
సేవలందించేందుకు సిద్ధమైన ఐఎన్‌ఎస్ నిస్తార్ యుద్ధనౌక
పూర్తయిన సీట్రయల్స్..ఇప్పటివరకు 11 సార్లు సీ ట్రయల్స్
విశాఖలోని హిందూస్థాన్ షిప్ యార్డ్‌లో తయారీ
డైవింగ్ సపోర్ట్ వెసెల్స్ నిర్మాణంలో భారత్ కీలక మైలురాయిని అధిగమించింది. ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా పూర్తి స్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో నౌకల తయారీకి ఉపక్రమించిన హిందూస్థాన్ షిప్‌యార్డు లిమిటెడ్(హెచ్‌ఎస్‌ఎల్) సాంకేతిక సంస్కరణలు చేసుకుంటూ.. ఐఎన్‌ఎస్ నిస్తార్ యుద్ధ నౌకని అందుబాటులోకితీసుకొచ్చింది.
ఇప్పటి వరకు 11 సార్లు సీ ట్రయల్స్ పూర్తి చేసుకున్న ఈ జలాంతర్గామి రక్షిత యుద్ధ నౌక.. త్వరలోనే నౌకాదళ అమ్ముల పొదిలో చేరి సేవలందించనుంది. తొలిసారిగా ఓ యుద్ధనౌకలో 3 మెగావాట్ల డీజిల్ ఇంజిన్ ఏర్పాటు చేయడం.. నిస్తార్ నుంచే మొదలు పెట్టడం విశేషం. – సాక్షి, విశాఖపట్నం
వెల్ కమ్ బ్యాక్ ..నిస్తార్
భారత్–పాక్ యుద్ధ సమయంలో పీఎన్‌ఎస్ ఘాజీ సబ్‌మెరైన్‌ని కాలగర్భంలో కలిపేసింది ఐఎన్‌ఎస్ నిస్తార్. దాయాదితో జరిగిన పోరులో చారిత్రక విజయాన్ని అందించిన నిస్తార్ ఆ తర్వాత సేవల నుంచి ని్రష్కమించింది. ఇప్పుడు మళ్లీ స్వదేశీ పరిజ్ఞానంతో నిస్తార్ క్లాస్ నిర్మించాలని భారత నౌకాదళం భావిస్తూ.. ఆ బాధ్యతని విశాఖలోని హెచ్‌ఎస్‌ఎల్‌కు అప్పగించింది.
11 సార్లు సీ ట్రయల్స్ నిర్వహణ..
నిస్తార్–క్లాస్ సామర్థ్య ధ్రువీకరణ నిమిత్తం ఇప్పటి వరకు చేపట్టిన 11 సీ ట్రయల్స్ విజయవంతమయ్యాయి. ఇటీవల తుది ట్రయల్ నిర్వహించారు. యార్డ్–11190 పేరుతో నౌక పనులు చివరి దశకు చేరుకున్నాయి. షిప్‌యార్డు డిజైన్ మేనేజర్ ఉషశ్రీ ఆధ్వర్యంలో సిబ్బంది దీన్ని రూపొందించారు.
ఐఎన్‌ఎస్ నిస్తార్ స్వరూపమిదీ..
బరువు 9,350 టన్నులు
పొడవు 118.4 మీటర్లు
వెడల్పు 22.8 మీటర్లు
స్వదేశీ పరిజ్ఞానం 80%
ప్రాజెక్టు వ్యయం రూ.2,396 కోట్లు
సెన్సార్ నేవిగేషన్ రాడార్ నిస్తార్ ప్రత్యేకతలు
» డీప్ సబ్ మెరైన్స్ రెస్క్యూ వెహికల్
» సముద్ర గర్భం నుంచి 15 టన్నుల బరువుని ఎత్తేలా మెరైన్ క్రేన్ ఏర్పాటు
» 75 మీటర్ల లోతువరకు డైవింగ్ చేస్తుంది
» 3 మెగావాట్ల జనరేటర్ దీని సొంతం
» 300 మీటర్ల లోతు వరకు కార్యకలాపాల నిర్వహణ
ఉపయోగం
ఆపదలో ఉన్న జలాంతర్గాములకు సహాయం
సముద్రంలో నిరంతర గస్తీ, పరిశోధన, రక్షణ
Comments
Please login to add a commentAdd a comment