dream girl
-
ఆమె డ్రీమ్ గర్ల్ మాత్రమే కాదు, నాట్య మయూరి కూడా..! (ఫోటోలు)
-
హీరోయిన్ కూతురు కొత్త మూవీ.. బడ్జెట్ జస్ట్ రూ.7 లక్షలే!
సినిమా అనేది ఇప్పుడు వందల కోట్ల వ్యవహారం అయిపోయింది. స్టార్ హీరోలు, పాన్ ఇండియా హీరోలు.. వందల కోట్లు అని పరుగెడుతుంటే.. మిడ్ రేంజ్, చిన్న హీరోలు ఏ మాత్రం తగ్గట్లేదు. తక్కువలో తక్కువ రూ.5 కోట్లు బడ్జెట్‌కి మించిన సినిమాల్లోనే నటిస్తున్నారు. తాజాగా ఓ హీరోయిన్ కూతురు హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతోంది. ఇప్పుడు ఈమె నటించిన ఈ చిత్రాన్ని కేవలం రూ.6-7 లక్షల్లో పూర్తి చేశారంటే మీరు నమ్ముతారా? అవును మేం చెప్పింది నిజమే. (ఇదీ చదవండి: హీరో ధనుష్ ఇంటికొచ్చిన పోలీసులు? కొడుకు ఆ తప్పు చేయడంతో!) ప్రముఖ తమిళ దర్శకుడు ఏఆర్ భారతి తీసిన లేటెస్ట్ మూవీ 'డ్రీమ్ గర్ల్'. చారులతా ఫిల్మ్స్ పతాకంపై కావేరి మాణిక్యం, ఆర్ గుణశేఖరన్, ఆధిత్యన్ కలిసి నిర్మించిన ఈ చిత్రంలో జీవా హీరో. సీనియర్ ఫైట్ మాస్టర్ జస్టిన్ మనవరాలు, నటి బబిత కూతురు హరిష్మిత హీరోయిన్గా పరిచయమవుతోంది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 12న థియేటర్లలో రిలీజ్ కానుంది. దర్శకుడు మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు. ఈ చిత్రం పలు ఆసక్తికరమైన అంశాలతో సాగే ప్రేమకథ అని అన్నారు. కేవలం రూ. 6-7 లక్షల్లో దీన్ని పూర్తిచేసినట్లు చెప్పారు. తక్కువ బడ్జెట్ చిత్రాలకు ఇది ఓ మంచి ఉదాహరణ అని పేర్కొన్నారు. ప్రణాళిక ప్రకారం నటీనటులు, సాంకేతిక బృందం సంపూర్ణ సహకారం అందించడంతో ఇది సాధ్యం అయ్యిందని పేర్కొన్నారు. (ఇదీ చదవండి: Bigg Boss 7: ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. ఆ ఇద్దరు ఔట్?) -
ఓటీటీలోకి సూపర్ హిట్ కామెడీ ఫిలిం.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?
బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా నటించిన కామెడీ ఎంటర్టైనర్ డ్రీమ్ గర్ల్ 2. ఇది 2019లో వచ్చిన డ్రీమ్ గర్ల్ సినిమాకు కొనసాగింపుగా తెరకెక్కింది. ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ.140 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ మూవీ ఎట్టకేలకు ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయింది. రెండు నెలల తర్వాత ఓటీటీలోకి థియేటర్లలోకి వచ్చిన రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోందీ మూవీ. అక్టోబర్ 20 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. 'మీ కలలు నిజం కాబోతున్నాయి. డ్రీమ్ గర్ల్ రెట్టింపు మ్యాజిక్, డబుల్ ఎంటర్టైన్మెంట్తో తిరిగి వస్తోంది.. రేపటి నుంచి డ్రీమ్ గర్ల్ 2 ఓటీటీలో అందుబాటులో ఉంటుంది' అని నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. ఫ్యాన్స్ ఖుషీ.. ఇది చూసిన అభిమానులు.. హమ్మయ్య, ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తోంది అని కామెంట్లు చేస్తున్నారు. రాజ్ శాండిల్య దర్శకత్వం వహించిన ఈ మూవీలో కరమ్‌గా ఆయుష్మాన్, పరిగా అనన్య పాండే నటించింది. పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, మంజోత్ సింగ్, రాజ్‌పాల్ యాదవ్ కీలక పాత్రలు పోషించారు. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) చదవండి: ఆరోజు నా భార్య నా మీదకు చెప్పు విసిరింది.. శిల్పా శెట్టి భర్త ఎమోషనల్ -
మా నాన్నను ధర్మేంద్ర ఏడిపించారు..
‘ఒక విదేశీ షూటింగ్‌కు నాతోపాటు మా నాన్న వచ్చారు. ధర్మేంద్రతో పాటలో యాక్ట్ చేయాలి. నాన్నకు అప్పటికే ధర్మేంద్ర నా వెంట పడటం తెలుసు. అందుకని నాన్న ప్రతిసారి మా కారు ధర్మేంద్ర ఎక్కకుండా అడ్డుకునేవారు. అయినా సరే ధర్మేంద్ర మా కారులోనే వస్తానని అనేవారు. నేను బ్యాక్సీట్లో కూచోగానే మా నాన్న వెంటనే డోర్ తీసుకుని నా పక్కన కూచునేవారు. ధర్మేంద్ర చాలా క్లవర్. ఇంకో డోర్ నుంచి ఆయన ఎక్కి నా పక్కన కూచునేవారు. వాళ్లు ఇలా నా కోసం ప్లాన్లు వేయడం సరదాగా అనిపించేది’ అన్నారు హేమమాలిని. 72 సంవత్సరాల హేమమాలిని నేటికి బాలీవుడ్ ‘డ్రీమ్‌గర్ల్’గా ఉన్నారు. అందుకే మొన్నటి ఆదివారం (మార్చి 7) విమెన్స్ డే సందర్భంగా ఇండియన్ ఐడెల్ ఎపిసోడ్‌ను ఆమె పేరున నిర్వహించారు. హేమమాలిని ఆ ఎపిసోడ్‌కు హాజరయ్యి ఆ సందర్భంగా చాలా విశేషాలు చెప్పారు హేమ మాలిని. అంతేకాదు, అందరినీ ఆశ్చర్యపరుస్తూ డాన్స్ చేశారు. ఆమె స్టెప్పులేసిన పాటల్లో ‘షోలే’లోని ‘జబ్ తక్ హై జాన్’ పాట ఒకటి. ‘షోలే’లో ఈ పాట క్లయిమాక్స్ లో వస్తుంది. గబ్బర్ సింగ్ ముందు మండుటెండలో బండరాళ్ల మీద పగిలిన గాజుపెంకులపై డాన్స్ చేస్తుంది హేమ మాలిని, ధరేంద్రను విడిపించుకోవడానికి. ఆ పాట వెనుక ఉన్న విశేషాలను కూడా ఆమె చెప్పారు– ‘ఆ పాట ఇలా ఉంటుందని దర్శకుడు రమేశ్ సిప్పి చెప్పారు. చేద్దాం... కాని షూటింగ్ నవంబర్, డిసెంబర్లో పెట్టుకోండి. అప్పుడు మైసూరు (షూటింగ్ జరుగుతున్న ప్రాంతం) చల్లగా ఉంటుంది అన్నాను. కాని రమేశ్ సిప్పీ వినలేదు. ఏప్రిల్ నెలఖారున షూటింగ్ పెట్టారు. అంత ఎండ లో రాళ్ల మీద డాన్స్ చేయడం ఎలా అనుకున్నాను. మా అమ్మ పాదాలకు ప్రత్యేకమైన సాక్సులు తయారు చేయించింది. అవి వేసుకుంటే కాళ్లు కాలవు.. సాక్సులు వేసుకున్నట్టు తెలియదు కూడా. వాటిని తొడుక్కుంటుంటే రమేశ్ సిప్పీ దూరం నుంచి చూసి ‘వద్దొద్దు్ద అవి వేయకండి’ అని వార్నింగ్ ఇచ్చారు. సరే... రాళ్ల మీద కాసిన్ని నీళ్లైనా పోయండి చల్లబడతాయి అన్నాను. దానికీ ఒప్పుకోలేదు. చివరకు పాటను అలాగే చేశాను. మొత్తం పాట తీయడానికి పది రోజులు పట్టింది. కాని ఫలితం ఎలా ఉందో మీరే చూశారుగా’ అన్నారామె. ‘జానీ మేరా నామ్ సినిమా సమయానికి నేను ఇంకా ఫీల్డుకి కొత్త. ఆ సినిమాలో వాదా తూ నిభాయా... పాట దేవ్ ఆనంద్ గారితో చేయాలి. రోప్ వేలో ఒక చైర్లో దేవ్ ఆనంద్ కూచుంటే ఆయన వొడిలో నేను కూచోవాలి. సరే.. సినిమాల్లో ఇవన్నీ తప్పవు. నేను దేవ్ గారి వొడిలో కూచున్నాక ప్రతిసారీ కరెంటు పోయేది. నేను అలాగే కూచుని ఉండాల్సి వచ్చేది. ఏమిటా అని చూస్తే తర్వాత తెలిసింది... కావాలనే కరెంట్ తీసేస్తున్నారని. ఇలాంటివి కూడా షూటింగ్లలో జరుగుతుంటాయి’ అన్నారామె. తను ఇంట్లో మూడో సంతానమని, తను గర్భంలో ఉండగానే ఈసారి పుట్టేది ఆడపిల్లే.. దానికి హేమ మాలిని అని పేరు పెట్టాలి అని తన తల్లి అనుకుందని ఆమె చెప్పారు. పుట్టక ముందే పేరు రెడీ చేసుకున్న ఆమె పుట్టాక ఆ పేరును డ్రీమ్ గర్ల్ హేమమాలినిగా నిలబెట్టుకున్నారు. -
కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న ‘డ్రీమ్ గర్ల్’
ఆయుష్మాన్ ఖురానా ప్రస్తుతం బాలీవుడ్లో ప్రమోగాత్మక చిత్రాలలో నటిస్తూ క్రేజీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ‘అంధాథూన్’, ‘బదాయి హో’ వంటి విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుత హీరోలలో డిఫరెంట్ సినిమాలు చేసే స్టార్ హీరో అమీర్ ఖాన్ తర్వాత ఆయుష్మాన్ పేరే వినపడుతోంది. తాజాగా ఈ హీరో డిఫరెంట్ రోల్లో నటించిన చిత్రం ‘డ్రీమ్ గర్ల్’. విడుదలైన తొలి ఆట నుంచే మంచి టాక్‌ను సొంతం చేసుకుని, కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రం విడుదలైన ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 52 కోట్లను వసూలు చేసింది. ఇంత భారీ వసూళ్లు రాబట్టడంతో నిర్మాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ చిత్రం కలెక్షన్ల సునామీని సృష్టిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక సినిమా విషయానికొస్తే ఆయుష్మాన్ ఖురానా కరమ్‌గా ప్రధాన పాత్ర పోషించాడు. ఇందులో కరమ్ స్థానికంగా జరిగే చిన్న చిన్న నాటకాల్లో అమ్మాయి పాత్రలు చేస్తుంటాడు. దీంతో అమ్మాయి గొంతుతో ఫేమస్ అయిన కరమ్‌కు ఫ్రెండ్షిప్ అనే కాల్ సెంటర్లో జాబ్ వస్తుంది. కరమ్ పేరు కాస్త పూజాగా మార్చుకుంటాడు. లోన్లీగా ఫీలయి కాల్ సెంటర్‌కు ఫోనే చేసే అమ్మాయి, అబ్యాలతో గొంతు మార్చి సరదాగా మాట్లాడుతూ వారిలో స్థైర్యాన్ని, ఉత్సాహాన్ని నింపుతాడు. -
మూడు రోజుల్లో రూ.44.57 కోట్ల కలెక్షన్స్
బాలీవుడ్లో ‘విక్కీ డోనర్’, ‘జోర్ లగాకే హైస్సా’, ‘అంధా ధున్’ లాంటి ప్రయోగాత్మక చిత్రాలలో నటించి క్రేజీ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న హీరో ఆయుష్మాన్ ఖురానా. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తర్వాత భిన్నమైన సినిమాలు ఎంచుకోనే నటుడిగా పేరు తేచ్చుకున్న ఆయుష్మాన్ ఖురానా నటించిన తాజా చిత్రం ‘డ్రీమ్ గర్ల్’. ఈ సినిమా విడుదలైన మొదటి రోజే అత్యధిక వసూళ్లను సాధించి మరోసారి ఈ నటుడికి భారీ ఓపెనింగ్‌ను తెచ్చిపెట్టింది. రాజ్ శాండిల్య తొలిసారి దర్శకుడిగా మారి తెరకెక్కించిన ఈ చిత్రం రిలీజ్ అయిన మొదటి రోజే రూ. 10.05 కోట్లు కలేక్ట్ చేయగా.. శనివారం నాటికి(రెండవ రోజు)16.42 కోట్లు వసూళ్లు చేసింది. అలాగే విడుదలైన మొదటి ఆదివారం నాటికి బాక్సాఫీస్ వద్ద రూ. 18.1 కోట్లు వసూలు చేసింది. దాంతో మొత్తంగా మూడు రోజులకు కలిపి రూ. 44.57 కోట్ల కలెక్షన్స్ సాధించింది. కాగా పూర్తి వినోదాత్మక నేపథ్యంతో తెరకెక్కించిన డ్రీమ్ గర్ల్‌లో ఆయుష్మాన్ ఖురానా పరమ్ పాత్ర పోషించాడు. నిరుద్యోగి అయిన పరమ్ డబ్బుల కోసం చిన్న చిన్న నాటకాల్లో అమ్మాయి పాత్రలు పోషిస్తూ ఉంటాడు. అలా జీవితం సాగిస్తున్న పరమ్‌కు ‘ఫ్రెండ్షిప్’ అనే కాల్ సెంటర్లో ఉద్యోగం వస్తుంది. అందులో లేడి గోంతుతో మాట్లాడుతూ.. అబ్బాయి, అమ్మాయిలతో స్నేహం చేయాలి, దీంతో పరమ్ కాస్తా పూజాగా మారతాడు. నాన్ స్టాప్ పంచ్‌లతో కడుపుబ్బా నవ్వించే ఈ సినిమా, విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్ రావడంతో విమర్శకుల నుంచి పాజిటీవ్ రెస్పాన్స్ వస్తుంది. -
డ్రీమ్ గాళ్‌తో రానా!
ప్రస్తుతం ముంబై నుంచి హైదరాబాద్ వరకూ మోస్ట్ వాంటెడ్ యాక్టర్ రానా. ప్రాంతీయ హద్దులను తన స్టోరీ సెలక్షన్స్‌తో చెరిపేస్తున్నారు. యాక్టర్‌గా కొత్త కొత్త కథలను చెబుతున్న రానా నిర్మాతగా మారి మరిన్ని కథలను స్క్రీన్ మీదకు తీసుకురావాలని అనుకుంటున్నారని తెలిసింది. ఆల్రెడీ సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద వచ్చిన కొన్ని సినిమాలకు రానా సమర్పకుడిగా వ్యవహరించారు. ఇప్పుడు పూర్తిస్థాయి నిర్మాతలా మారి, రాజ్ తరుణ్ హీరోగా అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మిస్తున్నారట. ఈ సినిమా షూటింగ్ కూడా ఆల్రెడీ జరుగుతోందని తెలిసింది. ఇది హిందీ ‘డ్రీమ్ గాళ్’ చిత్రానికి రీమేక్ అని కూడా సమాచారం. -
డ్రీమ్‌గర్ల్!
‘హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలు చేయడం తప్ప హీరోయిన్ కాలేవు’లాంటి వెటకారాలను ఆమె సీరియస్‌గా తీసుకుందో లేదోగాని బాలీవుడ్లో పుష్కరకాల ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని బ్లాక్‌బస్టర్ సక్సెస్‌లను రుచి చూసింది నుష్రత్ భరుచా. ‘ప్యార్ కా పంచ్‌నామా’, ‘ప్యార్ కా పంచ్‌నామా–2’ ‘సోనూ కే టిటూ కీ స్వీటీ’ సినిమాలు భరుచాకు మంచి గుర్తింపు తెచ్చాయి. త్వరలో ‘డ్రీమ్‌గర్ల్’గా అలరించనున్న నుష్రత్ అంతరంగ తరంగాలు... కిట్టీ పార్టీతో... సినిమాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. నేను సినిమాల్లోకి రావడం పేరెంట్స్‌కు ఎంతమాత్రం ఇష్టం లేదు. మా చుట్టాలు పక్కాలలో ‘ప్రొఫెషన్’ అంటే ‘మెడిసిన్’, ‘ఇంజనీరింగ్’ తప్ప మరేదీ కాదు. వీటిలోనే జాబ్ సెక్యూరిటీ ఉంటుందనేది వారి నమ్మకం. యాక్టింగ్ అనేది ‘రియల్ ప్రొఫెషన్’ కాదు అని ఖరాఖండిగా చెప్పేవాళ్లు. ఇప్పటికీ ‘‘నేను సినిమాల్లో నటిస్తున్నాను’’ అని చెబితే జాలిగా చూసేవాళ్లు లేకపోలేదు. ఒకసారి టీవీ సీరియల్ ‘కిట్టీ పార్టీ’ ఆడిషన్‌కు వెళ్లాను. ఏదో వెళ్లానుగానీ...సెలెక్ట్ అవుతానని అనుకోలేదు. ‘మీరు సెలెక్ట్ అయ్యారు’ అంటూ వచ్చిన కాల్ నన్ను సంతోషంలో ముంచెత్తింది. అదృష్టమేమిటంటే కొద్దినెలల్లోనే బిగ్స్క్రీన్పై నటించే అవకాశం వచ్చింది. ‘కల్ కిస్నే దేఖా’ ‘జై సంతోషి మా’ (2006) సినిమాల్లో నటించాను. ఈ సినిమాలతో పెద్ద గుర్తింపు లభించలేదు. ‘డార్క్ లవ్ సెక్స్ ధోఖా’ సినిమాలో పరువుహత్య బాధితురాలిగా నటించాను. ఈ సినిమా నాకు మంచి గుర్తింపు తెచ్చింది. టీవిలో నటిస్తున్నప్పుడు ‘నటన’ అంటే ఆషామాషీ కాదని బాగా కష్టపడాలనే విషయం అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది. అయినా సరే... ‘ఇలాంటి పాత్రలు మాత్రమే చేయాలి’ అని ఎప్పుడూ మడి కట్టుకొని కూర్చోలేదు. ఒక పాత్రలో దమ్ము ఉంటే అది నెగెటివ్ క్యారెక్టర్ అయినా చేశాను. ‘ఇలాంటి పాత్రలు ఎందుకు చేస్తారు?’ అనే వాళ్లు కూడా లేకపోలేదు. ఒక సినిమాలో నాకు అవకాశం వచ్చిందా? రాలేదా? అనే దానికంటే నాకు ఇచ్చిన పాత్రకు న్యాయం చేయగలనా లేదా? అనేది ఆలోచిస్తాను. ‘ప్యార్ కా పంచ్‌నామా’ సినిమాలో నటించే అవకాశం వచ్చినప్పుడు ‘‘ఈ పాత్రను నేను చేయలేను. ఇలాంటి అమ్మాయిలు నిజజీవితంలో ఉంటారని నేను అనుకోవడం లేదు’’ అన్నాను. ‘‘ఇదేమీ నిజజీవిత కథ కాదు... కామెడీ సినిమా చేస్తున్నాను. కామెడీ సినిమాల్లో క్యారెక్టర్లు ఇలాగే ఉంటాయి... అంతేగాని అమ్మాయిలు ఇలా ఉంటారని చూపడం నా ఉద్దేశం కాదు’’ అని చెప్పాడు డైరెక్టర్. అలా ఆయన మాటలతో కన్విన్స్ అయి ఆ సినిమాలో నటించాను. విధిరాత! గతంలో వీళ్లు వాళ్లు అనేవారు...‘‘నువ్వు హీరోయిన్ మెటీరియల్ కాదు. నువ్వు ఫ్రెండ్ రోల్స్ మాత్రమే చేస్తుండాలి’’ బయటివాళ్లే కాదు. కుటుంబసభ్యులు కూడా ‘‘నీ కళ్లు చేప కళ్లు కాదు కాబట్టి నువ్వు హీరోయిన్ కాలేవు’’ అనేవాళ్లు. నేను మాత్రం సీరియస్‌గా తీసుకోకుండా తేలిగ్గా నవ్వేదాన్ని. కానీ విధిరాతను ఎవరు మార్చగలరు! -
స్త్రీ పురుషుడు
కమలహాసన్ గతంలో ‘భామనే సత్యభామనే’ సినిమాలో బామ్మగా నటించడం గుర్తుండే ఉంటుంది. హిందీలో మళ్లీ అలాంటి ఛాయలున్న పాత్రనే ఆయుష్మాన్ ఖురానా చేస్తున్నాడు. ‘విక్కీ డోనర్’, ‘జోర్ లగాకే హైస్సా’, ‘అంధా ధున్’ సినిమాలతో బాలీవుడ్లో మంచి గిరాకీ ఉన్న నటుడుగా పేరు పడ్డ ఆయుష్మాన్ ఖురానా తాజాగా ‘డ్రీమ్ గర్ల్’ అనే హాస్య చిత్రానికి పని చేస్తున్నాడు. హిందీ టెలివిజన్‌లో ‘కామెడీ సర్కస్’, ‘కపిల్ శర్మ షో’ వంటి షోలకు వందలాది ఎపిసోడ్స్ రాసిన రాజ్ శాండిల్య తొలిసారిగా దర్శకుడిగా మారి ఈ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో ఆయుష్మాన్ ఆయా పరిస్థితులను బట్టి రామాయణంలో సీతలాగా, భారతంలో ద్రౌపదిలాగా, కృష్ణలీలలో రాధలాగా వ్యవహరిస్తాడట. అంటే ఈ పురుషుడు మూడు స్త్రీ పాత్రలను అనుసరించనున్నాడన్న మాట. ఉత్తర ప్రదేశ్‌లోని చిన్న టౌన్లో జరిగే ఈ కథకు అనుగుణంగా హిందీ, హరియాణా యాసలను నేర్చుకునే పనిలో ఉన్నాడట ఆయుష్మాన్ ఖురానా. కొత్త టాలెంట్ ఎక్కడున్నా గుర్తించి అవకాశం ఇచ్చే ఏక్తా కపూర్ ఈ సినిమాకు ఒక నిర్మాత. సినిమాలో ఈ ‘హీరో–యిన్’కు హీరోయిన్ ఉంది. నుస్రత్ బరూచా ఆ బాధ్యత నిర్వర్తించనుంది. -
హేమ అడుగుల్లో హెగ్డే
ఆ తరం ప్రేక్షకులను తన నటనతో అలరించి డ్రీమ్‌గాళ్‌గా పేరు సంపాదించారు హేమ మాలిని. ప్రస్తుత తరం హీరోయిన్స్ కూడా హేమ డ్యాన్స్ నుంచి ప్రేరణ పొందుతున్నారనడంలో ఆశ్చర్యం ఏం లేదు. తాజాగా పూజా హెగ్డే కూడా ఈ లిస్ట్‌లోనే ఉన్నానంటున్నారు. పూజా ప్రస్తుతం నటిస్తున్న ఓ సినిమాకి క్లాసికల్ డ్యాన్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాంగ్ షూట్ చేయాలనుకున్నారట. దాంతో గంటల తరబడి ఆ డ్యాన్స్‌ను నేర్చుకుంటూ శ్రమించడమే కాకుండా హేమ మాలిని పాత సినిమాలను చూస్తున్నారట పూజా. ఈ విషయం గురించి పూజా మాట్లాడుతూ – ‘‘తొలిసారి క్లాసికల్ డ్యాన్స్‌కు ప్రాధాన్యం ఉన్న పాట చేయబోతున్నాను. ఇలాంటి పాటలకు ప్రేరణ అంటే హేమాజీని మించి ఎవరున్నారు? చిన్నప్పటి నుంచి ఆవిడ సినిమాలు చూస్తూ పెరిగాను. ఆమె డ్యాన్స్ మూమెంట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా అనిపిస్తుంటాయి. ప్రతి ఎక్స్ప్రెషన్ను కరెక్ట్‌గా స్క్రీన్ మీద చూపిస్తారామె’’ అన్నారు. ఇంతకీ ఏ సినిమాలో ఈ సాంగ్‌కు నర్తిస్తున్నారో మాత్రం పూజా హెగ్డే పేర్కొలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో మహేశ్ ‘మహర్షి’, ప్రభాస్ ‘జాన్’ (వర్కింగ్ టైటిల్) సినిమాలున్నాయి. ఈ రెండింటిలో ఏదో ఒక సినిమాలో ఈ పాట ఉంటుందా? వెయిట్ అండ్ సీ. -
నయా డ్రీమ్ గాళ్!
బాలీవుడ్లో లేడీ సూపర్ స్టార్ దీపికా పదుకోన్ హవా కొనసాగుతూనే ఉంది. ఇటీవలే ఫోర్బ్స్ లిస్ట్‌లో టాప్ 5లో చోటు సంపాదించిన దీపిక మరోసారి టాప్ స్టార్‌గా నిలిచారు. ఐయండీబీ (ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ ) విడుదల చేసిన ‘2018 టాప్ 10 స్టార్స్ ఆఫ్ ఇండియన్ సినిమా’ జాబితాలో దీపిక టాప్‌లో నిలిచారు. ఖాన్స్‌ను సైతం పక్కన పెట్టి ఈ లిస్ట్‌లో టాప్ సీట్ దక్కించుకున్నారంటే దీపికా పదుకోన్ ఫాలోయింగ్ అర్థం చేసుకోవచ్చు. ‘ఐయండీబీ ప్రో స్టార్‌మీటర్ ర్యాంకింగ్’, ఈ సైట్‌ను వీక్షించిన లెక్కల ఆధారంగా ఈ లిస్ట్ తయారు చేశారు. ఈ లిస్ట్‌లో టాప్‌లో దీపికా పదుకోన్ ఉండగా సెకండ్ స్థానాన్ని ‘కింగ్‌ఖాన్’ షారుక్ ఖాన్ సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమిర్‌ఖాన్, ఐశ్వర్యా రాయ్, సల్మాన్ ఖాన్ మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. కత్రినా కైఫ్, కుబ్ర సైట్ (డిజిటల్ వెబ్‌సిరీస్ ‘సాక్రెడ్ గేమ్స్’ ఫేమ్), ఇర్ఫాన్ ఖాన్, రాధికా ఆప్టే, అక్షయ్ కుమార్ మిగతా స్థానాల్లో నిలిచారు. ‘‘పద్మావత్’లో దీపికా చూపించిన అద్భుతమైన నటనే తనను టాప్‌లో నిలబెట్టింది’’ అని ఐయండీబి ప్రతినిధి నేహా గురేజా పేర్కొన్నారు. డ్రీమ్ గాళ్! బాలీవుడ్ నటి హేమ మాలిని పేరు చెప్పాలంటే డ్రీమ్ గాళ్ అని సంభోదించకుండా ఉండలేరు. తాజాగా కొత్త తరం కథానాయికల్లో డ్రీమ్ గాళ్ అనే ట్యాగ్ ఎవరికి సూట్ అవుతుంది? అని స్వయానా నాటి డ్రీమ్ గాళ్‌ని అడిగితే –‘‘ఈ జనరేషన్ డ్రీమ్ గాళ్ దీపికా పదుకోన్. ఎలాంటి దుస్తులు ధరించినా కూడా చాలా గ్రేస్‌ఫుల్‌గా, హుందాగా క్యారీ చేయగలదు. అలాగే కనిపించిన ప్రతీసారి చూపు తిప్పుకోలేనంత స్టన్నింగ్‌గా ఉంటుంది. తను నడుచుకునే తీరు, తనకు నచ్చినట్టుగా జీవించే విధానం నాకు చాలా ఇష్టం. దీపికతో నాకు మంచి రిలేషన్షిప్ కూడా ఉంది’’ అని డ్రీమ్‌గాళ్ అనే ట్యాగ్నిచ్చి దీపికను పొగడ్తల్లో ముంచెత్తారు హేమ మాలిని. రాణీ సొంతమైంది ‘పద్మావత్’ సినిమాలో రాణీ పద్మావత్ (దీపికా పదుకోన్)ను దక్కించుకోవడం కోసం ఎంతో ప్రయత్నిస్తాడు ఖిల్జీ (రణ్వీర్ సింగ్). కానీ తన ప్రయత్నం విఫలమే అవుతుంది. ఖిల్జీకు దక్కకుండా అగ్నికి ఆహుతి అవుతుంది. ఇలాంటి విలనిజమ్ కనబరిచినందుకే రణ్వీర్ సింగ్‌కు ఇటీవల ఓ టీవీ షో ఉత్తమ న టుడు అవార్డ్‌ను అందజేసింది. ‘‘సినిమాలో రాణీని సొంతం చేసుకోలేకపోయాను. కానీ నిజ జీవితంలో నా రాణీ నా సొంతమైంది’’ అంటూ ఆ అవార్డ్ తీసుకుంటూ పేర్కొన్నారు రణ్వీర్. రణ్వీర్ స్పీచ్ విని ఆనంద బాష్పాలను ఆపుకోలేకపోయారు దీపిక. -
‘డ్రీమ్ గర్ల్’గా యంగ్ హీరో
అంధాధున్, బదాయి హో సినిమాల సక్సెస్‌లతో మంచి ఫాంలో ఉన్న బాలీవుడ్ యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానా మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. డ్రీమ్ గర్ల్ పేరుతో తెరకెక్కనున్న సినిమాలో ఆయుష్మాన్ టైటిల్ రోల్లో కనిపించనున్నాడు. టైటిల్‌ను బట్టే తెలుస్తోంది ఈ యంగ్ హీరో మరోసారి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడని. రాజ్ శాండిల్య దర్శకత్వంలో ఏక్తాకపూర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. టీషర్ట్, చీర, చేతికి గాజులతో ఆయుష్మాన్ లుక్ వినోదాత్మకంగా ఉంది. నుస్రత్ బారుచా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. As whacky as it can get! Here's the first glimpse of my look in and as #DreamGirl. Thoughts?#DreamGirlFirstLook #DreamGirlFilmingBegins @ektaravikapoor @NushratBharucha @RuchikaaKapoor @writerraj @balajimotionpic pic.twitter.com/qyJib4U9Ao — Ayushmann Khurrana (@ayushmannk) 3 December 2018 -
డ్రీమ్ గాళ్‌తో హాట్ గాళ్
ఎవరైనా సెలబ్రిటీని కలిసే అవకాశం వస్తే ఓ ఫొటోనో లేదా సెల్ఫీనో దిగడానికి ఆశపడతాం. సెలబ్రిటీలు కూడా తమకు నచ్చిన తారలను కలిస్తే? వాళ్లూ కచ్చితంగా అదే చేస్తారు. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ పాయల్ రాజ్‌పుత్ హాట్ గాళ్‌గా యూత్‌ని ఆకర్షించారు. కానీ ఆమె ఈరోజు ఈ స్టేజ్‌కి రావడానికి గల కష్టం వెనక ఓ డ్రీమ్‌గాళ్ ఉన్నారట. ఆవిడే కరీనా కపూర్. ఇటీవల పాయల్‌కి తన డ్రీమ్గాళ్ని కలుసుకునే ఛాన్స్ దొరికింది. దాంతో వెంటనే కరీనాతో ఓ సెల్ఫీ దిగి ‘‘కల నిజమైంది. నా డ్రీమ్‌గాళ్ కరీనాను కలుసుకున్నాను. ఇది నెరవేరడానికి పదేళ్లు పట్టింది. నేను యాక్టర్ అవ్వడానికి కరీనానే కారణం. తను నాకు ఇన్స్పిరేషన్’’ అని అన్నారు. ∙కరీనాతో పాయల్ -
మమ్మీ రిటర్న్స్
సరిగ్గా 51 ఏళ్ల క్రితం నాటి సంఘటన ఇది. దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు అందరూ కొత్తవాళ్లతో ‘తేనె మనసులు’ తీయాలను కున్నారు. లుక్ టెస్ట్‌కి చాలామంది వచ్చారు. వాళ్లల్లో హేమమాలిని ఒకరు. ఆదుర్తి ఆమెను రిజక్ట్ చేశారు. ఇది జరిగింది 1965లో. అదే ఏడాది ‘పాండవ వనవాసం’లో ఒక పాటకు నర్తించారు హేమమాలిని. ఆ తర్వాత హిందీ చిత్రాల్లో నాయికగా చేసి, ‘డ్రీమ్ గాళ్’ అయ్యారు. ‘పాండవ వనవాసం’లో కనిపించిన ఐదేళ్లకు ‘శ్రీకృష్ణ విజయం’లో ఓ గెస్ట్ రోల్లో కనిపించారు. మళ్లీ ఇప్పుడు తెలుగు తెరపై హేమమాలిని కనిపించనున్నారు. అప్పట్లో డ్రీమ్ గాళ్‌గా కనిపించిన హేమ ఇప్పుడు మమ్మీ పాత్రలో కనిపించనున్నారు. బాలకృష్ణ నూరవ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లో ఆయన తల్లి పాత్ర చేయనున్నారామె. శాతకర్ణి తల్లి గౌతమీ బాలాశ్రీ పాత్రనే ఆమె పోషించనున్నారు. దాదాపు 45 ఏళ్ల తర్వాత తెలుగులో హేమ నటించనున్న చిత్రం ఇది. -
'హేమ నా ఇంటికి దగ్గరే.. కానీ కలుసుకోలేదు'
ముంబయి: దాదాపు 40 ఏళ్ల తరువాత.. అలనాటి సూపర్ డూపర్ హిట్ బాలీవుడ్ చిత్రం 'షోలే' తారాగణమంతా ఒకే వేదికపై తళుక్కుమన్నారు. వారందరినీ బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమమాలిని ఏకం చేసింది. హేమమాలిని తొలి సంగీత ఆల్బమ్ 'డ్రీమ్ గర్ల్' ఆవిష్కరణ వారంతా ఒక వేదికపైకి రావడానికి అవకాశం ఇచ్చింది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, ధర్మేంద్ర, హేమమాలిని, చిత్ర దర్శకుడు రమేశ్ సిప్పీ తదితరులు హాజరయ్యారు. '40 ఏళ్ల తరువాత హేమామాలిని మ్యూజిక్ ఆల్బమ్ షోలే చిత్ర సభ్యులను ఒకే చట్రంలోకి తీసుకొచ్చింది' అని అమితాబ్ మంగళవారం తన బ్లాగులో పోస్ట్ చేశారు. 'మా జట్టులోని సంజీవ్ కుమార్, అంజాద్ ఖాన్ మన మధ్యలో లేరు. సమయం ఎవరి కోసం ఆగదు. కానీ ఆ ఎదురుచూపులను గుర్తిస్తుంది. ధర్మేంద్ర, హేమమాలిని మా ఇంటికి దగ్గర్లోనే ఉంటారు. కానీ మేం ఎప్పుడూ కలుసుకోలేదు. ఈ కార్యక్రమంలో ఇలా కలుసుకోవడం ఆశ్చర్యంగా అనిపించింది' అని అమితాబ్ అన్నారు. ఈ ఆల్బమ్‌లోని 'అజీ సునియే జరా' అనే పాటను సంగీత దర్శకుడు బాబుల్ సుప్రియోతో కలిసి హేమమాలిని పాడింది. ఈ పాటలోని బిగ్ బిసే లేకే పాజి అనే పదాలు అమితాబ్, ధర్మేంద్రలను సూచిస్తాయి. 'కళలు, వినోదాలే నన్ను నడిపిస్తున్నాయి. అవి నాలో కలిసిపోయాయి. గతంలో నా గాన ప్రతిభను పరీక్షించుకోలేదు. ఇప్పుడు వినిపించేందుకు ఆత్రుతతో ఉన్నాను. గతంలోమాదిరిగానే ఈసారీ ఆదరిస్తారని భావిస్తున్నాను' అని హేమమాలిని అన్నారు. 1973లో కిశోర్ కుమార్‌ను చూసి స్ఫూర్తి పొందిన హేమ అప్పటి నుంచి సంగీత ఆల్బమ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
డ్రీమ్ గర్ల్‌ని ఆకట్టుకున్న రకుల్
డ్రీమ్ గర్ల్ హేమ మాలినితో నటించే అవకాశం వస్తే ఎవరైనా ఊరికే ఉంటారా? అదే హేమమాలిని వీరాభిమాని అయితే ఎగిరి గంతేస్తారు కదూ. టాలీవుడ్ తెరపై దూసుకుపోతున్న రకుల్ ప్రీత్ సింగ్‌కి 'షిమ్లా మిర్చి' చిత్ర రూపంలో ఈ అవకాశం దొరికింది. ఇక అంతే.. తనకు వచ్చీరాని తమిళంలో తెగ కబుర్లు చెప్పి హేమమాలినిని రకుల్ ప్రీత్ సింగ్ ఆకట్టుకుంది. షిమ్లాలో షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమాలో.. హేమ మాలిని కూతురుగా రకుల్ నటిస్తోంది. హేమమాలిని నటించిన బ్లాక్ అండ్ వైట్ చిత్రాల్లో ఆమె అందాన్ని కళ్లార్పకుండా చూసేదాన్నని రకుల్ చెప్పింది. కచ్చితమైన టైమింగ్‌తో డైలాగ్‌ని స్పష్టంగా చెప్పడానికి హేమ ఎంతగానో సాధన చేసేవారంది. షూటింగ్ సమయంలో ఆమె జీవిత కథలను తనతో పంచుకోవడం మరువలేని అనుభూతి అని రకుల్ చెప్పుకొచ్చింది. చాలా కష్టమైన స్టెప్పులను కూడా హేమ మాలిని చాలా సునాయాసంగా చేసేవారని, తనతో కలిసి స్టెప్పులేయడం చాలా కష్టమైనప్పటికీ హేమ సహకారంతో సౌకర్యవంతంగా చేయగలిగానని రకుల్ సంతోషంతో గంతులేస్తోంది. -
వ్యక్తిగత కారణాలతోనే ఆమె పాడలేదు!
న్యూఢిల్లీ: మనకు డ్రీమ్ గర్ల్ అనగానే ఠక్కున గుర్తుకు వచ్చే హీరోయిన్ హేమమాలిని. ఈ రోజు ఆమె పుట్టినరోజు. బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుని అభిమానుల్లో చెరగని ముద్రవేసిన హేమమాలిని గురువారం 66వ వసంతంలోకి అడుగుపెట్టారు. అయితే ఆమెకు సినీ జీవితంలో ఎదురైన చేదు అనుభవాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. గతంలో తన సినిమాలో పాట పాడాలని హేమమాలినా కోరినా.. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ తిరస్కరించిందట. ఆ విషయాన్ని స్వయంగా హేమమాలిని ట్వీట్ చేశారు. 1979 లో వచ్చిన 'మీరా' సినిమాలో హీరోయిన్ అయిన హేమమాలినికి లతా మంగేష్కర్ గాత్రదానం చేశారు. అయితే తరువాత తాను నటించే సినిమాలో పాడమని అడిగినా అందుకు లతా మాత్రం ఆసక్తి కనబరలేదని హేమమాలిని తెలిపింది. దీనికి పెద్దగా కారణాలు ఏమీ లేవని, వ్యక్తిగత కారణాలతోనే లతా ఆ సినిమాలో పాడలేదని హేమమాలిని స్పష్టం చేసింది.' అప్పుడు నా సినిమాలో పాడటానికి ఆమె తిరస్కరించింది. అది గతం. ప్రస్తుతం మేమిద్దరం స్నేహితులం'అని హేమమాలిని తెలిపింది. ఈ రోజు తనకు లతా నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు అందుకున్నట్లు కూడా హేమమాలిని స్పష్టం చేసింది. దక్షిణాది నుంచి ఉత్తరాదికి వెళ్లి, అక్కడి వెండితెరను ఏలిన డ్రీమ్‌గర్ల్ హేమమాలిని. ఒక్క ధర్మేంద్ర మాత్రమే కాదు.. చాలామంది హృదయాలను ఆమె కొల్లగొట్టారు. ఈ అందాల సుందరికి అప్పుడే 66 ఏళ్లు నిండాయి. ముంబైలో తన పెద్దకూతురు ఇషా డియోల్, అల్లుడు భరత్‌లతో తన పుట్టినరోజును చాలా ప్రశాంతంగా చేసుకుంటున్నారు. బీజేపీ ఎంపీగా కూడా ఉన్న హేమమాలిని.. ఈ పుట్టినరోజుకు ఎలాంటి ఆర్భాటాలు మాత్రం ఉండకూడదనే కోరుకుంటున్నారు. -
డ్రీమ్‌గర్ల్‌కు 66 ఏళ్లు!
దక్షిణాది నుంచి ఉత్తరాదికి వెళ్లి, అక్కడి వెండితెరను ఏలిన డ్రీమ్‌గర్ల్ హేమమాలిని. ఒక్క ధర్మేంద్ర మాత్రమే కాదు.. చాలామంది హృదయాలను ఆమె కొల్లగొట్టారు. ఈ అందాల సుందరికి అప్పుడే 66 ఏళ్లు నిండాయి. ముంబైలో తన పెద్దకూతురు ఇషా డియోల్, అల్లుడు భరత్‌లతో తన పుట్టినరోజును చాలా ప్రశాంతంగా చేసుకుంటున్నారు. బీజేపీ ఎంపీగా కూడా ఉన్న హేమమాలిని.. ఈ పుట్టినరోజుకు ఎలాంటి ఆర్భాటాలు మాత్రం ఉండకూడదనే కోరుకుంటున్నారు. వాస్తవానికి తాను ఇప్పుడు తన నియోజకవర్గమైన మథురలో ఉండాల్సిందని, కానీ ఇప్పుడు అక్కడకు వెళ్లలేక, ముంబైలోనే పుట్టినరోజు చేసుకుంటున్నానని హేమమాలిని చెప్పారు. తన భర్త ధరమ్ జీ (ధర్మేంద్ర) ప్రస్తుతం ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు న్యూజిలాండ్ వెళ్లారని, చిన్నకూతురు అహానా ఢిల్లీలో ఉందని, అందువల్ల తాను ఇక్కడ పెద్ద కూతురితోనే పుట్టినరోజు చేసుకుంటున్నానని ఆమె అన్నారు. ఇప్పటికీ తనను ఆదరిస్తున్న అభిమానులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. సినీ పరిశ్రమ నుంచి, ప్రేక్షకుల నుంచి తనకు ఎప్పుడూ ప్రేమాభిమానాలు అందుతూనే ఉన్నాయని ఆమె అన్నారు. -
డ్రీమ్గర్ల్కి (చెమట) చుక్కలు చూపిస్తున్న మథుర
అందాల నటీమణులు రాజకీయాల రఫ్పాటలో దిగనైతే దిగుతున్నారు కానీ దిగాక మాత్రం అన్నీ సమస్యలే. ఇన్నాళ్లూ రాజ్యసభ రూటులో పార్లమెంటు సభ్యురాలైన హేమామాలిని ఈ సారి ఉత్తరప్రదేశ్ లోని మథుర నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లోకి దిగారు. అసలే మథుర... ఆపై మండుటెండ...దాంతో అలనాటి డ్రీమ్ గర్ల్ కి పగలే చుక్కలు ... అవే ... చెమట చుక్కలు కనిపిస్తున్నాయి. దాంతో ఆమె ఎయిర్ కండిషన్ కారు లో నుంచి బయటకు రావడం లేదు. కారు లోనుంచే చేతులు ఊపి, నమస్కారాలు పెడుతున్నారు. ఆమె ప్రత్యర్థి, రాష్ట్రీయ లోకదళ్ సిట్టింగ్ ఎంపీ జయంత్ చౌధురీ ఒక వైపు నియోజకవర్గమంతా చెలరేగి దున్నేస్తున్నారు. దీంతో బిజెపి కార్యకర్తలు ఏసీ వదిలి బయటకు రమ్మని ప్రాధేయపడుతున్నారు. చివరికి పత్రికలు కూడా రాజకీయమంటే కెంట్ ప్యూరిఫయర్ యాడ్ కాదని వ్యాఖ్యానించడంతో తప్పనిసరై ఆమె ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. శ్రీకృష్ణుడి లీలా భూమి మథుర లో ప్రచారం మాత్రం హేమామాలిని ప్రాణాలమీదకి వచ్చింది. నిత్యం చేసే యోగ, ప్రాణాయామాల షెడ్యూల్స్ దెబ్బతింటున్నాయి. ఒక్కో చోట మంచినీటి చుక్క కూడా దొరకడం లేదు. దాంతో ఆరు దశాబ్దాలుగా కాపాడుకున్న గ్లామర్ ఆవిరైపోతుందేమోనని అభిమానులు భయపడుతున్నారు. మరో వైపు బిజెపి నేతల వెన్నుపోట్లు, అలకలను మేనేజ్ చేయడం కూడా కష్టమైపోతోంది. దక్షిణాది భరతనాట్యం నుంచి బొంబాయి బాలీవుడ్ దాకా, అయ్యంగార్ కుటుంబం నుంచి జాట్ వాలా భార్యగా, సప్నోంకా సౌదాగర్ నుంచి షోలే దాకా ఎన్నెన్నో పాత్రల్ని అవలీలగా పోషించిన హేమామాలినికి ఈ ఎన్నికలు మాత్రం ఒక పరీక్షలా నిలుస్తున్నాయి. బిజెపి క్యాడర్ల క్రమశిక్షణ వల్లో మరే కారణం వల్లో మొత్తం మీద ఆమెకు నగ్మాకు ఎదురవుతున్న సమస్యలు ఆమెకు ఎదురు కావడం లేదు. కానీ ఎండ కష్టాలు మాత్రం ఎండిపోయేలా చేస్తున్నాయి. నియోజకవర్గంలో దాదాపు 16 లక్షల మంది ఓటర్లున్నారు. వీటిలో 3.5 లక్షల మంది జాట్లు. ఈ జాట్లందరూ రాష్ట్రీయ లోకదళ్ వైపు వెళ్లే అవకాశాలున్నాయి. దాదాపు 80 వేల మంది ముస్లింలున్నారు. 1.25 లక్షల మంది దళితులున్నారు. వారంతా బిఎస్ పీకి ఓటేసే అవకాశాలున్నాయి. ఈ మిగిలిన ఓట్లపైనే హేమామాలిని గురిపెడుతున్నారు. -
డ్రీమ్ గర్ల్