spying
-
ఆత్మావలోకనం
మానవ అస్తిత్వాన్ని గురించిన చర్చ ప్రపంచంలో చిరకాలంగా ఉంది. మానవ దేహం సజీవంగా ఉన్నంత వరకు అందులో చైతన్యం ఉంటుంది. ఆ చైతన్యాన్నే ప్రాణం అంటున్నాం. శరీరాన్ని విడిచి ప్రాణం పోవడమే మరణం. మరణించిన తర్వాత శరీరాన్ని దహనం చేయడమో, పూడ్చిపెట్టడమో చేస్తారు. మరణం తర్వాత ప్రాణం ఏమవుతుందనే దానిపై రకరకాల ఊహలు ఉన్నాయి; దీనిపై రకరకాల ఆధ్యాత్మిక సిద్ధాంతాలు ఉన్నాయి; రకరకాల మత విశ్వాసాలు ఉన్నాయి. శరీరాన్ని సజీవంగా నిలిపి ఉంచే చైతన్యాన్నే ఆధ్యాత్మికవేత్తలు ఆత్మ అంటారు. ‘నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః/ న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః’ అని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పాడు. ఆత్మను ఆయుధాలు ఖండించలేవు, అగ్ని దహించలేదు, నీరు తడపలేదు, గాలి ఆరబెట్టలేదు. గీతాసారం ప్రకారం ఆత్మ సమస్త ప్రకృతి శక్తుల ప్రభావానికీ అతీతమైనది. జీర్ణవస్త్రాన్ని విడిచి కొత్త వస్త్రాన్ని తొడుక్కున్నట్లే, జీర్ణశరీరాన్ని విడిచిన ఆత్మ తిరిగి కొత్త శరీరాన్ని వెతుక్కుని వెళుతుందనే నమ్మకం కూడా ఉంది. ‘పునరపి జననం పునరపి మరణం/ పునరపి జననీ జఠరే శయనం’ అని ఆదిశంకరుడు చెప్పాడు. శరీరం మరణించినా, ఆత్మకు మాత్రం జనన మరణ పరిభ్రమణం తప్పదని ఆయన సారాంశం. ఆత్మకు మరణం లేదనే నమ్మకం ప్రపంచంలోని చాలా మతాల్లో ఉంది. ఆత్మ మరణం లేనిదే కాదు, ఆద్యంత రహితమైనది కూడానని జైనుల సిద్ధాంతం. సమస్త సృష్టిలోని సూక్షా్మతి సూక్ష్మ క్రిమి కీటకాలు మొదలుకొని మనుషులు సహా భారీ జంతువుల వరకు సమస్త జీవుల్లోనూ ఆత్మ ఉంటుందని జైనుల విశ్వాసం.చైనాకు చెందిన తావో మతమైతే– ప్రతి వ్యక్తిలోనూ ‘హున్’, ‘పో’ అనే రెండు రకాల ఆత్మ ఉంటుందని, ఈ రెండు రకాలు ‘యాంగ్’, ‘యిన్’ అనే సానుకూల, ప్రతికూల శక్తులతో నిండి ఉంటుందని చెబుతుంది. తావో మతం కూడా పునర్జన్మలను నమ్ముతుంది. ఆధునికుల్లో చాలా మంది మతాలకు అతీతంగా ఆత్మ అస్తిత్వాన్ని తెలుసుకోవడానికి, దానిని నిర్వచించడానికి ప్రయత్నించారు. ‘నేను’ అనే స్పృహ ఆత్మకు మూలమని, అలాగని ఆత్మ అస్తిత్వాన్ని నిరూపించడం గాని, ఖండించడం గాని సాధ్యం కాదని జర్మన్ తత్త్వవేత్త ఇమ్మాన్యుయేల్ కాంట్ చెప్పాడు.ఆత్మ అస్తిత్వాన్ని గురించి ఎన్నో సిద్ధాంతాలు, కల్పనలు, విశ్వాసాలు ఉన్నాయి. ఆత్మ పదార్థమా, కాదా అనే సంగతి ఇంతవరకు ఎవరూ చెప్పలేదు. ఒకవేళ పదార్థమే అయితే, అది ఏ స్థితిలో ఉంటుందో కూడా చెప్పలేదు. అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త డంకన్ మెక్‌డూగల్ ఆత్మకు బరువు ఉంటుందని, ఆ బరువు ఇరవై ఒక్క గ్రాములని ఒక ప్రయోగం చేసి మరీ చెప్పాడు. ఆ తర్వాతి కాలంలో రాబర్ట్ ఎల్ పార్క్, బ్రూస్ హుడ్ వంటి శాస్త్రవేత్తలు మెక్‌డూగల్ ప్రయోగంలో శాస్త్రీయత లేదంటూ కొట్టి పారేశారు. మరణానంతరం ఆత్మ ఏమవుతుందనే దానిపై మత సిద్ధాంతాలు ఎలా ఉన్నా, దీనిపై చాలామందికి తీరని సందేహాలు ఉన్నాయి. మరణంతోనే ఒక జీవి చరిత్ర పరిసమాప్తమైపోతుందని, ఆత్మ అనేది ఏదీ ఉండదని హేతువాదులు అంటారు. ఆధ్యాత్మికవేత్తల్లోనే కాదు, సాహితీవేత్తల్లోనూ ఆత్మ అస్తిత్వానికి సంబంధించిన పరిపరి విధాల అభిప్రాయాలు ఉన్నాయి. ‘మరుజన్మ ఉన్నదో లేదో/ ఈ మమతలప్పుడేమవుతాయో’ అన్నారు ఆత్రేయ. ‘చచ్చిపోయి జీవి ఎచ్చట కేగునో/ ఏమి యగునో ఎవరికెరుగ రాదు/ ఎరుకలేని వారలేమేమొ చెప్పగా/ విని తపించువారు వేన వేలు’ అన్నారు అబ్బూరి రామకృష్ణారావు. ఆయన తన జీవిత చరమాంకంలో చెప్పిన పద్యమిది. ఆత్మ గురించి, ‘ఆత్మజ్ఞానం’ గురించి వివిధ మతాల్లో అనేకానేక సిద్ధాంతాలు ఉన్నాయి. ఆత్మ అస్తిత్వంపై అనేక విశ్వాసాలు ఉన్నాయి. ఆత్మ ఉందనేందుకు శాస్త్ర సాంకేతిక నిరూపణలు లేకున్నా, ఆత్మ అనే భావన సహస్రాబ్దాలుగా మానవాళిపై ప్రభావం చూపుతోంది. ఆత్మ భావన ప్రభావం మత సిద్ధాంతాలతో పాటు తత్త్వశాస్త్రంలోను, సాహిత్యంలోను, ఇతర సృజనాత్మక కళలలోను కనిపిస్తుంది. ‘ఆత్మ’ భావన చాలావరకు ఆస్తికుల ప్రవర్తనను నియంత్రిస్తూ వస్తోంది. కర్మ సిద్ధాంతానికి, పాప పుణ్యాల విచక్షణకు, పాపభీతికి మూలం ‘ఆత్మ’ భావనే! ఆత్మ అస్తిత్వాన్నే గుర్తించనివారు ప్రపంచ జనాభాలో అతి తక్కువమంది మాత్రమే ఉంటారు. కృత్రిమ మేధ మనుషుల రోజువారీ జీవితాలను ప్రభావితం చేస్తున్న వర్తమాన కాలంలో కూడా ఆత్మ అస్తిత్వాన్ని నమ్మేవాళ్లే ఎక్కువ.ఇప్పటి వరకు ప్రపంచానికి తెలిసి ఆధునిక శాస్త్రవేత్తలెవరూ ఆత్మ అస్తిత్వాన్ని గురించి పెద్దగా పరిశోధనలు సాగించలేదు. అయితే, అమెరికా రక్షణశాఖ ప్రధాన కేంద్రం ‘పెంటగాన్’ ఈ అంశంపై 1983లోనే పరిశోధన చేసింది. మనిషి మరణించినా ఆత్మ మరణించదంటూ లెఫ్టినెంట్ కల్నల్ వేయన్ మెక్‌డోనల్ తన పరిశోధన పత్రంలో రాశారు. అమెరికా గూఢచర్య సంస్థ ‘సీఐఏ’ 2003లో బహిర్గతపరచిన రహస్య పత్రాల్లో ఇది కూడా ఉంది. అయితే, ఇటీవలే ఇది వెలుగులోకి రావడంతో పాశ్చాత్య పత్రికలు, ప్రసార సాధనాల్లో పలు వ్యాఖ్యానాలతో కూడిన కథనాలు వెలువడ్డాయి. ధ్యానస్థితిలో సూక్ష్మశరీరయానం అనుభవాల గురించి ఆధ్యాత్మికవేత్తలు, యోగసాధకులు చెబుతుంటారు. దీనినే ‘ఔటాఫ్ బాడీ ఎక్స్పీరియెన్సెస్’ అంటున్నారు. గూఢచర్యంలో ఇలాంటి అనుభవాలను ఉపయోగించుకోవడం ఎలా అనేదానిపైనే మెక్‌డోనల్ పరిశోధన చేశారు. దీనిపై శాస్త్రవేత్తలు ఏమేరకు ఆత్మావలోకనం చేసుకుంటారో చూడాలి. -
గూఢచర్యం కేసు.. ‘బ్రహ్మోస్’ మాజీ ఇంజినీర్‌కు జీవిత ఖైదు
నాగ్‌పూర్: బ్రహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్ మాజీ ఇంజినీర్ నిషాంత్ అగర్వాల్‌కు నాగ్‌పూర్ సెషన్స్‌కోర్టు జీవిత ఖైదు విధించింది. నాగ్‌పూర్‌లోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ టెక్నికల్ రీసెర్చ్ విభాగంలో నాలుగేళ్లు పనిచేసిన నిషాంత్ అగర్వాల్ పాకిస్థాన్‌కు ప్రాజెక్టు కీలక రహస్యాలను చేరవేశాడని కోర్టులో రుజువైంది. దీంతో కోర్టు నిషాంత్‌కు 14 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.3వేల జరిమానా విధించింది. పాక్ గూడఛారి సంస్థ ఐఎస్ఐకి రహస్యాలు చేరవేస్తున్న నిషాంత్‌ను మిలిటరీ ఇంటెలిజెన్స్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ 2018లో అరెస్టు చేశాయి. అనంతరం నిషాంత్‌పై ఐపీసీతో పాటు అఫీషియల్స్ సీక్రెట్ యాక్ట్ చట్టాల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో 2018 నుంచి జైలులో ఉన్న నిషాంత్‌కు ఈ ఏడాది ఏప్రిల్‌లోనే మహారాష్ట్ర హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ బెయిల్ మంజూరు చేసింది. డీఆర్డీవో, మిలిటరీ పారిశ్రామిక కన్సార్టియం సంయుక్తంగా బ్రహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్ కంపెనీని ఏర్పాటు చేశాయి. -
డేంజర్ యాప్స్.. మీ ఫోన్లో ఇప్పుడే తొలగించండి..
వినియోగదారుల సమాచార భద్రతకు ముప్పుగా పరిణమించిన పలు మొబైల్ యాప్‌లను గూగుల్ ఇటీవల తన ప్లేస్టోర్ నుంచి తొలగించింది. సైబర్ సెక్యూరిటీ సంస్థ ఈసెట్(ESET) ఈ ఏడాది గూగుల్ ప్లేస్టోర్‌లో 18 లోన్ యాప్‌లను స్పైలోన్ యాప్‌లుగా గుర్తించింది. కోట్లాది డౌన్లోడ్స్ ఉన్న ఈ లోన్‌యాప్‌లు వినియోగదారుల ఫోన్ల నుంచి వారి వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నాయి. ఈ సమాచారాన్ని రుణగ్రహీతలను బ్లాక్మెయిల్ చేసి అధిక వడ్డీ రాబట్టడానికి దుర్వినియోగం చేస్తున్నాయి. ఇటువంటి యాప్‌లకు సంబంధించిన వివరాలను ఈసెట్ పరిశోధకులు తెలియజేశారు. ఈ యాప్‌లు ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆగ్నేయాసియాలోని వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్నట్లు చెబుతున్నారు. ఈసెట్ గుర్తించిన 18 డేంజర్ యాప్‌లలో 17 యాప్‌లను గూగుల్ ఇప్పటికే తొలగించింది. ఒకటి మాత్రం ఇప్పటికీ యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉంది. అయితే ఇది యాక్టివ్ స్థితిలో లేదు. గూగుల్ ప్లేస్టోర్‌లో తొలగించిన ఈ యాప్‌ను ఇక్కడ ఇస్తున్నాం.. ఇవి మీ మొబైల్ ఫోన్లో ఉంటే ఇప్పుడే తొలగించండి.. డేంజర్ యాప్స్ ఇవే.. ఏఏ క్రెడిట్ (AA Kredit) అమోర్ క్యాష్ (Amor Cash) గేయబాక్యాష్ (GuayabaCash) ఈజీ క్రెడిట్ (EasyCredit) క్యాష్‌వావ్ (Cashwow) క్రెడిబస్ (CrediBus) ఫ్లాష్‌లోన్ (FlashLoan) ప్రెస్టమోస్క్రెడిటో (PréstamosCrédito) ప్రెస్టమోస్ డి క్రెడిట్-యుమికాష్ (Préstamos De Crédito-YumiCash) గో క్రెడిటో (Go Crédito) ఇన్స్టంటానియో ప్రెస్టమో (Instantáneo Préstamo) కార్టెరా గ్రాండే (Cartera grande) రాపిడో క్రెడిటో (Rápido Crédito) ఫైనప్ లెండింగ్ (Finupp Lending) ఫోర్‌ఎస్ క్యాష్ (4S Cash) ట్రూనైరా (TrueNaira) ఈజీ క్యాష్ (EasyCash) ఇది కూడా చదవండి: టెక్ ప్రపంచంలో సంచలనం.. ఈ యేటి మేటి సీఈవో ఈయనే.. -
నేవీ మాజీ అధికారుల మరణశిక్షపై ఊరట
దోహా: భారత నౌకాదళానికి చెందిన మాజీ అధికారుల మరణశిక్ష వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎనిమిది మంది భారతీయులకు విధించిన మరణ శిక్ష విధించడాన్ని సవాల్ చేస్తూ భారత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను ఖతార్ కోర్టు అనుమతించింది. ఈ మేరకు నిర్బంధంలో ఉన్న మాజీ నావికాధికారుల కుటుంబాలకు చెందిన సన్నిహిత వర్గాల సమాచారం అందినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. భారత అప్పీల్‌ను కోర్టు అంగీకరించిందని, ఈ కేసులో తుది నిర్ణయంపై పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నాయి. అయితే విచారణ తేదీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. దీనికి సంబంధించి విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ నుంచి అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. కాగా మరణ శిక్షను ఎదుర్కొంటున్న వీరంతా భారత నావికాదళంలో ముఖ్యమైన పదవుల్లో దాదాపు 20 సంవత్సరాలపాటు సేవలందించారు. ఖతార్ సాయుధ దళాలకు శిక్షణ, సంబంధిత సేవలను అందించే ప్రైవేటు భద్రతా సంస్థ దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో పనిచేస్తూ ఇజ్రాయెల్ తరపున ఓ సబ్‌మెరైన్ ప్రోగ్రాం కోసం తమ దేశంలో గూఢచర్యానికి పాల్పడినట్లు వీరిపై ఖతార్ ఆరోపణలు మోపింది. చదవండి: కాల్పుల్లో గాయపడిన భారతీయ విద్యార్థి మృతి ఈ నేపథ్యంలో 2022 ఆగస్టు 30న ఎనిమిది మంది అధికారులను అరెస్ట్ చేశారు. గత అక్టోబర్ నెలలో దేశ న్యాయస్థానం వీళ్లకు మరణ శిక్ష విధిస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై భారత ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఈ అంశాన్ని తీవ్రమైనదిగా పరిగరణించింది. ఎనిమిది మంది మాజీ నేవీ సిబ్బందికి మరణశిక్ష విధించడంపై ఖతార్‌లో అప్పీల్ దాఖలు చేసినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి నవంబర్ 9న వెల్లడించారు. ఈ తీర్పు రహస్యంగా ఉందని, న్యాయ బృందంతో మాత్రమే దీనిపై చర్చిస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు తదుపరి చట్టపరమైన చర్యలను కొనసాగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మరణ శిక్ష పడిన వారిలో..కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ్, కమాండర్ అమిత్ నాగ్‌పాల్, కమాండర్ తివారీ, కమాండర్ సుగుణాకర్ పాకాల, కమాండర్ సంజీవ్ గుప్తా, సెయిలర్ రాగేగ్లు ఉన్నారు. సంబంధిత వార్త: అది సున్నితమైన అంశం.. ఊహాగానాలు నమ్మొద్దు -
మీ మొబైల్ భద్రమా? ఉన్నట్టుండి బ్యాటరీ డౌన్, తెలియకుండానే డాటా ఖతం!
రోజురోజుకి టెక్నాలజీ విపరీతంగా పెరుగుతున్న క్రమంలో మనకు కావాల్సిన సమాచారం మొత్తం మన చేతిలో (స్మార్ట్‌ఫోన్‌లో) ఉంచుకుంటున్నాము. అయితే కొంతమంది మన సమాచారాన్ని తెలుసుకోవడానికి హ్యాక్ చేస్తూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఇది చాలా ఎక్కువైపోయింది. మన ఫోన్లో మన ప్రమేయం లేకుండా మనకు సంబంధించిన సమాచారం ఎవరైనా చూస్తున్నారా?.. లేదా.. అని తెలుసుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. తెలియని అప్లికేషన్లు (Unfamiliar Applications): ఆధునిక కాలంలో స్పైవేర్ ఇతర వ్యక్తులను గురించి తెలుసుకోవడానికి ప్యారంటల్ కంట్రోల్ యాప్స్ ఉపయోగించుకుంటారు. ఈ యాప్‌లలో ఒకదానిని ఉపయోగించి ఎవరైనా మీ ఫోన్లో స్పై చేస్తుంటే తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి డౌన్లోడ్ చేసినట్లు మీకు గుర్తులేని ఏవైనా తెలియని అప్లికేషన్ల కోసం మీ ఫోన్లో సర్చ్ చేయవచ్చు. దీనికోసం నెట్ నానీ, కాస్పెర్స్కీ సేఫ్ కిడ్స్, నార్టన్ ఫ్యామిలీ యాప్స్ ఉపయోగపడతాయి. పర్ఫామెన్స్లో సమస్యలు: స్పైవేర్ మీ డేటాను ఎప్పటికప్పుడు సేకరించుకుంటుంది. అయితే మునుపటికంటే మీ మొబైల్ పర్ఫామెన్స్ విషయంలో తగ్గితే వెంటనే దానికి కారణాలు తెలుసుకోండి. స్మార్ట్‌ఫోన్‌ను ఎలా వేగవంతం చేయాలనే దానిపై అరా తీయండి, ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అని శోధించండి. బ్యాటరీ త్వరగా ఖాళీ అవ్వడం: స్పైవేర్ నిరంతరం పని చేస్తుంటే, అది మీ బ్యాటరీని సాధారణం కంటే వేగంగా ఖాళీ చేస్తుంది. అయితే అన్ని బ్యాటరీలు క్రమంగా క్షీణిస్తాయి, అలా కాకుండా కారణం లేకుండా త్వరగా క్షీణించడం ప్రారంభమైతే దానికి కారణం తెలుసుకోండి. ముందుగా మీరు ఏదైనా కొత్త అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసారా? లేదా అప్డేట్ చేసారా చూడండి. కొన్ని యాప్స్ కూడా బ్యాటరీ త్వరలో ఖాళీ అవ్వడానికి కారణం అయ్యే అవకాశం ఉంది. మొబైల్ ఫోన్ వేడెక్కడం: మీ మొబైల్ చాలా వేగంగా వేడెక్కుతుంటే ఎవరో మీ మొబైల్ హ్యాక్ చేస్తున్నారని అనుమానించండి. తక్కువగా ఉపయోగించనప్పుడు లేదా అసలే ఉపయోగించకుండా ఉన్నప్పుడు వేడెక్కితుంటే తప్పకుండా దానికి కారణాలు తెలుసుకోండి. ఎక్కువ డేటా వినియోగం: మీ మొబైల్ ఫోన్లో అనుకోకుండా ఎక్కువ డేటా ఖాళీ అవుతుంటే స్పైవేర్ రన్ అవుతుందనే సంకేతం కావచ్చు. ఎందుకంటే నేరస్థుడు సమాచారాన్ని పొందటానికి యాప్ డేటాను ఉపయోగించాల్సి ఉంటుంది, కాబట్టి డేటా వినియోగంలో పెరుగుదల చాలా ఎక్కువ ఉంటుంది. ఆఫ్ చేయడం లేదా రీస్టార్ట్ చేయడంలో సమస్యలు: నిజానికి మన ఫోన్ మనకు కావలసినప్పుడు షట్ డౌన్ చేసుకోవచ్చు, లేదా రీస్టార్ట్ చేసుకోవచ్చు. అయితే హ్యాకర్లు మన మొబైల్ హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఆఫ్ చేయడం లేదా రీస్టార్ట్ చేయడంలో సమస్యలు తలెత్తుతాయి. నేరస్థులకు ఎలాంటి ఆటంకం లేకుండా మీ ఫోన్ ఉపయోగించాలి కాబట్టి యాక్సెస్ చేయడం జరుగుతుంది. సర్చ్ బ్రౌజర్ హిస్టరీ: మీ మొబైల్ ఫోన్లో ఎప్పటికప్పుడు బ్రౌజర్ హిస్టరీ చెక్ చేసుకుంటూ ఉండండి. ముఖ్యంగా అందులో ఫోన్ స్పై సాఫ్ట్వేర్ గురించి ఏదైనా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే స్పైవేర్‌ని డౌన్లోడ్ చేయడానికి మీ బ్రౌజర్‌ని ఎవరైనా ఉపయోగించే అవకాశం ఉంది. బహుశా అలా జరిగినప్పుడు హిస్టరీలో మనకు కనపడుతుంది. మొబైల్ ఫోన్లో ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టడానికి కూడా కొన్ని మార్గాలు ఉన్నాయి. స్పైవేర్ రిమూవ్ టూల్ ఉపయోగించండి: మీ ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి స్పైవేర్‌ను తీసివేయడానికి రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించండి. ఇది స్పైవేర్ (మరియు ఇతర రకాల మాల్వేర్) కోసం మీ పరికరాన్ని స్కాన్ చేస్తుంది, అదే సమయంలో దానిని పూర్తిగా తీసివేస్తుంది. అయితే దీని కోసం భద్రత కలిగిన సాఫ్ట్వేర్ ఉపయోగించాలని గుర్తుంచుకోండి. ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్ చేయండి: మొబైల్ ఫోన్ హ్యాక్ నుంచి తప్పించుకోవడానికి ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్ చేయడం మంచిది. దీని ద్వారా పూర్తిగా తీసివేసే అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ దాని వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. కావున దీనికి ప్రత్యామ్నాయంగా ఏదైనా ఉపయోగించాలని సూచిస్తున్నాము. ఫోన్ ఫ్యాక్టరీ రీసెట్ చేయండి: ఫోన్ ఫ్యాక్టరీ రీసెట్ చేయడం వల్ల స్పైవేర్ పూర్తిగా తొలగించబడుతుంది. ఫోన్ ఫ్యాక్టరీ రీసెట్ చేస్తే ఫోన్లో ఉన్న అన్ని అంశాలు పోతాయి. మీరు ఏదైనా ఫోన్ తీసుకుంటే దానిని తప్పకుండా రీసెట్ చేయాలి. అంతే కాకుండా ఎప్పుడూ అనవసరమైన యాప్స్ డౌన్లోడ్ చేయకుండా ఉండాలి. -
బౌద్ధ సన్యాసి ముసుగులో భారత్‌లో గూఢచర్యం?
దేశ రాజధానిలో గూఢచర్య కలకలం రేగింది. బౌద్ధ సన్యాసి వేషంలో ఉన్న ఓ మహిళను చైనా పౌరురాలిగా నిర్ధారించుకున్న ఢిల్లీ పోలీసులు.. పలు అభియోగాల కింద ఆమెను అరెస్ట్ చేశారు. మూడేళ్లుగా భారత్‌లో ఉంటున్న ఆమె.. కీలక సమాచారం ఏమైనా చైనాకు చేరవేసిందా? ఏదైనా కుట్రకు తెర తీసిందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఢిల్లీ ఉత్తరంగా ఉన్న టిబెట్ శరణార్థి శిబిరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గూఢచర్యానికి పాల్పడిందనే అనుమానంతో పాటు చోరీలకు, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిందనే అనుమానంతోనూ ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. నేపాల్ రాజధాని ఖాట్మాండుకు చెందిన డోల్మా లామా అనే బౌద్ధ సన్యాసి.. టిబెట్ శరణార్థి కాలనీలోని మంజు కా టిల్లాలో ఉంటున్నాడు. అయితే అతను అతను కాదని.. ఆమె అని పోలీసులు వెల్లడించారు. చైనాకు చెందిన కాయ్ రువో(30).. బౌద్ధ సన్యాసి వేషంలో ఇక్కడికి వచ్చినట్లు తేల్చారు. ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి సేకరించిన ఆధారాలతో అతన్ని.. ఆమెగా ప్రకటించారు పోలీసులు. చైనీస్ పాస్‌పోర్ట్‌తో 2019లో భారత్‌లోకి కాయ్ రువో ప్రవేశించిందని ప్రకటించారు. ఇంగ్లీష్‌తో పాటు మాండరిన్, నేపాలీ భాషలను ఆమె మాట్లాడుతోంది. ఈ మేరకు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఆమెను అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు. అయితే.. చైనా కమ్యూనిస్ట్ నేతలు కొందరు తనను చంపే యత్నం చేస్తున్నారని.. తప్పించుకునేందుకు ఇలా వేషం కట్టినట్లు ఆమె ప్రాథమికంగా చెప్పినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ పోలీసులు ఆమెను క్షుణ్ణంగా విచారించాలని నిర్ణయించుకున్నారు. ఇదీ చదవండి: ఎవరూ ఎత్తుకెళ్లలే.. గ్యాంగ్ రేప్ చేయలే!! -
భారత్, శ్రీలంక.. ఒక చైనా నౌక
భారత్ అభ్యంతరాలు, ఆందోళనలు బేఖాతర్ చేస్తూ చైనా హైటెక్ నిఘా నౌక యువాన్ వాంగ్ 5 శ్రీలంకలోని హంబన్‌టొట రేవు పట్టణంలోకి మంగళవారం ఉదయం ప్రవేశించింది. ఈ విషయాన్ని పోర్టు అధికారులు వెల్లడించారు. ఇంధనం నింపుకోవడానికే ఈ రేపులో ఆగినట్టుగా చైనా బయటకి చెబుతున్నప్పటికీ మన దేశ రక్షణ కార్యకలాపాలపై నిఘా వేయడం కోసమే డ్రాగన్ ఈ నౌకను పంపినట్టుగా అనుమానాలు వెలువడుతున్నాయి. ఆగస్టు 11వ తేదీనే ఈ నౌక శ్రీలంకకు రావాల్సి ఉంది. అయితే ఈ నౌక రాకను అడ్డుకోవాల్సిందిగా శ్రీలంకలోని రణిల్ సింఘె ప్రభుత్వానికి భారత్ విజ్ఞప్తి చేసింది. భారత్ అభ్యంతరాలను చైనా దృష్టికి తీసుకువెళుతూ చైనా ఆ నౌక రావడానికి తొలుత అనుమతి నిరాకరించింది. కానీ చైనా నుంచి వచ్చిన ఒత్తిళ్లకు తలొగ్గి ఆఖరి నిమిషంలో అనుమతినిచ్చింది. 2020లో లద్ధాఖ్లోని గల్వాన్ లోయలో ఘర్షణలతో భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు రాజుకుంటూనే ఉన్నాయి. ఈ నిఘా నౌకతో అవి మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు భారత్ ఆందోళనల్ని చైనా కొట్టి పారేస్తోంది. తమ నౌక కార్యకలాపాలు ఏ దేశ భద్రతకు ముప్పు కావని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ అన్నారు. అంతర్జాతీయ చట్టాలకు లోబడే సర్వసాధారణంగా జరిగే పరిశోధనలనే యువాన్ వాంగ్ 5 చేస్తుందని అంటున్నారు. భారత రక్షణ ప్రమాదంలో పడుతుందా ? యువాన్ వాంగ్ 5 ఒక పరిశోధన నౌక అని చైనా చెప్పుకుంటోంది. కానీ ఇది పరిశోధనలు, సర్వేలతో పాటు నిఘా కూడా పెట్టగలదు. భారత్ మిలటరీ ప్రాంతాలన్నింటిపైనే నిఘా ఉంచే సామర్థ్యం ఈ నౌకకి ఉంది. యువాన్ వాంగ్ సిరీస్‌లో మూడో జనరేషన్‌కు చెందిన ట్రాకింగ్ నౌక ఇది. ఖండాంతర క్షిపణులు, ఉపగ్రహాలు, రాకెట్లను ట్రాక్ చేసే ఎలక్ట్రానిక్ వ్యవస్థ ఈ నౌకలో ఉంది. 750 కి.మీ. దూరంలో ఉన్నవన్నీ ఈ నౌక రాడార్ పరిధిలోకి వస్తాయి. శ్రీలంకలోని హంబన్‌టొట రేవులోకి ఈ నౌక ప్రవేశించడం వల్ల భారత్‌లోని తూర్పు కోస్తా రేవు పట్టణాల్లో జరిగే వ్యూహాత్మక కార్యకలాపాలన్నీ ఈ నౌక రాడార్ పరిధిలోకి వస్తాయి. శ్రీలంక తీరంలో ఆ నౌక ఉన్న సమయంలో భారత్ క్షిపణి పరీక్షలు నిర్వహిస్తే వాటి గురించి మొత్తం ఆ నౌక ద్వారా తెలుసుకోవచ్చు. శ్రీలంక రేవులో యువాన్ వాంగ్5 ఉన్నంతవరకు తమిళనాడులో ఉన్న 1,076 కి.మీ. తీర ప్రాంతంపై నిఘా పెట్టొచ్చు. కల్పకం, కూడంకుళం వంటి అణు విద్యుత్ కేంద్రాలు ఈ నౌక రాడార్లోకి రావడం వల్ల భారత్‌లో ఆందోళన పెరుగుతోంది. ఇంధనం నింపుకోవడానికే హంబన్‌టొటలో ఆగుతున్నామని చైనా చెబుతోంది. అయితే జూలై 14న చైనా నుంచి బయల్దేరిన ఈ నౌక ఇప్పటివరకు ఏ రేవు పట్టణంలోనూ ఆగకపోవడంతో మన దేశ మిలటరీ కార్యకలాపాలను పసిగట్టడం కోసమే వచ్చిందన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి సముద్ర గర్భంలో సర్వేలు నిర్వహించే సత్తా కూడా ఈ నౌకకి ఉంది. దీనివల్ల జలాంతర్గాముల గుట్టు మట్లు కూడా తెలుసుకునే అవకాశం ఉంది. చైనా కంపెనీ అధీనంలో హంబన్‌టొట పోర్టు శ్రీలంక రేవు పట్టణంలో చైనా నౌక ఉన్నంతవరకు ఎలాంటి శాస్త్రీయమైన పరిశోధనలు జరపడానికి తాము అనుమతించబోమని శ్రీలంక పోర్ట్ అథారిటీ చెబుతోంది. నౌకకు సంబంధించిన ఆటోమేటిక్ ఐడెంటిఫికేసన్ సిస్టమ్‌ని ఆఫ్‌లో ఉంచాలన్న నిబంధన పైనే నౌక రావడానికి అనుమతిచ్చామని అంటోంది. అయితే హంబన్‌టొట పోర్టు చైనా కంపెనీ చేతిలో లీజులో ఉంది. ఈ ఓడరేవు నిర్మాణానికి చైనాకు చెందిన ఎగ్జిమ్ బ్యాంక్ 120 కోట్ల డాలర్లు రుణంగా ఇచ్చింది. ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంక ఆ రుణాలు తీర్చలేకపోవడంతో చైనా మర్చంట్ పోర్టు సంస్థ 2017లో 99 ఏళ్ల పాటు ఈ పోర్టుని లీజుకి తీసుకుంది. ఈ కంపెనీయే రేవు పట్టణంలో రోజు వారీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. ఇది భారత్‌కు మరింత ఆందోళన పెంచుతోంది.. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కనుసన్నల్లోనే ఈ నౌక నడుస్తుందని అమెరికా రక్షణ శాఖ కూడా ధ్రువీకరించింది. వ్యూహాత్మక ప్రాంతంలో పోర్టు అంతర్జాతీయ నౌకలు ప్రయాణించే మార్గంలో తూర్పు, పశ్చిమ సముద్ర ప్రాంతాలు కలిసే చోటుకి 10 నాటికల్ మైళ్ల దూరంలో హంబన్‌టొట ఉంది. ఆసియా, యూరప్ మధ్య నిత్యం 36 వేల రవాణా నౌకలు తిరుగుతూ ఉంటాయి. ప్రపంచ దేశాల అవసరాలు తీర్చే చమురులో 50% ఈ మార్గం ద్వారానే సరఫరా అవుతుంది.ఈ రేవు ద్వారా వెళ్లడం ద్వారా ఆసియా, యూరప్ మధ్య మూడు రోజుల ప్రయాణం కలిసొస్తుంది. ఆ మేరకు చమురు ఆదా అవుతుంది. డ్రాగన్ కొత్త ఎత్తులు ఆర్థికంగా సంక్షోభంలో ఉన్న దేశాల అవసరాలను తీరుస్తామన్న చెప్పుకొని డ్రాగన్ దేశం తమ సొంత ప్రయోజనాలు నెరవేర్చుకుంటోంది. శ్రీలంక ఆర్థికంగా కుంగిపోయి అధ్యక్షుడు మహీందా రాజపక్స దేశం విడిచిపోయిన పారిపోయిన పరిస్థితుల్లో భారత్ ఆ దేశాన్ని ఎన్నో విధాలుగా ఆదుకుంది. 350 కోట్ల డాలర్లను అప్పుగా ఇవ్వడంతో పాటు ఆహారం, మందులు, చమురు పంపించింది. అటు చైనా నుంచి కూడా శ్రీలంక చాలా అప్పులు చేసింది. 2005–2017 మధ్యలో 1500 కోట్ల డాలర్లను అప్పుగా ఇచ్చింది. ఇప్పుడు భారత్ కూడా సాయం చేస్తూ ఉండడంతో లంకపై భారత్ పట్టు పెరిగిపోతుందన్న భయం చైనాకు పట్టుకుంది. అందుకే శ్రీలంకలో భారత్ ప్రాభవాన్ని తగ్గించడం కోసం వ్యూహాలు పన్నుతోంది. ఆ దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు, రోడ్డు, రైలు, విమానాశ్రయాల్లో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. శ్రీలంక కూడా అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి అప్పు తేవడానికి కావల్సిన మాట సాయాన్ని చైనా నుంచి ఆశిస్తోంది. దీనిపై ఇరు దేశాల మధ్య చర్చలు సాగుతున్నాయి. ఎవరినీ నొప్పించకూడదన్న లక్ష్యంతో శ్రీలంక ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తున్నా చైనా నుంచి వస్తున్న ఒత్తిళ్లే ఆ దేశంపై అధికంగా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. యువాన్ వాంగ్ 5 ► చైనాలోని జియాంగ్నన్ షిప్‌యార్డ్‌లో నిర్మాణం ► 2007 నుంచి విధుల్లోకి ► పొడవు 222 మీటర్లు – ► వెడల్పు 25.2 మీటర్లు ► నౌకలో అత్యంత ఆధునిక సాంకేతిక నిఘా వ్యవస్థ ► నింగి నేల నీరు అన్నింటిపై నిఘా పెట్టే సామర్థ్యం ► గత నెలలో చైనా లాంగ్ మార్చ్ ► 5బీ రాకెట్ ప్రయోగంపై నిఘా – నేషనల్ డెస్క్, సాక్షి -
చైనా ‘స్పై షిప్’తో భారత్ ఆందోళనకు గల కారణాలేంటి?
న్యూఢిల్లీ: భారత్ భద్రతా పరమైన ఆందోళనలు వ్యక్తం చేస్తున్నప్పటికీ చైనాకు చెందిన నిఘా నౌకా శ్రీలంకలోని హంబన్‌తోటా పోర్టుకు మంగళవారం చేరింది. తొలుత నౌక ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని చైనాకు సూచించిన శ్రీలంక.. భారత్ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ అనుమతులు ఇచ్చింది. అసలు.. ఇంతకి చైనా స్పై షిప్‌తో భారత్ ఆందోళన చెందేందుకు గల 5 ప్రధాన కారణాలు తెలుసుకుందాం. ► చైనా యాంగ్ వాంగ్ 5 నిఘా నౌక సెన్సార్లు కలిగి ఉంది. భారత్ బాలిస్టిక్ మిసైల్స్‌ను ప్రయోగిస్తే వాటిని ట్రాక్ చేయగలదు. ఈ మిసైల్స్‌ను భారత్ ఒడిశాలోని అబ్దుల్ కలామ్ ఐలాండ్ నుంచి ప్రయోగిస్తుంటుంది. ► యాంగ్ వాంగ్ 5లోని అత్యాధునిక సాంకేతిక సామర్థ్యాలను ఉపయోగించికొని.. భారత క్షిపణుల పరిధి, ఖచ్చితత్వాన్ని అంచనా వేయగలగుతుంది చైనా. దీంతో మన క్షిపణుల వివరాలు డ్రాగన్ చేతికి చిక్కినట్లవుతుంది. ఆ నౌక ఆగస్టు 22 వరకు శ్రీలంకలోనే ఉండనుంది. ► యాంగ్ వాంగ్ 5 సముద్రంలో సర్వేలు నిర్వహించగలదు. దాంతో హిందూ మహా సముద్రంలో సబ్‌మెరైన్ కార్యకలాపాలు సాగించేందుకు వీలు కలగనుంది. 2021లో చైనాకు చెందిన సర్వే నౌక షియాంగ్ యాంగ్ హంగ్ 03 ఇలాంటి సర్వేలే నిర్వహించింది. ► 2014లో చైనాకు చెందిన అణ్వాయుధ సామర్థ్యం కలిగిన నౌకను ఓ పోర్టులోకి శ్రీలంక అనుమతించింది. దాంతో భారత్-శ్రీలంక మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే, ఈసారి చైనా నౌక ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ఆన్ చేసి ఉంటుందని, శాస్త్రపరమైన పరిశోధనలు చేసేందుకు అనుమతించటం లేదని శ్రీలంక పేర్కొంది. హంబన్‌తోటా నౌకాశ్రయం కార్యకలాపాలను చైనా సంస్థ నిర్వహిస్తున్నప్పటికీ ఆపరేషనల్ సమస్యలను తామే చూసుకుంటున్నట్లు శ్రీలంక పోర్ట్స్ అథారిటీ తెలిపింది. ► చైనాకు రుణాలు చెల్లించలేక హంబన్‌తోటా నౌకాశ్రయాన్ని 99 ఏళ్ల లీజుకు ఇచ్చిన క్రమంలో భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ పోర్టును మిలిటరీ అవసరాల కోసం ఉపయోగించే ప్రమాదం ఉందని ముందు నుంచే హెచ్చరిస్తోంది భారత్. ఇదీ చదవండి: భారత్ హెచ్చరికలు బేఖాతరు.. శ్రీలంక చేరిన చైనా ‘స్పై షిప్’ -
భారత్ హెచ్చరికలు బేఖాతరు.. శ్రీలంక చేరిన చైనా ‘స్పై షిప్’
కొలంబో: చైనాకు చెందిన ఉన్నతస్థాయి పరిశోధక నౌక శ్రీలంకలోని హంబన్‌తోటా నౌకాశ్రయానికి మంగళవారం చేరుకుంది. స్పై షిప్ రాకపై భారత్ భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తం చేసిన కొద్ది రోజుల్లోనే పోర్టుకు చేరుకోవటం ప్రాధాన్యం సంతరించుకుంది. మంగళవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో వాంగ్ యాంగ్ 5 నౌక శ్రీలంక పోర్టుకు చేరుకున్నట్లు హర్బర్ మాస్టర్ కెప్టెన్ నిర్మల్ డీ సిల్వా తెలిపారు. పొరుగు దేశంలో చైనా నౌక ఉండటంపై భారత్ ఇటీవలే ఆందోళన వ్యక్తం చేసింది. భారత్‌కు చెందిన వ్యవస్థలపై నిఘావేసే ప్రమాదం ఉందని పేర్కొంది. దీంతో షిప్ రాకను వాయిదా వేసుకోవాలని చైనాకు సూచించింది శ్రీలంక. అయితే, చైనా ఒత్తిడికి తలొగ్గి గత శనివారం అనుమతులు జారీ చేసింది. ఆగస్టు 16 నుంచి 22 మధ్య నౌక తమ పోర్టులో ఉండేందుకు అనుమతిస్తున్నట్లు పేర్కొంది. ‘చైనాకు చెందిన వాంగ్ యాంగ్ 5 నౌక నిర్వహణలో పొరుగు దేశం భద్రతకే అధిక ప్రాధాన్యం ఉంటుంది. అందరి ఆందోళనలను దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.’ అని శ్రీలంక విదేశాంగ శాఖ ఓ ప్రకటన చేసింది. అంతకు ముందు భారత్, అమెరికాల ఆందోళనలను తప్పుపట్టింది చైనా. శ్రీలంకపై ఒత్తిడి పెంచేందుకు భద్రతాపరమైన అంశాలను లేవనెత్తటం పూర్తిగా అసంబద్ధమని పేర్కొంది. చైనా సముద్ర శాస్త్ర పరిశోధన కార్యకలాపాలను హేతుబద్ధమైన కోణంలో చూడాలని, చైనా, శ్రీలంక మధ్య సహకారానికి అంతరాయం కలిగించకుండా ఆపాలని సంబంధిత పక్షాలను కోరుతున్నామని చెలిపారు డ్రాగన్ విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్. ఇదీ చదవండి: భారత ఆందోళనను లెక్కచేయని శ్రీలంక.. చైనా నిఘా నౌకకు అనుమతి -
పాక్ కోసం గూఢచర్యం.. ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు
జైపూర్: పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్న గజేంద్ర సింగ్(35) అనే ప్రభుత్వ ఉద్యోగిని అరెస్టు చేసినట్లు రాజస్తాన్ పోలీసులు గురువారం వెల్లడించారు. అతడు జోథ్‌పూర్‌లో మిలటరీ ఇంజనీరింగ్ సర్వీసు(ఎంఈఎస్) చీఫ్ ఇంజనీర్ కార్యాలయంలో క్లాస్–4 ఉద్యోగిగా పని చేస్తున్నాడు. వాట్సాప్ ద్వారా పాక్ మహిళతో సంబంధాలు కొనసాగిస్తున్నాడని, సైనిక రహస్యాలను ఆమెకు చేరవేస్తున్నాడని రాజస్తాన్ ఇంటెలిజెన్స్ డీజీపీ ఉమేశ్ మిశ్రా చెప్పారు. ఆఫీసులో జిరాక్స్ మిషన్ ఆపరేట్ చేస్తుంటాడని, కీలకమైన ఫైళ్లు, లెటర్లను సెల్ఫోన్లో ఫొటో తీసి, సదరు పాక్ మహిళకు వాట్సాప్‌లో పంపుతున్నట్లు తేలిందన్నారు. -
పెద్ద పన్నాగమే పన్నిన చైనా...!
కాలిఫోర్నియా: భారత్‌ను ఎదుర్కొవాలనే కుతంత్రంతో చైనా పలు విషయాల్లో పాకిస్థాన్‌కు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. కరోనా సమయంలో కూడా పాకిస్థాన్‌కు సహాయాన్ని అందించింది. పాకిస్థాన్ పౌరులకు వ్యాక్సిన్ అందించడంలో కూడా చైనా ముందే ఉంది. పాకిస్థాన్ కుటీల రాజకీయాల వల్ల ఆ దేశాన్ని ఫైనాన్షిల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్‌లో భాగంగా పాకిస్థాన్‌ను అమెరికా గ్రే లిస్ట్‌లో పెట్టిన విషయం తెలిసిందే. పాకిస్థాన్‌కు అందించే ఆర్థిక సహాయాన్ని కూడా అమెరికా పూర్తిగా నిలిపివేసింది. దీంతో డ్రాగన్ దేశంతో పాకిస్థాన్ మరింత దగ్గరైంది. చైనాతో చేస్తోన్న దోస్తీ ఇప్పుడు పాకిస్థాన్ కొంపముంచేలా ఉంది. చైనాకు చెందిన టెక్ దిగ్గజం హువావే పాకిస్థాన్ ప్రజలపై నిఘా పెట్టిన్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌కు చెందిన సున్నితమైన డేటాను హువావే యాక్సెస్ చేసిందని వార్తలు వస్తున్నాయి. హువావే కంపెనీ పాకిస్థాన్ దేశానికి చెందిన వాణిజ్య రహస్యాలను దొంగిలించి పాకిస్తానీయులపై నిఘా పెట్టిందని అమెరికాకు చెందిన సాఫ్ట్వేర్ కంపెనీ బిజినెస్ ఎఫిషియెన్సీ సోల్యూషన్స్ ఆరోపించింది. పాకిస్థాన్ ప్రభుత్వం కోసం బిజినెస్ ఎఫిషియెన్సీ సోల్యూషన్స్ ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసింది. సాఫ్ట్వేర్ పూర్తైన తరువాత పాకిస్థాన్ దేశపు సమాచారాన్ని ట్రయల్ రన్ కోసం బీజింగ్‌కు పంపింది. ఇప్పటివరకు హువావే పాకిస్థాన్‌కు చెందిన సమాచారాన్ని తిరిగి ఇవ్వలేదని బిజినెస్ ఎఫిషియెన్సీ సోల్యూషన్స్ ఆరోపించింది. ఈ విషయంపై బిజినెస్ ఎఫిషియెన్సీ సోల్యూషన్స్ కాలిఫోర్నియా కోర్టులో హువావేపై విచారణ చేయాలని ఆరోపించింది. బీఈఎస్ తన పిటిషన్లో పాకిస్థాన్‌కు చెందిన కీలక సమాచారాన్ని హువావే బ్యాక్‌డోర్ ద్వారా గ్రహిస్తుందని పేర్కొంది. చైనా కేవలం పాకిస్థాన్‌పై నిఘా ఉంచిదనుకుంటే పొరపాటే..! మిడిల్ ఈస్ట్ దేశాలపై కూడా చైనా సైబర్ దాడులను చేస్తోందని సైబర్‌సెక్యూరిటీ సంస్థ ఫైర్ఐ వెల్లడించింది. పాకిస్థాన్ కీలక సమాచారం, ఆ దేశ ప్రజల సమాచారాన్ని సేకరించి పూర్తిగా పాకిస్థాన్ దేశాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకునేలా చైనా ప్రయత్నిస్తోంది. -
ఐకియాకు భారీ షాక్..!
పారిస్: ప్రముఖ స్వీడిష్ ఫర్నీచర్ కంపెనీ ఐకియాకు ఫ్రాన్స్‌లో భారీ షాక్ తగిలింది. ఆ దేశపు కోర్టు కంపెనీపై సుమారు ఒక మిలియన్ డాలర్ల జరిమానాను విధించింది. ఐకియా తన కస్టమర్ల, ఉద్యోగులపై గూడచర్యం చేసిందని కోర్టు తేల్చింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్టోర్లను కలిగి ఉన్న ఐకియా గత కొన్ని సంవత్సరాలుగా వినియోగదారుల, ఉద్యోగుల సమాచారాన్ని అక్రమంగా సేకరిస్తోందని కంపెనీపై ఆరోపణలు ఉన్నాయి. అక్రమ పద్ధతుల ద్వారా ఉద్యోగుల బ్యాంకు ఖాతాలను సమీక్షించినట్లు ప్రముఖ ఫ్లాట్‌ప్యాక్ ఫర్నిచర్ గ్రూప్ ఆరోపణలు చేయసాగింది. ఉద్యోగుల, కస్టమర్ల గోప్యతకు భంగం వాటిల్లేలా ఐకియా ప్రవర్తించిందని ఫ్లాట్‌ప్యాక్ ఫర్నిచర్ గ్రూప్ తెలిపింది. అంతేకాకుండా ఐకియా తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం కస్టమర్ల, ఉద్యోగుల డేటాను వాడినట్లు కోర్టు ధృవీకరించింది. కాగా ఈ విషయంపై ఐకియా స్సందించింది. మరలా ఇలాంటివి జరగకుండా చూస్తామని ఒక ప్రకటనలో తెలిపింది. ఐకియాకు ఫ్రాన్స్ మూడో అతిపెద్ద ఫర్నిచర్ మార్కెట్ దేశంగా నిలుస్తోంది. సుమారు ఐకియాకు ఫ్రాన్స్‌లో సుమారు పదివేల మంది ఉద్యోగులు ఉన్నారు. చదవండి: ఫ్రాంక్లిన్ ఏఎంసీ, ఉద్యోగులపై భారీ జరిమానా -
నేవీ ‘హనీ ట్రాప్’ పాక్ ఐఎస్ఐ ఏజెంట్ల కుట్రే
దొండపర్తి (విశాఖ దక్షిణ): విశాఖ నేవీ అధికారులకు యువతులను ఎరవేసి సైనిక రహస్యాలను తెలుసుకునేందుకు పన్నిన హనీ ట్రాప్ వెనుక పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ల కుట్ర దాగి ఉన్నట్టు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) నిర్ధారణకు వచ్చింది. ఈ కేసులో నిందితుడైన ఇమ్రాన్ యాకూబ్‌పై విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో జాతీయ దర్యాప్తు సంస్థ శుక్రవారం అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసింది. భారత రక్షణ దళాలను లక్ష్యంగా చేసుకుని నావికాదళ అధికారులను హనీట్రాప్ చేయడం ద్వారా దేశ సైనిక రహస్యాలను తెలుసుకోడానికి పాకిస్తాన్ నిఘా అధికారులు పన్నిన కుట్రను 2019లో కేంద్ర నిఘా వర్గాలు పసిగట్టి దర్యాప్తు చేపట్టిన విషయం విదితమే. దీనిపై 2019 నవంబర్ 16న విజయవాడలోని కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. గూఢచర్యం ద్వారా దేశ రక్షణకు సంబంధించిన సున్నితమైన సమాచారంతో పాటు హవాలా ద్వారా నగదు చేతులు మారినట్టు నిఘా వర్గాలకు కీలక ఆధారాలు లభించాయి. దీంతో కేసు దర్యాప్తును ఎన్ఐఏకు అప్పగించగా 2019 డిసెంబర్ 12న కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో పాకిస్తాన్‌తో వ్యాపార సంబంధాలున్న ముగ్గురు పౌరులతో పాటు 11 మంది నావికాదళ అధికారుల పాత్ర ఉన్నట్టు ఆధారాలు సేకరించిన ఎన్ఐఏ వారిని అరెస్ట్ చేసింది. వారిపై 2020 జూన్ 15న ఎన్ఐఏ కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేసింది. అనంతర దర్యాప్తులో గుజరాత్‌లోని గోద్రాకు చెందిన యాకూబ్ ఇమ్రాన్‌కు పాకిస్తాన్ ఏజెంట్లతో సంబంధాలు ఉన్నట్టు అధికారులు నిర్ధారణకు వచ్చారు. నావికాదళ రహస్యాలు, సమాచారం సేకరించేందుకు పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ల సూచనల మేరకు ఇమ్రాన్ యాకూబ్ నేవీ అధికారుల బ్యాంకు ఖాతాలకు డబ్బులు బదిలీ చేసినట్టు ఆధారాలు సేకరించారు. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాల కోసం ఇమ్రాన్ చట్టవిరుద్ధంగా వస్త్ర వ్యాపారం పేరుతో నిధులను సమీకరించినట్టు ఎన్ఐఏ దర్యాప్తులో రుజువైంది. ఈ విషయాలతో అతడిపై అనుబంధ చార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు. దర్యాప్తు కొనసాగుతోందని ఎన్ఐఏ ప్రకటించింది. -
‘నగ్న ఫోటోలపై ఆసక్తే నాతో అలా చేయించింది’
జైపూర్: రాజస్తాన్ లథికి చెందిన సత్యనారాయణ పాలివాల్(42) అనే వ్యక్తిని గూఢచర్యం ఆరోపణలపై.. అధికారిక రహస్యాల చట్టం కింద ఇంటిలిజెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ హనీట్రాప్ వలలో చిక్కిన సత్యనారాయణ.. దేశానికి, మిలటరీకి సంబంధించిన కీలక విషయాలను వారితో పంచుకున్నాడని అధికారులు తెలిపారు. ఇక విచారణ సందర్భంగా ఐఎస్ఐ.. నగ్న ఫోటోలు, సెక్స్ చాట్‌ని ఎరగా వేసి సత్యనారాయణ నుంచి కీలక సమాచారాన్ని రాబట్టిందని తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ‘సోషల్ మీడియా ఫేక్ అకౌంట్ ద్వారా సత్యనారాయణకు ఐఎస్ఐకి చెందిన పలువురు మహిళలతో పరిచయం ఏర్పడింది. ఇక నగ్న ఫోటోలపై సత్యనారాయణకు ఉన్న ఆసక్తిని గమనించిన సదరు మహిళలు ఆ కోవకు చెందిన ఫోటోలను అతడికి పంపేవారు. అంతేకాక అతడితో సెక్స్ చాట్ కూడా చేసేవారు’ అని అధికారులు వెల్లడించారు. (హనీట్రాప్ కేసు : కీలక వ్యక్తి అరెస్ట్ ) ‘ఇక నగ్న ఫోటోల మీద ఉన్న ఆసక్తితో సత్యనారాయణ దేశానికి సంబంధించిన రహస్య సమాచారం, పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్లో ఆర్మీ కదలికలకు గూర్చిన సున్నితమైన సమాచారాన్ని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఐఎస్ఐ మహిళలకు అందజేశాడు. సత్యనారాయణ సోషల్ మీడియా ఖాతాల ద్వారా చాలాకాలంగా ఐఎస్ఐతో సంప్రదింపులు జరుపుతున్నాడు. క్లిష్టమైన సమాచారం కోసం అతడిని హానీట్రాప్ చేశారు’ అని ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. అంతేకాక నిందితుడిని కొంతకాలంగా గమనిస్తున్నామని, జైసల్మేర్‌లో అదుపులోకి తీసుకున్నప్పుడు అతని మొబైల్ ఫోన్లో అనేక ఆర్మీ పత్రాలు దొరికాయని అధికారులు వెల్లడించారు. (చదవండి: ఆ యాప్ ద్వారా భారత్‌ను టార్గెట్ చేస్తున్న పాక్!) ఈ సందర్భంగా రాజస్తాన్ పోలీసులు మాట్లాడుతూ.. ‘జైసల్మేర్‌కు చెందిన సత్యనారాయణ పాలివాల్ని గూఢచర్యం ఆరోపణల కింద సీఐడీ స్పెషల్ బ్రాంచ్ అధికారులు అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా అతడు పాకిస్తాన్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ వ్యక్తులతో కాంటాక్ట్‌లో ఉండటమే కాక మిలిటరీకి సంబంధించిన కీలక సమాచారాన్ని వారికి చేరవేశాడు. ప్రస్తుతం అతడిని జైపూర్‌కు తరలించాము. రాజస్తాన్ ఇంటిలిజెన్స్ అధికారులు, మిలటరీ అతడిని ప్రశ్నిస్తుంది’ అని తెలిపారు. -
ఫేస్‌బుక్‌పై గూఢచర్యం కేసు
వాషింగ్టన్: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌పై మరో కేసు నమోదయ్యింది. మొబైల్లోని కెమరాను అనధికారికంగా ఉపయోగించడం ద్వారా ఇన్స్టాగ్రామ్ వినియోగదారులపై గూఢచర్యం చేస్తుందనే ఆరోపణలతో కేసు నమోదయ్యింది. ఐఫోన్‌లోని ఫోటో షేరింగ్ యాప్ కెమెరాను వినియోగించని సమయంలో కూడా యాక్సెస్ చేస్తున్నట్లు జూలైలో మీడియా నివేదికలు వెలువడ్డాయి. వీటి ఆధారంగా ఈ దావా నమోదయ్యింది. అయితే ఫేస్బుక్ ఈ నివేదికలను ఖండించింది.. దాన్ని ఒక బగ్గా వర్ణించింది.. సరి చేస్తున్నామని తెలిపింది. ఇన్స్టాగ్రామ్ ఐఫోన్ కెమెరాలను యాక్సెస్ చేస్తోందనే వార్తలను తప్పుడు నోటిఫికేషన్లుగా అభివర్ణించింది. శాన్ఫ్రాన్సిస్కోలోని ఫెడరల్ కోర్టులో గురువారం దాఖలు చేసిన ఫిర్యాదులో, న్యూజెర్సీ ఇన్స్టాగ్రామ్ యూజర్ బ్రిటనీ కొండిటి కెమెరా యాప్ ఉపయోగం ఉద్దేశపూర్వకంగా ఉందని.. దానితో వినియోగదారుల “లాభదాయకమైన, విలువైన డాటాను సేకరించే ఉద్దేశ్యంతో ఇది పని చేస్తుంది’’ అని వాదించారు. (చదవండి: ఫేస్బుక్ ఇండియా ఎండీకి నోటీసులు) ఫిర్యాదు ప్రకారం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వినియోగదారుల ప్రైవేట్, సన్నిహిత వ్యక్తిగత డాటాను పొందడంతో సహా విలువైన ఇన్సైట్స్, మార్కెట్ పరిశోధనలను సేకరించగలవని వెల్లడించారు. అయితే దీనిపై స్పందించడానికి ఫేస్బుక్ నిరాకరించింది. గత నెలలో దాఖలు చేసిన ఒక దావాలో, ఫేస్బుక్ తన 100 మిలియన్లకు పైగా ఇన్స్టాగ్రామ్ వినియోగదారుల బయోమెట్రిక్ డాటాను చట్టవిరుద్ధంగా పొందడానికి ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీని ఉపయోగించారని ఆరోపించారు. ఫేస్బుక్ ఈ వాదనను ఖండించింది. ఇన్స్టాగ్రామ్ ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీని ఉపయోగించదని తెలిపింది. -
ఆ యాప్ ద్వారా భారత్‌ను టార్గెట్ చేస్తున్న పాక్!
సాక్షి, న్యూఢిల్లీ: భారత్ కరోనా వైరస్‌తో ప్రపంచ దేశాలతో కలిసి పోరాటం చేస్తుంటే పాకిస్తాన్ మాత్రం ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సైతం భారత్‌లోకి టెర్రరిస్టుల్ని పంపించడంలో బిజీగా ఉందని ఇటీవలే ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నర్వానే వ్యాఖానించారు. దీనికి తగ్గట్టుగానే పాకిస్తాన్ భారతసైన్యానికి చెందిన ఉన్నతాధికారుల ఫోన్లు హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తోందని ఇండియన్ ఆర్మీ అధికారులను హెచ్చరించింది. కరోనా మహమ్మారి గురించి ప్రజలను అప్రమత్తం చేయడానికి భారత ప్రభుత్వం ఆరోగ్యసేతు యాప్‌ని అందరూ ఇన్స్టాల్ చేసుకోవాలని కోరింది. చదవండి: మహమ్మారి మాటున భారీ దాడికి పాక్ స్కెచ్.. అయితే ఇప్పుడు అదే యాప్ ద్వారా పాకిస్తాన్ భారత సైన్యానికి సంబంధించిన విషయాలను హ్యాక్ చేయాలని చూస్తోంది. ఆరోగ్యసేతు యాప్‌లాగా ఉండే మరో యాప్‌ని ఆరోగ్యసేతు.ఏపీకే (Arogya setu.apk) పేరుతో పాకిస్తాన్ వర్గాలు తయారు చేశాయి. వీటిని భారత ఆర్మీ సిబ్బందికి వాటప్స్ ద్వారా ఆరోగ్య సేతు పేరుతో పంపిస్తున్నాయి. దీనిని వారి ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటే మన ఆర్మీ విషయాలను పాకిస్తాన్ సులభంగా తెలుసుకోగలుగుతుంది. భారత్‌కు చెందిన పేర్లతో సోషల్ మీడియా అకౌంట్లను ఉపయోగిస్తూ భారత ఆర్మీని పాకిస్తాన్ టార్గెట్ చేస్తోంది. ఇప్పటికే అనోష్క చోప్రా పేరుతో ఆర్మీ ఆఫీసర్‌కి ఒక రిక్వెస్ట్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వ వెబ్సైట్ (mygov.in), ఆండ్రాయిడ్ ప్లే స్టోర్, ఐఓఎస్ యాపిల్ ప్లే స్టోర్ నుంచి మాత్రమే ఆర్మీకి చెందిన వారు ఆరోగ్య సేతు యాప్‌ని డౌన్లోడ్ చేసుకోవాలని భారత సైనిక విభాగం ఆదేశాలు జారీ చేసింది. కశ్మీర్లోకి ‘కరోనా’ ఉగ్రవాదులు -
‘వాట్సాప్’లో ‘గూఢాచోరులు’ ఎవరు?
న్యూఢిల్లీ : దేశంలోని 17 మంది మానవ హక్కుల కార్యకర్తలు, దళిత కార్యకర్తలు, జర్నలిస్టుల ‘వాట్సాప్’ ఖాతాలపై ఇజ్రాయెల్‌లోని ‘ఎన్ఎస్ఓ’ టెక్నాలజీ సంస్థ నుంచి కొనుగోలు చేసిన ‘పెగాసస్’ సాఫ్ట్‌వేర్‌తో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు నిఘా కొనసాగిస్తున్నారనే విషయం గురువారం వెలుగులోకి రావడం అన్ని వర్గాల ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ఒక్క వాట్సాప్ సందేశాలను మాత్రమే తస్కరించడం లేదు. వాట్సాప్ ఫోన్ కాల్స్‌ను వింటున్నారు. రికార్డు చేస్తున్నారు. పెగాసస్ సాఫ్ట్‌వేర్‌కున్న శక్తి సామర్థ్యాల ప్రకారం ఫోన్లోని పాస్‌వర్డ్‌లను, ఫొటోలను, వీడియోలను కూడా తస్కరించవచ్చు. కేవలం పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమే కాకుండా, డిజిటల్ చెల్లింపుల యుగంలో పౌరులను ఆర్థికంగా కొల్లగొట్టేందుకు, ఇతర విపరీత పరిణామాలకు దారితీయగల ఈ ‘గూఢచర్య’ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్న ముసుగు దొంగలు ఎవరు? డేటా భద్రత వైఫల్యంపై ఆందోళన చెందుతున్నామని, దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని కేంద్రానికి అందజేయాల్సిందిగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ‘వాట్సాప్’ యాజమాన్యాన్ని కోరారు. ఆయన మాటలకు అర్థం కేంద్ర ప్రభుత్వానికిగానీ, కేంద్ర ప్రభుత్వ సంస్థలకుగానీ సంబంధం లేదని చెప్పడం. మరి పౌరులపై నిఘా కొనసాగించాల్సిన అవసరం ఎవరికుంది? ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ నగరానికి సమీపంలో 2010లో ఏర్పాటయిన ఈ ఎన్ఎస్ఓ సంస్థ పెగాసస్ అనే ‘స్పైవేర్’ను తానే విక్రయించినట్లు ఒప్పుకుంది. అయితే ఎవరికన్నది స్పష్టంగా చెప్పకపోయినా తాను ప్రభుత్వ సంస్థలకు తప్ప మరెవరికీ ఇలాంటి సాఫ్ట్‌వేర్‌ను విక్రయించడం లేదని చెప్పింది. ఆ సంస్థ 2016 నిర్ణయించిన ధరల పట్టిక ప్రకారం పది మంది యూజర్ల డేటాపై నిఘా కోసం పెగాసస్ సాఫ్ట్వేర్ ధరను ఒక మిలియన్ డాలర్లు. ఆ నిఘాను మరో పది మందికి పెంచాలంటే మరో రేటును చెల్లించాల్సి ఉంటుంది. ఇతర వైరస్లాగా ఇది నెట్వర్క్ అంతటికి వ్యాపించకుండా కంపెనీ జాగ్రత్తలు తీసుకుంది. మిస్సిడ్ కాల్ ద్వారా వాట్సాప్‌లోకి స్పైవేర్ ప్రవేశిస్తుంది. పది మందిపై నిఘాకే దాదాపు ఏడు కోట్ల రూపాయలను వెచ్చించి ప్రైవేటు వ్యక్తులు ఎవరు కొనుగోలు చేస్తారు? ఎన్ఎస్ఓ ప్రకారం ప్రభుత్వ సంస్థ అంటే కేంద్ర ప్రభుత్వం పరిధిలోని సీబీఐ, లేదా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని నేర పరిశోధనా సంస్థనో అయ్యి ఉండాలి. నిఘా నీడలో మానవ హక్కుల కార్యకర్త బేలా బాటియా, బీబీసీ మాజీ జర్నలిస్ట్ సుభ్రాన్షు చౌధరి తదితరులు సామాజిక నేపథ్యం చూస్తే ఎవరు నిఘా వహించారో, ఆ గూఢాచోరులు ఎవరు ఇట్టే తెలిసిపోతుంది. (చదవండి: వాట్సాప్ డేటాపై ‘పెగాసస్’ గురి) -
గూఢచర్య ఆరోపణలపై పాక్‌లో భారతీయుడి అరెస్ట్
లాహోర్: దేశంలో గూఢచర్యానికి పాల్పడుతున్నాడనే ఆరోపణలపై పాకిస్తాన్ ఓ భారతీయుడిని అరెస్ట్‌చేసింది. తానో గూఢచారినని రాజు లక్ష్మణ్ ఒప్పుకున్నాడని, అతడిని పంజాబ్ ప్రావిన్స్‌లోని డేరా ఘాజీ ఖాన్ జిల్లాలోని రాఖీగజ్ ప్రాంతంలో అరెస్ట్‌చేసినట్లు పాక్ పోలీసులు వెల్లడించారు. ఇతర వివరాలు రాబట్టేందుకు లక్ష్మణ్‌ను పోలీసులు గుర్తుతెలియని ప్రాంతానికి తరలించారు. బెలూచిస్తాన్ ప్రావిన్స్ నుంచి డేరా ఘాజీ ఖాన్ జిల్లాలోకి లక్ష్మణ్ ప్రవేశిస్తుండగా అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. గూఢచర్యానికి పాల్పడ్డారనే ఆరోపణలపై గతంలో భారత మాజీ నేవీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌ను బెలూచిస్తాన్ ప్రాంతంలోనే పాక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
జాదవ్ కేసులో త్వరలో తుదితీర్పు
హేగ్ : కుల్‌భూషణ్ జాదవ్ కేసులో హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్ధానం ఆగస్టులో తుది తీర్పు వెలువరించనుంది. జాదవ్ కేసులోఈ ఏడాది ఫిబ్రవరి 18 నుంచి 21 వరకూ సాగిన తుది విచారణలో భారత్, పాకిస్తాన్‌లు తమ వాదనలను న్యాయస్ధానానికి నివేదించాయి. భారత్‌కు చెందిన జాదవ్‌ను గూఢచర్య ఆరోపణలపై పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్ఐ ఇరాన్ నుంచి అపహరించిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ సైనిక కోర్టు గూఢచర్య ఆరోపణలపై జాదవ్‌కు మరణ శిక్ష విధించింది. పాకిస్తాన్ కుట్రపూరితంగా వ్యవహరించి జాదవ్‌పై గూఢచర్య అభియోగాలు మోపిందని భారత్ ఆరోపిస్తోంది. పాక్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ భారత్ అంతర్జాతీయ న్యాయస్ధానాన్ని ఆశ్రయించింది. -
ఆపిల్, అమెజాన్ కంపెనీలపై చైనా గూఢాచార్యం
ఈ మధ్య చైనాకు, అమెరికాకు పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో సంబంధాలు బలహీనపడ్డాయి. చైనాపై అగ్రరాజ్యం తీవ్ర ఆరోపణలు చేయడం, వాటిని డ్రాగన్ కొట్టిపడేయడం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వివాదాలు మరింత రాజుకునేలా, ఓ ఆశ్చర్యకరమైన రిపోర్టు వెలుగులోకి వచ్చింది. అమెరికా అగ్ర కంపెనీలైన ఆపిల్, అమెజాన్ వంటి 20 కంపెనీలపై చైనా గూఢాచార్యం చేస్తుందని ఓ యూఎస్ పబ్లికేషన్ ప్రచురించింది. చైనా ఫ్యాక్టరీలు తయారుచేసిన మదర్‌బోర్డును వాడుతున్న అమెరికా కంపెనీలపై డ్రాగన్ గూఢాచార్యం చేస్తుందట. ఆ మదర్‌బోర్డ్‌లో ఓ మైక్రోచిప్‌ను అమర్చి, అమెజాన్, ఆపిల్ వంటి 28 ఇతర అమెరికా కంపెనీలు, సంస్థల సర్వర్లను చైనా హ్యాక్ చేస్తుందని తాజా రిపోర్టు పేర్కొంది. సూపర్ మైక్రో మదర్ బోర్డుల్లో అమర్చే ఈ చిన్న చిప్‌లు చైనీస్ గూఢాచారులకు అనుమతిస్తున్నాయని రిపోర్టు వెల్లడించింది. దీంతో ఈ మదర్ బోర్డులను వాడే డేటా సెంటర్లు, కంప్యూటర్లలోకి హ్యాకర్లు, గూఢాచారులు చొచ్చుకుపోతున్నట్టు తెలిపింది. 2015లోనే మదర్బోర్డుల్లో ఈ చైనీస్ చిప్‌ను గుర్తించినట్టు పేర్కొంది. అయితే ఈ విషయాన్ని ఎంతో సీక్రెట్‌గా ఉంచి, అమెరికన్ అధికారులు విచారణ జరుపుతున్నారు. దాదాపు మూడేళ్ల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. చాలా మంది అధికారులకు ఈ విషయం తెలుసని బ్లూమ్‌బర్గ్ రిపోర్టు చేసింది. చైనా ఫ్యాక్టరీల్లో మదర్‌బోర్డులను తయారు చేసేటప్పుడే ఈ చిప్‌లను అమర్చుతారట. హై-వాల్యు కార్పొరేట్ సీక్రెట్లను, ప్రభుత్వ నెట్‌వర్క్‌ల కీలక డేటా సుదీర్ఘ కాలం పాటు యాక్సస్ చేసుకోవడమే చైనా లక్ష్యమని ఓ ప్రభుత్వ అధికారి చెప్పారు.అయితే మదర్‌బోర్డులో చిప్‌లను అమర్చి, గూఢాచారం చేపడుతుందని తనపై వస్తున్న ఆరోపణలు చైనా ప్రభుత్వం కొట్టిపారేసింది. -
ట్రంప్ టార్గెట్ ‘ఈబీ–5’
వాషింగ్టన్: అమెరికాలో విదేశీయులకు గ్రీన్ కార్డు ఇచ్చే ‘ఈబీ–5 వీసా’ విధానాన్ని ట్రంప్ ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది. ఈ వీసా నిబంధనల ప్రకారం అమెరికాలో 10లక్షల డాలర్లు (దాదాపు రూ.6.78 కోట్లు) పెట్టుబడి పెట్టే వారికి (దీని ద్వారా కనీసం 10 మంది శాశ్వత ఉద్యోగాల కల్పన జరుగుతుంది) ఆ దేశం గ్రీన్ కార్డులు అందిస్తోంది. అయితే ఈ వీసా విధానాన్ని పూర్తిగా సంస్కరించడం లేదా పూర్తిగా తొలగించడంపై దృష్టిపెట్టాలని యూఎస్ కాంగ్రెస్‌ను ట్రంప్ సర్కారు కోరింది. ఈబీ–5 విధానం ద్వారా వచ్చిన గ్రీన్‌కార్డును సంపాదించిన వారు దీన్ని దుర్వినియోగం చేయడంతోపాటు మోసాలకు పాల్పడుతున్న కేసులు నమోదవుతున్న నేపథ్యంలోనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది అమల్లోకి వస్తే.. ఈబీ–5 విధానంలో అమెరికాలో గ్రీన్ కార్డులు పొందుతున్న భారతీయులపైనా పెను ప్రభావం పడనుంది. ఈ జాబితాలో చైనా, వియత్నాంలు తొలి రెండు స్థానాల్లో ఉండగా.. భారత్ మూడో దేశంగా ఉంది. ఈ విధానంలో ఏటా10వేల వీసాలను విదేశీయులకు ఇస్తున్నారు. ఇందులో ఒక్కో దేశానికి గరిష్టంగా 7% పరిమితి ఉంటుంది. గతేడాది భారత్ నుంచి 500 ఈబీ–5 వీసా పిటిషన్లు దాఖలవగా.. ఈసారి ఈ సంఖ్య 700కు చేరవచ్చని భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నమోదు చేసుకున్న వారి వీసా తిరస్కరణ రేటు గరిష్టంగా 20% మాత్రమే. ఇది కూడా సమర్పించే దస్తావేజులు, నిధుల విషయంలో సమస్యలతోనే. భారత్ నుంచి ఈ వీసాలు పొందేవారిలో చండీగఢ్, పంజాబ్, ఢిల్లీ, ముంబై, తమిళనాడు, కర్ణాటక నుంచే ఎక్కువ మంది పెట్టుబడిదారులు ఉంటారు. అమెరికా ‘గూఢచర్య’ ఆరోపణ! అమెరికా సీనియర్ చట్టసభ్యులు కూడా ఈబీ–5 ఇన్వెస్టర్స్ వీసా కార్యక్రమాన్ని మొదట్నుంచీ వ్యతిరేకిస్తున్నారు. ఈ వీసాల దుర్వినియోగం జరుగుతున్న ఘటనలను ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు. ‘ఈబీ–5 విధానం ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగియనుంది. ’మనీలాండరింగ్, గూఢచర్యం చేసేందుకు కూడా కొందరు ఈ విధానాన్ని వినియోగించుకుంటున్నారు’ అని అమెరికా సిటిజన్‌షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్ డైరెక్టర్ ఎల్ ఫ్రాన్సిస్ సిస్నా ఇటీవలే.. కాంగ్రెస్ సభ్యుల విచారణలో వెల్లడించారు. 1990లో కేటగిరీ–5ను సృష్టించినపుడు.. ఉద్యోగ కల్పన, పెట్టుబడుల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందనే కాంగ్రెస్ భావించింది. రెండేళ్ల తర్వాత నిరుద్యోగం పెరగడంతో రీజనల్ సెంటర్ ప్రోగ్రామ్‌ను అమల్లోకి తెచ్చి.. దీనికి ఈబీ–5 వీసా విధానాన్ని జోడించారు. చైనీయులే మోసగిస్తున్నారు! గత ఐదేళ్లలో ఈ వీసాల ద్వారా దేశ భద్రతను ప్రశ్నించేలా 19 కేసులు నమోదయ్యాయని సిస్నా తెలిపారు. ఈబీ–5 వీసాలను దుర్వినియోగం చేస్తున్న వారిలో ఎక్కువమంది చైనీయులే ఉన్నారు. ఈ ఏడాది జనవరిలో 120 మంది చైనీయులు తప్పుడు విధానాల్లో పెట్టుబడులు పెట్టినట్లు అంగీకరించారని అమెరికా ఇమిగ్రేషన్ అధికారి ఒకరు తెలిపారు. ఇలా వివిధ కేసులు బయటపడుతూ.. అమెరికా భద్రతకే సవాల్ విసురుతున్నందున ఈ విధానంలో మార్పులు తీసుకురావాలని డొనాల్డ్ ట్రంప్ సర్కారు భావిస్తోంది. 350 గ్రాములకు మించి పౌడర్లు తేవొద్దు! అమెరికా వచ్చే ప్రయాణికులు 350 గ్రాములకు మించి బరువున్న పొడి పదార్థాలు విమానం కేబిన్‌లోకి తీసుకురాకుండా అమెరికా నిషేధం విధించింది. జూన్ 30 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని అమెరికా రవాణా భద్రత పరిపాలన విభాగం (టీఎస్ఏ) పేర్కొంది. గతేడాది ఆస్ట్రేలియాలో ఓ గల్ఫ్ విమానంలో పౌడర్ ఎక్స్‌ప్లోజివ్స్ ద్వారా పేలుడు జరిపేందుకు విఫలయత్నం చేసిన నేపథ్యంలో టీఎస్ఏ ఈ నిర్ణయం తీసుకుంది. ‘350 గ్రాములకు మించి బరువున్న పొడి పదార్థాలను ఎక్స్‌రే స్క్రీనింగ్ చేయనున్నాం. అలాంటి పదార్థాలను చెకింగ్ బ్యాగుల్లో ఉంచితే అదనపు తనిఖీలు ఉండవు’ అని టీఎస్ఏ పేర్కొంది. పౌడర్ లాంటి పదార్థాలు తీసుకొస్తే అదనపు తనిఖీలుంటాయని, వాటిని చెకింగ్ బ్యాగుల్లో ఉంచడం ఉత్తమమని విమానయాన సంస్థలు సూచిస్తున్నాయి. వైద్యం, పిల్లలకు సంబంధించిన పౌడర్లు, చితాభస్మం, సుంకం లేని పౌడర్లను వెంట తీసుకెళ్లొచ్చని తెలిపాయి. -
గూఢచర్యంలో తీపి గుర్తులు
భారత్ పట్ల మెతక వైఖరి ప్రకటిస్తున్నందుకు పాకిస్తాన్ ప్రభుత్వం జనరల్ జియాను వదిలించుకుందని వర్మ చేసిన ప్రకటనతో నేను ఏకీభవిస్తాను. జియాకు వ్యతిరేకంగా జరిగిన కుట్రలో గుల్కి కీలక పాత్ర ఉందని నా నమ్మకం. ఐఎస్ఐ చీఫ్ స్థానంలో గుల్ కొనసాగుతున్నప్పుడే పాక్ అధ్యక్షుడు, సైనిక నియంత జియా దుర్మరణం చెందారు. తర్వాత చాలా సంవత్సరాల పాటు ఆ పదవిలో కొనసాగిన గుల్ని ప్రధాని బెనజీర్ భుట్టో పదవీచ్యుతుడిని చేశారు. అయితే పదవినుంచి తొలగించడం కాకుండా ముల్తాన్‌లో కీలకమైన సైనిక విభాగానికి కమాండర్‌గా పంపారు. ఆ తర్వాత గుల్ జీవిత కాలం పాటు ఫ్రీలాన్స్ జిహాదీగా పనిచేశారు. అలాంటి ఘటనలు కూడా చోటు చేసుకోగల వనీ, మన ఊహకు అందని రీతిలో తరచూ అవి జరుగుతూ ఉంటా యనీ, ఆఖరికి ప్రచ్ఛన్న యుద్ధకాలంలోనూ అలాంటి ఘటనలు సాధ్యమేననీ చెప్పే విధంగా గూఢచర్యం చరిత్ర రుజువులతో సహా నిండి ఉంది. వైరి శిబిరాల ప్రతినాయకులు కలుసుకున్నారు, చర్చించుకున్నారు, పరస్పరం గౌరవాభిమానాలను పెంపొందించుకు న్నారు. కొన్ని సమయాలలో వ్యక్తిగతంగా ప్రేమాభి మానాలు కూడా కురిపించుకున్నారు. మన దాయాది దేశాల గూఢచర్య వ్యవస్థల అధిపతులు– రా అధిపతి ఏఎస్ దౌలత్, ఐఎస్ఐ అధినేత అసద్ దురానీల మధ్య నమ్మితీరవలసిన రీతిలో జరిగినట్టు చెబు తున్న ఉమ్మడి కృషి గురించి వెల్లడించిన సంద ర్భంలో భారత్ పాకిస్తాన్ మీడియా ఆనందోత్సాహా లలో మునిగి తేలుతున్నది. ఈ వారం ఈ అపూర్వ మైన అంశం గురించి చర్చించడానికి కారణం అదే. చెప్పుకోదగిన ఇలాంటి చర్చకు సమన్వయకర్తగా వ్యవహరించిన వారు పత్రికా రచయిత ఆదిత్య సిన్హా. నిజానికి ఈ రెండు దేశాల గూఢచారి వ్యవస్థల అధిపతులు (లేదా ఎన్ఎస్ఏలు) వివిధ అంశాల గురించి చర్చించడానికి సుదూర ప్రాంతాలలో (థాయ్‌లాండ్ అయితే సౌకర్యంగా ఉంటుంది) కలుసుకుంటూ ఉంటారన్నది తెలిసిన విషయమే. ఈ పుస్తకంలో కదలించే కథనం ఒకటి ఉంది. వీసా నిబంధనలను ఉల్లంఘించి, ముంబై విమానాశ్ర యంలో పోలీసులకు దొరికిపోయిన అసద్ దురానీ కుమారుడికి రా ఎలా సహాయ సహకారాలు అందిం చినదీ ఆ కథనం చెబుతుంది. అతడు ఐఎస్ఐ మాజీ అధిపతి కుమారుడన్న వాస్తవాన్ని తెలుసుకునే అవకాశం కూడా వారు ఎవరికీ దక్కనీయలేదు. అప్పటికి దురానీ పదవీ విరమణ చేసి చాలా కాలమే అయింది. కానీ దౌలత్‌కు దురానీ అంటే ఎంతో గుడ్ విల్ ఉంది. దౌలత్ ఆనాటి రా సంస్థ అధిపతి రాజిం దర్ ఖన్నాతో మాట్లాడారు. మన గూఢచారి వ్యవస్థ అధిపతులు కొందరు పదవులలో ఉండగానే రహస్య సంభాషణలు జరిగాయి. రాజీవ్‌గాంధీ హయాంలో రా సంస్థ సంచాలకునిగా పనిచేసిన ఆనంద్వర్మ చని పోవడానికి కొంచెం ముందు ‘ది హిందు’ అభిప్రా యవేదికలో విభ్రాంతికరమైన నిజాలను వెల్లడిం చారు. అవి పేరుమోసిన లెఫ్టినెంట్ జనరల్ హమీద్ గుల్‌తో ఆయన జరిపిన రహస్య చర్చల వివరాలే. గుల్ అప్పటి ఐఎస్ఐ అధిపతి. ఈ చర్చలు ఎక్కు వగా విదేశాలలో జరిగినవే. తరువాత పబ్లిక్ ఫోన్ల ద్వారా జరిపినవి. సంకేత భాష, సంకేతాల సాయంతో ఆ చర్చలు జరిగాయి. ఈ చర్చలలో సియాచిన్, కశ్మీర్ వివాదాలలోని తీవ్రతను తగ్గిం చాలని ఆ ఇద్దరు అభిప్రాయపడ్డారు. గుల్ తన పట్ల నమ్మకం కుదిరేటట్టు చేయడానికి ఒక కోవర్ట్ ఆపరే షన్ కూడా నిర్వహించాడు. సిక్కు సైనిక పటాలా లకు చెందిన నలుగురుని అతడు భారత్‌కు అప్ప గించాడు. ఈ నలుగురు 1984లో ఆపరేషన్ బ్లూ స్టార్ తరువాత పాకిస్తాన్ వైపు ప్లేటు ఫిరాయించి భారత్‌లో తిరుగుబాటుకు ప్రయత్నించి నవారు. నిజానికి ఈ ప్రక్రియ రాజీవ్‌గాంధీ ఆశీస్సులతో జనరల్ జియా ఉల్ హక్ చొరవతోనే ఆరంభమైంది. మొదటి సమావేశంలో రాజీవ్‌గాంధీ జోర్డాన్ యువ రాజు హసన్ పలుకుబడిని ఆశించారని కూడా వర్మ రాశారు. యువరాజు రాజీవ్ వ్యక్తిగత మిత్రుడు (ఆ కాలంలో రాయల్ జోర్డాన్ ఎయిర్ లైన్స్‌ను దేశంలోకి అనుమతిస్తూ హక్కు కల్పించారనీ, అందుకు యువ రాజు రాజీవ్‌కు ఒక ఫ్యాన్సీ కారు బహూకరిస్తున్నా రనీ వివాదం చెలరేగింది). హసన్‌కు పాకిస్తాన్లో కూడా చాలా పలుకుబడి ఉంది (ఆయన భార్య పాక్ సంతతికి చెందినవారు). అయితే ఇదంతా జనరల్ జియా హత్యకు గురి కావడంతో నిలిచిపోయింది. ఈ శాంతి ప్రక్రియ పట్ల వ్యతిరేకంగా ఉన్న కొందరు జియా సైనిక సహచరులే ఆ హత్యకు పాల్పడ్డారని వర్మ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ పరిణామాలన్నీ కలసి ఒక కుట్ర సిద్ధాం తాన్ని మన ముందు ఉంచుతాయి. నిస్సందేహంగా వర్మ అత్యంత జాగరూకత కలిగిన అధికారి. దాదాపు మూడు దశాబ్దాలు వేచి ఉండి అప్పుడు బహిర్గతం చేశారు. గుల్ వెల్లడించిన వివరాలే వర్మను ఆ రహ స్యాలను బయటపెట్టడానికి ప్రేరణ కలిగించి ఉండ వచ్చు. వర్మ తన జ్ఞాపకాల విషయంలో నిజాయితీగా ఉంటూవచ్చారని నేను నమ్ముతున్నాను. వరుసగా జరిగిన అలాంటి ట్రాక్–2 సమావేశాలకు నేను హాజ రయ్యాను. వీటిలో బలూసా గ్రూప్ పేరిట జరిగిన సమావేశానికి అమ్మాన్లో రాజు హసన్ ఆతిథ్యమి చ్చారు. ఈ భేటీలో మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎస్.కె.కౌల్, ఆయన సోదరుడూ, కేబినెట్ మాజీ సెక్రటరీ, అమెరికాలో భారత రాయబారి పి.కె. కౌల్ పాల్గొనేవారు. లెఫ్టినెంట్ జనరల్ సతీష్ నంబియార్, పాకిస్తాన్ మాజీ ఆర్మీ వైస్–చీఫ్ జనరల్ కె.ఎమ్. అరిఫ్, పాక్ ప్రముఖ పారిశ్రామికవేత్త బాబర్ ఆలీ ఈ సమావేశాల్లో సందర్భానుసారం పాల్గొనేవారు. ఈ బృంద సభ్యుల్లో అత్యంత నిజాయితీపరుడు రిటైర్డ్ మేజర్ జనరల్ మహ్మద్ దురానీ. అత్యంత వివేచన, ఆశావాది, సైనికతత్వం కలిగిన ఇలాంటి పాకిస్తానీ జనరల్‌ని మీరు ఎన్నడూ చూసి ఉండరు. పాకిస్తాన్ మీడియాలోని కమాండో–కామిక్ తరహా వ్యాఖ్యాతలు ఈయనను ‘జనరల్ శాంతి’ అని అభివర్ణించేవారంటే ఆశ్చర్యం కలిగించదు. తర్వాత 2008లో పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారుగా బాధ్యతల్లో ఉన్నప్పుడు, కసబ్ పాకిస్తానీ జాతీయుడే అని అంగీకరించడంలో ఎంతో సాహసాన్ని, నిజాయి తీని ప్రదర్శించారు. ఈ నిజాన్ని వ్యతిరేకించలేమని కూడా చెప్పారు. దానికి ప్రతిఫలం ఆయన పదవి ఊడిపోయింది. మహ్మద్ దురానీ నిజంగానే పాకిస్తాన్ దేశ భక్తుడు, దృఢసైనికుడు అనడంలో సందేహమే లేదు. సియాల్ కోట్ సెక్టర్లో ప్రత్యేకించి ఫిలోరా, చావిందా సమరాల్లో ఫస్ట్ ఆర్మర్డ్ డివిజన్ నేతృ త్వంలో భారత మెరుపు దాడుల దళాలు భీకర పోరు సల్పుతున్నప్పుడు, దురానీ పాక్ తరపున యువ ట్యాంక్ కమాండర్‌గా పోరాడారు. ఆనాటి పోరాటాన్ని బుద్ధిహీనమైన తీవ్రపోరా టంగా ఆయన అభివర్ణించారు. భారత్ పక్షాన నిజంగా అద్భుతమైన, ఎత్తుగడల పరమైన సైనిక చర్య జరిగిందంటే దానికి లెఫ్టినెంట్ కల్నల్ ఏబీ తారాపోర్ కారణమని చెప్పారు. తన సైనిక రెజిమెంట్‌ను తారాపోర్ అత్యంత దూకుడుగా ముందుకు నడిపించారని, కానీ ఆర్టిల్లరీ కాల్పుల్లో తాను మరణించాడని దురానీ చెప్పారు. ఆ యుద్ధంలో ప్రకటించిన రెండు పరమ వీర చక్ర అవార్డులలో ఒకటి తారాపోర్కే దక్కింది. నేలకొరి గిన తారాపోర్ మృతదేహాన్ని దురానీ యుద్ధ క్షేత్రంలో స్వయంగా చూశారు. ప్రత్యర్థికి చెందిన వాడైనా ఆ సాహస సైనికుడి పట్ల దురానీ నేటికీ అత్యంత గౌరవం ప్రదర్శిస్తారు. 1987–88లో భారత్ దాదాపు రెండుసార్లు విజ యానికి అతిచేరువలోకి వచ్చి వెనుకడుగు వేసిందని రక్షణ రంగ పరిశీలకులు తరచుగా చెబుతుంటారు. మొదటిది 1987లో బ్రాస్ట్రాక్స్లో జరిగిన యుద్దం కాగా, రెండోది 1988లో జరిగిన శాంతి ప్రక్రియ. బహిరంగంగా ఇరుపక్షాలూ అధికారికంగా ప్రకటించ కున్నా, నిర్ధారించకపోయినా, సియాచిన్ ఒప్పందం దాదాపు ఖరారైందని అందరికీ అవగతమైంది. అది కూడా తెర వెనుక ఇలాంటి ప్రయత్నాలు, ఉద్రిక్తతల మధ్య కుదిరిన ఒప్పందాల వల్లే ఇది సాద్యమైంది. వీటివల్లే యుద్ధం నుంచి శాంతివైపుగా జరిగిన నాట కీయ పరిణామాలు, మళ్లీ యథాతథస్థితి నెలకొ న్నాయి. భారత్ పట్ల మెతక వైఖరి ప్రకటిస్తున్నందుకు పాకిస్తాన్ ప్రభుత్వం జనరల్ జియాను వదిలించు కుందని వర్మ చేసిన ప్రకటనతో నేను ఏకీభవిస్తాను. జియాకు వ్యతిరేకంగా జరిగిన కుట్రలో గుల్కి అధిక పాత్ర ఉందని నా నమ్మకం. ఐఎస్ఐ చీఫ్ స్థానంలో గుల్ కొనసాగుతున్నప్పుడే పాక్ అధ్యక్షుడు, సైనిక నియంత జియా దుర్మరణం చెందారు. తర్వాత చాలా సంవత్సరాల పాటు ఆ పదవిలో కొనసాగిన గుల్ని ప్రధాని బెనజీర్ భుట్టో పదవీచ్యుతుడిని చేశారు. అయితే పదవినుంచి తొలగించడం కాకుండా ముల్తాన్‌లో కీలకమైన సైనిక విభాగానికి కమాండర్‌గా పంపారు. ఆ తర్వాత గుల్ జీవిత కాలం పాటు ఫ్రీలాన్స్ జిహాదీగా పనిచేశారు. తాజా కలం : లండన్ కేంద్రంగా పనిచేసి ఇంట ర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్ట్రాటెజిక్ స్టడీస్ అధ్వ ర్యంలో మాల్దీవుల్లోని కురుంబా గ్రామ రిసార్ట్‌లో జరిగిన ట్రాక్–2 రకం భారత–పాక్ సదస్సులో నేను మొదటిసారిగా లెఫ్టినెంట్ జనరల్ అసద్ దురానీని కలిశాను. అది 1988 శీతాకాలం. అటల్ బిహారీ వాజ్ పేయీ, నవాజ్ షరీఫ్ పాలనలో భారత్–పాక్ సంబంధాల్లో కాస్త ప్రశాంతత నెలకొన్న సమయ మది. ఆ సమయంలో భారత్ వైపు నుంచి వాగాడం బరం నాటకీయంగా ఎందుకు తగ్గుముఖం పట్టిం దని దురానీ ఆశ్చర్యం వ్యక్తపర్చారు. కశ్మీర్లో పూర్తిగా సాధారణ స్థితి, శాంతి నెలకోవడమే దీనికి కారణమని నేను చెప్పాను. ఆ సమయంలో నేను జన రల్ దురానీ నుదురు ముడత పడటాన్ని, తీవ్ర దృక్కులను చూశాను. అప్పుడు దురానీ ఇలా చెప్పారు. ‘ఆ పరిస్థితి మారిపోవడానికి ఎంతోకాలం పట్టదు.‘ పాకిస్తాన్ సైన్యం కార్గిల్‌లో మొదటిసారి చొరబాటు జరపడం ద్వారా ఇది నిజమైంది కూడా. ఆరు నెలల తర్వాత లేక ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 19 ఏళ్ల క్రితం ఇరుదేశాల సైన్యాలు అక్కడ యుద్ధం చేశాయి. ఆ తర్వాత ఐదేళ్లకు దురానీ రిటైరయ్యారు. అయినా సరే ఐఎస్ఐ బాస్‌గా ఆయనకు అన్ని వివ రాలూ తెలిసి ఉంటాయి. శేఖర్ గుప్తా, వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్, twitter@shekargupta -
చిచ్చురేపిన గూఢచర్యం
దేశాల మధ్య ఉండే సంబంధాలు చిత్రమైనవి. పరస్పరం కత్తులు నూరుకునే దేశాలు మాత్రమే కాదు... స్నేహంగా ఉంటున్న దేశాలు సైతం అవతలి పక్షం తీరుతెన్నుల గురించి ఆరా తీసేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాయి. అయిదేళ్ల క్రితం సీఐఏ మాజీ ఉద్యోగి ఎడ్వర్డ్ స్నోడెన్ అమెరికా దశాబ్దాలుగా శత్రు దేశాలపైన మాత్రమే కాదు... సన్నిహిత దేశాలపై కూడా ఎలా నిఘా పెట్టిందో బట్టబయలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు బ్రిటన్–రష్యాల మధ్య కొనసాగుతున్న పంచాయతీ అలాంటి గూఢచార కార్యకలాపాల పర్యవసానమే. రష్యా సైనిక ఇంటెలిజెన్స్ కల్నల్‌గా పనిచేసిన సెర్గీ స్క్రిపాల్, ఆయన కుమార్తె యులియా స్క్రిపాల్ బ్రిటన్‌లోని శాలిస్బరీ పట్టణంలో ఒక షాపింగ్ మాల్ వద్ద ఈ నెల 4న అపస్మారకస్థితిలో పడి ఆసుపత్రిపాలైన ఉదంతం బ్రిటన్, రష్యాలమధ్య చిచ్చు రేపింది. వీరిద్దరిపైనా విష రసాయన ప్రయోగం జరిగిందన్నది ఆరోపణ. పర్యవ సానంగా రష్యా రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న 23మంది దౌత్యాధికా రులు తక్షణం దేశం విడిచి వెళ్లాలంటూ బ్రిటన్ హుకుం జారీ చేసింది. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో ఇలా పరస్పరం దౌత్యాధికారులను బహిష్కరించుకున్న చరిత్ర ఉంది. ఆ సంప్రదాయం మళ్లీ మొదలుకావడం ఆందోళన కలిగిస్తుండగా ఈ గొడ వలో తాజాగా ఫ్రాన్స్, జర్మనీ, అమెరికా కూడా తలదూర్చాయి. ఈ ఉదంతంలో రష్యా తక్షణం సంజాయిషీ ఇవ్వాలంటూ డిమాండ్ చేశాయి. ఈ ఉదంతంతో తమకేమాత్రం సంబంధం లేదని రష్యా అంటున్నది. సెర్గీ స్క్రిపాల్ రష్యా పౌరుడు, ఆ దేశ సైనిక ఇంటెలిజెన్స్‌లో ఉన్నతాధికారిగా పనిచేసినవాడు. వేరే దేశాలపై నిఘా ఉంచి సమాచారం రాబట్టాల్సిన స్క్రిపాల్ యూరప్‌లో తమ దేశం తరఫున పనిచేస్తున్న గూఢచారులు, వారి చిరునామాలు, వారి మారుపేర్లు వగైరాలను పదేళ్లపాటు బ్రిటన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ సంస్థ ఎంఐ6కు అందజేశాడు. 2003లో పట్టుబడ్డాడు. ఈ కేసు పర్యవసానంగా అతని ఉద్యోగం పోవడంతోపాటు దేశద్రోహ నేరంకింద జైలు శిక్ష కూడా పడింది. 2010లో బ్రిటన్, రష్యాల మధ్య గూఢచారుల మార్పిడి ఒప్పందం కింద స్క్రిపాల్ విడుదలై బ్రిటన్ వెళ్లి పోయాడు. సాధారణంగా అయితే అక్కడితో ఆ వ్యవహారం ముగిసి పోవాల్సింది. కానీ రష్యాకు అలాంటి చరిత్ర లేదు. అది గతంలో సైతం ఇలా డబుల్ ఏజెంట్లుగా పని చేసిన ‘ద్రోహుల్ని’ వదల్లేదు. రష్యా గూఢచార సంస్థ కేజీబీలో పనిచేస్తూ అనంతర కాలంలో పుతిన్ ప్రభుత్వానికి వ్యతిరేకిగా మారి బ్రిట న్కు వెళ్లిపోయిన అలెగ్జాండర్ లిత్వినెంకోను ఇదే తరహాలో 2006లో మట్టుబె ట్టారు. రష్యా వ్యాపారవేత్త బోరిస్ బెరిజోవ్స్కీని చంపడానికి పుతిన్ ప్రభుత్వం ఆదేశించిందని ఆరోపించి లిత్వినెంకో పుతిన్ ఆగ్రహానికి గురయ్యాడు. లిత్వినెం కోపై గుర్తు తెలియని వ్యక్తులు పొలో నియం–210 అనే అణుధార్మిక పదార్థాన్ని ప్రయోగించారని బ్రిటన్ పోలీసులు నిర్ధా రించారు. తమ భూభాగంలో లిత్వినెం కోపై విషప్రయోగం జరిపిన రష్యా పౌరుణ్ణి బ్రిటన్ గుర్తించి అప్పగించమని కోరినా పుతిన్ ప్రభుత్వం అంగీకరించలేదు. వివిధ దేశాల ప్రధానులు, అధ్యక్షులు విదేశాల్లో పర్యటించడం, ఒప్పందాలు కుదుర్చుకోవడం, స్నేహసంబంధాలు నెరపడం సర్వసాధారణం. దీనికి సమాంత రంగా ఆ దేశాల్లోనే గూఢచారులను నియమించుకుని వారిద్వారా సొంతంగా సమా చారం రాబట్టుకోవడం ఇంచుమించు ప్రతి దేశమూ చేసే పని. మిగిలిన దేశాల మాటెలా ఉన్నా అమెరికా ఈ విషయంలో ఆరితేరింది. అది ధూర్త దేశాలుగా పరిగణిస్తున్న ఇరాన్, ఉత్తరకొరియా, సిరియా వంటి దేశాలపై మాత్రమే కాదు... తనకు సన్నిహితంగా మెలగుతున్న బ్రిటన్, జపాన్, దక్షిణ కొరియాలపై కూడా గూఢచర్యం సాగించింది. ఎడ్వర్డ్ స్నోడెన్ వీటిని సాక్ష్యాధారాలతో సహా వెల్లడించి అందరినీ నివ్వెరపరిచాడు. అమెరికా నిఘాకు బలైన దేశాల్లో మన దేశం కూడా ఉంది. శత్రు దేశాల ఎత్తుగడలేమిటో, ఆ దేశాల్లో అంతర్గత పరిస్థితులెలా ఉన్నాయో తెలుసుకోవడంలో వింతేమీ లేదు. శత్రుదేశం కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండ టం సాధారణం. కానీ మిత్ర దేశాలుగా ఉంటూ పరస్పరం సహకరించుకునే దేశాలు సైతం అవతలి దేశం ఏం చేస్తున్నదో తెలుసుకునే ప్రయత్నం చేస్తాయి. ప్రతి దేశమూ తమ సమస్త సమాచారాన్నీ బట్టబయలు చేసుకోదు. ఎంత మిత్రదేశమైనా చెప్పవలసినదేమిటో, చెప్పకూడనిదేమిటో పరిమితులు విధించుకుంటుంది. తమ సమాచారం బయటికిపొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటూ, అవతలి దేశం గుట్టు లాగడానికి ప్రయత్నిస్తుంటుంది. ఇలా ఎవరికి వారు సాగించే నిఘా కార్యకలా పాలు ఎప్పుడో ఒకప్పుడు బయటపడుతుంటాయి. 1971లో భారత్–పాకిస్తాన్ల మధ్య యుద్ధం జరగడానికి ముందు నాటి ప్రధాని ఇందిరాగాంధీ వ్యూహమేమిటో తమకు కేబినెట్ మంత్రి ద్వారా తెలిసేదని అప్పటి సీఐఏ డైరెక్టర్ రిచర్డ్ హెల్మ్స్ ప్రకటించాడు. 2009లో లండన్‌లో జరిగిన జీ–20 దేశాల సమావేశాలపై అమెరికా నిఘా పెట్టి వివిధ దేశాల ప్రతినిధి బృందాలు తమలో తాము మాట్లాడుకున్న సంభాషణల్ని రికార్డు చేసిందని స్నోడెన్ అయిదేళ్లక్రితం బయటపెట్టాడు. ఏ దేశం ఎలాంటి వ్యూహం అనుసరించబోతున్నదో తెలుసుకుని ముందు జాగ్రత్తలు తీసు కోవడం అమెరికా చర్యలోని ఆంతర్యం. జీ–20లో ఒకటి రెండు మినహా అన్నీ అమెరికా మిత్ర దేశాలే. పైగా ఆతిథ్యం ఇచ్చిన బ్రిటన్ అత్యంత సన్నిహిత దేశం. అయినా అమెరికా తన పోకడ మానుకోలేదు. ఇప్పుడు స్క్రిపాల్, అతని కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. వీరిపై ప్రయో గించిన పదార్థం ‘నోవిచోక్’ అయి ఉండొచ్చునంటున్నారు. ఇది నాడుల పనితీరును నియంత్రించే వ్యవస్థను దెబ్బతీస్తుందని, మనుషుల్ని క్షణాల్లో అశక్తులుగా మారుస్తుందని, ఒకసారి దీని బారిన పడితే కోలుకోవడం అంటూ ఉండదని చెబుతున్నారు. ఆ సంగతలా ఉంచి ఈ ఉదంతం రష్యాకూ, యూరప్ దేశాలకూ మధ్య ఎలాంటి చిచ్చు రేపుతుందో, ఇది ఎటు పోతుందో రాగలరోజుల్లో తెలు స్తుంది. పరస్పర గూఢచర్యం చివరికెలాంటి పరిణామాలకు దారితీస్తుందో తెలి యాలంటే స్క్రిపాల్ ఉదంతమే ఉదాహరణ. -
స్కామ్‌లో ఇరుకున్న నటుడు
సాక్షి, ముంబై : కాల్ డేటా రికార్డ్ స్కామ్‌లో బాలీవుడ్ నటుడికి పోలీసులు సమన్లు జారీ చేశారు. విలక్షణ నటుడిగా గుర్తింపుపొందిన నవాజుద్దీన్ సిద్ధిఖీ, తన భార్య అంజలిపై అనుమానంతో ఓ డిటెక్టివ్‌ను నియమించాడని.. ఆమె కాల్ డేటాను సేకరించాడని ఆరోపణలు ఉన్నాయి. వ్యక్తిగత కాల్స్‌ను ట్రాప్ చేస్తున్నారంటూ కొందరు ఫిర్యాదులు రావటంతో థానే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ వ్యవహారం చిన్నది కాదని తేల్చిన పోలీసులు.. కాల్ డేటా రికార్డ్ స్కామ్ పేరిట దీని దర్యాప్తు చేపట్టారు. మొత్తం 11 మందిని అరెస్ట్ చేయగా.. అందులో ప్రైవేట్ డిటెక్టివ్లు కూడా ఉన్నారు. నవాజ్ తన భార్యపై అనుమానంతో నిఘా వేయించాడని, కాల్ డేటా సేకరించాడని ఓ డిటెక్టివ్ వెల్లడించాడు. అందుకు గానూ నవాజ్ తనకు రూ. 50 వేల దాకా చెల్లించాడని అతను చెప్పాడు. దీంతో విచారణకు సహకరించాల్సిందిగా నవాజుద్దీన్ పోలీసులు కోరారు. అయినా ఎటువంటి స్పందన లేకపోవటంతో థానే పోలీసులు సమన్లు జారీ చేశారు. ఇక ఈ వ్యవహారంపై నవాజుద్దీన్ ట్విట్టర్లో స్పందించాడు. తన కూతురు స్కూల్ ప్రాజెక్టు కోసం హాజరయ్యానని చెబుతూ.. అసత్య ఆరోపణలపై మీడియా తనను ప్రశ్నించటం దిగ్భ్రాంతి కలగజేస్తోందని అంటున్నాడు. Last evening, I was helping my daughter to prepare her school project Hydroelectric Power Generator & went to her school this morning for Project Exhibition. To my surprise the media had questions about some random allegations on me #Disgust pic.twitter.com/APPaEK373q — Nawazuddin Siddiqui (@Nawazuddin_S) 10 March 2018 -
చైనాలో స్పై విమానం
బీజింగ్: సముద్రాల్లో విమాన వాహక నౌకల నుంచి నియంత్రించగలిగే కొత్త గూఢచర్య విమానాన్ని చైనా అభివృద్ధి చేస్తోంది. శత్రు దేశాల డ్రోన్లు, జెట్ల కదలికలను కనిపెట్టడానికి వీలుగా దీనికి ఏఈఎస్ఏ రాడార్‌ను అమర్చారు. కేజే–600 అనే పేరుగల ఈ గూఢచర్య విమానాన్ని చైనా అభివృద్ధిపరుస్తున్నట్లు ఆ దేశ అధికారిక మీడియా సోమవారం తొలిసారిగా బయటపెట్టిందంటూ హాంకాంగ్‌కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. చైనా సముద్ర జలాల్లో ఇప్పటికే రెండు విమాన వాహక నౌకలు సేవలందిస్తుండగా, మూడో దానిని షాంఘైలో నిర్మిస్తోంది. తాజాగా అభివృద్ధి చేస్తున్న గూఢచర్య విమానాలను మూడో విమాన వాహక నౌకపై మోహరించే అవకాశం ఉన్నట్లుæ పత్రిక పేర్కొంది. గగనతలంలో అమెరికాకు దీటుగా తన సామర్థ్యాలను పెంపొందించుకునేందుకే కేజే–600ను చైనా నిర్మిస్తోందని సమాచారం. దీనిని దక్షిణ చైనా సముద్రం, హిందూ మహా సముద్రంలో మోహరించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. -
‘ఆ 42 యాప్‌లను డిలీట్ చేయండి’
న్యూఢిల్లీ : 42 ఆండ్రాయిడ్ యాప్‌ల ద్వారా చైనా భారత్‌పై గూఢచర్యం చేస్తోందని భారతీయ నిఘా సంస్ధ(ఐబీ) వెల్లడించింది. సైనికులందరూ ఆ యాప్‌లను తమ మొబైళ్ల నుంచి తొలగించాలని సూచించింది. భారత్‌కు చెందిన భద్రతా వ్యవస్థల విషయాలను ఈ యాప్‌ల ద్వారా చైనా తెలుసుకుంటున్నట్లు పేర్కొంది. రిపోర్టుల ప్రకారం.. వాస్తవాధీన రేఖ వద్ద కావలి ఉంటున్న సైనికులందరూ తమ మొబైళ్లను ఫార్మాట్ చేయాలని ఇంటిలిజెన్స్ డీఐజీ సూచనలు చేశారు. వియ్ చాట్(WeChat), ట్రూ కాలర్(Truecaller), వీబో(Weibo), యూసీ బ్రౌజర్(UC Browser), యూసీ న్యూస్(UC News) లాంటి తదితర 42 యాప్‌లు భారత్‌కు అత్యంత ప్రమాదకరమని చెప్పారు. చైనా మొబైళ్లలో ఈ యాప్‌లను వినియోగించడం అత్యంత ప్రమాదకరమని తెలిపారు. దేశ రక్షణకు సంబంధించిన సమాచారం తస్కరణకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. -
అమెరికా మహిళకు షాకిచ్చిన చైనా!
తమ దేశానికి వ్యతిరేకంగా గూఢచర్యానికి పాల్పడిందంటూ అమెరికన్ మహిళా వ్యాపారవేత్తకు చైనా కోర్టు శిక్ష విధించింది. మూడున్నరేళ్లు జైలులో గడుపాలని, ఆ తర్వాత ఆమెను స్వదేశానికి పంపాలని తీర్పు ఇచ్చింది. హుస్టన్‌కు చెందిన సాండీ ఫాన్ గిల్లీస్ 2015 మార్చిలో టెక్సాస్ అధికారులతో కలిసి వ్యాపార పర్యటన నిమిత్తం చైనా వచ్చింది. అయితే, ఆమె గూఢచర్యానికి పాల్పడుతున్నదంటూ చైనా పోలీసులు అదుపులోకి తీసుకొని, కస్టడీలో పెట్టుకున్నారు. మంగళవారం కోర్టు విచారణ సందర్భంగా ఆమె నేరాన్ని అంగీకరించిందని, దీంతో ఆమెకు కోర్టు శిక్ష విధించిందని ఆమె లాయర్ చెప్తున్నారు. కానీ, ఆమె భర్త జెఫ్ గిల్లీస్ మాత్రం సాండీ అమాయకురాలని, అక్రమంగా చైనా అదుపులోకి తీసుకున్న ఆమెను వెంటనే విడుదల చేయాలని ఆందోళనలు నిర్వహిస్తున్నారు. 1990 దశకంలో అమెరికా ప్రభుత్వం తరఫున చైనాలో సాండీ గూఢచర్యానికి పాల్పడిందని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే, ఆ సమయంలో సాండీ అమెరికాలోనే ఉన్నదని ఆయన పత్రాలు చూపిస్తున్నారు. -
గూఢచర్యానికి ఐఎస్ఐ వాడుకుంటున్న దారిదే!
న్యూఢిల్లీ: పాకిస్థాన్ కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటిలిజెన్స్(ఐఎస్ఐ) భారతీయ రక్షణ వ్యవస్థపై నిఘా ఉంచుతుందన్న విషయం తెలిసిందే. కానీ, ఏ పద్ధతిలో రక్షణ వివరాలను సేకరిస్తోందో తెలిస్తే షాక్ అవకుండా ఉండలేం. ప్రస్తుతం లేవగానే అది లేకుండా బతకలేం అనిపించే మొబైల్ ఇందుకు సాధనంగా వాడుతున్నట్లు లోక్ సభ సమావేశాల్లో హోం శాఖ మంత్రి హరిభాయ్ పటేల్ చౌదరి తెలిపారు. భారత రక్షణ వ్యవస్థలో పనిచేసి రిటైరయిన వారికి ఉద్యోగం, డబ్బు తదితరాలను ఆశ చూపి గూడచర్యానికి ఉపయోగించుకుంటున్నట్లు ఆయన తెలిపారు. కొన్ని రకాలైన వైరస్ తో ఆండ్రాయిడ్ ఆప్ లను తయారు చేసి ప్రజలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. టాప్ గన్(ఆటల యాప్), ఎమ్పీ జుంకీ(మ్యూజిక్ యాప్), వీడీ జంకీ(వీడియో యాప్), టాకింగ్ ఫ్రాగ్(ఎంటర్టైన్ మెంట్ యాప్)లలో వైరస్ ను ఉపయోగించి అధికారులను ఆకర్షిస్తున్నారని ఆయన చెప్పారు. 2013 నుంచి 2016 మధ్యకాలంలో ఏడుగురు రిటైర్డ్ ఉద్యోగులు ఐఎస్ఐకు సమాచారం అందిస్తూ దొరికిపోయినట్లు తెలిపారు. ఐఎస్ఐ స్మార్ట్ ఫోన్లను పావుగా వాడుకుంటుడాన్ని భారత భద్రతా సిబ్బంది పసిగట్టిందని ఆయన వివరించారు. ప్రభుత్వ సంస్థలన్నింటికి కంప్యూటర్ సెక్యూరిటీ పాలసీని అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సైబర్ దాడులను ఉద్యోగులు, అధికారలు సమర్ధవంతంగా ఎదుర్కొనే విధంగా చేశామని, అన్ని ప్రదేశాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ కెమెరాలను ఉపయోగిస్తున్నట్లు చౌదరి తెలిపారు. -
భారతీయుడికి జైలు శిక్ష
అబుదాబి: గూఢచర్యం కేసులో దోషిగా భారతీయుడొకరికి యూఏఈ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. నిందితుడిని మనార్ అబ్బాస్ గా గుర్తించారు. భారత నిఘా విభాగం తరపున గూఢచారిగా పనిచేస్తున్నారన్న ఆరోపణలు రుజువుకావడంతో అతడికి అబుదాబిలోని సుప్రీంకోర్టు ఐదేళ్ల శిక్ష విధించిందని 'గల్ఫ్ న్యూస్' తెలిపింది. అబుబాబి నౌకాశ్రయాల్లో సైనిక జలాంతర్గాములకు చెందిన కీలక సమాచారాన్ని అబుదాబిలోని భారత దౌత్యకార్యాలయానికి చేరవేస్తున్నారనే ఆరోపణలతో గతేడాది అబ్బాస్ ను అరెస్ట్ చేశారు. జైలు శిక్ష పూర్తైన తర్వాత అతడిని స్వదేశానికి పంపిస్తారు. అబ్బాస్ కు జైలు శిక్ష విధించడంపై భారత ఎంబసీ ఇంకా స్పందించలేదు. -
‘గూఢచర్యం’పై అధికారి అరెస్ట్
-
ఐఎస్ఐకు మాజీ సైనికుడి గూఢచర్యం
న్యూఢిల్లీ: పాకిస్తాన్ గూఢచారి సంస్థ (ఐఎస్ఐ) తరఫున గూఢచర్యం నెరపుతున్నట్లు ఆరోపణల నేపథ్యంలో మాజీ ఎయిర్‌ఫోర్స్ అధికారి రంజిత్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఐఎస్ఐ తీవ్రవాదులతో సంబంధాలున్నాయని అనుమానంతో రంజిత్ సింగ్‌ను సోమవారం పంజాబ్‌లో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి స్వస్థలం కేరళగా గుర్తించారు. కాగా పోలీసులు ఇవాళ రంజిత్ సింగ్‌ను స్థానిక కోర్టులో హాజరు పరిచారు. విచారణ నిమిత్తం అతడిని అయిదు రోజుల పాటు కస్టడీకి తీసుకోనున్నారు. అయిదేళ్లుగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పని చేస్తున్న రంజిత్ అధికారి పాకిస్థాన్ ఏజెన్సీలు పన్నిన వలలో చిక్కుకున్నాడు. సదరు సంస్థలు ఎరవేసిన ఓ యువతితో (హనీ ట్రాప్) అశ్లీల వీడియో చాటింగ్‌తో ఫిదా అయి.. కీలకమైన రహస్య సమాచారాన్ని ఆమెకు అందించాడు. గత మూడు నెలలుగా సాగుతున్నట్లు కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు కూపీ లాగడంతో వెలుగులోకి వచ్చింది. కాగా యువతిని ఎరగావేసిన పాక్ సంస్థలు తమకు కావాల్సిన సమాచారం మొత్తం లాక్కున్నాయని తేలింది. ఎయిర్‌ఫోర్స్‌లో ఉండే కీలక నెట్వర్క్ వ్యవస్థ పనితీరు, అధికారులు పేర్లు, ఫోన్ నంబర్లు, బేస్ క్యాంప్‌ల వివరాలు, హెడ్ క్వార్టర్స్ అడ్రస్‌లు, వంతెనల వివరాలను రంజిత్.... ఆ యువతికి చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎయిర్‌ఫోర్స్ అధికారులు గతరాత్రి రంజిత్‌ను విధుల నుంచి తొలగించారు. అలాగే సైనికాధికారుల నుంచి రహస్యాలను సేకరిస్తున్న ‘గూఢచర్య’ రాకెట్‌కు సంబంధించి జమ్మూకశ్మీర్‌లో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
వీరజవానే గూఢచర్యానికి పాల్పడ్డాడా?
-
వీరజవానే గూఢచర్యానికి పాల్పడ్డాడా?
శ్రీనగర్: అతనో వీర జవాన్... భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య జరిగిన కార్గిల్ యుద్ధంలో దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన సైనికుడు. దేశ సరిహద్దు ప్రాంతంలో శత్రువు కెదురొడ్డి వీరోచితంగా పోరాడిన యోధుడు. మరి అలాంటి యోధుడే.. ఇపుడు దేశద్రోహిగా మారిపోయాడా.. దేశానికి సంబంధించిన కొన్ని కీలక పత్రాలను దేశం దాటించే ప్రయత్నం చేశాడా ..వీర జవాన్ కాస్తా గూఢచారిగా మారిపోయాడా.. జమ్ము కశ్మీర్లో శుక్రవారం చోటు చేసుకున్న పరిణామాలు ఈ అనుమానాలను బలపరుస్తున్నాయి. జమ్ము కశ్మీర్ కు చెందిన మాజీ సైనికుడు మున్వర్ అహ్మద్ మీర్ ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థకు సమాచారం అందిస్తున్నాడనే ఆరోపణలతో పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ క్రైం బ్రాంచ్ , జమ్ము కశ్మీర్ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. రాజౌరి జిల్లా నివాసి అయిన మీర్‌పై అధికార రహస్య చట్టం కింద కేసులు నమోదయ్యాయి. కొన్ని రహస్య ప్రతాలను, కీలక సమాచారానికి పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐకు చేరవేశాడని పోలీసులు భావిస్తున్నారు. కీలకమైన సమాచారాన్ని ఉగ్రవాద సంస్థకు అందించాడని తమ విచారణలో తేలిందని నిఘా విభాగం అధికారులు తెలిపారు. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయుడిని కూడా అరెస్టు చేసినట్లు రాష్ట్ర డీజిపి వెల్లడించారు. స్థానిక కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం వీరిని రిమాండ్ కోసం ఢిల్లీకి తరలించామన్నారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను మాజీ సైనికుడు అహ్మద్ మిర్ ఖండించాడు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తప్పుడు ఆరోపణలతో తనను అన్యాయంగా ఇరికించారని వాదిస్తున్నాడు. కాగా మాజీ సైనికుడు మిర్ అధికార పీడీపీలో చురుకైన కార్యకర్త అని తెలుస్తోంది. -
పోప్‌పై గూఢచర్యం.. రహస్యాలపై రెండు బుక్స్
వాటికన్‌సిటీ: పోప్ ఫ్రాన్సిస్ వ్యక్తిగత సంభాషణలు వెలుగుచూడటం.. క్యాథలిక్ చర్చ్ వర్గాలను కుదిపేస్తున్నది. పోప్ ఫ్రాన్సిస్‌పై గూఢచర్యం జరిపిన ఓ స్పానిష్ క్రైస్తవ మతగురువు, మరో వ్యక్తి.. ఆయన వ్యక్తిగత సంభాషణలకు సంబంధించిన వైర్ టేప్‌లను బయటపెట్టారు. ఇప్పటికే వాటికన్ చర్చ్‌కు సంబంధించిన కీలక రహస్య సమాచారం ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులకు చేరడం కలకలం సృష్టిస్తున్నది. ఈ రహస్య సమాచారంలో చర్చ్ నిధులను కొల్లగొట్టడం, వేశ్యలోలత్వం వంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాలతో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు రచించిన రెండు పుస్తకాలు బుధవారం విడుదల కానున్నాయి. స్వచ్ఛంద సేవాకార్యక్రమాలకు సంబంధించిన నిధులను క్రైస్తవ మతగురువులైన కార్డినల్స్ నివాసాలకు అదనపు హంగులు చేకూర్చేందుకు దుర్వినియోగం చేశారని, అక్రమాలకు నెలవైన వాటికన్ బ్యాంకు నేరగాళ్లకు అడ్డగా మారిందని ఈ పుస్తకాలు ఆరోపిస్తున్నాయి. చర్చ్‌కు సంబంధించిన వర్గీకరించిన పత్రాలను దొంగలించి లీక్ చేశారనే ఆరోపణలపై ప్రజాసంబంధాల నిపుణుడు ఫ్రాన్సెస్కా చావ్కీ, మొన్సీగ్నర్ లుసియో ఎంజెల్ వాలెజో బాల్డా గతవారం అరెస్టయ్యారు. అయితే ఈ ఇద్దరే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు గియన్లుయిజి నూజి, ఎమిలియనో ఫిట్టిపాల్దికి రహస్య సమాచారం చేరవేశారా? అన్న విషయాన్ని వాటికన్ అధికారికంగా ధ్రువీకరించలేదు. అయితే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు రాసిన పుస్తకాలను మాత్రం తీవ్రంగా ఖండించింది. -
ప్రతిపక్ష నేతపై సీఎం గూఢచర్యం!
ఏడాది కిందటివరకు ఆయన ముఖ్యమంత్రి. ఫైళ్ల మీద సంతకాలు, ఇంటర్వ్యూలు, సిఫార్సులు అంటూ రోజుకు వందల మంది ఆయన ఇటికి వెళ్లేవారు. చిన్నపాటి భద్రతా తనిఖీలు తప్ప ఆయన్ని కలవడానికి వెళ్లేవారికి పెద్ద ఇబ్బందులేవీ ఉండేవికావు. ఇప్పుడు పదవి పోయింది. సీన్ మొత్తం మారిపోయింది. తన మీద ప్రభుత్వం నిశితంగా గూఢచర్యం చేస్తోందని అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. తన ఇంటికి ఎవరెవరు వస్తున్నారు, ఏ పని మీద వస్తున్నారు.. ఇలాంటి వివరాలన్నీ సేకరిస్తున్నారంటూ మండిపడుతున్నారు. ప్రస్తుతం జమ్ముకాశ్మీర్‌లో సంచలనం రేపుతున్న ఈ వ్యవహారంలో బాధితుడు.. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత ఒమర్ అబ్దుల్లా! గూఢచర్యం విషయమై శుక్రవారం ట్విట్టర్లో స్పందించిన ఒమర్.. 'ముఫ్తీ సర్కార్ నాపై గూఢచర్యం చేస్తోంది. అంతగా నాగురించి వివరాలు కావాలనుకుంటే నేరుగా నాకే ఫోన్ చేసి అడగొచ్చు. కానీ ఇలాంటి సిగ్గుమాలిన చర్యలు ఎంతవరకు సబబు?' అని ప్రశ్నించారు. ఓ జాతీయ పత్రికకు చెందిన జర్నలిస్టు.. ఒమర్‌ను ఆయన ఇంట్లో ఇంటర్వ్యూ చేసి బయటకు వెళ్తుండగా సీఐడీ అధికారులు అడ్డుపడి.. ఆమె వివరాలు, ఏయే ప్రశ్నలకు ఒమర్ ఎలా సమాధానమిచ్చారు? తదితర వివరాలు సేకరించారట. ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఒమర్.. తనపై గూఢచర్యం జరుగుతోందంటూ ట్వీట్లు చేశారు. 'డియర్ ముఫ్తీ సాబ్.. మీ టెలిఫోన్ తీసి నాకు కాల్ చేయొచ్చు. ఎలాంటి విషయమైనా నన్నడగొచ్చు. కానీ నా ఇంటికొచ్చేవారిని ఇబ్బంది పెట్టకండి' అంటూ మండిపడ్డారు. Mufti Govt brazenly spying on me. A journalist interviewing me for a national daily just got stopped right outside my gate by CID person. — Omar Abdullah (@abdullah_omar) September 4, 2015 She was asked who she was & what the purpose of her visit was! Seriously guys if you want to know just ask me, I couldn't care less if U do. — Omar Abdullah (@abdullah_omar) September 4, 2015 Dear Mufti Sb if you & your apparatchiks want to know what I'm up to pick up the phone & ask me. Please don't accost people outside my gate! — Omar Abdullah (@abdullah_omar) September 4, 2015 -
ఇరాన్ లో ట్యాపింగ్ కలకలం!
టెహ్రాన్: ఇరాన్లో కూడా ట్యాపింగ్ కలకలాన్ని సృష్టిస్తోంది. అక్కడ ఉన్నతాధికారుల వద్ద ఉండే సమాచారాన్ని గూఢచారులు తస్కరించే ప్రమాదం ఉందన్న అనుమానంతో.. అక్కడి ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. పని ప్రదేశాల్లో ఇలాంటి ఉన్నతాధికారులు ఎవరూ స్మార్ట్ ఫోన్లు వాడకుండా ఉండేలా నిషేధం విధించాలన్న యోచనలో అక్కడి సర్కారు కనిపిస్తోంది. స్మార్ట్ ఫోన్లనయితే సులభంగా ట్యాప్ చేయొచ్చని, వాటిలో ఉన్న సమాచారాన్ని హ్యాక్ చేయొచ్చని ఇరాన్ సర్కారు భావిస్తోంది. ఒకవేళ గూఢచారులు అధికారుల ఫోన్లలో సమాచారాన్ని తస్కరించడంతో పాటు.. వాటిని పూర్తిగా తొలగిస్తే, అధికారులు ఆ సమాచారాన్ని తిరిగి పొందడం కూడా అంత సులువైన పని కాదని బ్రిగేడియర్ జనరల్ జలాలీ తెలిపారు. కీలక సమాచారం బయటకి పోకుండా ఉండాలంటే పని చేసే ప్రదేశాల్లో బేసిక్ ఫోన్లను మాత్రమే అనుమతించేలా కొత్త నిబంధనలు రూపొందించామన్నారు. ఈ కీలక నిర్ణయాలు అమలుకు తుది దశలో ఉన్నట్లు తెలిపారు. కీలకమైన న్యూక్లియర్ ఒప్పందాలు కుదుర్చుకుందామనుకున్న సమయంలో గూఢచార్యంపై వస్తున్న వార్తలతో ఇరాన్ ఈ ఆంక్షలు విధించాలనుకోంటోంది. -
పాక్‌కు గూఢచర్యంపై మాజీ సైనికుడి అరెస్టు
అమృత్సర్: పాకిస్తాన్ నిఘా సంస్థలకు గూఢచారిగా వ్యవహరిస్తున్నాడన్న ఆరోపణలతో మాజీ సైనికుడు సుఖ్వీందర్ సింగ్‌ను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఆర్మీ వాహనాల కదలికలు, కీలక సంస్థలు, ఆర్మీ శిక్షణ శిబిరాల పత్రాల ఫొటోలు, చేతితో గీసిన నిషిద్ధ స్థలాల పటాలను సింగ్ దగ్గరి నుంచి స్వాధీనం చేసుకున్నారు. సంగ్రూర్ జిల్లాకు చెందిన సింగ్ ‘21 సిక్కు లైట్ పదాతిదళం’లో పనిచేసి 2005లో ఉద్యోగ విరమణ చేశాడు. ప్రస్తుతం ప్రైవేటు గిడ్డంగిలో సెక్యూరిటీ గార్డ్‌గా పని ఉన్నాడు. పాక్ ఇంటెలిజెన్స్ అధికారి సింగ్‌ను డబ్బు, ఉద్యోగం ఇస్తామని ప్రలోభపెట్టాడని, అతడు ‘శర్మ జీ’ పేరుతో పాక్‌కు గూఢచారిగా పనిచేశాడని ప్రాథమిక విచారణలో తేలింది. భారత సరిహద్దుల్లో ఏర్పాటు చేసే బంకర్ల వివరాలు, నభా, సంగ్రూర్లలో ఆర్మీ కదలికలను ఎప్పటికప్పుడు తెలియజేసే పనిని సింగ్‌కు అప్పగించారు. -
గూఢచర్యం డొంక కదిలిందిలా..
జిరాక్స్ మిషన్ వద్ద కీలక డాక్యుమెంట్‌ను వదిలేసి వెళ్లిన ‘ఇంటి దొంగలు’ ఏడు గదుల తాళాలకు డూప్లికేట్ తాళం చెవుల తయారీ వాటి సాయంతో రాత్రిపూట కార్యాలయాల్లోకి వెళ్లి డాక్యుమెంట్ల చోరీ ఎనిమిది నెలల నుంచే సాగుతున్న ఫైళ్ల తరలింపు ఓరోజు డెరైక్టర్ గది తలుపు తెరచి ఉండడంతో అప్రమత్తమైన అధికారులు పోలీసుల రంగ ప్రవేశంతో రట్టయిన గుట్టు న్యూఢిల్లీ: సంచలనం రేపుతున్న కార్పొరేట్ గూఢచర్యం ఎలా బయటపడింది..? జాతీయ భద్రతకు సంబంధించిన అత్యంత కీలక ఫైళ్లు సైతం కార్యాలయాలను దాటి ఎలా బయటకు వెళ్లాయి..? చమురు శాఖలో ఎప్పట్నుంచి ఈ చీకటి తతంగం సాగుతోంది..? ఇదేదో వారం కిందట బయటపడ్డ ఉదంతం కాదు! దీని వెనుక పక్కా స్కెచ్ ఉందని, కొద్ది నెలల నుంచి గుట్టుచప్పుడు కాకుండా ఈ ఫైళ్ల తరలింపు సాగుతోందని తెలుస్తోంది. సరిగ్గా ఎనిమిది నెలల కిందట.. అంటే ప్రధాని నరేంద్ర మోదీ సర్కారు కొలువుదీరిన తర్వాత చమురు శాఖ కార్యాలయంలో చోటుచేసుకున్న కొన్ని ఘటనల ఆధారంగా తీగ లాగితే ఈ డొంక కదిలింది. శాస్త్రిభవన్‌లోని చమురుశాఖ కార్యాలయంలో గతేడాది జూన్‌లో ఓరోజు ఉదయం జిరాక్స్ మిషన్ వద్ద ముఖ్యమైన డాక్యుమెంట్ ఒకటి పడి ఉండడాన్ని అధికారులు గుర్తించారు. కీలకమైన పత్రం ఇక్కడికి ఎలా వచ్చిందని అధికారులు దానిపై దృష్టి సారించారు. కిందిస్థాయి సిబ్బంది ఎవరైనా ఈ చర్యలకు పాల్పడుతుండొచ్చని అనుమానించిన అధికారులు అప్పట్నుంచే జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టారు. చివరకు టాయిలెట్లకు వెళ్లినా తమ గదులకు తాళం వేసి వెళ్లేవారు. ఇదిలా ఉండగా, రెండు నెలల కిందట ఇలాంటిదే మరో ఘటన వెలుగుచూసింది. సాధారణంగా అర్ధరాత్రిపూట తమ పనులు చక్కబెట్టుకునే నిందితులు.. ఈసారి వేకువజామునే తమ ‘ఆపరేషన్’ పూర్తి చేశారు. ఉదయం పూట ఆఫీసు శుభ్రపరిచే సిబ్బంది తమ పనులు చేసుకుంటుండగా.. ఓ డెరైక్టర్ గది తలుపు తెరచి ఉండడాన్ని గమనించి ఉన్నతాధికారులకు చెప్పారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న మంత్రిత్వశాఖ దర్యాప్తునకు ఆదేశించింది. కార్యాలయాల్లో మరిన్ని సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి నిఘా పెంచింది. పోలీసులు కూడా పకడ్బందీ చర్యలు చేపట్టారు. గత గురువారం ఢిల్లీ పోలీసులు రహస్య పత్రాలను తరలిస్తున్న కొందరు వ్యక్తులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో గుట్టు రట్టయింది. ‘కీ’లకమైన ఫైళ్లు వెళ్లాయిలా..! డూప్లికేట్ తాళం చెవులతో కార్యాలయాల తలుపులు తెరచి రాత్రిపూట చిన్నచిన్న కారిడార్లు, ఇరుకు మార్గాల గుండా రహస్య పత్రాలను తరలించేవారని పోలీసుల దర్యాప్తులో తేలడం ఈ స్కాంలో మరో కోణం. నిందితులు ఏకంగా ఏడు గదుల డూప్లికేట్ తాళం చెవులను తయారుచేశారు. కీలకమైన ప్రత్యేక కార్యదర్శి, ఇద్దరు సంయుక్త కార్యదర్శులతోపాటు చమురు అన్వేషణా విధానం, పెట్రోలియం, గ్యాస్ ధరల అంశాలను పర్యవేక్షించే కొందరు డెరైక్టర్ల గదుల తాళాలకు డూప్లికేట్ ‘కీ’లు రూపొందించడం గమనార్హం. వరుసగా అనుమానాస్పద ఘటనలు వెలుగుచూడడంతో అప్పట్నుంచి అధికారులు కార్యాలయంలోని అన్ని గదుల తాళాలను మార్చారు. కీలకమైన ఫైళ్ల కదలికలో నిబంధనలను కచ్చితంగా పాటిస్తున్నారు. రహస్య ఫైళ్లు, డాక్యుమెంట్లను నేరుగా వెళ్లి అందజేయడం, లేదా సీల్డ్ కవర్లో పంపడంలాంటి చర్యలు తీసుకుంటున్నట్లు చమురుశాఖ కార్యదర్శి సౌరబ్ చంద్ర తెలిపారు. చమురుశాఖకు జైపాల్‌రెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో ‘మల్టీ-టాస్కింగ్ స్టాఫ్’లో పనిచేసిన ఆశారాం(58), ఆయన సహచరుడు ఈశ్వర్‌సింగ్(56) ఈ డూప్లికేట్ ‘కీ’లను తయారు చేసినట్లు తెలుస్తోంది. రాత్రిపూట నకిలీ ఐడీ కార్డులు, నకిలీ తాళంచెవులతో ఉన్నతాధికారుల గదుల్లోకి వెళ్లడం, అవసరమైన పత్రాలను జిరాక్స్ తీసి, వాటిని చమురు కన్సల్టెంట్లు, కార్పొరేట్లకు అందించేవారని దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ఇద్దరు చమురుశాఖ సిబ్బంది సహా రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్సార్, కైర్న్, రిలయన్స్ గ్రూప్‌లకు చెందిన మొత్తం 12 మందిని పోలీసులు అరెస్టు చేసి దర్యాప్తు జరుపుతుండడం తెలిసిందే. కాగా ఈ కేసులో అరెస్టయినవారిలో ఇద్దరు నిందితులను పోలీసులు ఆదివారం శాస్త్రిభవన్కు తీసుకువెళ్లారు. కార్యాలయాల నుంచి రహస్య పత్రాలు ఎలా తీసకువెళ్లేవారో వారి ద్వారా తెలుసుకున్నారు. కొన్ని సాక్ష్యాలను సేకరించి, వారి వాంగ్మూలాలను రికార్డు చేశారు. మొద్దుబారిపోయిన వ్యవస్థకు నిదర్శనం మొద్దుబారిపోయిన అధికార వ్యవస్థ, కీలక ఫైళ్ల నిర్వహణలో దారుణమైన నిర్లక్ష్యానికి కార్పొరేట్ గూఢచర్యం కేసు ఓ నిదర్శనమని కొందరు మాజీ ఉన్నతాధికారులు విమర్శిస్తున్నారు. రహస్య డాక్యుమెంట్ల విషయంలో పాటించాల్సిన నిబంధనలను అధికారులు తుంగలో తొక్కుతున్నారని మాజీ కేబినెట్ కార్యదర్శి టీఎస్ఆర్ సుబ్రమణియన్ పేర్కొన్నారు. రక్షణ, పెట్రోలియం వంటి శాఖల రహస్య ఫైళ్లను పకడ్బందీగా నిర్వహించడంతోపాటు ఆ శాఖల కార్యాలయాలకు వచ్చే సందర్శకులపై గట్టి నిఘా ఉండాలని మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ సూచించారు. ఎవరికీ వ్యతిరేకం కాదు: ప్రధాన్ కార్పొరేట్ గూఢచర్యంపై దర్యాప్తు ఏ ఒక్కరినో లక్ష్యంగా చేసుకొని చేయడం లేదని పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టంచేశారు. ‘మా ఇంట్లో దొంగలు పడ్డారు. దానిపై మేం ఫిర్యాదు చేశాం. దర్యాప్తు జరుగుతోంది. వ్యవస్థను భ్రష్టుపట్టించాలని చూసినవారు ఎవరైనా వదలబోం. ఎవరూ చట్టానికి అతీతులు కాదు. చట్టాలను ఉల్లంఘించిన ఎవరినైనా కఠినంగా శిక్షిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు. -
ఇంటిగుట్టుకు తూట్లు
ఇంటి గుట్టు - కాపురం రట్టు అని లోకోక్తి . ఇంటికి గుట్టు ఎంత అవసరమో, కాపురం రట్టు కాకుండా ఉండటమూ అంతే అవసరమని దీని భావం. విశాల ప్రజానీకం ప్రయోజనాలు ఇమిడి ఉండే ప్రభుత్వ వ్యవహారాలకూ ఇది వర్తిస్తుంది. సర్కారు విధానాలు, నిర్ణయాలు, ప్రతిపాదనలు, అంచనాలు, అంతర్గత చర్చలు కచ్చితంగా ఎలా ఉంటున్నాయో ముందస్తుగా బహిర్గతమైతే, అందులో గోప్యత లేకుంటే పాలనా నౌకకు చిల్లులు పడటం ఖాయం. కేంద్రంలో ఆర్ధిక, పెట్రోలి యం, బొగ్గు , ఇంధన మంత్రిత్వ శాఖలు చాలా కీలకం. వీటి రోజువారీ కార్యకలా పాలు అటు ఖజానాపైనా, ఇటు జనజీవనంపైనా ప్రభావం చూపుతాయి.అలాంటి శాఖల నుంచి చాలా కాలంగా ముఖ్యమైన రహస్య పత్రాలు భద్రతా కోటలు దాటి స్వార్ధపరుల చేతికి చేరుతున్నాయని ఢిల్లీ పోలీసులు రెండు రోజుల కిందట బయటపెట్టడం యావద్దేశాన్నీ విస్మయపపరచింది. ఈ గూఢచర్యంలో దేశంలోని ఐదు ప్రముఖ కార్పొరేట్ సంస్థల ప్రమేయం ఉందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించడం ఇంకా ఆశ్చర్యకరం. ఈ రహస్య పత్రాల లీకుల కుంభకోణంలో ఇప్పటివరకు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ప్రస్తుత, మాజీ ఉద్యోగులు నలుగురు, ఒక సీనియర్ జర్నలిస్టు , ఇద్దరు కన్సల్టెంట్లు సహా ఐదుగురు ప్రముఖ పారిశ్రామిక సంస్థల ఉన్నతాధికారులు ఉన్నట్టు గుర్తిం చారు. ఈ పన్నెండు మందినీ అరెస్టు చేయడమే కాక, కేసు దర్యాప్తుని ముమ్మరం చేశారు. నిఘా కోసం చిన్న దుకాణాల వద్ద సైతం ఈ రోజుల్లో సీసీటీవీ కెమెరాలు ఉపయోగిస్తున్నారు. ఇవి విరామం లేకుండా 24 గంటలూ వాటి ముందు జరిగే ప్రతి క్షణాన్నీ నిఘా నేత్రంతో రికార్డు చేస్తాయి. అయినప్పుడు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నుంచి రహస్య పత్రాలు దర్జాగా ఐదు, పది వేల ఖరీదుకు వీధిన పడటం నిస్సందేహంగా భద్రతా వైఫల్యమే. ఇంటి దొంగల లాలూచీ లేనిదే ఈ కుంభకోణం సాధ్యపడదు. నాలుగు నెలల క్రితం చూచాయగా గూఢచర్యాన్ని పసిగట్టిన జాతాయ భద్రతా సలహాదారు దీనిపై దృష్టి సారించాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు సూచించారు. దాంతో ఈ ఆఫీసులలో నిఘా పెట్టారు. బోగస్ పత్రాలను కీలకమైనవిగా నమ్మించి నిందితుల్ని పక్కదారి పట్టించి వలపన్ని పట్టుకున్నారు. ఈ కేసులో నిందితులు కార్యాలయాలను నకిలీ తాళం చెవులతో తెరిచినట్టు, నకిలీ ఐడీ కార్డులతో ప్రవేశించి పత్రాలను అపహరించినట్టు చెప్పే ఆధారాలు దొరికినట్టు చెబుతున్నారు. ఇలా చోరీకి గురైన రహస్య పత్రాల్లో కేబినెట్ మినిట్స్( చర్చనీయాంశాలు), ప్రభుత్వ ఆదేశాలు (జీవోలు), మెమోలు, నోట్లు ఉన్నాయి. ఆఖరికి ఈ నెల 28 వ తేదీన ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభలో చేయబోయే బడ్జెట్ ప్రసంగంలోని ముఖ్యభాగాలు కూడా నిందితుల నుంచి స్వాధీ నం చేసుకున్న రహస్య పత్రాల్లో ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. అంటే, పత్రాల చోరులు ఎంత విచ్చలవిడిగా ప్రభుత్వ కార్యాలయాల్లోకి చొరబడుతు న్నారో అర్ధమవుతుంది. బడ్జెట్ ప్రసంగంలో అంశాలు ఆర్థిక మంత్రి సభలో చదివి వినిపించే వరకు గోప్యంగా ఉంటాయి. అవి లీకవడం వల్ల బడ్జెట్ కారణంగా ప్రభావితమయ్యే వర్గాలు జాగ్రత్తపడతాయి. తద్వారా ప్రభుత్వ ఆర్థిక లక్ష్యాలు దెబ్బ తింటాయి. ఆర్ధిక ప్రణాళికలు పల్టీ కొడతాయి. అరుణ్ జైట్లీ ఈ సారి బడ్జెట్ప్రసంగంలో వెల్లడించబోయే వాటిలో జాతీయ గ్యాస్గ్రిడ్ ప్రతిపాదన ఉందని, దాని వివరాలు ముందుగా తెలుసుకోడానికి రిల యెన్స్, ఎస్సార్, అడాగ్, కెయిర్న్స్, జూబిలంట్ ఎనర్జీ సంస్థలు ఆసక్తిచూపుతు న్నాయని తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు చెబుతున్నారు. ఈ కంపెనీలన్నీ విద్యుత్, గ్యాస్ ఉత్పత్తికి సంబంధించిన వాణి జ్య రంగాలలో నిమగ్న మై ఉన్నవే. కాబట్టి, ఇవి రహస్య పత్రాల చౌర్యానికి ప్రయత్నించి ఉంటాయనే అను మానాలకు ఆస్కారం ఉంది. అయితే, ఈ ఆరోపణల్ని సదరు ఐదు కంపెనీలూ ఖం డిస్తున్నాయి. ఇందులోని సత్యాసత్యాలు పోలీసుల సమగ్ర దర్యాప్తులో గాని తేలవు. ఈ ‘లీక్గేట్’ లో దోషులుగా బయటపడిన ఎవ్వరినీ వదలబోమని, ఇందులో ప్రభు త్వ అధికారులు, దళారుల మధ్య లాలూచీని కొట్టివేయలేమని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఈ రహ్యపత్రాల లీకేజీ ఇప్పటిదా లేక ఇంతకు ముందు నుంచే జరుగుతోందా? అన్నది దర్యాప్తులో తేలుతుందని కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. భారీ స్థాయిలో జరిగిన ఈ లీకేజీ ఉదంతాన్ని స్వ యంగా బయటపెట్టడం వెనుక ఒక సందేశం ఉందని, ఏ పారిశ్రామిక సంస్థ అయి నా అవినీతి, అక్రమమార్గాల్లో పయనించరాదని ప్రభుత్వం వాటికి స్పష్టంగా చెప్ప డమే అసలు ఉద్దేశమని ఎన్డీఎ సర్కారు వర్గాలు అంటున్నాయి. అదేంకాదు, మోదీ సర్కారు తన ప్రతిష్టని పెంచుకోడానికి ఇలాంటి తేలికపాటి గూఢచర్యం కేసు ల్ని బయటపెట్టి, ఏదో మహానేరం జరిగినట్టు యాగీ చేసి చివరికి ఏమీ నష్టం లేద ని తేల్చివేసే అవకాశం లేకపోలేదని అభిప్రాయపడే వర్గాలూ ఉన్నాయి. వ్యాపారం, వాణిజ్యం, రాబడి వంటి అంశాలతో ప్రమేయం ఉన్న ప్రభుత్వ శాఖలలో ప్రైవేట్ కంపెనీల ‘లాబీయింగ్’ కొత్తేమీ కాదు. ఈ శాఖలలో కన్సల్టెంట్ల(సలహాదారులు) నియామకం కూడా సాధారణమే. ఇలాంటి రహస్య పత్రాల లీకేజీలు ఈ సలహాదా రులనే అనుమానిస్తాయి. జాతి పురోగతికి నష్టం కలిగించే ఈ తరహా చర్యలు దేశ ద్రోహం కంటే తక్కువవేమీ కాదు. గతంలో పోటీ పారిశ్రామిక సంస్థల మధ్య ఫార్ములాలు, ఇంజినీరింగ్ డిజైన్లు, ప్లాన్లు వంటి వాటి విషయంలో గూఢచర్యం సాగేది. సాప్ట్వేర్రంగం అభివృద్ధితో అది కొంత తగ్గింది. పాతికేళ్ళ క్రితం భారత్ రోదసీ విజ్ఞాన రంగంలో విదేశీ గూఢచర్యం కేసు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిం చింది. ఏ రూపాన కొనసాగినా కీలక రహస్య సమాచార లీకేజి దేశానికి అపార నష్టం కలగచేస్తుంది. రాజకీయాలకు అతీతంగా ఈ కేసుని శోధించి, దోషుల్ని గుర్తించి, ససాక్ష్యాలతో వారికి తగిన శిక్షపడేలా చూడడమే మోదీ సర్కారు విధి. -
అరుణ్ గుప్పిట్లో విశాఖ నేవల్ బేస్ సమాచారం
* చెన్నై కోర్టులో సెల్వరాజన్ హాజరు.. 14 రోజుల రిమాండ్ సాక్షి, హైదరాబాద్: ఐఎస్ఐ ఏజెంట్‌గా అనుమానిస్తున్న శ్రీలంక జాతీయుడు అరుణ్ సెల్వరాజన్ వద్ద విశాఖపట్నం నావికాదళ కేంద్రానికి చెందిన కీలక ఫొటోలు, సమాచారం లభ్యమైనట్టు తెలిసింది. అరుణ్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) హైదరాబాద్ యూనిట్ అధికారులు బుధవారం అరెస్టు చేయడం తెలిసిందే. అతని వద్ద నుంచి ఎన్ఐఏ అధికారులు విశాఖ నేవల్‌బేస్‌కు చెందిన ఫొటోలు, సమాచారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కాగా అరుణ్ నివాసం, కార్యాలయం నుంచి అనేక వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఐఏ గురువారం ప్రకటించింది. కాగా అరుణ్‌ను ఎన్ఐఏ గురువారం చెన్నైలోని ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.