
పట్నా: సోషల్ మీడియాతో కొంతమేరకు ముప్పు పొంచివున్నమాట వాస్తవమే అయినప్పటికీ, ప్రయోజనాలు కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. సోషల్ మీడియాను సరైన రీతిలో వినియోగించుకుంటే ఎన్నో సమస్యలకు పరిష్కారం లభింస్తుందనడంలో సందేహం లేదు. బీహార్‌లోని రోహతక్ జిల్లాలోని బల్దారీ గ్రామానికి చెందిన లాఖ్‌పాతో దేవి విషయంలో సోషల్ మీడియా ఒక వరంలా మారింది.
యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహాకుంభమేళా(Mahakumbh Mela)కు వెళ్లిన లాఖ్‌పతో దేవి అక్కడ తప్పిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియా సాయంతో ఇంటికి చేరుకుంది. ఆమె ఫిబ్రవరి 24న తన కుటుంబ సభ్యులతో పాటు మహాకుంభ్‌లో పవిత్ర స్నానం చేసేందుకు వెళ్లింది. అయితే అక్కడ జనసమూహం అధికంగా ఉండటంతో ఆమె కుటుంబ సభ్యుల నుంచి తప్పిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు కుంభమేళా ప్రాంతంలోనే రెండు రోజుల పాలు ఉండి, ఆమె కోసం వెదికారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో ఇంటికి తిరుగుముఖం పట్టారు.
అయితే ఇది జరిగిన 15 రోజుల తరువాత లాఖ్‌పాతో దేవి జార్ఖండ్(Jharkhand)లోని గఢ్వా జిల్లాకు చెందిన బహియాపూర్‌లో ఉందని ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. బహియాపూర్ పంచాయతీ సభ్యురాలు సోనీదేవి భర్త వీరేంద్ర మీడియాతో మాట్లాడుతూ ఇటీవల 60 ఏళ్ల మహిళ తమ ఇంటికి వచ్చిందని, ఆ సమయంలో ఆమె బలహీనంగా కనిపించిందన్నారు. దీంతో ఆమెకు ఆహారం అందించి, వసతి కల్పించామన్నారు. ఆమె తన చిరునామా చెప్పలేకపోవడంతో ఆమె ఫొటోను సోషల్ మీడియాలో సంబంధిత వివరాలతో పాటు షేర్ చేశామని తెలిపారు.
లాఖ్‌పాతో దేవి కుమారుడు రాహుల్ తల్లి ఫొటోను చూసి, వెంటనే జార్ఖండ్ చేరుకుని తన తల్లిని తనతోపాటు ఇంటికి తీసుకువచ్చాడు. ఈ సందర్బంగా రాహుల్ మాట్లాడుతూ మార్చి 10 సోషల్ మీడియాలో తన తల్లి ఫొటోను చూశానని,తరువాత తాను బహియార్ పూర్ చేరుకుని తన తల్లిని కలుసుకున్నానని తెలిపారు.
ఇది కూడా చదవండి: తండ్రి ఫోన్ రిపేర్ చేయించలేదని.. కుమారుడు ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment