న్యూఢిల్లీ: గత కొన్నాళ్లుగా అనేక మలుపులు తిరిగిన ట్విటర్ డీల్ ఎట్టకేలకు పూర్తయింది. 44 బిలియన్ డాలర్లకు బిలియనీర్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ సొంతమైంది. దీంతో ట్విటర్ బర్డ్ మస్క్ గూటికి చేరింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫాంను స్వాధీనం చేసుకున్న తర్వాత తొలిసారి స్పందిస్తూ ‘ద బర్డ్ ఈజ్ ఫ్రీడ్’ అంటూ మస్క్ ట్వీ ట్ చేశారు. అంటే నకిలీ ఖాతాలకు తావులేకుండా, భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలగకుండా యూజర్లకు అనుమతిస్తాననే సంకేతాలిచ్చారు. దీంతో ఈ ట్వీట్ లైక్‌లు, కమెంట్స్, రీట్వీట్లతో మోస్ట్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. అయితే దీనిపై నెటిజన్ల రియాక్షన్లు విభిన్నంగా ఉండటం గమనార్హం.
మరోవైపు ట్విటర్ బాస్‌గా మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ట్వీటర్ సీఈవో పరాగ్ అగర్వాల్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సెగల్,లీగల్ అఫైర్స్ అండ్ పాలసీ చీఫ్ విజయ గద్దెపై వేటు వేశారని వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది.
This makes me so happy. It’s a great day for freedom.
— Matthew Marsden (@matthewdmarsden) October 28, 2022
చదవండి:Twitter: మస్క్ ఎంట్రీ.. సీఈఓ ఔట్!
the bird is freed
— Elon Musk (@elonmusk) October 28, 2022
Comments
Please login to add a commentAdd a comment