sita
-
సినీ నటి సీత ఇంట్లో విషాదం
నటి సీత ఇంట్లో విషాదఛాయలు కమ్ముకున్నాయి. తమిళం, తెలుగు భాషల్లో కథానాయకిగా ఆమె రాణించారు. 'సింహాద్రి' సినిమాలో ఎన్టీఆర్‌కు అక్కగా నటించి ఆమె మంచి గుర్తింపు తెచ్చకున్నారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తున్న సీత టీవీ సీరియళ్లలోనూ నటిస్తున్నారు. సీతకు మాతృవియోగం కలిగింది. ఈమె తల్లి చంద్రమోహన్ (88) శుక్రవారం చెన్నైలోని సాలిగ్రామంలోని తమ స్వగృహంలో కన్నుమూశారు. గత కొద్ది కాలంగా గుండె సమస్యలతో బాధపడుతున్న చంద్రమోహన్‌కు తల్లిదండ్రులు పెట్టిన పేరు చంద్రావతి. సేలంకు చెందిన ఈమె చెన్నైకి చెందిన పీఎస్.మోహన్‌బాబును పెళ్లి చేసుకున్న తరువాత తన పేరును చంద్రమోహన్‌గా మార్చుకున్నారు. వీరికి ఎంజీఆర్ పాండు, రాజమోహన్ అనే ఇద్దరు కుమారులతో పాటు కూతురు సీత ఉన్నారు. చంద్రమోహన్ గత 45 ఏళ్లుగా చెన్నైలోని జీహెచ్ ఆస్పత్రిలో నర్సుగా వైద్యసేవలు అందించారు. ఆ తరువాత స్థానిక సాలిగ్రామంలోని సూర్య ఆస్పత్రిలో 9 ఏళ్లు వైద్యసేవలు అందించారు. ఈమె భర్త పీఎస్.మోహన్‌బాబు నటుడిగా పలు చిత్రాల్లో నటించారు. నటి సీతతో పాటు ఆమె సోదరులు సీనీ రంగానికి చెందిన వారే. సీత తండ్రి గత 10 ఏళ్ల క్రితమే కన్నుమూశారు. కాగా చంద్రమోహన్ మృతికి పలువురు సీనీ ప్రముఖులు అంజలి ఘటించి సీత కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. చంద్రమోహన్ భౌతికకాయానికి శుక్రవారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో స్థానిక అరుంబాక్కమ్‌లోని శ్మశాన వాటికలో అంత్యక్రియలను నిర్వహించారు.సీత తండ్రి స్వస్థలం విజయనగరం జిల్లా, బొబ్బిలి ప్రాంతం. ఈమె తండ్రి మోహన్ బాబు మెడికల్ రెప్రజెంటేటివ్‌గా పనిచేస్తూ చెన్నైలో స్థిరపడ్డారు. 1990లో కెరీర్ పరంగా మంచి పీక్‌లో ఉన్నప్పుడే నటుడు పార్థిబన్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. వారికి అభినయ, కీర్తన అనే ఇద్దరు కుమార్తెలతో పాటు రాఖీ అనే దత్తత తీసుకుకున్న కుమారుడు ఉన్నారు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘అమృత’ సినిమాలో కీర్తన నటించింది. ఉత్తమ బాలనటిగా నేషనల్ అవార్డు కూడా ఆమె అందుకుంది. పార్థిబన్‌తో విడిపోయిన తర్వాత సీరియల్ నటుడు సతీష్‌ను ఆమె రెండవ వివాహం చేసుకున్నారు. కొంత కాలం తర్వాత అతనితో కూడా ఆమె విడిపోయారు. -
రైజింగ్ స్టార్ సీత
బాడీ షేమింగ్‌ని పట్టించుకోకుండా, ప్రతిభకు అందుతున్న ప్రశంసలకు పొంగిపోకుండా, విమర్శల తీరును గ్రహిస్తూ.. తన వ్యక్తిత్వానికి, టాలెంట్‌కి మెరుగులు దిద్దుకుంటూ సాగిపోతున్న నటి.. సీత! ఆమె పరిచయమే ఇది..👉చెన్నైలో పుట్టి, పెరిగిన సీత.. ఆట, పాటల్లోనే కాదు చదువులోనూ చురుకే! తనను చూసి తనతో స్నేహం చేసిన వాళ్లకంటే వెక్కిరించే వాళ్లే ఎక్కువగా ఉండటంతో చిన్నప్పటి నుంచీ పెద్దగా ఫ్రెండ్స్ లేకుండా పోయారు. దాంతో మనోధైర్యమే ఆమెకు ఆప్తురాలైంది.👉ఒకరోజు.. సీత తనకున్న అతికొద్ది మంది స్నేహితులతో కలిసి.. బీచ్‌లో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తుండగా, ఒకతను సీతను గమనించి, ఆమె దగ్గరకు వెళ్లి ‘నేను ఓ సినిమా తీస్తున్నాను. అందులో నటిస్తారా?’ అని అడిగాడు. అతనెవరో తనను ఆట పట్టిస్తున్నాడనుకుని గబగబా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆటపట్టించడం కాదు, నిజంగానే అతను సినిమా పర్సన్ అని సీతకు .. సినిమా సెట్స్ మీదకు వెళ్లాక తెలిసింది. అతనే.. విజయ్ మిల్టన్. ఆమె తొలిచిత్రం ‘గోలీ సోడా’ డైరెక్టర్. 👉విజయం సాధించిన ‘గోలీ సోడా’.. అంతకుముందు కెమెరాను ఫేస్ చేసిన అనుభవమే లేని సీతకూ మంచి పేరే తెచ్చిపెట్టింది. ఆమె ప్రతిభకు ముగ్ధుడైన విజయ్ మిల్టన్ తన తర్వాత సినిమా ‘10 ఎండ్రాతుకుళ్లా’లోనూ అవకాశం ఇచ్చాడు. అలా ప్రభుదేవా నటించిన ‘చార్లీ చాప్లిన్’ తో పాటు మరికొన్ని సినిమాల్లోనూ నటించింది. 👉 వెండితెర అవకాశాల్ని అందించిన పాత్రే నన్ను వెబ్ ప్రపంచానికీ పరిచయం చేయడం సంతోషం. నిజానికి ఆ రోల్.. నా లైఫ్‌ని రిఫ్లెక్ట్ చేస్తున్నట్టు ఉంటుంది. నా ఫిజికల్ అపియరెన్స్ గురించి ఎవరేం కామెంట్ చేసినా పట్టించుకోను. నా పని నేను చేసుకుంటూ పోతా!👉‘గోలీ సోడా’కు సీక్వెల్‌గా తీసిన ‘గోలీ సోడా – ద రైజింగ్ ’ వెబ్‌సిరీస్‌తో సీత ఓటీటీలోకీ ఎంటర్ అయింది. ఇది డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది. – సీత. -
అయోధ్యకు పోటెత్తిన భక్తజనం
అయోధ్య: దేశవ్యాప్తంగా శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఈ నేపధ్యంలో అమ్మవారి ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. పలు దేవాలయాలకు నిలయమైన అయోధ్యకు చేరుకున్న వేలాది మంది భక్తులు ఉదయం నుండి అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే బాలరాముణ్ణి దర్శించుకుంటున్నారు.నవరాత్రులలో మొదటి రోజున నవదుర్గలలో ఒకరైన శైలపుత్రిని పూజిస్తారు. అయోధ్యలో అన్ని దేవాలయాలు అమ్మవారి పూజలతో కళకళలాడుతున్నాయి. ఇక్కడి ఛోటీ దేవ్‌కాళి ఆలయంలో భక్తులు క్యూ కట్టి, అక్కడ కొలువైన సీతామాతను ఆరాధిస్తున్నారు. ఈ ఆలయంలో పూజలు చేయడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయని పలువురు నమ్ముతుంటారు.అయోధ్యకు చెందిన పండితులు సత్యేంద్ర దాస్ మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు నవరాత్రులలో మొదటి రోజు. ఈ రోజున చాలామంది తమ ఇళ్లలో కలశాన్ని ప్రతిష్టించి, తొమ్మిది రోజుల పాటు అమ్మవారి పూజలు నిర్వహిస్తారని తెలిపారు. అయోధ్యకు వచ్చిన భక్తురాలు మీరా మాట్లాడుతూ, ఆలయంలో అమ్మవారి దర్శనం చక్కగా అయ్యిందని, అధికారులు భక్తుల కోసం సకల ఏర్పాట్లు చేశారని అన్నారు. మరో భక్తుడు శైలేంద్ర మాట్లాడుతూ ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయని అన్నారు. ఇది కూడా చదవండి: 4న సీఎం నివాసాన్ని ఖాళీ చేయనున్న కేజ్రీవాల్ -
Major Sita Ashok Shelke: వయనాడ్ వారియర్
వయనాడ్ అనే మాట వినిపించగానే కళ్ల ముందు కన్నీటి సముద్రం కనిపిస్తుంది. అక్కడికి వెళ్లే సహాయకులకు ప్రకృతి విలయవిధ్వంస దృశ్యాలను చూసి తట్టుకునే గుండెధైర్యంతో ΄ాటు మెరుపు వేగంతో కదిలే శక్తి ఉండాలి. ఆ శక్తి ఆర్మీ మేజర్ సీతా అశోక్ షెల్కేలో నిండుగా కనిపిస్తుంది. అందుకే... సామాన్య ప్రజల నుంచి రిటైర్డ్ ఆర్మీ అధికారుల వరకు సీతను ప్రశంసిస్తున్నారు...వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన చూరల్మాల గ్రామంలో కొత్తగా నిర్మించిన బెయిలీ బ్రిడ్జి రెయిలింగ్‌పై సగర్వంగా నిలుచున్న మేజర్ సీతా షెల్కే ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.లింగ వివక్షతను సవాలు చేసి సగర్వంగా వెలుగుతున్న ఫొటో అది.‘ఇండియన్ ఆర్మీ ఇంజనీర్లతో కలిసి మేజర్ సీత షెల్కే పదహారు గంటలోనే 24 టన్నుల సామర్థ్యం ఉన్న బెయిలీ వంతెనను నిర్మించారు’ అని అభినందిస్తూ ‘ఎక్స్’లో ΄ోస్ట్ పెట్టారు లెప్టినెంట్ కల్నల్ జేఎస్ సోది(రిటైర్డ్). తన కామెంట్‌తో ΄ాటు కొన్ని ఫొటోలను కూడా షేర్ చేశాడు.‘ఒక్క చిత్రం చాలు వంద మాటలు ఎందుకు!’ అన్నట్లు ఈ ఫొటోలలో ఒక్కటి చూసినా చాలు సీత బృందం కష్టం, శక్తిసామర్థ్యాలు తెలుసుకోవడానికి.ఒకవైపు నేల కూలిన చెట్లు, మరోవైపు అడుగు వేయనివ్వని శి«థిలాలు, వేగంగా ప్రవహిస్తున్న నది, పై నుంచి వర్షం, పరిమిత స్థలం... ఒక్క అనుకూలత కూడా లేని అత్యంత ప్రతికూల పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నిట్టూర్చకుండా బ్రిడ్జీ నిర్మాణం వేగంగా పూర్తయ్యేలా చేసింది ఆర్మీ బృందానికి నాయకత్వం వహించిన సీత.సహాయచర్యలు చేపట్టడంలో ఈ బ్రిడ్జి కీలకం కానుంది.‘ఇది సైన్యం విజయం మాత్రమే కాదు. సహాయకార్యక్రమాల కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారు, స్థానిక అధికారులు... ఎంతోమంది విజయం’ వినమ్రంగా అంటుంది సీత.కొండచరియలు విరిగిపడిన చోట పనిచేయడం పెద్ద సవాలు. అక్కడ పురుషులతో సమానంగా పనిచేసింది సీత.మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌కు చెందిన సీతకు ‘సాహసం’ చిన్నప్పటి నుంచి సన్నిహిత మిత్రురాలు. ఆ ధైర్యమే ఆమెను సైన్యంలోకి తీసుకువచ్చింది.మద్రాస్ ఇంజినీరింగ్ గ్రూప్(ఎంఈజీ) అనేది వంతెనలు నిర్మించడం, మందు΄ాతరలను నిర్వీర్యం చేయడం...ఇలాంటి పనులెన్నో చేస్తుంటుంది. ఈ ఇంజినీరింగ్ యూనిట్ గురించి ఒక్కమాటలో చె΄్పాలంటే ప్రమాదాల అంచున పనిచేయడం. ఏమాత్రం అప్రమత్తంగా లేక΄ోయినా ్ర΄ాణాలు మూల్యంగా చెల్లించుకోవాల్సిందే. ‘మద్రాస్ ఇంజినీరింగ్ గ్రూప్’లోని డెబ్బై మంది సభ్యులలో ఏకైక మహిళ సీత. అయినప్పటికీ ఆమె ఎప్పుడూ అసౌకర్యం అనుకోలేదు. అధైర్య పడి΄ోలేదు.‘మహిళ కదా... ఇది రిస్క్ జాబ్ కదా’ అని ఎంతోమంది సీతతో అనేవాళ్లు.‘రిస్క్ లేనిది ఎక్కడా!’ అనేది ఆమె నోటి నుంచి వేగంగా వచ్చే మాట.‘రిస్క్ తీసుకోక ΄ోవడం కూడా పెద్ద రిస్కే’ అనుకునే సీతా అశోక్ షెల్కే ఎన్నో రెస్క్యూ ఆపరేషన్లలో ధైర్యంగా ΄ాల్గొంది. నిద్ర, తిండి, నీళ్లు.... ఇలాంటివేమీ పట్టించుకోకుండా పనిచేసింది. ‘మగవాళ్లు ఎంత కష్టమైనా పనైనా చేస్తారు. మహిళలకు కష్టం’ అనే మాట ఆమె ముందు నిలిచేది కాదు.వాయనాడ్‌లో సహాయ, నిర్మాణ కార్యక్రమాలలో తన బృందంతో కలిసి నాన్–స్టాప్‌గా పనిచేస్తున్న సీత మోములో అలసట కనిపించదు....రాకెట్ వేగంతో పనిచేయాలనే తపన తప్ప. ఆ తపనే ఆమెను అందరూ ప్రశంసించేలా చేస్తోంది. -
అల్లర్లకు పాల్పడ్డవారిపై కేసులేవీ?
సాక్షి, నరసరావుపేట: ఎన్నికల నేపథ్యంలో జరిగిన అల్లర్లపై విచారణకు ఎన్నికల సంఘం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) డీజీపీకి సోమవారం సమర్పించిన నివేదికతో పల్నాడులో హీట్ పెరిగింది. ఈ నివేదికలో ఏముందోనన్న భయం అటు పోలీసులు, ఇటు టీడీపీ నేతల్లో నెలకొంది. అల్లర్లకు కారణమైన వారిపై కేసుల నమోదు సరిగా జరగలేదన్న అభిప్రాయానికి సిట్ వచ్చిందని సమాచారం. అప్పటి పోలీసు ఉన్నతాధికారుల ఒత్తిడి వల్లో, స్టేషన్ హౌస్ ఆఫీసర్ల నిర్లక్ష్యం వల్లో అల్లర్లకు కారణమైన వారిపై పూర్తిస్థాయిలో కేసులు నమోదు కాలేదు. మాచవరం మండలం కొత్త గణేషునిపాడులో ఎస్సీ, ఎస్టీలు, ముప్పాళ్ల మండలం తొండపిలో ముస్లింలు.. టీడీపీ నాయకుల దాడులతో గ్రామాలు వదలి వెళ్లారు. అయితే అక్కడ టీడీపీ నేతలపై కేసుల నమోదు పూర్తిస్థాయిలో జరగలేదు. పైగా గ్రామం నుంచి ప్రాణభయంతో పారిపోయిన బాధితులపైనే కేసులు పెట్టారు. వీటన్నింటిపైనా ఎన్నికల సంఘానికి సిట్ నివేదిక సమర్పించినట్టు తెలుస్తోంది. పోలీసుల తీరుపై సిట్ అధికారులకు తగిన ఆధారాలతో మంత్రి అంబటి రాంబాబు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు సిట్ నివేదికతో బాధ్యులైన పోలీసులపై చర్యలుంటాయని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.అరవింద్బాబుపై చర్యలేవి?ఎన్నికల్లో ఓటమి తప్పదని ముందే భావించి అల్లర్లను సృష్టించేందుకు టీడీపీ నరసరావుపేట అభ్యర్థి చదలవాడ అరవింద్‌బాబు ఇతర ప్రాంతాల నుంచి గూండాలు, బౌన్సర్లను తెప్పించి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటిపై పోలింగ్ రోజున దాడికి పాల్పడ్డారు. అక్కడ ఉన్న కార్లను పగలగొట్టి ఇంటిని ధ్వంసం చేశారు. అడ్డువచ్చిన ఎమ్మెల్యే మామ కంజుల కోటిరెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై నరసరావుపేట టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ.. ఇంతవరకు చదలవాడను అరెస్ట్ చేయలేదు. ఎమ్మెల్యే ఇంటిపై దాడికి సంబంధించిన సీసీ ఫుటేజ్‌ను పరిశీలించిన సిట్ బృందం హింసాత్మక ఘటనకు నాయకత్వం వహించింది అరవింద్బాబేనని గుర్తించినట్టు సమాచారం. కాగా పోలింగ్ మరుసటి రోజు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు హౌజ్ అరెస్ట్ చేయడానికి అరవింద్‌బాబు ఆస్పత్రికి పోలీసులు వెళ్లిన సమయంలో అక్కడ పెట్రోల్ బాంబులు, రాడ్లు, కర్రలు, గాజు సీసాలు వంటి మారణాయుధాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అయితే కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. ఈ విషయంపై వైఎస్సార్సీపీ లీగల్ విభాగం సభ్యులు సిట్ బృందానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఎందుకు చదలవాడపై కేసు నమోదు చేయలేదని సిట్ బృందం టూటౌన్ పోలీసులను ప్రశ్నించి అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. సిట్ నివేదికలో ఈ విషయంపై ప్రస్తావన ఉండవచ్చని పోలీసు వర్గాలు చర్చించుకుంటున్నాయి. కొనసాగుతున్న అరెస్టులుసిట్ బృందం.. కేసుల నమోదుతోపాటు అరెస్ట్‌లలో స్థానిక పోలీసుల నిర్లక్ష్యంపై గట్టిగా స్పందించినట్టు తెలుస్తోంది. దీంతో జిల్లాలో అరెస్టులపై పోలీసులు దృష్టిసారించారు. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇంటిపై దాడి కేసులో పరారీలో ఉన్న నలుగురు నిందితులు బెంగళూరు నుంచి శ్రీశైలం వెళ్తుండగా వారి సెల్ఫోన్ల సిగ్నల్స్ ఆధారంగా సిట్ బృందం అదుపులోకి తీసుకుంది. పమిడిపాడుకు చెందిన టీడీపీ నేత లాం కోటేశ్వరరావుతోపాటు మరో నలుగురిని నరసరావుపేట టూటౌన్ పోలీసులకు అప్పగించారు. ఇవే కాకుండా పల్నాడు జిల్లాలో మరిన్ని అరెస్టులు ఉంటాయన్న సమాచారంతో కేసుల్లో ఉన్న టీడీపీ నేతలు అజ్ఞాతంలోకి వెళ్లారు. పోలింగ్ రోజు, తరువాత జరిగిన అల్లర్లలో పల్నాడు జిల్లా వ్యాప్తంగా మొత్తం 146 కేసులు నమోదు చేయగా, అందులో సుమారు 1,500 మంది నిందితుల పేర్లు ఉన్నట్టు సమాచారం. సిట్ బృందం ఆదేశాల మేరకు మరికొన్ని కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. గొడవలకు సంబంధించిన వీడియోలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. వీటి ఆధారంగా మరికొంతమందిని గుర్తించి అరెస్ట్ చేయడానికి ప్రత్యేక బృందాలు చురుగ్గా పనిచేస్తున్నాయి. -
Sita Soren: జేఎమ్ఎమ్కు రాజీనామా.. గంటల్లోనే బీజేపీలో చేరిక
జార్ఖండ్ ముక్తి మోర్చా అధినేత శిబు సోరెన్ పెద్ద కోడలు సీత సోరెన్ మంగళవారం భారతీయ జనతా పార్టీలో చేరారు. జేఎంఎం పార్టీకి రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే ఆమె కాషాయ తీర్ధం పుచ్చుకున్నారు. మరికొన్ని రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు, వచ్చే ఏడాది జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సీత సోరెన్ పార్టీ మార్పు చర్చనీయాంశంగా మారింది. కాగా జేఎమ్ఎమ్ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సీతా సోరెన్ శిబు సోరెన్ పెద్ద కుమారుడు దుర్గా సోరెన్ సతీమణీ. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ వదిన అవుతుంది. అనారోగ్యంతో దుర్గా సోరెన్ 2009లో మరణించారు. అప్పుడు ఆయన వయసు 39 ఏళ్లు. అయితే భర్త మరణానంతరం తనను, తన కుటుంబాన్ని సోరెన్ కుటుంబ సభ్యులు పక్కన పెట్టారని ఆరోపిస్తూ మంగళవారం జేమ్ఎమ్ పార్టీకి సీత రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పార్టీలోని అన్ని పదవులకు, జార్ఖండ్ అసెంబ్లీలోని జామా స్థానానికి కూడా ఆమె రాజీనామా చేశారు. ‘కుటుంబంలోనే కాదు పార్టీలో తగిన గౌరవం దక్కడం లేదని తాను నిర్లక్ష్యానికి గురవుతున్నానని ఆరోపించారు. తనకు, తన కుతూళ్లకు వ్యతిరేకంగా పార్టీలో కుట్ర జరుగుతోందని ఆరోపించారు.. ప్రాథమిక సూత్రాలకు విరుద్ధంగా పార్టీ నడుస్తోందని విమర్శించారు. అయిష్టంగానే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు మామ శిబు సోరెన్‌కు రాసిన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ సభ్యులు, కుటుంబం తమను వేరు చేసే విధంగా వ్యవహరించడం తనను తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్నారు. -
జేఎంఎంకు సీతా సోరెన్ రాజీనామా!
జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ఎమ్మెల్యే సీతా సోరెన్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తాజాగా ఓటుకు నోటు కేసులో సీతా సోరెన్ పేరు తెరపైకి వచ్చింది. సీతా సోరెన్ జేఎంఎం చీఫ్ శిబు సోరెన్‌కు పెద్ద కోడలు. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు వదిన. ఆమె దుమ్కాలోని జామా అసెంబ్లీ స్థానం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో శిబు సోరెన్ పెద్ద కుమారుడు. నాటి జేఎంఎం ప్రధాన కార్యదర్శి దుర్గా సోరెన్ బొకారోలో అనుమానాస్పద స్థితిలో మరణించారు. అప్పటికి అతని వయస్సు కేవలం 39 సంవత్సరాలు. దుర్గో సోరెన్ మృతికి అతని కిడ్నీ ఫెయిల్యూర్ కారణమని చెబుతుంటారు. సోదరుని మరణానంతరం పార్టీలో హేమంత్ సోరెన్ స్థాయి పెరిగింది. కాగా రాష్ట్రంలో జరిగే అక్రమ మైనింగ్, రవాణా సమస్యపై సీతా సోరెన్ తరచూ తన గొంతు వినిపించేవారు. ఒడిశాలోని మయూర్‌భంజ్‌లో జన్మించిన సీతా సోరెన్ 12వ తరగతి వరకు చదువుకున్నారు. ఆమె తండ్రి పేరు బోడు నారాయణ్ మాంఝీ. తల్లి పేరు మాలతీ ముర్ము. అక్టోబర్ 2021లో ఆమె కుమార్తెలు రాజశ్రీ సోరెన్, జయశ్రీ సోరెన్ తమ తండ్రి పేరిట పార్టీని స్థాపించారు. దీనికి దుర్గా సోరెన్ సేన అని పేరు పెట్టారు. రాష్ట్రంలోని అవినీతి, నిర్వాసిత, భూ దోపిడీ తదితర సమస్యలపై పోరాడటమే తమ లక్ష్యమని రాజశ్రీ సోరెన్, జయశ్రీ సోరెన్ తెలిపారు. రాజశ్రీ బిజినెస్ మేనేజ్మెంట్, జయశ్రీ లా కోర్సు చదువుకున్నారు. -
సీతారామలక్ష్మణ వేషధారణలో ఇండిగో సిబ్బంది: పులకించిన ప్రయాణీకులు
అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రామమందిరం ప్రాణప్రతిష్ట ఈ నెల (జనవరి) 22నజరగనుంది.ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈ వేడుక ప్రముఖంగా మారనుంది. శ్రీరామ్ లల్లా దర్శనం చేసుకోసం భక్తులు వేయికళ్లతో వేచి చూస్తున్నారు. ఈక్రమంలో ప్రముఖ విమానయాన సంస్థలు దేశంలోని వివిధ నగరాల నుంచి అయోధ్యకు విమాన సర్వీసులను కూడా నడపనున్నాయి. అయితే ఇండిగో విమాన సంస్థ వార్తల్లో నిలిచింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన అధికారిక నివాసంలో జరిగిన వర్చువల్ ఈవెంట్ ద్వారా విమాన సర్వీసును జనవరి 11, గురువారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. గుజరాత్ లోని అహ్మదాబాద్ నుంచి అయోధ్యకు తొలి విమాన సర్వీసును ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రారంభించింది. తన ప్రారంభ విమానంలో దాని క్యాబిన్ సిబ్బంది శ్రీ రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు, సీత వేషధారణలో ఆకట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెటిజనులను ఆకట్టుకుంటోంది. విమాన సిబ్బంది ఒకరు రాముడిలా కిరీటంతో పాటు బంగారు రంగులో సాంప్రదాయ దుస్తులు, ఆభరణాలతో అలకరించుకుని మరీ బోర్డింగ్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. ఇక క్యాబిన్ సిబ్బంది రాముడు, లక్ష్మణుడు, సీత , హనుమంతుని వేషధారణలో ఆహ్వానం పలకడంతో ప్రయాణీకులంతా పులకించిపోయారు. ‘జై శ్రీరాం’ అని నినాదాలు చేశారు. Indigo staff dressed as Shri Ram, Sita, Laxman for the inaugural flight from Ahmedabad to Ayodhya!pic.twitter.com/5tqkfThZBU — Anu Sehgal 🇮🇳 (@anusehgal) January 11, 2024 ఈ డైరెక్ట్ ఫ్లైట్‌తో అయోధ్య నేరుగా అహ్మదాబాద్‌కి కనెక్ట్ అయిందని, ఢిల్లీ తర్వాత అయోధ్యకు విమాన సర్వీసుల అనుసంధానమైన రెండో స్థానంలో అహ్మదాబాద్ ఉందని, జనవరి 15 నుంచి ఇతన విమాన సర్వీసులు కూడా ఉంటాయని సీఎం యోగి తెలిపారు. జనవరి 16న అయోధ్య-ముంబై, ఢిల్లీ-అయోధ్య మధ్య మరో విమాన సర్వీసు ప్రారంభం కానుందని, మెరుగైన విమాన సేవలు పర్యాటకం, వ్యాపార కార్యకలాపాలకు గణనీయంగా దోహదపడతాయని యోగి పేర్కొన్నారు. మరోవైపు స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్, జనవరి 12, శుక్రవారం, జనవరి 21 న ఢిల్లీ నుండి అయోధ్యకు ప్రత్యేక విమాన సర్వీసులను ప్రకటించింది. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానం మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 3 గంటలకు అయోధ్య చేరుకుంటుంది. మరుసటి రోజు తిరుగు ప్రయాణంలో సాయంత్రం 5 గంటలకు బయలుదేరి, సాయంత్రం 6.30 గంటలకు ఢిల్లీలో ల్యాండ్ అవుతుంది. మరుసటి రోజు రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యే ప్రయాణీకులకు భోజనం అందించనుంది. -
22న పుట్టేవారంతా సీతారాములే..!
జనవరి 22న అయోధ్యలో నూతన రామాలయం ప్రారంభం కానుంది. అలాగే బాలరాముని ప్రతిష్ఠాపన మహోత్సవం కూడా జరగనుంది. దేశంలోని చాలామంది ఆరోజును ఎంతో పవిత్రమైనదిగా భావిస్తున్నారు. దీంతో తమకు ఆరోజు పుట్టబోయే చిన్నారులకు రాముడు లేదా సీత అనే పేరుపెట్టాలని చాలామంది తహతహలాడుతున్నారు. దేశంలోని పులువురు గర్భిణులు తాము జనవరి 22న బిడ్డకు జన్మనివ్వాలని ప్లాన్ చేసుకుంటున్నారు. అలాగే ఆరోజు తమకు పుట్టబోయే పిల్లలకు రాముడు లేదా సీత అనే పేరు పెట్టాలని నిర్ణయించుకుంటున్నారు. యూపీలోని మీరట్‌కు చెందిన ఒక సీనియర్ డాక్టర్ మాట్లాడుతూ పలువురు గర్భిణులు జనవరి 22న డెలివరీ చేయాలని తమ ఆసుపత్రికి వస్తున్నారని తెలిపారు. అబ్బాయి పుడితే రాముడు అని అమ్మాయి పుడితే సీత అని పేరు పెడతామని వారు చెబుతున్నారన్నారు. ఇది కూడా చదవండి: వారికి శ్రీరాముడు ‘మామ’? బంధుత్వం ఎలా కలిసింది? -
దుర్గ రాసింది సీతా చాలీసా!
హనుమాన్ చాలీసా, సాయి చాలీసా గురించి మనకు తెలుసు.సీతా చాలీసాను రాసి, వినిపిస్తున్నారు డాక్టర్ జిఎల్‌కె దుర్గ.ఆంధ్రమహిళా సభ రిటైర్డ్ ప్రిన్సిపల్ అయిన దుర్గ మోటివేషనల్ స్పీకర్‌గానూ యువతలో స్ఫూర్తిని కలిగిస్తున్నారు.అరవైఏడేళ్ల వయసులో జీవితాన్ని అర్థవంతంగా మార్చుకుంటూ స్ఫూర్తిని కలిగించే ఎన్నో విషయాలు ఇలా మన ముందుంచారు. ‘‘నేటి మహిళల పరిస్థితి చూస్తుంటే ఒక పక్కన ఆకాశంలోకి దూసుకుపోతున్నాం... మరోపక్కన అథోలోకంలోకి కూడా వెళుతున్నామా అనిపిస్తుంది. ఓవైపు అమ్మాయిలను ఆకాశం అంత ఎత్తు ఎదగాలని ప్రోత్సహిస్తున్నాం.. మరోవైపు ఇంకా స్త్రీ భ్రూణహత్యలు జరగడం చూస్తున్నాం. మహిళలు ఎదగాలంటే మగవారిలోనూ మార్పు రావాలి. ఇప్పటికన్నా ఇతిహాస కాలం నాటి రోజులను తెలుసుకుంటే నాటి మహిళ తెగువ, సమయస్ఫూర్తి మనకు కనిపిస్తాయి. సీతా చాలీసా స్త్రీ కేంద్రకంగా ఉంటుంది. తెలుసుకుంటూ చేసిన ప్రయత్నం శ్రీరామనవమి కళ్యాణోత్సవానికి మా అత్తగారి ఊరు వెళ్లాం. అక్కడ అమ్మవారికి మంగళసూత్రధారణ జరిగేటప్పుడు రామ, హనుమాన్ చాలీసా ఉంది, సీతాచాలీసా గురించి లేదే... అనిపించింది. తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత అదే విషయం మనసులో మెదులుతుండటంతో ఇంటర్నెట్లో శోధించాను. నాకున్న స్నేహితులు, పెద్దలను అడిగాను. తెలుగులో సీతా చాలీసా లేదు. హిందీలో ఉంది కానీ... బాణీ వేరుగా ఉంది. దీంతో తెలుగులో సీతా చాలీసా రాయాలని నిర్ణయించుకున్నాను. ఇందుకోసం వాల్మీకి రామాయణాన్ని పారాయణ చేస్తూ... అందులో నుంచి సీతాదేవి గురించి ఉన్న వ్యాఖ్యానాలు రాసుకుంటూ వచ్చాను. ఈ ప్రయాణంలో చాలా మంది మిత్రులు, పెద్దలు నాకు సాయం చేశారు. నిజానికి వాల్మీకి మహాకవి, రామాయణ కథానాయిక అయిన సీత గురించి చాలా గొప్పగా... రాముడికి ఏ మాత్రం తీసిపోని విధంగా చెప్పారు. అందం, సుగుణాలలోనే కాదు సహనం, ధైర్యం, తెలివితేటలు, ఔదార్యం, సమయస్ఫూర్తి, మాటలు .. ఇలా అన్నింటì లోనూ ఆమె గొప్పతనం గురించి వివరించారు. సీతాదేవి బాల్యం, యవ్వనం, స్వయంవరం, కల్యాణం, అరణ్యవాసం, అశోకవనం, రావణ వధానంతరం రామునితో తిరిగి అయోధ్య చేరడం, పట్టాభిషేకం, అనంతరం అడవులకు వెళ్లడం, అక్కడినుంచి వాల్మీకి ఆశ్రమం చేరడం, లవకుశులను పెంచడం, చివరగా తల్లి భూదేవిలో కలిసిపోవడం వరకు ఆమె జీవనం ఎంత శక్తిమంతమైనదో... అదంతా చాలీసాలో వచ్చేలా కూర్చాను. బాల్యంలో ఆడుకుంటూ శివధనస్సును ఉంచిన మంజూషను జరిపినది అని ఉంటే.. ‘శివధనస్సును అవలీలగా జరిపిన బాలవు నీవు’ అని, హనుమతో మాట్లాడేటప్పుడు..‘రాముని ధ్యాసే శ్వాసగ నిలిపి తపమొనరించిన తాపసి వీవు’ అని అశోకవనంలో చెప్పడం.. పట్టాభిషేక సమయంలో హనుమకు పుత్రవాత్సల్యంతో ఇచ్చిన అపురూపమైన మణిహారం గురించి .. ఇలా రామాయణంలోని ప్రతి ఘట్టాన్ని ఆమె గుణగణాలను వివరిస్తూ చేసే చాలీసా మనలో ఒక స్ఫూర్తిని నింపుతుంది. నాన మ్మ చెప్పిన కథలు.. నేను కామర్స్ సబ్జెక్ట్‌తో పీహెచ్‌డి పూర్తి చేసి, ఆంధ్ర మహిళా సభలో 35 ఏళ్లుగా లెక్చరర్‌గా, ప్రిన్సిపల్‌గా చేసి రిటైర్ అయ్యాను. ఆంధ్ర మహిళాసభ, దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ మహిళా సభకు వైస్‌ప్రెసిడెంట్‌గా ఉన్నాను. కాలేజీ రోజుల్లో బెస్ట్ స్టూడెంట్ అవార్డ్‌తో పాటు మెరిట్ స్కాలర్షిప్లు పొందాను. కామర్స్ స్టూడెంట్‌ని అయినా తెలుగు సాహిత్యం అంటే చాలా ఇష్టం. అలా, సంస్కృతం కూడా నేర్చుకున్నాను. అందుకు మా నానమ్మే కారణం. నా చిన్నతనంలో ఆమె ప్రతిరోజూ పడుకునే సమయంలో రామాయణంలోని కథలు చెప్పేది. ఆధ్యాత్మికతను పెంచే గజేంద్ర మోక్షం, రామాయణ, మహాభారతాల గురించి చెప్పేది. ఆ ఆసక్తితోనే పుస్తకాలు చదవడం అలవాటయ్యింది. ఇప్పటికి కూడా ప్రతి రోజూ ఉదయం రెండు గంటల సమయం రాయడానికి కేటాయిస్తే, రాత్రి రెండు గంటల సేపు చదవడానికి కేటాయిస్తాను. ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లి.. పదేళ్లుగా మోటివేషనల్ స్పీకర్‌గా ఉన్నాను. టీచింగ్ వృత్తిలో కొనసాగడం వల్ల యువతకు, మహిళలకు మంచి విషయాలు నా ద్వారా వెళ్లడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. సమాజంలో మార్పు వచ్చేందుకు చేసే ఏ చిన్న పని అయినా ముందుండేందుకు ప్రయత్నిస్తుంటాను. ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి, ఆ రోజు ఏ టీచర్ అయితే రాలేదో ఆ స్థానంలో నేను మోటివేషనల్ క్లాస్ తీసుకుంటాను. జైలుకు వెళ్లి ఖైదీలకు మంచి విషయాలు చెప్పడానికి ప్రయత్నిస్తుంటాను. మహిళల కోసం ప్రత్యేకం.. స్టాండప్ కామెడీ చేస్తుంటాను. స్వచ్ఛంద సంస్థలతో కలిసి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటాను. అత్తగారు–కోడళ్ల మధ్య ఉండాల్సిన బంధాలు, మహిళల ఆరోగ్యం, చదువుకు సంబంధించిన అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనడం, నాదైన బాణీలో నవ్విస్తూనే వారిని వారు దిద్దుకునే ఆలోచన కలిగించడానికి ప్రయత్నిస్తుంటాను. యువత కోసం వివేకానందుని రచనలు చేస్తున్నాను.ఇటీవల జరిగిన ఓ భక్తి కార్యక్రమంలో సీతాచాలీసాను బృందంగా ఆలపించడంతో ఎన్నాళ్లుగానో నా మనసులో మెదిలిన ఒక ఆలోచన ఇలా రూపుదిద్దుకొని, ప్రజల ముందుకు రావడం ఎంతో ఆనందంగా అనిపించింది. ‘పద్యం, గద్యం ఎరుగని దుర్గకు నిను కొలిచే భాగ్యం దక్కెను’ అని సీతామాతకు వందనం చెప్పాను’’ అని వివరించారు దుర్గ. – నిర్మలారెడ్డి -
ఇదు శ్రీలంక: సీతా ఎలియా
శ్రీలంకలో పరిపాలన విభాగాలుగా బ్రిటిష్ వాళ్లు అనుసరించిన ప్రావిన్స్ విధానమే ఉంది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ‘సీతా ఎలియా’ అనే చిన్న గ్రామం శ్రీలంక సెంట్రల్ ప్రావిన్స్‌లో ఉంది. శ్రీలంకలో అందమైన హిల్ స్టేషన్ నువారా ఎలియాకు కిలోమీటరు దూరంలోనే ఉంది సీతా ఎలియా. ఎలియా అనే పదానికి సింహళలో వెలుతురు, కాంతి అనే అర్థాలు చెబుతారు. రామాయణ కాలంలో సీతాదేవి వనవాసం చేసిన అశోక వాటిక ఇదని చెబుతారు. ఇక్కడి ఆలయాన్ని ‘సీతా అమ్మన్ టెంపుల్’ అంటారు. అశోకవాటిక సీతాదేవిని రావణాసురుడు తన రాజ్యం శ్రీలంకకు అపహరించుకుని వెళ్లి అతడి రాజమందిరంలో ఆమెకు బస ఏర్పాటు చేస్తాడు. రావణాసురుడి రాజమందిరంలో నివసించడానికి సీతాదేవి అంగీకరించకపోవడంతో పైగా ఆమె ఎప్పుడూ అశోక చెట్టు కిందనే ఎక్కువ సమయం గడపడాన్ని గమనించిన రావణాసురుడు ఆమె ప్రకృతి ప్రేమికురాలని, ఆమెకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కోరుకుంటోందని గ్రహించి ఈ ప్రదేశంలో బస ఏర్పాటు చేసినట్లు చెబుతారు. రావణాసురుడి భార్య మండోదరి కూడా ఈ వనానికి వచ్చి సీతాదేవిని కలిసేదని కూడా చెబుతారు. అశోకవాటిక నిజానికి మనసులోని శోకాన్ని దూరం చేసే అందమైన ప్రదేశమే. ప్రకృతి సౌందర్యానికి నెలువెత్తు నిదర్శనం. రావణాసురుడు మంచి కళాభిరుచి కలిగిన వాడని, సీతాపహరణం తప్ప మరేరకమైన అవగుణం లేదని చదివే వాళ్లం. అశోకవాటికను చూసినప్పుడు నిజమేననిపించింది. సీత అభిరుచిని గ్రహించడంతోపాటు ఆమె కోసం ఇలాంటి అందమైన ప్రదేశాన్ని ఎంపిక చేయడం... రావణాసురుడి కళాహృదయానికి అద్దం పడుతోంది. ఇక్కడి సెలయేరు నిరంతరం ప్రవహిస్తుంటుంది. సెలయేటి తీరాన సీతాదేవి స్నానం చేసేదని చెప్పడానికి ఆనవాలుగా సిమెంటు నిర్మాణం ఉంది. సీతాన్వేషణలో భాగంగా శ్రీలంకకు వచ్చిన హనుమంతుడు... సీతాదేవిని కలిసింది ఇక్కడే. ఆ ఘట్టాన్ని ప్రతిబింబిస్తూ సెలయేటి తీరాన శిల్పాలున్నాయి. భారతీయులు కట్టిన ఆలయం అశోకవాటికలో ఉన్న సీతా అమ్మన్ ఆలయం దక్షిణ భారత నిర్మాణశైలిలో ఉంది. తమిళనాడు నుంచి శ్రీలంకకు వలస కూలీలుగా వెళ్లిన వాళ్లు ఈ ఆలయాన్ని నిర్మించారట. ఆలయం లోపలి విగ్రహాల శిల్పనైపుణ్యం అద్భుతంగా ఉంది. కానీ ఆలయగోపురం మీద ఉన్న విగ్రహాలు శిల్పశాస్త్ర గణితానికి లోబడి ఉన్నట్లు అనిపించదు. విగ్రహం ఎత్తును అనుసరించి తల, మెడ, భుజాలు, దేహం, కాళ్ల పొడవులకు శాస్త్రబద్ధమైన కొలతలుంటాయి. శిల్పాన్ని చెక్కడానికి అవే ప్రధాన ఆధారం.ఆ తర్వాత ఎవరి విగ్రహాన్ని చెక్కుతుంటే సాహిత్యంలో వర్ణించిన ఆ వ్యక్తి దేహాకృతి, రూపలావణ్యాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ ఆలయ గోపురం మీదున్న విగ్రహాలను చూస్తే శాస్త్రబద్ధమైన పొంతన సరిగ్గా కుదరలేదనిపిస్తుంది. మరి కొంత పరిశీలనగా చూస్తే మాత్రం... శ్రీలంక వాసుల దేహసౌష్ఠవం ప్రభావం ఈ శిల్పాల మీద ఉన్నట్లనిపిస్తుంది. అయితే కూలీలుగా వలస వెళ్లిన వాళ్లు తమకున్న పరిమితమైన వనరుసలతో చేసిన ప్రయత్నాన్ని గౌరవించకుండా ఉండలేం. యూ ట్యూబర్ల షూటింగ్ ఇక్కడ పర్యటనకు వచ్చే వాళ్లలో భారతీయులే ఎక్కువ. నేను వెళ్లినప్పుడు ఒక ఉత్తరాది మహిళ తన స్మార్ట్ ఫోన్లో ఆ ప్రదేశాన్ని షూట్ చేస్తూ కామెంటరీ ఇస్తూ కనిపించింది. మరికొంత మంది ఆకాశాన్నంటుతున్న మహావృక్షాలను, సెలయేటి జలప్రవాహ శబ్దాన్ని రికార్డు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రదేశం సౌందర్యాన్ని అచ్చంగా కళ్లకు కట్టాలంటే డ్రోన్ కెమెరాతో షూట్ చేయాల్సిందే. – వాకా మంజులారెడ్డి (చదవండి: ఇదు శ్రీలంక: శ్రీగంగారామ మహా విహారాయ!) ఈ లింక్‌పై క్లిక్‌చేసి వాట్సాప్ ఛానెల్‌ని ఫాలోకండి -
Lanka Sita: బడుగు జీవుల దారిదీపం ఈ పెద్దక్క
లంక సీత వయసు 81. ఢిల్లీతో 61 ఏళ్ల అనుబంధం. ఢిల్లీలో ఉండనని ఏడ్చిన రోజులు... ఇంత నగరంలో ఎలా జీవించాలి... అనే ఆందోళన. జీవించడం ఎలాగో నేర్పిన గురువుది కూడా ఆ నగరమే. తెలుగుదనంతో ఢిల్లీలో అడుగుపెట్టిన నాటి తరం అమ్మాయి. తనలాగ ఎందరో... వాళ్లకు బతికే దారేది... అనుకుంది. అలాంటి అభాగ్యులకు అక్క అయింది... వారి జీవికకు దారి చూపిస్తోంది. ఆంధ్రప్రదేశ్, పశ్చిమగోదావరి జిల్లా, తణుకులో పుట్టిన లంక సీత దేశ రాజధానితో ముడివడిన తన జీవిత గమనాన్ని సాక్షితో పంచుకున్నారు. ‘‘నేను పుట్టింది అమ్మమ్మగారింట్లో తణుకులోనే, కానీ సొంతూరు నర్సాపురం. నాన్న ఉద్యోగరీత్యా నా చదువు కొంతకాలం నర్సాపురం, మరికొంత కాలం తణుకులో అమ్మమ్మగారింట్లో సాగింది. నాకు చదువంటే ఎంత ఇష్టమంటే ఇంగ్లిష్ పరీక్ష రాయడానికి టేబుల్ అందకపోతే నిలబడి పరీక్ష రాశాను తప్ప పరీక్ష మానలేదు. ఎస్ఎస్ఎల్సీ తర్వాత అనుకోకుండా పెళ్లి సంబంధం రావడం, మంచి సంబంధం, అబ్బాయికి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం అని పెళ్లి చేసి మా వారితోపాటు నన్ను ఢిల్లీకి పంపించారు మా వాళ్లు. పంజాబీల ఇంట్లో అద్దెకుండేవాళ్లం. ఇంగ్లిష్ అయితే నెగ్గుకొచ్చేదాన్ని, కానీ హిందీ అక్షరం కూడా మాట్లాడలేని పరిస్థితి. నాకు ఢిల్లీ అలవాటయ్యే లోపే భూకంపం వచ్చింది. మా ఓనర్ నన్ను గట్టిగా పిలుస్తూ పంజాబీలో, హిందీలో ఏదో చెప్తోంది. అర్థం చేసుకునేలోపు ఆవిడే వచ్చి బయటకు లాక్కువెళ్లింది. ఆ తర్వాత తెలిసింది నాకు అది భూకంపం అని. ఢిల్లీలో ఉండనని ఏడవడం అప్పుడు మొదలైంది. ఆ తర్వాత ఒక రోజు కడుపు నొప్పి కారణంగా మా వారిని హాస్పిటల్లో చేర్చారు. అది గుండెనొప్పి అని ఆయన దూరమైన తర్వాత తెలిసింది నాకు. కంపాషన్ గ్రౌండ్స్‌లో నాకు ఉద్యోగం ఇచ్చారు. ఉద్యోగంలో చేరిన తర్వాత ఇల్లు దాటి ఢిల్లీ వీథులు, సిటీ బస్సులతో నా జీవన యానం మొదలైంది. ఆఫీసులో ఉన్నా సరే నా కళ్లు వర్షించడానికి సిద్ధంగా ఉన్న నీలిమేఘాల్లా ఉండేవి. ఉద్యోగంలో పని నేర్చుకోవడం, ప్రైవేట్‌గా చదువుకోవడం మొదలు పెట్టిన తర్వాత నా మీద నాకు నమ్మకం కలిగింది. నా కళ్లు కన్నీళ్లను మరచిపోయాయి. ► మళ్లీ చదువు! ఇంటర్, బీఏ, ఎంఏ, ఆ తర్వత జర్నలిజం చేశాను. చైనా సామాజిక జీవనం పట్ల అధ్యయనం చేయాలనే ఉద్దేశంతో చైనీస్ భాష నేర్చుకోవడానికి లింగ్విస్టిక్స్‌లో చేరాను. కానీ ఉద్యోగంలో ప్రమోషన్ తర్వాత పని భారం కారణంగా ఇతర వ్యాపకాల మీద దృష్టి పెట్టలేకపోయాను. ఆర్థిక, సామాజిక పరిశోధన రంగంలో పని చేశాను. సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్‌గా ఉన్న సమయంలో అమ్మ కోసం నాలుగేళ్ల ముందే రిటైర్మెంట్ తీసుకున్నాను. ఉద్యోగంలో నా పని సామాజిక స్థితిగతుల మీద అధ్యయనం కావడంతో 2002లో సైరస్ (సీత ఆల్ ఇండియా రీసెర్చ్ అండ్ సోషల్ సర్వీసెస్) స్థాపించి విశ్రాంత జీవితాన్ని సమాజం కోసమే అంకితం చేశాను. ► మహిళ పరిస్థితి మారలేదు! ప్రభుత్వ ఉద్యోగం ఉండి కూడా దేశ రాజధాని నగరంలో నన్ను నేను నిలబెట్టుకోవడానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందో నాకు తెలుసు. నాలాగ తన కాళ్ల మీద తాము నిలబడాల్సిన స్థితిలో ఉన్న మహిళల కోసం ఏదైనా చేయాలనిపించింది. మహిళలు, యువకులు, వృద్ధులకు కూడా ఉపయోగపడేవిధంగా సైరస్ పేరుతో స్వచ్ఛంద సంస్థను స్థాపించాను. మహిళలకు ఉద్యోగ ప్రయత్నాల్లో సహాయం చేయడం, ఉపాధి మార్గాలను తెలియచేసి సహకారం అందించడం, తాగుబోతు భర్తల కారణంగా బాధలు పడుతున్న వాళ్లకు ఆసరాగా నిలవడం, మగవాళ్లకు కౌన్సెలింగ్ ఇచ్చి తాగుడుకు బానిసలు కాకుండా కుటుంబం పట్ల బాధ్యతగా వ్యవహరించే వరకు పర్యవేక్షిస్తూ ఆ కుటుంబాలను నిలబెట్టడం వంటి ప్రయత్నాలు మొదలుపెట్టాం. పిల్లలకు పోషకాహారం అందించడం, స్కూలుకి పంపేలా చూడడం, వృద్ధుల ఆరోగ్య సంరక్షణతోపాటు వారిని సమాజంలో ఉత్సాహంగా పాల్గొనేటట్లు చేయడం, యువతను చైతన్యవంతం చేయడం వంటి కార్యక్రమాలతో పని చేస్తోంది సైరస్. ► వర్తమానమే ప్రధానం! మా సైరస్ సంస్థలో పన్నెండు మందిమి ఉన్నాం. మేమందించే మా సేవలలో మాకు సహకరించే డాక్టర్లు, లాయర్లు, టీచర్లు, వాలంటీర్లున్నారు. మేము ఎవరి దగ్గరా ఆర్థిక సహకారం తీసుకోలేదు. మా కార్యక్రమాలకు వస్తురూపేణా సహకరించేవాళ్లున్నారు. నా పెన్షన్‌లో సగం ఈ సర్వీస్‌కే ఖర్చవుతుంది. నాకు పిల్లలు లేరు. పిల్లలతో కలిసి గడపడానికి ఎప్పుడూ ఏదో ఒక కార్యక్రమం చేస్తూ నా పిల్లలకే చేసినట్లు సంతోషపడుతుంటాను. సమాజానికి సేవ చేయడంతోపాటు తెలుగు కథలు, వ్యాసాలు రాయడం, అనేక ప్రదేశాల్లో పర్యటించడం, పరిశోధన వ్యాసాలు రాయడం నా హాబీలు. నేను నమ్మే తాత్వికత ఒక్కటే... ‘గతాన్ని మార్చలేం. అందుకే గతంలో జరిగిన చేదు సంఘటనల గుర్తు చేసుకుంటూ మనసు పాడు చేసుకోకూడదు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఊహించలేం. మనం వండుకున్న అన్నాన్ని తినే వరకు ఉంటామో లేదో మనకే తెలియదు. అలాంటప్పుడు భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ ఉండడం వృథా. ఇక వర్తమానమే ప్రధానం. వర్తమానంలో జీవించాలి’ ఇదే నన్ను నడిపిస్తున్న చోదక శక్తి’’ అన్నారు లంక సీత. లెప్రసీ ఆశ్రమం దత్తత వైజాగ్‌లో వొకేషనల్ సెంటర్ ప్రారంభించి చదువు మానేసిన వాళ్లకు కుట్లు, అల్లికలతోపాటు టైలరింగ్, వెదురుతో కళాకృతుల తయారీ, టీవీ మెకానిజం, ఏసీ రిపేర్లలో సర్టిఫికేట్ కోర్సులు నిర్వహించాం. కరోనా వరకు నిరంతరాయంగా సాగాయి. ఇప్పుడు వాటిని తిరిగి గాడిలో పెట్టాలి. హైదరాబాద్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లలో మెడికల్ క్యాంపులు పెట్టి అవసరమైన వారిని అనంతర చికిత్స కోసం ఉచితంగా వైద్యమందించే హాస్పిటల్స్‌తో అనుసంధానం చేస్తాం. రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే, గాంధీ జయంతి, చిల్డ్రన్స్ డే వంటి సందర్భాల్లో పిల్లలకు పోటీలు నిర్వహిస్తాం. ఢిల్లీలో అల్పాదాయ వర్గాలు నివసించే నాలుగు కాలనీలు, ఒక లెప్రసీ ఆశ్రమాన్ని దత్తత తీసుకున్నాం. దుస్తులు, పాత్రలు, బ్యాండేజ్ క్లాత్, మందులు పంపిణీ చేస్తాం. దత్తత తీసుకున్న కాలనీల పిల్లలకు స్కూలుకు వెళ్లడానికి అవసరమైన సమస్తం సమకూరుస్తున్నాం. – లంక సీత, ప్రెసిడెంట్, సైరస్ స్వచ్ఛంద సంస్థ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి. -
సీతమ్మ తల్లి తనువు చాలించిన ప్రదేశం ఎక్కడో తెలుసా!
సీతమ్మ తల్లి తనువు చాలించిన ప్రదేశం సీతా సమాహిత్ స్థల్. సీతాదేవి తన అవతారం చాలించినప్పుడు తన మాతృమూర్తి అయిన భూమాతలో ఐక్యం అయ్యిందన్న విషయం అందరికీ తెలుసు. కానీ ఆ ప్రదేశం ఎక్కడుందో చాలా మందికి తెలియదు. మరి అదెక్కడుంది? ఆ ప్రాంత విశేషాలేమిటి వంటివి చూద్దామా ..! ఆ పవిత్ర స్థలం ఎక్కడో కాదు .. అలహబాద్ మరియు వారణాసిలను కలిపే రెండవ జాతియ రహదారికి సుమారు 4 కి. మీ. దూరంలో దక్షిణాన ఉంటుంది. రెండవ జాతియ రహదారి పైన ఉన్న జంగిగంజ్ నుండి 14 కి.మీ ప్రయాణం చేస్తే అక్కడికి సులభంగా చేరుకోవచ్చు. ఆ ప్రదేశాన్ని 'సీత సమాహిత్ స్థల్' అని 'సీత మారి' అని పిలుస్తారు. సీతా సమాహిత్ స్థల్లో చూడటానికి ఒకేఒక గుడి ఉన్నది. ఆ గడ్డిని పశువులు కూడా తినేవి కావు బహుశా ..! దీన్ని చూస్తే గుడి అని అనిపించదేమో! ... స్మారకం అనాలేమో ..!! తమసా నది పరిసర ప్రాంతంలో ప్రశాంత వాతావరణంలో 90వ దశకంలో నిర్మించిన అందమైన స్మారక కట్టడం ఒకటుంది. ఈ స్మారక కట్టడం నిర్మాణం జరుగక ముందు ఇక్కడ అమ్మ వారి జుట్టుని తలపించేట్టుగా కేశ వాటిక ఉండేదని అక్కడి స్థానికులు చెబుతారు. అక్కడ మొలిచిన గడ్డిని పశువులు కూడా తినేవి కాదట. స్మారకాన్ని నిర్మించేటప్పుడు 'సీతా కేశ వాటిక' ను పాడు చెయకుండ అలాగే ఉంచారు. స్మారకం ఉన్న ప్రదేశానికి సమీపంలోనే వాల్మీకి ఆశ్రమం ఉన్నది. ఈ ఆశ్రమంలోనే జానకి దేవి మళ్లీ అడవుల పాలైనప్పుడు నివాసము ఉన్నది ఇక్కడే. ఆశ్రమానికి పక్కనే లవ కుశలకు జన్మనిచ్చిన స్థలం అయిన సీత వటవృక్షం కూడ ఉంటుంది. ఇక స్మారకం విషయానికి వస్తే, అది ముచ్చటగా రెండు అంతస్థుల నిర్మాణం. పై అంతస్తులోని అద్దాల మంటపంలో అమ్మ వారి పాల రాతి విగ్రహం ఉంటుంది. అలాగే కింద భాగంలో జీవకళ ఉట్టిపడే విధంగా భూమిలోకి చేరుకుంటున్నట్టుగా చూపిస్తున్న అమ్మ వారి ప్రతిమను చూస్తుంటే ... ఎంతటి వారికైన బాధ కలిగించే విధంగా ఉంటుంది. వెనక గోడల మీద ఆ సంఘటనలను చూపిస్తున్న సన్నివేశపు శిలా చిత్రం కనిపిస్తుంది. గుడి లేదా స్మారక వివరాల్లోకి వెళితే, దీన్ని స్వామి జితేంద్రానంద తీర్థులవారి ఆదేశం మేరకు ఇక్కడ నిర్మించారు. సీతా సమాహిత్ స్థల్ చేరుకొను మార్గం సీతా సమాహిత్ స్థల్ కి బస్సు మార్గం చక్కగా ఉంటుంది. అలహాబాద్ నుండి 55 కిలోమీటర్ల దూరంలో, వారణాసి నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ పుణ్య క్షేత్రం. రైళ్లలో వచ్చే వారు అలహాబాద్ లేదా వారణాసి (ఏది దగ్గర అనుకుంటే అది) రైల్వే స్టేషన్లో దిగి సీతా సమాహిత్ స్థల్ చేరుకోవచ్చు. విమాన మార్గం ద్వారా వచ్చే వారు అలహాబాద్ లేదా వారణాసి విమానాశ్రయాలకు చేరుకొని క్యాబ్ లేదా ప్రభుత్వ బస్సులో ప్రయాణించి చేరుకోవచ్చు. (చదవండి: కలియుగ శ్రవణుడిలా..తల్లిని భుజాలపై మోస్తూ..) -
ఆదిపురుష్‌కు సీత కష్టాలు.. వివాదంలో డైలాగ్
రామాయణం ఆధారంగా తెరకెక్కిన తాజా చిత్రం 'ఆదిపురుష్'. ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతాదేవిగా దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. కానీ నేపాల్‌లో మాత్రం ఈ సినిమా విడుదలపై అభ్యంతరం వ్యక్తం అయింది. ఆదిపురుష్ సినిమాలో సీతా దేవి భారతదేశపు కుమార్తె అని డైలాగ్ చెబుతూ ఓ సన్నివేశం ఉంటుంది. దీనిని నేపాల్ సెన్సార్ బోర్డు తప్పుబట్టింది. సీతా దేవి నేపాల్‌లో జన్మించిందని వారి నమ్మకం. దీంతో అక్కడ సినిమా రిలీజ్ కాలేదు. ఖాట్మండులోని కొన్ని థియేటర్లలో ఆదిపురుష్ సినిమాను బ్యాన్ కూడా చేశారు. (ఇదీ చదవండి: Adipurush: థియేటర్ అద్దాలు పగలగొట్టిన ప్రభాస్ ఫ్యాన్స్) ఆ డైలాగ్‌ను తొలగించాల్సిందిగా మూవీ మేకర్స్‌ను వారు కోరారు. దీంతో వివాదానికి కారణమైన డైలాగ్స్‌ను మేకర్స్ తొలగించారు. అనంతరం నేపాల్‌లో మూవీ విడుదలకు లైన్ క్లియర్ అయింది. కానీ మార్నింగ్ షోలు ఆగిపోయాయి. మరి కొన్ని గంటల్లో అక్కడ మెదటి షో పడనుంది. సీతాదేవి నేపాల్ కుమార్తెగా వారు భావిస్తారు కాబట్టి అక్కడ మొదటి నుంచి ఈ సినిమాకు మంచి హైప్ క్రియేట్ అయింది. ఇప్పటికే అక్కడ టికెట్లు కూడా భారీగా అమ్ముడుపోయాయి. (ఇదీ చదవండి: Adipurush: ఎవరీ ఓం రౌత్.. ప్రభాస్‌కు ఎలా పరిచయం?) -
ప్రత్యక్ష దైవం సాయిబాబా
షిర్డీ సాయిబాబా జీవితం నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘ప్రత్యక్ష దైవం షిర్డీ సాయి’. సాయిబాబాగా రామలింగా రెడ్డి నటించారు. కొండవీటి సత్యం దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో భానుచందర్, సీత ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం పాటల ప్రదర్శన హైదరాబాద్‌లో జరిగింది. విశ్రాంత ఇన్కమ్ టాక్స్ ప్రిన్సిపల్ ఛీప్ కమీషనర్ నరసింహప్ప అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఓ ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకుడు ఓం సాయి ప్రకాశ్ మాట్లాడుతూ– ‘‘సాయిభక్తుల అనుభవాలతో సినిమా తీయడం అభినందనీయం’’ అన్నారు. ‘‘యువతరంలో ఆధ్యాత్మికతను పెంపొందించాలనే ఆలోచనతో ఈ చిత్రాన్ని నిర్మించారు మచ్చా రామలింగారెడ్డి’’ అన్నారు చీఫ్ కమిషనర్ నరసింహప్ప. ‘‘యం.ఆర్. రెడ్డి మంచి భక్తిరస చిత్రాన్ని నిర్మించాలనుకోవడం అభినందనీయం’’ అని ఇన్కమ్ టాక్స్ కమిషనర్ జీవన్ లాల్ అన్నారు. చిత్రదర్శకుడు కొండవీటి సత్యం, నిర్మాతలు వెంకట్, వి. సుబ్బారావు, సంగీతదర్శకులు కిషన్ కవాడియా, పాటల రచయిత బిక్కి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
Fact Check: సీతకొండపై బాబు బొంకు!.. అబద్ధాలతో ట్వీట్
సాక్షి, విశాఖపట్నం: నాడు రాష్ట్రపతిగా అబ్దుల్ కలామ్‌కు అవకాశం కల్పించింది తానేనంటూ తరచూ బుకాయించే చంద్రబాబు ఆయన పేరుతో తాజాగా మరోసారి బరి తెగించారు! ఇటీవల విశాఖలో జీ 20 సదస్సు సందర్భంగా బీచ్‌రోడ్డు సీతకొండ సమీపంలోని వ్యూ పాయింట్‌ని సుందరంగా తీర్చిదిద్దిన రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ వ్యూ పాయింట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే కలాం వ్యూ పాయింట్ పేరును రాష్ట్ర ప్రభుత్వం మార్చేసిందంటూ చంద్రబాబు ట్వీట్ చేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. చంద్రబాబు నీచ రాజకీయాలకు మహనీయుడైన కలాం పేరును వాడుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర జనసైన్యం పేరుతో జనసేనకు చెందిన ఓ వ్యక్తి బుధవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో పోస్ట్ చేసిన ట్వీట్‌ను కొద్దిగా మార్చి ఇంగ్లీష్‌లో చంద్రబాబు మధ్యాహ్నం ట్వీట్ చేశారు. ఇక్కడ కూడా కాపీ, పేస్ట్‌లో చంద్రబాబుని మించినవారు లేరంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. సీతకొండ ఎదురుగా ఖాళీ స్థలం నుంచి సముద్రం అద్భుతంగా కనిపిస్తుంది. స్థానికులు దశాబ్దాలుగా దీన్ని సీతకొండ వ్యూ పాయింట్‌గానే వ్యవహరిస్తున్నారు. తాము 30 ఏళ్లుగా విశాఖలోనే ఉంటున్నామని, వ్యూ పాయింట్‌ను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని పలువురు పేర్కొంటున్నారు. రూ.3.29 కోట్లతో వ్యూ పాయింట్ అభివృద్ధి సుందర విశాఖ సాగర తీరంలో సరైన వ్యూ పాయింట్స్ లేకపోవడంతో జీ 20 సదస్సు సందర్భంగా సీఎం జగన్ ఆదేశాల మేరకు జోడుగుళ్ల పాలెం సమీపంలోని ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా మార్చారు. చక్కటి పెయింటింగ్స్ ఏర్పాటు చేశారు. నడక దారితోపాటు మార్బుల్స్‌తో కూర్చునే బెంచీలు, లవ్ వైజాగ్ చిహ్నం తదితరాలతో తీర్చిదిద్ది వైఎస్సార్ వ్యూ పాయింట్‌గా నామకరణం చేశారు. -
Srirama Navami 2023: పరిపూర్ణ పురుషోత్తముడు..
దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం అంతటా వ్యాపించి ఉన్న భగవానుడు మనకోసం ఒక రూపంలో ఒదిగిపోయి దివి నుంచి భువికి దిగి వస్తే, దాన్ని అవతారం అంటారు. అలా శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాలలో మానవ జీవితానికి అతి దగ్గరగా ఉండే అవతారం రామావతారం. చైత్ర శుద్ధ నవమి రోజు, లోకాలన్నిటి చేత నమస్కరింపబడే రాముడు ఈ భూమి మీద జన్మించాడు. పుట్టింది మొదలు ధర్మాన్నే అనుసరించాడు. పితృధర్మం, మాతృధర్మం, భ్రాతృధర్మం, స్నేహ ధర్మం, పత్నీ ధర్మం, ఋషుల ధర్మం... ఇలా అన్ని ధర్మాలు తెలిసినవాడు, ఆచరించినవాడు. అందుకే ‘రామో విగ్రహవాన్ ధర్మః’ అంటూ శత్రువులు కూడా ఆయనను స్తుతించారు. నేడు శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా... ఆ పరిపూర్ణ పురుషోత్తముడి గురించి తెలుసుకుందాం. అప్పటికి కౌసల్యాసుతునికి పదిహేను పదహారేళ్ల వయసుండొచ్చు. ఒకానొక రోజు దశరథమహారాజు రాముణ్ణి పిలిచి విశ్వామిత్ర మహర్షివైపు చూపిస్తూ ‘‘ఈ మహర్షితోపాటు నువ్వు అడవులకు వెళ్లాలి నాయనా...’’ అని అంటాడు. మరో పిల్లాడయితే ఏమనేవాడో ఏమో కానీ, రాముడు మాత్రం తండ్రి చెప్పాడు కాబట్టి కిమ్మనకుండా బయలుదేరాడు. అనుగు సోదరుడు లక్ష్మణుడు తోడు రాగా అడవుల్లోకి దారితీశాడు. తాటక సంహారం చేశాడు. అహల్యకు విమోచన ప్రసాదించాడు. రాముడు ఎంతటి క్రమశిక్షణ కలవాడంటే అంతఃపురంలో ఉన్నంత కాలమూ కన్నవారి మాట జవదాటలేదు. అరణ్యాల్లో ప్రవేశించాక విశ్వామిత్రుని ఆజ్ఞ మీరలేదు. సీతాస్వయంవరానికి తీసుకువెళతానని ఆ గురువర్యుడంటే∙మారు మాట్లాడకుండా అనుసరించాడు. పెద్దల మాటకే ప్రాధాన్యం జనకమహారాజు నెలకొల్పిన స్వయంవరమంటపంలో శ్రీరాముడు అడుగుమోపినా శివధనుస్సు ఉండే చోటికి హడావుడిగా వెళ్లిపోలేదు. దాన్ని భళ్లున ఎత్తేసి, ఫెళ్లున విరిచేసి, చేతులు దులిపేసుకోలేదు. ఎలాంటి తొందరపాటూ పడకుండా సభాభవనంలో నిమ్మళంగా కూర్చున్నాడు. శివధనువును ఎత్తాలంటూ విశ్వామిత్రుడు అనుజ్ఞ ఇచ్చాకనే రాముడు ఆ పనికి పూనుకున్నాడు. ధనస్సును సున్నితంగా ఎత్తిపట్టుకుని, నారి సారించి, విరిచాడు. ఇదంతా ఎలాంటి భావోద్వేగాలకు లోనుకాకుండా చేశాడు. అంత పెద్దపనీ పూర్తిచేశాక ధీర గంభీరంగా అడుగులు వేస్తూ తన ఉచితాసనానికి చేరుకున్నాడు. చిన్నపాటి విజయాన్ని సాధిస్తేనే మురిసి మెరిసిపోయే మనం, ఆ సందర్భాన రాముడి వర్తన నుంచి ఎన్ని పాఠాలు నేర్చుకోవచ్చో. చిన్న కష్టానికే కన్నీరొలికించడం. అల్పమైన సుఖాలకే అతిగా స్పందించడం.. లాంటి లక్షణాలను మరెంత సునాయాసంగా తొలగించుకోవచ్చో! వినయ విధేయతలు తొందరపాటు...తొట్రుపాటు అనేవి రాముడి నిఘంటువులోనే లేదు. శివధనువును విరవగానే సీతను రాముడికిచ్చి పెళ్లి చేస్తానని జనకుడు చెప్పిన మాట విని ఎగిరి గంతేయలేదు. వెంటనే సీత మెడలో మూడు ముళ్లూ వేసేయలేదు. జనకుని ప్రతిపాదనను తన కన్నవారికి తెలియజేయాలని, అందుకు వారి అనుమతి అవసరమనీ వినమ్రంగా చెప్పాడు. ఎవరి పట్ల ఏవేళ ఎలా ఆదరం చూపాలో రామునికి బాగా తెలుసుననడానికి ఇంతకు మించిన ఉదాహరణ మరొకటి లేదు. అలా ఆ పెద్దలందరి సమక్షంలోనూ మైథిలి చేయి అందుకున్నాడు. సీతారాముల కళ్యాణం జరిగి ఎంతోసేపు అవనే అవదు. పరశురాముడు వేంచేశాడు. పెళ్లివేదిక వద్దకు వస్తూనే ఆ మహాశయుడు వీరావేశాన్ని ప్రదర్శించాడు. ప్రపంచంలో రాముడంటే పరశురాముడేనని, మరో రాముడికి లోకాన చోటు లేనేలేదని వీరవిహారం చేశాడు. అటు జనకుడు, ఇటు దశరథుడు పరశురాముని క్రౌర్యాన్ని చూసి బెంబేలెత్తిపోయారు. అయితే రాముడు ఏమాత్రం తొందరపడలేదు. పరశురాముడు ఎంతగా పేట్రేగిపోతుంటే రాముడు అంత ప్రశాంతంగా ఉన్నాడు. పరశురాముడు అందించిన విష్ణుధనువును సునాయాసంగా పైకెత్తాడు. తను శ్రీహరి ప్రతిరూపమని చెప్పకనే చెప్పాడు. దీంతో పరశురాముడికి కమ్మిన పొరలు తొలగిపోయాయి. తారుమారైనా... మర్నాడు పొద్దున్నే పట్టాభిషేకం జరగాల్సి ఉంది. రాత్రికి రాత్రే కథ మారిపోయింది. కైకమ్మ స్వయంగా పిలిచి, తన మాటల్ని దశరథుని ఆదేశాలుగా వినిపించింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా పద్నాలుగేళ్లపాటు అరణ్యవాసం చేయాలని ఆజ్ఞాపించింది. మారు తల్లి మాటలను మన్నించాడు. అడవుల్లోకి పోయేందుకు సిద్ధమేనంటూ అందుకు రథాన్ని సిద్ధం చెయ్యమన్నాడు. మంగళస్నానాలు చేసి రాజదండాన్ని చేపట్టాల్సిన వేళ పత్నినీ, సోదరునీ వెంటబెట్టుకుని గుహుని పడవమీద నది దాటుకుంటూ పోయాడు. అడవుల్లోనూ ఆ రామునికి ప్రశాంతత లేనే లేదు. కష్టాలూ కన్నీళ్లే! సీతమ్మను రావణుడు అపహరించుకుపోయాక మానసికంగా నలిగిపోయాడు. చివరికి లంకలో అమ్మవారు ఉన్నారన్న సంగతి తెలిసి కొంత స్థిమితపడ్డాడు. తన ప్రియపత్నిని తన వద్దకు తెచ్చుకునేందుకు తగిన ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. వానరసైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. విభీషణునితో చెలిమిచేశాడు. ఓరిమితో వ్యవహరించాడు. తగిన సమయం కోసం ఓపికగా ఎదురు చూశాడు. సముద్రం మీద సేతువును నిర్మించాడు. అందుబాటులో ఉన్న వానర సేన సహకారంతోనే అమిత బలవంతుడైన శత్రువుతో యుద్ధం చేశాడు. విజేత తానే అయ్యాడు. స్థితప్రజ్ఞావంతుడు దక్కుతుందనుకున్న రాజ్యం క్షణాల్లో చేజారిపోయింది. వనవాస క్లేశాలు ముదిరిపోయాయి. సరసరాజాన్నభోజనాల స్థానంలో ఆకులు అలములు తినాల్సి వచ్చింది. ఒకవైపు భార్యావియోగం. మరోవైపు రాక్షసబాధ. వయసేమంత పెద్దది కాదు. అయినా చలించలేదు. స్థిరంగా ఉన్నాడు. దృఢంగా ఉన్నాడు. స్థితప్రజ్ఞతతో వ్యవహరించాడు. మరి ఇప్పటికాలాన మనం ఎలా ఉన్నాం..? బస్సు దొరక్కపోతే ఆందోళన. సినిమా టికెట్టు అందకపోతే అశాంతి. పరీక్షలో మార్కులు తక్కువయితే ఆవేదన. అన్నింటికీ తొందరే. ప్రేమ తొందర. పెళ్లి తొందర. ఇలా అయితే ఎలా. రాముని వంటి వారినే కష్టాలు కాల్చుకు తిన్నాయి. అన్నింటినీ ఆయన ఓపిగ్గా ఎదుర్కొన్నాడు. ఆయనతో పోల్చుకుంటే మనం ఎంతటి వారం? ఆయన పడ్డ కష్టాలతో పోల్చి చూసుకుంటే మన కష్టాలు ఏపాటివి?ఎప్పటి త్రేతాయుగం? రాముడు పుట్టి రెండు యుగాలయింది. మనమిప్పుడు కలికాలంలో ఉన్నాం. అయినా ఆ ఆదర్శనీయుణ్ణి నేటికీ మరువలేకపోతున్నాం. అదే ఆయన వ్యక్తిత్వం. అందుకే మానవుడిగా పుట్టినా, రాముడు మనకు దేవుడయ్యాడు. ఆయన నడిచిన బాట అయిన రామాయణం పఠనీయ కావ్యం అయింది. అందుకే రామాయణాన్ని పారాయణం చేయాలి. అందులోని మంచిని ఒంటబట్టించుకోవాలి. కృతజ్ఞత ఆయన రక్తంలోనే ఉంది చేసిన సహాయాన్ని ఎన్నటికీ మరువని సద్గుణ సంపన్నత రామునిది. అందుకే సీతమ్మ జాడతెలుసుకున్న ఆంజనేయస్వామిని బిడ్డలా చూసుకున్నాడు. ఎవరికీ ఇవ్వనంతటి చనువును ఇచ్చాడు. తన ప్రేమను పంచాడు. సుగ్రీవుడికి పట్టం కట్టాడు. విభీషణునికి లంకేశునిగా మకుటం తొడిగాడు. ..జననీ జన్మభూమిశ్చ.. రావణ సంహారం జరిగాక ఆ రాక్షస రాజు మనసుపడి కట్టించుకున్న కోటను స్వాధీనం చేసుకోవాలని లక్ష్మణుడు భావించాడు. విషయాన్ని అన్నతో చెప్పాడు. యావత్ లంకానగరమే మణిమయ నిర్మితమైనది. అందులోని రాజ సౌధం సామాన్యమైంది కాదు. ఎటు చూసినా బంగారమే. కాని, రాముని తీరు వేరు. ఆయనకు దురాశ ఉండదు. ఆయన ధర్మం తప్పడు. లక్ష్మణుని సలహాను సున్నితంగా తిరస్కరిస్తాడు. ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ’ అంటూ అయోధ్యవైపు చూడాలని సూచన చేస్తాడు. లంక విభీషణునికే చెందుతుందని స్పష్టం చేస్తాడు. అంటే పరాయి ప్రదేశం ఎంతటి గొప్పదైనా, సుందరమైనదైనా దానిని చూసి మనసు పారేసుకోలేదు. మాతృభూమిని మరువలేదు. పుట్టిన గడ్డపై ప్రేమను పోగొట్టుకోలేదు. రామ నైవేద్యం పానకం కావలసినవి: బెల్లం పొడి– పావు కేజీ; నీళ్లు– లీటరు; యాలకుల పొడి– టీ స్పూన్; మిరియాల పొడి– టీ స్పూన్; శొంఠిపొడి– చిటికెడు తయారీ: బెల్లం పొడిలో నీటిని కలిపి కరిగిన తర్వాత వడపోయాలి. ఈ బెల్లం నీటిలో యాలకుల పొడి, మిరియాల పొడి, శొంఠిపొడి కలిపితే పానకం రెడీ. వడపప్పు కావలసినవి: పెసరపప్పు – పావు కేజీ; పచ్చిమిర్చి ముక్కలు – టీ స్పూన్; పచ్చి కొబ్బరి తురుము– టేబుల్ స్పూన్; మామిడి కాయ తురుము– టేబుల్ స్పూన్ తయారీ: పెసరపప్పు శుభ్రంగా కడిగి అరగంట సేపు నానబెట్టాలి. గింజ మెత్తబడిన తర్వాత నీటిని వంపేసి అందులో పైన తీసుకున్న దినుసులన్నీ కలిపితే వడపప్పు రెడీ. వడపప్పు, పానకం ఆరోగ్యకరమైనవి. ఈ రెండింటినీ కలిపి తింటే జీర్ణవ్యవస్థ పని తీరు మెరుగవుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు తొలగిపోతాయి. వేసవి మొదలైన ఈ సమయంలో ఆరోగ్యం ఒడిదొడుకులను పానకం నివారిస్తుంది. యాలకుల పొడి అతిదాహాన్ని తగ్గిస్తుంది. – డి.వి.ఆర్. భాస్కర్ -
రామా! ఇది నిజమేనా!
హిమాలయాలలో నిదురిస్తున్న చిరంజీవి అయిన హనుమంతుడికి మెడలో ముత్యాల హారం చేతికి తగలగానే ఏదో జ్ఞప్తికి వచ్చినట్టుగా ఒక్కసారిగా నిద్ర నుంచి మేల్కొన్నాడు. నేడు నా రామయ్య కల్యాణం, నా సీతారాములు ముత్యాల తలంబ్రాలు పోసుకునే రోజు, నా రాముడు సీతమ్మ మెడలోల ముడి మీద ముడి అంటూ మూడు ముళ్లు వేసే శుభదినం. ఎన్నాళ్లుగానో ఆ కల్యాణం కన్నులారా తిలకించడానికి వెళ్లాలనుకుంటున్నాను, కాని రామనామస్మరణతో మరచిపోతున్నాను. ఈ సంవత్సరం కూడా మరచిపోతాననుకున్నాను. కాని సరైన సమయానికి ఈ ముత్యాల హారం, అదే ఆ నాడు పట్టాభిషేక సమయంలో సాక్షాత్తు సీతమ్మ నాకు బహూకరించిన ఈ ముత్యాల హారం, నా చేతికి తగిలి, గుర్తుకు వచ్చింది. ఇది నా భాగ్యం. రామనామ మంత్రం జపిస్తూ అయోధ్యకు... కాదు కాదు... భద్రాద్రికి బయలుదేరతాను. ఏ శుభ ముహూర్తాన కంచర్ల గోపన్న నా రాముడికి మందిరం కట్టించాడో కాని, ఆయన రామదాసు అయ్యాడు, నాటి నుంచి ఆయనకు వైభోగంగా కల్యాణం జరుగుతూనే ఉంది. ఈ సంవత్సరం నేను అక్కడకు వెళ్లి, కన్నులపండువుగా సీతారామకల్యాణం వీక్షిస్తాను. త్రేతాయుగంలో నా రాముడి కల్యాణం జరిగేనాటికి ఆయన ఎవరో కూడా నాకు తెలియదు కదా. ఆ వైభోగం ఇలా చూడగలగడం నా భాగ్యమే కదా... అనుకుంటూ... ‘రామ రామ రామ...’ అని స్మరిస్తూ, భద్రాద్రి చేరుకునే సమయానికి, కల్యాణం ప్రారంభమవుతోంది. కల్యాణం కన్నులారా వీక్షించాడు. పరవశించిపోయాడు. తన్మయంలో మునిగితేలాడు. కల్యాణం పరిసమాప్తమైంది. భక్తులంతా ఎక్కడివారక్కడ సర్దుకున్నారు. రామయ్య సీతమ్మతో ఏకాంత మందిరంలోకి ప్రవేశించి, ముచ్చట్లు ప్రారంభించాడు. వారి వెంటే హనుమ కూడా అంతఃపురం వరకు వచ్చి, బయట నిలబడి, దూరం నుంచి అంతా గమనిస్తున్నాడు. కొద్దిసేపటి తరవాత వారిని సమీపించి, ‘‘తండ్రీ! మీరు ఏకాంత మందిరంలో ఉన్నా కూడా, ఎవరి అనుమతి లేకుండా మీ దగ్గరకు వచ్చే చనువు నాకుంది కనుక, ఇలా వచ్చాను’ అన్నాడు. ఏమిటి హనుమ! ఇలా వచ్చావు, నేను నెరవేర్చవలసిన కార్యం ఏదైనా ఉందా?’ అని మృదుమధుర గంభీర గళంతో అడిగాడు రాముడు. ‘అటువంటిదేమీ లేదు తండ్రీ! మీ జంట చూడముచ్చటగా ఉంది. ఏనాడో త్రేతాయుగంలో శివధనుర్భంగం చేసి, సీతమ్మను చేపట్టావు. ద్వాపరం గడిచింది, కలియుంగలో కూడా కొన్ని వేల సంవత్సరాలు గడిచాయి. నేటికీ నీ కల్యాణం ఇంత వైభోగంగా జరుగుతోంది. తండ్రీ! నిన్ను వేనోళ్ల కొనియాడినా నా తనివి తీరదు...’ అంటూ పరవశించిపోతుంటే, స్థితప్రజ్ఞుడైన రాముడు నిశ్చలంగా కూర్చున్నాడు. అంతలోనే హనుమ... నీ పట్టాభిషేక సమయంలో నువ్వు సీతమ్మ చేతికి ఒక ముత్యాల హారం ఇచ్చి, ‘జానకీ! ఈ హారాన్ని నీకు ఇష్టమైన వారికి అందించు’ అన్నావు. సీతమ్మవారు... కాదు కాదు... నా కన్నతల్లి... ఆ హారాన్ని అందుకుని సింహాసనం మీద నుంచి లేచి, మెట్లు అవరోహించి, సభలో అందరి మధ్యగా అడుగులు వేస్తూ, విభీషణ, జాంబవంత సుగ్రీవ, అంగదాది వానరులను ఒక్కొక్కరినీ దాటుకుంటూ వచ్చి, నా దగ్గరకు రాగానే నిలబడిపోయింది. ఒక తల్లి తన కుమారుడిని చూసినంత ఆప్యాయంగా నా వైపు చూస్తూ, ‘మారుతీ! ఈ హారానికి నీవు మాత్రమే అర్హుడవు’ అంటూ నా చేతికి అందించింది. అక్కడున్నవారంతా హర్షధ్వానాలు చేశారు. సీతమ్మ ఎంపిక ఎంత చక్కగా ఉందో అంటూ సంబరపడ్డారు. ఆ తల్లిని వేనోళ్ల కొనియాడారు. నేను సిగ్గుతో ముడుచుకుపోతూ, ‘తల్లీ! అంతా రాముని మహిమ వల్లే జరిగిందమ్మా, ఆయన అనుజ్ఞ లేనిదే నేను ఇంత ఘనకార్యం సాధించలేకపోయేవాడిని’ అన్నాను... ఇదంతా నాటి గాథ. ‘తండ్రీ! నీ కథ జరిగిన ఇన్ని వేల సంవత్సరాల తరవాత నిన్ను కొన్ని ప్రశ్నించాలనుకుంటున్నాను. నువ్వు నా తండ్రివి కనుక, నేను ఏది అడిగినా నువ్వు చిరునవ్వుతోనే సమాధానాలు చెబుతావని నాకు తెలుసు కనుక ధైర్యంగా అడుగుతున్నాను. అయితే ఇవి నా సందేహాలు కాదు. నీ గురించి నలుగురూ నాలుగు రకాలుగా అనుకుంటుంటే ఆ మాటలు నన్ను బాధపెడుతున్నాయి. నీ వెంటే ఉండి, నీ అడుగులో అడుగులు వేసిన నాకు, నువ్వంటే ఏమిటో తెలుసు. ఇతరులు నిన్ను శంకిస్తుంటే నా మనసుకి కష్టంగా ఉంది. అందుకే సందేహ నివృత్తి కోసం నిన్ను ప్రశ్నిస్తున్నాను. మా సీతమ్మ తల్లి రావణుని చెరలో సంవత్సర కాలం ఉండి వచ్చిన తరవాత, నువ్వు ఆమెను అనుమానించావని, అగ్ని ప్రవేశం చేయించావని అందరూ అనుకుంటున్నారు. నీ వంటివానికి అనుమానించే లక్షణం లేదు కదా తండ్రీ. అందునా నీ గాథ రచించిన వాల్మీకి అలా రాసి ఉంటాడనుకోవట్లేదు.... అంటుండగానే... మధ్యలోనే సీతమ్మ అందుకుని, హనుమా! నీ రామయ్య ఎటువంటివాడో నీకు తెలియదా. నా ప్రభువు రాముడికి అపవాదు రాకూడదనే నేనే, స్వయంగా చితి పేర్చుకుని అగ్నిప్రవేశం చేశాను. భార్యను అనుమానించేంత చిన్నబుద్ధి లేదు రామునికి. రాముడు నాకు భర్త మాత్రమే కాదు, కొన్ని కోట్లమందికి ప్రభువు. ఆయన అందరికీ ఆదర్శంగా ఉండాలే కాని, నియంతలా శాసించకూడదు. ఆయనను ఎవ్వరూ వేలెత్తి చూపకూడదు. అందుకే నాకుగా నేను చితి పేర్చుకున్నాను అని పలికింది జనకరాజ పుత్రి. రాముడు చిరునవ్వుతో, హనుమా! ఎవరి ఆలోచనలు వారివి, ఎవరి ఊహలు వారివి. వారి కళ్లకు నా ప్రవర్తన అలా కనిపించి ఉందేమో, వారు అలా అనుకోవడంలో తప్పులేదేమో అన్నాడు. హనుమ మరో ప్రశ్న అడిగాడు... తండ్రీ! నువ్వు భార్యను అనుమానించావని, నిండు చూలాలని కూడా చూడకుండా, ఒక చాకలివాని మాట పట్టుకుని, అరణ్యాలపాలు చేశావని, అక్కడ కుశలవులు పుట్టారని, సీతమ్మ తల్లి భూదేవి ఒడిలో చేరిపోయిందని, ఎన్నెన్ని మాటలు అన్నారయ్యా నిన్ను... అంటూ కన్నీరుమున్నీరవుతుంటే, ‘హనుమా, మనమంతా మనుషులం. మనుషులలో అన్నిరకాల మనస్తత్వాలవారు ఉంటారు. అందరి అభిప్రాయాలను సహృదయంతో స్వీకరించాలి. ఆ విషయం కల్పితం అని వాల్మీకం చదివితే అర్థం అవుతుంది.. మా కథ రచించిన మహర్షి రామాయణ ఆరంభంలోనే... కుశలవుల చేత ఈ కథను గానం చేయించినట్లు వివరించాడు. నేనంటే భక్తి ప్రపత్తులు ఉన్న మరో కవి, నా సీత దూరమైతే ఎలా ఉంటుందో ఊహించి ఆ కథా రచన చేశాడని పండితులే స్వయంగా ఘోషిస్తున్నారు కదా ... అన్నాడు. రామా! నిన్ను మొదటిసారి చూసినప్పుడే నువ్వేమిటో, నీ సత్ప్రవర్తన ఏమిటో, నీ ఏకపత్నీవ్రతమేంటో అర్థమైపోయిందయ్యా. నీ సునిశిత మనస్తత్వం కూడా అర్థమైందయ్యా. ఇందుకు సంబంధించి నేను ఒక్క మాట చెప్పాలయ్యా. నువ్వు సీతమ్మను వెతుకుతూ మా కిష్కింధకు వచ్చావు. సీతమ్మ జాడ గురించి అడిగావు. నేను నగల మూటను తీసుకువచ్చి చూపించాను. నువ్వు ఒక నగను చేతిలోకి తీసుకుని కంట తడిపెట్టి, పక్కనే ఉన్న సౌమిత్రితో, ‘తమ్ముడూ! నా కళ్లకు నన్నీళ్లు అడ్డపడుతున్నాయి. నగలు నేను గుర్తించలేకపోతున్నాను. మీ వదినగారి నగలు నువ్వు గుర్తించవయ్యా... అన్నావు. అమ్మ అంటే నీకు ఎంత ప్రేమయ్యా. అంతేనా, నీ తమ్ముడు నీకు తగ్గ అనుజుడు. ఆయనకు నగలు చూపితే, ఆయన సీతమ్మ కాలి మంజీరాలు మాత్రమే గుర్తుపట్టగలిగాడు. నిత్యం ఆ తల్లి పాదాలకు నమస్కరించేవాడు నీ తమ్ముడు. ఎంత ఉత్తములయ్యా మీరు. చివరగా ఒక్క మాట తండ్రి... ఎన్ని యుగాలు గడిచినా, ఎన్ని సంవత్సరాలు గతించినా, దాంపత్యానికి చిహ్నంగా నా తల్లి సీతమ్మను, నా తండ్రి రామయ్యను చెప్పుకుంటూనే ఉంటారు. అది నాకు ఎంతో సంతోషం రామా! నాకు ఇంతకంటె ఏం కావాలి. నాడు మీ కల్యాణం స్వయంగా చూడలే కపోయామని ఎవ్వరూ బాధపడక్కర్లేదు. నీ భక్తుడు రామదాసు చేసిన పుణ్యం కారణంగా ప్రజలంతా ఏటేటా మీ కల్యాణం చూస్తూనే ఉంటారు. ఇంక నాకు సెలవు ఇప్పించు రామా! హిమాలయాలకు వెళ్లి, నీ నామస్మరణ చేస్తూ తపస్సులోకి వెళ్లిపోతాను... అని సీతారాముల ఆశీస్సులు తీసుకుని హనుమ నిష్క్రమించాడు. సృజన రచన – డా. వైజయంతి పురాణపండ -
బాణం లేని రాముడు.. రంగు లేని రావణుడు
సాక్షి, దుమ్ముగూడెం(ఖమ్మం): దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి గాంచిన భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయానికి అనుబంధ దేవాలయమైన దుమ్ముగూడెం మండలం పర్ణశాలలోని దేవాలయంపై పాలకులు నిర్లక్ష్యం చూపుతున్నారు. శ్రీరాముడు వనవాసం చేసిన సమయంలో పంచవటి కుటీరాన్ని ఇక్కడే నిర్మించుకున్నారు. భద్రాచలం ఆలయానికి వచ్చే భక్తులందరూ పర్ణశాలలోనూ రామయ్యను దర్శించుకుని ఇక్కడి గోదావరి ప్రాంతంలో బోట్ షికారు చేసి ప్రకృతి అందాలను చూసి పరవశించిపోతారు. ఇంతటి ప్రాశస్త్యం, ప్రత్యేకతలున్న దేవాలయంపై అధికారులు నిర్లక్ష్యం కనబరుస్తుండడంతో అభివృద్ధి జరగక, సరైన సౌకార్యాలు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రామయ్య వనవాసం చేసిన సమయంలో కీలక ఘట్టాల ఇతివృత్తాన్ని తెలియచేసేలా పర్ణశాల ఆలయ ఆవరణలో విగ్రహాలు, కుటీరాన్ని ఏర్పాటు చేశారు. అయితే, రానురాను అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపంతో ఇక్కడి విగ్రహాలు రంగు వెలిసిపోయి కళావిహీనంగా దర్శనమిస్తున్నాయి. లక్ష్మణుడి విగ్రహం రెండు ముక్కలు కాగా అక్కడి నుంచి తొలగించారు. అలాగే, సీతమ్మ–రామయ్య కలిసి ఉన్న విగ్రహంలో రాముడి చేతిలో ఉన్న బాణం సగం విరిగిపోయింది. ఇక పది తలల రావణుడి విగ్రహం రంగు వెలిసిపోగా.. సీతమ్మ బొటన వేలు విరిగిపడిపోయింది. సుదూర ప్రాంతాల నుంచి రామయ్యను దర్శించుకోవడానికి వచ్చే భక్తులు ఇక్కడి పరిస్థితులను చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచవటి కుటీరంలో బొటన వేలు విరిగిన సీతమ్మ విగ్రహం ఏటా రూ.కోటి ఆదాయం పర్ణశాల దేవాలయానికి వివిధ రకాల వేలం పాటల ద్వారా ఏటా రూ.కోటి వరకు ఆదాయం సమకూరుతోంది. అయినప్పటికీ ఎలాంటి అభివృద్ధి చేయకపోగా, శ్రీరామనవమి, ముక్కోటి ఉత్సవాలను తూతూమంత్రంగా నిర్వహిస్తున్నారనే ఆరోపణలు గ్రామస్తుల నుంచి వస్తున్నాయి. పర్ణశాల గ్రామానికి చెందిన వ్యక్తిని భద్రాద్రి ఆలయ పాలక మండలిలోకి తీసుకుంటే తప్ప ఆలయ అభివృద్ధి సాధ్యం కాదనే భావన వ్యక్తమవుతోంది. అరకొర సిబ్బందే.. పర్ణశాల రామాలయాన్ని సిబ్బంది కొరత వేధిస్తోంది. ఆలయంలో నలుగురు అర్చకులకు గాను ముగ్గురే విధులు నిర్వర్తిస్తున్నారు. మరొకరిని భద్రాచలం నిత్యాన్నదాన సత్రానికి డిప్యుటేషన్‌పై పంపించారు. ఇక దేవాలయానికి సరిపడా స్థలం ఉన్నందున రాత్రివేళ భక్తులు బస చేసేలా కాటేజీలు నిర్మిస్తే అటు పర్యాటకులకు సౌకర్యంగా ఉండడంతోపాటు ఆదాయం కూడా పెరుగుతుంది. దీనికి తోడు వ్యాపార వృద్ధి కూడా జరుగుతుందని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. సమయపాలన పాటించడం లేదు ఆలయానికి వచ్చే సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. ఏదో మొక్కుబడిగా వచ్చి వెళ్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే దీనికి ప్రధానం కారణం. ఆలయ ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటుచేస్తేనే సిబ్బంది ప్రవర్తనలో మార్పు రావొచ్చు. – గోసంగి నరసింహారావు, గ్రామస్తుడు, పర్ణశాల కాటేజీలు నిర్మిస్తే బాగుండు పర్ణశాల ఆలయ ప్రాంతంలో కాటేజీలు నిర్మిస్తే సుదూర ప్రాంతా ల భక్తులు రాత్రిపూట బస చేసేందుకు అవకా శం ఉంటుంది. కానీ ఇక్కడ కాటేజీలకు తోడు కనీస సౌకర్యాలు లేకపోవడంతో వచ్చి వెంటనే వెళ్లిపోవాల్సి వస్తోంది. – శివ కోటేశ్వరి, భక్తురాలు, గుంటూరు జిల్లా చిల్డన్స్ పార్క్, గార్డెన్ ఏర్పాటు చేయాలి పర్ణశాల ఆలయ ప్రాంగణంలో భక్తులు, పిల్లలు సేద తీరేలా చిల్డ్రన్స్ పార్క్, గార్డెనింగ్ ఏర్పాటు చేయాలి. దర్శనం అనంతరం కొంచెంసేపు కాలక్షేపం చేద్దామంటే గోదావరి బోట్ షికార్ తప్ప మరేవి కనిపించడం లేదు. ఆలయ అభివృద్ధిపై అధికారులు దృష్టి సారించాలి. – శ్రీకాంత్, భక్తుడు, జమ్మికుంట -
సీత కోసం ఆ హీరోయిన్స్‌ని సంప్రదించలేదు
బాలీవుడ్లో రామాయణం ఆధారంగా సీత దృక్కోణంలో సాగే కథతో ‘సీత: ది ఇన్కార్నేషన్’ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి కేవీ విజయేంద్రప్రసాద్ కథ అందిస్తుండగా, అలౌకిక్ దేశాయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో సీత పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కరీనా కపూర్, దీపికా పదుకొనేని మూవీ టీం సంప్రదించినట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే అది రూమర్ మాత్రమేని లిరిసిస్ట్, స్క్రీన్ ప్లే రైటర్ మనోజ్ ముంతాశిర్ తెలిపాడు. ఈ సినిమా క్యాస్టింగ్ గురించి ఓ ఇంటర్వూలో మాట్లాడిన మనోజ్ ‘ఈ సినిమాలో సీత పాత్రకు సంబంధించి స్కెచ్‌లు వేశాం. ఆ విధంగా చూస్తే కంగనానే సరిగ్గా సరిపోతుంది. ప్రేక్షకులు మూవీని చూసిన తర్వాత ఈ పాత్రలో ఆమెను తప్ప ఎవరిని ఊహించుకోలేరు. అంతగా ఆమె సెట్ అయ్యింది. ఇతర హీరోయిన్స్‌ని మూవీ టీం సంప్రదించిందని ప్రచారంలో ఉంది. అది నిజం కాదు’ అని తెలిపాడు. మరోవైపు కరీనా ఈ పాత్ర చేయడానికి ఎక్కువ మొత్తం పారితోషికం అడిగిందని పుకార్లు రావడంతో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరిగిన విషయం కూడా విదితమే. అయితే ఓ ఇంటర్వూలో బెబో మాట్లాడుతూ పురుషులతో సమానంగా మహిళలకు ఎందుకు ఇవ్వరని, ఇది స్త్రీల గౌరవానికి సంబంధించిన విషయమని తెలిపింది. అనంతరం ‘సీత: ది ఇన్కార్నేషన్’తోపాటు హృతిక్ రోషన్ ముఖ్యపాత్రలో నితేశ్ తివారి నిర్మించనున్న ‘రామాయణ’లోనూ సీతగా దీపిక పదుకొణె నటించనున్నట్లు రూమర్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు అలాకిక్ సినిమాలో దీపిక నటించట్లేదని కన్ఫార్మ్ అయిపోయింది. ఇక బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తున్నట్లు ఇటీవలె ప్రకటించిన విషయం తెలిసిందే. -
‘సీత’గా వస్తున్నది కరీనా కాదు.. నెక్ట్స్ సినిమాపై క్లారీటీ ఇచ్చిన కంగనా
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ‘తలైవి’. ఇటీవలై విడుదలైన ఈ మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. జయలలితగా కంగనా నటన విమర్శకుల ప్రశంసలు పొందింది. కాగా తన తదుపరి చిత్రాన్ని సోషల్ మీడియా వేదికగా మంగళవారం ప్రకటించింది కంగనా. రామాయణ కథ ఆధారంగా సీత పాత్ర ప్రధానంగా సాగే ‘సీత: ది ఇన్కార్నేషన్’ సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తున్నట్లు ఆమె తెలిపింది. ‘ఇలాంటి టాలెంటెడ్ టీంతో పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. జై సీతారామ్’ అని ఆమె క్యాప్షన్ జత చేసింది. పిరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘సీత: ది ఇన్కార్నేషన్’కి స్క్రీన్ రైటర్ కేవీ విజయేంద్ర ప్రసాద్ కథ అందించగా.. అలౌకిక్ దేశాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సీత పాత్ర కోసం మూవీ టీం మొదట కరీనా కపూర్‌ని సంప్రదించింది. కానీ బెబో ఎక్కువ పారితోషికం డిమాండ్ చేయడంతో ఆమె బదులు కంగనాను ఫైనల్ చేసింది. కాగా ఎంతో పవిత్రమైన సీత పాత్ర చేయడానికి కంగనా ఒప్పుకోవడం ఆనందనిచ్చిందని దర్శకుడు మీడియాతో తెలిపాడు. ఈ మూవీ మనం పురాణాలను చూసే విధానాన్ని మార్చుతుందని అలౌకిక్ చెప్పాడు. హిందీతోపాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రాన్ని ఏ హ్యూమన్ బీయింగ్ స్టూడియో నిర్మించనుంది. View this post on Instagram A post shared by Kangana Thalaivii (@kanganaranaut) -
భారీ రెమ్యునరేషన్‌పై నెటిజన్ల ట్రోలింగ్.. రిప్లై ఇచ్చిన కరీనా
బాలీవుడ్లో కరీనా కపూర్ ఖాన్‌కి ఉన్న క్రేజ్ తెలిసిందే. సైఫ్ అలీ ఖాన్‌తో పెళ్లి తర్వాత కూడా ఈ అమ్మడు డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదు. కాగా రామాయణం ఆధారంగా సీత పాత్ర కోణంలో ‘సీత: ది ఇంకార్నేషన్’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అలౌకిక్ దేశాయ్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో టైటిల్ రోల్ పోషించడానికి కరీనా ఏకంగా రూ.12 కోట్లు డిమాండ్ చేసిందని సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్‌కు గుర్తెంది. కరీనా గతంలో ఓ ప్రముఖ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వూలో ‘మైథాలజికల్ మూవీలో సీత పాత్ర పోషించడానికి రూ.12 కోట్లు డిమాండ్ చేశారంటా కదా?’ అని యాంకర్ అడిగింది. అందుకు బదులుగా కరీనా ఏం ఆలోచించకుండా ‘అవును’ అంది. దీంతో మైథాలజికల్ పాత్ర చేయడానికి అంత ఎక్కువ డిమాండ్ చేస్తారా అంటూ నెటిజన్లు విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ విషయంపై తాజాగా కరీనా ఓ ఇంటర్వూలో స్పందిస్తూ.. ఈ డిమాండ్ పారితోషికం విషయంలో కాదని, మహిళల గౌరవానికి సంబంధించిందని తెలుపుతూ.. ‘ సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించే హీరోహీరోయిన్ల పారితోషికాల్లో ఎంతో వ్యత్యాసం ఉంటుంది. ఈ విషయంలో గతంలో ఎవరు మాట్లాడేవారు కాదు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. దీని గురించి అందరూ మాట్లాడుతున్నారు’ అని చెప్పింది. ఈ విషయంలో తాప్సీ పన్ను, ప్రియమణి వంటి నటీమణులు కరీనాకి మద్దతుగా నిలిచారు. ఎవరైనా నటుడు ఎక్కువ పారితోషికం డిమాండ్ చేస్తే ఇలా అనేవారు కాదని వారు ప్రశ్నించారు. కాగా ఓం రౌత్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ‘ఆదిపురుష్’లో కరీనా భర్త సైఫ్ అలీఖాన్ రావణాసురుడి పాత్రలో నటిస్తుండడం విశేషం. -
ద్రౌపది, సీత పాత్రల్లో అలరించనున్న దీపికా పదుకోన్!
అనుకున్నట్లు అన్నీ కుదిరితే దీపికా పదుకోన్‌ని ప్రేక్షకులు సీత, ద్రౌపది పాత్రల్లో చూసే అవకాశం ఉంది. ఇప్పటికి ద్రౌపది పాత్ర ఖరారైంది. సీత పాత్ర ఖరారు కావాల్సి ఉంది. ఒకవేళ ఈ రెండు పాత్రలూ దీపికా చేస్తే.. రెండు పౌరాణిక పాత్రల్లో నటించిన ఘనత దీపికాకే దక్కుతుంది. ఇక విషయంలోకి వస్తే.. దీపికా పదుకోన్ కథానాయికగా రెండేళ్ల క్రితం ‘మహాభారత’ సినిమా ప్రకటన వచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. రెండేళ్లయినా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కకపోవడంతో ‘మహాభారత’ ఆగిందనే వార్తలు ప్రచారంలోకొచ్చాయి. ఈ వార్తలకు చిత్రనిర్మాత మధు మంతెన ఫుల్స్టాప్ పెట్టారు. ‘‘దీపికాకు ఈ కథ నచ్చి, నటించడంతో పాటు నిర్మాణ భాగస్వామిగా కూడా ఉండాలనుకున్నారు. ద్రౌపది దృష్టి కోణం నుంచి మహాభారతాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. పురాణాలు చెబుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అందుకే చాలా పరిశోధనలు చేసి, సమాచారం సేకరించాం. ఇప్పుడు స్క్రీన్‌ప్లేకి కావాల్సిన సమాచారం మా దగ్గర ఉంది. అయితే ఈ సినిమాకి టైమ్ పడుతుంది. ఈలోపు ‘రామాయణ’ మొదలుపెడతాం. అయితే ఇంకా నటీనటులను అనుకోలేదు. రానున్న దీపావళికి ‘రామాయణ’ నటీనటులను ప్రకటించాలనుకుంటున్నాం’’ అన్నారు. అయితే ‘రామాయణ’లో సీత పాత్రను దీపికా చేయనున్నారనే వార్త ఉంది. అలాగే స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ‘సీత: ది ఇన్కార్నేషన్’ కథ రాస్తున్నారు. ఈ సినిమాలో సీతగా దీపికా నటిస్తారనే టాక్ కూడా ఉంది. ఈ రెండు సినిమాల్లో ఏ ఒక్కదాంట్లో అయినా సీతగా ఆమె నటిస్తే.. అటు ద్రౌపదిగానూ ఇటు సీతగానూ నటించిన ఘనత దీపికాకు దక్కుతుంది. -
#BoycottKareenaKhan: ఏం జరుగుతోందంటే..
ఒక సినిమా కోసం ఫలనా హీరో, ఫలానా హీరోయిన్ ఊహించని రేంజ్లో రెమ్యునరేషన్ తీసుకోవడం అభిమానులకు ‘వావ్’ అనిపించొచ్చు.కానీ, కరీనా కపూర్ రెమ్యునరేషన్ డిమాండ్‌పై మాత్రం ‘ఛీ’ అనే బదులు వస్తోంది. సీత మీద తీయబోయే సినిమాలో లీడ్ రోల్ కోసం ఆమె నిర్మాతలను భారీగా డిమాండ్ చేసిందన్న పుకార్లు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో కొందరు పనిగట్టుకుని #BoycottKareenaKhan ను ట్రెండ్ చేస్తున్నారు. ఆమె హిందువుల మనోభావాల్ని దెబ్బతీసిందని, ఆమె చర్య ఒక మాయని మచ్చ అని వెరైటీగా #BoycottKareenaKhan హ్యాష్‌ట్యాగ్‌తో మండిపడుతున్నారు. ఈ ట్యాగ్ శనివారం ఉదయం నుంచి ట్విట్టర్లో ట్రెండ్ నడుస్తోంది. మరికొందరేమో కరీనా కంటే కంగనా బెస్ట్ ఛాయిస్ అని కామెంట్లు పెడుతుండగా, ఇంకొందరేమో సీత కంటే శూర్పణక క్యారెక్టర్ సరిపోతుందంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇక మరికొందరేమో అప్పట్లో తాండవ్తో ఆమె భర్త సైఫ్, ఇప్పుడు కరీనా ఖాన్ హిందువుల్ని హర్ట్ చేశారంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే అలౌకిక్ దేశాయ్ దర్శకుడిగా ‘సీత’ రూపుదిద్దుకోనుంది. ఈ మూవీకి ప్రముఖ సినీ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ స్టోరీ అందించనున్నట్లు తెలుస్తోంది. సీత నేపథ్యం ప్రధానంగా ఈ మూవీ తెరకెక్కబోతున్నట్లు సమాచారం. చదవండి: సుశాంత్-సారా బ్రేకప్‌కి కారణం వీళ్లే! -
Sita Vasuniya: చేనేత సీతమ్మ
ఫ్యాషన్ ప్రపంచం ప్యారిస్ అంటారు కానీ, ఫ్యాషన్‌కి ఇప్పుడు ఇటలీ కూడా. ‘వోగ్’ మాస పత్రిక పేరు వినే ఉంటారు. ఆ అమెరికన్ పత్రికకు ఇటలీలో ఒక ఎడిషన్ ఉంది. ‘వోగ్ ఇటాలియా’. ఫ్యాషన్, లైఫ్ స్టయిల్ రెండూ ఉంటాయి అందులో. ఒక్క ఇటలీవే కాదు. ఫ్యాషనబుల్‌గా ఉన్న ఏ దేశంలోని మహిళ అయినా, ఆఖరికి ఆమె ఆదిమవాసీ మహిళ అయినా.. ఆమె ధారణలో అత్యాధునికత కనిపిస్తూ ఉంటే ఆమె అందులో ప్రత్యక్షం అవుతుంది! వోగ్ ఇటాలియా తాజా సంచికలో సీతా వసూనియా కనిపించింది కూడా అందుకే. ఆమె ధరించిన చీర ఆమె నేసిందే. పైకి సాదాసీదాగా ఉన్న ఆ చీర ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలో కొత్త షో కేస్ డిజైన్ అయింది! సీత మధ్యప్రదేశ్‌లోని ఓ గిరిజన గూడెం యువతి. తను, తన చేనేత, స్వయం సహాయ బృందంలోని తన తోటివారు... ఇదే ఆమె ప్రపంచం. ఆ ప్రపంచంలో జీవనం, జీవితం తప్ప ఫ్యాషన్ అనే మాట ఉండదు. జీవనం అంటే బతుకు తెరువు. జీవితం అంటే లైఫ్ స్టైల్. అంటే.. కష్టపడం, ఇంటికి చేదోడు అవడం. పశ్చిమ మధ్యప్రదేశ్‌లోని వీలాంచల్ ప్రాంతంలోని ఆదివాసీ మహిళలు ఎలా ఉంటారో సీత కూడా వేరే మాట లేకుండా అలాగే ఉంటుంది కానీ.. ఇప్పుడు మాత్రం ఆ ప్రాంతంలో ఆమె ఒక విశేషం అయింది. ఆ ప్రాంతంలోనే కాదు. ఇండియాలో, ఇటలీలో, అమెరికాలో.. ఇంకా అనేక ఆధునిక దేశాలలో ఆమె ధరించిన చీర ఫ్యాషన్‌కు సరికొత్త ప్రతీక అయింది. తను కట్టుకోడానికి నేసుకున్న చీర తనకొక గుర్తింపును కట్టబెట్టింది! ఇంతలా గుర్తింపు రావడానికి కారణం.. ఆమె జీవితంలో ఎలాంటి ప్రాముఖ్యమూ లేని ఒకానొక రోజు. ఆ రోజు జరిగిన ఒక ఘటనే.. రెండేళ్ల కొడుకున్న ఈ యువ మాతృమూర్తిని ‘ఎంపవరింగ్ సెలబ్రిటీ’గా మార్చేశాయి. వోగ్ ఇటాలియా పత్రికలో వచ్చిన ఫొటోలో ఆమె మహేశ్వరం చేనేత అద్దకం చీర ధరించి ఉన్నారు. ఆ ఫొటోను తీసింది ఢిల్లీలో పేరున్న ఓ ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్. ధార్ జిల్లాలోని పర్యాటక స్థలం ‘మండు’లో ఆ ఫొటోగ్రాఫర్ కెమెరా పట్టుకుని తిరుగుతున్నప్పుడు అదే చోట స్వయం సహాయ బృందంలో సీత కనిపించింది. కనిపించడం కాదు. సీత ఉండేదే అక్కడ. ధార్ జిల్లాలోని పనల గ్రామ్ సీతది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆత్మ నిర్భర్ మిషన్ ఆధ్వర్యంలో మహిళల కోసం ప్రారంభించిన ‘ఏక్ జిల్లా ఏక్ ఉత్పాద్’ పథకంలో భాగంగా పదిమందిలో ఒకరిగా సీత ఆ రోజు ‘మండు’లో ఉంది. ఆ అదివాసీ యువతి చీరకట్టులోని అత్యాధునికతను ఆమె అనుమతితో తన కెమెరాలోకి షూట్ చేసుకున్నారు ఆ ఫొటోగ్రాఫర్. మండులోని రాణి రూపమతి మహల్ మ్యూజియం ఫొటో షూట్ జరిగింది. అది ఫిబ్రవరి నెల. ఆ వెంటనే మార్చి సంచికలో సీత ఫొటో వచ్చింది! ‘‘మండు కు మేమంతా శిక్షణ కోసం వచ్చాం. అప్పుడే ఆ ఫొటోగ్రాఫర్ నా ఫొటో తీసుకున్నారు. కానీ ఇలా నా ఫొటో ప్రపంచంలో అందరూ చూసే పుస్తకంలో వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. మా ఊళ్లోకొచ్చే వార్తా పత్రికల్లోని గ్రూప్ ఫొటోల్లో కూడా నేను ఏ రోజూ రాలేదు’’ అని సంభ్రమంగా అంటోంది సీత. మండులో వారికి లభించిన శిక్షణ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఆర్ట్, బాగ్ ప్రింట్, ఆ ప్రాంతానికే ప్రత్యేకమైన ధారానేత.. మొదలైన వాటి మీద. వాటిని ధ్యాసగా నేర్చుకుంటున్న సీతలో ఆ రోజు ఆమె కట్టుకున్న చీర ఫొటోగ్రాఫర్‌కి నచ్చింది. చివరికి సీతకు పేరు తెచ్చింది. సీత ఒక్కరే కాదు. ఇక ముందు ప్రాంతంలోని చేనేతలన్నిటికీ ప్రాచుర్యం తేచ్చే ప్రయత్నాలు మొదలు పెడతాం. ఇందుకు ప్రేరణ మాత్రం మాకు ‘వోగ్ ఇటాలియా’ లో వచ్చిన సీత ఫొటోనే’’ అంటున్నారు ధార్ జిల్లా అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ సలోనీ సిదానా. -
పవిత్రతా స్వరూపిణి సీత
భారతదేశంలో వివాహితుడు భార్య ప్రక్కన ఉంచుకోకుండా ఏ క్రతువు, వ్రతము చెయ్యకూడదు. భార్య భర్త ప్రక్కన ఉండాలి. సహధర్మచారిణి అనేది పత్నికి వాచకం. గృహస్థుడు అనుష్ఠించాల్సిన కర్మకలాపాలు వందల. సంఖ్యలో ఉన్నాయి. కానీ భార్య లేకపోతే సక్రమంగా ఏ కర్మ చెయ్యడానికి శాస్త్ర ప్రకారం అతడికి అర్హత లేదు. రాముడి భార్య బహిష్కరింపబడ్డ కారణంగా ఆమె అతని ప్రక్కన లేదు. కాబట్టి ప్రజలు రాముణ్ణి పునర్వివాహం చేసుకోమన్నారు. " అలా ఎన్నటికీ జరగదు.నా జీవితం సీతదే." అన్నాడు రాముడు. రాజుగా అతడు ప్రజల కోరికను ప్రతిఘటించడం ఇదే మొదలు. యజ్ఞనిర్వహణార్థం అప్పుడు సీతాదేవికి బదులుగా బంగారంతో ఒక సీత ప్రతిమను రూపొం దించారు. రాముడు నైమిశారాణ్యంలో అశ్వమేధ యాగం చేసాడు.ఆ యజ్ఞానికి వాల్మీకి మహర్షి శిష్య సమేతంగా వెళ్ళాడు. వాల్మీకి కుశలవులను రామాయణాన్ని గానం చేయమని ఆదేశిం చాడు. రామాయణాన్ని విన్న రాముడు వారుసీత పుత్రులే అని నిశ్చయించుకున్నాడు. సీత తన శుద్ధిని తన నిర్దోషిత్వాన్ని ఋజువు చేసే శపథం చేయాలని దూతల ద్వారా కబురు పంపాడు. వాల్మీకి వెంట సీత సభలో ప్రవేశించింది. సీత చేయబోయె శపథాన్ని వినటానికి వచ్చిన వివిధ వర్గాల ప్రజలతో ఆ సభ కిక్కిరిసిపోయింది. వాల్మీకి తన తపస్సు సాక్షిగా సీత పరిశుద్ధు రాలని ఉద్ఘోషించాడు. సీత సౌశీల్యం తనకుతెలుసని అయినా లోకాపవాదానకి వెరసితాను సీతను పరిత్యజించినట్లు అంగీకరిం చాడురాముడు.ఈ కలవలిద్దరు తన బిడ్డలేనన్నాడు. సీత త్రికరణశుద్ధిగా తాను రాముడిని పూజించి నట్లయితే వివరమిమ్మని భూదేవిని ప్రార్థించింది మనసా కర్మణా వాచా యథా రామం సమర్చయే । తథామే మాధవీ దేవి వివరం దాతుమర్హతి ॥ అప్పుడు భూమి విచ్చుకుంది. " ఇదిగో ఋజువు " అంటూ సీత భూమిఒడిలోచేరింది. భూదేవి సీతను సింహాసనంపై కూర్చోబెట్టుకొని రసాతలానికి వెళ్ళిపోయింది. ఈ విషాద పర్యవసానానికి ప్రజలు నిర్వీణ్ణులయ్యారు. రాముడు శోక సముద్రంలో మునిగి పోయాడు. సీతాదేవి పాతివ్రత్యమే! పవిత్రతా సరూపమే! ఆమె తన భర్త దేహాన్ని తప్ప మరొకరి దేహాన్పి స్పృశించదు. "పాతివ్రత్యమే ఆమె పరిశుద్ధత"అని రాముడన్నాడు. సీత అనే మాట భారత దేశంలో శుభం, పరిశుద్ధం,పవిత్రమైనవాటికెల్లా పర్యాయపదం,ఆమె సకల సద్గుణాలరాశి. సీత క్షమాశీలి,సర్వదా పరిశుద్ధ వర్తనం ఉన్న అర్థాంగి! అంతటి బాధను అనుభవిస్తున్నారాముని గురించి ఒక్క పరుషమైన వాక్కు కూడా పలకలేదు. సీత ఏనాడూ హానికి ప్రతిహాని తలపెట్ట లేదు.ప్రతి స్త్రీ సీతాదేవి అవడానికి ప్రయయ్నంచుగాక! - గుమ్మా ప్రసాద రావు -
పవిత్రతా స్వరూపిణి సీత
భారతదేశంలో వివాహితుడు భార్య ప్రక్కన ఉంచుకోకుండా ఏ క్రతువు, వ్రతము చెయ్యకూడదు. భార్య భర్త ప్రక్కన ఉండాలి. సహ ధర్మచారిణి అనేది పత్నికి వాచకం. గృహస్థుడు అనుష్ఠించాల్సిన కర్మకలాపాలు వందల. సంఖ్యలో ఉన్నాయి. కానీ భార్య లేకపోతే సక్రమంగా ఏ కర్మ చెయ్యడానికి శాస్త్ర ప్రకారం అతడికి అర్హత లేదు. రాముడి భార్య బహిష్కరింపబడ్డ కారణంగా ఆమె అతని ప్రక్కన లేదు. కాబట్టి ప్రజలు రాముణ్ణి పునర్వివాహం చేసుకోమన్నారు. " అలా ఎన్నటికీ జరగదు.నా జీవితం సీతదే." అన్నాడు రాముడు. రాజుగా అతడు ప్రజల కోరికను ప్రతిఘటించడం ఇదే మొదలు. యజ్ఞ నిర్వహణార్థం అప్పుడు సీతాదేవికి బదులుగా బంగారంతో ఒక సీత ప్రతిమను రూపొం దించారు. రాముడు నైమిశారాణ్యంలో అశ్వమేధ యాగం చేసాడు. ఆ యజ్ఞానికి వాల్మీకి మహర్షి శిష్య సమేతంగా వెళ్ళాడు. వాల్మీకి కుశలవులను రామాయణాన్ని గానం చేయమని ఆదేశిం చాడు. రామాయణాన్ని విన్న రాముడు వారు సీత పుత్రులే అని నిశ్చయించుకున్నాడు. సీత తన శుద్ధిని తన నిర్దోషిత్వాన్ని ఋజువు చేసే శపథం చేయాలని దూతల ద్వారా కబురు పంపాడు. వాల్మీకి వెంట సీత సభలో ప్రవేశించింది. సీత చేయబోయె శపథాన్ని వినటానికి వచ్చిన వివిధ వర్గాల ప్రజలతో ఆ సభ కిక్కిరిసిపోయింది. వాల్మీకి తన తపస్సు సాక్షిగా సీత పరిశుద్ధు రాలని ఉద్ఘోషించాడు. సీత సౌశీల్యం తనకు తెలుసని అయినా లోకాపవాదానకి వెరసి తాను సీతను పరిత్యజించినట్లు అంగీకరిం చాడురాముడు.ఈ కలవలిద్దరు తన బిడ్డలేనన్నాడు. సీత త్రికరణశుద్ధిగా తాను రాముడిని పూజించి నట్లయితే వివరమిమ్మని భూదేవిని ప్రార్థించింది మనసా కర్మణా వాచా యథా రామం సమర్చయే । తథామే మాధవీ దేవి వివరం దాతుమర్హతి ॥ అప్పుడు భూమి విచ్చుకుంది. " ఇదిగో ఋజువు " అంటూ సీత భూమి ఒడిలోచేరింది. భూదేవి సీతను సింహాసనంపై కూర్చోబెట్టుకొని రసాతలానికి వెళ్ళిపోయింది. ఈ విషాద పర్యవసానానికి ప్రజలు నిర్వీణ్ణు లయ్యారు. రాముడు శోక సముద్రంలో మునిగి పోయాడు. సీతాదేవి పాతివ్రత్యమే! పవిత్రతా సరూపమే! ఆమె తన భర్త దేహాన్ని తప్ప మరొకరి దేహాన్పి స్పృశించదు. "పాతివ్రత్యమే ఆమె పరిశుద్ధత" అని రాముడన్నాడు. సీత అనే మాట భారత దేశంలో శుభం, పరిశుద్ధం,పవిత్రమైనవాటికెల్లా పర్యాయపదం, ఆమె సకల సద్గుణాలరాశి. సీత క్షమాశీలి,సర్వదా పరిశుద్ధ వర్తనం ఉన్న అర్థాంగి అంతటి బాధను అనుభవిస్తున్నా రాముని గురించి ఒక్క పరుషమైన వాక్కు కూడా పలకలేదు. సీత ఏనాడూ హానికి ప్రతిహాని తలపెట్ట లేదు.ప్రతి స్త్రీ సీతాదేవి అవడానికి ప్రయయ్నంచుగాక! -గుమ్మా నిత్యకళ్యాణమ్మ చదవండి: నమస్కారం ఎవరికి.. ఎలా? తెలివుండాలి...తెలిసుండాలి -
స్పేస్ ఎక్స్‌లో తొలి తెలుగమ్మాయి
పదిహేనుసార్లు మారథాన్ రన్.. పదిభాషల్లో ప్రావీణ్యం.. ఎనిమిది దేశాల్లో అమెరికన్ ఎంబసీల్లో కొలువు.. కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలు... కర్ణాటక సంగీత కచేరీలు... 22 ఏళ్ళకే ఇరాక్ యుద్ధ బంకర్లలో పని.. అమెరికాలో ఉంటూ ఇవన్నీ చేసి ఘనత సాధించారు సీత శొంఠి. ఆమె తెలుగు మహిళ. కోనసీమ మూలవాసి. ఇప్పుడు ప్రతిష్టాత్మక ‘స్పేస్ ఎక్స్’ మిషన్ హెడ్‌గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమెరికాలోని చికాగో లో ఉంటున్న సీత తల్లిదండ్రులతో ‘సాక్షి’ సంభాషించింది. ‘మా అమ్మాయి అమెరికాలోనే పుట్టినా భారతీయ సంప్రదాయాన్ని విడిచి పెట్టలేదు. పదహారు సంవత్సరాలు వచ్చేవరకు పూర్తి తెలుగుదనంతోనే పెంచాను. కాలేజీలలో చేరాక వారి దారిని వారు ఎంచుకున్నా కూడా తెలుగుని విడవలేదు’ అంటారు సీత తల్లి శారదాపూర్ణ శొంఠి. తండ్రి శ్రీరామ్ శొంఠిది తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం. ఆంధ్ర యూనివర్సిటీలో ఎంబిబిఎస్ చదివారు. హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ సహ వ్యవస్థాపకులు కూడా. 1975లో అమెరికా వలస వెళ్ళారు. తల్లి శారదాపూర్ణ శొంఠి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు ఎంఏ చేశారు. తెలుగులో అన్నమాచార్య నృత్య సంగీత కళాభిజ్ఞత మీద, సంస్కృతంలో లక్షణ గ్రంథాల మీద పరిశోధన చేశారు. విలక్షణంగా చెప్పటం వల్లనే... అమెరికాలోని ప్రఖ్యాత ఆమెహెస్ట్ కాలేజీలో అండర్ గ్రాడ్యుయేషన్‌కి చేరడానికి వెళ్ళినప్పుడు ఎందుకు ఇక్కడ చేరాలనుకుంటున్నావు అని సీతను ప్రశ్నించారు. ‘మా అమ్మనాన్నలు నన్ను డాక్టర్ లేదా ఇంజనీర్ చదివించాలనుకుంటున్నారు. నాకు ఏదైనా విభిన్నంగా చేయాలని ఉంది. అందువల్ల డిఫరెంట్ ఫీల్డ్ ఏదో మీరే సజెస్ట్ చేయండి. ఏదైనా కొత్తగా సాధించాలనుకుంటున్నాను’ అని సీత చెప్పిన సమాధానం అధ్యాపకులను ఆకట్టుకుంది. ఆమెకు ఆ కాలేజీలో ప్రవేశం లభించింది. పొలిటికల్ ఎకనామిక్స్‌లో అండర్ గ్రాడ్యుయేషన్ చేశాక స్టేట్ డిపార్ట్మెంట్లో పనిచేయాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఆమె ఆసక్తిని తెలుసుకున్న ప్రొఫెసర్ ‘మిడిల్ ఈస్ట్‌లో రాజకీయాలనూ అక్కడి పరిస్థితులను అధ్యయనం చెయ్. అధ్యయనం తేలికగా ఉండడానికి అరబిక్ నేర్చుకోమ’ని సలహా ఇచ్చారు. వారి సూచన మేరకు సీత తెలుగు, హిందీ, ఫ్రెంచ్, అరబిక్... మొత్తం పది భాషలు నేర్చుకున్నారు. తల్లిదండ్రులు, సోదరి, పిల్లలతో సీత తొలి తెలుగమ్మాయి స్కూల్ ఫర్ అడ్వాన్స్డ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (ఎస్ఏఐఎస్)లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాక స్టేట్ డిపార్ట్మెంట్లో చేరారు. ఆ డిపార్ట్మెంట్లో ఎంపికైన మొట్టమొదటి తెలుగమ్మాయి సీత. ఈజిప్టు, లిబియా, సిరియా, క్రొయేషియా, లెబనాన్, ఆఫ్రికా, ఆప్ఘనిస్థాన్ వంటి దేశాలలోని అమెరికన్ ఎంబసీలలో పని చేశారు సీత. చిన్నప్పటి నుంచి అడ్వెంచరస్‌గా ఉండటం సీతకు ఇష్టం. ‘ఆ సాహసమే సీతను అత్యున్నత స్థాయికి చేర్చింది’ అంటారు ఆమె తండ్రి. యుద్ధ సమయంలో ఇరాక్‌లోనే.. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో గ్రీన్ జోన్లో అంటే కంటోన్మెంట్ ఏరియాలో సైనికులతో పాటు బంకర్ల దగ్గర పని చేశారు సీత. అమెరికా–ఇరాక్ యుద్ధ సమయంలో యుద్ధంలో మరణించిన 150 మందికి మణికట్టుకి బ్యాండ్ కట్టి, వారి వివరాలను అమెరికాకు తెలియచేశారు సీత. అప్పుడు ఆమెకు 22 సంవత్సరాలు. సీత అన్ని రకాల యుద్ధ విద్యలతోపాటు ఏకే 47 కాల్చడంలో కూడా శిక్షణ పొందారు. లిబియాలో గడాఫీ మరణించిన సమయంలో సీత అక్కడే ఉన్నారు. ‘అప్పటికి మా అమ్మాయికి ఇద్దరు పిల్లలు. బాగా చిన్నవాళ్లు కావటంతో నేను కూడా సీతతో పాటు అన్ని దేశాలు తిరిగాను. ఆమెకు సహాయంగా ఉన్నాను. ఆ సమయంలో అమ్మాయి చూపిన ధైర్యం చూసి నాకు ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా కలిగింది’ అన్నారు శారదా శొంఠి. పిల్లలు ఇద్దరు... సీతకు ఇద్దరు పిల్లలు. జయరామ్, ఆనంద. పిల్లల్ని చూసుకుంటూ ఆమె వృత్తిలో పురోగతి సాధిస్తున్నారు. ఆమెకు వంట కూడా బాగా వచ్చు. ఏ పదార్థాన్ని ఎంత, ఎలా తినాలి అనే విషయంలో అమితమైన శ్రద్ధ. పిల్లలకూ తానే వండి పెడతారు. ప్రతి ఆదివారం దేవాలయానికి తీసుకువెడతారు. పిల్లలు తెలుగు బాగా మాట్లాడతారు. స్పేస్ ఎక్స్ లాంచింగ్ స్టేషన్ వద్ద సీత సంగీత, నాట్య ప్రదర్శనలు సీత, సోదరితో కలిసి ఉమా రామారావుగారి వద్ద నాట్యం, నేదునూరి కృష్ణమూర్తిగారి దగ్గర సంగీతం నేర్చుకున్నారు. భారతీయ సంగీతం, పాశ్చాత్య సంగీతం, నాట్యం నేర్చుకుని ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలిచ్చారు. వరల్డ్ రెలిజియన్ కాన్ఫరెన్స్‌లో దలైలామా ముందు వేదమంత్రాలకు అనుగుణంగా నర్తించారు. శొంఠి సిస్టర్స్ పేరుతో భారతదేశంలో కూచిపూడి ప్రదర్శనలు ఇచ్చారు. మానస సరోవర్ నీళ్లు – గాంధీకి అభిషేకం సీత ఒకసారి మానస్ సరోవర్‌కి వెళ్లారు. ఆ సమయంలో వాళ్ళ బృందంలో ఉన్న 70 సంవత్సరాల పెద్దాయన అక్కడ అకస్మాత్తుగా కన్ను మూశారు. వెంటనే సీత ఆయన భౌతిక కాయాన్ని కిందకు తీసుకువచ్చి, దహనక్రియలు పూర్తిచేసి మళ్లీ మానస్ సరోవర్, కైలాస్గిరి దర్శించుకున్నారు. అక్కడ నుంచి వచ్చేటప్పుడు తల్లిదండ్రుల కోసమని ఒక గ్యాలన్ నీళ్లు తీసుకువచ్చారు. చికాగోలో గాంధీ విగ్రహం ప్రతిష్ఠించినప్పుడు ఈ నీటితోనే అభిషేకించారు. పదిహేనుసార్లు మారథాన్ రన్.. పదిభాషల్లో ప్రావీణ్యం.. ఎనిమిది దేశాల్లో అమెరికన్ ఎంబసీల్లో కొలువు.. కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలు... కర్ణాటక సంగీత కచేరీలు... 22 ఏళ్ళకే ఇరాక్ యుద్ధ బంకర్లలో పని.. అమెరికాలో ఉంటూ ఇవన్నీ చేసి ఘనత సాధించారు సీత శొంఠి. ఆమె తెలుగు మహిళ. కోనసీమ మూలవాసి. ఇప్పుడు ప్రతిష్టాత్మక ‘స్పేస్ ఎక్స్’ మిషన్ హెడ్‌గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమెరికాలోని చికాగో లో ఉంటున్న సీత తల్లిదండ్రులతో సంభాషించింది. – సంభాషణ: డాక్టర్ పురాణపండ వైజయంతి -
రూ.1500 కోట్ల బడ్జెట్ సినిమాలో నయనతార!
చెన్నై : నటి నయనతారను మరోసారి వెండితెరపై సీతగా చూసే అవకాశం ఉంటుందా? ఇందుకు అలాంటి అవకాశం లేకపోలేదంటున్నారు సినీ వర్గాలు. ప్రస్తుతం అగ్రతారగా వెలిగిపోతున్న నటి నయనతార. ఎన్నో విమర్శలు, అవమానాలు, అవరోధాలను అధిగమించి ఈ సంచలన నటి ఈ స్థాయికి చేరుకుందన్న విషయం తెలియందికాదు. తొలి దశలో అందాలనే నమ్ముకుని హీరోయిన్గా గుర్తింపు పొందిన నయనతార ఇప్పుడు కథానాయకి ప్రధాన పాత్రల నటిగా ఎదిగిపోయింది. ఇప్పుడు నయనతార నటించాలంటే ఆ పాత్రకు ప్రాముఖ్యత ఉండాల్సిందే. అలాంటి స్థాయిలో ఉన్న నయనతార ఇంతకు ముందు శ్రీరామరాజ్యం అనే తెలుగు చిత్రంలో సీతగా నటించింది. అయితే ఆ పాత్రకు ఎంపికైనప్పుడు చాలా మంది విమర్శించారు. నయనతార ఏమిటి సీతమ్మ పాత్రలో నటించడం ఏమిటి? అన్న వారికి ఆ పాత్రను తనదైన అభినయంతో జీవం పోసి మాటల్తో కాకుండా చేతలతో బదులిచ్చింది. అంతగా సీత పాత్రలో ఒదిగిపోయింది. ఆ విషయాన్ని అలా ఉంచితే నయనతారను మరోసారి సీతగా నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నది తాజా సమాచారం. వింటే రామాయణాన్నే వినాలి అంటారు. అంత గొప్ప పురాణ పురుషుడు శ్రీరాముడి చరితం ఆ ఇతిహాసం. రామాయణాన్ని ఎన్ని సార్లు ఎన్ని కోణాల్లో వెండితెరకెక్కించినా ప్రేక్షకులు చూసి పరవశం చెందుతూనే ఉంటారు.అలాంటి రామాయణాన్ని మరోసారి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్న వార్తలు ఇటీవల వింటూనే ఉన్నాం. అవును ప్రముఖ తెలుగు నిర్మాత అల్లు అరవింద్, హిందీ చిత్ర నిర్మాతలు మధు మంతేనా, నమిత్ మల్హోత్రాలతో కలిసి రామాయణం ఇతిహాసాన్ని మరోసారి కమనీయంగా వెండితెరపై ఆవిష్కరించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ మహా కావ్యాన్ని త్రీడీ ఫార్మెట్లో కనువిందుగా మూడు భాగాలుగా నిర్మించనున్నారు. దీనికి బాలీవుడ్ చిత్రం దంగల్ ఫేమ్ నితేశ్ తివారి, మామ్ చిత్రం ఫేమ్ ఉద్యఅవర్ కలిసి తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. దీన్ని ఒక్కో భాగాన్ని రూ.500 కోట్ల భారీ బడ్జెట్లో రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలా మూడు భాగాలకు రూ.1500 కోట్ల బడ్జెట్లో రూపొందించనున్నారన్నమాట. ఇంత భారీ బడ్జెట్లో తెరకెక్కనున్న భారతీయ చిత్రం ఇదే అవుతుంది. కాగా పౌరాణిక చిత్రాన్ని హిందీ, తమిళం, తెలుగు భాషల్లో రూపొందించడానికి ప్రణాళికను రచిస్తున్నారు. అయితే పలు భాషల్లో ఇది అనువాదం అయ్యే అవకాశం ఉంది. ఇకపోతే ఇందులో నటించే తారాగణం గురించి చర్చలు జరుగుతున్నాయి. అందులో సీత పాత్రకు నటి నయనతారను ఎంపిక చేయాలని చిత్ర యూనిట్ వర్గాలు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ అమ్మడితో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. అయితే తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న నయనతార ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో నటించడానికి కాల్షీట్స్ సర్దుబాటు చేయగలదా మరోసారి సీతగా మారనుందా అన్నదే చర్చనీయంగా మారింది. మూడు భాగాలుగా తెరకెక్కించనున్న ఈ రామాయణం చిత్ర తొలి భాగాన్ని 2021లో విడుదల చేయాలన్ని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. -
మేకప్ లేకుండా దర్శనమిచ్చిన ‘చందమామ’
ఆల్చిప్పల్లాంటి కళ్లతో అభిమానుల మనసుల్ని దోచుకుంది కాజల్ అగర్వాల్. యంగ్ హీరోయిన్స్ హవా కొనసాగుతున్న ఈ తరుణంలో కూడా కాజల్ తన జోరును చూపిస్తోంది. రీసెంట్గా సీత చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సీత పాత్రలో కాజల్ నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి. కాజల్ సోషల్ మీడియాలో నిత్యం తన అభిమానులతో టచ్‌లో ఉంటుంది. తాజాగా కాజల్ ఎలాంటి మేకప్ లేకుండా ఉన్న ఫోటోను షేర్ సుదీర్ఘమైన సందేశాన్ని పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ సారాంశం ఏంటంటే.. ‘జనాలు తమని తాము కనుగొనలేరు. ఎందుకంటే అందం.. గ్లామర్ ఎలివేషన్ ప్రపంచంలో మనం ఉన్నాం. సోషల్ మీడియా చెప్పేదే నిజం అని జనాల అభిప్రాయం. వందల కోట్ల సొమ్ముల్ని సౌందర్య సాధనాల కోసం.. బ్యూటీ ఉత్పత్తుల కోసం ఖర్చు చేస్తున్నాం. అందం పిచ్చి అన్నిచోట్లా ఉంది. మనం అసలైన ఆనందం పొందేది నిజాన్ని బయటకు చూపించినప్పుడే. మనలోని డిఫరెంట్ ఇమేజ్ ని ఈ ప్రపంచానికి చూపించినప్పుడే. మేకప్ వల్ల వచ్చే అందం అనేది బయటకు చూపించుకునేది మాత్రమే. అది మన క్యారెక్టర్ ని బయటకు చెబుతుందా? నిజమైన అందం మనం అంతర్గతంగా ఎంత లవ్ లీగా ఉంటామో దానివల్లనే వస్తుంది’ అని పేర్కొంది. -
ఆ సినిమా తీయకుండానే మంచి పేరు వచ్చింది
‘‘ఇండస్ట్రీలో శుక్రవారం నుంచి శుక్రవారానికి ఈక్వేషన్లు మారిపోతుంటాయి. శుక్రవారానికి నా సినిమా హిట్ అయితే నా తదుపరి సినిమాకు పెద్ద స్టార్ వస్తాడు. యావరేజ్‌గా ఆడితే యావరేజ్ స్టారే వస్తాడు. ఫ్లాప్ అయితే కొత్తవాళ్లతో సినిమా తీసుకోవడమే. ‘బెగ్గర్స్ కెనాట్ బీ చూజర్స్’ అనే సామెత ఉంటుంది ఇంగ్లీష్‌లో. అడుక్కునే వాడికి ఆప్షన్స్ ఉండవు అని. ప్రేక్షకుల నుంచి మన కొత్త చిత్రానికి వచ్చిన స్పందనే మన నెక్ట్స్ సినిమా అవుతుంది’’ అని దర్శకుడు తేజ అన్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ జంటగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సీత’. అనిల్ సుంకర నిర్మించిన ఈ చిత్రం గత శుక్రవారం రిలీజైంది. ఈ సందర్భంగా తేజ మీడియాతో పలు విశేషాలు పంచుకున్నారు. ► రామాయణానికి, మా కథకు ఏ సంబంధం లేదు. టైటిల్ సీత, కొన్ని డైలాగ్స్ చూసి అలా కొందరు ఊహించుకున్నారంతే. సీత పాత్ర ప్రస్తుత సమాజంలో ఉన్న ధన దాహం, పేరు కోసం పరిగెడుతున్న వారందరికీ ప్రతీక. న్యాయంగా, పద్ధతిగా ఉండాలి అనేది రామ్ పాత్ర తెలుపుతుంది. సమాజం ఎలా ఉండాలన్న దానికి ఉదాహరణ రామ్ అయితే ఎలా ఉంది అన్నది సీత పాత్రలో చూపించాను. రామ్, సీత ఇద్దరికీ మధ్య జరిగే క్లాషే ఈ చిత్రకథ. ► సీత అనే పాత్ర ప్రస్తుతం ఉన్న మనుషులందర్నీ ఉద్దేశించింది. కేవలం స్త్రీలని కాదు. గట్టిగా చెప్పాలంటే స్త్రీలు ఎంతో ఫార్వార్డ్ థింకింగ్‌తో ఉన్నారు. చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. కానీ మేమే సినిమాల్లో హీరోయిన్లను కేవలం హీరో వెనక పాటలు పాడుకునేట్టు చూపిస్తాం. దానికి కారణం మనం ఒక ఫార్మాట్ సినిమాకు అలవాటు పడి ఉండటమే. దీన్ని ఒకేసారి బద్దలుకొట్టడం కష్టం. మెల్లిమెల్లిగా జరగాలి. ► నా సినిమాలన్నింటికి రివ్యూస్ బావుండవు. ఆ విషయానికి నేను అలవాటు పడ్డాను. ‘సీత’ సినిమా కూడా ఫర్వాలేదని రివ్యూలు రాశారు. జనమైతే బావుంది అంటున్నారు. ‘నేనే రాజు నేనే మంత్రి’ కూడా రివ్యూలు డివైడ్‌గానే వచ్చాయి. కానీ సినిమా సక్సెస్ అయింది. మన ప్రోడక్ట్‌ను మనం జడ్జ్ చేయలేం. మనం ఒకటి అనుకుంటాం.. ఒకటి జరుగుతుంది. ప్రీ–రిలీజ్ వేడుకలో నేను తీసిన సినిమాను జడ్జ్ చేయడం నాకు రాదని చెప్పింది అందుకే. ఈ సినిమా ఆడుతుందో లేదో మనం చెప్పలేం. అదే తెలిస్తే ఎవ్వరం ఫ్లాప్ సినిమా తీయం కదా? తేజ దగ్గర నుంచి జేమ్స్ కామెరూన్ వరకూ ఎవ్వరూ ఫ్లా‹ప్ తీయాలనుకోరు. ► యాక్టర్స్ నుంచి బెస్ట్ రాబట్టాలంటే వాళ్లను ఆ పాత్ర మూడ్‌లోకి తీసుకెళ్లాలి. లేకపోతే యాక్టింగ్ అనేది కేవలం గొంతులో నుంచి వచ్చే డైలాగ్‌తో ఆగిపోతుంది. పాత్ర మూడ్‌లోకి వెళ్తే డైలాగ్ కడుపులో నుంచి వస్తుంది. ప్రతీ సీన్ ముందు యాక్టర్‌ని హిప్నటైజ్ చేయాలి. అప్పుడు యాక్టర్స్‌కి ఈజీ అవుతుంది. కొన్నిసార్లు యాక్టర్స్‌కి యాక్టింగ్ వచ్చినా ఒక గోడ కట్టుకొని లోపల ఉండిపోతారు. చాలా మంది దర్శకులు ఆ గోడ బయట నుంచే ఏదోటి చెప్పి చేయించేస్తుంటారు. నేను మాత్రం ఆ గోడ బద్దలు కొట్టి ఆ యాక్టర్‌ను బయటకు తీసుకొచ్చి నాకు కావాల్సినట్టు చేయించుకుంటాను. ► నాకు నా పాత సినిమా ఏది చూసినా ఇంకా బాగా చేసి ఉంటే బావుండు అనిపిస్తుంటుంది. మొన్న టీవీలో ‘నువ్వు–నేను’ సినిమా వస్తుంటే చూశా. మా ఎడిటర్‌కి ఫోన్ చేసి ‘క్లైమాక్స్‌లో హీరోయిన్ గోడ దూకే దగ్గర నాలుగు ఫ్రేములు తగ్గించొచ్చు కదా?’ అన్నాను. ‘ఊరుకోవయ్యా బాబు. ఆల్రెడీ ఆ సినిమా సూపర్ హిట్ అయిపోయింది’ అని సమాధానమిచ్చారు. నేనెప్పుడూ సంతృప్తి చెందను. ఇంకా బెటర్ చేయొచ్చు అనుకుంటాను. ► సినిమా కథ రాసుకున్నాక హీరో ఎవరైతే బావుంటుందని ఆలోచిస్తాను. ఈ పాత్రకు స్ట్రాంగ్ బాడీ ఉండి, అమాయకత్వం ఉండాలి. సాయి శ్రీనివాస్ బావుంటాడనిపించింది. హీరో కంటే విలన్ బలంగా ఉన్నప్పుడే కథ పండుతుంది. సమస్య పరిష్కరించలేని విధంగా ఉన్నప్పుడు, నువ్వు దాన్ని ఛేదిస్తేనే నీ పవర్ తెలుస్తుంది. హీరోయిజమ్ ఎలివేట్ అవుతుంది. హీరో ఆల్రెడీ చాలా స్ట్రాంగ్‌గా ఉండి విలన్ వీక్ అయితే సినిమా నిలబడదు. ► ఆడియన్స్ మూడ్ బట్టి సినిమాలు ఆడతాయి. సినిమా తీసేవాళ్లం సినిమాను కేవలం ఒక ప్రోడక్ట్లాగా చూస్తాం. ప్రేక్షకుడికి మాత్రం చాలా కారణాలుంటాయి. మొన్న శుక్రవారం ఇంకా ఎన్నికల మూడ్‌లోనే ఉండబట్టే మార్నింగ్ షోలు స్లోగా స్టార్ట్ అయ్యాయి. నైట్ షో నుంచి కలెక్షన్స్ పెరిగాయి. ► కథ మొదలయ్యాక పూర్తి అవ్వాలి. పూర్తయ్యే వరకూ ఉండేదే కథ. అది చూడకుండా క్యాలిక్యులేటర్ పట్టుకొని అది బావుంది, ఇది బాలే దు అని కూర్చొని లెక్కలు వేస్తే ఎలా? కామన్ ఆడియన్ మాత్రం సినిమా బావుండాలని ఆలోచనతో మాత్రమే వెళ్తాడు. మనం (రివ్యూ రైటర్స్‌ని ఉద్దేశిస్తూ) మాత్రం చెక్ చేయడానికి మాత్రమే వెళ్తాం. ఏది బాలేదో చూసి దర్శకుడి కంటే మనం గొప్ప అని నిరూపించుకోవడానికి సినిమా చూస్తాం. సినిమాను ఆస్వాదించాలి. సినిమానే కాదు జీవితాన్ని కూడా. పోలికలు ఆపేయాలి. ఆడు ఇది చేశాడు, ఈడు ఇది చేశాడని పోలికలు పెట్టుకుంటే కష్టం. అందుకే రివ్యూల కంటే ఆడియన్స్ ఏం చెబుతారన్నదే ముఖ్యం. ► నా సినిమాల్లో కథకు కావాల్సినంతే ఖర్చు పెడతాను. ప్రస్తుతం ఇండస్ట్రీ తప్పు దోవలో వెళ్లిపోతుందనిపిస్తుంది. బడ్జెట్ ఉందని ఖర్చు పెట్టకూడదు. కథ గుడిసె ఉండాలని అడిగితే గుడిసె ఉండాలి. బిల్డింగ్ ఉండకూడదు. దీనివల్ల ఖర్చు పెరిగి కథ బయటకు వెళ్లిపోతుంది. ► ప్రస్తుతం కొత్త దర్శకులు మంచి ఆలోచనలతో వస్తున్నారు. కొత్తోళ్లు వస్తే పాతోళ్లంతా పోతాం. అప్పుడే ఇండస్ట్రీ బెస్ట్ అవుతుంది. కొత్తవాళ్లు ఎలా వస్తారు? హై బడ్జెట్ సినిమాలతో కొత్తవాళ్లు రారు. అది కేవలం చిన్న సినిమాల వల్లే కుదురుతుంది. అందుకే చిన్న సినిమాలకు సపోర్ట్ ఇవ్వాలి. ఆదరించాలి. థియేటర్స్ ఇవ్వాలి. ► రామారావుగారికి న్యాయం చేయలేనని ‘ఎన్టీఆర్’ బయోపిక్ నుంచి తప్పుకున్నాను. ఆ సినిమా వదిలేసి వచ్చినందుకు చాలా మంది తప్పు చేస్తున్నావు అన్నట్టు చెప్పారు. రిలీజ్ అయ్యాక ‘మంచి పని చేశావు’ అన్నారు. మీడియా మాత్రం నన్ను పొగిడారు. ‘తేజ తీసి ఉంటే ఇంకా బాగా వచ్చేది’ అని. సినిమా తీయకుండా మంచి పేరు వచ్చింది. ► నేనెప్పుడూ అడ్వాన్స్డ్ సినిమాలే తీస్తుంటాను. ‘చిత్రం’ సినిమా ఇప్పటికీ రిలవెంట్గా ఉంటుంది. కొన్నిసార్లు నేనే స్క్రిప్ట్‌లో కొంచెం డోస్ తగ్గించుకుంటుంటా. ఇందులో కూడా కాజల్ – సోనూ సూద్ అగ్రిమెంట్ కాన్సెప్ట్ ఫస్ట్ వద్దన్నారు మా వాళ్లు. కానీ నేనే పెట్టించాను. బౌండెడ్ స్క్రిప్ట్ తీసుకొనే షూటింగ్‌కు వెళ్తాను. కామెడీ వరకు ఆన్ లొకేషన్లో మార్పులు చేర్పులు చేస్తుంటాం. ఎమోషన్స్‌ను మార్చను. మారిస్తే కథ మారిపోతుంది. ► నా మూడ్ బాలేక బాలకృష్ణ, వెంకటేశ్‌తో చేయాల్సిన రెండు సినిమాలు ఒకే రోజు వదిలేశా. ఆ సినిమాలు వదిలేశా అని బాధపడను. అదే కాదు ఏ విషయంలోనూ రిగ్రెట్ ఫీల్ అవ్వను. నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటో ఇంకా తెలియదు. ఈ సినిమా ఆడటాన్ని బట్టి ఉంటుంది. ► ‘తేజ కథలో ఎవ్వరూ చేయి పెట్టకూడదు, యాక్టర్స్‌ని కొడతాడు’ అని అనుకుంటారు. కానీ కథ గురించి టీమ్ అంతా కూర్చొని మాట్లాడుకుంటాం. సినిమా తీశాక కూడా నిర్మాతలకు చూపిస్తాను. మార్పులు చెబితే వింటాను. కొడతాడనే అభిప్రాయం కూడా ఒకందుకు మంచిదైంది. టైమ్‌పాస్ చేసేవాళ్లు రారు. సీరియస్‌గా, సిన్సియర్‌గా ఉండేవాళ్లే వస్తారు. ► మన జనాభా విపరీతంగా పెరిగిపోయింది. అందరికీ పని దొరకడం లేదు. దాంతో కొందరు సినిమాలను ఆపేయాలి, మా మనోభావాలు దెబ్బతిన్నాయి అన వివాదం చేయడానికి ఓ పనిగా పెట్టుకుంటున్నారు. పని ఉండి ఉంటే ఇవన్నీ పట్టించుకోడు ఎవ్వడూ. ఇండియాలో వెబ్సైట్లు చూస్తూ కూర్చునేవాళ్లు ఎక్కువ. అందుకే యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్ ఇండియా, చైనా మీద దృష్టి పెడుతుంటాయి. మేం తీసే పిచ్చివో, మంచివో సినిమాలకు కలెక్షన్స్ ఎందుకు ఇంత వస్తున్నాయి? ఎక్కువ మంది సినిమా చూస్తున్నారు కాబట్టే. ఖాళీగా ఉండేవాళ్లే మాకు దేవుళ్లు. -
‘సీత’ మూవీ రివ్యూ
టైటిల్ : సీత జానర్ : రొమాంటిక్ డ్రామా తారాగణం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, సోనూసూద్ సంగీతం : అనూప్ రుబెన్స్ దర్శకత్వం : తేజ నిర్మాత : రామబ్రహ్మం సుంకర ఇన్నాళ్లు మాస్ యాక్షన్ హీరోగా ప్రూవ్ చేసుకునేందుకు ప్రయత్నించి ఫెయిల్ అయిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సారి కొత్తగా ప్రయత్నించాడు. లేడి ఓరియంటెడ్ సినిమాగా తెరకెక్కిన సీత చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నేనే రాజు నేనే మంత్రి సినిమాతో ఘనవిజయం సాధించిన తేజ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సీత చిత్రంలో బెల్లంకొండ ఓ చాలెంజింగ్ రోల్లో కనిపించాడు. మరి ఈ సినిమా అయిన బెల్లంకొండకు ఆశించిన సక్సెస్ అందించిందా..? తేజ వరుసగా మరో సక్సెస్ సాధించాడా..? కథ : సీతా మహాలక్ష్మి (కాజల్ అగర్వాల్) డబ్బుకు తప్ప మనుషులకు, బంధాలకు ఏ మాత్రం విలువ ఇవ్వని పొగరుబోతు. తండ్రితో గొడవపడి సొంతంగా బిజినెస్ చేసి చిక్కుల్లో పడుతుంది. తను కొన్న ఓ స్థలం సమస్యల్లో ఉండటంతో లోకల్ ఎమ్మెల్యే బసవరాజు (సోనూసూద్) సాయం కోరుతుంది. అయితే బసవ అందుకు బదులుగా తనతో నెల రోజులు గడపాలని అగ్రిమెంట్ రాయించుకుంటాడు. అగ్రిమెంట్ ముందు ఒప్పుకున్న సీత, తన పని పూర్తయిన తరువాత కాదనటంతో వ్యాపరపరంగా సీతకు అడ్డంకులు సృష్టిస్తాడు బసవ. ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే తనకు డబ్బు కావాలి. కానీ సీత తండ్రి తన ఆస్తినంత భూటన్లో బాబాల దగ్గర పెరుగుతున్న రఘురామ్ (బెల్లంకొండ సాయి శ్రీనివాస్) పేరిట రాసేస్తాడు. దీంతో ఆస్తి కోసం రామ్‌ను కలుస్తుంది సీత. చిన్నతనంలో ‘సీతను నువ్వు చూసుకోవాలి, నిన్ను సీత చూసుకుంటుంది’ అని మామయ్య చెప్పిన మాటలకు కట్టుబడిన రామ్, సీతతో సిటీ వచ్చేస్తాడు. అలా వచ్చిన సీతా రామ్‌లకు బసవ నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి.? వాటి నుంచి ఎలా బయటపడ్డారు? అన్నదే మిగతా కథ. నటీనటులు : ఇన్నాళ్లు మాస్ యాక్షన్ హీరోగా కనిపించిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సినిమాలో కొత్తగా కనిపించే ప్రయత్నం చేశాడు. తన బాడీ లాంగ్వేజ్‌కు, ఇమేజ్‌కు ఏ మాత్రం సెట్ అవని అమాయకుడి పాత్రలో పూర్తిగా నిరాశపరిచాడు. సినిమా చూశాక అసలు ఈ సినిమాకు సాయి శ్రీనివాస్ ఎలా ఓకె చెప్పాడా అన్న అనుమానం రాక మానదు. హీరోయిన్గా సీత పాత్రకు కాజల్ అగర్వాల్ పూర్తి న్యాయం చేశారు. తల పొగరు ప్రదర్శించే సన్నివేశాలతో పాటు సెంటిమెంట్ సీన్స్‌లోనూ మెప్పించారు. విలన్‌గా సోనూసూద్ ఆకట్టుకున్నాడు. బసవ క్యారెక్టర్లో తేజ గత చిత్రాల పాత్రల ఛాయలు కనిపించినా.. సోనూ తనదైన మేనరిజమ్స్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఇతర పాత్రల్లో మన్నార చోప్రా, భాగ్యరాజ, తనికెళ్ల భరణి, అభిమన్యూ సింగ్‌లు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ : సినిమా మొదలైన పది నిమిషాల్లోనే కథ అంతా చెప్పేసిన దర్శకుడు తేజ... తరువాత కథనాన్ని ముందుకు నడిపించేందుకు చాలా కష్టపడ్డాడు. తన గత చిత్రాల్లోని పాత్రలు, సన్నివేశాలు చాలా రిపీట్ అయిన భావన కలుగుతుంది. కథపరంగా పెద్దగా మలుపులు లేకపోయినా కథనంలో ట్విస్ట్‌లను ఇరికించే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు ఇక సినిమా అయిపోయిందని ప్రేక్షకుడు అనుకున్న ప్రతీ సారి కొత్త ట్విస్ట్‌తో షాక్ ఇచ్చాడు. చాలా రోజుల తరువాత సంగీత దర్శకత్వం చేసిన అనూప్ రుబెన్స్ పరవాలేదనిపించాడు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సినిమాట్రోగఫి, నిర్మాణవిలువలు సినిమా స్థాయికి తగ్గటుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : కాజల్ అగర్వాల్ మైనస్ పాయింట్స్ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్ స్క్రీన్‌ప్లే క్లైమాక్స్ సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
మా నాన్నకి గిఫ్ట్ ఇవ్వబోతున్నాను
‘‘జనరల్‌గా ఏదైనా కథ విన్న తర్వాత ఈ సినిమా చేస్తే ఆడియన్స్‌కి నచ్చుతుందా? కమర్షియల్ అంశాలు ఏం ఉన్నాయి? అని ఆలోచిస్తాను. కానీ ఫస్ట్ టైమ్ కథ నచ్చి రిజల్ట్ గురించి ఆలోచించకుండా ‘సీత’ సినిమాలో నటించాను. యాక్టర్‌గా మరింత ఇంప్రూవ్ అయ్యే ఏ అవకాశాన్నీ వదులుకోను’’ అని బెల్లంకొండ సాయిశ్రీనివాస్ అన్నారు. తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన సినిమా ‘సీత’. మన్నారా చోప్రా మరో కథానాయిక. రామబ్రహ్మం సుంకర నిర్మించారు. అజయ్ సుంకర, అభిషేక్ అగర్వాల్ సహ–నిర్మాతలు. ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా బెల్లంకొండ సాయిశ్రీనివాస్ చెప్పిన విశేషాలు. ► తేజగారు నాకు రెండు కథలు చెప్పారు. ‘సీత’ కథ నాకు నచ్చింది. మా నాన్నగారికి (బెల్లంకొండ సురేశ్) మరో కథ నచ్చింది. కానీ రియలిస్టిక్ అప్రోచ్‌గా ఉందని ‘సీత’ చిత్రాన్ని ఓకే చేశాం. నా కెరీర్‌కు మంచి హెల్ప్ అవుతుందనిపించింది. ఈ చిత్రంలో మానవ సంబంధ, బాంధవ్యాలకు విలువ ఇచ్చే రఘురాం పాత్రలో నేను నటించాను. నా పాత్రలో వేరియేషన్స్ ఉంటాయి. నా పాత్రకు ఓ ప్రాబ్లమ్ ఉంటుంది. అందుకే పోస్టర్లో నాకు రెండు వాచ్‌లు ఉంటాయి. జీవితంలో డబ్బే ముఖ్యమనే పాత్రలో కాజల్ నటించారు. సినిమాలోని మొదటి రెండు గంటలు చాలా ఎంటర్టైనింగ్గా సాగుతుంది. క్లైమాక్స్ ఎమోషనల్‌గా ఉంటుంది. ► ఏ సినిమా సెట్స్‌లో అయినా నేను పూర్తిగా డైరెక్టర్‌కు సరెండరైపోతాను. ఈ సినిమాకీ అంతే. తేజగారి ఇన్పుట్స్ నా కెరీర్‌కు బాగా ప్లస్ అవుతాయి. ఆయనతో ఈ సినిమా జర్నీ నాకు మంచి ఎక్స్‌పీరియన్స్‌ను ఇచ్చింది. ఈ సినిమా ఫస్ట్‌డే సెట్లో తేజగారు నాకు ఓ పేజీ డైలాగ్స్ ఇచ్చారు. నాలోని యాక్టర్‌ని పరీక్షిస్తున్నారేమో అనిపించింది. క్యారవ్యాన్‌లోకి వెళ్లి ఆ డైలాగ్స్‌ను బాగా ప్రాక్టీస్ చేసి వచ్చి కెమెరా ముందు చెప్పాను. తేజగారు షాక్ అయ్యారు. ‘నీలో నటుడు ఉన్నాడని తెలుసు కానీ ఇంత మంచి నటుడు ఉన్నాడని ఇప్పుడే తెలిసింది’ అన్నారు. చాలా హ్యాపీ ఫీలయ్యా. చాలా కష్టపడి కంబోడియాలోని అంగోర్ వాట్ టెంపుల్లో షూటింగ్ చేశాం. అక్కడ షూటింగ్ చేసుకున్న రెండో సినిమా మాదేనట. ► ఈ సినిమా కథ విన్నప్పుడే ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తారని తెలిసింది. ఇంతకుముందు కాజల్, నేను కలిసి ‘కవచం’ సినిమా చేశాం. ‘సీత’ సినిమాలోని సీత క్యారెక్టర్‌కు కాజల్‌నే కరెక్ట్ అనిపించింది. ఇక ఈ సినిమాకు సరిగ్గా సరిపోతుందనే ‘సీత’ టైటిల్‌ను పెట్టాం. ‘మీరు హీరో అయ్యుండి లేడీ ఓరియంటెడ్ టైటిల్ పెట్టారేంటి?’ అని చాలామంది అడిగారు. నా క్యారెక్టర్ బాగున్నప్పుడు ఇవన్నీ ప్రాబ్లమ్ కాదనుకున్నాను. ‘అల్లుడు శీను’ సినిమా తర్వాత మళ్లీ ఈ సినిమాలో కామెడీ చేశాను. ► జనరల్‌గా పోలీస్ పాత్రను నా డ్రీమ్ రోల్‌గా భావిస్తుంటాను. ‘కవచం’ సినిమాలో పోలీస్ పాత్ర చేశాను. అంతగా సక్సెస్ కాలేదు. అందుకే ‘రాక్షసుడు’లో మళ్లీ పోలీస్ పాత్ర చేస్తున్నాను. పోగొట్టుకున్న చోటే వెతుక్కోమంటారు కదా. నా సినిమాల హిందీ వెర్షన్స్‌కు యూట్యూబ్‌లో మంచి వ్యూస్ వస్తున్నాయి. హిందీలో నాకు మంచి మార్కెట్ ఏర్పడుతోంది. బన్నీ, నా సినిమాలకే ఇలా ఎక్కువగా వ్యూస్ వస్తున్నాయి. కొత్త దర్శకులతో వర్క్ చేయడానికి ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నా. సరైన కథ దొరకాలి. ప్రస్తుతం ‘రాక్షసుడు’ సినిమా చేస్తున్నాను. జూలైలో విడుదల అనుకుంటున్నాం. అజయ్ భూపతితో చేయాల్సిన సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయి. ► ఈ సినిమాతో మీకు యాక్టర్‌గా మంచి గౌరవం వస్తుందని యూనిట్ సభ్యులు అన్నారు. ఈ మాట ఆడియన్స్ కూడా అంటే చాలా సంతోషపడతాను. ‘సీత’ కథను నాన్నగారు ఓకే చేయలేదు అంటే.. ఆయన ఇంకా ఏదైనా ఎక్స్పెక్ట్ చేశారేమో. ఈ సినిమాను మా అమ్మగారికి, మా తమ్ముడికి చూపించాను. వారికి నచ్చింది. అమ్మ అయితే క్లైమాక్స్ సన్నివేశాలకు ఏడ్చారు. మా నాన్నగారికి మే 24న ఈ సినిమాతో గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. -
కజురహో బీర్ఫెస్ట్లో ‘సీత’ బృందం..!
-
‘సీత’ ప్రీ రిలీజ్ వేడుక
-
ఆ బాధ ఇంకా వెంటాడుతోంది: కాజల్
చెన్నై : ఇటీవల నటి కాజల్ చెప్పిన ఒక విషయం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ బ్యూటీకి ఇటీవల విజయాలు ముఖం చాటేసినా, అవకాశాలు మాత్రం తలుపుతడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కమలహాసన్‌తో ఇండియన్–2లో నటించే అవకాశం వచ్చినట్లే వచ్చి వెనక్కిపోతుందేమోనన్న ఆందోళనకు గురైన కాజల్‌అగర్వాల్‌కు తాజాగా మళ్లీ ఆగిపోయిందని ప్రచారం జరిగిన ఇండియన్–2 త్వరలో సెట్‌పైకి వెళ్లనుందన్న సంతోషం ఉక్కిరిబిక్కిరి చేస్తోందట. అదేవిధంగా తెలుగులో తన సినీ గురువుగా భావించే దర్శకుడు తేజ దర్శకత్వంలో నటించిన సీత చిత్రం ఈ నెల 24వ తేదీన తెరపైకి రానుంది. ఇందులో కాజల్‌అగర్వాల్‌ను హీరోయిన్ సెంట్రిక్ పాత్ర లాంటిదని సమాచారం. ఇకపోతే హిందీ చిత్రం క్వీన్‌కు రీమేక్‌గా తెరకెక్కిన ప్యారిస్ ప్యారిస్ చిత్రం విడుదల కావలసి ఉంది. కాగా ప్రస్తుతం కాజల్ చిత్రాలను తగ్గించుకుందట. ఒకప్పుడు ఏడాదికి ఈ అమ్మడు నటించిన చిత్రాలు కనీసం ఆరేడు విడుదలయ్యేవట. ఇప్పుడు తగ్గడానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు కాజల్‌అగర్వాల్ ఒక ఇంటర్వ్యూలో బదులిస్తూ మనసులో ఒక వేదన వెంటాడుతోందని చెప్పింది. దాన్ని చాలా ఆలస్యంగా గ్రహంచినట్లు తెలిపింది. 2013లో తన చెల్లెలి పెళ్లి అయ్యిందని చెప్పింది. ఆ వేడుకలోనూ తాను అతిథిగానే పాల్గొన్నానని చెప్పింది. కుటుంబంలోని సభ్యురాలిగా సంతృప్తిగా ఆ వేడుకలో పాలుపంచుకోలేకపోయానని అంది. అందుకు కారణం ఏమిటంటే తన చెల్లెలంటే తనకు చాలా ప్రేమ అని పేర్కొంది. తామిద్దరం చాలా సన్నిహితంగా ఉంటామని, అలాంటి తన చెల్లెలి విశేష రోజున తాను ఆమెతో పూర్తిగా గడపలేకపోయానన్న బాధ తనను వెంటాడుతూనే ఉందని చెప్పింది. అందుకు కారణం షూటింగ్‌లతో బిజీగా ఉండడమేనని వివరించింది. అందుకే ఆ తరువాత చిత్రాలను తగ్గించుకోవాలన్న నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఏడాది నాలుగు చిత్రాల్లో నటిస్తే చాలని భావించానని చెప్పింది. ఇప్పుడు తాను చిత్రాల్లో నటిస్తున్నా, కుటుంబసభ్యులకు వీలైనంత సమయాన్ని కేటాయిస్తూ సంతోషంగా గడుపుతున్నానని చెప్పింది. పాత్రలకు న్యాయం చేయడానికి కఠినంగా శ్రమిస్తున్నా, 24 గంటలు అదే పనిలో ఉండడం లేదని చెప్పింది. ప్రస్తుతం ఈ బ్యూటీ జయంరవికి జంటగా కోమాలి చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ శనివారం విడుదలైంది. తదుపరి కమలహాసన్‌తో ఇండియన్–2లో నటించడానికి రెడీ అవుతోంది. దీన్ని స్టార్ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. -
తేజగారు నా బ్రెయిన్ వాష్ చేశారు
‘‘సీత’ సినిమా స్టోరీ తేజగారు నాకు ఎప్పుడో చెప్పారు. అప్పటి టైమ్‌కు సెట్ అవుతుందా? అనుకున్నాం. అప్పుడు నా డేట్స్ కూడా ఖాళీ లేవు. అలా ఆ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టాం. ‘నేనే రాజు నేనే మంత్రి’ సమయంలో ‘సీత’ సినిమా నాతోనే తీయాలి. వేరే హీరోయిన్‌తో మిమ్మల్ని చేయనివ్వనని ఆటపట్టించేదాన్ని. పెర్ఫామ్ చేయడానికి చాలా స్కోప్ ఉన్న పాత్ర ఇది. అందుకే మిస్ చేసుకోకూడదు అనుకున్నాను’’ అని కాజల్ అగర్వాల్ చెప్పారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ జంటగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సీత’. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మించారు. ఈ నెల 24న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా కాజల్ అగర్వాల్ మీడియాతో పలు విశేషాలు పంచుకున్నారు. ► నాకు పురాణాలంటే చాలా ఇష్టం. కానీ ఈ సినిమాకు పురాణాలకు ఎక్కువ సంబంధం లేదు. ఇదంతా ప్రస్తుత కాలంలో జరిగే కథ. సినిమాలో ఎక్కువ మానవ సంబంధాలు, లక్ష్యాల గురించి చర్చించాం. కొందరమ్మాయిలు సింపుల్‌గా పెళ్లి చేసుకుని సెటిలైతే చాలు అనుకుంటున్నారు. కొందరమ్మాయిలు ఏదైనా సాధించాలనుకుంటారు. ఇందులో నా పాత్రకు ఓ గోల్ ఉంటుంది. దాన్ని అందుకోవడం కోసం ప్రయత్నిస్తుంటుంది. తను చాలా స్వార్థపరురాలు. ► తేజగారు స్క్రిప్ట్‌కు తగ్గ టైటిల్ మాత్రమే పెడతారని మనకు తెలుసు. దీనికి అలానే పెట్టారు. నటిగా నా కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నా ప్లస్, మైనస్సులు ఆయనకు తెలుసు. ఇందులో నటిగా నన్ను ఇంకా పుష్ చేశారు. తేజగారంటే నాకు చాలా గౌరవం. సినిమా మీద ఆయనకున్న డ్రైవ్ ‘లక్ష్మీ కల్యాణం’ సమయంలో ఎలా ఉందో ఇప్పుడూ అలానే ఉంది. ఆయన నాకు లక్కీ. ► సాయిశ్రీనివాస్‌తో మంచి కెమిస్ట్రీ ఏర్పడింది. మేమిద్దరం ‘కవచం’ సినిమా చేయడం వల్ల ఈ సినిమాకు ఇంకా ప్లస్ అయిందనుకుంటున్నాను. నా పాత్ర కంటే కూడా తనది ఇంకా కష్టమైన పాత్ర. చాలా బాగా చేశాడు. యంగ్ హీరోలతో యాక్ట్ చేసినా డామినేట్ చేయను. సరదాగా టీజ్ చేస్తానేమో. ► ఈ సినిమాలో నా పాత్రను కొందరు రిలేట్ చేసుకోవచ్చు. కొందరు ఇలా ఉందేంటి? అని కూడా అనుకోవచ్చు. నా పాత్రకు నెగటివ్ షేడ్స్ ఉంటాయి. ఈ పాత్రను కొన్నిసార్లు నేనూ రిలేట్ చేసుకున్నా, కొన్నిసార్లు ఇది టూమచ్ అనుకున్నాను. ప్రతీ సీన్ ముందు తేజగారు కొంచెం బ్రెయిన్ వాష్ కూడా చేశారు. ఆ పాత్ర అలాంటిది. ► సీత పాత్ర చేయడానికి హోమ్‌వర్క్ అంటే.. తేజగారితో చాలా డిస్కషన్స్ చేశాను. సీత ఎలా ఉంటుంది అని నోట్స్ రాసుకున్నాను. చాలా పుస్తకాలు చదివాను. అలాగే ఈ సినిమాలో నా స్టంట్స్ నేనే చేసుకున్నాను. గాయాలు కూడా అయ్యాయి. నా వీపు అంతా ప్లాస్టర్స్‌తో నిండిపోయింది. నిటారుగా కూర్చోలేని సందర్భాలు కూడా ఉన్నాయి. ఫిజియోథెరఫీ కూడా చేయించుకోవాల్సి వచ్చింది. ► నా తోటి హీరోయిన్లు ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్నారని నేను చేయను. నాకు నచ్చాలి కదా? పక్కవారితో పోల్చి చూసుకోను. నా దగ్గరకు వచ్చిన వాటిలో బెస్ట్ పిక్ చేసుకుంటాను. ► 23న ఎన్నికల రిజల్ట్స్ రాబోతున్నాయి. 24న మా సినిమా రిలీజ్ కాబోతోంది. భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తారా అంటే ఆ ఉద్దేశమే లేదు. ప్రస్తుతం నా ఫోకస్ అంతా సినిమాలపైనే ఉంది. సినిమాలు చేసే ప్రాసెస్‌ను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. భవిష్యత్తు గురించి ఆలోచించను. ► తెలుగులో శర్వానంద్‌తో ఓ సినిమా, తమిళంలో క్వీన్ రీమేక్ ‘ప్యారిస్ ప్యారిస్’, ‘జయం’ రవితో చేసిన ‘కోమలి’ రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ‘భారతీయుడు 2’ జూన్ నుంచి తిరిగి ప్రారంభం అవుతుంది. మరో ప్రాజెక్ట్ వివరాలు రెండు రోజుల్లో తెలియజేస్తాను. -
గ్యాప్ వల్ల మేలే జరిగింది
‘‘నా మ్యూజిక్ గురించి పాజిటివ్ రివ్యూస్‌ను తీసుకున్నప్పుడు నెగటివ్ రివ్యూస్‌ను కూడా తీసుకోవాలి. కెరీర్లో 50కి పైగా సినిమాలు చేశాను. తెలిసో తెలియకో కొన్ని ట్యూన్స్ రిపీటై ఉండొచ్చు. అది ఒకేసారి ఆరుకి పైగా ప్రాజెక్ట్స్‌ను డీల్ చేస్తున్నప్పుడు కలిగిన ఓవర్ స్ట్రెస్ వల్ల కావొచ్చు. కావాలని ఎవరూ ట్యూన్స్‌ను రిపీట్ చేయరు’’ అని సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ అన్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా తేజ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సీత’. ఏ టీవీ సమర్పణలో రామబ్రహ్మం సుంకర నిర్మించారు. అజయ్ సుంకర, అభిషేక్ అగర్వాల్ సహ–నిర్మాతలు. ఈ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రసంగీతదర్శకుడు అనూప్ రూబెన్స్ చెప్పిన విశేషాలు. ► నా కెరీర్లో ‘సీత’ 54వ చిత్రం. ఇందులో ఐదు పాటలు, ఒక బిట్సాంగ్ ఉన్నాయి. ఒక్క కమర్షియల్ సాంగ్ తప్ప మిగతా అన్నీ సందర్భానుసారంగానే వస్తాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన ‘బుల్రెడ్డి’, ‘నిజమేనా’ పాటలకు మంచి స్పందన లభిస్తోంది. త్వరలోనే అన్ని పాటలను విడుదల చేస్తాం. ఈ సినిమాకు ఆర్ఆర్ (రీ రికార్డింగ్) చేయడం చాలెంజింగ్‌గా అనిపించింది. సినిమా చూసినవారు ఆర్ఆర్ బాగుందని అంటున్నారు. ► దర్శకులు తేజగారితో ఇంతకుముందు జై, ధైర్యం సినిమాలకు వర్క్ చేశాను. ఇప్పుడు ఆయన బ్యాక్ టు బ్యాక్ ‘నేనే రాజు నేనే మంత్రి, సీత’ చిత్రాలకు వర్క్ చేయడం హ్యాపీ. ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి భిన్నాభిప్రాయాలు వినిపించి ఉండొచ్చు. కానీ తేజగారితో వర్క్ చేయడం నాకు ఫుల్ కంఫర్ట్‌గా ఉంటుంది. ► లవ్, యాక్షన్, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ ఇలా అన్నీ ఉన్న చిత్రం ఇది. ఇలాంటి సినిమాను నేను ఇంతవరకు చూడలేదు. హీరో హీరోయిన్లు సాయి, కాజల్‌లతో పాటు విలన్ పాత్రలు చాలా కొత్తగా ఉంటాయి. యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్ర కావడంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాగా పెర్ఫార్మ్ చేశాడు. ► అనుకున్నవి జరగకపోవడంతో నా కెరీర్లో చిన్న గ్యాప్ వచ్చింది. ఒక విధంగా ఈ గ్యాప్ నాకు మేలే చేసింది. గత మూడేళ్లలో నాన్‌స్టాప్‌గా వర్క్ చేశాను. సో... ఈ గ్యాప్ టైమ్‌లో కాస్త రిలాక్స్ అయ్యాను. కొన్ని కొత్త విషయాలు నేర్చుకున్నాను. ఇటీవల కన్నడ ‘సీతారామకల్యాణ’ చిత్రానికి సంగీతం అందించాను. అలాగే కన్నడ హీరో గణేశ్ సినిమాకు వర్క్ చేస్తున్నాను. తెలుగులో కార్తికేయ హీరోగా తెరకెక్కుతోన్న ఓ సినిమాకు సంగీత దర్శకుడిగా చేస్తున్నాను. -
‘సీత’ మూవీ వర్కింగ్ స్టిల్స్
-
ఆస్తి పర్మినెంట్.. పెళ్లి టెంపరరీ!
ఆమె పేరు సీత. డబ్బుకు చాలా విలువ ఇస్తుంది. అందుకే పర్మినెంట్ ఆస్తి కోసం ఓ టెంపరరీ పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుంది. ఇంతలో అనుకోని మలుపు ఎదురవుతుంది? అది ఏంటన్నది తెలియాలంటే ఈ నెల 24 వరకూ వేచి చూడాల్సిందే. బెల్లకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సీత’. ఏ టీవీ సమర్పణలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. సోనూ సూద్, మన్నారా చోప్రా కీలక పాత్రలు చేసిన ఈ చిత్రంలో ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ పాయల్ రాజ్‌పుత్ స్పెషల్‌సాంగ్ చేశారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: అజయ్ సుంకర, అభిషేక్ అగర్వాల్, సంగీతం: అనూప్ రూబెన్స్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికపాటి. -
మే 24న రాబోతోన్న ‘సీత’
‘కవచం’ సినిమాతో రీసెంట్గా పలకరించిన బెల్లంకొండ శ్రీనివాస్‌కు ఆశించిన విజయం దక్కలేదు. కెరీర్ స్టార్టింగ్ నుంచీ సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఈ యువహీరో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ హీరో మరోసారి కాజల్ అగర్వాల్‌తో కలిసి తెరపై సందడి చేసేందుకు రెడీ అయ్యాడు. వీరి కాంబినేషన్లో రాబోతోన్న మరో చిత్రం ‘సీత’ రిలీజ్ డేట్ ఖరారైంది. ఈపాటికే విడుదల కావల్సిన ఈ చిత్రాన్ని సరైన సమయం కోసం చూసి వేసవి చివర్లో విడుదల చేసేందుకు సిద్దమయ్యారు మేకర్స్. మే 24న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. సోనూసూద్ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్ ఓ ప్రత్యేక గీతంలో నటించింది. ఎ.కె.ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించంగా డైరెక్టర్ తేజ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
స్త్రీ పురుషుడు
కమలహాసన్ గతంలో ‘భామనే సత్యభామనే’ సినిమాలో బామ్మగా నటించడం గుర్తుండే ఉంటుంది. హిందీలో మళ్లీ అలాంటి ఛాయలున్న పాత్రనే ఆయుష్మాన్ ఖురానా చేస్తున్నాడు. ‘విక్కీ డోనర్’, ‘జోర్ లగాకే హైస్సా’, ‘అంధా ధున్’ సినిమాలతో బాలీవుడ్లో మంచి గిరాకీ ఉన్న నటుడుగా పేరు పడ్డ ఆయుష్మాన్ ఖురానా తాజాగా ‘డ్రీమ్ గర్ల్’ అనే హాస్య చిత్రానికి పని చేస్తున్నాడు. హిందీ టెలివిజన్‌లో ‘కామెడీ సర్కస్’, ‘కపిల్ శర్మ షో’ వంటి షోలకు వందలాది ఎపిసోడ్స్ రాసిన రాజ్ శాండిల్య తొలిసారిగా దర్శకుడిగా మారి ఈ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో ఆయుష్మాన్ ఆయా పరిస్థితులను బట్టి రామాయణంలో సీతలాగా, భారతంలో ద్రౌపదిలాగా, కృష్ణలీలలో రాధలాగా వ్యవహరిస్తాడట. అంటే ఈ పురుషుడు మూడు స్త్రీ పాత్రలను అనుసరించనున్నాడన్న మాట. ఉత్తర ప్రదేశ్‌లోని చిన్న టౌన్లో జరిగే ఈ కథకు అనుగుణంగా హిందీ, హరియాణా యాసలను నేర్చుకునే పనిలో ఉన్నాడట ఆయుష్మాన్ ఖురానా. కొత్త టాలెంట్ ఎక్కడున్నా గుర్తించి అవకాశం ఇచ్చే ఏక్తా కపూర్ ఈ సినిమాకు ఒక నిర్మాత. సినిమాలో ఈ ‘హీరో–యిన్’కు హీరోయిన్ ఉంది. నుస్రత్ బరూచా ఆ బాధ్యత నిర్వర్తించనుంది. -
బుల్.. బుల్.. బుల్లెట్టు మీదొచ్చె..!
మాస్ సినిమాల హీరోగా గుర్తింపు తెచ్చుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సీత. కాజల్ అగర్వాల్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు తేజ దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఇటీవల టీజర్ రిలీజ్ చేసిన సీత యూనిట్ తాజాగా సినిమాలోని మాస్ సాంగ్‌ను విడుదల చేశారు. ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్‌పుత్‌పై చిత్రీకరించిన స్సెషల్ సాంగ్‌ను బుధవారం రిలీజ్ చేశారు. అనూప్ రుబెన్స్ సంగీత సారధ్యంలో ఉమ నేహ, తేజ సంతోష్, అమిటోలు ఆలపించిన ఈ పాటకు సురేంద్ర కృష్ణ సాహిత్యమందించారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాను ఏప్రిల్‌లోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. -
బుల్ బుల్ పాయల్
‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి సెన్సేషన్ క్రియేట్ చేశారు పాయల్ రాజ్‌పుత్. అందం, అభినయంతో యువతని అలరించిన ఈ బ్యూటీ కథానాయికగా బిజీగా ఉన్నా ప్రత్యేక గీతాల్లో నటిస్తున్నారు. తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, మన్నారా చోప్రా హీరో హీరోయిన్లుగా రూపొందిన ‘సీత’ చిత్రంలో ప్రత్యేక పాటలో నటించారు పాయల్. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. ఈ పాటలో భాగంగా ఆర్ఎక్స్ 100 బైక్‌పై చిరునవ్వులు చిందిస్తూ, వయ్యారాలు వొలకబోస్తున్న పాయల్ లుక్ ఆకట్టుకుంటోంది. ‘‘సినిమా కథానుసారం కీలక సమయంలో వచ్చే ‘బుల్ రెడ్డి...’ అనే పెప్పీ మాస్ సాంగ్‌లో పాయల్ న టించారు. ఈ పాట మాస్‌తో సహా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుంది. ఈ పాటలో పాయల్ సోలో పెర్ఫామెన్స్ సినిమాకే హైలైట్‌గా నిలవనుంది. ఈరోజు ఉదయం 10.30 గంటలకు ఈ పాటని రిలీజ్ చేస్తున్నాం. ఇటీవల విడుదలైన మా సినిమా టీజర్ 2.5 మిలియన్ వ్యూస్‌తో సూపర్ రెస్పాన్స్‌ను రాబట్టుకుంది. దీంతో సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. సోనూ సూద్, తనికెళ్ల భరణి, అభినవ్ గోమటం, అభిమన్యుసింగ్ నటించిన ఈ చిత్రానికి సమర్పణ: ఏ టీవీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికపాటి, సహ నిర్మాతలు: అజయ్ సుంకర, అభిషేక్ అగర్వాల్, సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: శిర్షా రే. -
‘నువ్వు సీతవి కాదు.. శూర్పణఖవి’
వరుసగా మాస్ సినిమాలు చేస్తూ సక్సెస్ కోసం పోరాడుతున్న యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఇన్నాళ్లు మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించినా పెద్దగా వర్క్ అవుట్ కాకపోవటంతో ఇప్పుడు రూట్ మార్చి ఓ లేడి ఓరియంటెడ్ సినిమాకు ఓకె చెప్పాడు. తేజ దర్శకత్వంలో సీత సినిమాలో నటిస్తున్నాడు సాయి శ్రీనివాస్. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాలో టైటిల్ రోల్లో సీనియర్ హీరో కాజల్ అగర్వాల్ నటిస్తోంది. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నిర్మాణం చివరి దశకు చేరుకోవటంతో ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. తాజాగా సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. సినిమాలో కీలకమైన సీత పాత్రను పరిచయం చేస్తూ రూపొందించిన ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. టీజర్లో కూడా ఎక్కువగా హీరోయిన్ పాత్రనే ఫోకస్ చేశారు. ఇన్నాళ్లు సీరియస్ యాక్షన్ రోల్స్ లో కనిపించిన శ్రీనివాస్ ఈ సినిమా కామెడీ టచ్ ఉన్న పాత్రలో నటించాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనూప్ రుబెన్స్ సంగీతమందిస్తున్నాడు. -
‘సీత’ సినిమాలో పాయల్ పెప్పీ సాంగ్
హైదరాబాద్ : బోల్డ్ యాక్టింగ్, అద్భుతమైన డాన్సింగ్ స్కిల్స్‌తో ఇటు కుర్రకారును, అటు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకున్న యంగ్ హీరోయిన్ 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ పాయల్ రాజ్‌పుత్ మరో బంపర్ ఆఫర్ దక్కించుకుంది. ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర నిర్మాణ సారధ్యంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వస్తున్న‘ సీత’ సినిమాలో ఒక పెప్పీసాంగ్కు స్టెప్పులేసే లక్కీ చాన్స్ దక్కించుకుందట. హైదరాబాద్ శివార్లలో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్లో అనూప్ రూబెన్స్ స్వరపర్చిన ఈ పాటను చిత్రీకరించబోతున్నారని సమాచారం. తేజ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సీత సినిమాలో కాజల్ అగర్వాల్ బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్నారు. అంతేకాదు కాజల్ నెగిటివ్‌రోల్ పోషిస్తున్న ఈ సినిమాలో సోనూ సూద్ చాలా కాలం తరువాత మళ్లీ టాలీవుడ్ సినిమాలో నటిస్తుండటం విశేషం. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలను దాదాపు పూర్తి చేసుకుంది. అయితే పాయల్, కాజల్, బెల్లంకొండ శ్రీనివాస్‌లపై ఈ స్పెషల్ సాంగ్ చిత్రీకరణ ముగిసిన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ మొదలు కానున్నాయి. ఏప్రిల్ 25న ఈ మూవీని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. కాగా ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడికి ఇక్కడ వరస ఆఫర్లను తన ఖాతాలో వేసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే మాస్ మహారాజా రవితేజ సినిమా 'డిస్కో రాజా' తో పాటు, మన్మథుడు-2 మూవీలో కూడా చాన్స్ కొట్టేసింది. అలాగే కవచం సినిమా తరువాత కాజల్‌కు బెల్లంకొండతో ఇది రెండవ సినిమా. మరోవైపు ఇప్పటికే విడుదలైన సీత ఫస్ట్ లుక్ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. -
ఆమెకు 60 ఇప్పుడు అనుమానం
ఇంతకుముందు ‘ఎమ్టీనెస్ట్ సిండ్రోమ్’ గురించి మాట్లాడాం. వృద్ధ దంపతులు.. పిల్లలు దగ్గర లేకపోవడం వల్ల ఎన్నో మానసిక వ్య«థలకు గురి అవుతారు.అలాంటి వ్యధే.. ‘లేట్ ఆన్సెట్ సైకోసిస్’ కూడా.పిల్లల్లాగే, భర్తా దూరమైపోతాడేమోనన్న మానసిక స్థితి ఇది. షష్టిపూర్తి అయిపోయినా.. దంపతులు ప్రేమించుకోవడమే కాదు.. ప్రేమను వ్యక్తం చేసుకోవడమూ అవసరమే అంటున్నారు డాక్టర్లు. అమ్మ ఎలా ఉంది నాన్నా? వారానికి ఒకసారి ఫోన్ మోగుతుంది. అమెరికా నుంచి అబ్బాయి. ‘ఎలా ఉన్నావు నాన్నా’ ‘బాగున్నారా’ ‘అమ్మ ఎలా ఉంది?’ ‘బాగుంది. దానికేం?’ ‘ఏమైనా కావాలా నాన్నా’ ‘నాకేం కావాలిరా? నీకేమైనా కావాలంటే చెప్పు పంపుతా’ ‘ఏం అక్కర్లేదు నాన్నా.. ఇక్కడ ఏం కావాలన్నా దొరుకుతుంది. ఉండనా?’ ఫోన్ పెట్టేస్తాడు. మరి కాసేపట్లో ఫోన్ మోగుతుంది. అమెరికా నుంచే.ఈసారి అమ్మాయి. ‘ఫోన్ దగ్గర పెట్టుకోండి నాన్నా. కాల్ చేసినప్పుడు ఎత్తరు’ ‘వాకింగ్‌కు వెళ్లానమ్మా’ ‘కాదులెండీ... అమ్మ ఏదో తెమ్మనుంటుంది వెళ్లుంటారు’ ‘సరిగ్గా చెప్పావు’‘అమ్మను మరీ గారాం చేస్తారు మీరు. అమ్మ ఎలా ఉంది? బాగుంది కదా’‘అయ్యో... దానికేం తల్లీ... బ్రహ్మాండంగా ఉంది’‘ఈ సంవత్సరం కూడా రావడం కుదిరేలా లేదు నాన్నా. పిల్లలకు ఎగ్జామ్సు. ఇంకా ఈయనకు కూడా లీవు దొరకదు’‘పర్లేదమ్మా... ఏం పర్లేదు. మీరు హ్యాపీగా ఉండండీ చాలు’‘థ్యాంక్యూ నాన్నా. ఉంటాను’ పెట్టేస్తుంది.అబ్బాయి ఒక మాట అని ఉంటే బాగుండేది.‘అమెరికాలో అన్నీ దొరుకుతున్నాయి... ఒక్క అమ్మానాన్న ప్రేమ తప్ప’ అని.అమ్మాయి ఇంకో మాట కూడా అనాల్సింది– ‘ఈసారి ఏమైనా సరే వచ్చి ఒక నెల రోజులు ఉంటాం నాన్నా’ అని. కొడుకు, కూతురు ఇలా ఫోన్ పలకరింపులు కాకుండా నేరుగా ఆ అమ్మానాన్నలను చూసి ఉన్నా, తమతో తీసుకెళ్లి ఉన్నా కథ వేరేగా ఉండేది. శ్రీనివాసరావు, సీత ఇద్దరూ ఆ కాలనీలో ఎన్నో ఏళ్లుగా ఉంటున్నారు. ఇద్దరినీ ఎవరూ పేర్లతో పిలువరు. ఆయనను ‘సారు గారు’ అనీ ఆమెను ‘మేడమ్ గారు’ అని పిలుస్తారు. ఇద్దరూ కాలేజీలో లెక్చరర్లుగా పని చేసి రిటైర్ అయ్యారు. ఇద్దరూ ఒకప్పుడు పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకొని వార్తలు సృష్టించారు. కులాలు వేరు కావడం వల్ల ఇరు వర్గాల వాళ్లు పిల్లలు పుట్టి కొంచెం పెద్దవాళ్లు అయ్యేవరకు కూడా దూరం పెట్టారు. ఆ తర్వాత కలిసినా మునుపటి బంధం మిస్సయినట్టే. అంతవరకూ సీతా మేడమ్‌కు భర్తే తోడు. పిల్లలు తోడు. కాలనీవాసులు తోడు. ఆయనకు ఆమె అంటే చాలా ప్రేమ. కొంగు పట్టుకునే తిరుగుతాడు. తనకు క్లాసులు లేకపోయినా ఆమెకు క్లాసులు ఉన్నంత వరకూ ఉండి ఇంటికి తీసుకువెళతారు. ఇద్దరికీ చదువు విలువ తెలుసు. కనుక పిల్లలను బాగా చదివించారు. పిల్లలూ బాగా చదువుకున్నారు కనుక అమెరికాలో స్థిరపడ్డారు. కొడుక్కు కోడలు అమెరికాలోనే దొరికింది. కూతురుకు అల్లుడూ అమెరికాలోనే దొరికాడు.రిటైరయ్యాక ‘ఇన్నాళ్లూ అలవాటు పడ్డ ప్రాణాలు ఇక్కడే ఉంటాం’ అని వాళ్లు అన్నారు. ‘లేదు.. మీరొచ్చి మా దగ్గర ఉండాల్సిందే’ అని పిల్లలు బలవంత పెట్టడం మర్చిపోయారు. ఒకరోజు శ్రీనివాసరావు బజారు నుంచి వచ్చేసరికి సీత వీధిలోనే నిలబడి అనుమానంగా చూస్తూ ఉంది.‘ఏమిటి?’ అన్నాడాయన గేటు వరకూ వచ్చాక.‘అదే... ఎవత్తది’ అందామె.‘మీరు వీధి చివర ఎవర్తోనో కబుర్లు చెప్పి వచ్చారు. ఏమీ ఎరగనట్టు నాటకాలాడుతున్నారే’ అంది.శ్రీనివాసరావుకు అయోమయంగా అనిపించింది.‘ఎవర్తోనూ మాట్లాడలేదే’‘అన్నీ గమనిస్తున్నాను. ఈ వయసులో మీకు వేషాలు మొదలయ్యాయి. ఎవరితోనో పోయి నా కొంప ముంచడానికేగా’ ఏడుస్తూ లోపలికి పరిగెత్తుకుని పోయింది.శ్రీనివాసరావు జీవితంలో దురదృష్టకరమైన దశ నాటితో మొదలైంది. అతనికి అరవై ఆరు. ఆమెకు అరవై. ఈ వయసులో ఒక మధురమైన జీవితం గడపాలని అనుకున్నాడు శ్రీనివాసరావు. ప్రేమ వివాహం కావడం వల్ల, పెద్దల ఆదరణ లేకపోవడం వల్ల, పేదరికం నుంచి రావడం వల్ల, ఉద్యోగమే సర్వస్వమనుకుని చేశాడు. ఆమె కూడా అంతే కష్టపడింది. ఇన్నాళ్లకు బాధ్యతలు తీరి సంతోషాలు పంచుకుందామనుకుంటే ఈ సమస్య వచ్చిపడింది. అనుమానం. తీవ్ర అనుమానం. అతడు ఏం చేస్తున్నాడు... ఎవరితో మాట్లాడుతున్నాడు... ఇంట్లో నుంచి ఎన్నింటికి బయటకు వెళ్లి ఎన్నింటికి వస్తున్నాడు... ఇవన్నీ ఆమె ఆరా తీసేది. అసలు ఏమీ చేయకుండా కిటికీలో నుంచి ఆకాశం వైపు చూస్తూ నిలుచున్నా ‘ఎవరిని చూస్తున్నారు?’ అని వెనగ్గా వచ్చి అడిగేది.శ్రీనివాసరావు మెల్లగా కాలనీలో ఆడవాళ్లతో మాట్లాడటం మానేశాడు. అప్పుడప్పుడు డౌట్స్ కోసం గర్ల్ స్టూడెంట్స్ వచ్చేవారు. వాళ్లను రాకుండా చేశాడు. సమస్య సాల్వ్ కాలేదు.చివరికి పనిమనిషిని కూడా తీసేయాల్సి వచ్చింది. ఊహు... లాభం లేకపోయింది. అతడికి కోపంగా ఉంది. బాధగా ఉంది. భార్య మీద ప్రేమ క్షణక్షణానికి తరిగిపోయి విసుగూ చిరాకూ ఎక్కువవుతున్నాయి. పిల్లలకు చెప్పాలంటే ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఇరుగూ పొరుగూ వారికి చెప్తే పరువు పోతుందని అదో భయం.లోపల లోపల నలిగిపోయి ఒళ్లు అలసిపోయి ఒంటిమీద స్పృహలేనట్టు నిద్ర పోతున్నా ఆమె అనుమానంగా వచ్చి అతడి గదిలో తొంగి చూసేది. ‘దీనిని లేట్ ఆన్సెట్ సైకోసిస్ అంటారు’ అన్నాడు సైకియాట్రిస్ట్ ఆమెను తీసుకొని వచ్చిన శ్రీనివాసరావుతో.‘ఆమె లోలోపల ఏదో తీవ్రమైన భయం ఉంది. పిల్లలు ఎలా అయితే తనను వదిలి వెళ్లిపోయారో మీరు కూడా అలా వదిలివెళ్లిపోతారనే భయం గూడుకట్టిపోయింది. అనుమానం హేతువును తినేస్తుంది. మానసిక అస్థిమితం చిత్తాన్ని దెయ్యాల కార్ఖానా చేసేస్తుంది. మనం చాలా ప్రయత్నించాలి. మందులతోనూ మందులు లేకుండానూ’ అన్నాడు సైకియాట్రిస్ట్.‘ఇదేం జబ్బు డాక్టర్. ఎవరికైనా చెప్పుకోవడానికైనా సిగ్గుగా ఉంది. ఈ వయసులో నా మీద అభాండాలు వేస్తుందంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అందుకే ఈ ట్రీట్మెంట్ను సీక్రెట్‌గా పెట్టి చేయండి’ రిక్వెస్ట్ చేశాడు శ్రీనివాసరావు.‘చూడండి శ్రీనివాసరావుగారూ... అసలు ముందు మనం చేయాల్సిన పని మీ పిల్లలను ఇన్వాల్వ్ చేయడమే. ఎందుకంటే, మీరు బయటి వ్యక్తి. కాని పిల్లలు ఆమె లోపలి నుంచి వచ్చారు. తల్లికి పిల్లల స్పర్శ, స్పందన, పరామర్శ, ఎదురుగా ఉండటం ఇవెప్పుడూ ఆమెకు బలాన్ని ఇస్తాయి. ఆమెకు ఏ అనారోగ్యం వచ్చిందో ఆమెకు తెలియదు. ఆమె బిహేవియర్ కూడా ఆమెకు గుర్తు ఉండదు. మెల్లగా ఆమెను పిల్లల్లో పడేయండి. మందులు ఇద్దాం. కౌన్సెలింగ్ కూడా చేద్దాం’ అన్నాడు సైకియాట్రిస్ట్.‘అలాగే మీరు కూడా మీలో ఉన్న ప్రేమ ఆమెకు తెలిసేలా చేయండి. మీరు ఆమెను ప్రేమించే రోజుల్లో ఎన్నో ప్రేమలేఖలు రాసి ఉంటారు. నువ్వంటే నాకు ప్రేమ అని ఉంటారు. అని పెళ్లయ్యాక ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా ఆ మాట అని ఉండరు. అన్నారా?’‘లేదు డాక్టర్’‘అనుమానం జబ్బు కానీ ప్రేమ ఆశించడం జబ్బు కాదు. మీ ప్రేమ ప్రదర్శనే ఆమెకు సగం మందు. మగవాళ్ల ప్రపంచాన్ని ఫిల్ చేయడానికి చాలా ఉంటాయి. కాని స్త్రీల ప్రపంచాన్ని ఫిల్ చేసేది మాత్రం తన కుటుంబ సభ్యుల ఆప్యాయత, కన్సర్న్ మాత్రమే’.... రోజులు గడిచాయి. మొదటిసారి వీసాలు కట్టించుకుని శ్రీనివాసరావు, సీత అమెరికా వెళ్లారు.కొడుకు, కూతురు ఇద్దరూ అక్కడి నుంచే డాక్టర్‌తో ఆమెకు తెలియకుండా మాట్లాడారు.ఒడిలో ఎగిరొచ్చి కూచునే మనవడు ఆమెకు సగం నయం చేశాడు. ఆమె దగ్గర వేమన పద్యం అతి కష్టం మీద నేర్చుకున్న మనవరాలు మరో సగం నయం చేసింది. శ్రీనివాసరావు చాటుమాటుగా అందించే ప్రేమలేఖలు ఆమె సిగ్గులమొగై్గ అందుకుంటోంది.‘అమ్మ ఎలా ఉంది’ అని ఫోన్లో అడిగితే అమ్మకు ఎప్పుడూ నయం కాదు.అమ్మ సమక్షంలో అమ్మతో గడిపితేనే అమ్మ ఎలా ఉందో తెలుస్తుంది. ‘మా అమ్మ చాలా బాగుంది’ అని నమ్మకంగా చెప్పగలిగే పిల్లలు ఇప్పుడు ఎందరు ఉన్నారు? – కథనం: సాక్షి ఫ్యామిలీ ఇన్పుట్స్: డాక్టర్ కల్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్ -
గాలి జనార్దన రెడ్డిపై సిట్ చార్జ్‌షీటు
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో అక్రమ గనుల తవ్వకాలకు సంబంధించిన కేసులో మాజీ మంత్రి గాలి జనార్దన రెడ్డిపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) చార్జ్‌షీటు దాఖలు చేసింది. గురువారం బెంగళూరులోని ప్రజాప్రతినిధుల కోర్టులో చార్జ్‌షీట్‌ను సమర్పించింది. షేక్‌సాబ్ అనే వ్యక్తికి సంబంధించిన మైనింగ్ స్థలాన్ని కాంట్రాక్టుకు తీసుకుని అక్రమంగా తవ్వకాలు జరిపినట్లు చార్జ్‌షీట్‌లో సిట్ ఆరోపించింది. ఏ1గా గాలి జనార్దనరెడ్డి, ఏ2గా అలీఖాన్, ఏ3గా శ్రీనివాసరెడ్డిల పేర్లను పేర్కొంది. -
లక్ష్మణుడు ఎందుకు నవ్వాడు?
రావణుడు మరణించిన తరువాత కపి సైన్యంతో విభీషణ, అంగద, సుగ్రీవులతో, సీతాలక్ష్మణులతో అయోధ్య చేరి పట్టాభిషేకం చేసుకుంటున్నాడు రాముడు. శ్రీ రామ పట్టాభిషేకం అట్టహాసంగా జరుగుతోంది. రాముని పక్కనే సింహాసనానికి దగ్గరగా నిలబడి ఉన్నాడు లక్ష్మణుడు. ఉన్నట్టుండి తనలో తనే నవ్వుకున్నాడు. అది అందరూ చూశారు. ఆ సందర్భంగా సభలో ఉన్న ఒక్కొక్కరూ ఒకలా అనుకున్నారా నవ్వు చూసి. ఆనాడు రాముడిని అడవులపాలు చేసి, భర్తను చంపుకుని, భరతునితో తిట్లు తిని, నేడు ఆహ్వానం పలుకుతోందని, నా గురించే నవ్వేడా? అనుకుందిట కైక. సుగ్రీవుడు, అన్నను చంపించి రాజ్యాన్ని సంపాదించాడా అని నన్ను చూసి నవ్వేడేమో అనుకున్నాడట. తండ్రిని చంపించిన పిన తండ్రి పంచ చేరినందుకు ఆక్షేపిస్తున్నాడా అనుకున్నాడట అంగదుడు. ఇంటి గుట్టు చెప్పి అన్నను చంపుకుని రాజ్యం సంపాదించుకున్నానని ఎగతాళిగా నన్ను చూసి నవ్వేడా అనుకున్నాడట విభీషణుడు. రాముడి బాణాలను తండ్రి వాయుదేవుని అనుగ్రహంతో వక్ర మార్గాన నడిపించానని పరిహాసం చేస్తున్నాడా అని హనుమ అనుకున్నాడట. ముందు వెనక ఆలోచించకుండా బంగారు లేడిని తెమ్మని కోరి, చేజేతులా ఇన్ని కష్టాలను కొని తెచ్చినందుకు నవ్వుకుంటున్నాడేమో అనుకుందిట సీత. బంగారు లేడి ఉండదని తెలిసీ భార్య కోరిక తీర్చడానికి బయలుదేరి వెళ్లి చిక్కులలో పడినందుకు నవ్వుతున్నాడా అని శ్రీరాముడు అనుకున్నాడట. అందరి మనసుల్లోనూ ఉన్న అనుమానాలను గ్రహించిన రాముడు, తమ్ముడి నవ్వు విశేషార్థాలకు దారి తీస్తుందని లక్ష్మణుని‘ఎందుకు నవ్వేవు సోదరా?‘ అని అడిగాడు. దానికి లక్ష్మణదేవర ‘అన్నా!’ సీతా రాముల సేవలో ఏమరు పాటు లేకుండా ఉండాలని నిద్రాదేవిని నన్ను వనవాస సమయంలో పదునాల్గు సంవత్సరాలూ ఆవహించవద్దని ఒక వరం అడిగాను. అందుకామె సరేనని సమ్మతించి, ‘పదునాలుగేళ్లయిన తరువాత నిన్ను ఆవహిస్తానని’ వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఆవహించని నిద్రాదేవి ఇప్పుడు ఈ సంతోష సమయంలో మరచిపోకుండా వచ్చి నన్ను ఆవహించినందుకు నవ్వేను, మరేమీ కాదు‘ అన్నాడు. దానితో అందరూ తమ తమ మనసులలో అనుకున్నది నిజం కాదని, అనవసరంగా భయపడ్డామనుకుని మనసారా నవ్వుకున్నారట. జీవితంలో మనకు కూడా ఇలాంటి సందర్భాలనేకం ఎదురవుతుంటాయి. ఎవరో ఎందుకో నవ్వుకోవడం లేదా ఎవరి మీదనో చిర్రుబుర్రులాడటం, అసందర్భంగా ఆవులించడం, కళ్లు తుడుచుకోవడం, ఒళ్లు విరుచుకోవడం చేస్తుంటారు. దానికి రకరకాల కారణాలు వెతుక్కుని, మనలో మనం మథన పడకుండా ఉంటే సరిపోతుంది కదా! –డి.వి.ఆర్. -
‘టెస్ట్ ట్యూబ్ బేబీకి ఉదాహరణ సీత’
లక్నో : రామయణ కాలంలోనే టెస్ట్ ట్యూబ్ బేబీల ఎరా మొదలైందంటూ ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి దినేశ్ శర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీతమ్మవారు మట్టికుండలో జన్మించారని పెద్దలు అంటుంటారని దీన్ని బట్టి టెస్ట్ ట్యూబ్ బేబీల ఎరా రామాయణ కాలం నుంచి ఉన్నట్లు తెలుస్తోందని అన్నారు. మహాభారత కాలం నాటి నుంచే పాత్రికేయం ఉన్నదని గురువారం శర్మ వ్యాఖ్యానించిన విషయం తెలిసందే. హిందీ పాత్రికేయుల దినోత్సవం సందర్భంగా ఓ కార్యక్రమానికి హాజరైన శర్మ నూతన ఆవిష్కరణలను పురాతన భారత్‌తో పోల్చుతూ లైవ్ టెలికాస్ట్ మహాభారత కాలంలో ఉందని పేర్కొన్నారు. ‘గూగుల్ ఇప్పుడు మొదలైంది. మన గూగుల్ ఎప్పుడో మొదలైంది. నారద మహర్షి సమాచార చేరవేతకు ఓ ఉదాహరణ.’ అని శర్మ వ్యాఖ్యానించారు. -
‘సీతారామ’కు తొలి దశ అనుమతి
సాక్షి, హైదరాబాద్ : సీతారామ ఎత్తిపోతల పథకం పనులకు తొలి దశ (స్టేజ్–1) అటవీ అనుమతులు లభించాయి. ప్రాజెక్టు పరిధిలో 1,531 హెక్టార్ల (3,827.5 ఎకరాలు) అటవీ భూముల సేకరణకు సంబంధించిన అనుమతులను కేంద్ర అటవీ శాఖ చెన్నై ప్రాంతీయ కార్యాలయం మంజూరు చేసింది. శుక్రవారం చెన్నైలో జరిగిన అటవీ, పర్యావరణ సాధికార కమిటీ సమావేశంలో సీతారామ ప్రాజెక్టు ప్రతిపాదనలపై ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ సుధాకర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. డాక్టర్ ఎం.ఆర్.జి.రెడ్డి చైర్మన్‌గా ఉన్న ఈ కమిటీ.. సీతారామ ప్రాజెక్టు ప్రతిపాదనలను క్షుణ్నంగా పరిశీలించి కేంద్రానికి సానుకూలంగా సిఫారసు చేసింది. దీంతో అటవీ భూములను ఇరిగేషన్ శాఖకు బదిలీ చేయడానికి లైన్ క్లియర్ అయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు, పాల్వంచ, కొత్తగూడెం అటవీ డివిజన్లలోని 1,201 హెక్టార్లు, ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, ఖమ్మం అటవీ డివిజన్లలోని 330 హెక్టార్ల అటవీ భూమిని ఇరిగేషన్ శాఖకు బదలాయించేందుకు కేంద్రానికి అటవీ, పర్యావరణ ప్రాంతీయ కార్యాలయం సిఫార్సు చేస్తుంది. ప్రాజెక్టులోని పైపులైన్లు, గ్రావిటీ కాల్వలు, వాటిపై నిర్మాణాలు, విద్యుత్ లైన్లు, డిస్ట్రిబ్యూటరీలు, టన్నెళ్లు నిర్మించడానికి ఈ అటవీ భూములు అవసరమవు తున్నాయి. 175 ఎకరాలు తగ్గింపు.. సీతారామ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధా న్యత ప్రాజెక్టుగా పరిగణి స్తోంది. ఈ కాలువ నిర్మాణం కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల పరిధిలో 114 కిలోమీటర్ల మేర అటవీ భూముల నుంచి వెళ్తోంది. ఇందుకోసం 1,602 హెక్టార్ల అటవీ భూమిని ప్రాజెక్టుకు బదలాయిం చాలని సాగునీటి పారుదల శాఖ తొలుత కోరింది. దీనిపై అదనపు ప్రధాన అటవీ సంరక్షణాధికారి శోభతో పాటు అధికారుల బృందం ఇటీవల వారంపాటు క్షేత్ర స్థాయిలో పర్యటించింది. 9 అటవీ డివిజన్ల పరిధిలో భూములు, ప్రాజెక్టు కాలువ అలైన్మెంట్, వన్య ప్రాణు లు సంచరించే ప్రాంతాలు, అటవీ సంపదపై ప్రభావాల్ని పరిశీలించింది. అలైన్మెంట్, టన్నెళ్ల ప్రకారం లెక్కలు వేసిన అధికారులు బదలాయించే అటవీ భూమిని 1,531 హెక్టార్లుగా నిర్ధారించారు. ఫలితంగా బదలాయించే అటవీ భూమి 71 హెక్టార్లు (175 ఎకరాలు) తగ్గింది. పనులు వేగిరం: హరీశ్ సీతారామ ప్రాజెక్టుకు అనుమతులు లభించడంపై ఇరిగేషన్ మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. రెండో దశ అనుమ తుల ప్రక్రియకు కృషి చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఎకో సెన్సి టివ్ జోన్‌లోని 275 హెక్టార్లకు (688 ఎకరాలు) కేంద్ర వన్యప్రాణి బోర్డు అనుమ తి కోసం కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌కు విజ్ఞప్తి చేశామని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు చెందిన భూసేకరణ, అటవీ, పర్యావరణ, వన్యప్రా ణి అనుమతులు, పంప్ హౌజ్‌లు, కెనాల్స్, ఇతర పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని చెప్పారు. 6.74 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో తలపెట్టిన సీతారామ ప్రాజెక్టు పనులు ఇంకా వేగంగా జరగాలని సూచించారు. సీతారామ ప్రాజెక్టు పూర్తయితే 3,45,534 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరగనుందని చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం సేకరిస్తున్న అటవీ భూములకు ప్రత్యామ్నాయంగా 4,050 ఎకరాలను కొత్తగూడెం, ఖమ్మం, జగిత్యాల జిల్లాల్లో గుర్తించామని, ఈ మేరకు ఆయా జిల్లా కలెక్టర్లు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు ఇచ్చారని తెలిపారు. ప్రత్యామ్నాయ అటవీ భూముల్లో అడవులు పెంచేందుకు అవసరమయ్యే నిధులను అంచనా వేసి ఇరిగేషన్ శాఖకు వెంటనే సమర్పించాలని అటవీ శాఖను కోరారు. -
వినరో భాగ్యము..
పర్ణశాల.. ఇక వర్ణశోభితం! - కళ్ల ముందు కదలాడనున్న కమనీయ రామాయణం - ‘రామాయణ సర్క్యూట్’లో భాగంగా అభివృద్ధి - త్రీడీ దృశ్య రూప వ్యవస్థ.. అరణ్యకాండను తెరలపై చూపే ఏర్పాట్లు - కొత్తగూడెం విమానాశ్రయంతో అనుంధానం.. ప్రభుత్వ ప్రణాళిక సాక్షి, హైదరాబాద్: సీతమ్మ ఆరేసుకున్న నార చీర అదిగో. ఆ చెట్టు పక్కనే ఆమె బంగారు లేడిని చూశారట. ఇదిగో ఇక్కడే శూర్పనఖ ముక్కుచెవులను లక్ష్మణుడు కోసింది. రావణుడు మాయ వేషంలో భిక్ష అర్థించి సీతను అపహరించిన పర్ణశాల ఇదేనట.. ..ఇలా పర్యాటక భక్తులు చెప్పుకునే చోటు పర్ణశాల. రామాయణం అరణ్యకాండలో ప్రధాన ఘట్టానికి ప్రత్యక్ష సాక్ష్యంగా భాసిల్లుతున్న ఆ ప్రాంతం భద్రాచల పుణ్యక్షేత్రం సమీపంలో ఉంది. పురాణ గాధలో దానికున్న ప్రాధాన్యం ఎంతో! కానీ, భక్తి పారవశ్యంతో వెళ్లే భక్తులకు అక్కడ తీవ్ర నిరాశ తప్పడం లేదు. కనీస వసతులూ కరువే. ఇప్పుడు దాని రూపురేఖలను మార్చి దేశంలోనే గొప్ప ఆధ్యాత్మిక–ఆధునిక పర్యాటక ప్రాంతంగా తీర్చి దిద్దే ప్రణాళికలకు రూపకల్పన జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్ పథకంలో భాగంగా రామాయణ్ సర్క్యూట్ పేరుతో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. భక్తులు వచ్చేందుకు రోడ్డు, ఉండేందుకు విశ్రాంతి గదులు, రెస్టారెంట్ ఉంటే సరిపోదు, ఆ ప్రాంతాన్ని సందర్శించిన తర్వాత ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోయే ఇతివృత్తం అవసరం. ఇప్పుడు దాని విషయంలోనే మేధోమథనం జరుగుతోంది. భారీ త్రీడీ దృశ్య వ్యవస్థ... లేనిది ఉన్నట్టుగా.. మన కళ్లముందే జరుగుతుందన్నట్టుగా అనుభూతి కలిగించే త్రీడీ దృశ్య వ్యవస్థ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పర్యాటక ప్రాంతాల్లో కనువిందు చేస్తోంది. ఇలాంటి వ్యవస్థను పర్ణశాలలో ఏర్పాటు చేయాలనే ప్రాథమిక ఆలోచనపై కసరత్తు జరుగుతోంది. డిస్నీలాండ్‌లోని ఇలాంటి ఏర్పాట్లను చూసిన పర్యాటకశాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ పేర్వారం రాములు అదే తరహా పర్ణశాలలో ఉంటే బాగుంటుందని సూచించారు. ఆ దిశగా నిపుణులు కసరత్తు చేస్తున్నారు. అరణ్యకాండకు సంబంధించిన పూర్తి ఇతివృత్తాన్ని ప్రత్యేక త్రీ డీ తెరలపై చూపే ఏర్పాటు చేస్తారు. పర్యాటకులు వాటి మధ్య నుంచి ముందుకు సాగేందుకు ప్రత్యేక కన్వేయర్ బెల్టు వ్యవస్థ ఉంటుంది. దానిపై కూర్చొని ముందుకు వెళ్తుంటే.. అరణ్యకాండ మొత్తం కళ్ల ముందు కదలాడుతుంది. ఇందుకు దాదాపు 20కిపైగా ప్రత్యేక తెరల వ్యవస్థ, ప్రొజెక్టర్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని భావిస్తున్నారు. అండర్‌వాటర్ ఎక్వేరియం తరహాలో ఏర్పాటు చేసే మరో ఆలోచన కూడా ఉంది. ఇక నాటి ఘట్టాలను ప్రతిబింబించే ఆనవాళ్లను మరింత మెరుగ్గా కనిపించేలా చేస్తారు. భక్తులు ఉండేందుకు వీలుగా దాదాపు 30 వరకు కాటేజీలు, భోజనశాలలు, బ్యాటరీ వాహనాలు, ఉద్యానవనాలు, పిల్లల పార్కులు ఏర్పాటు చేస్తారు. విమానాశ్రయంతో అనుసంధానం ఇటీవలే కొత్తగూడెం విమానాశ్రయ ఏర్పాటుకు పౌర విమానయానశాఖ పచ్చజెండా ఊపింది. పనులు వెంటనే మొదలయ్యేలా ఈ ప్రాజెక్టులో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. స్థానిక ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ఈ మేరకు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. రామాయణ్ సర్క్యూట్ కింద ఇచ్చిన నిధులను రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్లకు పెంచాలని కోరనున్నారు. ప్రాజెక్టులో ఇతర ప్రతిపాదిత ప్రాంతాలు ► భద్రాచలం క్షేత్రం వద్ద ప్రత్యేక వసతి కేంద్రాల నిర్మాణం ► ఆ ఆలయాన్ని నిర్మించిన రామదాసు సొంత ప్రాంతం నేలకొండపల్లిలో స్మారక కేంద్రం ► రామదాసు తహసీల్దారుగా పనిచేసిన పాల్వంచలో స్మృతి కేంద్రం ► శ్రీరాముడు మాయలేడిని వధించిన ప్రాంతంగా చెప్పుకునే జీడికల్ రామాలయం అభివృద్ధి. భక్తులకు వసతి కేంద్రాలు ► సీతాన్వేషణలో భాగంగా రాముడు విశ్రమించినట్టుగా పేర్కొనే ఇల్లంతకుంట ప్రాంతంలో అభివృద్ధి పనులు ► రాముడు నడయాడిన గుర్తులున్నాయని పేర్కొనే రామగిరి ఖిల్లా. కాళిదాసు మేఘసందేశం ఇక్కడే రాశారంటారు. ప్రాజెక్టు స్వరూపం రామాయణ గాథతో ముడిపడిన ప్రాంతాలను పర్యాటక వలయంగా అభివృద్ధి చేయాలని కేంద్రం ఇప్పటికే నిర్ణయించింది. అయోధ్య మొదలు రామసేతు ఉన్న రామేశ్వరం వరకు రామాయణ ఇతివృత్తం చోటుచేసుకున్న ప్రాంతాలుగా పేర్కొనే పుణ్యక్షేత్రాలను అభివృద్ధి చేయబోతోంది. స్వదేశీ దర్శన్ కింద రామాయణ్ సర్క్యూట్ పేరుతో దేశంలోని 11 ప్రాంతాలను గుర్తించింది. అవి.. ఉత్తరప్రదేశ్ : అయోధ్య, నందిగ్రామ్, శృంగవర్పూర్, చిత్రకూట్ బిహార్ : సీతార్మర్హి, బక్సర్, దర్భంగ ఛత్తీస్‌గఢ్ : జగ్దల్పూర్ తమిళనాడు : రామేశ్వరం కర్ణాటక : హంపి మహారాష్ట్ర : నాసిక్, నాగ్‌పూర్ ఒడిశా : మహేంద్రగిరి మధ్యప్రదేశ్: చిత్రకూట్ తెలంగాణ : పర్ణశాల -
అల్లు 'రామాయణం'లో సీత ఎవరు?
చెన్నై: పురాణ ఇతిహాసాలు, చరిత్ర ఇతివృత్తాలతో రూపొందే చిత్రాలకు ప్రేక్షకుల విశేష ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా రామాయణ, మహాభారత గాధలతో ఎన్నో కోణాలతో వచ్చిన చిత్రాలు కళాఖండాలుగా నిలిచిపోయాయి. బాలకృష్ణ శ్రీరామరాజ్యం, ఇటీవల బాహుబలి లాంటి పురాణ, చారిత్రక చిత్రాలు నవతరానికి ఎంతో స్పూర్తిగా నిలిచిందనే చెప్పాలి. తాజాగా చారిత్రక ఇతివృత్తంతో సంఘమిత్ర చిత్రం రూపుదిద్దుకుంటోంది. తాజాగా అలనాటి రామాయణాన్ని అద్భుత కళాఖండంగా తెరకెక్కించడానికి టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సిద్దమయ్యారు. సుమారు రూ.500 కోట్ల భారీ బడ్జెట్లో ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, హిందీ భాషలలో నిర్మించనున్నట్లు ఆయన ఇటీవల వెల్లడించారు. ఇందులో శ్రీరాముడు, సీత వంటి ప్రధాన పాత్రలకు ప్రముఖ తారలను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. అందులో భాగంగా సీత పాత్రకు అనుష్క, తమన్నా, నయనతార పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తాజా సమాచారం. ఇప్పుడు ఆ అదృష్టం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తిగా మారింది. అనుష్క అరుంధతి, రుద్రమదేవి, దేవసేన పాత్రల్లో ఉత్తమ నటనను ప్రదర్శించింది. ఇక తమన్న బాహుబలి చిత్రంలో అవంతికగా జీవించారనే చెప్పాలి. నటి నయనతార విమర్శకులను సైతం మెప్పించేలా శ్రీరామరాజ్యం చిత్రంలో సీతమ్మగా నటించారు. మరి తాజా రామాయణంలో కలియుగ సీతగా ఎవరు మారతారో మరి కొద్ది రోజుల్లోనే తేలనుంది. ఎందుకుంటే రామాయణం చిత్రం నవంబర్‌లో సెట్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. -
‘సీత’ దర్శకుడికి బెదిరింపులు
సాక్షి, సిటీబ్యూరో: సోషల్ మీడియా ద్వారా తనకు బెదిరింపులు వస్తున్నాయంటూ వివాదాస్పద షార్ట్‌ఫిల్మ్ ‘సీత–ఐయామ్ నాట్ ఏ వర్జిన్’ చిత్ర దర్శకుడు పి.కౌశిక్‌బాబు మంగళవారం సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించారు. వెల్లూరి ప్రసన్నతో పాటు ఇంకా కొంత మంది తనను సోషల్ మీడియా ద్వారా తీవ్ర స్థాయిలో బెదిరిస్తున్నారని ఆరోపించారు. కౌశిక్ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
అంజలీదేవికి నివాళి
పెద్దాపురం : నటనతో ప్రజలందరినీ మెప్పించిన కలియుగ సీత అంజలీ దేవి అని ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు అన్నారు. పెద్దాపురం పట్టణ ఆడపడుచు అంజలీ దేవి మూడో వర్ధంతిని బుధవారం సాయంత్రం నిర్వహించారు. అంజలీదేవి ఫౌండేష¯ŒS చైర్మ¯ŒS, ప్రముఖ పారిశ్రామిక వేత్త గోలి రామారావు అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఆమెను నేటి కళాకారులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. గోలి రామారావు మాట్లాడుతూ అంజలీదేవి పెద్దాపురం పట్టణంలో జన్మించిడం గర్వకారణమన్నారు. అంజలిదేవి తనయుడు పీయూఎస్ చిన్నారావు మాట్లాడుతూ తన తల్లిపై పట్టణ ప్రజలకు ఉన్న ఆదరాభిమానాలను చూస్తే గర్వకారణంగా ఉందన్నారు. ఫౌండేష¯ŒS కన్వీనర్ పొలమరశెట్టి సత్తిబాబు, అంజలిదేవి మేనల్లుళ్లు గోళ్ల బాబీ, గోళ్ల శ్రీను మాట్లాడారు. తొలుత అంజలీదేవి విగ్రహానికి ఎమ్మెల్సీ బొడ్డు, గోలి తదితరులు క్షీరాభిషేకం చేసి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ వి.ముని రామయ్య, మున్సిపల్ వైస్ చైర్మ¯ŒS త్సలికి సత్య భాస్కరరావు, కౌన్సిలర్లు వాసంశెట్టి గంగ, గోకిన ప్రభాకరరావు, విజ్జపు రాజశేఖర్, తూతిక రాజు, పాగా సురేష్‌కుమార్, అభిమాన సంఘం కార్యదర్శి వెలగల కృష్ణ పాల్గొన్నారు. -
భర్త లేచిపోయాడన్న ఆవేశంతో భార్య...
జైపూర్: భర్త వివాహేతర సంబంధాలతో ఆ ఇల్లాలు విసిగిపోయింది. ఎన్నిసార్లు చెప్పిచూసినా భర్తలో మార్పురాలేదు. పైగా వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్న అమ్మాయితో కలిసి భర్త ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఇక అంతే.. ఆ ఇల్లాలి కోపం రెట్టింపయ్యింది. ఏం చేయాలో తోచలేదు. తన ఇద్దరు కుమారులను చంపేసింది. ఆ ఘటన వివరాలిలా ఉన్నాయి... రాజస్థాన్ లోని బన్సవారాకు చెందిన గజేంద్ర అనే వ్యక్తికి సీత అనే మహిళతో ఏడేళ్ల కిందట వివాహమైంది. ఈ క్రమంలో వారికి పప్పు(5), సుభాష్(2) సంతానం కలిగారు. కొన్నేళ్లవరకు అన్యోన్యంగా సాగింది. అయితే గత కొంతకాలం నుంచి వీరి కాపురంలో గొడవలు మొదలయ్యాయి. భర్త గజేంద్ర స్థానిక మహిళతో వివాహేతర సంబంధాలు ఏర్పరుచుకున్నాడు. ఈ విషయంలో తరచుగా భార్యాభర్తల మధ్య కొట్లాట జరిగేది. భర్తను చాలాసార్లు వారించిచూసినా ప్రయోజనం కనిపించలేదు. ఈ క్రమంలో బుధవారం గజేంద్ర, మహిళతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆమెకు ఏం చేయాలో పాలుపోలేదు. ఆ మరుసటిరోజు తన ఇద్దరు చిన్నారుల్ని ఇంటి సమీపంలో ఉన్న బావిలో పడవేసి బంధువుల ఇంటికి వెళ్లింది. పిల్లల్ని చంపేశానని బంధువులకు చెప్పగా వారు శుక్రవారం పోలీసులకు సమాచారం అందించగా వారు కేసు నమోదుచేశారు. బావిలో నుంచి సుభాష్ మృతదేహాన్ని శుక్రవారం తీయగా, పెద్ద కుమారుడు పప్పు మృతదేహం నేడు లభ్యమైందని పోలీసులు తెలిపారు. గజేంద్ర, స్థానిక మహిళ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరించారు. -
ఆ బొమ్మ నాది కాదు... ఆయనదే
విద్య - విలువలు ‘‘నేనిది చేసి తీరుతా’’ అని సంకల్పం చేయడం తప్పుకాదు. ‘‘కానీ ఇది నేను చేస్తా. నేనెందుకు చేయలేను’’ అని అనుకున్నాననుకోండి. కానీ నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే వేరొకడున్నాడన్నమాటకు అర్థం లేదు. నేను అనుకున్నవన్నీ జరగకుండా ఆపగలిగినవాడు ఒకడున్నాడనే స్పృహ అవసరం. అందుకే రేపటి రోజున అయోధ్యకు రాజుగా రాముడికి పట్టాభిషేకం చెయ్యాలనుకున్న దశరథ మహారాజు అలా చెయ్యగలిగాడా! రాత్రికి రాత్రి చేయలేకపోయాడు. లక్ష్మణస్వామి వచ్చి ‘‘రాజ్యం ఇవ్వకుండా ఉండడానికి నాన్నగారెవరు? అన్నయ్యా, అనుజ్ఞ ఇయ్యి, దశరథుణ్ణి చంపేస్తా’’ అన్నాడు. దానికి రాముడేమన్నాడో తెలుసా ‘‘నాన్నగారు నిన్న రాత్రి పిలిచి రాజ్యం ఇస్తానన్నా, ఈవేళ కూడా ఆయనకు ఇవ్వాలని ఉన్నా... ఇవ్వకుండా ఎలా ఆగిపోయింది? ఆయనకు కోరికలేక కాదుగా. నాన్నగారికి ఇవ్వాలని ఉన్నా, నాకు పుచ్చుకోవాలని ఉన్నా ఆయన ఇవ్వలేక, నేను పుచ్చుకోలేక ఎవ్వరం కాదనలేని ఒకానొక స్థితిని కల్పించినవాడు మన మాంసనేత్రాలకు కనబడనివాడు ఒకడున్నాడు. దానికి నాన్నగారినెందుకురా నిందిస్తావ్! ఆ దైవాన్ని అనుసరించు’’ అన్నాడు. సుందరకాండలో సీతమ్మ అద్భుతమైన మాట ఒకటంటుంది. హనుమ వెళ్లి అంత కష్టంలో ఉన్న సీతమ్మకు రాముని క్షేమవార్త చెప్పాడు. అదే పరిస్థితిలో కనుక మనం ఎవరమైనా ఉంటే ఏమంటాం... ‘‘ఇక్కడినుంచి నేను బయటపడే రోజు ఉంటుందంటావా హనుమా’’ అని. కానీ ఆమె ఏమన్నదో తెలుసా... ‘‘హనుమా, నేను కనబడడం లేదన్న బెంగతో రాముడు తాను చేయవలసిన పనులు మానేసుకున్నాడా? లేకపోతే నన్ను పొందే కార్యక్రమం పెట్టుకుని దాని వ్యగ్రతలో ‘నాకు ఈశ్వరుడు ఏనాడు అనుకూలించాడు కనుక, నేనెందుకు పూజించాలి ఆయన్ని’ అనుకుని భగవంతుడిని పూజించడం మానేశాడా? ఎలా ఉన్నాడు రాముడు చెప్పు’’ అని అడిగింది. ఆమె ఎందుకలా అడిగిందంటే... కష్టాల మధ్యలో భగవంతుడి ఉదాసీనత మనకు అర్థం కాకపోవచ్చు. కానీ ఏదో ఒకనాడు ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. నూరేళ్ళు బతికినవాడు ఎప్పుడో ఒకప్పుడు శుభవార్త వింటాడు. కాబట్టి ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు, దాన్ని నెరవేర్చాలనే పట్టుదల ఉండడం మంచిదే. కానీ ఆ కార్యాన్ని ఏ కారణం చేతనో నీవు చేయలేకపోతే ‘ఇది నీవు చేయవద్దు. చేస్తే ఏదో ఒక ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఇక వద్దు’ అని ఆ పని చెయ్యకుండా ఆపినవాడు ఒకడున్నాడని గుర్తించినవాడిది పండిన బతుకు. అంతే తప్ప-నేను చేయాలనుకున్నా, వాడు నన్ను చేయనివ్వడం లేదనే వ్యగ్రత పెట్టుకుని పూజ మానేస్తే నీకొరిగేదేమిటి?’’ ఒక కార్యం చేయాలన్న ధైర్యం ఉండాలి. ఆటుపోటు తట్టుకోగలగాలి. కానీ ఈ పని అయి తీరాలి. కాకపోతే?? పరమేశ్వరుడి దగ్గరినుంచి కనబడిన ప్రతివాడినీ బాధ్యుడిని చేస్తాననే భావన, అందరినీ నిందించే తత్త్వం ఉండకూడదు. లక్ష్య సాధన తాను ఏ స్పష్టతతో మొదలు పెట్టాడో అదే స్పష్టతతో అంతే చిరునవ్వుతో ముందుకు తీసుకెళ్ళగలగాలి. ఇదీ ధృతి అంటే. ఇది ఎవరికి ఉందో వాడు మాత్రమే లక్ష్యాన్ని సాధించగలడు. అది లేని వాడు ఏదైనా సాధించిన రోజున పొంగిపోతాడు. లేకపోతే కృంగిపోతాడు. వాడితో కార్యములు సాధింపబడవు. ఒకవేళ సాధింపబడినా ఆ పని లోకంలో నిలబడుతుందేమో గానీ, ఆ సంకల్పం చేసిన వ్యక్తి మాతం ఆదర్శవంతుడిగా నిలబడలేడు. అందుకే ధృతి కలగడం అన్నది అంత తేలికైన విషయం కాదు. అది జీర్ణమైనవాడికే చెల్లుతుంది. గుంటూరులో నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. ఆ ఇంటి పెద్దకు ఒక కుమారుడున్నాడు. వాడు తండ్రితో ఎంతో ఆప్యాయంగా ఉండేవాడు. రాత్రి నాన్నగారి కాళ్లు పడుతూండగా, ఇంట్లోవాళ్లు ఏవో సరుకులు కావాలంటే ‘‘నాన్నగారండీ, ఇప్పుడే షాపుకెళ్లి పట్టుకొచ్చేస్తా’’ అని చెప్పి బయటకు వెళ్లినవాడిని ఒక వాహనం తొక్కేస్తే చనిపోయాడు. ఈ విషయం నాకు తెలియదు. ఆ మరుసటి సంవత్సరం నేను వెళ్లి మాటల సందర్భంలో ‘‘మీ అబ్బాయి ఎలా ఉన్నాడండీ’’ అని అడిగా. ‘‘ఆ బొమ్మను ఈశ్వరుడు తీసుకున్నాడండి’’ అన్నాడు. ‘‘మీరేవంటున్నారో నాకర్థం కాలేదు’’ అన్నా. ‘‘ఆ బొమ్మతో ఆడుకోమని నాకు ఆయన కొన్నాళ్లు ఇచ్చాడండీ. ఏమైనా అది ఆయనదే కదూ. నా వస్తువు నాకు కావాలని ఆయన దానిని పట్టుకెళ్ళిపోయాడు. అంత ఆప్యాయతతో నాకు ఆ బొమ్మ ఇచ్చి, అంతే స్వతంత్రంగా నా దగ్గర నుంచి ఆయన ఆ వస్తువు తీసుకున్నందుకు, ఇన్ని మధుర స్మృతులు మిగిల్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు’’ అన్నాడు. అది ధృతి. నరనరాన జీర్ణమయిన వేదాంతం. ఆ స్థాయికి ఎదగడం మనం నోటితో చెప్పినంత తేలిక కాదు. ఆయన నిజమైన వేదాంతి. ధృతి, సంకల్పం ఎప్పుడూ భక్తితో ముడిపడి ఉంటాయి. ‘ఈశ్వరానుగ్రహం చేత నేను చేస్తున్నాను తప్ప నా అంతట నేను చేసేది కాదు’ అన్న స్థితి. అది సంకల్ప శుద్ధి. అది లక్ష్య శుద్ధి. అందుకే లంకకు బయల్దేరే ముందు హనుమ ఏం చెబుతాడంటే... ‘‘నేను యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళగలను. నాకా శక్తి ఉంది. నేను ఉత్తర తీరాన నిలబడి వంగి దక్షిణ తీరాన్ని ముట్టుకోగలను. కానీ నేను ఎలా వెడతానంటే... బంగారు కోదండాన్ని పట్టుకున్న రామచంద్రమూర్తి వింటినారిని సంధించి ఆ కర్ణాంతం లాగి వదిలినప్పుడు బాణం ఎలా వెడుతుందో అలా వెడతాను. బాణం విడిచిపెడితే రాముడి శక్తి బాణంలోకి చేరి అది వెడుతుంది. అది నా శక్తి కాదు. రాముడి శక్తి’’ అంటాడు. అందుకే కేవలం ఒక లక్ష్యం పెట్టుకోవడం కాదు, అది చెదిరిపోకుండా నిలబడగలిగిన శక్తిని ఒకడివ్వాలి. వాడు ఉన్నాడు. అలా వాడు ఉన్నాడన్న నమ్మకమే భక్తి. వాడు నాకు సంకల్ప బలాన్ని ఇస్తాడని, దానియందు నిలబడగలిగిన శక్తిని ఇస్తాడని నమ్మడమే లక్ష్య సాధనకు తోడ్పడుతుంది. అటువంటి సంకల్పం నెరవేరిననాడు అది పదికాలాల పాటూ, పదిమందికి పనికి వచ్చేదిగా ఉండడమే కాక, సాధకుడు కూడా ఆదర్శంగా చిరకాలం నిలిచిపోతాడు. -
సీతను వేధించారంటూ రాముడిపై కేసు
పాట్నా: మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే దేవుడైనా సరే భారత న్యాయస్థానం ముందు నిలబడాల్సిందే. విచారణ ఎదుర్కోవాల్సిందే. ఇతిహాసమైన రామాయణంలో రాముడు సీత పట్ల అనుచితంగా అన్యాయంగా వ్యవహరించారని ఆరోపిస్తూ బీహార్‌లోని సీతమరాహి చీఫ్ జుడీషియన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఠాకూర్ చందన్ కుమార్ సింగ్ అనే న్యాయవాది సాక్షాత్తు రాముడిపైనే కేసు దాఖలు చేశారు. ఏ పాపం తెలియని సీతను అన్యాయంగా అగ్ని పరీక్షకు గురిచేసి అవమానించారని, అమానుషంగా ఆమెను 14 ఏళ్లు వనవాసం పంపించారని న్యాయవాది రాముడిపై కేసులో ఆరోపణలు చేశారు. ఎవరైనా తన భార్య పట్ల ఇంత క్రూరంగా వ్యవహరిస్తారా? ఇది రాముడి ఆత్మవంచన కాదా? అంటూ కూడా ఆయన తన కేసులో ప్రశ్నించారు. పురాణకాలం నాటి రాముడిపైన ఇప్పుడు కేసు వేయడం ఏ విశేషమైతే, ఆ కేసును విచారణకు చీఫ్ జుడిషియల్ మేజిస్ట్రేట్ స్వీకరించడం అంతకన్నా విశేషం. ఈ కేసుపై ట్విట్టర్ యూజర్లు తమదైన శైలిలో స్పందించారు. ‘రాముడిపై కేసు విచారణను వాయిదా వేయాలి. ఎందుకంటే ఆయనకు సరైన చిరునామా లేదు....రాముడిపై కేసు వేశారు సరే. ఆయన కేసు విచారణకు హాజరైతే వింతే....రాముడిపై 2000 సంవత్సరాల క్రితమే కేసు వేసి ఉంటారు. ఆయనపై ఈరోజు భూమిపైన విచారణ జరగుతోంది.....త్రేతాయుగం నాటి కేసులను కూడా పరిష్కరించేందుకు కోర్టు సిద్ధమైంది. రాముడు తన భూమి, సంపదను తిరిగి ఇచ్చివేయాలంటూ వేసే కేసును కూడా విచారణకు స్వీకరిస్తారని ఆశ కలగింది....ఈ కేసు విచారణ నేపథ్యంలో కురుక్షేత్ర యుద్ధానికి సంబంధించిన ఫైళ్లన్నింటినీ వెల్లడించాలని మనం మోదీపై ఒత్తిడి తీసుకరావాలి....నిందితుడైన రాముడిని జడ్జీ మొట్టమొదటిసారిగా ‘మై లార్డ్’ అని సంబోధిస్తారు కాబోలు....మీకు 14 ఏళ్ల జైలుశిక్ష విధంచవచ్చేమో....బీహార్ కోర్టుల్లో లక్షలాది కేసులు పెండింగ్‌లో ఉండగా రాముడిపై కేసును విచారించడమెందుకో....సీతను వేధించారని రాముడిపై కేసు పెట్టారు. వీసా లేకుండా లంకకు వెల్లారంటూ హనుమంతుడిపై కేసుపెడతారా?....’ ఇలా ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. -
కిడ్నాప్ చేయడమే రావణాసురుడి తప్పా?
-
కిడ్నాప్ చేయడమే రావణాసురుడి తప్పా?: వర్మ
ఎప్పుడూ ప్రస్తుత పరిణామాల మీద మాత్రమే విరుచుకుపడే రాంగోపాల్ వర్మ ఒక్కసారిగా ఇతిహాసాల మీద పడ్డాడు. రామాయణంలోని రావణాసురుడిని, ప్రస్తుత కాలంలోని కరుడుగట్టినవారితో పోల్చి అయనకన్నా పెద్ద విలన్లు భారతదేశంలో కుప్పలుతెప్పలుగా ఉన్నారంటూ తనదైన శైలిలో చెప్పాడు. రాంగోపాల్ వర్మ ఏమన్నారో ఆయన ట్వీట్లలోనే... ''రావణాసురుడు సీతను అపహరించి తన ఆధీనంలో నెలల తరబడి ఉంచాడు. కానీ ఏదైనా అఘాయిత్యానికి ఒడిగట్టాడా? ... ఆహా ఏదో అడుగుతున్నా. రావణుడు విలన్ అని తెలుసు.. కానీ హిట్లర్, ఒసామా బిన్ లాడెన్లలా.. కరుడు గట్టిన విలన్లా ప్రవర్తించినట్టు ఎప్పుడూ వినలేదు. ఒక విలన్లా రావణాసురుడు ఎప్పుడూ చేయలేదు... అయినా నిజంగా అతనొక పెద్ద విలనా? (దీనిపై పోల్ క్వశ్చన్ కూడా పెట్టారు) నేను చదివిన వాటిలో రాక్షసులు ఎవరూ రాక్షసులు చేసే పనులు చేయలేదు. మరోలా చెప్పాలంటే రచయితలు ఎవరూ క్యారెక్టర్లని సరిగా డెవలప్ చేయలేదు కానీ మనం వాటిని గుడ్డిగా నమ్ముతున్నాం.. సీతను అపహరించడమే రావణాసురుడి తప్పయితే.. భారత్‌లో ప్రతి నెలా 100 మందికి పైగా రావణాసురుడి కన్నా పెద్ద విలన్లను మనం అందించొచ్చని అనుకుంటున్నాను'' అని వర్మ అర్ధరాత్రి నుంచి మొదలుపెట్టి వరుసగా ట్వీట్లు చేసుకుంటూ పోయారు. ఐఎస్ఐఎస్ని తయారు చేసి పెంచి పోషించింది అమెరికా కాదా? అని ట్వీట్ చేశారు. Apart from not commiting any atrocity on Sita,inspite of being in his custody for months,did Ravana commit any other atrocities? just asking — Ram Gopal Varma (@RGVzoomin) November 15, 2015 I know that Ravana was a villain but I never heard a single act of villainy of his like I heard of Hitler,Osama bin laden etc — Ram Gopal Varma (@RGVzoomin) November 15, 2015 If Raavana's only crime is just kidnapping Sita I think we produce atleast 100 much more bigger villains every month in India — Ram Gopal Varma (@RGVzoomin) November 15, 2015 -
సీతపై శీతకన్ను
శీతాకాలం చలిమంచు కరుస్తుంది. ఆ మంచు కంటే కటువైనది పేదరికం. ఆ పేదరికం కంటే కర్కశమైనది పేద మహిళ జీవితం. బహుశా సీత చూసిన కష్టం ఏ పేద మహిళ కూడా చూసి ఉండకపోవచ్చు. గ్యాంగ్‌రేప్ చేశారు. రైలు పట్టాల మీద పారేశారు. రైలు కూడా ఆగలేదు... కనికరం చూపలేదు. నిలబడడానికి కాళ్లు లేవు. ఆసరాగా అమ్మ కూడా నిలబడలేదు. ప్రపంచమంతా శీతకన్ను వేసినా... ఈ సీత కన్ను అదరలేదు... ఈ సీత మనసు బెదరలేదు ఈమె గురి చెదరలేదు. కష్టాన్ని కాలదన్నింది... నిష్ఠూరాన్ని నిగ్గదీసింది. ఊతం ఇస్తోంది. ఉదాహరణగా నిలిచింది. పేదరికం.. గ్యాంగ్‌రేప్.. అవిటితనం.. సొంత తల్లి నుంచే నిరాదరణ... ఇవి సినిమా కష్టాలు కావు. ఓ సీతకు కాలం విసిరిన సవాళ్లు! స్వీకరించింది.. గెలిచింది.. కాలాన్ని కాళ్ల దగ్గర కట్టిపడేసింది! ఆ సీత కథ ఎలా మొదలైందంటే... రాజస్థాన్‌లోని చిత్తోడ్‌గఢ్ జిల్లా, ఫతేపుర గ్రామం సీత స్వస్థలం. తల్లి తప్ప నా అనేవారెవ్వరూ లేరు ఆమెకు. 20 ఏళ్ల పిల్ల. చదువు లేదు. కూలికెళ్తేనే కూడు. లేకుంటే పస్తే. ఇంటికి దగ్గర్లోనే ఉన్న ఓ కన్స్ట్రక్షన్ వర్క్‌లో కూలీగా పనిచేసేది. ఒకరోజు.. ఎప్పటిలాగే కూలీకి వెళ్లింది. సరిగ్గా పనిచేస్తున్నా.. నోటి దురుసుతనం చూపాడు మేస్త్రీ. ఆమెకు పట్టలేనంత కోపం వచ్చింది. మౌనంగా ఉండలేకపోయింది. ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే కుదరదని హెచ్చరించింది. అంతమందిలో సీత తనకు ఎదురుతిరగడంతో మేస్త్రీ అహం దెబ్బతింది. సీతకు తగిన గుణపాఠం చెప్పాలని అనుకున్నాడు. రెండు రోజులు పనిచోట సీతపట్ల బాగానే ఉన్నాడు. మర్యాద నటించాడు. ఇంకోవైపు తన స్నేహితులు, ఫతేపురా సర్పంచ్‌తో కలిసి సీత కిడ్నాప్‌కి పథకం పన్నాడు. మూడోరోజు సీత పని నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం స్నేహితులు, సర్పంచ్‌తో కలిసి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశాడు మేస్త్రీ. ఎవరికీ అనుమానం రాకుండా ఆ వ్యాన్ని చుట్టుపక్కల ఊళ్లన్నీ తిప్పుతూ వారంతా ఆ అమ్మాయి మీద లైంగిక దాడి చేశారు. స్పృహ తప్పిన సీతను మధ్యరాత్రి ఫతేపురా రైలు పట్టాల దగ్గర పడేసి వెళ్లిపోయారు. అప్పుడే అటుగా వచ్చిన ఓ రైలు చక్రాల కింద ఆమె కాళ్లు నలిగిపోయి ప్రాణం మిగిలిపోయింది. మూడోగాయం.. ఆ సంఘటన జరిగిన నాలుగు రోజులకి గానీ సీతకు మెలకువ రాలేదు. స్పృహ వచ్చాక... నడుం కింది భాగమంతా మొద్దు బారిపోయినట్టుగా ఉంది. కాళ్లు కదిపి రిలాక్స్ అవుదామని ప్రయత్నిస్తే మోకాళ్లు మాత్రమే కదిలాయి. మోకాళ్ల కిందిభాగంలో చర్మాన్ని లాగి కుట్టేసిన ఫీలింగ్. దిగ్గున లేచి చూసుకుందామనుకుంటే ఒళ్లంతా బరువుగా అనిపించింది. నిస్సహాయంగా పక్కనే ఉన్న తల్లివంక చూసింది. ‘రైలు కింద కాళ్లు చితికాయి. ఆపరేషన్ చేసి తీసేసారు’ అని చెప్పింది తల్లి. మనసుకు తగిలిన దెబ్బ, శరీరానికి అయిన గాయం.. రెండూ కలిసి ఒక్కసారిగా సీతను దుఃఖంలో ముంచెత్తాయి. కుమిలి కుమిలి ఏడ్చింది. దగ్గరకొచ్చి తల్లి ఊరడిస్తుందేమో అనుకుంది. రాలేదు సరికదా.. అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ రెండు గాయాల కన్నా ఈ చర్య ఆమెను ఎక్కువగా బాధించింది. కోలుకున్న సీత పోలీస్ కంప్లయింట్ ఇచ్చింది. మేస్త్రీతో పాటు ఆయనకు సహకరించిన వాళ్లందరినీ సర్పంచ్ సహా అరెస్ట్ చేశారు పోలీసులు. రెండు లక్షల రూపాయల నష్టపరిహారాన్నీ ఇప్పించారు. అయితే కథ ఇక్కడితో ముగిసిపోలేదు. నిజానికి ఇక్కడే మొదలయ్యింది. ఎలా? రెండు లక్షల పరిహారంతో పాటు అవిటితనాన్ని మోసుకొచ్చిన సీత ఆ తల్లికి గుదిబండలా కనిపించడం మొదలుపెట్టింది. పుట్టెడు దుఃఖంలో ఉన్న బిడ్డను పొట్టలో పెట్టుకోవాల్సిన తల్లి.. బిడ్డను అవమానించసాగింది. కూర్చోని తింటే రెండు లక్షలు ఎన్నాళ్లకు సరిపోతాయి? పనీపాటా చేయలేని నిన్ను ఈ రెండు లక్షలతో ఎంతకాలం సాకాలని ముద్ద పెట్టినప్పుడల్లా దెప్పిపొడిచేది. తల్లి పెట్టే తిండి కన్నా ఆమె తెప్పించే కన్నీళ్లతోనే కడుపు నిండిపోయేది సీతకు. అలా రోజులు గడుస్తుండగా.. ఓసారి సీత విషయంలో అరెస్టయిన దోషుల తాలూకు కుటుంబీకులు సీత వాళ్లమ్మను కలిశారు. అప్పటి నుంచి కూతురి విషయంలో ఆమె మరింత కఠినమైంది. న్యూ బిగినింగ్ ‘కంప్లయింట్ వెనక్కి తీసుకోమంటున్నారు. జరిగిందేదో జరిగిపోయింది. వాళ్లు జైల్లో ఉంటే నీకేమొస్తుంది..? వాళ్లు చెప్పినట్టుగా కంప్లయింట్ వెనక్కి తీసుకుంటే ఇంకో రెండులక్షల రూపాయలొస్తాయి’ అంటూ నస మొదలుపెట్టింది సీత తల్లి. ‘నాకు డబ్బులు ముఖ్యం కాదు. నాకు జరిగిన అన్యాయం ఇంకే ఆడపిల్లకూ జరక్కూడదు. వాళ్లు జైల్లో మగ్గితేనే ఆడవాళ్ల పట్ల ఎలా ఉండాలో తెలుస్తుంది. గౌరవించడం నేర్చుకుంటారు’ అని సమాధానం చెప్పింది సీత. ఈ మాటకు ఆమె తల్లికి కోపమొచ్చింది. వాళ్లు జైల్లో ఉంటే జీవితాంతం నిన్ను పోషించడానికి నా దగ్గర లక్షల కుప్పల్లేవ్’ అంది విసురుగా. తల్లి ప్రవర్తనకు విస్తుపోయింది సీత. దోషుల బంధువుల దగ్గర్నుంచి ఒత్తిడి ఎక్కువైంది. కూతురేమో వినట్లేదు. పైగా తనను పోషించడం రోజురోజుకీ భారంగా మారింది ఆమెకు. కూతురుని ఇంట్లోంచి గెంటేసింది. పేదరికం కన్నపేగును కూడా తెంచేసుకుంటుందన్న సత్యం బోధపడిన సీత.. గత్యంతరం లేక.. ఏ ఆదరణా దొరక్కా పోలీసుల సహాయం కోరింది. వాళ్లు ఆమెను ‘ప్రవాస్’ అనే ఆశ్రమంలో చేర్చారు. అక్కడే ఓనమాలు దిద్దుకుంది. బ్రిడ్జ్కోర్స్లో టెన్త్ పూర్తి చేసింది. సొంత కాళ్లమీద నిలబడ్డానికి బట్టలు కుట్టడం నేర్చుకుంది(హ్యాండ్ మిషిన్‌తో). ఇంకోవైపు కంప్యూటర్స్‌లో బేసిక్ కోర్సూ పూర్తి చేసింది. ఓపెన్ డిగ్రీ తరగతులకూ హాజరవుతోంది. ఇదంతా తన జీవితాన్ని చక్కదిద్దుకునే ప్రయత్నం. ఇంకోవైపు తనలాంటి వాళ్లకు సహాయం అందించడానికీ అడుగులేస్తోంది. బట్టలు కుట్టి సంపాదించిన దాంట్లోంచి కొంత డబ్బును ప్రవాస్ ఆశ్రమానికిస్తోంది. విధి వీథిలో పడేసినా ధైర్యం ఉంటే చాలు ఆకాశాన్నే చూరు చేసుకొని ఎలా బతకొచ్చో చెప్తోంది. తననే ఓ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్‌గా చూపిస్తోంది. దీంతో ఆగలేదు. ఇక్కడే ఓ కొత్త బిగినింగ్ అడుగులేయించింది ఆమెను జర్మన్ఫూట్తో. సీత కథను ఇంటర్నేషన్లో జర్నల్స్‌లో చదివిన ఓ జర్మన్ జర్నలిస్ట్ ఆమె ధైర్యానికి అబ్బురపడ్డాడు. ఇండియా వచ్చి ఆమెను కలుసుకున్నాడు. జర్మన్ఫీట్ను కానుకగా ఇచ్చాడు.. ఆమె మనోబలం గడపదాటి బయటకు రావాలని! సీత గడపదాటింది.. తాను నడవడమే కాదు నడవలేని వాళ్లకు నడకా నేర్పుతోంది! ‘మా అమ్మ మీద జాలి తప్ప కోపం లేదు. మేస్త్రీ మీద కనికరం లేదు. నా పరిస్థితి పట్ల భయమూ లేదు. అసలీ ప్రతికూలతలు లేకుంటే నా శక్తి నాకు తెలిసేదే కాదు. కాబట్టి ఏదొచ్చినా ఎదుర్కొని నిలబడ్డమే కానీ భయపడి పారిపోవద్దు. నా జీవితం నాకు నేర్పిన పాఠం ఇదే’ అంటుంది సీత. -
అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం
భద్రాచలం : సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భద్రాద్రి కళ్యాణ శోభతో కళకళలాడింది. ఆకాశమంత పందిరి ... భూదేవంత పీట ...పచ్చని తోరణాలు స్వాగతం పలుకుతుండగా.. మంగళవాయిద్యాల నడుమ పల్లకిలో శ్రీరామ చంద్రుడ్ని కల్యాణమండపానికి తరలించారు. మండపానికి చేరుకున్న సీతమ్మ తల్లిని దర్శించుకుని భక్తులు పారవశ్యంలో మునిగిపోయారు. విష్ణు స్వరూపుడైన శ్రీరామునికి ..శ్రీమహాలక్ష్మి ప్రతిరూపమైన సీతమ్మనిచ్చి కన్యాదానం నిర్వహించారు. వేద మంత్రాల మధ్య శ్రీరాముడు సీతమ్మకు మంగళ సూత్రధారణ చేశాడు.. రాముని కళ్యాణానికి గవర్నర్ నరసింహన్ ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. -
రాముడు సీతను అనుమానించాడా...
సీతారాముల జంట లోకానికి ఆదర్శప్రాయం వారి జంటే ఎందుకు ఆదర్శప్రాయం అయ్యింది? సీత సంగతి పక్కన పెడితే రాముడు ఎందుకు ఆదర్శం అయ్యాడు శివధనుస్సు విరిచి సీతను వివాహమాడినందుకా పట్టాభిషేకం కాదని ఆమెను అడవుల పాల్చేసినందుకా రావణుడు సీతను అపహరించి లంకలో ఉంచితే... సంవత్సరానికి కాని ఆమెను చెర నుంచి విడిపించనందుకా... తనలో సగభాగమైన సీతను అగ్నిప్రవేశం చేయించినందుకా... ఎందుకు రాముడు ఆదర్శం అయ్యాడు... ఒక్కసారి రామాయణం పరిశీలిద్దాం... గురువులు విశ్వామిత్రునితో మిథిలకు వెళ్లాడు. జనకుని కుమార్తె సీతను వివాహమాడాలంటే శివధనుస్సును ఎక్కుపెట్టాలి. గురువుల అనుజ్ఞతో శివధనుస్సు విరిచి, వారి ఆశీర్వాదంతో సీతను పరిణయమాడాడు శ్రీరాముడు. సీతను తన వెంట అయోధ్యకు తీసుకువెళ్లాడు.గురువుల ఎంపిక ఎంత గొప్పదో అర్థం చేసుకున్నాడు. జానకి తన ప్రాణానికి ప్రాణంగా ఉంటుందని తెలుసుకున్నాడు. అందుకే జానకిని తన ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నాడు. కొద్దిరోజులకే... దశరథుడు శ్రీరామ పట్టాభిషేకం నిర్ణయించాడు. రాముడు... తెల్లవారితే రాజు కాబోతున్నాడు! ఇంకేముంది! పట్టాభిషేకమే కదా! సీత మహారాణి అయిపోతుంది! ఇంత ఆనందంగా గడుపుతున్న సమయంలో... పినతల్లి కైకమ్మ అసూయకు రాముడు అరణ్యవాసం చేయాల్సి వచ్చింది. వెళ్లవలసింది తను మాత్రమే కనుక, సీతను తనతో పాటు సీత కూడా కష్టాలు పడకూడదనుకున్నాడు. అందుకే తాను మాత్రమే అరణ్యవాసానికి బయలుదేరాడు. ఇంతలో సీత వచ్చి, ‘రామా! మా అమ్మ నాకు కొన్ని నీతులు బోధించింది. భర్త సుఖాలలోనే కాదు, కష్టాలలోనూ పాలు పంచుకోవాలని చెప్పింది. అందువల్ల నేను కూడా నీ వెంట అడవులకు వస్తాను’ అంది. అందుకు రాముడు ‘సీతా! అరణ్యమంటే - చెలికత్తెలు వింజామరలు వీచుతుంటే సుఖంగాపట్టుపరుపుల మీద నిద్రించడం, బంగారుపళ్లెంలో భోజనం చేయడం, దాసదాసీ జనం సేవ చేస్తుంటే జీవనం గడపడం అనుకోకు. అరణ్యమంటే - పులులు, సింహాలు, పాములు... వంటి ఎన్నో విషప్రాణులు ఉంటాయి. వాటి బారి నుంచి నిరంతరం జాగ్రత్తగా ఉండాలి. అక్కడ కటిక నేల మీద పరుండాలి. సాత్వికమైన ఆహారం తినాలి. అన్నీ కష్టాలే. అందువల్ల నా అరణ్యవాసం పూర్తయ్యేవరకు నువ్వు నీ తండ్రి దగ్గర ఉండు... అని అనునయించాడు? రాముడి మాటలకు సీతకు కోపం వచ్చింది. ‘మా నాన్న ఎంత తెలివితక్కువవాడయ్యా, ఆడ రూపంలో ఉన్న పురుషుడికిచ్చి నన్ను వివాహం చేశారు’ అని కొంచెం పరుషంగాపలికింది. అసలు రాముడు తన వెంట ఎందుకు రావద్దన్నాడు... సీత తన కష్టాలలో పాలుపంచుకోవడానికి సిద్ధంగా ఉందో లేదో తెలుసుకోవాలనుకున్నాడు. ఇన్నాళ్లూ రాజభోగాలు అనుభవించిన సీత ఈ నాడు ఇన్ని కష్టాలకు ఓర్చుకోగలదో లేదో అర్థం చేసుకోవాలనుకున్నాడు. అందుకే ఆమె మాటలకు కోపం రాకపోగా ఎంతో ఆనందం కలిగింది రాముడికి. ఆమె పలికిన ఆ మాటలలో సీతకు రాముడిపై ఉన్న అనురాగం ప్రతిబింబించింది. అందుకే రాముడు సీతను తన వెంట అరణ్యాలకు తీసుకువెళ్లాడు. అంతటి అనురాగం ఉన్న సీత వెంట ఉంటే ఎన్ని కష్టాలనైనా ఎదుర్కోవచ్చనుకున్నాడు. అందుకు రాముడు అదర్శం అయ్యాడు. అరణ్యాలలో సీత తనతో ఎన్నో ఇబ్బందులు అనుభవించింది. నేలపై నిరాడంబరంగా శయనించింది. అక్కడ దొరికే కందమూలాలు మాత్రమే స్వీకరించింది. దశరథ మహారాజు ఇంటి కోడలై ఉండీ, ఎటువంటి రాజభోగాలూ అనుభవించకుండా, ఒక సామాన్య పౌరురాలిగా అరణ్యంలో జీవనం సాగించింది. తన కోసం అన్ని ఇబ్బందులు పడిన సీతను రాముడు ఎలా మరువగలడు? ఆమెకు ఎటువంటి ఇబ్బందులూ కలుగకుండా కంటికి రెప్పలా కాపాడుకున్నాడు సీతను రాముడు. అందుకు రాముడు ఆదర్శం అయ్యాడు. ఎన్నడూ ఏ కోరికా కోరని సీత, బంగారులేడి కావాలని తన మనోరథాన్ని వ్యక్తపరిచింది. సీత కోరిక కోరినందుకు రాముడు ఎంతో ముచ్చటపడ్డాడు. ఎంతో సామాన్యంగా జీవించే తన సీత ఇన్నాళ్లకు ఒక్క కోరికైనా కోరిందని సంబరపడ్డాడు. అంతే వెంటనే ఆ లేడి కోసం బయలుదేరాడు. ఇంతోనే జరగకూడనిది జరిగిపోయింది. పది తలల రావణుడు సీతను అపహరించుకుపోయాడు. అంతే... రాముడు పసిపిల్లవాడైపోయాడు. తన సీత లేకుండా తాను జీవించలేనన్నాడు. ఆమె మరణించి ఉంటే తక్షణమే తాను ప్రాణత్యాగం చేస్తానన్నాడు. కైక కోరిక ఆ విధంగా నెరవేరుతుందనుకున్నాడు. అందుకు రాముడు ఆదర్శం అయ్యాడు. రాముడు మహారాజ బిడ్డ. తను కావాలనుకుంటే ఇటువంటి సీతలు వందలమంది తన కనుసన్నలలో మెలగుతారు. మరి సీతే కావాలని ఎందుకు తాపత్రయపడ్డాడు. సీతకు తెలుసు, రాముడితో అరణ్యవాసం చేయవలసి వస్తే, ఎన్నో ఇక్కట్లపాలవ్వాలి. అయినా రాముడి తోడిదే జీవితం అనుకుంది. ఆయనతో కలిసి అడుగులో అడుగు వేసింది. అంతటి సీతను మరచిపోయే బలహీనుడు కాదు రాముడు. సీత కోసం చెట్టూ పుట్టా గాలించాడు. కనిపించిన ప్రతిప్రాణి నీ తన సీత జాడ చెప్పమని అర్థించాడు. సీత కనిపించకపోతే సర్వ ప్రాణికోటినీ తన దగ్గర ఉన్న ఆయుధంతో నాశనం చేసేస్తానన్నాడు. అందుకు రాముడు ఆదర్శప్రాయుడయ్యాడు. మరి ఇంతటి రాముడు సీతను అగ్ని ప్రవేశం ఎందుకు చేయించాడనుకోవచ్చు. సీతను అన్వేషించేవరకు రాముడు సామాన్యుడు. కాని సీతను అన్వేషించాక రాముడు రాజు. ఒక రాజు తాను చేసే పనులతో తన ప్రజలకు ఆదర్శప్రాయుడు కావాలే కాని, తానే తప్పు చేసి వారికి తప్పు చేసే అవకాశం ఇవ్వకూడదు. అందుకే తన సీత నిప్పులాంటిదని నిరూపించాలనుకున్నాడు. సీత నిష్కలంక శీలవతి అనీ, రాముడినే త్రికరణశుద్ధిగా ఆరాధిస్తున్నదనీ, దుష్టచిత్తుడయిన రావణుని నిరోధించగల పాతివ్రత్య తేజస్విని అనీ రాముడికి తెలుసు. కాని లోకం ఉన్నదేఅది విశ్వసించాలి. రాముడి అంతరంగం ఎరిగిన సీత తన పవిత్రతను నిరూపించుకోవడానికి అగ్నిప్రవేశం చేసింది.దీర్ఘకాలం రావణ అంతఃపురంలో ఉన్న స్త్రీని రాముడు చేపట్టాడని వేలెత్తి చూపకుండా ఉండటం కోసం రాముడు అంత పరుషంగా ప్రవర్తించాడు. జానకి పాతివ్రత్య జ్వాలారూపిణి అని ప్రపంచానికి చాటాడు. తన ప్రజలకు తానేమిటో చూపాడు. అందుకు రాముడు ఆదర్శం అయ్యాడు. - డా.పురాణపండ వైజయంతి -
రాముడితో కలిసి సీత నడిచిన దూరం 2,322 కి.మీ..?!
తండ్రి మాటతో రాచరికాన్ని వదిలిపెట్టి భార్య సీత, తమ్ముడు లక్ష్మణుడు వెంట రాగా పద్నాలుగేళ్ల వనవాసానికి బయల్దేరాడు రాముడు. ఉత్తరభారతదేశం నుంచి దక్షిణభారతదేశమంతా వీరు ప్రయాణించినట్టు వాల్మీకి రామాయణం తెలియజేస్తుంది. అయోధ్య నుంచి మొదలైన సీతారామ లక్ష్మణుల ప్రయాణం నేటి ఉత్తరప్రదేశ్, బీహార్, నేపాల్‌లోని జనక్‌పూర్, మహారాష్ట్ర, కర్నాటక, హంపి, తమిళనాడుల మీదుగా సాగింది. గోదావరి తీరాన పంచవటి లో సీతను రావణుడు అపహరించాడని, అటునుంచి రాముడు సీతను వెదుకుతూ రామేశ్వరం చేరుకున్నాడని, వానరుల సాయంతో సము ద్రం మీద వారధి నిర్మించి, లంకను చేరి రావణుడిని హతమార్చి, సీతను తీసుకొని తిరిగి అయోధ్య చేరుకున్నాడని కథనం. ఈ రోజుల్లో ఉత్తర్‌ప్రదేశ్ - తమిళనాడుల మధ్య దూరం లెక్కిస్తే రోడ్డు మార్గం 2,322 కి.మీ. రైలుమార్గంలో ప్రయాణిస్తే 30-35 గంటల్లో ఉత్తరప్రదేశ్ నుంచి తమిళనాడు చేరుకోవచ్చు. కాని నాడు కాలినడకన అరణ్యాలు, కొండకోనలు దాటుకుంటూ నదీపరీవాహక ప్రాంతాలను సమీక్షిస్తూ... వేల యోజనాలు సీతారామ లక్ష్మణులు ప్రయాణించి ఉండవచ్చని, ఇంత అని నిర్ధారణ చేయలేని ప్రయాణం వీరిదని చరిత్రకారులు చెబుతున్నారు. రామలక్ష్మణులకు విశ్వామిత్రుని యాగసంరక్షణార్థం బాల్యం లోనే అడవులకు వెళ్లి, రాక్షసులతో పోరాడిన అనుభవం ఉంది. కాని, సీత.. తండ్రి ఇంట సుకుమారిగా పెరిగిన యువరాణి. పట్టు తివాచీల రహదారులే ఆమెకు సుపరిచితం. అలాంటిది అత్తింట అడుగుపెట్టడంతోనే ఆమె భర్త వెంట వనవాసం చేయడానికి ప్రయాణమైంది. రాముడితో పాటు దుర్భేధ్యమైన అడవి మార్గాల గుండా తనూ కాలినడకన ప్రయాణించింది. అడుగడుగునా ముళ్లూ, రాళ్లూ, క్రూరమృగాలు, విష సర్పాలు, రాక్షసులు.. ఎండావానలు.. వేటినీ లెక్కచేయక వేల యోజనాలు పాదయాత్ర చేసి భర్త వనవాస దీక్ష దిగ్విజయం కావడానికి తనూ పాటుపడింది మహిమాన్విత సీత.