వాషింగ్టన్: టెస్లా సంస్థ సీఈవో ఎలన్ మస్క్‌కు ఏం చేసినా అది వార్తల్లో నిలుస్తుంది. అంతేనా కొన్ని సార్లు ఆ వార్తలే సంచలనంగా కూడా మారుతాయి. తాజాగా ఈ ప్రపంచ కుబేరుడు ట్విటర్ సంస్థకు భారీ షాక్‌నే ఇచ్చారు. సుమారు 44 బిలియన్ల డాలర్లతో ట్విటర్‌తో గతంలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు మస్క్ తెలిపారు. అయితే ఈ నిర్ణయంపై ట్విట్టర్ స్పందించింది. మస్క్‌పై న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ఆ సంస్థ తెలిపింది. తాము గతంలో ఒప్పందం కుదుర్చుకున్న ధరకు, నిబంధనలకు లోబడే కట్టుబడి ఉన్నట్లు ట్విటర్ బోర్డ్ చైర్మెన్ బ్రెట్ టేలర్ తెలిపారు.
ఒప్పందం మొదలు ఇదే రచ్చ..
ట్విట్టర్‌ను కొనుగోలు చేయనున్నట్లు ఏప్రిల్‌లో ఎలాన్ మస్క్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దీనికి సంబంధించిన ఒప్పందాలు కూడా ట్విటర్‌తో కుదుర్చుకున్నారు మస్క్. ఇక్కడ వరకు సీన్ అంతా సాఫీగానే జరిగింది. మే నెల మొదలుకొని.. ట్విటర్‌లో ఫేక్ అకౌంట్ల (స్పామ్ అకౌంట్లు) గురించిన సమాచారం ఒప్పంద సమయంలో సరిగా ఇవ్వలేదని ట్విట్టర్‌పై మస్క్ అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో మొత్తం యూజర్లలో ఫేక్ లేదా స్పామ్ యూజర్లు కేవలం 5 శాతం లోపు మాత్రమే ఉన్నారన్న విషయాన్ని ట్విటర్ నిరూపించాలని మస్క్ కండీషన్ పెట్టారు.
మొత్తంగా స్పామ్ అకౌంట్ల విషయంలో ట్విట్టర్ సంస్థ సరైన సమాచారాన్ని ఇవ్వడంలో విఫలమైందని అందుకే తాను ఈ డీల్ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. కాగా డీల్ నిబంధనల ప్రకారం మస్క్ లావాదేవీని పూర్తి చేయకపోతే $1 బిలియన్ బ్రేక్-అప్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మరో వైపు ట్విటర్ కూడా మస్క్‌పై న్యాయపరమైన చర్యలకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఎలాన్ మస్క్, ట్విట్టర్ మధ్య యుద్ధం ఎలా కొనసాగుతుందో చూడాలి.
చదవండి: బ్యాంక్ ఆఫ్ ఇండియా,ఫెడరల్ బ్యాంకుకు ఆర్బీఐ షాక్!
Comments
Please login to add a commentAdd a comment