నగ్నంగా నటించిన ఆండ్రియా.. హిట్ సినిమా సీక్వెల్‌ విడుదలకు చిక్కులు | Madras Court Warn To Pisasu 2 movie Makers | Sakshi
Sakshi News home page

నగ్నంగా నటించిన ఆండ్రియా.. హిట్ సినిమా సీక్వెల్‌ విడుదలకు చిక్కులు

Published Sun, Nov 3 2024 1:17 PM | Last Updated on Sun, Nov 3 2024 1:41 PM

Madras Court Warn To Pisasu 2 movie Makers

కోలీవుడ్‌ సంచలన దర్శకుడు మిష్కిన్‌ దర్శకత్వం వహించిన తాజా చిత్రం పిశాచి–2. 2014లో ఈయన దర్శకత్వంలో రూపొంది మంచి విజయాన్ని సాధించిన పిశాచి చిత్రానికి ఇది సీక్వెల్‌గా విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే, పలు అడ్డంకులు రావడంతో ఈ ప్రాజెక్ట్‌కు బ్రేకులు పడ్డాయి.

రాక్‌ఫోర్ట్‌ పతాకంపై మురుగానందం నిర్మించిన పిశాచి–2 చిత్రంలో నటి ఆండ్రియా ప్రధాన పాత్రలో నటించింది. నటుడు విజయ్‌ సేతుపతి గౌరవ పాత్రలో నటించారు. అయితే, ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు అనుమతి ఇవ్వద్దొంటూ ఫ్లయింగ్ హార్స్ పిక్చర్స్ కంపెనీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. తమ సంస్థ నుంచి ఒక సినిమా హక్కులను పొందిన రాక్‌ఫోర్ట్‌ ఇరువురి ఒప్పందం ప్రకారం రూ. 4.85 కోట్లు తమకు చెల్లించాల్సి ఉందని పేర్కొంది. ఈ అంశంపై విచారణ జరిపిన కోర్టు ఫ్లయింగ్ హార్స్ పిక్చర్స్ వారికి రాక్‌ఫోర్డ్‌ సంస్థ అధినేతలు డబ్బు చెల్లించిన తర్వాతే పిశాచి-2 చిత్రాన్ని విడుదల చేసుకోవచ్చని కోర్టు తెలిపింది.

ఆ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం. వడ్డీతో సహా ఫ్లయింగ్ హార్స్ పిక్చర్స్ వారికి రూ. 1.85 కోట్లు చెల్లించాలని కోర్టు తెలిపింది. అంత వరకు పిశాచి 2 విడుదలను నిషేధించాలని తెలిపింది. ఈ కేసు న్యాయమూర్తి జికె ఎలండ్రైయన్ ఎదుట విచారణకు వచ్చింది.  నవంబర్ 18వరకు ఈ కేసును కోర్టు వాయిదా వేసింది. ఈ తేదీలోగా ప్రతిస్పందించాలని రాక్‌పోర్ట్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను కోర్టు ఆదేశించబడింది.

ఈ చిత్రంలో నగ్నంగా నటించిన ఆండ్రియా
ఈ చిత్రంలో నటి ఆండ్రియా  పూర్తి నగ్నంగా నటించిందని తెలుస్తోంది. అందుకు ఆమె భారీ పారితోషికాన్ని డిమాండ్‌ చేసిందనే ప్రచారం కూడా వైరల్‌ అవుతుంది. దీనిపై దర్శకుడు మిష్కిన్‌ స్పందిస్తూ చిత్రం కోసం నటి ఆండ్రియాను నగ్నంగా చిత్రీకరించిన విషయం నిజమేనన్నారు. అందుకు ఆమె అధిక పారితోషికం డిమాండ్‌ చేయడం కూడా సహజమేనని పేర్కొన్నారు. 

అయితే, ఆమె నగ్నంగా నటించిన సన్నివేశాలను చిత్రీకరించలేదని, ఫొటోలు మాత్రమే తీసినట్లు పేర్కొన్నారు. అవి కూడా ఆమె సన్నిహితురాలు అయిన ఫొటోగ్రాఫర్‌తోనే తీయించామని, ఆ సమయంలో మిస్కిన్‌ అక్కడ లేనని పంచుకున్నారు. అయితే చిత్రాన్ని పిల్లలు కూడా చూడాలన్న ఉద్దేశంతో నగ్న ఫొటోలను చిత్రంలో పొందుపరచలేదని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement