
కమలహాసన్ గతంలో ‘భామనే సత్యభామనే’ సినిమాలో బామ్మగా నటించడం గుర్తుండే ఉంటుంది. హిందీలో మళ్లీ అలాంటి ఛాయలున్న పాత్రనే ఆయుష్మాన్ ఖురానా చేస్తున్నాడు. ‘విక్కీ డోనర్’, ‘జోర్ లగాకే హైస్సా’, ‘అంధా ధున్’ సినిమాలతో బాలీవుడ్‌లో మంచి గిరాకీ ఉన్న నటుడుగా పేరు పడ్డ ఆయుష్మాన్ ఖురానా తాజాగా ‘డ్రీమ్ గర్ల్’ అనే హాస్య చిత్రానికి పని చేస్తున్నాడు. హిందీ టెలివిజన్‌లో ‘కామెడీ సర్కస్’, ‘కపిల్ శర్మ షో’ వంటి షోలకు వందలాది ఎపిసోడ్స్ రాసిన రాజ్ శాండిల్య తొలిసారిగా దర్శకుడిగా మారి ఈ సినిమా చేస్తున్నాడు.
ఆ సినిమాలో ఆయుష్మాన్ ఆయా పరిస్థితులను బట్టి రామాయణంలో సీతలాగా, భారతంలో ద్రౌపదిలాగా, కృష్ణలీలలో రాధలాగా వ్యవహరిస్తాడట. అంటే ఈ పురుషుడు మూడు స్త్రీ పాత్రలను అనుసరించనున్నాడన్న మాట. ఉత్తర ప్రదేశ్‌లోని చిన్న టౌన్‌లో జరిగే ఈ కథకు అనుగుణంగా హిందీ, హరియాణా యాసలను నేర్చుకునే పనిలో ఉన్నాడట ఆయుష్మాన్ ఖురానా. కొత్త టాలెంట్ ఎక్కడున్నా గుర్తించి అవకాశం ఇచ్చే ఏక్తా కపూర్ ఈ సినిమాకు ఒక నిర్మాత. సినిమాలో ఈ ‘హీరో–యిన్’కు హీరోయిన్ ఉంది. నుస్రత్ బరూచా ఆ బాధ్యత నిర్వర్తించనుంది.
Comments
Please login to add a commentAdd a comment