Mysskin
-
నగ్నంగా నటించిన ఆండ్రియా.. హిట్ సినిమా సీక్వెల్ విడుదలకు చిక్కులు
కోలీవుడ్ సంచలన దర్శకుడు మిష్కిన్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం పిశాచి–2. 2014లో ఈయన దర్శకత్వంలో రూపొంది మంచి విజయాన్ని సాధించిన పిశాచి చిత్రానికి ఇది సీక్వెల్‌గా విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే, పలు అడ్డంకులు రావడంతో ఈ ప్రాజెక్ట్‌కు బ్రేకులు పడ్డాయి.రాక్‌ఫోర్ట్ పతాకంపై మురుగానందం నిర్మించిన పిశాచి–2 చిత్రంలో నటి ఆండ్రియా ప్రధాన పాత్రలో నటించింది. నటుడు విజయ్ సేతుపతి గౌరవ పాత్రలో నటించారు. అయితే, ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు అనుమతి ఇవ్వద్దొంటూ ఫ్లయింగ్ హార్స్ పిక్చర్స్ కంపెనీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమ సంస్థ నుంచి ఒక సినిమా హక్కులను పొందిన రాక్‌ఫోర్ట్ ఇరువురి ఒప్పందం ప్రకారం రూ. 4.85 కోట్లు తమకు చెల్లించాల్సి ఉందని పేర్కొంది. ఈ అంశంపై విచారణ జరిపిన కోర్టు ఫ్లయింగ్ హార్స్ పిక్చర్స్ వారికి రాక్‌ఫోర్డ్ సంస్థ అధినేతలు డబ్బు చెల్లించిన తర్వాతే పిశాచి-2 చిత్రాన్ని విడుదల చేసుకోవచ్చని కోర్టు తెలిపింది.ఆ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం. వడ్డీతో సహా ఫ్లయింగ్ హార్స్ పిక్చర్స్ వారికి రూ. 1.85 కోట్లు చెల్లించాలని కోర్టు తెలిపింది. అంత వరకు పిశాచి 2 విడుదలను నిషేధించాలని తెలిపింది. ఈ కేసు న్యాయమూర్తి జికె ఎలండ్రైయన్ ఎదుట విచారణకు వచ్చింది. నవంబర్ 18వరకు ఈ కేసును కోర్టు వాయిదా వేసింది. ఈ తేదీలోగా ప్రతిస్పందించాలని రాక్పోర్ట్ ఎంటర్టైన్మెంట్ను కోర్టు ఆదేశించబడింది.ఈ చిత్రంలో నగ్నంగా నటించిన ఆండ్రియాఈ చిత్రంలో నటి ఆండ్రియా పూర్తి నగ్నంగా నటించిందని తెలుస్తోంది. అందుకు ఆమె భారీ పారితోషికాన్ని డిమాండ్ చేసిందనే ప్రచారం కూడా వైరల్ అవుతుంది. దీనిపై దర్శకుడు మిష్కిన్ స్పందిస్తూ చిత్రం కోసం నటి ఆండ్రియాను నగ్నంగా చిత్రీకరించిన విషయం నిజమేనన్నారు. అందుకు ఆమె అధిక పారితోషికం డిమాండ్ చేయడం కూడా సహజమేనని పేర్కొన్నారు. అయితే, ఆమె నగ్నంగా నటించిన సన్నివేశాలను చిత్రీకరించలేదని, ఫొటోలు మాత్రమే తీసినట్లు పేర్కొన్నారు. అవి కూడా ఆమె సన్నిహితురాలు అయిన ఫొటోగ్రాఫర్‌తోనే తీయించామని, ఆ సమయంలో మిస్కిన్ అక్కడ లేనని పంచుకున్నారు. అయితే చిత్రాన్ని పిల్లలు కూడా చూడాలన్న ఉద్దేశంతో నగ్న ఫొటోలను చిత్రంలో పొందుపరచలేదని తెలిపారు. -
విజయ్ సేతుపతి కొత్త మూవీ.. ఆయనే మ్యూజిక్ డైరెక్టర్
విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రాల్లో ట్రైన్ ఒకటి. డింపుల్ హయాతి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో జయరాం, కేఎస్ రవికుమార్, నాజర్, వినయ్‌రాయ్, భావన, సంపత్ రాజ్, బబ్లూ పృథ్వీరాజ్, యుగీ సేతు, గణేష్ వెంకట్రామన్, శ్రీరంజని తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. బి.క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్.థాను నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిస్కిన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనే దీనికి సంగీతం అందించడం విశేషం. ఇంతకు ముందు మిస్కిన్ 'డెవిల్' అనే చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయమైన విషయం తెలిసిందే. ఈయన తాజాగా దర్శకత్వం వహించిన పిశాచి చిత్రంలో నటుడు విజయ్‌సేతుపతి గెస్ట్‌రోల్ చేశారు. ఆ చిత్రం ఇంకా విడుదల కాలేదు. కాగా ఇప్పుడు ట్రైన్ చిత్రంలో విజయ్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కూడా మిస్కిన్ సంగీతం అందిస్తున్నారు. ట్రైన్ మూవీ కోసం భారీ రైలు సెట్ వేసి అధిక భాగం షూటింగ్‌ను అందులోనే చిత్రీకరించినట్లు యూనిట్ వర్గాలు తెలిపాయి. కాగా ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి నటన సరికొత్తగా ఉంటుందని దర్శకుడు మిస్కిన్ పేర్కొన్నారు. త్వరలోనే ఈ చిత్రం విడుదలకు సంబంధించి విడుదల తేదీ తదితర వివరాలను వెల్లడించనున్నట్లు యూని ట్ వర్గాలు పేర్కొన్నాయి. చదవండి: తల్లి మరణంతో ఒంటరి జీవితం.. ఆ కారణంతో పెళ్లికి కూడా దూరం -
నా 25 ఏళ్ల కల.. కొత్త ప్రయాణం మొదలైంది: విశాల్
తెలుగు కుటుంబానికి చెందిన స్టార్ హీరో విశాల్ కోలీవుడ్‌లో బాగా పాపులారిటీని సొంతం చేసుకున్నారు. ఆయనకు సౌత్ ఇండియాలో అన్నీ భాషల్లో అభిమానులు ఉన్నారు. 2017లో మిస్కిన్ దర్శకత్వంలో విశాల్ నటించిన ‘డిటెక్టివ్’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ఆ చిత్రానికి సీక్వెల్‌ను ప్లాన్ చేశారు విశాల్. డిటెక్టివ్2 పేరుతో త్వరలో సెట్స్‌పైకి ఈ చిత్రం వెళ్లనుంది. ఈ సినిమాకు ఆయన హీరో మాత్రమే కాదు దర్శకుడు కూడా.. తన సినీ కెరియర్లో తొలిసారి డిటెక్టివ్2 చిత్రానికి దర్శత్వం వహించనున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన ఒక పోస్ట్ చేశారు. ఇండస్ట్రీలో 25 ఏళ్ల నా కల, ప్రయాణం మొదలైంది. నా కల, నా ఆకాంక్ష, నేను జీవితంలో ఎలా ఉండాలనుకుంటున్నాను అనే నా మొదటి ఆలోచన నిజమైంది. అవును, నా కెరీర్లో అత్యంత సవాలుతో కూడిన కొత్త బాధ్యతను నేను తీసుకున్నాను., ఒక దర్శకుడిగా కొత్త ప్రయాణం మొదలైంది. తుప్పరివాలన్2..డిటెక్టివ్2 కోసం లండన్ బయలుదేరాం. అజర్బైజాన్, మాల్లాల్లో షూటింగ్ చేయబోతున్నాం. ఈ ప్రయాణం గురించి వర్ణించడానికి మాటలు రావడం లేదు. మనం పడిన కష్టం ఎప్పుడూ వృథా కాదు అంటూ నా తండ్రి జీకే రెడ్డి, యాక్షన్ కింగ్ అర్జున్ సార్ చెప్పిన మాటలు ఎప్పుడూ మర్చిపోను. నటుడిగా నాకు ఈ గుర్తింపు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు దర్శకుడిగా రానున్నాను. మీ అందరి మద్దతు కొనసాగుతుందని ఆశిస్తున్నాను. నా కల ఇంత త్వరగా సాకారం కావడానికి కారణమైన మిస్కిన్ సర్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు. నిజ జీవితమైనా.. రీల్ జీవితమైనా నేను ఎవరి బిడ్డను అనాథగా విడిచిపెట్టను. గమ్యం చేరేలా చేస్తాను సార్.' అని విశాల్ తెలిపారు. డిటెక్టివ్2 ప్రాజెక్ట్‌ను కూడా మిస్కిన్ దర్శకత్వంలోనే విశాల్ చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన ప్రాజెక్ట్ నుంచి తప్పుకొన్నారు. దీంతో ఈ మూవీకి విశాల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పలు విషయాలు త్వరలో వెళ్లడి కానున్నాయి. And my journey begins finally after 25 years. My dream, my aspiration, my first thought of wat I wanna be in life has come true. Yes, I take charge of a new responsibility, the most challenging in my career,that of a debutante director. Here we go finally. Off to London,… pic.twitter.com/aiLVQZ3Bbx — Vishal (@VishalKOfficial) March 16, 2024 -
పూర్ణతో సంబంధం అంటగడుతున్నారు.. దర్శకుడి ఆవేదన
ప్రముఖ డైరెక్టర్ మిష్కిన్ సోదరుడు, 'సవరకట్టి' చిత్రం ఫేమ్ ఆదిత్య దర్శకత్వం వహించిన తాజా తమిళ చిత్రం డెవిల్. విదార్థ్, పూర్ణ, అరుణ్, మిష్కిన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి దర్శకుడు మిష్కిన్ సంగీతాన్ని అందించడం విశేషం. హెచ్ పిక్చర్స్ హరి, టచ్ స్క్రీన్ జ్ఞానశేఖర్ కలిసి నిర్మించారు. ఇప్పటి వరకు దర్శకుడిగా, నటుడిగా గుర్తింపు పొందిన ఈయన ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా అవతారం ఎత్తారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న డెవిల్ ఫిబ్రవరి 2న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. డెవిల్ సినిమా కాదు.. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ గురువారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. దర్శకుడు ఆదిత్య మాట్లాడుతూ తనకు సినిమా అంటే చాలా మక్కువ అని అయితే అందులో ఉండాల్సిన నిజాయితీని గురువు మిష్కిన్ నుంచి నేర్చుకున్నానని చెప్పారు. పూర్ణ మాట్లాడుతూ డెవిల్ తనకు కేవలం సినిమా మాత్రమే కాదని, తన జీవితానికి రిలేట్ అయిన ఒక ఎమోషన్ అని పేర్కొన్నారు. నా తమ్ముడని సపోర్ట్ చేయడంలేదు సంగీత దర్శకుడు మిష్కిన్ మాట్లాడుతూ ఈ మూవీ డైరెక్టర్ తన తమ్ముడు కావడంతో తాను అతనికి సపోర్ట్ చేస్తున్నానని కొందరు చెప్పుకోవడం బాధగా అనిపించిందన్నారు. చిత్రంలో పూర్ణ అద్భుతంగా నటించారన్నారు. తమ మధ్య ఏదో ఉందని పుకారు పుట్టిస్తున్నారని, నిజానికి ఆమె తనకు తల్లిలాంటి వారని, వచ్చే జన్మలో పూర్ణ కడుపున పుట్టాలని కోరుకుంటున్నానని మిష్కిన్ పేర్కొన్నారు. ఆయన మాటలు విని భావోద్వేగానికి లోనైన పూర్ణ స్టేజీపైనే ఏడ్చేసింది. View this post on Instagram A post shared by CinemaSpeak (@instacinemaspeak) చదవండి: విడాకులపై నిహారిక కామెంట్లు.. ఘాటుగా రియాక్ట్ అయిన మాజీ భర్త చైతన్య -
డింపుల్ హయత్‌కు గోల్డెన్ ఛాన్స్.. స్టార్ హీరోతో సినిమా
కోలీవుడ్‌లో చిన్న చిన్న పాత్రలతో కెరీర్‌ను ప్రారంభించిన నటుడు విజయ్‌సేతుపతి. ఆ తరువాత కథానాయకుడు స్థాయికి ఎదిగారు. అలా సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తున్న ఈయన ఆ తరువాత ప్రతినాయకుడిగానూ సత్తా చాటుతూ వచ్చారు. ఇటీవల హిందీ చిత్రం జవాన్‌లో షారూఖ్‌ఖాన్‌తో ఢీకొని సక్సెస్ అయ్యారు. మళ్లీ వరుసగా కథానాయకుడు పాత్రలో నటిస్తున్న విజయ్‌సేతుపతి ఇకపై విలన్‌గా నటించనని స్టేట్మెంట్ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. అలా ఈయన తాజాగా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రానికి 'ట్రైన్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మిష్కిన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వీ క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్.థాను నిర్మిస్తున్నారు. ఈ చిత్ర పూజాకార్యక్రమాలు చెన్నైలో ప్రారంభమయ్యాయి. ఇది స్వతంత్య్ర నేపథ్యంలో సాగే ట్రైన్ ట్రావెలింగ్ కథా చిత్రం కావడంతో దీనికి ట్రైన్ అనే టైటిల్ నిర్ణయించినట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో విజయ్‌సేతుపతి సరికొత్త గెటప్‌లో కనిపిస్తున్నారు. ఇందుకోసం ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు చెప్పారు. ఇందులో డింపుల్ హయత్ చాలా ముఖ్యపాత్రను పోషిస్తున్నట్లు తెలిపారు. వీరితో పాటు ఈరా దయానంద్, నాజర్, భావన, బట్లు పృథీరాజా, కేఎస్ రవికుమార్, రూడీసేతు, గణేష్ వెంకట్రామన్, కనిహా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దర్శకుడు మిష్కిన్‌నే సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి పాసియా పాతిమా ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ చిత్ర పూజా కార్యక్రమానికి దర్శకుడు వెట్రిమారన్, నాజర్, నిర్మాత మురళిరామస్వామి, రాధాకృష్ణన్, ఎస్.కదిరేశన్, అన్బుచెలియన్ హాజరై యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. -
పిశాచి డైరెక్టర్‌తో విజయ్ సేతుపతి సినిమా.. కాన్సెప్ట్ ఏంటంటే?
వైవిధ్య భరిత కథా చిత్రాల నటుడిగా పేరు గాంచిన నటుడు విజయ్ సేతుపతి. విభిన్న కథా చిత్రాల దర్శకుడు మిష్కిన్. వీరిద్దరి కాంబినేషన్లో చిత్రం అంటే ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవచ్చు. విజయ్ సేతుపతి గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. జవాన్ చిత్రంతో పాన్ ఇండియా నటుడిగా గుర్తింపు పొందారు. ఇక చిత్తిరం పేసుదడి, అంజాదే, పిశాచి వంటి చిత్రాలతో తానేమిటో నిరూపించుకున్న దర్శకుడు మిష్కిన్. కాగా ఈ రేర్ కాంబినేషన్లో ఒక చిత్రం రూపొందనుందని సమాచారం. ఇది ట్రైన్ ట్రావెలింగ్ కథా చిత్రంగా ఉంటుందని తెలుస్తోంది. రైలులో జరిగే కథ కావడంతో దీనికి ట్రైన్ అనే టైటిల్‌ను పెట్టే ఆలోచనలో దర్శకుడు ఉన్నట్లు సమాచారం. జయరాం ప్రతినాయకుడి పాత్రను పోషించనున్నారని.. దర్శకుడు మిష్కిన్ సంగీతాన్ని అందించనున్నట్లు సమాచారం. ఈయన ఇటీవలే డెవిల్ అనే చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా మారారు. ఇదే విధంగా మిష్కిన్ తాజాగా దర్శకత్వం వహించిన పిశాచి 2 చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న నటుడు విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటించిన 50వ చిత్రం మహారాజా కూడా రిలీజ్‌కు సిద్ధమవుతోంది. నిదిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన ఈ చిత్ర విజయంపై యూనిట్ వర్గాలు చాలా నమ్మకంతో ఉన్నాయి. చదవండి: ఇంట్రెస్టింగ్గా వీకెండ్ ఎపిసోడ్.. హాట్ బ్యూటీ అశ్విని ఎలిమినేట్ -
సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న రజనీకాంత్!
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ త్వరలో సినిమాలకు గుడ్‌బై చెప్పనున్నారంటూ ఓ వార్త ఫిల్మీ దునియాలో వైరల్‌గా మారింది. 170కు పైగా సినిమాలు చేసిన ఆయన త్వరలో రిటైర్మెంట్ తీసుకోనున్నారంటూ కథనాలు వెలువడుతున్నాయి. నిప్పు లేనిదే పొగ రాదు అన్న చందంగా డైరెక్టర్ మిస్కిన్ చేసిన వ్యాఖ్యల వల్లే ఈ ప్రచారం మొదలైంది. ఓ ఇంటర్వ్యూలో మిస్కిన్ మాట్లాడుతూ.. 'రజనీకాంత్ లియో డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్‌తో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. వీరి కాంబినేషన్లో సినిమా ఫిక్స్ అయితే బహుశా ఇదే ఆయన ఆఖరి చిత్రం కావచ్చు' అన్నాడు. ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఇది చూసిన రజనీ ఫ్యాన్స్ 'మా తలైవా అప్పుడే సినిమాలకు బ్రేక్ తీసుకుంటాడా?', 'మీరు అబద్ధం చెప్తున్నారు, రజనీ అలాంటి నిర్ణయం తీసుకోడు' అంటూ గగ్గోలు పెడుతున్నారు. మరి దీనిపై తలైవా ఏమని స్పందిస్తారో చూడాలి! ఇకపోతే రజనీకాంత్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ సినిమా చేస్తున్నాడు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఆఖరి దశలో ఉంది. ఈ చిత్రం ఆగస్టు 10న విడుదల కానుంది. మరోపక్క రజనీ తన కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్న లాల్ సలాం చిత్రంలో అతిథి పాత్ర పోసిస్తున్నాడు. ఆ తరువాత జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ డైరెక్షన్లో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో నటించేందుకు కమిటయ్యాడు. చదవండి: పుష్ప శ్రీవల్లితో ఐశ్వర్య పంచాయితీ.. స్పందించిన రష్మిక మందన్నా -
సందేశాత్మక చిత్రాలను మనమే ఆదరించడం లేదు: డైరెక్టర్ ఆవేదన
తమిళ సినిమా: సపర్బ్ క్రియేషన్స్ పతాకంపై నవ నిర్మాత రాజగోపాల్ ఇళంగోవన్ నిర్మించిన చిత్రం వెల్లిమలై. ఓం విజయ్ కథ బాధ్యతలను నిర్వహించారు. సీనియర్ నటుడు సపర్ గుడ్ ఫిలిమ్స్ సుబ్రమణి ప్రధాన పాత్రలో నటించారు. నటి మంజు నాయకి. రఘునందన్ సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. అందరికీ అర్థమయ్యేలా సరళమైన భాషలో ఒక ముఖ్యమైన అంశాన్ని తెరపై ఆవిష్కరించిన చిత్రం వెల్లిమలై. కాగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం చెన్నైలోని కమలా థియేటర్లో నిర్వహించారు. ఈ వేడుకలో నామ్ తమిళం పార్టీ నేత సీమాన్, దర్శకుడు కేఎస్ రవికుమార్ మిష్కిన్, పేరరసు, దిండుక్కల్ లియోన్ పలువురు సినీ ప్రముఖులు పాల్గొని ఆడియోను ఆవిష్కరించారు. ఈ చిత్రం కోసం దిండుక్కల్ లియోన్ ఒక పాట పాడటం విశేషం. ఈ సందర్భంగా దర్శకుడు మిష్కన్ మాట్లాడుతూ.. మంచి సందేశంతో కూడిన చిత్రాలను కూడా మనం ఆదరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటీటీలు వచ్చాక థియేటర్లో సినిమాలకు ఆదరణ కరువైందని, ఓటీటీలో సినిమా చూడటమంటే రౌడీయిజంతో సమానమంటూ ఆసక్తిక వ్యాఖ్యాలు చేశారు. ఇంతకుముందు మణికంఠన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి నిర్మించి ముఖ్య పాత్ర పోషించిన చిత్రం కడైసీ వ్యవసాయి అన్నారు. ఆ చిత్రానికి అంతర్జాతీయ పురస్కారం లభించింది. కానీ మనం మాత్రం ఈ సినిమాను ఆదరించలేదన్నారు. రూ. 300, 400 కోట్లు బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రాల మధ్య కడైసీ వ్యవసాయి చిత్రానికి రూ. 30 కోట్లు కూడా రాకపోవడం విచారకరమన్నారు. మంచి సందేశంతో వస్తున్న ఇలాంటి చిత్రాలు విజయం సాధించాలని మిష్కిన్ పేర్కొన్నారు. -
‘ఇళయరాజా నాకు తల్లి,తండ్రి’
తన చిత్రాలు కత్తిపై నడకలానే ఉంటాయి అని దర్శకుడు మిష్కిన్ పేర్కొన్నారు. నిజం చెప్పాలంటే ఇతర దర్శకులు చిత్రాలకు భిన్నంగానే ఈయన చిత్రాలు ఉంటాయి. అంతేకాదు మిష్కన్ మాటలు, చేతలు అలానే ఉంటాయి. తొలి నుంచి తనదైన శైలితోనే చిత్రాలు తెరకెకిక్కస్తున్న ఈయన ఆ మధ్య పిశాచు, తుప్పరివాలన్ వంటి చిత్రాలు సక్సెస్ అయ్యాయి. తాజాగా ఉదయనిధి స్టాలిన్ కథానాయకుడిగా నటి నిత్యామీనన్, అదితిరావ్ నాయికలుగా తెరకెక్కించిన చిత్రం సైకో. ఈ చిత్రం ప్రారంభం నుంచి విడుదలకు ముందు, ఆ తరువాత కూడా సంచలనంగా మారింది. సైకో చిత్రం గత నెల 24న తెరపైకి వచ్చింది. అయితే చిత్రానికి మాత్రం మిశ్రమ స్పందననే వస్తోంది. ఉదయనిది స్టాలిన్‌తో మిష్కిన్ కానీ టాక్‌కు సంబంధం లేకుండా థియేటర్లలో రెండో వారంలోకి చేరుకుంది. సాధారణంగా ఒక వారం పూర్తిగా చిత్రం థియేటర్లలో ఉంటేనే సక్సెస్ అనుకుంటున్న రోజులివి. కాబట్టి సైకో చిత్ర యూనిట్ సక్సెస్ సంతోషంలో ఉన్నారు. ఈ ఆనందాన్ని శుక్రవారం మీడియాతో పంచుకున్నారు కూడా. స్థానిక ప్రసాద్‌ల్యాబ్‌లో సైకో చిత్ర సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు మిష్కిన్ మాట్లాడుతూ సంగీతదర్శకుడు ఇళయరాజా తనకు తల్లిదండ్రులు మాదిరని అన్నారు. ఆయన అందించిన సంగీతం, పాటలు సైకో చిత్ర విజయానికి కారణంగా పేర్కొన్నారు. అందుకే ఈ చిత్ర విజయాన్ని ఆయనకు సమర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇకపోతే సైకో చిత్ర షూటింగ్ పూర్తి అయిన తరువాత నటుడు ఉదయనిదిస్టాలిన్ను తన తల్లి కడుపున పుట్టిన తన తమ్ముడుగా భావిస్తున్నానని చెప్పారు. నిజం చెప్పాలంటే తాను ఆయన చిత్రాలేవీ చూడలేదన్నారు. సైకో 2 చిత్రం చేస్తారా? అని అడుగుతున్నారని, తన జీవిత కాలంలో ఎప్పుడైనా ఉదయనిధిస్టాలిన్ తనతో చిత్రం చేయమని కోరితే చేయడానికి సిద్ధం అని అన్నారు. ఇకపోతే సైకో చిత్రం గురించి రకరకాల విమర్శలు వస్తున్నాయని, అయితే ఇది చెడ్డ చిత్రం కాదని అన్నారు. తన చిత్రాలన్నీ కత్తిపై నడిచినట్లే ఉంటాయన్నారు. చదవండి: అమ్మకు కీర్తి తెచ్చిన పాత్రలో కీర్తి ‘అమలాపాల్-విజయ్ విడిపోడానికి ధనుషే కారణం!’ -
చెంప దెబ్బ కొట్టలేక సినిమా వదిలేసింది..!
నటి నదియ అన్ని సార్లు మరో నటుడి చెంప చెళ్లు మనిపించి అలా చేసిందేంటబ్బా? ఇంతకీ ఏం జరిగి ఉంటుంది? ఆ కథేంటో చూద్దాం. 90 కాలం కథానాయకి నదియ. ఆ తరువాత కథానాయకి పాత్రలకు రాజీనామా చేసి అమ్మ, అత్త పాత్రల్లో నటిస్తోందిప్పుడు. ఎక్కువగా తెలుగు చిత్రాల్లో చూడగలుగుతున్న ఈమె చాలా గ్యాప్ తరువాత తమిళంలో ఒక చిత్రానికి కమిట్ అయ్యింది. విజయ్‌సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రాల్లో సూపర్‌డీలక్స్ ఒకటి. అరణ్యకాండం చిత్రం ఫేమ్ త్యాగరాజన్ కుమారరాజా దర్శకత్వం వహిస్తున్న ఇందులో నటి సమంత నాయకి. ముఖ్యమైన పాత్రల్లో దర్శకుడు మిష్కిన్, నదియ నటిస్తున్నారు. ఈ చిత్రంలో మిష్కన్ను నదియ కొట్టే సన్నివేశం చోటు చేసుకుంటుందట. ఆ సన్నివేశం సహజంగా ఉండాలని మిష్కిన్ నిజంగానే కొట్టమని నదియకు చెప్పారు. దీంతో ఆమె కూడా ఆయన్ని నిజంగానే కొట్టింది. అయితే అలా 56 సార్లు నదియ కొట్టినా ఆ సన్నివేశం బాగా రాలేదు. రెండు రోజుల పాటు అదే సన్నివేశాన్ని చిత్రీకరించారట. దీంతో విసిగిపోయిన నటి నదియ ఇకపై ఆ కొట్టే సన్నివేశంలో నటించడం తన వల్ల కాదు. వేరేవరినైనా చూసుకోండి అంటూ చిత్రం నుంచి వైదొలిగింది. కాగా నదియతో అన్ని సార్లు కొట్టించుకున్న మిష్కిన్ కూడా వేసారిపోయి తానూ నటించను అంటూ నటించడం తెలియని వారిని ఎందుకు ఎంపిక చేస్తారు? అని నదియ సమక్షంలోనే ఆగ్రహం వ్యక్తం చేశారట. నదియ సూపర్ డీలక్స్ చిత్రం నుంచి వైదొలగడానికి కారణం ఇదేనట. కాగా ఆమె పాత్రలో నటి రమ్యకృష్ణను ఎంపిక చేయగా ఆమె మిష్కిన్‌ను కొట్టే సన్నివేశాన్ని రెండే రెండు టేక్ల్లో నటించేసిందట. ఇప్పుడు ఈ న్యూసే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
మమ్ముట్టిపై దర్శకుడి వివాదాస్పద వ్యాఖ్యలు
-
మెగాస్టార్‌పై దర్శకుడి వివాదాస్పద వ్యాఖ్యలు
మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టిపై దర్శకుడు మిస్కిన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. మమ్ముట్టి హీరోగా తెరకెక్కిన పెరాన్బు సినిమా టీజర్ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్న మిస్కిన్ చేసిన కామెంట్స్ అసహ్యంగా ఉన్నాయంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. టీజర్ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్న మిస్కిన్, పెరాన్బు సినిమాలో మమ్ముట్టి నటనను కీర్తించారు. ‘సినిమాలో మమ్ముట్టి కాకుండా మరొకరు నటించి ఉంటే ఓవర్ యాక్షన్ చేసేవారు. మమ్ముట్టి చాలా బాగా నటించారు. ప్రేక్షకులు ఆయన్ను చూస్తూ ఉండిపోతారు. నేను వయసులో ఉండి, మమ్ముట్టి ఆడపిల్ల అయి ఉంటే ఆయన్ని అత్యాచారం చేసేవాణ్ని.. అసభ్యంగా మాట్లాడుతున్నానని అనుకోకండి. మమ్ముట్టి నటన గురించి మీకు అర్థమయ్యేలా చెప్పేందుకు ఇలా మాట్లాడాను’ అంటూ మిస్కిన్ సర్థి చెప్పే ప్రయత్నం కూడా చేశారు. అయితే మిస్కిన్ చేసిన వ్యాఖ్యలు పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతటి గొప్ప నటుడ్ని పొగిడేందుకు ఇలాంటి తేడా వ్యాఖ్యలు చేయటంపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. -
తెరపైకి రవిచంద్రన్ వారసురాలు
ప్రఖ్యాత నటుడు రవిచంద్రన్ వారసురాలిగా ఆయన మనవరాలు కథానాయకిగా పరిచయం కానున్నారు. కాదలిక్క నేరమిల్లై, అదేకంగళ్ మొదలగు 100 చిత్రాలకు పైగా హీరోగా నటించిన రవిచంద్రన్ ఆ తరువాత క్యారెక్టర్‌గానూ, దర్శకుడిగానూ చిత్రాలు చేశారు. ఆయన కొడుకు హంసవర్ధన్ కూడా హీరోగా పరిచయమైనా పెద్దగా రాణించలేదు. కాగా రవిచంద్రన్ మనవరాలు అభిరామి కథానాయకిగా రంగప్రవేశం చేయనున్నారు. ఈమెను దర్శకుడు మిష్కిన్ తను తాజా చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయం చేయనున్నారు. అయితే అభిరామి పేరుతో ఒక నటి ఉండడంతో ఈమె పేరును తాన్యాగా మిష్కిన్ మార్చారు. చిత్తరంపేసుదడి, అంజాదే, ఓనాయుమ్ ఆటుకుట్టి, పిశాచు వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన మిష్కిన్ ప్రస్తుతం విశాల్ హీరోగా తుప్పరివాలన్ చిత్రం చేయనున్నారు. ఇందులో రకుల్‌ప్రీత్ నాయకి. కాగా ఈ చిత్రం తరువాత మరో చిత్రానికి మిష్కిన్ కమిట్ అయ్యారు. దీన్ని రఘునందన్ అనే ఫైనాన్షియర్ నిర్మించనున్నారు. ఆయన కొడుకు మైత్రేయను హీరోగా పరిచయం చేస్తున్న ఈ చిత్రంలో తాన్యా నాయకిగా నటించనున్నారు. భరతనాట్యం నేర్చుకున్న తాన్యా ప్రస్తుతం మోడలింగ్ చేస్తున్నారు. తన ఫొటోను చూసిన దర్శకుడు మిష్కిన్ నటించడానికి ఆసక్తి ఉందా అని అడిగారనీ, తాను ఉందని చెప్పడంతో వెంటనే చిన్న స్క్రిప్ట్‌తో ఆడిటింగ్ చేసి ఓకే చేశారనీ తాన్యా వివరించారు. నటిగా పరిచయానికి తాత రవిచంద్రన్ పేరు ఉపయోగపడుతుంది గానీ తానిక్కడ నిలబడడానికి మాత్రం ఎంపిక చేసుకునే కథ, పాత్రలు, వాటిని మెప్పించడానికి పడే శ్రమ, చేసే కృషి ప్రధానం అవుతాయన్నారు. తాను నటిగా తాత పేరును కాపాడే ప్రయత్నం చేస్తాననీ తాన్యా అంటున్నారు. విశాల్ హీరోగా తుప్పరియాలన్ చిత్రం పూర్తి కాగానే మిష్కిన్ తాన్యా, మైత్రేయ జంటగా నటించే చిత్రాన్ని ప్రారంభించనున్నారు.