birth
-
బిడ్డకు ఊపిరిపోసి, ప్రాణాలొదిలిన బ్రెయిన్ డెడ్ తల్లి..
తల్లికి తన పిల్లలే సర్వస్వం అని అంటారు. తనకు పుట్టిన బిడ్డను తొలిసారి ఎత్తుకున్నప్పుడు ఆ తల్లి లోకాన్ని జయించినంతగా మురిసిపోతుంది. అయితే ఢిల్లీకి చెందిన ఆషితా చందక్(38) కథ దీనికి భిన్నమైనది. దీనిని విన్నవారంతా కంటతడి పెడుతున్నారు. ఆషితా చందక్ కొద్ది రోజుల్లో ఒక బిడ్డకు జన్మనివ్వనుంది. ఇందుకోసం ఆమె ఆతృతగా ఎదురుచూస్తోంది. బిడ్డను కని, ఎప్పుడెప్పుడు ఒడిలోకి తీసుకుంటానా అని ఆమె ఎదురుచూసింది. అయితే ఎనిమిదినెలల గర్భవతి అయిన ఆషితా విషయంలో విధి కన్నెర్రజేసింది. తన బిడ్డను చూసుకోకుండానే ఆమె ఈ ప్రపంచం నుంచి నిష్క్రమించింది. ఆషితా కుటుంబ సభ్యులు ఆమె ఇంతలోనే తమకు దూరమవుతుందనే విషయాన్ని నమ్మలేకున్నారు.ఆషితా ఢిల్లీలోని ఒక ప్రైవేట్ కంపెనీలో కస్టమర్ సపోర్ట్ మేనేజర్‌గా పనిచేస్తోంది. పెళ్లయిన ఎనిమిదేళ్త తరువాత ఆమె గర్భం దాల్చింది. ఫిబ్రవరి 7న ఆషిత ఉన్నట్టుండి బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. ఆషిత 8 నెలల గర్భవతి. కొన్ని వారాల్లో ఒక బిడ్డకు జన్మనివ్వనుంది. అయితే ఆమె బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైనందున వైద్యులు ఆమెకు సిజేరియన్ చేశారు. దీంతో ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. వెంటనే శిశువును వెంటిలేటర్ సపోర్ట్‌తో ఐసీయీలో ఉంచి చికిత్ప అందించారు. ఫిబ్రవరి 13న ఆషితా బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్థారించారు.ఆషితా కుటుంబ సభ్యులు ఆమె అవయవాలను దానం చేశారు. ఆషితా భర్త రాజుల్ రామ్పాట్ బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నారు. మెదడు పూర్తిగా పనిచేయడం మానేసిన బాధితుడు లేదా బాధితురాలిని వైద్యులు బ్రెయిన్ డెడ్ గా ప్రకటిస్తారు. అటువంటి స్థితిలో మెదడులో ఎటువంటి చురుకుదనం ఉండదు. దేనినైనా అర్థం చేసుకునే సామర్థ్యం, శరీరానికి సంకేతాలను పంపే సామర్థ్యం పూర్తిగా పోతుంది. వైద్యులు ఎవరినైనా బ్రెయిన్ డెడ్ అని ప్రకటించారంటే వారు దాదాపు చనిపోయారని అర్థం.ఇది కూడా చదవండి: రైల్వే స్టేషన్ తొక్కిసలాట: ఏడేళ్ల రియా ప్రాణాలు కోల్పోయిందిలా.. -
ట్రంప్ దెబ్బకు డెలి‘వర్రీ’
ముందే వచ్చిన పురిటినొప్పులు.. నెలలు నిండకుండానే అగ్రరాజ్యంలో కాన్పులు.. ఆస్పత్రులకు పరుగులు.. ఇప్పుడిదే అక్కడ ట్రెండ్!. రేపటి పరిణామాలు ఎటు దారితీస్తాయో తెలియదు. భారతీయులకు ఎంత ఖర్మ... ఎంత దురవస్థ... ఎన్ని అగచాట్లు... ఎంతటి దుర్గతి!. ‘అమెరికా విధాత’ ట్రంప్ గీసిన కలం గీతకు ఒక్క రోజులోనే మారిపోయింది మనోళ్ల తలరాత. పగవాడికి కూడా రాకూడదు ఈ దీనావస్థ... సీన్ ఇప్పుడే ఇలా ఉంది. అమెరికా 47వ అధ్యక్షుడిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్... మరుక్షణమే తమ దేశంలో జన్మతః పౌరసత్వ హక్కు(Birth Right Citizenship)ను రద్దు చేస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వు వెలువరించాడు. అమెరికాలో శాశ్వత నివాసితులు కాని వారికి జన్మించే పిల్లలకు జన్మతః పౌరసత్వం సంక్రమించదంటూ ట్రంప్ ఈ నెల 20న ఆదేశం జారీ చేశాడు. ఉత్తర్వు జారీ అయిన నెల రోజుల తర్వాత ఆ ఆదేశం అమల్లోకొస్తుంది. అంటే గడువు ఫిబ్రవరి 20. ఈ తేదీ ఇప్పుడు అమెరికాలో ఉంటున్న భారతీయ దంపతుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్(Executive Order) నేపథ్యంలో ఫిబ్రవరి 20లోపే.. గర్భిణులకు నెలలు నిండక మునుపే... సిజేరియన్ విధానంలో పిల్లల్ని కనేందుకు భారతీయ దంపతులు తొందరపడుతున్నారు. డెలి‘వర్రీ’తో ఆస్పత్రుల వద్ద క్యూ కడుతున్నారు. అమెరికాలోని ఓ రాష్ట్రంలో ప్రసూతి ఆస్పత్రి నడుపుతున్న డాక్టర్ ఎస్.డి.రామాకు గత రెండు రోజులుగా భారతీయ దంపతుల నుంచి ‘ముందస్తు డెలివరీ’(Pre Delivery) అభ్యర్థనలు ఎక్కువయ్యాట. ముఖ్యంగా 8వ నెల, 9వ నెల గర్భిణులు ‘సి-సెక్షన్’ (సిజేరియన్ శస్త్రచికిత్స) కోసం హడావుడి పడుతున్నారట. ఏడో నెల గర్భిణి అయిన ఓ భారతీయ మహిళ ముందస్తు ప్రసవం కోసం సిజేరియన్ ఆపరేషన్ చేయాలంటూ భర్తతో కలసి తనను సంప్రదించినట్టు డాక్టర్ రామా చెబుతున్నారు. వాస్తవానికి ఆమె మార్చి నెలలో ప్రసవించాల్సివుంది. ‘డెడ్ లైన్’ ఫిబ్రవరి 20వ తేదీ తర్వాత కాన్పు జరిగితే పుట్టే శిశువుకు అమెరికా పౌరసత్వం లభించదన్న భయం ఇప్పుడు వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోందన్నది ఈ పరిణామంతోనే అర్థమవుతోంది. అయితే.. ఇలా నెలలు నిండకుండానే జరిగే కాన్పుల కారణంగా తల్లికి, బిడ్డకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని గైనకాలజిస్టు డాక్టర్ ఎస్.జి.ముక్కాలా (టెక్సాస్) ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెలలు నిండకుండా పుట్టే శిశువులో ఊపిరితిత్తులు పూర్తిస్థాయిలో రూపొందవని, శిశువు తక్కువ బరువుతో ఉంటుందని, పోషణతోపాటు నాడీ సంబంధ సమస్యలు తలెత్తుతాయని ఆయన తెలిపారు. ఈ అంశాలన్నిటినీ ఆయన తన వద్దకు వస్తున్న భారతీయ జంటలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయమై ఆయన గత రెండు రోజుల్లో సుమారు 15-20 భారతీయ జంటలకు కౌన్సెలింగ్ ఇచ్చారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. భారతీయ దంపతులు వరుణ్, ప్రియనే (పేర్లు మార్చాం) తీసుకుంటే... ప్రియ వచ్చే మార్చి నెలలో ప్రసవించాల్సివుంది. వరుణ్ H-1 B వీసాపై భార్యతో కలసి ఎనిమిదేళ్లుగా అమెరికాలో ఉంటున్నాడు. గ్రీన్ కార్డుల కోసం ఆ జంట ఆరేళ్లుగా నిరీక్షిస్తోంది. ఇప్పుడు అకస్మాత్తుగా పౌరసత్వ విధానం మారిపోయింది. ప్రస్తుతం తాము నిశ్చింతగా ఉండాలంటే ప్రియ ముందస్తు డెలివరీకి వెళ్లడం ఒక్కటే మార్గమని వరుణ్ భావిస్తున్నాడు. “మేం ఇక్కడికి రావడానికి ఎంతో త్యాగం చేశాం. కానీ మా ఎదుటే తలుపు మూసుకుపోతోంది అనిపిస్తోంది’ అని బాధపడ్డాడు ఓ 28 ఏళ్ల ఇండియన్ ఫైనాన్షియల్ ప్రొఫెషనల్. అతడి భార్య ప్రస్తుతం గర్భవతి. తొలి సంతానానికి జన్మనివ్వబోతోంది. ఇక ఎలాంటి పత్రాలు లేకుండా అక్రమంగా అమెరికాలో నివాసం ఉంటున్న భారతీయుల పరిస్థితి వర్ణనాతీతం. కాలిఫోర్నియాలో ఎనిమిదేళ్లుగా అక్రమంగా నివసిస్తున్న విజయ్ (పేరు మార్చాం) తాజా ఫిబ్రవరి 20 ‘డెడ్ లైన్’తో నెత్తిన పిడుగుపడ్డట్టు బెంబేలెత్తుతున్నాడు. ::జమ్ముల శ్రీకాంత్(Courtesy: The Economic Times) -
20 Years of Tsunami: రాకాసి అలలను దాటి.. విషసర్పాల కారడవిలో శిశువుకు జన్మనిచ్చి..
సరిగ్గా 20 ఏళ్ల క్రితం తమిళనాడు తీరంలో సముద్రపు రాకాసి అలలు సృష్టించిన బీభత్సాన్ని నేటికీ ఎవరూ మరచిపోలేరు. 2004 డిసెంబర్ 26న ఏకంగా 6,605 మందిని బలిగొన్న సునామీ మిగిల్చిన విషాదం ఇప్పటికీ స్థానికులను వెంటాడుతూనే ఉంది. నాటి సునామీ బాధితులలో నమితా రాయ్ ఒకరు. ఆనాడు ఆమెకు అనూహ్య అనుభవం ఎదురయ్యింది. దానిని తలచుకున్నప్పుడల్లా ఆమె నిలువెల్లా వణికిపోతుంటుంది.ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీలో ఉంటున్న నమితా రాయ్ నాటి సునామీ అనుభవాలను మీడియాకు తెలిపారు. అవి ఆమె మాటల్లోనే.. ‘2004లో నేను కుటుంబంతోపాటు అండమాన్, నికోబార్‌లోని హాట్‌బే ద్వీపంలో ఉండేవాళ్లం. ఆ సమయంలో నేను గర్భవతిని. ఆ రోజు నేను రోజువారీ పనుల్లో బిజీగా ఉన్నాను. అకస్మాత్తుగా హట్ బే ద్వీపం దిశగా సముద్రపు అలలు ఎగసిపడుతూ వచ్చాయి. వాటిని చూసిన వారంతా పెద్దగా కేకలు పెడుతూ, కొండపైకి పరుగులు తీశారు. దీనిని చూసిన నేను భయంతో స్పృహ కోల్పోయాను.నేను తేరుకుని కళ్లు తెరచి చూసేసరికి దట్టమైన అడవిలో ఉన్నాను. నా చుట్టూ చాలామంది ఉన్నారు. అంతకుముందు అపస్మారక స్థితిలో ఉన్న నన్ను నా భర్త, పెద్ద కుమారుడు ఇక్కడికి తీసుకువచ్చారు. భీకరమైన అలల తాకిడికి హాట్‌బే ద్వీపమంతా ధ్వంసమయ్యిందని చెప్పారు. ఆ మాట వినగానే షాక్‌కు గురయ్యాను. ఆరోజు రాత్రి 11.49 గంటల సమయంలో నాకు అకస్మాత్తుగా పురిటి నొప్పులు వచ్చాయి. దగ్గర్లో డాక్టర్లెవరూ లేరు.పురిటి నొప్పులతో బాధపడుతూ మెలికలు తిరిగిపోయాను. దీనిని గమనించిన నా భర్త నన్ను ఒక చదునైన బండరాయిపై పడుకోబెట్టారు. సహాయం కోసం వైద్యులకు కాల్ చేశారు. ఎంత ప్రయత్నించినా వైద్య సహాయం అందలేదు. వెంటనే నా భర్త.. నేను పడుతున్న పురిటినొప్పల గురించి అక్కడున్న మహిళలకు చెప్పి,సాయం అర్థించారు. వెంటనే వారు అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో నాకు పురుడు పోశారు. అంతటి విపత్కర సునామీ పరిస్థితుల మధ్య నేను నా కుమారునికి జన్మనిచ్చాను. ఆ ఆడవిలో లెక్కకు మించిన విష సర్పాలు ఉంటాయి. వాటి మధ్యనే నేను పురుడు పోసుకున్నాను. నా కుమారునికి ‘సునామీ’ అని పేరు పెట్టుకున్నాను.అయితే అధిక రక్తస్రావం కారణంగా నా ఆరోగ్య పరిస్థితి దిగజారింది. అతికష్టం మీద నా బిడ్డకు పాలు తాగించాను. అయితే అంతకుమందు నేను ఏమీ తినకపోవడంతో నా పిల్లాడికి కావాల్సినంత పాలు ఇవ్వలేకపోయాను. దీనిని గమనించిన చుట్టుపక్కల మహిళలు నా కుమారుని చేత కొబ్బరి నీళ్లు తాగించారు. అటువంటి దుర్భర పరిస్థితుల్లో అదే ప్రాంతంలో మేము నాలుగు రోజులు ఉండాల్సి వచ్చింది. తరువాత రక్షణ సిబ్బంది అక్కడికి వచ్చి మమ్మల్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు. అక్కడి నుంచి నన్ను వైద్య చికిత్స కోసం పోర్ట్ బ్లెయిర్‌లోని జీబీ పంత్ ఆసుపత్రికి ఓడలో తీసుకెళ్లారు.కోవిడ్ -19 మహమ్మారి సమయంలో నా భర్త లక్ష్మీనారాయణ కన్నుమూశారు. ప్రస్తుతం నేను నా కుమారులు సౌరభ్, సునామీలతో పాటు హుగ్లీలో ఉంటున్నాను. పెద్ద కొడుకు సౌరభ్ ఒక ప్రైవేట్ షిప్పింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. రెండవవాడు సునామీ భవిష్యత్‌లో సముద్ర శాస్త్రవేత్త కావాలని అనుకుంటున్నాడు’ అని నమితా రాయ్ తెలిపారు.అనంతరం ఆమె కుమారుడు సునామీ మీడియాతో మాట్లాడుతూ ‘మా అమ్మే నాకు సర్వసం. మా నాన్నగారు మరణించాక అమ్మ మమ్మల్ని పెంచిపెద్ద చేసేందుకు ఎంతో శ్రమించింది. సునామీ కిచెన్‌ను నడుపుతూ కుటుంబాన్ని నెట్టుకువచ్చింది. భవిష్యత్‌లో నేను సముద్ర శాస్త్రవేత్త కావాలనుకుంటున్నాను’ అని తెలిపారు.ఇది కూడా చదవండి: Veer Bal Diwas: మొఘలులను ఎదిరించిన ఆ చిన్నారుల బలిదానానికి గుర్తుగా.. -
ప్రెగ్నెన్సీ అంటే జోక్ కాదు, నిజాలు ఎవ్వరూ చెప్పరు: రాధిక ఆప్టే కష్టాలు
నటి రాధికా ఆప్టే వచ్చే నెలలో (2024 డిసెంబరు) తొలి బిడ్డకు జన్మనివ్వబోతోంది. లండన్ ఫిల్మ్ ఫెస్టివల్లో తన కొత్త సినిమా ‘సిస్టర్ మిడ్నైట్’ ప్రీమియర్ షో సందర్భంగా బేబీబంప్ ఫోటోలతో దర్శనమిచ్చి ఫ్యాన్స్‌కు శుభవార్త అందించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రెగ్నెన్నీ బాధల గురించి చెప్పుకొచ్చింది.గర్భం దాల్చిన మొదటి మూడు నెలల్లో తను అనుభవించిన భావోద్వేగం, గందరగోళం, నిరాశ లాంటి ఫీలింగ్స్ గురించి ఏకరువు పెట్టింది. ప్రెగ్నెన్సీ అని తెలిసిన తరువాత రెండు వారాల పాటు తనకు ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉన్నానని చెప్పింది. అంతేకాదు ఈమూడు నెలలు 40-డిగ్రీల వేడిలో షూటింగ్ చేయాల్సి వచ్చింది. మరోవైపు భయంకరమైనకడుపు ఉబ్బరం, తీవ్రమైన మలబద్ధకం, వాంతులతో బాధ పడినట్టు పేర్కొంది. బిడ్డ కడుపులో ఉన్నపుడు సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని అందరూ చెప్పారు. కానీ తనకు మాత్రం నరకం కనిపించిందని తెలిపింది. పిల్లల్ని కనాలన్న ప్లానే లేదు. పైగా గర్భధారణ అంటే ఏమిటో, గర్భవతిగా ఉన్నప్పుడు ఏమి జరుగుతుందో, ఎలా ఉంటుందో తెలియదు. శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలియదు. అలాంటి సమయంలో నేను గర్భం దాల్చాను. గర్భధారణ అనే దాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు కాబట్టి, ఎవరూ నిజం చెప్పరు. కొంతమందికి ఇదంతా చాలా సులువుగానే అయిపోతుంది. కానీ కొంతమందికి అలాకాదు. గర్భం ధరించడం బిడ్డల్ని అంటే ఫన్కాదు. ఇది చాలా సబ్జెక్టివ్ కేసు. శరీరం అనేక మార్పులకు లోనవుతుంది అంటూ చెప్పుకొచ్చింది రాధిక ఆప్టే.కాగా రాధిక ఆప్టే 2012లో బ్రిటిష్ మ్యుజిషియన్ బెనెడిక్ట్‌ను వివాహమాడింది. పెళ్లంటే అస్సలు ఇష్టం లేదని, విదేశీ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే వీసా సులభంగా వస్తుందన్న ఉద్దేశంతోనే బెనెడిక్ట్‌ను వివాహం చేసుకున్నానని, కానీ ప్రస్తుతం తాను భర్తతో హ్యాపీగానే ఉన్నానని, తమ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. -
ఆరు నెలల పాపకు ప్రాణం పోసిన అంకురా హాస్పిటల్ ..
స్త్రీ, శిశు ఆరోగ్యంలో ప్రత్యేక సేవలందించే ప్రముఖ ఆరోగ్య సంరక్షణ సంస్థ అంకురా ఫర్ ఉమెన్ & చిల్డ్రన్ ఆస్పత్రి అరుదైన ఘనతను సాధించింది. మూత్రపిండ వ్యాధితో బాధపడుతున్న ఆరు నెలల పాపకు ప్రాణం పోసి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. అత్తాపూర్‌లోని అంకురా హాస్పిటల్ వైద్య బృందం సదరు శిశువుకి అత్యాధునికి చికిత్స అందించి పెరిటోనియల్ డయాలసిస్ చేయించారు. తద్వారా ఆ చిన్నారికి కొత్త జీవితాన్ని అందించడమే గాక తల్లిదండ్రులలో కొండంత ఆశను నింపారు.చిన్నారిని అంకురా హాస్పిటల్‌కు తీసుకువచ్చినప్పుడు..వివిధ అనారోగ్యాలతో తీవ్రమైన స్థితిలో ఉంది. వేగంగా శ్వాస తీసుకోవడం, తీవ్రమైన నిర్జలీకరణం, మూడు నుంచి నాలుగు నెలల వరకు బరువు పెరగకపోవడం, పొటాషియం స్థాయిలు తక్కువగా ఉండటం, శరీరంలో ఆమ్లం పెరగడం వంటి సమస్యలతో ఉంది. అత్యవసర పరిస్థితిని గుర్తించిన అత్తాపూర్ అంకురా ఆసుపత్రికి చెందిన పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ ఖలీల్ ఖాన్ వెంటనే చిన్నారిని ఐసీయూలో చేర్చి వెంటిలేటర్‌పై ఉంచారు. క్లినికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా, శిశువు మూత్రపిండ గొట్టపు అసిడోసిస్తో బాధపడుతున్నట్లు తేలింది.అత్తాపూర్‌లోని అంకురా హాస్పిటల్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ అంకుష్ కొమ్మవార్ మాట్లాడుతూ.. "క్లినికల్ పరీక్ష ఫలితాల ఆధారంగా, రోగి మూత్రపిండ గొట్టపు అసిడోసిస్తో బాధపడుతున్నట్లు నిర్ధారించాము. శిశువుకు మూత్రం, మూత్రపిండాలు రావడంలో ఇబ్బంది ఉంది. రోగికి పెరిటోనియల్ డయాలసిస్ అనేది సాధారణంగా పని చేయడం లేదు. కాబట్టి ఈ ప్రక్రియ గురించి పిల్లల తల్లిదండ్రులతో చర్చించి, వారి ఆమోదం పొందిన తర్వాత, డాక్టర్ రవిదీప్ పీడియాట్రిక్ నెఫ్రాలజిస్ట్ మార్గదర్శకత్వంలో వైద్య బృందం అత్యంత సున్నితమైన, కష్టతరమైన ప్రక్రియను నిర్వహించింది. తల్లిదండ్రుల సహాకారంతో అత్యంత నైపుణ్యం కలిగిన వైద్యుల మార్గదర్శకత్వంలో చికిత్స అందించారు. ఫలితంగా శిశువు ఆరోగ్యం క్రమంగా మెరుగుపడింది. బరువు పెరిగింది. అలాగే ఇంటరాక్టివ్ వయస్సు తగిన విధంగా మైలురాళ్లను చేరుకుంది. చిన్నారిని విజయవంతంగా డిశ్చార్జి చేశారు.ఈ మేరకు హైదరాబాద్‌లోని అంకురా హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ ప్రసాద్ వున్నం మాట్లాడుతూ.. "అంకురా హాస్పిటల్లో ప్రాణాలను కాపాడటం, రోగుల శ్రేయస్సును నిర్ధారించడం మా లక్ష్యం. శిక్షణ పొందిన అనుభవజ్ఞులైన వైద్యుల బృందం మా వద్ద ఉంది. అత్తాపూర్‌లోని అంకురా హాస్పిటల్లో ఆ శిశువుకి అందించిన అపూర్వమైన సంరక్షణ ఇందుకు నిదర్శనం. అంకురా హాస్పిటల్లో ఖచ్చితమైన ప్రణాళిక, నైపుణ్యంతో కూడిన బృందం, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో రోగులకు సేవలందిస్తోందని చెప్పుకొచ్చారు. (చదవండి: 'వర్క్ లైఫ్ బ్యాలెన్స్'పై ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడి అమూల్యమైన సలహాలు.!) -
Nanda Birth Anniversary: సొంతిల్లు లేని ప్రధాని.. జీవన భృతి కూడా వద్దంటూ..
భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ అనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే మన దేశ రెండవ ప్రధాని(తాత్కాలిక) గుల్జారీలాల్ నందా గురించి చాలా తక్కువమందికే తెలుసు. ఆయన 1964, 1966లలో రెండుసార్లు భారతదేశానికి తాత్కాలిక ప్రధానమంత్రిగా వ్యవహరించారు. నేడు (జూలై 4) గుల్జారీలాల్ నందా జన్మదినం. ఈ సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని ముఖ్యమైన విశేషాలను తెలుసుకుందాం.గుల్జారీలాల్ నందా 1898, జులై 4న ప్రస్తుత పాకిస్తాన్‌లోని సియాల్కోట్లో జన్మించారు. నందా తన విద్యాభ్యాసాన్ని లాహోర్, ఆగ్రా, అలహాబాద్లలో పూర్తి చేశారు. 1997లో ఆయనకు భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న లభించింది. గుల్జారీలాల్ నందా 1957, 1962లలో రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు.నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మరణానంతరం నందా 1964 మే 27న తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. నాడు అతని పదవీకాలం 13 రోజులు. దీని తరువాత తాష్కెంట్లో అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మరణించిన తరువాత నందా 1966, జనవరి 11న మరోమారు తాత్కాలిక ప్రధానిగా ప్రమాణం చేశారు. గుల్జారీ లాల్ నందా 1962, 1963లో కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిగా, 1963 నుంచి 1966 వరకు హోం వ్యవహారాల మంత్రిగా కూడా పనిచేశారు.దేశానికి రెండుసార్లు ప్రధానిగా, దీర్ఘకాలం కేంద్రమంత్రిగా పనిచేసిన గుల్జారీ లాల్ నందాకు చివరి రోజుల్లో సొంత ఇల్లు కూడా లేదు. అద్దె చెల్లించడానికి కూడా డబ్బులు లేక ఇబ్బంది పడ్డారు. కొన్ని నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో గుల్జారీ లాల్ నందాను ఇంటి యజమాని వెళ్లగొట్టాడు. ఈ వార్త దావానంలా మారడంతో నాటి కేంద్ర ప్రభుత్వం కొందరు అధికారులను నందా దగ్గరకు పంపింది. వారు స్వాతంత్ర్య సమరయోధులకు ఇచ్చే రూ. 500 భృతిని తీసుకునేందుకు నందాను అతికష్టం మీద ఒప్పించారు. గుల్జారీలాల్ నందా మాజీ ప్రధాని అని ఆ ఇంటి యజమానికి తెలియడంతో అతను నందాకు క్షమాపణలు చెప్పాడు. గుల్జారీ లాల్ నందా తన 99 సంవత్సరాల వయసులో 1998, జనవరి 15న కన్నుమూశారు. -
బస్టాండ్‌లో మహిళ ప్రసవం
కరీంనగర్ టౌన్: భర్తతో కలిసి స్వస్థలానికి వెళ్లేందుకు బస్సు కోసం ఎదురుచూస్తున్న ఓ నిండు గర్భిణి కరీంనగర్ బస్టాండులో ఆదివారం సాయంత్రం పండంటి ఆడబిడ్డను ప్రసవించింది. ఆర్టీసీ, 108 సిబ్బంది ఆ మహిళకు పురుడుపోశారు. ఒడిశాకు చెందిన కుమారి– దూల దంపతులు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలోని ఇటుక బట్టీలో కొద్దిరోజులుగా కూలీలుగా పనిచేస్తున్నారు.నిండు గర్భిణి అయిన కుమారిని తీసుకుని ఆమె భర్త దూల ఆదివారం కుంట–భద్రాచలం మీదుగా స్వస్థలానికి వెళ్లేందుకు కరీంనగర్ బస్‌స్టేషన్ చేరుకున్నారు. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో కుమారికి పురిటినొప్పులు వచ్చాయి. కాసేపటికి ఎక్కువ కావడంతో ఆమె భర్త అక్కడే ఉన్న ఆర్టీసీసిబ్బంది సాయం కోరాడు. వారు వెంటనే 108 సిబ్బందికి ఫోన్ చేశారు. ఇంతలో అక్కడే ఉన్న ఆర్టీసీ మహిళా సిబ్బంది పరిస్థితిని గమనించి ప్లాట్‌ఫాం ఎదురుగా ఉన్న చెట్టు కిందకు కుమారిని తీసుకెళ్లారు. చుట్టూ చీరలు అడ్డుగా పెట్టి డెలివరీ చేశారు. అదే సమయంలో 108 సిబ్బంది అక్కడికి చేరుకొని సాయం అందించారు. పండంటి ఆడబిడ్డ జని్మంచగా.. 108 వాహనంలో తల్లీబిడ్డను జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. పురుడుపోసిన ఆర్టీసీ స్వీపర్లు సైదమ్మ, స్రవంతి, లావణ్య, భవానీ, రేణుకను అధికారులు, ప్రయాణికులు అభినందించారు. కాగా తన భార్యకు డెలివరీ సమయం వచ్చే వరకు ఇటుక బట్టీ యాజమాని కూలీ డబ్బులు ఇవ్వలేదని, రేపుమాపు అంటూ దాటవేయడం వల్లే ఈ పరిస్థితి వచి్చందని కుమారి భర్త దూల ఆవేదన వ్యక్తం చేశారు. -
ఒకే కాన్పులో ఐదుగురికి జన్మనిచ్చిన తల్లి!
కవల శిశువుల జననం గురించి మనం వినేవుంటాం. ఒకే కాన్పులో ఇద్దరో లేదా ముగ్గురో పుట్టడాన్ని కూడా చూసేవుంటాం. అయితే ఒకే కాన్పులో ఏకంగా ఐదుగురు శిశువులు జన్మంచడాన్ని అంతగా చూసి ఉండం. వినివుండం. బీహార్‌లోని కిషన్‌గంజ్ జిల్లాలో 20 ఏళ్ల మహిళ ఏకకాలంలో ఐదుగురు ఆడ శిశువులకు జన్మనిచ్చింది.ఈ ఉదంతం చర్చనీయాంశంగా మారింది. శిశువులంతా ఒక కిలో లోపు బరువుతో ఉన్నారు. తల్లి, శిశువులంతా ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. ఆ మహిళకు పురుడు పోసిన డాక్టర్ ఫర్జానా మాట్లాడుతూ ఈ కేసు తనకు చాలెంజింగ్‌గా అనిపించిందని, ఇలాంటి కేసులు చాలా అరుదుగా ఉంటాయని తెలిపారు. కాగా ఆ మహిళకు సాధారణ ప్రసవం ద్వారా శిశువులంతా జన్మించడం విశేషం.కిషన్‌గంజ్ జిల్లాలోని కనక్‌పూర్ పంచాయతీ పరిధిలోని జల్మిలిక్ గ్రామానికి చెందిన తాహిరా బేగం (20) గర్భం దాల్చినప్పటి నుంచి ఓ ప్రైవేట్ నర్సింగ్‌హోమ్‌లో చికిత్స అందుకుంటోంది. ఈ నేపధ్యంలో ఆమె కడుపులో ఐదుగురు కవలలు ఉన్నారని స్కానింగ్‌లో వెల్లడయ్యింది. దీంతో ఆమె భయపడిపోయింది. అయితే డాక్టర్ ఫర్జానా ఆమెకు ధైర్యం చెప్పారు. తరువాత ఆమెకు తొమ్మిది నెలల పాటు రెగ్యులర్ చెకప్ కొనసాగింది. శనివారం ఆమె ఐదురుగు ఆడ శిశువులకు జన్మనిచ్చింది. తాహిరా ఇప్పుడు రెండోసారి తల్లి అయ్యింది. ఆమెకు ఇప్పటికే మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. ఇప్పుడు ఆమె ఆరుగురు పిల్లలకు తల్లిగా మారింది. -
ఆ మహిళ ఏకంగా 69 మంది పిల్లలకు జన్మనిచ్చిందా?
ఒక మహిళ గర్భం ధరించడం పిల్లలను కనడం అనేది అత్యంత కఠిన నియమాతో కూడిన పని. అయిన మాతృత్వపు మమకారంతో ప్రతి స్త్రీ సునాయాసంగా ఆ బాధ్యతను మోస్తుంది. అయితే ఎవరైనా మహా అయితే ఐదుగురు లేదా పది మంది వరకు కనడం గురించి విని ఉంటాం. ఏకంగా 69 మంది పిల్లలను కనడం గురించి విన్నారు. ఈ విషయాన్ని గుర్తించి గిన్నిస్ రికార్డుల్లో సైతం ఆ మహిళ పేరుని నమోదు చేశారు అధికారులు. ఇంతకీ ఆ మహిళ ఎవరు? ఎక్కడ జరిగిందంటే..ఈ అరుదైన ఘటన రష్యాలో చోటు చేసుకుంది. ఒకరు కాదు, నలుగురు కాదు, ఒక మహిళ ఏకంగా 27 సార్లు గర్భం దాల్చింది. ఏకంగా 69 మంది పిల్లలకు జన్మనిచ్చి ప్రపంచాన్నే ఆశ్చర్య పరిచింది. రష్యా నివాసి అయిన వాలెంటినా వాసిలీవ్ అనే మహిళ 1725 మరియు 1765 మధ్య 69 మంది పిల్లలకు జన్మనిచ్చింది. మాస్కోలోని స్థానిక ప్రభుత్వ నివేదిక ప్రకారం, రష్యన్ రైతు ఫియోడర్ వాసిలీవ్ భార్య వాలెంటినా వాసిలీవ్ సుమారు 27 ప్రసవాలతో 69 మంది పిల్లలకు జన్మనిచ్చినట్లు పేర్కొంది. అందులో 16 మంది కవలలే ఉండటం విశేషం. అంటే ఏడు ప ఏడు ప్రసవాల్లో ట్రిపులెట్స్ని, నాలుగు ప్రసవాల్లో నలుగురు చొప్పున పిల్లలను ప్రసవించింది. చరిత్రలో జరిగిన ఈ వింతను వెలికితీసి గుర్తించడమే కాకుండా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆ తల్లి పేరును అత్యంత ఫలవంతమైన తల్లిగా నమోదు చేసింది. రష్యాలోని కొన్ని చారిత్రక పుస్తకాల్లో దీని గురించి ఉంది. పైగా ప్రజలు కూడా ఈ విషయాన్ని కథలు కథలుగా చెప్పుకుంటారు. ఆ రైతు ఫియోడర్ వాసిలీవ్ మరొక స్త్రీని కూడా వివాహం చేసుకున్నాడు. ఆమె కూడా ఎనిమిది సార్లు గర్భవతి అయ్యి 18 మంది పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో వాసిలీవ్ మొత్తం 87 మంది పిల్లలకు తండ్రి అయ్యాడు. వారిలో 84 మంది మాత్రమే జీవించి ఉన్నారు. మిగిలిన ఏడుగురు పిల్లలు పుట్టిన కొద్ది రోజులకే చనిపోయినట్లు నివేదిక తెలిపింది. ఇదిలా ఉండగా..ఒక మహిళ అన్ని సార్లు గర్భం ధరించడం సాధ్యమేనా అని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ సంతాన సాఫల్య వైద్యుడు జేమ్స్ సెగర్స్ పరిశోధన చేశారు. ఆయన తన అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఇక్కడ వాలెంటినా 40 సంవత్సరాల వ్యవధిలో 27 గర్భాలకు తగినంత సమయం కలిగి ఉంటేనే ఇంతమంది పిల్లలను కనగలదని అన్నారు. అంతేగాదు ఒక స్త్రీ సైన్సు పరంగా మనం ఊహించిన దానికంటే ఎక్కువ మందిని కనగలదని చెప్పారు. మహిళలు సాధారణంగా 15 సంవత్సరాల వయస్సులో రుతుక్రమంలోకి వస్తారు. వారి అండాశయాలు ప్రతి 28 రోజులకు ఒక గుడ్డును విడుదల చేయడం ప్రారంభిస్తాయి. మెనోపాజ్‌లో గుడ్డు సరఫరా అయిపోయే వరకు ఈ అండోత్సర్గము కొనసాగుతుంది. ఈ అండోత్సర్గం తగ్గిపోయే మహిళ వయసు 51 ఏళ్లు అని తెలిపారు. ఇక్కడ ప్రసవాల సంఖ్య పెరిగే కొద్ది సంతానోత్పత్తి స్థాయి పడిపోతుంటుందని, ముఖ్యంగా 40 ఏళ్లు సమీపించేటప్పటికీ ప్రతి చక్రానికి బిడ్డ పుట్టే అవకాశం ఒక్క శాతంగానే ఉంటుందని అన్నారు. ఇక్కడ ఈ మహిళ వాలెంటినా 18 ఏళ్ల వరకు ప్రసవిస్తూనే ఉండి ఉండాలి. అలా ఆలోచిస్తే.. అన్ని సార్లు మహిళ గర్భం ధరించడం అనేది ఆమెకు బిడ్డకు చాలా ప్రమాదకమరమైనది, పైగా సాధ్యం కాదని అన్నారు జేమ్స్ సెగర్స్. (చదవండి: ఈ వ్యాయామాలతో కొవ్వు కరిగి స్లిమ్‌గా అవ్వుతారు!) -
ఒక్క బిడ్డను కంటే రూ.61 లక్షలు!
జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దక్షిణ కొరియా దేశంలో జనన రేటును పెంచేందుకు వినూత్న చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా పిల్లలకు జన్మనిచ్చే తల్లిదండ్రులకు ప్రోత్సాహకంగా ఒక్కో బిడ్డకు 59 వేల పౌండ్లు (దాదాపు రూ.61 లక్షలు) ఇచ్చే అంశాన్ని ఆ దేశ ప్రభుత్వం పరిశీలిస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ కార్యక్రమాన్ని అమలు చేసే ముందు ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు దక్షిణ కొరియా ప్రభుత్వానికి చెందిన అవినీతి నిరోధక, పౌర హక్కుల కమిషన్ ఓ పబ్లిక్ సర్వేను చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ సర్వే ఏప్రిల్ 17న ప్రారంభమైంది. పిల్లల్ని కనేవారికి అందించే ప్రోత్సాహాల కోసం ఏటా 12.9 బిలియన్ పౌండ్లు ( సుమారు రూ. 1.3 లక్షల కోట్లు) ఖర్చు చేయనుంది. ఇది ఆ దేశ బడ్జెట్లో దాదాపు సగం.దక్షిణ కొరియా దేశంలో జననాల రేటు భారీగా తగ్గిపోతోంది. 2023లో ఇది 0.72కు పడిపోయింది. 2023లో నమోదైన జాతీయ జనన రేటు ఆ దేశ చరిత్రలోనే అత్యంత కనిష్టం. దేశంలో జనాభా సంక్షోభానికి అనేక కారణాలు ఉన్నాయి. పెరిగిన జీవన వ్యయం, తగ్గిన జీవన నాణ్యత.. వెరసి దంపతులు వివాహ బంధానికి, పిల్లలను కనేందుకు విముఖత చూపుతున్నారు. -
కొడుకు డ్రీమ్ : బిడ్డను ‘కన్న’తల్లి టీవీ నటి, క్యూట్ బేబీ (ఫోటోలు)
-
బర్త్ సర్టిఫికెట్ కొత్త రూల్స్.. కేంద్రం కీలక మార్పులు?
జనన వివరాల నమోదుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ కీలక మార్పులు చేయనుంది. కొత్తగా పుట్టిన శిశువుల తల్లిదండ్రులు ప్రస్తుతం ఉన్న 'కుటుంబ మతం' డిక్లరేషన్‌కు భిన్నంగా ప్రతిపాదిత బర్త్ రిపోర్ట్‌లో తమ మతాన్ని వేరువేరుగా, వ్యక్తిగతంగా నమోదు చేయాల్సి ఉంటుందని ‘ది హిందూ’ నివేదించింది. ఈ కథనం ప్రకారం.. కొత్త ఫారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మోడల్ రూల్స్‌కు అనుగుణంగా ఉంది. దీన్ని అమలులోకి తెచ్చే ముందు రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయాలి. ఆయా ప్రభుత్వాలు దీన్ని ఆమోదించాల్సి ఉంటుంది. కాగా దత్తత తీసుకునే తల్లిదండ్రులకు కూడా ఇదే వర్తిస్తుంది. వారు కూడా తమ మతాన్ని వ్యక్తిగతంగా నమోదు చేయాలి. జననాలు, మరణాల రికార్డుల భద్రత కోసం జాతీయ స్థాయి డేటాబేస్ ఏర్పాటు చేస్తారు. ఆధార్ నంబర్లు, ఆస్తి రిజిస్ట్రేషన్లు, రేషన్ కార్డ్‌లు, ఎలక్టోరల్ రోల్స్, పాస్‌పోర్ట్‌లు, డ్రైవింగ్ లైసెన్స్‌లు, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (NPR) సహా అనేక ఇతర డేటాబేస్లను రిఫ్రెష్ చేయడానికి ఈ డేటాబేస్ ఉపయోగపడుతుంది. జనన మరణాల నమోదు (సవరణ) బిల్లు-2023ను పార్లమెంటు ఉభయ సభలు గతేడాది ఆగస్టులో ఆమోదించాయి. దీని ప్రకారం.. 2023 అక్టోబర్ నుండి విద్యా సంస్థలలో నమోదు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు, ఆధార్ నంబర్ పొందడం, వివాహాల నమోదు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు వంటి వివిధ ముఖ్యమైనవాటికి జనన ధ్రువీకరణ పత్రాన్నే ఏకైక పత్రంగా గుర్తిస్తారు. -
Gal Gadot: నాలుగోసారి ఆడపిల్లకు జన్మనిచ్చిన వండర్ ఉమెన్.. పేరేంటో తెలుసా? (ఫోటోలు)
-
నటి నుంచి సీఎం వరకూ.. ‘అమ్మ’ జీవితం సాగిందిలా!
పలువురు మహిళలు దేశ రాజకీయాల్లో ప్రముఖ స్థానాన్ని సంపాదించుకుంటున్నారు. చరిత్రను పరిశీలిస్తే.. సరోజినీ నాయుడు, ఇందిరా గాంధీ, సుచేతా కృపలానీ, సుష్మా స్వరాజ్, ప్రతిభా పాటిల్, మమతా బెనర్జీ, మాయావతి, ప్రియాంక గాంధీ సహా ఎందరో మహిళల పేర్లు దేశ ప్రజల నోళ్లలో మెదులుతాయి. దేశ రాజకీయాల్లో సత్తా చాటుతున్న నటీమణుల విషయానికొస్తే స్మృతి ఇరానీ, నుస్రత్ జహాన్, జయప్రద హేమమాలిని తదితరుల పేర్లు వినవస్తాయి. అయితే అమోఘమైన ప్రజాదరణ పొందిన మహిళా నేతల జాబితాను పరిశీలిస్తే ఒక నాటి నటీమణి, ఆ తరువాత తమిళనాట సీఎంగా సత్తా చాటిన జయలలిత తప్పుకుండా గుర్తుకువస్తారు. తమిళనాడు ప్రజలు జయలలితను ‘అమ్మా’ అని పిలిచేంతటి ఆదరణ ఆమె సొంతం చేసుకున్నారు. ఈరోజు(ఫిబ్రవరి 24) దివంగత సీఎం జయలలిత జన్మదినం. 1948 ఫిబ్రవరి 24న జన్మించిన జయలలిత జీవితానికి సంబంధించిన ఆసక్తికర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. కుటుంబ నేపధ్యం జయలలిత.. ప్రస్తుతం కర్ణాటకలో భాగంగా ఉన్న మైసూర్‌లోని మాండ్య జిల్లాలోని పాండవపురా తాలూకాలోని మేలుర్కోట్ గ్రామంలో అయ్యర్ కుటుంబంలో జన్మించారు. జయలలిత అసలు పేరు ‘కోమలవల్లి’. ఆమె తండ్రి పేరు జయరామ్. ఆయన వృత్తిరీత్యా న్యాయవాది. ఆమె తల్లి పేరు వేదవల్లి. జయలలిత తల్లి వేదవల్లి ప్రముఖ నటిగా పేరు సంపాదించారు. బాల్యంలో జయలలితకు సినిమాలపై అంతగా ఆసక్తి లేదు. ఆమె ఎప్పుడూ నటి కావాలని కోరుకోలేదు. బలవంతంగా ఆమె సినీ రంగంలోకి వచ్చారని చెబుతుంటారు. సినీ జీవితం చదువులో జయలలిత ఎంతో ప్రతిభ కనబరిచారు. జయలలిత తండ్రి ఆమెను లాయర్‌గా చూడాలనుకున్నారు. అయితే ఆమె తల్లి.. జయలలితను చిన్నతనంలోనే సినీ రంగంలోకి తీసుకువచ్చారు. జయలలిత కేవలం తన 15 ఏళ్ల వయసులోనే అడల్ట్ సినిమాలో నటించారు. ఆమె సినీ జీవితం అక్కడి నుంచే మొదలైంది. ఆమె సినిమాల్లో తన అద్భుత ప్రతిభను ప్రదర్శించారు. జయలలిత తన కెరీర్లో మొత్తం 85 సినిమాలు చేయగా, అందులో 80 సినిమాలు అమోఘ విజయం సాధించాయి. సినిమాల్లో స్లీవ్‌లెస్ బ్లౌజ్ ధరించిన తొలి నటిగా ఆమె గుర్తింపు పొందారు. రాజకీయ ప్రయాణం నాటి రాజకీయ నేత ఎంజీ రామచంద్రన్ నటి జయలలితను సినిమాల నుంచి రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. ఎంజీఆర్, జయలలిత ప్రేమించుకున్నారని కానీ పెళ్లి చేసుకోలేదని, పైగా వారు తమ బంధాన్ని ఏనాడూ బహిరంగపరచలేదని చెబుతుంటారు. జయలలిత 1982లో ఎంజీ రామచంద్రన్‌తో పాటు అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (అన్నా డీఎంకే)లో సభ్యురాలయ్యారు. నాటి నుంచే ఆమె రాజకీయ జీవితం ప్రారంభమైంది. 1984 నుండి 1989 వరకు జయలలిత తమిళనాడు నుండి రాజ్యసభ సభ్యురాలిగా వ్యవహరించారు. ఎంజీఆర్ మరణానంతరం అన్నాడీఎంకే పార్టీ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఆమె తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. సాధించిన విజయాలు తమిళనాడులో జయలలిత ప్రజాదరణ పొందిన నటిగా మాత్రమే కాకుండా మహిళా నేతగా, సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందారు. ఆరు సార్లు తమిళనాడు ముఖ్యమంత్రి కావడం ఆమె రాజకీయాల్లో సాధించిన అమోఘ విజయంగా చెబుతుంటారు. భ్రూణహత్యల నివారణకు ఆమె ‘క్రెడిల్ టు బేబీ స్కీమ్’ను ప్రారంభించారు. ‘అమ్మ’ బ్రాండ్ ప్రారంభించి, ఈ పేరుతో దాదాపు 18 ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేశారు. అమ్మ పేరుతో అమలయిన ఈ పథకాలు పూర్తిగా ఉచితం. లేదా భారీగా రాయితీలు అందించేవి. పట్టణ పేదలకు ఒక్క రూపాయికే ఆహారం అందించేందుకు ఆమె ‘అమ్మ క్యాంటీన్’ను ప్రారంభించారు. జయలలిత తన 68వ ఏట 2016 డిసెంబర్ 5న కన్నుమూశారు. -
బీథోవెన్ డీఎన్ఏలో అంతుచిక్కని రహస్యాలు?
జర్మనీకి చెందిన అలనాటి స్వరకర్త లుడ్విగ్ వాన్ బీథోవెన్ సింఫనీ, పియానో, వయెలెన్ మొదలైన వాటితో మ్యూజిక్ కంపోజ్ చేయడంలో ఎంతో పేరొందారు. తాజాగా ఆయన జుట్టు నుంచి సేకరించిన డిఎన్ఏపై జరిపిన విశ్లేషణ అతనికి సంబంధించిన పలు రహస్యాలను వెల్లడించింది. బీథోవెన్ దీర్ఘకాలం పాటు అనారోగ్యంతో బాధపడుతూ 1827లో కన్నుమూశారు. అతను వినికిడి లోపం, కాలేయ వ్యాధి, ఉదర సంబంధిత వ్యాధులు, అతిసారంతో బాధపడ్డాడు. బీథోవెన్ తన చివరి రోజుల్లో తన మూలాల గురించి జనానికి సవివరంగా తెలియజేయమని తన సోదరులను కోరారు. డీఎన్ఏ విశ్లేషణ కోసం.. జర్మనీ, యూకేల నుండి వచ్చిన పరిశోధకుల బృందం బీథోవెన్ జుట్టుకు సంబంధించిన డీఎన్ఏను విశ్లేషించింది. బీథోవెన్ డీఎన్ఏని అతని బంధువులుగా భావిస్తున్నవారి డీఎన్ఏతో సరిపోల్చారు. అలాగే అతని ఇప్పుటి బంధువులు ఎవరో తెలుసుకునేందుకు పలు రికార్డులను కూడా పరిశీలించారు. హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్తో మృతి బీథోవెన్ జుట్టు నమూనాలలో ఒకటి బీథోవెన్కి చెందినది కాదని, గుర్తు తెలియని మహిళ నుండి వచ్చినదని పరిశోధకులు కనుగొన్నారు. బీథోవెన్ మరణం బహుశా హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ వల్ల సంభవించి ఉండవచ్చునని కూడా వారు కనుగొన్నారు. హెపటైటిస్ వ్యాధి అతని కాలేయాన్ని దెబ్బతీసింది. ఇతర అవయవాల పనితీరుపై ప్రభావం చూపింది. బీథోవెన్ విషప్రయోగం వల్ల మరణించారనే మునుపటి నమ్మకానికి విరుద్ధమైన ఫలితం వచ్చింది. తండ్రులు వేరా? బీథోవెన్కు చెందిన ‘వై’ క్రోమోజోమ్ అతని తండ్రి తరపు బంధువులతో సరిపోలడం లేదని పరిశోధకులు కనుగొన్నారు. అతని వంశవృక్షంలో తండ్రులు వేరుగా ఉండే అవకాశం ఉందని ఉందని కూడా వారు తెలిపారు. అంటే అతని పూర్వీకులలో ఒకరు వారి వంశానికి చెందిన తండ్రి కాకుండా వేరే వ్యక్తి అయివుంటాడని, అతని ద్వారా బీథోవెన్ జన్మించి ఉండవచ్చని కూడా పరిశోధకులు చెబుతున్నారు. -
బర్త్ ఆర్డర్ కూడా వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తుంది!
‘మా పెద్దోడు చాలా బాధ్యతగా ఉంటాడు. కానీ చిన్నోడికే అస్సలు బాధ్యత లేదు. ఏం చెప్పినా పట్టించుకోడు. వాడిని ఎలా మార్చాలో అర్థం కావట్లేదు. మీరేమైనా హెల్ప్ చేస్తారని వచ్చాను’ అన్నారు సుబ్బారావు. ‘మా పెద్దపాప ఇంట్లో అన్ని పనులూ అందుకుంటుంది. కానీ చిన్నపాప మాత్రం ఎప్పుడూ డాన్స్, స్పోర్ట్స్ అంటూంటుంది. దాన్ని ఎలా దారిలో పెట్టాలో అర్థం కావడంలేదు’ చెప్పారు కోమలి. ఇంటికి పెద్ద బిడ్డ యజమాని లాంటి వాడు, బాధ్యతగా ఉంటాడు. రెండో బిడ్డ ప్రశాంతంగా ఉంటాడు. చివరివాడు బాధ్యతలేకుండా అల్లరిచిల్లరగా తిరుగుతుంటాడు.. ఇలాంటి మాటలు మీరు వినే ఉంటారు. ఇది నిజమేనని నమ్మేవాళ్లూ ఉంటారు.. ఇదంతా ట్రాష్ అని కొట్టేసేవాళ్లూ ఉంటారు. దీనిపై సైకాలజిస్టులు కూడా అధ్యయనం చేశారు. ప్రముఖ ఆస్ట్రియన్ సైకాలజిస్ట్ ఆల్ఫ్రెడ్ అడ్లర్ 20వ శతాబ్దం ప్రారంభంలో బర్త్ ఆర్డర్ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. కుటుంబంలో జన్మించిన క్రమం బిడ్డ ప్రవర్తన, భావోద్వేగాలు, ఇతర వ్యక్తులతో సంబంధాలపై శాశ్వత ప్రభావాన్ని చూపుతుందని ఈ సిద్ధాంతం సూచిస్తుంది. మొదటి బిడ్డలు ఎక్కువ శ్రద్ధ (బాధ్యత), మధ్యస్థ శిశువులు తక్కువ శ్రద్ధ (ఎక్కువ స్వాతంత్య్రం)ను పొందుతారనే ఆలోచనలో కొంత నిజం ఉండవచ్చు. చివరి బిడ్డలకు ఎక్కువ స్వేచ్ఛ (తక్కువ క్రమశిక్షణ) లభిస్తాయి. అయితే బర్త్ ఆర్డర్ ఒక ఫ్యాక్టర్ మాత్రమే. తల్లిదండ్రులు, తోబుట్టువులతో సంబంధాలు, జన్యువులు, పర్యావరణం, సామాజిక.. ఆర్థిక స్థితి వంటి అంశాలు కూడా పిల్లల వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తాయి. పేరెంటింగ్ స్టైల్ అనేది పిల్లల వ్యక్తిత్వాన్ని అమితంగా ప్రభావితం చేస్తుందనేది అనేక పరిశోధనల సారాంశం. అడ్లర్ సిద్ధాంతం ప్రకారం ఏ పిల్లలు ఎలా ఉంటారో తెలుసుకుందాం. మొదటి బిడ్డ అడ్లర్ బర్త్ ఆర్డర్ సిద్ధాంతం ప్రకారం, తొలి సంతానం.. వారి తల్లిదండ్రుల నుంచి ఎక్కువ శ్రద్ధ, సమయాన్ని పొందుతారు. కొత్త తల్లిదండ్రులు అప్పుడే పిల్లల పెంపకం గురించి నేర్చుకుంటున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా, కొన్నిసార్లు కఠినంగా, కొన్నిసార్లు న్యూరోటిక్‌గా కూడా ఉండవచ్చు. మొదటి సంతానం టైప్ A వ్యక్తిత్వాలతో బాధ్యతాయుతమైన నాయకులుగా ఉంటారు. కుటుంబంలోకి రెండో బిడ్డ వచ్చినప్పుడు తనకు కేటాయించే సమయం తగ్గడంవల్ల రెండో బిడ్డను చూసి అసూయపడతారు. ఆ తర్వాత తన తోబుట్టువుల పోషణ బాధ్యత తీసుకోవాల్సి రావడం వల్ల ఆదర్శంగా నిలిచేందుకు ప్రయత్నిస్తారు. మొదట జన్మించిన పిల్లలు అధునాతన అభిజ్ఞాభివృద్ధిని కలిగి ఉంటారని పరిశోధన కనుగొంది, ఇది చదువులో మంచి ఫలితాలను సాధించేందుకు ఉపయోగపడుతుంది. మిడిల్ చైల్డ్ తనకన్నా పెద్ద బిడ్డకు, చిన్న బిడ్డకు మధ్య విభేదాలకు మధ్యవర్తిత్వం వహించాల్సిన అవసరం ఉన్నందున, మధ్య పిల్లలు కుటుంబంలో శాంతిని కలిగించేవారుగా ఉంటారని అడ్లర్ సూచించాడు. పేరెంట్స్ పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల వారి దృష్టిని ఆకర్షించేందుకు, ఆదరణ పొందేందుకు వారిని ఆహ్లాదపరచేలా ప్రవర్తిస్తారు. తోబుట్టువులతో నిరంతరం పోటీలో ఉన్నట్లు అనిపించవచ్చు. వీరిలో అభద్రతా భావం, తిరస్కరణ భయం, బలహీనమైన ఆత్మవిశ్వాసం ఉండవచ్చు. తిరస్కరణ పట్ల సున్నితంగా ఉంటారు. తోబుట్టువులకు భిన్నంగా నిలబడాలనుకున్నప్పుడు తిరుగుబాటు లక్షణాలను కలిగి ఉంటారు. మధ్య పిల్లలు తమ తల్లులతో సన్నిహితంగా ఉండే అవకాశం తక్కువగా ఉందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఆఖరి బిడ్డ చివరి బిడ్డ పుట్టే కాలానికి తల్లిదండ్రులకు పిల్లల పెంపకంలో అనుభవం ఉండటం వల్ల కొన్నిసార్లు తక్కువ కఠినంగా ఉంటారు. చివరి బిడ్డ అని గారాబంగా పెంచడంవల్ల, మిగతావారితో పోల్చినప్పుడు చెడిపోయినట్లు కనిపిస్తారు. చిన్నపిల్లలుగా దొరికే స్వేచ్ఛవల్ల కలివిడిగా, స్నేహంగా, చార్మింగ్‌గా ఉంటారు. అయితే ఈ పిల్లలు తక్కువ స్వీయ–నియంత్రణ నైపుణ్యాలను కలిగి ఉండవచ్చు. ఇతరులపై ఎక్కువ ఆధారపడవచ్చు. మేనిప్యులేటివ్గా, అపరిపక్వంగా, సెల్ఫ్ సెంటర్డ్గా కనిపిస్తారు. ఏకైక సంతానం కుటుంబంలో ఏకైక సంతానంగా ఉన్నవారు తల్లిదండ్రుల దృష్టిని, వనరులను తోబుట్టువులతో పంచుకోవాల్సిన అవసరం లేదు. పెద్దలతో ఎక్కువగా సంభాషిస్తారు కాబట్టి, వయసుకు మించి పరిణతి చెందినట్లు కనిపిస్తారు. క్రియేటివ్ ఆలోచనలతో ఏకాంత సమయాన్ని ఆస్వాదిస్తారు. తన ప్రవర్తనపై నియంత్రణ కలిగి ఉంటారు. తల్లిదండ్రుల అధిక అంచనాల కారణంగా అన్నీ ఫర్ఫెక్ట్గా ఉండాలనే ధోరణి కలిగి ఉంటారు. జీవితంలో ఉన్నతమైనదాన్ని సాధించాలనే కోరిక ఉంటుంది. సాధిస్తారు. స్వావలంబన, ఊహాత్మక ధోరణి ఉంటుంది. సెన్సిటివ్‌గా ఉంటారు. సైకాలజిస్ట్ విశేష్, psy.vishesh@gmail.com -
‘స్పెర్మ్ డొనేషన్’తో జన్మించిన ఆమెకు ఎదురైన అనుభవం ఏమిటి?
లోకంలోని ప్రతీ చిన్నారి తన తల్లిదండ్రుల అండ కోరుకుంటుంది. బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన బాలల జీవితంలో ఎప్పుడూ శూన్యం తాండవమాడుతుంటుంది. అట్లాంటాకు చెందిన టిఫనీ జీవితంలో కూడా అటువంటి శూన్యతే ఏర్పడింది. ఆమె తన నాలుగేళ్ల వయసులోనే క్యాన్సర్ కారణంగా తండ్రిని కోల్పోయింది. ఆమె తల్లి ఇదే విషయాన్ని ఆమెకు తరచూ చెప్పేది. అయితే ఆమెకు చాలాకాలానికి తండ్రి గురించిన నిజం తెలియడంతో నివ్వెరపోయింది. మిర్రర్ వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం జార్జియాలోని అట్లాంటాలో ఉంటున్న టిఫనీ గార్డనర్ తన నిజమైన తండ్రిని మిస్సయ్యింది. ఆమెకు నాలుగేళ్లు ఉన్నప్పుడు తండ్రి క్యాన్సర్‌తో మరణించాడని ఆమె తల్లి చెప్పింది. తరువాత ఆమె తల్లి మరో పెళ్లి చేసుకుంది. టిఫనీ తన సవతి తండ్రికి దగ్గరయ్యింది. అయితే తన అసలు తండ్రిని మిస్సయ్యాననే బాధ ఆమెను నిరంతరం వెంటాడుతూ వచ్చింది. 2018లో టిఫనీ 36వ పుట్టినరోజున తల్లి ఆమెకు ఒక చేదు నిజాన్ని చెప్పింది. టిఫనీ ఇన్నాళ్లూ ఎవరినైతే తన అసలు తండ్రిగా భావించిందో, అతను తనకు నిజమైన తండ్రి కాడని ఆమె తెలుసుకుంది. తన తల్లి మొదటి భర్త తన అసలు తండ్రి కాడని ఆమె గ్రహించింది. అంతే ఆమెకు కాళ్ల కింద భూమి కంపించినట్లు అనిపించింది. తాను స్పెర్మ్ డొనేషన్ ద్వారా జన్మించానని, తన తల్లి ఎవరినుంచో స్పెర్మ్ తీసుకొని తనకు జన్మనిచ్చిందని టిఫనీకి అర్థం అయ్యింది. టిఫనీ తల్లి మొదటి భర్త.. టిఫనీని సొంత కూతురులా చూసుకున్నాడు. టిఫనీ జన్మ రహస్యం ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. టిఫనీ 1982లో జన్మించింది. ఇటీవల టిఫనీ డీఎన్ఏ పరీక్ష చేయించుకుంది. దీంతో నిజమైన తండ్రి ఎవరో వెల్లడయ్యింది. అతను సజీవంగా ఉన్నాడనే సత్యం కూడా ఆమెకు తెలిసింది. అయితే టిఫనీ తొలుత అతనిని కలవాలని అనుకున్నా, ఆమె ఇంటిలోనివారి ఒత్తిడి మేరకు అతనిని కలుసుకోలేదు. ఇదేవిధంగా ఆమె అసలు తండ్రి కుటుంబ సభ్యులు కూడా టిఫనీని కలుసుకోవద్దని కోరారు. దీంతో వీరి మధ్య పరిచయాలు అంతటితోనే ఆగిపోయాయి. ప్రస్తుతం టిఫనీకి 41 ఏళ్లు. 17 ఏళ్ల క్రితం టిఫనీకి వివాహం జరిగింది. వారికి ముగ్గురు కుమారులున్నారు. స్పెర్మ్ డోనర్ గుర్తింపును ఇకపై దాచకూడదంటూ ఆమె అమెరికా ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తోంది. -
ప్రాణ ప్రతిష్ఠ వేళ.. సీతారాముల జననం!
అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ రోజున నెలలు నిండిన పలువురు గర్భిణులు శిశువులకు జన్మనిచ్చేందుకు ప్లాన్ చేసుకుని, వైద్యుల సాయంతో డెలివరీలు చేయించుకున్నారు. ఈ సమయంలో పుట్టిన చిన్నారులకు అబ్బాయి అయితే రాముడు అని, అమ్మాయి అయితే సీత అని పేరు పెట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్‌లోని జిల్లా మహిళా ఆసుపత్రిలో సోమవారం 13 మంది శిశువులు జన్మించారు. వీరిలో ఎనిమిది మంది నార్మల్ కాన్పులో జన్మించగా, ఐదుగురు సిజేరియన్ ఆపరేషన్ ద్వారా జన్మించారు. జనవరి 22న తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో జిల్లా మహిళా ఆస్పత్రిలో మొదటి శిశువు జన్మించింది. బర్కచ్చా ఖుర్ద్‌లో నివాసం ఉంటున్న లక్ష్మణ్ భార్య అంజలి బాలికకు జన్మనిచ్చింది. తన కుమార్తెకు సీత లేదా జానకి అని పేరు పెడతానని ఆమె తెలిపింది. 22న తెల్లవారుజామున 3.20 గంటలకు, లాల్గంజ్లోని బర్దిహా నివాసి అమిత్ మిశ్రా భార్య ప్రీతి మగ శిశువుకు జన్మనిచ్చింది. ఆ చిన్నారికి రామ్ లేదా రాఘవ్ అనే పేరు పెట్టాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు శుక్లహా నివాసి బాబుల్ సోంకర్ భార్య పుతుల్ బాలునికి జన్మనిచ్చింది. ఆటోడ్రైవర్ బాబుల్ తనకు అప్పటికే ఓ కొడుకు ఉన్నాడని, ఇప్పుడు జన్మించిన కుమారునికి రామ్ అని పేరు పెట్టనున్నామన్నారు. మిర్జాపూర్కు చెందిన ప్రీతి తెల్లవారుజామున 4.24 గంటలకు, మంజు 11.45 గంటలకు ఆడ శిశువులకు జన్మనిచ్చారు. లాల్గంజ్ మార్కెట్‌కు చెందిన అన్షు మిశ్రా ఉదయం 11.55 గంటలకు సిజేరియన్ ఆపరేషన్ ద్వారా మగ శిశువుకు జన్మనిచ్చింది. జిల్లా మహిళా ఆసుపత్రి ప్రసూతి విభాగం వైద్యురాలు జూహీ దేశ్ పాండే మాట్లాడుతూ 22న మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య ఎనిమిది మంది మగ శిశువులు, ఐదుగురు ఆడ శిశువులు జన్మించారని తెలిపారు. ఇది కూడా చదవండి: సామాన్యులకు తెరుచుకున్న రామాలయం.. భక్తుల భారీ క్యూ! -
అమానుష ఘటన!ఆస్పత్రి వెలుపలే కూరగాయల బండిపై మహిళ ప్రసవం!
ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవించాలని అధికారులు ప్రచారం చేసినా ప్రజలు ధైర్యం చేయలేకపోతున్నారు. ఆఖరికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామన్నా ముందుకు రావడం లేదు కూడా. ఎందుకుంటే? అక్కడ జరిగిన పలు ఘటనలే. పోతే పోయాయి డబ్బులు అని కార్పోరేట్ ఆస్పత్రికే వెళ్తున్నారు. ప్రభుత్వాస్పత్రులంటే ప్రజలు జంకడానికి ఇవేనేమో అనిపించేలా ఇక్కడ ఓ అమానుష ఘటన చోటు చేసుకుంది. కాన్పు కోసం వచ్చిన నిండు గర్భిణి ఆస్పత్రి వెలుపలే గజగజలాడే చలిలో ఓ కూరగాయాల బండిపైనే ప్రసవించింది. ఆరుబయటే బహిరంగంగా ఓ తల్లి నొప్పులు పడి కనే దుస్థితి ఎదురైంది. ఈ ఘటనతో మాకు ఆస్పత్రులు, అక్కడ సిబ్బందిపై నమ్మకం పోయిందంటూ ఆ మహిళ భర్త కన్నీటిపర్యంతమయ్యాడు. అదీకూడా ఆస్పత్రి ప్రాంగణలోనే ఈ దారుణం జరగడం మరింత బాధకరం! అసలేం జరిగిందంటే..ఈ దిగ్బ్రాంతికర ఘటన హర్యానాలో అంబాలాలోని ప్రభుత్వాస్పత్రిలో చోటుచేసుకుంది. మెహాలి జిల్లాలోని దప్పర్ నివాసి తన భార్య గర్భవతి అని ఆస్పత్రికి తీసుకొచ్చాడు. ఆమెకు నొప్పులు మొదలవ్వడంతో స్ట్రెచర్ కోసం కంగారుగా ఆస్పత్రిలోకి పరుగెట్టాడు ఆ వ్యక్తి. అయితే అక్కడ ఆస్పత్రి సిబ్బంది ఎవరూ స్ట్రెచర్ తెచ్చేందుకు రాలేదు. పైగా అక్కడ ఉన్నవారెవరూ ఆమెను జాయిన్ చేసుకునేందుకు ముందుకు రాలేదు. ఆమెను లోపలికి తీసుకువెళ్లేలోపే ఆస్పత్రి గేటు సమపంలో బహిరంగ ప్రదేశంలోనే ప్రసవించింది. ఆ తల్లి బిడ్డలిద్దరూ క్షేమంగానే ఉన్నారు. తాను ఎంతలా ఆ ఆస్పత్రి సిబ్బందిని వేడుకున్నా పట్టించుకోలేదని ఆవేదనగా చెప్పాడు ఆ వ్యక్తి. ఆ తల్లి బిడ్డలను దేవుడే కాపాడాలంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ ఘటనతో తనకు ప్రభుత్వాస్పత్రి సిబ్బందిపై నమ్మకంపోయిందని వేదనగా చెప్పాడు. ఈ విషయం దావానంలా వ్యాపించడంతో ఒక్కసారిగా సదరు ఆస్పత్రిలో భయాందోళనలు మొదలయ్యాయి. దీంతో ఆ తల్లి బిడ్డలను ఆస్పత్రి సిబ్బంది లోపలికి తీసుకెళ్లి వార్డులో ఉంచారు. ఈ ఘటన గురించి పంజాబ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్‌కు చేరడంతో తక్షణమే ఈ ఘటనపై సమగ్ర స్థాయిలో విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఏ రాష్ట్రం అయినా అభివృద్ధిపథంలోకి వెళ్తుండటం అంటే సామాన్యుడికి సైతం సక్రమమైన వైద్యం, బతకగలిగే కనీస సౌకర్యాలు ఉన్నప్పుడే అది నిజమైన అభివృద్ధి అవుతుంది. ఇలాంటి ఘటనలు పునురావృతమవుతున్నంత కాలం అధికారులపై, నమ్మకంపోతుంది. పైగా అభివృద్ధి అనే పదానికి అర్థం లేకుంగా పోతుంది. ఇప్పటికైనా పాలకులు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని సామాన్యుడికి అన్నిరకాల వసతులు అందేలా చేసి ప్రజలచేతే తమ రాష్ట్రం అభివృద్ధిపథంలోకి పోతుందని సగర్వంగా చెప్పేలా చేయండి. అప్పడు దేశం కూడా సుభిక్షంగా ఉంటుంది. (చదవండి: చనిపోయిన భర్త నుంచే పిల్లలు పొందాలనుకుంది! అందుకోసం ఆమె ఏకంగా..) -
Merry Christmas 2023: దివిలోను.. భువిలోనా... సంబరం క్రిస్మస్ పర్వదినం
క్రీస్తు పుట్టుక సర్వ సృష్టికి పర్వదినం.. మనుజ కుమారుడిగా ఆ దేవాది దేవుడే ఈ భూతలంపైకి అరుదెంచిన అపురూప ఘట్టం. సర్వ మానవాళికి రక్షణ సౌభాగ్యం. ప్రతి ఒక్కరికి దేవుడు అందించిన శుభదినం. ► పరలోకం పరవశించిన వేళ మానవాళి రక్షణకు యేసు జననం అనివార్యమయినప్పుడు అది విశ్వవేడుకగా మారిపోయింది. రెండు వేల సంవత్సరాల క్రితం ఆ దేవాదిదేవుడే నరరూపిగా అరుదెంచేందుకు సిద్ధపడ్డాడు. నశించిపోతున్న మానవులందరికి తనని తాను బలి అర్పణగా అర్పించుకునేందుకు సిద్ధపడ్డ కరుణామయుని జననం కోసం అటు పరలోకం ఇటు భూలోకం సమాయత్తమయ్యాయి. దైవ సంకల్పం నెరవేర్చేందుకు పరలోక దూతాళి దిగివచ్చింది. గలిలయలోని నజరేతు గ్రామంలో దావీదు వంశస్థుడైన యోసేపునకు ప్రదానం చేయబడిన కన్యయైన మరియ వద్దకు పరలోకం నుంచి ముందుగా శుభవార్త తీసుకువచ్చారు. దయాప్రాప్తురాలా నీకు శుభం. ఆ దేవాది దేవుని కృపపొందిన నీవు ఒక కుమారుని కంటావు.. ఆ శిశువు గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడతాడు ఆయన రాజ్యం అంతం లేనిదై ఉంటుంది. ఇదంతా పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతుంది కాబట్టి నీవు భయపడాల్సిన పనిలేదు. సర్వోన్నతుని శక్తి నీకు తోడుగా ఉంటుందని అభయమిచ్చాడు. మరియతో పాటు దేవదూత యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై ఇదంతా దేవుని సంకల్పంతో జరుగుతుంది కాబట్టి నీ భార్యను చేర్చుకొనుటకు సందేహింప వద్దని, పుట్టబోవు శిశువు తన ప్రజలను వారి పాపాల నుంచి రక్షిస్తాడు కాబట్టి యేసు అని నామకరణం చేయాలని చెబుతాడు. ఈ విధంగా మానవ ప్రమేయం లేకుండా పరమ దేవుడు పరిశుద్ధాత్మ శక్తి తో మరియ ద్వారా అవని మీద అవతరించడానికి మార్గం సుగమం అయింది. ► భూలోకం మైమరచిపోయిన వేళ యేసు పుట్టుక సమయంలో యోసేపు మరియను తీసుకుని తన సొంత గ్రామమైన బెత్లెహేముకు బయలుదేరతాడు. నిండు చూలాలైన మరియకు స్థలం లేకపోవడం వలన ఓ పశువు పాకే ప్రభు జన్మస్థలమైంది. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఓ సత్రములో పరుండి యుండుట మీరు చూచెదరన్న ప్రవచనం ఆ విధంగా నెరవేరింది. ఆ రాత్రి ఊరి వెలుపల గొఱె -
సరోగసీ ద్వారా పుంగనూరు కోడెదూడ జననం
సాక్షి, అమరావతి/ రైల్వేకోడూరు : దేశంలోనే తొలిసారి ఓ నాటు ఆవుకు పుంగనూరు జాతి కోడెదూడ జన్మించింది. చింతలదీవి పశు క్షేత్రంలో అభివృద్ధి చేసిన ఏడు రోజుల వయస్సున్న ఘనీకృత పుంగనూరు జాతి పిండాన్ని అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం శెట్టిగుంట గ్రామానికి చెందిన పమిడిగంటం హరిరావుకు చెందిన నాటు ఆవు గర్భంలో స్థానిక పశువైద్యుడు డాక్టర్ ప్రతాప్ మార్చి 4న ప్రవేశపెట్టగా, మే 25న ఈ నాటు ఆవు చూలు కట్టినట్లుగా అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ అబ్దుల్ ఆరీఫ్ నిర్థారించారు. చూలుకాలంలో పశువు ఆరోగ్య పరిరక్షణ కోసం రూ.2,500 విలువైన దాణా, ఖనిజ లవణాలతో కూడిన మేతను ఆర్బీకే ద్వారా ఉచితంగా అందించారు. ఈ నాటు ఆవు ఈనెల 17వ తేదీ రాత్రి 9.30 గంటల సమయంలో మేలుజాతి పుంగనూరు జాతి కోడెదూడెకు జన్మనిచ్చింది. కోడెదూడ చాలా ఆరోగ్యంగా ఉందని పశువైద్యులు ధృవీకరించారు. దేశంలోనే ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అండ్ ఎంబ్రియో ట్రాన్సఫర్ విధానంలో పుంగనూరు కోడెదూడ జన్మించడం ఇది తొలిసారి. తొలిసారిగా సాహివాల్ దూడకు..: గతేడాది ఇదే విధానంలో ఒంగోలు ఆవుకు సాహివాల్ దూడ జన్మించింది. తిరుపతి ఎస్వీ గో సంరక్షణ శాలలో మేలు జాతి ఆవుల అండాలు సేకరించి, ఎస్వీ పశువైద్య విశ్వవిద్యాలయంలోని ఐవీఎఫ్ ల్యాబ్‌లో కృత్రిమంగా పిండాలను అభివృద్ధి చేసి టీటీడీ గోసాలలోని ఆవులలో ప్రవేశపెట్టి దేశంలోనే తొలిసారిగా సాహీవాల్ దూడకు జన్మనిచ్చేలా చేశారు. ఈసారి ఓ రైతు ఇంట ఓ నాటు ఆవు గర్భంలో సరోగసి విధానంలో పిండమార్పిడి చేసి మేలుజాతి పుంగనూరు దూడకు జన్మనివ్వడం గమనార్హం. సమీప భవిష్యత్‌లో మేలుజాతి దేశీ ఆవుల సంతతిని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వ సహకారంతో కృషిచేస్తామని చింతలదీవి పశు క్షేత్రానికి చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
విమానంలో ప్రయాణిస్తుండగా ప్రయాణికురాలికి సడెన్‌గా పురిటి నొప్పులు..
విమానం ప్రయాణిస్తుండగా ఓ గర్భిణికి అకస్మాత్తుగా నొప్పులు మొదలయ్యాయి. అప్రమత్తమైన విమాన సిబ్బంది విమానాన్ని టేకాఫ్ చేసేందుకు సన్నద్ధమయ్యేలోపే ఆ మహిళ ప్రసవించింది. ఈ అరుదైన షాకింగ్ ఘటన ఫ్రాన్స్ నుంచి బయలుదేరిన ఓ అంతర్జాతీయ విమానంలో జరిగింది. వివరాల్లోకెళ్తే..టర్కీ నుంచి ఫ్రాన్స్‌కి బయలుదేరిన పెగాసస్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఈ అనుహ్య ఘటన చోటు చేసుకుంది. ఆ అంతర్జాతీయ విమానంలో ప్రయాణిస్తుండగా ఓ మహిళ ప్రయాణికురాలు సడెన్‌గా ప్రసవ వేదను గురైంది. దీంతో సిబ్బంది వేగంగా స్పందించి ఆమెను మరొక చోటుకి తరలించారు. అక్కడ పారామెడిక్స్ బృందం ఆమెకు డెలివరీ చేయడంలో సహయం చేసింది. ఈ ఎమర్జెన్సీని దృష్టిలో ఉంచుకుని ఎయిర్‌లైన్స్ సిబ్బంది విమానాన్నిటేకాఫ్ చేయాలనకున్నారు. కానీ అంతలోనే విమానంలోనే ఆ మహిళ ఓ శిశువుకి జన్మనిచ్చింది. అయితే ఆ శిశువు నెలలు నిండకుండానే పుట్టడమేగాక వెంటనే ఏడవకపోవడంతో పారామెడిక్స్ సంబంధిత ఎయిర్పోర్ట్ఇక చెందిన అత్యవసర సేవలకు సమాచారం అందించారు. విమానం ప్రాన్స్‌లోని మారంసెయిల్లో టేకాఫ్ అవ్వగానే ఓ పారామెడిక్ మహిళ ఆ నవజాత శిశువును గుడ్డలో చుట్టి విమానం ముందు భాగంలోకి హుటాహుటినా తీసుకు రావడంతో ఒక్కసారిగా ప్రయాణికులంతా షాక్‌కి గురయ్యారు. ఆ నవజాత శిశువుని, ఆ మహిళను అంబులెన్స్ సాయంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వాస్తవానికి గర్భిణిలు నెలలు సమీపిస్తున్న తరుణంలో చాలా వరకు ఫ్లైట్ జర్నీ చేయరు. అందువల్ల విమానంలో ప్రసవం జరగడం అనేది అత్యంత అసాధారణం. అయితే ఇలాంటి ఘటనలు విమానంలో కొత్తేమి కూడా కాదు. ఎందుకంటే ఇలాంటి ఘటనే ఈక్వెడార్‌లోని గుయాకిల్ నుంచి ఆమ్స్టర్డామ్కు కేఎల్ఎం రాయల్ డచ్ విమానంలో కూడా చోటు చేసుకుంది. తాను గర్భవతి అని తెలియని ఓ మహిళా ప్రయాణికురాలు బాత్రూంకని వెళ్లి అనుకోకుండా ఓ బిడ్డకు ప్రసవించి అందర్నీ షాక్‌కి గురి చేసింది. అదీగాక ఏవియేషన్, స్పేస్, అండ్ ఎన్విరాన్మెంటల్ మెడిసిన్ జర్నల్‌లో వైద్యులు ఇలాంటి అకస్మాకి ప్రసవాలు ప్రతి 32 వేల మందిలో ఒకళ్లకు జరుగుతాయని అన్నారు. ఆ టైంలో మహిళలు ఫ్లైట్ జర్నీ చేస్తే నెలలు నిండకుండానే పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, ఇది మీకు, బిడ్డకు కూడా ప్రమాదమని చెప్పుకొచ్చారు. ఆకాశంలో పయనించేటప్పుడూ ఆక్సిజన్ తక్కువగా ఉండటంతో ఇలాంటి అనుకోని ఘటనలు జరుతుంటాయని అన్నారు వైద్యులు. (చదవండి: మగబిడ్డకు జన్మనిచ్చిన స్వలింగ జంట!ఒకే బిడ్డను ఇద్దరు గర్భంలో..) -
స్కూలు టాయిలెట్లో శిశు జననం.. మాయమైన తల్లి
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ జిల్లాలోగల కళ్యాణ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సమాజానికి తలవంపులు తెచ్చే ఘటన వెలుగుచూసింది. ఓ మహిళ రాత్రి వేళ ఒక పాఠశాల టాయిలెట్లో ఆడ శిశువుకు జన్మనిచ్చి, అక్కడి నుంచి పరారయ్యింది. ఆ నవజాత శిశువు రాత్రంతా టాయిలెట్లో రోదిస్తూనే ఉంది. ఉదయం పాఠశాల తెరిచినప్పుడు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. టాయిలెట్‌లోని నవజాత శిశువును చూసిన పాఠశాల సిబ్బంది, విద్యార్థులు ఆశ్చర్యానికి గురయ్యారు. అనంతరం పాఠశాల సిబ్బంది ఆ శిశువును స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి శిశువును ఉదయ్‌పూర్‌కు తరలించారు. ప్రస్తుతం అక్కడ శిశువు పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కళ్యాణ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డెత్కియా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాత్రివేళ స్థానిక ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలోని మరుగుదొడ్డిలో ఓ గుర్తుతెలియని మహిళ ఆడశిశువుకు జన్మనిచ్చింది. ప్రసవం తర్వాత ఆ మహిళ నవజాత శిశువును అక్కడే వదిలి వెళ్లిపోయింది. ఆ శిశువు రాత్రంతా టాయిలెట్లో ఏడుస్తూనే ఉంది. అది నిర్మానుష్య ప్రాంతం కావడంతో చుట్టుపక్కల వారికి వెంటనే ఈ విషయం తెలియలేదు. మర్నాటి ఉదయం పాఠశాల తెరిచినప్పుడు టాయిలెట్లో నుంచి చిన్నారి ఏడుపు వినిపించడంతో కొందరు విద్యార్థులు అక్కడికి వెళ్లారు. అక్కడ రక్తంతో తడిసిన శిశువు ఏడుస్తుండటాన్ని వారు గమనించారు. వారు వెంటనే ఈ విషయాన్ని ఉపాధ్యాయులకు తెలిపారు. దీంతో ఈ విషయం కళ్యాణ్పూర్ పోలీస్ స్టేషన్ వరకూ చేరింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, నవజాత శిశువును స్థానిక రిషభదేవ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అందించిన అనంతరం శిశువును ఉదయ్‌పూర్‌కు తరలించారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఉదయ్‌పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ నేపధ్యంలో గుర్తు తెలియని మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అయితే ఇప్పటివరకూ పోలీసులకు ఎటువంటి సమాచారం లభించలేదు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇది కూడా చదవండి: ప్రపంచ జనాభాలో 1,280 మంది మాత్రమే మిగిలిన విపత్తు ఏది? నాడు ఏం జరిగింది? -
కుజునిపై జీవముండేదా?
కుజ గ్రహం మీద పరిశోధనల కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పంపిన క్యూరియాసిటీ రోవర్ తాజాగా కీలకమైన విశేషాలను సేకరించింది. కుజుని ఉపరితలంపై పురాతన పగుళ్లను కనిపెట్టింది. ఇప్పటికీ ఏ మాత్రం చెక్కు చెదరకుండా ఉన్న ఆ పగుళ్లను ఫొటోలు, వీడియోలు తీసి భూమికి పంపింది. వాటిని చూసి సైంటిస్టులే ఆశ్చర్యపోతున్నారు. ఒకదాని తరువాత ఒకటిగా వచ్చి పోయే తడి, పొడి ఆవర్తనాలకు సూచికలైన ఈ తరహా పగుళ్లు జీవం పుట్టుకకు అత్యంత అనుకూలమని చెబుతారు. ..ఎండా, వానా కాలాలు కుజ గ్రహంపై అత్యంత పురాతన కాలం నాటి బురదమయమైన పగుళ్లను క్యూరియాసిటీ రోవర్ కనిపెట్టింది. షట్కోణాకృతిలోని ఆ పగుళ్లు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. వీటిని తొలినాటి కుజునిపై తడి, పొడి ఆవర్తనాల తాలూకు ఆనవాళ్లుగా భావిస్తున్నారు. జీవం పుట్టుకకు ఇవి అత్యంత కీలకమే గాక ఎంతో అనుకూలం కూడా. భూమిపై మాదిరిగా కుజునిపై క్రమానుగతంగా తడి, పొడి ఋతువులు, మరోలా చెప్పాలంటే వేసవి, వానాకాలాలు ఒకదాని తర్వాత ఒకటిగా వస్తూ పోతూ ఉండేవనేందుకు ఈ ఆవర్తనాలు నిదర్శనమని పరిశోధనకు సారథ్యం వహించిన విలియం రేపిన్ అభిప్రాయపడ్డారు. మట్టి పొర, లవణ ఖనిజాలతో సమృద్ధమైన వాటి పై పొరల మధ్య జోన్లో ఈ చక్రాలను కనిపెట్టారు. బురద ఎండిపోయినకొద్దీ కుంచించుకుపోయి, పగుళ్లిచ్చి టీ ఆకారపు జంక్షన్ మాదిరిగా ఏర్పడ్డాయి. పదేపదే నీరు పారిన మీదట వై ఆకృతిలోకి, అంతిమంగా షట్కోకోణాకృతిలోకి మారి గట్టిపడ్డాయి. భూమ్మీద మాదిరిగానే ఎండా, వానా కాలాలు క్రమం తప్పకుండా వచ్చేవని కచ్చితంగా చెప్పవచ్చని రేపిన్ చెప్పారు. ‘పైగా భూమి మాదిరిగా కుజునిపై టెక్టానిక్ ఫలకాలు లేవు. కనుక ఆ గ్రహం తాలూకు పురాతన చరిత్ర సురక్షితంగా ఉంది’అని అన్నారు. ఈ పరిశోధన ఫలితాలను నేచర్ జర్నల్‌లో తాజాగా ప్రచురించారు. జీవం తాలూకు ఆనవాళ్లు ఇప్పటికీ ఇంత సురక్షితంగా ఉన్న కుజుని వంటి గ్రహం భూమికి ఇంత సమీపంగా ఉండటం ఒక రకంగా మన అదృష్టం. విశ్వ రహస్యాలను ఛేదించే క్రమంలో ఇదో పెద్ద ముందడుగు కాగలదు’ – విలియం రేపిన్, పరిశోధన సారథి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
6 వేల కి.మీ. ప్రయాణించి బీచ్‌లో బిడ్డకు జననం.. పరాయి ప్రాంతంలో బందీగా మారిన జంట!
ఒక బ్రిటీష్ మహిళ బిడ్డకు జన్మనిచ్చేందుకు 4000 మైళ్లు(6437 కిలోమీటర్లు) ప్రయాణించింది. ప్రకృతి సిద్ధమైన అందమైన సముద్ర తీరంలో బిడ్డకు జన్మన్వివ్వాలనే తన కలను నెరవేర్చుకునేందుకు ఎంతో కష్టపడింది. ఆ గర్భిణి కలను సాకారం చేసేందుకు ఆమె భర్త కూడా ఎంతో సహకారం అందించాడు. ఎట్టకేలకు ఆమె దక్షిణ కొరియా దేశమైన గ్రెనడా సముద్రతీరంలో బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఇలా బిడ్డకు జన్మనిచ్చిందో లేదో, వెంటనే ఆ దంపతులను సమస్యలు చుట్టుముట్టాయి. జనన ధృవీకరణ పత్రం కోసం చిక్కులు బిడ్డకు జన్మనిచ్చినది మొదలు నాలుగు నెలలుగా.. అంటే ఇప్పటికీ ఆ దంపతులు గ్రెనడా తీరంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఇంటికి తిరిగి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ ఆ బిడ్డకు సంబంధించిన జనన ధృవీకరణ పత్రం అడగడమే ఆ దంపతులకు పెద్ద సమస్యగా పరిణమించింది. ఈ నేపధ్యంలో వారు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వారి దగ్గర డబ్బులు కూడా అయిపోయాయి. యూకేలో చిక్కుకుపోయిన పెద్ద కుమార్తె ఆ బ్రిటీష్ మహిళ పేరు యూలియా గుర్జీ(38). ఆమె యోగా ట్రైనర్. ఆమె భర్త పేరు క్లైవ్(51). వారికి ఇప్పటికే 8 ఏళ్ల ఎలిజబెత్ అనే కుమార్తె ఉంది. ఆమెను వారు యూకేలో ఉంచారు. ఎలిజబెత్ పాస్‌పోర్టు రివ్వ్యూ కాకపోవడంతో వారు ఆ చిన్నారిని తమతోపాటు తీసుకురాలేకపోయారు. కాగా ఆ దంపతులు యూకే నుంచి యూలియా సముద్ర తీరం చేరుకునేందుకు 6437 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. యూలియా ఏప్రిల్ 23న సాగరతీరంలో బేబీ లూయిస్‌కు జన్మనిచ్చింది. ఇది కూడా చదవండి: ఆగస్టు 14.. చాలామందికి జ్వరం?.. మీరూ ఆ జాబితాలో ఉన్నారా?.. పిచ్చెక్కిస్తున్న మీమ్స్! బర్త్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసి.. క్లైవ్ మీడియాతో మాట్లాడుతూ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్.. తాము ఆ నవజాత శిశువుకు తల్లిదండ్రులమైనట్లు తగిన రుజువు చూపించాలని కోరుతున్నదన్నారు. తాము రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి బర్త్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు సమర్పించి, కొంతకాలం వేచి చూశామన్నారు. ఎంతకీ తమకు బర్త్‌సర్టిఫికెట్ అందకపోవడంతో తిరిగి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి అధికారులను అడగగా, ఆ బిడ్డ ఆసుపత్రిలో జన్మించలేదని, అలాగే ఆ చిన్నారి ఎక్కడ జన్మించిందనే వివరాలు లేవని, అందుకే బర్త్ సర్టిఫికెట్ ఇవ్వలేమని తేల్చిచెప్పేశారన్నారు. పాస్‌పోర్టు కార్యాలయ సిబ్బంది కూడా.. తాము కింగ్ యూరోపియన్ యూనియన్ ఆసుపత్రికి వెళ్లగా, అక్కడి సిబ్బంది తాము ఆ శిశువు జననానికి సంబంధించిన వివరాలు నమోదు చేయలేమన్నారు. బిడ్డపుట్టిన 24 గంటల తరువాత రిజిస్ట్రేషన్ కోసం వచ్చినందున తాము ఏమీ చేయలేమని తేల్చిచెప్పేశారని క్లైవ్ తెలిపారు. పాస్‌పోర్టు కార్యాలయ సిబ్బంది కూడా బిడ్డ జననానికి సంబంధించిన రుజువులు లేనందున తామేమీ చేయలేమని తెలిపారు. దీంతో క్లైవ్ యూకేలోని సంబంధిత ఉన్నతాధికారులను సంప్రదించగా, వారు డిఎన్ఏ టెస్టు చేయించాలని కోరారు. దీనికి సంబంధించిన రిపోర్టు ఇంకా రావాల్సి ఉందని క్లైవ్ తెలిపారు. ‘చేతిలో చిల్లిగవ్వ లేదు’ ఇప్పటివరకూ తన కార్డులోవున్న 6,000 పౌండ్లు ఖర్చయిపోయాయని, తమ దగ్గర ప్రస్తుతం చిల్లిగవ్వ కూడా లేదని క్లైవ్ తెలిపారు. తాము యూకే నుంచి సహాయం అర్థిస్తుండగా, ఇంతవరకూ ఎటువంటి సమాధానం లేదన్నారు. యూలియా మాట్లాడుతూ తాము ఈ దేశంలో బందీ అయిపోయామని, యూకే తిరిగి వెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. యూకేలో ఉండిపోయిన తమ పెద్ద కుమార్తె తమకు తరచూ గుర్తుకువస్తున్నదని, బంధువుల ఇంటిలో ఆమె ఎలా ఉన్నదో తమకు తెలియడం లేదని యూలియా కన్నీరుపెట్టుకుంది. ఇది కూడా చదవండి: ‘నన్ను కొట్టి చంపేస్తున్నాడు’.. కమిషనరేట్‌లో 105 ఏళ్ల వృద్ధుని రోదన! -
షాకింగ్ ట్విస్ట్: మగ గొరిల్లా కడుపున ఓ ఆడ గొరిల్లా పిల్ల..
ఇంత వరకు మగవాళ్లు కూడా పిల్లలు కనడం గురించి మానవజాతిలోనే జరిగింది. అది కూడా వారు ట్రాన్స్ జెండర్‌గా మారే క్రమంలో జరిగిన అరుదైన ఘటనే. ఇప్పుడు అలాంటి ఘటనే ఓ జంతుశాలలో చోటు చేసుకుంది. అప్పటి వరకు అది ఆ జూలో మగ గొరిల్లాగా పెరిగింది..ఉన్నటుండి ఒక రోజు ఓ ఆడ గొరిల్లా పిల్లకు జన్మనివ్వడంతో జూ సిబ్బంది ఒక్కసారిగా కంగుతిన్నారు. ఈ ఘటన యూఎస్‌లోని కొలంబస్ జూలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. కొలంబస్ జూలో సుల్లీ అనే గొరిల్లా 2019లో తన తల్లితో కలిసి ఉంటోంది. దాన్ని చిన్నపటి నుంచి ఆ జూ సిబ్బంది అంతా మగ గొరిల్లాగానే భావించారు. ఊహించని విధంగా గురువారం తెల్లవారుఝామున ఓ ఆడ గొరిల్లాకు జన్మనిచ్చేంత వరకు అది ఆడ గొరిల్లా అని కనుగొనలేకపోయారు. జూ సిబ్బంది ఆ గొరిల్లాను పర్యవేక్షించే కీపర్లు అంతా మగ గొరిల్లాగానే భావించారు. ఈ విషయాన్ని ఫేస్బుక్లో అధికారికంగా జూ అధికారులు వెల్లడించారు. ఎందుకు తాము దాన్ని మగ గొరిల్లా అని భావించామో కూడా వివరించారు. నిజానికి సుమారు 8 ఏళ్ల వయసు వరకు గొరిల్లాలు మగ లేదా ఆడవిగా గుర్తించలేమని, అవి రెండు ఒకే పరిమాణంలో ఉంటాయి. పైగా వాటికి ప్రముఖ లైంగిక అవయవాలు ఉండవు. గొరిల్లాలు ఒక వయసు వచ్చే వరకు ఏ లింగం అనేది గుర్తించడం కష్ట అని చెప్పుకొచ్చారు. మగ గొరిల్లాలకు చాలా వయసు వచ్చే వరకు గెడ్డం, వెన్ను, కొన్ని ప్రత్యేక అవయవాలు అభివృద్ధి చెందవు. దీంతో వాటిని మగవా, ఆడవా అని గుర్తించడం కష్టమవుతుందని జూ నిర్వాహకులు చెప్పారు. అవి గర్భం దాల్చిన కూడా బాహ్య సంకేతాలు ఏమి పెద్దగా చూపవని చెబుతున్నారు. సహజంగానే గొరిల్లాకు పెద్ద పొత్తికడుపు ఉండటంతో గర్భదాల్చినట్లు గుర్తించడం కష్టమేనని కొలంబస్ జూ వివరణ ఇచ్చింది. ఇక సదరు గొరిల్లాకు పుట్టిన బిడ్డ ఆరోగ్యంగానే ఉందని, అది ఆడగొరిల్లా పిల్లలానే ఉందని జూ పేర్కొంది. ఇక సదరు సుల్లీ గొరిల్లాకు వెల్సన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. అలాగే డీఎన్ఏ పరీక్షలు కూడా నిర్వహించి ఆడ గొరిల్లా పిల్ల తండ్రిని కూడా గుర్తిస్తామని కొలంబస్ జూ పేర్కొంది. (చదవండి: సహజసిద్ధమైన 'ఏసీ'లు..అందుకు ఆ పురుగుల గూడే కారణమా..!) -
నైట్ షిఫ్ట్‌లు నిషేధం.. కంపెనీ తీసుకున్న నిర్ణయం ఎంత పనిచేసిందంటే
ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన జపాన్‌లో జనాభా సంక్షోభం ముదురుతోంది. దేశంలోని మహిళల సగటు సంతానోత్పత్తి రేటు వరుసగా ఏడో ఏడాదీ క్షీణించింది. 2022లో ఇది రికార్డు స్థాయిలో 1.26 కనిష్టానికి పడిపోయింది. అయితే, ఈ తరుణంలో ఆ దేశానికి చెందిన ప్రముఖ సంస్థ ఇటోచు కార్పొరేషన్ 10 ఏళ్ల క్రితం తీసుకున్న నిర్ణయంతో మహిళా ఉద్యోగుల సంతాన సాఫల్య రేటు పెరిగినట్లు తెలుస్తోంది. 2010లో జపాన్ ట్రేడింగ్ కంపెనీ ఇటోచు కార్ప్ సీఈవోగా మషిహిరో ఒకఫుజి బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో ఆఫీస్‌లో ప్రొడక్టివిటీని పెంచేందుకు పనిగంటల్ని తగ్గించారు. నైట్షిఫ్ట్లను రద్దు చేశారు. దీంతో ఇటోచు నిర్ణయం ఆ సంస్థ స్వరూపాన్నే మార్చేసింది. 2010 నుంచి 2021 వరకూ భారీ లాభాల్ని ఆర్జించింది. మెటర్నిటీ లీవ్‌లు తీసుకున్న మహిళా ఉద్యోగులు తిరిగి విధుల్లోకి వస్తున్నారు. జపాన్‌లో సగటు సంతాన రేటు 1.3ను ఈ కంపెనీ ఉద్యోగినులు అధిగమించారు. ఇటీవల ఉద్యోగులకు వారానికి రెండు రోజులు ఇంటినుంచి పనిచేసేందుకు ఇటోచు అనుమతించడంతో పాటు కార్యాలయ పని గంటలను ఎనిమిది నుంచి ఆరు గంటలకు కుదించింది. కొన్ని సమయాల్లో ఓవర్టైమ్ను కూడా రద్దు చేశారు. ఈ క్రమంలో పలువురు మహిళా ఉద్యోగులు మెటర్నిటీ లీవులు తీసుకుని పిల్లలను కని తిరిగి పనిచేసేందుకు వచ్చారు. తాము ఉత్పాదకత పెంచేందుకు తీసుకున్న ఈ నిర్ణయం బర్త్ రేట్‌పై ప్రభావం చూపుతుందని తామనుకోలేదని ఇటోచు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఫుమిహికో కొబయషి చెప్పుకొచ్చారు. -
జంట అరటిపండ్లు తినకూడదా?.. దేవుడికి కూడా సమర్పించకూడదా?
అరటిపళ్ళు కొనడానికి వెళ్ళినప్పుడు అరటిపళ్ళ వ్యాపారి అరటి గెలలోంచి అరటి హస్తాలు కోస్తున్నప్పుడు మన కళ్ళు ఆ హస్తం మీదే నిలుస్తాయి. ఆ హస్తంలో ఒకదానితో మరొకటి అతుక్కుపోయి వున్న జంట అరటిపళ్ళుగానీ ఉన్నాయా అని చూస్తాం. ఒకవేళ వుంటే ఆ కవల పండు వద్దని చెప్పి తీయించేస్తాం. కారణం.. జంట అరటిపళ్ళు పిల్లలు తినకూడదు. పైగా తింటే కవల పిల్లలు పుడతారనే అనే ఒక నమ్మకం ప్రజల్లో నాటుకుపోయింది. అసలు నిజానికి తినొచ్చా..తింటే ఏమవుతుంది? దేవుడికి సమర్పించొచ్చా లేదా తదితరాలు గురించి తెలుసుకుందామా! కవల అరటి పళ్ళను దేవుడికి పెట్టకూడదు. ఇలాంటి నమ్మకాలు మనకి వుంటాయి. అందుకే కవల అరటిపళ్ళను తీసుకోవడానికి ఇష్టపడం. అయితే చాలాసార్లు మనం కొన్న అరటిపళ్ళలో మనకి తెలియకుండానే కవల అరటిపళ్ళు వచ్చేస్తూ వుంటాయి. వాటిని పిల్లలకి పెట్టకుండా, దేవుడికి పెట్టకుండా పెద్దవాళ్ళే తింటూ వుంటారు. ఇంతకీ, కవల అరటిపళ్ళను పిల్లలకు పెట్టోచ్చా, ముఖ్యంగా పెళ్లి కాని వారు తినోచ్చా అంటే..కవలలు పుడతారని భారతీయుల విశ్వాసమే గానీ శాస్త్రీయంగా మాత్రం ఎక్కడా నిరూపితం కాలేదు. ఇలా ఫిలిప్పీన్స్ వాసులు కూడా మనలానే నమ్ముతారట. వారు కూడా జంట అరటిపళ్లు తినరట. ముఖ్యంగా గర్భిణి స్త్రీలు మొదటి మూడు నెలల్లోపు తింటే కవలలు పుడతారని మన వాళ్లు గట్టిగా నమ్ముతారు. అలాగే కొందరూ.. కవల పిల్లలు కావాలనే ఉద్దేశంతో జంట అరటిపళ్లు తింటారని చెబుతున్నారు. కానీ ఇందులో వాస్తవం లేదని నిపుణులు చెబుతున్నారు. అలా జరగలేదని నొక్కి చెబుతున్నారు. అదుకు ఆస్కారం లేదంటూ సైన్స్ కొట్టిపారేస్తుంది. అదొక మూఢ నమ్మకమే తప్ప మరేం కాదని తేల్చి చెబుతోంది. దేవతలకు పెట్టొచ్చా అంటే.. దీనికి పండితులు ఏం చెప్పారంటే.. ”అరటి చెట్టు అంటే మరెవరో కాదు. సాక్షాత్తూ దేవనర్తకి రంభ అవతారమే. శ్రీమహావిష్ణువు దగ్గర రంభ అందగత్తెనని అహంకార పూరితంగా వ్యవహరించడం వల్ల ఆమెను భూలోకంలో అరటిచెట్టుగా జన్మించమని మహావిష్ణువు శపించాడు. అయితే ఆమె తన తప్పు తెలుసుకుని ప్రాధేయ పడటంతో దేవుడికి నైవేద్యంగా వుండే అర్హతను విష్ణువు రంభకి వరంగా ఇచ్చారు. అందువల్ల అంత పవిత్రమైన పండులో మనం దోషాలను ఎంచాల్సిన అవసరం లేదంటున్నారు. కవల అరటిపళ్ళను నిరభ్యంతరంగా దేవతలకు అర్పించవచ్చు. అయితే తాంబూలంలో మాత్రం జంట అరటి పళ్ళను పెట్టకూడదట. ఎందుకంటే కవల అరటి పండులో రెండు పళ్ళు ఉన్నప్పటికీ అది ఒక్క పండుకిందే లెక్కలోకి వస్తుంది. మరి తాంబూలంలో ఒక్కపండు పెట్టకూడదు కదా..! అలాగని రెండు కవల అరటిపళ్లు తాంబూలంలో పెట్టడం బాగోదు. పైగా తీసుకోవడానికి అవతలి వాళ్లు సంకోచించే అవకాశం ఉంది, మరోవైపు తాంబులాన్ని వద్దనకూడదు అనేది శాస్త్రం. దీంతో అవతలి వ్యక్తి ఈ రెండు సమస్యలతో సందిగ్ధంలో పడి కలత చెందే అవకాశం ఉంది. ఇంటికి వచ్చిన అతిధిని గౌరవించడం మన సంప్రదాయమేగాక ఆనందంగానే వారిని సాగనంపుతాం. అందువల్ల తాంబూలంలో మాత్రం కవల అరటిపళ్ళను మినహాయించడమే మంచిది. (చదవండి: ఉపేక్షిస్తే ఉనికికే ప్రమాదం!) -
పిల్లల్ని ఎప్పుడు కనాలి? సైంటిస్టులు తేల్చేశారు.. అదే సరైన సమయమట
30ఏళ్లు దాటినా పెళ్లి ఊసెత్తని వాళ్లు చాలామందే ఉన్నారు. పెళ్లెప్పుడు అని అడిగితే.. అప్పుడేనా? ఏమిటంత తొందర అన్నట్లు సమాధానమిస్తుంటారు. ఉరుకులు పరుగుల జీవితంలో ప్రతీది ప్లానింగ్ చేసుకోక తప్పదు. పెళ్లి దగ్గర్నుంచి చివరకు పిల్లల విషయంలో కూడా ప్లానింగ్‌తోనే ఉంటున్నారు ఈ కాలం దంపతులు. పిల్లల్ని ఎప్పుడు కనాలో కూడా వాళ్ల దగ్గర ఓ థియరీ ఉంటుంది. కానీ వయసైపోయాక పిల్లల్ని కనాలంటే డెలీవరీకి ఇబ్బందులుంటాయని, దీనివల్ల చాలా ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. తాజాగా ఓ అధ్యయనం ప్రకారం.. పిల్లల్ని కనేందుకు సరైన వయసు ఏంటన్నది నిర్థారించారు. ఈ జనరేషన్లో భార్యభర్తలిద్దరూ రెండుచేతులా సంపాదించడానికి పెట్టిన శ్రద్ధ ఫ్యామిలీ ప్లానింగ్‌పై పెట్టడం లేదు. లైఫ్‌లో సెటిల్ అయ్యాక తీరిగ్గా పిల్లల్ని కనవచ్చులే అని లైట్ తీసుకుంటారని వైద్యులు తెలియజేస్తున్నారు. వాస్తవానికి ఏ వయసులోపు కనాలి అనే విషయంపై చాలా మంది దంపతుల్లో క్లారిటీ ఉండదు. ఇప్పుడే ఏం తొందర వచ్చిందిలే అని అనుకుంటారు. కానీ పిల్లల్ని కనేందుకు మహిళలకు 23 ఏళ్ల నుంచి 32 ఏళ్ల వయసు సరైన సమయం అని సైంటిస్టులు వెల్లడించారు. ఈ వయసులో బిడ్డలకు జన్మనిస్తే అసాధారణ పిండాలు లాంటి నాన్క్రోమోజోమల్ వంటి ఇష్యూస్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని తెలిపారు. 32 ఏళ్ల తర్వాత మహిళలు పిల్లల్ని కనే సామర్థ్యాన్ని రోజు రోజుకి తగ్గుతూ వస్తుంది. ఆలస్యంగా పిల్లల్ని కనడం వల్ల పుట్టే పిల్లల్లో డౌన్ సిండ్రోమ్, నెలలు నిండక ముందే పిల్లలు పుట్టడం, జెస్టేషనల్ డయాబెటిస్, ప్రీ ఎక్లాంప్సియా వంటి సమస్యలు కలిగే అవకాశం ఉంది. 32 దాటాక పిల్లల్ని కంటే డెలీవరీ సమయంలో నాడీ, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు 20 శాతం ఎక్కువని హంగేరి యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. -
ప్చ్.. ఈ దేశాల్లో జనం పిల్లలను కనడం లేదు!
ఒకనొక సమయంలో ప్రపంచం మొత్తంమీద జనాభా పెరుగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు జనాభా తగ్గుతూవస్తోంది. దీనికి కారణం లో బర్త్ రేట్. దీనికారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు సమస్యలు తలెత్తనున్నాయి. Birth Rate : కొంతకాలం క్రితం వరకూ మనమంతా జనాభా నియంత్రణ గురించి మాట్లాడేవాళ్లం. అయితే ఇప్పుడు దీనికి రివర్స్ అయ్యింది. కొన్ని దేశాల్లో ఇప్పుడు జనాభా సంఖ్యను పెంచాలంటూ అక్కడి ప్రభుత్వాలు గగ్గోలు పెడుతున్నాయి. భూమిపై తొలిసారి జనసంఖ్య తక్కువవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అయితే దీనివలన ఏమవుతుందనే ప్రశ్న మనందరిలో మెదులుతుంది. ప్రపంచంలో జననాల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణం మరణాల రేటు పెరగడం కాదు. జననాలు రేటు తగ్గడం. చైనా, భారత్‌లో కూడా 2.1 కంటే దిగువకు జనన రేటు.. సంతానోత్పత్తిలో మార్పుల ప్రభావాన్ని అధ్యయనం చేసే ఆర్థికవేత్త మాథియాస్ డోప్కే తెలిపిన వివరాల ప్రకారం జనన రేటు తగ్గుదల అనేది కొన్ని సంపన్న దేశాలు, దేశంలోని సంపన్న కుటుంబాలకు మాత్రమే పరిమితం కాలేదు. చైనా, భారత్, బ్రెజిల్, మెక్సికోతో సహా 15 పెద్ద ఆర్థిక వ్యవస్థలలో జనన రేటు 2.1 కంటే తక్కువగా ఉంది. ఇందులో అమెరికా వంటి సంపన్న దేశాలు, ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన చైనా, భారత్ కూడా ఉన్నాయి. తక్కువ జనన రేటుతో సమస్యలివే.. తక్కువ జననాల రేటు కారణంగా వృద్ధుల సంఖ్య పెరుగుతున్నది. గతంలో జపాన్,ఇటలీలలో ఎక్కువ మంది వృద్ధులు ఉండేవారు. కానీ ఇప్పుడు బ్రెజిల్, మెక్సికో,థాయ్‌లాండ్ కూడా ఈ జాబితాలో చేరాయి. సైకాలజిస్టులు తెలిపిన వివరాల ప్రకారం యువతకు సృజనాత్మకంగా ఆలోచించే శక్తి ఉంటుంది. యువత సమస్యను కొత్త మార్గంలో పరిష్కరిస్తుంది. యువత కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు చేస్తుంటుంది. 2030 నాటికి, తూర్పు, ఆగ్నేయాసియా జనాభాలో సగం మంది 40 ఏళ్లు పైబడిన వారే ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా జననాల రేటు తగ్గుదల కారణంగా ఈ శతాబ్దం మధ్య నాటికి విద్యావంతులైన యువ కార్మికుల కొరత ఏర్పడుతుంది. జనం పిల్లలను కనాలని కోరుకోవడం లేదు. ఫలితంగా ప్రపంచంలో తక్కువ సంఖ్యలో యువత ఉంటుంది. ఫలితంగా దేశాభివృద్ధి కుంటుపడుతుంది. 1950-2021 మధ్య కాలంలో జననరేటు తగ్గుదల ఇలా.. దక్షిణ కొరియా: 86% చైనా: 81% థాయిలాండ్: 79% జపాన్: 77% ఇరాన్: 73% బ్రెజిల్: 72% కొలంబియా: 70% మెక్సికో: 70% పోలాండ్: 69% టర్కీ: 68% రష్యా: 67% సౌదీ అరేబియా: 67% మలేషియా: 66% మొరాకో: 66% ఉక్రెయిన్: 66% ఇటలీ: 65% కెనడా: 63% భారతదేశం: 63% పెరూ: 63% బంగ్లాదేశ్: 62% మయన్మార్: 62% స్పెయిన్: 62% వియత్నాం: 61% ఇండోనేషియా: 60% అల్జీరియా: 58% ఈజిప్ట్: 58% నేపాల్: 57% ఫిలిప్పీన్స్: 56% దక్షిణాఫ్రికా: 52% యునైటెడ్ స్టేట్స్: 52% ఫ్రాన్స్: 49% అర్జెంటీనా: 47% కెన్యా: 44% జర్మనీ: 43% యెమెన్: 42% ఘనా: 41% ఉజ్బెకిస్తాన్: 41% ఇరాక్: 40% యునైటెడ్ కింగ్డమ్: 39% పాకిస్తాన్: 37% నైజీరియా: 19% ఇది కూడా చదవండి: 17కు వ్యాపారం.. 19కి సెటిల్.. 22కు రిటైర్మెంట్.. అమెరికా కుర్రాడి సక్సెస్ స్టోరీ -
ఆదిపురుష్‌కు సీత కష్టాలు.. వివాదంలో డైలాగ్
రామాయణం ఆధారంగా తెరకెక్కిన తాజా చిత్రం 'ఆదిపురుష్'. ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతాదేవిగా దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. కానీ నేపాల్‌లో మాత్రం ఈ సినిమా విడుదలపై అభ్యంతరం వ్యక్తం అయింది. ఆదిపురుష్ సినిమాలో సీతా దేవి భారతదేశపు కుమార్తె అని డైలాగ్ చెబుతూ ఓ సన్నివేశం ఉంటుంది. దీనిని నేపాల్ సెన్సార్ బోర్డు తప్పుబట్టింది. సీతా దేవి నేపాల్‌లో జన్మించిందని వారి నమ్మకం. దీంతో అక్కడ సినిమా రిలీజ్ కాలేదు. ఖాట్మండులోని కొన్ని థియేటర్లలో ఆదిపురుష్ సినిమాను బ్యాన్ కూడా చేశారు. (ఇదీ చదవండి: Adipurush: థియేటర్ అద్దాలు పగలగొట్టిన ప్రభాస్ ఫ్యాన్స్) ఆ డైలాగ్‌ను తొలగించాల్సిందిగా మూవీ మేకర్స్‌ను వారు కోరారు. దీంతో వివాదానికి కారణమైన డైలాగ్స్‌ను మేకర్స్ తొలగించారు. అనంతరం నేపాల్‌లో మూవీ విడుదలకు లైన్ క్లియర్ అయింది. కానీ మార్నింగ్ షోలు ఆగిపోయాయి. మరి కొన్ని గంటల్లో అక్కడ మెదటి షో పడనుంది. సీతాదేవి నేపాల్ కుమార్తెగా వారు భావిస్తారు కాబట్టి అక్కడ మొదటి నుంచి ఈ సినిమాకు మంచి హైప్ క్రియేట్ అయింది. ఇప్పటికే అక్కడ టికెట్లు కూడా భారీగా అమ్ముడుపోయాయి. (ఇదీ చదవండి: Adipurush: ఎవరీ ఓం రౌత్.. ప్రభాస్‌కు ఎలా పరిచయం?) -
పెళ్లయిన నాలుగు నెలలకేనా?.. నటిపై దారుణ ట్రోల్స్..!
బాలీవుడ్ హీరోయిన్ స్వరభాస్కర్ ఫహద్ అహ్మద్ అనే రాజకీయ నేతను పెళ్లాడిన సంగతి తెలిసిందే. మొదట వీరిద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని.. ఆ తర్వాత సాంప్రదాయబద్దంగా కూడా వివాహం చేసుకున్నారు. ఢిల్లీలోని జరిగిన పెళ్లికి కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితులు హాజరయ్యారు. అయితే తాజాగా స్వర భాస్కర్‌ను నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగింది? ఎందుకు ట్రోల్స్ చేస్తున్నారు? ఓ లుక్కేద్దాం. (ఇది చదవండి: మళ్లీ పెళ్లికి సిద్ధమైన బాలీవుడ్ నటి.. వెడ్డింగ్ కార్డ్ వైరల్) బాలీవుడ్ నటి స్వర భాస్కర్ దారుణ ట్రోల్స్‌కు గురయ్యారు. ఈ ఏడాది ప్రారంభంలో సమాజ్‌వాదీ పార్టీ (SP) నాయకుడు ఫహద్ అహ్మద్‌ను వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లి చేసుకున్న నాలుగు నెలలకే నటి బిడ్డకు జన్మనిచ్చిందంటూ సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ చేశారు. కొంతమంది నెటిజన్స్ చేసిన కామెంట్స్‌తో స్వర భాస్కర్ ట్విట్టర్లో ట్రెండ్ అయింది. అయితే వీటిపై స్వర భాస్కర్ ఇంతవరకు స్పందించలేదు. ఓ నెటిజన్ ట్వీట్ చేస్తూ..'పెళ్లయిన నాలుగున్నర్ర నెలలకే బిడ్డకు జన్మనిచ్చి తన పనిని ముందుగానే పూర్తి చేశారు.' అంటూ పోస్ట్ చేశారు. మరో నెటిజన్ రాస్తూ.. 'పెళ్లయిన 3-4 నెలలకే స్వర భాస్కర్ తల్లి అయిన మాట నిజమేనా?’ అని ట్విట్టర్లో ప్రశ్నించారు. అయితే కొందరు నెటిజన్స్ ఆమెకు మద్దతుగా కూడా నిలిచారు. కాగా.. నవంబర్ 2021లో స్వరా ఒక బిడ్డను దత్తత తీసుకోనున్నట్లు ప్రకటించింది. (ఇది చదవండి: లైవ్ షోలో సింగర్‌కు బుల్లెట్ గాయం.. ఆస్పత్రికి తరలింపు!) స్వరా భాస్కర్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌లు స్వర భాస్కర్ చివరిసారిగా శిఖా తల్సానియా, మెహర్ విజ్, పూజా చోప్రాలతో 'జహాన్ చార్ యార్' చిత్రంలో కనిపించింది. ఆమె 2009లో డ్రామా 'మధోలాల్ కీప్ వాకింగ్'లో సహాయ పాత్రతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆమె 'తను వెడ్స్ మను', 'రాంఝనా', 'ప్రేమ్ రతన్ ధన్ పాయో', 'నిల్ బట్టే సన్నత', 'అనార్కలి ఆఫ్ ఆరా', 'వీరే ది వెడ్డింగ్', 'షీర్ ఖోర్మా' వంటి హిట్ చిత్రాలలో నటించింది. స్వర భాస్కర్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ మిసెస్ ఫలానీలో తొమ్మిది పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. स्वरा भास्कर ने विवाह के 4.5 महीने बाद ही बालक को जन्म देकर समय से पहले काम पूर्ण करने वाले गडकरी जी को दिखाया आईना !! — Raju Das Hanumangadhi Ayodhya (@rajudasji99) May 31, 2023 -
చైనా షాకింగ్ నిర్ణయం..పెళ్లి కాకుండానే తల్లి అయ్యేలా..
ఆరు దశాబ్దాల్లో తొలిసారిగా చైనాలో వేగవంతంగా జనాభా క్షీణించడంతో దాన్ని నియంత్రించేలా పలు చర్యలు ఇప్పటికే తీసుకుంది చైనా. ఇప్పుడు ఇంకాస్త ముందడుగు వేసి.. యావత్ ప్రపంచం విస్తుపోయేలా సంచలన నిర్ణయం తీసుకుంది. అవివాహితలు, ఒంటరి మహిళలు ఐవీఎఫ్ ద్వారా పిల్లలను కనే వెసులుబాటుని ఇస్తోంది. పెళ్లైన జంటలకు మాత్రమే ఉండే పిల్లల సబ్సిడీలను అవివాహిత గర్భిణీలు కూడా పొందవచ్చునని చెబుతోంది. అవివాహిత స్త్రీల పిల్లల జనన నమోదును చట్టబద్ధం చేసింది. వారు కూడా వేతనంతో కూడిన ప్రశూతి సెలవులు కూడా తీసుకోవచ్చు అంటూ ఆఫర్లు ఇస్తోంది. ఈ మేరకు చైనాలోని అవివాహిత స్త్రీలు ప్రైవేట్ లేదా పబ్లిక్ ఆస్పత్రుల్లో ఐవీఎఫ్ చికిత్సను పొందవచ్చు. ఈ నేపథ్యంలోనే నైరుతి సిచువాన్ ప్రావిన్స్ రాజధాని చెంగ్డులో విడాకులు తీసుకున్న 33 ఏళ్ల మహిళ దీన్ని ఆశ్రయించే తల్లి కాబోతోంది. ప్రస్తుత ఆమె 10 వారాల గర్భవతి. చాలా మంది ఒంటరి మహిళలు దీన్ని ఆశ్రయిస్తున్నట్లు సమాచారం. దేశ వ్యాప్తంగా ఐవీఎఫ్‌ని సరళీకృతం చేస్తే గనుక ఇదొక పెద్ద మార్కెట్‌గా విస్తరించే అవకాశం ఉందంటున్నారు నిపుణలు. సాధారణ సంతానోత్పత్తి సేవలపై ప్రభావం పడుతుందని, భవిష్యత్తులో ఐవీఎఫ్ చికిత్సకు డిమాండ్ పెరిగే అవకాశం ఉందని ఆసియా పసిఫిక్ వ్యాపార అభివృద్ధి డైరెక్టర్ వైవ్ లిప్పెన్స్ హెచ్చరించారు. ప్రభుత్వాస్పత్రల్లో మహిళలందరికీ ఐవీఎఫ్ చికిత్స అందిస్తారనేది స్పష్టత లేదు. ఇప్పటివరకు ఎంత మంది మహిళలు దీన్ని ఉపయోగించుకున్నారనేది కూడా స్పష్టం కాలేదు. కానీ చాలా మంది మహిళలు ఐవీఎఫ్ సెంటర్లకు క్యూ కడుతున్నట్లు సమాచారం. జాతీయ ఆరోగ్య కేంద్రం మరిన్ని ఐవీఎఫ్ సెంటర్లను అందుబాటులో తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు చైనా వర్గాలు చెబుతున్నాయి. కాగా, ఇంతకు మునుపు చైనా పెళ్లికాని మహిళలకు ఐవీఎఫ్ సేవలను నిషేధించింది. ఎప్పుడైతే జనాభా క్షీణించడం ప్రారంభించిందో అప్పటినుంచి చైనా పిల్లలను కనేలా ప్రజలకు బారీ ఆఫర్లు అందిస్తూ ప్రోత్సహించింది. ఈ క్రమంలో పలు నిబంధనలు ఎత్తి వేసి కొత్త సంస్కరణలు తీసుకొచ్చింది. అందులో భాగంగానే ఈ ఐవీఎఫ్ చికిత్సా విధానం తెరమీదకు వచ్చింది. (చదవండి: ఎయిర్‌పోర్ట్‌లో యాపిల్ జ్యూస్ వివాదం..యువతి అరెస్టు) -
ఓ తల్లి కిరాతక చర్య.. ప్రెగ్నెంట్ అని తెలియక పసికందుని..
ఓ మహిళ ప్రసవించిన కొద్దిసేపిటికే బిడ్డను కిటికిలోంచి పడేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఆ బిడ్డ ఏడుపు విని కలవరపడి ఆమె బాత్రూం కిటికీలోంచి విసిరేసింది. ఈ అనూహ్య ఘటన పశ్చిమబెంగాల్లోని కోల్‌కతాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..పశ్చిమ బెంగాల్‌లోఇన కోల్‌కతాలో ఓ మహిళ తన ఇంటి బాత్రూంలోనే పండంటి మగబిడ్డకు ప్రసవించింది. ఐతే ఆమె నవజాత బిడ్డ ఏడుపు విని కలవరపడి కిటికిలోంచి విసిరేసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి విచారించగా..సమీపంలోని ఓ మహిళ ప్రసవించినట్లు గుర్తించి ఆరా తీశారు. ఐతే తాను ప్రెగ్నెంట్ అని తనకు తెలియదని, రెగ్యూలర్‌గా పిరియడ్స్ వస్తున్నట్లు తెలిపింది. అందువల్లే విసిరేశానని చెప్పింది ఆ తల్లి. ఆ బిడ్డ పుట్టిన వెంటనే ఏవడవడంతో భయం వేసిందని అందుకే అలా చేశానని చెప్పుకొచ్చింది. ఈ మేరకు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ విషయమై ఆమె కుటుంబసభ్యులను ప్రశ్నించగా..వారు కూడా ఆమె ప్రెగ్నెంట్ అని తెలియదని చెప్పడంతో విస్తుపోవడం పోలీసులు వంతైంది. ఐతే విచారణలో..ఆమె భర్త మద్యానికి బానిసని, ఆమె మానసిక పరిస్థితి కూడా సరిగా లేదని తేలింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. (చదవండి: మొబైల్ ఫోన్ పేలి ఎనిమిదేళ్ల చిన్నారి మృతి) -
పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ పూర్ణ (ఫొటోలు)
-
'ప్రేమలో పడండి' అని విద్యార్థులకు సెలవులు మంజూరు!
చైనా ఎప్పుడూ దూకుడుగా వ్యవహరిస్తూ తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ వార్తల్లో నిలుస్తుంది. తాజగా మరో వివాదాస్పద నిర్ణయంతో వార్తల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం చైనాలో జననాల రేటు పడిపోవటంతో.. పెంచే దిశగా రకరకాల చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అందుకోసం ప్రజలను ప్రోత్సహించేలా చైనా చేయని ప్రయత్నం లేదు. అందులో భాగంగా ప్రస్తుతం 'ప్రేమలో పడండి" అంటూ విద్యార్థులకు సెలవులు కూడా మంజూరు చేసింది. ఈ మేరకు చైనాలో తొమ్మిది కళాశాలల్లోని విద్యార్థులను 'ప్రేమలో పడండి" అంటూ ఏప్రిల్ నెలలో వారం రోజులు సెలవులు ఇస్తున్నట్లు సమాచారం. చైనా స్థానికి మీడియా ప్రకారం...ఫ్యాన మీయి ఎడ్యుకేషన్ గ్రూప్ నిర్వహిస్తున్న మిన్యాంగ్ ప్లయింగ్ వొకేషనల్ కాలేజ్ మొదటి మార్చి 21 నుంచి వసంత విరామాన్ని ప్రకటించింది. ప్రకృతిని ఆస్వాదిస్తూ..జీవితాన్ని ప్రేమించడం, ప్రేమను ఆస్వాదించడం నేర్చుకోండి అని విద్యార్థులను ప్రొత్సహిస్తోంది చైనా. జనన రేటును పెంచడంలో భాగంగా చేస్తున్న ప్రయత్నం అని చెబుతుండటం విశేషం. అదీగాక జనన రేటును పెంచడానికి ప్రభుత్వానికి 20కి పైగా సిఫార్సులు వచ్చాయి. ఐతే నిపుణలు జనాబా క్షీణతను తగ్గించే ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తూ..ఇదోక ప్రయత్నంగా తెరమీదకు తీసుకువచ్చి అమలు చేశారు. వాస్తవానికి 1980 నుంచి 2015 మధ్య విధించిన ఒక బిడ్డ విధానం చైనాను తన గుంత తనే తవ్వుకునేలా చేసింది. కరోనా మహమ్మారి తదనంతరం చోటు చేసుకున్న పరిణామాల కారణంగా చైనాలో ఒక్కసారిగా జననాల రేటు ఘోరంగా పడిపోయింది. దీంతో చైనా జనాభాను పెంచేందుకు రకరకాలుగా యత్నిస్తున్నా.. అందుకు ప్రజలు సుముఖంగా లేరు. ఎందుకంటే ఎక్కవ మంది పిల్లల కారణంగా వారి సంరక్షణ, విద్యకు సరిపడే ఆదాయం లేకపోవడంతో విముఖత చూపిస్తున్నారు. ముగ్గురి కంటే ఎక్కువ మంది పిల్లలున్న కుటుంబాలకు పలు రాయితీలు కల్పిస్తామని ప్రభుత్వాలు చెబుతున్నా..ప్రజల నుంచి సానూకూల స్పందన రాకపోవడం గమనార్హం. దీంతో నిపుణులు జనాభా క్షీణతను నియంత్రించేలా ఇలా వినూత్న రీతిలో ప్రయత్నాలు చేస్తున్నారు. (చదవండి: గాల్లో ఉండగానే హాట్ ఎయిర్ బెలూన్‌లో ఎగిసిపడ్డ మంటలు..) -
విషాదం.. కొడుకు పుట్టినరోజే.. తండ్రి ఆత్మహత్య..
ఉండవెల్లి: కొడుకు జన్మించిన రోజే ఓ తండ్రి బలవన్మర ణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లిలో చోటు చేసు కుంది. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న రాజు (29)కు కొన్నేళ్ల క్రితం గీతతో వివాహమైంది. వారిద్దరికి పాప, కుమారుడు ఉండగా.. ఆదివారం మూడో సంతానంగా మగ బిడ్డ అలంపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో జన్మించాడు. కుమారుడిని చూసి వచ్చిన రాజు.. మధ్యాహ్నం వేళ ఇంట్లోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియడం లేదని అతని తల్లిదండ్రులు, స్థానికులు చెబుతున్నారు. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చదవండి: జైలు నుంచి బయటకొచ్చిన నిహారిక -
బిడ్డకు జన్మనిచ్చిన కేరళ ట్రాన్స్మన్పై ఎమ్మెల్యే షాకింగ్ వ్యాఖ్యలు
దేశంలోనే తొలిసారిగా బిడ్డకు జన్మనిచ్చిన ట్రాన్స్‌మన్‌గా కేరళ ట్రాన్స్‌జెండర్ జంట నిలిచిన సంగతి తెలిసిందే. ఇది అరుదైన ఘటన అంటూ ఈ విషయం సర్వత్ర చర్చనీయాంశంగా నిలిచింది. ఐతే ఈ ఘటనపై కొడువల్లి ఎమ్మెల్యే, ఇండియన్ యూనియన్ ముస్లీం లీగ్ సీనియర్ నాయకుడు(ఐయూఎంఎల్) ఎంకే మునీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీన్ని అద్భుత ఘటనగా పేర్కొన్నవారంతా మూర్ఖులుగా అభివర్ణించారు. అసలు ఆ జంటకు పాప పుట్టిన విషయాన్ని ఒక్కసారి ఆలోచిస్తే అసలు విషయం మనకే అవగతముతుందన్నారు. దీని వెనుక ఉన్న లాజిక్‌ని కూడా ఆయన విడమరిచి మరీ చెప్పారు. బిడ్డకు జన్మనిచ్చిన ట్రాన్స్‌మన్ నిజానికి ఒక స్త్రీ ఆమె పురుషునిలా మారుదామని వక్షోజాలను కూడా తొలగించుకుంది. అయితే ఆమె గర్భం దాల్చడంతో ఆమెను పురుషుడిగా మార్చడం విరమించుకున్నారు. అంటే గర్భం దాల్చిన వ్యక్తి స్త్రీ అని స్పష్టంగా అర్థమవుతుంది. కానీ అందరూ దీన్ని ఒక అద్భుతంగా ఆహో ఓహో అంటూ ఏవేవో కబుర్లు చెబుతూ.. మూర్ఖుల్లా ప్రవర్తిస్తున్నారని కొడువల్లి ఎమ్మేల్యే ఎంకే మునీర్ అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం విజ్డమ్ ఇస్లామిక కాన్ఫరెన్స్ నిర్వహించిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఫిబ్రవరి 8న ప్రసవించిన ట్రాన్స్‌మ్యాన్ జిహ్హద్ ఆ నవజాత శిశువు బర్త్ సర్టిఫికేట్లో తనను ఆ బిడ్డకు తండ్రిగా నమోదు చేయాలనిఆస్పత్రి వర్గాలను కోరిన నేపథ్యంలోనే ఆ ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారు. (చదవండి: ఆమెను చూసి ‘అయ్యో’ అనేసిన ప్రధాని మోదీ) -
శిథిలాల కిందే ఊపిరిపోసుకుంది..'ఆ జననం ఓ అద్భుతం'
తుర్కియే, సిరియాలను భూకంపం ఓ ఊపు ఊపేసింది. ఆ ప్రకృతి విలయం ఇరుదేశాల్లో అంతులేని విషాదాన్ని నింపాయి. దీంతో ఎటూ చూసిన పేకమేడల్లా కూలిని భవనాల కింద చితికిన బతుకులే కనిపిస్తున్నాయి. ఆ దృశ్యాలన్ని అక్కడ ప్రజలకు అంత తేలికగా మర్చిపోలేని ఘోర విషాదాన్ని మిగిల్చాయి. ఇలాంటి విపత్కర పరిస్థితులో సిరియాలోని జెండెరిస్ పట్టణంలో శిథిలా కింద ఓ ఆడ శిశువు జన్మించడం అందర్నీ షాక్‌కి గురిచేసింది. ఇలాంటి విషాద సమయంలో జన్మించిన ఆ శిశువు జననం ఒక కొత్త ఆశను రేకెత్తించింది. సోమవారం సంభవించిన భూకంపం తదనంతరం భద్రతా బలగాలు రెస్క్యూ చర్యలు చేపడుతుండగా..సిరియాలో శిథిలాల కింద ఓ తల్లి ఒక ఆడబిడ్డకి జన్మినిచ్చిన సంగతి తెలిసింది. ఆ శిశువు తల్లి బొడ్డు తాడుకు జత చేయబడి ఉండటంతో సురక్షితంగా ఉందని అధికారులు తెలిపారు. ఐతే ఈ ప్రమాదంలో ఆ చిన్నారి తల్లి, తండ్రి, తోడబుట్టిన వాళ్లు అందరూ మృతి చెందారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఆస్పత్రిలో కోలుకుంటోంది. ఆ శిథిలాల కింద గజగజలాడే చలిలో ఓ చిన్నారి ఏడుపును గమనించి రెస్క్యూ టీం అప్రమత్తమై రక్షించారు. The moment a child was born 👶 His mother was under the rubble of the earthquake in Aleppo, Syria, and she died after he was born , The earthquake. May God give patience to the people of #Syria and #Turkey and have mercy on the victims of the #earthquake#الهزه_الارضيه #زلزال pic.twitter.com/eBFr6IoWaW — Talha Ch (@Talhaofficial01) February 6, 2023 ఈ ప్రమాదంలో స్వల్పగాయాలతో బయటపడటంతో పాపను హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. ఆ ఆస్పత్రిలో ఓ వైద్యుడి భార్య ఆ చిన్నారికి పాలందించింది. ప్రస్తుతం ఆ చిన్నారిని దత్తత తీసుకునేందుకు పలువురు ముందుకొచ్చారు. ఐతే ఆ చిన్నారి డిశ్చార్జ్ అయిన వెంటనే ఇంటికి తీసుకువెళ్తానని ఆమె మేనమామ చెబుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితులో పుట్టడం విశేషం అంటూ.. ఆ చిన్నారికి అయా అని పేరు పెట్టారు. 'అయా' అనగా అరబిక్‌లో 'అద్భుతం' అని అర్థం. ఆమె జననం ఓ అద్భుతం అంటూ అక్కడ ప్రజలు ఆ శిశువుకి ఈ పేరు పెట్టారు. (చదవండి: 67 ఏళ్ల వయసులో మళ్లీ ప్రేమలో పడ్డ బిల్‌గేట్స్) -
అదృష్టం మాములుగా లేదుగా! ఒకేసారి రెండు జాక్పాట్లు
అందరూ ఏదైనా మంచి జరగలాంటే మనకు అదృష్టం ఉండాలి అంటుంటారు. కాస్త మన హార్డ్‌వర్క్‌కి కొంచెం లక్ తోడైతే ఇక మనకు తిరుగుండదు. ఔనా! ఇంతకీ ఎందుకూ ఈ అదృష్టం గురించి చెబుతున్నానంటే ఇక్కడున్న మహిళకు అదృష్టం మాములుగా లేదు. ఒకేసారి ఉబ్బితబ్బిబై ఎగిరి గంతేసేంత పట్టరాని ఆనందం ఒకేసారి వరించింది. వివరాల్లోకెళ్లే...అమెరికాలోని నార్త్‌కరోలినాలోని ఒక మహిళ ఒకేసారి రెండు జాక్పాట్లు కొట్టేసింది. ఈ మేరకు బ్రెండా గోమెజ్ హెర్నాండెజ్ అనే 28 ఏళ్ల మహిళ పండటి బిడ్డకు జన్మనిచ్చిన కొద్దిసేపట్లోనే ఆమె రూ. 81 లక్షల లాటరీని గెలుచుకుంది. దీంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఆమె అమెరికాలోని కాంకర్డ్ సిటీలోని ఒక క్విక్‌ట్రిప్ స్టోర్ నుంచి పవర్‌బాల్ టికెట్‌ను కొనుగోలు చేసింది. ఆమె సరిగ్గా నవంబర్ 9న పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. అదే రోజు కొద్ది నిమిషాల్లోనే ఆమె లాటరీ గెలిచుకున్నట్లు లాటరీ నిర్వహణ అధికారులు తెలిపారు. ఈ మేరకు హెర్నాండెజ్ మాట్లాడుతూ...కచ్చితంగా ఈ చిట్టితల్లి వల్లే తాను ఈ లాటరీ గెలుచుకున్నాను, ఆమె నా అదృష్టదేవత అంటూ మురిసిపోయింది. అలాగే మిగతా నా ఇద్దరు మగ పిల్లలు కూడా ఈ అదృష్టంలో భాగమే. ఎందుకంటే ఈ లాటరీని ఆ ఇద్దరు పిల్లల పుట్టిన రోజుల నెంబర్లను ఆధారంగా లాటరీ టిక్కెట్‌ని ఎంచుకుని కొనుగోలు చేయడంతో గెలవగలిగానని ఆనందంగా చెబుతోంది. (చదవండి: వామ్మో! కుక్కపిల్లకి చేయిస్తున్నట్లుగా కోబ్రాకి స్నానం చేయిస్తున్నాడు) -
నాలుగోసారి ఆడపిల్ల పుట్టిందని..
శ్రీనివాసపురం: ఆడపిల్లయినా, మగపిల్లాడైనా ఒక్కరు ముద్దు, ఇద్దరు హద్దు అన్నారు. అధిక సంతానం వల్ల దేశానికే కాదు కుటుంబ పోషణకూ భారమే. ఇది గుర్తెరగకుండా పట్టుదలకు పోతే విషాదమే. వరుసగా నాలుగోసారి ఆడపిల్ల పుట్టిందని తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం కోలారు జిల్లా శ్రీనివాసపుర తాలూకాలోని శెట్టిహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు.. శెట్టిహళ్లి గ్రామానికి చెందిన లోకేష్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. 8 సంవత్సరాల క్రితం చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన శిరీష అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గరు ఆడపిల్లలు జన్మించారు. మగబిడ్డ పుట్టలేదని లోకేష్ స్నేహితులతో చెప్పుకుని బాధపడేవాడు. శిరీష గర్భం దాల్చి ఈ నెల 4వ తేదీన ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో లోకేష్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. ఇంట్లో నుంచి తల్లి, తమ్మున్ని మరో ఇంటికి పంపించి ఒక్కడే పడుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకున్నాడు. ఆదివారం ఉదయం విషయం తెలిసి లోకేష్ తల్లిదండ్రులు, భార్య తీవ్రంగా విలపించారు. పోలీసులు చేరుకుని వివరాలు సేకరించారు. (చదవండి: నా భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నావా?.. వీడియో బయటపెడతా) -
పెళ్లి కాకుండానే బిడ్డకు ప్రసవం.. క్యాంటమ్ కంపెనీ బాత్రూమ్లో శిశువు కలకలం
సాక్షి, అనకాపల్లి: అచ్యుతాపురం సెజ్‌లో అమానుషం జరిగింది. క్యాంటమ్ కంపెనీలోని బాత్రూమ్లో శిశువు కలకలం సృష్టించింది. క్యాంటమ్ కంపెనీలో పనిచేస్తున్న ఓ మహిళకు ప్రసవం జరిగింది. పెళ్లి కాకుండా ప్రసవించడంతో ఆ మహిళ.. శిశువును అక్కడే వదిలి వెళ్లిపోయింది. కంపెనీకి వెళ్లే బస్సుల్లో మహిళ కోసం సిబ్బంది గాలించారు. శిశువును చైల్డ్ లైన్‌కు అప్పగించారు. ఈ ఘటనపై సిబ్బంది.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. చదవండి: ఒకే అంశంపై రెండు పిటిషన్లు.. హైకోర్టు ఆగ్రహం -
యాచకురాలికి ప్రసవం చేసిన మహిళా కానిస్టేబుల్
సాక్షి, చెన్నై: వేలూరు సౌత్ పోలీస్ స్టేషన్లో మహిళా కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న యువరాణి శనివారం రాత్రి స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో పోలీస్ స్టేషన్ సమీపంలోని ప్రముఖ వస్త్ర దుకాణం వద్ద 35 ఏళ్ల యాచకురాలు ప్రసవం నొప్పులతో ఇబ్బంది పడుతోంది. మహిళతో పాటు ఆమె ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు.అత్యవసర పరిస్థితిని గుర్తించిన యువరాణి మరో పీసీతో కలిసి ఆమెకు ప్రసవం చేసింది. ఆడ శిశువు జన్మించింది. అనంతరం 108 సిబ్బందికి సమాచారం అందజేసి వేలూరు పెంట్‌ల్యాండ్ ఆసుపత్రికి తల్లీ, బిడ్డను తరలించారు. తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఆమె వద్ద విచారణ జరపగా భర్త వదిలి వెళ్లి పోవడంతో దిక్కులేక భిక్షాటన చేస్తున్నట్లు చెప్పింది. మహిళా పోలీసులు ఆమెకు దుస్తులు, వస్తువులను అందజేశారు. పీసీ యువరాణిని అధికారులు ప్రశంసించారు. కాగా నవజాత శిశువును పట్టుకుని ఉన్న పోలీసు ఫోటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. చదవండి: వారితో టచ్‌లో ఉన్నా.. దయచేసి వదంతులు నమ్మొద్దు: పంజాబ్ సీఎం -
అరుదైన ఘటన.. కవలలే.. కానీ కంప్లీట్ డిఫరెంట్!
సాధారణంగా కవల పిల్లలు అనగానే.. దాదాపు ఒకే పోలికలతో ఉంటారనే మనకు తెలుసు. కలిసి పుట్టినా ఒకే పోలికలతో లేనివారూ ఉంటారు. కానీ ఒకే పోలికలతో పుట్టినా.. పూర్తి భిన్నంగా కనిపించే కవలలు మీకు తెలుసా? ఇటీవలే ఇంగ్లండ్‌లోని నాటింగ్హమ్ నగరంలో ఇలాంటి అరుదైన కవలలు పుట్టారు. నాటింగ్హమ్కు చెందిన చంటెలీ బ్రాటన్ అనే మహిళ ఏప్రిల్ నెలలో కవలలకు జన్మనిచ్చింది. వారిలో ఒకరు అబ్బాయి, మరొకరు అమ్మాయి. అబ్బాయికి అయాన్ అని, అమ్మాయికి అజిరా అని పేర్లు పెట్టుకుంది. పుట్టినప్పుడు ఇద్దరూ దాదాపు ఒకే పోలికలతో ఉన్నారు. కానీ కొన్ని నెలలు గడిచేసరికి తేడా కనిపించడం మొదలైంది. అయాన్ ఆకుపచ్చ రంగు కళ్లతో, తల్లిని పోలినట్టు తెల్లని చర్మంతో ఉండిపోగా.. అజిరా మాత్రం గోధుమ రంగు కళ్లతో, చర్మం నలుపు రంగులోకి మారిపోవడం మొదలైంది. చాంటెలీ భర్త ఆస్టన్ తల్లిదండ్రుల్లో ఒకరు నల్లజాతికి చెందిన జమైకన్కాగా, మరొకరు స్కాట్లాండ్కు చెందినవారు. ఇక చాంటెలీ తాత కూడా నైజీరియాకు చెందిన వ్యక్తేనట. పిండం ఏర్పడినప్పుడు ముందటి తరాల జన్యువులు యాక్టివేట్ అయి ఉంటాయని వైద్య నిపుణులు అంటున్నారు. ఇది ఎంత అరుదైన ఘటన అంటే.. అసలు కవలల జననాలే తక్కువైతే, అందులోనూ ప్రతి పది లక్షల కవలల్లో ఒకరికి ఇలా జరిగే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. -
ఆహా.. భూమ్మీదకు నీరు అలా వచ్చి చేరిందా!!
వెబ్‌డెస్క్: ఈ భూమ్మీద నీటి శాతం 71గా ఉందని చదువుకునే ఉంటారు. ఈ నీటిలో సింహభాగం.. మహా సముద్రాలు, సముద్రాల రూపంలోనే ఉంది. మిగతా భాగం.. ఖండాలు, ద్వీపాలు వగైరా వగైరా ఉన్నాయి. మరి అంత శాతం నీరు ఎలా వచ్చి చేరి ఉంటుందని అనుకుంటున్నారు?.. ఈ విషయంపై ఏళ్ల తరబడి పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే.. ఇది తేల్చేందుకే జపాన్ ఓ స్పేస్ మిషన్‌ను చేపట్టింది. సుమారు ఆరేళ్ల తర్వాత దాని ఫలితం ఆధారంగా.. ఇప్పుడొక ఆసక్తికర ప్రకటన చేసింది. సౌర వ్యవస్థ యొక్క బయటి అంచుల నుండి గ్రహశకలాలు(ఆస్టరాయిడ్స్).. నీటిని భూమ్మీదకు మోసుకొచ్చాయనేది జపాన్ స్పేస్ మిషన్ తేల్చిన విషయం. ఆశ్చర్యంగా అనిపించిన.. వాటి ద్వారానే బిలియన్ల సంవత్సరాల కిందట భూమ్మీద నీరు, సముద్రాలు ఏర్పడ్డాయన్నది ఈ మిషన్ చెబుతోంది. ఈ వాదనకు సంబంధించి శాస్త్రీయ ఆధారాలు కూడా ఉన్నాయన్నది జపాన్ పరిశోధకులు చెప్తున్నమాట. ఈ భూమ్మీద జీవితం మూలాలు, విశ్వం నిర్మాణంపై వెలుగునిచ్చే అంశాల అన్వేషణలో భాగంగా.. 2020లో రైయుగు Ryugu అనే గ్రహశకలం భూమ్మీదకు తీసుకొచ్చిన పదార్థాన్ని పరిశీలించారు. హయబుసా-2 అని పిలిచే జపనీస్ స్పేస్ ప్రోబ్ ద్వారా 5.4 గ్రాముల (0.2 ఔన్సుల) రాళ్ళు, ధూళిని సేకరించారు. భూ జీవనానికి సంబంధించిన కొన్ని బ్లాకులలో అమైనో ఆమ్లాల ఉనికిని గుర్తించామని, అంతరిక్షంలోనే అవి ఏర్పడి ఉండొచ్చని శాస్త్రవేత్తల బృందం ఈ జూన్‌లో ఓ ఆర్టికల్ తమ పరిశోధన వివరాలను వెల్లడించింది. అంతేకాదు.. రైయుగు శాంపిల్స్‌లో కనిపించిన ఆర్గానిక్ మెటీరియల్ వల్లే భూమ్మీద నీటి జాడ ఏర్పడి ఉంటాయన్న వాదనకు బలం చేకూరుతోందని అంటున్నారు. అస్థిర, ఆర్గానిక్మూలాలు అధికంగా ఉన్న సీ-టైప్ గ్రహశకలాలు.. భూమి యొక్క నీటి యొక్క ప్రధాన వనరులలో ఒకటిగా ఉండవచ్చంటూ జపాన్, ఇతర దేశాల సైంటిస్టులు.. జర్నల్ నేచర్ ఆఫ్ ఆస్ట్రోనమీలో అభిప్రాయం వెల్లడించడం.. ఆ జర్నల్ సోమవారం పబ్లిష్ కావడం విశేషం. ఇదీ చదవండి: అంతరిక్ష కేంద్రం నుంచి భారత్‌కు సర్ప్రైజ్ -
సామ్రాజ్య భారతి: 1938,1939/1947
ఘట్టాలు: రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభం. ఇండియాలో రాజకీయ ప్రతిష్ఠంభన. భారతీయ జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సుభాస్ చంద్రబోస్ రాజీనామా. బ్రిటిష్ అరాచక పాలనకు నిరసనగా ఆమరణ నిరాహారదీక్షకు కూర్చున్న గాంధీజీ. చట్టాలు: గుడ్ కాండక్ట్ ప్రిజనర్స్ ప్రొబేషనల్ రిలీజ్ యాక్ట్, ఇన్సూరెన్స్ యాక్ట్; మనోవర్స్, ఫీల్డ్ ఫైరింగ్ అండ్ ఆర్టిలరీ ప్రాక్టీస్ యాక్ట్, కట్చీ మెమాన్స్ యాక్ట్. రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫారినర్స్ యాక్ట్, పోర్చుగీస్ కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్, కమర్షియల్ డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ యాక్ట్, డిజల్యూషన్ ఆఫ్ ముస్లిం మ్యారేజస్ యాక్ట్. జననాలు: బి.సరోజాదేవి : నటి (బెంగళూరు); శశి కపూర్ : నటుడు (కలకత్తా); షీలా దీక్షిత్ : రాజకీయనేత (కపుర్తాలా); గిరీష్ కర్నాడ్ : నటుడు (మహారాష్ట్ర); రాహుల్ బజాజ్ : బిజినెస్‌మేన్ (కలకత్తా); సంజీవ్ కుమార్ : నటుడు (సూరత్); ఎస్.జానకి : సి.నే.గాయని (రేపల్లె); హరిప్రసాద్ చౌరాసియా : వేణుగాన విద్వాసులు (అలహాబాద్); గిరిజ : నటి (కంకిపాడు); ఆర్.డి.బర్మన్ : సంగీత దర్శకుడు (కలకత్తా); ములాయం సింగ్ యాదవ్ : రాజకీయనేత (ఉత్తరప్రదేశ్); ఎల్.ఆర్. ఈశ్వరి : సినీ గాయని (మద్రాసు); గొల్లపూడి మారుతీరావు : నటుడు (విజయనగరం). (చదవండి: జమ్మూకశ్మీర్) -
సామ్రాజ్య భారతి: 1936,1937/1947
ఘట్టాలు: ‘టెంపుల్ ఎంట్రీ ప్రొక్లమేషన్’తో హిందూ ఆలయ ప్రవేశానికి ‘అట్టడుగు వర్ణాలు’ అని పిలవబడేవారిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసిన ట్రావెన్కూర్ మహారాజు చితిర తిరునాళ్ బలరామ వర్మ. కేరళ యూనివర్సిటీ ఏర్పాటు. ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ స్థాపన. చట్టాలు: పేమెంట్ ఆఫ్ వేజస్ యాక్ట్, పార్సీ మ్యారేజ్ అండ్ డైవోర్స్ యాక్ట్. అగ్రికల్చరల్ ప్రొడ్యూజ్ (గ్రేడింగ్ అండ్ మార్కింగ్) యాక్ట్, ముస్లిం పర్సనల్ లా (షరియత్) అప్లికేషన్ యాక్ట్, ఆర్య మ్యారేజ్ వాలిడేషన్ యాక్ట్ వైజయంతిమాల : తమిళనటి, భరతనాట్య ప్రవీణ (మద్రాసు); నూతన్ : బాలీవుడ్ నటి (బాంబే); జుబిన్ మెహ్తా : పాశ్చాత్య శాస్త్రీయ సంగీత నిర్వాహకులు (బాంబే); డి.రామానాయుడు : సినీ నిర్మాత (కారంచేడు); వేటూరి : సినీ గేయ రచయిత (పెదకళ్లేపల్లి); చిట్టిబాబు : సంగీతజ్ఞులు, కర్ణాటక సంగీత వైణికులు (కాకినాడ); విజయబాపినీడు : సినీ రచయిత, దర్శకులు (చాటపర్రు). రామచంద్ర గాంధీ : తత్వవేత్త, గాంధీజీ మనవడు (మద్రాసు); అనితా దేశాయ్ : నవలా రచయిత్రి, (ముస్సోరి); రతన్‌టాటా : పారిశ్రామికవేత్త (బాంబే); శోభన్‌బాబు : సినీ నటులు (నందిగామ); లక్ష్మీకాంత్ శాంతారామ్ : లక్ష్మీకాంత్, ప్యారేలాల్ ద్వయంలో ఒకరు. బాలీవుడ్ సంగీత దర్శకులు (బాంబే); రావుగోపాలరావు : సినీ నటుడు (కాకినాడ). (చదవండి: శతమానం భారతి: కొత్త పార్లమెంట్ ) -
షాకింగ్.. కడుపు నొప్పితో టాయిలెట్లోకి వెళ్లి.. బిడ్డతో బయటకొచ్చిన యువతి
కడుపు నొప్పితో విలవిల్లాడుతూ వాష్‌రూమ్‌లోకి వెళ్లిన యువతి అనుకోకుండా ఓ బిడ్డకు జన్మనిచ్చింది. యువతికి కనీసం పొట్ట పొరగడం, ప్రెగ్నెన్సీకి సంబంధించి ఎలాంటి లక్షణాలు కూడా లేకపోవడం మరింత చోద్యంగా మారింది. ఈ వింత ఘటన యూనైటెడ్ కింగ్డమ్లో వెలుగు చూసింది. జెస్ డేవిస్ అనే 20 ఏళ్ల యువతి యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్‌లో చదువుతోంది. ఓ రోజు రాత్రి యువతికి తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో పీరియడ్స్(నెలసరి) అని భావించి వాష్‌రూమ్‌లోకి వెళ్లింది. టాయిలెట్లో కూర్చొని ఉండగా అకస్మాత్తుగా 3 కేజీల మగబిడ్డకు జన్మనివ్వడంతో ఆశ్చర్యపోయింది. అసలు తాను గర్భవతిననే విషయం కూడా ఆమెకు తెలియదు. ఇక బిడ్డను ప్రసవించిన మరుసటి రోజే జెస్ డేవిస్ తన 20వ పుట్టిన రోజును జరుపుకోవడం విశేషం. విషయంపై సదరు యువతి మాట్లాడుతూ.. ‘నాకు పీరియడ్స్ ఎప్పుడూ రెగ్యులర్‌గా రావు. కాబట్టి నేను పెద్దగా పట్టించుకోలేదు. అప్పుడప్పుడు వికారంగా అనిపించేది. అందుకు కొన్ని మందులు వాడటం ప్రారంభించాను. ఆ రోజు ఉదయం తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. పీరియడ్స్ మొదలవుతున్నాయేమో అనుకున్నా. నడవలేని స్థిలిలో ఉన్నాను. కనీసం మంచం మీద పడుకోలేకపోయాను. అర్ధరాత్రి దాటాక కడుపునొప్పి ఎక్కువైంది. వెంటనే లేచి వాష్‌రూమ్‌కు వెళ్లా. నా పొట్టను కిందకు పుష్ చేశా. చదవండి: అక్కడ పానీ పూరీ అమ్మకాలు నిషేధం! ఎందుకంటే?... అప్పటికీ నాకు అనుమానం రాలేదు. కొద్దిసేపటి తర్వాత బిడ్డ ఏడుపు వినిపించింది. ఆ తరువాతే గానీ జరిగిందేంటో అర్థం కాలేదు. బాత్రూమ్లో బిడ్డను చూసి ముందు నేను కల కంటున్నానేమో అనుకున్నాను. కానీ జీవితంలో ఇంత కంటే పెద్ద షాక్ మరొకటి లేదు. వెంటనే షాక్ నుంచి తేరుకొని బిడ్డను చేతుల్లోకి తీసుకున్నా. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో వెంటనే నా స్నేహితురాలికి ఫోన్ చేసి విషయం చెప్పా. తాను అంబులెన్స్‌లో హాస్పిటల్‌కు వెళ్లామని చెప్పింది. మొదట్లో శిశువుతో సమయం గడిపేందుకు కొంత టైం పట్టింది. కానీ ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను’ అని వివరించింది. ఆసుపత్రిలో శిశువును ఇంక్యుబేటర్‌లో ఉంచారు. శిశువు 35 వారాలకే జన్మించినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం తల్లీ, బిడ్డ కోలుకుంటున్నారని పేర్కొన్నారు. చదవండి: రోడ్డు మీద వెళ్తున్న మహిళ.. తలపై పడిన కొబ్బరికాయ.. వైరలవుతోన్న వీడియో -
మంచి మాట..: ఈ దరి... ఆ దరి
జీవితం ఒక నదిలాంటిది. దాని ఈవలి ఒడ్డు పుట్టుక. పుట్టిన ప్రతి మనిషి జీవనం సాగించాలి. తరువాత, ప్రతి ఒక్కరూ మరణించవలసిందే. ఈ మరణమే ఆవలి ఒడ్డు. అలా ఆవలి వైపుకు చేరుకున్నవారందరూ ఏమయ్యారు.. ఎక్కడికి వెళ్లారు.. తిరిగి మళ్ళీ పుడతారా ఇటువంటి విషయాల మీద భిన్నాభిప్రాయాలున్నాయి. సృష్టి.. సృష్టికర్త.. దేవుడు.. పరమాత్మ.. ఆత్మ.. ఆస్తికత్వం.. నాస్తికత్వం.. శాస్త్రీయావగాహన.. హేతుబద్ధత .. ఇలా ఎన్నో అంశాలు ఉంటాయి. వీటిని బట్టి మన ఆలోచన.. ఆలోచనా విధానం..విశ్వాసం.. నమ్మకం..వైఖరి ఏర్పడి చావు పుట్టుకలను అర్ధం చేసుకుని , వాటిని విశ్లేషించగల శక్తి వస్తుంది. మృత్యువు అంటే మనకు ఎన్ని విభిన్నమైన అభిప్రాయాలున్నా జనన, మరణాల మధ్య మనం గడపవలసిన.. గడిపే జీవితం పట్ల చాలామంది ఒకే ఉద్దేశాన్ని కలిగి ఉంటారు. అరుదుగా లభ్యమైన ఈ జన్మను అర్ధవంతం చేసుకోవాలని తపిస్తారు. సకల ప్రాణరాశిలో ఆలోచనలో.. మేధలో.. తార్కికత లో..నిరంతరం ఎదగగలిగే ఏకైక జీవి మానవుడే. ఇది గ్రహించాడు కనుకనే ఈ సృష్టి లో తన ఉనికికి ఒక సార్ధకత చేకూర్చాలని ఉవ్విళ్ళురుతాడు. ఇక్కడే అందరూ వర్గ వైరుధ్యాలను.. మత విశ్వాసాలను వీడి ఏకభావనులవుతారు. మనసా.. వాచా.. కర్మణా మంచి చేయటానికి ప్రయత్నిస్తారు. కరుణ, ప్రేమలను చూపుతారు. తాము చేసే పనులకు తమ మనస్సునే సాక్షిని చేసుకుంటారు. తోటివారికి శక్తి మేరకు సహాయం సహకారాలనందిస్తారు. ఇదే కేవలం నేను.. నా కుటుంబమే ..నా సంక్షేమమేనన్న సంకుచిత.. స్వార్ధ భావన, చింతనల నుండి మనిషిని వేరుచేసి.. అతణ్ణి ఉన్నతుడుగా.. విశ్వమానవుడిగా చేసి...మనీషి గా.. చేస్తుంది. ఇదే అర్ధవంతమైన జీవితమంటే. మనం కన్ను మూసే లోపు ఆ గొప్ప స్థితి కి చేరాలని.. కనీసం ప్రయత్నం చేయాలన్న సంకల్పం వుండాలి. దాన్ని మరింత బలోపేతం చేసే ధతిని జత చేయాలి. ‘ ఒక అర్ధరహితమైన జీవితాన్ని కన్నా ఒక అర్ధవంతమైన చావును కోరుకుంటాను. ‘ ఒక గొప్ప తాత్వికుడి మాటలు ఎంత అక్షర సత్యాలు! శరీరంలోని కణం, కణజాలంలోని ప్రాణాధారమైన శక్తి సమూలంగా, సంపూర్ణంగా నశించినపుడే మనిషి చనిపోవడం జరుగుతుంది. ఈ చావును ఒకొక్కరు ఒకొక్క రకంగా భావన చేస్తారు. చూసే వ్యక్తి దృష్టి.. దృక్పధం... అవగాహనా శక్తిని బట్టి అర్ధం గోచరిస్తూ ఉంటుంది. వేదాంతులు చావును ఈ శరీరమనే కారాగారంలోబందీ గా వున్న ఆత్మ స్వేచ్ఛను పొందే ఒక అద్భుత వరంగా చెపుతారు. ఆధ్యాత్మిక పరులు జీవాత్మ, పరమాత్మల కలయికగా అభివర్ణిస్తారు. శాస్త్రవేత్తలు.. భౌతిక శాస్తవేత్తలు .. నాస్తికులు ఒక సహజపరిణామంగా చూస్తారు. ప్రతి ఒక్కరి పుట్టుక చావుతో అంతం కావాలి. ఇది తప్పనిది. తప్పించుకోలేనిది. చదువుకున్న వాడైనా.. చదువుకోనివాడైనా... ధనవంతుడైనా.. పేదవాడైనా.. జ్ఞానైనా, అజ్ఞానైనా మృత్యువాత పడక తప్పదు. జీవితాన్ని ఎవరెలా ఆస్వాదించారు.. ఉన్నంతలో ఎంత తృప్తిగా జీవించారు.. ఎంత చక్కగా భాషించారు.. పవిత్రమైన మనస్సుతో ఆలోచనలు చేసారు అన్న ఈ వివరాలు ఏ ఒక్కరి జీవితంలో ఉంటాయో ఈ జీవితం గొప్పది. వారే గొప్పవారు. కొందరికి చావంటే భయం. ఇది వారికి సహజాతం. ఇది వారిని జీవించనీయదు. దానికి వారిని సమాయత్తం చేయదు. ఈ భయంతో వారు జీవితాన్ని హాయిగా.. ఆహ్లాదంగా.. ఆనందంగా గడపనేలేరు. ఇది ఆధార రహితమే కాదు అర్ధరహితం కూడ. ఎందుకని..? వారికి ప్రపంచంలోవారొక్కరే చనిపోతున్నారేమో నన్న ఆలోచన. కాని ప్రతి ఒక్కరూ మరణిస్తున్నారు కదా! ఇది వారి మనసుకు.. బుద్ధికి తట్టదు. ఒకవేళ తట్టినా చావకుండా ఉంటే బావుండునన్న కోరిక. ఎంత అసంబద్ధ మైనది..! ఎంత అసాధ్యమైనది..! ఎంత మంది మృత్యువు నుండి తప్పించుకునే ప్రయత్నం రకరకాలుగా చేసి... తార్కిక శక్తిని వినియోగించక అసాధ్యమైన కోరికలడిగి ఎలా భంగపడ్డారోచెప్పే ఉదాహరణలు పురాణాలలో ఎన్నో వున్నాయి. ఎవ్వరినీ వదలని మత్యువు తనను విడిచిపెట్టదని, తను చావక తప్పదన్న నిజాన్ని బోధపరచుకోవాలి. ధైర్యం తెచ్చుకోవాలి. జీవితాన్ని చక్కగా గడపాలి. ఈ సహజ భయానికి తోడు .. మహమ్మారి అంటువ్యాధులు.. విపత్తులు సంభవించిన వేళలో మానసిక స్థైర్యాన్ని కోల్పోయి, భయ విహ్వలురై చనిపోయేవారుంటారు. ఇది కూడా కూడదు. చావనేది కష్టం కాదు. నష్టమూ కాదు. మనం బతికున్నప్పుడే మనలో ఆలోచనలో చనిపోయేవి.. అంటే మాయమయ్యేవి.. కొన్ని ఉంటాయి. వాటివల్ల మనం ఎన్నో కోల్పోతాం. ఎంతో నష్టపోతాం. ఏమిటవి..? కరుణ.. ప్రేమ.. పరోపకారం.. సహకారం..! వీటివల్ల మానవత్వానికి దూరమవుతాం. నిజానికి దీనికి మనం భయపడాలి. జీవితాన్ని గడపటం వేరు. జీవించటం వేరు. మొదటిది యాంత్రికం. రసవిహీనం. ఇది ఒక రకమైన మృత్యువే. ఇక రెండవది జీవించటమంటే ఉన్నంతలో తృప్తిగా, చెడు ఆలోచన మొగ్గలోనే చిదిమేస్తూ చేయగలిగిన సాయం నలుగురికి చేస్తూ, కష్టాలనుండి పాఠాలు నేర్చుకుంటూ, ఆనందంగా ఉండటం. మనిషి ఎలా మరణించాడన్నది ముఖ్యం కాదు. ఎలా జీవించాడన్నది చాలా ముఖ్యం. దీనికి ధనానికి సంబంధమేమి లేదు. జీవిత వైఖరి.. విలువలు.. మానసిక స్థితి.. ధైర్య, స్థైర్యాలు.. వీటివల్లే మనిషి జీవితం గొప్పదా.. కాదా అన్నది నిర్ణయ మవుతుంది. జీవాత్మ పరమాత్మలో లీనమవుతుందని కొందరు.. ఆత్మ ఈ శరీరమనే చెరసాల నుండి స్వేచ్ఛ పొందుతుందని ఇంకొందరు, ఇవేమీ కావని చావు ఒక ఒక సహజ సంఘటనని మరికొందరనచ్చు. ఈ భావనలో భేదాలున్నా జీవితాన్ని ఆదర్శంగా, మంచిగా, విలువైనదిగా చేసుకోవాలన్న విషయంలో అందరిదీ ఒకే అభిప్రాయం. ‘పిరికివాళ్ళు తమ మరణానికి ముందే చాలాసార్లు చనిపోతారు. కాని స్థైర్యవంతుడు ఒక్కసారే మృత్యువును రుచి చూస్తాడు. అన్న షేక్సి్పయర్ మాటలు మనస్సులో పెట్టుకుంటే మృత్యువుకు భయపడకుండా జీవితాన్ని ఎలా జీవించాలో వస్తుంది. మనం పొందిన ఈ జీవితం అపురూపం. మళ్లీ లభిస్తుందో లేదో తెలియదు. ఇది మరల తిరిగి రాదని కొందరు భావిస్తారు. అందుకే ఈ జీవితాన్ని మంచితనంతో, మంచిపనులతో సుగంధ భరితం చేసుకోవాలి. ఇక్కడ.. సరిగా ఇక్కడే మనిషి తన తెలివితేటలను.. యోచనను..వివేచన విచక్షణలను ఉపయోగించాలి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తను బుద్ధిశాలని నిరూపించుకోవాలి. – బొడ్డపాటి చంద్రశేఖర్, ఆంగ్లోపన్యాసకులు -
అదంతా నాన్సెన్స్: ఎలన్ మస్క్
Fewer Kids Environment Theory: స్పేస్ ఎక్స్ అధినేత, టెస్లా సీఈవో ఎలన్ మస్క్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో తెర మీదకు వచ్చాడు. పర్యావరణం బాగుండాలంటే.. తక్కువ సంతానం కలిగి ఉండాలంటూ వినిపించే వాదనను ఆయన తోసిపుచ్చాడు. ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉంటే.. అది వాతావరణానికి హాని అని అంటుంటారు. అందుకే తక్కువ మంది కనమని సలహాలిస్తుంటారు. అదంతా నాన్సెన్స్. జనాభా ఎంత పెరిగినా.. పర్యావరణానికి వచ్చిన నష్టం ఏం ఉండదు’’ అని ఆయన ఆల్ఇన్ సమ్మిట్( All-In Summit)లో వీడియో కాల్ ద్వారా వ్యాఖ్యానించారు. కనీసం మన సంఖ్యను కాపాడుకుందాం. అలాగని నాటకీయంగా జనాభాను పెంచాల్సిన అవసరం ఏమీ లేదు అని వ్యాఖ్యానించాడు ఏడుగురు బిడ్డల తండ్రైన ఎలన్ మస్క్. ఉదాహరణకు.. జపాన్‌లో జనన రేటు చాలా తక్కువ. కానీ, నాగరికతను కొనసాగించాలంటే.. జనాభా అవసరం ఎంతైనా ఉంది. దానిని మనం తగ్గించలేం అంటూ ఎలన్ మస్క్ వ్యాఖ్యలు చేశారు. అయితే జపాన్ పరిస్థితి ఇంతకు ముందు మస్క్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. జపాన్ జనాభా తగ్గిపోవడం ఆందోళనకరమైన అంశంగా పేర్కొన్న ఆయన.. జనాభా రేటులో మార్పుతేకుంటే ఆ దేశం ఉనికికే ప్రమాదని హెచ్చరించారు కూడా. అభివృద్ధి చెందిన దేశాల్లో.. పిల్లలను తక్కువగా కలిగి ఉండడం వల్ల కార్బన ఉద్గారాల విడుదల తక్కువగా ఉంటుందని, ఒక కుటుంబంలో ఒక బిడ్డ తక్కువగా ఉంటే.. 58.6 మెట్రిక్ టన్నుల ఉద్గారం వెలువడకుండా ఉంటుందంటూ ఓ థియరీ ఈ మధ్య చక్కర్లు కొడుతోంది. అయితే.. మారుతున్న లైఫ్ స్టైల్, ప్రొ క్లైమాటిక్ పాలసీలతో ఆ ప్రభావాన్ని(కార్బన్ ఉద్గారాల వెలువడడం) తగ్గించొచ్చని ప్రత్యేకంగా ఓ నివేదిక వెల్లడైంది. "Some people think that having fewer kids is better for the environment. Environment's gonna be fine even if we doubled the population. Japan had lowest birth rate. Having kids is essential for maintaining civilization. We can't let civilization dwindle into nothing." — @elonmusk pic.twitter.com/i03zytLDTJ— Pranay Pathole (@PPathole) May 20, 2022 -
ప్రభుత్వాసుపత్రిలో బిడ్డకు జన్మనిచ్చిన ఐఏఎస్ అధికారిణి
సాక్షి, బళ్లారి(కర్ణాటక): సాధారణ, మధ్య తరగతి మహిళలే ప్రసవాల కోసం ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న ఈ కాలంలో ఒక ఐఏఎస్ అధికారిణి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం చేయించుకున్నారు. తద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా మెరుగైన వైద్యం అందుతుందనే విషయాన్ని చాటిచెప్పారు. కర్ణాటకలో బళ్లారి జిల్లా పరిషత్ సీఈవోగా విధులు నిర్వహిస్తున్న ఎ.నందిని గర్భం దాల్చినప్పటి నుంచి ప్రభుత్వ ఆస్పత్రిలోనే నెలవారీ చికిత్సలు పొందారు. చదవండి: ఏపీ మీదగా ప్రత్యేక రైళ్లు.. వివరాలివే ప్రసవ నొప్పులు రావడంతో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. బుధవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో సహజ ప్రసవం ద్వారా పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చారు. ఐఏఎస్ అధికారులతో పాటు సామాన్యులకు కూడా ఇదే రకమైన వైద్యం అందిస్తున్నామని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఇన్చార్జి డా.బసిరెడ్డి తెలిపారు. గతంలో బళ్లారి కలెక్టర్ నకుల్ సతీమణికి, అలాగే జెడ్పీ సీఈవో రాజేంద్ర సతీమణికి కూడా ఇక్కడే ప్రసవాలు చేశామని చెప్పారు -
అమ్మాయిల సంఖ్య ‘అనంత’లోనే తక్కువ.. ఎందుకిలా?
సాక్షి ప్రతినిధి, అనంతపురం: జిల్లాలో అబ్బాయిలు, అమ్మాయిల మధ్య నిష్పత్తిలో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. అమ్మాయిల సంఖ్య ఇప్పటికీ తక్కువగా ఉంది. 2021 జనవరి నుంచి డిసెంబర్ వరకూ బర్త్ రేషియో (జననాల నిష్పత్తి) పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. వెయ్యి మంది అబ్బాయిలకు సగటున 902 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. అమ్మాయిల సంఖ్య తగ్గిపోతూ ఉండటం తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గడిచిన మూడు దశాబ్దాల నుంచి కూడా ఇదే పరిస్థితి నెలకొన్నట్టు చెబుతున్నారు. చదవండి: టెలీ మెడిసిన్ సేవల్లో ఏపీ టాప్ చివరి స్థానంలో అనంత.. అబ్బాయిలు, అమ్మాయిల నిష్పత్తిలో అనంతపురం జిల్లా రాష్ట్రంలోనే చివరిస్థానంలో ఉంది. రాష్ట్ర స్థాయిలో చూసినప్పుడు ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు సగటున 937 మంది అమ్మాయిలు ఉన్నారు. అదే జిల్లాలో చూస్తే వెయ్యి మంది అబ్బాయిలకు కేవలం 902 మంది అమ్మాయిలు ఉండడం ఆందోళన కలిగించే అంశం. దీన్నిబట్టి రమారమి వందమంది అమ్మాయిలు తక్కువగా పుడుతున్నట్టు స్పష్టమవుతోంది. కర్నూలు జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది. అక్కడ కూడా 908 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. ఎందుకిలా? కొన్ని కుటుంబాల్లో అమ్మాయిలంటే ఇప్పటికీ చిన్నచూపు ఉంది. మగ సంతానానికి ఇస్తున్న ప్రాధాన్యత అమ్మాయిల విషయంలో ఉండడం లేదు. మారుమూల ప్రాంతాల్లో ఇది మరింత ఎక్కువ. లింగనిర్ధారణ పరీక్షలు చేయించడం, అమ్మాయి అని తెలియగానే అబార్షన్ చేయించడం పరిపాటిగా మారింది. దీనివల్ల అమ్మాయిల నిష్పత్తి తగ్గిపోతోంది. జిల్లాలో లింగనిర్ధారణ నిరోధక చట్టం ( పీసీ పీ అండ్ డీటీ) గట్టిగానే అమలు చేస్తున్నారు. ఎక్కడైనా లింగనిర్ధారణ చేశారని తేలితే తీవ్ర చర్యలుంటాయని స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులకు అధికారులు హెచ్చరించారు. స్కానింగ్ సెంటర్ వైద్యుల (రేడియాలజిస్ట్/సోనాలజిస్ట్) పట్టాలు రద్దు చేయడానికైనా వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ కొందరు గైనకాలజిస్టులు, రేడియాలజిస్టులు కుమ్మక్కై లింగనిర్ధారణ, అబార్షన్లు చేస్తున్నట్లు విమర్శలున్నాయి. ఎవరైనా లింగనిర్ధారణ చేసినట్టు ఫిర్యాదు చేసి.. అది నిజమని తేలితే ఫిర్యాదుదారుడికి రూ.25 వేల బహుమతి ఇస్తారు. అలాగే ఆ ఫిర్యాదుపై విచారణ జరిగి డాక్టరుకు గానీ, నిర్వాహకులకు గానీ శిక్షపడితే రూ.లక్ష బహుమతి ఇస్తామని జిల్లా యంత్రాంగం ఇప్పటికే ప్రకటించింది. నిఘా మరింత పెంచాం జిల్లాలోని అన్ని స్కానింగ్ సెంటర్లపైనా నిఘా ఉంచాం. ఎక్కడైనా లింగనిర్ధారణ చేస్తున్నట్టు తెలిస్తే మాకు ఫిర్యాదు చేయొచ్చు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. అధికార యంత్రాంగానికి ప్రజలు సహకరిస్తే ఇలాంటి వాటిని అరికట్టవచ్చు. – డాక్టర్ కామేశ్వరప్రసాద్, డీఎంహెచ్ఓ రాయలసీమ జిల్లాల్లో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు అమ్మాయిల సంఖ్య ఇలా.. జిల్లా అమ్మాయిలు వైఎస్సార్ జిల్లా 925 చిత్తూరు 924 కర్నూలు 908 అనంతపురం 902 -
ఆ డాక్టర్ వల్లే నాకు లోపం.. కోర్టు సంచలన తీర్పు
Spina bifida won the landmark legal case over her wrongful conception: ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయిత తర్వాత మహిళలు వైద్యం, నెలవారీ చెకప్‌లకు కోసం డాక్టర్లను సంప్రదించి.. సూచనలు, జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే తాజాగా ఓ యువతి తన తల్లి గర్భంతో ఉన్న సమయంలో సరైన సలహాలు ఇవ్వలేదని డాక్టర్‌ను కోర్టుకు లాగింది. 20 ఏళ్ల యువతి ఈవీ టూంబ్స్.. తన తల్లికి తాను లోపంతో జన్మించడానికి డాక్టర్ కారణమైందని, సరైన సలహా ఇచ్చిఉంటే తాను జన్మించిన ఉండేదాన్ని కాదని పేర్కొంది. అయితే ఈవీ టూంబ్స్.. స్పైనా బిఫిడా అనే లోపంతో పుట్టారు. వెన్నెముక సరిగా ఏర్పకుండా లోపంతో పుట్టడం. దీంతో ఆమె రోజు మెడికల్ ట్యూబ్‌లను అమర్చుకొని వేదన అనుభవిస్తూ ఉన్నారు. ఆమె తన తల్లి ప్రెగ్నెన్సీ సమయంలో సరైన సూచనలు ఇవ్వలేదని డాక్టర్ ఫిలిప్ మిచెల్ ఆరోపణలు చేసింది. అంతటితో ఆగకుండా తనకు నష్టం పరిహారం చెల్లించాలని కోర్టులో దావా వేసింది. తాను పోషక ఆహారం తీసుకుంటే.. ఫోలిక్ యాసిడ్ తీసుకోవాల్సిన అవసరం లేదని డాక్టర్ సలహా ఇచ్చినట్లు ఈవీ తల్లి పేర్కొంది. లండన్ హైకోర్టు న్యాయమూర్తి రోసలిండ్ కో క్యూసి ఈవీ టూంబ్స్ కేసును సమర్థించారు. ఆమె తల్లికి ముందుగానే సరైన సలహా ఇచ్చి ఉంటే ఈవీ టూంబ్స్ .. స్పైనా బిఫిడా వెన్నుముక లోపంతో జన్మించి ఉండేది కాదని తీర్పు నిచ్చారు. టూంబ్స్ కోరిన విధంగా తగిన నష్ట పరిహారం చెల్లించాలని డాక్టర్‌ను కోర్టు ఆదేశించింది.ఇక ఈవీ టూంబ్స్ దివ్యాంగ ‘షో జంపర్’గా పలు పోటీల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. -
సుల్తాన్‌బజార్: వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి
సాక్షి, సుల్తాన్‌బజార్: వైద్యుల నిర్లక్ష్యంవల్లే తమ కూతురు మృతి చెందిందని బాలింత కుటుంబ సభ్యులు చేపట్టిన ఆందోళన సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ఆస్పత్రిలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఐదు గంటల పాటు ఆస్పత్రిలో గందరగోళ పరిస్థితి నెలకుంది. పోలీసులు విచ్చ వైద్యులపై కేసు నమోదు చేయడంతో బాధితులు శాంతించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సైదాబాద్ లక్ష్మీనగర్‌కు చెందిన బాలకృష్ణ భార్య పూజ(25)కు నెలలు నిండడంతో మొదటి కాన్పు కోసం ఈ నెల 25వ తేదీ ఆదివారం 3 గంటల ప్రాంతంలో సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో చేరి్పంచారు. సోమవారం తెల్లవారుజామున 4.30 గంటలకు వైద్యులు ఆపరేషన్ చేయడంతో పూజ పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అయితే వైద్యులు ఉదయం 11 గంటల ప్రాంతంలో బాలింతరాలు పూజ చనిపోయిందని చెప్పడంతో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి ఎలా చనిపోతుందంటూ కుటుంబ సభ్యులు వైద్యులను ప్రశి్నంచారు. పూజకు డ్యూటీ వైద్యులు సరిగా కుట్లు వేయకపోవడంతోనే రక్తస్రావం ఎక్కువై మరణించిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అంతేకాకుండా రెండో సారి వైద్యలు కుట్లు వేయడంతోనే పూజ మరణించిందని ఆందోళనకు దిగారు. తమ బిడ్డ వైద్యల నిర్లక్ష్యం వల్లే మృతిచెందిందని ఆస్పత్రి ఎదుట ఐదు గంటల పాటు ఆందోళన చేపట్టారు. అప్పుడే పుట్టిన చిన్నారని అనాథగా మారిందని కుటుంబ సభ్యులు విలపించిన తీరు అక్కడ ఉన్నవారిని కలచి వేసింది. సమాచారం తెలుసుకున్న సుల్తాన్‌బజార్ ఇన్స్పెక్టర్ భిక్షపతి, ఏసీపీ దేవేందర్ బంధువులకు నచ్చజెప్పారు. ఎట్టకేలకు వైద్యులపై పోలీçసు కేసు నమోదు చేస్తామని బంధువులకు సర్దిజెప్పి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆపరేషన్‌చేసిన డ్యుటీ డాక్టర్‌పై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్ డాక్టర్ రాజ్యలక్ష్మి హామీ ఇచ్చారు. -
నెలలు నిండకముందే పుట్టే బిడ్డలను ముందుగానే పసిగట్టవచ్చు!
సాధారణంగా బిడ్డలంతా తమ తల్లిగర్భంలో నవమాసాలూ ఉంటారన్నది తెలిసిందే. అంటే పూర్తిగా 36 వారాలన్నమాట. అయితే కొందరు చిన్నారులు పూర్తిగా నెలలు నిండకముందే పుడుతుండటం మనకు తెలిసిందే. నెలలు నిండకుండా పుట్టిన బిడ్డలను (ప్రీమెచ్యుర్ బేబీస్) అంటే ప్రసవానికి కనీసం పది వారాల ముందుగానే పసిగట్టవచ్చంటున్నారు బ్రిటన్ శాస్త్రవేత్తలు. ఇటీవలే ఇంగ్లాండ్‌లోని లండన్ ‘కింగ్స్ కాలేజీ’కి చెందిన శాస్త్రవేత్తలు తాము నిర్వహిస్తున్న అధ్యయనాల్లో భాగంగా కొందరు కాబోయే తల్లుల మెడ భాగంలో కొన్ని బ్యాక్టీరియాతోపాటు ప్రత్యేకంగా ఉన్న కొన్ని మాలెక్యూల్స్ కనుగొన్నారు. వీటి ఆధారంగా పూర్తిగా నెలలు నిండటానికి ముందే ఈలోకంలోకి వచ్చేందుకు తొందరపడే బిడ్డలను పసిగట్టేందుకు ఆస్కారముందంటున్నారు. దాంతో ముందుగానే ఏయే శిశువులు పుట్టబోతున్నారన్న విషయం తెలుస్తుంది కాబట్టి... బిడ్డను పూర్తికాలం తల్లిగర్భంలోనే ఉంచడానికి ఏమైనా ప్రత్యేక ప్రక్రియలు లేదా చికిత్సలను రూపొందించవచ్చా అనే దిశలో ఇప్పుడు ప్రయత్నాలు జరిపేందుకు ఆస్కారం ఉందంటున్నారా శాస్త్రవేత్తలు. ఒకవేళ అది ఇప్పటికిప్పుడు సాధ్యం కాకపోయినప్పటికీ... పుట్టబోయేదెవరో తెలిసిపోతుంది కాబట్టి... అలాంటి శిశువుల విషయంలో... ఆ మేరకు అవసరమైన ‘ఇంక్యుబేషన్’ వంటి పలు జాగ్రత్తలను తీసుకునేందుకు వీలుంటుందని అధ్యయనవేత్తలు పేర్కొంటున్నారు. -
ఆస్పత్రి బాత్రూమ్లో ప్రసవించిన అత్యాచార బాధితురాలు
తిరువనంతపురం: అత్యాచారానికి గురయిన బాలిక గర్భం దాల్చింది. ఆ విషయం తెలియకుండా ఉండేందుకు ఆరు నెలల పిండాన్ని వదిలించుకునే ప్రయత్నం చేసింది. ఈ సందర్భంగా నెలలు నిండకుండానే ప్రసవించేందుకు ప్రయత్నించడంతో పిండం బయటకు వచ్చింది. ఆస్పత్రిలోని బాత్రూమ్లో పిండాన్ని నీళ్లు పోసి వదిలించుకునేందుకు ప్రయాస పడింది. ఈ హృదయ విదారక సంఘటన కేరళలో జరిగింది. 18 ఏళ్లు నిండని బాలిక అత్యాచార బాధితురాలు. గర్భిణి కావడంతో వైద్య పరీక్షల కోసం తల్లితో కలిసి కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి బుధవారం వెళ్లింది. వైద్యురాలి కోసం వేచి చూస్తున్న సమయంలో ఆ యువతి బాత్రూమ్కు వెళ్లింది. చదవండి: సీక్రెట్ యాప్‌తో భార్య ఫోన్ ట్యాపింగ్.. ఆమెపై నీడలా భర్త ఈ సమయంలో నెలలు నిండకుండానే బలవంతంగా ప్రసవించేందుకు ప్రయత్నించింది. తీవ్ర ప్రయత్నం చేయడంతో ఆరు నెలల పిండాన్ని ప్రసవించింది. ఈ విషయం ఎవరికీ తెలియకుండా బాత్రూమ్లో ఎక్కువగా నీళ్లు పోసి కప్పిపుచ్చేందుకు ప్రయత్నించింది. అయితే పిండం ఆ నీటికి మరుగుదొడ్డిలోకి వెళ్లలేదు. ఈ విషయాన్ని ఓ వ్యక్తి గమనించి ఆస్పత్రి నిర్వాహకులకు, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ బాలికను 20 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. గురువారం అత్యాచారం చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. చదవండి: ‘భీమ్లా నాయక్’లో పాడిన ‘కిన్నెర’నాదుడు ఎవరో తెలుసా? -
Fertility Rate: ఇక్కడ తగ్గుతున్నారు.. అక్కడ పెరుగుతున్నారు
సాక్షి, అమరావతి: దేశంలో కొన్ని రాష్ట్రాల్లో జననాల సంఖ్య (బర్త్ రేట్) అమాంతం పెరుగుతుంటే.. మరికొన్ని రాష్ట్రాల్లో ఊహించని విధంగా తగ్గిపోతోంది. దేశంలో జనాభా పెరుగుదల మధ్య తీవ్ర వ్యత్యాసాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో సంతాన సాఫల్య సూచిక (టోటల్ ఫెర్టిలిటీ రేటు) తగ్గాల్సిన దానికంటే ఎక్కువగా తగ్గిపోతోంది. దీనివల్ల భవిష్యత్‌లో వృద్ధుల సంఖ్య పెరిగిపోనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సంతాన సాఫల్యత గల మహిళ ఆంధ్రప్రదేశ్‌లో 1.6 మందిని మాత్రమే కంటున్నారు. ఫెర్టిలిటీ రేటు తగ్గడం ఊహించని పరిణామంగా చెబుతున్నారు. 2006లో ఆంధ్రప్రదేశ్‌లో సగటున ఒక మహిళ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చేది. తాజా గణాంకాల ప్రకారం అది 1.6 కు మాత్రమే పరిమితమైంది. కనీసం 1.9 లేదా ఆ పైన జననాల సంఖ్య ఉంటేనే జనాభా పెరుగుదల ఉంటుంది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. తమిళనాడు, కేరళ, తెలంగాణ, కర్ణాటక వంటి దక్షిణాది రాష్ట్రాలన్నిటిలోనూ ఫెర్టిలిటీ రేటు 1.7 కంటే తక్కువగా ఉంది. దీనివల్ల జనాభా పెరుగుదల కనీస స్థాయిలో కూడా ఉండదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో అయితే.. దేశంలోనే అత్యంత తక్కువగా జననాల రేట 1.5 మాత్రమే ఉంది. ఉత్తరాదిన పెరుగుతున్న జనాభా ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం సగటుకు మించి జనాభా పెరుగుతున్నారు. అత్యధికంగా బిహార్‌లో సగటున ఒక మహిళ 3.2 మందికి జన్మనిస్తోంది. ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. తాజాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జనాభా నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచి్చన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇండియా సగటు బర్త్ రేటు 2.2గా ఉంది. తాజా గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే బిహార్‌లో నూరు శాతం ఎక్కువగా ఫెర్టిలిటీ రేటు నమోదవటం గమనార్హం. ఇద్దరంటే మొగ్గు చూపడం లేదు గతంలో ‘ఇద్దరు పిల్లలు.. ఇంటికి వెలుగు’ అనే నినాదాలు హోరెత్తేవి. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో ఆ పరిస్థితి లేదు. ఒక్కరే చాలు అనుకునే వాళ్లే ఎక్కువయ్యారు. చాలామంది యువతులు ఉద్యోగాలు, ఉపాధి వంటి కారణాల వల్ల ఆలస్యంగా వివాహాలు చేసుకుంటున్నారు. దీంతో వారు ఇద్దరు పిల్లల్ని కనడానికి ఇష్టపడటం లేదు. మగవాళ్లు సైతం అదే భావంతో ఉంటున్నారు. పట్టణీకరణ నేపథ్యంలో కుటుంబ ఖర్చులు పెరిగిపోవడం, చదువుల వ్యయం కారణంగా ఆయా కుటుంబాలు పిల్లలకు జన్మనిచ్చే విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నాయి. ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోవడంతో పిల్లల పెంపకం భారంగా మారడం కూడా సంతాన సాఫల్యత తగ్గడానికి కారణంగా చెబుతున్నారు. ఇలా రకరకాల కారణాలతో సంతానోత్పత్తి తగ్గిపోతున్నట్టు చెబుతున్నారు. ఇలా తగ్గుతూ వెళితే.. జనాభా ప్రాతిపదికన ఏర్పాటయ్యే పార్లమెంటరీ స్థానాలను పునరి్వభజన చేస్తే ఒక ప్రాంతంలో భారీగా సీట్లు పెరిగే అవకాశం ఉందని, మరో ప్రాంతంలో తగ్గిపోతాయని చెబుతున్నారు. ఇది రాజకీయ అసమానతలకు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు. -
వర్క్ ఫ్రం హోం కాదు.. వర్క్ ఫ్రం ఆస్పత్రి
కోవిడ్-19 కారణంగా ఉద్యోగులు వర్క్‌ఫ్రం హోం చేస్తున్నారు. దీంతో ఎక్కువ మంది ఉద్యోగులకు గంటల తరబడి జర్నీ చేసే బాధ తప్పింది. డబ్బులు కూడా సేవ్ చేసుకుంటున్నారు. కానీ అదే సమయంలో ఇంటిని మేనేజ్ చేస్తూ ఆఫీస్ పనిచేయడం కష్టంగా మారింది. పరిస్థితులు ఎలా ఉన్నా వర్క్ ఫ్రం హోం చేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఓ ఉద్యోగి భార్య ఆస్పత్రిలో పండంటి పాపకు జన్మనిచ్చింది. దీంతో సదరు ఉద్యోగి వర్క్ ఫ్రం హోంని కాస్తా.. వర్క్ ఫ్రం హాస్పటల్‌గా మార్చాడు. ఆస్పత్రికి చెందిన ఓ వార్డ్‌లో భార్య అప్పుడే పుట్టిన పాపాయికి జోకొడుతుంటే.. పక్కనే ఓ టేబుల్‌పై ల్యాప్ ట్యాప్‌తో భర్త ఆఫీస్ పనిచేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సామ్ హోడ్జెస్ అనే నెటిజన్ వర్క్ ఫ్రం హాస్పిటల్ ఫోటోల్ని నెట్టింట్లో షేర్ చేయగా..ఏప్రిల్ 2న "నా భార్య పండంటి పాపాయికి జన్మనిచ్చింది. తండ్రిగా పిల్లలకు దూరంగా ఎంత కష్టమో మాటల్లో చెప్పలేను. అయినా వర్క్‌కి నేను కట్టుబడి ఉన్నా వర్క్ ఫ్రం హోం కంటే వర్క్ ఫ్రం హాస్పటల్ నుంచి వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. కుటుంబ సభ్యుల్ని, క్లైంయింట్లను" మేనేజ్ చేస్తున్నాను అంటూ ట్వీట్లో పేర్కొన్నాడు. చదవండి: రెండేళ్ల వరకూ వర్క్ ఫ్రం హోం.. ఎంతమందంటే Peak horrific LinkedIn pic.twitter.com/1Pqx0ZOjeF — Sam Hodges (@SamHodges) June 20, 2021 -
7 నెలల 7 రోజులు.. ఒకే కాన్పులో 10 మంది జననం!
ప్రిటోరియా: తనకు ఒకే కాన్పులో 10 మంది పిల్లలు( డెక్యూప్లెట్స్) జన్మించినట్లు దక్షిణాఫ్రికాకు చెందిన గొసియామీ థామర సిట్‌హోల్ (37) అనే మహిళ ప్రకటించింది. ప్రిటోరియా నగరంలో సోమవారం రాత్రి తన భార్యకు సిజేరియన్ (సి–సెక్షన్) ద్వారా ప్రసవం జరిగిందని, ఏడుగురు మగ శిశువులు, ముగ్గురు ఆడ శిశువులు జన్మించారని ఆమె భర్త టెబోగో సోటెట్సీ చెప్పారు. తనకు చాలా ఆనందంగా ఉందని, ప్రస్తుతం ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేనంటూ భావోద్వేగానికి గురయ్యారు. తన భార్య గర్భం దాల్చి 7 నెలల 7 రోజులయ్యిందని, నెలలు నిండకుండానే 10 మందికి జన్మనిచ్చిందని తెలిపాడు. అయితే, ఒకే కాన్పులో 10 జన్మించారని దంపతులు చెబుతున్న విషయాన్ని వైద్యులు ఇంకా ధ్రువీకరించలేదు. ఒకవేళ ధ్రువీకరిస్తే.. ఒకే కాన్పులో ఇంతమంది పిల్లలు పుట్టడం ప్రపంచంలో ఇదే మొదటిసారి అవుతుంది. గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కడం ఖాయం. సిట్‌హోల్ గతంలో కవలలకు జన్మనిచ్చింది. రెండోసారి సహజ గర్భం దాల్చానని సిట్గోల్ గతంలో వెల్లడించింది. కృత్రిమ గర్భధారణ కోసం చేసే ట్రీట్మెంట్ల వల్లే ఇలా ఎక్కువ మంది శిశుశులు జన్మిస్తారని వైద్య నిపుణులు చెబుతున్నారు. గర్భం దాల్చే అవకాశాలను పెంచడానికి ఫలదీకరణ చెందిన అండాలను ఎక్కువ మొత్తంలో మహిళల గర్భాశయంలో ప్రవేశపెడుతుంటారని, అవి సక్రమంగా పెరిగి, ఎక్కువ మంది శిశువులు జన్మిస్తారని అంటున్నారు. ప్రసవం కంటే ముందు కూడా ఆమె మీడియాతో మాట్లాడింది. తన గర్భంలో ఆరుగురు శిశువులు ఉన్నట్లు వైద్యులు చెప్పారని, తర్వాత స్కానింగ్ చేయిస్తే 8 మంది ఉన్నట్లు తేలిందని వివరించింది. ప్రసవంలో ఆ సంఖ్య 10కి చేరింది. ఈ పిల్లల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్నది ఇంకా తెలియరాలేదు. చదవండి: 24 వేల ఏళ్ల తర్వాత బతికొచ్చాయి! -
కొత్త జంటలకు బంఫర్ ఆఫర్!
టోక్యో: జపాన్‌లో జననాల రేటు దారుణంగా పడిపోవడంతో ఆ దేశం వినూత్నంగా ఆలోచించింది. అక్కడి యువతి యువకులను పెళ్లి చేసుకునేలా ప్రోత్సాహించి జననాల రేటు పెంచేందుకు కొత్త జంటకు 6 లక్షల యెన్లను జపాన్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో జననాల రేటు తిరిగి గాడిన పడుతుందని జపాన్ ఆలోచించింది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి పెళ్లి చేసుకునే జంటలకు ప్రోత్సాహక బహుమతి కింద 6 లక్షలు యెన్లు(ఇండియన్ కరెన్సీలో రూ. 4 లక్షలకు కంటే ఎక్కవ) ఇవ్వనుంది. అంతేగాక పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఈ ప్రోత్సాహం ఎంతగానో ఉపయోగపడుతుందని జపాన్ ప్రభుత్వం పేర్కొంది. (చదవండి: 516కు పైగా ఆపరేషన్స్.. అయినా కానీ..) ఈ పథకాన్ని ప్రకటిస్తూ ప్రభుత్వం కొన్ని నిబంధనలు కూడా విధించింది. పెళ్లి చేసుకునే జంట మొదట వారి పేర్లను రిజిస్టర్ చేసుకోవాలని, వారి వయసు 40 ఏళ్లకు మించి ఉండకూడదు. వార్షిక ఆదాయం 5.4 లక్షల కంటే తక్కువగా ఉన్న వారే ఈ ప్రోత్సాహక బహుమతికి అర్హులుగా జపాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. గతేడాది దేశ వ్యాప్తంగా 8.65 లక్షల మంది మాత్రమే జన్మించడంతో రానురాను జననాల రేటు పడిపోతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దేశంలో జననాల రేటును తిరిగి పెంచేందుకు జపాన్ ఈ కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ ప్రోత్సాహాకాన్ని ఆ దేశ యువతీ యువకులు ఏ స్థాయిలో సద్వినియోగం చేసుకుంటారో, జననాల రేటు పెరుగుదలకు ప్రభుత్వ ప్రయత్నం తోడ్పడుతుందో లేదో వేచి చూడాలి. (చదవండి: చైనా ముప్పు; భారత్- జపాన్ కీలక ఒప్పందం) -
‘108’లో మహిళ ప్రసవం..
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ‘108 అంబులెన్స్‌లో ఓ గర్భిణి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. చక్రాయపేట మండలం సిద్ధారెడ్డి పల్లె గ్రామానికి చెందిన దివ్యలక్ష్మికి శనివారం తెల్లవారు జామున పురిటి నొప్పులు రావడంతో ‘108’కు కుటుంబ సభ్యులు కాల్ చేశారు. ఫోన్ చేసిన 15 నిమిషాల్లోనే అంబులెన్స్ చేరుకుంది. మధ్యమార్గంలో పురిటి నొప్పులు మరింత ఎక్కువ అవడంతో సిబ్బంది.. అంబులెన్స్‌లోనే చికిత్స చేసి మగబిడ్డకు పురుడు పోశారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్ కు తరలించామని ‘108’ అంబులెన్స్ సిబ్బంది తెలిపారు. ప్రజలు ‘108’ సేవలను ఉపయోగించుకోవాలని సిబ్బంది కోరారు. -
ఆడపిల్లకు జన్మనిచ్చిన భార్య.. భర్త అరెస్ట్
ముంబై: ఆడబిడ్డకు జన్మనిచ్చిన భార్యను చంపుతానంటూ బెదిరింపులకు దిగడమే కాకుండా ఆసుపత్రి సిబ్బందిని గాయపరిచిన వ్యక్తిని బరామతి(పుణే) పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. పుణేకు చెందిన కృష్ణ కాలే భార్య జూన్ 25న బరామతి డోర్లేవాడికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆడబిడ్డ పుట్టడం ఇష్టం లేని కాలే మద్యం సేవించి ఆసుపత్రికి వచ్చాడు. తాగిన మైకంలో భార్యను చంపుతానంటూ గొడవ చేశాడు. ఈ నేపథ్యంలో అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆస్పత్రి సిబ్బందిపై రాళ్లతో దాడి చేశాడు. అంతేగాక తన భార్యను అసభ్య పదజాలంతో దూషిస్తూ బెదిరింపులకు దిగాడు. (పోలీసుల దాష్టీకానికి మరో వ్యక్తి బలి) దీంతో బరామతి పోలీసులకు ఆస్పత్రి సిబ్బంది సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై బరామతి సీనియర్ ఇన్స్పెక్టర్ ఆడుంబర్ పాటిల్ మాట్లాడుతూ.. ‘కాలే ఆసుపత్రికి వచ్చి ఆడ శిశువుకు జన్మనిచ్చినందుకు భార్యను వేధించడమే కాకుండా అక్కడి సిబ్బందిపై దాడి చేశాడు. ఇక అతడిని అరెస్టు చేసి ఐపీసీ 353 (విధిలో ఉన్న ఒక ప్రభుత్వ సేవకుడిపై దాడి చేయడం లేదా క్రిమినల్ ఫోర్స్ ఉపయోగించడం), 333 (తన విధిని నిర్వర్తించడంలో ఒక ప్రభుత్వ ఉద్యోగిని తీవ్ర హాని కలిగించడం), 504 (50) (శాంతిని ఉల్లంఘించడం) 506 (నేర బెదరింపులు) సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశాం’ అని పేర్కొన్నారు. (కళ్ల ముందు హత్య: పరారైన పోలీసులు) -
పాపం
పాపం అన్నవారికి సిగ్గులేదు...అయ్యో పాపం అన్నవారికి బుద్ధిలేదు.అతడే డిసైడ్ చేస్తాడు...ఆమె ఎలా బతకాలన్నది!తల్లయినా చెల్లయినా భార్యైనా...ప్రియురాలైనా స్నేహితురాలైనా...అతడే నిర్ణయిస్తాడు వాళ్లెలా బతకాలన్నది.ఎలా బతకడం అన్నది నా హక్కయినప్పుడు... బతికి ఉండటం నా హక్కు కాదా?పోనీ... పుట్టడం అయినా నా హక్కు కాదా?పుట్టనివ్వకపోవడం పాపం కాదా?ఆ పాపం చేసిన మనిషి అపరాధి అయితే...చూసి ఏమీ చేయని మనిషి మహాపరాధి..!! ప్రపంచంలో జనాభా ఎంత పెరిగినా..ఒక మనిషి మిస్ అవడం పెద్ద విషయం.వెంటనే ఫిర్యాదు వెళుతుంది.వెంటనే పోలీస్ హంట్ మొదలౌతుంది. చుట్టాలు ధైర్యం చెబుతారు. చుట్టుపక్కల వాళ్లు ఓదార్పు ఇస్తారు. కానీ అమ్మ కడుపులోనే‘మిస్’ అయిపోయే ఆడగుడ్డు మాటేమిటి?ఫిర్యాదు చేసేదెవరు? ఉరుకులు, పరుగులు మీద వెదికేదెవరు? ‘నన్ను బతకనివ్వండి ప్లీజ్’ అని పితృస్వామ్య సమాజంలో స్త్రీ ఇంకా ఆక్రోశిస్తూనే ఉంది.‘నన్ను వేధించకండి, ఉద్యోగం చేసుకోనివ్వండి ప్లీజ్’ అని ఉద్యోగిని మౌనంగా రోదిస్తోంది.‘నన్ను చదువుకోనివ్వండి ప్లీజ్’ అని కుగ్రామంలో బాలిక కన్నీళ్లు పెట్టుకుంటోంది. ఇవన్నీ పుట్టిన తర్వాత సమాజంలో మనుగడ కోసం ఏడ్చే ఏడుపులు. ఆడపిల్లకు ఏడుపు.. పుట్టిన తర్వాతే... ఇంకా చెప్పాలంటే పుట్టుకతోనే మొదలవుతుంది అనుకుంటాం. అంతకంటే అమాయకత్వం మరోటి ఉండదు. ఆడపిల్ల పుట్టుక కోసం కూడా ఏడవాల్సి వస్తోందిప్పుడు. పుట్టింది ఆడపిల్ల అని తెలియగానే ఇంట్లో శవం లేచినట్లు ముఖాలు నల్లగా పెట్టుకునే రోజులుండేవని అప్పట్లో చదివాం. ఆ బిడ్డను బతకనివ్వకుండా గొంతులో విషపు చుక్క వేసి చంపేసే కర్కశత్వం గురించి తెలిసి చివుక్కుమన్న మనసుని చిక్కబట్టుకున్నాం. ఇప్పుడు టెక్నాలజీ అభివృద్ధి చెందింది. టెక్నాలజీని అడ్డుపెట్టుకుని అమానుషత్వం వికృతహాసం చేస్తోంది. ఆడపిల్లను పుట్టనివ్వకుండానే కడుపులోనే చిదిమేయడం వెనుక ఆ కరడుకట్టిన నిర్ణయం ఎవరిది? మన రాష్ట్రాలు ‘మగ’రాష్ట్రాలు! తెలుగు రాష్ట్రాల్లో తల్లుల గర్భాల్లో ఊపిరి పోసుకున్న నలుగురు ఆడపిల్లల్లో ముగ్గురే భూమ్మీద పడుతున్నారు. ఆ ఒక ఆడబిడ్డ పుట్టకుండానే మరణిస్తోంది! ‘సెక్స్ రేషియో ఆఫ్ బర్త్’ గణాంకాల ప్రకారం రాజస్తాన్, ఆంధ్రప్రదేశ్‌లలో వెయ్యిమంది మగపిల్లలు పుడితే ఆడపిల్లలు 806కే పరిమితమవుతున్నారు. ఈ తేడా ప్రకృతి వివక్ష కాదు, సమాజం వివక్ష. 2016 నాటి ఈ లెక్కల్లో ఈ రాష్ట్రాలు జాతీయ సరాసరి సంఖ్య 877 కంటే చాలా తక్కువలో ఉన్నాయి. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే అట్టడుగు స్థానంలో ఉన్నాయి. అంతకు మునుపు దాదాపు ఒక దశాబ్దం వెనక్కు వెళ్లినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో వెయ్యి మంది మగపిల్లలు పుడితే, ఆడపిల్లల సంఖ్య 974గా ఉంది. 2007 నాటికి కూడా వ్యత్యాసం ఉంది. అయితే అప్పటికే లింగ నిర్ధారణ చేసే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేసింది. ప్రీనాటల్ డయాగ్నోసిస్‌ను అరికట్టే చట్టమూ వచ్చేసింది. పెరిగిన విజ్ఞానంతోపాటు మనుషుల్లో జ్ఞానం, సంస్కా రం కూడా పెరిగి ఉంటే మగపిల్లలు– ఆడపిల్లల పుట్టుక మధ్య వ్యత్యాసం తగ్గిపోయేది. విజ్ఞానాన్ని కూడా మేల్ డామినేషనే ప్రభావితం చేస్తోంది కదా.. 2016 నాటికి తేడా ఏపీలో ఏకంగా 17 శాతానికి పడిపోయింది. తెలంగాణలో 2013 లో వెయ్యికి మగపిల్ల లకు 954 మంది ఆడబిడ్డలు పుట్టారు, 2016 నాటికి ఆ సంఖ్య 881కి పడిపోయింది. 2007కి– 2016కి మధ్య 2011లో ఏపీలో ఊహించని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో 993 కి చేరింది. కేరళ(954) కంటే మెరుగ్గా ఉంది. ఆ తర్వాత మళ్లీ తగ్గుతూ వస్తోంది! తల్లిపై మెట్టినింటి ఆంక్షలు ఆడపిల్ల... తాను పుట్టిన తర్వాత అయితే తన ఉనికి కోసం తానే పోరాడుతుంది. పుట్టక ముందే పిండాలను ఛిద్రం చేసే చేతుల నుంచి కాపాడేది ఎవరు? కడుపున ఆడపిల్ల పుట్టింది అంటే... అదనపు భారం అనుకున్నా, అంత్యకాలంలో అన్నానికి భరోసా ఇచ్చేది ఆడపిల్లే. అయినా... బిడ్డ పుట్టిన తర్వాత మాయమైతే ‘మిస్సింగ్’ కేసు పెట్టి వెతుక్కోవచ్చు. కడుపులోనే కనుమరుగవుతున్న బిడ్డల కోసం ఎక్కడ వెతకాలి? తల్లి కడుపులో ఛిద్రమవుతున్న బిడ్డను వెతికిపెట్టడం ఏ పోలీస్ వ్యవస్థకు చేతనవుతుంది. అసలు ఫిర్యాదు చేసేదెవరు? బిడ్డను కడుపులోనే చిదిమేస్తున్న పాపం ఎవరిదో కాదు, పూర్తిగా అమ్మానాన్నలదే. అంతకంటే సూటిగా చెప్పాలంటే... ఆ తల్లిని ఆంక్షల వలయంలో బంధిస్తున్న పురుష సమాజానిది. ‘ఆడపిల్ల పుడితే ఇంట్లో అడుగుపెట్టనివ్వం’ అని కళ్లురిమే మెట్టినింటిది. – మంజీర -
యూటూ...
కోళ్ళు కూయక ముందే నిద్దర లేచింది రాజమ్మ. లేస్తానే బిందెలు, చేంతాడు తీసుకోని బయల్దేరింది. ఒళ్ళు తెలియకుండా నిద్ర పోతున్న కూతురు సుజాతని తట్టి లేపి ‘అమ్మాయ్, లే, లేచి తలుపు గడేస్కో, నేను బాయికి పోతన్నా’ అని చెప్పి బయట పడింది.తిరిగొచ్చే సరికి తెల్లగా తెల్లారిపొయ్యింది. ఎప్పుడూ ఎండాకాల మొచ్చిందంటే ఇదే తంతు.చెర్లో ఉన్న కమ్మోళ్ళ బాయిలో చుక్క నీళ్లు ఉండవు. ఊరు మొత్తానికీ మాలోళ్ళ బాయే గతి. దాంట్లోనైనా ఇబ్బడిముబ్బడిగా ఏవీ నీళ్ళుండవు. కొంచెం కొంచెంగా జల ఊరతా ఉంటది. జనాలు రేత్తిరి తెల్లార్లూ డబ్బాలకు గాలాలేసుకోని వంతులవారీగా చేదుకుంటా ఉంటారు.ఎప్పుడు వంతొచ్చేనో ఏమో అని వరసలో నుంచోని నుంచోని ఇసుగు పుట్టి పక్కకి పొయ్యామా, అప్పుడే వంతొచ్చుద్ది, ఎనకోళ్ళు ముందుకొచ్చేత్తారు, ఇంక చివర్నే మళ్ళీ వంతొచ్చేది. ఎందుకొచ్చిన గోలనుకోని కొంతమందిఅక్కడే ఆ చెరువు కట్ట మీదే ఒక నిద్ర బోతారు తమ వంతొచ్చేదాకా. ఈ బాధలన్నీ పడలేక కొంతమంది ఆసాములు సైకిళ్ళున్నోళ్ళు పొలం బాయికో, పక్కూరి బాయికో పోయి నీళ్ళు తెచ్చుకుంటారు. అట్లా వీలు కానోళ్ళు రాజమ్మలాగే తంటాలు పడతారు. అయితే ఊళ్లోని ముసలీ ముతకా బాయికాడకొస్తే కాపోళ్ళు గదా అని పల్లె జనాలు కాస్త బరవాసాగానే పోతారు. వంతుల్తో పని లేకుండా ‘‘వరసలో రాండమ్మో’’ అనకుండా నీళ్ళు చేదిపోస్తారు. కానీ రోజు అట్టా కుదరొద్దూ?ఎవురికోళ్ళకే తొందర పనులాయె! వస్తా వస్తానే కూతుర్ని కేకలు పెట్టి పక్కలు తియ్యమని చెప్పి చీపురుతో గబగబా చిమ్మి కల్లాపు చల్తుంది రాజమ్మ. అందరికంటే ముందు పాచికసువు తీయలేకపొయ్యాననే ఇసురులో ఉంది. ‘ఇయ్యాలేందొదినా పొద్దెక్కిందాకా ఉన్నావు. మెలుకువ రాలేదా ఏంది ?’ అప్పటికే ఇంటిముంగల ముగ్గెయ్యడం పూర్తిచేస్తున్న పొరుగామె ఆరా తీసింది. ‘ఆ... ఎంత ముందు లేచినా నీళ్ళ బాయి దగ్గరే పున్నెకాలం పూర్తవుతుంది. ఒకరోజు అయితే బతిమాలీ బామాలీ వరసతో పన్లేకండా దోర్చుకుంటాం. రోజూ అడుగుతుంటే వాళ్ళు మాత్రం ఊరుకుంటారా? మాకు పనులు లేవా అని ఎదురు అడుగుతున్నారు.’‘అవునొదినా. మరీ పెద్దంతరం చిన్నంతరం లేకండా పోతంది. నిన్న మాయిటేల నీళ్ళ బాయి దగ్గర నడిం బజారోల్ల మీద అడ్డం దిరిగారు పల్లెలో కుర్రాళ్ళు. ఆ గంగి కొడుకు ఏసోబు గాడయితే మరీ పెచ్చుమీరి పోతన్నాడు. వాళ్ళనట్టా అలవాటు కానిస్తే ఎట్టా?అందుకే మీ బావకొడుకు శీనూ ఇంకా నలుగురయిదుగురొచ్చి బాయి దగ్గర దుమ్ముదులపబోయారు. పిల్లల్ని వదిలితే గోల పెద్దదయిద్దనీ ఎసోబుగాడ్ని పంచాయితీకి పిలిపిచ్చి మాట్టాడారు పేద్దోళ్ళు. వాడు పొగురుగా మాట్లాడతా మిర్రిమిర్రి చూస్తా శీనయ్య మీద కొచ్చ్సాడు. వాళ్లమ్మొచ్చి కొడుక్కి నాలుగుబెట్టి లాక్కెళ్ళింది సర్దుకు పోవాలగానీ ఏందీ తగాదాలంటా’. ‘ఏమోలే వదినా. నాల్రోజులు తాలితే అదే చల్లబడుద్దిలే. ఇయ్యాల సత్తాయి చేలో నయ్యెరువు జల్లాల. అందరూ పనులు మొదలు పెడితే పల్లెలో మంగి ముఠా కట్టిద్ది. ఇప్పుడైతే ఖాళీగా ఉన్నారు. మనుషుల్ని పిల్చకరమ్మని పొద్దుననంగా పంపా పల్లె మీదికి. వొచ్చాడేమో చూడు మీ అన్న!’’ అంటా రాజమ్మ లోపలికొచ్చింది. సుజాతకి జడలేస్తా వాళ్ళ నాన్నింకా బజారునుండి పెత్తనాలోదిలి రాలేదని సాగాదీస్తుండగానే తాగే బీడీని బైట గోడమీద బెట్టి లోపలికొచ్చాడాయన.‘మిడిమేలపు చావొచ్చిందాకా ఇట్టానే తాగు. రోగమొస్తే రోప్పోస్తే ఎట్టనా అనేదే లేదు. అవతల మీ అన్న కాడెద్దుల ఎగసాయం జేస్తా, ఎకరాలు సంపాయిస్తా ఉంటే నువ్వు మాత్రం మీ అయ్యిచ్చిన ఆ ఎకరం ముక్కలోనే పొర్లాడతా ఉండు..సిగ్గన్నా పెట్టలా మడిసి జన్మకి ..ఇంతకీ మణుసుల్ని పిల్చావా లేదా?’ఈ గొంతుకి అలవాటైపోయిన ఆయన తాపీగా చెప్పాడు.‘ఇయ్యాలెవరూ పన్లోకి రారు. మంగి కూతురు కుమారుళ్ళా.. దాని మొగుడు ఐదరాబాద్లో యాక్సిడెంటయి చచ్చిపోయాడంట. రాత్రి మేదరమెట్ట ఫోనోచ్చిందంట. శవాన్నిక్కడికి తెచ్చేసరికి రేపటేలయ్యిద్దంట..‘ ‘ఎట్టా జరిగిందంటా?’ అడిగింది రాజమ్మ‘ఏమోనే. వస్తేగానీ తెలీదు. పాపం ఊరొదిలి ఎల్లడం వాడికి బాదగా ఉన్నా, ఇద్దరాడపిల్లల్నీ బాగా చదివిచ్చుకోవాలనీ, ఈడుంటే మంగి కుమార్‌ని చేనూ చేనూ తిప్పిద్దనీ, ఐదారాబాద్లో వాళ్ళ బావ ఇళ్ళకిరంగులేసే పని జేస్తంటే ఆడనే ఎదో ఒక పని చూసుకుంటానని ఎల్లాడు. ఇప్పూడిట్టా జరిగా. ఇద్దరూ ఎంతఒద్దిగ్గా ఉంటారు పాపం’ అన్నాడు రామయ్య.పదింటికి వచ్చిన శవాన్ని చూసినోళ్ళందర్రూ ఇళ్ళకు సాంతం వెళ్ళకుండానే– ‘చేతిలో చిల్లి గవ్వ లేకుండా ఆ పిల్లల్నేట్టా నెట్టాల కుమారి. యాక్సిడెంట్ డబ్బులొస్తే పెళ్ళిజేసి అది కూలో నాలో జేసుకు బతకడమే’నని తేల్చారు. రాజమ్మమాత్రం మొగుడులేనిల్లు ఊరందరికీ అలుసైద్దనీ కాయలున్న చెట్టుకే రాళ్ళదెబ్బలనీ అంది. కొన్నాళ్ళు పిల్లలిద్దర్నీ బడికి పంపింది కుమారి. పెద్దదయిందగ్గర నుండి బరువు పెరిగిద్దనీ పెళ్ళి జేయ్యమని అందరూ తొందర పెట్టడంతో సుజాతోళ్ళ పెద్దయ్య దగ్గర డబ్బు తెచ్చి పెద్దకూతురి పెళ్లి చేసింది.చిన్న కూతురు దేవిని సుజాతతో పాటు హైస్కూల్‌కి పంపింది. దేవి ఎనిమిదో తరగతి సుజాత పది. మనిషి నలుపైనా దేవి ఎంత అందంగా ఉండేదో.నవ్వే కళ్ళతో మెరిసిపోతా ఉండేది. గలగలా మాట్లాడ్డం మొదలు పెట్టిందంటే చుట్టూ ఉన్నోళ్ళు అట్టా నోర్లు తెరుచుకోని ఇంటానే ఉండేవాళ్ళు. అంత అయిస్కాంతం ఆ పిల్ల. తొమ్మిది అయిపోగానే పెద్ద పిల్ల పురుళ్లనీ, అయ్యనీ, ఇయ్యనీ డబ్బుల్లేక దేవిని చదువు మాన్పించేసింది కుమారి. పొలంపనులకి తీస్కెళ్ళడం మొదలుపెట్టింది.పత్తి చేలల్లోఊళ్ళో వాళ్ళందరూ ఒక వరసగా, తరువాత పల్లెలో వాళ్ళందరూ ఒక వరుసగా సాళ్ళు పట్టుకుని పనిజేసేవాళ్ళు. సాళ్ల మధ్యలో ఎవరికిష్టమైన యవ్వారాలు వాళ్ళు పెట్టుకునే వారు. కుమారి సాల్లో ఉండి పనిజేస్తే, దేవి మనిషెత్తు సాళ్ళు దాటి అందరి ఒళ్ళల్లో పత్తి తీసుకుని గోతాలకేసుకుని, గట్టు మీదున్న శీనయ్యకి అందిచ్చేది. ఎప్పుడూ గలగలా మాట్లాడతానే ఉండే పిల్లకి పాపం నోరు తెరిచే తీరికుండేది గాదు. బడి మానేసినాక ఈ రెండేళ్ళలో దేవి యవ్వనోత్సాహంతో మరింత అందంగా తయారయింది. పొలంలో దిగిం దగ్గర్నించీ ఆ పిల్లని కూర్చోనివ్వరు, నుంచోనివ్వరు. వొడినిండిందనో, మంచి నీళ్ళనో పిలుస్తానే ఉండేవాళ్ళు. వీటికి తోడు గట్టు మీదనుంచి శీనయ్య గోతాలెత్తాలనో, కుట్టాలనో చీటికి మాటికి పిలుస్తా ఉండేవాడు. ఒకరోజు శీనన్న అట్ట పిలిచినప్పుడు దేవి సుజాతని తోడు రమ్మంది. ఇది గమనించిన శీను ‘‘సుజాత వల్ల కాదులే, నువు రా’’ అని గట్టిగా పిలిచాడు. దేవి అయిష్టంగా కదిలి వెళ్ళింది.ఏదో తేడాగా అనిపించింది సుజాతకి. ఆ మాటే అంది వాళ్ళమ్మతో సాయంత్రం. ‘అసలా గోతాలు వాడేత్తుకోలేకనా. ఆ సోంబేరోడు దేనికీ కాకుండా పోతున్నాడు.గాలెవ్వారాలెక్కువౌతున్నాయి. ఈడు మొగపిల్లోడనీ, వంశాన్ని నిలబెడతాడనీ ఉన్న పొలమంతా మీ తాత పెదయ్యకి బెట్టె. మీ అయ్యకేమో గొర్రెలూ బర్రెలూ ఇచ్చి బయటకి పంపే. నోరున్నోడి మాటే చెల్లిద్ది. ఈడెమో సదువూ సంధ్య లేకుండా ఊరు మీద దిరుగుతున్నాడు. ఈడికి కాదుగానీ దానికి జెబుతాలే’ అంది వాళ్ళమ్మ. వాళ్ళమ్మ మాటతో సుజాతకి ఊరట కలిగింది. అమ్మ ఎప్పుడూ అంటుంది. మగపిల్లల జోలికి వెళ్ళకూడదు. వాళ్లోస్తే ఊరుకోకూడదు. గట్టిగా బుద్ది జెప్పాలనేది.ఒకరోజు పొద్దున్న ‘అమ్మాయి సుజాతా ... నాకు చేలో ఉమ్మరంగా పనుంది గానీ, తొందరగా పన్జేసుకొని కొట్టం కాడికెళ్ళమ్మా బర్రీనేటట్టుంది’ అని చెప్పి రాజమ్మ బయటికెళ్ళింది. అమ్మ వెళ్ళిం తర్వాత మిగిలిపోయిన పనులు చేయటానికి సిద్దం అయింది సుజాత. ఇంతలో గోడవతలనుండి శీనన్న పిలవడంతో బయటకొచ్చింది. ఎందన్నాయ్ ‘ అంటా దగ్గరకెళ్ళింది. ‘అమ్మోల్లు పొలం ఎల్లారా? ...నువ్వు కొట్టం దగ్గరకి వెళ్లొద్దులే. బర్రె పని నేను జూస్తాలే’ అన్నాడు. ఎప్పుడూ పనందుకొని శీనన్న ఇలా అనటంతో సుజాతకి ఆశ్చర్యం వేసింది. వద్దులే అందామనుకొని ఏదో విషయం ఉందని అర్ధమయ్యి ‘ఎందుకన్నాయి?’ అంది.‘ఏం లేదులే ...మొన్న నేను దేవితో ఉన్నప్పుడు వాళ్ళ మామ ఏసోబు గాడు చూశాడు’ అన్నాడు నంగినంగిగా. ‘వాడు దాన్ని కొట్టాడు. అది నామీద చెప్పింది వాడికి. వాడు నామీద కోపంగా ఉన్నాడు. నన్నేమనలేక నిన్నేమన్న అంటాడేమోనన్లే ...జాగర్తగా ఉండు.’ అనెళ్ళాడు. అన్నమాటలకి సుజాత బిత్తరకపోయింది. ఎంత తేలిగ్గా చెప్పెల్తన్నాడు!. ఏసోబు, వాళ్ళమ్మ దేవినేమన్నారో. ఆ పిల్ల ఎంతేడుస్తుందో. ఏసోబుకి నిజంగానే కోపం వచ్చుంటుంది. మొన్న అంజమ్మత్త చెప్పిన బాయికాడ సంగతి గుర్తొస్తే భయమేసింది. వీడు జేసిన పనికి నిజంగా నన్నేమన్నా అంటాడేమో. ఇంట్లో ఉన్నా భయం పుట్టేట్టు జేశాడు. చేసిందంతా చేసి ఇప్పుడు నాకు జాగ్రత్త చెబుతున్నాడు. మా పెద్దయ్యోల్లకు తెల్సో లేదో. ఎవరికన్నా జెప్తే శీనన్నాయ్ ఏమంటాడో ...శీనన్న బర్రెదగ్గరకి వెళ్ళాడో లేదో. చెప్పింది చేస్తాడని లేదుబర్రీనుంటే? ఏంకాదులె అనుకోని కొట్టంకాడికి బయల్దేరింది. ఇల్లు మూలదాటి గొందిలోకి ఎళ్ళగానే హటాత్తుగా ఎదురయ్యాడు ఏసోబు. వేగంగా అడుగులేస్కుంటా వస్తున్నాడు.. తనకోసమే వస్తున్నాడా? భయమేసింది. గబుక్కున వెనక్కు తిరిగింది. ఏసోబు పిలుస్తున్నా వెనక్కి తిరగలేదు. పరుగులాంటి నడకతో ఇంట్లోకొచ్చిపడింది.అమ్మకోసం ఎదురు చూస్తా కూర్చుంది సుజాత. తప్పుజేస్తే అమ్మ ఎవర్నైనా ఊరుకోదు. ఇవ్వాళ శీనన్నకి బాగా గడ్డిబెట్టిద్ది. పెద్దయ్యోళ్లతో తగాదయినా సరే. ‘ఏందే బర్రె దగ్గరకెళ్ళ లేదు? బర్రీనిందని ఏసోబు చెబుతున్నా వినిపించోకుండా వచ్చావంట.’ అంది రాజమ్మ లోపలికొస్తానే. జరిగిందంతా చెప్పింది సుజాత. ‘ఆ సన్నాసోడికేం పొయ్యేకాలమొచ్చింది. దాన్నలరిపాలు చెయ్యడానికి. ఈడిలాగే అందరూ ఎదవ పనులు జేస్తారంటనా. వాళ్లట్టాటోళ్ళుకాదు. ఏసోబు మాట కటువైనా మనిషి మంచోడు. అయినా ఊళ్ళో వాళ్ళ జోలికి రావడం అంత తేలికా’ అంది రాజమ్మ.ఆ రాత్రి కుమారి రాజమ్మ దగ్గరకొచ్చింది. ‘అక్కాయ్ గ్రేడు పనులు మొదలు పెడితే చెప్పు మేం కూడా వస్తాం.’ దిగులు గొంతుతో అంది కుమారి. సరేలే కుమారీ అట్టనే వద్దువు... విషయం తెలిసిందిలే. అయినా దానికైనా జాగర్త ఉండొద్దా. ఎవురేందో తెలియోద్దా.. నువ్వయినా చేప్పొద్దా.’ అంది.అమ్మ మాటలో, గొంతులో ఏదో తేడా అనిపించింది సుజాతకి. ‘నాకేం తెలుసక్కాయి ఇట్ట జేస్తాడనీ.... ఈడ పెరిగిన పిల్ల కాదాయె. దానికేందెలుసు..... అయినా ఆ మనిషే ఉంటే.... ఎన్ని అనుకున్నాడు..’ దుఃఖంతో కుమారి గొంతు పూడుకుపోయింది.‘ఇప్పుడు ఏడిచి ఏం లాభం కుమారీ... ముం దుండాలి. ‘అంది రాజమ్మ.కాసేపు మాట్లాడి కుమారి వెళ్ళిపోయింది.అమ్మ మాట్లాడాల్సినవేవో మాట్లాడలేదనిపించింది సుజాతకి ‘‘పాపం దేవిమా ...’ అంది సుజాత వాళ్ళమ్మ మొహంలోకి చూస్తూ.‘ఏమయ్యిద్ది .. దానికి తెలియోద్దంటే జాగర్త? ఎదురెళ్ళి తెచ్చుకుంటారనుకుందా? ఆ ఏసోబు గాడికిచ్చి ముడి పెట్టేస్తార్లే ’’ అంది తేలిగ్గా .సుజాతకు అమ్మ కొత్తగా కనిపించింది. అమ్మ ఎందుకు ఇంత కటువుగా మాట్లాడుతుంది. శీనన్న మీద అమ్మకెప్పుడూ మంచి అభిప్రాయం లేదు. చిన్న విషయాల దగ్గర కూడా తిడుతుంది. కానీ ఇప్పుడు శీనన్న మీద రావల్సినంత కోపం రాలేదెందుకనీ. పైగా దేవినే తప్పుబడుతూ మాట్లాడింది. పొలంలో దేవి గురించి అమ్మ జాగ్రత్త దేవి గురించేనా?అమ్మ గురించి చెడ్డగా అనుకోలేకపోయింది.ఏసోబు మంచితనం మీద అమ్మ నమ్మకానికి, మనజోలికి రాలేడనే ధీమాకి మధ్య ఎదో సంబంధం ఉన్నట్లనిపించింది సుజాతకి .కానీ అదేమిటో తెలీలేదు.ఆ రాత్రి నిద్ర పోలేదు సుజాత. -ఝాన్సీరాణి -
నాకది పునర్జన్మ: సెరెనా
లాస్ఏంజెల్స్: మహిళలకు తొలి కాన్పు పునర్జన్మతో సమానం అనేది మనదగ్గర చెప్పుకొనే మాట. సరిగ్గా ఇలాంటి పరిస్థితినే అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ కూడా ఎదుర్కొంది. ఆమె గతేడాది సెప్టెంబర్‌లో అమ్మాయి (ఒలింపియా)కి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా తీవ్ర ఆరోగ్య సమస్య ఎదురైనట్లు సెరెనా వివరించింది. ‘బిడ్డ పుట్టాక నేను దాదాపు చనిపోయినంత పనైంది. నాకది నిజంగా పునర్జన్మే. గుండె స్పందన క్రమేపీ పడిపోతుండటంతో అత్యవసరంగా సిజేరియన్ చేయాల్సి వచ్చింది. అదృష్టవశాత్తూ శస్త్రచికిత్స విజయవంతమైంది. అంతకుముందే పాప పుట్టినట్లు తెలిసింది’ అని వివరించింది. ధమనుల్లో గడ్డకట్టిన రక్తం ఊపిరితిత్తుల్లోకీ చేరనుండటం సెరెనాకు ఇబ్బంది తెచ్చిపెట్టింది. ‘శస్త్రచికిత్స అనంతరం శ్వాస సమస్య తలెత్తింది. విపరీతమైన దగ్గు వచ్చింది. ఆస్పత్రివారు సీటీ స్కాన్ చేయించారు. ఉదర ప్రాంతంలో రక్త ప్రసరణ సమస్యను గుర్తించారు. ప్రాణాలు నిలిపే పరికరాలు బిగించారు. ఈ కారణంగా ఆరు వారాలపాటు మంచంపైనే ఉంటూ మాతృత్వ మధురిమలను ఆస్వాదించాల్సి వచ్చింది’ అని వివరించింది. సెరె నా... ఈ నెలలో టెన్నిస్‌లోకి పునరాగమనం చేసింది. అక్క వీనస్‌తో కలిసి ఫెడ్ కప్ బరిలో దిగింది. -
హిందువులు నలుగురిని కనాలి
సాక్షి, బెంగళూరు: హిందూ దంపతులు నలుగురు పిల్లలకు జన్మనివ్వాలని హరిద్వార్‌లోని భారతమాత మందిర పీఠాధిపతి గోవింద్ దేవ్ గిరీజీ మహాదేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో హిందూ జనాభాను పెంచి భారత్ నుంచి ఏ ప్రాంతం విడిపోకుండా చూడొచ్చని అన్నారు. కర్ణాటకలోని ఉడుపిలో జరుగుతున్న ధర్మ సంసద్ హిందూ సదస్సులో శనివారం ఆయన మాట్లాడారు. ‘ప్రస్తుతం హిందువులు, మనమిద్దరం.. మనకు ఇద్దరు అన్న రీతిలో ఆలోచిస్తుండటం వల్ల దేశంలోని కొన్ని ప్రాంతాల్లో హిందూ జనాభా తగ్గిపోతోంది. దీంతో అక్కడ హిందూ ప్రాభవం మసకబారుతోంది. ఫలితంగా వారిలో భారత్ నుంచి విడిపోవాలనే భావన కలుగుతోంది. దీనికి పరిష్కారంగా ప్రతి హిందూ దంపతులు నలుగురు పిల్లలకు జన్మనివ్వాలి. దాని వల్ల భౌగోళిక, ధార్మిక సమతుల్యత ఏర్పడుతుంది’ అని వివరించారు. -
ఆ బాలికకు బాబు పుట్టాడు!
సాక్షి, ముంభై: అత్యాచార బాధితురాలు, మైనర్ బాలిక(13) మగబిడ్డకు జన్మనిచ్చింది. సుప్రీంకోర్టు ఆమె గర్భ స్రావానికి అనుమతి ఇచ్చిన అనంతరం వైద్యులు ఆమెకు సిజేరియన్ చేశారు. కోర్టు అనుమతి ఇచ్చిన రెండు రోజుల తరువాత వైద్యులు శుక్రవారం ఈ ఆపరేషన్ నిర్వహించారు. తండ్రి స్నేహితుడి దుర్మార్గానికి బలై, ముక్కుపచ్చలారని ప్రాయంలో బిడ్డకు తల్లి అయింది. బాలిక వయస్సు, బాలిక ఆరోగ్యం కారణం నంగా సాధారణ డెలివరీ సాధ్యం కాకపోవడంతో సిజేరియన్ పద్ధతిని ఎంచుకున్నామని ముంబై జేజే ఆసుపత్రి వైద్యులు తెలిపారు. నెలలు నిండని కారణంగా బాబు తక్కువ బరువుతో (1.8కిలోలు) పుట్టాడని, దీంతో నవజాత ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్ఐసియు) లో ఉంచినట్టు చెప్పారు. శిశువు పరిస్థితిని సమీక్షిస్తున్నామని, అలాగే బాలిక కనీసం వారం రోజుల పాటు ఆసుపత్రిలో ఉండాల్సి ఉంటుందని తెలిపారు. గైనాలజీ విభాగం అధిపతి డా. అశోక్ ఆనంద్ చెప్పారు. అయితే బిడ్డను తమతో ఉంచుకోవాలా లేదా అనేది బాలిక కుటుంబం ఇంకా నిర్ధారించుకోలేదు. బాలిక మానసిక పరిస్థితి, మెడికల్ బోర్డు నివేదికను పరిశీలించిన అత్యున్నత ధర్మాసనం అబార్షన్‌కు అనుమతి ఇచ్చింది. 31 వారాల గర్భాన్ని తొలగించే క్రమంలో తల్లి ప్రాణానికి కూడా ముప్పు రావచ్చని మెడికల్ బోర్డు హెచ్చరించినప్పటికీ.. అబార్షన్ చేయించడానికి సుప్రీం కోర్టు అంగీకరించింది. కాగా ఏడు నెలల క్రితం బాలికపై ఆమె తండ్రి వ్యాపార భాగస్వామి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక బరువు పెరగడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఆగష్టులో హాస్పిటల్‌కు తీసుకెళ్లగా.. 27 వారాల గర్భంతో ఉందని డాక్టర్లు తేల్చారు. దీంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో బాలికపై పలుమార్లు అత్యాచారం చేసినట్లు నిందితుడు అంగీకరించిన సంగతి తెలిసిందే. -
పాము పిల్లలకు ఎలా జన్మనిస్తుంది..వైరల్ వీడియో
సాక్షి, ప్రత్యేకం: పాములు పిల్లలకు ఎలా జన్మనిస్తాయో మీకు తెలుసా?. తెలియకపోతే ఎప్పుడైనా తెలుసుకోవాలని అనిపించిందా?. అలా పాముల గురించి తెలుసుకోవాలని కూతూహలం ఉన్న ఓ వ్యక్తి అందులో ఎట్టకేలకు విజయం సాధించాడు. పాము పిల్లలకు జన్మనిస్తున్న దృశ్యాన్ని ఫోన్లో షూట్ చేశాడు. దాన్ని ఆన్లైన్ షేర్ చేశాడు. అంతే ఆ వీడియో వైరల్ గా మారింది. మరి మీరు కూడా పాము పిల్లలకు ఎలా జన్మనిస్తుందో చూసేయండి..! -
బిడ్డకు జన్మనిచ్చి తల్లి మృతి
పగిడ్యాల: బిడ్డకు జన్మనిచ్చి తల్లి మృతి చెందిన ఘటన శనివారం పగిడ్యాలలో చోటుచేసుకుంది. గ్రామంలోని దేవనగర్ కాలనీకి చెందిన బోరెల్లి శ్రీనివాసులు భార్య మల్లేశ్వరీ(25) రెండో సారి కాన్పుకు గురువారం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో సాధారణ ప్రసవంగా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవానంతరం అధిక రక్తస్రావం ఏర్పడి తల్లి కోమాలోకి వెళ్లి శనివారం తెల్లవారుజామున మృత్యువాత పడింది. -
కొత్త తలుపు
తలపు ఒక తలుపు మంచి ఆలోచన ఉంటే మంచి వాకిళ్లు స్వాగతం చెబుతాయి. జన్మ జన్మలు ఆ మంచితోనే ముడిపడి ఉంటాయన్నది నమ్మకం. ఒక జన్మలో తీరని తృష్ణ మరు జన్మలో ఎందరి దాహమో తీర్చే సేవగా మారవచ్చు. అటు జన్మ, ఇటు జన్మ గురించి అంత కచ్చితంగా చెప్పలేం కానీ, ఈ జన్మకు మంచి పని చేస్తే తిరిగి మంచి జరుగుతుందని ఒక అందమైన కొత్త తలపు, కొత్త తలుపు తెరుచుకుంటుందని నమ్ముతాం. వళ్లంతా పుళ్లు వాటి నుంచి కారుతున్న రసి. ముక్కుతూ మూలుగుతూ మట్టికొట్టుకుపోయిన దేహాలు. వారి నుంచి ముక్కులు పగిలిపోయేటంత దుర్గంధం. దూరం నుంచి చూస్తుంటేనే కడుపులో తిప్పినట్టు అవుతోంది. అలాంటిది, వారిని చేత్తో ఆప్యాయంగా నిమురుతు న్నాడు. వాళ్లు వద్దని మొరాయిస్తున్న కొద్దీ బతిమిలాడుతూ జుట్టు కత్తిరించి, స్నానం చేయిస్తున్నాడు. పుళ్లకు మందు రాసి, బట్టలు వేస్తున్నాడు. అమ్మలా గోరుముద్దలు తినిపిస్తున్నాడు. ఈ పనులన్నీ ఏ విసుగూ లేకుండా చేస్తూ దేవదూతలా కనిపిస్తున్న ఆ వ్యక్తిని తదేకంగా చూస్తూ నిల్చుండిపోయాడు వాసుదేవరావు. సూటు బూటు వేసుకుని శ్రీమంతుడిలా ఉన్న వాసుదేవరావును అనుమానంగా చూస్తూ అక్కడి వాచ్మెన్ ‘సార్..’ అని గట్టిగా పిలిచాడు. ఉలిక్కిపడి చూశాడతడిని. ‘‘ఎవరు మీరు! ఏం కావాలి..’’ అన్నాడు వాచ్మెన్. ‘‘అతను.. అతను.. నా కొడుకు...’’ అనాథలకు సేవ చేస్తూ వారే లోకంగా ఉన్న అతడిని చూపించాడు. ‘‘అవునా!’’ ఆశ్చర్యపోతూనే అభిమానంగా ‘‘రండయ్యా! రండి, లోపలికి రండి. ఇక్కడ కూర్చోండి. సార్‌ని పిలుచుకొస్తా!’’ సాదరంగా తోడ్కొని కుర్చీలో కూర్చోబెట్టి గబగబా వెళ్లాడు అతను. విధి... విలాసం ఆశ్రమంలో అందరితో పాటు భోజనం చేస్తున్నాడు వాసుదేవరావు. అందరికీ కొసరి కొసరి వడ్డిస్తున్నాడు తన కొడుకు సాకేత్. అతని మొహంలోని ప్రశాంతతను, ఆనందాన్ని చూస్తున్నాడు వాసుదేవరావు. అందరూ సాకేత్‌ని దేవుడిలా చూస్తున్నారు. కానీ, తనకు మాత్రం ఇంకా కొడుకు భవిష్యత్తే కనపడుతోంది. కళ్ల ముందు మాత్రం తను నిర్మించుకున్న సామ్రాజ్యం కదలాడుతోంది. తను వయసులో ఉన్నప్పుడు ఉన్న ఊళ్లో ఆస్తులమ్ముకొని విదేశాలకు వెళ్లాడు. అక్కడ బిజినెస్ పెట్టి భారీగా సంపాదించాడు. భార్య, కూతురు, కొడుకు.. కోట్లలో ఆస్తులు. దేనికీ లోటు లేదు. మంచి స్థితిమంతుడికి కూతురినిచ్చి పెళ్ళి చేశాడు. ఇక మిగిలింది సాకేత్ ఒక్కడే. ఇంజనీరింగ్ చదివించాడు. తన బిజినెస్‌లను చూసుకునేవాడు. ఆరేడేళ్ల్ల క్రితం ఓ రోజు.. ‘‘నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను డాడీ. మన దేశానికి వెళతాను’’ అన్నాడు. ఆశ్చర్యపోయాడు తను. ‘‘నువ్వు పుట్టిందీ పెరిగిందీ ఇక్కడే. మనదేశానికి వెళతాను అంటావేంటి?’’ ఆశ్చర్యపోతూ అడిగాను. ‘‘ఏమో, ఈ ప్రాంతం నాది కాదనిపిస్తోంది. నేను ఈ వ్యాపారాలు కాకుండా ఇంకా ఏదో చేయాలనిపిస్తోంది..’ అన్నాడు సాకేత్. ‘‘అదేంట్రా.. పెళ్లి చేసుకొని హాయిగా ఉండక. ఎక్కడెక్కడికో వెళతానంటావేంటి’’ అంది తల్లి. ‘‘లేదమ్మా! అక్కడ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి’’ అన్నాడు సాకేత్. తండ్రీ–కొడుకు మధ్య వాదనలయ్యాయి. తల్లి ఏడుపు, తండ్రి నిష్టూరం.. ఏమీ పట్టించుకోలేదు సాకేత్. ఓ రోజు.. ఉదయాన్నే సాకేత్ రూమ్‌లో ఓ లెటర్ దొరికింది. తను వెళ్లిపోతు న్నానని, తన కోసం వెతకద్దని రాసుంది అందులో. వాసుదేవరావు కొడుకు మీద ఆశలు వదిలేసుకున్నాడు. భార్య ఏడుస్తూనే కాలం గడుపుతోంది. ఏళ్లు గడుస్తున్నాయి.. ఈ మధ్య కొడుకు మీద బెంగ ఎక్కువై భార్య మంచం పట్టింది. ఇన్నేళ్లకు సాకేత్ ఉన్న చోటు తెలిసింది వాసుదేవరావుకి. ఆగమేఘాల మీద బయల్దేరాడు. బతిమాలో, బామాలో వెంటతీసుకుద్దామని. ఏది సామ్రాజ్యం? కానీ, తను ఇక్కడ చూస్తున్నది వేరు. అనాథలకు సేవ చేస్తూ.. వారి మలమూత్రాదులు ఎత్తుతూ వారిని కంటికి రెప్పలా సాకుతూ అదే జీవితంలా సాకేత్ కనిపించాడు. ఒంటరిగా ఉన్న సాకేత్ దగ్గరగా వెళ్లాడు వాసుదేవరావు. ‘‘సాకేత్.. నీ మీదే ఆశలెన్నో పెట్టుకున్నాం మీ అమ్మా నేను. నీ కోసం ఓ అందమైన సామ్రాజ్యాన్నే నిర్మించాను. అవన్నీ వదిలేసి అనాథల మధ్య నువ్వు గడుపుతున్న జీవితం చూస్తుంటే బాధగా ఉంది. ఇంత మంది ముసలీ, ముతకను ఆదరిస్తున్న నీవు ఈ వయసులో ఈ ముసలితల్లిదండ్రులను ఎందుకు దూరం చేస్తున్నావ్! అక్కడ నీ తల్లి బెంగతో మంచంపట్టింది. మమ్మల్ని అనాథలను చేయకు. ఇప్పటికైనా పోయిందేమీ లేదు. వీళ్లందరి కోసం డబ్బులు పంపిద్దాం. మంచి కేర్‌టేకర్‌ని పెడదాం. మన ఇంటికి వచ్చేయ్!’ అన్నాడు కొడుకును బతిమాలుతూ! ‘‘డాడీ, నన్ను వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చారు. చాలా సంతోషం. అమ్మను కూడా ఇక్కడకే తీసుకురండి వ్యాపారాలన్నీ ఎవరికైనా అప్పజెప్పండి. అంతా ఇక్కడే ఉందాం’’ అన్నాడు సాకేత్ అంతకుమించి మాట్లాడటానికి ఏమీ లేదన్నట్టు. గతం ఏం చెబుతోంది? ‘‘సాకేత్.. మీరు గతాన్వేషణలో ఉన్నారు. ఇప్పటి నుంచి 10 ఏళ్లు, అటు నుంచి 20 ఏళ్ల క్రితం వరకు మీ జీవితాన్ని దర్శించండి. ఆ అన్వేషణలో మిమ్మల్ని కలచివేసిందేంటో వివరించంyì ’’ అన్నారు కౌన్సెలర్.తండ్రి బలవంతమ్మీద పాస్ట్‌లైఫ్ రిగ్రెషన్ థెరపీకి వచ్చాడు సాకేత్. అషైశ్వార్యాల మధ్య పెరిగినవాడు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో తెలుసుకోవాలని ఉందని వాసుదేవరావు పట్టుబట్టాడు. సాకేత్ సరేననడంతో థెరపీ మొదలైంది. ఎంతో ప్రశాంతంగా, మరెంతో నిశ్శబ్దంగా ఉన్న ఆ గదిలో కౌన్సెలర్ ముందున్నారు సాకేత్, వాసుదేవరావు. మెత్తటి వాలుకుర్చీలో విశ్రాంతిగా కళ్లు మూసుకుని కూర్చున్నాడు. థెరపీలో సాకేత్ అంతర్‌ప్రయాణం మొదలైంది. క్షణాలు.. నిమిషాలు గడుస్తున్నాయి. సాకేత్ అంతర్‌ప్రయాణం మొదలైంది. ఇరవై ఏళ్ల క్రితం జీవితాన్ని వివరిస్తున్నాడు సాకేత్... ‘‘నా తల్లి, తండ్రి నన్ను అపురూపంగా చూసుకుంటున్నారు. ఏం కావాలన్నా క్షణంలో అమర్చుతున్నారు. చదువులో మంచి మార్కులు, చెల్లిలితో పోట్లాటలు.. ’ అంతా ఆనందంగా ఉంది...’’ చెబుతున్న సాకేత్‌ని మరో పదేళ్ల వెనక్కి.. ఆ తర్వాత తల్లి గర్భంలో ఉన్నప్పటి స్థితిని వివరించండి...’’అన్నారు కౌన్సెలర్. వాసుదేవరావు కొడుకు చెబుతున్న విషయాలను ఆసక్తిగా ఆతృతగా వింటున్నాడు. కాసేపు నిశ్శబ్దంగా ఉన్న ఆ గదిలో సాకేత్ చెప్పడం మొదలుపెట్టాడు.. ‘‘నేనో కాంతిగోళం నుంచి అణువంత వెలుగునై ఓ చీకటి గుహలోకి చేరుతున్నాను. అది నా తల్లి గర్భం. కానీ, నాలో అంతులేని అలజడి. ఈ జన్మను నేను సార్థకం చేసుకోగలనా?!’’ అనిపిస్తోంది సాకేత్ వివరణ వింటున్న కౌన్సెలర్ ‘‘ఎందుకు అలజడి? దానికి గల కారణాన్ని అన్వేషించాలంటే మీరింకా వెనక్కి ప్రయాణించండి. అక్కడ ఏం జరుగుతుందో దర్శించండి’’ అన్నారు. కౌన్సెలర్ సూచనలు అందుతున్నాయి సాకేత్ కి. మెళ్లగా అతని చెవులకు ఎంతోమంది ఆక్రందనలు వినపడటం మొదలుపెట్టాయి. కనులు మూసుకొని ప్రశాంతంగా నిద్రిస్తున్నట్టు ఉన్న సాకేత్ మొహం ఒక్కసారిగా ఉద్వేగంగా మారిపోయింది. అలమటించే అభాగ్యులు సాకేత్ మíస్తిష్కంలో కనిపిస్తున్నది వివరిస్తున్నాడు. ‘‘నేనో గూడెంలో ఉన్నాను. ఆ గూడెం నాయకుడి సేవకుడిని నేను. అతనేం చెప్పినా ఎదురుచెప్పకుండా పనులు చేయాల్సిన విధి నాది. ఓ సారి మా ప్రాంతంలో తీవ్రమైన కరువొచ్చింది. అయినా, అక్కడున్న వనరుల వల్ల మా గూడెంలో తిండికీ, నీటికి పెద్ద కష్టాలు రాలేదు. కానీ, మా పొరుగు గూడెం జనం తిండికీ, నీళ్లకూఅలమటిస్తున్నారు. వాళ్ల అవసరాలు తీర్చుకోవడానికి మా గూడేనికి వచ్చి మొరపెట్టుకున్నారు. కానీ, మా నాయకుడి హృదయం కరగలేదు. పిల్లల ఆకలి తీర్చలేక నిస్సహాయ స్థితిలో వాళ్లలో కొందరు ఎదిరించారు. ఎదిరించిన వారిని చెట్లకు కట్టేసి భయానకంగా కొట్టించాడు మా నాయకుడు. వాళ్ల ఒళ్లంతా రక్తసిక్తమయ్యాయి. వాళ్ల పరిస్థితికి నా కడుపు తరుక్కుపోయింది. వాళ్ల కష్టాలు చూసి తిండి సహించేది కాదు. నిద్రపట్టేది కాదు. మా గూడెం కట్టుబాట్ల ప్రకారం నాయకుడికి తెలియకుండా ఏ పనీ చేయకూడదు. కానీ, నాయకుడు లేని సమయం చూసి వాళ్లకు నీళ్లు, తిండి సాయం చేశాను. ఇది మా నాయకుడికి తెలిసింది. నాలాగ మిగతావాళ్లు తనను ధిక్కరిస్తారని నన్ను ఉరి తీయమని ఆదేశించాడు. అప్పుడే అనుకున్నాను. ‘సాటి జీవులపై కరుణ చూపని ఈ జన్మ ఎందుకు?. ఆకలితో, దాహంతో అలమటిస్తున్నవారికి గుక్కెడు నీళ్లు, బుక్కెడు తిండి పెట్టని జన్మ వృథా. నేను నేనుగా ఎదగాలి, దీనులకు నాకు చేతనైన సాయం చేయాలి’ అనుకున్నాను. సేవ చేయడానికే ఈ జన్మ తీసుకున్నాను. నా విధిని నేను నిర్వర్తిస్తాను’’ అని చెబుతున్న సాకేత్ దృఢనిశ్చయం అబ్బురమనిపించింది వాసుదేవరావుకి. స్వదేశంలో... భార్యతో సహా తిరిగి స్వదేశానికి చేరుకున్నాడు వాసుదేవరావు. కొడుకు చేస్తున్న సేవలో తనూ భాగస్తుడయ్యాడు. ఆనందం కోట్లు ఖర్చుపెట్టి కట్టుకున్న కోటల్లో ఉండదని, ఎదుటివాడి కష్టం తీర్చడంలో ఉందని కొడుకు ద్వారా గ్రహించాడు. అదే ఈ దశలో నేర్చుకోదగిన పాఠం అని గుర్తించాడు. సేవలోనే కర్మ ప్రక్షాళన సృష్టి అంతటా ఉన్న చైతన్యం మనలోనూ ఉంది. ఆ చైతన్యం తప్పకుండా ఎదగాల్సి ఉంటుంది. ఇవ్వడంలో దివ్యత్వం మనలో ప్రవేశిస్తుంది. అందుకే ఇచ్చేవారిలో ఈశ్వరుడు ఉంటాడు అంటాం. అలాగే సేవాభిరుచిని నారాయణడి సేవతో పోల్చుతాం. నర అంటే శరీరం. ఆయణ అంటే శక్తి. ఈ దైవత్యం ఒకరి నుంచి ఒకరికి ప్రవహించాలి. సేవలోనే కర్మల ప్రక్షాళన జరుగుతుంది. కర్మలు నశించినప్పుడు మోక్షప్రాప్తి లభిస్తుంది. భగవద్గీత, బైబిల్, ఖురాన్ చెప్పినవి ఇవే! – డాక్టర్ హరికుమార్, జనరల్ సర్జన్, బ్లిస్ఫుల్ లైఫ్ ఫౌండేషన్, హైదరాబాద్ ‘నేను ఎవరిని...’ అనే ప్రశ్న ఉదయించాలి ఆత్మ పరిణతి చెందేంతవరకు మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటూనే ఉంటుంది. పుట్టుక నుంచి మరణం వరకు మనిషి జీవన దశలు ఏ విధంగానైతే ఉంటాయో ఆత్మ దశలు అలాగే ఉంటాయి. శైశవ ఆత్మలు: ఈ దశలో ఉన్నవారిలో జంతు ప్రవృత్తి అధికం. ఆహారం కోసం, స్త్రీ కోసం, ధనం కోసం ఒకరినొకరు చంపుకోవడం ఉంటుంది. యువ ఆత్మలు: డబ్బు సంపాదన, కీర్తి కండూతి, కుటుంబ బంధాలు కోరుకుంటారు. ప్రస్తుతం సమాజం ఈ దశలోనే ఉంది. వృద్ధాత్మలుపై రెండు దశలు దాటిన తర్వాత ‘నేను ఎవరిని’ అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఇక్కడే వృద్ధాత్మలుగా పరిణతి చెందుతారు. అప్పుడే సాటి జీవుల పట్ల కరుణ, దయ కలుగుతాయి. ప్రేమను పంచుతారు. ప్రస్తుత సమాజంలో వీటి సంఖ్య చాలా చాలా తక్కువ. కోటికి ఒకరుగా ఉంటున్నారు. ఈ దశకు చేరుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. అనంతాత్మలు: కృష్ణుడు, బుద్ధుడు, వివేకానందుడు, మదర్‌థెరిస్సా.. లాంటి వారు కొన్ని కోట్ల మందిలో మార్పు తీసుకురావడానికి వచ్చినవారు. వారు ఎన్నో జన్మలు తీసుకొని ఎంతో నేర్చుకొని ఆ దశకు చేరుకున్నవారు. మనకు మార్గనిర్దేశకులయ్యారు. ప్రతి ఆత్మ ఈ దశకు చేరుకునేవరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. – డా. లక్ష్మీ న్యూటన్, పాస్ట్ లైఫ్ థెరపిస్ట్, లైఫ్ రీసెర్చి అకాడమీ, హైదరాబాద్ పాఠాలు నేర్చుకోవడానికే! ►ఈ లోకం ఒక విశ్వవిద్యాలయం. ప్రతి జన్మనూ ఈ విశ్వవిద్యాలయంలో నేర్చుకోవడం కోసమే తీసుకుంటాం. ►ప్రతి జన్మలోనూ పరిణతి పొందేందుకే ఆరాటపడుతుంటాం. ►ప్రతి జన్మలోనూ వచ్చే సవాళ్లు ఒక పుస్తకం. ఆ పాఠాలను నేర్చుకుంటేనే సవాళ్లను సులువుగా అధిగమించగలం. ►మోక్షం సిద్ధించాలంటే బయటెక్కడో కాదు మనలో ఉన్న ‘దయ’ అనే ఆలయాన్ని దర్శించాలి. – నిర్మల చిల్కమర్రి -
జయంతి.. ఓ దెయ్యం
అనగనగా ఓ దెయ్యం. ఆ దెయ్యానికి తల ఉండదు. దీనికి కారకులు ఎవరు? వారిపై తల లేని దెయ్యం ఎలా ప్రతీకారం తీర్చుకుంది? అనే కథతో రూపొందిన సినిమా ‘జయంతి’. ఫణిరాజ్ హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. వచ్చే నెలలో రిలీజ్ చేయాలను కుంటున్నారు. ఫణిరాజ్ మాట్లాడుతూ – ‘‘జయంతి అనే ఓ దెయ్యం కథే ఈ సినిమా. బ్రహ్మానందం, అలీ, పోసానిల సన్నివేశాలు వినోదాన్ని పంచుతాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: తారక్ –ఫణిరాజ్. -
పుట్టుకతోనే కాంగ్రెస్ వాడిని: సిద్ధూ
న్యూఢిల్లీ: పుట్టుకతోనే తాను కాంగ్రెస్ వాడినని మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ అన్నారు. అనేక నాటకీయ పరిణామాల అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో సిద్ధూకు పార్టీ సీనియర్ నేత అజయ్ మాకెన్, పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాలఇన్చార్జ్ ఆషా కుమారి పార్టీలోకి సోమవారం ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సిద్ధూ విలేకరులతో మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్‌లోనే పుట్టానని, ఎన్నో ఏళ్ల తర్వాత తిరిగి తన మూలాలు వెతుక్కుంటూ సొంత గూటికి చేరినట్లుందన్నారు. పార్టీ ఆదేశిస్తే ఎక్కడనుంచైనా పోటీ చేస్తానన్నారు. తన తండ్రి భగవంత్ సింగ్ సిద్ధూ స్వాతంత్య్ర సమరయోధుడని.. ఆయన కాంగ్రెస్‌లో 40 ఏళ్లు ఉన్నారని తెలిపారు. రాముడిని అడవులకు పంపిన కైకేయిగా బీజేపీని, రాముడిని కన్నకౌసల్యగా కాంగ్రెస్ పార్టీని అభివర్ణించారు. -
క్రీస్తు జననం.. క్రైస్తవుల పర్వదినం
- జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు - చర్చిలకు విద్యుత్ కాంతుల శోభ కర్నూలు(టౌన్): క్రీస్తు జననాన్ని పురస్కరించుకుని నిర్వహించుకునే క్రిస్మస్ సందడి మొదలైంది. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా చర్చిలు విద్యుత్ దీప కాంతులతో శోభిల్లుతున్నాయి. వారం రోజులుగా ఆయా చర్చిల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు నిర్వహించారు. చర్చిల్లో క్యాండిల్ లైటింగ్ సర్వీసు నిర్వహించారు. అసలు క్రిస్మస్ అంటే.... క్రిస్మస్ అంటే క్రీస్తు జన్మించిన రోజు. బైబిల్లోని లేఖనాల ప్రకారం ఏసుక్రీస్తు 2016 సంవత్సరాల క్రితం డిసెంబర్ 25న పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చినట్లు క్త్రెస్తవులు విశ్వాసం. అందుకే ఏటా డిసెంబర్ 25న క్రెస్తవులు పండుగగా చేసుకుంటారు. ఏసుక్రీస్తు పుట్టుకను జ్ఞానులు నడిపించిన నక్షత్రాన్ని సూచనగా క్రిస్మస్ పండుగ రోజున ప్రతి ఇంటిపై క్రీస్తు జననాన్ని తెలియజేస్తు నక్షత్రాలను ఏర్పాటు చేస్తారు. వంద సంవత్సరాల చరిత్ర కలిగిన కోల్స్ సెంటీనియల్ తెలుగు బాప్టిస్టు చర్చి, రాక్‌వుడ్ మెమోరియల్ చర్చి, స్టాంటన్ చర్చి, గిప్సన్ చర్చి, సీఎస్ఐ తదితర చర్చిలను అందంగా అలంకరించారు. క్రీస్తు పుట్టుకను తెలియజేస్తూ పశువుల పాకను ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి నుంచి అన్ని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ఆర్ధరాత్రి 12 గంటల వరకు ప్రార్థనలు చేసి హ్యాపి క్రిస్మస్లోకి అడుగిడిన తరువాత శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. క్రైస్తవ ప్రపంచానికి శుభోదయం: బిషప్ పూల ఆంథోని (సెయింట్ లూర్డ్సు క్యాథడ్రల్ చర్చి ) బాధాతప్త హృదయాలకు ఓదార్పునివ్వడానికి, చీకటి నిండిన బతుకులో వెలుగులు నింపడానికి రాజాధిరాజు దీనాతిధీనునిగా క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. క్రిస్మస్ అంటే క్రీస్తు జననం, క్రీస్తును అరాధించడం అనే ఆర్థాలున్నా.. మూలార్థం మాత్రం మార్పు. అదే సమ సమాజ స్థాపన. ఆ మరియ సుతుడు అపరాజితుల పక్షాన నిలిచేందుకే ఈ లోకానికి వచ్చాడు. మనం కూడా వ్యా«ధులు, బాధల్లో ఉన్న వారి పక్షాన నిలుద్దాం. నవ సమాజాన్ని నిర్మిద్దాం. ప్రేమ, కరుణే జీవిత సారాం«శం : డాక్టర్ రెవరెండ్ రత్నప్రభపాల్ క్రీస్తు పుట్టుక దేవుని ప్రత్యక్షతకు నిదర్శనం. పాపుల రక్షణ కోసం తన రక్తాన్ని చిందించాడు. ఆయన సూచించిన సత్యం, ధర్మం, శాంతి, దయా మార్గంలో మనందరం నడవాలి. సర్వమానవాళికి ఆయన కల్పించిన రక్షణ మనకు పాప, మరణ భయముల నుంచి విముక్తి కలిగింది. -
జయ ప్రస్థానమిదీ...
► 1948 :ఫిబ్రవరి 24: అప్పటి మైసూరు రాష్ట్రంలోనే మేల్కొటేలో జయలలిత జననం. ► 1950: తండ్రి జయరామ్ మరణం. మాతామహుల ఇంటికి బెంగళూరు చేరిన తల్లి వేదవల్లి. ► 1950-58: తల్లి చెన్నై వెళ్లిపోవడంతో మాతామహుల ఇంటివద్దే పెరిగిన జయలలిత. ► 1958: తిరిగి చెన్నైలోని తల్లి వద్దకు చేరిక ► 1961: కన్నడ సినిమా ‘శ్రీశైల మహాత్మే’తో బాలనటిగా వెండితెరపై అరంగేట్రం ► 1964: హీరోయిన్గా నటించిన తొలి కన్నడ సినిమా ‘చిన్నాడ గోంబే’ బ్లాక్‌బస్టర్. ► 1965: తెలుగు, తమిళ భాషల్లో కథనాయికగా అరంగేట్రం ► 1974: నటిగా 100 సినిమాలు పూర్తి. ► 1980: సినిమాలకు స్వస్తి. కథానాయికగా ఆఖరి సినిమా విడుదల. ► 1982: అన్నా డీఎంకే వ్యవస్థాపకుడు ఎం.జి.రామచంద్రన్ ఆహ్వానం మేరకు పార్టీ సభ్యురాలిగా రాజకీయ రంగ ప్రవేశం. ► 1983: అన్నా డీఎంకే పార్టీ ప్రచార కార్యదర్శిగా బాధ్యతల స్వీకరణ. ► 1984: రాజ్యసభ సభ్యత్వం. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం, పార్టీ విజయం. ► 1987: ఎంజీఆర్ మరణంతో పార్టీలో చీలిక. జయలలిత మద్దతుదారులపై అనర్హత వేటు. రాష్ట్రపతి పాలన. ► 1987: అన్నాడీఎంకే రెండు వర్గాల పునరైక్యం. తొలి మహిళా ప్రతిపక్ష నేతగా ఎంపిక. ► 1989: శాసనసభలో దుశ్శాసన పర్వం. డీఎంకే సభ్యుడు దురై మురుగన్ జయలలిత చీర లాగారన్న ఆరోపణలు. ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెడతానని జయ శపథం. ► 1991: అన్నాడీఎంకే ఘన విజయం. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం. ► 1995: గిన్నిస్ రికార్డు స్థాయిలో దత్తపుత్రుడు సుధాకరన్ వివాహం. అవినీతి ఆరోపణలు. ► 1996: అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత, పార్టీ ఘోర పరాజయం. అవినీతి ఆరోపణలపై అరెస్టు, 30 రోజుల జ్యుడీషియల్ కస్టడీ. ► 2001: అన్నాడీఎంకే ఘనవిజయం. కేసుల కారణంగా ఎన్నికల్లో పోటీకి అనర్హత. అయినా రెండోసారి సీఎంగా ప్రమాణం. చెల్లదని సుప్రీం తీర్పు. పన్నీరుసెల్వానికి బాధ్యతల అప్పగింత. ► 2003: టాన్సీ భూములు, ప్లెజెంట్ స్టే హోటల్ కేసుల కొట్టివేతను సమర్థించిన సుప్రీంకోర్డు. ముఖ్యమంత్రిగా జయలలిత పగ్గాలు. ఉప ఎన్నికలో పోటీ చేసి అసెంబ్లీకి. ► 2006: శాసనసభ ఎన్నికల్లో ఓటమి. ► 2011: శాసనసభ ఎన్నికల్లో గెలుపు, ముఖ్యమంత్రిగా పగ్గాలు. ► 2014: ఆస్తుల కేసులో జయలలితను దోషిగా పేర్కొంటూ బెంగళూరులోని ప్రత్యేక కోర్టు తీర్పు. నాలుగేళ్ల జైలుశిక్ష, రూ.100 కోట్ల జరిమానా. మళ్లీ జైలుకు జయలలిత. సీఎంగా పన్నీరుసెల్వం. ► 2015: జయలలితపై ఆరోపణలను కొట్టివేసిన కర్ణాటక హైకోర్టు ప్రత్యేక ధర్మాసనం. మళ్లీ ముఖ్యమంత్రిగా జయ పగ్గాలు. ► 2016 మే: అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే విజయదుందుభి. ఎంజీఆర్ అనంతరం వరుసగా రెండు పర్యాయాలు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది రికార్డు. ఐదు నెలలు గడవక ముందే అనారోగ్యం. ► 2016 డిసెంబర్ 5: మరణం -
ఇక జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు ఉచితం
త్వరలో ఏలూరులో సమావేశం భీమవరం టౌన్: ఇక జనన, మరణ ధృవీకరణ పత్రాలు ఉచితంగా పొందేందుకు మార్గం సుగమం అవుతోంది. ఈ పత్రా జారీ మరింత సులభతరం, ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేకుండా డిసెంబర్ 1వ తేది నుంచి పొందవచ్చు. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ఈనెల 24 తేదిన ఏలూరు నగరపాలక సంస్థను డీఎంఅండ్‌హెచ్‌వో కె.కోటేశ్వరి ఆధ్వర్యంలో జిల్లాలోని అందరు మునిసిపల్ కమిషనర్లు, ఏఎస్‌వోలు, హెల్త్ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించనున్నారు. వైద్య ఆరోగ్యశాఖ డీఎంఎ కూడా రానున్నారు. నగర పాలక సంస్థలు, మునిసిపల్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణాలు చేయనవసరం లేదు. త్వరలో ఇంటి వద్ద కూర్చుని ఆ ధృవీకరణ పత్రాలు పొందవచ్చు. ఈ ధృవీకరణ పత్రాల నమూనా ఆన్లైన్లో ప్రత్యేక్ వెబ్‌సైట్‌గా పొందుపరచే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ నమూనా పత్రంలో వివరాలు నమోదు (రిజిస్ట్రేషన్) చేస్తే క్షణాల్ల పరిశీలిన జరుగుతుంది. సంబంధిత నమూనా ధృవీకరణ పత్రాలపై ముందుగానే మునిసిపల్ కమీషనర్ల డిజిటల్ సంతకాలు చేసి ఉంటాయి. రిజిస్ట్రేషన్ పరిశీలన అనంతరం జనన, మరణ ధృవీకరణ పత్రాలను సొంతంగానే ప్రింటౌట్ తీసుకునే సౌకర్యం కలగనుంది. గతం, ప్రస్తుతం: కాగిత రహిత పాలనలో భాగంగా ఇప్పటి వరకూ ఉన్న సాంకేతిక విధానంలో కూడా మార్పులు చేస్తున్నారు. గతంలో నగరపాలక సంస్థలు, మునిసిపాలిటిల్లో జనన, మరణ ధృవీకరణ పత్రాలు చేతిరాత విధానంలో అందచేసేవారు. జననం, మరణం జరిగిన వెంటనే సమాచారాన్ని మునిసిపల్ రికార్డుల్లో నమోదు చేస్తారు. దశాబ్దకాలంగా కంప్యూటరైజ్డ్ ధృవీకరణ పత్రాలను ఇస్తున్నారు. మీసేవ కేంద్రాల ద్వారా కూడా ఈ పత్రాలను పొందే సౌలభ్యం ఏర్పడింది. అయితే పట్టణాలో జనన, మరణ వివరాలను తప్పనిసరిగా నగర, మునిసిపాలిటిలకు సమాచారం అందిచాల్సి ఉంది. ధృవీకరణ పత్రాలు పొందేందుకు కొంత రుసుము చెల్లించాల్సి ఉంది. సిఆర్ సిస్టం: నగర పాలక సంస్థలు, మునిసిపాలిటిలో ప్రస్తుతం ఉన్న యూనిఫైడ్ బర్త్ అండ్ డెత్ (యుబిడి) సాఫ్ట్‌వేర్‌ను ఇప్పుడు సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం (సిఆర్ఎస్)లోకి మార్పు చేస్తున్నారు. ఈ మేరకు నాలుగు నెలల క్రితం డైరక్టర్ ఆఫ్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ (yì ఎంఎ) కె.కన్నబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ పనుల నిర్వహణను కొన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించడంతో మునిసిపాలిటిల్లో సాఫ్ట్వేర్ మార్పుకు శ్రీకారం చుడుతున్నారు. భీమవరంలో ప్రయోగాత్మకంగా : రాజమండ్రి రీజియన్ పరిధిలోని కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో మొట్టమొదటిగా భీమవరం మునిసిపాలిటిలో సిఆర్ఎస్ సిస్టం సాఫ్ట్‌వేర్‌ను త్వరలో ప్రవేశపెట్టనున్నారు. పూర్వ నుంచి రికార్డు పస్తుకాల్లో ఉన్న జనన, మరణ వివరాలను స్కాన్ చేసి కంప్యూటరీకరణ చేశారు. ఆ తరువాత సిఆర్ఎస్ సిస్టంలో వీటిని పొందుపరుస్తారు. ఇప్పటికే ప్రభుత్వాసుపత్రుల్లో: గతంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో, ఇంటి వద్ద ప్రసవం జరిగినా, మరణించినా ఆ సమాచారాన్ని మునిసిపాలిటికి తెలిపి రికార్డుల్లో నమోదు చేయించాలి. ఈ ఏడాది మే 1వ తేది నుంచి ప్రభుత్వ, ఏరియా ఆసుపత్రుల్లో జనన, మరణాల సమాచారం మునిసిపాలిటిలకు తెలపాల్సిన అవసరం లేకుండానే సంబంధిత ధృవీకరణ పత్రాలు (సర్టిఫికెట్లు) ఆసుపత్రుల వద్దే అందిస్తున్నారు. శిశువులకు ఆధార్ నంబర్ కూడా కేటాయింపు జరిగిపోతుంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో మాత్రం జనన, మరణ సమాచారాన్ని మునిసిపాలిటిలకు తెలపాల్సి ఉంది. ఉచితం: ప్రభుత్వ, ఏరియా ఆసుపత్రులు, పిహెచ్సిలో జనన, మరణ ధృవీకరణ పత్రాలు పొందేందుకు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఉచితంగా పొందవచ్చు. నగరపాలక సంస్థలు, మునిసిపాలిటిల్లో సిఆర్ఎస్ సిస్టం అమలులోకి వచ్చాక ఇళ్ల వద్ద నుంచి ఆన్లైన్లో ఆ పత్రాలను ఉచితంగా పొందే సౌలభ్యం త్వరలోనే కలగనుంది. -
ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు
ఎంజీఎం : ఒకే కాన్పులో ముగ్గు రు ఆడ శిశువులు జన్మించిన ఘటన వరంగల్‌లోని సీకేఎం ప్రభుత్వ ఆస్పత్రిలో శనివా రం చోటు చేసుకుం ది. వరంగల్ లేబర్ కాలనీకి చెందిన ఐత సంధ్యకు నెలలు నిండడంతో ఆస్పత్రి లో చేర్పించారు. ఈ మేరకు వైద్యులు సుధీర్, శ్రీవిద్య శనివారం ఆమెకు శస్త్రచికిత్స చేయగా ముగ్గురు ఆడ శిశువులు జన్మించారని ఆస్పత్రి సూపరింటెండెం ట్ శ్రీనివాస్ తెలిపారు. ముగ్గురు శిశువులు కూడా రెండు కిలోలకు పైగా చొ ప్పున బరువుతో ఆరోగ్యంగా ఉన్నారని వివరించారు. -
శంకరుని కన్నా ముందే శ్రమ పుట్టింది..
కవి, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ ఖమ్మం కల్చరల్ : శంకరుని కన్నా ముందే శ్రమ పుట్టిందని ప్రముఖ కవి, జాతీయ ఉత్తమ సినీ గేయ పురస్కార గ్రహీత సుద్దాల అశోక్‌తేజ అన్నారు. నగరంలోని బడ్జెట్ హోటల్లో శుక్రవారం రోటరీ క్లబ్ ఆఫ్ స్తంభాద్రి ఆధ్వర్యంలో సుద్దాల అశోక్‌తేజ రచించిన ‘శ్రమకావ్య’ గానం పాఠ్యపుస్తకం విలువ, దాని వెనుక ఉన్న భావాలను తెలియజెపాల్పనే ఉద్దేశంతో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అశోక్‌తేజ రచించిన ‘శ్రమకావ్య’ పుస్తకానికి సంబంధించి చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే.. శంకరుని రూపాన్ని నేను చూసినప్పుడు ఆయన చేతిలో ఢమరుకం ఉంటుంది.. ఆయన ఒంటిపై పులి చర్మం ఉంటుంది.. అంటే ఆయన చేతిలో ఉన్న ఢమరుకాన్ని, పులి చర్మాన్ని తయారు చేసే వ్యక్తి శ్రమకోర్చి వాటిని తయారు చేశాడు కాబట్టే శంకరుడు వాటిని ధరించగలిగాడు.. అందుకే నేను శంకరుని కన్నా ముందే శ్రమ పుట్టిందని భావిస్తాను. అలాగే రామాయణం కన్నా ముందు శ్రమయాణం పుట్టిందని చెప్పొచ్చు. శ్రమకావ్యన్ని రచించడానికి నాకు మూడు నెలల సమయం పట్టింది. దానిని నేను అమెరికాలో రెండు పర్యాయాలు నా కుమారుడిని చూసేందుకు వెళ్లినప్పుడు ఎటువంటి అసౌకర్యానికి లోనుకాకుండా ప్రశాంత, తీరిక సమయాల్లో రాశాను. శ్రమలో నిమగ్నమైన శారీరక చలనం నుంచి నాట్యం పుట్టింది.. శ్రమతో మమేకమైన మనిషి అరుపులో నుంచి సంగీతం వచ్చింది. ఈ రెండు అంశాలను తీసుకుని శ్రమకావ్యాన్ని రచించాను. ఆదిమానవుడు నరుడిగా రూపాంతరం చెంది ప్రస్తుతం ఎటువంటి జీవన గమనాన్ని అనుసరిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో ఆయన శ్రమ ఎలా దోపిడీకి గురైంది.. శ్రమ గొప్పతనం ఏమిటనే అంశాలను వివరిస్తూ శ్రముడు(పురుష), శ్రమి(స్త్రీ) అనే రెండు పాత్రలను తీసుకుని రాయడం జరిగింది. సాహితీ వేత్త మువ్వా శ్రీనివాసరావు, సాహితీ సేవాసంస్థ అధ్యక్షుడు ఆనందాచారి, కవి సీతారామ్.. ‘శ్రమ’ గొప్పతనాన్ని వివరిస్తూ కావ్యాలను రాసిన ఏకైన వ్యక్తి సుద్దాల అశోక్‌తేజ అని కొనియాడారు. ఈ సందర్భంగా సుద్దాల అశోక్‌తేజను క్లబ్ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. అనంతరం రోటరీ క్లబ్ ఆఫ్ స్తంభాద్రి సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో రోటరీ దశాబ్ది ఉత్సవాల కన్వీనర్ కురవెళ్ల ప్రవీణ్‌కుమార్, క్లబ్ అధ్యక్షుడు వందనపు శ్రీనివాసరావు, కార్యదర్శి వజ్రపు రామ్మోహన్, కోశాధికారి బోజెడ్ల ప్రభాకర్‌రావు, సభ్యులు పాలవరపు శ్రీనివాస్, రవి, నాగేష్, దండ్యాల లక్ష్మణరావు పాల్గొన్నారు. -
108 వాహనంలోనే ప్రసవం
తెరుచుకోని శివ్వంపేట పీహెచ్సీ ఇబ్బందులు పడిన బాలింత శివ్వంపేట: పురిటినొప్పులు రావడంతో ఆదివారం 108 వాహనంలో ఆసుపత్రికి బయలుదేరిన గర్భిణి మార్గమధ్యంలో ఆ వాహనంలోనే బిడ్డకు జన్మనిచ్చింది. అక్కడి నుంచి శివ్వంపేట పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ ఆసుపత్రి తెరుచుకోకపోవడంతో బాలింత తీవ్ర ఇబ్బందులు పడింది. గత్యంతరం లేక నర్సాపూర్ ఆసుపత్రికి చేరుకుంది. వివరాలు ఇలా...శివ్వంపేట మండలం పిల్లుట్లకు చెందిన కానుకుంట లక్ష్మి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారమిచ్చారు. వెంటనే ఆ వాహనం గ్రామానికి చేరుకుని లక్ష్మిని నర్సాపూర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో వాహనంలోనే మగబిడ్డకు జన్మనిచ్చింది. 108 ఈఎంపీ శ్రీనివాస్, పైలట్ రమేష్ సమయస్ఫూర్తితో ఆమెకు సుఖప్రసవం జరిగేలా సహకరించారు. అనంతరం బాలింతకు వెంటనే ఇంజక్షన్ ఇవ్వాల్సి ఉండగా మధ్యాహ్నం 12.30గంటలకు శివ్వంపేట ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రికి తాళం వేసి ఉండడంతో చేసేదేమి లేక కొద్దిసేపు ఎదురు చూశారు. ఎవరూ రాకపోవడంతో బాలింతను 108 అంబులెన్సులోనే నర్సాపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పీహెచ్సీ ఎదుట నిరసన... శివ్వంపేటలో వైద్యులు, సిబ్బంది విధులకు రాకపోవడంతో రోగులకు సరైన సేవలు అందడం లేదంటూ ఆసుపత్రి ఎదుట శివ్వంపేట, పిల్లుట్ల వాసులు నిరసన తెలిపారు. ఐదు రోజుల క్రితం శివ్వంపేట చెరువు కట్ట వద్ద రోడ్డు ప్రమాదం జరగ్గా ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్సనిమిత్తం ప్రభుత్వాసుపత్రికి రాగా తాళం వేసి ఉండడంతో ప్రైవేటుకు వెళ్లాల్సి వచ్చింది. శివ్వంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది తీరుపై వారు మండిపడ్డారు. కలెక్టర్ స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి
సూర్యాపేట : తెలంగాణ గౌడ యువజన సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి ఉత్సవాలను గురువారం పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ గౌడ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు భూపతి నారాయణగౌడ్, నియోజకవర్గ కన్వీనర్ దేశగాని శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు గౌడ సంఘం నాయకులు మాట్లాడారు. జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలన్నారు. అనంతరం సర్వాయి పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా యూత్ అధ్యక్షుడు మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్, బైరు వెంకన్నగౌడ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, శనగాని రాంబాబుగౌడ్, యూత్ కాంగ్రెస్ అ««ధ్యక్షులు బైరు శైలెందర్గౌడ్, నేరెళ్ల మధుగౌడ్, సత్యనారాయణ, టైసన్ శ్రీను, పల్సా వెంకన్న, రవి, రాపర్తి శ్రీనివాస్‌గౌడ్, బెల్లంకొండ రాంమూర్తిగౌడ్, పొలగాని బాలుగౌడ్, వెంకటనారాయణ, చీకూరి ప్రకాష్‌గౌడ్, వేణు, భూపతి శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
పాపన్నగౌడ్ జయంతిని అధికారికంగా నిర్వహించాలి
-సర్దార్‌సర్వాయి పాపన్న జైత్రయాత్ర రాష్ట్ర కన్వీనర్ రమణాగౌడ్ హత్నూర :బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాటం చేసిన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని పాపన్న గౌడ్ జైత్రయాత్ర రాష్ట్ర కన్వీనర్ వీవీ రమణాగౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం హత్నూర మండలం దౌల్తాబాద్‌కు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జైత్రయాత్ర బస్సుచేరుకుంది. మండల గౌడసంఘం నాయకులు దుర్గంగౌడ్, ధునుంజయ్యగౌడ్, గౌడసంఘం నాయకులు జైత్రయాత్ర బస్సుకు స్వాగతం పలికారు. తెలంగాణతల్లి, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసిన అనంతరం రమణాగౌడ్ మాట్లాడుతూ ఈనెల18న జరిగే సర్దార్ సర్వాయిపాపన్నగౌడ్ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్నారు. ఈనెల1న పాపన్న జన్మస్థలమైన వరంగల్జిల్లా కిలాషాపురం నుంచి బస్సుయాత్ర ప్రారంభమై గ్రామగ్రామాన తిరుగుతూ సభలు, సమావేశాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి గ్రామంలో పాపన్నగౌడ్ విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలన్నారు. ఈనెల18న పాపన్నగౌడ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ట్యాంక్‌బండ్, అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వమే పాపన్న విగ్రహాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గౌడసంఘం రాష్ట్ర నాయకులు బాల్‌రాజ్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్, రమేష్‌గౌడ్, నర్సయ్యగౌడ్, వెంకటేశ్వర్‌గౌడ్, దుర్గంగౌడ్, రాజాగౌడ్, లక్ష్మణ్‌గౌడ్, మండల నాయకులు యాదగిరిగౌడ్, రామస్వామిగౌడ్, స్వామిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. 08ఎన్ఆర్ఎస్ః41 దౌల్తాబాద్‌లో తెలంగాణతల్లి విగ్రహానికి పూలమాలలు వేస్తున్న గౌడసంఘం నాయకులు 08ఎన్ఆర్ఎస్ః41ఎః నాయకులకు స్వాగతం పలుకుతున్న గౌడసంఘం నాయకులు