Chennai court
-
నగ్నంగా నటించిన ఆండ్రియా.. హిట్ సినిమా సీక్వెల్ విడుదలకు చిక్కులు
కోలీవుడ్ సంచలన దర్శకుడు మిష్కిన్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం పిశాచి–2. 2014లో ఈయన దర్శకత్వంలో రూపొంది మంచి విజయాన్ని సాధించిన పిశాచి చిత్రానికి ఇది సీక్వెల్‌గా విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే, పలు అడ్డంకులు రావడంతో ఈ ప్రాజెక్ట్‌కు బ్రేకులు పడ్డాయి.రాక్‌ఫోర్ట్ పతాకంపై మురుగానందం నిర్మించిన పిశాచి–2 చిత్రంలో నటి ఆండ్రియా ప్రధాన పాత్రలో నటించింది. నటుడు విజయ్ సేతుపతి గౌరవ పాత్రలో నటించారు. అయితే, ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు అనుమతి ఇవ్వద్దొంటూ ఫ్లయింగ్ హార్స్ పిక్చర్స్ కంపెనీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమ సంస్థ నుంచి ఒక సినిమా హక్కులను పొందిన రాక్‌ఫోర్ట్ ఇరువురి ఒప్పందం ప్రకారం రూ. 4.85 కోట్లు తమకు చెల్లించాల్సి ఉందని పేర్కొంది. ఈ అంశంపై విచారణ జరిపిన కోర్టు ఫ్లయింగ్ హార్స్ పిక్చర్స్ వారికి రాక్‌ఫోర్డ్ సంస్థ అధినేతలు డబ్బు చెల్లించిన తర్వాతే పిశాచి-2 చిత్రాన్ని విడుదల చేసుకోవచ్చని కోర్టు తెలిపింది.ఆ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం. వడ్డీతో సహా ఫ్లయింగ్ హార్స్ పిక్చర్స్ వారికి రూ. 1.85 కోట్లు చెల్లించాలని కోర్టు తెలిపింది. అంత వరకు పిశాచి 2 విడుదలను నిషేధించాలని తెలిపింది. ఈ కేసు న్యాయమూర్తి జికె ఎలండ్రైయన్ ఎదుట విచారణకు వచ్చింది. నవంబర్ 18వరకు ఈ కేసును కోర్టు వాయిదా వేసింది. ఈ తేదీలోగా ప్రతిస్పందించాలని రాక్పోర్ట్ ఎంటర్టైన్మెంట్ను కోర్టు ఆదేశించబడింది.ఈ చిత్రంలో నగ్నంగా నటించిన ఆండ్రియాఈ చిత్రంలో నటి ఆండ్రియా పూర్తి నగ్నంగా నటించిందని తెలుస్తోంది. అందుకు ఆమె భారీ పారితోషికాన్ని డిమాండ్ చేసిందనే ప్రచారం కూడా వైరల్ అవుతుంది. దీనిపై దర్శకుడు మిష్కిన్ స్పందిస్తూ చిత్రం కోసం నటి ఆండ్రియాను నగ్నంగా చిత్రీకరించిన విషయం నిజమేనన్నారు. అందుకు ఆమె అధిక పారితోషికం డిమాండ్ చేయడం కూడా సహజమేనని పేర్కొన్నారు. అయితే, ఆమె నగ్నంగా నటించిన సన్నివేశాలను చిత్రీకరించలేదని, ఫొటోలు మాత్రమే తీసినట్లు పేర్కొన్నారు. అవి కూడా ఆమె సన్నిహితురాలు అయిన ఫొటోగ్రాఫర్‌తోనే తీయించామని, ఆ సమయంలో మిస్కిన్ అక్కడ లేనని పంచుకున్నారు. అయితే చిత్రాన్ని పిల్లలు కూడా చూడాలన్న ఉద్దేశంతో నగ్న ఫొటోలను చిత్రంలో పొందుపరచలేదని తెలిపారు. -
'తంగలాన్' ఓటీటీ విషయంలో తీర్పు వెల్లడించిన కోర్టు
విక్రమ్ హీరోగా పా.రంజిత్ తెరకెక్కించిన చిత్రం 'తంగలాన్'. ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ఓటీటీ విడుదల విషయంలో కాస్త జాప్యం ఎదురైంది. సినిమా రిలీజ్ అయి రెండు నెలలు దాటిని ఈ చిత్రం ఓటీటీలోకి అందుబాటులోకి రాలేదు. అయితే, తంగలాన్ ఓటీటీ అంశంపై మద్రాస్ ప్రధాన న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఇప్పటికే పలు తేదీలలో స్ట్రీమింగ్ కానుందంటూ సోషల్‌మీడియాలో ప్రచారం జరిగింది. కానీ, అవన్నీ రూమర్స్‌గానే మిగిలిపోయాయి. మాళవిక మోహనన్, పార్వతీ తిరువోతు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.తంగలాన్ సినిమాను ఓటీటీలో విడుదల చేయవద్దని తిరువళ్లూరుకు చెందిన పోర్కోడి మద్రాసు హైకోర్టులో ప్రజా ప్రయోజన పిటిషన్ దాఖలు చేశారు. ఈ సినిమాలో వైష్ణవులను అవమానించేలా చాలా సన్నివేశాలు ఉన్నాయని ఆయన పిటీషన్ వేశారు. అంతేకాకుండా బౌద్ధమతం గురించి చాలా పవిత్రంగా చూపించిన దర్శకుడు వైష్ణవులను మాత్రం కించపరిచేలా తెరకెక్కించారని పిటీషన్లో పేర్కొన్నారు. ఇప్పుడు ఓటీటీలో విడుదలైతే ఇరువర్గాల మధ్య మత ఘర్షణలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాబట్టి ఓటీటీలో తంగలాన్ సినిమా విడుదలను నిషేధించాలని పిటిషన్లో తెలిపారు.తంగలాన్ ఓటీటీ వివాదం పిటిషన్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఆర్ శ్రీరామ్, జస్టిస్ సెంథిల్ కుమార్ రామ్మూర్తిలతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. దానిని పరిశీలించిన న్యాయమూర్తులు మాట్లాడుతూ.. 'తంగళన్ సినిమా ప్రభుత్వ నింబధనల మేరకు సెన్సార్ సర్టిఫికెట్ పొంది థియేటర్లలో విడుదలైంది కాబట్టి అలాంటి నిర్ణయం తీసుకోలేమని కోర్టు తెలిపింది. తంగలాన్ సినిమాను ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల చేయడానికి ఎలాంటి అడ్డంకి లేదని ఆదేశిస్తూ ఈ కేసును న్యాయస్థానం కొట్టివేసింది. స్టూడియో గ్రీన్ కెఇ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రానికి జి.వి ప్రకాష్ సంగీతం సమకూర్చారు. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైన తంగలాన్ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 110 కోట్లు రాబట్టింది. కోర్టు తీర్పుతో దీపావళి కానుకగ తంగలాన్ ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. -
హీరోయిన్ తమన్నా కేసు వాయిదా
సినీ నటి తమన్నా కేసును చైన్నె హైకోర్టు వాయిదా వేసింది. నటి తమన్నా సినిమాల్లో నటిస్తూనే వాణిజ్య ప్రకటనల్లోనూ నటిస్తున్న విషయం తెలిసిందే. అలా ఆమె నటించిన ఓ వాణిజ్య ప్రకటన ప్రసారం గడువు పూర్తి అయినా సదరు సంస్థ ఆ ప్రకటనను ఉపయోగించడంతో తమన్నా దాన్ని వ్యతిరేకిస్తూ చైన్నె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో తాను ఒక ప్రముఖ వాణిజ్య సంస్థకు సంబంధించిన వాణిజ్య ప్రకటనలో నటించానని, అయితే ఒప్పందం గడువు పూర్తి అయినా ప్రకటనను వాడుతుండటంతో తాను కోర్టును ఆశ్రయించానని, తన పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం ఆ ప్రకటనపై నిషేధం విధించిందని పేర్కొన్నారు. అయినప్పటికీ ఆ సంస్థ కోర్టు తీర్పును ధిక్కరిస్తూ తాను నటించిన ప్రకటనను ప్రచారం చేసుకుంటోందని పేర్కొన్నారు. ఈ కేసు న్యాయమూర్తులు సెంథిల్ కుమార్, రామమూర్తిల డివిజన్ బెంచ్‌లో విచారణకు వచ్చింది. దీంతో ఆ వాణిజ్య సంస్థ తరుపున హాజరైన న్యాయవాది ఆర్.కృష్ణ కుమార్ వాదిస్తూ నటి తమన్నా నటించిన తమ వాణిట్య ప్రకటన ప్రసారాన్ని తాము నిలిపి వేశామని, అయితే ప్రైవేట్ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో వాడుతుంటే తాము ఎలా బాధ్యులమవుతామని పేర్కొన్నారు. దీంతో ఈ కేసులో రిట్ పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించిన న్యాయ మూర్తులు తదుపరి విచారణను సెప్టెంబర్ 2వ తేదీకి వాయిదా వేశారు. కాగా ఒక సబ్బు ప్రకటన సంస్థపై కూడా తమన్నా చైన్నె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. -
200 రోజులుగా జైల్లోనే.. తమిళనాడు మంత్రికి మరోసారి ఎదురుదెబ్బ
చెన్నై: ప్రస్తుతం జ్యూడీషియల్ కస్టడిలో ఉన్న తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీకి మరోసారి నిరాశే ఎదురైంది. మనీలాండరింగ్ కేసులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను చెన్ననై సిటీ కోర్టు మూడోసారి తిరస్కరించింది. ఈ కేసులో ఎలాంటి మార్పు జరగనందున బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు చెన్నై ప్రిన్సిపల్ డిస్ట్రిక్ అండ్ సెషన్స్ కోర్టు జడ్జి ఎస్ అలీ తీర్పునిచ్చారు. కాగా గతేడాది జూన్ 14న మంత్రి సెంథిల్ బాలాజీని ఈడీ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. గత అన్నా డీఎంకే ప్రభుత్వంలో రవాణాశాఖ మంత్రిగా ఉన్న సెంథిల్ బాలాజీ(2018లో ఆయన డీఎంకే పార్టీలో చేరారు).. రవాణాశాఖలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి భారీగా సొమ్ము వసూలు చేసినట్లు ఈడీ ఆరోపించింది. ఆఈ కేసులో కేసు నమోదు చేసిన ఈడీ.. అతన్ని అరెస్ట్ చేసింది. అరెస్ట సమయంలో ఛాతీలో నొప్పి రావడంతో ఆయన చెన్నైలోని ఆసుపత్రిలో చేరారు. చదవండి: ‘ఆటల్ సేతు’ నిర్మాణం కోసం ఉపయోగించిన టెక్నాలజీ ఇదే! అక్కడ మంత్రికి బైపాస్ సర్జరీ జరిగింది. అనంతరం ఈడీ విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకొని తరువాత జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించింది. అప్పటి నుంచి అతని రిమాండ్‌ను కోర్టు పొడిగిస్తూనే ఉంది. గత 200రోజులకు పైగా సెంథిల్ జైల్లోనే ఉన్నారు. ఎటువంటి పోర్ట్‌ఫోలియో లేకుండా డీఎంకే ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్నారు. ఇక ఆగస్టులో బాలాజీపై ఈడీ 3, 000 పేజీల చార్జిషీట్‌ను దాఖలు చేసింది. అయితే అనారోగ్య కారణాలతో ఇప్పటి వరకు మూడుసార్లు బాలాజీ బెయిల్ కోసం అభ్యర్ధించగా.. ప్రతిసారీ కోర్టులో తిరస్కరణే ఎదురైంది. అంతకముందు ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు అక్టోబర్ 19న కొట్టివేసింది. ముందస్తు బెయిల్ దరఖాస్తులను చెన్నై కోర్టు రెండుసార్లు కొట్టివేసింది. -
జయప్రదకు బిగ్ షాక్.. జైలు శిక్ష విధించిన కోర్టు..
సాక్షి, చెన్నై: సీనియర్ సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదకు బిగ్ షాక్ తగిలింది. ఆమెకు చెన్నై కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పును వెల్లడించింది. అలాగే, జరిమానా కూడా విధించింది. వివరాల ప్రకారం.. తమిళనాడులోని ఎగ్మోర్ కోర్టు జయప్రదకు ఆరు నెలలు జైలు శిక్ష విధించింది. అయితే, చెన్నైకి చెందిన రామ్ కుమార్, రాజబాబుతో కలిసి జయప్రద అన్నారోడ్డులో ఓ సినిమా థియేటర్‌ను నడిపించారు. కాగా, ఈ సినిమా థియేటర్లో పనిచేసే కార్మికులు నుంచి వసూలు చేసిన ఈఎస్ఐ మొత్తాన్ని చెల్లించలేదని కార్మిక బీమా కార్పోరేషన్ కోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై కోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. అయితే, దీనిపై విచారణ జరిపిన కోర్టు.. జయప్రదతో పాటుగా మరో ముగ్గురికి ఎగ్మోర్ కోర్టు ఆర్నెళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించింది. అలాగే, ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున జరిమానా విధించింది. ఇదిలా ఉండగా.. జయప్రద తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమే. ఆమె.. తెలుగు సహా పలు భాషల చిత్రాల్లో నటించారు. రెండు దశాబ్దాల పాటు స్టార్ హీరోయిన్గా తన మార్క్ నటనతో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసి అక్కడ కూడా దిగ్విజయంగా విజయ యాత్రను కొనసాగించారు. நடிகை ஜெயப்பிரதாவுக்கு 6 மாதம் சிறை#JayaPrada | #Jail pic.twitter.com/GKUcmO6ViJ — Kumudam Reporter (@ReporterKumudam) August 11, 2023 -
గృహహింస కేసు.. విచారణకు గడువు కోరిన నటుడు
తమిళసినిమా: బుల్లితెర నటుడు అర్ణవ్ పోలీసుల ముందు విచారణకు హాజరు కావడానికి గడువు కోరాడు. వివరాల్లోకి వెళితే.. బుల్లితెర జంట అర్ణవ్, దివ్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇటీవల తన భర్త తనని కొట్టి, చిత్రహింసలకు గురి చేస్తున్నాడంటూ స్థానిక పోరర్ మహిళా పోలీసుస్టేషన్లో ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో గృహహింస, హత్య బెదిరింపులు విభాగాల్లో కేసు నవెదు చేసి, విచారణ చేపట్టారు. అందులో భాగంగా నటుడు అర్ణవ్‌ను విచారణకు రావాల్సిందిగా పలుమార్లు సమన్లు పంపినా అతను హాజరు కాలేదు. చివరిగా శుక్రవారం హాజరు కావాలని లేని పక్షంలో అరెస్టు చేయాల్సి ఉంటుందని సమన్లు జారీ చేశారు. అయితే అర్ణవ్ పరారీలో ఉన్నట్లు, ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా కంటికి గాయం కారణంగా తాను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నానని, అందువలన విచారణకు హాజరు కావడానికి గడువు కావాలని, ఈ నెల 18వ తేదీన హాజరవుతానని తన న్యాయవాది ద్వారా ఓ లేఖను పోలీసులకు పంపారు. దీంతో అతనిపై చర్యలు తీసుకునే విషయమై పోలీసులు అధికారులు చర్చలు జరుపు తున్నారు. -
హీరో సూర్య, జ్యోతికలపై ఎఫ్ఐఆర్కు కోర్టు ఆదేశం
తమిళ స్టార్ హీరో సూర్య మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఆయన నటించిన 'జై భీమ్' చిత్రంపై చెలరేగిన వివాదం మరోసారి చర్చనీయాంశమైంది. జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందిన సంగతి తెలిసిందే. నేరుగా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. అయితే ఈ చిత్రంలో తమ కులాన్ని కించపరిచారని వన్నియార్ సామాజిక వర్గానికి చెందిన కొందరు 2021 నవంబర్‌లో కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. జై భీమ్‌లోని కొన్ని సన్నివేశాలు తమ ప్రతిష్ఠను మసకబార్చేలా ఉన్నాయని పిటిషన్లో పేర్కొన్నారు. తాజాగా ఈ పిటిషన్‌ను విచారించిన చెన్నై కోర్టు హీరో సూర్య, అతని భార్య జ్యోతిక(జై భీమ్ నిర్మాత) దర్శకుడు జ్ఞానవేల్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. గతంలో పలుమార్లు ఈ పిటిషన్‌పై విచారణ జరిగినా సూర్య, జ్యోతిక, జ్ఞానవేల్ ఎవరూ కోర్టుకు హాజరు కాలేదన్న విషయాన్ని ప్రస్తావించింది. అంతేకాకుండా ఈ కేసుపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆ ముగ్గురును కోరింది. తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది. -
చిన్నమ్మకు చుక్కెదురు
సాక్షి ప్రతినిధి, చెన్నై: చిన్నమ్మ శశికళకు చెన్నై సిటీ సివిల్ కోర్టులో చుక్కెదురైంది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి నుంచి ఆమెను తొలగించడం సబబే అంటూ న్యాయస్థానం సోమవారం తీర్పు చెప్పింది. నేపథ్యం ఇదీ.. సుదీర్ఘకాలం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఉన్న జయలలిత 2016 డిసెంబర్లో కన్నుమూశారు. తరువాత ఆ బాధ్యతల్లో శశికళ, ఉప ప్రధాన కార్యదర్శిగా టీటీవీ దినకరన్ ఎంపికైనట్లు ఆపార్టీ 2016 డిసెంబర్ 19న ప్రకటించింది. ఇక ఆ తరువాత సీఎం సీటుపై కన్నేసిన జయలలిత శాసనసభాపక్ష నేతగా కూడా ఎన్నిక్కయ్యారు. అయితే అదే సమయంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళకు నాలుగేళ్ల శిక్ష పడగా బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలుకెళ్లారు. దీంతో ప్రధాన కార్యదర్శి పదవి నుంచి శశికళను, ఉప ప్రధాన కార్యదర్శి పదవి నుంచి టీటీవీ దినకరన్‌ను తొలగిస్తున్నట్లు పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ ఓ పన్నీర్‌సెల్వం, ఉప కన్వీనర్ ఎడపాడి పళనిస్వామి 2017 సెప్టెంబర్‌లో జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంలో ప్రకటించారు. ఆ తీర్మానాలు చెల్లవంటూ.. ఇదిలా ఉండగా, ప్రధాన కార్యదర్శి సమక్షంలో జరగని (సర్వసభ్య సమావేశంలో) తీర్మానాలు చెల్లవని ప్రకటించాల్సిందిగా కోరుతూ శశికళ, దినకరన్ చెన్నై సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేశారు. తనను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంటూ 2016లో చేసిన తీర్మానానికి పార్టీ సభ్యుల హోదాలో పన్నీర్‌సెల్వం, ఎడపాడి పళనిస్వామి బద్దులై ఉండాలని, కన్వీనర్, కో– కన్వీనర్ పదవులను ఏర్పాటు చేయడం చట్ట విరుద్ధమని ప్రకటించాలని శశికళ తన పిటిషన్లో పేర్కొన్నారు. శశికళ వేసిన పిటిషన్‌ను నిరాకరించాల్సిందిగా పన్నీర్‌సెల్వం, ఎడపాడి కూడా పిటిషన్ వేశారు. ఈ వ్యవహారం కోర్టులో విచారణకు వచ్చినప్పుడు పార్టీ తరపు న్యాయవాదులు తమ వాదన వినిపిస్తూ, శశికళ, దినకరన్‌ను పార్టీ నుంచి బహిష్కరించడాన్ని సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు, ఎన్నికల కమిషన్ సమర్ధించిందని చెప్పారు. తాను పార్టీ ప్రధాన కార్యదర్శినని.. న్యాయస్థానంలో శశికల అబద్ధమాడారని వివరించారు. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం అనే పేరుతో సొంతగా పార్టీ స్థాపించినందున తాను వేసిన పిటిషన్‌ను వెనక్కితీసుకుంటున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దినకరన్ మరో పిటిషన్ ద్వారా కోర్టుకు విన్నవించారు. దీంతో ప్రధాన కార్యదర్శిగా ప్రకటించాలని కోరుతూ శశికళ దాఖలు చేసిన పిటిషన్‌పై మాత్రమే సోమవారం విచారణ సాగింది. శశికళ వేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని కోరుతూ పన్నీర్‌సెల్వం, ఎడపాడి పళనిస్వామి దాఖలు చేసిన పిటిషన్లను స్వీకరిస్తున్నట్లు, ప్రధాన కార్యదర్శి పదవి నుంచి శశికళను తొలగిస్తూ చేసిన తీర్మానం చెల్లుతుంది కాబట్టి ఆమె వేసిన పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు చెన్నై సిటీ సివిల్ కోర్టు న్యాయమూర్తి జె. శ్రీదేవి సోమవారం తీర్పు చెప్పారు. సివిల్ కోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్తాం.. సేలం: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తనను తొలగించడం సబబే అంటూ చెన్నై సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలు చేస్తామని చిన్నమ్మ సోమవారం స్పష్టం చేశారు. నామక్కల్ జిల్లా తిరుచెంగోడులోని ఆర్ధనారీశ్వర స్వామి ఆలయానికి శశికళ సోమవారం వచ్చి స్వామిని దర్శించుకున్నారు. స్వామి, అమ్మవారు, నవగ్రహాల సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలే తనకు ఆధారమన్నారు. ఎంజీఆర్ రూపొందించిన విధి విధానాల ఆధారంగా కార్యకర్తలే ప్రధాన కార్యదర్శిని నిర్ణయించగలరని స్పష్టం చేశారు. దేశంలోని మరే పార్టీలోనూ ఈ షరతు లేదని, అన్నాడీఎంకే విధి విధానాల్లో మాత్రమే ఉందని స్పష్టం చేశారు. దీనికి అనుగుణంగానే తాను పోరాడుతున్నట్లు చెప్పారు. -
VK Sasikala: శశికళకు ఎదురు దెబ్బ
అన్నాడీఎంకే బహిష్కృత నేత వీకే శశికళకు ఎదురు దెబ్బ తగిలింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఉండే హక్కును కోరుతూ వీకే శశికళ వేసిన పిటిషన్‌ను చెన్నై కోర్టు కొట్టివేసింది. అన్నాడీఎంకేలోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చి తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న వీకే శశికళకు ఎదురు దెబ్బ తగిలింది. 2017లో పార్టీ నుంచి తనను మహిష్కరిస్తూ అన్నాడీఎంకే పార్టీ సాధారణ మండలి తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆమె ఒక పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. పార్టీ కో-ఆర్డినేటర్ పన్నీర్‌సెల్వం, జాయింట్ కో-ఆర్డినేటర్ పళనిస్వామి, లీగల్ వింగ్ జాయింట్ సెక్రెటరీ ఏఎం బాబు మురుగవేల్ ఇంటర్లోక్యూటరీ(సంభాషణ) దరఖాస్తు దాఖలు చేయడంతో శశికళ పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది. 2017లో జరిగిన ఏఐఏడీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశం.. అప్పటి ప్రధాన కార్యదర్శి పదవి నుంచి శశికళను తొలగించడంతో పాటు పార్టీ నుంచి బహిష్కరించించింది. ఈ వేటుపై శశికళ గతంలో చెన్నై సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. పన్నీర్‌సెల్వం, పళనిస్వామి నేతృత్వంలోని అప్పటి విడివిడి వర్గాల విలీనం తర్వాత ఈ కౌన్సిల్ భేటీ జరిగి.. శశికళను పార్టీ నుంచి వెలేస్తున్నట్లు ప్రకటించారు. చదవండి: చిన్నమ్మకు ‘పన్నీరు’ క్లీన్ చిట్ -
చెయ్యి వేస్తే కత్తితో పొడుచుకుంటా.. హీరోయిన్ బెదిరింపులు
Court New Order On Meera Mithun Controversy Issue: ప్రముఖ నటి, బిగ్‌బాస్ ఫేం మీరా మీథున్‌ను మళ్లీ వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియాలో ఏది అనిపిస్తే అది మాట్లాడి వివాదాల పాలవుతుంది ఈ అమ్మడు. ఈ భామపై అప్పట్లో అరెస్ట్ వారెంట్ జారీ అయింది. పలు తమిళ చిత్రాల్లో నటించిన మీరాకు అవకాశాలు రాకుండా కొంతమంది అడ్డుకుంటున్నారని, అందులో షెడ్యూల్ క్యాస్ట్ వాళ్లు కూడా ఉన్నారని ఆమె ఆరోపించింది. వారిని వెంటనే ఇండస్ట్రీ నుంచి తప్పించాలంటూ వారిని, వారి కులాన్ని కించపరుస్తూ గతంలో కాంట్రవర్సీ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ వీడియో వైరల్ కాగా ఆ సామాజిక వర్గం నుంచి ఆందోళనలు మొదలయ్యాయి. ఆమె మీద పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సీ, ఎస్ట్రీ అట్రాసిటీ కేసుతోపాటు పలు కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మీరాను అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులకు చుక్కలు చూపించింది ఈ అమ్మడు. అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులతో 'ఇక్కడ ఆడవాళ్లకు రక్షణ లేదా? పోలీసులు టార్చర్ చేస్తున్నారు.. ప్రధాని మోదీ, తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించండి’ అంటూ అరుస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతేగాక ప్రతి ఒక్కరూ, పోలీసులు నన్ను టార్గెట్ చేస్తున్నారు. నన్ను టచ్ చేస్తే కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకుంటాను అంటూ బెదిరించింది. ముఖ్యమంత్రి, ప్రధాని మోదీ.. ఇది తమిళనాడు పోలీసులు చేస్తున్న హింస అంటూ చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది. ఇదంతా ఇలా ఉంటే చాలా రోజుల తర్వాత ఈ కేసుపై చెన్నై కోర్టు తీర్పు ఇచ్చింది. ఇప్పటివరకూ మీరా ఒక్క విచారణకు కూడా హాజరు కాకపోవడంతో ఆమెను అరెస్ట్ చేసి ఏప్రిల్ 4న కోర్టులో హాజరు పర్చాల్సిందిగా పోలీసులకు ఆదేశించింది. ఇప్పటిదాకా ఇంతలా రచ్చ చేసిన ఈ అమ్మడు ఈసారి ఏం చేస్తుందో చూడాలి. -
శరత్‌కుమార్, రాధిక దంపతులకు ఏడాది జైలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: చెక్‌బౌన్స్ కేసులో నటుడు శరత్‌కుమార్, నటి రాధిక దంపతులకు తలా ఏడాది జైలు శిక్ష విధిస్తూ చెన్నై ప్రత్యేక కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. వివరాలు ఇలా.. శరత్‌కుమార్, రాధిక భాగస్వాములుగా ఉన్న మేజిక్ ఫ్రేమ్స్ సంస్థ ‘ఇదు ఎన్న మాయం’ అనే చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్ర నిర్మాణం కోసం రాడియన్స్ అనే సంస్థ నుంచి 2014లో రూ.15 కోట్లు అప్పు తీసుకున్నారు. 2015 మార్చిలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అప్పు తీర్చని పక్షంలో టీవీ ప్రసార హక్కులు లేదా ఆ తరువాత నిర్మించే చిత్ర హక్కులను ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. అదనంగా రూ.కోటి అప్పుతీసుకుని చెన్నై టీనగర్‌లోని ఆస్తిని తాకట్టుపెట్టారు. ఆ డబ్బుతో ‘పాంబు సట్టై’ అనే మరో చిత్రాన్ని నిర్మించి ఒప్పందానికి కట్టుబడనందున తమకు రావాల్సిన రూ. 2.50 కోట్లు వడ్డీ సహా చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని, టీ నగర్ ఆస్తులు అమ్మకుండా నిషేధం విధించాలని రాడియన్స్ సంస్థ కోర్టులో పిటిషన్ వేసింది. డబ్బు చెల్లించాలని కోర్టు తీర్పు చెప్పడంతో శరత్‌కుమార్, రాధిక కలిసి 7 చెక్కులను రాడియన్స్ సంస్థకు అందజేశారు. శరత్‌కుమార్ దంపతుల బ్యాంకు ఖాతాలో డబ్బు లేకపోవడంతో వీటిలో ఒక చెక్కు బౌన్స్ అయింది. ఈ కారణంగా శరత్‌కుమార్ దంపతులపై, మరో భాగస్వామి స్టీఫెన్‌పై రాడియన్స్ సంస్థ చెన్నై సైదాపేట కోర్టులో క్రిమినల్ కేసు పెట్టారు. ఈ కేసును ఎమ్మెల్యేల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులో బుధవారం విచారణకు రాగా, శరత్‌కుమార్, రాధిక దంపతులకు, స్టీఫెన్‌కు తలా ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. అయితే అప్పీలు కోసం శరత్‌కుమార్, స్టీఫెన్‌లకు అవకాశం ఇస్తూ శిక్షను నిలిపివేసింది. కోర్టుకు హాజరుకానందున రాధికపై పిటీ వారెంట్ జారీచేసింది. -
వారెంట్ జారీ అయ్యిందని తెలిసి షాకయ్యా: దర్శకుడు శంకర్
సాక్షి, చెన్నై: చెన్నైలోని ఎగ్మోర్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో తనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యిందని తెలిసి షాక్‌కు గురయ్యానని దర్శకుడు శంకర్ పేర్కొన్నాడు. అయితే తన లాయర్ సాయి కుమరన్ కోర్టును సంప్రదించగా తనపై ఎలాంటి వారెంట్ లేదని తెలిందని ఆయన తెలిపాడు. ఆన్ లైన్ కోర్ట్ రిపోర్టింగ్‌లో లోపం కారణంగా ఇలా జరిగిందని తెలిసి ఊపిరి పీల్చుకున్నానన్నాడు. ఆన్లైన్లో జరిగిన పొరపాటును ఇప్పుడు సరి చేశారని శంకర్ తెలిపాడు. అయితే ఈ విషయంపై ఎలాంటి అవాస్తవలను ప్రసారం చేయవద్దని ఆయన మీడియాకు విజ్ఞప్తి చేశాడు. కాగా, ప్రముఖ రచయిత అరుర్ తమిళ్‌నందన్ రచించిన ‘జిగుబా’ కథను కాపీ కొట్టి ‘రోబో’ చిత్రాన్ని తెరకెక్కించాడని శంకర్‌పై చెన్నైలోని ఎగ్మోర్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో కేసు దాఖలైంది. ఇదే కేసుకు సంబంధించి శంకర్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యిందన్న వార్త ప్రచారంలో ఉన్న నేపథ్యంలో.. తాజాగా ఆయన ఓ ప్రెస్ నోట్‌ను విడుదల చేసి స్పష్టతనిచ్చారు. -
రేపే నామినేషన్; ఏడాది జైలు, జరిమానా!
చెన్నై : రాజద్రోహం కేసులో మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం(ఎండీఎంకే) చీఫ్ వైగోనకు చెన్నై కోర్టు ఏడాది పాటు జైలు శిక్ష విధించింది. అదే విధంగా 10 వేల రూపాయల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ప్రత్యేక న్యాయస్థానం జడ్జి జె. శాంతి ఈ మేరకు తీర్పు వెలువరించారు. కాగా శనివారం రాజ్యసభ సభ్యత్వానికై నామినేషన్ వేసేందుకు వైగో సిద్ధపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కోర్టు తీర్పు ఆయనను ఇరకాటంలో పడేసింది. అయితే ప్రజాప్రతినిధి చట్టం- 1951లో రాజద్రోహాన్ని నేరంగా పరిగణించే సెక్షన్లు లేవు కాబట్టి వైగో నామినేషన్ వేయవచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కాగా 2009లో ఓ పుస్తకావిష్కరణ సందర్భంగా వైగో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఈలంకు ఏమైంది’ అనే అంశంపై ఆయన మాట్లాడుతూ.. శ్రీలంకలో ఎల్టీటీఈ పోరాటం ఆపకపోయినట్లైతే భారత్ ఒక్కటిగా కలిసి ఉండబోదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో వైగోపై రాజద్రోహం కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో 2017లో అరెస్టైన ఆయన నెలరోజుల పాటు జైలులో ఉన్న తర్వాత బెయిలుపై విడుదలయ్యారు. ఇక 1978 నుంచి 1996 మధ్య కాలంలో వైగో రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. తమ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే లేకపోయినప్పటికీ.. దాదాపు 23 ఏళ్ల తర్వాత డీఎంకే మద్దతుతో పెద్దల సభకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. జూలై 18న తమిళనాడులో ఇందుకు సంబంధించిన ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం కోర్టు తీర్పు వెలువడటం గమనార్హం. -
చెన్నై కోర్టుకు హాజరైన నటి
సాక్షి, చెన్నై: నటి, మాజీ ప్రపంచసుందరి సుస్మితాసేన్ సోమవారం ఎగ్మూర్ కోర్టులో హాజరయ్యారు. కారు కొనుగోలు వ్యవహారంలో నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో ఆమె న్యాయస్థానం ముందుకు వచ్చారు. 2005లో విదేశాల నుంచి దిగుమతి అయిన ల్యాండ్ క్రూజ్ బ్రాండ్ కారును రూ. 55 లక్షలకు ఆమె కొనుగోలు చేశారు. అయితే ఈ కారు 2004లో తయారైనట్లు చెన్నై హార్బర్లో నమోదు చేయబడింది. అదీకాకుండా ఆ కారు టాక్స్‌కు సంబంధించి తప్పుడు లెక్కలు చూపినట్లు హార్బర్ కస్టమ్స్ అధికారులు గుర్తించారు. దీంతో ఆ కారును దిగుమతి చేసిన ముంబాయికి చెందిన హరన్, బండారి తమలాలపై కేసు నమోదు చేశారు. ఈ కేసుపై ఎగ్మూర్ న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది. అయితే ఆ కారుకు సంబంధించి సుస్మితాసేన్ రూ.20.31 లక్షలను పన్నును చెల్లించారు. ఈ విషయంలో ఆమెను కస్టమ్స్ అధికారులు సాక్షిగా పేర్కొనడంతో గతంలో ఒకసారి ఎగ్మూర్ కోర్టుకు హాజరై తాను చెల్లించిన పన్ను ఆధారాలను సమర్పించి వివరణ ఇచ్చారు. ఆ తరువాత ఈ కేసులో నిందితులను క్రాస్ ఎగ్జామ్ చేయడానికి మరోసారి కోర్టుకు హాజరవ్వాల్సిందిగా సుస్మితాసేన్‌కు పలుసార్లు ఉత్తర్వులు జారీ చేసినా ఆమె హాజరు కాకపోవడంతో అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. దీంతో సుస్మిత తాను కారుకు సంబంధించి పన్నును చెల్లించానని అందువల్ల తనపై అరెస్ట్ వారెంట్‌ను రద్దు చేయాలని కోరారు. అదేవిధంగా ఈ కేసు నుంచి తన పేరును తొలగించాలని చెన్నై హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు నటి సుస్మితాసేన్ నేరుగా కోర్టుకు హాజరు కావాల్సిందేనని ఆదేశించింది. దీంతో సోమవారం ఉదయం సుస్మితాసేన్ ఎగ్మూర్ కోర్టుకు హాజరయ్యారు. -
సెన్సార్ బోర్డుకు ఆ 'సినిమా' తిప్పలు!
చెన్నై: ఓ బాలిక(13) సెన్సార్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ)కు పరీక్ష పెట్టింది. కొన్ని నెలల కిందట ఇంటి నుంచి పారిపోయిన బాలికను పోలీసులు గతవారం గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. బాలిక పేరెంట్స్ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ రిట్ ప్రకారం కోర్టులో బాలికను పోలీసులు హాజరుపరిచారు. ఈ సందర్భంగా బాలిక చెప్పిన విషయాలు విని న్యాయమూర్తులు, పోలీసులు, బాలిక తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. తాను తమిళ చిత్రం కళవని మూవీ చూసి ప్రభావితురాలినయ్యానని కోర్టుకు బాలిక విన్నవించింది. ఆ మూవీ ఎఫెక్ట్ వల్లనే ప్రియుడితో కలిసి ఇంటి నుంచి పారిపోయినట్లు మైనర్ చెప్పింది. ప్రస్తుతం ఆ బాలిక గర్భవతి. అయితే ఆ మూవీకి సీబీఎఫ్సీ కేవలం యూ సర్టిఫికేట్ ఇవ్వడాన్ని చెన్నై కోర్టు తప్పుపట్టింది. 2010లో సీబీఎఫ్సీ కళవని మూవీకి యూ సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ మూవీకి సంబంధించి సీబీఎఫ్సీ అధికారికి చెన్నై కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ సినిమాకు ఏ విధంగా క్లియరెన్స్ ఇచ్చారు, యూ సర్టిఫికేట్ ఎలా డిసైడ్ చేశారు.. ఇలాంటి సబ్జెక్ట్‌ను ఎందుకు ఎంకరేజ్ చేశారని కోర్టు ప్రశ్నించింది. నిర్మాత సహా మూవీకి పనిచేసిన కీలక వ్యక్తుల నుంచి వివరణ తీసుకుని అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. వచ్చే సోమవారం వరకు గడువిచ్చింది. -
కోర్టుకు హాజరైన కరుణానిధి
-
కోర్టుకు హాజరైన కరుణానిధి
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ కరుణానిధి (92) సోమవారం చెన్నై కోర్టుకు హాజరయ్యారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఆయన కోర్టుకు వచ్చారు. కరుణానిధి వెంట ఆయన కూతురు కనిమొళి, చిన్న కొడుకు స్టాలిన్ ఉన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం కోర్టు ఈ కేసు విచారణను మార్చి 10 వ తేదీకి వాయిదా వేసింది. డీఎంకే మేగజైన్లో ప్రచురించిన ఓ వ్యాసంలో తన పరువుకు భంగం కలిగేలా రాశారని ఆరోపిస్తూ గతేడాది జయలలిత పరువు నష్టం దావా వేశారు. కాగా జయ ఆరోపణలను కరుణానిధి ఖండించారు. -
ఓ రాజా లొంగుబాటు
చెన్నై : మాజీ ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రజా పనుల శాఖ మంత్రి ఓ పన్నీరు సెల్వం సోదరుడు ఓ రాజ కోర్టు లో లొంగి పోయారు. పూజారి ఆత్మహత్య కేసు విచారణానంతరం ఆయనకు బెయిల్ మంజూరైంది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత జైలు శిక్ష నేపథ్యంలో రాష్ట్రం ఓ పన్నీరు సెల్వం సీఎం పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో పన్నీరు సోదరుడు రాజ ఆగడాలకు హద్దేలేదన్న ఆ రోపణలు బయలు దేరాయి. అలాగే పెరియకుళం సమీపంలోని ఓ గ్రామం లో పూజారిగా ఉన్న నాగముత్తు ఆత్మహత్య చేసుకోవడం వివాదానికి దారి తీసింది. పన్నీరు బ్రదర్ రాజ అండ్ బృందం ఒత్తిళ్లు తాళలేక నాగముత్తు ఆత్మహత్య చేసుకున్నట్టుగా విచారణలో తేలింది. వ్యవహారం మదురై హైకోర్టుకు వెళ్లి అక్కడి నుంచి తేని జిల్లా మెజిస్ట్రేట్ కోర్టుకు చేరింది. విచారణ బృందం రాజ, అక్కడి అన్నాడీఎంకే నాయకులు పాండి, మన్మారన్, శివకుమార్, జ్ఞాన లోగు, శరవణన్ తదితర ఏడు మందిపై కోర్టులో చార్జ్ షీట్ దాఖలైంది. విచారణకు రావాలంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లకు నోటీసులు జారీ అయినా, ఖాతరు చేయలేదు. ఇక వారెంట్ల జారీ కాబోతుందన్న సమాచారంతో అన్నాడీఎంకే నేత పాండి మేల్కొన్నారు. రెండు రోజుల క్రితం కోర్టులో లొంగిపోయి, అనంతరం బెయిల్ తీసుకుని బయటకు వచ్చేశారు. రాజా లొంగుబాటు : పాండికి బెయిల్ లభించడంతో తనకూ వస్తుందన్న ఆశతో కోర్టులో లొంగి పోయేందుకు ఓ రాజ నిర్ణయించారు. అయితే, నాగముత్తు కేసులో ప్రధాని నిందితుడిగా ఆయన పేరు చేర్చి ఉండడంతో బెయిల్ లభించేనా అన్న ఉత్కంఠ నెలకొంది. దీంతో చడీ చప్పుడు కాకుండా కోర్టులో లొంగి పోయేందుకు ఏర్పాటు చేసుకున్నారు. ఈ వ్యవహారం మీడియా కంటపడకుండా అన్నాడీఎంకే వర్గాలు జాగ్రత్తలు పడ్డారు. బుధవారం రాజ కోర్టులో లొంగిపోయే సమయంలో పెరియకుళంలో పార్టీ నేతృత్వంలో భారీ కార్యక్రమానికి ఏర్పాటు చేశారు. దీంతో మీడియ వర్గాలంతా పెరియకుళంకు చేరుకున్నాయి. ఇదే అదనుగా భావిం చిన రాజ కోర్టు వెనుక ద్వారం గుండా లోనికి వెళ్లారు. న్యాయమూర్తి శివజ్ఞానం ఎదుట హాజరై ఈ కేసులో తాను లొంగి పోతున్నట్టు పేర్కొన్నారు. దీంతో ఆయన్ను పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. నాగముత్తు ఆత్మహత్య వ్యవహారం విచారణ కాసేపు సాగినానంతరం తనకు బెయిల్ మం జూరు చేయాలని కోర్టుకు రాజ విన్నవించారు. బెయిల్ మంజూరులో జాప్యం నెలకొనడంతో ఉత్కంఠ నెల కొంది. ఎట్టకేలకు మధ్యాహ్నం భోజన విరామానంతరం రాజకు బెయిల్ లభించడంతో పన్నీరు సెల్వం మద్దతు శిబిరంలో ఆనందం వికసించింది. -
అరుణ్ గుప్పిట్లో విశాఖ నేవల్ బేస్ సమాచారం
* చెన్నై కోర్టులో సెల్వరాజన్ హాజరు.. 14 రోజుల రిమాండ్ సాక్షి, హైదరాబాద్: ఐఎస్ఐ ఏజెంట్‌గా అనుమానిస్తున్న శ్రీలంక జాతీయుడు అరుణ్ సెల్వరాజన్ వద్ద విశాఖపట్నం నావికాదళ కేంద్రానికి చెందిన కీలక ఫొటోలు, సమాచారం లభ్యమైనట్టు తెలిసింది. అరుణ్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) హైదరాబాద్ యూనిట్ అధికారులు బుధవారం అరెస్టు చేయడం తెలిసిందే. అతని వద్ద నుంచి ఎన్ఐఏ అధికారులు విశాఖ నేవల్‌బేస్‌కు చెందిన ఫొటోలు, సమాచారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కాగా అరుణ్ నివాసం, కార్యాలయం నుంచి అనేక వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఐఏ గురువారం ప్రకటించింది. కాగా అరుణ్‌ను ఎన్ఐఏ గురువారం చెన్నైలోని ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. -
నవంబర్ 22న కోర్టుకు హాజరుకండి
తమిళసినిమా, న్యూస్‌లైన్ : నటి అంజలి నవంబర్ 22న కోర్టుకు తప్పని సరిగా హాజరు కావాలని సైదాపేట కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నటి అంజలి తమిళంలో అంగాడి తెరు చిత్రంతో హీరోయిన్గా గుర్తింపు పొందింది. ఈమె ఆ మధ్య దర్శకుడు కలైంజయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన చెన్నై సైదాపేట కోర్టులో పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు పలుమార్లు విచారణకు వచ్చినా అంజలి కోర్టుకు హాజరు కాలేదు. ఈ కేసు మంగళవారం ఉదయం మరోసారి విచారణకు వచ్చింది. దర్శకుడు కలైంజయం హాజరై వివరణ ఇచ్చారు. నటి అంజలి ఈ సారి కూడా కోర్టుకు రాలేదు. ఆమె తరపు న్యాయవాది మహా నాథన్ హాజరై నటి అంజలి అనారోగ్యం కారణంగా కోర్టుకు రాలేదని, అందుకు సంబంధించిన డాక్టర్ సర్టిఫికెట్‌ను కోర్టులో సమర్పించా రు. న్యాయమూర్తి రాజ్యలక్ష్మి అంజలి న్యాయవాది వివరణతో సంతృప్తి చెందలేదు. ఈ కేసు విచారణను నవంబర్ 22కు వాయిదా వేస్తూ ఆ రోజున నటి అంజలి తప్పకుండా కోర్టుకు హాజరు కావాలని ఉత్తర్వులు జారీ చేశారు.