. -
దేశాలు గాలించి.. భర్తను పట్టుకుని..
కేరళకు చెందిన ఓ వ్యక్తి.. పాకిస్థాన్‌కు చెందిన ఓ బ్రిటిష్ యువతిని పెళ్లి చేసుకుని, తర్వాత ఆమెను వదిలేశాడు. అక్కడినుంచి పారిపోయి తన సొంత రాష్ట్రమైన కేరళలోని మలప్పురం జిల్లాకు వచ్చేశాడు. అయితే తన మాజీ భర్త ఎక్కడున్నాడో వెతికి వెతికి పట్టుకున్న సదరు మహిళ.. అతగాడితో సుదీర్ఘ న్యాయపోరాటం చేసి, భారీమొత్తంలో భరణం పొందింది. మలప్పురం జిల్లాలోని చవక్కడ్ ప్రాంతానికి చెందిన నౌషద్ హుస్సేన్ లండన్‌లో ఎంబీయే చదివేవాడు. అప్పట్లో పాకిస్థాన్‌కు చెందిన బ్రిటిష్ మహిళ మరియం ఖాలిక్ అక్కడ సేల్స్ ఆఫీసర్‌గా పనిచేసేది. ఆమెతో స్నేహం పెంచుకుని, 2013 ఏప్రిల్‌లో పెళ్లి చేసుకున్నాడు. ఏడాది తర్వాత ఇంటికి వెళ్లి తన తల్లిదండ్రులకు నచ్చజెప్పి కేరళలో మళ్లీ పెళ్లి చేసుకుందామని, తీసుకెళ్తానని చెప్పి నౌషాద్ యూకే వదిలి వెళ్లిపోయాడు. మొదట్లో కొన్నాళ్ల పాటు ఆమెకు ఫోన్ చేసేవాడు గానీ, తర్వాత ఫోన్లు ఆగిపోయాయి. కొంతకాలం తర్వాత తన తల్లిదండ్రులు ఈ పెళ్లికి ఒప్పుకోవడం లేదని, తాను యూకే తిరిగి రావట్లేదని ఓ లేఖ రాశాడు. అతడి గురించిన ఆధరాలేమీ పెద్దగా లేకపోవడంతో, ఆమె 2015లో తన పెళ్లి ఆల్బం తీసుకుని మలప్పురం వచ్చింది. ఆమె పాకిస్థాన్‌కు చెందినది కావడంతో పోలీసులు కూడా పెద్దగా సహకరించలేదు. ఆమె కష్టాలు తెలుసుకున్న స్నేహిత అనే స్వచ్ఛంద సంస్థ ఆమెకు సాయం చేయడానికి ముందుకొచ్చింది. రెండు నెలల తర్వాత నౌషాద్ మరో పెళ్లికి సిద్ధమవుతూ దొరికేశాడు. తనను భార్యగా అంగీకరించకపోవడంతో ఆమె అతడిపై కోర్టులో కేసు దాఖలు చేసింది. కోర్టు ఆమెను అతడి ఇంట్లోనే ఉండొచ్చని చెప్పినా, హుస్సేన్ రెండో పెళ్లి చేసుకున్నాడు. అత్తింటివాళ్లు తన వీసాను రద్దుచేయించడానికి, తనను భయపెట్టడానికి ప్రయత్నించినా ఆమె మాత్రం వెనకడుగు వేయలేదు. పలువురు న్యాయవాదులు ఆమెకు దన్నుగా వచ్చారు. చివరకు ఇంగ్లండ్‌లో ఉండేందుకు సరిపోయేలా ఒకేసారి ఆమెకు పెద్దమొత్తంలో భరణం ఇచ్చేందుకు నౌషాద్ అంగీకరించాడు. తన పోరాటం కేవలం డబ్బు కోసం కాదని, తన జీవితంతో ఆడుకున్నందుకు అతడికి గుణపాఠం చెప్పేందుకేనని ఆమె తెలిపింది. మహిళలను తేలిగ్గా తీసుకోడానికి వీల్లేదని, యూకే వెళ్లేముందు ఒకసారి భారతదేశం అంతా చూస్తానని చెప్పింది. ఇక్కడి ప్రజలు చాలా స్నేహపూర్వకంగా ఉంటారని కృతజ్ఞతలు కూడా తెలిపింది.