hema malini
-
బీజేపీ ఎంపీ హేమమాలిని వివాదాస్పద వ్యాఖ్యలు.. ప్రతిపక్ష నేతల ఆగ్రహం
లక్నో : ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ హేమ మాలిని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళాలో నమోదైన మరణాలు సంఖ్య పెద్దది కాదని వ్యాఖ్యానించారు. అయితే, ఆ వ్యాఖ్యల్ని ప్రతిపక్ష నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. కుంభ మేళాలో హేమమాలిని స్నానమాచరించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు మౌని అమావాస్య రోజున జరిగిన తొక్కిసలాటలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. 60 మంది గాయపడ్డారు’ ఈ దుర్ఘటనపై ప్రశ్నలు సంధించారు. ‘ఇది అంత పెద్ద సంఘటన కాదు. అది ఎంత పెద్దదో నాకు తెలియదు (కానీ).. దానిని బాగా పెద్దది చేసి చూపిస్తున్నారు.యూపీ సీఎం యోగి ఆధిత్యాథ్ ఏర్పాట్లు బాగా చేశారు. కుంభమేళాకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇలాంటి వాటి నిర్వహణ చాలా కష్టం. కాబట్టే తొక్కిసలాట జరిగింది. అలాంటి ఘటనలు జరగడం’ అనివార్యం అని అన్నారు. #WATCH | Delhi: BJP MP Hema Malini says "...We went to Kumbh, we had a very nice bath. It is right that an incident took place, but it was not a very big incident. I don't know how big it was. It is being exaggerated...It was very well-managed, and everything was done very… pic.twitter.com/qIuEZ045Um— ANI (@ANI) February 4, 2025యూపీ ప్రభుత్వం వాస్తవ మరణాల సంఖ్యను దాచిపెట్టిందని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. ఆ వ్యాఖ్యలపై హేమమాలిని మాట్లాడుతూ.. వారు ఏమి చెప్పాలనుకుంటున్నారో అది చెబుతారు .తప్పుడు విషయాలు చెప్పడమేగా వారి పని’ అని అన్నారు.హేమమాలిని వ్యాఖ్యలపై ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ ఎంపీ తారిఖ్ అన్వర్ తీవ్రంగా స్పందించారు. హేమమాలిని సందర్శించినప్పుడు ఆమెకు వీఐపీ ట్రీట్మెంట్ ఇచ్చారు. కాబట్టే, కుంబమేళాలో జరిగిన దుర్ఘటనకు సంబంధించిన వాస్తవాలేంటో తెలియడం లేదు. పోలీసులు, అధికారులు వీఐపీ ట్రీట్మెంట్ ఇచ్చేందుకు పాకులాడుతున్నారు. హేమ మాలిని సామాన్య ప్రజల కోసం చేసిన ఏర్పాట్లు, భద్రత గురించి పట్టించుకోలేదు. అందుకే పదుల సంఖ్యలో ప్రాణాలు పోతే ఇదో సమస్య కాదని ఆమె చెప్పడం బాధితుల్ని ఎగతాళి చేయడమే అవుతుందన్నారు. హేమమాలిని వ్యాఖ్యలపై సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ స్పందించారు. హేమ మాలిని ప్రయాగ్‌రాజ్ సందర్శనలో వీఐపీ ట్రీట్మెంట్ పొందినట్లు చెప్పారు. ఆమె అధికార పార్టీ నాయకురాలు, పైగా ప్రముఖ నటి. ఆమెకు ప్రత్యేక సౌకర్యాలు ఉండే అవకాశం ఉంది (కానీ) పదుల సంఖ్యలో మరణించారు. గాయపడ్డారు. వాటి గురించి ఎవరు పట్టించుకుంటారని అన్నారు. -
తొక్కిసలాట పెద్ద విషయమేమీ కాదు: హేమామాలిని
న్యూఢిల్లీ: సీనియర్ నటి, బీజేపీ ఎంపీ హేమా మాలిని మహా కుంభమేళా దుర్ఘటనపై చేసిన వ్యాఖ్యలు.. వివాదాస్పదంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొక్కిసలాటలో అంత మంది చనిపోవడం పెద్ద విషయమేమీ కాదని అన్నారామె. మహా కుంభమేళాలో ప్రయాగ్‌రాజ్ త్రివేణి సంగమం తొక్కిసలాటలో 30 మంది మరణించగా.. 60 మంది గాయపడ్డారని యూపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. మరణాల సంఖ్యను యూపీ సర్కార్ దాస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో.. ఈ అంశం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలనూ కుదిపేస్తోంది. అయితే ఈ విమర్శలపై హేమా మాలిని స్పందించారు. #WATCH | Delhi: BJP MP Hema Malini says "...We went to Kumbh, we had a very nice bath. It is right that an incident took place, but it was not a very big incident. I don't know how big it was. It is being exaggerated...It was very well-managed, and everything was done very… pic.twitter.com/qIuEZ045Um— ANI (@ANI) February 4, 2025‘‘మేమూ పుణ్య స్నానం కోసం అక్కడికి వెళ్లాం. జరిగిందేదో జరిగింది. అయినా అదేం అంత పెద్ద ఘటనేం కాదు. కేవలం ప్రతిపక్షాలు ప్రదర్శిస్తున్న అతిశయోక్తి మాత్రమే. కుంభ మేళా నిర్వహణలో యోగి ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది. అంతా సజావుగానే జరుగుతోంది. అయితే అంత మంది వస్తుండడంతో.. నిర్వాహణ కాస్త కష్టతరమే. కాబట్టి తొక్కిసలాట పెద్దగా పట్టించుకోవాల్సిన విషయం కాదు అని అన్నారామె. అయితే ఈ వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ తారీఖ్ అన్వర్ కౌంటర్ ఇచ్చారు. ఆమె నటి, పైగా అధికారంలో ఉన్నారు. అందుకే ఆమెకు వీఐపీ ట్రీట్మెంట్ దక్కి ఉంటుంది. తొక్కిసలాటకు దారి తీసే భయంకరమైన రద్దీ ఎలా ఉంటుందో బహుశా ఆమెకు తెలిసి ఉండకపోవచ్చు అని అన్నారామె. ఒకవేళ అది(తొక్కిసలాట ఘటన) పెద్ద విషయం కాదని ఆమె అంటే.. అది నిజంగా దురదృష్టకరం. అది బాధిత కుటుంబాలను అవమానించడమే అని అన్నారాయన#WATCH | On BJP MP Hema Malini's statement on the Maha Kumbh Stampede, Congress MP Tariq Anwar says, "Hema Malini can never know what it was really like. When she visited, she was given VIP treatment. Things at Maha Kumbh went downhill because the police and administration were… pic.twitter.com/SnsQGfnIkA— ANI (@ANI) February 4, 2025ఇదిలా ఉంటే.. గత వారం పుణ్య స్నానానికి వెళ్లిన హేమా మాలిని.. గొప్ప అనుభూతిని పొందినట్లు ఆ టైంలో వ్యాఖ్యానించారు. ఆ టైంలో ఆమె వీవీఐపీ టట్రీట్మెంట్ గురించి చర్చ నడిచింది. మరోవైపు మహాకుంభమేళాలో సామాన్యులను పట్టించుకోవడం లేదని, కేవలం వీవీఐపీలకు మాత్రమే ఏర్పాట్లు ఉంటున్నాయనే ఆరోపణలు మొదటి నుంచి వినవస్తున్నాయి. -
రోడ్లను హేమ మాలినీ బుగ్గల్లా తీర్చిదిద్దుతా: ఆప్ ఎమ్మెల్యే
న్యూఢిల్లీ: నటి, బీజేపీ ఎంపీ హేమా మాలినిపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నగరంలోని రోడ్లను హేమ మాలినీ బుగ్గల్లా(చెంపలు )అందంగా, మృదువుగా చేస్తానని ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ ఎమ్మెల్యే నరేష్ బల్యాన్ వ్యాఖ్యానించారు. తన నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే మంగళవారం సందర్శించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు.ఆప్ ఎమ్మెల్యే వ్యాఖ్యాలపై పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ రేఖా శర్మ స్పందిస్తూ.. ఆయన్ను మహిళా ద్వేషిగా అభివర్ణించారు. తమ పార్టీ ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీని కోరారు. ఇలాంటి వారిని సమాజం నుంచి తరిమికొట్టాలని అన్నారు.‘దేశంలోని వివిధ ప్రాంతాలలో నేతలు, ముఖ్యంగా ఇండియా కూటమికి చెందిన నాయకులు స్త్రీలపై ద్వేషం కనబరుస్తున్నారు. మహిళలపై లింగవివక్ష వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం. దాదాపు 40 సంవత్సరాల క్రితం లాలూ ప్రసాద్ యాదవ్ అదే రకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యక్తులు తమను తామునేతలుగా భావిస్తారు. కానీ ప్రజలు ఎన్నికల సమయంలో అలాంటి వ్యక్తులకు తగిన గుణపాఠం చెప్పాలి. వీరిని సమాజంలో అంగీకరించకూడదు.’ అని పేర్కొన్నారు.అటు ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ ఛైర్పర్సన్ స్వాతి మలివాల్ కూడా ఆప్ ఎమ్మెల్యే వ్యాఖ్యాలపై ధ్వజమెత్తారు. పదేళ్ల నుంచి ఆయన నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు. ’నరేష్ బల్యాన్ చేసిన మహిళా వ్యతిరేక ప్రకటనను ఖండిస్తే సరిపోదు. గత పదేళ్లుగా ఉత్తమ్ నగర్ రోడ్లు ఆధ్వానంగా ఉన్నాయి. ప్రజలు వీటినే వినియోగిస్తున్నారు. ఇన్నేళ్లు ఆయన నిద్రపోతున్నారా; రోడ్లను హేమమాలిని చెంపలలాగా తీర్చిదిద్దుతాం" అంటున్నారు. మహిళలను వస్తువులుగా భావించే ఇలాంటి చౌకబారు ఆలోచనకు సమాజంలో స్థానం లేదు. మహిళా వ్యతిరేక ఆలోచనలు కలిగిన ఈ వ్యక్తిపై తక్షణమే చర్యలు తీసుకోవాల అరవింద్ కేజ్రీవాల్‌కు విజ్ఞప్తి చేస్తున్నాం’ అని పేర్కొన్నారు,.दिल्ली के उत्तम नगर से विधायक नरेश बाल्यान का कहना है कि “सड़कें हेमा मालिनी के गालों जैसी बना देंगे”! इस महिला विरोधी बात की जितनी निंदा करें वो कम है। ये आदमी पूरे दस साल सोता रहा है जिसके चलते उत्तम नगर की सड़कें टूटी फूटी पड़ी हैं! आज भी काम न करके, सिर्फ़ अपनी घटिया सोच का… pic.twitter.com/ObXRdrbj3e— Swati Maliwal (@SwatiJaiHind) November 4, 2024 -
థియేటర్లలో ఫ్లాప్.. కానీ 25 కోట్ల టికెట్స్ సేల్.. ఆ సినిమా ఏదంటే? (ఫొటోలు)
-
వినేశ్ ఫొగట్‌పై హేమమాలిని వివాదాస్పద వ్యాఖ్యలు
సెమీ ఫైనల్లో విజయం.. ఫైనల్లో పతకం సాధించడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో భారతీయ క్రీడాభిమానులకు ఊహించని షాక్.. భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్‌పై అనర్హత వేటు. 50 కిలోల విభాగంలో 100 గ్రాములు ఎక్కువ బరువు ఉందంటూ ఒలంపిక్ సంఘం ఆమెను అనర్హురాలిగా ప్రకటించింది.కష్టమంతా వృథాపతకం ఖాయమనుకున్న అభిమానుల మనసు ముక్కలైంది. బరువు నియంత్రణ కోసం వినేశ్ ఎంతగానో కష్టపడింది. నీళ్లు తాగకుండా నిద్రను త్యాగం చేసింది. అయినా ఫలితం లేకుండా పోయింది. విజయానికి అడుగు దూరంలో ఉన్న ఆమెను 100 గ్రాముల కోసం రేసులోనే లేకుండా చేయడమేంటని యావత్ భారత క్రీడాభిమానులు విచారం వ్యక్తం చేశారు.ఇదొక గుణపాఠంకానీ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని మాత్రం ఈ అంశంపై విభిన్నంగా స్పందించారు. 100 గ్రాముల అధిక బరువు వల్ల అనర్హతకు గురవడం వింతగా ఉంది. అందుకే ఎప్పటికప్పుడు బరువు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇది మనందరికీ ఓ గుణపాఠం. ఆమె త్వరగా 100 గ్రాముల బరువు తగ్గాలని ఆశిస్తున్నాను. అయినా ఇప్పుడు ఒలంపిక్ పతకమైతే రాదు కదా అని చివర్లో సెటైరికల్‌గా ఓ నవ్వు విసిరింది.సంతోషం?ఆమె రియాక్షన్ చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. 'ఒక క్రీడాకారిణి మీద అలాంటి కామెంట్లు చేయడమేంటి? పైగా చివర్లో ఆ నవ్వు చూశారా?', 'బరువు తగ్గడం గురించి లెక్చర్ ఇవ్వాల్సిన సమయమా ఇది', 'ఒక ఛాంపియన్ వైఫల్యాన్ని చూసి తను ఎలా నవ్వుతుందో చూశారా?', 'వినేశ్‌పై వేటు వేసినందుకు తెగ సంతోషిస్తున్నట్లు ఉంది' అని ఆగ్రహంతో కామెంట్లు చేస్తున్నారు. Her last reaction "milega nhin" 🤔😡#GOLD #OlympicGames #HemaMalini pic.twitter.com/dcQHS6Sdus— Ateeque Ahmad عتیق احمد (@AteekSyd) August 7, 2024 -
విజయానందంలో సీనియర్ హీరోయిన్.. కాలికి కట్టుతో భర్త!
సీనియర్ నటుడు ధర్మేంద్ర డియోల్ 88 ఏళ్ల వయసులోనూ ఎంతో హుషారుగా కనిపిస్తూ ఉంటాడు. సోషల్ మీడియాలోనూ అప్పుడప్పుడు కబుర్లు చెప్తూ ఉంటాడు. తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా షేర్ చేస్తుంటాడు. ఈ క్రమంలో ఈ సీనియర్ హీరో ఓ వీడియో షేర్ చేశాడు. గాయపడ్డ సింహం.. మళ్లీ బిజీ అయిపోయానంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియోలో ఆయన తన ఫామ్ హౌస్‌లో ప్రకృతి నడుమ సేద తీరుతున్నాడు. చెట్టు కింద కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. అందులో అతడి కుడి కాలికి పట్టీ వేసి ఉంది. ఇది చూసిన అభిమానులు ఆయనకు ఏమైందని కంగారుపడుతున్నారు. ఆ గాయం త్వరగా మానుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. కాగా ఈయన చివరగా రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని, తేరి బాటీ ఐసా ఉల్జా జియా అనే సినిమాల్లో కనిపించాడు. ఇకపోతే ధర్మేంద్ర రెండో భార్య హేమమాలిని సంతోషంలో మునిగి తేలుతోంది. మధుర నియోజకవర్గం నుంచి ఆమె మూడోసారి ఎంపీగా గెలుపొందింది. దీంతో ఫ్యాన్స్ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. View this post on Instagram A post shared by Dharmendra Deol (@aapkadharam) చదవండి: నేను వాడిపడేసిన టిష్యూ ఏరుకుంది: నటి -
లోక్‌సభ ఎన్నికల్లో సీనియర్ నటి హ్యాట్రిక్.. అభినందించిన కూతురు!
ఈ ఏడాది జూన్ 4న వెలువడిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో సీనియనర్ నటి హేమ మాలిని విజయం సాధించింది. యూపీలోని మథుర లోక్‌సభ నియోజకవర్గం బరిలో నిలిచిన ఆమె వరుసగా మూడోసారి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్‌కు చెందిన ముఖేష్ ధన్గర్పై 5,10,064 ఓట్ల మెజారిటీలో గెలుపొందారు. తాజాగా ఈ విజయంపై ఆమె కూతురు, నటి ఇషా డియోల్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు అభినందనలు మమ్మా.. హ్యాట్రిక్ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. కాగా.. హేమ మాలిని 1999లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2003లో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఆ తర్వాత 2004లో అధికారికంగా బీజేపీలో చేరారు. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ వరుసగా విజయం సాధించారు. తాజాగా హ్యాట్రిక్ కొట్టడంపై హేమమాలిని స్పందించారు. ప్రజలకు మూడోసారి సేవ చేసే అవకాశం లభించినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా తనను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. View this post on Instagram A post shared by ESHA DEOL (@imeshadeol) -
రెండో పెళ్లి.. ఇప్పటికీ విడిగానే.. యానివర్సరీ మాత్రం గొప్పగా
ప్రేమ ఎప్పుడు, ఎలా చిగురిస్తుందో ఎవరికీ తెలియదు. ఒక్కసారి మనసులు కలిశాయంటే ఎన్ని అవాంతరాలు ఎదురైనా వాటిని దాటి మరీ ఒక్కటయ్యేందుకు రెడీ అయిపోతారు. బాలీవుడ్ సీనియర్ జంట ధర్మేంద్ర- హేమమాలిని విషయంలో ఇదే జరిగింది. ధర్మేంద్రతో ప్రేమలో పడేనాటికే అతడికి ప్రకాశ్ కౌర్ అనే భార్య ఉంది. ఈ జంటకు నలుగురు పిల్లలు సంతానం. రెండో పెళ్లిఈ బంధాన్ని కాపాడుకుంటూనే మోవైపు హేమమాలినిని రెండో పెళ్లి చేసుకున్నాడు. తాజాగా వీరు 44వ పెళ్లి రోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా హేమమాలిని భర్తతో కలిసున్న ఫోటోలు షేర్ చేసింది. ఇందులో ధర్మేంద్ర, హేమమాలిని దండలు మార్చుకున్నారు. భర్త ప్రేమగా ముద్దుపెడుతుంటే సిగ్గుపడిపోయింది హేమ. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.అప్పుడే చిగురించిన ప్రేమహేమమాలిని, ధర్మేంద్ర 1970లో వారి తుమ్ హసీన్ మెయిన్ జవాన్ చిత్రంలో తొలిసారి నటించారు. అప్పుడే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పెళ్లికి రెడీ అయ్యారు. అయితే హేమ తల్లిదండ్రులు ధర్మేంద్రను వివాహం చేసుకోవడాన్ని వ్యతిరేకించారు. అయినా వినకుండా 1980లో ఈ జంట పెళ్లి పీటలెక్కింది. వీరికి ఈషా, అహనా అని ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే ధర్మేంద్ర తన మొదటి భార్యతో కలిసి ఒకే ఇంట్లో ఉండగా హేమమాలిని తన పిల్లలతో వేరుగా ఉంటోంది. Photos from today at home pic.twitter.com/JWev1pemnV— Hema Malini (@dreamgirlhema) May 2, 2024More photos for you pic.twitter.com/20naRKL8gA— Hema Malini (@dreamgirlhema) May 2, 2024చదవండి: ప్రియుడితో పెళ్లికి రెడీ.. ఎంగేజ్మెంట్ వీడియో షేర్ చేసిన బ్యూటీ -
10 ఏళ్ల తర్వాత పోటీ.. ఎంతో ఫేమస్, పలు.. గెలిపించేనా? (ఫొటోలు)
-
ధర్మేంద్ర వద్దన్నా హేమమాలిని రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు?
బాలీవుడ్ నటి హేమ మాలిని అద్భుతమైన నటిగా రాణించడమే కాదు..రాజకీయాల్లోనూ తన సత్తా చాటుతున్నారు. ఇప్పుడు ఆమె భారతీయ జనతా పార్టీ తరపున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. హేమ మాలిని మూడోసారి యూపీలోని మధుర నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. హేమ మాలిని 2014 నుంచి రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ఆమె.. తన భర్తకు తాను రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదనే విషయాన్ని వెల్లడించారు. హేమ మాలిని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి రావడం తన భర్త, నాటి హీరో ధర్మేంద్రకు ఇష్టంలేదంటూనే, మరో హీరో వినోద్ ఖన్నా సూచనలతో రాజకీయాల్లో కాలుమోపానని తెలిపారు. రాజకీయాల్లో నెగ్గుకురావడం చాలా కష్టమని, అందుకే ధర్మేంద్ర తనను రాజకీయాల్లోకి వెళ్లవద్దని సూచించారన్నారు. ధర్మేంద్ర రాజకీయాల్లోకి ప్రవేశించినప్పుడు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారని, అందుకే తనకు అలాంటి సలహా ఇచ్చిరని హేమ మాలిని తెలిపారు. ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో ధర్మేంద్ర ఇబ్బంది పడ్డారని తెలిపారు. అయితే తాను తన భర్త ఎదుర్కొన్న పరిస్థితులను సవాల్‌గా స్వీకరించి, రాజకీయాల్లోకి అడుగుపెట్టానని అన్నారు. ధర్మేంద్ర 2004 నుండి 2009 వరకు బికనీర్ నుండి ఎంపీగా ఉన్నారని తెలిపారు. తన రాజకీయ ప్రయాణంలో నాడు నటుడు వినోద్ ఖన్నా తనకు మద్దతు ఇచ్చారని తెలిపారు. ఎన్నికల్లో ఎలా ప్రసంగించాలో వినోద్‌ను చూసి నేర్చుకున్నానని, పబ్లిక్ని ఎలా ఫేస్ చేయాలో కూడా ఆయనే నేర్పించారన్నారు. బీజేపీ నేత వినోద్ ఖన్నా గురుదాస్‌పూర్ నుండి రెండుసార్లు ఎంపీగా, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రిగా, విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా కూడా వ్యవహరించారు. -
Lok sabha elections 2024: శ్రీకృష్ణుని గోపికను నేను: హేమమాలిని
మథుర(యూపీ): గోపాలకృష్ణుని 16 వేల గోపికల్లో ఒకరినంటూ సినీ నటి హేమమాలిని తనను తాను అభివర్ణించుకున్నారు. మథురలో బీజేపీ అభ్యరి్థగా బరిలోకి దిగిన హేమమాలిని గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘గోపికల్లో ఒక గోపికగా నన్ను నేను ఊహించుకుంటాను. మథుర చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన బ్రిజ్వాసులంటే శ్రీకృష్ణునికి ఎంతో ప్రేమ, అభిమానం. అందుకే బ్రిజ్వాసులను ఇష్టంతో సేవిస్తే కృష్ణ భగవానుని ఆశీస్సులు లభిస్తాయని నా నమ్మకం. అందుకే వారికి విశ్వాసంతో సేవ చేస్తున్నా’అని ఆమె అన్నారు. పేరు, ప్రఖ్యాతుల కోసమో, మరే ఇతర భౌతిక లాభాపేక్షతోనో రాజకీయాల్లోకి రాలేదన్నారు. మథుర చుట్టుపక్కల 84 కోసుల పరిధి(252 కిలోమీటర్లు)లోని ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని చెప్పారు. -
సూర్జేవాలాపై ఈసీ చర్యలు.. ఎన్నికల ప్రచారంపై వేటు
బీజేపీ ఎంపీ హేమా మాలినీపై కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు కేంద్ర ఎన్నికల సంఘం చర్యలకు ఉప్రమించింది. సూర్జేవాలా 48 గంటల పాటు ప్రచారం చేయకుండా ఈసీఐ ఏప్రిల్ 16న నిషేధం విధించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 తరపున అనుమతించే అన్ని ఇతర అధికారాల ప్రకారం సుర్జేవాలా బహిరంగ సభలు, బహిరంగ ఊరేగింపులు, బహిరంగ ర్యాలీలు, రోడ్ షోలు, ఇంటర్వ్యూలు, మీడియాలో (ఎలక్ట్రానిక్, ప్రింట్, సోషల్ మీడియా) బహిరంగ ప్రసంగాలు మొదలైనవి నిర్వహించకుండా నిషేధించింది. ఏప్రిల్ 16 సాయంత్రం 6 గంటల నుండి 48 గంటల పాటు ఆయనపై వేటు వేసింది. కొద్ది రోజుల క్రితం హర్యానాలో చేసిన ఎన్నికల ప్రచారంలో రణ్‌దీప్ సూర్జేవాలా బాలీవుడ్ నటి, బీజేపీ సిట్టింగ్ ఎంపీ హేమమాలినిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఈసీఐ సూర్జేవాలాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. హేమమాలినిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు ఏప్రిల్ 9న షోకాజ్ నోటీసు జారీ చేసింది . మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) ఉల్లంఘించింనదుకు గాను ఎన్నికల సంఘం ఎలాంటి పక్షపాతం లేకుండా హర్యానాలో ఎన్నికల ప్రచారంలో సూర్జేవాలా చేసిన వ్యాఖ్యల్ని ఖండించింది. దుష్ప్రవర్తనపై మందలించింది. -
‘స్థానికేతర’పై కాంగ్రెస్‌కు హేమమాలిని కౌంటర్
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ కొన్ని స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య స్థానిక, స్థానికేతర అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీనియర్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని స్థానికతను టార్గెట్ చేస్తూ మథుర పార్లమెంట్ సెగ్మెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముఖేష్ ధంగర్ ఇటీవల విమర్శలు చేశారు. బీజేపీ ఎంపీ హేమామలిని మథురకు స్థానికురాలు కాదని అంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నేత విమర్శలపై తాజాగా మథుర బీజేపీ అభ్యర్థి హేమమాలిని ఓ జాతీయ మీడియా ఇంటర్య్వూలో పాల్గొని మాట్లాడారు. ‘నేను గత పదేళ్లుగా మథురలో స్థానికురాలిని. శ్రీకృష్ణ భగవానుడికి భక్తురాలుగా నేను ఇక్కడ స్థానికురాలినే. నేను ఇక్కడి ఎంపీగా పలు సేవలు అందించినందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది. అందుకే నేను ఇక్కడి వ్యక్తినే. నన్న మీరు(కాంగ్రెస్ నేతలు) స్థానికేతర వ్యక్తిగా భావించినా.. స్థానికేతర వ్యక్తిగానే బాగా సేవలు అందిచగలరని నమ్ముతా. స్థానికులుగా ఇక్కడే ఉండే వారికి ఈ ప్రాంత మంచి, చెడు తెలియదు. వారు ఇక్కడి పరిస్థితులను మెరుగ్గా మార్చాలనుకోరు. స్థానికేతరులు మాత్రం అలా కాదు.. ఎందుకంటే బయటినుంచి వచ్చినవారికి చాలా అనుభవాలు ఉంటాయి. అందుకే ఇక్కడ ఎక్కువ అభివృద్ధి చేయడానికి కృషి చేస్తారు. నేను ఒక ఎంపీగా... కేంద్రంలోని మంత్రుల సాయంతో మథురలో చాలా అభివృద్ధి పనులు చేశాను. నేను ఒక ఎంపీగా నా పదవి మచ్చ తీసుకురాలేను. ఒక ఎంపీగా సరైనా సేవలు అందిస్తే.. ప్రతి నగరం అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. నేను ఈ ప్రాంతానికి మంచి చేయటం కోసం ముంబై నుంచి మథుర ఎనిమిది గంటలు ప్రయాణిస్తాను. లెక్కలేనన్ని సార్లు ముంబై- మథుర వస్తూ ఉంటా.. ఎందుకంటే నాకు మథుర ప్రాంతానికి మంచి చేయాలనే తపన ఉంటుంది’ అని ఎంపీ హేమమాలిని అన్నారు. ఇప్పటికే మథుర నుంచి రెండుసార్లు ఎంపీగా గెలుపొందని హేమమాలినికి బీజేపీ ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో సైతం మారోమారు అవకాశం ఇచ్చింది. హేమమాలిని స్థానికురాలు కాదని.. తాను స్థానికుడనని ఈసారి ఎన్నికల్లో మథురలో తనను గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముఖేష్ ధంగర్ ప్రజలను కోరుతున్నారు. ఇక..మొదటిసారి 2014 సార్వత్రిక ఎన్నికలో బీజేపీ తరఫు హేమమాలిని పోటీ చేసీ సమీప రాష్ట్రీయ లోక్ దళ్(ఆర్ఎల్డీ) అభ్యర్థి జయంత్ చౌదరీ ఓడించారు. సుమారు 3 లక్షల భారీ మేజార్టీతో హేమమాలిని గెలుపొందారు. 2019లో సైతం సమీప ఆర్ఎల్డీ అభ్యర్థి కున్వర్ నరేంద్రపై హేమమాలిని 2,93,471 మేజార్టీతో విజయం సాధించారు. -
మరో పదేళ్లు హేమామాలినీనే ఎంపీ?
యూపీలోని మధుర ఎంపీ హేమామాలిని విజయానికి ఇక ఢోకాలేదట! ఓ స్వామీజీ ఆమెను ఆశీర్వదిస్తూ, రోబోయే పదేళ్లూ విజయాల పరంపర కొనసాగిస్తూనే ఉంటారని చెప్పారట. ప్రస్తుతం హేమామాలిని మధుర లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. తాజాగా ఆమె ఆచార్య ప్రేమానంద్ మహరాజ్‌ను కలిసేందుకు మధురలోని ఆయన ఆశ్రమానికి వెళ్లారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆమె ప్రేమానంద్ ఆశీర్వాదాలు తీసుకోవాలనుకున్నారు. ఈ సందర్భంగా ప్రేమానంద్ మహారాజ్ హేమామాలినీని ఆశీర్వదిస్తూ ‘మీరు సాధువులకు దగ్గరగా ఉండటమే కాకుండా, భగవంతుని పాదాలను ఆశ్రయించారు. మీరు ప్రాపంచిక విజయాలనే కాకుండా, అతీంద్రియ విజయాలను కూడా అందుకుంటారు. శ్రీ కృష్ణునిపై మీకు కలిగిన ప్రేమ ఒక అతీంద్రియ విజయం . ఏది ఏమైనప్పటికీ మీరు మరో పదేళ్లు ఇలా విజయాలు సాధిస్తూనే ఉంటారు’ అని ఆశీర్వదించారు. హేమామాలిని ప్రేమానంద్ ఆశ్రమంలో 20 నిముషాల పాటు ఉన్నారు. -
Hema Malini Assets Worth: హేమమాలిని ఆస్తులు వంద కోట్లకు పైగానే..
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నటి హేమమాలిని..ఉత్తరప్రదేశ్‌లోని మధుర నియోజకవర్గం నుంచి మూడోసారి ఎంపీ బరిలో నిలిచారు. తాజాగా ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. తన మొత్తం ఆస్తి సుమారు రూ. 123 కోట్లుగా తెలిపారు. అయితే రూ. 1.4 కోట్ల అప్పులు ఉన్నట్లు పేర్కొన్నారు. నటనను తన వృత్తిగా తెలిపిన హేమమాలిని.. అద్దె, వడ్డీ ఆదాయవనరులుగా తెలిపారు. అలాగే తన భర్త, నటుడు ధర్మేంద్ర డియోల్ ఆస్తుల విలువ రూ.20 కోట్లు, అప్పులు రూ.6.4 కోట్లుగా పేర్కొన్నారు. నటన, పెన్షన్, వడ్డీలు ఆయన ఆదాయవనులుగా తెలిపారు. అఫిడవిట్ ప్రకారం హేమమాలినిపై ఎలాంటి క్రిమినల్ కేసులు పెండింగ్‌లో లేవు. వీరి చరాస్తుల్లో మెర్సిడీస్ బెంజ్, రేంజ్ రోవర్, మహీంద్రా బొలెరో, అల్కాజార్, మారుతీ ఈఈసీఓ సహా రూ.61 లక్షల విలువైన వాహనాలు ఉన్నాయి. ఆమె వద్ద రూ. 13.5 లక్షల నగదు ఆమె భర్త ధర్మేంద్ర డియోల్ చేతిలో రూ. 43 లక్షల నగదు ఉన్నాయి. కాగా 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో హేమమాలిని బీజేపీ తరపున మధుర నుంచి గెలుపొందారు. ఈ సారి అక్కడి నుంచి హ్యాట్రిక్ సాధించాలని చూస్తున్నారు. చదవండి: అవును! నేను అన్నది నిజమే..బోస్పై కంగన మరో ట్వీట్ వైరల్ -
మధురలో హేమ మాలినికి ముళ్లబాట?
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో వివిధ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తున్నాయి. ఇదేసమయంలో ఉత్తరప్రదేశ్‌లోని మధుర లోక్‌సభ స్థానం నుంచి అంతర్జాతీయ బాక్సర్ విజేందర్ సింగ్‌కు టికెట్ ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ ఎన్నికల పోటీని మరింత ఆసక్తికరంగా మార్చింది. ఇలాంటి పరిస్థితుల్లో రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన హేమ మాలినికి గట్టిపోటీ ఎదురుకానున్నదనే వార్తలు వినిపిస్తున్నాయి. నటి హేమ మాలిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ ఇమేజ్‌పై ఆధారపడి ముందుకు సాగుతున్నారనే మాట వినిపిస్తుంటుంది. హిందుత్వ వాదం కూడా ఆమెకు కలిసివచ్చే ఫ్యాక్టర్ అని చెబుతుంటారు. ఒకవైపు హేమమాలిని ఇండియా అలయన్స్ నుండి ఒలింపియన్ బాక్సర్ విజేందర్ సింగ్‌తో తలపడనుండగా, మరోవైపు బహుజన్ సమాజ్ పార్టీ నుంచి బరిలోకి దిగిన మాజీ ఐఆర్ఎస్ అధికారి సురేష్ సింగ్ ఆమెకు పోటీనిస్తున్నారు. దీంతో హేమ మాలినికి మధుర లోక్‌సభ ఎన్నికలు ముళ్ల బాటను తలపిస్తున్నాయనే వాదన వినిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో జాట్ల ఓట్ల శాతం అధికం. ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర భార్య అయిన హేమ మాలిని తనకు జాట్ కమ్యూనిటీ మద్దతు ఉందని గతంలో ప్రకటించారు. బాక్సర్ విజేందర్ సింగ్ హర్యానాలోని భివానీకి చెందిన ఆటగాడు. ఇప్పుడు మధురకు ప్రాతినిధ్యం వహించేందుకు సిద్ధమయ్యారు. బీఎస్పీ నుంచి బరిలోకి దిగిన సురేష్ సింగ్ పదవీ విరమణ చేశాక మధురలోని ఒక విద్యా సంస్థకు అధిపతిగా ఉంటున్నారు. ఆయన పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ క్లీన్ ఇమేజ్ సంపాదించుకున్నారు. హేమ మాలిని మధుర, బృందావన్‌లలో పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించారు. ఆమె శ్రీ కృష్ణ భక్తురాలిగా పేరొందారు. అయితే యమునా నది శుద్దీకరణ, పారిశ్రామిక అభివృద్ధి తదితర స్థానిక సమస్యలను పరిష్కరించడంలో ఆమె విఫలమయ్యారని స్థానికులు ఆరోపిస్తుంటారు. కాగా 2014లో హేమమాలిని చేతిలో ఓడిపోయిన ఆర్ఎల్డీకి నేత జయంత్ చౌదరి ఇప్పుడు ఎన్డీఏతో పొత్తు కారణంగా ఆమెకు మద్దతుగా నిలిచారు. ఏప్రిల్ 26న మధురలో రెండో దశలో ఓటింగ్ జరగనుంది. -
ఆమె డ్రీమ్ గర్ల్ మాత్రమే కాదు, నాట్య మయూరి కూడా..! (ఫోటోలు)
-
మధుర సీటుపై ఎన్డీఏ మల్లగుల్లాలు? హేమా మాలినికి మొండి చెయ్యి?
ఉత్తరప్రదేశ్‌లోని మధుర లోక్‌సభ టిక్కెట్ కేటాయింపుపై నేషనల్ డెమెక్రటిక్ అలయన్స్(ఎన్డీఏ) మల్లగులల్లాలు పడుతోంది. రాష్ట్రీయ లోక్‌దళ్ ఎన్డీఏలో చేరుతుందనే చర్చల నడుమ మధుర లోక్‌సభ సీటు కేటాయింపుపై ఆసక్తికర చర్చ ప్రారంభమయ్యింది. తాజాగా మధుర ఎంపీ హేమ మాలిని తాను మథుర నుండి మాత్రమే ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. కాగా ఆర్ఎల్డీ అధినేత జయంత్ చౌదరి ‘ఇండియా’ కూటమిని వీడి ఎన్డిఎలో చేరుతారనే చర్చ ప్రారంభమైనప్పటి నుండి, బీజేపీ- ఆర్ఎల్డీ మధ్య సీట్ల కేటాయింపుపై పలు ఊహాగానాలు ఊపందుకున్నాయి. మధుర సీటు జయంత్ చౌదరి పార్టీకి దక్కవచ్చనే వాదన బలంగా వినిపిస్తోంది. జయంత్ చౌదరి 2009లో తొలిసారిగా మధుర నుంచి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అయితే గత రెండు ఎన్నికల్లో బీజేపీ సీనియర్ నాయకురాలు, నటి హేమమాలిని ఈ స్థానం నుంచి గెలుపొందారు. కాగా తాజాగా మధుర వచ్చిన హేమమాలిని ఆకాశవాణి ప్రసారం చేస్తున్న ప్రధానమంత్రి ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని స్థానిక బీజేపీ నేతల మధ్య కూర్చుని విన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనను పార్టీ ఆదేశిస్తే మథుర నుంచి పోటీ చేస్తానని తెలిపారు. -
12 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకున్న హీరోయిన్.. కారణమేంటి?
ప్రముఖ హీరోయిన్ హేమమాలిని కూతురు ఈషా డియోల్ విడాకులు తీసుకుంది. తల్లి అడుగుజాడల్లోనే ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె నటిగా పలు సినిమాల్లో కథానాయికగా చేసింది. మధ్యలో పెళ్లితో కాస్త గ్యాప్ ఇచ్చింది. ఆ తర్వాత రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం సినిమాలు చేయడం తగ్గించినప్పటికీ.. ఓటీటీల్లో నటిస్తోంది. అలాంటిది ఈమె ఇప్పుడు విడాకులు తీసుకుందనే విషయం చర్చనీయాంశంగా మారిపోయింది. (ఇదీ చదవండి: ఇన్నాళ్లకు ఓటీటీలోకి వచ్చేస్తున్న 'ద కేరళ స్టోరీ'.. రిలీజ్ డేట్ ఫిక్స్) బాలీవుడ్ టాప్ జోడీ ధర్మేంద్ర-హేమమాలినిల పెద్ద కూతురు ఈషా డియోల్. 21 ఏళ్ల వయసులోనే అంటే 2002లోనే 'కోయి మేరే దిల్ సే పూచే' అనే సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. 2008వరకు దాదాపు ఆరేళ్లలో 30కి సినిమాల్లో నటించింది. ఆ తర్వాత కాస్త స్పీడ్ తగ్గించింది. 2012లో భరత్ తక్తానీని పెళ్లి చేసుకుని ఓ మూడేళ్లు నటనకు బ్రేక్ ఇచ్చింది. ఈషా-భరత్ దంపతులకు 2017లో అమ్మాయి పుట్టగా, 2019లో అబ్బాయి పుట్టాడు. ఏమైందో ఏమో గానీ గత కొన్నాళ్ల నుంచి ఈషా డియోల్, భర్త నుంచి విడాకులు తీసుకోనుందనే రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు వాటిని నిజం చేస్తూ వీళ్లిద్దరూ ప్రకటన ఇచ్చారు. పరస్పర అంగీకారంతో విడిపోతున్నామని, పిల్లలు మాత్రం తమకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకొచ్చారు. అయితే విడిపోవడానికి కారణం ఏంటనేది మాత్రం బయటకు చెప్పలేదు. (ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.. ఇప్పుడేమో ఇలా?) -
Hema Malini As Sita Pics: అయోధ్యలో ‘సీత’గా ఆకట్టుకున్న హేమా మాలిని
-
అయోధ్యలో నటి హేమమాలిని నృత్య ప్రదర్శన!
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. జనవరి 22న రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. ఈ నేపధ్యంలోనే జగద్గురు రామానందాచార్య స్వామి రామభద్రాచార్య అమృత మహోత్సవం అయోధ్యలో జనవరి 14 నుండి జనవరి 22 వరకు జరగనుంది. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని సహా పలువురు కళాకారులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో హేమమాలిని తన నృత్య ప్రదర్శను ఇవ్వనున్నారు. ఈ సంగతిని ఆమె ఒక వీడియో సందేశం ద్వారా తెలియజేశారు. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ రామ మందిర ప్రతిష్ఠాపన సమయంలో నేను అయోధ్యకు వెళ్తున్నాను. జనవరి 22న శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపనతో అక్కడ ఒక భవ్యమైన ఆలయాన్ని ప్రధాని మోదీ ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. జనవరి 17న అయోధ్యలో జరిగే స్వామి రామభద్రాచార్యుల అమృత మహోత్సవ కార్యక్రమంలో రామాయణం ఆధారంగా ఉండే నృత్యరూపకాలన్ని ప్రదర్శించే అవకాశం తనకు లభించిందని పేర్కొన్నారు. కాగా అయోధ్యలో ఈరోజు (జనవరి 14) నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. మాలినీ అవస్తి మొదటి రోజు కార్యక్రమంలో తన ప్రతిభను ప్రదర్శించనున్నారు. జనవరి 22న జరిగే రామాలయ ప్రారంభోత్సవానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనవరి 22 మధ్యాహ్నం రామాలయంలోని గర్భగుడిలో రామ్‌లల్లాను ప్రతిష్టించాలని నిర్ణయించింది. రాముడి జన్మస్థలమైన అయోధ్య దేశ ప్రజలకు ఆధ్యాత్మిక కేంద్రంగా మారనుంది. -
మీతో సెల్ఫీలు దిగడానికే వచ్చానా?: హీరోయిన్ సీరియస్
తారలు కనిపిస్తే చాలు ఫోటోలు, సెల్ఫీలంటూ వెంటపడుతుంటారు జనాలు. కెమెరామన్లయితే వారిని తమ కెమెరాల్లో బంధించాలని తెగ ఉవ్విళ్లూరుతుంటారు. ఈ క్రమంలో సెలబ్రిటీలు మేకప్‌తో ఉన్నా, లేకపోయినా.. ఏదైనా హడావుడిలో ఉన్నా, తాపీగా ఉన్నా.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తమ కెమెరాలు క్లిక్‌మనిపిస్తూనే ఉంటారు. అందరు సెలబ్రిటీలు సహనంగా ఫోటోలకు, సెల్ఫీలకు రెడీగా ఉండరు. కొందరు చిరాకుతో వారిని పట్టించుకోకుండా వెళ్లిపోతుంటారు కూడా! తాజాగా సీనియర్ హీరోయిన్ హేమమాలిని కూడా ఇదే చేసింది. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో హీరోయిన్ ప్రముఖ గేయ రచయిత గుల్జర్ బయోగ్రఫీ 'గుల్జార్ సాబ్: హజార్ రహే మడ్ కే దేఖిన్' అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి హేమమాలిని హాజరైంది. అయితే ఈ కార్యక్రమంలో గుంభనంగా కనిపించింది నటి. ఓ అభిమాని సెల్ఫీ ఇవ్వమని అడగ్గా నీకు సెల్ఫీలు ఇవ్వడానికి రాలేదిక్కడికి అని ఆగ్రహంగా బదులిచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 'సెల్ఫీ అడిగినందుకు ఇంత పొగరెందుకో..', 'జయా బచ్చన్‌లాగే ఈమెకు కూడా జనాలు కనబడితే నచ్చదేమో..' అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈమధ్యే బర్త్‌డే పార్టీ కాగా హేమమాలిని ఇటీవలే 75వ పడిలోకి అడుగుపెట్టింది. తనతో పాటు హీరోహీరోయిన్లుగా రాణించిన అందరినీ బర్త్‌డే వేడుకలకు పిలిచి పార్టీ చేసుకుంది. ఈ పార్టీకి జితేంద్ర, జయా బచ్చన్, షబానా అజ్మీ, పద్మిని కొల్హాపూర్ తదితరులు మెరిశారు. అలాగే డిసెంబర్లో జరిగిన ధర్మేంద్ర 88వ బర్త్‌డే ఫంక్షన్లోనూ హేమమాలిని స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. సోషల్ మీడియాలోనూ 'ప్రియమైన జీవిత భాగస్వామి... నువ్వు నాకెంతో స్పెషల్..' అంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. కాగా హేమమాలిని చివరగా 2020లో వచ్చిన 'సిమ్లా మిర్చి' మూవీలో కనిపించింది. View this post on Instagram A post shared by Voompla (@voompla) చదవండి: అందుకే నా కోడలు మాజీ ప్రియుడిని కలవరిస్తోంది: నటి అత్త -
భర్తకు దూరంగా ఉండటంపై మొదటిసారి స్పందించిన హేమమాలిని
బీటౌన్ సీనియర్ నటుడు ధర్మేంద్ర హేమమాలినిని వివాహం చేసుకున్నప్పటికీ, తన మొదటి భార్య నుంచి ధర్మేంద్ర విడాకులు తీసుకోలేదు. దీంతో తన కుమార్తెలు ఈషా, అహ్నాలతో కలిసి ప్రస్తుతం హేమ ఉంటున్నారు. వీరిద్దరి వివాహం 1980లోనే అయింది. కానీ వేర్వేరు ఇళ్లలో ఉంటున్న విషయం తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన భర్త నుంచి వేరుగా ఉండటంపై హేమమాలిని స్పందించారు. (ఇదీ చదవండి: పవన్ 'బ్రో' విషయంలో సీరియస్ అయిన థమన్..!) మొదటి భార్య ప్రకాశ్ కౌర్‌తో ధర్మేంద్ర ఇంటర్వ్యూయర్ ఆమెను ఫెమినిస్ట్ ఐకాన్‌గా పరిగణిస్తూ.. మీరు ఒంటరిగా ఉండేందుకు ఇది కూడా ఒక కారణమనే చెప్పవచ్చా అనే ప్రశ్నకు హేమా ఇలా చెప్పుకొచ్చారు. 'నేను స్త్రీవాదానికి చిహ్నమా..? (నవ్వుతూ). ఎవరూ భర్తకు దూరంగా ఉండాలని కోరుకోరు. జీవితం ఏదిస్తుందో అది జరుగుతుంది. దానిని మనం స్వీకరించాల్సిందే. ప్రతి స్త్రీకి భర్త, పిల్లలు కావాలని కోరుకుంటుంది. కానీ ఎక్కడో ఆ లెక్కలు తప్పుతాయి. లేకపోతే, ఎవరికీ తమ జీవితాన్ని ఇలా గడపాలని అనిపించదు. అని హెమ తెలిపారు. 'బాధపడటం లేదు' 'భర్తకు దూరంగా ఉండటంలో నేను బాధపడటం లేదు. నాతో నేను సంతోషంగా ఉన్నాను. నాకు నా ఇద్దరు పిల్లలు ఉన్నారు, నేను వారిని చాలా బాగా పెంచాను. అయితే, అతను (ధర్మేంద్ర) ఎప్పుడూ అక్కడే ఉండేవాడు. ప్రతిచోటా. పిల్లలకు తొందరగా పెళ్లి చేయాలి అని భయపడేవాడు. నేను ఇది జరుగుతుంది అనే చెప్పేదానిని. సరైన సమయం వచ్చినప్పుడు, సరైన వ్యక్తి వస్తాడు అని ఆయనకు ధైర్యం చెప్పేదాన్ని. భగవంతుడు, గురువుల ఆశీర్వాదంతో నా పిల్లల ఇద్దరి పెళ్లిల్లు అయిపోయాయి. మేమిద్దరం అనుకున్నది ప్రతిదీ జరిగింది.' అని హేమ అన్నారు. రెండో భార్య హేమమాలిని, పిల్లలతో ధర్మేంద్ర హేమమాలినిని ధర్మేంద్ర మొదటిసారి కలిసినప్పుడు ప్రకాష్ కౌర్‌ను వివాహం చేసుకున్నాడు. ధర్మేంద్ర, ప్రకాష్ కౌర్‌లకు ఇద్దరు కుమారులు - సన్నీ డియోల్,బాబీ డియోల్‌తో పాటు ఇద్దరు కుమార్తెలు అజీత, విజేత ఉన్నారు. ఇటీవల, ధరమేంద్ర మనవడు కరణ్ డియోల్ వివాహం జరిగింది. హేమమాలిని కుటుంబం నుంచి ఎవరూ ఆ పెళ్లికి హాజరు కాలేదు. దీంతో భార్య, కుమార్తెల కోసం ఒక భావోద్వేగ పోస్ట్ కూడా ధర్మేంద్ర రాశారు. (ఇదీ చదవండి: ఆ హీరోయిన్ వల్లే నాకు విడాకులు.. ఇప్పటికీ తనను క్షమించను: సింగర్) -
నా చీర పిన్ తీసేయమని డైరెక్టర్ అడిగారు: సీనియర్ హీరోయిన్
సీనియర్ నటి, రాజకీయవేత్త హేమమాలిని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అప్పట్లోనే బాలీవుడ్లో స్టార్ హీరోలతో నటించింది. 1960లో సినీ రంగంలో అడుగు పెట్టిన హేమమాలిని తన కెరీర్లో వందకు పైగా చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత 2004లో భాజపాలో చేరిన ఆమె ప్రస్తుతం మథుర నియోజకవర్గం ఎంపీగా కొనసాగుతున్నారు. సినిమాల్లో నటిస్తూనే ధర్మంద్రను ప్రేమను వివాహాం చేసుకున్నారామె. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తన కెరీర్‌కు సంబంధించి పలు ఆసక్తకర విషయాలను పంచుకున్నారు. (ఇది చదవండి: రూ.500కోసం హీరోహీరోయిన్ల వీడియో లీక్ చేశారు! ) హేమ మాలిని వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను తన అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటూనే ఉన్నారు. గతంలో ఓ డైరెక్టర్ తన చీరకు ఉన్న పిన్ తీయాలని కోరాడని వెల్లడించింది. ఆ సమయంలో అందరూ షాక్‌కు గురయ్యారు. ఆ రోజుల్లో ఫిల్మ్ మేకింగ్ ఎలా అభివృద్ధి చెందిందో.. అదే ఈ రోజు అత్యంత కష్టతరమైన ప్రక్రియగా మారిందని హేమ ప్రస్తావించారు. తాను మళ్లీ సినిమాల్లో పని చేస్తానని అనుకోవడం లేదన్నారు. హేమ మాట్లాడుతూ.. 'డైరెక్టర్ ఏదో ఒక సన్నివేశాన్ని చిత్రీకరించాలనుకున్నాడు. నేను ఎప్పుడూ నా చీరపై పిన్ను పెట్టుకుంటాను. నన్ను చీరకు ఉన్న పిన్ తీసేయమని అడిగారు. కానీ నేను మాత్రం చీర కింద పడిపోతుంది అన్నా. మాకు అదే కావాలి అన్నారు.' అని హేమ గుర్తు చేసుకున్నారు. అలాగే 'సత్యం శివం సుందరం' సినిమా ఎప్పటికీ చేయనని తెలిసినా.. రాజ్ కపూర్ తనని ఎలా సంప్రదించాడో కూడా ఆమె వెల్లడించింది. హేమకు ఇద్దరు పిల్లలు ఈషా, అహానా ఉన్నారు. (ఇది చదవండి: 'బిగ్ డాడీ' పేరుతో వచ్చేస్తున్న ఘోస్ట్ టీజర్) -
భార్య కోసం ఏకంగా ఆస్పత్రినే బుక్ చేసిన స్టార్ హీరో!
బాలీవుడ్ సీనియర్ నటి హేమమాలిని 1970ల్లో బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత హేమ ధర్మేంద్రతో కలిసి 1970లో వారి తుమ్ హసీన్ మెయిన్ జవాన్ చిత్రంలోమొదటిసారి నటించారు. ఈ సినిమాతోనే హేమమాలిని, ధర్మేంద్ర మధ్య ప్రేమ చిగురించింది. కానీ అప్పటికే ధర్మేంద్రకు పెళ్లై.. పిల్లలు కూడా ఉన్నారు. కానీ ధర్మేంద్ర, హేమ మాలిని 1980లో వివాహం చేసుకున్నారు. (ఇది చదవండి: బిగ్‌బాస్ హౌస్‌లో ముద్దులాట.. తప్పు మీది.. నన్నెందుకు పంపించేశారు?) అయితే ఈ జంటకు మొదట ఈషా డియోల్ జన్మించింది. అయితే పాప పుట్టినప్పుడు జరిగిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. హేమమాలిని డెలివరీ కోసం ఏకంగా ఆస్పత్రినే బుక్ చేసుకున్నారట. దీనికి సంబంధించిన పాత వీడియో ప్రస్తుతం వైరలవుతోంది. అయితే ఈ విషయాన్ని హేమ మాలిని స్నేహితుల్లొ ఒకరు వివరించారు. హేమ ప్రసవించిన విషయం ఎవరికీ తెలియకుండా ఉండేందుకు ఇలా చేశారని చెప్పుకొచ్చారు. ఈషా పుట్టడానికి ధర్మేంద్ర 100 గదుల ఆసుపత్రిని ఎందుకు బుక్ చేయాల్సి వచ్చిందో అప్పుడు చాలామందికి అర్థం కాలేదని వెల్లడించారు. ఓ షోలో పాల్గొన్న హేమమాలినికి ఆమె స్నేహితురాలు నీతూ కోహ్లి ఈ సంఘటనను గురించి అడిగారు. అయితే దీనిపై కొందరు భిన్నంగా స్పందించారు. దీనివల్ల ఇతరులు ఇబ్బందులు పడతారని తెలియదా అని ప్రశ్నించారు. ఇలాంటి పనులు అనవసరమైనవని మండపడుతున్నారు. మరికొందరేమో ఆస్పత్రికి బదులు ఒక ఫ్లోర్ బుక్ చేసుకోవచ్చు కదా అని సూచిస్తున్నారు. ధర్మేంద్ర, హేమ లవ్ స్టోరీ కాగా.. హేమ ధర్మేంద్ర 1970లో వారి తుమ్ హసీన్ మెయిన్ జవాన్ చిత్రంలో మొదటిసారి నటించారు. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న జంట 1980లో వివాహం చేసుకున్నారు. హేమ తల్లిదండ్రులు ధర్మేంద్రను వివాహం చేసుకోవడాన్ని వ్యతిరేకించారు. ఈ జంటకు ఈషా, అహానా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అంతకుముందు 1954లో ప్రకాశ్ కౌర్‌ను వివాహం చేసుకోగా.. నలుగురు పిల్లలు జన్మించారు. (ఇది చదవండి: అమ్మకు బ్రెయిన్ క్యాన్సర్.. నన్ను కూడా గుర్తుపట్టలేదు: యాంకర్) -
ఇంట్లో పెళ్లికి డుమ్మా కొట్టిన భార్యాపిల్లలు.. సోషల్ మీడియాలో నటుడి భావోద్వేగం
బాలీవుడ్ నటదిగ్గజం ధర్మేంద్ర మనవడు కరణ్ డియోల్ ఓ ఇండివాడైన సంగతి తెలిసిందే! దృష ఆచార్యతో అతడు ఏడడుగులు నడిచాడు. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. అయితే ఈ పెళ్లికి ధర్మేంద్ర భార్యాకూతురు డుమ్మా కొట్టారు. అదేంటి? కుటుంబంలోని వ్యక్తి పెళ్లికి రాకపోవడం ఏంటనుకుంటున్నారా? అయితే ముందు ధర్మేంద్ర కుటుంబం గురించి తెలుసుకోవాల్సిందే! మొదటి భార్య ప్రకాశ్ కౌర్‌తో ధర్మేంద్ర మొదటి భార్య.. నలుగురు సంతానం ధర్మేంద్రకు ఇద్దరు భార్యలు. అతడు 19 ఏళ్ల వయసులోనే ప్రకాశ్ కౌర్‌ను పెళ్లాడాడు. వీరికి సన్నీ డియోల్, బాబీ డియోల్, విజేత, అజీత అని నలుగురు సంతానం. ఇటీవల పెళ్లి చేసుకున్న కరణ్.. సన్నీ డియోల్ తనయుడు! సుమారు 70 ఏళ్లుగా ధర్మేంద్ర- ప్రకాశ్ కౌర్ కలిసి జీవిస్తున్నారు. ఇకపోతే అతడికి పెళ్లైన విషయం తెలిసి కూడా నటి హేమమాలిని ధర్మేంద్రను ప్రేమించి పెళ్లాడింది. ఈ జంటకు ఈషా, అహానా సంతానం. వీరిని సన్నీ డియోల్.. కరణ్ పెళ్లికి రావాలని ఆహ్వానించినప్పటికీ ఈ కుటుంబం మాత్రం వేడుకకు వచ్చేందుకు మొగ్గు చూపలేదు. పెళ్లి పందిట్లో హేమమాలిని, ఆమె కూతుర్లు ఎక్కడా కనిపించనేలేదు. ధర్మేంద్ర పిలవకపోవడంతోనే వాళ్లు రాలేదని ప్రచారం జరిగింది. రెండో భార్య హేమమాలిని, పిల్లలతో ధర్మేంద్ర పిలవనందుకే క్షమాపణలు! ఈ క్రమంలో ధర్మేంద్ర సోషల్ మీడియాలో భావోద్వేగానికి లోనయ్యాడు. 'హేమ, నా డార్లింగ్ పిల్లలు ఇషా, అహానా.. అల్లుళ్లు తక్తానీ, వోహ్రా.. మిమ్మల్ని నేను ఎంతగానో గౌరవిస్తున్నాను, మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. వయసు పైబడటం, అనారోగ్యం నాకో విషయాన్ని గుర్తు చేశాయి. నేను మీతో వ్యక్తిగతంగా మాట్లాడాల్సింది. కానీ..' అంటూ వాక్యాన్ని సగంలోనే ఆపేస్తూ క్షమించండి అన్నట్లుగా చేతులు జోడించిన ఎమోజీని జత చేస్తూ పోస్ట్ పెట్టాడు. View this post on Instagram A post shared by Dharmendra Deol (@aapkadharam) చదవండి: రెండో భర్తకు విడాకులు.. కారణాలు అనవసరం అంటున్న నటి -
హీరోలందరికి ఎఫైర్లున్నాయి.. నా భర్తను మాత్రమే ఎందుకంటారు?
అలనాటి బాలీవుడ్ నటుడు ధర్మేంద్రకు పాత తరంలో చెప్పలేనంత ఫ్యాన్ బేస్ ఉన్న హీరో.. ఇప్పటికీ తను నటించిన షోలే(1975) సినిమా భారతీయ సినీ చరిత్రలో ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికి ఈ సినిమా ఏదో ఒక చోట ఆడుతూనే ఉంది. దీంతో నేటి తరం వారికి కూడా ఆయనంటే అభిమానం. (ఇదీ చదవండి: అభిమాని చేసిన పనికి భావోద్వేగానికి గురైన తమన్నా) ప్రముఖ నటి హేమమాలిని ధర్మేంద్ర జీవితంలో అడుగుపెట్టేనాటికే అతడికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. అయినప్పటికీ హేమమాలినితో అతడు ప్రేమలో పడ్డాడు. అటు ఆమె కూడా ధర్మేంద్రను ఎంతగానో ప్రేమించింది. ఈ ప్రేమకు మొదటి పెళ్లి అడ్డవుతుందని అంతా అనుకున్నారు, కానీ వారు మాత్రం అలాంటి భయాలేమీ పెట్టుకోలేదు. 1980లో హేమమాలినిని రెండో పెళ్లి చేసుకుని తన జీవితంలోకి స్వాగతించాడు. కాగా వారికి 1981లో ఇషా డియోల్, 1985లో అహనా డియోల్ జన్మించారు. తాజాగా ఇదే విషయంపై హేమమాలినిని ధర్మేంద్ర పెళ్లి చేసుకోవడంపై మొదటి భార్య ప్రకాష్ కౌర్ సమర్థించింది. హేమమాలిని కూడా ధర్మేంద్రకు సంబంధించిన ఇతర కుటుంబ సభ్యులతో చాలా మర్యాదగానే ప్రవర్తిస్తుందని ప్రకాష్ కౌర్ చెప్పుకొచ్చింది. గతంలో దర్మేంద్రను 'ఉమెనైజర్' అని పలువురు కామెంట్లు చేశారు.. అదే కామెంట్లను ఇప్పుడు కూడా కొందరు చేస్తూ ఉంటారు. అని ప్రకాష్ కౌర్ ఇలా స్పందించింది. (ఇదీ చదవండి: ఆమెకు ఇష్టం లేకున్నా ఎలా పట్టుకుంటావ్.. నటుడిపై ట్రోల్స్) 'నా భర్త మాత్రమే ఎందుకు, ఏ మగాడైనా నాకంటే హేమమాలినినే ఇష్టపడతారు. ఇండస్ట్రీలో సగం మంది ఇదే పని చేస్తున్నప్పుడు నా భర్తను ఉమెనైజర్ అని పిలవడానికి ఎవరైనా ఎంత ధైర్యం చేస్తారు? హీరోలందరూ ఎఫైర్లు పెట్టుకుని రెండో పెళ్లి చేసుకుంటున్నారు. అతను నాకు మంచి భర్త కాకపోవచ్చు, కానీ అతను ఖచ్చితంగా ఉత్తమ తండ్రి. అతని పిల్లలు అతన్ని చాలా ప్రేమిస్తారు. అతను వారిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు.' అని చెప్పింది. ధర్మేంద్ర మొదటి భార్య పిల్లలు బాలీవుడ్లో టాప్ హీరోలైన సన్నీ డియోల్,బాబీ డియోల్ అని తెలిసిందే. కాగా వారికి విజేత,అజీత అనే సోదరీమణుల ఉన్నారు. -
బ్లాక్ అండ్ వైట్ డేస్... ఎంత బంగారమో!
కేబుల్ ఛానల్స్, ఆన్లైన్ స్ట్రీమింగ్ సర్వీసులకు ముందు వినోదానికి దూరదర్శన్ పెద్ద దిక్కు. దూరదర్శన్‌కు, ప్రేక్షకులకు మధ్య దూరం పెరిగినా ఆ నాస్టాల్జియాకు మాత్రం దూరం కాలేదు. దీనికి ఉదాహరణ వైరల్ అయిన ఈ వీడియో. ‘అల్బెల’ సినిమాలోని ‘షోల జో బడ్కే’ పాటను హార్మోనియం వాయిస్తూ సి.రామచంద్ర, కవితా కృష్ణమూర్తితో కలిసి పాడుతున్న బ్లాక్ అండ్ వైట్‌కు సంబంధించిన వీడియోను నటి హేమమాలిని పరిచయం చేస్తున్న దూరదర్శన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒకరకంగా చెప్పాలంటే ఈ వీడియో నెటిజనులను టైమ్‌మిషన్‌లో బ్లాక్ అండ్ వైట్ జమానాలోకి తీసుకువెళ్లింది. ఆరోజుల్లో దూరదర్శన్‌లో తమకు నచ్చిన కార్యక్రమాలతోపాటు ‘మహా... భారత్’ అనే టైటిల్ సాంగ్ వినిపించగానే తాము రెక్కలు కట్టుకొని టీవీల ముందు వాలిన దృశ్యాలను కూడా నెటిజనులు గుర్తుతెచ్చుకున్నారు. ఈ వీడియోను ‘గోల్డ్’ అండ్ ‘ప్యూర్’ అని ఆకాశానికెత్తారు నెటిజనులు. -
క్లాసికల్ డాన్సర్, పద్మభూషణ్ అవార్డు గ్రహిత హఠాన్మరణం
లెజెండరి క్లాసికల్ డాన్సర్, పద్మభూషన్ అవార్డు గ్రహిత కనక్ రెలే(85) హఠాన్మరణం చెందారు. గుండెపోటుతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన ఆమె పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. దీంతో ఆమె మృతికి నటి హేమ మాలిని,సుధచంద్రన్లతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకురాలని ప్రార్థిస్తూ సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. కనక్ రెలే మోహీని అట్టం డాన్స్‌లో ప్రావీణ్యురాలు. చదవండి: కేరళ హైకోర్టులో మోహన్ లాల్‌కు చుక్కెదురు! అంతేకాదు ఆమె నలంద నృత్య కళా మహావిద్యాలయ వ్యవస్థాపకురాలు, ప్రిన్సిపాల్ కూడా. శాస్త్రీయ నృత్యానికి ఆమె అందించిన సేవలకు గానూ భారత ప్రభుత్వం ఆమెను పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులతో సత్కరించింది. జూన్ 11, 1937లో గుజరాత్లో జన్మించిన కనక్ రెలే భారతదేశపు అత్యంత సృజనాత్మక శాస్త్రీయ నృత్యకారులలో ఒకరిగా పేరు పొందారు. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని, పశ్చిమ బెంగాల్‌లోని శాంతినికేతన్‌లోని విశ్వభారతి విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేసిన ఆమె మేనమామ కళలను నెరవేర్చాలని భావించి నాట్యాన్ని నేర్చుకున్నారు. చదవండి: గుడ్ మార్నింగ్ అమెరికా షోలో చరణ్, చిరంజీవి ఏమన్నారంటే! Shocked to hear that Padmabhushan Kanak Rele ji has passed away. A dutiful family person, she was a true visionary, academician & a Mohini Attam performer par excellence. It is a day of great grief to the Rele and Nalanda Parivaar and the classical dance fraternity. Om Shanti 🙏 pic.twitter.com/HDhRFGO7j0 — Hema Malini (@dreamgirlhema) February 22, 2023 -
నా భర్తకు మొదటి భార్య ఉందని ఎప్పుడూ టార్చర్ పెట్టలేదు: నటి
ప్రముఖ నటి హేమమాలిని నటుడు ధర్మేంద్ర జీవితంలో అడుగుపెట్టేనాటికే అతడికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. అయినప్పటికీ హేమమాలినితో అతడు ప్రేమలో పడ్డాడు. అటు ఆమె కూడా ధర్మేంద్రను ఎంతగానో ప్రేమించింది. ఈ ప్రేమకు మొదటి పెళ్లి అడ్డవుతుందని అంతా అనుకున్నారు, కానీ వారు మాత్రం అలాంటి భయాలేమీ పెట్టుకోలేదు. 1980లో హేమమాలినిని రెండో పెళ్లి చేసుకుని తన జీవితంలోకి స్వాగతించాడు. తాజాగా ఓ షోకి హాజరైన ఆమెకు.. ధర్మేంద్ర మొదటి భార్యను చూస్తే అసూయ కలగలేదా? అన్న ప్రశ్న ఎదురైంది. దీనికామె స్పందిస్తూ.. ఏరోజూ నాకు అసూయ పుట్టలేదు. అందుకే నేనిప్పుడు ఇంత సంతోషంగా ఉన్నాను. లవ్‌లో ఉన్నప్పుడు ప్రేమను పంచాలే తప్ప ఇతరత్రా వాటిని ఆశించకూడదు. నువ్వు ప్రేమించే వ్యక్తి నీకు అంతకన్నా ఎక్కువ ప్రేమను పంచుతున్నప్పుడు ఏదో చిన్నచిన్న విషయాల కోసం అతడిని ఎందుకు టార్చర్ చేస్తాం? తను నన్ను బాగా చూసుకున్నాడు కాబట్టే నేనెప్పుడూ బాధపడలేదు, తనపై కోప్పడలేదు, టార్చర్ పెట్టలేదు. అందుకే ఇప్పటికీ మేము ఒకరికొకరం ప్రేమ ఇచ్చిపుచ్చుకుంటున్నాం. మా మధ్యలోకి దేన్నీ దూరనివ్వం. అతడి సమస్యలు నాకు తెలుసు కాబట్టి కొన్నికొన్ని సందర్భాల్లో నేను సర్దుకుపోతాను. మనం ఏదైనా ఇస్తే దానికి రెట్టింపు మనకు లభిస్తుంది. అది ప్రేమేనని నేను నమ్ముతాను. ఆ ప్రేమకు విలువ ఇవ్వాలన్నది నా అభిప్రాయం' అని చెప్పుకొచ్చింది నటి. కాగా ధర్మేంద్ర- హేమమాలినిలకు 1981లో ఇషా డియోల్, 1985లో అహనా డియోల్ జన్మించారు. చదవండి: త్వరగా ఎదిగేందుకు ఇంజక్షన్స్ తీసుకున్న హన్సిక? -
కాపురాలు కూల్చడం మాకు సరదా కాదు: నటి
పచ్చని కుటుంబం చిన్నాభిన్నం కావడానికి ఆడవాళ్లే కారణం కాదంటోంది సీనియర్ నటి అరుణ ఇరానీ. మగవాళ్లే ఇల్లాలికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నారని, కానీ వారిని పక్కనపెట్టి ఇతర మహిళలనే లోకం తప్పుపడుతోందని చెప్పుకొచ్చింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆడవాళ్లు తమ కాపురాలు కూలిపోవడానికి మరో ఆడదే కారణం అని వారిని తిడుతుంటారు. కానీ ఒక్క క్షణం ఆలోచించండి.. మిమ్మల్ని సంతోషంగా ఉంచే బాధ్యత మీ భర్తది కానీ వేరేవాళ్లది ఎలా అవుతుంది? ముందు అతడిని అదుపులో పెట్టండి. కేవలం ఒకరి సంసారాన్ని నాశనం చేయాలన్న ఉద్దేశంతో ఏ అమ్మాయి వివాహేతర సంబంధానికి పూనుకోదు. ఉదాహరణకు హేమమాలినిని తీసుకోండి. ఆమె ధర్మేంద్ర కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాన్న ఉద్దేశంతో అతడిని పెళ్లి చేసుకుందా? కాదు కదా! ఏదో ఒక కాగితం మీద రాసుకున్నదాన్ని బట్టి అతడు నా భర్త, ఆమె నా భార్య అంటుంటారు, కానీ ఆ పేపర్‌కు పెద్ద విలువేమీ ఉండదు. ప్రేమకు ఉన్న సెక్యూరిటీ పెళ్లికి లేదు. ప్రేమ లేనిచోట పెళ్లి చేసుకున్నా వృధానే.. అయినా ఆల్రెడీ పెళ్లైన మగవారితో మళ్లీ ఏడడుగులు నడవడం అంత సులువైన విషయం కాదు. అర్ధరాత్రి నా బిడ్డకేదైనా అయితే ఆ మనిషికి నేను ఫోన్ చేయలేను. అలాంటి బాధలు పడటం ఎందుకని పిల్లలు వద్దనుకున్నాను' అని చెప్పుకొచ్చింది. కాగా అరుణ ఇరానీ 1990లో ఫిలింమేకర్ కుకు కోహ్లిని పెళ్లాడింది. అప్పటికే అతడికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. చదవండి: రెండో పెళ్లికి రెడీ అయిన నటి, కొడుకుతో కలిసి విదేశాలకు -
Beauty: మొహానికి అరోమా ఆయిల్‌తో మసాజ్! 74 ఏళ్ల వయసులోనూ అందంగా..
Hema Malini- Beauty Tips In Telugu: అలనాటి బాలీవుడ్ డ్రీమ్‌గర్ల్ హేమమాలిని.. డెబ్బై పదుల వయసులోనూ ఆకర్షణీయమైన రూపంతో మెరిసిపోతున్నారు. 70వ దశకంలో బీ-టౌన్ ప్రేక్షకులను తన అందం, అభినయంతో మంత్రముగ్ధులను చేసిన ఆమె.. ఇప్పటికీ ‘తార’లా వెలిగిపోతున్నారు. అయితే, 74 ఏళ్ల వయసులోనూ తను ఇలా కనిపించడానికి కారణం అమ్మ చెప్పిన చిట్కాలే అంటూ తన బ్యూటీ సీక్రెట్‌ను ఇటీవల రివీల్ చేశారామె. ఆవిడ ఏం చెప్పారంటే.. ‘‘రోజూ ఉదయమే కొబ్బరి నీళ్లు తాగుతాను. వీలైనంత ఎక్కువగా మంచి నీళ్లూ తాగుతాను. అలాగే భోజనంలో పెరుగు తప్పకుండా ఉండాల్సిందే. వీటివల్ల చర్మం తేమను కోల్పోకుండా తాజాగా.. కాంతిమంతంగా ఉంటుంది. ఇవన్నీ మా అమ్మ చెప్పిన చిట్కాలే. ఈ చిట్కాలతోపాటు రోజూ క్రమం తప్పకుండా డాన్స్, యోగా, సైక్లింగ్ చేస్తా. మొహానికి అరోమా ఆయిల్‌తో మసాజ్ చేసుకుంటా. ఇది మొహం మీది ముడతలను మాయం చేసి చర్మాన్ని మృదువుగా.. యంగ్‌గా ఉంచుతుంది!’’ అని హేమమాలిని పేర్కొన్నారు. సినీ రంగం నుంచి రాజకీయాల్లో ప్రవేశించిన హేమమాలిని ప్రస్తుతం బీజేపీ నుంచి ఎంపీగా ఉన్నారు. చదవండి: Menthi Podi: షుగర్ పేషెంట్లు రాత్రి వేళ మెంతి గింజల్ని పాలలో ఉడకబెట్టి తాగితే.. Black Circles Under Eyes: పచ్చిపాలు.. కొబ్బరి నూనె! ఇలా చేస్తే కళ్ల చుట్టూ ఉన్న నల్లని వలయాలు మాయం -
నాగదోషం ఉన్నట్లు నమ్మించి.. పలుమార్లు అత్యాచారం
తిరువళ్లూరు: విద్యార్థిని ఆత్మహత్యకు ఆశ్రమ నిర్వాహకుడు మునస్వామే కారణం అని.. సీబీసీఐడీ అధికారులు నిర్ధారించారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా చెంబేడు గ్రామానికి చెందిన హేమమాలిని(22) ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతోంది. అనారోగ్యానికి గురికావడంతో బంధువులు 2021లో వెల్లాత్తుకోటలోని ఓ ఆశ్రమానికి ఆమెను తీసుకెళ్లారు. యువతిని పరిశీలించిన ఆశ్రమ నిర్వాహకుడు మునస్వామి నాగదోషం ఉన్నట్లు నమ్మించి తరచూ యువతిని ఆశ్రమానికి రప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 14న మళ్లీ అనారోగ్యానికి గురి కావడంతో యువతి బంధువులు ఆశ్రమానికి తీసు కెళ్లారు. రెండు రోజుల తరువాత హేమామాలిని అక్కడ ఆత్మహత్యకు యత్నించింది. తిరువళ్లూరు వైద్యశాలకు తరలించగా అక్కడ చిక్సిత ఫలించక మృతి చెందింది. యువతి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ.. పలు సంఘాలు ఆందోళన చేపట్టడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే నిందితుడు మునస్వామిని మాత్రం అరెస్టు చేయలేదు. ఈ నేపథ్యంలో ఈ కేసును సీబీసీఐడీకి మార్చాలని ఆందోళనలు ఉద్ధృమయ్యాయి. దీంతో ప్రభుత్వం ఈ కేసును సీబీసీఐడీకి అప్పగించింది. కేసును విచారించిన సీబీసీఐడీ పోలీసులు యువతిపై ఆశ్రమ నిర్వాహకుడు మునస్వామి పలుమార్లు అత్యాచారం చేసాడని, తరచూ తనకు లొంగాలని యువతిని వేదించడం వల్లే మనస్థాపం చెంది హేమామాలిని ఆత్మహత్య చేసుకున్నట్టు నిర్ధారించారు. అనంతరం ఆదివారం అర్ధరాత్రి ఆశ్రమ నిర్వాహకుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. చదవండి: (14 ఏళ్ల బాలిక.. 40 ఏళ్ల వ్యక్తితో నిశ్చితార్థం) -
‘యుద్ధాన్ని ఆపేందుకు ప్రతి ఒక్కరూ ప్రధాని మోదీ సాయాన్ని కోరారు’
Everyone Wants PM Modi's Help: ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం బుల్లియా ప్రచార ర్యాలీలో బాలీవుడ్ నటి బీజేపీ ఎంపీ హేమా మాలిని ఉక్రెయిన్ యుద్ధంలో ప్రతి ఒక్కరూ మోదీ జీ మీరు జోక్యం చేసుకోండి అని కోరారు అని చెప్పారు. అంతేకాదు ప్రతి ఒక్కరూ ఆయన్ని అభ్యర్థించారంటేనే నిజంగా ప్రపంచం ఆయనకు ఎంతగా గౌరవం ఇస్తుందో తెలుస్తోందన్నారు. పైగా ఇది మనకు చాలా గర్వకారణం అని ప్రశంసించారు. ఆయన తనకంటూ ఒక మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకోవడమే కాక ప్రపంచమే ఆశ్చర్యపోయేలా దేశాన్ని అభివృద్ధి చేశారని కొనియాడారు. అంతేకాదు ఆ ప్రచారా ర్యాలీ మొత్తం డబుల్ ఇంజన్‌కి సర్కార్ నినాదం చుట్టూ కేంద్రీకృతమై ఉంది. ఆమె ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ను మాత్రమే కాకుండా ప్రధాన మంత్రి నాయకత్వాన్ని సైతం ప్రశంసించారు. గత కొన్ని నెలలుగా బీజేపీ చేసిన సోషల్ మీడియా ప్రచారాల్లో ప్రపంచ నాయకుడిగా పీఎం మోదీ ఔన్యత్యాన్ని గురించి చాటి చెప్పిందన్నారు. ఈ మేరకు మోదీ గురువారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కి డయల్ చేసి, "తక్షణ హింసను నిలిపివేయాలని" విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ నుంచి తమ పౌరులు సురక్షితంగా వచ్చేందుకే భారత్ అత్యధిక ప్రాముఖ్యతను ఇస్తుందని కూడా నొక్కి చెప్పారని అన్నారు. రష్యా, నాటో సమూహం మధ్య విభేదాలు నిజాయితీతో కూడిన సంభాషణ ద్వారా మాత్రమే పరిష్కారమవుతాయన్న తన దీర్ఘకాల విశ్వాసాన్ని పునరుద్ఘాటించారని చెప్పారు. (చదవండి: ఉక్రెయిన్‌లోని భారత వైద్య విద్యార్థుల అగచాట్లు! కాలినడన పోలాండ్ సరిహద్దులకి పయనం) -
రోడ్లను తన బుగ్గలతో పోల్చిన మంత్రి వ్యాఖ్యలపై స్పందించిన హేమమాలిని
Hema Malini Breaks Silence on MP Comments Comparing Roads to Her Cheeks: తన నియోజక వర్గంలోని రోడ్లు బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ బుగ్గల మాదిరిగా ఉన్నాయంటూ రాజస్తాన్‌కు చెందిన మంత్రి రాజేంద్రసింగ్ గుదా ఝాంజు ఇటీవల చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ క్రమంలో శివసేన సీనియర్ నేత, మహారాష్ట్ర మంత్రి గులాబ్‌రావు పాటిల్ సైతం ఇదే తరహాలో అలనాటి నటి, బీజేపీ ఎంపీ హేమమాలినిపై ఆదివారం షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో మంత్రులు మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాందంటూ పలువురు సినీ, రాజకీయన ప్రముఖులు స్పందిస్తూ తప్పుబుడుతున్నారు. చదవండి: క్రిస్మస్కి ఓటీటీ, థియేటర్లో సందడి చేయబోయే చిత్రాలివే! తాజాగా మహారాష్ట్ర మంత్రి తనపై చేసిన వ్యాఖ్యలపై నటి, ఎంపీ హేమమాలిని స్పందించారు. ఈ సందర్భంగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్, 2013లో అప్పటి యూపీ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల మంత్రి రాజారామ్ పాండె ఇలాగే అన్నారని గుర్తు చేశారు. రోడ్లను నటీమణుల బుగ్గలతో పోల్చే సంప్రదాయాన్ని లాలూ ప్రసాద్ మొదలు పెట్టారన్నారు ఆమె. ఇప్పుడు అదే సాంప్రదాయాన్ని అందరూ అనుసరిస్తున్నారన్నారు. అయితే ఇలాంటి కామెంట్స్ సరైనవి కావని హేమమాలిని పేర్కొన్నారు. సాధారణ ప్రజలు ఇలాంటి కామెంట్స్ చేస్తే పెద్దగా తప్పుపట్టాల్సిన అవసరం లేదు కానీ, గౌరవ హోదాల్లో ఉన్నవాళ్లు, ప్రజాప్రతినిధులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదన్నారు. చదవండి: ఆ నటుడితో స్టార్ హీరో మాజీ భార్య లవ్ ఎఫైర్!, ఇదిగో ఫ్రూఫ్ #WATCH "A trend of such statements was started by Lalu Ji years ago and many people have followed this trend. Such comments are not in a good taste," says BJP MP Hema Malini on Maharashtra minister Gulabrao Patil comparing roads to her cheeks pic.twitter.com/SJg5ZTrbMw — ANI (@ANI) December 20, 2021 ఇక మీ బుగ్గలపై కామెంట్ చేసినందుకు గులాబ్‌రావు పాటిల్‌ను క్షమాపణ కోరుతారా..? అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. తాను ఆ వ్యాఖ్యలను పట్టించుకోనని హేమమాలిని స్పష్టంచేశారు. కాగ 2005లో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ బిహార్ రహదారిని త్వరలో నటి హేమమాలిని బుగ్గల మాదిరిగా మారుస్తామంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం చెలరేగడంతో ఆతర్వాత దీన్ని ఖండించారు. ఇక 2013లో అప్పటి యూపీ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల మంత్రి రాజారామ్ పాండె ప్రతాప్‌గఢ్‌జిల్లాలోని రోడ్లను హేమమాలినీ, మాధురీ దీక్షిత్ చెంపల మాదిరిగా నిర్మిస్తామంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో అప్పటి సీఎం అఖిలేష్ యాదవ్ ఆయనను పదవీ నుంచి తొలగించిన విషయం తెలిసిందే. -
రోడ్లను ఆ నటి బుగ్గలతో పోలుస్తూ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
జైపూర్: సాధారణంగా రాజకీయ నేతలు తమ ప్రసంగాలలో స్థానిక సమస్యలను ఒక్కో రీతిలో పోల్చి వ్యాఖ్యలు చేస్తారు. ఒక్కోసారి ఈ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉంటే మరికొన్నిసార్లు వివాదాస్పదంగాను మారుతుంటాయి. తాజాగా, రాజాస్తాన్ మంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి వివరాలు.. రాజస్తాన్‌కు చెందిన మంత్రి రాజేంద్రసింగ్ గుదా ఝాంజును జిల్లాలోని తన నియోజక వర్గం ఉదయ్‌పూర్‌వాటిలో బహిరంగ సమావేశం నిర్వహించారు. దీనిలో పెద్ద సంఖ్యలో స్థానికులు హజరయ్యారు. ఈ క్రమంలో మంత్రి ప్రసంగిస్తూ.. తన నియోజక వర్గంలోని రోడ్లు బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ బుగ్గల మాదిరిగా ఉన్నాయని అన్నారు. ఈ వ్యాఖ్యలతో అక్కడున్నవారు పెద్దగా నవ్వారు. మంత్రిగారి వ్యాఖ్యలపట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాగా, అశోక్ గెహ్లత్ నూతన మంత్రివర్గ కూర్పులో మూడు రోజుల క్రితం రాజేంద్రసింగ్ గుదాకు సైనిక్ కల్యాణ్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలను అప్పగించారు. ప్రస్తుతం ఈ వివాదాస్పద వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు మంత్రి వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. దీనిపై కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ ప్రియాంకగాంధీ స్పందించాలని కామెంట్లు చేస్తున్నారు. కాగా, రానున్న అసెంబ్లీ ఎన్నికలలో మహిళలకు ప్రాముఖ్యత ఉంటుందని పలుసభల్లో ప్రియాంక గాంధీ తెలిపారు. ఈ నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయా దుమారాన్ని రేపుతున్నాయి. ప్రతిపక్షాలు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో కూడా కొందరు మంత్రులు, నాయకులు ఇదే విధంగా మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2005లో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ బిహార్ రహదారిని త్వరలో నటి హేమమాలిని బుగ్గల మాదిరిగా మారుస్తామని వ్యాఖ్యలు చేశారు. దీనిపై పెద్ద దుమారం చెలరేగడంతో ఆతర్వాత దీన్ని ఖండించారు. తన వ్యాఖ్యలను ప్రతిపక్షాలు కావాలనే వక్రీకరించాయన్నారు. 2013లో అప్పటి యూపీ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల మంత్రి రాజారామ్ పాండె ప్రతాప్‌గఢ్‌జిల్లాలోని రోడ్లను హేమమాలినీ, మాధురీ దీక్షిత్ చెంపల మాదిరిగా నిర్మిస్తామని అన్నారు. దీంతో అప్పటి సీఎం అఖిలేష్ యాదవ్ ఆయనను పదవీ నుంచి తొలగించిన విషయం తెలిసిందే. #WATCH | "Roads should be made like Katrina Kaif's cheeks", said Rajasthan Minister Rajendra Singh Gudha while addressing a public gathering in Jhunjhunu district (23.11) pic.twitter.com/87JfD5cJxV — ANI (@ANI) November 24, 2021 -
అఫ్గానిస్తాన్‌లో ఏం జరుగుతోంది? అలనాటి హీరోయిన్ ఆందోళన
ప్రస్తుతం ఎక్కడ విన్నా అఫ్గానిస్తాన్‌కు సంబంధించిన వార్తలు చర్చనీయాంశంగా మారాయి. సోషల్ మీడియాలతో అంతా అఫ్గాన్ ప్రజల గురించి ఆవేదన చెందుతూ పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. అఫ్గన్ పరిణామాలు ప్రపంచాన్ని ఆవేదనకు గురి చేస్తోంది. తాజాగా ఈ పరిణామాలపై ప్రముఖ నటి, ఎంపీ హేమ మాలిని స్పందించారు. ‘అసలు అఫ్గనిస్తాన్‌లో ఏం జరుగుతోంది’? అని ఆందోళన చెందుతూ ప్రశ్నించారు. ఈ సందర్భంగా తన సినిమాల షూటింగ్ అఫ్గానిస్తాన్‌లో జరిగిన రోజులను ఆమె గుర్తుచేసుకున్నారు. ‘ఒకప్పుడు ఎంతో సంతోషంగా.. శాంతియుతంగా ఉన్న అఫ్గానిస్తాన్‌లో అసలేం జరుగుతోంది? ఇది నిజంగా చాలా బాధకరమైన విషయం. ‘ధర్మాత్మ’ సినిమా షూటింగ్ సమయంలో అఫ్గన్‌లో నాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ సినిమాలో నా పాత్ర మొత్తం ఆ దేశంలోనే షూటింగ్ పూర్తయ్యింది. ఆ సమయంలో నా కుటుంబసభ్యులు అక్కడే ఉన్నారు. సహ నటుడు ఫిరోజ్ ఖాన్ నా సంరక్షణ చూసుకున్నారు.’ అని హేమమాలిని ట్వీట్ చేశారు. అయితే ‘ధర్మాత్మ’ అఫ్గానిస్తాన్‌లో షూటింగ్ చేసుకున్న తొలి బాలీవుడ్ సినిమాగా నిలవడం విశేషం. చదవండి: ‘బుల్లెట్టు బండి’ పాటకు వధువు సూపర్ డ్యాన్స్.. భర్త ఫిదా చదవండి: ‘ట్విటర్ పక్షి’ని మాంచిగా వండి లాగించేసిన కాంగ్రెస్ నాయకులు What is happening to a happy, once peaceful nation, Afghanistan, is truly sad. My great memories of Afghanistan date back to ‘Dharmatma’- I play a gypsy girl & my portion was shot entirely there. Had a great time as my parents were with me and Feroz Khan took good care of us pic.twitter.com/2jrsZJpvQd — Hema Malini (@dreamgirlhema) August 17, 2021 -
నా భర్తను కలిసి ఏడాది దాటిపోయింది: హేమ మాలిని
‘కలసి ఉంటే కలదు సుఖం’ అంటారు. కానీ ఇదే విషయాన్ని సీనియర్ నటి హేమ మాలిని వేరే విధంగా చెబుతున్నారు. దూరంగా ఉంటే క్షేమంగా ఉంటాం అంటున్నారు. భర్త ధర్మేంద్రను హేమ కలసి ఏడాది పైనే అయింది. ఈ ఇద్దరూ దూరం కావడానికి కారణం కరోనా. కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. దీంతో ఎక్కడివాళ్లు అక్కడ ఉండాల్సిన పరిస్థితి. ధర్మేంద్ర, హేమ మాలిని విషయంలో ఇదే జరిగింది. నిజానికి గతేడాది లాక్ డౌన్ నుంచే ధర్మేంద్ర ముంబయ్‌కి దూరంగా ఉన్న ఫామ్‌హౌస్‌లో ఉన్నారు. హేమ ఏమో ముంబయ్‌లో ఉన్నారు. తాజాగా లాక్డౌన్ విధించడంతో ఇద్దరూ ఎక్కడివాళ్లు అక్కడ ఉండిపోయారు. ఈ విషయం గురించి హేమ మాలిని మాట్లాడుతూ –‘‘ప్రస్తుతం ప్రతి ఒక్కరూ భద్రంగా ఉండటం అవసరం. ఇప్పుడు ఒకరినొకరు కలుసుకోవడం కన్నా ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం. ఆయన్ను (ధర్మేంద్ర) మేం కలవడంకన్నా ఆయన ఆరోగ్యంగా ఉండటం మాకు ముఖ్యం. వందేళ్ల మానవ చరిత్రలో ఇంత పెద్ద అంటువ్యాధిని మనం ఇప్పుడే ఎదుర్కొంటున్నాం. సమాజాన్ని కాపాడుకోవాలంటే.. మనం ధైర్యంగా నిలబడాలంటే మనిషికీ మనిషికీ దూరం పాటించాల్సిందే. ఈ త్యాగం చేయాలి’’ అన్నారు. ధర్మేంద్ర వయసు దాదాపు 85. హేమకు 70 ఏళ్లు పైనే. ఈ కరోనా టైమ్‌లో వయసు పైబడినవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణం చేయడం మంచిది కాదు. ఇంటిపట్టునే ఉండాలి. అందుకే ధర్మేంద్ర–హేమ ఇలా దూరంగా ఉంటున్నారు. ఈ ఇద్దరూ 1980లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పటికే ధర్మేంద్రకి పెళ్లయి, ఇద్దరు కుమారులు సన్నీ, బాబీ డియోల్ ఉన్నారు. ధర్మేంద్ర–హేమకు ఇద్దరు కుమార్తెలు ఇషా డియోల్, అహానా డియోల్ ఉన్నారు. -
మా నాన్నను ధర్మేంద్ర ఏడిపించారు..
‘ఒక విదేశీ షూటింగ్‌కు నాతోపాటు మా నాన్న వచ్చారు. ధర్మేంద్రతో పాటలో యాక్ట్ చేయాలి. నాన్నకు అప్పటికే ధర్మేంద్ర నా వెంట పడటం తెలుసు. అందుకని నాన్న ప్రతిసారి మా కారు ధర్మేంద్ర ఎక్కకుండా అడ్డుకునేవారు. అయినా సరే ధర్మేంద్ర మా కారులోనే వస్తానని అనేవారు. నేను బ్యాక్సీట్లో కూచోగానే మా నాన్న వెంటనే డోర్ తీసుకుని నా పక్కన కూచునేవారు. ధర్మేంద్ర చాలా క్లవర్. ఇంకో డోర్ నుంచి ఆయన ఎక్కి నా పక్కన కూచునేవారు. వాళ్లు ఇలా నా కోసం ప్లాన్లు వేయడం సరదాగా అనిపించేది’ అన్నారు హేమమాలిని. 72 సంవత్సరాల హేమమాలిని నేటికి బాలీవుడ్ ‘డ్రీమ్‌గర్ల్’గా ఉన్నారు. అందుకే మొన్నటి ఆదివారం (మార్చి 7) విమెన్స్ డే సందర్భంగా ఇండియన్ ఐడెల్ ఎపిసోడ్‌ను ఆమె పేరున నిర్వహించారు. హేమమాలిని ఆ ఎపిసోడ్‌కు హాజరయ్యి ఆ సందర్భంగా చాలా విశేషాలు చెప్పారు హేమ మాలిని. అంతేకాదు, అందరినీ ఆశ్చర్యపరుస్తూ డాన్స్ చేశారు. ఆమె స్టెప్పులేసిన పాటల్లో ‘షోలే’లోని ‘జబ్ తక్ హై జాన్’ పాట ఒకటి. ‘షోలే’లో ఈ పాట క్లయిమాక్స్ లో వస్తుంది. గబ్బర్ సింగ్ ముందు మండుటెండలో బండరాళ్ల మీద పగిలిన గాజుపెంకులపై డాన్స్ చేస్తుంది హేమ మాలిని, ధరేంద్రను విడిపించుకోవడానికి. ఆ పాట వెనుక ఉన్న విశేషాలను కూడా ఆమె చెప్పారు– ‘ఆ పాట ఇలా ఉంటుందని దర్శకుడు రమేశ్ సిప్పి చెప్పారు. చేద్దాం... కాని షూటింగ్ నవంబర్, డిసెంబర్లో పెట్టుకోండి. అప్పుడు మైసూరు (షూటింగ్ జరుగుతున్న ప్రాంతం) చల్లగా ఉంటుంది అన్నాను. కాని రమేశ్ సిప్పీ వినలేదు. ఏప్రిల్ నెలఖారున షూటింగ్ పెట్టారు. అంత ఎండ లో రాళ్ల మీద డాన్స్ చేయడం ఎలా అనుకున్నాను. మా అమ్మ పాదాలకు ప్రత్యేకమైన సాక్సులు తయారు చేయించింది. అవి వేసుకుంటే కాళ్లు కాలవు.. సాక్సులు వేసుకున్నట్టు తెలియదు కూడా. వాటిని తొడుక్కుంటుంటే రమేశ్ సిప్పీ దూరం నుంచి చూసి ‘వద్దొద్దు్ద అవి వేయకండి’ అని వార్నింగ్ ఇచ్చారు. సరే... రాళ్ల మీద కాసిన్ని నీళ్లైనా పోయండి చల్లబడతాయి అన్నాను. దానికీ ఒప్పుకోలేదు. చివరకు పాటను అలాగే చేశాను. మొత్తం పాట తీయడానికి పది రోజులు పట్టింది. కాని ఫలితం ఎలా ఉందో మీరే చూశారుగా’ అన్నారామె. ‘జానీ మేరా నామ్ సినిమా సమయానికి నేను ఇంకా ఫీల్డుకి కొత్త. ఆ సినిమాలో వాదా తూ నిభాయా... పాట దేవ్ ఆనంద్ గారితో చేయాలి. రోప్ వేలో ఒక చైర్లో దేవ్ ఆనంద్ కూచుంటే ఆయన వొడిలో నేను కూచోవాలి. సరే.. సినిమాల్లో ఇవన్నీ తప్పవు. నేను దేవ్ గారి వొడిలో కూచున్నాక ప్రతిసారీ కరెంటు పోయేది. నేను అలాగే కూచుని ఉండాల్సి వచ్చేది. ఏమిటా అని చూస్తే తర్వాత తెలిసింది... కావాలనే కరెంట్ తీసేస్తున్నారని. ఇలాంటివి కూడా షూటింగ్లలో జరుగుతుంటాయి’ అన్నారామె. తను ఇంట్లో మూడో సంతానమని, తను గర్భంలో ఉండగానే ఈసారి పుట్టేది ఆడపిల్లే.. దానికి హేమ మాలిని అని పేరు పెట్టాలి అని తన తల్లి అనుకుందని ఆమె చెప్పారు. పుట్టక ముందే పేరు రెడీ చేసుకున్న ఆమె పుట్టాక ఆ పేరును డ్రీమ్ గర్ల్ హేమమాలినిగా నిలబెట్టుకున్నారు. -
అమ్మ అనుమతిస్తే ఆమె బయోపిక్‌లో నటిస్తా!
చెన్నై : అమ్మ అనుమతిస్తే ఆమె బయోపిక్‌లో నటించడానికి సిద్ధమని నటి హేమమాలిని కూతురు, బాలీవుడ్ కథానాయకి ఇషాడియోల్ పేర్కొన్నారు. ఈ బ్యూటీ బుధవారం చెన్నైలో సందడి చేశారు. కలర్స్ సంస్థ కొత్తగా ప్రవేశపెట్టిన క్లోమాంటిక్ టెక్నాలజీ వెయిట్ లాస్ అనే ప్రొడక్ట్ పరిచయ కార్యక్రమం చెన్నైలోని ఒక నక్షత్ర హోటల్లో జరిగింది. ఇషాడియోల్ మాట్లాడుతూ క్రోమాటిక్ టెక్నాలజీ విధానం ద్వారా తాను 16 కిలోలు తగ్గానని చెప్పారు. ఆమె విలేకరులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ మాతృభాష తమిళమేనని అన్నారు. చెన్నై అంటే చాలా ఇష్టమని పేర్కొన్నారు. రసం తాగడానికి చెన్నై వస్తుంటానని చెప్పారు. నటుడు సూర్య అంటే చాలా ఇష్టమని తెలిపారు. అవకాశం వస్తే మళ్లీ తమిళంలో నటించడానికి సిద్ధమేనని చెప్పారు. మీ అమ్మ బయోపిక్‌లో నటిస్తారా అన్న ప్రశ్నకు బదులిస్తూ అమ్మ అనుమతిస్తే ఆ చిత్రంలో నటించడానికి సిద్ధమేనని ఇషా డియోల్ చెప్పారు. చదవండి: పెళ్ళిలో అజయ్ దేవ్‌గణ్ డబ్బులు ఆఫర్ చేశాడు! చదవండి: డివిలియర్స్‌పై మనసుపడ్డ షాహిద్ భార్య! -
అప్పట్లోనే రూ. 35 కోట్లు వసూలు చేసిందా సినిమా
ఒక పర్ఫెక్షనిస్ట్ చెక్కిన సినీ శిల్పం... షోలే రమేశ్ సిప్పికి నేడు 74వ జన్మదినం జరుపుకొని 75 లోకి అడుగుపెడుతున్నాడు. ఇంకో నాలుగేళ్లకు షోలే వచ్చి 50 ఏళ్లు అవుతుంది. రమేష్ సిప్పి, షోలే, భారతీయ కమర్షియల్ సినిమా వేరు వేరు కాదు. వాటిని ఒక స్థాయికి తీసుకెళ్లి పెద్ద సినిమాల రథానికి బావుటా కట్టి పరిగెత్తించినవాడు అతడు. సగటు ప్రేక్షకులను గట్టి కథతో రంజింప చేయవచ్చని నమ్మి అతడు తీసి షోలే నేటికీ కోట్లాది ప్రేక్షకులకు ఆరాధ్య చిత్రం. దర్శకుడు రమేశ్ సిప్పి పూనుకోకపోతే, ధైర్యం చేయకపోతే, హ్యూజ్‌గా ఇమేజిన్ చేయకపోతే భారతీయులు గర్వంగా చెప్పుకోవడానికి, ఆరాధించడానికి, పదే పదే చూడటానికి ‘షోలే’ ఉండేది కాదేమో. ‘సుపుత్రా కొంప పీకరా’ అని సామెత. కాని రమేష్ సిప్పీ ‘సుపుత్రా గంపకెత్తరా’ అన్నట్టు తండ్రి జి.పి.సిప్పీ చేత భారీ పెట్టుబడి పెట్టించి, ‘షోలే’ తీయించి దాని మీద తరతరాలు డబ్బు గంపకెత్తేలా చేశాడు. 1975లో మూడు కోట్లతో తీసిన సినిమా అది. కాని ఎంత వసూలు చేసిందో తెలుసా ఆ రోజుల్లో? 35 కోట్లు. అంటే ఇవాళ్టి లెక్కలో 800 కోట్ల రూపాయలు. అదీ ఫస్ట్ రీలీజ్లో. ఆ తర్వాత షోలే సంవత్సరాల తరబడి రీ రిలీజ్ అవుతూనే ఉండింది. కోట్లు సంపాదిస్తూనే ఉండింది. సిప్పీలకు చిల్లర ఖర్చు కావాల్సినప్పుడల్లా షోలే రిలీజ్ చేస్తుంటారన్న జోక్ కూడా ఉంది. రమేశ్ సిప్పి తండ్రి జి.పి.సిప్పిని చూసి సినిమాల్లోకి వచ్చాడు. జావేద్ అఖ్తర్‌లతో స్నేహం కట్టి ‘సీతా ఔర్ గీతా’ తీశాడు. ఆ సినిమా హిట్ అయ్యాక ‘అబ్బాయ్... ఏదైనా పెద్ద సినిమా తీయరా’ అని తండ్రి కోరితే అకిరా కురసావా ‘సెవన్ సమురాయ్’, హిందీలో వచ్చిన ‘మేరా గావ్ మేరా దేశ్’ సినిమాల స్ఫూర్తితో జావేద్ అఖ్తర్‌లతో కలిసి షోలే కథ తయారు చేసుకున్నాడు. ఒక్క వాక్యంలో చెప్పాలంటే ‘దొంగను పట్టుకోవడానికి దొంగలను నియమించడం’ దీని కథ. ఆ దొంగ గబ్బర్ సింగ్, అతణ్ణి పట్టుకునే దొంగలు వీరూ, జయ్. రమేశ్ సిప్పీ షోలే కోసం అంతముందు లేని చాలా మార్పులను సినిమాల్లోకి తెచ్చాడు. సినిమాస్కోప్, సెవెంటి ఎంఎం. స్టీరియోఫొనిక్... ఇవన్నీ ఆయన తప్పనిసరి అనుకున్నాడు. గతంలో బందిపోటు సినిమాలంటే గుహలు, చంబల్ లోయలు, నల్లబట్టలు, పెద్ద పెద్ద తిలకాలు ఉండేవి. సిప్పి ఆకుపచ్చ మైదానాలు, కొండగుట్టలు ఉన్న కర్ణాటక ప్రాంతం ఎంచుకున్నాడు. స్టంట్స్ కోసం ప్రత్యేకంగా విదేశీ నిపుణులను తీసుకొచ్చాడు. ఆర్.డి.బర్మన్ రీరికార్డింగ్ ఈ సినిమాకు అమోఘంగా కుదిరింది. షోలే దాదాపు రెండేళ్లు తీశారు. ఆ రోజుల్లో జితేంద్ర వంటి హీరోలు ఇంత వ్యవధిలో మూడు సినిమాలు చేసేవారు. కాని రమేశ్ సిప్పి తన పర్ఫెక్షనిజమ్ పిచ్చితో తాను నచ్చిన విధంగా షాట్ వచ్చినప్పుడే ఓకే చేశాడు. సినిమా మొదలులో వచ్చే ట్రైన్ రాబరీ కోసం మొత్తం 49 రోజులు పని చేశారు. కుటుంబాన్ని గబ్బర్‌సింగ్ చంపేశాక ఠాకూర్‌గా సంజీవ్ కుమార్ వచ్చి వారి శవాలను చూసే సీన్ సినిమాలో రెండు మూడు నిమిషాలు ఉంటుంది. కాని దానిని 7 రోజులు తీశారు. ‘రమేశ్ సిప్పీ ఏం చేయబోతున్నాడో’ అని అందరూ భయపడే స్థాయిలో సినిమా తీశాడు. రమేశ్ సిప్పి ఎంత పర్ఫెక్షనిస్ట్ అంటే షోలే లో ‘స్టేషన్ సే గాడీ జబ్’ పాటలో హేమమాలిని టాంగా నడుపుతూ ఉంటే ధర్మేంద్ర ఆమెను టీజ్ చేస్తూ పాడుతూ ఉంటాడు. ఒక షాట్లో దూరంగా ట్రైన్ వస్తూ ఉంటే షాట్ తీయాలని అనుకున్నారు. ట్రైన్ వచ్చే టైము తెలుసుకొని షాట్ కోసం రెడీగా ఉన్నారు అంతా. ఆ షాట్ ఫెయిల్ అయితే మళ్లీ రేపు ట్రైన్ వచ్చే వరకూ ఆగాలి. ట్రైన్ వస్తున్నట్టు దూరం నుంచి కూత వినిపిస్తూ ఉంది. అందరూ షాట్‌కి రెడీ అయ్యారు. కాని రమేశ్ సిప్పికి సడన్‌గా హేమమాలిని తలలో పూలు లేవని గుర్తుకొచ్చింది. కంటిన్యుటీ ప్రకారం పూలు ఉండాలి. అసిస్టెంట్ వైపు చూసేసరికి అతని పై ప్రాణం పైనే పోయింది. కాని ప్రాణాలకు తెగించి పరిగెత్తి హేమమాలిని తలలో పూలు పెట్టి దూరంగా గెంతి వెళ్లిపోతే సరిగ్గా షాట్ మొదలెట్టి సరిగ్గా పూర్తి చేశారు. షోలే రిలీజయ్యాక మొదటి వారం ఫ్లాప్ టాక్ వచ్చింది. సినిమాని ఏం చేయాలా అని రమేశ్ సిప్పి క్లయిమాక్స్ మార్చే ఆలోచనలు చేశాడు. కాని ఎందుకైనా మంచిదని దానికి ముందు థియేటర్‌కు వెళ్లి ‘సినిమా ఎలా ఉంది’ అని యజమానిని అడిగితే అతడు లేచి క్యాంటిన్ వైపు చూపుతూ ‘చూడండి... ఎలా ఈగలు తోలుకుంటుందో’ అన్నాడు. రమేశ్ సిప్పి నీరుగారిపోయాడు. ‘అసలు జనం సిగరెట్లు బీడీలు టీ కోసం కూడా బయటకు రావడం లేదండీ’ అన్నాడు అసలు సంగతి వివరిస్తూ. అప్పటికి గాని రమేశ్ సిప్పికి తన సినిమాలో సూపర్‌హిట్ లక్షణాలు కనిపించలేదు. రమేశ్ సిప్పి షోలే తర్వాత ‘షాన్’, ‘సాగర్’, ‘శక్తి’ వంటి చెప్పుకోదగ్గ సినిమాలు తీసిన ‘షోలే’లో జరిగిన మేజిక్ రిపీట్ కాలేదు. అయినా సరే ‘షోలే’ చాలు మనకి. రమేశ్ సిప్పిని ప్రశంసించేందుకు ప్రతి సందర్భం చాలు. రమేశ్ సిప్పి జిందాబాద్. -
‘వదినలా భావిస్తాం.. కానీ మమ్మల్ని బాధపెట్టారు’
చండీఘడ్: సీనియర్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని వ్యాఖ్యలపై కంధీ కిసాన్ సంఘర్ష్ కమిటీ(కేకేఎస్‌సీ) అసహనం వ్యక్తం చేసింది. నూతన వ్యవసాయ చట్టాల వల్ల ఏయే ప్రయోజనాలు ఉన్నాయో తమకు వివరించాలని విజ్ఞప్తి చేసింది. ఇందుకోసం ఆమె పంజాబ్‌కు రావాలని, తమ సొంత ఖర్చులతో అక్కడే వారం రోజుల పాటు వసతి ఏర్పాటు చేస్తామంటూ విమర్శలు సంధించింది. కాగా ఎన్డీయే సర్కారు ప్రవేశపెట్టిన కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తున్న విషయం విదితమే. నిరసనలు మొదలై యాభై రోజులు దాటినప్పటికీ ఇంతవరకు రైతు సంఘాలు, కేంద్రం మధ్య చర్చలు కొలిక్కి రాలేదు. నూతన సాగు చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే ఇప్పటికే విధించగా.. వాటిని రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో అన్నదాతలు నేటికీ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. (చదవండి: రైతులకు ఏం కావాలో వాళ్లకే తెలియదు: హేమమాలిని) ఈ నేపథ్యంలో మథుర ఎంపీ హేమమాలిని గత బుధవారం మాట్లాడుతూ.. అసలు తమకు ఏం కావాలన్న అంశంపై రైతులకే స్పష్టత లేదని వ్యాఖ్యానించారు. కొత్త వ్యవసాయ చట్టాల్లో ఏముందో, వాటి వల్ల కలిగే సమస్యలు ఏంటో కూడా వారికి తెలియదని, దీనిని బట్టి రైతుల ఆందోళన స్వచ్ఛందమైన కాదని తెలుస్తోందన్నారు. కొంతమంది వ్యక్తుల ప్రోద్భలంతోనే వారు ఆందోళనలు చేస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై స్పందించిన కేకేఎస్‌సీ ఆదివారం స్పందించింది. ఈ మేరకు.. ‘‘ఎన్నికల ప్రచారంలో భాగంగా పంజాబ్ కోడలినని హేమమాలిని గారు స్వయంగా చెప్పారు. గౌరవనీయులైన మిమ్మల్ని మేం వదినగా భావిస్తాం. అంటే తల్లితో సమానం. కానీ రైతు ఆందోళనలపై మీరు చేసిన వ్యాఖ్యలు పంజాబీలను బాధించాయి. 51 రోజులుగా నిరసన చేస్తున్నాం. ఢిల్లీ సరిహద్దుల్లో దాదాపు 100 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. కఠిన శ్రమకోర్చి రైతు పంటను పండిస్తాడు. కనీస మద్దతు ధర కూడా లేకుండా దానిని ఎందుకు అమ్ముకోవాలి. దయచేసి మీరు ఇక్కడకు రండి. ఆ మూడు వ్యవసాయ చట్టాల గురించి సవివరంగా తెలియజేయండి. ఇందుకోసం హేమమాలిని ప్రయాణానికి అయ్యే ఖర్చులు మేమే భరిస్తాం. వారం రోజులపాటు ఫైవ్‌స్టార్ హోటల్లో ఉండేందుకు మా సొంత డబ్బుతో ఏర్పాట్లు కూడా చేస్తాం’’ అని హేమమాలినికి లేఖ రాసింది. కాగా హేమమాలిని ధర్మేంద్రను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన స్వస్థలం పంజాబ్. -
హేమమాలిని వివాదాస్పద వ్యాఖ్యలు!
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌తో వేలాది రైతులు గత కొంత కాలంగా ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆందోళన చేస్తున్న రైతులను ఉద్ధేశించి బీజేపీ ఎంపీ, సీనియర్ బాలీవుడ్ నటి హేమమాలిని సంచనల వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆమె ఉత్తరప్రదేశ్‌లోని మథుర పార్లమెంట్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బుధవారం హేమమాలిని మాట్లాడుతూ.. అసలు రైతులకు ఏం కావాలో వారికే తెలియదని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కొత్త చట్టాలకు వ్యతిరేకంగా ఎందుకు రైతులు ఆందోళన చేస్తున్నారో వాళ్లకే తెలియదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కొత్త వ్యవసాయ చట్టాల్లో ఏముందో, వాటి వల్ల ఉన్నసమస్య ఏంటో కూడా తమకు తెలియదని పేర్కొన్నారు. దీన్నిబట్టి రైతుల ఆందోళన స్వచ్ఛందమైన కాదని, ఎవరో వారి వెనకుండి చేయిస్తే రైతులు చేస్తున్నారనే విషయం అర్థమవుతుందని హేమమాలిని అన్నారు. చదవండి: సాగు చట్టాల అమలుపై స్టే అదే విధంగా నూతన చట్టాలపై సుప్రీంకోర్టు స్టే విధించాడాన్ని హేమమాలిని స్వాగతించారు. తద్వారా పరిస్థితులు చక్కబడేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఎన్నిసార్లు చర్చలు ఏర్పాటు చేసినప్పటికీ రైతులు ఏకాభిప్రాయానికి రావడం లేదని, వారు ఏం కోరుకుంటున్నారో కూడా తెలియదన్నారు. అలాగే రైతుల నిరసనల వల్ల పంజాబ్‌లో చాలా నష్టం ఏర్పడిందని, ముఖ్యంగా సెల్ టవర్లను ధ్వంసం చేయడం మంచిది కాదన్నారు. ఇదిలా ఉండగా కొత్త చట్టాల వల్ల కేవలం కార్పొరేట్ సంస్థలకే లాంభం చేకూరుతుందని నిరసనలు తెలియజేస్తున్న రైతులు పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో 1500కు పైగా రిలయన్స్ జియో టెలికాం టవర్లను ధ్వంసం చేశారు. కాగా నూతన వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీంకోర్టు మంగళవారం స్టే విధించిన విషయం తెలిసిందే. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఈ స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది. అలాగే, ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు, ప్రభుత్వానికి మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలగించే దిశగా సూచనలు చేసేందుకు నలుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటుచేసింది. ఈ చట్టాలు అమల్లోకి రాకముందు ఉన్న కనీస మద్దతు ధర వ్యవస్థ కొనసాగుతుందని వివరించింది. -
బంధుప్రీతి.. గ్యాంగ్‌వార్.. డ్రగ్స్...
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం దగ్గర నుంచి బాలీవుడ్ ప్రశాంతంగా లేదు. ప్రతిభను తొక్కేస్తున్నారు... బాయ్‌కాట్ నెపోటిజమ్ అని మొన్న. బాలీవుడ్ స్టీరింగ్ ఓ గ్యాంగ్ చేతిలో ఉంది.. వాళ్లు ఎటు అంటేæఇండస్ట్రీ అటు తిరుగుతుందని నిన్న. బాలీవుడ్‌ను నడుపుతున్నది డ్రగ్స్ మత్తే అని ఈ మధ్య. ఇలా రకరకాల వివాదాలు. బాలీవుడ్ కాదు... వివాదాలవుడ్ అంటున్నారు చాలామంది. అయితే... ‘ఇండస్ట్రీలో కొందరు చేసిన తప్పుకు అందర్నీ తప్పుపట్టొద్దు’ అంటున్నారు జయాబచ్చన్. ఆమె మాటలతో ఇండస్ట్రీలో పలువురు ఏకీభవించారు. కంగనా రనౌత్ కాదన్నారు. ఆ వివరాలు. సుశాంత్ సింగ్ ఆత్మహత్య దగ్గర మొదలైన వివాదాలు ఎప్పటికప్పుడు ఏదో ఒక టాపిక్ వైపు మళ్లుతున్నాయి. మిస్టరీ నవలల్లోలా ఏదో ఒక కొత్త టాపిక్‌కి తెరలేస్తోంది. బంధుప్రీతిని ప్రోత్సహించడం వల్లే ప్రతిభకు చోటుండట్లేదు అని కొన్ని రోజులు చర్చ నడిచింది. ఆ తర్వాత డ్రగ్స్ మత్తులో ఇండస్ట్రీ మునిగి తేలుతోందని మరో కొత్త అంశం వెలుగులోకొచ్చింది. రియా చక్రవర్తి డ్రగ్స్ తీసుకున్నట్టు, డ్రగ్స్ తీసుకున్న వాళ్ల పేర్ల జాబితాను పోలీసులకు అందించినట్టు వార్త. ఈ విషయం మీద నటుడు, యంపీ రవికిషన్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అది ఓ కొత్త వాదనలకు దారి తీసింది. రవికిషన్ వర్సెస్ జయా బచ్చన్ ‘బాలీవుడ్ ఇండస్ట్రీ మత్తు పదార్ధాలకు బానిస అవుతోంది. ఈ విషయంపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని తన అభిప్రాయాన్ని తెలిపారు రవికిషన్. ఆయన వ్యాఖ్యలను తిప్పికొట్టారు నటి, యంపీ జయా బచ్చన్. ‘‘కొందరు చేసిన తప్పుకి ఓ పరిశ్రమ మొత్తాన్నీ నిందించడం కరెక్ట్ కాదు’’ అని మాట్లాడారామె. ఇదంతా మంగళవారం జరిగింది. జయ మాటలకు బుధవారం స్పందించారు రవికిషన్. జయాజీ నాతో ఏకీభవించండి ‘నా ఉద్దేశం ఇండస్ట్రీలో అందరూ మత్తు పదార్థాలు తీసుకుంటున్నారని కాదు. కానీ తీసుకుంటున్న వాళ్ల ఉద్దేశమైతే పరిశ్రమను నాశనం చేయడమే. ఇండస్ట్రీ మీద ఉన్న బాధ్యతతో ఈ విషయం గురించి మాట్లాడుతున్నాను. జయాజీ కూడా నాతో ఏకీభవించాలి. ప్రస్తుతం డ్రగ్స్ ఓ ఫ్యాషన్ అయిపోయింది. 90వ దశకంలో ఇలాంటివి జరగలేదు. ఇండస్ట్రీలో మురికిని తొలగించాలన్నది మా ముఖ్యోద్దేశం’’ అన్నారు రవి కిషన్. జయా జీ... ఇది నా సొంత భోజనం: కంగనా ‘కొందరు సినీ ఇండస్ట్రీలో పెరిగి దాన్నే మురికి కాలువగా పిలుస్తున్నారని, ఇది భోజనం పెట్టిన చేతిని కరవడమే’ అని జయా బచ్చన్ చేసిన వ్యాఖ్యలకు మంగళవారం స్పందించిన కంగనా బుధవారం కూడా తన విమర్శలను కొనసాగించారు. ‘‘ఏ భోజనం గురించి మీరు మాట్లాడుతున్నారు జయా జీ! రెండు నిమిషాల వేషం, ఐటమ్ నంబర్లు, ఒక రొమాంటిక్ సీన్ ఉండే భోజనమే ఇక్కడ దొరుకుతుంది, అది కూడా హీరోతో గడిపితేనే! నేను వచ్చి ఇండస్ట్రీకి ఫెమినిజమ్ నేర్పాను. మీరనే భోజనాన్ని దేశభక్తి చిత్రాలతో నింపాను. ఇది నా సొంత భోజనం, మీది కాదు’’ అని కంగనా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదిలావుంటే జయా బచ్చన్‌కి పలువురు తారలు మద్దతు పలికారు. జయాజీ... యూ ఆర్ రైట్ ‘ఎన్నో సామాజిక విషయాలకు ఇండస్ట్రీకి చెందిన చాలామంది అండగా నిలబడ్డాం. ఇప్పుడు ప్రభుత్వం మాతో నిలబడాల్సిన సమయం ఇది. చెప్పాల్సిన విషయం సూటిగా, స్పష్టంగా చెప్పారు జయాజీ’ అన్నారు తాప్సీ. ‘బహుశా వెన్నెముక ఉండేవాళ్లు ఇలానే మాట్లాడతారేమో’ అని జయ మాటలను ప్రశంసించారు దర్శకుడు అనుభవ్ సిన్హా. ‘జయాజీ మాట్లాడింది అక్షర సత్యం. ఇండస్ట్రీ కోసం ఆమె మాట్లాడటం చాలా సంతోషం’ అన్నారు దియా మిర్జా. ‘పెద్దయ్యాక నేనూ జయాజీలా అవ్వాలనుకుంటున్నాను’ అన్నారు సోనమ్ కపూర్. ‘కంగనా.. పెద్దవాళ్లను గౌరవించాలన్న విషయం కూడా నీకు గుర్తులేదా? నువ్వు తిట్టాలనుకుంటే నన్ను తిట్టు.. వింటాను’ అన్నారు నటి స్వరా భాస్కర్. అలానే జయా బచ్చన్ వ్యాఖ్యలను నటుడు, దర్శకుడు ఫర్హాన్ అక్తర్, దర్శకుడు సుధీర్ మిశ్రా సమర్థించారు. ఈ వివాదం ఇంకెంత దూరమెళ్తుందో? ఎవరెవర్ని వివాదాల్లోకి లాగుతుందో? ఇండస్ట్రీని ఇంకెన్ని ఇబ్బందుల్లో పడేస్తుందో చూడాలి. వివాదాలవుడ్గా మారిన బాలీవుడ్ ఇండస్ట్రీని ఏమైనా అంటే ఊరుకోను – హేమా మాలిని ‘నాకు పేరు, గౌరవం, మర్యాద అన్నీ ఇచ్చింది సినిమా ఇండస్ట్రీయే. అలాంటి ఇండస్ట్రీని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకునేది లేదు’ అన్నారు సీనియర్ నటి హేమా మాలిని. ప్రస్తుతం జరుగుతున్న చర్చ గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘బాలీవుడ్ ఓ అందమైన ప్రదేశం. సృజనాత్మక ప్రపంచం. ఈ ఇండస్ట్రీ మీద తప్పుడు వ్యాఖ్యలు చేస్తే నాకు చాలా బాధగా ఉంటుంది. డ్రగ్స్ ఉన్నాయి అంటున్నారు. డ్రగ్స్ లేనిదెక్కడ? ఒకవేళ మురికి ఉంటే కడిగితే పోతుంది. బట్టల మీద అంటుకున్న మురికి ఉతికితే పోతుంది. బాలీవుడ్ మీద పడ్డ మరక కూడా పోతుంది’’ అని అన్నారామె. కంగనాకు సెక్యూరిటీ ఎందుకు – ఊర్మిళ కంగనా చేస్తున్న వ్యాఖ్యలపై (ముంబై పాకిస్తాన్‌ని తలపిస్తోంది. డ్రగ్స్ నిండిన బాలీవుడ్) మండిపడ్డారు నటిæఊర్మిళ. ‘డ్రగ్స్ సమస్య దేశమంతా ఉంది. కంగనాకు తెలుసు.. తన సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్‌లోనే డ్రగ్స్ మొదలయిందని. తన సొంత ప్రాంతం నుంచే ఆమె డ్రగ్స్ పై యుద్ధం మొదలుపెట్టాలి. అసలు ఈమెకు వై కేటగిరీ సెక్యూరిటీ ఎందుకు ఏర్పాటు చేశారు? ముంబై అందరిదీ. ఆ సిటీ గురించి తప్పుగా మాట్లాడితే ముంబై పుత్రికగా ఊరుకునేది లేదు. ఒక వ్యక్తి అదే పనిగా అరుస్తున్నాడంటే అతను నిజం చెబుతున్నాడని కాదు. కొంతమందికి ఊరికే అరవడం అలవాటు.. అంతే. ఒకవేళ బయటకు వచ్చి మాట్లాడితే తమ కేం అవుతుందో అని చాలా మంది బయటకు రావట్లేదంతే’ అన్నారు ఊర్మిళ. -
‘నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను’
లాక్డౌన్ విధించిన నాటి నుంచి సోషల్ మీడియాలో సెలబ్రిటీల ఆరోగ్యానికి సంబంధించిన రుమార్లు తెగ ప్రచారం అవుతున్నాయి. ఫలానా నటి / నటుడు అనారోగ్యం పాలయ్యారని.. ఆస్పత్రిలో చేరారంటూ పుకార్లు ప్రచారం అవుతున్న సంగతి తెలిసిందే. చివరకు సదరు వ్యక్తి స్వయంగా తెర మీదకు వచ్చి.. నాకేమి కాలేదు.. ఆరోగ్యంగా ఉన్నాను అంటూ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. తాజాగా ప్రసిద్ధ బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ హేమ మాలిని కూడా ఈ పుకార్ల బారిన పడ్డారు. ఆమె ఆరోగ్యం బాగాలేదు.. ఆస్పత్రిలో చేరారనే వార్తలు సోషల్‌మీడియాలో తెగ వైరలయ్యాయి. దాంతో అభిమానులు, సన్నిహితుల నుంచి ఒకటే ఫోన్లు. ఈ బాధ తట్టుకోలేక చివరికి ‘నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను’ అంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు హేమ మాలిని. (ఆయనతోనే జీవితం అనుకున్నా.. అందుకే..) View this post on Instagram Dear All, Thank you so much for showing your concern. I am absolutely fine with the blessing of Lord Krishna. Radhey Radhey. You all stay home, stay safe. A post shared by Dream Girl Hema Malini (@dreamgirlhemamalini) on Jul 11, 2020 at 11:20pm PDT ‘నేను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా వార్తలు వస్తోన్న విషయం నా దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో నా అభిమానులు, నా మంచి కోరే వారికి ఓ విషయం తెలియజేయాలనుకున్నాను. అవన్నీ రూమర్స్. నాకు ఏమీ కాలేదు. చాలా ఆరోగ్యంగా ఉన్నాను. దేవుడి దయతో అంతా బాగానే ఉంది’ అంటూ ఓ వీడియోను షేర్ చేశారు హేమ మాలిని. 28 సెకన్ల నిడివి కలిగిన వీడియోను తన ఇంటి నుంచే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అయితే హేమ మాలిని ఈ వీడియోను పోస్ట్ చేయడానికి ముందే ఈ వార్తలపై ఆమె కూతురు ఈషాడియోల్ స్పందించారు. తన తల్లి డ్రీమ్ గర్ల్ హేమ మాలిని పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని ఆమె ట్వీట్ చేశారు. అంతేకాక హేమ మాలిని ఆరోగ్యంపై ఆందోళన చెందిన అభిమానులకు, తమ పట్ల చూపిస్తోన్న ప్రేమకు ఈషా డియోల్ కృతజ్ఞతలు తెలిపారు.(నాన్నా! నేనున్నాను!!) My mother @dreamgirlhema is fit & fine 🧿 ! The news regarding her health is absolutely fake so please don’t react to such rumours! Thanks to everyone for their love & concern . ♥️🙏🏼 — Esha Deol (@Esha_Deol) July 12, 2020 -
‘కలకాలం మీరు ఇలాగే ఉండాలి.. అమ్మానాన్నా’
‘‘అమ్మా, నాన్నా నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను. మీరిలాగే కలకాలం కలిసి ఉండాలని.. ప్రేమ, సంతోషం, ఆరోగ్యం మీకు ప్రసాదించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను! ప్రేమతో ఇషా, భరత్, రాధ్యా, మియూ’’అంటూ అలనాటి బాలీవుడ్ డ్రీమ్‌గర్ల్ హేమమాలిని, నటుడు ధర్మేంద్రకు వారి తనయ, నటి ఇషా డియోల్ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తన తల్లిదండ్రులకు సంబంధించిన కొన్ని అరుదైన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు. ఇక ఇషా సోదరి అహానా సైతం హేమ, ధర్మేంద్రలకు శుభాకాంక్షలు తెలిపారు. దీంతో సోషల్ మీడియా వేదికగా వారికి శుభాభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు స్పందించిన హేమ మాలిని తన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. కాగా బాలీవుడ్లో డ్రీమ్‌గర్ల్‌గా ఓ వెలుగు వెలిగిన హేమ మాలినిని పెళ్లి చేసుకోవడానికి ఎంతో మంది హీరోలు ప్రయత్నించి విఫలమయ్యారు. సంజీవ్ కుమార్, జితేంద్ర ఆ జాబితాలో ప్రముఖులు. (మన కథ ముగిసింది: నీతూ కపూర్) ఇక జితేంద్ర హేమ మాలిని ఇంట్లో వాళ్లను ఒప్పించి.. తన ప్రేమను పెళ్లి పీటలదాకా తీసుకువచ్చాడు. మద్రాసులో వివాహం చేసుకోవడానికి తేదీ ఖరారు చేయించాడు. కానీ అప్పటికే హేమతో కలిసి షోలే, సీతా ఔర్ గీతా, దిలాగీ, డ్రీమ్‌గర్ల్ వంటి చిత్రాల్లో నటించిన ధర్మేంద్ర.. ఆ పెళ్లిని అడ్డుకుని ఆమెను తన జీవిత భాగస్వామిగా చేసుకున్నాడు. దీంతో 1959లో ధర్మేంద్ర జీవితంలో రెండో భార్యగా హేమమాలిని అడుగుపెట్టారు. ఇద్దరూ వైవాహిక బంధంలో కొనసాగి ఆ తర్వాత దూరం దూరంగా ఉంటున్నా ఎన్నడూ ఒకరినొకరు విమర్శించుకోలేదు. అంతేకాదు ధర్మేంద్ర జీవితంలోకి తాను ప్రవేశించినప్పటికీ ఆయనను ఏనాడు తన కుటుంబం నుంచి వేరు చేయలేదని హేమ మాలిని పలు సందర్భాల్లో చెప్పారు. ఆయన తనకోసమే పుట్టారని భావిస్తానని.. ఆయనతో జీవితం పంచుకోవడం తనకు సంతోషాన్ని ఇచ్చిందని భర్తపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. ఇక హేమమాలిని ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్న విషయం తెలిసిందే.(లాక్‌డౌన్‌తో గెలుద్దాం: హేమ పిలుపు) View this post on Instagram Happy wedding anniversary my darling parents! My mamma & papa I love u both soooooooo much & pray to god to bless you both with infinite years of togetherness ,love , happiness & the best of health !🧿🤗 @dreamgirlhemamalini @aapkadharam Love you , Esha , Bharat,Radhya & Miu ♥️♥️♥️♥️♥️♥️💕 A post shared by Esha Deol (@imeshadeol) on May 1, 2020 at 9:46pm PDT Dharam ji & I thank all those who have wished us on our wedding anniversary today. It is your blessings & good wishes that have always been with us all through these years🙏 pic.twitter.com/tEtO6L4Boj — Hema Malini (@dreamgirlhema) May 2, 2020 -
ఎవరైనా సరే.. ఇంట్లోనే ఉండండి: హేమమాలిని
-
లాక్‌డౌన్‌తో గెలుద్దాం: హేమ పిలుపు
ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ.. ఇంటి లోపలే ఉండి ప్రతిఒక్కరు లాక్‌డౌన్‌కు సహకరించాలని బాలీవుడ్ నటి, పార్లమెంటు సభ్యురాలు హేమమాలిని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో లాక్డౌన్ అమలవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్వీయ నిర్భంధంలో ఉన్న హేమ లాక్‌డౌన్‌కు సహకరించాలంటూ వీడియో ద్వారా సందేశాన్నిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె ట్విటర్లో బుధవారం షేర్ చేశారు. (శ్మశానంలో కుళ్లిన అరటిపండ్లను తింటున్న కూలీలు) ప్రస్తుతం ‘భారతమాత(భారతదేశం) కరోనా మహమ్మారి కారణంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. మీరంతా దేశంలో పుట్టి.. పెరిగిన పౌరులు. కాబట్టి ప్రభుత్వ ఆదేశాలను పాటించడం పౌరులుగా అది మన కర్తవ్యం. ఏ మతానికి, జాతికి చెందిన వారైనా ఇంటి లోపలే ఉండటం ముఖ్యం. దీనివల్ల కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టవచ్చు. కరోనాపై లాక్డౌన్ ద్వారా గెలిచి మన భారతమాతను కాపాడుకుందాం. ఇందుకోసం దేశ పౌరులంతా ఇంకా కొన్ని రోజులు ఇంట్లోనే ఉండండి... కోవిడ్-19 బారినుంచి దేశాన్ని సంరక్షించండి’ అంటూ ఆమె పిలుపునిచ్చారు. కాగా కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత రోజురోజుకు పెరిగిపోతున్న కారణంగా లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌కు ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రధాని మోదీ పిలుపు నిచ్చారు. (మరింత పటిష్టంగా లాక్డౌన్) -
తాగొచ్చి హేమ మాలిని పెళ్లి ఆపాడు
అలనాటి సూపర్ స్టార్ జితేంద్ర నేడు 78వ వడిలోకి అడుగుపెట్టాడు. అతను తన ప్రేయసి శోభా కపూర్‌ను 1974లో అక్టోబర్18న వివాహం చేసుకున్నాడు. అయితే దీనికన్నా ముందు అలనాటి అందాల తార హేమమాలినిని పెళ్లి చేసుకోబోయాడు. ఈ విషయాన్ని ఆమె జీవిత కథ ఆధారంగా వచ్చిన "హేమ మాలిని: బియాండ్ ద డ్రీమ్‌గర్ల్" పుస్తకం వెల్లడించింది. ఈ పుస్తకం ప్రకారం ఆమె తల్లిదండ్రులకు హేమ, వివాహితుడైన ధర్మేంద్రతో ఉండటం అస్సలు నచ్చేది కాదు. దీంతో ఆమెకు జితేంద్రతో వివాహం జరిపించాలనుకున్నారు. వెంటనే అతని కుటుంబసభ్యులతో మాట్లాడటం, ఇంట్లో వాళ్ల సంతోషం కోసం జితేంద్ర కూడా పెళ్లికి అంగీకరించడం చకచకా జరిగిపోయాయి. ముహూర్తం కూడా ఖరారు చేసుకుని, చెన్నైలో పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేస్తుండగా ఓ వార్తాపత్రిక ఈ విషయాన్ని చాటింపు చేసి చెప్పింది. దీంతో విషయం తెలుసుకున్న ధర్మేంద్ర్ర, జితేంద్ర ప్రేయసి శోభా(ప్రస్తుతం అతని భార్య)తో కలిసి పెళ్లిని ఆపేందుకు చెన్నైకు పయనమయ్యారు. (ఎంతో నేర్చుకున్నా) మద్యం సేవించిన ధర్మేంద్ర.. హేమ ఇంటికి చేరుకుని ఆమెను ఇంత పెద్ద తప్పు చేయవద్దని కోరుకున్నాడు. మరోవైపు శోభా కూడా జితేంద్రను కలిసి ఆగ్రహం వ్యక్తం చేయగా అతను మాత్రం హేమను పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించాడని పుస్తకంలో పేర్కొన్నారు. అయితే ధర్మేంద్ర మాటలతో కదిలిపోయిన హేమ పెళ్లికి మరింత గడువు కావాలని తన పేరెంట్స్‌ను అభ్యర్థించింది. అలా ఆ పెళ్లి వాయిదా పడింది. కాగా షోలే, సీతా ఔర్ గీతా, దిలాగీ, డ్రీమ్‌గర్ల్ వంటి చిత్రాల్లో హేమతో కలిసి నటించిన ధర్మేంద్ర ఆమెతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడు. అనంతరం 1979లో ఆగస్టు 21న హేమను రెండో భార్యగా చేసుకున్నాడు. అయినప్పటికీ వాళ్లిద్దరి సంసార విషయంలో ఎప్పడూ గొడవలు బయటకు రాలేదు. ఇక వీరికి కూతుళ్లు ఈషా, అహాన్ డియోల్ ఉన్న సంగతి తెలిసిందే. ఈషా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చినప్పటికీ ప్రస్తుతం గృహిణిగా ఉండగా.. అహానా క్లాసికల్ డ్యాన్సర్‌గా పలు ప్రదర్శనలు ఇస్తున్నారు. ఇక ధర్మేంద్ర మొదటి భార్య ప్రకాశ్ కౌర్ సంతానం సన్నీ డియోల్, బాబీ డియోల్ కూడా సినిమా రంగంలోనే ఉన్నారు. -
లోక్‌సభలో కోతులపై చర్చ
న్యూఢిల్లీ: మతపరమైన ప్రదేశాలలో కోతుల బెడద ఎక్కువగా ఉంటోందని మథుర బీజేపీ ఎంపీ హేమమాలిని తెలిపారు. దేశ రాజధానిలోని ల్యూటెన్స్ ప్రాంతంలోనూ కోతుల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని గురువారం ఆమె లోక్‌సభలో ప్రస్తావించారు. తన నియోజకవర్గంలోని మథుర, బృందావన్‌లలో భక్తులు కోతుల నుంచి సమస్యలు ఎదుర్కొంటున్నారని, యాత్రికుల సామాన్లు కోతులు లాక్కుని పోతున్నాయన్నారు. ఢిల్లీలోని ల్యూటెన్స్ ప్రాంతంలో కోతుల భయంతో పిల్లలు ఆడుకోకుండా ఇళ్లలోనే ఉండిపోతున్నారని ఎల్జేపీ ఎంపీ చిరాగ్ పాశ్వాన్ అన్నారు. ‘ఒకసారి కోతి నా కళ్లజోడుని తీసుకెళ్లింది. దానికి పళ్లరసం ఇచ్చి కళ్లజోడును తిరిగి తీసుకోవాల్సి వచ్చింది’అని టీఎంసీ ఎంపీ సుదీప్ బంధోపాధ్యాయ అన్నారు. -
‘ఎంపీలు ఢిల్లీ కాలుష్యాన్ని పెద్దగా పట్టించుకోరు’
న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ హేమమాలిని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో నవంబర్ 15న జరిగిన పార్లమెంట్ ప్యానెల్ సమావేశానికి పలువురు ఎంపీలు డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. ఆ లిస్టులో నటి హేమమాలిని కూడా ఉన్నారు. దీనిపై మీడియా ప్రతినిధులు హేమమాలిని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పారు. ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో నివసించని ఎంపీలే సమావేశానికి హాజరు కాలేదన్నారు. ఎందుకంటే ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో నివసించేవారికి వాయు కాలుష్య నివారణపై శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. కానీ కాలుష్య తీవ్రత తక్కువగా ఉండే ముంబై వంటి నగరాల్లో నివసించేవారికి ఢిల్లీ కాలుష్యం గురించి పెద్దగా ఆసక్తి ఉండదన్నారు. అందుకే వారు సమావేశానికి హాజరు కాలేదని పేర్కొన్నారు. బాధ్యత గల ఎంపీగా ఉండి ఢిల్లీ కాలుష్య నియంత్రణ సమావేశానికి గైర్హాజరవడమే కాక పట్టింపు లేనట్లుగా మాట్లాడటంపై ఢిల్లీవాసులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే సమావేశానికి గైర్హాజరైన తూర్పు ఢిల్లీ ఎంపీ, క్రికెటర్ గౌతమ్ గంభీర్ పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం హేమమాలిని ఇంతటి తీవ్రమైన సమస్యను తేలికగా తీసిపారేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఆయనతోనే జీవితం అనుకున్నా.. అందుకే..
న్యూఢిల్లీ : ధర్మేంద్ర జీవితంలోకి తాను ప్రవేశించినప్పటికీ ఆయనను ఏనాడు తన కుటుంబం నుంచి వేరు చేయలేదని అలనాటి డ్రీమ్‌గర్ల్, బీజేపీ ఎంపీ హేమ మాలిని అన్నారు. త్వరలోనే రాజకీయాలకు స్వస్తి పలికి తన కూతుళ్లు, మనవలతో జీవితం గడపాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన హేమ మాలిని.. ధర్మేంద్రతో ప్రేమ, పెళ్లి తదితర అంశాల గురించి చెప్పుకొచ్చారు. ‘ ధరమ్ జీని చూసిన నిమిషంలో ఈయన నా మనిషి.. నా కోసమే పుట్టారు అనిపించారు. అందుకే ఆయనతోనే జీవితం గడపాలనుకున్నా. అందుకోసం ఆయనను పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నా. అయితే మా పెళ్లి ఎవరినీ బాధించుకూడదనే.. నేనెప్పుడూ ధర్మేంద్రను ఆయన మొటటి భార్య, పిల్లలకు దూరంగా ఉండనివ్వలేదు. వాళ్లు కూడా నేను ఏనాడు వాళ్ల జీవితంలో జోక్యం చేసుకున్నట్లుగా భావించలేదు. ఆయనను వివాహం చేసుకున్నానే తప్ప.. కుటుంబ సభ్యుల నుంచి ఏనాడు వేరుచేయలేదు’ అని పేర్కొన్నారు. ఇక బాలీవుడ్లో డ్రీమ్‌గర్ల్‌గా ఓ వెలుగు వెలిగిన హేమ మాలినిని వివాహం చేసుకోవడానికి చాలామంది హీరోలు ప్రయత్నించారు. వారిలో సంజీవ్ కుమార్ ఒకడు. ఆ తర్వాత జితేంద్ర ఆ ప్రయత్నం చేశాడు. వాళ్లిద్దరు మద్రాసులో వివాహం చేసుకోవడానికి దాదాపు తేదీ ఖరారు చేశారు. అయితే అప్పటికే హేమతో కలిసి షోలే, సీతా ఔర్ గీతా, దిలాగీ, డ్రీమ్‌గర్ల్ వంటి చిత్రాల్లో నటించిన ధర్మేంద్ర ఆమెతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడు. ఈ నేపథ్యంలో మద్రాసులో జరుగనున్న పెళ్లిని ఆపించి ఆమెను తన భార్యగా చేసుకున్నాడు. దీంతో 1959లో ధర్మేంద్ర జీవితంలో హేమమాలిని అడుగుపెట్టారు. అయితే... రెండో భార్యగా ఉన్నప్పటికీ వాళ్లిద్దరి సంసార విషయంలో ఎప్పడూ గొడవలు బయటకు రాలేదు. ఇద్దరూ ఆ బంధంలో కొనసాగి ఆ తర్వాత దూరం దూరంగా ఉంటున్నా విమర్శలకు దిగలేదు. వారిరువురూ కలిసి ప్రయివేట్‌గా కనిపించడం కూడా చాలా అరుదు. ఇక వీరికి కూతుళ్లు ఈషా, అహాన్ డియోల్ ఉన్న సంగతి తెలిసిందే. ఈషా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చినప్పటికీ ప్రస్తుతం గృహిణిగా ఉండగా.. అహానా క్లాసికల్ డ్యాన్సర్‌గా పలు ప్రదర్శనలు ఇస్తున్నారు. ఇక ధర్మేంద్ర మొదటి భార్య ప్రకాశ్ కౌర్ సంతానం సన్నీ డియోల్, బాబీ డియోల్ కూడా సినిమా రంగంలోనే ఉన్నారు. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ హేమా మాలిని
-
‘సినిమాల్లో తప్ప రియల్‌గా చీపురు పట్టింది లేదు’
ప్రముఖ నటి, ఎంపీ హేమామాలిని ‘స్వచ్ఛ్ భారత్’లో భాగంగా చీపురు పట్టి పార్లమెంట్ పరిసరాలను శుభ్రం చేసిన సంగతి తెలిసిందే. అయితే హేమా మాలిని చేసిన పనికి ప్రశంసలు లభించకపోగా.. విమర్శల పాలవుతోంది. తాజాగా ఇలా విమర్శించే వారి జాబితాలో హేమా మాలిని భర్త ధర్మేంద్ర డియోల్ కూడా చేరారు. హేమా మాలిని చేసిన పని తనకు కూడా అసహజంగా తోచిందన్నారు. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ధర్మేంద్ర ఇలా బదులిచ్చాడు. హేమా మాలిని నిజ జీవితంలో ఎప్పుడైనా చీపురు పట్టుకున్నారా అని ఓ అభిమాని ట్విటర్లో ధర్మేంద్రను ప్రశ్నించాడు. అందుకు ఆయన బదులిస్తూ.. ‘సినిమాల్లో తప్ప నిజ జీవితంలో తను ఎన్నడు చీపురు పట్టి ఎరగదు’ అన్నాడు. హేమా మాలిని ఆలోచన మంచిదే.. అయితే దాన్ని అమలు చేయడంలో ఆమె విఫలం అయ్యారన్నారు ధర్మేంద్ర. ఆమె ప్రచారం చేయదల్చుకున్న శుభ్రత సందేశాన్ని ప్రతి ఒక్కరు పాటించాలని కోరారు ధర్మేంద్ర. దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం మన బాధ్యత అన్నారు ధర్మేంద్ర. Haan films main , mujhe bhi अनाड़ी लग रहीं थीं . मैं ने मगर बचपन में , अपनी माँ का हमेशा हाथ बटाया है । मैं झाड़ू में माहिर था । I love cleanliness 🍀🍀🍀🍀🍀🍀🍀🍀 — Dharmendra Deol (@aapkadharam) July 14, 2019 -
అత్యంత శుభ్రమైన ప్రాంతంలో స్వచ్ఛ భారత్
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీలు శనివారం పార్లమెంట్ ఆవరణలో స్వచ్ఛ భారత్ అభియాన్‌కు పూనుకున్నారు. ఎంపీలు హేమా మాలిని, కేంద్రమంత్రి అనురాగ్ ఠాగూర్‌లు పార్లమెంట్ బయట చీపురుకట్ట చేతబట్టి శుభ్రం చేశారు. త్వరలో మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల దృష్ట్యా 'స్వచ్ఛ భారత్ అభియాన్'కు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే వీరిపై నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) చీఫ్ ఒమర్ అబ్దుల్లా వ్యంగ్యంగా స్పందించారు. ‘‘దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన ప్రాంతంలో (పార్లమెంట్) స్వచ్ఛ భారత్‌ను చేస్తున్నారు. దేశంలో ఎక్కడా కూడా పార్లమెంట్ ముందు పాటించిన శుభ్రత పాటించరు. ముఖ్యంగా సమావేశాలు జరిగే రోజుల్లో ఇంకా శుభ్రతను పాటిస్తారు. మీరు మాత్రం అక్కడే శుభ్రం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారో ఏమో?. కేవలం ఫోటోలకు ఫోజులు ఇవ్వడానికే ఈ కార్యక్రమానికి దిగినట్టు ఉంది’’ అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మధుర లోక్‌సభ నియోజకవర్గం నుంచి హేమా మాలిని గెలిచిన విషయం తెలిసిందే. -
ఆనందంలో ఈషా డియోల్
బాలీవుడ్ నటి ఈషా డియోల్ రెండో సారి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. కాగా, తన కూతురు పేరు మిరయా తక్తానీ అని తెలిపారు. హేమ మాలిని, ధర్మేంద్రల కూతురైన ఈషా.. భరత్ తక్తానీని 2012లో పెళ్లి చేసుకోగా.. అక్టోబర్ 2017 ఈ దంపతులకి రాధ్య జన్మించింది. తాజాగా తనకు రెండోసారి ఆడపిల్ల జన్మించిందని, ఆ సంతోషాన్ని అభిమానులతో కలిసి పంచుకున్నారు. రెండో కాన్పు ద్వారా ఆడబిడ్డ జన్మించిందని ఇషా డియోల్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. మీ ప్రేమ, ఆశీర్వాదానికి ధన్యవాదాలు అని ఇషా తన పోస్ట్‌లో పేర్కొన్నారు. పెళ్ళి తర్వాత ఇషా డియోల్ పూర్తిగా సినిమాలకి దూరమయ్యారు. 2002లో కోయి మేరే దిల్ సే పూచ్చే చిత్రంతో బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన ఈషా డియోల్.. ధూమ్, యువ, నో ఎంట్రీ, ధస్ చిత్రాలతో ఈషా బాగా పాపులర్ అయ్యారు. తనకి మరో కూతురు జన్మించడంతో హేమమాలని దంపతులు సంతోషంగా ఉన్నారని ఈషా పేర్కొన్నారు. -
వన్నె తగ్గని ఎన్నిక
క్లాసికల్ డాన్సర్, నటి, రచయిత, డైరెక్టర్, ప్రొడ్యూసర్, పొలిటీషియన్..ఒక ఎంపవర్డ్ ఉమన్‌లోని ఆరు కోణాలివి. ఆ ఆరూ కీలకమైనవే.సమర్థతతో పోటీ పడి రాణించాల్సిన రంగాలే. ఇన్నింటి మధ్య తననుతాను నిరూపించుకుంటూ... కొన్ని వివాదాలు, మరికొన్ని విమర్శలు,అంతకు మించిన వ్యంగాస్త్రాల మధ్య మూడో దఫా పార్లమెంట్లోఅడుగు పెడుతున్నారు ప్రముఖ నటి హేమమాలిని. అరవైల నుంచి ఎనభైల వరకు యువత గుండెల్లో కలలు పూయించిన డ్రీమ్‌గర్ల్ హేమమాలిని... ఉత్తర ప్రదేశ్‌లోని మధుర లోక్‌సభ స్థానం నుంచి మరోసారి ఎన్నికయ్యారు. నలభై ఏళ్ల సుదీర్ఘ సినీ కెరీర్లో 150 సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈ స్వప్న సుందరి సినిమాలకు దూరమయ్యారు కానీ ప్రేక్షకులకు దగ్గర కాకుండా లేరు. టీవీ సీరియల్స్, వాణిజ్య ప్రకటనల్లో కనిపిస్తూనే ఉన్నారు. పుట్టింటి రాష్ట్రం తమిళనాడుకు చెందిన ఓ టెక్స్టైల్ బ్రాండ్‌ను ప్రమోట్ చేయడానికి గులాబీ రంగు పట్టుచీరలో అప్పుడే విరిసిన గులాబీలా కనిపించే హేమ, మరో యాడ్‌లో శుద్ధజలం అంటూ అప్పుడే ఇంటిపనులు చక్కబెట్టుకొచ్చిన గృహిణిలా కనిపిస్తారు. వీటితోపాటు భారతీయ కళల పరిరక్షణ కోసం తన వంతుగా నాట్య ప్రదర్శనలిస్తూనే ఉన్నారు. నాట్యం చేయని రోజు తనకేమీ తోచదని చెబుతుంటారు హేమమాలిని. క్లాసికల్ డాన్స్‌తోపాటు రెగ్యులర్‌గా యోగసాధన చేస్తారామె. డెబ్బై ఏళ్ల వయసులో కూడా హేమ ఇంత అందంగా ఉండటానికి బహుశా అవే ఆమె బ్యూటీ సీక్రెట్స్ కావచ్చు. అయ్యంగారమ్మాయి తమిళనాడులోని తిరుచిరాపల్లిలో అయ్యంగార్ల కుటుంబంలో పుట్టిన హేమమాలినీ చక్రవర్తి ఉత్తర ప్రదేశ్‌లోని మధురను రాజకీయ క్షేత్రంగా మలుచుకున్నారు. సినిమా నిర్మాత కూతురు కావడం, భరత నాట్య కళాకారిణి కావడంతో ఆమె టీనేజ్లోనే సినిమాల్లోకి వచ్చేశారు. చెన్నైలో ప్లస్‌టూ చదువుతుండగానే ‘ఇతు సాహిత్యం’ తమిళ సినిమాలో సహనటిగా సినీరంగ ప్రవేశం చేశారు. సినిమాల్లోకి రావడం వల్ల తనకు ఇష్టమైన హిస్టరీ సబ్జెక్ట్ దూరం కావలసి వచ్చిందనే ఆవేదన ఆమె మాటల్లో వ్యక్తమవుతుండేది. ఆ కొరతను భర్తీ చేసుకోవడానికే ఆమె ‘పరంపర’ చారిటబుల్ ఈవెంట్స్‌లో పాల్గొని మైసూరు, ఖజురహో వంటి చారిత్రక ప్రదేశాల్లో ఇప్పటికీ నాట్య ప్రదర్శనలిస్తున్నారు. సామాజిక కార్యకర్త హేమమాలిని యానిమల్ రైట్స్ యాక్టివిస్టుగా సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా ఉంటారు. ముంబయిలో గుర్రాల మీద బరువులు రవాణా చేయడాన్ని ఆమె తీవ్రంగా గర్హించేవారు. ఈ పరిస్థితిని నియంత్రించవలసిందిగా ఆమె మున్సిపల్ కమిషనర్‌కు రిపోర్టు చేశారు కూడా. అలాగే జల్లికట్టు విషయంలోనూ ఆమె స్పందించారు. అప్పటి కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి జైరామ్ రమేశ్‌కు వివరంగా ఉత్తరం రాశారు. ‘జల్లికట్టులో భాగంగా పశువులను నియంత్రించడానికి ముక్కుతాళ్లను పట్టుకుని గట్టిగా లాగుతుంటారు. అలా లాగడం పశువులకు ఎంతో హింసాత్మకం’ అంటూ, జల్లికట్టు సందర్భంగా అవి ఎన్ని రకాలుగా గాయపడుతుంటాయనే విషయాలను కూడా ఆ ఉత్తరంలో వివరంగా రాశారామె. పెటా (పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్) ఇయర్ ఆఫ్ ది అవార్డుకు ఎంపికైన సందర్భంగా.. ‘తన సంతోషం కోసం మరో ప్రాణికి హాని కలిగించడాన్ని ఇష్టపడని కారణంగానే తాను శాకాహారిగా ఉన్నట్లు’ చెప్పారు హేమమాలిని. అభ్యుదయవాది సమాజంలో మహిళకు ఎదురవుతున్న సమస్యల మీద స్పందిస్తూ మహిళాభ్యుదయం కోసం వ్యాసాలు రాస్తుంటారు హేమమాలిని. ‘న్యూ ఉమన్’, ‘మేరీ సహేలీ’ పత్రికలకు కొంతకాలం ఎడిటర్‌గా ఉన్నారామె. సంప్రదాయ పితృస్వామ్య భావజాలంతో నిర్మితమైన సమాజంలో మహిళ స్థానం ఎలా ఉందో చూపిస్తూ, ఆ పరిస్థితులను అధిగమించి పురోగమించాల్సిందిగా తన వ్యాసాల్లో సూచించేవారామె. స్త్రీ తనను తాను ఆధునిక మహిళగా మలుచుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలనేది హేమమాలిని అభిప్రాయం. ఈ అభ్యుదయవాదమే ఆమెను నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌ని చేసింది. ఆ హోదాకు ఎంపికైన తొలి మహిళ హేమమాలిని. ఆమె ఇస్కాన్ లైఫ్ మెంబర్ కూడా. కోలీవుడ్ నుంచి బాలీవుడ్‌కి తమిళంలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఐదారేళ్లకే బాలీవుడ్ వచ్చి హేమమాలిని ఇంటి తలుపు తట్టింది. 1968లో ‘సప్నోం కా సౌదాగర్’ సినిమాతో హిందీ తెరను అలరించేనాటికి అదే తన పర్మినెంట్ అడ్రస్ అవుతుందని ఆమె ఊహించలేదు. ఆ తర్వాత రెండేళ్లకే పరిచయమయ్యారు ధర్మేంద్ర. ఆ పరిచయం ప్రేమగా మారి, పెళ్లి బంధంతో బలపడడానికి పదేళ్లు పట్టింది. అప్పటికే పెళ్లయి పిల్లలున్న ధర్మేంద్ర.. డ్రీమ్‌గర్ల్ మీద ప్రేమను పెంచుకున్నాడు. ఇద్దరూ కలిసి 35 సినిమాల్లో నటించారు. అప్పట్లో బాలీవుడ్లో ధర్మేంద్ర మీద ఒక గాసిప్ నడుస్తుండేది. హేమమాలినితో సీన్ చేసేటప్పుడు సీన్‌ను త్వరగా పూర్తి కానిచ్చేవాడు కాదట. హేమమాలినితో ఎక్కువ సమయం సన్నిహితంగా మెలగడం కోసం షూటింగ్ టైమ్ నిడివి పెరగడానికి రకరకాల వ్యూహాలు పన్నేవాడట. లైట్ బాయ్‌లకు డబ్బిచ్చి షూటింగ్ టైమ్‌లో లైట్లు ఆగిపోయేట్టు చూడమనేవాడట. ఒకే సన్నివేశాన్ని మళ్లీ మళ్లీ నటించవచ్చనేది ధర్మేంద్ర ప్లాన్. వీళ్లిద్దరి పెళ్లితో... నిర్మాతలకు తీసిన సీన్లనే మళ్లీ మళ్లీ తీసే ఖర్చు తప్పింది. కంప్లీట్ ఉమన్ డాన్సర్‌గా, నటిగా కెరీర్ ప్రారంభించిన హేమమాలిని పెళ్లి తర్వాత తెరమరుగైపోలేదు. ఇద్దరు అమ్మాయిలకు తల్లయ్యారు, వాళ్లను డాన్సర్లుగా తీర్చిదిద్దారు. పెద్దమ్మాయి ఈషాను నటనలోకి, రెండో అమ్మాయి అహానాను డైరెక్షన్లోకి తీసుకువచ్చారు. కూతుళ్లతోపాటు నాట్య ప్రదర్శనలిస్తుంటారు, అక్కడ వాళ్లకు సూచనలిచ్చే పెద్దక్కలా కనిపిస్తారు. ఉత్తమ నటిగా 1972లో ఫిలింఫేర్ అవార్డుకు ఎంపికైన హేమ, దశాబ్దాల పాటు కెరీర్లో నిలదొక్కుకుని అదే ఫిలింఫేర్ నుంచి 2000 సంవత్సరంలో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారాన్ని అందుకున్నారు. అదే ఏడాది పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్న డ్రీమ్‌గర్ల్‌ను.. ‘పర్పథమ్ పథ్ సింఘానియా’ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. ప్రచారం నుంచి పార్లమెంట్‌కి సహనటుడు వినోద్ ఖన్నాకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేయడానికి 1999లో మైక్ పట్టుకున్నారు (వినోద్ ఖన్నా పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు) హేమమాలిని. ఆ తర్వాత నాలుగేళ్లకే హేమమాలినిని పెద్దల సభలోకి స్వాగతించింది బీజేపీ. 2003 నుంచి 2009 వరకు ఆరేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగిన హేమమాలిని 2010లో బీజేపీ జనరల్ సెక్రటరీ బాధ్యతలు చేపట్టారు. 2014లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. ఆమె పార్లమెంట్ అభ్యర్థిగా ప్రజల్లోకి రావడం అదే మొదటిసారి. మధుర నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఆర్ఎల్డి అభ్యర్థి జయంత్ చౌదరి మీద మూడు లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారామె. జయంత్ చౌదరి అప్పుడు సిట్టింగ్ ఎంపీ, ఆర్ఎల్డి (రాష్ట్రీయ లోక్‌దళ్) పార్టీ వైస్ ప్రెసిడెంట్ కూడా. ఇప్పుడు మళ్లీ మధుర నుంచి గెలిచి తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు హేమమాలిని. ఈ సారి ఆమె ప్రత్యర్థి ఆర్ఎల్డి అభ్యర్థి కున్వర్ నరేంద్ర సింగ్. అతడిపై హేమ దాదాపుగా మూడు లక్షల మెజారిటీ సాధించారు. నియోజకవర్గంలో అరవై శాతం మంది తమకు ప్రతినిధిగా డ్రీమ్‌గర్లే ఉండాలని ఆకాంక్షించారు. ఈ విజయంతో ఆమె సంసద్ భవన్‌లోకి మూడవసారి అడుగుపెట్టనున్నారు. ఓట్ల పంట హేమమాలిని మార్చి 31వ తేదీన... ‘గోవర్థన క్షేత్రం నుంచి తన ఎన్నికల ప్రచారం మొదలైంద’ని ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఆమె పోస్ట్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయింది. గొప్ప నటి అని ఒకరు, ఆమెకు ఉత్తమ నటి అవార్డు ఇవ్వవచ్చని ఒకరు, ఎప్పుడూ ఇలానే చేస్తే బావుణ్ను అని ఒకరు, ఓట్ల కోసం రాజకీయ నాయకులు ఎలాంటి నాటకాలైనా వేస్తారు, అసలే నటి కదా, ఇక నటనకు ఏం తక్కువ అని ఒకరు... కామెంట్ చేశారు. మీడియా కూడా ఒక ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని ప్రస్తావించింది. అప్పుడామె ‘‘దారిన ప్రయాణిస్తున్నప్పుడు బంగారు రంగులో మెరిసిపోతున్న పంటపొలాలు నన్ను ఆకర్షించాయి. కోతకు సిద్ధంగా ఉంది పంట. పొలంలోకి దిగగానే పంట కోస్తున్న మహిళలు ఎదురొచ్చి ఆదరంగా స్వాగతించారు. వారి దగ్గరున్న కొడవలి అందుకుని నేనూ పంట కోసి కట్టలు కట్టాను’’ అంటూ... దీనికి పెద్దగా చర్చ అవసరం లేదని తేలిగ్గా తీసిపారేశారామె. అయితే ఎవరెన్ని రకాలుగా వ్యంగ్యాస్త్రాలు సంధించినా, మధుర మహిళలు మాత్రం బంగారు రంగు మేనిఛాయతో మెరిసిపోతూ... తమతోపాటు పొలంలో దిగి గోధుమ పంటను కోసిన డ్రీమ్‌గర్ల్‌ను ఇట్టే తమతో కలుపుకున్నారు. ఆమె గడచిన ఐదేళ్లలో లోక్‌సభలో తమ కోసం ప్రశ్నించిన సందర్భాలు చాలా తక్కువనే వాస్తవాన్ని కూడా పక్కన పెట్టి మరీ ఆమె కోసం ఓట్ల పంట పండించారు. అందరిలో ఒకరిలా..! హేమమాలినిలో ఆడంబరత్వం కనిపిస్తుంది కానీ.. పనిగట్టుకుని ఎప్పుడూ ఆమె ఆడంబరాలను ప్రదర్శించలేదు. కారు, ఎస్కార్టు లేకుండా ఆటోలో వెళ్లడానికి ఏ మాత్రం సంశయించరు. గత ఏడాది ఆగస్టులో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి అంత్యక్రియలకు హాజరయ్యారామె. ఆమెకు డ్రైవింగ్ హాబీ కావడంతో సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లారప్పుడు. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత జనంతో కిక్కిరిసి పోయి ఉన్న ఆ ప్రాంగణంలో తన కారు బయటకు వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో, అత్యంత సాధారణమైన మహిళలాగ రోడ్డు మీదకు వచ్చి ఆటో ఆపి ఎక్కేశారు. హేమమాలిని, ఆమెతోపాటు వచ్చిన మరో మహిళ ఇద్దరూ కలిసి ఆటోలో వెళ్లడాన్ని చూసిన వాళ్లు ఆశ్చర్యపోయారు. కానీ ఆమెను బాగా తెలిసిన వాళ్లు మాత్రం... గతంలో కూడా ఓ సారి ఇస్కాన్ టెంపుల్‌కి వెళ్లాల్సిన టైమ్‌కి డ్రైవర్ అందుబాటులో లేకపోవడంతో, డ్రైవర్ కోసం ఎదురు చూడకుండా ఆమె ఆటో పిలిపించుకుని వెళ్లిపోయిన సంగతిని గుర్తు చేసుకున్నారు. బంధువులు, స్నేహితుల ఇళ్లకు వెళ్లేటప్పుడు కూడా మామూలు మహిళలా వెళ్లడానికే ఇష్టపడతారామె.హేమమాలినిని ‘మరీ సన్నగా ఉంద’నే కారణంతో తమిళ ఇండస్ట్రీ పక్కన పెట్టింది. ఆ సన్నదనాన్నే బాలీవుడ్ కోరుకుంది. హేమ 1977లో ‘డ్రీమ్ గర్ల్’ సినిమాలో నటించినప్పటి నుంచి ఆమెకా పేరు స్థిరపడిపోయింది. ఇప్పటికీ హేమ డ్రీమ్ గర్లే. – వాకా మంజులారెడ్డి వివాదాలు.. విపరీతార్థాలు నాలుగేళ్ల కిందట 2015లో హేమమాలిని ఆగ్రా నుంచి జైపూర్‌కి వెళ్తున్నప్పుడు ఆమె మెర్సిడెస్ కారు ఒక ఆల్టో కారు మీదకు దూసుకుపోయింది. ఆ ప్రమాదంలో హేమమాలిని, ఆల్టోలో ఉన్న ఇద్దరు మహిళలు గాయపడ్డారు, ఆల్టోలో ఉన్న నాలుగేళ్ల పాపాయి ప్రాణాలు పోయాయి. ఆ ప్రమాదం తీవ్రమైన వివాదానికి దారి తీసింది. ఆల్టో కారును నడుపుతున్నది ఆ పాపాయి తండ్రే. అతడు ఇండికేటర్ వేయకుండా టర్నింగ్ తీసుకోవడం వల్లనే ప్రమాదం జరిగిందని హేమమాలిని అనడంతో వివాదం రాజుకుంది. ఆమెకు ప్రమాదంలో తగిలిన గాయాల కంటే ఈ వివాదగాయమే పెద్ద తలనొప్పిగా మారిందప్పట్లో.మరో వివాదం బృందావన్ విషయంలో ఎదురైంది. ఏ దారీ లేని వితంతువులకు బృందావన్ ఆశ్రయం కల్పిస్తుంది. అయితే వెస్ట్‌బెంగాల్, బీహార్ నుంచి వచ్చే వితంతువులకు అనుమతి నిరాకరించాలని హేమమాలిని అనడం పెద్ద దుమారాన్నే లేపింది. దీంతోపాటు మరో వివాదం ఆమె డాన్స్ స్కూల్ తెచ్చి పెట్టింది. హేమమాలిని డాన్స్ స్కూల్ ‘నాట్య విహార కళాకేంద్ర’ ముంబయి శివార్లలోని అంధేరీ ప్రాంతంలో ఉంది. రెండువేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న కోట్లాదిరూపాయల విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని కేవలం డెబ్బై వేల రూపాయలకే ఆమెకు కేటాయించడాన్ని తప్పు పట్టాయి ప్రతిపక్షాలు. వీటితోపాటు పార్లమెంట్ సమావేశాల్లో ఆమె హాజరు తక్కువగా ఉండడం కూడా ఆమె వివరణ ఇచ్చుకోలేని గట్టి విమర్శ. -
225 మంది కోటీశ్వరులేనట..!
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్నాయి. రేపు ఏడో దశ ఎన్నికల పోలింగ్‌తో ఓట్ల పండుగ సమాప్తం కానుంది. మరో మూడు రోజులు ఎదురు చూస్తే.. మే 23న రాజు ఎవరో బంటు ఎవరో తేలిపోతుంది. ఈ నేపథ్యంలో ఈ సారి సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచిన మహిళా అభ్యర్థులు కేవలం 724 మంది మాత్రమే. చిన్న రాజకీయ పార్టీలు మహిళలకు ఎక్కువ సీట్లు కేటాయించగా.. జాతీయ పార్టీలు మాత్రం ఈ విషయంలో చాలా వెనకబడ్డాయి. బరిలో నిలిచిన మహిళా అభ్యర్థులు అఫిడవిట్లలో వెల్లడించిన వివరాలను విశ్లేషించిన నేషనల్ ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ సంస్థలు అభ్యర్థుల నేర చరిత్ర, విద్య, ఆర్థిక అంశాల గురించి సంయుక్తంగా ఓ రిపోర్డును విడుదల చేశాయి. మొత్తం 724 మంది బరిలో నిలవగా.. 716 మంది అఫిడవిట్లును పరిశీలించిన మీదట ఈ రిపోర్టును విడుదల చేసినట్లు సదరు సంస్థలు వెల్లడించాయి. వివరాలు సరిగా లేనందువల్ల మిగతా ఎనిమిది మంది అఫిడవిట్లను పరిశీలించలేదని పేర్కొన్నాయి. రిపోర్టులోని వివరాలు.. నేర చరితులు.. మొత్తం 724 మంది మహిళలు బరిలో నిలవగా.. వీరిలో 110 మంది మీద క్రిమినల్ కేసులుండగా.. వీరిలో 78 మంది సీరియస్ క్రిమినల్ కేసులున్నట్లు సదరు రిపోర్టు వెల్లడించింది. ఇక పార్టీలపరంగా నేరచరితుల వివరాలు.. కాంగ్రెస్ పార్టీ నుంచి 54 మంది మహిళా అభ్యర్థులు బరిలో నిలవగా.. వారిలో 14 మంది మీద కేసులుండగా.. 10 మీద సీరియస్ క్రిమినల్ కేసులున్నట్లు తెలిపింది. ఇక అధికార బీజేపీ నుంచి 53 మంది పోటీ చేయగా.. 18 మంది క్రిమినల్ కేసులుండగా.. 10 మంది మీద తీవ్రమైన క్రిమినల్ కేసులున్నాయి. బీఎస్పీ నుంచి 24 మంది మహిళా అభ్యర్థులు బరిలో నిలవగా.. ఇద్దరి మీద, తృణమూల్ నుంచి 23 మంది పోటీ చేయగా.. ఆరుగురు నేర చరితులుండగా.. వారిలో నలుగురి మీద తీవ్ర క్రిమినల్ కేసులున్నట్లు తెలిసింది. ఇక 222 మంది స్వతంత్య్ర అభ్యర్థులు బరిలో నిలవగా.. వీరిలో అత్యల్పంగా కేవలం 22 మంది నేర చరితులుండగా.. 21 మంది మీద తీవ్ర నేరారోపణలు ఉండటం గమనార్హం. ఆర్థిక నేపథ్యం.. ఈ 716 మందిలో 255 మంది కోటీశ్వరులే కావడం విశేషం. అభ్యర్థుల సగటు ఆస్తి రూ.5.63 కోట్లుగా ఉంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో మథుర నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీచేస్తున్న హేమమాలిని రూ.250 కోట్ల ఆస్తులతో కోటీశ్వరులైన మహిళా అభ్యర్థుల్లో మొదటి స్థానాన్ని ఆక్రమించారు. రూ.220 కోట్ల ఆస్తులతో ఆంధ్రప్రదేశ్‌లోని రాజంపేట టీడీపీ అభ్యర్థి డీఏ సత్యప్రభ రెండో స్థానంలో ఉండగా.. శిరోమణి అకాళీ దళ్ పార్టీ తరఫున పంజాబ్ బఠిండ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ రూ. 217 కోట్ల ఆస్తులతో మూడో స్థానంలో నిలిచారు. ఎనిమిది మంది మాత్రం తమ పేరిట అసలు ఆస్తులు లేవని వెల్లడించారు. విద్యావంతులు.. ఇక 724 మందిలో 232 మంది అభ్యర్థుల విద్యార్హత ఐదు నుంచి ఇంటర్ లోపే. 396 మంది డిగ్రీ ఉత్తీర్ణులయినట్లు వెల్లడించగా.. 37 మంది అక్షరాస్యులు(రాయడం, చదవడం వరకే పరిమితం) కాగా 26 మంది నిరాక్షరాస్యులుగా ప్రకటించుకున్నారు. ఇక పోటీ చేసిన వారిలో 25 - 50 ఏళ్ల వయసు వారు 531 మంది ఉండగా.. 50 - 81 ఏళ్ల లోపు వారు 180 మంది కాగా.. ఒక్కరు మాత్రం తన వయసు 80 ఏళ్ల కన్నా ఎక్కువే అన్నారు. మరో ముగ్గురు అభ్యర్థులు తమ వయసు వివారాలు వెల్లడించకపోగా.. ఒక అభ్యర్థి తన వయసు 25 కంటే తక్కువగా ప్రకటించారు. -
‘ఫ్రూటీ, సమోసా ఇచ్చి చెడగొడుతున్నారు’
లక్నో : మథుర బీజేపీ ఎంపీ అభ్యర్థి హేమా మాలిని ఎన్నికల ప్రచారంలో భాగంగా సుధామ కుతిలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులతో ముచ్చటించిన హేమా మాలిని పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోతుల సమస్య గురించి చర్చిస్తూ.. ‘కోతులు ఎక్కడికి వెళ్తాయి. అవి కూడా మనతోపాటే ఉండాలి. అసలు సమస్య ఏంటంటే.. ఇక్కడికి వచ్చే పర్యాటకులు కోతులకు సమోసా, ఫ్రూటీ ఇచ్చి వాటిని చెడగొడుతున్నారు. కోతులకు ఇలాంటి ఆహారం ఇవ్వకూడదు. కేవలం పండ్లు మాత్రమే ఇవ్వండి’ అని పేర్కొన్నారు. #WATCH Vrindavan: BJP MP Hema Malini at Sudama Kuti answers a question on monkey menace in the area. She says, "Coexistence hai na. Monkey kahan jaega? Problem kya hai, yahan aane waale yaatri Frooti dete hain, samosa de de ke unko kharab kar diya. Unko sirf phal dijiye." pic.twitter.com/NJzJvEE6nA — ANI UP (@ANINewsUP) April 11, 2019 అంతేకాక కోతుల సమస్య అంతటా ఉందని హేమా మాలిని తెలిపారు. ఓమాక్స్ హౌసింగ్‌లో తనకొక చిన్న ఇల్లు ఉందని.. అక్కడ కూడా కోతుల సమస్య చాలా ఎక్కువగా ఉందన్నారు. ఈ నెల 1న ఎన్నికల ప్రచారం ప్రారంభించిన హేమా మాలిని..దానిలో భాగాంగా వ్యవసాయ క్షేత్రంలో మహిళా కూలీలతో కలిసి గోధుమ పంటని కోసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తీసిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో కోతల మాలిని అంటూ నెటిజన్లు ఆమెని ట్రోల్ చేశారు. -
కోతల మాలిని
హేమమాలిని. బాలీవుడ్ డ్రీమ్‌గర్ల్. ఏడు పదులు దాటినా వన్నె తరగని అందం. ఎన్నికలొస్తున్నాయ్ కదా. సినీ గ్లామర్ అన్ని వేళలా ఓట్లు కురిపించదని ఆమెకు బాగా తెలుసు. ఉత్తరప్రదేశ్‌లో మ«థుర నియోజకవర్గం నుంచి మరోసారి ఎన్నిక కోసం బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన ఆమె ఏప్రిల్ 1న ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మథురకు 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోవర్థన్ వ్యవసాయ క్షేత్రంలో మహిళా కూలీలతో కలిసి గోధుమ పంటల్ని కోశారు. కాసేపు వారితో ముచ్చట్లాడారు. ఆ ఫొటోలన్నీ ట్విట్టర్లో షేర్ చేస్తే 14 వేల లైక్‌లు దాటిపోయాయి. తమ కలల రాణి మండుటెండల్లో చెమట్లు కక్కుతూ పని చేయడంతో కందిపోయిన ఆ ముఖారవిందాన్ని చూసి కొందరు అభిమానుల హృదయాలు జాలితో ఉప్పొంగాయి. ఆ ఫొటోలకు లైక్‌లపై లైక్‌లు కొట్టారు. అయితే చాలామంది నెటిజన్లు భారీగా ట్రోలింగ్ చేశారు. ‘ఇక నటించింది చాలు. నియోజకవర్గం సంగతి చూడండ’ంటూ చురకలంటించారు. కలల రాణి.. వివాదాల వాణి ♦ శ్రీ కృష్ణుడి జన్మస్థానమైన మథుర నియోజకవర్గం నుంచి గత లోక్‌సభ ఎన్నికల్లో హేమమాలిని గెలుపొందారు. ఈ అయిదేళ్లలో నియోజకవర్గం అభివృద్ధికి ఆమె ఏమీ చెయ్యకపోగా పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్నారు. ♦ 2016లో మథురలో పోలీసులకు, కబ్జాదారులకు మధ్య ఘర్షణలు జరిగి. 24 మంది ప్రాణాలు కోల్పోయి రక్తం ఏరులై పారితే అదే సమయంలో ఆమె సినిమా షూటింగ్లో ఉన్నారు. పైపైచ్చు ‘నేను ఒక ఆర్టిస్టుని. సినిమా షూటింగ్లో తీరిక లేకుండా ఉన్నా. ఇప్పటికే డేట్స్ కూడా ఇచ్చాను. సినిమా విడుదల ఆగిపోకూడదు. మథురలో జరిగిన ఘటన చాలా దురదృష్టకరం’ అంటూ ఒక ట్వీట్ చేసి చేతులు దులుపుకున్నారు. అది వివాదాస్పదం కావడంతో అధిష్టానం హేమమాలినిపై సీరియస్ అయింది. దీంతో హేమ ఆ ట్వీట్‌ను తొలగించి మర్నాడే నియోజకవర్గానికి వచ్చి బాధితుల్ని పరామర్శించారు. ♦ మథుర నుంచి జైపూర్‌కు వెళుతుండగా హేమమాలిని ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న మరో కారుని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హేమమాలినికి గాయాలయ్యాయి. ఎదురు కారులో ఉన్న నాలుగేళ్ల బాలుడు చనిపోయాడు. తల్లిదండ్రులకు తీవ్ర గాయాలయ్యాయి. హేమమాలినిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి వైద్య సాయం అందించిన ఆమె అనుచరగణం ప్రమాదంలో గాయపడిన సామాన్యుల్ని పట్టించుకోలేదు. గాయాల నుంచి కోలుకున్న తర్వాత హేమమాలిని.. ఆ కుటుం బాన్ని పరామర్శించకపోగా ఆ బాలుడి తండ్రిదే తప్పన్నట్టు మాట్లాడారు. ఆయన ట్రాఫిక్ రూల్స్ పాటించలేదని దుయ్యబట్టారు. ఈ ఘటన కూడా అప్పట్లో వివాదాస్పదమైంది. ♦ ముంబైలోని అత్యంత ఖరీదైన అంధేరి ప్రాంతంలో తన డ్యాన్స్ అకాడమీ నాట్య విహార్ కేంద్ర చారిటీ ట్రస్ట్ కోసం కారుచౌకగా భూమి సంపాదించారన్న ఆరోపణలున్నాయి. రూ.50 కోట్ల విలువైన ఆ భూముల్ని హేమమాలిని అక్రమ మార్గాల్లో రూ.70 వేలకే పొందారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. పార్లమెంటులో హాజరు అంతంత మాత్రం లోక్‌సభ ఎంపీగా నియోజకవర్గం సమస్యలు ఏమైనా లేవనెత్తారా అంటే అదీ లేదు. లోక్‌సభలో హేమమాలిని హాజరు శాతం 39 శాతమే. ఇది జాతీయ సగటు హాజరు (80 శాతం) కంటే చాలా తక్కువ. ఈ అయిదేళ్లలో కేవలం 17 చర్చల్లో పాల్గొన్నారు. (జాతీయ సగటు 67 చర్చలు) పొలాల్లో చెమటోడిస్తే ఓట్ల పంట పండుతుందా? హేమమాలిని మథురలో ఏటికి ఎదురీదుతున్నారు. ఈ ఐదేళ్లలో ఆమె నియోజకవర్గం అభివృద్ధికి ఏమీ చేయలేదన్న అసంతృప్తి స్థానికుల్లో ఉంది. ‘సినీతారలు పనెక్కడ చేస్తారు. ఆమె ఎప్పుడు ఇక్కడికి వచ్చినా నేరుగా గెస్ట్‌హౌస్‌కి వెళ్లిపోతారు. ప్రజల సమస్యలు పట్టించుకోరు. తాగునీటి సమస్య ఉంది. పబ్లిక్ టాయిలెట్ సౌకర్యాలు లేవు. పర్యాటకులు ఎక్కువగా వచ్చే కృష్ణుడి జన్మస్థానంలో అన్నీ సమస్యలే’ అని కొందరు స్థానికులు ఆమెపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. గతంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి హేమమాలిని పాల్గొన్న ర్యాలీలకు జనం స్పందన అంతంత మాత్రంగానే ఉంది. దీంతో ఆమెకు టికెట్ మళ్లీ ఇవ్వరాదనే డిమాండ్లు కూడా వచ్చాయి. ఎలాగోలా టికెట్ దక్కించుకున్నప్పటికీ డ్రీమ్ గర్ల్‌కి ఈసారి ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురవుతోంది. ఈసారి ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ పొత్తులో భాగంగా మథుర స్థానాన్ని ఆర్ఎల్డీకీ కేటాయించారు. ఆ పార్టీ నుంచి కన్వర్ నాగేంద్రసింగ్ బరిలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ నుంచి మహేశ్ పాఠక్ పోటీ చేస్తున్నారు. త్రిముఖ పోటీలో ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి. కలల రాణికి ఈ ఎన్నికలు కల్లలుగా మారుతాయనే ప్రచారమైతే సాగుతోంది. ట్రోలింగ్ ఇలా... ♦ మీరు డ్రీమ్ గర్లా, డ్రామా గర్లా? ♦ ఈ ఫొటోలు ట్విటర్లో పోస్టు చేయడానికి సరైన సమయాన్ని ఎంచుకున్నారు. ఇవాళ ఏప్రిల్ ఫస్ట్. అంటే ఏంటో తెలుసు కదా! ♦ అయిదేళ్ల కిందట నుంచి ఇలా పని చేసి ఉంటే మీరే విజేతగా నిలిచి ఉండేవారు. ఆల్ ది బెస్ట్. -
వరి కోసిన హేమ.. ఓట్ల కోసమే రామ!
లక్నో : దేశమంతా సార్వత్రిక ఎన్నికల కోలాహలం నడుస్తోంది. ఎక్కడ చూసినా నేతల ప్రచారాలే దర్శనమిస్తున్నాయి. ఓటర్ల మన్ననలు పొందడానికి అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు. అలవాటు లేని పనులు చేస్తున్నారు. ఓటర్లు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. వినూత్నరీతిలో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఓటర్ల మెప్పు పొందడం కోసం ఒకప్పటి బాలీవుడ్ డ్రీమ్ గర్ల్, మధుర నియోజవర్గం బీజేపీ ఎంపీ అభ్యర్థి హేమమాలిని సినిమాటిక్ స్టైల్లో ప్రచారం చేస్తున్నారు. ఆదివారం ఎన్నికల ప్రచారం ప్రారంభించిన హేమ.. మహిళా ఓటర్లపై దృష్టి పెట్టారు. నియోజకవర్గంలోని గోవర్దన క్షేత్ర ప్రాంతంలో ప్రచారం నిర్వహించిన ఆమె.. దారిలో పొలాల వద్ద కనిపించిన మహిళా రైతులకు వద్దకు వెళ్లారు. కొడవలి చేతపట్టి వారితో పాటు వరి కోశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ‘ ఎన్నికల ప్రచారంలో భాగంగా గోవర్దన క్షేత్ర ప్రాంతంలోని మహిళలను కలుసుకున్నాను. మొదటి రోజు ప్రచారంలో పొలాల వద్ద ఉన్న మహిళతో కలిసి మాట్లాడడం అదృష్టంగా భావిస్తున్నాను’ అంటూ ఆ మహిళలతో దిగిన ఫోటోలను ట్విటర్లో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Began my Lok Sabha campaign today with the Govardhan Kshetra where I had the opportunity to interact with women working in the fields. A few fotos for u of my first day of campaign pic.twitter.com/EH7vYm8Peu — Hema Malini (@dreamgirlhema) March 31, 2019 -
రూ.100 కోట్లు దాటేసిన డ్రీమ్ గర్ల్ ఆస్తులు
సాక్షి, మథుర : బీజేపీ ఎంపీ, అలనాటి బాలీవుడ్ హీరోయిన్ హేమమాలిని బిలయనీర్‌గా అవతరించారు. మథుర పార్లమెంటరీ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు సమయంలో తన ఆస్తుల వివరాలను ప్రకటించారు. తనతోపాటు, ఆమె భర్త బాలీవుడ్ సీనియర్ హీరో ధర్మేంద్ర ఆస్తులను కూడా ఆమె ఎన్నికల కమిషన్‌కు సమర్పించారు. విలువైన బంగాళాలు, ఆభరణాలు, నగదు, షేర్లు, టర్మ్ డిపాజిట్లు అన్నీ కలిపి తన ఆస్తుల విలువ ప్రస్తుతం రూ. 101 కోట్లుగా ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించారు. గత ఐదేళ్లలో ఆమె సంపద రూ. 34.46 కోట్ల మేర పెరిగింది. హేమమాలిని ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్ ఆధారంగా ఆమె 2014 జనరల్ ఎన్నికలకు ముందు రూ. 66 కోట్ల విలువైన ఆస్తులను కలిగి ఉన్నారు. భర్త ధరేంద్ర ఆస్తులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12.30 కోట్ల రూపాయలు పెరిగాయి. ఇక ఆమె విద్యార్హతల విషయానికి వస్తే.. డాన్స్‌కోసం తొమ్మిదేళ్ల వయసులోనే చదువుకు స్వస్తి పలికినా.. ఆ తరువాత మెట్రిక్ పాసవ్వడంతోపాటు ఉదయపూర్ యూనివర్శిటీ నుంచి పీహెచ్డీ చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం అందించే పద్మశ్రీ అవార్డును దక్కించుకున్నారు. 2014 ఎన్నికల కంటే ముందు ఆమె 2003-2009, 2012-12 మధ్య కాలంలో రెండు సార్లు రాజ్యసభ సభ్యురాలిగా పనిచేశారు. మరోవైపు మథుర నియోజవర్గం కోసం తాను చాలా చేశానని హేమమాలిని చెప్పుకొచ్చారు. దాదాపు వెయ్యి గ్రామాలున్న మథుర నియోజకవర్గ ప్రజల కోసం చాలా అభివృద్ధి పనులు చేశానన్నారు అయితే ఏమేమి పనులు చేసిందీ తనకు స్పష్టంగా గుర్తు లేదన్నారు. ఈ నేపథ్యంలో తాను ఈసారి ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తానన్న ధీమాను వ్యక్తం చేశారు. అంతేకాదు తనకివే చివరి ఎన్నికలని, భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో తాను పోటీచేయనని కూడా హేమమాలిని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
నాకివే చివరి ఎన్నికలు..!
సాక్షి, న్యూఢిల్లీ: తనకివే చివరి ఎన్నికలని, భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో తాను పోటీచేయనని బీజేపీ నాయకురాలు, ఒకప్పటి బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమామాలిని అన్నారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హేమామాలిని మాట్లాడుతూ.. ‘ఇవి నా చివరి ఎన్నికలు. భవిష్యత్‌లో నేను ఎన్నికల బరిలో నిలవను. నేను సిట్టింగ్ ఎంపీగా ఉన్న మధుర నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీ చేసే అవకాశాన్ని కల్పించిన అమిత్ షా, మోదీలకు నా కృతజ్ఞతలు. నేను మిగిలిన రాజకీయ నాయకుల్లాంటి దాన్ని కాను. మధుర అభివృద్ధికి నేను పడిన కష్టం ప్రజలకు తెలుసు. వాళ్ల కోరిక మేరకే ఇక్కడ పోటీకి దిగుతున్నాన’ని వివరించారు. దేశంలోని 184 నియోజకవర్గాలకు తమ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. యూపీలోని మధుర నియోజవర్గం నుంచి బరిలోకి సిట్టింగ్ ఎంపీ, నటి హేమామాలినీనే నిలపాలని కాషాయ పార్టీ నిర్ణయించింది. మధురలో హేమామాలినీకి పోటీగా మహేశ్ ఠాకూర్‌ను ఎంచుకుంది కాంగ్రెస్ అధిష్టానం. ఉత్తర్‌ప్రదేశ్‌లో 6 దశల్లో లోక్‌సభ పోలింగ్ జరగనుంది. అక్కడ మొదటి విడత ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 11న జరుగుతాయి. ఫలితాలు మే 23న వెలువడతాయి. -
ఆమె డ్యాన్స్ చేస్తేనే మీకు ఓట్లు!
భోపాల్ : ఎన్నికల ముందే బీజేపీ-కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్దం తీవ్ర స్థాయికి చేరింది. ఇరు పార్టీల నేతలు వ్యక్తిగతంగా దూషించుకుంటూ రచ్చకెక్కుతున్నారు. ఎన్నికల ప్రణాళికలో భాగంగా కాంగ్రెస్.. ప్రియాంక గాంధీని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించిన విషయం తెలిసిందే. ఈ నియామకంపై బీజేపీ నేతలు వ్యక్తిగతంగా విమర్శలు చేయడం.. దీనికి కాంగ్రెస్ సైతం అదే రీతిలో తిప్పికొడుతుండటం రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. జనాకర్షక నేతలు లేకనే కాంగ్రెస్ చాక్లెట్ ఫేస్వంటి ప్రియాంక గాంధీని తెరపైకి తీసుకొచ్చిందని బీజేపీ నేత ఖైలాష్ విజయ్‌వర్గీయాస్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ కాంగ్రెస్‌కు జనాకర్షక నేతలే లేరు. అందుకే అందమైన ముఖాలను తీసుకొచ్చి ఎన్నికల్లో ఓట్లు పొందాలని భావించింది. దీని కోసం కొందరు కరీనా కపూర్‌ను, మరికొందరు సల్మాన్ ఖాన్‌ను సూచించారు. కానీ కాంగ్రెస్ చివరకు ప్రియాంక గాంధీని తీసుకొచ్చింది’ అని వ్యాఖ్యానించారు. ప్రియాంక అందాన్ని చాక్లెట్‌తో పోల్చడం వివాదానికి కారణమైంది. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మంత్రి సజ్జన్ సింగ్ వర్మ తీవ్రంగా స్పందించారు. ‘బీజేపీలో కూడా జనాకర్షక నేతలు ఎవరూ లేరు. ఆ పార్టీలోని నేతల ముఖాలను కనీసం జనాలు కూడా గుర్తించలేరు. వారి పార్టీలో ఒకరే ఒకరున్నారు. ఆమె నటి హేమమాలిని. రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీ ఓట్లు పొందాలంటే హెమమాలినితో క్లాసికల్ డ్యాన్స్ చేయించాల్సిందే. ఆమె క్లాసికల్ డ్యాన్స్ అదరగొడితేనే బీజేపీకి ఓట్లు పడతాయి. మనల్ని దేవుడు సృష్టిస్తాడు. మన రూపాన్నిచ్చేది కూడా ఆయనే. ప్రజలు ప్రతి ఒక్కరిని ఆదరించాల్సిందే. దేవుడు ప్రియాంకను అందంగా పుట్టించడం ఆమె తప్పుకాదు. అందంగా ఉన్నవారిని బీజేపీ ప్రశంసించాలి. కానీ ఇలా వ్యాఖ్యానించకూడదు. ప్రియాంక పట్ల ఈ తరహా వ్యాఖ్యలతో విజయ్ వర్గీయాస్ తన గౌరవాన్ని పోగొట్టుకున్నారు. సొంత పార్టీ నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు’ అని ఘాటుగా బదులిచ్చాడు. ప్రియాంక అందంపై నోరు జారిన బీజేపీ నేత ఖైలాష్ విజయ్వర్గీయాస్పై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆయన తన వ్యాఖ్యల పట్ల వివరణ ఇచ్చుకున్నారు. తాను ప్రియాంకను ఉద్దేశించి చాక్లెట్ అనే పదం వాడలేదని, బాలీవుడ్ నటులను ప్రస్తావిస్తూ అన్నానని పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికి ఇరుపార్టీల ఈ తరహా మాటలు పొలిటికల్ హీట్‌ను పెంచుతోంది. -
స్క్రీన్ టెస్ట్
1. ‘ఈ జెండా పసిబోసి చిరునవ్వురా, దాస్య సంకెళ్లు తెంచిందిరా..’ అనే పాట మహేశ్‌బాబు నటించిన ఓ చిత్రంలోనిది. ఈ పాటలో ఓ పసిబాబు చేతిలో నుండి జాతీయ జెండా ఓ కొండపై నుండి కింద పడుతుంది. ఆ జెండా కింద పడకుండా హీరో పట్టుకునే ఈ సీన్ ఏ సినిమాలోనిది? ఎ) బాబీ బి) అతడు సి) ఖలేజా డి) ఒక్కడు 2. అక్కినేని, సావిత్రి జంటగా నటించిన చిత్రం ‘వెలుగు నీడలు’. ఈ చిత్రంలోని ‘పాడవోయి భారతీయుడా’ పాట రచయితెవరో కనుక్కోండి? ఎ) కొసరాజు బి) ఆత్రేయ సి) శ్రీశ్రీ డి) సినారె 3. ‘తెలుగు వీర లేవరా, దీక్ష బూని సాగరా...’ అనే పాటలో నటించిన నటుడెవరో తెలుసా? ఎ) శోభన్‌బాబు బి) యన్టీఆర్ సి) అక్కినేని డి) కృష్ణ 4. ‘జననీ జన్మ భూమిశ్చ, స్వర్గాదపీ గరీయశీ...’ అనే పాట రచించింది, దర్వకత్వం వహించింది ఒక్కరే. ఎవరా దర్శకుడు? ఎ) ముత్యాల సుబ్బయ్య బి) దాసరి నారాయణరావు సి) రవిరాజా పినిశెట్టి డి) కోడి రామకృష్ణ 5. ‘దేశం మనదే.. తేజం మనదే.. ఎగురుతున్న జెండా మనదే...’ అనే పాటలో నటించిన నటుడెవరో తెలుసా? (చిన్న క్లూ: ఈ చిత్రానికి తేజ దర్శకుడు) ఎ) ఉదయ్‌కిరణ్ బి) నవదీప్ సి) ప్రిన్స్ డి) దిలీప్ రెడ్డి 6. ‘కొంతమంది సొంత పేరు కాదుర గాంధీ, ఊరుకొక్క వీధి పేరు కాదురా గాంధీ...’ పాట శ్రీకాంత్ నటించిన 100వ చిత్రం ‘మహాత్మ’ లోనిది. కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. ఈ దేశభక్తి గీతం సూపర్‌హిట్. ఈ పాటలో నటించిన క్యారెక్టర్ నటుని పేరేంటి ? ఎ) రామ్‌జగన్ బి) తనికెళ్ల భరణి సి) పరుచూరి గోపాలకృష్ణ డి) అజయ్ ఘోష్ 7. ‘మేజర్ చంద్రకాంత్’ చిత్రంలోని ‘పుణ్యభూమి నా దేశం నమో నమామి... జన్మ భూమి నాదేశం సదా స్మరామి...’ అనే పాటలో యన్టీఆర్ నటించారు. ఆ పాటను రచించింది జాలాది. సంగీత దర్శకుడెవరో తెలుసా? ఎ) మణిశర్మ బి) యంయం కీరవాణి సి) రాజ్–కోటి డి) చక్రవర్తి 8. ‘వినరా వినరా దేశం మనదేరా, అనరా అనరా రేపిక మనదేరా’ పాట ఏ చిత్రంలోనిది? (మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు). ఎ) బొంబాయి బి) రోజా సి) దిల్సే డి) దళపతి 9. ‘వందేమాతరం’ చిత్రంలోని ‘వందేమాతరం, వందేమాతరం... వందేమాతర గీతం వరస మారుతున్నది... తరం మారుతున్నది, ఆ స్వరం మారుతున్నది..’ అనే పాటతో శ్రీనివాస్ ఇంటి పేరు ‘వందేమాతరం’ అయింది. ఈ పాటలో నటించింది హీరో రాజశేఖర్, హీరోయిన్గా నటించింది ఎవరో తెలుసా? ఎ) విజయశాంతి బి) భానుప్రియ సి) సుమలత డి) జీవిత 10. ‘భారత మాతకు జేజేలు... బంగరు భూమికి జేజేలు’ పాట యన్టీఆర్ నటించిన ‘బడిపంతులు’ చిత్రంలోనిది. పీసీ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యన్టీఆర్ మనవరాలిగా నటించిన బాల నటి ఎవరో కనుక్కోండి? (తర్వాత కాలంలో ఆమె యన్టీఆర్ సరసన హీరోయిన్గా నటించారు) ఎ) విజయనిర్మల బి) జయసుధ సి) శ్రీదేవి డి) జయంతి 11. ‘ఏ దేశమేగినా ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా, ఎవ్వరెదురైనా... పొగడరా నీ తల్లి భూమి భారతిని.. నిలపరా నీ జాతి నిండు గౌరవమూ...’ పాట ‘అమెరికా అబ్బాయి’ సినిమాలోనిది. అమెరికాలో షూటింగ్ చేసుకున్న ఈ క్రాస్ ఓవర్ సినిమాకు దర్శకుడెవరు? ఎ) బాలచందర్ బి) కె. విశ్వనాథ్ సి) సింగీతం శ్రీనివాసరావు డి) భారతీరాజ 12. ‘ఓ బాపు నువ్వే రావాలి, నీ సాయం మళ్లీ కావాలి...’ అనే పాట చిరంజీవి నటించిన ‘శంకర్‌దాదా జిందాబాద్’ చిత్రంలోనిది. ఈ దేశభక్తి గీతాన్ని సుద్దాల అశోక్‌తేజ రచించగా దేవీశ్రీ ప్రసాద్ స్వరపరిచారు. ఈ చిత్రానికి దర్శకుడెవరు? ఎ) బి. గోపాల్ బి) ప్రభుదేవా సి) జయంత్.సి. పరాన్జీ డి) వీవీ వినాయక్ 13. 1982లో విడుదలైన ‘గాంధీ’ చిత్రానికి రిచర్డ్ అటెన్‌బరో స్వీయదర్శకత్వం వహించారు. బెన్ కింగ్స్లే ‘గాంధీ’ పాత్రధారి. బ్రిటిష్ ఇండియన్ ఫిల్మ్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో కస్తూర్బా గాంధీ పాత్రలో నటించిన ప్రముఖ బాలీవుడ్ నటి ఎవరో కనుక్కోండి? ఎ) బి) రేఖ సి) రోహిణి హట్టంగడి డి) హేమమాలిని 14. ఆంగ్లేయుల వద్ద సిపాయిగా పనిచేసిన ‘మంగల్ పాండే’ పాత్రలో నటించారు ఆమిర్‌ఖాన్. ఆ చిత్రంలో ఆయన సరసన హీరా పాత్రలో నటించిన నటి ఎవరో తెలుసుకుందామా? ఎ) రాణీ ముఖర్జీ బి) కరిష్మా కపూర్ సి) కరీనా కపూర్ డి) అమీషా పటేల్ 15. ‘మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్...’ పాట ‘ఖడ్గం’ చిత్రంలోనిది. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ముస్లిం పాత్రలో నటించి, మెప్పించిన నటుడెవరు? ఎ) శ్రీకాంత్ బి) రవితేజ సి) ప్రకాశ్‌రాజ్ డి) బ్రహ్మాజీ 16. ‘ఏ మేరా ఇండియా, ఐ లవ్ మై ఇండియా...’ పాట సుభాష్ ఘాయ్ దర్శకత్వం వహించిన ‘పరదేశ్’ చిత్రంలోనిది. ఆ చిత్రంలో షారుఖ్ ఖాన్ సరసన నటించిన నటి ఎవరు? ఎ) మహిమా చౌదరి బి) ప్రీతి జింటా సి) కాజోల్ డి) కత్రినాకైఫ్ 17. సంజయ్‌దత్, అజయ్ దేవ్గన్, సైఫ్ అలీఖాన్, అర్మాన్ కోహ్లి, సునీల్ శెట్టి, సంజయ్ కపూర్, అభిషేక్ బచ్చన్, అక్షయ్ఖన్నా.. ఇంతమంది బాలీవుడ్ హీరోలు నటించిన చిత్రం ‘ఎల్ఓసి కార్గిల్’. వారితో పాటు ఆ చిత్రంలో నటించిన తెలుగు హీరో ఎవరో తెలుసా? ఎ) ప్రభాస్ బి) నాగార్జున సి) రానా డి) వెంకటేశ్ 18. శంకర్ దర్శకత్వం వహించిన ‘భారతీయుడు’ చిత్రంలో స్వాతంత్య్ర సమర యోధుడు సేనాపతి పాత్రలో నటించారు కమల్‌హాసన్. మళ్లీ సేమ్ కాంబినేషన్లో ‘భారతీయుడు–2’ తెరకెక్కుతోంది. ఎన్ని సంవత్సరాల తర్వాత ఈ సీక్వెల్ ప్రారంభించారో కనుక్కోండి? ఎ) 22 బి) 18 సి) 20 డి) 25 19. తెల్లదొరలపై తిరగబడ్డ తెలుగుబిడ్డ ‘ఆంధ్రకేసరి’ టంగుటూరి ప్రకాశం పంతులు. ఆయన చరిత్రను సినిమా గా రూపుదిద్దిన నటుడెవరో తెలుసా? (అతనే నిర్మాత, దర్శకుడు, నటుడు) ఎ) చంద్రమోహన్ బి) విజయ్ చందర్ సి) మురళీమోహన్ డి) నరేశ్ 20. చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘సైరా’. ఆంగ్లేయులను ఎదిరించిన తెలుగువాడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ జీవిత చరిత్ర ఇది. ఈ చిత్రంలోని ‘మైరారెడ్డి’ పాత్రను పోషిస్తున్న నటుడెవరో తెలుసా? ఎ) జగపతిబాబు బి) సుదీప్ సి) అమితాబ్ డి) విజయ్ సేతుపతి మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) (ఎ) 2) (సి) 3) (డి) 4) (బి) 5) (బి) 6) (ఎ) 7) (బి) 8) (బి) 9) (ఎ) 10) (సి) 11) (సి) 12) (బి) 13) (సి) 14) (ఎ) 15) (సి) 16) (ఎ) 17) (బి) 18) (ఎ) 19) (బి) 20) (ఎ) నిర్వహణ: శివ మల్లాల -
‘అద్భుతం.. నమ్మలేకపోతున్నా’
న్యూఢిల్లీ : తన నృత్య ప్రదర్శనతో మరోసారి ఆకట్టుకున్నారు బీజేపీ ఎంపీ హేమ మాలిని.. మంగళవారం ‘ప్రవాసి భారతీయ దివాస్’ సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాశిలో హేమ మాలిని ‘మా గంగా’ పేరిట నృత్య ప్రదర్శన ఇచ్చారు. దాదాపు 90 నిమిషాల పాటు సాగిన ఈ ప్రదర్శనలో హేమ మాలిని గంగ పాత్రలో నటించారు. కేంద్ర మంత్రులు, దేశ, విదేశాల నుంచి వచ్చిన అతిథులు సమక్షంలో ఈ ప్రదర్శన నిర్వహించారు. దీనిలో హేమ మాలిని గంగా నది ప్రాముఖ్యతను తెలియజేస్తూ.. ప్రస్తుతం అది ఎలా కలుషితమవుతుందో వివరిస్తూ చేసిన నృత్యం అందరిని ఎంతో ఆకట్టుకుంది. హేమ మాలిని నృత్యానికి కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ఫిదా అయ్యారు. ప్రదర్శన ముగిసిన వెంటనే సుష్మా వేదిక మీదకు వెళ్లి హేమ మాలినిని ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సుష్మా స్వరాజ్ ‘నీ నృత్య ప్రదర్శన ఎలా ఉందో చెప్పడానికి నా దగ్గర మాటల్లేవు. నా జీవితంలో తొలిసారి టీవీ కార్యక్రమాల్లో వాడే మూడు పదాలను వాడుతున్నాను. ‘అద్భుతం, నమ్మలేకపోతున్నా, ఊహాతీతం’’ అంటూ కొనియాడారు. ఈ నాటకం కోసం ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నీతా లుల్లా దుస్తులను డిజైన్ చేశారు. #WATCH Veteran actor & BJP MP Hema Malini performing at the 'Pravasi Bharatiya Diwas' in Varanasi. (22.01.2019) pic.twitter.com/akP9fVwHKv — ANI UP (@ANINewsUP) January 23, 2019 -
నయా డ్రీమ్ గాళ్!
బాలీవుడ్లో లేడీ సూపర్ స్టార్ దీపికా పదుకోన్ హవా కొనసాగుతూనే ఉంది. ఇటీవలే ఫోర్బ్స్ లిస్ట్‌లో టాప్ 5లో చోటు సంపాదించిన దీపిక మరోసారి టాప్ స్టార్‌గా నిలిచారు. ఐయండీబీ (ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ ) విడుదల చేసిన ‘2018 టాప్ 10 స్టార్స్ ఆఫ్ ఇండియన్ సినిమా’ జాబితాలో దీపిక టాప్‌లో నిలిచారు. ఖాన్స్‌ను సైతం పక్కన పెట్టి ఈ లిస్ట్‌లో టాప్ సీట్ దక్కించుకున్నారంటే దీపికా పదుకోన్ ఫాలోయింగ్ అర్థం చేసుకోవచ్చు. ‘ఐయండీబీ ప్రో స్టార్‌మీటర్ ర్యాంకింగ్’, ఈ సైట్‌ను వీక్షించిన లెక్కల ఆధారంగా ఈ లిస్ట్ తయారు చేశారు. ఈ లిస్ట్‌లో టాప్‌లో దీపికా పదుకోన్ ఉండగా సెకండ్ స్థానాన్ని ‘కింగ్‌ఖాన్’ షారుక్ ఖాన్ సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమిర్‌ఖాన్, ఐశ్వర్యా రాయ్, సల్మాన్ ఖాన్ మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. కత్రినా కైఫ్, కుబ్ర సైట్ (డిజిటల్ వెబ్‌సిరీస్ ‘సాక్రెడ్ గేమ్స్’ ఫేమ్), ఇర్ఫాన్ ఖాన్, రాధికా ఆప్టే, అక్షయ్ కుమార్ మిగతా స్థానాల్లో నిలిచారు. ‘‘పద్మావత్’లో దీపికా చూపించిన అద్భుతమైన నటనే తనను టాప్‌లో నిలబెట్టింది’’ అని ఐయండీబి ప్రతినిధి నేహా గురేజా పేర్కొన్నారు. డ్రీమ్ గాళ్! బాలీవుడ్ నటి హేమ మాలిని పేరు చెప్పాలంటే డ్రీమ్ గాళ్ అని సంభోదించకుండా ఉండలేరు. తాజాగా కొత్త తరం కథానాయికల్లో డ్రీమ్ గాళ్ అనే ట్యాగ్ ఎవరికి సూట్ అవుతుంది? అని స్వయానా నాటి డ్రీమ్ గాళ్‌ని అడిగితే –‘‘ఈ జనరేషన్ డ్రీమ్ గాళ్ దీపికా పదుకోన్. ఎలాంటి దుస్తులు ధరించినా కూడా చాలా గ్రేస్‌ఫుల్‌గా, హుందాగా క్యారీ చేయగలదు. అలాగే కనిపించిన ప్రతీసారి చూపు తిప్పుకోలేనంత స్టన్నింగ్‌గా ఉంటుంది. తను నడుచుకునే తీరు, తనకు నచ్చినట్టుగా జీవించే విధానం నాకు చాలా ఇష్టం. దీపికతో నాకు మంచి రిలేషన్షిప్ కూడా ఉంది’’ అని డ్రీమ్‌గాళ్ అనే ట్యాగ్నిచ్చి దీపికను పొగడ్తల్లో ముంచెత్తారు హేమ మాలిని. రాణీ సొంతమైంది ‘పద్మావత్’ సినిమాలో రాణీ పద్మావత్ (దీపికా పదుకోన్)ను దక్కించుకోవడం కోసం ఎంతో ప్రయత్నిస్తాడు ఖిల్జీ (రణ్వీర్ సింగ్). కానీ తన ప్రయత్నం విఫలమే అవుతుంది. ఖిల్జీకు దక్కకుండా అగ్నికి ఆహుతి అవుతుంది. ఇలాంటి విలనిజమ్ కనబరిచినందుకే రణ్వీర్ సింగ్‌కు ఇటీవల ఓ టీవీ షో ఉత్తమ న టుడు అవార్డ్‌ను అందజేసింది. ‘‘సినిమాలో రాణీని సొంతం చేసుకోలేకపోయాను. కానీ నిజ జీవితంలో నా రాణీ నా సొంతమైంది’’ అంటూ ఆ అవార్డ్ తీసుకుంటూ పేర్కొన్నారు రణ్వీర్. రణ్వీర్ స్పీచ్ విని ఆనంద బాష్పాలను ఆపుకోలేకపోయారు దీపిక. -
స్క్రీన్ టెస్ట్
అక్కడ ఇక్కడ.. సినిమాకి నో బౌండరీస్. ఇక్కడ హిట్టయిన సినిమా అక్కడ... అక్కడ హిట్టయిన సినిమా ఇక్కడ రీమేక్ అవుతుంటాయి. అలాంటి రీమేక్ మూవీస్ గురించి ఈ వారం స్పెషల్. 1. హిందీ చిత్రం ‘మిలీ’ తెలుగు ‘జ్యోతి’ చిత్రానికి మాతృక. అక్కడ (బాలీవుడ్లో) జయభాదురీ టైటిల్ రోల్ చేశారు. ఇక్కడ (టాలీవుడ్) ఆ పాత్రను పోషించిన నటి ఎవరు? ఎ) జయసుధ బి) జయప్రద సి) శ్రీదేవి డి) సుజాత 2. యన్టీఆర్ నటించిన ‘యుగంధర్’ సినిమా హిందీ ‘డాన్’కి రీమేక్. ఆ చిత్రంలో హీరోగా నటించిందెవరో గుర్తుందా? ఎ) జితేంద్ర బి) రిషికపూర్ సి) మిథున్ చక్రవర్తి డి) అమితాబ్ 3. తమిళ సూపర్ డూపర్ హిట్ ‘నాట్టామై’ తెలుగులో ‘పెదరాయుడు’గా విడుదలై, ఇక్కడా బంపర్ హిట్ సాధించింది. తెలుగులో మోహన్‌బాబు నటించారు. తమిళ్లో మోహన్‌బాబు పాత్రను పోషించిన నటుడెవరో తెలుసా? ఎ) విజయ్‌కాంత్ బి) పార్తిబన్ సి) శరత్‌కుమార్ డి) రజనీకాంత్ 4. విజయశాంతి హిందీలో చేసిన మొదటి చిత్రం ‘ఈశ్వర్’. తెలుగులో ఘనవిజయం సాధించిన ‘స్వాతిముత్యం’ చిత్రానికి ఇది రీమేక్. ఈ చిత్ర దర్శకుడెవరో కనుక్కోండి? ఎ) కె.విశ్వనాథ్ బి) బి.గోపాల్ సి) కె. రాఘవేంద్రరావు డి) కె. మురళీమోహన రావు 5. అక్కినేని నాగేశ్వరరావు హిందీలో ఒకే ఒక్క సినిమాలో నటించారు. తెలుగులో ఆయన నటించిన ఓ సూపర్ హిట్ చిత్రానికి రీమేక్ అది. ఆ చిత్రకథానాయిక అంజలీదేవి, ఆమె భర్త, చిత్రనిర్మాత ఆదినారాయణరావు మాటను కాదనలేక ఏయన్నార్ హిందీలో నటించారు. ఇంతకీ ఆ సినిమా పేరేంటి? ఎ) దేవదాసు బి) సువర్ణసుందరి సి) కీలుగుర్రం డి) తెనాలి రామకృష్ణ 6. హీరో రాజÔó ఖర్ను ఒకప్పుడు ‘అంకుశం’ రాజశేఖర్ అనేవారు. ఆ సినిమా ద్వారా ఆయనకు అంత పేరొచ్చింది. మరి... ఆ సినిమా రీమేక్ ద్వారా బాలీవుడ్‌కి హీరోగా పరిచయమైన తెలుగు నటుడెవరో తెలుసా? ఎ) బాలకృష్ణ బి) వెంకటేశ్ సి) చిరంజీవి డి) నాగార్జున 7. ‘మిస్సమ్మ’ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. ఆ సినిమాలో ఎన్టీఆర్ చేసిన పాత్రను తమిళ్లో చేసిన నటుడెవరు? ఎ) యంజీఆర్ బి) శివాజీ గణేశన్ సి) జెమినీ గణేశన్ డి) శివకుమార్ 8. కన్నడ చిత్రం ‘యు టర్న్’ తెలుగు రీమేక్‌లో సమంత జర్నలిస్ట్‌గా చేశారు. కన్నడ ‘యు టర్న్’లో ఆ పాత్ర చేసిన నటి ఎవరో కనుక్కోండి? ఎ) ప్రియమణి బి) రకుల్ ప్రీత్‌సింగ్ సి) అంజలి డి) శ్రద్ధా శ్రీనాథ్ 9. రజనీకాంత్ నటించిన ‘చంద్రముఖి’ అన్ని భాషల్లోనూ పెద్ద హిట్. ఆ సినిమా మొదట మలయాళంలో వచ్చింది. ‘చంద్రముఖి’ కన్నడ, తమిళ్, తెలుగు భాషలకు డైరెక్టర్ పి.వాసు. ఒరిజినల్ మలయాళ చిత్రానికి దర్శకుడెవరు? ఎ) సురేశ్ కృష్ణ బి) సిద్ధిక్ లాల్ సి) ఫాజిల్ డి) ప్రియదర్శన్ 10 కృష్ణ, జయప్రద జంటగా నటించిన సూపర్ హిట్ ఫిల్మ్ ‘ఊరికి మొనగాడు’. ఆ చిత్రాన్ని హిందీలో ‘హిమ్మత్వాలా’ పేరుతో విడుదల చేశారు. అది పెద్ద హిట్. జయప్రద రోల్‌ను పోషించిన నటి ఎవరు? ఎ) రేఖ బి) హేమ మాలిని సి) శ్రీదేవి డి) డింపుల్ కపాడియా 11. ‘ప్రేమమ్’ తెలుగు సినిమాలో లెక్చరర్ పాత్రలో నటించారు హీరోయిన్ శ్రుతీహాసన్. ఆ పాత్ర ఒరిజినల్ క్యారెక్టర్‌ను మలయాళంలో చేసిన నటి ఎవరో తెలుసా? ఎ) సాయిపల్లవి బి) మంజిమా మోహన్ సి) అనుపమా పరమేశ్వరన్ డి) నివేథా థామస్ 12 మహేశ్ బాబు కెరీర్లో ‘పోకిరి’ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్. అదే పేరుతో ఆ సినిమాను తమిళ్లో తెరకెక్కించారు. అక్కడ కూడా ‘పోకిరి’ మంచి హిట్‌ను సొంతం చేసుకుంది. మహేశ్‌బాబు క్యారెక్టర్‌ను చేసిన ఆ తమిళ్ హీరో ఎవరు? ఎ) అజిత్ బి) శివ కార్తికేయన్ సి) విజయ్ డి) సూర్య 13. ‘తుమ్హారి సులు’ అనే సినిమాను హిందీలో విద్యాబాలన్ చేశారు. తమిళ్లో ఆ సినిమా రీమేక్ ‘కాట్రిన్ మొళి’లో ఆ పాత్రను చేసిన నటి ఎవరో తెలుసా? ఎ) శ్రుతీహాసన్ బి) జ్యోతిక సి) నయనతార డి) సమంత 14 నాగచైతన్య, సమంత జంటగా నటించిన చిత్రం ‘ఏ మాయ చేసావె’. ఆ చిత్రం తమిళ్ వెర్షన్లో సమంత పాత్రను పోషించిన నటి ఎవరో తెలుసా? ఎ) శ్రియ బి) త్రిష సి) అమలాపాల్ డి) మీరా జాస్మిన్ 15. సునీల్ హీరోగా నటించిన ‘మర్యాద రామన్న’ చిత్రం హిందీ రీమేక్‌లో ఆ పాత్రను పోషించిన నటుడెవరో తెలుసా? ఎ) అజయ్ దేవగన్ బి) అక్షయ్ కుమార్ సి) సంజయ్‌దత్ డి) సైఫ్ అలీఖాన్ 16. విద్యాబాలన్ చేసిన హిందీ ‘కహానీ’ తెలుగు రీమేక్ ‘అనామిక’లో నయనతార నాయికగా నటించారు. ‘అనామిక’ సంగీత దర్శకుడెవరో తెలుసా? ఎ) మణిశర్మ బి) యం.యం.కీరవాణి సి) మిక్కీ జే మేయర్ డి) కె.యమ్ రాధాకృష్ణన్ 17. వెంకటేశ్ హీరోగా తెలుగు ‘సూర్యవంశం’, అమితాబ్ బచ్చన్ హీరోగా హిందీ ‘సూర్యవంశ్’ చిత్రాలు వచ్చాయి. ఈ రెండు చిత్రాలనూ తెరకెక్కించిన దర్శకుడెవరో కనుక్కోండి? ఎ) ఈవీవీ సత్యనారాయణ బి) దాసరి నారాయణరావు సి) కోడి రామకృష్ణ డి) బి.గోపాల్ 18. విజయ్ దేవరకొండ నటించిన ‘అర్జున్ రెడ్డి’ సంచలన విజయం సాధించింది. హీరోయిన్గా షాలినీ పాండే నటించారు. ఆ చిత్రాన్ని హిందీలో సేమ్ డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్నారు. హిందీ ‘అర్జున్ రెడ్డి’లో హీరోయిన్గా నటిస్తున్నది ఎవరో తెలుసా? ఎ) కరీనా కపూర్ బి) కియరా అద్వాని సి) ఆలియా భట్ డి) ప్రియాంకా చోప్రా 19. తమిళ చిత్రం ‘వసంత మాళిగై’ అంటే తెలుగు ‘ప్రేమనగర్’. రెండు భాషల్లోనూ హీరోలు శివాజీ గణేశన్, అక్కినేని. కానీ హీరోయిన్ ఒక్కరే. ఎవరా హీరోయిన్? ఎ) సావిత్రి బి) వాణిశ్రీ సి) జమున డి) కాంచన 20. రీమేక్ చిత్రాలు చేయడానికి ఇష్టపడనని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిన శంకర్ ఓ హిందీ సినిమాని ‘నన్బన్’ పేరుతో తమిళంలో రీమేక్ చేశారు. ఇది ‘స్నేహితుడా’ పేరుతో తెలుగులో విడుదలైంది. హిందీలో కరీనా కపూర్ నాయిక.. మరి సౌత్‌లో ఎవరు? ఎ) ఇలియానా బి) చార్మి సి) కాజల్ అగర్వాల్ డి) శ్రియ మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) ఎ 2) డి 3) సి 4)ఎ 5) బి 6) సి 7) సి 8) డి 9) సి 10) సి 11) ఎ 12) సి 13) బి 14) బి 15) ఎ 16) బి 17) ఎ 18) బి 19) బి 20) ఎ నిర్వహణ: శివ మల్లాల -
వైరముత్తు మంచోడేం కాదు: మరో గాయని
గీత రచయిత వైరముత్తు అంత సచ్చీలుడేంకాదు అంటూ ఆయనకు వ్యతిరేకంగా మరో మహిళ గొంతు విప్పింది. లైంగిక వేధింపులపై మీటూ అంటూ సామాజిక మాధ్యమం ద్వారా పలువురు గొంతు విప్పుతున్నారు. మీటూ ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. మీటూతో ఒక కేంద్రమంతినే పదవి కోల్పాయారంటే ఆ ప్రభావం ఎంతుందో అర్థం చేసుకోవచ్చు. ఇక కోలీవుడ్‌లో ప్రముఖ గీత రచయిత వైరముత్తుపై గాయని చిన్మయి చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలాన్నే రేపుతున్నాయి. వైరముత్తులోని మరో కోణం గురించి బాధిత మహిళలు గొంతు విప్పుతున్నారు. చిన్మయి తరువాత అమెరికాకు చెందిన ఇద్దరు మహిళలు వైరముత్తు వేధింపుల బాధితులమేనని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా దివంగత ప్రఖ్యాత గాయకుడు, నటుడు మలేషియా వాసుదేవన్ కోడలు, గాయని హేమమాలిని వైరముత్తు గురించి మాట్లాడుతూ ఆయనేమంత సచ్చీలుడు కాదని పేర్కొంది. ఈమె తన ఫేస్బుక్లో గాయని చిన్మయికి మద్దతుగా నిలిచింది. హేమమాలిని పేర్కొంటూ తమిళ సినీ పరిశ్రమ గాయని చిన్మయికి మద్దతుగా ఎందుకు నిలబడడం లేదో తనకు అర్ధం కావడం లేదన్నారు. వైరముత్తు సచ్చీలుడు కాదన్న విషయం సినీపరిశ్రమకే తెలుసన్నారు. చిన్మయి ఎందుకు ఆ సంఘటనను 10 ఏళ్ల క్రితం చెప్పలేదు? అని ఆమెను ప్రశ్నిస్తున్నారెందుకు. ఇప్పటికైనా బహిరంగపరిచినందుకు దానిపై నిజా నిజాలను నిగ్గతేల్చాలన్నారు. చిన్నయిని ప్రశ్నిస్తున్న వారు వైరముత్తును ప్రశ్నించడం లేదే అని నిలదీశారు. ఆరోపణలను ఎదుర్కొంటున్నవారిని వదిలి బాధితులను ప్రశ్నించడం ఏంటని వాపోయారు. చిత్రపరిశ్రమ ఏక పక్షంగా వ్వవహరిస్తోందని ఆరోపించారు. తాను ఒక ప్రైవేట్ చానల్లో పనిచేస్తున్న సమయంలో వైరముత్తు అక్కడ పనిచేసే ఒక యువ యాంకర్‌తో ఈ వ్యవహారంపై వేధించిన విషయం తనకు తెలుసని చెప్పారు. ఆయన గురించి తాను10 ఏళ్లలో పలు చోట్ల మాట్లాడాని తెలిపింది. కాగా నోరు లేని వారి కోసం తన గొంతు విప్పుతున్న గాయని చిన్మయినిని అభినంధిస్తున్నాను అని గాయని హేమమాలిని పేర్కొన్నారు. ఇంతకు ముందు వైరముత్తుపై లైంగికవేధింపుల ఆరోపణలు చేసిన సింధూజా రాజారాం కూడా హేమమాలిని చెప్పిన ప్రైవేట్ చానల్లో పని చేసిన యువ యాంకర్ గురించి ప్రస్ధావించారన్నది గమనార్హం. ఆస్పత్రిలో వైరముత్తు.. లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్న వైరముత్తు శుక్రవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. మదురైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. ఆయనకు ఫుడ్ పాయిజన్ అయినట్లు సమాచారం. -
నేను కోరుకుంటే నిమిషంలో సీఎం అవుతా : ప్రముఖ నటి
జైపూర్ : తాను కోరుకుంటే నిమిషంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతానని బాలీవుడ్ సీనియర్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని అన్నారు. గురువారం రాజస్తాన్‌లోని బాన్స్వారాలో జరిగిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆమె ఈ మాటలన్నారు. ఆమె మాట్లాడుతూ.. ‘ నేను బంధీని కావాలనుకోవటం లేదు. నా స్వేచ్ఛ అంతటితో ముగిసిపోతుంది. ఒక వేళ ముఖ్యమంత్రి అయ్యేఅవకాశం నన్ను వెతుకుంటూ వస్తే తప్పకుండా అవుతాను. ఇప్పుడైతే ఆ ఉద్ధేశం లేద’ని అన్నారామె. హేమమాలిని సినిమాలకు కొద్దిగా దూరమైన తర్వాత రాజకీయాలలో బిజీ అయ్యారు. 1999లో బీజేపీ తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె 2003లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2003 నుంచి 2009 వరకు రాజ్యసభ సభ్యురాలిగా ప్రజలకు సేవలందించారు. 2014లో బీజేపీ తరుపున ఉత్తరప్రదేశ్‌లోని మథుర నుంచి లోక్‌సభ స్థానానికి పోటీ చేసిన ఆమె తన ప్రత్యర్థి జయంత్ చౌదరిపై అత్యథిక ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాజకీయాలలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. -
సీఎం అవ్వడం నాకు చిటికెలో పని అంటున్న నటి
‘ముఖ్యమంత్రి అవ్వడం అనేది నాకు నిమిషాల మీద పని. నేను తల్చుకుంటే ఎప్పుడైనా ముఖ్యమంత్రిని కాగలను’ అంటున్నారు బాలీవుడ్ ‘డ్రీమ్ గర్ల్’ హేమ మాలిని. బుధవారం రాజస్థాన్ బన్స్వారాలో జరిగిన ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో నృత్య ప్రదర్శన ఇవ్వడానికి హాజయరయ్యారు హేమ మాలిని. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు. ఆ సమయంలో విలేకరులు ‘ఒక వేళ అవకాశం వస్తే మీరు యూపీ సీఎం అవుతారా’ అని అడగ్గా.. అందుకు హేమ మాలిని ‘నేను తల్చుకుంటే సీఎం అవ్వడం పెద్ద విషయమేం కాదు. కానీ నాకు అది ఇష్టం లేదు. సీఎం అయితే నేను నా వ్యక్తిగత జీవితాన్ని, సమయాన్ని కోల్పొవాల్సి వస్తుందంటూ’ బదులిచ్చారు. అంతేకాక ‘నేను మంత్రిని అవ్వడానికి కారణం నా సినీ జీవితం. ప్రజలు నన్ను హేమ మాలిని, ‘డ్రీమ్ గర్ల్’ అని పిలుస్తారు. నేను బాలీవుడ్లో పనిచేశాను. అందువల్లే నన్ను అందరూ గుర్తించగల్గుతారని’ తెలిపారు. అంతేకాక ‘పార్లమెంట్లో ప్రవేశించకముందే నేను బీజేపీ కోసం చాలా పని చేశాను. ఎంపీగా ఎన్నికైన తర్వాత ఈ నాలుగేళ్లలో నా నియోజకవర్గం మధురలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాను. ముఖ్యంగా ఇక్కడ రహదారుల అభివృద్ధికి అధికంగా కృషి చేశానని’ తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని అభినందనలతో ముంచెత్తారు. ‘మోదీ లాంటి ప్రధాని లభించడం చాలా అరుదు. ప్రతిపక్షాలు ఆయన గురించి ఏవేవో మాట్లాడుతుంటాయి. కానీ దేశం కోసం పని చేస్తున్నదేవరో ప్రత్యక్షంగా చుస్తూనే ఉన్నాం కదా’ అని తెలిపారు. -
ప్రముఖ నటికి తృటిలో తప్పిన ప్రమాదం
మధుర: ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ హేమమాలినికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆమె కాన్వాయ్ వెళ్తుండగా ఒక్కసారిగా చెట్టు కూలి రోడ్డుపై పడిపోయింది. ఉత్తరప్రదేశ్ మధుర సమీపంలోని మిథౌలి గ్రామానికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఆదివారం సాయంత్రం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మధుర ఎంపీ హేమమాలిని మిథౌలీలో ఏర్పాటుచేసిన బహిరంగసభలో పాల్గొనేందుకు వెళ్తుండగా భారీ ఈదురుగాలల కారణంగా ఆమె కాన్వాయ్కి ముందు చెట్టు పడిపోయిందని పోలీసులు తెలిపారు. కొన్ని సెకన్లు ఆలస్యంగా చెట్టు నేలకూలింటే ఎంపీ కాన్వాయ్‌పై పడేదని చెప్పారు. అదృష్టవశాత్తూ ఆమె ప్రమాదం నుంచి బయటపడ్డారని వెల్లడించారు. కాగా, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కురుస్తున్న అకాల వర్షాటకు దాదాపు 50 మంది మృత్యువాత పడ్డ విషయం తెలిసిందే. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు, ఇసుక తుపానులు బీభత్సం సృష్టిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హరియాణ, చండీగఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, అసోం, మేఘాలయ, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడులో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. -
ఇలాంటివి గతంలోనూ జరిగాయి; హేమామాలిని
మధుర : నటి, బీజేపీ ఎంపీ హేమామాలిని సంచలన వ్యాఖ్యలు చేశారు. అత్యాచార ఘటనలకు విస్తృతమైన పబ్లిసిటీ లభిస్తోందన్న ఆమె.. గతంలో వాటిని ఎవరూ పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. శనివారం ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడిన హేమా మాలిని ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ప్రస్తుతం మహిళలపై, మైనర్లపై జరుగుతున్న అఘాత్యాలు బోలెడంత పబ్లిసిటీని తెచ్చిపెడుతున్నాయి. నిజానికి గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. కానీ, వాటి గురించి మీడియా కనీసం ప్రస్తావించ లేదు. ప్రజలు కూడా వాటిని పెద్దగా పట్టించుకునేవారు కాదు’ అని ఆమె వ్యాఖ్యానించారు. అయితే కాసేపటికే ఆమె దిద్దు బాటు చర్యలకు దిగారు. ‘ఇలాంటి ఘటనలు బాధాకరం. మళ్లీ జరగకూడదనే కోరుకుంటున్నా. అవి దేశంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇతర దేశాల దృష్టిలో మన ప్రతిష్టకు భంగం కలిగిస్తాయి’ అని ఆమె తెలిపారు. హేమా మాలిని వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. ఇలాంటి సమయంలో ఆమె ఆ వ్యాఖ్యలు ఎలా చేయగలిగారని? ఆమె వ్యాఖ్యలు సిగ్గు చేటని.. పలువురు మండిపడుతున్నారు. కాగా, ప్రస్తుతం కథువా, ఉన్నావో, సూరత్‌లో జరిగిన మైనర్లపై దాష్టీకాలు చర్చనీయాంశంగా మారింది తెలిసిందే. మరోపక్క జమ్ము కశ్మీర్ విద్యాశాఖ మంత్రి కథువా ఘటనపై స్పందిస్తూ.. పిల్లలను స్కూళ్లకు పంపించకపోవటం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటూ వ్యాఖ్యలు చేయటం విమర్శలకు దారితీసింది. -
'గుడ్ బై మై ఫ్రెండ్'.. హేమమాలిని భావోద్వేగం
సాక్షి, ముంబయి : బాలీవుడ్ ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని భావోద్వేగానికి లోనయ్యారు. హఠాన్మరణం చెందిన శ్రీదేవి భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు వచ్చిన ఆమె దాదాపు కంటతడి పెట్టుకున్నారు. 'మరణంలోనూ నిర్మలంగా ఎరుపు చీరలో చాలా అందంగా కనిపిస్తూ శ్రీదేవి పవళిస్తోంది' అంటూ హేమ భావోద్వేగంతో నిండిన ట్వీట్ చేశారు. శనివారం శ్రీదేవి అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. తొలుత గుండెపోటుతో చనిపోయారని చెప్పినా.. బాత్ టబ్‌లో పడి ఆమె ఊపిరి ఆడక చనిపోయారని దుబాయ్ పోలీసులు, ఫోరెన్సిక్ అధికారులు, పబ్లిక్ ప్రాసీక్యూటర్స్ తేల్చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె అంతిమయాత్ర కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే కడసారి ఆమెను చూసేందుకు హేమమాలిని వచ్చారు. 'నా నివాళులు అర్పించాను. మొత్తం చిత్ర పరిశ్రమ అక్కడే శోకసంద్రంలో మునిగిపోయి ఉంది. అది ఆమెకు ఉన్న తేజస్సు.. ఆమె నటించిన చిత్రాల మ్యాజిక్.. ఎర్రచీరలో ఆమె చాలా అందంగా కనిపిస్తూ అక్కడ ప్రశాంతంగా పవళిస్తోంది. ఏర్పాట్లు అన్నీ చాలా బాగా చేశారు. గుడ్‌బై మై డియర్ ఫ్రెండ్' అని హేమమాలిని ట్వీట్ చేశారు. -
ముంబై ప్రమాదంపై హేమమాలిని సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ముంబయి : బీజేపీ ఎంపీ, నటి హేమమాలిని ముంబయి అగ్ని ప్రమాదంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముంబయిలో అగ్ని ప్రమాదానికి కారణం జనాభా అన్నారు. ముంబయిలోకి పరిమితికి మించి జనాభాను అనుమతించడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని, జనాభా అనుమతికి కూడా కొన్ని పరిమితులు విధించాల్సిన అవసరం ఉందన్నారు. ముంబయిలోని కమలామిల్స్ కాంపౌండ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకొని 14మంది ప్రాణాలుకోల్పోయిన విషయం తెలిసిందే. దీనిపై మీడియా ప్రతినిధులతో హేమమాలిని పార్లమెంటు వెలుపల మాట్లాడుతూ 'పోలీసులు తమ విధులు నిర్వర్తించడం లేదన్నది విషయం కాదు. వారు చాలా గొప్పగా పనిచేస్తున్నారు. కానీ, ముంబయిలో విపరీతంగా జనాభా ఉంది. ముంబయి ముగిశాక మరోనగరం ప్రారంభం కావాలి. అంతేగానీ, ఈ నగరంలో ఇంకా విస్తరిస్తూనే ఉంది.. నియంత్రణ లేకుండా పోతోంది. ప్రతి నగరానికి జనాభా విషయంలో కొంత పరిమితి అంటూ ఉండాలి. పరిమితి దాటాక ఎవరినీ అనుమతించకూడదు. వారిని వేరే నగరానికి వెళ్లిపోనివ్వాలి... అక్కడ నుంచి మరో నగరానికి వెళ్లనివ్వాలి' అని హేమమాలిని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
రా.. వదినా రా...
కుదురితే పిన్నిలా రా.. వీలైతే అమ్మలా రా.. లేకపోతే అక్కలా రా.. లేదా అత్తలా రా.. కానీ.. రా. తెలుగు సినిమాలో హీరోయిన్లుగా నటించిన అమ్మళ్లు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కుమ్ముళ్లు స్పెషల్ స్టోరీ. చెక్కుచెదరని నటన చెక్కు చెదరని అందం.. అలనాటి డ్రీమ్ గర్ల్ హేమమాలిని గురించి అందరూ అనుకునే మాట ఇది. నటన కూడా అంతే. చెక్కు చెదరలేదు. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో ఆమె చేసిన రాణి గౌతమి బాలశ్రీ పాత్ర అందుకు నిదర్శనం. చాలా విరామం తర్వాత తెలుగు తెరపై ఆమె కనిపించిన చిత్రం ఇది. ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే... 1965లో విడుదలైన ‘పాండవ వనవాసం’లో ఒక పాటకు నర్తించారామె. ఆ తర్వాత ఐదేళ్లకు ‘శ్రీకృష్ణ విజయం’లో ఓ గెస్ట్ రోల్లో కనిపించారు. 45 ఏళ్ల తర్వాత ‘గౌతమిపుత్ర శాతకర్ణి’తో మళ్లీ తెలుగు తెరపై కనిపించారు. లేఖ తిరిగొచ్చింది లేఖ గుర్తుందా? అదేనండీ.. దర్శకుడు కృష్ణవంశీ ‘చంద్రలేఖ’లో లేఖ పాత్రలో చూపించిన ఇషా కొప్పీకర్ గుర్తుందా? ఆ సినిమా తర్వాత ఇషా హిందీ బాట పట్టారు. ఆల్మోస్ట్ పంతొమ్మిదేళ్ల తర్వాత ఆమె తెలుగులో ఫుల్ లెంగ్త్ రోల్ చేసిన సినిమా ‘కేశవ’. ‘కార్తికేయ’ ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో నిఖిల్, రీతూవర్మ జంటగా నటించిన ఈ చిత్రంలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించారామె. శివరాజ్‌కుమార్ హీరోగా కన్నడంలో రూపొందుతున్న ‘కవచ’ చిత్రంలో నటిస్తున్నారు ఇషా. మోడ్రన్ గ్రాండ్‌మదర్ కాంచన పేరు వినగానే, ఏదో గుడిలో సేవ చేస్తున్నారట అని మాట్లాడుకున్న మాటలు గుర్తుకొస్తాయి. నిజం అది కాదు. దాదాపు 15 కోట్ల రూపాయలను తిరుమల తిరుపతి దేవస్థానంకు విరాళంగా ఇచ్చారామె. వెండితెర వెలుగు జిలుగులకు దూరంగా ఉంటున్న కాంచన 32ఏళ్ల తర్వాత తెలుగు స్క్రీన్‌పై కనిపించడం, అది కూడా ‘అర్జున్ రెడ్డి’లాంటి బోల్డ్ మూవీలో కనిపించడం విశేషం. 1960, 70, 80లలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో తిరుగు లేని నాయికగా రాణించడంతో పాటు పలు హిందీ చిత్రాలు కూడా చేశారామె. తెలుగు తెరకు దూరమైన.. ఆ మాటకొస్తే గతేడాది మలయాళంలో చేసిన ‘ఒలప్పీపీ’ మినహా 1985 తర్వాత కాంచన సినిమాలు చేయలేదు. 32 ఏళ్ల తర్వాత మోడ్రన్ గ్రాండ్మదర్గా ‘అర్జున్ రెడ్డి’లో కనిపించారు. ‘సఫరింగ్ ఈజ్ పర్సనల్ లెట్ హిమ్ సఫర్..’ అని 77 ఏళ్ల కాంచన ఈ సినిమాలో చెప్పిన డైలాగ్ ఫేమస్ అయింది. 1985లో ‘శ్రీ దత్త దర్శనం’ తర్వాత తెలుగు తెరపై ఆమె కనిపించిన చిత్రం ఇదే. జానకీ నాయకుడితో మళ్లీ... ‘ఘరానా మొగుడు’ ఫేమ్ వాణీ విశ్వనాథ్ గుర్తున్నారా? తెలుగులో దాదాపు 40 సినిమాలు చేశారు. వాటిలో ‘కొదమ సింహం’, ‘గాడ్ ఫాదర్’ వంటి పలు చిత్రాల్లో నటించారు. పదేళ్ల తర్వాత వాణి టాలీవుడ్‌కి వచ్చారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ‘జయ జానకి నాయక’లో జగపతిబాబు చెల్లెలిగా పవర్ఫుల్ రోల్లో కనిపించారామె. ఇక మిస్సవ్వను ఎంత ట్రెడిషనల్‌గా కనిపించగలరో అంతే గ్లామరస్‌గా కనిపించగలరు భూమిక. అందుకు ఉదాహరణ ‘ఒక్కడు’, ‘మిస్సమ్మ’. ‘ఖుషి’లో బుక్ చదివే సీన్‌ని ఎవరూ మరచిపోలేరనుకోండి. ఈ బ్యూటీ మూడేళ్ల క్రితం వచ్చిన ‘లడ్డూబాబు’లో ఓ కీలక పాత్ర చేశారు. ఆ తర్వాత తెలుగు సినిమాలు చేయలేదు. అప్పటికే భూమిక పెళ్లవడం, ఒక బాబు కూడా పుట్టడంతో సినిమాలు తగ్గించేశారు. ఇక, భూమిక సినిమాల్లో కనిపించరు అనుకుంటున్న సమయంలో మిడిల్ క్లాస్ అబ్బాయి (ఎంసీఏ)తో వచ్చారు. ఈ చిత్రంలో నాని వదిన పాత్రలో భూమిక నటన సూపర్బ్. గతేడాది హిందీ చిత్రం ‘ఎం.ఎస్. ధోని’లో ధోని సిస్టర్ క్యారెక్టర్లోనూ మెరిశారు. సో.. కుర్ర హీరోలకు అక్క, వదిన అంటే భూమిక బాగుంటారని ఓ ముద్ర పడింది. అందుకు తగ్గట్టుగానే ‘సవ్యసాచి’లో నాగచైతన్యకు అక్క పాత్రకు భూమికను అడగడం, ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇక.. తెలుగు సినిమాలను మిస్సయ్యే ప్రసక్తి లేదంటున్నారు భూమిక. జయప్రదం ఫ్రమ్ సౌత్ టు నార్త్ హీరోయిన్గా సక్సెస్ అయినట్లుగానే ఫ్రమ్ తెలుగు స్టేట్ టు యూపీ పొలిటీషియన్‌గా జయప్రద సక్సెస్ అయ్యారు. ‘భూమి కోసం’తో తెలుగు తెరపై మెరిసి, ‘అంతులేని కథ’తో అంతు లేని ఫేమ్ తెచ్చేసుకున్నారు. అడవిరాముడు, సాగర సంగమం, మేఘసందేశం వంటి హిట్ మూవీస్‌తో జయప్రదంగా ఆమె కెరీర్ సాగింది. పదేళ్ల క్రితం పి. వాసు దర్శకత్వం వహించిన ‘మహారథి’లో బాలకృష్ణకు అత్తగా నటించారామె. ఆ తర్వాత మాతృభాషలో నటించలేదు. హిందీ, మలయాళం, కన్నడ చిత్రాల్లో అప్పుడప్పుడూ సినిమాలు చేస్తున్నారు. మాతృభాషలో నటించడంలేదన్న కొరతను ‘శరభ’ తీర్చేసింది. ఈ చిత్రం విడుదలకు రెడీ అయింది. ఇది చేస్తున్నప్పుడే మరో తెలుగు సినిమా ‘సువర్ణ సుందరి’ కమిట్ అయ్యారామె. అన్నకు అక్క.. తమ్ముడికి పిన్ని అన్నయ్యకు అక్కగా, తమ్ముడికి పిన్నిగా నటించే చాన్స్ కొంతమంది తారలకే వస్తుంది. ఖుష్బూకి ఆ చాన్స్ వచ్చింది. పదకొండేళ్ల క్రితం ‘స్టాలిన్’లో చిరంజీవికి అక్కగా నటించారామె. ఇప్పుడు తమ్ముడు పవన్ కల్యాణ్‌కి పిన్నిగా ‘అజ్ఞాతవాసి’లో నటిస్తున్నారు. యాక్చువల్లీ తెలుగులో ఖుష్బూ కనిపించిన చివరి సినిమా రాజమౌళి ‘యమదొంగ’. అందులో మోహన్‌బాబు చేసిన యమధర్మరాజు పాత్రకు సతీమణిగా నటించారు. స్మాల్ గ్యాప్ జూనియర్ ఐశ్వర్యారాయ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ సినిమాలో స్నేహా ఉల్లాల్‌ని చూసినప్పుడు అందరూ అలానే అన్నారు. ఆ తర్వాత కొంతకాలం తెలుగులో చురుగ్గానే సినిమాలు చేశారీ తేనెకళ్ల సుందరి. ఫోర్ ఇయర్స్ బ్యాక్ ‘అల్లరి’ నరేశ్ హీరోగా వచ్చిన ‘యాక్షన్ 3డీ’ సినిమా తర్వాత తెలుగులో స్నేహా ఉల్లాల్ నటించలేదు. ఆటో ఇమ్యూన్ డిజార్డర్‌తో బాధపడ్డానని, అందుకే కెమెరా ముందుకి రాలేకపోయానని స్నేహా ఉల్లాల్ స్వయంగా పేర్కొన్నారు. స్మాల్ గ్యాప్ తర్వాత ‘ఆయుష్మాన్ భవ’తో రీ–ఎంట్రీ షురూ అయింది. మమ్మీ ఫాలోస్ డాటర్ ఎక్కడైనా పిల్లలు అమ్మలను ఫాలో అవుతారు. మరి.. మమ్మీ ఫాలోస్ డాటర్ అన్నారేంటి అనుకుంటున్నారా? మరేం లేదు.. టూ డేస్ బ్యాక్ ‘హలో’ అన్నారు కల్యాణి ప్రియదర్శన్ డాటరాఫ్ డైరెక్టర్ ప్రియదర్శన్ అండ్ యాక్ట్రస్ లిజి. ఈ ఏడాది కూతురు తెరపైకి వస్తే.. వచ్చే ఏడాది నితిన్ సినిమాలో ‘గుర్తుందా శీతాకాలం’ (పరిశీలనలో ఉన్న టైటిల్) తల్లి పాత్రలో కనిపించనున్నారు. అన్నట్లు లిజికి ఇది మొదటి తెలుగు సినిమా కాదు. నైన్టీస్లో ‘సాక్షి, మగాడు, 20వ శతాబ్దం’ వంటి సినిమాల్లో నటించారామె. చాలా గ్యాప్ తర్వాత ఆమె తెలుగులో చేస్తోన్న చిత్రమిది. – ముసిమి శివాంజనేయులు -
దూసుకొచ్చిన ఎద్దు.. హేమమాలినికి తప్పిన ప్రమాదం
-
హేమమాలినికి తప్పిన ప్రమాదం
మథుర : సీనియర్ నటి, పార్లమెంట్ సభ్యురాలు హేమమాలినికి తృటిలో ప్రమాదం తప్పింది. బుధవారం సాయంత్రం మథుర రైల్వే స్టేషన్ లో ఆమె ఆకస్మిక తనిఖీలకు వెళ్లారు. ఆ సమయంలో ఓ ఎద్దు ఆమె వైపుగా దూసుకొచ్చింది. అయితే భద్రతా సిబ్బంది అప్రమత్తతో అంతా సురక్షితంగా బయటపడ్డారు. జాతీయ మీడియా ద్వారా వైరల్ అయిన ఆ వీడియో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. ఆమె స్టేషన్ లో నడిచి వస్తుండగా, ఓ ఎద్దు అదుపు తప్పి స్టేషన్ లోకి దూసుకొచ్చింది. అదుపు చేసే యత్నంలో అది ముందుకు పరుగు తీసింది. ఆమెతో ఉన్న పోలీస్ అధికారులు ఆమె చుట్టూ నిలబడి, ఆమెను పక్కకు తప్పించారు. ఇక ఎద్దు కూడా పక్కనుంచి వెళ్లిపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రైల్వే స్టేషన్ లో పశువులు తిరగడంపై హేమమాలిని అధికారులపై మండిపడ్డారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఊరుకోబోనని హెచ్చరించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ముంబై ఎల్పిన్స్టోన్ బ్రిడ్జి ఘటన అనంతరం ఎంపీలందరూ తమ నియోజకవర్గాల్లోని రైల్వే స్టేషన్ల ను దర్శించి సౌకర్యాలను, పరిస్థితులను సమీక్షించాలని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హేమామాలిన మధుర స్టేషన్‌ను దర్శించారు. హేమమాలిని వైపుగా దూసుకొచ్చిన ఎద్దు -
సవతి కొడుకు గురించి హేమ మాలిని
సాక్షి, సినిమా : బాలీవుడ్ లో దిగ్గజ నటుడు ధర్మేంద్ర కుటుంబం గురించి తెలియని వారుండరేమో. మొదటి భార్య ప్రకాశ్ కౌర్ ఉండగానే నటి హేమ మాలినిని రెండో వివాహం చేసుకున్నారు. అయితే మతం మారి మరి ఆయన హేమను వివాహం చేసుకున్నారంటూ అప్పట్లో ఆయనపై విమర్శలు వెలువెత్తాయి. అదంతా ట్రాష్ అంటూ వాటిని ధర్మేంద్ర ఖండించారు కూడా. ఇదిలా ఉంటే మొదటి భార్య కుమారులైన సన్నీ, బాబీ డియోల్‌లు.. హేమ మాలిని-ఆమె కుటుంబ సభ్యులకు సంబంధించిన ఏ కార్యక్రమంలోనూ కనిపించరు. అసలు వీరు కలవటం అనేది కూడా చాలా అరుదనే చెప్పుకోవాలి. కానీ, గ్యాప్ గురించి బాలీవుడ్లో కథలు కథలుగా చెప్పుకుంటుంటారు కూడా. అయితే ఫస్ట్ టైమ్ ధర్మేంద్ర మొదటి భార్య పిల్లల గురించి హేమ మాలిని ఓపెన్ అయ్యారు. వారితో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని ఆమె స్వయంగా చెప్పారు. ప్రముఖ రచయిత రాజ్ కమల్ ముఖర్జీ రచించిన ఆమె ఆత్మకథ హేమా మాలిని : బియాండ్ ది డ్రీమ్ గర్ల్ పుసక్త ఆవిష్కరణ కార్యక్రమంలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘మా మధ్య బంధం ఎంతో అందమైంది. ముఖ్యంగా నాకు ఎప్పుడు ఏం సాయం కావాలన్న ధర్మేంద్రతోపాటు సన్నీ కూడా ముందుంటాడు’’ అని ఆమె చెప్పారు. 2005లో రాజస్థాన్‌లో ఆమెకు యాక్సిడెంట్ అయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో హేమను ముందుగా పరామర్శించటంతోపాటు.. తోడుగా సన్నీ డియోల్ నిలిచాడంట. ఆమె వెంటే ఉండి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకున్నాడని ఆమె చెప్పారు. ఇక ఈ పుస్తకావిష్కరణ సభకు సన్నీడియోల్ రాకపోయినప్పటికీ.. రమేష్ సిప్పీ, జూహి చావ్లా,సుభాష్ ఘాయ్, నటి దీపికా పదుకునే, మాలిని కుటుంబ సభ్యులు హాజరయ్యారు. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - హేమా మాలిని