అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ రోజున నెలలు నిండిన పలువురు గర్భిణులు శిశువులకు జన్మనిచ్చేందుకు ప్లాన్ చేసుకుని, వైద్యుల సాయంతో డెలివరీలు చేయించుకున్నారు. ఈ సమయంలో పుట్టిన చిన్నారులకు అబ్బాయి అయితే రాముడు అని, అమ్మాయి అయితే సీత అని పేరు పెట్టారు.
ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్‌లోని జిల్లా మహిళా ఆసుపత్రిలో సోమవారం 13 మంది శిశువులు జన్మించారు. వీరిలో ఎనిమిది మంది నార్మల్ కాన్పులో జన్మించగా, ఐదుగురు సిజేరియన్ ఆపరేషన్ ద్వారా జన్మించారు. జనవరి 22న తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో జిల్లా మహిళా ఆస్పత్రిలో మొదటి శిశువు జన్మించింది. బర్కచ్చా ఖుర్ద్‌లో నివాసం ఉంటున్న లక్ష్మణ్ భార్య అంజలి బాలికకు జన్మనిచ్చింది. తన కుమార్తెకు సీత లేదా జానకి అని పేరు పెడతానని ఆమె తెలిపింది.
22న తెల్లవారుజామున 3.20 గంటలకు, లాల్‌గంజ్‌లోని బర్దిహా నివాసి అమిత్ మిశ్రా భార్య ప్రీతి మగ శిశువుకు జన్మనిచ్చింది. ఆ చిన్నారికి రామ్ లేదా రాఘవ్ అనే పేరు పెట్టాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు శుక్లహా నివాసి బాబుల్ సోంకర్ భార్య పుతుల్ బాలునికి జన్మనిచ్చింది. ఆటోడ్రైవర్ బాబుల్ తనకు అప్పటికే ఓ కొడుకు ఉన్నాడని, ఇప్పుడు జన్మించిన కుమారునికి రామ్ అని పేరు పెట్టనున్నామన్నారు.
మిర్జాపూర్‌కు చెందిన ప్రీతి తెల్లవారుజామున 4.24 గంటలకు, మంజు 11.45 గంటలకు ఆడ శిశువులకు జన్మనిచ్చారు. లాల్‌గంజ్ మార్కెట్‌కు చెందిన అన్షు మిశ్రా ఉదయం 11.55 గంటలకు సిజేరియన్ ఆపరేషన్ ద్వారా మగ శిశువుకు జన్మనిచ్చింది. జిల్లా మహిళా ఆసుపత్రి ప్రసూతి విభాగం వైద్యురాలు జూహీ దేశ్ పాండే మాట్లాడుతూ 22న మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య ఎనిమిది మంది మగ శిశువులు, ఐదుగురు ఆడ శిశువులు జన్మించారని తెలిపారు.
ఇది కూడా చదవండి: సామాన్యులకు తెరుచుకున్న రామాలయం.. భక్తుల భారీ క్యూ!
Comments
Please login to add a commentAdd a comment