Hindustan Shipyard Limited
-
జలాంతర్గాములకు రక్షణ కవచం.. నిస్తార్
డైవింగ్ సపోర్ట్ వెసెల్స్ నిర్మాణంలో భారత్ కీలక మైలురాయిని అధిగమించింది. ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా పూర్తి స్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో నౌకల తయారీకి ఉపక్రమించిన హిందూస్థాన్ షిప్‌యార్డు లిమిటెడ్(హెచ్ఎస్ఎల్) సాంకేతిక సంస్కరణలు చేసుకుంటూ.. ఐఎన్ఎస్ నిస్తార్ యుద్ధ నౌకని అందుబాటులోకితీసుకొచ్చింది.ఇప్పటి వరకు 11 సార్లు సీ ట్రయల్స్ పూర్తి చేసుకున్న ఈ జలాంతర్గామి రక్షిత యుద్ధ నౌక.. త్వరలోనే నౌకాదళ అమ్ముల పొదిలో చేరి సేవలందించనుంది. తొలిసారిగా ఓ యుద్ధనౌకలో 3 మెగావాట్ల డీజిల్ ఇంజిన్ ఏర్పాటు చేయడం.. నిస్తార్ నుంచే మొదలు పెట్టడం విశేషం. – సాక్షి, విశాఖపట్నంవెల్ కమ్ బ్యాక్ ..నిస్తార్ భారత్–పాక్ యుద్ధ సమయంలో పీఎన్ఎస్ ఘాజీ సబ్‌మెరైన్‌ని కాలగర్భంలో కలిపేసింది ఐఎన్ఎస్ నిస్తార్. దాయాదితో జరిగిన పోరులో చారిత్రక విజయాన్ని అందించిన నిస్తార్ ఆ తర్వాత సేవల నుంచి ని్రష్కమించింది. ఇప్పుడు మళ్లీ స్వదేశీ పరిజ్ఞానంతో నిస్తార్ క్లాస్ నిర్మించాలని భారత నౌకాదళం భావిస్తూ.. ఆ బాధ్యతని విశాఖలోని హెచ్‌ఎస్‌ఎల్‌కు అప్పగించింది. 11 సార్లు సీ ట్రయల్స్ నిర్వహణ.. నిస్తార్–క్లాస్ సామర్థ్య ధ్రువీకరణ నిమిత్తం ఇప్పటి వరకు చేపట్టిన 11 సీ ట్రయల్స్ విజయవంతమయ్యాయి. ఇటీవల తుది ట్రయల్ నిర్వహించారు. యార్డ్–11190 పేరుతో నౌక పనులు చివరి దశకు చేరుకున్నాయి. షిప్‌యార్డు డిజైన్ మేనేజర్ ఉషశ్రీ ఆధ్వర్యంలో సిబ్బంది దీన్ని రూపొందించారు.ఐఎన్ఎస్ నిస్తార్ స్వరూపమిదీ.. బరువు 9,350 టన్నులుపొడవు 118.4 మీటర్లు వెడల్పు 22.8 మీటర్లు స్వదేశీ పరిజ్ఞానం 80%ప్రాజెక్టు వ్యయం రూ.2,396 కోట్లు సెన్సార్ నేవిగేషన్ రాడార్ నిస్తార్ ప్రత్యేకతలు» డీప్ సబ్ మెరైన్స్ రెస్క్యూ వెహికల్ » సముద్ర గర్భం నుంచి 15 టన్నుల బరువుని ఎత్తేలా మెరైన్ క్రేన్ ఏర్పాటు » 75 మీటర్ల లోతువరకు డైవింగ్ చేస్తుంది » 3 మెగావాట్ల జనరేటర్ దీని సొంతం » 300 మీటర్ల లోతు వరకు కార్యకలాపాల నిర్వహణ ఉపయోగంఆపదలో ఉన్న జలాంతర్గాములకు సహాయంసముద్రంలో నిరంతర గస్తీ, పరిశోధన, రక్షణ -
షిప్‌యార్డు ‘కీర్తి’ని చాటేలా.. రక్షణ శాఖతో రూ.934 కోట్ల భారీ ఒప్పందం
సాక్షి, విశాఖపట్నం : ఆత్మ నిర్భర్ భారత్‌ను ఇనుమడింపజేసేలా విశాఖపట్నం హిందుస్థాన్ షిప్‌యార్డు లిమిటెడ్ (హెచ్ఎస్ఎల్) భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. షిప్ రిపేర్ హబ్‌గా పరుగులు తీస్తున్న హెచ్ఎస్ఎల్.. సుదీర్ఘ విరామం తర్వాత వచ్చిన సింధుకీర్తి సబ్‌మెరైన్ రీఫిట్, మరమ్మతులకు సంబంధించి రక్షణశాఖతో సోమవారం ఎంవోయూ చేసుకుంది. రూ.934 కోట్లతో నిర్వహించే ఈ భారీ పనులను నిర్ణీత సమయంలో పూర్తిచేసి తన ప్రతి ష్టను మరింత పెంచుకునేందుకు షిప్‌యార్డు సిద్ధమవుతోంది. దీనిద్వారా స్థానిక ఎంఎస్ఎంఈలకు 1,000 పనిదినాల ఉపాధిని హెచ్ఎస్ఎల్ కల్పించనుంది. గతంలో తీవ్ర జాప్యం... సింధుకీర్తి సబ్‌మెరైన్ 2006లో మరమ్మతుల కోసం హెచ్‌ఎస్‌ఎల్‌కు రాగా, తొమ్మిదేళ్లకు పూర్తిచేశారు. అయినప్పటికీ ఇటీవల రికార్డు స్థాయిలో రీఫిట్ పనులను పూర్తిచేస్తూ ప్రపంచదేశాల చూపును తనవైపు తిప్పుకుంటూ ఇతర దేశాల నౌకల మరమ్మతుల బాధ్యతలను కూడా హెచ్ఎస్ఎల్ చేపడుతోంది. అందువల్లే భారత రక్షణశాఖ చొరవ తీసుకొని ఆత్మ నిర్భర్ భారత్ కింద సింధుకీర్తి సబ్‌మెరైన్ రీఫిట్ బాధ్యతలను షిప్‌యార్డుకి అప్పగిస్తూ భారీ ఎంవోయూ కుదుర్చుకుంది. ప్రస్తుతం సింధుకీర్తి రీఫిట్ పనులను 22 నెలల్లో పూర్తి చేస్తామని హెచ్ఎస్ఎల్ ఒప్పందంలో పేర్కొంది. రూ.934 కోట్ల ఈ భారీ ఒప్పందం ద్వారా 20కిపైగా హెచ్ఎస్ఎల్తో కలిసి పనిచేస్తున్న చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఉపాధి కలగనుంది. మొత్తం 1,000 పనిదినాలు ఎంఎస్ఎంఈలకు ఉపాధి కల్పించనున్నట్లు షిప్‌యార్డు ప్రకటించింది. నిర్ణీత 22 నెలల కంటే ముందుగానే సింధుకీర్తి సబ్‌మెరైన్ పనులు పూర్తిచేసి అప్పగించేందుకు కృషి చేస్తామని షిప్‌యార్డు ఉద్యోగులు ప్రతినబూనడం విశేషం. పెద్ద చాలెంజ్‌గా స్వీకరిస్తున్నాం కారణాలేమైనా గతంలో సింధుకీర్తి మరమ్మతుల విషయంలో చాలా ఆలస్యం జరిగింది. దానివల్ల ఎదురైన అవమానాలను భరించి మరమ్మతుల విషయంలో ఎన్నో సంస్కరణలు అమలుచేశాం. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ నిర్దేశించిన కాలపరిమితిలోపే రీఫిట్ పనులను పూర్తి చేస్తూ విదేశీ ఆర్డర్లు కూడా పొందుతున్నాం. ఇప్పుడు హెచ్ఎస్ఎల్ ప్రధాన నౌకా నిర్మాణ కేంద్రంగా దూసుకుపోతోంది. ఐదేళ్లలో ఏకంగా 14 ప్రాజెక్టులను పూర్తి చేశాం. ఇప్పటివరకు 200 నౌకలు తయారు చేయడంతోపాటు 2,000 షిప్స్ మరమ్మతు పనులను పూర్తిచేశాం. విశాఖను షిప్ రిపేర్హబ్గా తీర్చిదిద్దేందుకు సింధుకీర్తి ద్వారా వచ్చిన పెద్ద సవాల్‌గా భావించి మేమంతా దానిని స్వీకరిస్తున్నాం. – కమొడర్ హేమంత్ ఖత్రి, హెచ్ఎస్ఎల్ సీఎండీ -
ఆ మృతులంతా భాస్కరరావు బంధువులే..
సాక్షి, శ్రీకాకుళం : జిల్లాలోని కంచిలి మండలం జలంత్రకోట వద్ద జాతీయరహదారిపై ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులను నిన్న(శనివారం) విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డు క్రేన్ ప్రమాదంలో చనిపోయిన భాస్కరరావు బంధువులుగా గుర్తించారు. భాస్కరరావు మరణ వార్త తెలిసిన వెంటనే ఆయన బంధువులు ఖరగ్ పూర్ నుంచి స్కార్పియోలో విశాఖకు బయల్దేరారు. కాగా ఆదివారం తెల్లవారుజామున జలంత్రకోట వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని స్కార్పియో వాహనం ఢీకొట్టింది. (చదవండి : కుప్పకూలిన భారీ క్రేన్) ఈ ప్రమాదంలో భాస్కరరావు అత్త నాగమణి, ఆమె కోడలు లావణ్య, స్కార్పియో డ్రైవర్ రౌతు ద్వారక మృతి చెందారు. భాస్కరరావు బావమరుదులు రాజశేఖర్, ఢిల్లీశ్వరరావు, నాగమణి పెద్ద కోడలు మైథలి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని పోలీసులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. షిప్‌యార్డ్ కాలనీలో భార్య, ఇద్దరు పిల్లలతో పొదినాను భాస్కరరావు(35) నివాసం ఉంటున్నాడు. లీడ్ ఇంజినీరింగ్ సంస్థలో మూడేళ్లుగా కాంట్రాక్ట్ పద్దతిపై పనిచేస్తున్నాడు. హిందూస్థాన్ షిప్‌యార్డ్‌లో శనివారం భారీ క్రేన్ కూలి 10 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. (చదవండి : ఆ కుటుంబాలను కకావికలం చేసింది..) -
రూ. 20 వేల కోట్లతో భారీ నౌకాదళ ప్రాజెక్టు!
న్యూఢిల్లీ: సుమారు రూ. 20వేల కోట్లకు పైగా వ్యయంతో ప్రైవేటు రంగంలో నాలుగు ఉభయచర యుద్ధ నౌకల నిర్మాణానికి రక్షణ శాఖ ఓకే చెప్పింది. దాదాపు 30వేల టన్నుల నుంచి 40 వేల టన్నుల సామర్థ్యంతో ఈ నౌకలు ఉండనున్నాయి. ప్రైవేటు రంగంలో చేపట్టనున్న అతిపెద్ద ప్రాజెక్టు కూడా ఇదే. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టుకు రక్షణ శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ నేతృత్వంలో ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో రెండు నౌకల నిర్మాణ బాధ్యతలను విశాఖపట్నంలోని హిందుస్తాన్ షిప్‌యార్డ్‌కు, మరో రెండు నౌకల బాధ్యతలను ఇతర సంస్థలకు ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు.