జనవరి 22న అయోధ్యలో నూతన రామాలయం ప్రారంభం కానుంది. అలాగే బాలరాముని ప్రతిష్ఠాపన మహోత్సవం కూడా జరగనుంది. దేశంలోని చాలామంది ఆరోజును ఎంతో పవిత్రమైనదిగా భావిస్తున్నారు. దీంతో తమకు ఆరోజు పుట్టబోయే చిన్నారులకు రాముడు లేదా సీత అనే పేరుపెట్టాలని చాలామంది తహతహలాడుతున్నారు.
దేశంలోని పులువురు గర్భిణులు తాము జనవరి 22న బిడ్డకు జన్మనివ్వాలని ప్లాన్ చేసుకుంటున్నారు. అలాగే ఆరోజు తమకు పుట్టబోయే పిల్లలకు రాముడు లేదా సీత అనే పేరు పెట్టాలని నిర్ణయించుకుంటున్నారు. యూపీలోని మీరట్‌కు చెందిన ఒక సీనియర్ డాక్టర్ మాట్లాడుతూ పలువురు గర్భిణులు జనవరి 22న డెలివరీ చేయాలని తమ ఆసుపత్రికి వస్తున్నారని తెలిపారు. అబ్బాయి పుడితే రాముడు అని అమ్మాయి పుడితే సీత అని పేరు పెడతామని వారు చెబుతున్నారన్నారు.
ఇది కూడా చదవండి: వారికి శ్రీరాముడు ‘మామ’? బంధుత్వం ఎలా కలిసింది?
Comments
Please login to add a commentAdd a comment