తొక్కిసలాట పెద్ద విషయమేమీ కాదు: హేమామాలిని | BJP MP Hema Malini Shocking Comments On Kumbh Stampede | Sakshi
Sakshi News home page

కుంభమేళా తొక్కిసలాట పెద్ద విషయమేమీ కాదు: హేమామాలిని

Published Tue, Feb 4 2025 5:18 PM | Last Updated on Tue, Feb 4 2025 5:43 PM

BJP MP Hema Malini Shocking Comments On Kumbh Stampede

న్యూఢిల్లీ: సీనియర్‌ నటి, బీజేపీ ఎంపీ హేమా మాలిని మహా కుంభమేళా దుర్ఘటనపై చేసిన వ్యాఖ్యలు.. వివాదాస్పదంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.  తొక్కిసలాటలో అంత మంది చనిపోవడం పెద్ద విషయమేమీ కాదని అన్నారామె. 

మహా కుంభమేళాలో ప్రయాగ్‌రాజ్‌ త్రివేణి సంగమం​ తొక్కిసలాటలో 30 మంది మరణించగా.. 60 మంది గాయపడ్డారని యూపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. మరణాల సంఖ్యను యూపీ సర్కార్‌ దాస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో.. ఈ అంశం పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలనూ కుదిపేస్తోంది. అయితే ఈ విమర్శలపై హేమా మాలిని స్పందించారు. 

‘‘మేమూ పుణ్య స్నానం కోసం అక్కడికి వెళ్లాం. జరిగిందేదో జరిగింది. అయినా అదేం అంత పెద్ద ఘటనేం కాదు. కేవలం ప్రతిపక్షాలు ప్రదర్శిస్తున్న అతిశయోక్తి మాత్రమే. కుంభ మేళా నిర్వహణలో యోగి ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది. అంతా సజావుగానే జరుగుతోంది. అయితే అంత మంది వస్తుండడంతో.. నిర్వాహణ కాస్త కష్టతరమే. కాబట్టి తొక్కిసలాట పెద్దగా పట్టించుకోవాల్సిన విషయం కాదు అని అన్నారామె. 

అయితే  ఈ వ్యాఖ్యలకు కాంగ్రెస్‌ ఎంపీ తారీఖ్‌ అన్వర్‌ కౌంటర్‌ ఇచ్చారు.  ఆమె నటి, పైగా అధికారంలో ఉన్నారు. అందుకే ఆమెకు వీఐపీ ట్రీట్‌మెంట్‌ దక్కి ఉంటుంది. తొక్కిసలాటకు దారి తీసే భయంకరమైన రద్దీ ఎలా ఉంటుందో బహుశా ఆమెకు తెలిసి ఉండకపోవచ్చు అని అన్నారామె. ఒకవేళ అది(తొక్కిసలాట ఘటన) పెద్ద విషయం కాదని ఆమె అంటే.. అది నిజంగా దురదృష్టకరం. అది బాధిత కుటుంబాలను అవమానించడమే అని అన్నారాయన

ఇదిలా ఉంటే.. గత వారం పుణ్య స్నానానికి వెళ్లిన హేమా మాలిని.. గొప్ప అనుభూతిని పొందినట్లు ఆ టైంలో వ్యాఖ్యానించారు. ఆ టైంలో ఆమె వీవీఐపీ టట్రీట్‌మెంట్‌ గురించి చర్చ నడిచింది. మరోవైపు మహాకుంభమేళాలో సామాన్యులను పట్టించుకోవడం లేదని, కేవలం వీవీఐపీలకు మాత్రమే ఏర్పాట్లు ఉంటున్నాయనే ఆరోపణలు మొదటి నుంచి వినవస్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

What's your opinion?

మహా కుంభమేళా తరహా భారీగా జనం గుమిగూడే కార్యక్రమాల్లో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు?

Choices
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement