మెగాస్టార్‌పై దర్శకుడి వివాదాస్పద వ్యాఖ్యలు | Director Mysskin Comments on Mammootty Were Slammed | Sakshi
Sakshi News home page

Published Tue, Jul 17 2018 12:41 PM | Last Updated on Tue, May 28 2019 10:06 AM

Director Mysskin Comments on Mammootty Were Slammed - Sakshi

మాలీవుడ్ మెగాస్టార్‌ మమ్ముట్టిపై దర్శకుడు మిస్కిన్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. మమ్ముట్టి హీరోగా తెరకెక్కిన పెరాన్బు సినిమా టీజర్‌ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్న మిస్కిన్‌ చేసిన కామెంట్స్‌ అసహ్యంగా ఉన్నాయంటూ ఫ్యాన్స్‌ ఫైర్‌ అవుతున్నారు. టీజర్‌ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్న మిస్కిన్‌, పెరాన్బు సినిమాలో మమ్ముట్టి నటనను కీర్తించారు.

‘సినిమాలో మమ్ముట్టి కాకుండా మరొకరు నటించి ఉంటే ఓవర్‌ యాక్షన్‌ చేసేవారు. మమ్ముట్టి చాలా బాగా నటించారు. ప్రేక్షకులు ఆయన్ను చూస్తూ ఉండిపోతారు. నేను వయసులో ఉండి, మమ్ముట్టి ఆడపిల్ల అయి ఉంటే ఆయన్ని అత్యాచారం చేసేవాణ్ని.. అసభ్యంగా మాట్లాడుతున్నానని అనుకోకండి. మమ్ముట్టి నటన గురించి మీకు అర్థమయ్యేలా చెప్పేందుకు ఇలా మాట్లాడాను’ అంటూ మిస్కిన్ సర్థి చెప్పే ప్రయత్నం కూడా చేశారు. అయితే మిస్కిన్ చేసిన వ్యాఖ్యలు పై సోషల్‌ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతటి గొప్ప నటుడ్ని పొగిడేందుకు ఇలాంటి తేడా వ్యాఖ్యలు చేయటంపై ఫ్యాన్స్‌ ఫైర్‌ అవుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement