ఈ మధ్య చైనాకు, అమెరికాకు పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో సంబంధాలు బలహీనపడ్డాయి. చైనాపై అగ్రరాజ్యం తీవ్ర ఆరోపణలు చేయడం, వాటిని డ్రాగన్ కొట్టిపడేయడం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వివాదాలు మరింత రాజుకునేలా, ఓ ఆశ్చర్యకరమైన రిపోర్టు వెలుగులోకి వచ్చింది. అమెరికా అగ్ర కంపెనీలైన ఆపిల్, అమెజాన్ వంటి 20 కంపెనీలపై చైనా గూఢాచార్యం చేస్తుందని ఓ యూఎస్ పబ్లికేషన్ ప్రచురించింది. చైనా ఫ్యాక్టరీలు తయారుచేసిన మదర్‌బోర్డును వాడుతున్న అమెరికా కంపెనీలపై డ్రాగన్ గూఢాచార్యం చేస్తుందట. ఆ మదర్‌బోర్డ్‌లో ఓ మైక్రోచిప్‌ను అమర్చి, అమెజాన్, ఆపిల్ వంటి 28 ఇతర అమెరికా కంపెనీలు, సంస్థల సర్వర్లను చైనా హ్యాక్ చేస్తుందని తాజా రిపోర్టు పేర్కొంది.
సూపర్ మైక్రో మదర్ బోర్డుల్లో అమర్చే ఈ చిన్న చిప్‌లు చైనీస్ గూఢాచారులకు అనుమతిస్తున్నాయని రిపోర్టు వెల్లడించింది. దీంతో ఈ మదర్ బోర్డులను వాడే డేటా సెంటర్లు, కంప్యూటర్లలోకి హ్యాకర్లు, గూఢాచారులు చొచ్చుకుపోతున్నట్టు తెలిపింది. 2015లోనే మదర్‌బోర్డుల్లో ఈ చైనీస్ చిప్‌ను గుర్తించినట్టు పేర్కొంది. అయితే ఈ విషయాన్ని ఎంతో సీక్రెట్‌గా ఉంచి, అమెరికన్ అధికారులు విచారణ జరుపుతున్నారు. దాదాపు మూడేళ్ల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. చాలా మంది అధికారులకు ఈ విషయం తెలుసని బ్లూమ్‌బర్గ్ రిపోర్టు చేసింది. చైనా ఫ్యాక్టరీల్లో మదర్‌బోర్డులను తయారు చేసేటప్పుడే ఈ చిప్‌లను అమర్చుతారట. హై-వాల్యు కార్పొరేట్ సీక్రెట్లను, ప్రభుత్వ నెట్‌వర్క్‌ల కీలక డేటా సుదీర్ఘ కాలం పాటు యాక్సస్ చేసుకోవడమే చైనా లక్ష్యమని ఓ ప్రభుత్వ అధికారి చెప్పారు.అయితే మదర్‌బోర్డులో చిప్‌లను అమర్చి, గూఢాచారం చేపడుతుందని తనపై వస్తున్న ఆరోపణలు చైనా ప్రభుత్వం కొట్టిపారేసింది.
Comments
Please login to add a commentAdd a comment