Baby Born
-
ముక్కు లేకుండానే జన్మ..ఇప్పుడెలా ఉన్నాడంటే?
ఓ చిన్నారి పుట్టుకతో ముక్కు లేకుండా జన్మించాడు. ఆ చిన్నారి తల్లికి 20 వారాల గర్భంగా ఉన్నప్పుడే పుట్టబోయే బిడ్డలో ఏదో సమస్య ఉందని తెలిసింది. ఆ తర్వాత స్కానింగ్‌లో బిడ్డ ముక్కు కనిపించ లేదని, అలాగే బిడ్డ కూడా పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా లేడని చెప్పారు వైద్యులు. అయితే ఆ తల్లి అబార్షన్ చేయించుకునేందకు ఇష్టపడలేదు. ఎలా ఉన్నా.. భూమ్మీదకు తీసుకురావాలని స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యింది. చివరికీ వైద్యులు చెప్పినట్లుగానే జన్మించాడు. ఆ బిడ్డ బతికే క్షణాలు కూడా తక్కవే అని పెదవి విరిచారు డాక్టర్లు. సీన్ కట్ చేస్తే..22 ఏళ్ల తర్వాత.. అసలేం జరిగిందంటే..యూఎస్‌కి చెందిన జాన్, మేరీ జో దంపతులు తమ తొలి సంతానం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మేరీ జో సరిగ్గా 20 వారాల గర్భతగా ఉండగా.. ఏదో సమస్య తలెత్తుందని అనిపించింది. వారి ఊహించినదే నిజమైంది. స్కానింగ్‌లో పుట్టబోయే బిడ్డ మెదడు సరిగా అభివృద్ధి చెందలేదని, అలాగే ముక్కు కూడా లేదని తేలింది. శిశువు పుట్టిన బతకడం కష్టం అని గర్భస్రావం చేయించుకోవాల్సిందిగా మేరీ జోకి సూచించారు. అయితే అందుకు ఆ దంపతుల మనసు అంగీకరించ లేదు. దీంతో వారు ఏం జరిగినా ఆ బిడ్డను ఈ భూమ్మీదకు తెచ్చి పెంచుకుందామని గట్టిగా డిసైడ్ అయిపోయారు. అయితే ఆ బిడ్డ వైద్యులు చెప్పినట్లుగానే జన్మించడం జరిగింది. అదీకూడా డెలీవెరీకి ఐదువారాల ముందుగానే సీజేరియన్ చేసి పండంటి మగ బిడ్డను బయటకు తీశారు వైద్యులు. ఇక ఆ శిశువుకి పుట్టడంతోనే ముక్కు, కనురెప్పలు ఏర్పడలేదు. పైగా శిశువు మెదడులో ఎడమవైపు భాగం కూడా అభివృద్ధి చెందలేదు. అలాగే ఆ శిశువు పాదాలకు వేళ్లు కూడా లేవు. దీంతో డాక్టర్లు ఎంతసేపో ఆ శిశువు బతకదని పెదవి విరిచారు. ఎందుకంటే? ముక్కు లేదు కాబట్టి అస్సలు శ్వాస పీల్చుకోగలుగుతుందా లేదనది ఒక ప్రశ్న అయితే ఆక్సిజన్ మెదడకు సక్రమంగా అందకపోతే బతికే ఛాన్స్ అనేది కచ్చితంగా ఉండదు. ఈ రసవత్తరకరమైన ఆందోళనల మధ్య ఓ అద్భుతంలా ఆ శిశువు శ్వాస పీల్చుకోవడం బతకడం చకచక జరిగిపోయింది. వైద్యులు కూడా ఊహించని రీతీలో ఆ శిశువు కోలుకుంటూ..జస్ట్ డెలివరీ అయిన ఒక్క వారంలోనే డిశ్చార్చ్ అయ్యి తల్లిదండ్రలతో వెళ్లిపోయాడు. అయితే తల్లిదండ్రలు ఆ బిడ్డని కంటికి రెప్పలా కాచుకుంటూ అత్యంత భద్రంగా పెంచారు. ఎందుకంటే ముక్కులేదు కాబట్టి రంధ్రంగా ఉన్న ఆ ప్లేస్‌లో ఒక సన్నని నెట్మాదిరి క్లాత్‌ని అడ్డంగా ఉంచేవారు. అలాగే కళ్లకు రెప్పలు లేవు కాబట్టి నిద్ర వచ్చే సమయంలో వైద్యులు ఇచ్చిన ఒక రకమైన ద్రవాన్ని రక్షణగా ఉంచేవారు. అలా ఆ బిడ్డకు ఆరు నెలల వయసు వచ్చే వరకు ఓ గాజు ముక్కలా కాపడుకుంటూ వచ్చారు. ఆ తర్వాత పెరిగి పెద్దయ్యే వరకు చాలా సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చింది. దాదాపు 30 సర్జరీలు దాక చేయించుకున్నాడు. ప్రస్తుతం ఆ చిన్నారి వయసు 22 ఏళ్లు. ఇప్పుడు అతను అందరిలానే సంగీతం, బేస్‌బాల్ వంటి ఆటలు ఆడుతూ హాయిగా గడుపుతున్నాడు. ఆ చిన్నారికి పేరు గ్రే కెనాల్స్. పుట్టుకతో ముక్కు లేకపోవడంతో కేవలం దీని పునర్నిర్మాణం కోసం ఏకంగా 11 సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చింది. ఇలా అత్యంత అరుదుగా కొద్దిమందికి మాత్రమే జరగుతుందని వైద్యులు చెబుతున్నారు. పైగా పూర్తి ముక్కుని పునర్నిర్మించడం అనేది అత్యంత క్లిష్టమైన సర్జరీ కూడా. అలాగే అతడి తల్లిందండ్రులు కూడా అతడు ఎదిగే క్రమంలో తన తోటి పిల్లలతో చులకనకు గురవ్వకూడదని ఇంట్లోనే ఉంచి చదువు చెప్పించారు. అలాగే తన పట్ల ఎవ్వరూ జాలి చూపకుండా ఎలా మసులుకోవాలో కూడా కెన్నాల్కి తల్లిదండ్రులు నేర్పించారు. అంతేగాదు ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డను చూసి బాధపకడ పోగా ప్రత్యేక అవసరాలున్న పిల్లలను ప్రత్యేకమైన తల్లిదండ్రులకే ఇస్తాడని సగర్వంగా చెప్పారు. పైగా వైకల్యంతో పుట్టిన పిల్లల పట్ల ఎలా తల్లిదండ్రులు వ్యవహరించాలనేందుకు స్ఫూర్తిగా నిలిచారు ఆ దంపతులు. బిడ్డ సమస్యను ముందు తల్లిదండ్రులే ధైర్యంగా ఫేస్ చేసేందుకు రెడీ అయితేనే బిడ్డలో స్థైర్యాన్ని నిపంగలమని చాటి చెప్పారు. ఇక కెన్నాల్ కూడా తాను ఇన్ని సర్జరీలు చేసి నరకయాతన చూసిన తల్లిదండ్రులు ఇచ్చిన స్థైర్యాన్ని ఆశని వదులకోకపోవడం విశేషం. ఇక కెనాల్స్ కూడా ఈ సర్జరీల వల్ల తన జీవితానికి కలుగుతున్న అంతరాయన్ని అధిగమించి చక్కగా ముందుకు సాగిపోయేలా ప్లాన్ చేసుకుంటానని ఆత్మవిశ్వాసంగా చెబుతున్నాడు. మరీ అతనికి ఆల్ ద బెస్ట్ చెబుదామా!. (చదవండి: నెయిల్ పాలిష్ రిమూవర్ ఇంత డేంజరా? మంటల్లో చిక్కుకున్న చిన్నారి..) -
ఆర్టీసీ బస్సులో మహిళ ప్రసవం.. క్షేమంగా తల్లీబిడ్డలు!
మెదక్: ఆర్టీసీ బస్సులో ఓ మహిళ సుఖ ప్రసవం జరిగిన సంఘటన జహీరాబాద్‌లో చోటు చేసుకుంది. డిపో మేనేజర్ నారాయణ వివరాలు. పొట్పల్లి గ్రామానికి చెందిన హాజీ పాషా భార్య జరీనా బేగంకు పురిటి నొప్పులు వచ్చాయి. ప్రసవం కోసం బీదర్ ఆసుపత్రికి వెళ్లడానికి శుక్రవారం రాత్రి సహాయకులతో కలిసి జహీరాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఎక్కింది. బస్సు పట్టణం దాటగానే ఆమెకు నొప్పులు ఎక్కువయ్యాయి. బస్సు డ్రైవర్ ఆనందం, కండక్టర్ కరుణాకర్ మార్గమధ్యలో ఉన్న మిర్జాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి బస్సును తరలించారు. నర్స్ సుధారాణిని బస్సు వద్దకు తీసుకుని వచ్చేలోపు మహిళ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. -
శిథిలాల కిందే ఊపిరిపోసుకుంది..'ఆ జననం ఓ అద్భుతం'
తుర్కియే, సిరియాలను భూకంపం ఓ ఊపు ఊపేసింది. ఆ ప్రకృతి విలయం ఇరుదేశాల్లో అంతులేని విషాదాన్ని నింపాయి. దీంతో ఎటూ చూసిన పేకమేడల్లా కూలిని భవనాల కింద చితికిన బతుకులే కనిపిస్తున్నాయి. ఆ దృశ్యాలన్ని అక్కడ ప్రజలకు అంత తేలికగా మర్చిపోలేని ఘోర విషాదాన్ని మిగిల్చాయి. ఇలాంటి విపత్కర పరిస్థితులో సిరియాలోని జెండెరిస్ పట్టణంలో శిథిలా కింద ఓ ఆడ శిశువు జన్మించడం అందర్నీ షాక్‌కి గురిచేసింది. ఇలాంటి విషాద సమయంలో జన్మించిన ఆ శిశువు జననం ఒక కొత్త ఆశను రేకెత్తించింది. సోమవారం సంభవించిన భూకంపం తదనంతరం భద్రతా బలగాలు రెస్క్యూ చర్యలు చేపడుతుండగా..సిరియాలో శిథిలాల కింద ఓ తల్లి ఒక ఆడబిడ్డకి జన్మినిచ్చిన సంగతి తెలిసింది. ఆ శిశువు తల్లి బొడ్డు తాడుకు జత చేయబడి ఉండటంతో సురక్షితంగా ఉందని అధికారులు తెలిపారు. ఐతే ఈ ప్రమాదంలో ఆ చిన్నారి తల్లి, తండ్రి, తోడబుట్టిన వాళ్లు అందరూ మృతి చెందారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఆస్పత్రిలో కోలుకుంటోంది. ఆ శిథిలాల కింద గజగజలాడే చలిలో ఓ చిన్నారి ఏడుపును గమనించి రెస్క్యూ టీం అప్రమత్తమై రక్షించారు. The moment a child was born 👶 His mother was under the rubble of the earthquake in Aleppo, Syria, and she died after he was born , The earthquake. May God give patience to the people of #Syria and #Turkey and have mercy on the victims of the #earthquake#الهزه_الارضيه #زلزال pic.twitter.com/eBFr6IoWaW — Talha Ch (@Talhaofficial01) February 6, 2023 ఈ ప్రమాదంలో స్వల్పగాయాలతో బయటపడటంతో పాపను హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. ఆ ఆస్పత్రిలో ఓ వైద్యుడి భార్య ఆ చిన్నారికి పాలందించింది. ప్రస్తుతం ఆ చిన్నారిని దత్తత తీసుకునేందుకు పలువురు ముందుకొచ్చారు. ఐతే ఆ చిన్నారి డిశ్చార్జ్ అయిన వెంటనే ఇంటికి తీసుకువెళ్తానని ఆమె మేనమామ చెబుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితులో పుట్టడం విశేషం అంటూ.. ఆ చిన్నారికి అయా అని పేరు పెట్టారు. 'అయా' అనగా అరబిక్‌లో 'అద్భుతం' అని అర్థం. ఆమె జననం ఓ అద్భుతం అంటూ అక్కడ ప్రజలు ఆ శిశువుకి ఈ పేరు పెట్టారు. (చదవండి: 67 ఏళ్ల వయసులో మళ్లీ ప్రేమలో పడ్డ బిల్‌గేట్స్) -
లక్షన్నరలో ఒక పుట్టుక.. అరుదైన ఘట్టం
బిడ్డ పుట్టడం.. ఏ తల్లిదండ్రులకైనా జీవితాతంతం గుర్తుండిపోయే మధుర క్షణాలు. కానీ, ఇక్కడ ఓ పేరెంట్స్‌కు మాత్రం అదెంతో ప్రత్యేకమైన సందర్భం. ఎందుకంటే.. లక్షన్నరలో ఒక్కరు మాత్రమే అలా పుట్టే అవకాశం ఉంది కాబట్టి. అలబామా హంట్స్‌విల్లెకు చెందిన క్యాసిడీ, డైలన్ స్కాట్లు డిసెంబర్ 18వ తేదీన ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అయితే ఆ తేదీ ఆ భార్యాభర్తలిద్దరికీ ఎంతో ప్రత్యేకం. కారణం.. అదే రోజు వాళ్లిద్దరి పుట్టినరోజు కాబట్టి. పైగా నార్మల్ డెలివరీ ద్వారా ఆ బిడ్డ పుట్టింది. ఈ భూమ్మీద దాదాపు లక్షన్నర మందిలో.. ఇలాంటి ఒక పుట్టుక ఉంటుందనే అంచనా ఉంది. ఈ విషయాన్ని ఫేస్బుక్లో పంచుకుంది ఆ బిడ్డ పుట్టిన హంట్స్‌విల్లే హాస్పిటల్. ఇలాంటి తేదీల్లోనే జన్మనిచ్చిన మరికొందరు తల్లిదండ్రులు.. కింద కామెంట్ సెక్షన్లో తమ శుభాకాంక్షలు తెలియజేశారు. -
షాకింగ్.. నాలుగు కాళ్లతో జన్మించిన శిశువు.. ఫొటో వైరల్..
భోపాల్: మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో ఆర్తి కుశ్వాహా అనే మహిళకు జన్మించిన ఆడ శిశువుకు నాలుగు కాళ్లున్నాయి. చిన్నారి 2.3 కేజీల బరువు ఉంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. కమ్లా రాజా ఆస్పత్రిలో ఆర్తి కుశ్వాహ బుధవారం ప్రసవించింది. అయితే పుట్టిన బిడ్డకు నాలుగు కాళ్లు ఉండటం చూసి వైద్యులు షాక్ అయ్యారు. విషయం తెలియగానే జయారోగ్య హాస్పిటల్ గ్రూప్ సూపరింటెండెంట్ డా.ఆర్కే ధాకడ్.. వైద్య బృందంతో వెళ్లి చిన్నారిని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. పుట్టుకతోనే శిశువుకు నాలుగు కాళ్లు ఉన్నాయి. ఆమెకు శారీరక వైకల్యం ఉంది. కొన్ని పిండాలు అదనంగా ఏర్పడుతాయి. దీనిని వైద్య శాస్త్ర భాషలో చెప్పాలంటే ఇస్కియోపాగస్ అంటారు. పిండం రెండు భాగాలుగా విభజించబడినప్పుడు శరీరం రెండు చోట్ల అభివృద్ధి చెందుతుంది. ఈ ఆడ శిశువు నడుము కింది భాగం రెండు అదనపు కాళ్లతో అభివృద్ధి చెందింది. కానీ ఆ కాళ్లు క్రియారహితంగా ఉన్నాయి. అని డా. ధాకడ్ వివరించారు. శిశువుకు ఇంకా వేరే శరీర భాగాల్లో వైకల్యం ఉందా? అని పరిశీలించిన అనంతరం ఆమె ఆరోగ్యంగా ఉంటే ఇన్‌యాక్టివ్‌గా ఉన్న రెండు కాళ్లను శస్త్ర చికిత్స చేసి తొలగిస్తామని ధాకడ్ చెప్పారు.అప్పుడు చిన్నారి సాధారణ జీవితాన్ని గడపవచ్చని పేర్కొన్నారు. చదవండి: లైంగిక వేధింపులు.. హెడ్ మాస్టర్‌ను కర్రలతో చితకబాదిన అమ్మాయిలు -
తండ్రిగా ప్రమోషన్ పొందిన స్పెయిన్ బుల్
టెన్నిస్ రారాజు.. స్పెయిన్ బుల్ రఫేల్ నాదల్ తండ్రిగా ప్రమోషన్ పొందాడు. శనివారం రాత్రి నాదల్ భార్య మరియా ఫ్రాన్సిస్కా పెరెల్లో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కాగా ఈ ఏడాది జూలైలో నాదల్ దంపతులు తాము తొలిసారి తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించాడు. తాజాగా మగబిడ్డ ఇంట్లో అడుగుపెట్టడంతో వారి ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. ఇక నాదల్, మరియా ఫ్రాన్సిస్కాలు 2019లో వివాహం చేసుకున్నారు. కెరీర్‌పై ఫోకస్ పెట్టడానికే కొన్నాళ్ల పాటు పిల్లలు వద్దనుకున్నామని నాదల్ గతంలో పేర్కొన్నాడు. ప్రస్తుతం 36 ఏళ్ల వయసున్న నాదల్ టెన్నిస్‌లో ఇప్పటివరకు 22 గ్రాండ్‌స్లామ్‌లు సాధించాడు.టెన్నిస్ పురుషుల ర్యాంకింగ్స్‌లో నాదల్ రెండో స్థానంలో ఉండగా.. తొలి స్థానంలో తన దేశానికే చెందిన టెన్నిస్ సంచలనం కార్లోస్ అల్కరాజ్ కొనసాగుతున్నాడు. ఇటీవలే తన చిరకాల మిత్రుడు రోజర్ ఫెదరర్ టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ఫెదరర్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ నాదల్ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. ఇద్దరు చివరిసారిగా లావెర్ టెన్నిస్ టోర్నీలో డబుల్స్ మ్యాచ్‌లో పాల్గొని అభిమానులను సంతోషపెట్టారు.అయితే మ్యాచ్ ముగిశాకా ఫెదరర్, నాదల్‌లు కన్నీళ్లు పెట్టడం అక్కడున్న ప్రతీ ఒక్కరిని కలిచివేసింది. మరో టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ నాదల్కు శుభాకాంక్షలు తెలిపాడు. ''కంగ్రాట్స్ స్పెయిన్ బుల్.. ఇప్పటిదాకా తెలియదు.. నిజంగా గుడ్‌న్యూస్. ఏ వ్యక్తి అయినా తాను తొలిసారి తండ్రి అయితే అక్కడ ఉండే సంతోషం వేరుగా ఉంటుంది. ఆ అనుభూతిని ఇప్పుడు నాదల్ పొందుతున్నాడు. అలాంటి సంతోషాన్ని ఇదివరకే చూశా. నాదల్కు ఎలాంటి అడ్వైజ్ ఇవ్వలేను.. ఎందుకంటే అతనికి పెద్ద ఫ్యామిలీ ఉంది. వాళ్లే అన్ని జాగ్రత్తలు చెబుతారు'' అంటూ లాఫింగ్ ఎమోజీతో పేర్కొన్నాడు. Baby Nadal is here! 👶 According to Spanish press, Rafael Nadal and Maria Francisca Perello welcomed their first child—a boy named Rafael—on Saturday. Congrats, Rafa and Mery! ❤️ — TENNIS (@Tennis) October 8, 2022 #Djokovic on Rafa’s son: Congrats! I didn’t know. Really? It’s a beautiful news. I wish his wife and baby a lot of health and happiness. As a father, I’m not gonna give any advise (smiling) him.He has a big family. I’m sure he will experience himself (smiling)#rafa — Yerik_nolefamkz 🇰🇿 (@yerikilyassov) October 8, 2022 -
ప్రసవంలో బిడ్డ మరణిస్తే.. 60 రోజుల ప్రత్యేక సెలవులు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగుల కోసం మరో కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రసవం సమయంలో బిడ్డ గనుక మరణిస్తే.. ఆ తల్లులకు 60 రోజుల ప్రత్యేక ప్రసూతి సెలవులు ఇవ్వనున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ప్రసవం సమయంలోగానీ లేదంటే పుట్టిన కాసేపటికే గానీ బిడ్డ చనిపోతే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే మహిళా ఉద్యోగులకు ఈ సెలవులు వర్తిస్తాయని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(DoPT) శుక్రవారం తన ఆదేశాల్లో వెల్లడించింది. బిడ్డ పుట్టిన వెంటనే చనిపోతే.. ఆ తల్లి జీవితంపై తీవ్ర ప్రభావం పడుతుందని, అందువల్ల కలిగే మానసిక క్షోభను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీవోపీటీ ఆ ప్రకటనలో తెలిపింది. ప్రసవ సమయంలో బిడ్డ చనిపోవడం, మెటర్నీటీ లీవుల విషయంలో చాలామంది ఉద్యోగులు ఎంక్వైరీలు, విజ్ఞప్తులు చేస్తున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ అంశంపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో సంప్రదించాకే ఆదేశాలు ఇస్తున్నట్లు ప్రకటించింది డీవోపీటీ. ఒకవేళ మెటర్నీటీ లీవులు గనుక ఉంటే.. అవి వర్తిస్తాయని, అవి అందుబాటులో లేకుంటే 60 రోజుల ప్రత్యేక మెటర్నిటీ లీవులు వర్తిస్తాయని(బిడ్డ మరణించిన నాటి నుంచి) సదరు ప్రకటన తెలిపింది. అలాగే బిడ్డ పుట్టిన వెంటనే మరణించే పరిస్థితిని పుట్టిన 28 రోజుల వరకు నిర్వచించవచ్చని అన్ని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/విభాగాలకు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రత్యేక ప్రసూతి సెలవుల ప్రయోజనం.. ఇద్దరు పిల్లల కంటే తక్కువ సంతానం ఉన్న కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగికి, అథరైజ్డ్ ఆస్పత్రిలో పిల్లల ప్రసవం జరిగితేనే వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (CGHS) కింద గుర్తింపు ఉన్న ప్రైవేట్ లేదంటే ప్రభుత్వాసుపత్రిలో మాత్రమే ప్రసవం జరగాల్సి ఉంటుంది. ఒకవేళ ఎంప్యానెల్ లేని ప్రైవేట్ ఆసుపత్రిలో అత్యవసర ప్రసవాలు జరిగితే, అత్యవసర ధృవీకరణ పత్రం తప్పనిసరి అని పేర్కొంది. ఇదీ చదవండి: బాహుబలి.. ఐఎన్ఎస్ విక్రాంత్ -
లైంగిక దాడికి గురైన బాలికకు శిశువు జననం
సాక్షి, చెన్నై(తిరువొత్తియూరు): సామూహిక లైంగిక దాడికి గురైన 17 ఏళ్ల బాలికకు ఓ ఆడశిశువు జన్మించింది. కాగా ఆ బాలిక తల్లిని, ఆమె వివాహేతర ప్రియుడిని పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. వివరాలు.. చెన్నై కొరుక్కుపేట, మోక్షపురానికి చెందిన 17 ఏళ్ల బాలిక ప్లస్ వన్ చదువుతోంది. ఈమెకు గత కొన్ని రోజులకు ముందు చెన్నై ఎగ్మూర్ ఆసుపత్రిలో ఆడ శిశువు జన్మించింది. బాలికకు శిశువు జన్మించిన సంఘటనపై ఆసుపత్రి వర్గాలు ఆరాతీశాయి. దీంతో బాలిక తనపై లైంగిక దాడి జరిగినట్లు వారి దృష్టికి తెచ్చింది. ఆసుపత్రి ఉద్యోగులు ఇచ్చిన సలహా మేర కు బాలిక సోమవారం చాకలిపేట మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇందులో కోరుక్కుపేట మీనాంబాళ్ నగర్‌కు చెందిన దురైరాజ్ (51), బషీర్ జమాల్ తదితరులు తనపై లైంగిక దాడి చేయడంతో తాను గర్భిణి అయినట్లు తెలిపింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేయగా బాలిక తల్లికి దురైరాజుకు వివాహేతర సంబంధం ఉందని, లైంగిక దాడికి తల్లి ప్రోత్సహించినట్టు తెలిసింది. దీంతో పో లీసులు బాలిక తల్లిని, ఆమె ప్రియుడిని అరెస్టు చేశా రు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. చదవండి: (ప్రియురాల్ని స్నేహితులకు విందుగా మార్చిన ప్రియుడు..) బన్రుట్టి సమీపంలో మరో ఘటన బన్రుట్టి సమీపంలో కూతురిపై బలవంతంగా లైంగిక దాడికి ప్రోత్సహించిన తల్లిని, ఆమె ప్రియుడిని పోలీసులు పోక్సో చట్టం కింద పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. కడలూర్ జిల్లా బన్రుట్టి సమీపంలోని భద్ర కోట గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక అదే ప్రాంతంలోని పాఠశాలలో పన్నెండో తరగతి చదువుతోంది. ఆమె తల్లి హంసవల్లి (40). భర్త మృతి చెందడంతో ఈమెకు అదే ప్రాంతానికి చెందిన కార్తికేయన్ (35)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈక్రమంలో కార్తికేయన్‌ను కుమార్తెపై బలాత్కారం చేయడానికి హంస వల్లి ప్రోత్సహించినట్లు తెలిసింది. దీంతో కార్తికేయన్ విద్యార్థినిపై లైంగిక దాడి చేసినట్టు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు హంసవల్లిని, కార్తికేయన్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
46 ఏళ్లకు తల్లైన స్టార్ హీరోయిన్, కవలలకు జననం
Actress Preity Zinta And Her Husband Gene welcome Twins Jai and Gia: ప్రముఖ బాలీవుడ్ నటి, ఒకప్పటి స్టార్ హీరోయిన్ ప్రీతి జింటా(46) గుడ్ న్యూస్ చెప్పింది. కవలలకు ఆమె తల్లైనట్లు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. సరోగసి(అద్దె గర్భం) పద్దతిలో తాను, జీన్ తల్లిదండ్రులైనట్లు ఈ సందర్భంగా ఆమె వెల్లడించింది. ఇక విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటిస్తూ పిల్లల పేర్లను కూడా వెల్లడించింది. భర్త జీన్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. ‘అందరికి నమస్కారం. ఈ రోజు మా జీవితాల్లో నెలకొన్న అంత్యంత సంతోషకరమైన వార్తను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. జీన్, నేను కవలలకు జన్మనిచ్చాం. చదవండి: రాశీ ఖన్నాకు బంపర్ ఆఫర్.. కరణ్ జోహార్ సినిమాలో ఛాన్స్..! ప్రస్తుతం మా హృదయాలు కృతజ్ఞత, ప్రేమతో నిండిపోయాయి. సరోగసి ద్వారా కవలలను మా కుటుంబంలోకి స్వాగతించాం. వారి పేర్లు జై జింటా, గియా జింటా నిర్ణయించాం’ అంటూ ఆమె రాసుకొచ్చింది. అలాగే సరోగసి ప్రక్రియలో తమకు సహకరించిన డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందికి ఈ సందర్భంగా ప్రీతి జింటా కృతజ్ఞతలు తెలిపింది. కాగా అమెరికాకు చెందిన జీన్ గుడెనఫ్‌ను ప్రీతి జింటా 2016లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లికి ముందు జీన్‌తో రిలేషన్లో ఉన్న ఆమె.. 2016 ఫిబ్రవరి 29న రహస్య వివాహం చేసుకుంది. చదవండి: నయన్‌కు సర్ప్రైజ్: విక్కీ బర్త్‌డే బ్యాష్ మామూలుగా లేదుగా View this post on Instagram A post shared by Preity G Zinta (@realpz) -
నిజంగా ఆపిల్ పండు లాంటి బిడ్డ, కట్ చేస్తే..
ఆపిల్‌పండు లాంటి బిడ్డను కనమని కాబోయే తల్లులను దీవిస్తుంటారు పెద్దలు. కానీ, సింగపూర్‌లో నిజంగానే యాపిల్ పండు సైజులో ఓ బిడ్డ పుట్టింది. అయితే బతకడం కష్టమనుకున్న తరుణంలో దాదాపు 25 వారాలపాటు శ్రమించిన డాక్టర్లు.. ఎట్టకేలకు ఆ బిడ్డను ఆరోగ్యవంతమైన బరువుకు తీసుకొచ్చి ప్రాణాలు కాపాడారు. సింగపూర్‌లోని నేషనల్ యూనివర్సిటీ హాస్పిటల్(NUH)లో కిందటి ఏడాది జూన్ 9న నెలలు నిండకుండానే ఓ పాప పుట్టింది. కేవలం 24 సెంటీమీటర్ల పొడవు, కేవలం 212 గ్రాముల బరువుతో పుట్టందా పాప. దీంతో సగటు ఆపిల్ పండు కన్నా తక్కువ బరువు ఉందంటూ గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది ఆ చిన్నారి. అయితే బతకడం కష్టమని డాక్టర్లు తేల్చేయడంతో ఆ తల్లిదండ్రులు బోరున విలపించారు. వాళ్ల శోకాన్ని అర్థం చేసుకుని రిస్క్ చేసి మరీ 13 నెలలపాటు ఫ్రీ ట్రీట్మెంట్ ద్వారా ప్రయత్నించారు ఎన్హెచ్యూ వైద్యులు. 13 నెలల ఐసీయూ చికిత్సలో అద్భుతం జరిగింది. చివరికి 6.3 కేజీల ఆరోగ్యవంతమైన బరువుకు చేరిన ఆ చిన్నారిని.. ఈమధ్యే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆ బిడ్డకు వెక్(క్వెక్) యూ గ్జువాన్ అని పేరుపెట్టుకున్న ఆ తల్లిదండ్రులు.. చిన్నారి ఆరోగ్యంగా తమ చేతికి దక్కడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ లోవా రికార్డుల ప్రకారం.. అమెరికాలో 245 గ్రాముల బరువుతో పుట్టిన చిన్నారి పేరిట రికార్డు ఉండగా.. వెక్ యూ గ్జువాన్ ఆ రికార్డును చెరిపేసింది. -
విమానం గాల్లో ఎగురుతుండగానే పాప పుట్టింది
న్యూఢిల్లీ: విమానం గాల్లో ఎగురుతుండగానే ముద్దులొలికే పాప పుట్టింది. బెంగుళూరు నుంచి జైపూర్‌కి వచ్చిన విమానంలో అదనంగా మరో ప్రయాణికురాలు వచ్చి చేరింది. ఇండిగో విమానం 6ఇ–469 విమానం ప్రయాణిస్తుండగానే అందులో ఉన్న ఒక గర్భిణికి పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో విమాన సిబ్బంది అందులోనే ప్రయాణిస్తున్న డాక్టర్ సుబాహనా నజీర్ సహకారంతో ఆమెకి పురుడు పోశారు. ఆ మహిళ ఆడ శిశువుకి జన్మనిచ్చింది. తల్లీ బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని విమానయాన సంస్థ ఇండిగో ఒక ప్రకటనలో వెల్లడించింది. మహిళ ప్రసవ వేదన పడుతుంగానే విమాన పైలెట్ ఈ విషయాన్ని జైపూర్ విమానాశ్రయానికి సమాచారం అందించారు. దీంతో విమానం దిగేసరికి అక్కడ అంబులెన్స్, వైద్యుడు సిద్ధంగా ఉన్నారు. జైపూర్ విమానాశ్రయం సిబ్బంది ఆ తల్లి, బిడ్డలకి స్వాగతం పలికారు. ఇండిగో విమాన సిబ్బందితో సహా అందరూ వారితో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. డెలివరీకి సాయం చేసిన ఆ వైద్యుడికి థ్యాంక్స్ కార్డు ఇచ్చారు. బుధవారం ఉదయం 5.45 గంటలకి బెంగుళూరు నుంచి బయల్దేరిన విమానం ఉదయం 8 గంటలకి జైపూర్‌కి చేరుకుంది. గత ఏడాది అక్టోబర్‌లో ఢిల్లీ నుంచి బెంగుళూరు వెళుతున్న ఇండిగో విమానంలో ఇలాంటి సంఘటనే జరిగింది. అప్పుడు బాబు పుట్టిన వార్త వైరల్‌గా మారింది. -
చేప ఆకారంలో శిశువు జననం.. అంతలోనే
దూద్‌బౌలి: ఓ మహిళకు వింత (చేప) ఆకారంతో శిశువు జన్మించింది. జన్యు లోపం కారణంగా జన్మించిన కొద్ది గంటల్లోనే ఆ శిశువు మరణించింది. ఈ సంఘటన హైదరాబాద్‌లోని పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో బుధవారం రాత్రి జరిగింది. సంగారెడ్డికి చెందిన తహసీన్ సుల్తానా (20), మహ్మద్ ఆరీఫ్‌లు దంపతులు. ఈ నెల 5న తహసీన్ సుల్తానా ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరారు. ఈ నెల 10వ తేదీన సాయంత్రం 7 గంటలకు కాళ్లు అతుక్కుని చేప రూపంలో శిశువు జన్మించింది. విషయాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగమణికి తెలిపారు. వైద్య చికిత్స పొందుతూ రాత్రి 10 గంటలకు ఆ శిశువు మృతి చెందింది. ఇలాంటి సంఘటనలు అరుదుగా జరుగుతాయని, జన్యులోపం వల్లే ఇలా జన్మించినట్లు డాక్టర్లు తెలిపారు. -
‘108’లో మహిళ ప్రసవం..
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ‘108 అంబులెన్స్‌లో ఓ గర్భిణి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. చక్రాయపేట మండలం సిద్ధారెడ్డి పల్లె గ్రామానికి చెందిన దివ్యలక్ష్మికి శనివారం తెల్లవారు జామున పురిటి నొప్పులు రావడంతో ‘108’కు కుటుంబ సభ్యులు కాల్ చేశారు. ఫోన్ చేసిన 15 నిమిషాల్లోనే అంబులెన్స్ చేరుకుంది. మధ్యమార్గంలో పురిటి నొప్పులు మరింత ఎక్కువ అవడంతో సిబ్బంది.. అంబులెన్స్‌లోనే చికిత్స చేసి మగబిడ్డకు పురుడు పోశారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్ కు తరలించామని ‘108’ అంబులెన్స్ సిబ్బంది తెలిపారు. ప్రజలు ‘108’ సేవలను ఉపయోగించుకోవాలని సిబ్బంది కోరారు. -
తెలుగు రాష్ట్రాల్లో ‘లీపు’శిశువులు
-
‘లీపు’ వీరులు వీరే!
సాక్షి, మహబూబాబాద్/ జనగామ: నాలుగేళ్ల కోసారి వచ్చే లీపు (ఫిబ్రవరి 29) శనివారం రోజున మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రిలో ముగ్గురు, జనగామ ఆస్పత్రిలో ఐదుగురు శిశువులు జన్మించారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన పి.ఉమారాణి, జిల్లా కేంద్రం బేతోలుకు చెందిన ఎస్.కే.ఫాతిమా, మరిపెడకు చెందిన బానోతు బులీలు మగశిశువులకు జన్మనిచ్చారు. అలాగే.. జనగామ మాతాశిశుసంరక్షణ ఆరోగ్య కేంద్రంలో జయంతి, శాలూభాయ్, హాజిరా, అనిత, అనురాధ గర్భిణులకు ప్రసూతి చేశారు. జన్మించిన ఐదుగురిలో ఒక ఆడ శిశువు, నలుగురు మగ శిశువులు ఉన్నారు. మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రిలో ముగ్గురు శిశువుల జననం సాక్షి, తిరుపతి: తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో లీప్ ఏడాది ఫిబ్రవరి 29 శనివారం రోజున పండంటి బిడ్డలకు జన్మనిచ్చిన తల్లులు.. తమ బిడ్డలను చూసుకుని మురిసిపోయారు. ఎవరికీ రాని అదృష్టం, గుర్తింపు తమ బిడ్డలకు దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ఇద్దరు శిశువుల జననం -
జూనియర్ శిల్పా శెట్టి
శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా దంపతులు సంతోషంలో మునిగిపోయారు. ‘సమిషా’ రూపంలో ఆనందం వాళ్ల ఇంటికి వచ్చింది. విషయం ఏంటంటే... శిల్పా శెట్టి రెండోసారి తల్లయ్యారు. ఈ విషయాన్ని శుక్రవారం ప్రకటించారు. ‘‘మా ప్రార్థనలను ఆ దేవుడు విన్నట్లున్నాడు. వాటి ఫలితమే సమిషా అనుకుంటున్నాం. ఫిబ్రవరి 15న మా చిన్నారి దేవత ‘సమిషా’ మా ఇంటికి వచ్చిందని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. జూనియర్ యస్యస్కే (శిల్పా శెట్టి కుంద్రా)’’ అని చిన్నారి వేలుని పట్టుకొని దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు శిల్పాశెట్టి. అయితే ఈ మధ్యలో శిల్పా శెట్టి గర్భవతి అయినట్టు కనిపించలేదు. మరి సరోగసీ పద్ధతిలో రెండో సారి తల్లయ్యారా? లేక పాపను దత్తత తీసుకున్నారా? తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే శిల్పాకుంద్రాకు వియాన్ అనే కుమారుడు ఉన్న విషయం తెలిసిందే. -
లిటిల్ మిరాకిల్.. సంచలనం రోజునే
ఈ మధ్యకాలంలో తమ పిల్లలు పుట్టే తేదీలు వినూత్నంగా, క్రేజీగా ఉండాలని తల్లిదండ్రులు భావిస్తున్నారు. దాని కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే దైవ సంకల్పమో లేక యాదృచ్ఛికమో తెలియదు గాని అమెరికాలో ఓ పాప క్రేజీ తేదీన జన్మించింది. అమెరికాకు చెందిన కామెట్రియోన్ మూర్ బ్రౌన్ ఈ నెల 11న(సెప్టెంబర్ 11) పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె ప్రసవించిన సమయం కూడా రాత్రి 9.11 గంటలకు. అంతేకాదు ఆ చిన్నారి బరువు కూడా 9 పౌండ్ల 11 ఔన్సులు. డాక్టర్ ఈ అంకెలు చెప్పగానే ఆ చిన్నారి తల్లిదండ్రులు తొలుత ఆశ్చర్యపోయారు. అనంతరం చరిత్రలో మర్చిపోలేని రోజున తమ పాప జన్మించిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ 11 ఈ పేరు వినగానే అమెరికన్లు కలలో కూడా ఉలిక్కిపడతారు. ప్రపంచం మొత్తం గజగజా వణికిపోతారు. అమెరికా చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలోనే పెను విషాదం అదే రోజున చోటు చేసుకుంది. అమెరికా ఆర్థిక శక్తికి సూచికగా చెప్పుకునే వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై ఉగ్రదాడి జరిగింది సెప్టెంబర్ 11నే. అందుకే 9/11ను అమెరికన్లు మర్చిపోలేరు. సరిగ్గా ఆ సంఘటన జరిగి 18 ఏళ్లు పూర్తయిన రోజునే క్రిస్టినా బ్రౌన్ జన్మించింది. దీనిపై ఆ చిన్నారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘లిటిల్ మిరాకిల్’ అంటూ తెగ సంబరపడిపోతున్నారు. -
300 గ్రాముల బరువుతో పుట్టాడు!
అవును నిజమే.. మూడు వందల గ్రాముల బరువుతో ఓ పిల్లాడు భూమ్మీదకు వచ్చాడు. మాములుగా ఈ బరువుతో పుట్టడం అసాధారణం. ఇలాంటివి అరుదుగా జరుగుతాయని వైద్యులు పేర్కొన్నారు. పుట్టినప్పుడు 11 ఔన్సుల( దాదాపుగా 300గ్రాములు) బరువుతో పుట్టాడని.. మన గుండె కంటే తక్కువ బరువు అని, సాధారణ సోడా క్యాన్ అంత బరువు అని వైద్యులు పేర్కొన్నారు. ఇంత తక్కువ బరువుతో పుట్టి.. బతకడమంటే మాములు విషయం కాదు. ఆ పసిబిడ్డ పుట్టినప్పుడు వాడి నాన్న అరచేతిలో సరిగ్గా సరిపోయాడని పేర్కొన్నారు. అయితే ఆ పసికందును మళ్లీ మామూలు స్థితికి తెచ్చేందుకు తల్లిదండ్రులు, వైద్యులు పడ్డ కష్టం ఓసారి చూద్దాం. న్యూయార్క్‌లో ఉంటున్న జామీ, జానీ ఫ్లోరియోలకు ఓ బిడ్డ జన్మించబోతోన్నారని ఆనందంతో ఉన్నారు. అయితే వైద్యులు పరీక్షించే సమయంలో అసలు నిజం బయటకు వచ్చింది. లోపల పెరుగుతున్న బిడ్డకు సరైన పోషకాలు అందడం లేదని సరైన ఎదుగుదల కనిపించడం లేదనే నిజం తెలిసింది. దీంతో వైద్యులు ఆపరేషన్ చేయాల్సిందేనని.. తమకు సాధ్యం అయినంత వరకు ప్రయత్నం చేస్తామని చెప్పారు. అయితే బిడ్డ పుట్టినా.. అప్పటి నుంచే అసలు పరీక్ష మొదలైందని వైద్యులు పేర్కొన్నారు. మాములుగా పుట్టాల్సిన బరువు కంటే 11రెట్లు తక్కువ బరువుతో ఉన్నాడని.. ఆసుపత్రిలోనే ఉంచి పర్యవేక్షించాలని చెప్పారు. అయితే తల్లి మనసు బిడ్డ కోసం ఆరాటపడుతుందని తెలిసిందే కదా.. ఆసుపత్రిలో ఉన్న ప్రతిరోజు తన బిడ్డను సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నించేది. క్రిస్మస్ రోజు, వాలెంటైన్స్ డేను ఇలా ప్రతీ పండుగను కొత్తగా సెలబ్రేట్ చేస్తూ.. అలాంటి ప్రత్యేకమైన రోజున స్పెషల్‌గా రెడీ చేసేది. మొత్తానికి తొమ్మిది నెలల వైద్యుల కష్టం, తల్లిదండ్రుల ప్రేమతో బిడ్డలో మార్పు కనిపించింది. ఇంకా తమ బిడ్డ సాధారణ పరిస్థితికి వచ్చేంత వరకు శ్రమించాల్సి ఉందని, వస్తాడనే నమ్మకం ఉందని ఫ్లోరియో తెలిపారు. -
పిల్లలు లేని వారికి శుభవార్త!
పారిస్: అమ్మదనానికి నోచుకోలేని స్త్రీలు అనుభవించే బాధ వర్ణనాతీతం. కొందరు స్త్రీలు పుట్టుకతోనే గర్భసంచి లేకుండా పుడితే.. మరికొందరు పెరుగుతున్న క్రమంలో గర్భసంచిని కోల్పోవడం జరుగుతుంది. ఇలాంటి వారికి గర్భసంచి మార్పిడి చేయించుకోవడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. గర్భసంచి దానం చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడం, ప్రస్తుతం గర్భసంచి దానం చేసేందుకు సంబంధిత మహిళ కుటుంబసభ్యులకే అవకాశం ఉండటం వంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. అయితే బ్రెజిల్‌కు చెందిన వైద్యులు మరణించిన ఓ మహిళ గర్భసంచిని విజయవంతంగా ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. పుట్టుకతోనే గర్భసంచి లేదు.. బ్రెజిల్‌కు చెందిన 32 ఏళ్ల మహిళకు పుట్టుకతోనే గర్భసంచి లేదు. దీంతో ‘మేయర్ రోకీటాన్స్కీ కస్టర్ హైసర్’అనే సిండ్రోమ్‌కు గురైంది. ఆమెకు పిల్లలు పుట్టే అవకాశం లేకపోవడంతో 2016 సెప్టెంబర్‌లో గర్భసంచి మార్పిడి చికిత్స చేయాలని నిర్ణయించారు. బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై మరణించిన ఓ 45 ఏళ్ల మహిళ గర్భసంచిని ట్రాన్స్‌ప్లాంట్ కోసం సిద్ధం చేశారు. సుమారు 10 గంటలు శ్రమించి ఆమెకు గర్భసంచిని విజయవంతంగా ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. ఐదు నెలల తర్వాత ఆమె గర్భసంచిని పరీక్షించిన వైద్యులకు దుష్ప్రభావాలు కనిపించలేదు. నెలసరి కూడా రెగ్యులర్ అవుతుండటంతో సర్జరీ అయిన 7 నెలలకే ఆమె గర్భసంచిలోకి ఫలదీకరణం చెందిన అండాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం 10 రోజులకు ఆమె గర్భం ధరించినట్లు తెలిపారు. సిజేరియన్ ఆపరేషన్ ద్వారా 2017 డిసెంబర్లో ఆమె ఆడపిల్లకు జన్మనిచ్చింది. అనంతరం ఆమె నుంచి గర్భసంచిని తొలగించారు. -
చనిపోయిన బిడ్డను ఇచ్చారంటూ ఆందోళన..
రాయగడ: రాయగడ జిల్లా ఆస్పత్రిలో శిశువు మారిపోయిందన్న అభియోగంతో వివాదం రేగింది. స్థానిక ఆస్పత్రిలో మంగళవారం ఓ మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు వైద్యాధికారుల రికార్డుల్లో ఉంది. కానీ మహిళ కుటుంబ సభ్యులు ప్రసవ సమయంలో మగ బిడ్డను చూశామంటూ ఆందోళనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి. రాయగడ జిల్లా కాశీపూర్ సమితి కుంబారసిల్లా గ్రామానికి చెందిన కవిత కుంబారి ప్రసవ వేదనతో రాయగడ జిల్లా ఆస్పత్రిలో ఈ నెల 10వ తేదీన అడ్మిట్ కాగా సోమవారం రాత్రి 11గంటల సమయంలో శిశువుకు జన్మనిచ్చింది. శిశువు బరువు తక్కువగా ఉండడంతో ఎస్ఎంసీఎస్లో ఉంచి అత్యవసర వైద్యం అందిస్తున్నారు. కవిత కుంబారికి సీరియస్ కావడంతో కొరాపుట్ మెడికల్ కళాశాల ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో మంగళవారం కవిత కుటుంబ సభ్యులను డాక్టర్లు పిలిచి కవితకు పుట్టిన ఆడ శిశువు మృతిచెందిందని చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు ప్రసవ సమయంలో మగ బిడ్డను చూశామని, శిశువు మృతిచెందిందని డాక్టర్లు ఆడ బిడ్డను అప్పగిస్తున్నారని ఆందోళనకు దిగారు. డాక్టర్లు శిశువును మార్చేశారని ఆరోపిస్తున్నారు. కానీ కవిత ఆడ శిశువుకు జన్మనిచ్చిందని రికార్డుల్లో రాసి ఉంది. ఈ సమస్య పట్ల వైద్య విభాగం, ఉన్నతాధికారులు విచారణ సాగిస్తున్నారు. -
తండ్రి లేని బిడ్డగా రికార్డుల్లోకి...
సాక్షి, చెన్నై: తండ్రి లేకుండా బిడ్డ..? మద్రాస్ హైకోర్టు చొరవతో టెక్నికల్‌గా ఇది సాధ్యమయ్యింది. తమిళనాడులో వీర్య దాత ద్వారా బిడ్డను కన్న ఓ తల్లి.. బర్త్ సర్టిఫికెట్లో తండ్రి పేరును తొలగించాలంటూ న్యాయపోరాటం చేసి విజయం సాధించారు. దీంతో చిన్నారి తావిషి పెరారా దేశంలో ‘తండ్రి లేని బిడ్డగా’ రికార్డుల్లోకి ఎక్కి చరిత్ర సృష్టించింది. ఆసక్తికరమైన ఈ కేసు వివరాల్లోకి వెళ్తే... త్రిచీకి చెందిన మధుమిత రమేష్ అనే మహిళ భర్త చరణ్ రాజ్‌తో పరస్పర అంగీకారం మేర విడిపోయారు. ఆపై కొన్నిరోజుల తర్వాత వీర్యం డోనర్ ద్వారా గతేడాది ఏప్రిల్‌లో మధుమిత ఓ బిడ్డకు జన్మనిచ్చారు. అయితే త్రిచీ కార్పొరేషన్ అధికారులు మాత్రం బిడ్డ తండ్రిగా వీర్యదాత మనిష్ మదన్‌పాల్ మీనా పేరును బర్త్ సర్టిఫికేట్లో పేర్కొన్నారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన మధుమిత.. సర్టిఫికేట్ నుంచి తండ్రి పేరును తొలగించాల్సిందిగా అధికారులకు అర్జి పెట్టుకుంది. పేర్లలో తప్పులను మాత్రమే సవరించే వీలుందని, అంతేగానీ ఏకంగా పేరునే తొలగించే అవకాశం లేదని అధికారులు ఆమెకు బదులిచ్చారు. దీంతో గతేడాది సెప్టెంబర్‌లో ఆమె మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు.. సర్టిఫికెట్‌ను సవరించాల్సిందిగా రెవెన్యూ శాఖను ఆదేశించింది. అయినప్పటికీ ఆమె దరఖాస్తును అధికారులు మరోసారి తిరస్కరించటంతో మరోసారి ఆమె కోర్టు తలుపు తట్టారు. అదే సమయంలో ఆమె మాజీ భర్త చరణ్ రాజ్, వీర్యపు డోనర్ మనీష్‌లు ఇద్దరూ ఆ బిడ్డకు తాము తండ్రులం కాదంటూ అఫిడవిట్లు దాఖలు విశేషం. చివరకు మధుమిత అభ్యర్థనను అంగీకరించిన బెంచ్.. తావిషి పెరేరా బర్త్ సర్టిఫికేట్లో తండ్రి కాలమ్‌ను ఖాళీగా వదిలేయాలని త్రిచీ కార్పొరేషన్‌ను ఆదేశించింది. తద్వారా తావిషి తండ్రి లేని బిడ్డగా రికార్డుల్లో నిలిచిపోనుంది. -
ఆరు నెలలకే శిశువు జననం
►తల్లీబిడ్డ క్షేమం ►యర్రగొండపాలెంలో ఘటన యర్రగొండపాలెం టౌన్: గర్భం దాల్చిన ఆరు నెలలకే ఓ మహిళ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ప్రసవానంతరం తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. యర్రగొండపాలెం ప్రభుత్వాస్పత్రిలో సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలివీ.. యర్రగొండపాలెం పట్టణంలోని పడమటి బజారులో నివాసం ఉంటున్న 21 ఏళ్ల వివాహిత చాబోలు కుమారి రెండోసారి గర్భం దాల్చింది. ఆరు నెలల గర్భిణిగా ఉన్న కుమారి బలహీనంగా ఉండటంతోపాటు సోమవారం ఉదయం నుంచి నొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో తల్లిదండ్రులు వెంటనే స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యాధికారి డాక్టర్ పి.చంద్రశేఖర్ ఆమెను పరీక్షించి, ప్రసవానికి కొంత సమయం పడుతుందని చెప్పారు. కొద్ది సేపటికే కుమారికి నొప్పులు అధికమయ్యాయి. శస్త్రచికిత్స అవసరం లేకుండానే ఆడ శిశువుకు జన్మనిచ్చింది. శిశువు 900 గ్రాములు బరువుతో ఆరోగ్యంగానే ఉన్నట్టు విధి నిర్వహణలో ఉన్న స్టాఫ్‌నర్స్ కె.ప్రసన్న తెలిపారు. -
అక్కడ జన్మించాడు.. ఛాన్స్ కొట్టేశాడు
న్యూఢిల్లీ: ఎగురుతున్న విమానంలో ఓ మహిళ ఆదివారం పండంటి బిడ్డను ప్రసవించింది. విమానంలో పుట్టిన ఆ శిశువుకు జీవితమంతా టికెట్లు ఉచితంగా ఇవ్వాలని జెట్ ఎయిర్వేస్ నిర్ణయించింది. జెట్ ఎయిర్వేస్కు చెందిన 9డబ్ల్యూ569 విమానం ఆదివారం తెల్లవారుజామున సౌదీ అరేబియాలోని డమ్మమ్ నుంచి కొచ్చికి బయులుదేరింది. ప్రయాణం మధ్యలో ఓ గర్భిణికి పురిటి నొప్పులు మొదలై విమానంలోనే మగబిడ్డను ప్రసవించింది. ఇలా విమానంలో పిల్లలు పుట్టడం జెట్ ఎయిర్వేస్ సంస్థకు ఇదే ప్రథమం. దీంతో ఆ శిశువుకు తమ విమానాల్లో జీవితాంతం ఉచితంగా ప్రయాణించే అవకాశం ఇస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. -
మూడు కాళ్లతో శిశువు జననం!
-
మూడు కాళ్లతో శిశువు జననం!
జనగామ: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఓ మహిళ మూడు కాళ్లతో ఉన్న వింత శిశువుకు జన్మనిచ్చింది. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లి గ్రామానికి చెందిన ఎల్లబోయిన జంపన్న భార్య శ్రీలత రెండవ సంతానంగా మంగళవారం మూడు కాళ్లతో ఉన్న శిశువుకు జన్మనిచ్చింది. శ్రీలత గర్భం దాల్చిన నాటి నుంచి జనగామలో ప్రతి నెలా వైద్య పరీక్షలు చేయించుకుంటున్నది. ఆరు నెలల సమయంలో స్కానింగ్ తీసిన సమయంలో వైద్యులు అనుమానం వ్యక్తం చేశారు. కడుపులోని శిశువు కింది భాగంలో అదనంగా మరో అవయవం పెరుగుతుందని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. రోజువారి కూలీకి వెళితేనే బతుకు బండి నడిచే పరిస్థితుల్లో కాన్పు అయ్యే వరకు దేవునిపై భారం వేసి ఎదురు చూశారు. ఈ నెల 20న రాత్రి పురిటి నొప్పులు రావడంతో ఏరియా ఆస్పత్రికి తీసుకువచ్చారు. కడుపులో ఉన్న శిశువు ఉమ్మ నీరు మింగడంతో వైద్యురాలు స్వప్న నేతృత్వంలో మంగళవారం ఉదయం ఆపరేషన్ చేశారు. కడుపులోని బిడ్డకు మూడుకాళ్లు ఉండడంతో వైద్యులు సైతం ఒకింత ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మూడు కాళ్లతో శిశువు జన్మించడంతో కుటుంబ సభ్యులు ఆవేదనకు లోనయ్యారు. శిశువు ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ మూడవ కాలు విషయమై పూర్తిగా అధ్యయనం చేసేందుకు హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. మూడు కాళ్లతో జన్మించిన శిశువు ఆరోగ్య స్థితిగతులను నిలోఫర్ వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.