గుంటూరు, సాక్షి: తిరుపతిలో పాలనాపరమైన వైఫల్యంతో తొక్కిసలాట జరిగి ఆరుగురు మరణిస్తే.. ప్రభుత్వం తూతూ మంత్రపు చర్యలతో సరిపెట్టింది. ఈ పరిణామంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు.. ఈ విషయంలో ప్రభుత్వంపై న్యాయపోరాటానికి వైఎస్సార్‌సీపీ సిద్ధమైంది.
క్రౌడ్ మేనేజ్‌మెంట్‌లో ఘోర వైఫల్యానికి ముఖ్య కారణం ఎస్పీ సుబ్బారాయుడు. వైకుంఠ ద్వారా దర్శన టోకెన్ల కోసం వేలమంది వస్తారని తెలిసి కూడా ఆయన పర్యవేక్షణ చేయలేదు. పైగా నిర్లక్ష్యంగా కిందిస్థాయి సిబ్బందికి బాధ్యతలు అప్పగించి పక్కకు తప్పుకున్నారు. ఈ విషయం సీఎం చంద్రబాబు దృష్టికి కూడా వెళ్లింది. దీంతో ఆయనపై కఠిన చర్యలు తీసుకుంటారేమోనని అంతా అనుకున్నారు. అయితే..
తొక్కిసలాటకు ప్రధాన కారకుడైన ఎస్పీ సుబ్బరాయుడును కేవలం ట్రాన్స్‌ఫర్‌తోనే సరిపెట్టింది ప్రభుత్వం. దీంతో.. ప్రభుత్వ వైఖరిపై న్యాయపోరాటం చేయాలని వైఎస్సార్‌సీపీ భావిస్తోంది. ఈ పోరాటంపై పార్టీ నుంచి త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
అవి పచ్చి అబద్ధాలు: భూమన
హైందవ భక్తులు అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మాపై ఎల్లో మీడియా చేస్తున్న ఆరోపణలు అన్ని పచ్చి అబద్ధాలు అని గుర్తించాలి. భక్తులు ప్రాణాలు కోల్పోతే లెక్కలేనితంగా ఈరోజు టీటీడీ వ్యవహరిస్తోంది. జిల్లా ఎస్పీ పై చర్యలు తీసుకోకుండా నామ మాత్రంగా బదిలీ చేసి. ప్రభుత్వం జాప్యం చేస్తోంది. టీటీడీ ఈవ, అడిషనల్ ఈవో, తిరుపతి జిల్లా ఎస్పీలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలి అని టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment