Fish Shaped Baby Born In Hyderabad: చేప ఆకారంలో శిశువు జననం.. అంతలోనే - Sakshi
Sakshi News home page

చేప ఆకారంలో శిశువు జననం.. అంతలోనే

Published Fri, Mar 12 2021 2:40 AM | Last Updated on Fri, Mar 12 2021 1:40 PM

Baby Born As Fish Shape In Hyderabad - Sakshi

దూద్‌బౌలి: ఓ మహిళకు వింత (చేప) ఆకారంతో శిశువు జన్మించింది. జన్యు లోపం కారణంగా జన్మించిన కొద్ది గంటల్లోనే ఆ శిశువు మరణించింది. ఈ సంఘటన హైదరాబాద్‌లోని పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో బుధవారం రాత్రి జరిగింది. సంగారెడ్డికి చెందిన తహసీన్‌ సుల్తానా (20), మహ్మద్‌ ఆరీఫ్‌లు దంపతులు. ఈ నెల 5న తహసీన్‌ సుల్తానా ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరారు. ఈ నెల 10వ తేదీన సాయంత్రం 7 గంటలకు కాళ్లు అతుక్కుని చేప రూపంలో శిశువు జన్మించింది. విషయాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ నాగమణికి తెలిపారు. వైద్య చికిత్స పొందుతూ రాత్రి 10 గంటలకు ఆ శిశువు మృతి చెందింది. ఇలాంటి సంఘటనలు అరుదుగా జరుగుతాయని, జన్యులోపం వల్లే ఇలా జన్మించినట్లు డాక్టర్లు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement