ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ: భారత్ కరోనా వైరస్‌తో ప్రపంచ దేశాలతో కలిసి పోరాటం చేస్తుంటే పాకిస్తాన్ మాత్రం ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సైతం భారత్‌లోకి టెర్రరిస్టుల్ని పంపించడంలో బిజీగా ఉందని ఇటీవలే ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నర్వానే వ్యాఖానించారు. దీనికి తగ్గట్టుగానే పాకిస్తాన్ భారతసైన్యానికి చెందిన ఉన్నతాధికారుల ఫోన్‌లు హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తోందని ఇండియన్ ఆర్మీ అధికారులను హెచ్చరించింది. కరోనా మహమ్మారి గురించి ప్రజలను అప్రమత్తం చేయడానికి భారత ప్రభుత్వం ఆరోగ్యసేతు యాప్‌ని అందరూ ఇన్‌స్టాల్ చేసుకోవాలని కోరింది.
చదవండి: మహమ్మారి మాటున భారీ దాడికి పాక్ స్కెచ్..
అయితే ఇప్పుడు అదే యాప్ ద్వారా పాకిస్తాన్ భారత సైన్యానికి సంబంధించిన విషయాలను హ్యాక్ చేయాలని చూస్తోంది. ఆరోగ్యసేతు యాప్‌లాగా ఉండే మరో యాప్‌ని ఆరోగ్యసేతు.ఏపీకే (Arogya setu.apk) పేరుతో పాకిస్తాన్ వర్గాలు తయారు చేశాయి. వీటిని భారత ఆర్మీ సిబ్బందికి వాటప్స్ ద్వారా ఆరోగ్య సేతు పేరుతో పంపిస్తున్నాయి. దీనిని వారి ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకుంటే మన ఆర్మీ విషయాలను పాకిస్తాన్ సులభంగా తెలుసుకోగలుగుతుంది. భారత్‌కు చెందిన పేర్లతో సోషల్ మీడియా అకౌంట్లను ఉపయోగిస్తూ భారత ఆర్మీని పాకిస్తాన్ టార్గెట్ చేస్తోంది. ఇప్పటికే అనోష్క చోప్రా పేరుతో ఆర్మీ ఆఫీసర్‌కి ఒక రిక్వెస్ట్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వ వెబ్‌సైట్ (mygov.in), ఆండ్రాయిడ్ ప్లే స్టోర్, ఐఓఎస్ యాపిల్ ప్లే స్టోర్ నుంచి మాత్రమే ఆర్మీకి చెందిన వారు ఆరోగ్య సేతు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలని భారత సైనిక విభాగం ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment