Chief Twit Elon Musk Visits Twitter Office Carrying Bathroom Sink, Video Goes Viral - Sakshi
Sakshi News home page

చీఫ్‌ ట్విట్‌ అట! సింక్‌తో హింట్‌! మస్క్‌ వీడియో వైరల్‌, పేలుతున్న సెటైర్లు 

Published Thu, Oct 27 2022 12:03 PM | Last Updated on Thu, Oct 27 2022 12:35 PM

Chief Twit Elon Musk carried a sink to Twitter HQ viral video - Sakshi

న్యూఢిల్లీ: బిలియనీర్‌, టెస్లా సీఈవోఎలాన్‌ మస్క్‌ ట్విటర్ కొనుగోలు డీల్‌ ఇక ఖాయమైనట్టే కనిపిస్తోంది. ఈ శుక్రవారంతో డీల్‌ పూర్తి అవుతుందని కో ఇన్వెస్టర్లతో ప్రకటించిన మస్క్‌ శాన్‌ఫ్రాన్సిస్కోలోని ట్విటర్ ప్రధాన కార్యాలయంలో  ప్రత్యేకంగా  దర్శనమివ్వడం ఈ వార్తలకు బలాన్నిస్తోంది. దీనికి సంబంధించి ఒక వీడియోను స్వయంగా ‘లెట్ దట్ సింక్ ఇన్!’ అంటూ ట్విటర్‌లోపోస్ట్ చేశారు మస్క్‌. డీల్‌ డన్‌ అనేందుకు  సింబాలిక్‌గా  ‘సింక్‌‍’  తో ఎంట్రీ ఇచ్చిన మస్క్‌ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.  దీంతో మిశ్రమంగా స్పందిస్తూ నెటిజన్లు మీమ్స్‌ సందడి చేస్తున్నారు. (Elon Musk ట్విటర్‌ డీల్‌: మస్క్‌ మరోసారి సంచలన నిర్ణయం!)

అంతేకాదు చీఫ్‌ ట్విట్‌.. బయోలో ప్రకటించుకోవడం విశేషం. 44 బిలియన్ డాలర్లతో (సుమారురూ.3.56 లక్షల కోట్లు) ట్విటర్‌ను కొనుగోలు చేసేందుకు మస్క్ పావులు కదుపుతున్నారు. మరోవైపు ట్విటర్‌ కొనుగోలు తరువాత 75 శాతం ఉద్యోగులకు మస్క్‌ ఉద్వాసన పలకనున్నారనే వార్తలపై అలాంటి ఆలోచన ఏదీ లేదని ట్విటర్‌ క్లారిటీ ఇచ్చినప్పటికీ, ఉద్యోగులు మాత్రం ఆందోళనలో ఉన్నట్టు  తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే గ్లోబల్‌గా భారీ ఆదాయాన్ని అందిస్తున్న యాక్టివ్‌ యూజర్లను  ట్విటర్‌ కోల్పోతోందని  అంతర్గత నివేదిక ఆధారంగా  రాయిటర్స్‌  రిపోర్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. (చిక్కుల్లో ట్విటర్‌: వారు గుడ్‌బై, ఆదాయం ఢమాల్‌..రీజన్‌?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement