దీపికా పదుకోన్, రణ్‌వీర్ సింగ్
బాలీవుడ్‌లో లేడీ సూపర్ స్టార్ దీపికా పదుకోన్ హవా కొనసాగుతూనే ఉంది. ఇటీవలే ఫోర్బ్స్ లిస్ట్‌లో టాప్ 5లో చోటు సంపాదించిన దీపిక మరోసారి టాప్ స్టార్‌గా నిలిచారు. ఐయండీబీ (ఇంటర్‌నెట్ మూవీ డేటా బేస్ ) విడుదల చేసిన ‘2018 టాప్ 10 స్టార్స్ ఆఫ్ ఇండియన్ సినిమా’ జాబితాలో దీపిక టాప్‌లో నిలిచారు. ఖాన్స్‌ను సైతం పక్కన పెట్టి ఈ లిస్ట్‌లో టాప్ సీట్ దక్కించుకున్నారంటే దీపికా పదుకోన్ ఫాలోయింగ్ అర్థం చేసుకోవచ్చు. ‘ఐయండీబీ ప్రో స్టార్‌మీటర్ ర్యాంకింగ్’, ఈ సైట్‌ను వీక్షించిన లెక్కల ఆధారంగా ఈ లిస్ట్ తయారు చేశారు.
ఈ లిస్ట్‌లో టాప్‌లో దీపికా పదుకోన్ ఉండగా సెకండ్ స్థానాన్ని ‘కింగ్‌ఖాన్’ షారుక్ ఖాన్ సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమిర్‌ఖాన్, ఐశ్వర్యా రాయ్, సల్మాన్ ఖాన్ మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. కత్రినా కైఫ్, కుబ్ర సైట్ (డిజిటల్ వెబ్‌సిరీస్ ‘సాక్రెడ్ గేమ్స్’ ఫేమ్), ఇర్ఫాన్ ఖాన్, రాధికా ఆప్టే, అక్షయ్ కుమార్ మిగతా స్థానాల్లో నిలిచారు. ‘‘పద్మావత్’లో దీపికా చూపించిన అద్భుతమైన నటనే తనను టాప్‌లో నిలబెట్టింది’’ అని ఐయండీబి ప్రతినిధి నేహా గురేజా పేర్కొన్నారు.
డ్రీమ్ గాళ్!
బాలీవుడ్ నటి హేమ మాలిని పేరు చెప్పాలంటే డ్రీమ్ గాళ్ అని సంభోదించకుండా ఉండలేరు. తాజాగా కొత్త తరం కథానాయికల్లో డ్రీమ్ గాళ్ అనే ట్యాగ్ ఎవరికి సూట్ అవుతుంది? అని స్వయానా నాటి డ్రీమ్ గాళ్‌ని అడిగితే –‘‘ఈ జనరేషన్ డ్రీమ్ గాళ్ దీపికా పదుకోన్. ఎలాంటి దుస్తులు ధరించినా కూడా చాలా గ్రేస్‌ఫుల్‌గా, హుందాగా క్యారీ చేయగలదు. అలాగే కనిపించిన ప్రతీసారి చూపు తిప్పుకోలేనంత స్టన్నింగ్‌గా ఉంటుంది. తను నడుచుకునే తీరు, తనకు నచ్చినట్టుగా జీవించే విధానం నాకు చాలా ఇష్టం. దీపికతో నాకు మంచి రిలేషన్‌షిప్ కూడా ఉంది’’ అని డ్రీమ్‌గాళ్ అనే ట్యాగ్‌నిచ్చి దీపికను పొగడ్తల్లో ముంచెత్తారు హేమ మాలిని.
రాణీ సొంతమైంది
‘పద్మావత్’ సినిమాలో రాణీ పద్మావత్ (దీపికా పదుకోన్)ను దక్కించుకోవడం కోసం ఎంతో ప్రయత్నిస్తాడు ఖిల్జీ (రణ్‌వీర్ సింగ్). కానీ తన ప్రయత్నం విఫలమే అవుతుంది. ఖిల్జీకు దక్కకుండా అగ్నికి ఆహుతి అవుతుంది. ఇలాంటి విలనిజమ్ కనబరిచినందుకే రణ్‌వీర్ సింగ్‌కు ఇటీవల ఓ టీవీ షో ఉత్తమ న టుడు అవార్డ్‌ను అందజేసింది. ‘‘సినిమాలో రాణీని సొంతం చేసుకోలేకపోయాను. కానీ నిజ జీవితంలో నా రాణీ నా సొంతమైంది’’ అంటూ ఆ అవార్డ్ తీసుకుంటూ పేర్కొన్నారు రణ్‌వీర్. రణ్‌వీర్ స్పీచ్ విని ఆనంద బాష్పాలను ఆపుకోలేకపోయారు దీపిక.
Comments
Please login to add a commentAdd a comment