Indian Army personnel
-
‘ఏం భయం లేదు మేమున్నాం.. దీపావళి సంతోషంగా జరుపుకోండి’
శ్రీనగర్: యావత్ భారత దేశం దీపావళి వేడుకలకు సిద్ధమైంది. ధంతేరాస్‌లో భాగంగా శనివారం నియంత్రణ రేఖ వద్ద ఆర్మీ జవాన్లు దీపాలు వెలిగించి, బాణసంచా పేల్చుతూ వేడుకలు నిర్వహించారు. దేశ ప్రజలకు దివాళీ శుభాకాంక్షలు తెలిపారు. నియంత్రణ రేఖ సహా సరిహద్దు ప్రాంతాల్లో దీపావళి జరుపుకొన్నారు. అంతా మంచే జరుగుతుందని ప్రజల్లో ధైర్యం నింపారు. సరిహద్దుల వద్ద తాము అప్రమత్తంగా ఉన్నామని, ఎలాంటి చింత లేకుండా కుటుంబంతో కలిసి వేడుకలు జరుపుకోవాలని పేర్కొన్నారు. ‘దేశ ప్రజలు ఎలాంటి చితలేకుండా కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలు జరుపుకోవాలని చెప్పాలనుకుంటున్నా. దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు, సరిహద్దుల్లో మన జవాన్లు అప్రమత్తంగా, నిరంతరం నిఘా వేస్తూ ఉన్నారని భరోసా ఇస్తున్నాం.’ అని కలెనల్ ఇక్బాల్ సింగ్ తెలిపారు. ధంతేరాస్ సందర్భంగా లక్ష్మి పూజ నిర్వహించి.. లక్ష్మీగణపతి హారతి పాటలు పాడారు సైనికులు. సైనికులతో మోదీ దీపావళి వేడుకలు.. ఈ దీపావళి వేడుకలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత ఆర్మీ సైనికులతో కలిసి జరుపుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే జవాన్లతో దీపావళి వేడుకల్లో పాల్గొనాలని ప్రధాని మోదీ నిర్ణయించినట్లు కేంద్రప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా ఏ ప్రాంతానికి వెళ్తారనేది గోప్యంగా ఉంచారు. గత ఏడాది జమ్ముకశ్మీర్‌లోని నౌషేరాలో జవాన్లతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. Jammu and Kashmir | Indian Army soldiers posted along the Line of Control (LoC) in the Akhnoor sector burst crackers & lit earthen lamps as #Diwali festivities began with Dhanteras yesterday pic.twitter.com/ekmaKMJiJr — ANI (@ANI) October 22, 2022 ఇదీ చదవండి: Dhanteras 2022: చీపురు సహా, వీటిని కొనుగోలు చేస్తే..లక్ష్మీ కటాక్షం! -
సరిలేరు మీకెవ్వరు.. జవాన్లపై ప్రశంసలు
శ్రీనగర్: భారత జవాన్లు నిజమైన హీరోలు అన్న పేరును మరోసారి నిలబెట్టుకున్నారు. ప్రసవ వేదనతో బాధపడుతున్న మహిళను ఆస్పత్రికి చేర్చి మానవత్వం చాటుకున్నారు. గడ్డకట్టే చలిలో, మోకాళ్లలోతు మంచులో ఆమెను సుమారు రెండు కిలోమీటర్ల దూరం మేర మోసుకువెళ్లారు. సదరు మహిళ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. వివరాలు.. కుప్వారాలోని ఫకియాన్ గ్రామానికి చెందిన మంజూర్ అహ్మద్ షేక్ భార్య గర్భవతిగా ఉన్నారు. ఈ క్రమంలో జనవరి 5 అర్దరాత్రి ఆమెకు ప్రసవ నొప్పులు మొదలయ్యాయి. ఓవైపు తీవ్రమైన చలి.. మరోవైపు మంచువర్షం.. సమీపంలో ఒక్క వాహనం కూడా కానరాలేదు.. రెండు కిలోమీటర్లు దాటితే గానీ ఆస్పత్రికి చేరుకోలేరు.(చదవండి: మహిళా రైతుల ట్రాక్టర్లు వచ్చేస్తున్నాయ్) ఇలాంటి పరిస్థితుల్లో భార్యను ఆస్పత్రికి తీసుకువెళ్దామంటే అతడికి ఎటువంటి మార్గం కనిపించలేదు. దీంతో హృదయ విదారకంగా విలపిస్తూ సహాయం అర్థించసాగాడు. వెంటనే స్పందించిన ఆర్మీ జవాన్లు వైద్య బృందంతో అహ్మద్ ఇంటికి చేరుకున్నారు. అతడి కుటుంబ సభ్యులు వెంటరాగా నలుగురు సైనికులు ఆమెను భుజాలపై మోస్తూ కరాల్‌పురాలో ఉన్న ఆస్పత్రికి చేర్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను భారత రక్షణ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ క్రమంలో భారత జవాన్ల మానవతా గుణంపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘‘సరిలేరు మీకెవ్వరు’’ అంటూ సెల్యూట్ చేస్తున్నారు. Heavy snow in Kashmir brings unprecedented challenges for citizens, especially in higher reaches. Watch the Soldier & Awam fighting it out together by evacuating a patient to the nearest PHC for medical treatment. #ArmyForAwam#AmanHaiMuqam pic.twitter.com/DBXPhhh0RP — PRO Udhampur, Ministry of Defence (@proudhampur) January 7, 2021 -
ఆ యాప్ ద్వారా భారత్‌ను టార్గెట్ చేస్తున్న పాక్!
సాక్షి, న్యూఢిల్లీ: భారత్ కరోనా వైరస్‌తో ప్రపంచ దేశాలతో కలిసి పోరాటం చేస్తుంటే పాకిస్తాన్ మాత్రం ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సైతం భారత్‌లోకి టెర్రరిస్టుల్ని పంపించడంలో బిజీగా ఉందని ఇటీవలే ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నర్వానే వ్యాఖానించారు. దీనికి తగ్గట్టుగానే పాకిస్తాన్ భారతసైన్యానికి చెందిన ఉన్నతాధికారుల ఫోన్లు హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తోందని ఇండియన్ ఆర్మీ అధికారులను హెచ్చరించింది. కరోనా మహమ్మారి గురించి ప్రజలను అప్రమత్తం చేయడానికి భారత ప్రభుత్వం ఆరోగ్యసేతు యాప్‌ని అందరూ ఇన్స్టాల్ చేసుకోవాలని కోరింది. చదవండి: మహమ్మారి మాటున భారీ దాడికి పాక్ స్కెచ్.. అయితే ఇప్పుడు అదే యాప్ ద్వారా పాకిస్తాన్ భారత సైన్యానికి సంబంధించిన విషయాలను హ్యాక్ చేయాలని చూస్తోంది. ఆరోగ్యసేతు యాప్‌లాగా ఉండే మరో యాప్‌ని ఆరోగ్యసేతు.ఏపీకే (Arogya setu.apk) పేరుతో పాకిస్తాన్ వర్గాలు తయారు చేశాయి. వీటిని భారత ఆర్మీ సిబ్బందికి వాటప్స్ ద్వారా ఆరోగ్య సేతు పేరుతో పంపిస్తున్నాయి. దీనిని వారి ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటే మన ఆర్మీ విషయాలను పాకిస్తాన్ సులభంగా తెలుసుకోగలుగుతుంది. భారత్‌కు చెందిన పేర్లతో సోషల్ మీడియా అకౌంట్లను ఉపయోగిస్తూ భారత ఆర్మీని పాకిస్తాన్ టార్గెట్ చేస్తోంది. ఇప్పటికే అనోష్క చోప్రా పేరుతో ఆర్మీ ఆఫీసర్‌కి ఒక రిక్వెస్ట్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వ వెబ్సైట్ (mygov.in), ఆండ్రాయిడ్ ప్లే స్టోర్, ఐఓఎస్ యాపిల్ ప్లే స్టోర్ నుంచి మాత్రమే ఆర్మీకి చెందిన వారు ఆరోగ్య సేతు యాప్‌ని డౌన్లోడ్ చేసుకోవాలని భారత సైనిక విభాగం ఆదేశాలు జారీ చేసింది. కశ్మీర్లోకి ‘కరోనా’ ఉగ్రవాదులు -
సరిహద్దుల్లో ఆగని కాల్పుల మోత..!
-
సరిహద్దుల్లో ఆగని కాల్పుల మోత..!
శ్రీనగర్ : ఓ వైపు అభినందన్ వర్థమాన్ విడుదలతో భారత్ పాక్ మధ్య శాంతి చర్చల ప్రక్రియ మొదలవుందని అందరూ భావిస్తుండగా.. దాయాది దేశం మాత్రం పాత పాటే పాడుతోంది. జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదేపదే ఉల్లంఘిస్తోంది. పూంచ్, రాజౌరీ జిల్లాల్లో నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి ఉన్న భారత సైనిక స్థావరాలు, జనావాసాలే లక్ష్యంగా భారీ తుపాకులు, 105 ఎంఎం హోవిట్జర్లతో విరుచుకుపడుతోంది. మోర్టార్ షెల్స్‌తో దాడికి తెగబడింది. పాక్ రేంజర్ల దాడులను భారత భద్రతా దళాలు దీటుగా తిప్పికొడుతున్నాయి. ఈ క్రమంలో ఐదుగురు భద్రతా సిబ్బంది, ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు, ఇద్దరు పోలీసులు ప్రాణాలు కొల్పోయారు. ఒక పౌరుడు, మరో ఐదుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. పూంచ్ జిల్లాలో పాక్ రేంజర్ల దాడిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయమై ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. పాక్ రేంజర్ల దాడిలో రుబానా కోసర్ (24), ఆమె కుమారుడు ఫజాన్ (5)తో పాటు తొమ్మిది నెలల కుమార్తె ఫబ్నమ్ చనిపోయినట్టు తెలిపారు. ఈ ఘటనలో రుబానా భర్త యూనిస్ గాయలతో బయటపడ్డాడని వెల్లడించారు. అంతకు ముందు పాక్ కాల్పుల్లో నసీమ్ అనే పౌరుడు తీవ్రంగా గాయపడ్డాడని తెలిపారు. గత వారం రోజుల్లో పాక్ 60 సార్లు కాల్పువ ఉల్లంఘనకు పాల్పడిందన్నారు. ఈ నేపథ్యంలో రాజౌరీ, పూంచ్ జిల్లాల్లో ఎల్వోసీకి 5 కిలోమీటరల పరిధిలో ఉన్న విద్యాసంస్థలన్నింటినీ మూసివేయాలని ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. గతేడాది పాక్ 2,936 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. భయాందోళనలతో సరిహద్దు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్టు సమాచారం.ఉగ్రవాదుల స్థావరాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. -
ఈ 54 మంది ఏమయ్యారు?
భారతీయుడు కుల్భూషణ్జాధవ్కు పాకిస్తాన్విధించిన ఉరిశిక్షను అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్సవాల్చేసి తాత్కాలికంగానైనా నిలిపివేయించగలిగింది. జాధవ్‌ను భారత్‌నుంచి దౌత్యపరమైన సాయం అందించేందుకు వీలు కల్పించాలని పాక్‌ను ఐసీజే ఆదేశించింది. ఇది చిరకాల ప్రత్యర్థి పాక్‌పై అంతర్జాతీయ వేదిక మీద భారత్‌కు చాలా గొప్ప విజయంగా దేశమంతా కీర్తిస్తోంది. కానీ.. నాలుగున్నర దశాబ్దాలుగా పాక్‌చెరలో మగ్గుతున్నట్లు భారత సైనికుల విషయంలో కేంద్ర ప్రభుత్వాలు ఇదే పట్టుదలను చూపలేకపోతున్నాయి. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. 54 మంది.. 1971 నాటి భారత్ పాక్‌యుద్ధంలో ‘అదృశ్యమ’య్యారు. భారత సైన్యం సిబ్బంది 1. మేజర్ఎస్పీఎస్వారాయిచ్(15 పంజాబ్ ఈయనను పాక్ఖైదీగా పట్టుకున్న వెంటనే తుపాకీ కాల్పుల్లో చనిపోయారని చెప్తున్నారు) 2. మేజర్కన్వల్జిత్సింగ్సంధూ (15 పంజాబ్) 3. సెకండ్లెఫ్టినెంట్సుధీర్మోహన్సభర్వాల్(87 లైట్‌రెజిమెంట్) 4. కెప్టెన్రవీందర్కౌరా (మెడికల్రెజిమెంట్) 5. కెప్టెన్గిరిరాజ్సింగ్(5 అస్సాం) 6. కెప్టెన్ఓమ్ప్రకాష్దలాల్(గ్రెనేడియర్స్) 7. మేజర్సూరజ్సింగ్(15 రాజ్‌పుత్) 8. మేజర్ఎ.కె.సూరి (5 అస్సాం) 9. కెప్టెన్కల్యాణ్సింగ్రాథోడ్(5 అస్సాం) 10. మేజర్జస్కిరణ్సింగ్మాలిక్(8 రాజ్రైఫిల్స్) 11. మేజర్ఎస్.సి. గులేరి (9 జాట్) 12. లెఫ్టినెంట్విజయ్కుమార్ఆజాద్(1/9 జి రెజ్) 13. కెప్టెన్కమల్బక్షి (5 సిఖ్) 14. సెకండ్లెఫ్టినెంట్పరస్రామ్శర్మ (5/8 జి. ఆర్.) 15. కెప్టెన్వశిష్ట్నాథ్ 16. లెఫ్టినెంట్హవల్దార్కృష్ణలాల్శర్మ (1 జమ్మూకశ్మీర్రైఫిల్స్) 17 సుబేదార్అస్సాసింగ్(5 సిఖ్) 18. సుబేదార్కాళిదాస్(8 జమ్మూకశ్మీర్ఎల్ఐ) 19. లాన్స్నాయక్జగదీశ్రాజ్(మహర్రెజిమెంట్) 20 లాన్స్నాయక్హజూరాసింగ్ 21 గన్నర్సుజన్సింగ్(14 ఫార్వర్డ్రెజిమెంట్) 22. సిపాయ్దలేర్సింగ్(15 పంజాబ్) 23. గన్నర్పాల్సింగ్(181 లైట్‌రెజిమెంట్) 24. సిపాయ్జాగీర్సింగ్(16 పంజాబ్) 25 గన్నర్మదన్మోహన్(94 మౌంటెయిన్రెజిమెంట్) 26. గన్నర్గ్యాన్చంద్/ గన్నర్శ్యామ్సింగ్ 27. లాన్స్నాయక్బల్బీర్సింగ్ఎస్.బి.ఎస్. చౌహాన్ 28. కెప్టెన్డి.ఎస్.జామ్వాల్(81 ఫీల్డ్రెజిమెంట్) 29. కెప్టెన్వశిష్ట్నాథ్(అటాక్) భారత వైమానిక దళ సిబ్బంది 30. స్క్వాడ్రన్లీడర్మోహీందర్కుమార్జైన్(27 స్క్వాడ్రన్) 31. ఫ్లైట్లెఫ్టినెంట్సుధీర్కుమార్గోస్వామి (5 స్క్వాడ్రన్) 32. ఫ్లైయింగ్ఆఫీసర్సుధీర్త్యాగి (27 స్క్వాడ్రన్) 33. ఫ్లైట్లెఫ్టినెంట్విజయ్వసంత్తాంబే (32 స్క్వాడ్రన్) 34. ఫ్లైట్లెఫ్టినెంట్నాగస్వామి శంకర్(32 స్క్వాడ్రన్) 35. ఫ్లైట్లెఫ్టినెంట్రామ్మేథారామ్అద్వానీ (జేబీసీయూ) 36. ఫ్లైట్లెఫ్టినెంట్మనోహర్పురోహిత్(5 స్క్వాడ్రన్) 37. ఫ్లైట్లెఫ్టినెంట్తన్మయసింగ్దాన్దాస్(26 స్క్వాడ్రన్) 38. వింగ్కమాండర్హర్శరన్సింగ్(47 స్క్వాడ్రన్) 39. ఫ్లైట్లెఫ్టినెంట్బాబుల్గుహ 40. ఫ్లైట్లెఫ్టినెంట్సురేశ్చందర్సందాల్(35 స్క్వాడ్రన్) 41. స్క్వాడ్రన్లీడర్జల్మాణిక్షా మిస్త్రీ 42. ఫ్లైట్లెఫ్టినెంట్హర్వీందర్సింగ్(222 స్క్వాడ్రన్) 43. స్క్వాడ్రన్లీడర్జతీందర్దాస్కుమార్(3 స్క్వాడ్రన్) 44. ఫ్లైట్లెఫ్టినెంట్ఎల్.ఎం.సాసూన్(జేబీసీయూ) 45. ఫ్లైట్లెఫ్టినెంట్కుషల్పాల్సింగ్నందా (35 స్క్వాడ్రన్) 46. ఫ్లాగ్ఆఫీసర్కృషన్ఎల్. మల్కానీ (27 స్క్వాడ్రన్) 47. ఫ్లైట్లెఫ్టినెంట్బల్వంత్ధవాలే (1 స్క్వాడ్రన్) 48. ఫ్లైట్లెఫ్టినెంట్శ్రీకాంత్సి. మహాజన్(5 స్క్వాడ్రన్) 49. ఫ్లైట్లెఫ్టినెంట్గుర్దేవ్సింగ్రాయ్(27 స్క్వాడ్రన్) 50. ఫ్లైట్లెఫ్టినెంట్రమేశ్జి. కాదమ్(టీఏసీడీఈ) 51. ఫ్లాగ్ఆఫీసర్కె.పి.మురళీధరన్(20 స్క్వాడ్రన్) 52. నావల్పైలట్లెఫ్టినెంట్కమాండర్అశోక్రాయ్ 53. స్క్వాడ్రన్లీడర్దేవప్రసాద్ఛటర్జీ 54. పెటీ ఆఫీసర్తేజీందర్సింగ్సేథీ సంబంధిత వార్తలు పాక్‌చెరలో ‘అదృశ్య’ బందీలు!! 1983లో ఖైదీల మార్పిడిపై హైడ్రామా