భారతదేశంలో వివాహితుడు భార్య ప్రక్కన ఉంచుకోకుండా ఏ క్రతువు, వ్రతము చెయ్యకూడదు. భార్య భర్త ప్రక్కన ఉండాలి. సహధర్మచారిణి అనేది పత్నికి వాచకం. గృహస్థుడు అనుష్ఠించాల్సిన కర్మకలాపాలు వందల. సంఖ్యలో ఉన్నాయి. కానీ భార్య లేకపోతే సక్రమంగా ఏ కర్మ చెయ్యడానికి శాస్త్ర ప్రకారం అతడికి అర్హత లేదు.
రాముడి భార్య బహిష్కరింపబడ్డ కారణంగా ఆమె అతని ప్రక్కన లేదు. కాబట్టి ప్రజలు రాముణ్ణి పునర్వివాహం చేసుకోమన్నారు. " అలా ఎన్నటికీ జరగదు.నా జీవితం సీతదే." అన్నాడు రాముడు. రాజుగా అతడు ప్రజల కోరికను ప్రతిఘటించడం ఇదే మొదలు. యజ్ఞనిర్వహణార్థం అప్పుడు సీతాదేవికి బదులుగా బంగారంతో ఒక సీత ప్రతిమను రూపొం దించారు.
రాముడు నైమిశారాణ్యంలో అశ్వమేధ యాగం చేసాడు.ఆ యజ్ఞానికి వాల్మీకి మహర్షి శిష్య సమేతంగా వెళ్ళాడు. వాల్మీకి కుశలవులను రామాయణాన్ని గానం చేయమని ఆదేశిం చాడు. రామాయణాన్ని విన్న రాముడు వారుసీత పుత్రులే అని నిశ్చయించుకున్నాడు. సీత తన శుద్ధిని తన నిర్దోషిత్వాన్ని ఋజువు చేసే శపథం చేయాలని దూతల ద్వారా కబురు పంపాడు. వాల్మీకి వెంట సీత సభలో ప్రవేశించింది. సీత చేయబోయె శపథాన్ని వినటానికి వచ్చిన వివిధ వర్గాల ప్రజలతో ఆ సభ కిక్కిరిసిపోయింది.
వాల్మీకి తన తపస్సు సాక్షిగా సీత పరిశుద్ధు రాలని ఉద్ఘోషించాడు. సీత సౌశీల్యం తనకుతెలుసని అయినా లోకాపవాదానకి వెరసితాను సీతను పరిత్యజించినట్లు అంగీకరిం చాడురాముడు.ఈ కలవలిద్దరు తన బిడ్డలేనన్నాడు.
సీత త్రికరణశుద్ధిగా తాను రాముడిని పూజించి నట్లయితే వివరమిమ్మని భూదేవిని ప్రార్థించింది మనసా కర్మణా వాచా యథా రామం సమర్చయే । తథామే మాధవీ దేవి వివరం దాతుమర్హతి ॥
అప్పుడు భూమి విచ్చుకుంది. " ఇదిగో ఋజువు " అంటూ సీత భూమిఒడిలోచేరింది. భూదేవి సీతను సింహాసనంపై కూర్చోబెట్టుకొని రసాతలానికి వెళ్ళిపోయింది. ఈ విషాద పర్యవసానానికి ప్రజలు నిర్వీణ్ణులయ్యారు. రాముడు శోక సముద్రంలో మునిగి పోయాడు.
సీతాదేవి పాతివ్రత్యమే! పవిత్రతా సరూపమే! ఆమె తన భర్త దేహాన్ని తప్ప మరొకరి దేహాన్పి స్పృశించదు. "పాతివ్రత్యమే ఆమె పరిశుద్ధత"అని రాముడన్నాడు.
సీత అనే మాట భారత దేశంలో శుభం, పరిశుద్ధం,పవిత్రమైనవాటికెల్లా పర్యాయపదం,ఆమె సకల సద్గుణాలరాశి.
సీత క్షమాశీలి,సర్వదా పరిశుద్ధ వర్తనం ఉన్న అర్థాంగి! అంతటి బాధను అనుభవిస్తున్నారాముని గురించి ఒక్క పరుషమైన వాక్కు కూడా పలకలేదు. సీత ఏనాడూ హానికి ప్రతిహాని తలపెట్ట లేదు.ప్రతి స్త్రీ సీతాదేవి అవడానికి ప్రయయ్నంచుగాక!
- గుమ్మా ప్రసాద రావు
Comments
Please login to add a commentAdd a comment