Internet Movie Data Base
-
నంబర్ వన్
ఇండియన్ సినిమా అండ్ టెలివిజన్ సిరీస్‌కు సంబంధించి ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (ఐఎమ్‌డీబీ) వెబ్సైట్ ఈ ఏడాదికి సంబంధించిన ఇండియన్ సెలబ్రిటీస్ జాబితాను విడుదల చేసింది. ఇందులో తొలి స్థానంలో నిలిచారు హీరోయిన్ ప్రియాంకా చోప్రా. రెండో స్థానంలో దిశా పటానీ, మూడో స్థానాన్ని హృతిక్ రోషన్ కైవసం చేసుకున్నారు. కియారా అద్వానీ, అక్షయ్ కుమార్, సల్మాన్‌ఖాన్, ఆలియా భట్, కత్రినా కైఫ్, రకుల్‌ప్రీత్ సింగ్, కత్రినా కైఫ్ వరుస క్రమంలో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. దక్షిణాది నుంచి కథానాయిక రకుల్‌ప్రీత్ సింగ్ ఒక్కరే ఈ జాబితాలో చోటు సంపాదించుకోవడం విశేషం. ఐఎమ్‌డీబీ ప్రోస్టార్ మీటర్ ర్యాంకింగ్స్, ఐఎమ్‌డీబీ పేజ్ వ్యూయర్స్ వంటి అంశాలను ఆధారంగా తీసుకుని ఈ జాబితాను విడుదల చేయడం జరిగిందని ఐఎమ్‌డీబీ ప్రతినిధి పేర్కొన్నారు. -
నయా డ్రీమ్ గాళ్!
బాలీవుడ్లో లేడీ సూపర్ స్టార్ దీపికా పదుకోన్ హవా కొనసాగుతూనే ఉంది. ఇటీవలే ఫోర్బ్స్ లిస్ట్‌లో టాప్ 5లో చోటు సంపాదించిన దీపిక మరోసారి టాప్ స్టార్‌గా నిలిచారు. ఐయండీబీ (ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ ) విడుదల చేసిన ‘2018 టాప్ 10 స్టార్స్ ఆఫ్ ఇండియన్ సినిమా’ జాబితాలో దీపిక టాప్‌లో నిలిచారు. ఖాన్స్‌ను సైతం పక్కన పెట్టి ఈ లిస్ట్‌లో టాప్ సీట్ దక్కించుకున్నారంటే దీపికా పదుకోన్ ఫాలోయింగ్ అర్థం చేసుకోవచ్చు. ‘ఐయండీబీ ప్రో స్టార్‌మీటర్ ర్యాంకింగ్’, ఈ సైట్‌ను వీక్షించిన లెక్కల ఆధారంగా ఈ లిస్ట్ తయారు చేశారు. ఈ లిస్ట్‌లో టాప్‌లో దీపికా పదుకోన్ ఉండగా సెకండ్ స్థానాన్ని ‘కింగ్‌ఖాన్’ షారుక్ ఖాన్ సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమిర్‌ఖాన్, ఐశ్వర్యా రాయ్, సల్మాన్ ఖాన్ మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. కత్రినా కైఫ్, కుబ్ర సైట్ (డిజిటల్ వెబ్‌సిరీస్ ‘సాక్రెడ్ గేమ్స్’ ఫేమ్), ఇర్ఫాన్ ఖాన్, రాధికా ఆప్టే, అక్షయ్ కుమార్ మిగతా స్థానాల్లో నిలిచారు. ‘‘పద్మావత్’లో దీపికా చూపించిన అద్భుతమైన నటనే తనను టాప్‌లో నిలబెట్టింది’’ అని ఐయండీబి ప్రతినిధి నేహా గురేజా పేర్కొన్నారు. డ్రీమ్ గాళ్! బాలీవుడ్ నటి హేమ మాలిని పేరు చెప్పాలంటే డ్రీమ్ గాళ్ అని సంభోదించకుండా ఉండలేరు. తాజాగా కొత్త తరం కథానాయికల్లో డ్రీమ్ గాళ్ అనే ట్యాగ్ ఎవరికి సూట్ అవుతుంది? అని స్వయానా నాటి డ్రీమ్ గాళ్‌ని అడిగితే –‘‘ఈ జనరేషన్ డ్రీమ్ గాళ్ దీపికా పదుకోన్. ఎలాంటి దుస్తులు ధరించినా కూడా చాలా గ్రేస్‌ఫుల్‌గా, హుందాగా క్యారీ చేయగలదు. అలాగే కనిపించిన ప్రతీసారి చూపు తిప్పుకోలేనంత స్టన్నింగ్‌గా ఉంటుంది. తను నడుచుకునే తీరు, తనకు నచ్చినట్టుగా జీవించే విధానం నాకు చాలా ఇష్టం. దీపికతో నాకు మంచి రిలేషన్షిప్ కూడా ఉంది’’ అని డ్రీమ్‌గాళ్ అనే ట్యాగ్నిచ్చి దీపికను పొగడ్తల్లో ముంచెత్తారు హేమ మాలిని. రాణీ సొంతమైంది ‘పద్మావత్’ సినిమాలో రాణీ పద్మావత్ (దీపికా పదుకోన్)ను దక్కించుకోవడం కోసం ఎంతో ప్రయత్నిస్తాడు ఖిల్జీ (రణ్వీర్ సింగ్). కానీ తన ప్రయత్నం విఫలమే అవుతుంది. ఖిల్జీకు దక్కకుండా అగ్నికి ఆహుతి అవుతుంది. ఇలాంటి విలనిజమ్ కనబరిచినందుకే రణ్వీర్ సింగ్‌కు ఇటీవల ఓ టీవీ షో ఉత్తమ న టుడు అవార్డ్‌ను అందజేసింది. ‘‘సినిమాలో రాణీని సొంతం చేసుకోలేకపోయాను. కానీ నిజ జీవితంలో నా రాణీ నా సొంతమైంది’’ అంటూ ఆ అవార్డ్ తీసుకుంటూ పేర్కొన్నారు రణ్వీర్. రణ్వీర్ స్పీచ్ విని ఆనంద బాష్పాలను ఆపుకోలేకపోయారు దీపిక. -
భయానికీ, ఆశకూ మధ్య...
ఇంటర్నెట్ మూవీ డేటా బేస్(ఐఎమ్‌డీబీ)ని ప్రతి రోజూ విశ్వవ్యాప్తంగా 1.6 కోట్లమంది సందర్శిస్తారు. రివ్యూలు, ఫోటో గ్యాలరీలు, డౌన్లోడ్ లింకులతో సహా దాదాపు ఇరవై లక్షల సినిమాలకు సంబంధించిన సమాచారం ఉంటుంది ఇందులో! ఇలాంటి నేపథ్యమున్న సైట్లో గత పదిహేను సంవత్సరాలుగా ఒకే చిత్రం ‘ద బెస్ట్’ గా నిలుస్తోంది! వేలాది చిత్రాల మధ్య అది టాపర్‌గా నిలుస్తోంది. హాలీవుడ్ సినిమాలకు సంబంధించి అత్యంత విశ్వసనీయమైన సమాచార వాహినిగా ఉన్న ఈ సైట్లో ఆ సినిమా ఆధిపత్యాన్ని అందుకునే చిత్రాలు రావడం లేదు.నెటిజన్లే ఓటర్లుగా ఐఎండీబీ ఎంపిక చేసిన అత్యుత్తమ 250 హాలీవుడ్ సినిమాల్లో తొలిస్థానంలో నిలుస్తున్న ఆ చిత్రమే ‘ద షాషాంక్ రెడెంషన్’. 1994 లో విడుదలైన ఈ సినిమా 1998 నుంచి ఇప్పటి వరకూ టాప్ రేటింగ్‌తో తొలిస్థానంలో నిలిచి, కొనసాగుతోంది. 1990ల ప్రారంభంలో కేవలం ఒక డాలర్ చెల్లించి తను రాసిన కథలను, నవలలను సినిమాగా తీసుకోవచ్చుననే బ్రహ్మాండమైన ఆఫర్‌ను ఇచ్చాడు అమెరికన్ రచయిత స్టీఫెన్ కింగ్. ఆయనేమీ అప్పటికింకా ఔత్సాహిక యువ రచయిత కాదు, ఆయన రాసిన అనేక కథాంశాలు అప్పటికే సినిమాలుగా రూపొంది కోట్లాది డాలర్ల కలెక్షన్లను సాధించాయి! అప్పటికే రెండు దశాబ్దాలుగా రచయితగా ప్రస్థానం సాగించిన కింగ్ నుంచి వచ్చిన ఆశ్చర్యకరమైన ప్రకటన అది. ఆ ప్రకటన చాలా మంది హాలీవుడ్ నిర్మాతలకు, దర్శకులకు బంపర్ ఆఫర్ అయ్యింది. అంత వరకూ కింగ్ నవలలను మూస పద్ధతిలో అనేక మంది దర్శక నిర్మాతలు తెరకెక్కిస్తూ వస్తున్న నేపథ్యంలో... తన అక్షరాలను తెరపై సృజించదగిన వారి కోసం కింగ్ ఈ ప్రయత్నం చేశాడనుకోవాలి. అద్భుతమైన సినిమాకు తగిన ముడిసరుకు ఉంటుంది కింగ్ రచనల్లో. జీవితానికి పాజిటివ్ కోట్ వేసి పాత్రచిత్రణ చేస్తారు కింగ్. చాలా వరకూ హారర్ నవలలే రాసిన స్టీఫెన్కింగ్ భిన్నమైన షార్ట్ స్టోరీల్లో ఒకటి ‘రీటా హేవర్త్ అండ్ షాషాంక్ రెడెంషన్’. కింగ్ అభిమాని అయిన దర్శకుడు ఫ్రాంక్ డరబోంట్ ఆ ఒక్క డాలర్ ఆఫర్ కింద ఈ షార్ట్స్టోరీని ఎంచుకొని సినిమాగా రూపొందించాడు. రెండు దశాబ్దాల పాటు జైలు జీవితం గడిపిన ఒక వ్యక్తి కథే ఈ సినిమా. భార్య హత్య గురించి చేయని నేరానికి హీరో ‘రెండు జీవితాల ఖైదు’ అనుభవించాలని శిక్ష విధిస్తుంది కోర్టు. అతడిని ‘షాషాంక్’ అనే జైలుకు తరలిస్తారు. అక్కడి పరిస్థితుల మధ్య జైలును సంస్కరించడానికి, అక్కడ జరుగుతున్న అక్రమాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి అతడు చేసే ప్రయత్నాల కథే మిగతా సినిమా. హీరో పాత్రద్వారా ఎక్కడా నిరుత్సాహం, నిస్తేజం ఆవరించకుండా పరిస్థితులకు తగ్గట్టుగా జీవితాన్ని మలుచుకోవడాన్ని పాఠంగా చూపిస్తారు. ‘ఫియర్ కెన్ హోల్డ్ యూ ప్రిజనర్, హోప్ కెన్ సెట్ యూ ఫ్రీ’ అనే ట్యాగ్‌లైన్ ఈ చిత్రం జీవితానికి అద్దే పాజిటివ్ నెస్‌ను ప్రతిబింబిస్తుంది. ఆశావాహ దృక్పథం గురించి అద్భుత స్థాయిలో ఆవిష్కరించిన ఈ సినిమా గాడ్‌ఫాదర్, గాడ్‌ఫాదర్-2 తదితర చిత్రాలన్నింటినీ దాటుకుని ఐఎండీబీలో ఫస్ట్‌ప్లేస్‌కు చేరుకుంది. సినిమా రూపంలో కూడా ప్రపంచం ఆశావాహ దృక్పథాన్నే ఆదరిస్తుందనేదానికి నిరూపణే ‘ద షాషాంక్ రిడెంషన్’ - జీవన్