బాలీవుడ్‌లో ‘విక్కీ డోనర్’, ‘జోర్ లగాకే హైస్సా’, ‘అంధా ధున్’ లాంటి ప్రయోగాత్మక చిత్రాలలో నటించి క్రేజీ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న హీరో ఆయుష్మాన్ ఖురానా. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తర్వాత భిన్నమైన సినిమాలు ఎంచుకోనే నటుడిగా పేరు తేచ్చుకున్న ఆయుష్మాన్ ఖురానా నటించిన తాజా చిత్రం ‘డ్రీమ్ గర్ల్’. ఈ సినిమా విడుదలైన మొదటి రోజే అత్యధిక వసూళ్లను సాధించి మరోసారి ఈ నటుడికి భారీ ఓపెనింగ్‌ను తెచ్చిపెట్టింది. రాజ్ శాండిల్య తొలిసారి దర్శకుడిగా మారి తెరకెక్కించిన ఈ చిత్రం రిలీజ్ అయిన మొదటి రోజే రూ. 10.05 కోట్లు కలేక్ట్ చేయగా.. శనివారం నాటికి(రెండవ రోజు)16.42 కోట్లు వసూళ్లు చేసింది. అలాగే విడుదలైన మొదటి ఆదివారం నాటికి బాక్సాఫీస్ వద్ద రూ. 18.1 కోట్లు వసూలు చేసింది. దాంతో మొత్తంగా మూడు రోజులకు కలిపి రూ. 44.57 కోట్ల కలెక్షన్స్ సాధించింది.
కాగా పూర్తి వినోదాత్మక నేపథ్యంతో తెరకెక్కించిన డ్రీమ్ గర్ల్‌లో ఆయుష్మాన్ ఖురానా పరమ్ పాత్ర పోషించాడు. నిరుద్యోగి అయిన పరమ్ డబ్బుల కోసం చిన్న చిన్న నాటకాల్లో అమ్మాయి పాత్రలు పోషిస్తూ ఉంటాడు. అలా జీవితం సాగిస్తున్న పరమ్‌కు ‘ఫ్రెండ్‌షిప్’ అనే కాల్ సెంటర్‌లో ఉద్యోగం వస్తుంది. అందులో లేడి గోంతుతో మాట్లాడుతూ.. అబ్బాయి, అమ్మాయిలతో స్నేహం చేయాలి, దీంతో పరమ్ కాస్తా పూజాగా మారతాడు. నాన్ స్టాప్ పంచ్‌లతో కడుపుబ్బా నవ్వించే ఈ సినిమా, విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్ రావడంతో విమర్శకుల నుంచి పాజిటీవ్ రెస్పాన్స్ వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment