* చెన్నై కోర్టులో సెల్వరాజన్ హాజరు.. 14 రోజుల రిమాండ్
సాక్షి, హైదరాబాద్: ఐఎస్‌ఐ ఏజెంట్‌గా అనుమానిస్తున్న శ్రీలంక జాతీయుడు అరుణ్ సెల్వరాజన్ వద్ద విశాఖపట్నం నావికాదళ కేంద్రానికి చెందిన కీలక ఫొటోలు, సమాచారం లభ్యమైనట్టు తెలిసింది. అరుణ్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) హైదరాబాద్ యూనిట్ అధికారులు బుధవారం అరెస్టు చేయడం తెలిసిందే.
అతని వద్ద నుంచి ఎన్‌ఐఏ అధికారులు విశాఖ నేవల్‌బేస్‌కు చెందిన ఫొటోలు, సమాచారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కాగా అరుణ్ నివాసం, కార్యాలయం నుంచి అనేక వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌ఐఏ గురువారం ప్రకటించింది. కాగా అరుణ్‌ను ఎన్‌ఐఏ గురువారం చెన్నైలోని ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.
అరుణ్ గుప్పిట్లో విశాఖ నేవల్ బేస్ సమాచారం
Published Fri, Sep 12 2014 2:34 AM | Last Updated on Wed, Oct 17 2018 5:14 PM
Advertisement