న్యూఢిల్లీ: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ట్విటర్‌పై మరో బాంబు వేశారు. తన 44 బిలియన్ డాలర్ల కొనుగోలు డీల్‌నుంచి బయటికి రావడాన్ని మరోసారి గట్టిగా సమర్ధించుకున్నారు. దీనికి సంబంధించిన కారణం చూపుతూ ట్విటర్‌కు ఒక లేఖ రాశారు. జూలైలో ట్విటర్ డీల్‌ను ఉపసంహరించు కుంటున్నట్టు ప్రకటించారు. ఆ తరువాత ఆగస్టులో మరొక లేఖలో, పీటర్ జాట్కో కోర్టుకు హాజరు కావాలని మస్క్ డిమాండ్ చేశారు. తాజాగా మూడో లేఖ రాయడం గమనార్హం.
ట్విటర్ మాజీ సెక్యూరిటీ హెడ్ , విజిల్‌బ్లోయర్ పీటర్ జాట్కోకు మిలియన్ డాలర్లను చెల్లించిన విషయాన్ని తన వద్ద దాచిపెట్టిందని మండి పడ్డారు. దీనిపై ట్విటర్ మూడో లేఖను కూడా పంపించారు. ఈ మేరకు ట్విటర్ చీఫ్ లీగల్ ఆఫీసర్ విజయ గాడేకు సెప్టెంబర్ 9న లేఖ రాశారు. జాట్కోకు నెలల తరబడి జీతం ఇవ్వకపోవడం, ఇతర పరిహారం కింద సుమారు 7 మిలియన్ల డాలర్లు సెవెరెన్స్ పేమెంట్ చేసిందట. మరోవైపు మస్క్ ఆరోపణలపై ట్విటర్ ఇంకా స్పందించలేదు. (Dolo-650: వెయ్యికోట్ల ఫ్రీబీస్,ఐపీఏ సంచలన రిపోర్టు)
కాగా ట్విటర్ నకిలీ ఖాతాలపై సమాచారం అందించలేదని ఆరోపించిన మస్క్ ట్విటర్ కొనుగోలు డీల్‌నుంచి జూలైలో వైదొలిగారు. దీన్ని వ్యతిరేకించిన ట్విటర్ కోర్టును ఆశ్రయించింది. ఈ వివాదంపై డెలావర్ కోర్టులో అక్టోబర్ 17న విచారణ ప్రారంభమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment