born
-
పిల్లలు పుట్టి చనిపోతుండటం మనస్తాపానికి లోనైన దేవి
కుత్బుల్లాపూర్ : పిల్లలు పుట్టి చనిపోతుండటం, భర్త మద్యానికి బానిస కావడంతో మనస్తాపానికి లోనైన ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది.. ఎస్సై పరమేశ్వర్ రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన దేవి (28) కోదండరామ్ దంపతులు సుభాష్‌నగర్ ప్రాంతంలో నివాసం ఉంటూ కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు పుట్టి పది నెలల వ్యవధిలోనే మృత్యువాత పడ్డారు.అప్పటి నుంచి డిప్రెషన్‌తో బాధపడుతున్న దేవి తరచూ భర్తతో గొడవ పడేది. ఆదివారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన భర్తతో మరోసారి గొడవ పెట్టుకోవడంతో అతను ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోయాడు. దీంతో మనస్తాపానికి లోనైన దేవి ఇంట్లో ఐరన్ రాడ్డుకు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తెల్లవారుజామున ఇంటికి వచ్చిన కోదండరామ్ దీనిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతురాలి సోదరుడు ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
Rahul Gandhi: ప్రధాని మోదీ జన్మతః ఓబీసీ కాదు
ఝార్సుగూడ(ఒడిశా): ప్రధాని మోదీ జన్మతః ఇతర వెనుకబడిన వర్గం(ఓబీసీ)వ్యక్తి కాదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. తనను తాను ఓబీసీ అని చెప్పుకుంటూ ప్రజలను మోదీ తప్పుదోవ పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. మోదీ ఘాంచి కులంలో పుట్టారని, 2000 సంవత్సరంలో గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం ఈ కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చిందని వివరించారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా గురువారం రాహుల్ గాంధీ ఒడిశాలోని ఝార్సుగూడలో జరిగిన సభలో మాట్లాడారు. గుజరాత్‌కు ముఖ్యమంత్రి అయ్యాక మోదీయే ఈ కులాన్ని ఓబీసీలో చేర్చారు. ఈ దృష్ట్యా, మోదీ పుట్టుకతోనే ఓబీసీకి చెందిన వ్యక్తి కారని పేర్కొన్నారు. అంతకుముందు, మోదీది తెలి కులమని పేర్కొన్న రాహుల్ ఆ తర్వాత తన ఉద్దేశం ఘాంచి కులమంటూ వివరణ ఇచ్చారు. దేశంలో సామాజిక న్యాయం సాధించకుండా ప్రధాని మోదీ కులగణనను ఎప్పటికీ చేపట్టలేరని రాహుల్ చెప్పారు. ఓబీసీలతో కరచాలనం చేయని మోదీ బిలియనీర్లను మాత్రం ఆలింగనం చేసుకుంటారని విమర్శించారు. ‘ఒడిశాలోని గిరిజనుల భూములను లాగేసుకునేందుకు కుట్ర జరుగుతోంది. రాష్ట్రంలోని అధికార బీజేడీ, బీజేపీల మధ్య పీ, డీ తేడా మాత్రమే ఉంది. మిగతాదంతా సేమ్ టూ సేమ్. ఒకే నాణేనికి ఈ పారీ్టలు రెండు పార్శా్వలు’అని రాహుల్ పేర్కొన్నారు. ఒడిశాలో సుమారు 200 కిలోమీటర్ల మేర సాగిన జోడో యాత్ర గురువారం ఛత్తీస్‌గఢ్‌లోకి ప్రవేశించింది. -
ప్రాణ ప్రతిష్ఠ వేళ.. సీతారాముల జననం!
అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ రోజున నెలలు నిండిన పలువురు గర్భిణులు శిశువులకు జన్మనిచ్చేందుకు ప్లాన్ చేసుకుని, వైద్యుల సాయంతో డెలివరీలు చేయించుకున్నారు. ఈ సమయంలో పుట్టిన చిన్నారులకు అబ్బాయి అయితే రాముడు అని, అమ్మాయి అయితే సీత అని పేరు పెట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్‌లోని జిల్లా మహిళా ఆసుపత్రిలో సోమవారం 13 మంది శిశువులు జన్మించారు. వీరిలో ఎనిమిది మంది నార్మల్ కాన్పులో జన్మించగా, ఐదుగురు సిజేరియన్ ఆపరేషన్ ద్వారా జన్మించారు. జనవరి 22న తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో జిల్లా మహిళా ఆస్పత్రిలో మొదటి శిశువు జన్మించింది. బర్కచ్చా ఖుర్ద్‌లో నివాసం ఉంటున్న లక్ష్మణ్ భార్య అంజలి బాలికకు జన్మనిచ్చింది. తన కుమార్తెకు సీత లేదా జానకి అని పేరు పెడతానని ఆమె తెలిపింది. 22న తెల్లవారుజామున 3.20 గంటలకు, లాల్గంజ్లోని బర్దిహా నివాసి అమిత్ మిశ్రా భార్య ప్రీతి మగ శిశువుకు జన్మనిచ్చింది. ఆ చిన్నారికి రామ్ లేదా రాఘవ్ అనే పేరు పెట్టాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు శుక్లహా నివాసి బాబుల్ సోంకర్ భార్య పుతుల్ బాలునికి జన్మనిచ్చింది. ఆటోడ్రైవర్ బాబుల్ తనకు అప్పటికే ఓ కొడుకు ఉన్నాడని, ఇప్పుడు జన్మించిన కుమారునికి రామ్ అని పేరు పెట్టనున్నామన్నారు. మిర్జాపూర్కు చెందిన ప్రీతి తెల్లవారుజామున 4.24 గంటలకు, మంజు 11.45 గంటలకు ఆడ శిశువులకు జన్మనిచ్చారు. లాల్గంజ్ మార్కెట్‌కు చెందిన అన్షు మిశ్రా ఉదయం 11.55 గంటలకు సిజేరియన్ ఆపరేషన్ ద్వారా మగ శిశువుకు జన్మనిచ్చింది. జిల్లా మహిళా ఆసుపత్రి ప్రసూతి విభాగం వైద్యురాలు జూహీ దేశ్ పాండే మాట్లాడుతూ 22న మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య ఎనిమిది మంది మగ శిశువులు, ఐదుగురు ఆడ శిశువులు జన్మించారని తెలిపారు. ఇది కూడా చదవండి: సామాన్యులకు తెరుచుకున్న రామాలయం.. భక్తుల భారీ క్యూ! -
22న పుట్టేవారంతా సీతారాములే..!
జనవరి 22న అయోధ్యలో నూతన రామాలయం ప్రారంభం కానుంది. అలాగే బాలరాముని ప్రతిష్ఠాపన మహోత్సవం కూడా జరగనుంది. దేశంలోని చాలామంది ఆరోజును ఎంతో పవిత్రమైనదిగా భావిస్తున్నారు. దీంతో తమకు ఆరోజు పుట్టబోయే చిన్నారులకు రాముడు లేదా సీత అనే పేరుపెట్టాలని చాలామంది తహతహలాడుతున్నారు. దేశంలోని పులువురు గర్భిణులు తాము జనవరి 22న బిడ్డకు జన్మనివ్వాలని ప్లాన్ చేసుకుంటున్నారు. అలాగే ఆరోజు తమకు పుట్టబోయే పిల్లలకు రాముడు లేదా సీత అనే పేరు పెట్టాలని నిర్ణయించుకుంటున్నారు. యూపీలోని మీరట్‌కు చెందిన ఒక సీనియర్ డాక్టర్ మాట్లాడుతూ పలువురు గర్భిణులు జనవరి 22న డెలివరీ చేయాలని తమ ఆసుపత్రికి వస్తున్నారని తెలిపారు. అబ్బాయి పుడితే రాముడు అని అమ్మాయి పుడితే సీత అని పేరు పెడతామని వారు చెబుతున్నారన్నారు. ఇది కూడా చదవండి: వారికి శ్రీరాముడు ‘మామ’? బంధుత్వం ఎలా కలిసింది? -
గొర్రెకు మేకపిల్ల జననం
దేవరుప్పుల: జనగామ జిల్లా దేవరుప్పుల మండలం గొల్లపల్లిలో కోనేటి సోమయ్యకు చెందిన గొర్రెకు మేకపిల్ల జన్మించింది. శనివారం జరిగిన ఈ వింతను చూసి పెంపకందారులు, స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన జనగామ–సూర్యాపేట రహదారి పక్కనే జరగడంతో బాటసారులు సైతం ఆసక్తిగా గమనించారు. దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ విషయమై మండల పశువైద్యాధికారి సింధుప్రియ మాట్లాడుతూ ఒకే మందలో గొర్రెలు, మేకలు తిరిగినప్పుడు అనుహ్య సంపర్క ప్రక్రియతో ఇలాంటి సంఘటనలు అరుదుగా జరుగుతాయని పేర్కొన్నారు. -
అలవాటుని అధిగమించటం అతికష్టం!
అలవాట్లు మనిషిని పట్టిస్తాయి. అంతే కాదు బంధిస్తాయి, బానిసని కూడా చేస్తాయి. అలవాటుకి ప్రయత్నం అవసరం లేదు. అలవాటు రెండవ స్వభావం అని చెప్పవచ్చు. స్వభావం లాగానే అలవాటుని కూడా అధిగమించటం చాలా కష్టం. అది ఎంతగా వంటపట్టిపోతుందంటే దాన్ని విడిగా గుర్తించటం కూడా కుదరదు. నిజానికి అది పుట్టుకతో వచ్చింది కాదు. తరవాత పెంపొందించుకున్నది. అలవాట్లు మనిషిని పట్టిస్తాయి. అంతే కాదు బంధిస్తాయి, బానిసని కూడా చేస్తాయి. అలవాటుకి ప్రయత్నం అవసరం లేదు. అలవాటు రెండవ స్వభావం అని చెప్పవచ్చు. స్వభావం లాగానే అలవాటుని కూడా అధిగమించటం చాలా కష్టం. అది ఎంతగా వంటపట్టిపోతుందంటే దాన్ని విడిగా గుర్తించటం కూడా కుదరదు. నిజానికి అది పుట్టుకతో వచ్చింది కాదు. తరవాత పెంపొందించుకున్నది. పెరిగిన భౌగోళిక, ఆర్థిక, సాంఘిక, రాజకీయ, పరిస్థితులు, వాతావరణం, మనుషులు, మత విశ్వాసాలు మొదలైన ఎన్నో అంశాలు ఒక అలవాటు ప్రబలటానికి దోహదం చేస్తాయి. అవే పరిస్థితుల్లో ఉన్న మరొక వ్యక్తికి అది కాక మరొక అలవాటు ఉండవచ్చు. దీనికి వ్యక్తి స్వభావం కారణం అవుతుంది. అంటే, వ్యక్తి సహజ స్వభావం, పరిస్థితుల ప్రభావాల సమాహారంగా అలవాట్లు ఏర్పడుతాయి. ఆ అలవాటు తెచ్చి పెట్టుకున్నది అని గుర్తించటం ఉండదు. అది సహజ లక్షణం అనే భ్రమలో ఆ వ్యక్తి మాత్రమే కాదు, చుట్టుపక్కల వారు కూడా ఉంటారు. అలవాటు ఎట్లా ఏర్పడిందో గుర్తించటం చాలా కష్టం. దానిని మానుకోటం మాత్రం కష్టం. ముందు అది మంచిది కాదు అని గుర్తించాలి, తరవాత మానాలి అనే సంకల్పం ఉండాలి. ఆ పైన ప్రయత్నం చేయాలి. మొదటిదే చాలా కష్టం. ఎందుకంటే మనిషికి తనని తాను సమర్థించుకోటం అన్నది సహజంగా ఉంటుంది. అలవాటై పోయంది అనటం అలవాటుగా మారింది. ఇంతకీ అలవాటు అంటే? అల+వాటు = అలవాటు. అంటే, సముద్రంలో అల ఎంత సహజంగా పైకి ఎగసి, అంతే వేగంగా ఎటువంటి ప్రయత్నం, శ్రమ లేకుండా పడుతుందో అంత తేలికగా హాయిగా జరిగిపోయేది. దానిని ప్రత్యేకంగా గుర్తించటం కూడా ఉండదు. అలవాటు అన్నది ఎంత బలంగా ఉంటుందంటే దానిని మానటం చాలా కష్టం. బలవంతంగా మానే వాతావరణం కల్పిస్తే గిజగిజ లాడిపోతారు. అందులోనూ దురలవాట్లు అయితే మరీనూ. పిచ్చిగా ప్రవర్తించటం, అవతలి వారికి పిచ్చెక్కేట్టు ప్రవర్తించటం లేదా ఆత్మహత్యలకి ΄పాల్పడటం చూస్తూనే ఉన్నాం. అదే మంచి అలవాటు అయితే ఇబ్బంది పడతారు కాని, ఉన్న పరిస్థితుల్లోనే సద్దుకునే ప్రయత్నం చేస్తారు. కాని, గిజగిజలాడరు. ఉదాహరణకి రోజూ ఒక సమయానికి ధ్యానమో, పూజో చేసుకునే అలవాటు ఉన్నవారు ఎప్పటిలాగా వీలుకాకపోతే ఉన్నంతలో ఎవరికీ ఇబ్బంది కలగకుండా తమ పని పూర్తి చేసుకుంటారు. పుస్తకాలు చదివే అలవాటు ఉన్నవారు ఎక్కడ ఉన్నా, ఎంత మంది మధ్య ఉన్నా, ఇతరులని ఇబ్బంది పెట్టకుండా పుస్తకం పట్టుకుని కూర్చొంటారు. కొంతమంది త్వరగా దేనినైనా అలవాటు చేసుకుంటారు. వీరి అలవాట్లని మార్చటం అంత కష్టం కాదు. కొత్త అలవాట్లని తేలికగా చేసుకోగలరు కనుక మంచివి అలవాటు చేస్తే సరి! కొంతమందికి ఏది అలవాటు కావటం అన్నదే ఉండదు. వీళ్ళతో ప్రమాదం ఏమంటే మంచివి, పనికి వచ్చే అలవాట్లు కూడా ఉండవు. మనిషి జీవితం చాలావరకు అలవాటుగా సాగుతుంది. కొంతమందిని ఈ విధంగా ఎట్లా బతుకుతున్నావు? అని అడిగితే అలవాటయి పోయింది అంటారు. చిన్నప్పటినుంచి ఏది అలవాటు చేస్తే అదే అలవడుతుంది. రుచులు కూడా అలవాటు వల్లనే కలుగుతాయట! చిన్నతనం నుండి కారం తినటం అభ్యాసం చేస్తే అదే అలవాటు అవుతుంది. ఎప్పుడు తినని వారికి నోరు మంట పుడుతుంది. ఒక్కొక్కప్రాతం వారు ఒక్కొక్క ఆహారాన్నీ ఇష్టపడటానికి కారణం ఇదే. అభిరుచులు కూడా అంతే! సాధారణంగా చేదు ఇష్టం ఉండదు ఎవరికీ. కాని నెమ్మదిగా అలవాటు చేసుకుని వదల లేని స్థితికి వచ్చింది సమాజం. కాఫీ, టీ, శీతల పానీయాలు ఇత్యాదులు. మొదటిసారి గొంతు దిగవు. ఆ తరువాత వదలవు. ధూమపానం, మద్యపానం సంగతి సరే సరి. – డా.ఎన్. అనంత లక్ష్మి (చదవండి: పుట్టలో పాలు పోయటంలో అంతరార్థం? ఆ 12 నాగులనే పూజిస్తారు ఎందుకు?) -
బ్రిటన్ ధూమపాన రహితదేశం కానుందా? ప్రధాని రిషి సునాక్ ప్లాన్ ఏమిటి?
బ్రిటన్ కొత్త ప్రతిపాదిత చట్టం ప్రకారం రాబోయే కొద్ది సంవత్సరాలలో బ్రిటన్‌లో ధూమపానం సమర్థవంతంగా నిర్మూలనకానుంది. 2040 నాటికి బ్రిటన్ ‘పొగ రహిత’ దేశంగా మారుతుందని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఆశాభావం వ్యక్తం చేశారు. న్యూజిలాండ్ తర్వాత రాబోయే తరం ధూమపానం చేయకుండా నిరోధించడానికి చట్టం చేసిన రెండవ దేశం బ్రిటన్. ప్రపంచంలోని అన్ని దేశాల్లో ధూమపానం ఒక సామాజిక దురాచారంగా మారింది. ధూమపానం కారణంగా లెక్కలేనంతమంది క్యాన్సర్‌తోపాటు అనేక వ్యాధులతో బాధపడుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ 2040 నాటికి దేశాన్ని ధూమపాన రహితంగా మార్చాలని నిర్ణయించారు. ఇందుకోసం బ్రిటన్‌లో కొత్త చట్టాలను రూపొందించడంపై చర్చ జరుగుతోంది. బ్రిటీష్ వయోజనులలో 12.9 శాతం మంది ధూమపానం చేస్తున్నారు. 8.7 శాతం మంది ప్రతిరోజూ ఇ-సిగరెట్లను ఉపయోగిస్తున్నారు. నూతన చట్టాలను అమలు చేయడం ద్వారా 2075 నాటికి 1.7 మిలియన్ల మంది ధూమపానం చేయడాన్ని తగ్గించవచ్చని బ్రిటీష్ ప్రభుత్వం భావిస్తోంది. యూకేలో అమలుకానున్న కొత్త చట్టం జనవరి 1, 2009న లేదా ఆ తర్వాత జన్మించిన ఎవరికైనా పొగాకు ఉత్పత్తులను విక్రయించడాన్ని చట్టవిరుద్ధం చేశారు. ప్రస్తుతం ధూమపానం చేసే వయస్సు 18 సంవత్సరాలు. ప్రతి సంవత్సరం చట్టబద్ధంగా ధూమపానం చేసే వయస్సును పెంచడం అనేది సమీక్ష ముఖ్య సిఫార్సులలో ఒకటి. ధూమపానం అనేది గుండెపోటు, స్ట్రోక్, క్యాన్సర్, అంగస్తంభన, గర్భస్రావం వంటి 50 అనారోగ్య పరిస్థితుల ప్రమాదాన్ని పెంచుతుంది. ధూమపానం సంవత్సరానికి 76,000 మందిని పొట్టనపెట్టుకుంటోంది. కేఫ్‌లు, పబ్‌లు, బార్లు, రెస్టారెంట్లలో ధూమపానాన్ని నిషేధించిన ఏకైక దేశం న్యూజిలాండ్. ఇప్పుడు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కూడా న్యూజిలాండ్ తరహాలో దేశంలో ధూమపానాన్ని నిషేధించేందుకు సిద్ధమవుతున్నారు. ఇది కూడా చదవండి: ఇందిర సభలోకి సింహం ఎందుకు వదిలారు? -
నక్షత్రాల అవిర్భావం గుట్టు విప్పిన భారత టెలిస్కోప్!
న్యూఢిల్లీ: బిగ్‌బ్యాంగ్ తర్వాత 20 కోట్ల ఏళ్లకు ఏర్పడ్డ తొలి నక్షత్రాల రహస్యాలను భారత టెలిస్కోప్ బహిర్గతం చేసింది. బెంగళూరులోని రామన్ పరిశోధనా సంస్థ (ఆర్ఆర్ఐ)లో డిజైన్ చేసి, నిర్మించిన సరస్–3 రేడియో టెలిస్కోప్‌తో నక్షత్రాల గుట్టును బయట పెట్టారు. 2020 మార్చిలో కర్ణాటకలోని దండిగనహళ్లి చెరువు వద్ద, కొంతకాలం శరావతి బ్యాంక్ వాటర్స్ వద్ద ఈ టెలిస్కోప్‌ను ఏర్పాటు చేశారు. విశ్వం ఎలా ఏర్పడిందో తెలుసుకొనేందుకు ఆర్ఆర్ఐతోపాటు ఆస్ట్రేలియాకు చెందిన కామన్వెల్త్ సైంటిఫిక్, ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (సీఎస్ఐఆర్ఓ), యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్, యూనివర్సిటీ ఆఫ్ టెల్ అవివ్ పరిశోధకులు సంయుక్తంగా ఈ పరిశోధన నిర్వహించారు. సరస్–3 టెలిస్కోప్ డేటాను ఇటవలే విశ్లేషించారు. బిగ్‌బ్యాంగ్ అనంతరం తొలుత ఏర్పడిన నక్షత్ర మండలాల్లోని 3 కంటే తక్కువ శాతం వాయువులు నక్షత్రాలుగా రూపాంతరం చెందినట్లు గుర్తించామని ఆర్ఆర్ఐ ప్రతినిధి సౌరభ్ సింగ్ చెప్పారు. దేశీయంగా అభివృద్ధి చేసిన సరస్–3 రేడియో టెలిస్కోప్ కాస్మిక్ డాన్ ఆస్ట్రోఫిజిక్స్‌పై అవగాహన మరింత పెంచుకొనేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. బిగ్‌బ్యాంగ్ అనంతర కాలాన్ని కాస్మిక్ డాన్‌గా వ్యవహరిస్తారు. అప్పటి గెలాక్సీల్లో అత్యధిక సాంద్రత కలిగిన కృష్ణ బిలాలు (బ్లాక్ హోల్స్) ఉండేవి. -
ట్రిపుల్ బొనాంజా.. ఒకే కాన్పులో ఇద్దరు కాదు ముగ్గురు
మైసూరు: ఒకే కాన్పులో ఒకరూ ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు పిల్లలు పుట్టారు. నగరంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో శనివారం ఈ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. లక్ష్మి అనే మహిళ గర్భం దాల్చింది. ప్రస్తుతం ఆమెకు 7 నెలలు. ప్రసవ వేదన రావడంతో ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. వైద్యులు సిజేరియన్ ఆపరేషన్ ద్వారా కాన్పు చేశారు. ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడపిల్ల పుట్టారు. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని వైద్య నిపుణురాలు డాక్టర్ లీలావతి తెలిపారు. కాగా, శిశువులు కొంత బరువు పెరిగేవరకూ 20 రోజులు ఐసీయూలో ఉంచుతామన్నారు. తల్లి లక్ష్మి మాట్లాడుతూ స్కానింగ్‌లో ముగ్గురు పిల్లలు ఉన్నట్లు తెలిసి ఆందోళన చెందానని, పిల్లలు క్షేమంగా ఉండడంతో సంతోషంగా ఉందని చెప్పారు. చదవండి: (Preethi Manoj: రెండువారాలు మృత్యుపోరాటం) -
సంవత్సరాల తేడాతో ఒకే నెల ఒకే తేదిలో జన్మించిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు
న్యూయార్క్: కొంత మంది ఒకే తేదిన లేదా ఒకే రోజున అక్కా తమ్ముళు పుట్టడం తరుచుగా వినే ఉంటాం. అలాగే కొంతమంది నాన్న లేదా అమ్మ పుట్టిన తేదినే పిల్లలు పుట్టడం కూడా చూసుంటాం. కానీ చాలా అత్యంత అరుదుగా సంవత్సరాల తేడాతో ఒకే నెల ఒకే తేదిన జన్మించడం జరుగుతుంది. అచ్చం అలాంటి అనుభవం యూఎస్‌కి చెందిన ఒక జంటకు ఎదురైంది. అంతేకాదు ఈ జంటకి మూడేసి సంత్సారాల తేడాతో ఒకే నెల ఒకే రోజు ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. (చదవండి: దయచేసి ఫోన్ ఎత్తి మేము సురక్షితంగా ఉన్నాం అని చెప్పండి!) వివరాల్లోకెళ్లితే...క్రిస్టిన్ లామెర్ట్ సంవత్సరాల తేడాతో ఆగస్టు 25న తన ముగ్గురు కుమార్తెలకు జన్మనిచ్చింది. మొదటి పాప సోఫియా ఇచ్చిన డెలివరీ తేది 2015 ఆగస్టు 23 అయితే రెండు రోజులు ఆలస్యంగా అంటే ఆగస్టు 25న జన్మించింది. రెండో పాప గియులియానాకి ఇచ్చిన డెలివరీ తేది 2018 ఆగస్టు 29 అయితే నాలుగు రోజులు ముందుగా ఆగస్టు 25న పుట్టింది. ఇక మూడో పాప మియా కూడా అనుహ్యంగా డెలివరీకి ఇచ్చిన తేది 2020 సెప్టెంబర్ 8 అయితే 14 రోజులకు ముందుంగా అదే తేదిన జన్మించింది. ఇలా చాలా అత్యంత అరుదుగా సంభవిస్తుంది. ఈ మేరకు ఆ ముగ్గురి బిడ్డల తల్లి క్రిస్టిన్ తాము ఇలా జరుగుతుందని అసలు ఊహించలేదు కానీ ఇది తమకు అత్యంత ప్రత్యేకం అంటూ ఆనందం వ్యకం చేసింది. అంతేకాదు ఆమె భర్త మిన్నెసోటా యూనివర్శిటీలో సోషియాలజీ ప్రొఫెసర్ అయిన రాబ్ వారెన్ మాట్లాడుతూ..."ముగ్గురు సంవత్సరాల తేడాతో జన్మిస్తారని అనుకున్నాం కానీ ఇలా ఒకే నెల ఒకే తేదిన జన్మిస్తారని ఊహించలేదు. పైగా అందుకోసం ఎటువంటి ప్లాన్ చేయలేదు." అంటూ చెప్పుకొచ్చాడు. (చదవండి: నా భార్య బాధ తట్టుకోలేకపోతున్నా.. నన్ను జైల్లో పడేయండి!) -
వింత: కోడి ఆకారంలో మేక..
పీసీపల్లి: కోడిని పోలిన ఓ మేక జన్మనిచ్చిన ఘటన శనివారం చోటుచేసుకుంది. పీసీపల్లి మండలం కమ్మవారిపల్లి గ్రామానికి చెందిన ఎస్కే దస్తగిరికి చెందిన మేక గురువారం ఒకే ఈతలో రెండు మేక పిల్లలకు జన్మనిచ్చింది. 3 కిలోలు, 1.5 కిలోల బరువు ఉన్న అవి ఆరోగ్యంగా తల్లిని పోలినట్టు ఉన్నా యి. శనివారం ఉదయం అదే మేక మరో పిల్లకు జన్మనిచ్చింది. అయితే అది గురువారం నాటి పిల్లల మాదిరిగా కాకుండా కోడి ఆకారంలో ముక్కు కలిగి ఉంది. శరీరంపై వెంట్రుకలు కూడా లేవు. కేవలం పావు కిలో బరువు మాత్రమే ఉన్న ఆ పిల్ల పుట్టిన కొద్ది సేపటికే మృతి చెందింది. వింతగా ఉన్న దీనిని చూసినవారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. (చదవండి: కిడ్నాప్ డ్రామా: నివ్వెరపోయే విషయాలు) -
అద్భుతం.. 27 ఏళ్ల తర్వాత జన్మించింది
వాషింగ్టన్: సాధారణంగా మనందరం దాదాపు తొమ్మిదినెలలు తల్లి గర్భంలో ఉన్న తర్వాత భూమ్మీదకు వస్తాం. కానీ మోలీ గిబ్సన్ అనే చిన్నారి మాత్రం దాదాపు 27 ఏళ్ల తర్వాత భూమ్మీద పడింది. ఈ ఏడాది అక్టోబర్‌లో చిన్నారి మోలీ కళ్లు తెరిచింది. కానీ తన గర్భస్థ పిండం మాత్రం 1992లో ఏర్పడింది. ఇన్నేళ్ల పాటు ఆ పిండాన్ని గడ్డకట్టిన స్థితిలో భద్రపరిచారు. తాజాగా 2020 ఫిబ్రవరిలో ఓ జంట బిడ్డ కావాలని కోరడంతో ఆ పిండాన్ని అభివృద్ధి పరిచారు. టేనస్సీకి చెందిన టీనా, బెన్ గిబ్సన్ దంపతుల ఇలా దీర్ఘకాలం గడ్డకట్టించిన పిండం నుంచి బిడ్డను కన్న దంపతులుగా రికార్డు సృష్టించారు. ఈ అరుదైన పద్దతిలో జన్మించిన రెండో బిడ్డగా మోలీ రికార్డు సృష్టించింది. గతంలో ఈ రికార్డు ఆమె సోదరి ఎమ్మా పేరు మీద ఉంది. ఎందుకంటే తాను కూడా గడ్డకట్టించిన పిండం నుంచే జన్మించింది కాబట్టి. ఈ పద్దతిని ‘ఎంబ్రోయో డొనేషన్’ అంటారు అంటారు. అంటే పిండాన్ని దత్తత తీసుకోవడం. ఈ పద్దతిలో ఏళ్ల క్రితమే పిండాలను తయారు చేసి వాటిని గట్టకట్టిన స్థితిలో భద్రపరుస్తారు. పిల్లలకు కావాలనుకున్న దంపతులకు ఈ పిండాలను దత్తత ఇస్తారు. అలా మోలీ 27 ఏళ్ల కిందటే పిండంగా మారింది. అప్పటి నుంచి ఇప్పటివరకు గడ్డకట్టిన (ఫ్రోజెన్) స్థితిలోనే ఉంది. ఎట్టకేలకు ఆమె ఈ ఏడాది అక్టోబరులో బిడ్డగా ఈ లోకంలోకి అడుగుపెట్టింది. పిల్లలు కోసం కలలుగనే జంటల కోసం ఇప్పుడు ఎన్నో విధానాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ‘ఎంబ్రోయో డొనేషన్’ విధానం చాలా చాలా ప్రత్యేకం. అంతేగాక.. ఇదెంతో అరుదైనది కూడా. ఇక పిండం దత్తత మనకు వింతగా ఉన్నా అమెరికాలో మాత్రం ఇది ఎప్పటి నుంచో ఉంది. ఈ ప్రక్రియలో భాగంగా అమెరికాలోని నేషనల్ ఎంబ్రోయో డొనేషన్ సెంటర్ (ఎన్ఈడీసీ) అనే సామాజిక సంస్థ.. పిండాలను శీతల ఉష్ణోగ్రతల్లో నిల్వ ఉంచుతుంది. ఎవరికైనా సంతానం అవసరమైతే.. ఆ పిండాలను దానమిస్తుంది. (చదవండి: బాలికకు షాక్ ఇచ్చిన స్లో ఇంటర్నెట్) ఈ క్రమంలో టీనా, గిబ్సన్ దంపతులు ‘ఎంబ్రోయో డోనేషన్’ విధానంలో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. అయితే, ఆ ఇద్దరు పిల్లలు 27 ఏళ్ల కిందటే పిండంగా మారారు. అలా గిబ్సన్ దంపతులు 2017లోనే.. 24 ఏళ్ల నాటి పిండాన్ని బిడ్డగా పొంది తొలి రికార్డు నెలకొల్పారు. తాజాగా రెండో బిడ్డను కూడా పొంది మొదటి రికార్డును బద్దలు కొట్టారు. దీన్ని బట్టి చూస్తే.. వారికి పుట్టిన ఇద్దరు పిల్లలు ఒకేసారి పిండాలుగా మారారు. రెండో పిండం ఈ లోకాన్ని చూసేందుకు అదనంగా మూడేళ్లు వేచి చూడాల్సి వచ్చింది. -
కడుపు అతుక్కుని కవలల జననం
ముస్తాబాద్(సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో అవిభక్త కవలలు జన్మించారు. ముస్తాబాద్‌కు చెందిన చెవుల శిరీష–వెంకటేశ్ దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మూడోసారి గర్భందాల్చిన శిరీషకు ప్రస్తుతం ఎనిమిదినెలలు, శనివారం రాత్రి తీవ్రమైన కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ముస్తాబాద్‌లోని ఓ నర్సింగ్‌హోమ్‌లో చేర్పించారు. వైద్యులు శిరీషకు స్కానింగ్ చేసి కవలలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆపరేషన్ చేయగా, కడుపులో ఇద్దరు ఆడ శిశువులు అవిభక్తంగా ఉన్నారు. ఇద్దరికీ కడుపు భాగం అతుక్కుని ఉంది. కాళ్లు, చేతులు, తలలు వేర్వేరుగా ఉన్నాయి. ఇద్దరు శిశువులు, తల్లి ఆరోగ్యంగా ఉన్నారు. లక్షల మందిలో ఒకరికి ఇలా జరుగుతుందని శిరీషకు వైద్యం అందించిన డాక్టర్ అనూష తెలిపారు. ఈ కవలలు రెండు కిలోల బరువుతో జన్మించగా.. మెరుగైన వైద్యం కోసం సిద్దిపేటలోని పిల్లల ఆస్పత్రికి తరలించారు. కాగా, అవిభక్త కవలలను చూసి శిరీష–వెంకటేశ్ దంపతులు ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నారు. రెక్కాడితే డొక్కాడని తాము ఈ కవలలను ఎలా కాపాడుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
బ్రిటన్ రాజవంశంలో కొత్త వారసుడు
లండన్: బ్రిటన్ రాజవంశంలో కొత్త వారసుడొచ్చాడు. యువరాజు హ్యారీ భార్య మేఘన్ మార్కెల్ సోమవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. బ్రిటిష్ సింహాసనాన్ని అధిష్టించేందుకు ఇప్పటికే ఆరుగురు క్యూలో ఉండగా, ఈ కొత్త వారసుడు ఏడో వాడయ్యాడు. బ్రిటిష్ కాలమానం ప్రకారం తెల్లవారుజామున 5.26 గంటలకు మేఘన్ ఈ బిడ్డకు జన్మనిచ్చారు. బాబు 3.2 కేజీల బరువు ఉన్నాడు. తల్లీబిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారని ప్రిన్స్ హ్యారీ విలేకరులకు చెప్పారు. ‘నాకు ఇంతకంటే గొప్ప విషయం ఇప్పటివరకు ఏదీ లేదు. నా భార్యను చూస్తే చాలా గర్వంగా ఉంది. నేను ఇప్పుడు చంద్రుడిపై ఉన్నంత సంతోషంగా ఉంది’ అని హ్యారీ తెలిపారు. -
పాక్‌లో పుట్టిన వ్యక్తికి భారతీయ పౌరసత్వం
సాక్షి, ముంబై: పాకిస్తాన్లో పుట్టిన భారతీయ వ్యక్తికి సుదీర్ఘ పోరాటం తరువాత ఎట్టకేలకు భారతీయ పౌరసత్వాన్ని పొందాడు. మహారాష్ట్రకి చెందిన ఆసిఫ్ కారడియా గత యాబై ఏళ్లుగా ముంబైలో నివశిస్తున్న అతనికి మాత్రం భారతీయ పౌరసత్వం లేదు. తన తండ్రి అబ్బాస్ కరాడియా 1962లో గుజరాతీ యువతిని వివాహం చేసుకున్నాడు. వివాహం అనంతరం అబ్బాస్ భార్య తన తల్లి దగ్గరకు కరాచి వెళ్లింది. అమె కరాచిలో ఉన్న సమయంలోనే 1965లో ఆసిఫ్ జన్మించాడు. రెండేళ్ల తరువాత స్వదేశానికి తిరిగివచ్చిన ఆసిఫ్‌కు పౌరసత్వం ఇచ్చేందుకు అధికారులు నిరాకరించారు. ఆసిఫ్‌కు భారతీయుడిగా గుర్తింపులేనందున అధికారుల నుంచి సమస్యలు ఎదుర్కొవడంతో తన కుమారుడికి భారతీయ పౌరసత్వం కల్పించాల్సిందిగా ఆసిఫ్ తండ్రి బాంబే హైకోర్టులో సంయుక్త పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై స్పందించిన బాంబే హైకోర్టు పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం అతను భారతీయ పౌరుడిగా అర్హుడని పేర్కొంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 5 ప్రకారం తల్లిదండ్రులు భారతీయ పౌరసత్వం కలిగి ఉంటే వారికి జన్మించిన సంతానంకి కూడా అది వర్థిస్తుందని తీర్పులో పేర్కొంది. పౌరసత్వం ఇచ్చేందుకు మొదటి చర్యగా జిల్లా పాలనాధికారి ఆసీఫ్‌చే భారతీయ పౌరుడిగా ప్రమాణస్వీకారం చేయించారు. -
5.3 కిలోల శిశువు జననం
హన్మకొండ: వరంగల్ అర్బన్ జిల్లాలో అధిక బరువు గల శిశువు జన్మించింది. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం నారాయణపురం గ్రామానికి చెందిన మంజుల ప్రసవం కోసం హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో చేరింది. సోమవారం వైద్యులు ఆపరేషన్ చేసి ప్రసవం చేశారు. ఆమెకు ఏకంగా 5.3 కిలోల బరువుగల ఆడ శిశువు జన్మించింది. శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు. మంజులకు ఇది మూడో కాన్పని, ఇదివరకు ఇద్దరు కుమారులు ఉన్నారని బంధువులు తెలిపారు. -
కొత్త సంవత్సరం..కొత్త తరం..
-
రెండు సార్లు జన్మించిన బిడ్డ
-
ప్రాణాంతక వ్యాధితో జన్మించిన శిశువు
-
ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుట్టిన వెంటనే ఆధార్
అనంతపురం మెడికల్ : ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుట్టిన బిడ్డకు వెంటనే ఆధార్ అందివ్వనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయగా దీనికి సంబంధించి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ఆధార్ ఎలా ఇవ్వాలన్న దానిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఎస్ఓ మారుతిప్రసాద్, డిప్యూటీ ఎస్ఓ బసవరాజు, ఆపరేటర్ అశ్విని ఆస్పత్రికి వెళ్లి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్, ఆర్ఎంఓ వైవీ రావును కలిశారు. అనంతరం వారు ఎంఆర్ఓ పాపారావు, స్టాటిస్టికల్ ఆఫీసర్ గౌడ్‌తో సమావేశమై ఆధార్‌పై చర్చించారు. ఇప్పటికే ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుట్టిన రోజే జనన ధ్రువీకరణ ఇస్తున్నారని, ఇదే సమయంలోనే ఆధార్ నమోదు ప్రక్రియ సాగాలని సూచించారు. అనంతరం ఆధార్ నమోదులో ఉన్న సందేహాలను నివృత్తి చేసుకున్నారు. -
నిలోఫర్ ఆస్పత్రిలో 6 కిలోల శిశువు జననం
-
6 కిలోల శిశువు జననం
హైదరాబాద్: నగరంలోని నిలోఫర్ ఆస్పత్రిలో శనివారం ఆరుకిలోల బరువుతో శిశువు జన్మించింది. బోరబండకు చెందిన షబానా అనే మహిళ ఆరు కిలోల మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని శస్త్ర చికిత్స చేసిన వైద్యులు తెలిపారు. పుట్టిన బిడ్డ ఆరు కిలోల బరువు ఉండటం అరుదైన ఘటన అని వైద్యులు అంటున్నారు. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. 6 కేజీల బరువుతో శిశువు పుట్టడం అరుదైన విషమన్నారు. -
ఒకే కాన్పులో ముగ్గురు శిశువుల జననం
వరంగల్ ఎంజీఎం: వరంగల్ జిల్లా కేంద్రంలో ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించారు. స్థానిక లేబర్ కాలనీకి చెందిన సంధ్య అనే మహిళకు మొదటికాన్పులో ముగ్గురు ఆడ శిశువులు పుట్టారు. ఈ సంఘటన వరంగల్ సీకేఎం ఆసుపత్రిలో శనివారం చోటుచేసుకుంది. శనివారం ఉదయం 8 గంటల సమయంలో ఆసుపత్రి వైద్యులు మహిళకు సర్జరీ చేసి ముగ్గురు శిశువులను బయటకు తీశారు. ముగ్గురూ ఆరోగ్యంగా ఉన్నారు. -
ఒకే కాన్పులో ముగ్గురు బిడ్డలు
చింతూరు : మండల పరిధిలోని పెదశీతనపల్లి పంచాయతీ కొండపల్లి గ్రామానికి చెందిన గిరిజన మహిళ వంజం ముత్తమ్మ ఒకే కాన్పులో ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చింది. ప్రసవం కోసం ఈమెను చింతూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అక్కడ ముగ్గురు ఆడ పిల్లలకు జన్మనిచ్చింది. తల్లీ,బిడ్డలు ముగ్గురూ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు క్రిస్టోఫర్ తెలిపారు. -
108లో కవలల జననం
హయత్‌నగర్: పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణి 108 వాహనంలోనే కవలకు జన్మనిచ్చింది. నెలలు గడవక ముందు పుట్టిన శిశువుల పరిస్థితి విషమంగా ఉంది. 108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం... తట్టిఅన్నారం లక్ష్మీగణపతి కాలనీకి చెందిన లక్ష్మమ్మ భార్య చంద్రకళ ఏడు నెలల గర్భిణి. అయితే, ఆమెకు బుధవారం పురిటి నొప్పులు రావడంతో 108కు సమాచారం ఇచ్చారు. వెంటనే చేరుకున్న 108 సిబ్బంది చంద్రకళను అంబులెన్స్‌లో ఎక్కించారు. నొప్పులు తీవ్రం కావడంతో సిబ్బంది వాహనంలోనే కాన్పు చేశారు. ఇద్దరు మగశిశువులు జన్మించారు. నెలలు నిండకుండానే జన్మించడంతో వారి పరిస్థితి విషమంగా ఉందని, తల్లీబిడ్డలను గాంధీ ఆసుపత్రిలో చేర్పించామని ఈఎండీ కృష్ణప్రసాద్, పైలట్ రాజు తెలిపారు. -
కొత్తగా కళ్లు తెరిచెనే...
నెహ్రూ జూలాజికల్ పార్కు సరీసృపాల జగత్తులో శనివారం ఇండియన్ స్టార్ తాబేలు, గ్రీన్ ఇగ్వానా, ఇండియన్ చెమిలియన్లు పిల్లలకు జన్మనిచ్చాయి. వీటి జననంతో జూలో సరీసృపాల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. పరిస్థితులను బట్టి శరీర రంగులను మార్చుకునే గ్రీన్ ఇగ్వానా, స్టార్ ఆకారంతో కూడిన చుక్కుల తాబేలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వీటిపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతుందని జూ అధికారులు తెలిపారు. - బహదూర్‌పురా -
బాలిక కాదు.. బాహుబలి!
బెంగళూరు: భారతదేశంలోనే అత్యధిక బరువుతో పుట్టిన ఆడ శిశువుకు, బెంగళూరు మహిళ జన్మనిచ్చింది. నందిని అనే గర్భిణికి హసన్ ఆస్పత్రిలో సోమవారం పుట్టిన బాలిక 6.82 కిలోల బరువు ఉందని డాక్టర్లు వెల్లడించారు. అప్పుడే పుట్టిన శిశువులు సగటున 3.4 కిలోల వరకు బరువుంటారు. తన 25 ఏళ్ల సర్వీసులో ఇంత భారీగా బరువున్న ఆడ శిశువును ఎప్పుడూ చూడలేదంటూ డాక్టర్ వెంకటేశ్ రాజు అనే స్థానిక వైద్యాధికారి ఆశ్చర్యపోయారు. బిడ్డకు తగ్గట్టే తల్లి నందిని కూడా 5.9 అడుగుల ఎత్తు, 94 కిలోల బరువు ఉన్నారు. ప్రస్తుతం ఈ శిశువును ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచి ఆమె ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. శిశువు ఆరోగ్యం అన్ని విధాలా బాగుందని, అయితే ఆమె భారీ కాయాన్ని చూసి అంతా విస్తుపోయామని సిజేరియన్ ఆపరేషన్ నిర్వహించిన గైనకాలజిస్టు డాక్టర్ పూర్ణిమ మణు వివరించారు. గత ఏడాది కూడా ఫిర్దోస్ ఖాటూన్ అనే మహిళ 6.7 కిలోల బరువున్న మగ శిశువుకు జన్మనిచ్చారు. నందిని కుమార్తె ఇంతకంటే ఎక్కువ బరువు ఉండటం విశేషం. -
బ్రిటన్ సంపన్నుల్లో రూబెన్ సోదరులు టాప్
బ్రిటన్ సంపన్నుల్లో భారత సంతతికి చెందినవారు టాప్ ర్యాంక్ లో నిలిచారు. సండేటైమ్స్ సంపన్నుల జాబితాలో రూబెన్, హిందూజా సోదరులు మొదటి రెండు స్థానాలను కైవసం చేసుకున్నారు. ముంబైలో పుట్టిన వ్యాపార దిగ్గజాలు 77 ఏళ్ల డేవిడ్ రూబెన్, 74 ఏళ్ల సైమన్ రూబెన్ సోదరులు ఈసారి సండేటైమ్స్ శ్రీమంతుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. 13.1 బిలియన్ పౌండ్ల సంపదతో యూకే సంపన్నుల జాబితాలో అగ్రభాగాన్ని సొంతం చేసుకున్నారు. గతేడాది ఐదో స్థానంలో ఉన్న రూబెన్ సోదరుల సంపద విలువ ఈసారి 3.4 బిలియన్ పౌండ్లు పెరిగింది. దాంతో ఈసారి మొదటి స్థానంలో నిలిచారు. ఈ సోదరుల తర్వాతి స్థానంలో 13 బిలియన్ పౌండ్ల సంపదతో హిందూజా గ్రూప్‌నకు చెందిన శ్రీచంద్ హిందూజా, గోపీచంద్ హిందూజా బ్రదర్స్ ఉన్నారు. ఇక 11.59 బిలియన్ పౌండ్లతో లెన్ బ్లవట్నిక్ మూడో స్థానాన్ని సంపాదించారు. అయితే ప్రపంచవ్యాప్తంగా 50 మంది కుబేరుల జాబితాలో ముఖేశ్, అనిల్ అంబానీ కలసి 17.90 బిలియన్ పౌండ్ల సంపదతో 30వ స్థానానికి పరిమితమయ్యారు. స్టీల్ పరిశ్రమల సంక్షోభం, యూకే ధనవంతుల సంపద ర్యాంకింగ్ పై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపినట్లు తెలుస్తోంది. 2008 లో 27.7 బిలియన్ పౌండ్లతో టాప్ లో నిలిచిన ఆర్సిలర్ మిట్టల్ ఛైర్మన్ లక్ష్మీ నివాస్ మిట్టల్ సంపద ఈ సంవత్సరం 7.12 బిలియన్ పౌండ్లకు పడిపోయింది. ఇండియాలో జన్మించిన రూబెన్ బ్రదర్స్ 1950 సమయంలో బ్రిటన్ వెళ్ళి అక్కడ మెటల్స్, ప్రాపర్టీ రంగాల్లో భారీగా సంపదను ఆర్జించారు. సంపన్న ఇరాకీ జోయెషీ కుటుంబంలో పుట్టిన ప్రవాస భారతీయులైన ఈ హిందూజా సోదరులకు ఇండియాలో కూడ అశోక్ లేలాండ్, ఇండస్ ఇండ్ బ్యాంక్ వంటి మొదటి తరగతి కంపెనీలు ఉన్నాయి. -
గర్భంలోనే వృద్ధాప్యం నిర్థారణ
కొంతమంది యువకులు.. పుట్టుకతో వృద్ధులు అన్నారు. కొందరు అతి చిన్న వయసులోనే వృద్ధాప్యం మీద పడినట్లు కనిపిస్తారు. మరి కొందరు వయసు మళ్లినా యవ్వనంగా కనిపిస్తుంటారు. దీనంతటికీ గర్భధారణ సమయమే ప్రధానమట. గర్భంతో ఉన్న మహిళలు తీసుకునే ఆహారం, పోషకాలను బట్టే ఈ ప్రక్రియ ఆధారపడి ఉంటుందంటున్నారు లండన్ కు చెందిన పరిశోధకులు. గర్భంలోని పిండానికి అందే పోషకాల ఆధారంగానే పుట్టిన తర్వాత వారి యవ్వన, వృద్ధాప్య దశలు ప్రారంభమౌతాయని తాజా పరిశోధనలలో తేలింది. పుట్టక ముందే ముదిమి లక్షణాలు నిర్థారణ అవుతాయని లండన్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు చెప్పారు. గర్భధారణ, పిండ అభివృద్ధిని ఎలుకలపై ప్రయోగించి చూశారు. గర్భధారణ సమయంలో తల్లి గర్భంలో ఆక్సిజన్ తగ్గడం, ధూమపానం వంటి అలవాట్లతో పుట్టే పిల్లల్లో యవ్వనం, వృద్ధాప్యం వంటి లక్షణాలు సంక్రమిస్తాయని, చిన్నతనంలోనే వృద్ధాప్య లక్షణాలు కనిపించే అవకాశం ఉంటుందని కనుగొన్నారు. మనుషుల్లో 23 జతల క్రోమోజోములుంటాయి. ప్రతి క్రోమోజోమ్ చివరి భాగాన్ని టెలోమేర్గా పిలుస్తారు. షూలేస్ చివరి భాగంలోని ప్లాస్టిక్ లా ఉండే ఈ టెలోమేర్లు క్రోమోజోములను బయటకు వెళ్లకుండా నివారిస్తుంటాయి. ఈ టెలోమేర్లు చిన్నివిగా మారడాన్ని బట్టి మనిషి వయసును, వృద్ధాప్యాన్ని లెక్కించవచ్చని పరిశోధకులు అంటున్నారు. ప్రయోగాల్లో భాగంగా పుట్టిన ఎలుకల్లోని రక్తనాళాల్లో ఉండే టెలోమేర్ల పొడవును కొలిచారు. అవి గర్భంలో ఉన్నప్పుడు తల్లి పొందిన యాంటీ ఆక్సిడెంట్లు, ఆక్సిజన్ ను బట్టి ఉన్నట్లు తెలుసుకున్నారు. గర్భంలో పిండం పెరుగుదల వారికి అందే ఆక్సిజన్ ను బట్టి ఉంటుందని, అది పుట్టిన తర్వాత వచ్చే లక్షణాలకు కారణమౌతుందని చెప్తున్నారు. తల్లి గర్భంలో ఉన్నపుడు తక్కువ ఆక్సిజన్ ను ఆమ్లాలను పొందిన ఎలుక పిల్లలు కాస్త ఎక్కువ వయసున్నట్లుగా కనిపించాయని, అవి గుండె సంబంధిత వ్యాధులను కూడా కలిగి ఉన్నట్లు తెలుసుకున్నారు. అలాంటి పిల్లలు తక్కువ పొడవున్న టెలోమేర్స్ ను కలిగి ఉన్నట్లు పరిశోధకులు చెప్తున్నారు. సరైన ఆక్సిజన్, యాంటీ ఆక్సిడెంట్లు అందిన పిల్లలు ఆరోగ్యంగానూ, తక్కువ వయసున్నట్లు కనిపించడంతోపాటు.. టెలోమేర్ల పొడవు కూడా ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. ఎలుకలపై చేసిన తమ ప్రయోగాలు పుట్టిన తర్వాతే కాక గర్భంలో ఉన్నప్పుడే పిల్లల పెరుగుదల, లక్షణాలకు కారణమైనట్లుగా నిర్థారిస్తున్నాయని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం పరిశోధకులు డినో గిస్పాని చెప్తున్నారు. ఇప్పటికే వాతావరణాన్ని బట్టి, అలవాట్లను బట్టి మన జన్యువుల్లో వచ్చే లోపాలు ఊబకాయానికి, గుండె జబ్బులకు కారణాలవుతున్నట్లు మనకు తెలుసని, అయితే ప్రస్తుత పరిశోధనలు గర్భంలోఉన్నపుడే ముదిమి లక్షణాలు, గుండె జబ్బులు నిర్ధారణ అవుతాయని నిరూపించినట్లు ఫ్యాసబ్ జర్నల్ లో ప్రచురించిన పరిశోధనలో తెలిపారు. -
పన్నెండేళ్ల పిండం.. ఆరోగ్యకరమైన బిడ్డ
చైనాలో అత్యంత అరుదైన శిశువు జన్మించి ప్రపంచ ఖ్యాతి గాంచింది. 12 ఏళ్ల పాటు ఆస్పత్రిలో భద్రపరచిన పిండం.. దేశంలో లాంగెస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీగానే కాక అత్యంత ఆరోగ్యకరమైన బిడ్డగా పేరు తెచ్చుకుంది. చైనా వాయవ్య షాంగ్జీ రాష్ట్రంలోని 40 ఏళ్ల మహిళ లీ గేవ్ తన రెండో కొడుకుగా 3.440 కిలోగ్రాముల బిడ్డకు జన్మనిచ్చి రికార్డు సృష్టించింది. గ్జియాన్ నగరంలోని తంగ్డు ఆస్పత్రిలో బుధవారం లీ తన బిడ్డకు జన్మనిచ్చింది. మహిళల్లో సంతానోత్పత్తి, గర్భధారణపై ప్రభావం చూపే ఫెలోపియన్ నాళాలు మూసుకుపోవడం, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ సమస్యలతో బాధపడుతున్న లీ గేవ్.. 2003 లో ఐవీఎఫ్ ద్వారా గర్భధారణకు ప్రయత్నాలు ప్రారంభించింది. అప్పట్లో డాక్టర్లు ఆమె నుంచి సేకరించిన 12 అండాలను.. ఆమె భర్త వీర్యకణాలతో కలపి పిండాలుగా రూపొందించారు. వాటిలోని రెండు పిండాలను లీ గర్భంలో ప్రవేశపెట్టారు. మిగిలిన వాటిలో ఆరోగ్యంగా ఉన్న ఏడింటిని అలాగే ఆస్పత్రిలోని రీ ప్రొడక్టివ్ మెడిసిన్ సెంటర్లో భద్రపరిచారు. అనంతరం 2004 లో లీ ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అప్పట్నుంచీ అత్యవసర పరిస్థితుల్లో వాడేందుకు ఆ పిండాలను భద్రపరిచడానికి ఆస్పత్రికి రోజుకు 50 సెంట్లు అంటే సుమారు 45 రూపాయల చొప్పున చెల్లిస్తూ వస్తోంది. గతేడాది చైనా ఒకే బిడ్డ విధానాన్ని ఎత్తివేయడంతో లీ.. రెండో బిడ్డను కనాలని నిర్ణయించుకుంది. దీంతో భద్రపరిచిన పిండాల నుంచి రెండు ఆరోగ్యమైన పిండాలను డాక్టర్లు ఆమె గర్భంలోకి ప్రవేశపెట్టారు. వాటిలో ఒకటి విజయవంతమైంది. సాధారణంగా తమ ఆస్పత్రిలో ఈ పద్ధతిని అవలంబించే సమయంలో గర్భంలోకి రెండు మూడు పిండాలను ప్రవేశపెడతారని, ఎందుకంటే వాటిలో 40 శాతమే సురక్షితంగా ఉండే అవకాశం ఉందని తంగ్డు ఆస్పత్రి రీ ప్రొడక్టివ్ మెడిసిన్ సెంటర్ డైరెక్టర్ వాంగ్ గ్జియో హాంగ్ తెలిపారు. పిండాలను భద్రపరచడంతో అదృష్టం కొద్దీ రెండో బిడ్డకు జన్మనిచ్చే అవకాశం కలిగిందని లీ గేవ్ భర్త ఆనందంగా చెబుతున్నాడు. మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ లూయిస్ బ్రౌన్ 1978 లో బ్రిటన్‌లో జన్మించాడు. ఆ తర్వాత సుమారు 50 లక్షల మంది పిల్లలు ఐవీఎఫ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా జన్మించారు. చైనా ప్రధాన భూభాగంలో మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ జెంగ్ మెంగ్జు 1988 లో జన్మించాడు. చైనాలో సుమారు 40 శాతం మంది వంధ్యత్వంతో బాధపడుతున్నారని, ప్రభావవంతమైన పునరుత్పత్తి సహాయ పద్ధతుల్లో ఐవీఎఫ్ ఒకటి అని వాంగ్ తెలిపారు. 2003 నుంచీ తంగ్డూ ఆస్పత్రి పిండాలను భద్రపరచడం ప్రారంభించిందని ఇప్పటివరకూ సుమారు లక్షకు పైగా పిండాలను భద్రపరచగా, వాటిలో 27000 వరకూ పునరుత్పత్తికి వినియోగించామని... ఈ పద్ధతి ద్వారా 4,293 ఆరోగ్యకరమైన టెస్ట్ ట్యూబ్ బేబీలు జన్మించినట్లు వాంగ్ తెలిపారు. -
28 ఏళ్ళ తర్వాత అక్కడో శిశువు పుట్టింది..!
ఆ ప్రాంతంలో పిల్లలు పుట్టడమే కరువై... సంవత్సరాలు దాటి పోయింది. నవజాత శిశువులకోసం పరితపించే అక్కడి ప్రజలకు.. దశాబ్దాల తర్వాత అద్భుతం జరిగింది. ఏళ్ళుగా వారు కంటున్న స్వప్నం... వారం క్రితం సాకారమైంది. ఇటలీలోని ఓస్థానా పట్టణంలో 1987 తర్వాత ఏ కుటుంబంలోనూ పిల్లలు పుట్టడమే చూడలేదని, స్థానిక మేయర్ లాంబార్డో చెప్తున్నారు. గతవారం ఓ కుటుంబంలో శిశువు జన్మించడం నిజంగా అద్భుత సన్నివేశమని... దీంతో అక్కడి ప్రజలు ఆనందంలో తేలియాడుతున్నారని ఇటలీ డైలీ న్యూస్ పేపర్ లా స్టాంపా వెల్లడించింది. ఓస్థానాలో పుట్టిన చిన్నారితోపాటు... కేవలం 85 మంది మాత్రమే ఇక్కడ నివసిస్తున్నారు. ఇతర గ్రామాలు, పట్టణాలతో పోలిస్తే ఇక్కడి జనాభా క్రమంగా తగ్గిపోతోంది. ఇక్కడ ఇటువంటి పరిస్థితి నిజానికి 1975 లో ప్రారంభమై...1976-87 కు మధ్య కేవలం 17 మంది పిల్లలు మాత్రమే పుట్టడం చరిత్రను సృష్టించింది. అప్పట్లో చివరిగా ఓ అబ్బాయి పుట్టినట్లు స్థానిక మేయర్ జియాకోమో లాంబార్డో చెప్తున్నారు. జననాల ట్రెండ్ తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో... ఈ పరిస్థితి కొనసాగాలని కోరుకుంటూ స్థానికంగా ప్రత్యేక వేడుకను కూడా నిర్వహించారు. జనాభా తగ్గిపోవడాన్ని అరికట్టడం ఎంతో కష్టమని, ఆ దిశగా తాము ఎన్నో ఆలోచనలు చేస్తున్నామని లాంబార్డో అంటున్నారు. ముఖ్యంగా యువ ఇటాలియన్లకు ఈ గ్రామీణ ప్రాంతంలో ఉద్యోగావకాశాలు లేకపోవడం కూడా ఇక్కడ జనాభా తగ్గడానికి కారణమని ఆయన అంటున్నారు. ఉద్యోగాలకోసం ఇక్కడి ప్రజలు అనేకమంది స్వంత ఇళ్ళను కూడా వదిలి నగరాలకు వెళ్ళిపోయారని చెప్తున్నారు. ఇటలీలోని ఈ ఓస్థానా పట్టణంలో ప్రస్తుతం ఓ దుకాణం, ఓ బార్, రెండు రెస్టారెంట్లు మాత్రమే ఉన్నట్లు స్థానిక వార్తా వెబ్ సైట్ 'ది లోకల్' ప్రకారం తెలుస్తోంది. ఉత్తర ఇటలీలో కొంత శాతం మెరుగ్గా ఉన్నప్పటికీ, దక్షిణ ఇటలీలోని సిసిలీ సహా అన్ని ప్రాంతాలూ తీవ్రమైన భౌగోళిక మార్పులను ఎదుర్కొంటోంది. ఇటువంటి పరిస్థితులపై తీవ్ర ఆందోళనకు గురైన కొందరు స్థానికులు... ఇక్కడి జనాభా పెరుగుదల కోసం ప్రత్యేక చర్యలు ప్రారంభించారు. అందులో భాగంగా వైద్యపరీక్షలు చేయించుకొని, మరణాలు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. సిసిలీ ద్వీపంలోని గంగి పట్టణంలో గతేడాది మరో ప్రయత్నం కూడా చేశారు. ఇక్కడి సుమారు 20 గృహాలు రెండు డాలర్లకన్నా అతి తక్కువ ధరకు అమ్మకానికి పెట్టారు. ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు సుమారు 50 మంది ముందుకొచ్చారు. వీరు తిరిగి వెళ్ళకుండా ఉండేందుకు కొనుగోలుదారుల ఇష్టప్రకారం పునరుద్ధరణకు కూడా అంగీకరించారు. దీంతో ప్రస్తుతం గంగిలో 7 వేల మంది నివాసితులు ఉన్నారు. అయినప్పటికీ ఓస్థానాలో పరిస్థితే ఇక్కడ కూడా ఏర్పడుతుందేమోనని స్థానిక నాయకులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఓస్థానాలో జన్మించిన శిశువు పాబ్లో రాకను తాము స్వాగతిస్తున్నామని, ఇక్కడ తిరిగి పుట్టుక ప్రారంభమవ్వడం గర్వించదగ్గ మార్పు అని మేయర్ లాంబార్డో అంటున్నారు. స్థానిక యువకులు పట్టణం వదిలి ఉద్యోగాలకోసం వలస వెళ్ళకుండా ఆపే తమ ప్రయత్నం క్రమంగా ఫలిస్తోందని, తల్లిదండ్రులు కొన్నేళ్ళక్రితం ఉపాధికోసం ఊరు వదిలి వెళ్ళినా.. ప్రస్తుతం ఇక్కడ ఉద్యోగావకాశం కల్పించడంతో తిరిగి బస చేసేందుకు యువకులు వస్తున్నారని లాంబార్డో చెప్తున్నారు. తమ ప్రయత్నాలతో క్రమంగా జనాభా కూడా అభివృద్ధి చెందే అవకాశం కనిపిస్తున్నట్లు ఆయన అంటున్నారు. -
చిన్నారికి ముక్కులో పెరిగిన మెదడు..!
జ్ఞానేంద్రియాల్లో ముక్కు, శ్వాస పీల్చుకోవడంతోపాటు, వాసనలను పసికట్టేందుకు ఉపయోగపడుతుంది. అలాగే మెదడులో భావాలను కలిగించే 'లిమ్బిక్' వ్యవస్థ వల్ల ముక్కు వాసనలను పసిగట్టగల్గుతుంది. ఇలా ముక్కునుంచి మెదడుకు సంబంధం ఉండటం మనకు తెలుసు.. కానీ ఆ బాలుడికి ఏకంగా మెదడే ముక్కులో పెరుగుతుండటం వైద్య రంగాన్నే విస్తుపోయేలా చేసింది. అయితే అనేక ఆపరేషన్ల తర్వాత బిర్మింగమ్ పిల్లల ఆస్పత్రి వైద్యులు చిన్నారి లోపాన్ని సరి చేయగలిగారు. పుట్టుకతో వచ్చిన లోపంతో ఇబ్బందిపడుతున్న వేల్స్ మీస్టెగ్ ప్రాంతానికి చెందిన ఇరవై ఒక్క నెల్ల ఒల్లీ ట్రీజీజ్ కు మెదడు భాగం చిట్లి దాని ద్వారా ముక్కులో ఓ తిత్తిలా మెదడు పెరగటం ప్రారంభించింది. వైద్య శాస్త్రంలో ఎన్సెఫలోసెల్ గా పిలిచే ఈ పరిస్థితిని గుర్తించేందుకు డాక్టర్లు కూడ ఎంతో కష్టపడాల్సి వచ్చింది. చిన్నారికి ఇరవై వారాల వయసులో స్కాన్ తీసిన వైద్యులు ముక్కులో కండ పెరుగుతున్నట్లుగా భావించారు. ఒల్లీ తల్లి ఇరవై రెండేళ్ళ యామీ... వైద్యులు చెప్పిన విషయంతో షాక్ కు గురైంది. భర్తకు దూరమైన యామీ ఒల్లీని తన వరంగా భావించింది. చిన్నారికి ఏమౌతుందోనని ఖంగారు పడిపోయింది. తొమ్మిది నెలలు గడిచే సరికి ఒల్లీ రూపం పినాచియో బొమ్మలా మారుతూ వచ్చింది. దీంతో వైద్యులు అతడి ముక్కుకు వెంటనే శస్త్ర చికిత్స చేయాలని లేదంటే అతడు ఊపిరి పీల్చడం కూడ కష్టంగా మారుతుందని యామీకి చెప్పారు. ఆమెకు అవగాహన కూడ కల్పించారు. ఎంఆర్ఐ స్కాన్ తీసిన తర్వాత బిడ్డ ముక్కులో పెరుగుతున్నది కండకాదు.. ఓ తిత్తిలా పెరుగుతున్న మెదడు అని తేల్చారు. పుట్టుకతో వచ్చిన లోపంగా కూడ గుర్తించారు. 2014 నవంబర్ లో ఒల్లీకి బిర్మింగమ్ చిల్డ్రన్స్ ఆస్పత్రిలో రెండుగంటల పాటు విజయవంతంగా శస్త్ర చికిత్స చేశారు. పుర్రె భాగాన్ని కత్తిరించి మెదడు నుంచి ముక్కులోకి అధికంగా ఉన్న తిత్తివంటి ఫ్లూయిడ్ భాగాన్ని తీసి తిరిగి కుట్లు వేశారు. ప్రస్తుతం ఒల్లీ పూర్తిగా కోలుకున్నాడు. నాలుగేళ్ళ తన అక్క అన్నతో హాయిగా ఆడుకుంటున్నాడు. అయితే చిన్నారికి భవిష్యత్తులో చికిత్సలు చేయాల్సి వస్తుందా లేదా అన్న విషయాన్నిప్రస్తుతానికి వైద్యులు నిర్థారించ లేదు. అతడి మెదడు పెరుగుదలను బట్టి భవిష్యత్ చికిత్స ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు. -
క్యాబ్‌లో ప్రసవం.. శిశువు పేరు ఉబెర్!
అది దక్షిణ ఢిల్లీలోని డెవ్లీ ప్రాంతం. పురుటి నొప్పులు పడుతున్న ఓ మహిళ అంబులెన్స్ కోసం ఎంతగానో ప్రయత్నించింది. కానీ ఆమెకు సహాయం చేయడానికి ఏ ఒక్క అంబులెన్స్ అందుబాటులో లేదు అనే సమాధానం వచ్చింది. దీంతో కంగారు పడిన ఆమె అటుగా వచ్చిన క్యాబ్‌ను పిలించింది. ఆసుపత్రికి వెళ్లే లోపే.. క్యాబ్‌లోనే ఆ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆమె తనకు సహాయం అందించిన ఆ క్యాబ్ కంపెనీ పేరే బిడ్డకు పెట్టబోతోంది. బాబ్లీ అనే మహిళ ప్రసవానికి సహకరించిన క్యాబ్ డ్రైవర్ షానవాజ్ మాట్లాడుతూ.. 'తాను మరో ఇద్దరు మహిళలతో ఉంది. క్యాబ్ కావాలి అని చెప్పగానే.. నేను అంబులెన్స్‌ను పిలువకపోయారా అని అడిగాను. అవి అందుబాటులో లేవని సమాధానం చెప్పారు. దీంతో క్యాబ్‌లో తీసుకెళ్తుండగానే ఆమెకు ప్రసవం అయింది. కూడా ఉన్న ఇద్దరు మహిళలు ప్రసవంలో సహకరించారు. అంతా నిమిషాల్లో జరిగిపోయింది. వెంటనే వారిని సఫ్తార్‌జంగ్ హస్పిటల్‌కు తీసుకెళ్లాను. ఎమర్జెన్సీ వార్డుకు చేర్చాను. తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారు.. చాలా సంతోషంగా ఉంది. ఆస్పత్రి డాక్టర్లు నువ్వు ఆమె భర్తవా అని అడిగారు' అని నవ్వుతూ తెలిపాడు. కుటుంబ సభ్యులు ఆదివారం ఆ బిడ్డకు నామకరణ మహోత్సవం జరుపుతున్నారు. ఈ కార్యక్రమానికి షానవాజ్‌ను ఆహ్వనించి అతన్నే తన బిడ్డకు పేరు పెట్టాల్సిందిగా బాబ్లీ కోరింది. షానవాజ్ తను పనిచేస్తున్న సంస్థ 'ఉబెర్' పేరునే ఆ మగబిడ్డకు పెట్టనున్నట్లు వెల్లడించాడు. -
పుట్టుకతోనే కిడ్నీ, గర్భాశయం లేదని..
బరేలి: పుట్టుకతోనే ఓ కిడ్నీ, గర్భాశయం లేదన్న విషయాన్ని 17 ఏళ్ల తర్వాత తెలుసుకున్న ఓ అమ్మాయి మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని బరేలిలో ఈ దారుణం జరిగింది. బరేలికి చెందిన ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని కొన్ని నెలల క్రితం అనారోగ్యంపాలైంది. ఆమె తల్లిదండ్రులు చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లగా, డాక్టర్ సలహా మేరకు అల్ట్రాసౌండ్ టెస్ట్ చేయించారు. నివేదికలో ఆమెకు ఓ కిడ్నీ, గర్భాశయం లేదని తేలింది. అప్పటి నుంచి ఆ అమ్మాయి డిప్రెషన్‌కు లోనయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. తల్లిదండ్రులు ఆ అమ్మాయిని మరికొందరు డాక్టర్ల దగ్గరకు తీసుకెళ్లి వైద్యం చేయించారు. అయినా ఆ అమ్మాయి డిప్రెషన్ నుంచి కోలుకోలేదు. గత శుక్రవారం తండ్రి ఇంట్లోలేని సమయంలో ఆ అమ్మాయి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె కేకలు వేయడంతో తల్లి ఇరుగుపొరుగు వారి సాయంతో ఆస్పత్రికి తీసుకెళ్లింది. ఆస్పత్రిలో ఆమె మరణించినట్టు పోలీసులు తెలిపారు. -
చెల్లీ ఇక నీకేం కాదు...
చెల్లీ ఇక నీకేం కాదు... అన్నట్టు కనిపిస్తున్న ఆ ఫోటో ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటోంది. తన గర్భంలోని ముగ్గురు కవలలనూ కాపాడుకునేందుకు ఆ తల్లి చేసిన సాహసాన్ని వైద్యులూ సవాల్ గా తీసుకున్నారు. ఇద్దరు మగ శిశువుల ప్రాణాలకు రిస్క్ అని తెలిసినా పాపను రక్షించుకునేందుకు..ఆ తల్లి నెలలు నిండకుండా ముందుగానే ప్రసవం చేయించుకున్న తీరు... అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఇంట్లో ముగ్గురు పిల్లలతో హాయిగా ఎంజాయ్ చేస్తోంది. ఆస్ట్రేలియాకి చెందిన 22 ఏళ్ళ దన్ స్తాన్ అనే మహిళ ముగ్గురు కవల పిల్లలకు జన్మనిచ్చింది. నడి గర్భిణిగా ఉండగానే ఆమె ప్రసవానికి సిద్ధమైంది. మరో మార్గం లేని సందర్భంలో ఆమె... 28 వారాల్లోనే ప్రసవం చేయించుకుంది. ఇద్దరు మగ శిశువులతోపాటు... కడుపులో ఆక్సిజన్ సమస్యతో ఇబ్బంది పడుతున్న పాపను కూడ రక్షించుకునేందుకు ఆమె భర్త రోహాన్ తో సంప్రదించి ధైర్యం చేసింది. ఆస్పత్రిలో ప్రసవం అనంతరం కాస్త అనారోగ్యంగా ఉన్న బిడ్డలను పదకొండు వారాలపాటు వైద్యుల పర్యవేక్షణలోనే ఉంచారు. అనంతరం ఆ దంపతులు ముగ్గురు బిడ్డలనూ ఆనందంగా ఇంటికి తీసుకెళ్ళారు. -
పుట్టకముందే బిడ్డను చూసుకోవచ్చు!
లండన్: 2డీ, 3డీ, 4డీ అల్ట్రాసౌండ్ స్కానింగ్‌లో ప్రసిద్ధి చెందిన లాంక్ షైర్లోని ‘బేబీ బూ’ ఆస్పత్రి వినూత్న సర్వీసులను అందిస్తోంది. పుట్టబోయే బిడ్డ ఎలా ఉంటుందో అచ్చం అలాంటి ప్రతిమను సృష్టించి తల్లుల చేతుల్లో పెడుతోంది. పుట్టబోయే బిడ్డను ముందే చూసుకొని మురిసిపోవచ్చని చెబుతోంది. ఓ తల్లి గర్భంలో పిండం పూర్తిస్థాయి శిశువుగా మారేందుకు దాదాపు 28 వారాలు పడుతుందని, అప్పుడు తన వద్దకు వచ్చే తల్లులకు స్కానింగ్ చేసి... 3డీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పుట్టబోయే బిడ్డ ప్రతిమను రూపొందిస్తామని ఆ ఆస్పత్రి యజమాని కేటీ కెర్మోడ్ తెలియజేశారు. పుట్టిన తర్వాత బిడ్డకు, తాము ముందే రూపొందించిన ప్రతిమకు ముఖ కవలికల్లో ఏ మాత్రం తేడా ఉండదని కేటీ చెప్పారు. బిడ్డ ప్రతిమను అందంగా అలంకరించిన బాక్సులో లేదా గోడకు వేలాడదీసుకునేందుకు వీలుగా ఫొటోఫ్రేమ్‌లో, ఎలా కోరుకుంటే అలా అందజేస్తామని ఆమె వివరించారు. స్కానింగ్ చార్జీలు కాకుండా బిడ్డ ప్రతిమకు దాదాపు 15వేల రూపాయలు ఖర్చవుతుందని చెప్పారు. ప్రస్తుతానికి తాము తల, మెడ వరకున్న ప్రతిమలను మాత్రమే తయారు చేసి ఇస్తున్నామని, మొత్తం బాడీ అంతా కావాలనుకుంటే తల్లులు 16వ వారంలో ఒకసారి, మళ్లీ 28వ వారంలో ఒకసారి తమ ఆస్పత్రికి రావాల్సి ఉంటుందని చెప్పారు. తనకు రెండు సార్లు గర్భస్రావం జరగడంతో ఈ వినూత్న ప్రతిమ ఆలోచన వచ్చిందని, ఈ రకమైన సర్వీసును తమ ఆస్పత్రి అందిస్తుందని ప్రకటించినప్పుడు తొలుత తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ఇప్పుడు మాత్రం ఇలాంటి ప్రతిమలకు డిమాండ్ పెరుగుతోందని కేటీ తెలిపారు. ఆస్పత్రిలో మొట్టమొదటి సారిగా బిడ్డ ప్రతిమను తయారు చేయించుకున్న 28 ఏళ్ల లేలా మ్యాక్మిలన్ మాత్రం ఇది అద్భుతమైన ప్రక్రియని ఆనందపడిపోతున్నారు. స్కానింగ్ ఇమేజ్‌లు, వాటికి సంబంధించిన డీవీడీ కలిగి ఉండడం కన్నా బిడ్డ ముఖాన్ని ప్రతిమలో చూసుకోవడం థ్రిల్లింగా ఉందని వృత్తిరీత్య ఫొటోగ్రాఫరైన మ్యాక్మిలన్ చెప్పారు. -
వింత శిశువు జననం..
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కేరామేరి మండలం గొండుగూడ గ్రామానికి చెందిన రాధిక అనే మహిళ వింత శిశువుకు జన్మనిచ్చింది. ఈ సంఘటన మంగళవారం కేరామేరి మండల కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో చోటు చేసుకుంది. రాధిక ఈ రోజు ఇద్దరు అమ్మాయిలకు జన్మ నిచ్చింది. వారిలో ఓ పాప తల, రెండు చేతులు లేకుండా పుట్టింది. మరో పాప పూర్తి ఆరోగ్యంతో ఉంది. పోషకాహార లోపం కారణంగానే ఇలాంటి శిశువులు జన్మిస్తారని వైద్యులు వెల్లడించారు. -
సౌందర్యకు కొడుకు పుట్టాడు..
చెన్నై: ప్రముఖ నటుడు రజనీకాంత్ మరోసారి తాత ప్రమోషన్ కొట్టేశారు. ఆయన చిన్న కుమార్తె సౌందర్య బుధవారం రాత్రి చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పటికే తాత హోదాలో ఉన్న ఆయన ఈసారి బుజ్జి మనవడు పుట్టడంతో సంతోషంతో ఉన్నారు. ప్రస్తుతం పాపతో పాటు సౌందర్య కూడా క్షేమంగా ఉన్నట్లు రజనీకాంత్ సన్నిహితుడొకరు తెలిపారు. 2010లో ప్రముఖ వ్యాపారవేత్త అశ్విన్ రామ్‌కుమార్‌తో సౌందర్య వివాహం జరిగింది. వీరిద్దరికి ఇదే తొలి సంతానం. కాగా రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య...ప్రముఖ తమిళ హీరో ధనుష్‌ను ప్రేమ వివాహం చేసుకున్న విషయం విదితమే. వారిద్దరికీ ఇద్దరు కుమారులు. ఇక రజనీ కాంత్ నటించిన 3డి యానిమేషన్ చిత్రం కోచ్చడయాన్ చిత్రం ద్వారా సౌందర్య దర్శకురాలిగా పరిచయం అయిన విషయం తెలిసిందే. ఆ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో రజనీకాంత్ 'తన కూతుళ్లు కష్టపడి సంపాదించాల్సిన అవసరం లేదు. తాను సంపాదించింది వృథా చేయకుండా ఉంటే చాలు వారు పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా'నని అన్నారు. అదే వేదికపై తన నాన్న మాటను పాటిస్తానని సౌందర్య తెలిపింది. పెళ్లి అయిన నాలుగేళ్లకు పైగా సంతానానికి దూరంగా ఉన్న సౌందర్య.. తండ్రి మాటను తూచా తప్పకుండా పాటించి బుజ్జిబాబుకు జన్మనిచ్చింది. -
బాలుడికి అరుదైన ఆపరేషన్
-
‘ఆడ’.. బిడ్డే
కలెక్టరేట్, న్యూస్‌లైన్ :‘ఆడపిల్ల పుడితే చింతించాల్సిన అవసరం లేదు. ఆడపిల్ల అంటే మీ ఇంట బంగారుతల్లి పుట్టిం దని భావించాలి.’ అంటూ ముఖ్యమంత్రి కిరణ్కూమర్ రెడ్డి అదర గొట్టిన విషయం తెలిసిందే! ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘బంగారు తల్లి’ పథకం జిల్లా లో అభాసుపాలవుతోంది. ఈ ఏడాది మే 1వ తేదీ మొదలు మొదటి, రెండవ సంతానంలో పుట్టిన ఆడ శిశువులకు ఉజ్వల భవిష్యత్తు కల్పిస్తామని ప్రకటనలు గుప్పించిన ప్రభుత్వం అమలుకు వచ్చేసరికి శీతకన్ను వేస్తోంది. పథకం ప్రారంభమై ఆరు నెలలవుతోన్నా అనుకున్న ఫలితాలు కనిపించడం లేదు. మే 1 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 3,053 మంది ఆడ శిశువులు జన్మించినట్లు అధికారులు లెక్కలు చూపుతున్నా.. లబ్ధిదారుల గుర్తింపులో మాత్రం రాష్ట్రంలోనే వెనుకబడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో బంగారుతల్లి సర్వేను ఇందిరాక్రాంతి పథం, అర్బన్ ప్రాంతాల్లో మెప్మాలకు ప్రభుత్వం అప్పగించింది. ఐకేపీ ఆధ్వర్యంలో జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 3,021 మంది ఆడశిశువులను గుర్తించగా అందులో 2,705మందిని అర్హులుగా తేల్చారు. అయితే వీరిలో 776 మంది ఖాతాల్లో మాత్రమే రూ.19,40,000 జమ అయ్యాయి. ఇక జిల్లాలోని అర్బన్ ప్రాంతాలైన నిజామాబాద్, ఆర్మూర్, కామారెడ్డి, బోధన్‌లలో బంగారు తల్లి పథకాన్ని ఒక్కరికి కూడా వర్తింప చేయలేదు. అర్బన్ ప్రాంతాల్లో 283 మంది ఆడపిల్లలను ఇప్పటి వరకు గుర్తిస్తే అందులో 184 మందిని అర్హులుగా తేల్చారు. ఆర్మూర్‌లో 28 మంది, బోధన్‌లో ఒకరిని, కామారెడ్డిలో 28 మందిని, నిజామాబాద్ 127 మందిని అర్హులుగా పేర్కొన్నారు. నిజామాబాద్‌లో ఒకరికి డబ్బు లు మంజూరు చేసినప్పటికీ అధికారుల తప్పిదంతో బ్యాంకు ఖాతా నంబర్లో తేడా రావ డం వల్ల ఆ డబ్బులు కాస్త వెనక్కి వెళ్లాయి. వివిధ శాఖల మధ్య సమన్వయలోపం కారణంగా బంగారు తల్లి పథకం జిల్లాలో మసకబారుతోంది. అమ్మో.. ని‘బంధనా’లు.. బంగారుతల్లి పథకానికి విధించిన నిబంధనలు లబ్ధిపొందే కుటుంబాలను తీవ్ర ఇక్కట్ల పాలు చేస్తున్నాయి. ప్రసవాలు ప్రభుత్వ ఆస్పత్రిలోనే జరిగాలి. ఆడపిల్ల పుట్టిన వెంటనే ఆన్లైన్లో 24 గంటల్లో పేరునమోదు చేయిం చాలి. కాగా దీనికి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ కావడం లేదు. సాఫ్ట్వేర్ అప్లోడింగ్ చేసి సమస్య పరిష్కరించేపనిలో ఉన్నమని అధికారులు ఓవైపు చెప్పుకొస్తున్నారు. గ్రామాల్లోఅయితే గ్రామ కార్యదర్శి గుర్తించిన జనన ధ్రువీకరణ పత్రం, అంగన్వాడి కార్యకర్త, సంబంధిత పీహెచ్సీ డాక్టర్ ధ్రువీకరణ, మహిళ సభ్యురాలు ధ్రువీకరణ, రేషన్ కార్డు లో తల్లిదండ్రుల పేర్లు, ఫొటోలు, బ్యాంకు ఖాతా జిరాక్స్ పత్రాలు ఉండాలి. ఈ బాధ్యతలను డీఆర్డీఏ మండల ఏపీఎం లేదా సీఎల కు అప్పగించారు. ఇక పట్టణ ప్రాంతాల్లో మెప్మా ఈ సర్వే బాధ్యతలు చేపడుతుంది. అయితే ఆశించిన స్థాయిలో సర్వే జరగడం లేదు. శాఖల మధ్య సమన్వయ లోపం బం గారు తల్లులకు శాపం గా మారింది. బంగారు తల్లంటే... ఈ ఏడాది మే1 తర్వాత పుట్టిన ఆడపిల్లలకు పథకం వర్తిస్తుంది. ఆడపిల్ల పెరుగుతున్న కొద్దీ వయస్సు, చదువును బట్టి ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం అందుతుంది. ప్రతి ఏడాది ఇచ్చే పారితోషికం కాకుండా 21 సంవత్సరాలు నిండితే ఇంటర్, డిగ్రీ రెగ్యులర్‌గా పాసైన వారికి రూ.55,500తో పాటు ప్రోత్సాహకంగా రూ. 1,55,500 అందిస్తారు.