
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ‘108 అంబులెన్స్‌లో ఓ గర్భిణి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. చక్రాయపేట మండలం సిద్ధారెడ్డి పల్లె గ్రామానికి చెందిన దివ్యలక్ష్మికి శనివారం తెల్లవారు జామున పురిటి నొప్పులు రావడంతో ‘108’కు కుటుంబ సభ్యులు కాల్ చేశారు. ఫోన్ చేసిన 15 నిమిషాల్లోనే అంబులెన్స్ చేరుకుంది. మధ్యమార్గంలో పురిటి నొప్పులు మరింత ఎక్కువ అవడంతో సిబ్బంది.. అంబులెన్స్‌లోనే చికిత్స చేసి మగబిడ్డకు పురుడు పోశారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్ కు తరలించామని ‘108’ అంబులెన్స్ సిబ్బంది తెలిపారు. ప్రజలు ‘108’ సేవలను ఉపయోగించుకోవాలని సిబ్బంది కోరారు.
Comments
Please login to add a commentAdd a comment