Fish
-
ఫిష్.. నగర వాసుల దిల్ ఖుష్
నాంపల్లి: ఆరోగ్యవంతమైన తెలంగాణ సాధనలో భాగంగా మత్స్యశాఖ సరికొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ‘మన తెలంగాణ–మన చేపలు’ నినాదంతో విభిన్న కార్యక్రమాలు చేపడుతోంది. తెలంగాణ మత్స్య సహకార సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో చేపలను నగరంలో విరివిగా విక్రయించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇదివరకే నగరంలో పలు చోట్ల చేపల విక్రయ కేంద్రాలు (ఫిష్ స్టాల్స్), సంచార విక్రయ కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటికి తోడు విభిన్న రుచులను పరిచయం చేసేందుకు ఫిష్ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకూ మాసబ్‌ట్యాంక్‌లోని శాంతినగర్‌లో ప్రయోగాత్మకంగా ఫిష్ క్యాంటీన్‌ను నడిపిస్తున్నారు. దీనికి విశేష ఆదరణ లభిస్తోంది. సుదూర ప్రాంతాల నుంచి చేపల రుచులను ఆస్వాదించడానికి శాంతినగర్ ఫిష్ క్యాంటీన్‌కు వస్తున్నారు. రోజుకు 500 కేజీల చేపలను వినియోగిస్తున్నారు. ఆదివారం వెయ్యి కేజీలు వివిధ రకాల రెసిపీలకు వాడుతున్నారు. వివిధ రకాలు.. బోన్‌లెస్ చేపల ఫ్రై, రొయ్యల ఫ్రై, చేపల పులుసు, అపోలో ఫిష్, ఫిష్ ఫింగర్స్, క్రిస్పీ రొయ్యలతో వంటకాలను తయారు చేస్తున్నారు. ప్రతి రోజూ (పండుగ రోజు మినహా) మధ్యాహ్నం 12.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ క్యాంటీన్ పనిచేస్తుంది. చేప దమ్ బిర్యానీ రూ.250, బోన్‌లెస్ ఫిష్ బిర్యానీ రూ.300 లకు అమ్ముతున్నారు.రెడీ టు కుక్.. మత్స్య శాఖ రెడీ టు కుక్ పేరుతో ఆర్డర్లు కూడా బుక్ చేసుకుంటోంది. శుభకార్యాలు, వివిధ రకాల ఫంక్షన్లకు చేప వంటకాలను అందిస్తోంది. అలాగే చేపల పులుసు, రొయ్యలు, పీతల పులుసుకు కావాల్సిన చేపలను కూడా శుద్ధి చేసి సప్లయ్ చేస్తోంది. మత్స్య శాఖ డీజీఎం సుజాత 7989196259 ఫోన్ నంబరులో సంప్రదించి ఆర్డర్ చేసుకోవచ్చు.ఐదు కొత్త క్యాంటీన్లు.. నగరంలో ఐదు కొత్త ఫిష్ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నాం. గచి్చ»ౌలి, దిల్సుఖ్నగర్, శంషాబాద్, నాంపల్లి, ఎస్ఆర్ నగర్లో త్వరలో ప్రారంభిస్తాం. చేప బిర్యానీ, చేప పులుసు, ఫ్రై వంటకాలకు మంచి ఆదరణ లభిస్తోంది. భవిష్యత్తులో మరిన్ని క్యాంటీన్లను ప్రారంభించే ఆలోచన చేస్తాం. – మెట్టు సాయి కుమార్ -
పెన్షనర్ల ప్యారడైజ్‌లో.. జల పుష్పాల జాక్‌పాట్
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పెన్షనర్ల ప్యారడైజ్‌గా పేరొందిన కాకినాడలోని గంగపుత్రులు జల పుష్పాలతో జాక్‌పాట్ కొడుతున్నారు. అరుదైన ట్యూనా(tuna fish) చేపలను పట్టడంలో చేయితిరిగిన మత్స్యకారులు కాకినాడ తీరానికే సొంతం. ఇక్కడి సముద్ర తీరానికి 175–300 నాటికల్ మైళ్ల దూరంలో ట్యూనా చేపల సందడితో గంగపుత్రులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. మునుపెన్నడూ లేనిరీతిలో తొలిసారి రికార్డు స్థాయిలో ట్యూనా చేపలు చిక్కుతూ వారికి సిరుల వర్షం కురిపిస్తున్నాయి.మూడు రకాల ట్యూనా చేపలలో అరుదైన జాతి స్కిట్‌జాగ్. వీటికి మరోపేరు నామాలు. వాడుక భాషలో మాత్రం తూర చేపలని పిలుస్తుంటారు. మత్స్యకారుల వలలకు చిక్కుతున్న ట్యూనాల్లో స్కిట్‌జాగ్ జాతి చేపలే అధికంగా ఉంటున్నాయి. వీటితోపాటు ఎల్లో ఫిన్ ట్యూనా, వైట్ ట్యూనా రకాల చేపలు కూడా విరివిగా లభిస్తున్నాయి. స్కిట్‌జాగ్ రకం కిలో రూ.70, వైట్ ట్యూనాలు కిలో రూ.105, ఎల్లో ఫిన్ ట్యూనాలు కిలో రూ.95 ధర పలుకుతున్నాయి. జాలర్ల పంట పండుతోంది జనవరి రెండో వారం నుంచే ట్యూనాలు విరివిగా లభిస్తుండటంతో మత్స్యకారుల పంట పండుతోంది. కాకినాడ తీరం నుంచి నిత్యం 25 నుంచి 30 బోట్లలో సముద్ర లోతుల్లోకి వెళ్లి ట్యూనాలు వేటాడుతున్నారు. ఒకసారి వేట (వాజీ)కి వెళితే దొరికే చేపలను బట్టి రూ.లక్ష నుంచి రూ.2 లక్షలు వస్తే గొప్పగా చెప్పుకుంటారు. అటువంటిది ప్రస్తుతం ఒక ఫైబర్ బోటులో రూ.3.50 లక్షల నుంచి రూ.5 లక్షలు విలువైన ట్యూనాలు పడుతుండటంతో మత్స్యకారుల ఆనందానికి అవధులు లేవు. ఎల్లో ఫిన్ ట్యూనా రోజుకు ఐదారు టన్నులు వస్తుంటే అత్యధికంగా నామాలుగా పిలిచే (స్కిట్‌జాగ్) ట్యూనాలు 20 నుంచి 25 టన్నులు ఉంటున్నాయి.కాకినాడ తీరానికి నిత్యం 250 నుంచి 300 టన్నుల ట్యూనాలు వస్తున్నాయి. ఫైబర్ బోటుపె మేస్త్రీ, కళాసీలు కలిసి మొత్తం ఆరుగురు వేటకు వెళుతుంటారు. సముద్రంపై 10 రోజులపైనే ఉంటే తప్ప రూ.2 లక్షల విలువైన మత్స్య సంపద దొరికేది కాదు. ప్రస్తుతం వారం రోజులు గడవకుండానే రూ.నాలుగైదు లక్షల విలువైన ట్యూనాలతో తిరిగొస్తున్నామని మత్స్యకారులు సంతోషంగా చెబుతున్నారు. ఇదే ఒరవడి కొనసాగి ట్యూనాలు మార్చి నెలాంతం వరకు దొరుకుతాయనిఅంచనా వేస్తున్నారు. అదే నిజమైతే ఈ సీజన్లో ట్యూనాలతో ఆర్థికంగా స్థిరపడతామనే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.పరిహారం ఎగ్గొట్టినా ట్యూనాలే ఆదుకుంటున్నాయికాకినాడ, ఉప్పాడ కొత్తపల్లి తదితర ప్రాంతాల్లో సముద్రంలో చేపల వేట ఆధారంగా సుమారు 300 ఫైబర్ బోట్లను మత్స్యకారులు నడుపుతున్నారు. ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు సముద్ర వేట నిషేధ సమయం. వేట నిషేధంతో ఉపాధి కోల్పోయే మత్స్యకారుల జీవనానికి ఇబ్బంది కలగకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వేట నిషేధ పరిహారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూ వచ్చింది. కూటమి ప్రభుత్వం గద్దెనెక్కాక వేట నిషేధ పరిహారం కొండెక్కింది. కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసినా మత్స్యకారులకు నిరాశనే మిగిలింది. సంక్రాంతి పండుగ కూడా సంతోషం లేకుండా గడచిపోయిందనే ఆవేదన చెందుతున్నారు. వేటకు వెళ్లినా వలకు సరైన చేపలు చిక్కక కొన్ని సందర్భాల్లో ఫైబర్ బోటు నిర్వహణ వ్యయం రూ.లక్ష కూడా చేతికొచ్చేది కాదు. ఈ తరుణంలో సముద్రంలో లభిస్తున్న ట్యూనా చేపలు మత్స్యకారులకు ఊపిరిపోస్తున్నాయి.ట్యూనాలకు కేరాఫ్ కాకినాడ కాకినాడ తీరం ట్యూనా చేపలకు ప్రసిద్ధి. ఇక్కడి మత్స్యకారులు ఎంతో నైపుణ్యంతో సముద్రంలో సుదీర్ఘ ప్రాంతానికి వెళ్లి ట్యూనా చేపలను వేటాడతారు. మూడు రకాల ట్యూనాలు లభ్యమవుతున్నాయి. వేట నిషేధ సమయం తరువాత ఆరు నెలలపాటు ట్యూనా చేపలు ఎక్కువగా లభిస్తాయి. జనవరి నెలలో ట్యూనా దిగుబడి బాగా వచ్చింది. గతంతో పోలిస్తే 10 శాతం ధర పెరిగింది. దీంతో మత్స్యకారులు ఆర్థిక పరిస్థితి బాగుంది. – అనురాధ, ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్, హార్బర్ పేట, కాకినాడ కాకినాడ తీరానికి అభిముఖంగానే ట్యూనాలు కాకినాడ తీరం ఎదురుగా విశాఖ, చింతపల్లి ప్రాంతంలో సుమారు 175 నాటికల్ మైళ్ల దూరంలో ట్యూనా చేపలు లభ్యమవుతున్నాయి. ఈ సీజన్లో జనవరి నెలలో మత్స్యకారుల వలలకు ట్యూనా చేపలు భారీగా చిక్కాయి. దీంతో వేట కోసం ప్రతి మత్స్యకారుడు సముద్రంలో వేట కొనసాగిస్తున్నారు. – మల్లే కొండబాబు, మత్స్యకారుడు, సూర్యారావుపేట -
ఇందిరా మహిళా శక్తి ద్వారా సంచార చేపల విక్రయ వాహనాలు
సాక్షి, హైదరాబాద్: మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సంచార చేపల విక్రయ వాహనాలను సమకూర్చుతోంది. మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశా లతో ఈ వాహనాలను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సిద్ధం చేస్తోంది. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాల ద్వారా పలు వ్యాపారాలను ప్రారంభింపజేయనున్నారు. జిల్లాకు ఒకటి చొప్పున మొత్తం 32 వాహనాలను మహిళా సంఘాల కోసం ప్రత్యేకంగా తయారు చేయి స్తున్నారు. ఒక్కో వాహనానికి రూ. 10 లక్షలు ప్రభుత్వం సమకూరుస్తోంది. జనవరి 3న వాహనాలను మంత్రి సీతక్క ప్రారంభించను న్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి మత్స్య యోజన పథకంతో అనుసంధానం చేసి.. 60 శాతం సబ్సిడీతో రూ. 4 లక్షలకే మహిళా సంఘాలకు ఈ వాహనాలు అందజేస్తారు. ఈ సబ్సిడీ మొత్తాన్ని సైతం బ్యాంకుల నుంచి వడ్డీ లేని రుణాలుగా సెర్ప్ ఇప్పించనుంది. గచ్చిబౌలిలోని నిథమ్ ఇన్స్టిట్యూట్లో మహిళా సంఘాల సభ్యులకు సంచార చేపల విక్రయానికి సంబంధించిన శిక్షణను సెర్ప్ ఆధ్వర్యంలో ఉచితంగా అందించనున్నారు. -
తిమింగలం సుదూర ప్రయాణం
వాతావరణ మార్పుల పెను ప్రభావాలు జలచరాలపై పడతాయని చెప్పే ప్రబల నిదర్శనమొకటి తాజాగా వెలుగుచూసింది. మహాసముద్రాల ఉపరితజలాల ఉష్ణోగ్రతల్లో మార్పుల కారణంగా చేపలు, తిమింగలం వంటి జలచరాల ఆహార లభ్యతలో మార్పులు సంభవిస్తున్నాయి. జత కట్టడానికి తోడు కోసం అలుపెరుగని అన్వేషణ కొనసాగిస్తున్నాయని తేలింది. చిన్న తిమింగలాల పెంపకానికి అనువైన వాతావరణం, పిల్లల్ని కనడానికి అనువైన సముద్రజలాల ఆవరణ కోసం ఈ భారీ జలచరం ఏకంగా 13,000 కిలోమీటర్లు ప్రయాణించిందని పరిశోధకుల పరిశోధనలో వెల్లడైంది. సరైన ఆవాసం, ఆహారం, తోడు కోసం దక్షిణ అమెరికా ఖండం నుంచి ఆఫ్రికా ఖండం దాకా వలస యాత్ర మొదలెట్టిన తిమింగలం.. ప్రయాణంలో భాగంగా ఏకంగా రెండు మహాసముద్రాలను దాటి మూడో మహాసముద్ర జలాల్లో తచ్చాడుతోంది. తిమింగలం తిప్పల కథ క్లుప్తంగా..9 సంవత్సరాల్లో..కొలంబియా దేశం సమీపంలో పసిఫిక్ మహా సముద్ర జలాల్లోని ‘గల్ఫ్ ఆఫ్ ట్రిబుగా’లో తొలిసారిగా 2013 జూలై పదో తేదీన ఒక బృందం ఈ మెగాప్టేరా నోవాఏంగ్లీ రకం హంప్‌బ్యాక్ మగ తిమింగలాన్ని చూశారు. దీని ఫొటోలను తీసి తిమింగలం వివరాలను పొందుపరిచే happywhale. com వెబ్సైట్లో పొందుపరిచారు. నాలుగేళ్ల తర్వాత దీనిని బహియే సోలానో ప్రాంతంలో కలియతిరగడం చూశారు. మళ్లీ ఐదేళ్ల తర్వాత అంటే 2022 ఆగస్ట్ 22న ఏకంగా 13,046 కిలోమీటర్ల దూరంలోని ఆఫ్రికా ఖండంలోని హిందూ మహాసముద్ర ప్రాంతం ఝాంజిబార్ చానల్ వద్ద చూశారు. దీనికి సంబంధించిన వేలాది ఫొటోలను కృత్రిమ మేధతో సరిపోల్చి 2013లో దక్షిణ అమెరికాలో కనిపించిన తిమింగలం ఇదేనని తేల్చారు. మొదటిసారి చూసిన ప్రాంతానికి, 2022లో కనిపించిన ప్రాంతానికి మధ్య దూరం సరళరేఖా మార్గంలో చూస్తే 13వేల కి.మీ.లు ఉంటుందని, ఒక వేళ ఇది అర్ధచంద్రాకార మార్గంలో ఇక్కడికి చేరుకుని ఉంటే ఇది ఏకంగా 19,000 కిలోమీటర్లు ప్రయాణించి ఉంటుందని లెక్కతేల్చారు. ‘‘ ఒక తిమింగలం ఇంతదూరం వలసరావడం చరిత్రలో ఇదే తొలిసారి. సరైన ఆహారం, తోడు దొరక్క సుదూరాలకు ప్రయా ణిస్తోంది’’ అని టాంజానియా సెటాసియన్స్ ప్రోగ్రామ్ శాస్త్రవేత్త డాక్టర్ ఎకటేరినా కలష్నికోవా చెప్పారు. కలష్నికోవా పరిశోధనా వివరాలు రాయల్ సొసైటీ ఆఫ్ ఓపెన్ సైన్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
3 చేపల కథ!
సాక్షి, హైదరాబాద్: ఏడు చేపల కథ తెలుసుగానీ ఈ మూడు చేపల కథ ఏంటి కొత్తగా అనుకుంటున్నారా? ముందుగా రాష్ట్రంలోని అమ్రాబాద్తోపాటు కల్సుబాయి, రాధానగరి పేర్లు విన్నారా? అవి దేశంలోని ప్రముఖ అభయారణ్యాలు. ఈ అభయారణ్యాల్లోని నీటిపాయల్లో తాజాగా మూడు రకాల చేపల జాతులను జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జెడ్ఎస్ఐ) గుర్తించింది. ఈ చేపల రకాలు ఇండోరియోనెక్టెస్ జాతికి చెందినప్పటికీ కాస్త వేర్వేరు లక్షణాలు కలిగి ఉండటంతో వాటికి మూడు వేర్వేరు పేర్లు పెట్టారు. అందులో మొదటి రకం చేపను తెలంగాణలోని అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో గుర్తించారు.అందుకే దానికి ఇండోరియెనెక్టెస్ ఆమ్రాబాద్ అని పేరు పెట్టారు. ఇది అక్కడ మాత్రమే జీవిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక రెండో రకం చేప జాతిని మహారాష్ట్రలోని పశి్చమ కనుమలలో ఉన్న కల్సుబాయి అభయారణ్యంలో గుర్తించిన సైంటిస్టులు.. దానికి ఇండోరియెనెక్టెస్ కల్సుబాయిగా నామకరణం చేశారు. మూడో రకం చేప జాతిని మహారాష్ట్రలోని రాధానగరి అభయారణ్యంలోని ఓ నదీ ప్రవాహంలో గుర్తించారు. దీనికి ఇండోరియోనెక్టెస్ రాధానగరిగా పేరుపెట్టారు.ఇండోరియోనెక్టెస్ వర్గానికి చెందిన చేపలు చాలా వరకు గోదావరి, కృష్ణా, కావేరి నదీ వ్యవస్థల్లో ఎక్కువగా కనిపిస్తాయని శాస్త్రవేత్త శ్రీకాంత్ జాదవ్ వివరించారు. మహారాష్ట్ర, గుజరాత్, గోవా, కర్ణాటక, కేరళలలో ఇవి ఎక్కువగా ఉంటాయని తెలిపారు. తెలంగాణలో తొలిసారిగా 2020లో ఇదే వర్గానికి చెందిన ఇండోరియోనెక్టెస్ తెలంగాణెన్సిస్ను కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లో కనుగొన్నారు. ఇప్పటివరకు ఈ రకానికి చెందిన ఆరు జాతుల చేపలను శాస్త్రవేత్తలు గుర్తించారు. -
అంతరిక్షంలో చేపలు పెంచారు!
చైనా వ్యోమగాములు అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. అంతరిక్షంలో ఏకంగా చేపలను పెంచి చూపించారు. నవంబర్ 4న ముగిసన షెన్ఝౌ–18 స్పేస్ మిషన్‌లో భాగంగా వాళ్లు ఈ ఘనత సాధించారు. చైనా అంతరిక్ష కేంద్రం ఇందుకు వేదికైంది. ఈ ప్రయోగం కోసం శరవేగంగా పెరిగే జీబ్రా చేపలను ఎంచుకున్నారు. వాటిని పెంచేందుకు అంతరిక్ష కేంద్రం లోపల అన్ని వసతులతో కూడిన క్లోజ్డ్ ఎకో సిస్టంను ఏర్పాటు చేశారు. చేపలు అందులోనే పెరిగి పెద్దవై పునరుత్పత్తి కూడా జరిపాయి. 43 రోజుల జీవనచక్రాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నాయి. తద్వారా అంతరిక్ష ప్రయోగాల్లో ఇది సరికొత్త రికార్డుగా నిలిచింది. అంతరిక్షంలో అత్యంత సవాళ్లతో కూడిన వాతావరణంలో జలచరాలు ఏ మేరకు మనుగడ సాగించగలవన్న దానిపై ఈ ప్రయోగం ద్వారా చాలా స్పష్టత వచి్చందని సైంటిస్టులు అంటున్నారు. అంతేగాక అంతరిక్ష రంగంలో కొంతకాలంగా చైనా సాధిస్తున్న పైచేయికి ఇది తాజా నిదర్శనమని కూడా చెబుతున్నారు. జీబ్రా చేపలకు జన్యుపరంగా మానవులతో చాలా దగ్గరి పోలికలుంటాయి. అంతరిక్షంలో వీటితో చేపట్టిన ప్రయోగం విజయవంతం కావడాన్ని కీలక మైలురాయిగా చెబుతున్నారు. భూమికి ఆవల శాశ్వత మానవ ఆవాసాల ఏర్పాటుకు చేస్తున్న ప్రయత్నాలు ఇకపై మరింతగా ఊపందుకుంటాయని భావిస్తున్నారు. ‘‘దీర్ఘకాలిక అంతరిక్ష మిషన్లు విజయవంతం కావాలంటే ఏం చేయాలన్న దానిపై ఈ ప్రయోగం మరింత స్పష్టతనిచి్చంది. అంతరిక్షంలో స్వయంపోషక జీవ వ్యవస్థల అభివృద్ధికి బాటలు పరిచింది’’ అని చైనా పేర్కొంది. -
డేంజర్ ‘డెవిల్’ ఫిష్!
తెనాలి: అత్యంత ప్రమాదకరమైన డెవిల్ ఫిష్ (దెయ్యపు చేప) గుంటూరు జిల్లా కొల్లిపర మండలం దావులూరులోని చేపల చెరువులో ప్రత్యక్షమైంది. నదులు, సముద్రాలకే పరిమితం కావాల్సిన ఈ చేపలను చూసి రైతు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాడు. దావులూరుకు చెందిన కోట రాంబాబు వ్యవసాయం చేస్తూనే, ఎకరంన్నర విస్తీర్ణం గల చెరువులో చేపల పెంపకం చేస్తున్నారు. గత ఆగస్టులో మార్కెట్ డిమాండ్ కలిగిన బొచ్చె, రాగండి, గడ్డి చేపల సీడ్‌ను రెండు వేల కౌంటు చెరువులో వేశారు. రోజూ మేత వేస్తున్నారు. ఫీడింగ్ ఎలా ఉంది? చేపలు ఎదుగుతున్నాయా? వ్యాధులు ఏమైనా అశించాయా? అనేది తెలుసుకునేందుకు బుధవారం వల వేయించి చేపలు పట్టించాడు. వాస్తవంగా తాము చెరువులో వేసిన చేపలు ఒకటీ, రెండూ మాత్రమే వస్తూ, డెవిల్ చేపలు ఎక్కువ పడుతుండడాన్ని గమనించాడు. వలకు బొచ్చె, రాగండి చేపలు తక్కువగా రావటమే కాదు...వచ్చి న ఒకటీ ఆరా చేప కూడా అర కిలో బరువు తూగాల్సి ఉంటే, కేవలం పావు కిలోకు మించలేదని చెప్పారు. అంటే డెవిల్ చేపలు రోజూ వేస్తున్న మేతను, చేపలను కూడా తినేస్తున్నాయన్న నిర్ధారణకు వచ్చి, ఆందోళనలో పడ్డాడు. కృష్ణానదికి మూడునెలల క్రితం వచ్చిన భారీ వరదలతో డెవిల్‌ఫిష్ ఇతర ప్రాంతాలకు విస్తరించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి డెవిల్‌ఫిష్ 2016లో తొలిసారిగా కృష్ణానదిలో విజయవాడ వద్ద కనిపించింది. భూమిమీద కూడా వెళ్లే సామర్థ్యం ఉన్న ఈ డెవిల్ ఫిష్, ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని 65 శాతం నీటివనరులకు విస్తరించిందని అంచనా వేస్తున్నారు. స్థానిక చేపల జాతులను విపరీతంగా తినేస్తూ.. సున్నితమైన జల జీవావరణ వ్యవస్థనూ దెబ్బతిస్తుంది. విభిన్నమైన ఆహారాలను తీసుకునే ఈ చేపలు అసాధారణ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని పేరు. ఆక్సిజను లేని పరిస్థితిని కూడా తట్టుకుంటాయి. కొన్ని సందర్భాల్లో వలలకు నష్టం చేయడంతో పాటు మత్స్యకారులకు గాయాలను కూడా చేసిన ఘటనలున్నాయి. 152 విభిన్న మంచినీటి చేప జాతులకు నిలయమైన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో డెవిల్ ఫిష్‌ను నియంత్రించాల్సిన ఆవశ్యకత ఉందని, లేకుంటే చేపల చెరువులు, పంట కాలువలు, నదుల్లో చేపల ఉత్పత్తికి ముప్పు వాటిల్లుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
బీఎస్ఎఫ్ పురుగులతో చవకగా చేపల మేత!
బ్లాక్ సోల్జర్ ఫ్రై (బిఎస్ఎఫ్) పురుగులను ప్రత్యామ్నాయ ప్రొటీన్ వనరుగా ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. ఎండబెట్టిన బిఎస్ఎఫ్ పురుగుల పిండితో బలపాల(పెల్లెట్ల) రూపంలో చేపల మేతను తయారు చేసుకునేందుకు మార్గం సుగమం అయ్యింది. కూరగాయలు, పండ్ల వ్యర్థాలను ముడిసరుకుగా వాడి పర్యావరణ హితమైన పద్ధతుల్లో బిఎస్ఎఫ్ పురుగులను ఉత్పత్తి చేసి, వాటితో వాణిజ్య స్థాయిలో నాణ్యమైన చేపల మేతను ఉత్పత్తి చేసే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఐసిఎఆర్ సంస్థ సెంట్రల్ మెరైన్ ఫిష్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సిఎంఆర్ఎఫ్ఐ) ఇటీవల అభివృద్ధి చేసింది. ఫీడ్ కన్వర్షన్ రేషియో చాలా మెరుగ్గా ఉండటమే కాకుండా చేపల మేత ఖర్చు తగ్గటం ద్వారా ఆక్వా రైతులకు మేలు జరుగుతుందని సిఎంఆర్ఎఫ్ఐ తెలిపింది. ఇప్పటివరకు సోయాచిక్కుళ్ల పిండి, ఎండుచేపల పిండిని ప్రొటీన్ వనరుగా చేపల మేతల్లో వాడుతున్నారు. (Ethnoveterinary medicine 90% కేసుల్లో యాంటీబయాటిక్స్ అవసరం లేదు)ఇక మీదట బిఎస్ఎఫ్ పురుగుల పిండిని నిక్షేపంగా వాడొచ్చని వెల్లడైంది. అయితే, ఈ మేత ఏయే రకాల చేపల పెంపకంలో ఎలా ఉపయోగపడుతోంది? అన్నది పరీక్షించాల్సి ఉంది. ఈ పరిశోధనను కొనసాగించేందుకు సిఎంఎఫ్ఆర్ఐ అమల ఎకోక్లీన్ అనే కేరళకు చెందిన స్టార్టప్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇదీ చదవండి: డ్రీమ్ జాబ్స్ అంటే ఇలా ఉంటాయా? వైరల్ వీడియో -
fishmonger: తీరిన కోరిక!
కీళ్లపూడిలో కృష్ణప్ప అనే ఓ చేపల వ్యాపారి ఉండేవాడు. చేపల చెరువులో రోజూ చేపలు పట్టుకుని ఓ పెద్ద గంపలో తీసుకెళ్లి పక్కనే ఉన్న రామగిరిలో అమ్ముకుని మధ్యాహ్నానికి ఇంటికి వచ్చేవాడు. వచ్చే ఆదాయంతోనే తన నలుగురు కూతుళ్లను చదివించుకుంటున్నాడు. తండ్రి కష్టాన్ని చూసి కూతుళ్లు బాధపడేవారు. ఈ కారణంగా చదువులపై శ్రద్ధపెట్టారు. ఓ రోజు కృష్ణప్ప గంప నిండా చేపలు పట్టి పక్క ఊరిలో సంతకు బయలుదేరాడు. దారిలో ఓ పెద్ద చేప గంపలో ఎగిరెగిరి పడుతుంటే కిందికి దించి చూశాడు. ఆ చేప దిగులుగా ఉంది. ‘అయ్యా.. నాకు జబ్బుపడ్డ చిన్నారి ఉంది. దాని బాగోగులు చూసుకోవాలి. నేను చూసుకోకుంటే అది బతకదు. అదంటే నాకు చాలా ప్రాణం. వెనక్కి వెళ్లి అది బాగయ్యే వరకు ఉండి వచ్చేస్తాను. ఆ తర్వాత నన్ను ఎక్కడైనా అమ్ముకో!’ అంటూ కంట తడిపెట్టింది బంగారు చేప.దాని ఆవేదనకు కృష్ణప్ప మనసు కరిగి, వెనక్కి వెళ్లి దాన్ని చేపల చెరువులో విడిచిపెట్టాడు. వేయికళ్లతో ఎదురు చూస్తున్న పిల్ల చేప దగ్గరికి చేరింది ఆ తల్లి చేప. నాలుగురోజుల పాటు దానికి మంచి ఆహారం పెట్టాడు కృష్ణప్ప. వారం రోజులకు, తన పిల్ల చేప ఆరోగ్యం కుదుటపడిన తర్వాత.. గట్టు మీద కూర్చొని చేపలు పడుతున్న కృష్ణప్ప గంపలోకి వచ్చి పడింది బంగారు చేప.ఆశ్చర్యపోయాడు కృష్ణప్ప. ‘నీ బిడ్డ ఆరోగ్యం బాగైందా?’ అడిగాడు. ‘మీ దయ.. మంచి ఆహారం పెట్టడం వల్ల ఆరోగ్యం బాగుపడింది. నా కోరిక తీరింది. ఇక నన్ను ఎక్కడైనా అమ్ముకుని లాభం పొందు’ అంది బంగారు చేప. తీసుకెళ్లాడు కృష్ణప్ప. దాన్ని సంతలో అమ్ముతుండగా బతికున్న ఆ చేపను ఓ ధనవంతుడు చూశాడు. పాతికవేలు ఇచ్చి కొనుక్కుపోయాడు. తీసుకెళ్లి ఉడికించడానికి పెనం మీద వేస్తుండగా ఎగిరి కింద పడింది. ‘అయ్యా.. జబ్బుపడ్డ నా బిడ్డ ఎలా ఉందో ఓసారి చూసుకుని వస్తాను. ఆ తర్వాత వేయించుకుని తిందువు’ అని వేడుకుంది.దాంతో ఆ ధనవంతుడు బంగారు చేపను కృష్ణప్ప వద్దకు తీసుకెళ్లి, విషయం చెప్పాడు. ఆశ్చర్యపోతూ కృష్ణప్ప, ఆ బంగారు చేపను మళ్లీ చెరువులో వదిలిపెట్టాడు. నాలుగు రోజుల తర్వాత అది తన పిల్లతో చెరువు గట్టు మీదకి వచ్చింది. కృష్ణప్ప వద్దకు వెళ్లి ‘నా పిల్లతో సహా నన్ను ధనవంతుడి వద్ద విడిచిపెట్టు’ అంది. కృష్ణప్ప ఆ రెండిటినీ ధనవంతుడి వద్దకు తీసుకెళ్లాడు. దాని నిజాయితీని మెచ్చుకున్న ధనవంతుడు ‘వద్దు కృష్ణప్పా.. వీటిని నువ్వే సంరక్షించు’ అంటూ ఆ రెండిటినీ వెనక్కి పంపాడు. కృష్ణప్ప తన ఇంట్లోనే పెద్ద అక్వేరియాన్ని ఏర్పాటు చేసి ఆ తల్లి, పిల్లను అందులో ఉంచి, ప్రదర్శన ఏర్పాటు చేశాడు.ఆ ఊరి వాళ్లే కాక, ఇరుగు, పొరుగు ఊళ్ల వాళ్లూ వచ్చి ఆ బంగారు చేపల్ని చూసి ఆనందించసాగారు. అలా జనం పెరిగి కృష్ణప్ప ఇంట్లోని అక్వేరియం పెద్ద ప్రదర్శనశాలగా మారిపోయింది. దాంతో కృష్ణప్పకు రోజూ డబ్బులు రాసాగాయి. చేపలు పట్టే పని మానుకుని, చేపల ప్రదర్శనతో వస్తున్న ఆదాయంతో తన పిల్లల్ని బాగా చదివించి ప్రయోజకుల్ని చేశాడు కృష్ణప్ప. ∙బోగా పురుషోత్తం -
చీరమీను.. రుచి అదిరేను.. రేటెంతైనా తినాల్సిందే
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఏడాదిలో ఒక్కసారి మాత్రమే లభించే చీరమీనుల్ని చూస్తే గోదావరి వాసులు లొట్టలేస్తారు. శీతల గాలి తిరిగిందంటే.. గోదావరి తీరంలో చీరమీను కోసం మాంసాహార ప్రియులు ఎగబడుతుంటారు. గోదావరికి వరదలు వస్తే పులస చేపల కోసం క్యూకట్టే తరహాలోనే అక్టోబరు నెలాఖరు మొదలు నవంబరు నెలాఖరు వరకూ చీరమీను కోసం గోదావరి తీరంలో తెల్లవారకుండానే జనం తండోపతండాలుగానే కనిపిస్తుంటారు. పోషకాలు దండిగా ఉండి సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చే అరుదైన ఈ చిట్టి చేపలను కొనాల్సిందేనంటారు. కార్తీకాన్ని ఎంతో నిష్టగా ఆచరించే వారు సైతం అరుదుగా లభించే చీరమీనును మాత్రం వదిలిపెట్టరు. కొలత ఏదైనా.. ధర ఎంతైనా.. మార్కెట్లో అన్నిరకాల వస్తువులను కేజీలు, లీటర్లలో కొలుస్తుంటారు. కానీ.. చీరమీను మాత్రం సంప్రదాయంగా వస్తున్న గిద్ద, సోల, గ్లాసు, తవ్వ , శేరు, కుంచం, బకెట్ కొలమానంతో విక్రయిస్తున్నారు. చీరమీను రోజువారీ లభ్యతను బట్టి లభ్యతను బట్టి ప్రస్తుతం శేరు (సుమారు కిలో) రూ.2 వేల నుంచి రూ.5 వేల ధర పలుకుతోంది. ఈ చీరమీను ఎక్కువగా యానాం, భైరవపాలెం, ఎదుర్లంక, జి.వేమవరం, గుత్తెనదీవి, జి.మూలపొలం, ఎదుర్లంక, మురమళ్ల, పశువుల్లంక, మొల్లేటిమొగ, పండి, పల్లం, సూరసేన యానాం, అంతర్వేదికర, వేమగిరి గ్రామాల్లో లభిస్తోంది. సెలీనియం అధికం సంపూర్ణ ఆరోగ్యానికి చీరమీను ఎంతో దోహదం చేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఈ చేపల్లో సెలీనియం అధిక మోతాదులో ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి, శరీరంలోని హానికరమైన కణాలతో పోరాడటానికి సహాయపడుతుందని పలు అధ్యయనాల్లో తేలిందని మత్స్య శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మానవునికి రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సెలీనియం కీలక పాత్ర పోషిస్తుంది. రోగనిరోధక కణాల పనితీరును మెరుగుపర్చి ఆస్తమాను తగ్గించడంలో క్రియాశీలకంగా పనిచేస్తుంది. థైరాయిడ్, గుండె సంబంధ వ్యాధులు, కొలె్రస్టాల్ స్థాయిలను తగ్గించడానికి చీరమీనులో ఉండే సెలీనియం సహాయపడుతుందని చెబుతున్నారు. చీరమీనుతో మసాలా కర్రీ, చింతకాయలతో కలిపి కూర, చీరమీను గారెలు కూడా వేస్తుంటారు. అంగుళం నుంచి.. ఇండో–పసిఫిక్ సముద్ర ప్రాంతాల్లో అరుదుగా లభించే చీరమీను లిజార్డ్ ఫిష్ జాతికి చెందిన చేపగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సినోడాంటిడే కుటుంబానికి చెందిన చేపలివి. వీటి శాస్త్రీయ నామం సారిడా గ్రాసిలిస్. సారిడా టంబిల, సారిడా అండోస్క్యామిస్ జాతులకు చెందిన చిట్టి చేపలని కూడా పిలుస్తారు. అంగుళం నుంచి మూడు అంగుళాల పరిమాణంలో ఉండే చీరమీను చీరల సాయంతో పడుతుంటారు. రంగు, రంగు చీరలను చూసి ఈ చిట్టిచేపలు గోదావరి అడుగు నుంచి నీటి ఉపరితలంపైకి వస్తుంటాయి. అలా చీరల్లోకి సమూహాలుగా వచ్చి ఇవి జాలర్లకు పట్టుబడుతుంటాయి. రేటెంతైనా తినాల్సిందే చాలా అరుదైన చీరమీను మార్కెట్లోకి వచ్చి0దంటే ఎంత ధరకైనా కొనాల్సిందే. మా చిన్నప్పుడు తాతల కాలం నుంచి చీరమీను సీజన్లో ఒక్కసారైనా ఈ కూర తినాలని చెప్పేవారు. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచిగా ఉండటంతో ఏ సీజన్లోను విడిచిపెట్టం. ఎంత ధర ఉన్నా కొని తినాల్సిందే. ధర రూ.5 వేలు ఉన్నా కొని కూర వండిస్తాం. – చిక్కాల నరసింహమూర్తి, యానాం ఆరోగ్యానికి దోహదం సీజనల్‌గా దొరికే చీరమీను ఎంత రుచిగా ఉంటుందో.. ఆరోగ్యానికి కూడా అంతే దోహదం చేస్తుంది. కాల్షియం, పొటాషియం, జింక్, అయోడిన్ చీరమీనులో ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఈ చేపల్లో ఉండే ఒమెగా–3 ప్యాటీ యాసిడ్స్‌తో ఎంతో ఉపయోగం. ఆరోగ్యానికి చీరమీను ఎంతో దోహదం చేస్తుంది. అనేక అధ్యయనాల్లో ఈ విషయం తేలింది. అందుకే ఈ ప్రాంతంలో మాంసాహార ప్రియులు సీజన్లో దొరికే చీరమీను ఎంత ఖర్చు పెట్టి అయినా కొనుగోలు చేస్తుంటారు. – కె.కరుణాకర్, మత్స్యశాఖ అధికారి, కాకినాడ -
చేపలు మాత్రమే తింటు..ఏకంగా 15 కిలోల బరువు తగ్గిన మహిళ..!
చేపలు ఆరోగ్యానికి మంచిదే గానీ అతిగా తింటే మాత్రం ప్రమాదమే. అలా తినమని సాధారణంగా వైద్యులు కూడా సూచించరు. కానీ ఈ మహిళ మూడు నెలల పాటు చేపలు మాత్రమే తిని ఏకంగా 15 కిలోల బరువు తగ్గింది. అది చూసి వైద్యులే కంగుతిన్నారు. వివరాల్లోకెళ్తే..ఫ్లోరిడాకి చెందిన 62 ఏళ్ల జేన్ క్రమ్మెట్ బరువు 109 కిలోలు ఉండేది. నడవలేని స్థితిలో మంచానికే పరిమితమై ఉంది. వైద్యులు బరువు తగ్గేలా ఆహారాలు, పానీయాలపై పలు నిబంధనలు పాటించాలని సూచించారు. కానీ అలా చేసినా ఆమె బరువు పరంగా ఎలాంటి మార్పు కనిపించలేదు.పైగా అలా మంచపైనే ఉండటంతో కాళ్లు బాగా వాచిపోయి, విపరీతమైన ఆకలితో బాధపడేది. ఇక ఎన్ని ప్రయత్నాలు చేసిన లాభం లేదని భావంచి స్నేహితుల సూచన మేరుకు వైద్యుడు బోజ్ని సంప్రదించింది. ఆయన ఆమెకు 'ఫిష్ ఫాస్ట్'ని సూచించారు. మూడు నెలల పాటు సార్డినెస్ అనే చేపలను మాత్రమే తినమని సూచించారు. ఇలా చేస్తే బరువు తగ్గుతారని అనడంతో జేన్ విస్తుపోయింది. ఏదో వింతగా ఉన్న ఎలాంటి ప్రయోజనం ఉంటుందో ఏమో..చూడాలని ట్రై చేసి చూసింది. ఆయన చెప్పినట్లుగా మూడు నెలల పాటు సార్డిన్ చేపలు మాత్రమే తినడం ప్రారంభించింది. ఇలా చేసిన రెండు నెలల్లోనే మంచి మార్పు కనిపించింది. ఏకంగా ఆరు కిలోలు వరకు తగ్గింది. ఇక మూడు నెలలు పూర్తి అయ్యేటప్పటికీ ఏకంగా 15 కిలోల వరకు తగ్గిపోయింది. జోన్ ఇంత స్పీడ్‌గా బరువు తగ్గడం చూసి వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు. ఇది ఒక రకమైన జిడ్డుకరమైన చేప. పైగా ఇందులో మంచి పోషక విలువలు ఉంటాయి. అనారోగ్యంతో ఉన్నవారిని దీన్ని తినమని వైద్యులు సూచిస్తారు. ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్, విటమిన్ డి, క్యాల్షియం ఉంటాయి. ఇలా చేపలతో బరువు తగ్గడం అత్యంత అరుదు కదూ..!.(చదవండి: వెన్ను నొప్పి కేన్సర్‌కు దారితీస్తుందా..?) -
కళ, సంస్కృతి, కవిత్వాన్ని ప్రేరేపించే చేప కథ
అనేక బెంగాలీ కుటుంబాలకు వారి ప్రియమైన ఇలిష్ (హిల్సా) లేకుండా దుర్గా పూజ అసంపూర్ణంగా ఉంటుంది. అది లేనిదే పూజ అసంపూర్తిగా ఉంటుందని భావించి కొందరు అమ్మవారికి ఈ చేప వంటకాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. హిల్సా వంటకం కేవలం పాక ఆనందాన్ని మాత్రమే కాకుండా వారి సంస్కృతిపై ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇది భారతదేశం, బంగ్లాదేశ్ ’జీవనాళం’ గుండా ఈదుతూ, పండుగలు, వేడుకలలో కనిపిస్తుంది.హిల్సా వెండి మెరుపు, అద్భుతమైన రుచి రారమ్మని ఆహ్వానిస్తాయి. బెంగాలీ–అమెరికన్ ఆహార చరిత్రకారుడు చిత్రిత బెనర్జీ ఈ చేప సాంస్కృతికతను సంపూర్ణంగా అక్షరీకరించారు. దీనిని ‘జలాల ప్రియత‘, ‘చేపలలో రాకుమారుడు‘గా అభివర్ణించారు.హిల్సా కథ పండుగలు, డైనింగ్ టేబుల్‌కు మించి విస్తరించి ఉంది. శతాబ్దాలుగా, ఇది సాంప్రదాయ కాళీఘాట్ పెయింటింగ్స్‌లో లేదా సమకాలీన వర్ణనలలో గంభీరమైన, మత్స్యకన్య లాంటి దేవతగా – కవులు, రచయితలు, కళాకారుల కల్పనలను ఆకర్షించింది.ఒక సాహిత్య వ్యవహారంహిల్సాతో బెంగాలీ ప్రేమ, దాని సాహిత్య సంప్రదాయంలో క్లిష్టంగా అల్లింది. 18 ఉపపురాణాలలో ఒకటైన బృహద్ధర్మ పురాణంలో సనాతనవాదులు దాని వినియోగాన్ని చర్చించినప్పటికీ, చేపలు బ్రాహ్మణులకు రుచికరమైనది అని ప్రశంసించారు. ‘బ్రాహ్మణులు రోహు (బెంగాలీలో రుయి), చిత్తడి ముద్ద (పుంటి), స్నేక్‌హెడ్ ముర్రెల్ (షూల్), ఇతర తెల్లటి, పొలుసుల చేపలను తినవచ్చని ఈ పాఠం చెబుతోంది‘ అని గులాం ముర్షీద్ తన పుస్తకం, బెంగాలీ కల్చర్ ఓవర్ ఎ థౌజండ్‌లో రాశారు. -
పనికిరాని చేపలతో పంటలకు పోషణ
మత్స్యకారులు వేటాడి తెచ్చిన చేపలలో కొన్ని కుళ్లి తినటానికి పనికి రాకుండాపోతుంటాయి. వాటిని మత్స్యకారులు పారేస్తుంటారు. అటువంటి పనికిరాని చేపలను ప్రకృతి వ్యవసాయదారులు పునర్వినియోగిస్తున్నారు. పంట చేలకు పోషకాలను అందించే చక్కని మీనామృతం తయారు చేస్తున్నారు. కాకినాడ జిల్లా గొల్ల్ర΄ోలు మండలం దుర్గాడకు చెందిన రైతు గుండ్ర శివ చక్రంతోపాటు పలువురు రైతులు మీనామృతం, అనేక రకాల కషాయలు, ద్రావణాల తయారీలో విశేష అనుభవం గడించారు. ప్రకృతి/సేంద్రియ వ్యవసాయం చేస్తూ కషాయాలు, ద్రావణాలు స్వయంగా తయారు చేసుకోలేని స్థితిలో ఉన్న ఎందరో రైతులకు దువ్వాడ రైతాంగం చేదోడుగా ఉంటున్నది. గతంలో కుళ్లిన ఉల్లిపాయలతో ద్రావణం తయారు చేసి నల్ల తామర పురుగును నియంత్రించటంలో దుర్గాడ రైతులు విజయం సాధించటం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అయ్యింది. అ రైతులు స్థానికంగా దొరికే పదార్థాలు, వనరులతో అనేక కషాయాలు, ద్రావణాలు తయారు చేస్తూ ప్రకృతి వ్యవసాయాన్ని పరిపుష్టం చేస్తున్నారు. ఈ కోవలోదే మీనామృతం. తినటానికి, ఎండ బెట్టడానికి పనికిరాని పచ్చి చేపలను ముక్కలు చేసి పాత బెల్లం కలిపి, 90 రోజులు మురగబెట్టి మీనామృతం తయారు చేస్తున్నారు. ఇది కొన్ని నెలల పాటు నిల్వ ఉంటుంది. పంటల ఎదుగుదలకు.. పూత, పిందె రాలకుండా బలంగా పెరగడానికి దీన్ని పంటలపై పిచికారీ చేస్తున్నారు. ఎకరానికి ఒక లీటరు సరి΄ోతుంది. మీనామృతం తయారు చేసి తమ పంటలపై వాడుకోవటంతో పాటు ఇతర ప్రాంతాల రైతులకు లీటరు రూ.120కి విక్రయిస్తున్నారు.– ప్రసాద్, సాక్షి, పిఠాపురంమీనామృతం బాగా పని చేస్తోంది!పచ్చి చేపలు, పాత బెల్లంతో తయారు చేస్తున్న మీనామృతం సేంద్రియ పంటలకు బాగా ఉపయోగ పడుతోంది. దీన్ని పిచికారీ చేసిన పంటల దిగుబడి పెరుగుతోంది. మా గ్రామంలో గో గాయత్రి ప్రకృతి వ్యవసాయ వనరుల తయారీ శిక్షణ కేంద్రంలో ఈ ద్రావణం తయారు చేస్తున్నాం. ఈ ద్రావణం కోసం వివిధ ప్రాంతాల నుంచి రైతులు వచ్చి తీసుకెళుతున్నారు. ప్రతీ రోజు సుమారు 100 లీటర్ల వరకు తయారు చేస్తున్నాం. దీంతోపాటు రసం పీల్చు పురుగు నివారణకు చిల్లీ స్పెషల్ కషాయం తయారు చేస్తున్నాం. కాకినాడ జిల్లా ప్రకృతి వ్యవసాయాధికారి ఎలియాజరు సహాయంతో వివిధ రకాల కొత్త కషాయాలు తయారు చేసి విక్రయిస్తున్నాం.– గుండ్ర శివచక్రం (95537 31023),ప్రకృతి వ్యవసాయదారుడు, దుర్గాడ, గొల్ల్ర΄ోలు మండలం, కాకినాడ జిల్లాపచ్చి చేపలు, పాత బెల్లంతో తయారు చేస్తున్న మీనామృతం సేంద్రియ పంటలకు బాగా ఉపయోగ పడుతోంది. దీన్ని పిచికారీ చేసిన పంటల దిగుబడి పెరుగుతోంది. మా గ్రామంలో గో గాయత్రి ప్రకృతి వ్యవసాయ వనరుల తయారీ శిక్షణ కేంద్రంలో ఈ ద్రావణం తయారు చేస్తున్నాం. ఈ ద్రావణం కోసం వివిధ ్ర΄ాంతాల నుంచి రైతులు వచ్చి తీసుకెళుతున్నారు. ప్రతీ రోజు సుమారు 100 లీటర్ల వరకు తయారు చేస్తున్నాం. దీంతోపాటు రసం పీల్చు పురుగు నివారణకు చిల్లీ స్పెషల్ కషాయం తయారు చేస్తున్నాం. కాకినాడ జిల్లా ప్రకృతి వ్యవసాయాధికారి ఎలియాజరు సహాయంతో వివిధ రకాల కొత్త కషాయాలు తయారు చేసి విక్రయిస్తున్నాం.– గుండ్ర శివచక్రం (95537 31023),ప్రకృతి వ్యవసాయదారుడు, దుర్గాడ, గొల్ల్ర΄ోలు మండలం, కాకినాడ జిల్లా -
walking fish: నడిచే చేపల గురించి విన్నారా?
సీ రాబిన్ చేపల్లో కొత్త రకం జాతుల వైవిధ్యమైన లక్షణాలను శాస్తవేత్తలు తాజాగా కనుగొన్నారు. సీ రాబిన్స్ చేపల్లోని ప్రియోనాటస్ కారోలైనస్ జాతుల మొప్పల వెనకాల రెక్కలతోపాటు, కిందిభాగంలో పీత ఉన్న మాదిరిగా ఆరు కాళ్లను గుర్తించారు. చేప ఈ కాళ్లతో ఎంచక్కా సముద్రగర్భం అడుగుభాగంపై చకచకా ముందుకు కదులుతోంది. ఆ కాళ్లకు మరో ప్రత్యేకత ఉంది. వాటి అడుగున ఉన్న పాదాల్లాంటి మెత్తని భాగానికి జ్ఞానేంద్రియంలాంటి గుణం ఉండటం విశేషం. సముద్రం అడుగున మట్టి కింద ఏదైనా చిన్న జీవి దాక్కున్నా, ఇంకేదైనా ఆహారం ఉన్నా ఈ చేప తన కాళ్లతోనే గుర్తించగలదు. అవసరమైతే మట్టిలో కూరుకుపోయిన ఆహారాన్ని తవ్వి బయటకు తీయగలదు. ఇలాంటి కొత్త విషయాలతో కూడిన అధ్యయన వివరాలు తాజాగా ‘కరెంట్ బయోలజీ’సైన్స్ జర్నల్‌లో గురువారం ప్రచురితమయ్యాయి. మట్టి అడుగున అమైనో ఆమ్లాలను కల్గిన చిన్న జీవి జాడనూ చేప గుర్తించగలదు. అక్కడి ఆహారం, జీవి నుంచి విడుదలయ్యే రసాయనాలను గుర్తించే ఏర్పాట్లు సీ రాబిన్ పాదాల్లో ఉన్నాయి. పాదాల్లోని నరాలు ఇందుకు అనుగుణంగా స్పందిస్తున్నాయని అధ్యయనకారులు తెలిపారు. మనిషి నాలుక మీద ఉండే రుచి మొగ్గల లాంటి బొడిపెలు ఈ చేప పాదాల కింద ఉన్నాయి. వీటి సాయంతో అది తన ఆహారం జాడ కనిపెడుతోందని అధ్యయనం వెల్లడించింది. -
Ghost Shark: కొత్త దెయ్యం షార్క్ దొరికింది
విల్లింగ్టన్: పసిఫిక్ మహాసముద్రంలో అత్యంత లోతుల్లో సంచరించే కొత్త రకం చేపను న్యూజిలాండ్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ చేప కళ్లు చాలా నల్లగా ఉండటంతోపాటు చిమ్మచీకటిమయమైన సముద్రం లోతుల్లో సంచరిస్తుండటంతో దీనిని ‘ఘోస్ట్ షార్క్’గా పేర్కొంటున్నారు. ఘోస్ట్ షార్క్‌లను స్పూక్ షిఫ్ లేదా చిమేరా అని కూడా అంటారు. వీటిలో ముళ్లులు, పొలుసులు ఉండవు. శరీరం మొత్తం మెత్తగా మృదులాస్థితోనే తయారై ఉంటుంది. న్యూజిలాండ్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాటర్ అండ్ అటా్మస్ఫిరికల్ రీసెర్చ్ బృందం ఈ చేప జాతిని కనుగొంది. న్యూజిలాండ్‌కు తూర్పున ఉన్న ఛాథమ్ రైస్ అనే సముద్రజలాల ప్రాంతంలో ఈ చేపలు జీవిస్తున్నాయి. ఉపరితలం నుంచి దాదాపు 2,600 మీటర్లలోతు మాత్రమే సంచరిస్తుంటాయి. మొత్తం పొడవులో సగం ఉండే పొడవాటి ముక్కు లాంటి నోరు వీటి ప్రత్యేకత. ‘‘లాటిన్లో అవియా అంటే బామ్మ. అందుకే దీనిని హరియోటా అవియా అని పేరు పెట్టాం. అంతరించి పోతున్న జాతుల జాబితాలో చేర్చే విషయమై ఆలోచిస్తున్నట్టు నిపుణులు తెలిపారు. -
సాల్మన్ చేపలతో సౌందర్యం..!
మాంసాహారులు ఇష్టంగా తినే సాల్మన్ చేపలు సౌందర్య సంరక్షణలో ప్రధాన పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా చర్మ సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. మొటిమలు సమస్య నుంచి ముడతల వరకు ప్రతి చర్మ సమస్యలో సమర్థవంతంగా పోరాడటంలో తోడ్పడుతుందని తెలిపారు నిపుణులు. అదెలాగో సవివరంగా చూద్దాం..!.ఆరోగ్యకరమైన మెరిసే చర్మం కోసం తప్పనిసరిగా సాల్మన్ చేపలను ఆహారంలో భాగం చేసుకోవాలని చెబతున్నారు నిపుణులు. ఇది చర్మానికి కావాల్సిన ఆర్థ్రీకరణ పెంచడంలోనూ, ముడతలతో పోరాడటంలోనూ సహాయపడుతుందట. ఈ సాల్మన్ చేప ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలతో నిండి ఉంటుంది. అందువల్ల ఇవి చర్మం తోపాటు మొత్తం ఆరోగ్యానికి అద్భుతమైనవి. ఈ ఆరోగ్యకరమైన కొవ్వులు తేమ అవరోధాన్ని నిర్వహించడమేగాక చర్మం బొద్దుగా, మృదువుగా ఉండేలా చేస్తాయి. ఇందులో ఉండే శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు కాలుష్యం, యూవీ కిరణాల వల్ల వాటిల్లే నష్టం నుంచి రక్షిస్తాయి. దీనిలోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు చర్మాన్ని డ్రై కానివ్వవు. తేమను లాక్ చేసి రోజంతా తాజాగా హైడ్రేటెడ్‌గా ఉండేలా చేస్తాయి. మొటిమలను నియంత్రిస్తాయి. అలాగే మొటిమలు వల్ల ఎదురయ్యే మంటను కూడా నివారిస్తాయి. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది.చర్మాన్ని యవ్వనంగా, దృఢంగా ఉండేలా చేయడంలో కొల్లాజెన్ కీలకం. సాల్మన్లోని అధిక స్థాయి ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు సహజంగా కొల్లాజెన్ ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. అలాగే ముఖంపై ఏర్పడే గీతలు, ముడతలను తగ్గిస్తాయి. చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. ఇందులోని విటమిన్ డీ చర్మాన్ని కాంతివంతంగా చేయడంలో సహాయపడుతుంది. పైగా ముఖ వర్చస్సు పెరుగుతుంది కూడా. అంతేగాదు స్కిన్ ఎలాస్టిసిటీని మెరుగుపరుస్తుంది. మచ్చలు వంటి వాటిని నివారించి స్కిన్ హీలింగ్‌కు మద్దుతిస్తుంది.(చదవండి: చట్నీ డే: చట్నీ, పచ్చళ్లు, పొడుల మధ్య వ్యత్యాసం..?) -
ఈ విషయం తెలుసా? ఈ సాలీడు కుడితే.. ఇక అంతే!
ప్రపంచంలోని సాలెపురుగుల్లోకెల్లా ఇది అత్యంత ప్రమాదకరమైనది. ఏదో బూజు గూడు అల్లుకునే మామూలు సాలెపురుగే అనుకుంటే పొరపాటే! ఇది కుట్టిందంటే, ఇక అంతే సంగతులు! ‘సిడ్నీ ఫన్నెల్ వెబ్ స్పైడర్’ అనే ఈ సాలెపురుగు ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరానికి వంద కిలోమీటర్ల వ్యాసార్ధం పరిధిలోని అడవుల్లో కనిపిస్తుంది. ఒక్కోసారి ఈ సాలెపురుగులు ఇళ్లల్లోకి కూడా చేరుతుంటాయి.ఈ సాలెపురుగు కుట్టినప్పుడు శరీరంలోకి చేరే విష పదార్థాలు నిమిషాల్లోనే నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. తక్షణ చికిత్స అందించకుంటే, అరగంటలోనే ప్రాణాలు పోయే పరిస్థితి తలెత్తుతుంది. ఈ సాలెపురుగు కాటు వల్ల మనుషులకు ప్రాణాపాయం ఉంటుంది గాని, కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులకు ఎలాంటి ప్రమాదం ఉండదు. ఇదొక అరుదైన విశేషం.ఒళ్లంతా ముళ్లున్న స్టార్ఫిష్..సముద్రంలో స్టార్‌ఫిష్‌లు అరుదుగా కనిపిస్తాయి. స్టార్ఫిష్లలో మరీ అరుదైనది ఈ ముళ్ల స్టార్ఫిష్. ఇది సముద్రం లోలోతుల్లో ఉంటుంది. ఒళ్లంతా ముళ్లు ఉండటం వల్ల దీనిని ‘క్రౌన్ ఆఫ్ థాన్స్ స్టార్ఫిష్’ అని అంటారు.ఈ ముళ్ల స్టార్‌ఫిష్‌లు రకరకాల రంగుల్లో ఉంటాయి. ఎక్కువగా నలుపు, ముదురు నీలం, ఊదా, ఎరుపు, గోధుమ రంగు, బూడిద రంగుల్లో ఉంటాయి. ఇవి ఎక్కువగా పగడపు దిబ్బలను ఆశ్రయించుకుని బతుకుతాయి. పర్యావరణ మార్పుల వల్ల పగడపు దిబ్బలు రంగు వెలిసిపోతుండటం, పగడపు దిబ్బల విస్తీర్ణం నానాటికీ తగ్గిపోతుండటంతో ఈ ముళ్ల స్టార్ఫిష్ల సంఖ్య కూడా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. పగడపు దిబ్బలను కాపాడుకునేందుకు తగిన చర్యలు చేపట్టకుంటే, ఈ ముళ్ల స్టార్ఫిష్ జాతి అంతరించిపోయే ప్రమాదం కూడా ఉంది.అత్యంత పురాతన గుహాచిత్రాలు..ప్రపంచంలో పురాతన మానవులు సంచరించిన ప్రదేశాల్లో పలుచోట్ల ఆనాటి మానవులు చిత్రించిన గుహాచిత్రాలు బయటపడ్డాయి. సహస్రాబ్దాల నాటి గుహాచిత్రాలు పురాతన మానవుల ఆదిమ కళా నైపుణ్యానికి అద్దంపడతాయి. ఇటీవల ఇండోనేసియాలోని సూలవేసీ దీవిలో అత్యంత పురాతన గుహాచిత్రాలు బయటపడ్డాయి. ఈ దీవిలోని మారోస్ పాంగ్కెప్ ప్రాంతానికి చెందిన లీంగ్ కరాంపాంగ్ సున్నపురాతి గుహల్లో ఈ పురాతన చిత్రాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు.వీటిలో ఎర్రరంగుతో చిత్రించిన మూడడుగుల పంది బొమ్మ, చిన్న పరిమాణంలో నిలబడి ఉన్న భంగిమలో మూడు వేటగాళ్ల బొమ్మలు ఉన్నాయి. ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్ యూనివర్సిటీకి చెందిన పురాతత్త్వ శాస్త్రవేత్తలు ఈ గుహాచిత్రాలపై క్షుణ్ణంగా పరిశోధనలు జరిపారు. గుహ లోపలి భాగంలో ఒకే రాతిపై వరుసగా చిత్రించిన ఈ బొమ్మలను కార్బన్ డేటింగ్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి పరీక్షించి, ఇవి కనీసం 51,200 ఏళ్ల కిందటివని అంచనాకు వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు దొరికిన గుహా చిత్రాలలో ఇవే అత్యంత పురాతనమైన గుహా చిత్రాలని గ్రిఫిత్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మాక్సిమ్ ఆబర్ట్ వెల్లడించారు. -
Devil Fish: ఇటువంటి చేపను మీరెప్పుడైనా చూశారా?
ఆదిలాబాద్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం తలాయి గ్రామం సమీపంలో పెద్దవాగులో ఓ వింత చేప లభ్యమైంది. పనెం శంకర్ చేపలు పట్టేందుకు వెళ్లగా.. అతడికి ఈ చేప దొరికింది. నల్లమచ్చలతో ఆకారం వింతగా ఉండటంతో చేపను చూసేందుకు స్థానికులు తరలివచ్చారు.ఈ విషయమై జిల్లా మత్స్యశాఖ ఫీల్డ్ అధికారి మధుకర్‌ను సంప్రదించగా.. ఈ చేపను డెవిల్ ఫిష్ అంటారని తెలిపారు. ఎక్కువగా ప్రాణహిత జలాల్లో సంచరిస్తుందని పేర్కొన్నారు. అయితే జిల్లాలో ఇప్పటివరకు జాలర్లకు దొరికిన ఘటనలు లేవని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ వైపు జిలాల్లో ఎక్కువగా వీటి సంచారం ఉంటుందని, ఈ చేపలు తినేందుకు పనికి రావని తెలిపారు.ఇవి చదవండి: చచ్చిన ఎలుకల కోసం రైల్వే పైలెట్ ప్రాజెక్ట్ -
బందరు తీరంలో భారీ చేప.. బరువు తెలిస్తే షాకే..
సాక్షి, కృష్ణా జిల్లా: సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు బందరు తీరంలో వలకు భారీ టేకు చేప చిక్కింది. మూడు రోజుల క్రితం కృష్ణా జిల్లా మచిలీపట్నం గిలకలదిండి వద్ద సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు టేకు చేప చిక్కింది.ఈ టేకు చేప 1500 కిలోల బరువు ఉన్నట్లు మత్స్యకారులు తెలిపారు. క్రేన్ సాయంతో ఆ భారీ చేపను బయటకు తీశారు. ఈ టేకు చేపను చెన్నైకి చెందిన వ్యాపారులు కొనుగోలు చేశారు. ఈ భారీ చేపను చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు.కాగా, బందరుకు ఆనుకుని బంగాళాఖాతంలో లభ్యమయ్యే చేప నాణ్యతకు.. రుచికి పెట్టింది పేరు. ఇక్కడ లభ్యమయ్యే చేపల్లో ఎలాంటి రసాయన ధాతువులు ఉండవు. అందుకే ఈ చేపలకు మంచి డిమాండ్. ఇక్కడ వందల రకాలు లభ్యమవుతుండగా వాటిలో 20 నుంచి 25 రకాల చేపలకు మాత్రం మంచి గిరాకీ ఉంది. ఈ చేపల కోసం విదేశీయులు కూడా ఎగబడుతుంటారు. -
మనం మీనం
పెంపుడు జంతువులు అనగానే మనకు కుక్కలు, పిల్లులు గుర్తొస్తాయి. ఎందుకంటే అవి మనుషులను గుర్తు పెట్టుకోవడమే కాదు విశ్వాసంగానూ ఉంటాయి. మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వెంటే వస్తుంటాయి. చాలా ఫ్రెండ్లీగా ఇంట్లో కలియదిరుగుతాయి. అయితే కుక్కలు, పిల్లులే కాదు.. చేపలు కూడా చాలా విశ్వాసంగా ఉంటాయని మీకు తెలుసా..? అవి మనతో ఫ్రెండ్లీగా ఉంటాయని విన్నారా? అలాంటి చేపలను మన ఇంట్లోని అక్వేరియంలో పెంచుకుంటే? అలాంటి ఫ్రెండ్లీ చేపల గురించి తెలుసుకుందాం.. మనసుకు ప్రశాంతత, కాలక్షేపం కోసం ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది పెంపుడు జంతువులతో సమయం గడుపుతున్నారు. మరికొందరైతే పని ఒత్తిడితో అలిసిపోయి ఇంటికి వచ్చాక కాసేపు వాటితో దోస్తానా చేస్తుంటారు. బిజీ లైఫ్‌స్టైల్‌తో మాన సిక ప్రశాంతత కోసం ఒక్కొక్కరూ ఒక్కో రకమైన జీవనశైలిని అలవాటు చేసుకుంటారు. తాజాగా హైదరాబాద్ వాసులు కాసేపు రిలాక్స్ అయ్యేందుకు చేపలను పెంచేస్తున్నారు.జీబ్రా చేపలుఈ చేపల శరీరంపై నల్లటి, తెల్లటి చారికలు ఉంటాయి. అందుకే వీటికి జీబ్రా అని పేరుపెట్టారు. జీబ్రా డానియోస్ పూర్తి పేరు. ఇవి యాక్టివ్‌గా ఉంటాయి. భిన్న పరిసరాలకు అనుకూలంగా ఒదిగిపోయే లక్షణాల కారణంగా వీటిని శాస్త్రవేత్తలు రీసెర్చ్ కోసం వాడుతుంటారు. ఇవి ఆరేడు చేపలతో కలిసి గుంపుగా పెరుగుతాయి.నెమలి నాట్యంలా.. నెమలి ఫించం లాంటి మొప్పలు ఉన్న చేపలు కదులుతుంటే అచ్చం నెమలి నాట్యం చేస్తున్నట్లే అనిపిస్తుంది. అవి నీటిలో అలాఅలా కదులుతుంటే మనసు గాల్లో తేలిపోక మానదు. ఇవి యజమానులను గుర్తించడమే కాదు.. మనం నేరి్పంచే టాస్్కలు కూడా నేర్చుకుంటాయి.‘ఆస్కార్’ ఇచ్చేయొచ్చు.. ఆస్కార్ ఫిష్‌లు గోల్డెన్, బ్లాక్, బ్లూ కలర్లో ఉంటాయి. అందంగా, ఫ్రెండ్లీగా ఉండి పెంచుకునే వారిని ఇట్టే గుర్తుపట్టేస్తాయి. వీటికి ట్రైనింగ్ ఇస్తే ముద్దు ముద్దుగా చెప్పినట్టు వింటాయి.ఇంటెలిజెంట్.. గోల్డ్ ఫిష్ అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. అక్వేరియం ఏర్పాటు చేసుకునే ప్రతి ఒక్కరూ గోల్డ్ ఫిష్ పెంచుకుంటారు. వీటికి జ్ఞాపక శక్తి, తెలివి చాలా ఎక్కువ. వీటికి కూడా మనకు నచ్చినట్టు ట్రైనింగ్ ఇచ్చుకోవచ్చు.హచ్ డాగ్స్‌లా.. పేరుకు తగ్గట్టే ఏంజెల్లా ఉంటాయి ఈ చేపలు. అక్వేరియంలోని ఇతర చేపలతో ఫ్రెండ్షిప్ చేస్తాయి. యజమానులు ఎటువెళ్తే అటు చూస్తాయి. ఇక ఫుడ్ పెట్టేటప్పుడు చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంటాయి.వెరీ.. క్యూరియస్ గయ్..గౌరమి అనే రకం చేపలు క్యూరియస్‌గా ఉంటాయి. కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తితో ఉంటాయి. ఒకే ప్రాంతంలో నివాసం ఉంటూనే.. చుట్టుపక్కల ఏం ఉన్నాయనే విషయాలు తెలుసుకుంటాయి. చుట్టుపక్కల చేపలతో ఫ్రెండ్లీగా ఉండటమే కాకుండా యజమానులను గుర్తుంచుకుంటాయి. సిచిల్డ్ చాలా భిన్నం..సిచిల్డ్ చేపలు చాలా భిన్నమైనవి. వాటి ప్రవర్తన క్లిష్టంగా ఉండటమే కాకుండా, చుట్టూ ఉన్న వాతావరణంతో కలగలిసి పోతాయి. ఏదైనా సమస్యలు వస్తే చాకచక్యంగా పరిష్కరించడంలో దిట్ట. జాగ్రత్తగా కాపాడుకోవాలి.. చేపలను పెంచాలని ఇష్టపడటమే కాదు. వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. సరైన సమయంలో ఫుడ్పెట్టాలి. ఎప్పటికప్పుడు నీటిని మారుస్తుండాలి. మోటార్లతో ఆక్సిజన్ అందేలా జాగ్రత్తపడాలి. లేదంటే వైరస్ బారినపడి చేపలు చనిపోతుంటాయి. – షేక్ నసీరుద్దీన్ మన బాధ్యత.. ఎలాంటి చేపలను పెంచితే ఎక్కువ కాలం జీవించగలవో తెలుసుకుని పెంచాలి. పెద్ద అక్వేరియం ఏర్పాటు చేసి, నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు చెక్ చేయాలి. చేపలకు మన మీద నమ్మకం రావడానికి సమయం పడుతుంది. ఆ తర్వాత అవి మనతో ఫ్రెండ్లీగా ఉండి, మనల్ని గుర్తుపడతాయి. – ఇబ్రహీం అహ్మద్ దస్తగిర్ -
పులస.. వలస..ప్రయాణమిక కులాసా
పుస్తెలు అమ్మి అయినా పులస తినాలనేది గోదావరి జిల్లాల్లో నానుడి. రుచిలోఅత్యంత మేటైన పులస చేపల ప్రవర్తన కూడా అంతే ప్రత్యేకమైనది. సముద్రం నుంచి గోదావరి నదిలోకి ఎదురీదుకుంటూ వచ్చే పులసల కోసం బంగాళాఖాతం నుంచి భద్రాచలం వరకూ స్వేచ్ఛగా విహరించేలా పోలవరం ప్రాజెక్టులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.సాక్షి, అమరావతి: గోదావరిలోకి ఎర్రనీరు పోటెత్తగానే సముద్రం నుంచి గోదావరిలోకి ఎదురీది వచ్చే పులసల ప్రయాణానికి ఇబ్బంది లేకుండా పోలవరం స్పిల్‌వే రెండో బ్లాక్‌లో ఫిష్ ల్యాడర్ నిర్మాణం పూర్తయ్యింది. జలాశయంలో డెడ్ స్టోరేజి 25.72 మీటర్ల స్థాయి నుంచి గరిష్ట మట్టం 45.72 అడుగుల వరకూ ఏ స్థాయిలో నీరు నిల్వ ఉన్నా పోలవరం ప్రాజెక్టు నుంచి ఎగువకు దిగువకు పులసలు రాకపోకలు సాగించేలా ఫిష్ ల్యాడర్ నిర్మించారు.గోదావరిలో వరద పెరుగుతుండటం.. ధవళేశ్వరం బ్యారేజి నుంచి వరద ప్రవాహం బంగాళాఖాతంలో కలుస్తుండటంతో సముద్రం నుంచి విలస ఎదురీదుతూ ఫిష్ ల్యాడర్ మీదుగా అఖండ గోదావరిలో విహరిస్తోంది. దేశంలో పులస, ఇతర చేపల స్వేచ్ఛా విహారానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసిన ఏకైక ప్రాజెక్టు పోలవరమేనని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచంలో చేపల స్వేచ్ఛా విహారానికి ప్రత్యేక ఏర్పాట్లు ఉన్న అతి పెద్ద జలాశయం పోలవరం ప్రాజెక్టే కావడం గమనార్హం. ప్రపంచంలో ఒక చేప జాతి సైకాలజీపై అధ్యయనం చేసి.. ఆ చేప జాతి స్వేచ్ఛకు విఘాతం కలి్పంచకుండా నిరి్మస్తున్న ఏకైక ప్రాజెక్టు కూడా పోలవరమేనని పర్యావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నదుల్లోకి ఎదురీదే అరుదైన జాతి గోదావరిలో ఏడాది పొడవునా పులసలు దొరకవు. నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల వర్షాలు కురిసి.. గోదావరి వరద ప్రవాహం (ఎర్రనీరు) సముద్రంలో కలిసే సమయంలో (జూన్ 4వ వారం నుంచి జూౖలె, ఆగస్టు మధ్యన సముద్రంలో జీవించే విలస రకం చేపలు నదిలోకి ఎదురీదుతాయి. సముద్రపు జలాల నుంచి విలస గోదావరి నీటిలోకి చేరాక పులసగా రూపాంతరం చెందుతుంది. పులస సంతానోత్పత్తి కోసం గోదావరిలోకి ఎదురీదుతుంది. వరదల సమయంలో ధవళేశ్వరం బ్యారేజీ గేట్లను ఎత్తి ఉంచడం వల్ల గోదావరి సముద్రంలో కలిసే అంతర్వేది నుంచి దాదాపుగా భద్రాచలం వరకూ నదిలో ఎదురీదుతుంది. విలస గోదావరి నీటిలోకి ప్రవేశించాక.. దాని శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకోవడం వల్ల పులసగా మారి అద్భుతమైన రుచినిస్తుంది. సంతానోత్పత్తి చేశాక తిరిగి సముద్రంలోకి చేరి.. విలసగా రూపాంతరం చెందుతుంది. పోలవరం నుంచి స్వేచ్ఛా విహారం పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తే అత్యంత అరుదైన పులస చేపల స్వేచ్ఛకు విఘాతం కలుగుతుందని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమానాలు వ్యక్తం చేసింది. పులస స్వేచ్ఛకు భంగం వాటిల్లకుండా పోలవరం ప్రాజెక్టు మీదుగా ఎగువకు.. దిగువకు స్వేచ్ఛగా విహరించేలా ఏర్పాట్లు చేస్తేనే ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతి ఇస్తామని షరతు విధించింది. ఆ షరతుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడంతో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చింది.సైకాలజీపై ప్రత్యేక అధ్యయనం సముద్రంలో ఉండే విలస.. గోదావరిలోకి చేరి పులసగా రూపాంతరం చెందాక.. అది ప్రవర్తించే తీరు(సైకాలజీ)పై అధ్యయనం చేసి.. దాని స్వేచ్ఛకు భంగం వాటిల్లకుండా ఎగువకు దిగువకు రాకపోకలు సాగించేలా పోలవరం ప్రాజెక్టుకు ఫిష్ ల్యాడర్ గేట్ల డిజైన్ రూపొందించే బాధ్యతను కోల్‌కతాలోని ప్రఖ్యాత సీఐఎఫ్ఆర్ఐ (సెంట్రల్ ఇన్‌ల్యాండ్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్)కు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. సుమారు ఐదేళ్లపాటు అధ్యయనం చేసిన సీఐఎఫ్ఆర్ఐ పులస స్వేచ్ఛా విహారానికి వీలుగా పోలవరం స్పిల్‌వే రెండో బ్లాక్‌లో అమర్చే ఫిష్ ల్యాడర్ గేట్లను డిజైన్ చేసింది. ఈ డిజైన్‌ను సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) ఆమోదించింది.ఇంజనీరింగ్ అద్భుతం.. ఫిష్ ల్యాడర్సీడబ్ల్యూసీ ఆమోదించిన మేరకు ఫిష్ ల్యాడర్ నిర్మాణాన్ని 2022లో పూర్తి చేసిన ప్రభుత్వం వాటికి గేట్లను కూడా అమర్చింది. గోదావరి నదిలో వరద ప్రవాహం ఏ స్థాయిలో ఉన్నా పులసలు స్వేచ్ఛగా విహరించేలా పోలవరం స్పిల్‌వే రెండో పియర్‌కు మూడుచోట్ల ఫిష్ ల్యాడర్ గేట్లను అమర్చింది. ఫిష్ ల్యాడర్ 252 మీటర్ల పొడవు ఉంటుంది. దీన్ని పోలవరం స్పిల్‌వే రెండో బ్లాక్‌లో నాలుగు అరలుగా నిరి్మంచారు. ఒక్కో అరకు ఒక్కో గేటు చొప్పున నాలుగు గేట్లను అమర్చారు. క్రస్ట్ లెవల్లో అంటే 25.72 మీటర్ల స్థాయిలో ఫిష్ ల్యాడర్ అరకు ఒకటి, 30.5 మీటర్ల స్థాయిలో అరకు రెండో గేటు అమర్చారు. 34 మీటర్ల స్థాయిలో అరకు మూడో గేటు, 41 మీటర్ల స్థాయిలో నాలుగో గేటు అమర్చారు. పోలవరం ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 45.72 మీటర్లు, కనిష్ట నీటిమట్టం 25.72 మీటర్లు. అంటే.. గోదావరిలో నీటిమట్టం గరిష్టంగా ఉన్నా.. సాధారణంగా ఉన్నా.. కనిష్టంగా ఉన్నా పులసలు ఎగువకు, దిగువకు రాకపోకలు సాగించేలా పోలవరం ప్రాజెక్టుకు ఫిష్ ల్యాడర్ గేట్లు అనుకూలంగా ఉంటాయి. పోలవరం స్పిల్‌వే మీదుగా పులస స్వేచ్ఛగా విహరిస్తుండటంతో ఫిష్ ల్యాడర్‌ను ఇంజనీరింగ్ అద్భుతంగా పర్యావరణ నిపుణులు అభివరి్ణస్తున్నారు. -
‘మీన’మేషాలు!
సాక్షి, సిద్దిపేట : రాష్ట్రంలో స్థానిక జాతుల చేపలు అంతరించిపోయే దశకు చేరుకుంటున్నాయి. కొన్ని రకాల చేపలనే విస్తృ తంగా పెంచడం, మిగతా వాటి బ్రీడింగ్, పరిరక్షణ లేకపోవడమే దీనికి కారణమవుతోంది. ఈ క్రమంలో సిద్దిపేట జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల బీఎస్సీ (ఫిషరీస్), ఎమ్మెస్సీ (ఫిషరీస్) అధ్యాపకులు, విద్యార్థులు చేపల జీవవైవిధ్య స్టడీ ప్రాజెక్ట్ చేపట్టారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి స్థానిక చేపలను సేకరించి భద్రపరుస్తున్నారు. ప్రభుత్వం సహకరిస్తే స్థానిక రకాల చేపల బ్రీడింగ్ చేపడతామని చెబుతున్నారు. ఎన్ని ఉన్నా ఆ 4 రకాలే ఎక్కువ రాష్ట్రంలో మొత్తం 166 రకాల చేపలుండగా.. నాలుగు రకాల చేపలే ఎక్కువగా లభిస్తాయి. రోహు (రవ్వ), బొచ్చ, బంగారు తీగ, బొమ్మె చేపలే విస్తృతంగా పెంచడం, వినియోగించడం జరుగుతోంది. మిగతా రకాల చేపలు మెల్లగాఅంతరించిపోతున్నాయి. భవిష్యత్తులో పలు రకాల చేపల పేర్లు వినడమే తప్పితే చూసే పరిస్థితి ఉండదని నిపుణులు అంటున్నారు.ఇంటర్నేషనల్ యూనియన్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) తమ రెడ్‌బుక్‌లో ఇప్పటికే పలు రకాల చేపలు అంతరించిపోతున్నాయని వెల్లడించింది. అందులో తెలంగాణకు చెందిన 20 రకాల జాతుల చేపలు కూడా ఉండటం గమనార్హం.65 రకాల చేపలు సేకరించి.. చేపల జీవవైవిధ్య స్టడీ ప్రాజెక్ట్‌లోభాగంగా సిద్దిపేట ప్రభుత్వ పీజీ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు కలసి ఇప్పటివరకు 65 రకాల చేపలను సేకరించారు. వాటిని ముందు తరాలకు చూపించడం, అందించడం కోసం ప్రయత్నిస్తున్నారు. సహజ ఆవాసాల్లో లభించే వివిధ రకాల చేపలను సేకరించి, స్పెసిమెన్లనూ నిల్వ చేస్తున్నారు. ఇప్పటివరకు గోదావరి, మున్నేరు, కృష్ణా నదులు, వైరా, పాలేరు రిజర్వాయర్ల నుంచి మంచినీటిలోపెరిగే చేపలను తీసుకువచ్చారు. మలుగు పాము పాములా కనిపిస్తున్నా ఇది చేపనే. మలుగు పాముగా పిలిచే ఈ చేపలు సాధారణంగా2 నుంచి 3 అడుగుల మేర పెరుగుతాయి. మత్స్యకారులు దీనిని మున్నేరు వాగులో పడితే విద్యార్థులు కొనుగోలు చేసి తెచ్చారు. దీనికి పొలుసులు ఉండవు.ఇది బ్రీడింగ్ సమయంలో వలస వెళ్తుంది.మగ దుమ్మ ఈ చేప పేరు మగ దుమ్మ. ఇది వైరా రిజర్వాయర్‌లో లభించింది. అంతరిస్తున్న చేపల రకాల్లో ఇది కూడా ఉంది. క్యాట్ ఫిష్ జాతికి చెందిన ఈ చేపల్లో ఆరోగ్యానికి మేలు చేసే ఒమెగా–3 ఫ్యాట్ అధికంగా ఉంటుంది. చుక్క పాంప్రెట్ చేప ఇది చుక్క పాంప్రెట్ చేప.ఈ రకం చేపలువలకు చిక్కాయంటే మత్స్యకారులకుపండగే. ఇవి బాగా రుచిగా ఉండటంతో ముంబై, కేరళ ప్రాంతాల ప్రజలు లొట్టలేసుకొని తింటారు. ఇవి మున్నేరు నదిలో ఉన్నాయి. ఒక్క సిద్దిపేటలోనే ఎమ్మెస్సీ ఫిషరీస్ కోర్సురాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల బీఎస్సీ (ఫిషరీస్) కోర్సును నిర్వహిస్తున్నా.. ఒక్క సిద్దిపేట జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ,పీజీ కళాశాల (అటానమస్)లో ఎమ్మెస్సీ(ఫిషరీస్) కోర్సు అందుబాటులో ఉంది. 2017–18లో ప్రారంభమైనఈ పీజీ కోర్సును ఏటా 40 మంది విద్యార్థులు పూర్తి చేస్తున్నారు. విద్యార్థులకు ప్రత్యేకంగా చేపల ఫారి్మంగ్ తీరును చూపించేందుకు.. కళాశాల ప్రాంగణంలోనే రకరకాల చేపలను పెంచుతున్నారు. ఆ చేపలకు ఫుడ్‌ను కాలేజీలోనే తయారు చేస్తున్నారు. అలాగే ఎక్వేరియం చేపల బ్రీడింగ్ కూడా చేస్తున్నారు. బ్రామ బెలగారి ఈ చేపను ఓసియో బ్రామ బెలగారి చేపఅంటారు. దీనిని గోదావరి నది నుంచితీసుకువచ్చారు. ఇవి అచ్చం పరక చేపల మాదిరిగా ఉంటాయి. ఈ రకం చేపలుఅంతరించిపోతున్న జాబితాలో ఉన్నాయి. స్థానిక చేపల విత్తనోత్పత్తి చేస్తాం స్థానికంగా లభించే రకరకాల చేపలు అంతరించి పోతున్నాయి. స్థానిక చేపల విత్తనోత్పత్తి దిశగా ముందుకు సాగుతున్నాం. ప్రభుత్వం సహకరిస్తే స్థానిక చేపల విత్తనోత్పత్తి చేసి అందిస్తాం. మా కళాశాలలో చదివిన విద్యార్థులు ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. మన రాష్ట్రంలో చేపల ఉత్పత్తిని పెంచేందుకు ఫిషరీస్ చేసిన విద్యార్థులను వినియోగించుకోవడం వల్ల మేలు జరుగుతుంది. – అయోధ్యరెడ్డి, ఫిషరీస్ హెడ్, ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల సిద్దిపేట65 రకాలు సేకరించాం.. చేపల జీవవైవిధ్య స్టడీ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటివరకు 65 రకాల చేపలను సేకరించి భద్రపరిచాం. కృష్ణా, గోదావరి, మున్నేరు నదులు, వైరా, పాలేరు రిజర్వాయర్ల నుంచి అంతరించి పోతున్న చేపలను సేకరించాం. ఏదైనా కొత్త రకం చేప పడితే చెప్పాలని మత్స్యకారులను కోరాం. ఫిషరీస్ చదివిన వారికి ప్రభుత్వంఉద్యోగాలు కల్పించి మన మత్స్య సంపదను కాపాడాలి. – సాయికుమార్, ఎమ్మెస్సీ సెకండియర్ -
దెయ్యం చేపలు!
భద్రాచలం: తిరుమలాయపాలెం మండలంలోని బీసురాజుపల్లి ఆకేరు చెక్‌డ్యామ్ నీటిలో గిరిజనులకు సముద్ర జలాల్లో మాత్రం కనిపించే వింత రకం చేపలు లభించాయి. సముద్ర జలాల్లో మాత్రమే తిరిగే ఈ చేపలను అక్వేరియంల్లోనూ పెంచుతారని తెలుస్తోంది. స్థానికంగా వీటిని దయ్యం చేపలుగా పిలుస్తుండగా, వరదల సమయాన ఆకేరు చెక్‌డ్యామ్‌లోకి చేరినట్లు భావిస్తున్నారు. కాగా, ఇవి చెరువుల్లోకి చేరితే ఇతర చేపల అభివృద్ధికి ఆటంకంగా మారుతాయని మత్స్యకారులు చెబుతున్నారు. -
చూస్తే.. గోరంత చేపలే! ఇవి శబ్దం చెవులు చిల్లులు పడాల్సిందే!!
ఈ నీటితొట్టెలోని చేపలను చూశారు కదా! ఇవి చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి. వీటి పొడవు దాదాపు గోరంత ఉంటుంది. కచ్చితంగా చెప్పాలంటే, ఇవి 10 నుంచి 12 మిల్లీమీటర్ల పొడవు వరకు ఉంటాయి. పారదర్శకంగా తళతళలాడుతూ చూడచక్కగా ఉంటాయి.అయితే, ఇవి శబ్దం చేస్తే మాత్రం చెవులు చిల్లులు పడాల్సిందే! ఈ చేపలకు శాస్త్రవేత్తలు ‘డేనియోనెల్లా సరీబ్రమ్’ అని పేరుపెట్టారు. వీటి నుంచి వెలువడే శబ్దం 140 డెసిబల్స్ వరకు ఉంటుంది. మామూలుగా మనుషుల చెవులు 70 డెసిబల్స్ వరకు శబ్దాన్ని భరించగలవు. అంతకు రెట్టింపు స్థాయిలో కూత పెట్టగలగడమే ఈ గోరంత చేపల ప్రత్యేకత.వీటి శబ్దం దాదాపుగా జెట్విమాన శబ్దంతో సమానంగా ఉంటుంది. ఈ చేపలను తొలిసారిగా 1980లలో గుర్తించారు. అయితే, ఈ చేపలను పోలిన ‘డేనియోనెల్లా ట్రాన్స్లూసిడా’ అనే మరోరకం చేపలు కూడా ఉండటంతో శాస్త్రవేత్తలు వీటి లక్షణాలను నిర్దిష్టంగా గుర్తించడంలో కొంత గందరగోళానికి లోనయ్యారు.మూడేళ్ల కిందట ఒక అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం వీటిపై పరిశోధనలు జరిపి, వీటి కూత శక్తిని తెలుసుకున్నారు. వీటి గొంతు వద్ద ధ్వనికండరాలు, మృదులాస్థి ప్రకంపనల ద్వారానే ఈ చేపలు చెవులు చిల్లులు పడే స్థాయిలో కూత పెట్టగలుగుతున్నాయని గుర్తించారు. వీటి కూత ముందు సింహగర్జన కూడా బలాదూరే! సింహగర్జన శబ్దం 114 డెసిబల్స్ అయితే, ఈ చేపల కూత శబ్దం 140 డెసిబల్స్. ఇంతకు మించిన శబ్దం చేసే జీవి ప్రపంచంలో మరేదీ లేదు. -
రూ.25 లక్షల విలువైన చేపల్ని చోరీ చేసిన టీడీపీ శ్రేణులు
ఏర్పేడు: తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలోని పెనుమల్లంలోని పంచాయతీ చెరువులో రూ.25 లక్షల విలువైన చేపల్ని టీడీపీ కార్యకర్తలు దొంగిలించారని లీజుదారు ఘొల్లుమంటున్నాడు. ఈ మేరకు పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే.. పెనుమల్లంలోని పంచాయతీ చెరువుకు గత ఏడాది అక్టోబర్‌లో పంచాయతీ అధికారులు లీజు వేలం నిర్వహించారు. పంచాయతీ పరిధిలోని నడుమూరు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు మునిరాజా రూ.50 వేల లీజుకు చేపల చెరువును దక్కించుకున్నాడు. సుమారు రూ.5 లక్షలు వెచ్చించి చేప పిల్లల్ని కొనుగోలు చేసి చెరువులో వేసి పెంచుతున్నాడు. చేపల చెరువు కాలపరిమితి ఆదివారంతో ముగియనుంది. కాగా.. టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యంగా చెరువులోని చేపల్ని వలలతో పట్టుకుని తీసుకుపోయారు. ఇదేమిటని అడిగినందుకు చెరువు వద్దకు వస్తే తాట తీస్తామని బెదిరించడంతో బాధితుడు పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. చెరువులోని సుమారు రూ.25 లక్షల విలువైన చేపలను టీడీపీ కార్యకర్తలు పట్టుకుని వెళ్లారని బాధితుడు వాపోయాడు. ఈ విషయంపై ఇన్చార్జి పంచాయతీ కార్యదర్శి శివప్రసాద్‌ను వివరణ కోరగా.. ఆదివారం వరకు చేపల చెరువుకు కాలపరిమితి ఉందని, సమస్యపై చర్చించి న్యాయం చేస్తామని చెప్పారు. -
చికెన్, ఫిష్ కబాబ్స్‌ల్లో కృత్రిమ రంగుల వాడకం నిషేధం!
రెస్టారెంట్లలోనూ, హోటల్స్‌లోనూ ఆహారం ఆకర్షణీయంగా ఫుడ్ కలర్స్ ఉపయోగిస్తుంటారు. మనం కూడా అలా కనిపిస్తే ఆవురావురామంటూ తినేస్తాం. కానీ దీని వల్ల పలు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయంటూ వాటిపై నిషేధం విధించారు అధికారులు. ఒకవేళ ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే ఏకంగా ఏడేళ్లు దాక జైలు శిక్ష పడుతుందట. ఈ నిషేధం ఎక్కడంటే..శాకాహారం దగ్గర నుంచి నాన్‌వెజ్‌లలో చికెన్, ఫిష్ కబాబ్స్లపై కృత్రిమ రంగులు వాడుతుంటారు. తినేవాడికి నోరూరించేలా ఆకర్షణీయంగా కనిపించడం కోసం ఇలా చేస్తుంటారు. ముఖ్యంగా కబాబ్స్ల వంటి వాటికి ఎక్కువగా కృత్రిమ రంగులు వినయోగిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే కర్ణాట ప్రభుత్వం సోమవారం ఈ నిషేధం విధించింది. ఇది ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని పేర్కొంది. ఈ కృత్రిమ రంగులు శరీరానికి హానికరమని, ప్రతికూల ఆరోగ్య ప్రభావాలను కలిగిస్తాయని చెబుతోంది. ఈ విషయమై కర్ణాటక ఆహార భద్రత ప్రమాణాల విభాగానికి వివిధ ఫిర్యాదులు అందాయి. దీంతో కృత్రిమ రంగులను ఉపయోగించే 39 తినుబండరాల నమునాలను పరీక్షించగా వాటిలో సుమారు ఎనిమిది కృత్రిమ రంగుల ఉపయోగిస్తున్నారని,అవి సురక్షితం కాదని తేలింది. ఈ నేపథ్యంలోనే కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య మంత్రి దినేష్ గుండూరావు కృత్రిమ రంగులను ఉపయోగించే తినుబండారాలను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేగాదు ఈ విషయాన్ని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా వెల్లడించడమే గాక ఈ నిబంధనలను ఉల్లంఘించిన ఆహార విక్రేతలపై పది లక్షల జరిమానా, ఏడేళ్లు జైలు శిక్షతో సహా పలు తీవ్రమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. (చదవండి: 90 ఏళ్ల వృద్దుడికి అరుదైన వ్యాధి..కడుపు ఛాతిలోకి చొచ్చుకుపోయి..) -
అహో!
వీడియో వైరల్ కావడానికి అసాధారణ అద్భుతాలతో పనిలేదు. ‘ఆహా’ అనిపిస్తే చాలు. ఇది అలాంటి వైరల్ వీడియోనే. ప్రఖ్యాత ఫొటోగ్రాఫర్ మార్క్ స్మిత్ తీసిన వీడియో నెటిజనులను మంత్రముగ్ధులను చేసింది. చేపను క్యాచ్ చేస్తున్న ఒక డేగకు సంబంధించిన క్లోజ్–అప్ షాట్ ఇది.కెమెరామన్‌గా మార్క్ స్మిత్ అద్భుతమైన పనితనం ఈ వీడియోలో కనిపిస్తుంది. ఈ స్టన్నింగ్ వీడియో 124 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. -
చేపను పోలిన భవనం..ఎక్కడుందంటే..?
కనస్ట్రక్షన్కి టెక్నాలజీ కూడా తోడవ్వడంతో విభిన్న ఆకృతిలో భవనాలను నిర్మిస్తున్నారు అధికారులు. అవి నగరానకి స్పెషల్ ఐకాన్‌గా నిలిస్తున్నాయి. అబ్బా ఎలా నిర్మించారు దీన్ని అని ఆశ్చరయపోయేలా వాటిని నిర్మిస్తున్నారు. అలానే చేప ఆకృతిలో భవనాన్ని నిర్మించి వాటే ఏ బిల్డింగ్ ఇది అను ముక్కునవేలేసుకునేలా చేశారు నిర్మాణకారులు. ఎక్కడుందంటే ఈ భవనం..?ఈ ఫిష్ బిల్డింగ్ హైదరబాద్ ఉంది. దీన్ని నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ ప్రాంతీయ కార్యాలయంగా చేప ఆకృతిలో నిర్మించారు. స్థానికంగా దీన్ని ఫిష్ బిల్డింగ్ అనిపిలుస్తారు. ఈ బిల్డింగ్‌కి స్ఫూర్తి..1992లో పూర్తి అయిన బార్సిలోనా ఫ్రాంక్ గెహ్రీ స్మారక ఫిష్ శిల్పం. దాన్ని చూసి ఇలా చేప ఆకారంలో బిల్డింగ్‌ని నిర్మించడం జరిగింది. ఈ భవనం మిమెటిక్ ఆర్కిటెక్చర్‌కు ఒక ఉదాహరణ. చేప రూపంలో మొత్తం బిల్డింగ్ కార్యచరణ అంశాలను కలుపుతుంది. దీని ప్రవేశ ద్వారం రెండు మెట్లపై ఉన్న గుడారంలా ఉంటుంది. రెండు వృత్తాకరా అద్దాలు చేప కళ్లులా కనిపిస్తాయి. మొత్తం భవనం స్టెయిన్లెస్ స్టీల్‌తో కప్పబడి, మధ్యలో నీలిరంగు స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఉంటుంది. అంతేగాదు ఆ బిల్డింగ్‌కి ఉన్న బ్లూ-పర్పుల్ స్పాట్లైట్లు రాత్రిపూట భవనాన్ని ప్రకాశించేలా చేస్తాయి. చూడటానికి ఈ ఫిష్ బిల్డింగ్ ఓ'జెయింట్ ఫిష్' హైదరాబాద్‌లో ఈదుతున్నట్లుగా కనిపిస్తుంది.(చదవండి: రూ. 83 లక్షల జీతం వదులుకుని మరీ పేస్ట్రీ చెఫ్‌గా..రీజన్ వింటే షాకవ్వుతారు!) -
ఇదేంటో తెలుసా? దీనిని తాకితే.. ప్రాణాలకే?
చేపలను చాలామంది ఇష్టంగా తింటారు. అలాగని అన్ని చేపలూ తినడానికి పనికొచ్చేవి కాదు. చేపల్లో కొన్ని రకాలు విషపూరితమైనవి కూడా ఉంటాయి. ప్రపంచంలోని విషపూరితమైన చేపల్లోకెల్లా అత్యంత విషపూరితమైన చేప ‘స్టోన్‌ఫిష్’. ఇది ఎక్కువగా సముద్రం అడుగున ఉంటుంది. చూడటానికి అచ్చంగా రాయిలా కనిపిస్తుంది.సముద్రగర్భంలో డైవింగ్ చేసేవారికి తప్ప ఒడ్డున ఉన్నవారికి ఇది కనిపించడం చాలా అరుదు. డైవింగ్ చేసేవారు దీనిని చూస్తే చేప అనుకోరు. సముద్రం అడుగున ఉండే ఎన్నో రాళ్లలో ఇది కూడా ఒక రాయేనని పొరబడుతుంటారు. పొరపాటున దీనిపైన అడుగు వేసినా, తాకినా ప్రమాదం తప్పదు. స్కార్పియన్‌ఫిష్ జాతికి చెందినది ఈ స్టోన్‌ఫిష్.ఇది ఎక్కువగా భారత్, చైనా, ఫిలిప్పీన్స్, పాపువా న్యూగినీ, ఆస్ట్రేలియా పరిధిలోని సముద్ర జలాల్లో కనిపిస్తుంది. దీని కాటు అత్యంత విషపూరితమైనది. ఇది కాటు వేస్తే గంటల తరబడి నొప్పితో విలవిలలాడాల్సి వస్తుంది. దీని కాటుకు విరుగుడు మందు కూడా ఇంతవరకు లేదు. ఒక్కోసారి దీని కాటు మనుషుల ప్రాణాలు కూడా తీస్తుంది.ఈ సంగతి గురించి మీకు తెలుసా?‘మర్డర్’ అంటే హత్య అనే అర్థమే అందరికీ తెలుసు. అయితే, కాకుల గుంపును కూడా ‘మర్డర్’ అనే అంటారు.ఇవి చదవండి: ఇదేం చేప కాదు.. నీటిలో దిగితే దానికంటే తక్కువేం కాదు! -
మిలమిల మెరిసే మిణుగురు చేపలు గురించి విన్నారా..?
చేపలు రంగురంగుల్లో ఉంటాయని తెలుసు... కానీ మిణుగురుల్లా... రాత్రి పూట వెలిగే చేపల్ని చూశారా? అదే ఫ్లోరోసెంట్ ఫిష్! అక్వేరియంలో చేపలు సందడి చేస్తేనే సంబర పడతాం. మరి అవి మిలమిలా కాంతులతో మెరిసిపోతే? కేరింతలు కొడతాం కదూ! అలాంటి చేపలు ఎక్కడున్నాయో తెలుసా? తైవాన్‌లో సందడి చేస్తున్నాయి ఈ చేపలు. మరి ఇన్నాళ్ల నుంచి సముద్రం అడుగున మన మన కంటపడకుండా ఉన్నాయా..? అంటే కానేకాదు. ఎందుకంటే ఈ చేపల్ని శాస్త్రవేత్తలే సృష్టించారు. జన్యు మార్పిడి విధానం తెలుసుగా. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా జన్యు మార్పిడి పరిజ్ఞానంతో చేసిన అతిపెద్ద చేపలు ఇవే. ఎందుకీ ప్రయోగం అంటే?ఈ ప్రక్రియ వల్ల జంతువుల్లోను, మనుషుల్లోను జన్యుపరంగా వచ్చే వ్యాధులను ఎలా నివారించవచ్చో తెలుస్తుంది. సుమారు ఆరు అంగుళాల వరకు పెరిగే ఏంజెల్ చేపల్ని తీసుకుని ప్రయోగాలు చేసి, వాటి శరీరానికి మెరిసే లక్షణం వచ్చేలా చేశారు. వీటిని ఏంజెల్ ఫ్లోరోసెంట్ ఫిష్ అని పిలుస్తారు. తైవాన్‌లో ఓ బయోటెక్నాలజీ సంస్థ వారు ఎన్నో పరిశోధనలు చేసి ఇది సాధించారు. నిజానికి ఇలాంటి ప్రయోగాలు 2001 నుంచే జరిగాయి. అయితే ఆ చేపలు పూర్తి స్థాయిలో వెలుగులు విరజిమ్మలేదు. తర్వాత ఏడేళ్లు శ్రమించి ఇలాంటి ఏంజెల్ చేపలను సృష్టించి శరీరం మొత్తం మెరిసిపోయేలా చేశారు. వీటి ప్రత్యేకతేంటో తెలుసా? వీటికి పుట్టే పిల్లలకి కూడా ఇలా మెరిసే లక్షణం వచ్చేస్తుంది. అలా మొత్తం అయిదు తరాల వరకు ఈ జన్యు లక్షణాలు వస్తాయని చెబుతున్నారు. అంటే వీటి మనుమలు, మనవరాళ్లు కూడా వాటి తాతల్లాగే వెలిగిపోతాయన్నమాట.తినొచ్చా అంటే..వీటిని నిక్షేపంలా వండుకుని తినొచ్చు అని చెబుతున్నారు శాస్త్రవేత్తలు . మిగతా చేపల్ని తిన్నట్టే వీటినీ లొట్టలేసుకుంటూ ఆరగించొచ్చు. కాకపోతే ధరే ఎక్కువ. ఒక్కోటి రూ.1300 పైనే పలుకుతాయట. ఇంకో రెండేళ్లలో వీటిని అక్వేరియాల్లో పెంచుకోవచ్చు. మీకు జెల్లీ ఫిష్ తెలుసుగా? దానిపై ఏదైనా వెలుతురు పడినప్పుడు మెరుస్తూ కనిపించడానికి కారణం దాంట్లో సహజంగా ఉండే ఫ్లోరోసెంట్ మాంసకృత్తులే. దాన్ని వేరు చేసి ఈ చేపల్లో ప్రవేశపెట్టారన్నమాట. అన్నట్టు... ఈ జన్యువును గతంలో పిల్లులు, ఎలుకలు, పందుల్లోకి ప్రవేశపెట్టారు. అయితే వాటికి కూడా శరీరంలోని కొద్ది భాగం మాత్రమే వెలుగులీనింది. ఇప్పుడు ఈ ఏంజెల్ చేపలు మాత్రం పూర్తి స్థాయిలో మెరిసిపోతూ ముచ్చట కలిగిస్తున్నాయి.(చదవండి: ఎవరీ సావిత్రి ఠాకూర్? ఏకంగా కేంద్ర మంత్రి వర్గంలో..!) -
మృగశిర కార్తెకు ఆ పేరే ఎలా వచ్చింది? బెల్లం ఇంగువ ఎందుకు తింటారు?
మృగశిర కార్తె అంటే.. ఆశ్విని మొదలుకుని రేవతి వరకూ మనకున్న 27 నక్షత్రాల్లో సూర్యుడి ప్రవేశం ఆధారంగా కార్తె నిర్ణయం జరుగుతుంది. భారతీయ జ్యోతిష్య సాంప్రదాయం ప్రకారం.. ఒక్కో కార్తెలో ఒక్కో విధంగా ప్రకృతిలో మార్పులు జరుగుతుంటాయి. ఈ క్రమంలో సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించి నాటినుంచి నైరుతి రుతుపనాలు వస్తాయి. వాతావరణం ఒక్కసారి చల్లబడటం , ప్రకృతిలో అనేక మార్పులు చోటు చేసుకునే నేపథ్యంలో అనేక రకాల చెడు సూక్ష్మక్రిములు వంటివి పునురుత్పత్తి అవుతాయి.మానవునిలో రోగ నిరోధకశక్తి తగ్గి జ్వరం , దగ్గు , శ్వాస సంబంధ వ్యాధులు వస్తాయి. మృగశిర కార్తెలో బెల్లంలో ఇంగువ కలుపుకుని తినడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి కాపాడుకోవచ్చు. ఇది శాస్త్రీయంగా నిరూపించబడింది. బెల్లంలో ఇంగువ కలుపుకుని తినడం వల్ల ముఖ్యంగా గుండె జబ్బులు , ఆస్తమా , మధుమోహ వ్యాధి ఉన్నవారు , గర్భిణులు ఈ సమయంలో బెల్లంలో ఇంగువ కలుపుకుని తింటే ఎంతో ప్రయోజనం ఉంటుంది. దీని వెనుక ఆరోగ్య రహస్యం దాగివుంది. ఇది శరీరంలో ఉష్ణోగ్రత ప్రేరేపించి వర్షాకాలంలో సోకే వ్యాధులను అడ్డుకుంటుందని పెద్దల విశ్వాసం. ఇది మన పూర్వీకుల నుంచి ఆనాదిగా వస్తోంది. ఎండకాలం తర్వాత వాతావరణం చల్లబడటంతో మన శరీరంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఈ క్రమంలో వేడిగా ఉండేందుకు బెల్లంలో ఇంగువ కలుపుకుని తింటారు. దీని వల్ల గుండె జబ్బులు , ఆస్తమా రోగులకు ఉపశమనం కలుగుతుంది. ఇదేకాక ఈ సీజన్లో చాలా మందికి జీర్ణశక్తితోపాటు రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంటుంది. జ్వరం , దగ్గు బారిన పడతారు. ఇలాంటి వాటి నుంచి గట్టెక్కాలంటే బెల్లంలో ఇంగువ కలుపుకుని తినాల్సిందే.ఇక మాంసాహారులైతే ఈ సీజన్లో కోళ్లు, పొట్టేళ్లు, మేకపోతులు, చేపలు వంటి వాటిని తింటారు. కార్తె ప్రారంభం శుక్రవారం అయినా కొంత మంది మాంసాహారాన్ని తీసుకోకపోవడంతో శని, ఆదివారాల్లో తీసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆరోగ్య పరంగా చెప్పుకుంటే కోడి మాంసం వేడి చేస్తుందని, తద్వారా శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుందని, సీజనల్‌గా వచ్చే వ్యాధులు రావన్నది అందరికీ తెలిసిందే. ఈ సీజన్లోనే చేప మందు ఇవ్వడం జరుగుతుంది. చేపలు తినడం ద్వారా గుండె జబ్బులు, అస్తమా రోగులకు ఉపశమనం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో చేపలను ఇంగువలో, చింతచిగురులో పెట్టి తీసుకుంటారు.ఈ కార్తెలు ఎందుకంటే..పంచాంగ ప్రకారం ఆరుద్ర నక్షత్రంలో సూర్యుడు ప్రవేశించే సమయంలోని తిథి , వార , నక్షత్ర , యోగ , కరణాలు , శకునాలు తదితర అంశాల ఆధారంగా చేసుకుని ఆ సంవత్సరం యొక్క వర్షాన్ని నిర్ణయించడం జరుగుతుంది. ఈ విధంగా వ్యవసాయదారులకు నిత్యజీవనోపయోగిగా,వ్యవసాయం పనులకు మార్గదర్శకంగా ఈ కార్తెలు ఉపయోగపడుతున్నాయి.పురాణగాధ ప్రకారంమృగశిరస్సు కలిగిన మృగవ్యాధుడు అను వృతాసురుడు వరప్రభావంచే పశువులను , పంటలను హరించి వేయడం ప్రకృతి భీభత్సాలాను సృష్టించడం , వర్షాలకు అడ్డుపడటం జరుగుతూ ఉండేడిది. ఇతను చనిపోకుండా అనేక వరాలు కలిగి ఉండటంచేత ఇంద్రుడు సముద్రఅలల నుండి వచ్చే నురుగును ఆయుధంగా చేసి చంపేస్తాడు.ప్రకృతి మార్పు ప్రభావంఈ కథ ఆధారంగా ఖగోళంలో ఇంద్ర నక్షత్రమైన జ్యేష్టాకు మృగశిరకు 180 డిగ్రీల దూరంలో ఉండటం వలన తూర్పు ఆకాశంలో ఇంద్ర నక్షత్రం ఉదయించగానే వృతాసుర నక్షత్రం అస్తమిస్తుంటుంది. ఇక్కడ నురుగు అనేది ఋతుపవనాలకు , వర్షాలకు సూచన. ఇంద్ర నక్షత్రమైన జ్యేష్ట ఉదయించినపుడు సూర్యుడు మృగశిరలోకి ప్రవేశించడం వలన మృగశిరకార్తె ప్రవేశిస్తుంది. వర్షాలు పడకుండా అడ్డుపడ్డ మృగాసురుని చంపిన ఇంద్రున్ని వర్షప్రదాతగా , వర్షదేవుడుగా పిలుస్తారు. ఇది కథ. -
బుల్లి చేపలతో భలే మేలు!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: గోదారోళ్లు తిండి పెట్టి చంపేస్తారురా బాబూ అంటుంటారు. గోదావరి తీరంలో లభించే రుచికరమైన చేపలు అటువంటివి మరి. ఒకప్పుడు ముక్క లేనిదే ముద్ద దిగదనే నానుడి గోదావరి జిల్లాలకే ప్రత్యేకం. ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈబాపతు జనం పెరిగిపోయారు. అందులోనూ చేపలు దొరకాలే కానీ ఎంతటి వారైనా ఇట్టే లొట్టలేసుకుని లాగించేస్తున్నారు. గోదావరిలో దొరికే పండుగప్ప, కొయ్యింగ, కొరమేను, సీజనల్‌గా ఆగస్టులో లభించే పులస వంటిì పది రకాల చేపలంటే మాంసాహార ప్రియులు పడిచస్తారు. ఇంతకాలం పెద్ద చేపలనే ఇష్టపడేవారు ఇప్పుడు చిన్న చేపలపైనా మక్కువ చూపిస్తున్నారు. చిన్న చేపలు రుచికి రుచి.. బలవర్ధకమైన మాంసాహారం, సంపూర్ణ ఆరోగ్యాన్నిస్తాయి. సముద్రపు చేపలకు గిరాకీ సముద్రపు ఉప్పు నీటిలో లభించే చేపలంటే మాంసాహార ప్రియులు ఇష్టపడతారు. పీతలు, రొయ్యలు, ట్యూనా, వంజరం, కోనం, చందువ తదితర రకాల చేపలకు మార్కెట్లో భలే గిరాకీ. ఇటువంటి చేపలు కాకినాడ రేవు నుంచి దక్షిణాదిన తమిళనాడు, కేరళతో పాటు ఒడిశా, మహారాష్ట్రలకు ఎగుమతి చేస్తున్నారు. పెద్ద చేపలతో పాటు చిన్నచిన్న చేపలకు కూడా ఇప్పుడిప్పుడే డిమాండ్ పెరుగుతోందని మత్స్యకారులు చెబుతున్నారు. చూడటానికి అరంగుళం, అంగుళం, ఒకటిన్నర అంగుళాల సైజులో ఉండే ఈ చిన్న చేపలు కొన్ని రకాల జబ్బులకు దివ్యౌషధమని వైద్యులు నిర్ధారిస్తున్నారు.ఈ జాబితాలో నెత్తళ్లు, కవళ్లు, కట్టచేపలు, పరిగెలు, కానగంత తదితర చేపలు ఉన్నాయి. పెద్ద చేపల కంటే చిన్న చేపలు మంచివని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. చిన్న చేపల్లో తక్కువ స్థాయిలో మెర్క్యురీ, అధిక స్థాయిలో మినరల్స్ ఉండటంతో ఆరోగ్యానికి మంచిదంటున్నారు. చిన్న చేపల్లో ఒమేగా–3 యాసిడ్స్ ఎక్కువగా ఉండటంతో మెదడు చురుగ్గా పని చేసేందుకు దోహదపడుతుంది. చిన్న చేపల్లో కలుíÙతాల స్థాయి కూడా తక్కువ మోతాదులో ఉంటుంది. పెద్ద చేపల కంటే చిన్న చేపల ధర కూడా తక్కువే. పండుగప్ప, వంజరం, ట్యూనా, కొరమేను వంటి కేజీ, కేజీన్నర ఉండే ఒక పెద్ద చేప కొనాలంటే కనీసం రూ.వెయ్యి వెచి్చంచాలి.అదే కేజీ చిన్న చేపలు కావాలంటే రూ.100 నుంచి రూ.200 పెడితే దొరికేస్తాయి. వివిధ రకాల పండ్లు, కూరగాయల నుంచి అదనంగా లభించే ఐరన్, జింక్ చిన్న చేపల ద్వారా పెరుగుతాయని వైద్యులు చెబుతున్నారు. చిన్న చేపలను ఆహారంగా తీసుకునే మహిళల్లో రక్తహీనత తగ్గి శక్తిమంతులవుతారు. ప్రధానంగా గర్భిణులు, ప్రసవం అయిన మహిళలకు నెత్తళ్లు రకం చిన్న చేపలు ఎంతో బలవర్ధకమైన ఆహారంగా గ్రామీణ మహిళలు భావిస్తారు. అల్పాదాయ దేశాల్లో మధ్యతరగతి, పేద వర్గాలు చిన్న చేపలనే ఎక్కువగా ఆహారంగా తీసుకుంటారు.వారంతా ఆరోగ్యవంతులుగా, బలవంతులుగా ఉంటారని వరల్డ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ తాజా అధ్యయనంలో పేర్కొంది. మహిళా సాధికారత కోసం ఒడిశా రాష్ట్రం మిషన్ శక్తి చొరవతో రెండేళ్ల క్రితం పైలట్ ప్రాజెక్టు చేపట్టింది. దీని ద్వారా 7 మిలియన్లకు పైగా చిన్న చేప పిల్లలను ఉత్పత్తి చేసిందని అధ్యయనం చెబుతోంది. వీటిని మహిళా స్వయం సహాయక బృందాలకు పంపిణీ చేసి, గ్రామీణ మహిళల్లో శక్తిసామర్థ్యాల పెంపునకు ఇతోధికంగా తోడ్పాటు అందించారు. స్విట్జర్లాండ్, కాంబోడియా వంటి దేశాల్లో స్వదేశీ చిన్న చేపలను కూరగాయల ఉత్పత్తితో పాటు మిళితం చేయడం గమనార్హం.కవళ్లతో గుండె జబ్బుల నివారణ చిన్న చేపల్లో ప్రధానంగా కవళ్లు ఆహారంగా తీసుకుంటే కాల్షియం, మినరల్స్, విటమిన్–డి వంటి పోషకాలు లభిస్తాయని వైద్యులు చెబుతున్నారు. వీటిని ఆహారంగా తీసుకునే వారిలో గుండె జబ్బులకు ఆస్కారం ఉండదంటున్నారు. ఈ చేపలు చూసేందుకు చాలా చిన్నగా ఉంటాయి. వ్యావహారికంగా వీటిని ఆయిల్ సర్డిన్స్గా, శాస్త్రీయంగా సర్డెనెళ్ల లొంగిచెప్స్గా పిలుస్తారు. ఈ చేపల్లో పాలి అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండటం వలన గుండె జబ్బులను తగ్గిస్తాయి.నెత్తళ్లతో కీళ్ల నొప్పులు మాయం సిల్వర్ కలర్లో కనిపించే నెత్తళ్ల చేపలు చాలా చిన్నగా ఉంటాయి. ఆంకూవీస్ అని వ్యవహారికంగా పిలిచే ఈ చేపల శాస్త్రీయ నామం స్టోల్ ఫోరస్ ఇండికస్. నెత్తళ్లలో కాల్షియం ఎక్కువగా ఉండడంతో కీళ్ల నొప్పుల నివారణకు పనికొస్తాయి. గర్భిణులు, వృద్ధులకు ఎంతో బలవర్ధకమైన ఆహారంగా భావిస్తారు. నెత్తళ్లు 100 గ్రాములు ఆహారంగా తీసుకుంటే 200 కిలో క్యాలరీల శక్తి, 45 గ్రాముల ప్రొటీన్లు, 3.3 గ్రాముల కొవ్వు పదార్థాలు, 1,400 మిల్లీగ్రాముల కాల్షియం, 2 గ్రాములు మిగిలిన ఖనిజాలు, 67 మిల్లీ గ్రాముల కొలెస్ట్రాల్ లభిస్తాయని కాకినాడ ఎస్‌ఐఎఫ్‌టీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.చిన్న చేపల్లో కాల్షియం ఎక్కువ చిన్న చేపల్లో కాల్షియం, విటమిన్–ఎ పుష్కలంగా ఉంటాయి. ఈ చేపలను ఆహారంగా తీసుకుంటే ఎముకలకు, కళ్లకు మేలు జరుగుతుంది. సహజంగా పెద్ద చేపలు ఇష్టంగా తీసుకుంటారు. పెద్ద చేపల కంటే చిన్న చేపలు బలవర్ధకం. గర్భిణులకు, ప్రసవానంతరం బలవర్ధకమైన ఆహారంగా నెత్తళ్లు పెట్టడం పల్లెల్లో ఆనవాయితీగా వస్తున్నదే. – టి.సుమలత, ప్రిన్సిపాల్, ఎస్‌ఐఎఫ్‌టీ, కాకినాడ చిన్న చేపలను ముళ్లతో తింటే మేలు చిన్న చేపల్లో ముళ్లు లేతగా ఉంటాయి. అందులో కాల్షియం, ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. గొంతులో గుచ్చుకుంటాయనే అనుమానం లేకుంటే చిన్న చేపలను ముళ్లతో తినడమే మేలు. ప్రకృతిలో దేని ద్వారానూ లభించనంత కాల్షియం చిన్న చేపల్లో లభ్యమవుతుంది. ఈ కాల్షియం ఎముకలు గుల్లబారడాన్ని నివారించి, ఆస్టియోపొరాసిస్ వంటి సమస్యలను దూరం చేస్తుంది. చిన్న చేపల నుంచి లభ్యమయ్యే ప్రొటీన్ వల్ల కండ పుష్టి ఏర్పడి, శరీర నిర్మాణానికి దోహదపడుతుంది. – డాక్టర్ తొమూర్తి గౌరీశేఖర్, ఎముకల వైద్య నిపుణుడు, కాకినాడ -
ఆ పూలు స్టార్స్‌లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు ఉంటాయి. ప్రకృతికి మించి అద్భుతమైనది మరోకటి లేదు. దానికి మించి మనిషి తాను ఏదో కనిపెట్టాలనుకుంటే విధి చేసే మరింత విచిత్రంగా ఉంటుంది. చివరికి మనిషిని సమస్యలో పెట్టి అతడి వాళ్ల నుంచి సమస్యకు పరిష్కరం దొరికేలా చేస్తుంది విధి. అలాంటి రెండు ఆసక్తికర విషయాలు చూద్దామా..!స్టార్ఫిష్లా ఉండే పూలునక్షత్రాకారంలో ఉండే ఈ పూలను స్టార్ఫిష్ కాక్టస్ ఫ్లవర్స్ అని, స్టార్ ఫ్లవర్స్ అని అంటారు. బ్రహ్మజెముడు జాతికి చెందిన ఒక ఎడారి మొక్కకు ఈ పూలు పూస్తాయి. ఇవి అరచేతి విస్తీర్ణాన్ని మించి చాలా పెద్దగా ఉంటాయి. ఇవి ఊదా, ముదురు ఎరుపు, లేత ఎరుపు, పసుపు, గోధమ రంగుల్లో ఉంటాయి. ఈ పూలు చూడటానికి అందంగానే ఉన్నా, వీటి నుంచి వెలువడే కుళ్లిన మాంసం వాసనను భరించడమే కష్టం. కనిపెట్టిన మెషిన్ గన్తోనేఅమెరికాలో జన్మించిన బ్రిటిష్ ఆవిష్కర్త హైరమ్ స్టీవన్ మాక్సిమ్ మొట్టమొదటి ఆటోమేటిక్ మెషిన్ గన్ను రూపొందించాడు. ఆ మెషిన్ గన్‌తో టెస్ట్ ఫైరింగ్ చేస్తున్నప్పుడు వచ్చిన శబ్దానికి ఆయన బధిరుడిగా మారాడు. ఆ తర్వాత ఆయన కొడుకు హైరమ్ పెర్సీ మాక్సిమ్ సైలెన్సర్‌ను కనిపెట్టాడు. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?) -
ఎండలకు చచ్చిపోతున్న చేపలు.. వ్యాపిస్తున్న దుర్వాసన!
మండుతున్న ఎండలు మన దేశాన్నే కాదు ప్రపంచంలోని పలు దేశాలను భయపెడుతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు అటు జనాలను, ఇటు జీవాలను మలమలమాడిపోయేలా చేస్తున్నాయి. కరువు బారిన పడిన దక్షిణ వియత్నాంను ఈ ఎండలు మరిన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. దక్షిణ వియత్నాంలో అంతకంతకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు చేపలను బలి తీసుకుంటున్నాయి. 300 హెక్టార్లలో విస్తరించి ఉన్న ‘సాంగ్ మే’ చెరువులోని వేలాది చేపలు ఎండ వేడికి తాళలేక చనిపోయాయి. డాంగ్ నైలో ఉష్ణోగ్రత 40 డిగ్రీలను దాటింది. 1998లో ఈ ప్రాంతంలో ఈ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు రిజర్వాయర్ నిర్వహణ సంస్థ నిర్లక్ష్యం కూడా చేపలు చనిపోవడానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుత వేసవి కాలంటో 200 టన్నులకు పైగా చేపలు చనిపోయాయి. అత్యధిక ఉష్ణోగ్రత, నీటి కొరత కారణంగా ఈ చేపలు చనిపోయాయని స్థానికులు చెబుతున్నారు. చనిపోయిన చేపల వాసన గత కొన్నిరోజులుగా ఈ ప్రాంతంలో విపరీతంగా వ్యాపించడంతో ఇక్కడి జనం నానా అవస్థలు పడుతున్నారు. ఈ చనిపోయిన చేపలను చెరువులో నుంచి తొలగించే పనిలో మత్స్యకారులు నిరంతరం శ్రమిస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక యంత్రాంగం విచారణ ప్రారంభించింది. -
‘దీదీ’ ఫైర్.. ‘‘చాయ్‌కు బదులు అది తాగమంటారేమో..!’’
కలకత్తా: లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ సమీపించిన వేళ పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత బీజేపీపై మాటల దాడి పెంచారు. కూచ్‌బెహార్‌లో సోమవారం(ఏప్రిల్15) జరిగిన ఎన్నికల ప్రచార సభలో మమత మాట్లాడారు. ఆర్జేడీ నేత తేజస్వియాదవ్ నవరాత్రుల్లో చేపలు తినడంపై విమర్శిస్తున్న బీజేపీ నేతలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. బీజేపీని అధికారంలో నుంచి దించకపోతే దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందన్నారు. ‘మనం ఏం తినాలో, ఎలా పడుకోవాలో బీజేపీ వాళ్లే నిర్ణయిస్తారు. వాళ్లను ఇలాగే వదిలేస్తే రోజూ ఉదయం చాయ్‌కు బదులు గో మూత్రం తాగమంటారు. భోజనానికి బదులు ఆవు పేడ తినమంటారు. ఒకవేళ బీజేపీ మళ్లీ పవర్లోకి వస్తే భవిష్యత్తులో ఎన్నికలే ఉండవు. వాళ్లకు వన్ లీడర్, వన్ నేషన్, వన్ భోజన్, వన్ భాషన్ కావాలి’అని మమత విరుచుకుపడ్డారు. పశ్చిమబెంగాల్లో తొలి దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుంది. ఇదీ చదవండి.. కుటుంబ రాజకీయాలకు స్వస్తి చెప్పండి -
భారత్‌లో చేపలు తినేవాళ్ల సంఖ్య పెరిగింది!: అధ్యయనంలో వెల్లడి!
భారత్‌లో చేపల వినియోగం పెరిగిందని అధ్యయనంలో వెల్లడయ్యింది. ముఖ్యంగా జమ్ము కాశ్మీర్లో అనూహ్యంగా అత్యధిక పెరుగుదల కనిపించిందని పేర్కొంది. ఈ మేరకు భారతదేశంలో చేపల వినయోగం, సంబంధిత ఆహార పొకడలపై అధ్యయనం నిర్వహించగా..సరికొత్త నివేదికలును అందించింది. ఆ ఫలితాల్లో ఇటీవల కాలంలో చేపల వినియోగంలో గణనీయమైన పెరుగుదల ఉన్నట్లు వెల్లడించింది. భారత దేశంలో చేపల వినియోగం: ప్యాటర్న్, ట్రేండ్ అనే వాటిని బేస్ చేసుకుని స్టడీ చేయగా గణనీయమైన వృద్ధి కనిపించింది. ఈ స్టడీని ఇండియన కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్(ఐసీఏఆర్), మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, భారత ప్రభుత్వం అండ్ వరల్డ్ ఫిష్ ఇండియా కలిసి నిర్వహించాయి. కాల పరిమిత 2005-2006 నుంచి 2019-2020 వరకు చేపల వినియోగం ఎలా ఉందనే దానిపై అధ్యయనం చేయగా, చేపల వినియోగంలో భారతేశంలో గణనీయమైన వృద్ధి కనిపించిందని తేలింది. అందుకు జనాభ పెరుగుదల, పెరిగిన సంపద, మారుతున్న పరిస్థితులు కారణం అని పేర్కొన్నారు అధికారులు. ఇక భారతదేశంలో చేపల తినే జనభా 73.6 మిలియన్ల(66%) నుంచి 966.9 మిలియన్లకు(71.1%)కు చేరింది. ఇది సుమారు 32% పెరుగుదలను సూచిస్తోంది. అలాగే 2019-2020లో 5.95% మంది ప్రజలు ప్రతిరోజూ చేపలను తీసుకోగా, 34.8% మంది కనీసం వారానికి ఒకసారి మిగలిన 31.35% అప్పుడప్పుడు మాత్రమే తీసుకుంటారని అధ్యయనంలో తేలింది. కాగా, త్రిపురలో అత్యధికంగా (99.35%), హర్యానాలో అత్యల్పంగా (20.55%) చేపలను వినయోగిస్తున్నారు. తూర్పు ఈశాన్య రాష్ట్రాలు, తమిళనాడు, కేరళ, గోవాలలో అత్యధికంగా చేపలు తినే వాళ్ల సంఖ్య (90% కంటే ఎక్కువ) ఉంది. దీనికి విరుద్ధంగా, పంజాబ్, హర్యానా రాజస్థాన్ వంటి ఉత్తరాది రాష్ట్రాలు అత్యల్పంగా ఉన్నాయి (30% కంటే తక్కువ). అయితే, దేశంలోని ఉత్తరాన ఉన్న రాష్ట్రం జమ్మూ కాశ్మీర్లో చేపలు తినేవారి సంఖ్య అత్యధికంగా పెరగడం గమనార్హం. అలాగే కేరళ, గోవాలలో కూడా రోజువారీ చేపల వినియోగదారుల శాతం అత్యధికంగా ఉందని స్టడీ పేర్కొంది. అంతేగాక పురుషుల కంటే స్త్రీలు చేపల తక్కువుగా తింటున్నారని అధ్యయనం పేర్కొంది. (చదవండి: ఇదేం వ్యాధి.. తినకూడనివన్నీ లాగించేస్తోంది..) -
ఆ విషయం నాకు కూడా తెలుసు... మీకు ఇష్టముంటేనే రండి: ఆర్పీ హాట్ కామెంట్స్
జబర్దస్త్ కమెడియన్‌గా ఫేమ్ తెచ్చుకున్న ఆర్పీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అంతే కాదు.. గతేడాది ప్రియురాలిని పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించారు. విశాఖపట్నంలో కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. ముందస్తు హడావుడి లేకుండా సీక్రెట్‌గా వివాహం చేసుకున్నాడు. కానీ పెళ్లికి ముందే హైదరాబాద్‌లో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరిట కర్రీ పాయింట్ బిజినెస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. కూకట్ పల్లి, అమీర్‌పేట్‌లోనూ అతనికి బ్రాంచ్‌లున్నాయి. స్టాల్స్ ప్రారంభం నుంచే ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. వ్యాపారం విజయవంతం కావడంతో ఆర్పీ ముందడుగు వేసి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరిట పలు బ్రాంచ్‌లు ఓపెన్ చేశాడు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆర్పీ తన బిజినెస్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. మీ వద్ద ధరలు అధికంగా ఉన్నాయంటున్నారు? అని యాంకర్ ప్రశ్నించగా.. ఆర్పీ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. నా బిజినెస్ నా ఇష్టం.. నా రేట్లు అంతే అంటూ హాట్ కామెంట్స్ చేశారు. అదేంటో మీరు ఓ లుక్కేయండి. ఆర్పీ మాట్లాడుతూ..'ఇది నా బిజినెస్. నా రేట్లు ఇంతే. చేపలకు, మిగతా వాటికి చాలా తేడా ఉంటుంది. ఆడి, బెంజ్, క్రెటా కార్లలో నీ స్తోమతను బట్టి తీసుకుంటాం. ఇది కూడా అంతే కొనగలిగే కెపాసిటీ ఉన్నవాళ్లే తీసుకుంటారు. అంతే తక్కువ రేటు అని చెప్పి.. ఎలా పడితే అలా ఇవ్వలేను కదా. మేం మొత్తం క్వాలిటీ ఉత్పత్తులు మాత్రమే వాడుతాం. నా చేపల పులుసు నీకు అందుబాటు రేటులో ఉంటేనే తిను. లేకపోతే వద్దు. కొందరు కావాలనే నాపై అలాంటి ప్రచారం చేస్తుంటారు. నీకు ఇష్టముంటే తిను. లేకపోతే పో. నా చేపల పులుసు రేట్లు అంతే. అంతేకానీ రూ.100 జేబులో పెట్టుకుని.. రూ.1000 ఫుడ్ కావాలంటే వస్తుందా? మా చేపల పులుసు తినమని నేను ఎవరినీ బతిమాలాడను కదా? రేట్లు ఎంత పెట్టాలి అనే విషయం నాకు తెలుసు. నాది కూడా వ్యవసాయం కుటుంబమే. ఎవరెన్ని చేసిన ఐ డోంట్ కేర్. నా చేపల పులుసుపై నాకు నమ్మకముంది' అని అన్నారు. -
మాగాణుల్లో మిథేన్‌కు చిరు చేపలతో చెక్!
వాతావరణాన్ని వేడెక్కిస్తున్న మిథేన్, కార్బన్ డయాక్సయిడ్ కన్నా 86 రెట్లు ఎక్కువ పర్యావరణానికి హాని చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలోకి విడుదలవుతున్న మిథేన్ వాయువులో 10శాతం మేరకు వరి పొలాల నుంచే వెలువడుతోందని అంచనా. అయితే, వరి పొలాల్లోని నీటిలో చిరు చేపల (గోల్డెన్ షైనర్ రకం)ను పెంచితే మూడింట రెండొంతుల మిథేన్ వాయువు తగ్గిందని కాలిఫోర్నియాకు చెందిన రిసోర్స్ రెన్యువల్ ఇన్స్టిట్యూట్(ఆర్ఆర్ఐ) అనే స్టార్టప్ కంపెనీ చెబుతోంది. ‘ఫిష్ ఇన్ ద ఫీల్డ్స్’ పేరిట పైలట్ ప్రాజెక్టు ద్వారా రెండేళ్లుగా పరిశోధనలు చేస్తున్న ఈ స్టార్టప్ కంపెనీ ఇటీవల ‘ద జెఎం కప్లన్ ఇన్నోవేషన్ ప్రైజ్’ను గెల్చుకొని ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ‘వరి రైతులకు చేపల ద్వారా అదనపు ఆదాయం కూడా సమకూరుతుంది. సముద్ర చేపలను దాణాల్లో వాడే బదులు ఈ పొలాల్లో పెరిగే చేపలను వాడటం ద్వారా భూతాపాన్ని తగ్గించడానికి, చేపల జీవవైవిధ్యాన్ని పెంపొందించడానికి మా పరిశోధనలు ఉపకరిస్తాయి. 1,75,000 డాలర్ల ప్రైజ్ మనీతో మేం చేపట్టిన ప్రయోగాత్మక సాగుకు ఊతం వచ్చింది..’ అన్నారు ఆర్.ఆర్.ఐ. వ్యవస్థాపకులు దెబోరా మోస్కోవిట్జ్, ఛాన్స్ కట్రానో. ఆసియా దేశాల్లో అనాదిగా సాగు చేస్తున్న వరి–చేపల మిశ్రమ సాగులో అదనపు ప్రయోజనాన్ని కొత్తగా వారు శోధిస్తున్నారు. సుస్థిర ఆక్వా సాగుతో పాటు రైతుల ఆదాయం పెరుగుదలకు, భూతాపం తగ్గడానికి ఉపకరిస్తుందంటున్నారు. మాగాణుల్లో వరితో పాటు చేపలు పెంచితే ‘కార్బన్ క్రెడిట్స్’ ద్వారా కూడా అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. మరికొన్ని సంగతులు ప్రపంచంలోని గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలలో నాలుగింట ఒక వంతు ఆహారం , వ్యవసాయం నుంచి వస్తున్నవే. వీటిల్లో నైట్రస్ ఆక్సైడ్ , మీథేన్దే అగ్రభాగం. ప్రపంచ గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలలో 13 శాతం వ్యవసాయం, అటవీ భూ వినియోగంనుంచి వస్తుండగా, 21 శాతం ఇంధన కాలుష్యం. వరి పంట, పశువుల పెంపకం వంటి పద్ధతులు నేరుగా గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలకు దోహదం చేస్తాయనేది నిపుణుల వాదన. పంటకోత, నాటడం, రవాణా ద్వారా కార్బన్ డయాక్సైడ్ (CO₂) ఉద్గారాలు, అలాగే యూరియాతో పండించిన గడ్డితినే పశువుల ద్వారా, పేడ నిర్వహణ ద్వారా ద్వారా మీథేన్ విడుదలవుతుంది. ఎరువుల వాడకం, నేల శ్వాసక్రియ వలన నైట్రస్ ఆక్సైడ్ ఉద్గారాలు ఏర్పడతాయి. ఈ నేపథ్యంలోనే వాతావరణ-స్మార్ట్ వ్యవసాయం ద్వారా ఉద్గారాల ప్రభావాలను తగ్గించాలనేది ప్రధాన లక్ష్యంగా ఉంది. ఇందులో భాగంగా సమర్థవంతమైన పశువుల పెంపకం, శిలాజ ఇంధనంపై ఆధారపడటాన్ని తగ్గించడం, జంతు-ఆధారిత ఆహార పదార్థాల నిర్వహణ లాంటివి ప్రధానంగా ఉన్నాయి. ఇవి సుస్థిర ఆహార వ్యవస్థకు దోహదపడతాయి కూడా. గ్రీన్హౌస్ వాయువులపై వ్యవసాయ ప్రభావాన్ని తగ్గించడం మన భూగ్రహ మనుగడకు చాలా అవసరం. -
రూ.70లకు చేపతో భోజనం
శ్రీకాకుళం: ఒకప్పుడు రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై ఉన్న ఆమె వ్యాపారం.. నేడు చక్కటి షాపులోకి చేరింది. సముద్రంలోకి వేటకు వెళ్లి కష్టపడిన ఆమె భర్త.. నేడు ఇతర ప్రాంతాల నుంచి చేపలు తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. చదువుల కోసం ఇబ్బంది పడిన కుమార్తెలు.. సగర్వంగా నేడు కాలేజీకి వెళ్తున్నారు. వైఎస్సార్ సీపీ వినూత్న విధానాలతో తీరిన వెతలకు, మారిన బతుకులకు బర్రి తోటమ్మ కు టుంబం ఓ నిదర్శనం. ఫిష్ ఆంధ్రా మొదలుకుని ఫీజు రీయింబర్స్మెంట్ వరకు సంక్షేమ పథకాలను వినియోగించుకుని చక్కటి బతుకు బాటను ఏర్పరచుకున్నారు. తోటమ్మది శ్రీకాకుళం రూరల్ మండలం చిన గనగళ్లపేట గ్రామం. ఈమె భర్త రామారావు సముద్రంలో చేపల వేటకు వెళ్లి వచ్చినప్పుడు సంపాదించిన మొత్తంతో కుటుంబమంతా జీవనం సాగించేది. కొన్నేళ్ల కిందట వీరు కుమార్తెల చదువుల కోసం శ్రీకాకుళం పట్టణానికి కుటుంబంతో పాటు వచ్చేశా రు. మండల వీధిలో నివాసం ఉంటూ జీవ నోపాధికి అరసవల్లి కూడలి వద్ద రోడ్డు పక్కన చేప లు విక్రయించేవారు. కుమార్తెలను చవివిస్తూ కుటుంబాన్ని పోషించటం కష్టంగా ఉండేది. సరిగ్గా అదే సమయంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత సీఎం అమలు చేసిన సంక్షేమ పథకాలను ఈ కుటుంబం సమర్థంగా వినియోగించుకుంది. పిల్లలకు జగనన్న ఇస్తున్న ఫీ జు రీయింబర్స్మెంట్ వస్తోంది. భర్తకు ఏటా వేట విరామ సమయంలో భృతి అందడం మొదలైంది. వీటన్నంటికంటే ‘ఫిష్ ఆంధ్రా’ అవకాశాన్ని తోటమ్మ ఒడిసిపట్టుకున్న తీరు అందరికీ ఆదర్శప్రాయం. వినూత్నంగా విస్తరణ మత్స్యకారుల కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభు త్వం అమలు చేసిన ఫిష్ ఆంధ్రా పథకం ఆ కుటుంబానికి వరంగా మారింది. అరసవల్లి కూడలి వద్ద మూడు నెలల కిందట ఫిష్ ఆంధ్రా షాపును నెలకొల్పి తాజా చేపల విక్రయాన్ని ప్రారంభించారు. రూ.2.2లక్షల బ్యాంకు రుణంతో షాపును ఏర్పాటు చేసుకున్నారు. దీనికి 40శాతం రాయితీని ప్రభుత్వం కల్పించింది. వ్యాపారం రెట్టింపు కావటంతో వినూత్న తరహాలో విస్తరించారు. వారానికి అరటన్నుకు పైగా చేపలను విక్రయిస్తున్నారు. రూ.70లకు చేపతో భోజనం తోటమ్మకు కొత్త తరహా ఆలోచన రావటంతో రూ.70 లకే పూర్తి స్థాయిలో చేపల పులుసుతో పాటు చేప ముక్కతో భోజనం వడ్డించడం మొదలుపెట్టారు. వినియోగదారుల కోరిక మేరకు రొయ్యల కూర వండి సరఫరా చేస్తున్నారు. దీనికి కూడా ఆదరణ లభించడంతో సాయంత్రం సమయంలో ఫిష్, రొయ్యల వేపుడు విక్రయిస్తున్నారు. ఆర్డర్ ఇచ్చినప్పుడు ఫిష్, రొయ్యల బిరియానీ తయారు చేసి రూ.100 నుంచి రూ.150లకు విక్రయిస్తున్నారు. పెద్ద మొత్తంలో ఆర్డర్ ఇస్తే ఇంటి వద్దకే సరఫరా చేస్తుండటంతో ఆదరణ పెరుగుతోంది. సాఫీగా చదువులు తోటమ్మ కుమార్తెలు విజయలక్ష్మి, సుగుణలు వ్యా పారంలో తల్లికి సహకరిస్తూనే చదువుల్లో రాణిస్తున్నారు. భర్త రామారావు షాపులో విక్రయించేందుకు జిల్లాలోని పలువురు మత్స్య కారుల నుంచి చేపలను కొనుగోలు చేసి తీసుకువస్తున్నారు. -
మాంసం దుకాణాలపై కొరడా ఝుళిపిస్తున్న అధికారులు
మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ సూచనల మేరకు గ్వాలియర్ మున్సిపల్ కార్పొరేషన్ నగరంలో అనుమతి లేకుండా బహిరంగంగా మాంసం, చేపలను విక్రయించడాన్ని నిషేధించింది. దీనిని అమలు చేసేందుకు అధికారులు నగరంలోని పలు మార్కెట్లలో దాడుల నిర్వహిస్తున్నారు. గ్వాలియర్ మార్కెట్లో లైసెన్సులు లేకుండా నిర్వహిస్తున్న ఏడు మాసం దుకాణాలను అధికారులు మూసివేయించారు. అలాగే పలువురు వ్యాపారుల నుంచి వేల రూపాయల జరిమానా వసూలు చేశారు. దీనికితోడు ఆయా వ్యాపారుల నుంచి సరుకులను స్వాధీనం చేసుకున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హర్ష్‌సింగ్ ఆదేశాల మేరకు మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అనూజ్ శర్మ, డాక్టర్ వైభవ్ శ్రీవాస్తవ నేతృత్వంలో నగరంలో బహిరంగంగా మాంసం, చేపలు విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకునేందుకు బృందాలుగా ఏర్పడి చర్యలు చేపట్టారు. రోడ్డు పక్కన మాంసం, చేపలు విక్రయిస్తున్న వారి నుంచి సరుకులను స్వాధీనం చేసుకున్నారు. తాత్కాలిక దుకాణాల ఆక్రమణలను కూడా తొలగించారు. నిబంధనలను పాటించని దుకాణదారుల నుంచి మూడు వేల రూపాయల చొప్పున జరిమానా వసూలు చేశారు. ఇది కూడా చదవండి: 2023.. భారత్‌లో సంభవించిన భారీ అగ్ని ప్రమాదాలివే.. -
ప్రపంచంలోనే అత్యంత అసహ్యమైన చేప! చూస్తే భయపడాల్సిందే!
ఇటీవల కుక్కలు, పిల్లుల్లో అసహ్యమైన వాటిని గుర్తించి అవే ప్రపంచంలోనే అత్యంత అసహ్యమైనవిగా పేర్కొనడం గురించి విన్నాం. ఐతే ఇలా వెల్లడించేది అగ్లీ యానిమల్ ప్రిజర్వేషన్ సోసైటీ. ఇపుడు ఆ కోవలోకి ఓ చేప వచ్చింది. ఇదేంటి చేపల్లో కూడా అసహ్యమైనవి ఉంటాయా! అని ఆశ్చర్యంగా ఉంది కదూ!. ఔను ఓ వికారమైన చేప ఉందంటా. దీన్ని చూస్తేనే భయపడతామని చెబుతున్నారు పరిశోధకులు. ఈ చేప పేరు 2003లో ఇంటర్నెట్లో తెగ వైరల్ అయ్యింది. కానీ ఇది రియల్ కాదనే అనుకున్నారు అంతా. ఐతే అలాంటి వింత చేప ఉందని, అదే అత్యంత అసమస్యమైనదని శాస్త్రవేత్తలు చెప్పడం విశేషం. ఈ చేప ఆకారం పలు ఎమోజీల్లో కూడా ఉంటుంది. అయితే ఈ అత్యంత అసహ్యకరమైన చేపను తొలిసారిగా 1983లో న్యూజిలాండ్ తీరంలో ఓ పరిశోధన నౌక దీన్ని కనుగొంది. ఇవి సముద్రంలో సుమారు 600 నుంచి 1200 మీటర్ల అడుగుల లోతుల్లో సంచరిస్తుంటాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. పీడనం అధికంగా ఉండే అడుగున ఇవి ఉండటం కారణంగా వీటి ఎముకలు, కండరాలతో కూడిన మెత్తని శరీరంతో చూసేందుకు వికారంగా ఉంటాయన్నారు. శాస్త్రవేత్తలు దీన్ని బ్లాబ్ ఫిష్ అని పిలుస్తారు. ఇది సైక్రోల్యూట్స్ మైక్రోపోరోస్ కుటుంబానికి చెందడం వల్ల దీని శాస్త్రీయ నామం కూడా అలానే(సైక్రోల్యూట్స్ మైక్రోపోరోస్) వ్యవహరించారు పరిశోధకులు. అయితే దీన్ని బయటకు తీస్తే ఒత్తడి తక్కువుగా ఉండటం వల్ల దీని శరీరం విస్తరించినట్లుగా అయ్యి రిలాక్స్డ్ మోడ్‌లో ఉండి ముక్కు బయటకు వచ్చి ఉంటుంది. అదే సముద్రం అడుగున మాత్రం అధిక పీడనం కారణంగా అది మొత్తం ముడిచుకుపోయినట్లు ఓ జెల్లీ ఫిష్ మాదిరిగా కనిపిస్తుందిన చెప్పుకొచ్చారు. అయితే దీన్ని చూసిన వెంటనే..దాని వింత ఆకరం కారణంగా భయపడటం జరుగుతుందని అన్నారు. అందువల్లే అగ్లీ యానిమల్ ప్రిజర్వేషన్ సొసైటీ దీన్ని ప్రంపచంలోనే అత్యంత వికారమైన బ్లాబ్ ఫిష్‌గా పేర్కొన్నట్లు తెలిపారు. (చదవండి: బిడ్డను ఎప్పుడెప్పుడూ చూస్తానా అనుకుంది! కానీ అదే ఆమెకు..) -
పిల్లల కోసం రుచికరమైన సమోసా.. చేప తో
కావలసినవి: చేప సొన – పావు కిలో (జాగ్రత్తగా ఉండికించి, చల్లారాక పొడిపొడిగా చేసుకోవాలి) కారం – 2 టీ స్పూన్లు గరం మసాలా – 1 టీ స్పూన్ కార్న్ – అర కప్పు (ఉడికించినవి) పసుపు – అర టీ స్పూన్ సోంపు పౌడర్ –1 టీ స్పూన్ ఉప్పు – తగినంత మిరియాల పొడి – అర టీ çస్పూన్ ఉల్లిపాయలు – 3 (సన్నగా తరిగినవి) నూనె – డీప్ ఫ్రైకి సరిపడా అల్లం – వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్లు పచ్చిమిర్చి – 3 (సన్నగా తరిగినవి) గుడ్డు – 1 గోధుమపిండి – కప్పు మైదాపిండి – 2 కప్పులు ధనియాల పొడి – 2 టీ స్పూన్లు నీళ్లు – సరిపడా కొత్తిమీర తురుము – కొద్దిగా తయారీ: ముందుగా నూనె వేడి చేసుకోవాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకుని.. వేగిన తర్వాత అల్లం – వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత సోంపు పౌడర్, మిరియాల పొడి, ధనియాలపొడి, పసుపు, ఉప్పు, గరం మసాలా, కారం, కొత్తిమీర తురుము వేసి మొత్తం కలుపుకుని.. ఆ మిశ్రమాన్ని ఉడికించి.. చివరిలో చేప సొన జోడించి.. గరిటెతో బాగా తిప్పి.. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో.. గోధుమపిండి, మైదాపిండి, గుడ్డు, చిటికెడు ఉప్పు వేసి, కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుని.. మెత్తగా కలిపి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఆ పిండి మిశ్రమంతో చిన్నచిన్న చపాతీలు ఒత్తుకోవాలి. వాటి మధ్యలో ముందుగానే ఉడికించుకుని పెట్టుకున్న కార్న్ కొద్దిగా, చేప సొన మిశ్రమం కొద్దిగా నింపుకుని.. సమోసా షేప్‌లో చుట్టుకోవాలి. ఇప్పుడు వాటిని నూనెలో డీప్‌ఫ్రై చేసుకుంటే రుచి అదిరిపోతుంది. (చదవండి: ఈ మెషిన్ తో ఒకే సారి ఆరు కప్పుల ఐస్‌క్రీమ్ తయారీ..) -
వెరైటీగా ఫిష్ కేక్ ట్రై చేయండిలా!
ఫిష్ కేకు తయారీకి కావాల్సినవి: శుభ్రం చేసిన చేప ముక్కలు – మూడు కప్పులు(చర్మం, ముల్లు తొలగించి చిన్న ముక్కలు చేయాలి) బ్రెడ్ ముక్కల పొడి – అరకప్పు నూనె – టేబుల్ స్పూను స్ప్రింగ్ ఆనియన్ తరుగు – కప్పు బంగాళ దుంపలు – రెండు మిరియాల పొడి – రెండు టీస్పూన్లు నిమ్మరసం – రెండు టేబుల్ స్పూన్లు కొత్తిమీర తరుగు – అరకప్పు పచ్చిమిర్చి – రెండు ఉప్పు – రుచికి సరిపడా. తయారీ విధానం: బంగాళదుంపలను ఉడికించి, తొక్కతీసి చిదుముకోవాలి. చేప ముక్కలను గిన్నెలో వేసి, పచ్చిమిర్చిని తరిగి వేయాలి. స్ప్రింగ్ ఆనియన్, కొత్తిమీర తరుగు, చిదుముకున్న బంగాళ దుంపల మిశ్రమం, ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం వేసి ముక్కలు పట్టేలా కలిపి అరగంట పక్కన పెట్టుకోవాలి. అరగంట తరువాత మిశ్రమాన్ని టిక్కీల్లా తయారు చేసుకోవాలి. బ్రెడ్ ముక్కల పొడిలో ఈ టిక్కీలను అద్దాలి. ఇప్పుడు బేకింగ్ ట్రేకు నూనె రాసి, బ్రెడ్ ముక్కల పొడిలో అద్దిన ఫిష్ కేక్స్‌ను బేకింగ్ ట్రేలో పెట్టి అరగంటపాటు బేక్ చేస్తే ఎంతో రుచికరమైన ఫిష్ కేక్ రెడీ. (చదవండి: అరటికాయ మంచూరియా టేస్టీగా తయారు చేసుకోండిలా!) -
సూపర్ రేర్ చిరుత టోబీ పఫర్ ఫిష్: మురిసిపోతున్న ప్రకృతి ప్రేమికులు
ప్రకృతి అంటేనే మనిషికి అందని రహస్యాల పుట్ట. అప్పుడప్పుడు అద్భుతమైనవి వెలుగులోకి వచ్చి మనల్ని ఆశ్చర్యంలో ముంచుత్తుతాయి. అయితే కొన్ని అరుదైన జీవులు కూడా అంతరించిపోతున్న తరుణంలో, మారుతున్న కాలంతో పాటు కొన్ని ఆశ్చర్యకరమైన జీవులు వెలుగులోకి రావడం విశేషం. ఆస్ట్రేలియా తీరంలో అత్యంత అరుదైన లెపార్డ్ టోబీ పఫర్ ఫిష్ దర్శనమిచ్చింది. దీంతో ప్రకృతి ప్రేమికులు సంబర పడుతున్నారు. Super Rare Leopard Toby Puffer Fish సముద్రపు లోతుల్లో సంచరిస్తున్న కోరల్ సీ మెరైన్ పార్క్‌లో ఈత కొడుతున్న డీప్ సీ డైవర్ దృష్టిలోచిరుతపులిని పోలిన మచ్చలున్న చిన్న తెల్ల చేప పడింది. దీన్నే లెపార్డ్ పఫర్ ఫిష్ లేదా కాంతిగాస్టర్ లెపార్డ్ అని పిలుస్తారు. ఆస్ట్రేలియా తీరంలోని గ్రేట్ బారియర్ రీఫ్లో ఈత కొడుతుండగా, ఒక డైవర్ 'అత్యంత అరుదైన' సముద్ర జీవిని చూసి ఆశ్చర్యపోయాడు టోబీ పఫర్ అందమైన ఫోటోను గ్రేట్ బారియర్ రీఫ్ మెరైన్ పార్క్ అథారిటీకి అనుబంధ సంస్థ మాస్టర్ రీఫ్ గైడ్స్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో షేర్ చేసింది. ఇలాంటి చేపను ఎప్పుడూ చూడలేదని సంస్థ తెలిపింది. ఇవి సాధారణంగా ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, గ్వామ్, మైక్రోనేషియా జలాల్లో కనిపిస్తుందని, అయితే ఈ తెల్లని చేప ఆస్ట్రేలియాలో కనిపించడం ఇదే తొలిసారి అని పేర్కొంది. ప్రతిరోజూ మనల్ని ఆశ్చర్యపరిచే శక్తి సముద్రానికి ఉంది.ఇంకా కనుగొనలేని అద్భుతమైన జంతువులు సముంద్రం నిండి ఉంది. తన జీవితంలో చిన్న తెల్ల చేపను చూడటం చాలా అదృష్టం అని డైవర్ కేథరీన్ లోగాన్ పేర్కొన్నాడు. చిరుత టోబీ పఫర్ అంటే ? రాక్ ఎన్ క్రిటర్స్ ప్రకారం, ఇది అక్వేరియంలో ఎక్కువగా వాడతారు. దీని ముందు భాగంలో రెండు చారలు ఉంటాయి. ముత్యం లాంటి తెల్లటి శరీరంపై చిరుత పులికి ఉండే మచ్చల్ని పోలిన మచ్చలు ఉంటాయి. అలాగే దీన్నిపట్టుకున్నప్పుడు కొద్దిగా "పఫ్"(ఉబ్బుతాయి) అవుతాయి. దాదాపు 3 అంగుళాల పొడవు ఉంటాయి. View this post on Instagram A post shared by Master Reef Guides - Great Barrier Reef 🪸 (@masterreefguides) -
ఫిష్ – చీజ్ బాల్స్.. టేస్ట్ అదిరిపోతుంది, ట్రై చేయండి
ఫిష్ – చీజ్ బాల్స్ తయారీకి కావల్సినవి: చేప ముక్కలు – పావు కిలో (మెత్తగా ఉడికించి, చల్లారాక మధ్యలో ముల్లు తొలగించి, పొడిపొడి తురుములా చేసుకోవాలి) బ్రెడ్ స్లైస్ – 8 లేదా 10 (నలువైపులా కట్ చేసుకుని పెట్టుకోవాలి) చీజ్ తురుము – 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి ముక్కలు – 1 టీ స్పూన్ పసుపు – కొద్దిగా, గరం మసాలా – 1 టీ స్పూన్, కోడిగుడ్లు – 2 బ్రెడ్ పౌడర్ – పావు కప్పు, చిక్కటి పాలు – కొన్ని, ఉప్పు – తగినంత నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ విధానమిలా: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఉడికించిన ఫిష్ తురుము, చీజ్ తురుము, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, గరం మసాలా వేసుకొని బాగా కలిపి ముద్దలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్రతి బ్రెడ్ ముక్కను పాలలో నానబెట్టి.. గట్టిగా ఒత్తి.. అందులో కొద్దికొద్దిగా ఫిష్ మిశ్రమం పెట్టుకుంటూ బాల్లా చేసి, నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. -
మంగళూరు తీరంలో.. అరుదైన తిమింగలం!
సాక్షి, విశాఖపట్నం: ప్రపంచంలోనే అత్యంత అరుదైన ఒమూరా వేల్ (తిమింగలం) ఉనికిని కర్ణాటకలోని మంగళూరు తీరంలో గుర్తించామని ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఐ) డైరెక్టర్ జనరల్ ఆర్.జయభాస్కరన్ వెల్లడించారు. తాము చేపట్టిన సర్వేలో భాగంగా మంగళూరు తీరంలో వీటి సంతతిని ఇటీవల కనుగొన్నామన్నారు. ఒమూరా జాతి తిమింగలానికి దంతాలు ఉండవన్నారు. భారత సముద్ర జలాల్లో వీటి లభ్యత ఇదే తొలిసారని చెప్పారు. సోమవారం ఆయన విశాఖలోని ఎఫ్ఎస్ఐ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. మరో అరుదైన బ్లెయిన్‌విల్లి (మిసోప్లొడాన్ డెన్సిరో్రస్టిస్) జాతికి చెందిన తిమింగలాల జాడ కూడా పశి్చమ తీరంలోని గోవా ప్రాంతంలో లభ్యమైందని తెలిపారు. అయితే ఒమూరా జాతికి భిన్నంగా ఈ తిమింగలాలు పొడవైన దంతాలను కలిగి ఉంటాయన్నారు. దేశంలో 2.02 మిలియన్ చదరపు కిలోమీటర్ల పరిధిలో సముద్ర క్షీరదాలపై ఎఫ్ఎస్ఐ సర్వే నిర్వహిస్తోందని తెలిపారు. ఏడాది కాలంలో తూర్పు, పశ్చిమ తీరాల్లో 10,483 డాల్ఫిన్లు 18 రకాలు, నాలుగు జాతులకు చెందిన 27 తిమింగలాల జాడ కనుగొన్నామని చెప్పారు. జయ భాస్కరన్ విశాఖ ప్రాంతంలోనూ వివిధ రకాల డాల్ఫిన్లు.. విశాఖ పరిసరాల్లోని సముద్ర జలాల్లోనూ వివిధ రకాల డాలి్ఫన్లు సంచరిస్తున్నాయని జయభాస్కరన్ చెప్పారు. ప్రతి ఐదేళ్లకోసారి మత్స్య సంపద గణన చేపడతామని, ప్రస్తుతం ఈ గణన కొనసాగుతుందని తెలిపారు. ప్రస్తుతం మత్స్య షికారి, మత్స్య దర్శిని వెస్సల్స్‌తో ఎఫ్ఎస్ఐ సర్వే చేస్తోందన్నారు. ఈ వెసల్స్ పాతవి కావడంతో కొత్త వెసల్స్ మంజూరు చేయాలని విశాఖ పర్యటనకు వచ్చిన కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తమ్ రూపాలాను కోరామని, ఇందుకు ఆయన సమ్మతించారని డీజీ వివరించారు. విశాఖ ఎఫ్ఎస్ఐలో ఆధునికీకరించిన మెరైన్ మ్యూజియంలో రసాయనాల్లో భద్రపరచిన అరుదైన చేప జాతులను ప్రదర్శనకు ఉంచామని, ఇందులో విద్యార్థులు, పరిశోధకులతో పాటు ప్రజలను ఉచితంగా అనుమతిస్తామన్నారు. ఈ మ్యూజియంలో అత్యంత అరుదైన సముద్రపు ఆవు (సీ కౌ)ను ప్రదర్శనకు ఉంచామని తెలిపారు. ఆయన వెంట విశాఖ ఎఫ్ఎస్ఐ మెకానికల్ మెరైన్ ఇంజినీర్ భామిరెడ్డి పాల్గొన్నారు. -
4 కళ్ల నల్లని చారల చేప... చూసేందుకు జనం పరుగులు!
బీహార్‌లోని బెతియా జిల్లాలో మత్స్యకారుల వలకు విచిత్రమైన చేప చిక్కింది. ఆ చేపను చూసేందుకు జనం తండోపతండాలుగా తరలి వస్తున్నారు. బెతియా జిల్లాలలోని లాకఢ్ గ్రామంలోని మత్స్యకారుల చేతికి ఈ చేప చిక్కింది. గ్రామానికి సమీపంలో ప్రవహిస్తున్న నదిలో వల వేసినప్పుడు వారికి ఈ చేప చిక్కింది. తొలిసారి చూసినప్పుడు ఈ చేప విమానం మాదిరిగా కనిపిస్తుంది. ఈ చేప నల్లని చారలను కలిగివుంది. దానికి నాలుగు కళ్లు ఉన్నాయి. ఈ చేపను సకెర్మౌత్ క్యాట్‌ఫిష్ అని అంటారు. ఈ తరహా చేపలు సాధారణంగా అమెరికాలో ప్రవహించే నదులలో కనిపిస్తాయి. వింతగా కనిపిస్తున్న ఈ చేపను చూసేందుకు సమీపగ్రామ ప్రజలు తరలివస్తున్నారు. కాగా ఈ తరహా చేపలు ఇతర చేపల గుడ్లను తినేస్తుంటాయి. ఫలితంగా ఈ చేపలు ఇతర చేపల మనుగడకు ముప్పుగా భావిస్తున్నారు. గ్రామానికి చెందిన వీరేంద్ర చౌదరి ఇక్కడికి సమీపంలోని నదిలో ఇటువంటి రెండు చేపలను పట్టుకున్నారు. ఈ చేపలను వీరేంద్ర చౌదరి తన ఇంటిలో సురక్షితంగా ఉంచారు. ఈ విషయాన్ని స్థానికులు సంబంధిత అధికారులకు తెలియజేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం ఈ చేపను అందం కోసం జనం ఇంటిలోని ఫిఫ్ అక్వేరియంలలో ఉంచుతారు. అయితే ఎవరో ఇటువంటి చేపలను నదిలో విడిచిపెట్టి ఉంటారు. ఫలితంగా ఈ చేపలు మరింత వృద్ధి చెంది, గండక్, కోసీ గంగా నదులలో కనిపిస్తున్నాయి. అయితే నదిలో ఈ చేపలు ఉండటం పలు జలచరాలకు ముప్పు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: ఆ రాష్ట్రపతి సుప్రీంకోర్టు మెట్లు ఎందుకు ఎక్కారు? కేసు పూర్వపరాలేమిటి? -
చెరువులో దెయ్యం చేపలు
కర్ణాటక: బెంగళూరు గ్రామీణ జిల్లా ఆనేకల్ తాలూకా మాయసంద్ర గ్రామంలో చెరువులో అరుదైన చేపలు లభించాయి. శనివారం సాయంత్రం చెరువులో వేసిన వల వేసి తీయగా నల్లగా, చారలు, చుక్కలతో భయం గొలిపేలా ఉన్న రాకాసి చేపలు లభించాయి. వీటి దేహం రాయిలాగ గట్టిగా ఉంది, పదునైన రెక్కలు కలిగి ఉన్నాయని మత్స్యకారులు తెలిపారు. ఒక్కో చేప సుమారు 2 కేజీల పైనే బరువుంది. ఈ చేపలను హైపోస్టోమస్, ప్లెకోస్టోమస్ లేదా సకర్ మౌత్ క్యాట్ ఫిష్, కామన్ ఫ్లెకో అని, అచ్చ తెలుగులో దయ్యం చేప అని పిలుస్తారు. వీటితో అన్నీ సమస్యలే సాధారణంగా ఈ చేపలు తినడానికి పనికిరావు. ఈ చేపలను అక్వేరియంలలో అలంకారం కోసం ఉంచుతారు. ఇవి ఊరి చెరువులోకి ఎలా వచ్చాయనేది ప్రశ్నగా మారింది. ఇటువంటి చేపలు విస్తరిస్తే పనికి వచ్చే ఇతర చేపల సంతతి నాశనమవుతుందని, ఆదిలోనే అరికట్టాలని జాలర్లు తెలిపారు. ఇవి మంచి చేపల గుడ్లను తినేసి ఆ జాతులను దెబ్బతీస్తాయి, దీని వల్ల కేంద్ర ప్రభుత్వం దయ్యం చేపల పెంపకాన్ని నిషేధించింది. -
1,300 కిలోల ఆఫ్రికన్ స్కార్పియన్ చేపలు స్వాధీనం
అన్నానగర్: రామనాథపురంలో బుధవారం వేకువజామున 1,300 కిలోల అరుదైన ఆఫ్రికన్ స్కార్పియన్ చేపలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. రామనాథపురం ఫుడ్‌సేప్టీ ఆఫీసర్ లింగవేల్ పట్టణం ఖాతన్ ప్రాంతంలో ట్రాలీ దుకాణాలు, రోడ్డు పక్కన ఉన్న అంగళ్లపై బుధవారం వేకువజామున దాడులు చేశారు. అనంతరం ఆ ప్రాంతంలో నిలిపివున్న కార్గో వాహనంలో సోదాలు చేశారు. ఈ వాహనంలో మన ప్రభుత్వం నిషేధించిన స్కార్పియన్ చేపలను ఆఫ్రికా నుంచి పెద్ద మొత్తంలో తీసుకెళుతున్నట్లు గుర్తించారు. అనంతరం అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సౌర పడవలతో చేపలవేట
సాక్షి, హైదరాబాద్: చేపల వేటలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆధునిక విధానాలను ప్రవేశ పెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య ప్రయత్నాలను ఆరంభించింది. రాష్ట్రంలోని భారీ జలాశయాల్లో చేపలు పట్టేందుకు మత్స్యకారులకు అవసరమైన యంత్ర సామగ్రిని సమకూర్చేందుకు మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా తెప్పలతో చేపల వేట సాగిస్తున్న మత్య్సకారులకు సౌరశక్తితో నడిచే పడవలు అందజేయాలని నిర్ణయించింది. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే ఉనికిలో ఉన్న సుమారు వందకుపైగా జలాశయాల్లో.. దాదాపు లక్ష మందికి పైగా మత్య్సకారులకు తెప్పలతో చేపల వేట జీవనాధారంగా ఉంది. లోతైన నీటిలో తెప్పలపై అనేక మంది మత్స్యకారులు ప్రమాదాలకు గురవుతుంటే.. మరికొందరు మృతి చెందుతున్నారు. తెప్పపై నుంచి వల వేయడం, తెడ్డు సాయంతో పడవ ముందుకు నడపడంలో అనేక ఇబ్బందులొస్తున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. వీటిన్నింటిని గుర్తించి మత్స్యకారుల మేలు కోసం ఇకపై సౌరశక్తి పడవలు సమకూర్చాలని రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య నిర్ణయించింది. మరబోట్లతో అధిక వ్యయం: చేపల వేటకు ఉపయోగించే డీజిల్, పెట్రోల్ మరబోట్ల వినియోగం ఖర్చుతో కూడుకున్నదని ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ చెప్పారు. ఇంధన ఖర్చులు లేని పర్యావరణహితమైన మార్గాలను పరిశీలించినట్టు తెలిపారు. కేరళలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీష్ టెక్నాలజీతో తెలంగాణకు సౌరశక్తి పడవులను తీసుకొస్తామని తెలిపారు. హైదరాబాద్‌లోని ‘బిట్స్ పిలాని’సంస్థ నిపుణులతో శనివారం చర్చలు జరిపామని పేర్కొన్నారు. సహకారం అందించేందుకు బిట్స్ పిలాని శాస్త్రవేత్తలు ప్రొఫెసర్ మోరపాకల శ్రీనివాస్, ప్రొఫెసర్ సంతాను కోలే తదితరులు హామీ ఇచ్చారని రవీందర్ తెలిపారు. రానున్న రోజుల్లో రాష్ట్ర జలాశయాలన్నింటిలోనూ సౌరశక్తితో నడిచే పడవులను ప్రవేశపెడతామని రవీందర్ వెల్లడించారు. -
కచ్చిడి చేపలతో ఒక్కరోజులోనే మిలియనీర్.. ఎందుకింత విపరీతమైన క్రేజ్?
ఏపీ సెంట్రల్ డెస్క్: మహారాష్ట్రకు చెందిన ఓ జాలరికి దొరికిన కచ్చిడి చేపలతో ఒక్క రోజులోనే మిలియనీర్ అయిపోయాడు. యాభై కేజీల కచ్చిడి చేప కలకత్తాలో రూ.13 లక్షలకు అమ్ముడుబోయింది. కాకినాడ కుంభాభిషేకం రేవులో కచ్చిడి చేప 4 లక్షల రూపాయలు పలికింది. కోనసీమలోని అంతర్వేది తీరంలో కచ్చిడి దొరికిన మత్స్యకారుడిపై కాసుల వర్షం కురిసింది. ఇలాంటి వార్తలు తరచూ చూస్తున్నాం. అసలేంటీ కచ్చిడి చేప. పులసకే తాతలా ఉంది. కళ్లు బైర్లు కమ్మే రేటు ఎందుకు పలుకుతోంది. కేజీ రూ. 20 వేలకు పైగా ధర పలికేంత విషయం కచ్చిడిలో ఏముంది. సింగపూర్, మలేసియా, హాంగ్‌కాంగ్, థాయ్‌లాండ్, జపాన్, ఇదర ఆగ్నేయాసియా దేశాల్లో దీనికి అంత డిమాండ్ ఎందుకు.. అంటే ఇది ఔషధాల గని కాబట్టి. బురద ప్రాంతాల్లో నివాసం హిందూ మహా సముద్రం, దక్షిణ పసిఫిక్ మహా సముద్రంలో ఇవి నివసిస్తాయి. పర్షియన్ గల్ఫ్, భారత్ తీరం, జపాన్, పవువా న్యూగినియా, ఉత్తర ఆ్రస్టేలియా సముద్ర ప్రాంతంలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. నదీ ముఖద్వారాలు సమీపంలో, అడుగున బురదగా, బండరాళ్లు ఉండే ప్రాంతాల్లో జీవిస్తాయి. సాధారణంగా ఇవి 60 మీటర్ల లోతులో సంచరిస్తూ ఉంటాయి. ఆహారం కోసం వలస వెళ్తూ ఉంటాయి. ఎన్నో పేర్లు.. ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతంలో కచ్చిడిగా పిలుస్తున్న ఈ చేప శాస్త్రీయ నాయం ప్రొటోనిబియా డయాకాంథస్. దీనిని ఘోల్ ఫిష్ అని, సీ గోల్డ్ అని కూడా పిలుస్తారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో టెలియా భోలా, కచ్చర్ భోలా అని అంటారు. ప్రపంచ వ్యాప్తంగా దీనిని బ్లాక్స్పాటెడ్ క్రోకర్ అని, ఆ్రస్టేలియాలో బ్లాక్ జ్యూఫిష్ అని అంటారు. జీవితకాలం 15 ఏళ్లు.. వీటి నోరు పెద్దగా ఉంటుంది. పక్కన నాలుగు రెక్కలు (ఫిన్స్), వెన్నుముక పొడవునా మరో ఫిన్ ఉంటుంది. రెండు వెన్నుముకలతో పొట్ట తర్వాత నుంచి కిందకు వంగి.. తోకవరకు సన్నగా ఉంటుంది. ఇవి అవకాశాన్ని బట్టి అన్ని రకాల ఆహారాలను తింటాయి. ముఖ్యంగా పీతలు, రొయ్యలు, లాబ్స్టర్లను ఇష్టంగా లాగిస్తాయి. చిన్న చేపలను వేటాడతాయి. సముద్రంలో ఎక్కడెక్కడ తిరిగినా ఏటా గుడ్లు పెట్టే సమయానికి మాత్రం తమ ఆవాసాలకు గుంపులుగా చేరతాయి. మే నుంచి అక్టోబర్ మధ్య కాలంలో నదులు సముద్రంలో కలిసే చోట్లకు వచ్చి గుడ్లుపెడతాయి. వీటి జీవితకాలం 15 ఏళ్లు. అయితే పుట్టినప్పటి నుంచి చాలా వేగంగా ఎదుగుతాయి. నాలుగేళ్లలోనే మూడు అడుగుల సైజుకు పెరిగి సంతానోత్పత్తికి సిద్ధమవుతాయి. ఐదు అడుగుల వరకూ కూడా పెరిగే ఇవి.. 60 కేజీలకు పైగా బరువుతూగుతాయి. ఎన్నో ఉపయోగాలు కచ్చిడి చేపలోని ఔషధ గుణాల వల్లే దానికంత క్రేజ్ వచ్చింది. ఐయోడిన్, ఒమెగా–3, డీహెచ్ఏ, ఈపీఏ, ఐరన్, మెగ్నీషియం, సెలీనియం లాంటి మినరల్స్ గని ఈ చేప. దీని కడుపు క్రింది భాగంలో చిన్న సంచిలాంటి శరీర భాగం ఉంటుంది. ఆ సంచిలో లభించే ఔషధాల వల్ల మార్కెట్లో దీనికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఈ సంచి కారణంగానే దీనిని సీ గోల్డ్ అని పిలుస్తారు. ఈదడానికి ఉపయోగపడే వీటి రెక్కలతో సింగపూర్‌లో వైన్ తయారు చేస్తారు. కంటి చూపును మెరుగుపరిచే చాలా విటమిన్స్, మినరల్స్, ప్రొటీన్స్ ఈ చేపలో పుష్కలంగా లభిస్తాయి. ఈ చేపలో చర్మానికి అవసరమైన ప్రొటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. దీనితో చర్మంపై ముడతలు పడవు. ముదిమి ఛాయలు దరిదాపులకు రాకుండా నవయవ్వనంగా చర్మం మెరుస్తుంది. చిన్న పిల్లల్లో మొదడు సక్రమంగా ఎదుగుదలకు ఈ చేపలో పెద్దఎత్తున లభించే ఒమెగా–3 ఎంతో ఉపయోగపడుతుంది. క్రమం తప్పక తింటూ ఉంటే ఐక్యూ (ఇంటెలిజెన్స్ కొషెంట్) కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. కచ్చిడిలోని విటమిన్స్, మినరల్స్ మన శరీరంలోని కండరాలు బలంగా మారడానికి ఎంతో దోహదపడతాయి. ప్రమాదంలో కచ్చిడి.. ప్రపంచ దేశాల్లో అతిగా వేటాడటం, తీర ప్రాంతం కాలుష్యంగా మారడం వల్ల దీని ఉనికికే ప్రమాదం ఏర్పడుతోంది. గుడ్లు పెట్టేందుకు తీర ప్రాంతాలకు వచ్చే సమయంలో వీటిని ఎక్కువగా వేటాటం వల్ల వాటి సంఖ్య విపరీతంగా తగ్గిపోతోంది. ఇటీవల కాలంలో దీనిని రక్షించడానికి ఆ్రస్టేలియా కొన్ని కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. అలాగే భారత్ తీర ప్రాంతంలో మెకనైజ్డ్ బోట్లతో వేట నిషేధం, ఇవి గుడ్లు పెట్టే సీజన్లో వేటకు విశ్రాంతి ప్రకటించడం వల్ల వీటికి రక్షణ లభిస్తోంది. -
ఇష్టం అంటే మరీ ఇలానా! ఈ 'స్ట్రేంజ్ అడిక్షన్' వింటే షాకవ్వాల్సిందే!
ఒక్కో వ్యక్తికి ఒక్కో ఇష్టం ఉంటుంది. ఫుడ్‌కి సంబంధించినంత వరకు ఒక్కోక్కళ్లకి ఒక్కో విధమైన టేస్ట్ ఉంటుంది. దాన్నే అమితంగా ఇష్టపడటం జగుతుంది. కానీ మరి ఘోరంగా అది లేకపోతే బతకడమే కష్టం అన్నట్లు ఉండం. పరిస్థితుల రీత్యా ఎడ్జెస్ట్‌మెంట్ కూడా చేసుకుంటాం. లేదంటా లైఫ్ సాఫీగా జరగదు..బ్రేక్‌లు మాదిరిగా ఆగిపోతూ నత్తనడకలా ఉంటుంది. మనకు మనకే మన లైఫ్ కష్టంగా అర్థంకాని విధంగా ఉంటుంది. అది ఏ విషయంలోనేనాసరే!. కానీ ఇక్కడొక వ్యక్తి ఇష్టం మాములుగా లేదు! వింటే షాక్ అవ్వుతారు. వివరాల్లోకెళ్తే..అమెరికాలోని కాన్వాస్‌కు చెందిన టైలర్ అనే వ్యక్తి ఓ స్ట్రేంజ్ అడిక్ట్. ఏంటిది? డ్రగ్స్, మాదక ద్రవ్యాలు వంటివి అని అనుకోకండి. ఎందుకంటే? అవేమీ కావు. చెప్పాలంటే తనకు ఎంతో ఇష్టమైన ఆహారానికి బానిసగా మారాడు. ఆ ఫుడ్ లేకుండా మనోడికి ఆ రోజు స్టార్ట్ అవ్వలేనంతగా. టైలర్‌కి ఆ ఫుడ్ అంటే..అలాంటి ఇలాంటి ఇష్టం కాదు. ఇంతకీ.. టైలర్‌కి నచ్చిన ఫుడ్ ఏంటంటే.. :"ట్యూనా ఫిష్". ఇదంటా టైలర్‌కి చాలా పిచ్చి. ఎంతలా అంటే వారానికి ఐదు క్యాన్లు హాంఫట్ చేసేంత పిచ్చి ఇష్టం. ప్రతి రోజు దాని వాసన చూడకుండా ఉండలేడట. అందుకని ఆ ట్యూనా ఫిష్ క్యాన్లను కూడా ఎప్పుడూ వెంటే జేబులో పెట్టుకుని తిరుగుతాడట. అందరూ చక్కగా రోజుని మంచి కాఫీతోనో లేదా గ్రీన్ టీ తోనో డే స్టార్ట్ చేస్తే టైలర్ మాత్రం ఈ ఫిష్ క్యాన్‌తో స్టార్ట్ చేస్తాడు. ఈ మేరకు టైలర్ అమ్మ మాట్లాడుతూ..చిన్నప్పటి నుంచి టైలర్‌కి ట్యూనా ఫిష్ అంటే ఇష్టం అని తెలుసు. కానీ మరి ఇంతలా అడిక్ట్ అవుతాడని ఊహించలేదు. చిన్నతనంలో ఈస్టర్కి పిల్లలంతా బుట్టలో చాక్లెట్లు వేసుకుంటే ఇతను మాత్రం ఆ ట్యూనా ఫిష్ క్యాన్లు బుట్టలో పెట్టుకునేవాడు. వాడికి ఆ ఫిష్ అంటే ఇష్టం కదా! అలా పెట్టుకున్నాడని లైట్ తీసుకున్నా. కానీ అదే తప్పవుతుందని ఊహించలేదని వాపోయింది టైలర్ తల్లి. ప్రస్తుతం టైలర్ రోజు ఆ చేప వాసన చూడకుండా ఉండలేడు. అది తినకపోతే ఏం చేయలేను అన్నంత స్టేజ్‌లో ఆ ట్యూనా ఫిష్కి అడిక్ట్ అయ్యాడు. వామ్మో ఇలాంటి స్ట్రేంజ్ అడిక్షిన్లు కూడా ఉంటాయా! అనిపిస్తుంది కదా!. (చదవండి: అయ్ బాబోయ్.. ఐఏ! రేకెత్తిస్తున్న భయాలు..భయం గుప్పెట్లో యువత) -
ఒక్క క్లిక్... రెడీ టు కుక్
బతికిన చెరువు చేపలు, రొయ్యలు... తాజా సముద్రపు చేపలు, రొయ్యలు, పీతలు... ఎండుచేపలు, రొయ్యల పచ్చళ్లు... నేరుగా వండుకుని తినేలా స్నాక్ ఐటమ్స్‌తోపాటు ‘రెడీ టు కుక్’ పేరిట మసాలా అద్దిన (మారినేట్) మత్స్య ఉత్పత్తులు... కనీసం వారం రోజులు నిల్వ చేసుకునేలా వ్యాక్యూమ్డ్ ప్యాకింగ్‌తో ఐస్‌లో భద్రపర్చిన కటింగ్ ఫిష్, రొయ్యలు... ఇలా 60 రకాల మత్స్య ఉత్పత్తులలో ఏది కావాలన్నా ఇక నుంచి ఆన్లైన్లో బుక్ చేసుకుంటే చాలు క్షణాల్లో డోర్ డెలివరీ ఇస్తారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తోంది. సాక్షి, అమరావతి: ‘ఫిష్ ఆంధ్ర–ఫిట్ ఆంధ్ర’ బ్రాండింగ్‌తో హబ్ అండ్ స్పోక్స్ మోడల్లో డొమెస్టిక్ మార్కెటింగ్ వ్యవస్థను విస్తరిస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం... మరో అడుగు ముందుకేసి స్థానిక వినియోగం పెంచడమే లక్ష్యంగా మత్స్య ఉత్పత్తులను డోర్ డెలివరీ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఏటా 50లక్షల టన్నుల మత్స్య ఉత్పత్తుల దిగుబడులతో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం... తలసరి వినియోగంలో కేవలం 8.07 కేజీలు మాత్రమే ఉంది. దీనిని వచ్చే ఐదేళ్లలో కనీసం 30 శాతం పెంచడమే లక్ష్యంగా జిల్లాకు ఒక ఆక్వా హబ్, దానికి అనుబంధంగా రిటైల్ అవుట్లెట్లతోపాటు ఈ–మొబైల్ 3 వీలర్, 4 వీలర్ ఫిష్ వెండింగ్ వెహికల్స్ డెయిలీ (ఫిష్ కియోస్‌్క), సూపర్ (లైవ్ ఫిష్ వెండింగ్ సెంటర్స్), లాంజ్ (వాల్యూ యాడెడ్) యూనిట్లను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టులో భాగంగా 1,826 స్టోర్స్ అందుబాటులోకి రాగా, మరో 2వేల యూనిట్లను త్వరలో ప్రారంభించనుంది. తాజాగా ఒక్కో కేటగిరీలో 20 చొప్పున ఫ్రెష్ వాటర్, బ్రాకిష్ వాటర్, మెరైన్ కేటగిరీల్లో 60కి పైగా మత్స్య ఉత్పత్తుల డోర్ డెలివరీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటితోపాటు డిమాండ్ ఎక్కువగా ఉన్న రకాలను గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో సర్వే కూడా చేస్తున్నారు. తొలి దశలో ప్రధాన నగరాలు, పట్టణాల్లో, రెండో దశలో రాష్ట్రమంతా అమలు చేయాలని నిర్ణయించారు. డోర్ డెలివరీ కోసం స్విగ్గీ, జొమాటో వంటి కంపెనీలతో ఒప్పందం చేసుకోనున్నారు. ఫిష్ ఆంధ్ర అవుట్లెట్ వారు సొంతంగా డోర్ డెలివరీ చేసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తారు. సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం ఫిష్ ఆంధ్ర బ్రాండింగ్‌ను మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు డిజిటల్ మార్కెటింగ్ అండ్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ (డీఎం–సీఆర్ఎం)ను అందుబాటులోకి తెచ్చారు. యూ ట్యూబ్, గూగుల్, ఫేస్బుక్, ఇన్‌స్ర్ట్రాగామ్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా విస్తృత ప్రచారానికి ప్రణాళిక సిద్ధంచేశారు. కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ వ్యవస్థ ద్వారా వినియోగదారుల ఫీడ్ బ్యాక్ తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలో ప్రత్యేకంగా కాల్‌సెంటర్ కూడా అందుబాటులోకి తీసుకువస్తారు. డిజిటల్ చెల్లింపుల కోసం పేటీఎం సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. ప్రత్యేకంగా వెబ్సైట్ మత్స్య ఉత్పత్తులను ప్రజల ముంగిటకు తీసుకువెళ్లాలనే లక్ష్యంతో ‘ఫిష్ ఆంధ్ర’ ఆన్లైన్ అమ్మకాలకు శ్రీకారం చుట్టేందుకు ఏర్పాటు చేసిన వెబ్‌సైట్‌ను ఇటీవల రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆవిష్కరించారు. రిటైల్ అవుట్‌లెట్స్, ఇతర యూనిట్లను ఈ వెబ్‌సైట్‌తో అనుసంధానం చేయడానికి మ్యాపింగ్ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. స్విగ్గీ, జొమాటో తరహాలో ఫిష్ ఆంధ్ర వెబ్‌సైట్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తారు. త్వరలో డోర్ డెలివరీకి శ్రీకారం ఫిష్ ఆంధ్ర పేరిట దాదాపు 2వేల అవుట్‌లెట్స్ ఏర్పాటు చేశాం. ఇంత పెద్దఎత్తున చైన్ వ్యవస్థ దేశంలో మరెక్కడా లేదు. మరో అడుగు ముందుకేసి కోరుకున్న మత్స్య ఉత్పత్తులను ప్రజల ముంగిటకు తీసుకువెళ్లేందుకు డోర్ డెలివరీ సదుపాయాన్ని కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఇందుకోసం వెబ్‌సైట్‌ను ప్రారంభించాం. డోర్ డెలివరీ కోసం స్విగ్గీ, జొమాటో తరహా కంపెనీలతో ఒప్పందం చేసుకుంటాం. – కూనపురెడ్డి కన్నబాబు, రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ -
ఇలాంటి ట్రైపాడ్ చేపను ఎప్పుడయినా చూశారా?
-
ఇదో రాకాసి మీనం: వలను చించేస్తూ.. భూమిని చీలుస్తూ!
చిత్రంలో మీరు చూస్తున్నది చేపే. కానీ ఇది కొంచెం వైల్డ్. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రచెరువులో బుధవారం దర్శనమిచ్చింది. మామూలు చేపలతో పోలిస్తే విభిన్నంగా కనిపించడంతో ప్రజలు దీనిని చూసేందుకు ఆసక్తి చూపారు. ఈ చేప కోసం పరిశోధకుల్ని సంప్రదిస్తే వారు బోలెడు విషయాల్ని వివరించారు. – కాశీబుగ్గ ఇదీ చేప కథ.. శాస్త్రీయ నామం: టెరిగో ఫ్లిక్తీస్ పరదాలిస్ వ్యవహారిక నామం: అమెజాన్ అంటుబిల్ల.. సెయిల్ ఫిన్ క్యాట్ ఫిష్ నీటి అడుగు భాగంలో బొరియలు చేస్తాయి. తద్వారా జీవవైవిధ్యం దెబ్బతింటుంది. మత్స్యకారుల వలలను తమ శరీర భాగాలతో చించేస్తాయి. ఈ చేపల్ని పక్షులు ఆరగిస్తే వాటి ఆహార నాళం చిరిగిపోయి మరణిస్తాయి. ఇది విదేశాలకు చెందినది. అక్వేరియంలో పెంచేందుకు దీనిని గతంలో భారత్‌కు తీసుకొచ్చారు. అక్వేరియంలో ఉండే నాచు పదార్థాన్ని తిని శుభ్రపరచడం దీని ప్రత్యేకత. నీరు లేకపోయినా ఎక్కువ సేపు బయట బతకగలగడం మరో ప్రత్యేకత. మన దేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, వెస్ట్‌బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఇవి కనిపిస్తాయని జీవ వైవిధ్య శాస్త్రవేత డాక్టర్ కర్రిరామారావు ‘సాక్షి’కి వివరించారు. 2014లో దీనిని తెలంగాణలో తొలిసారి గుర్తించినట్లు ఆయన తెలిపారు. -
వ్యవసాయం చేస్తూనే చేపల పెంపకం
-
ఫిష్.. ఫిష్ హుర్రే!
సాక్షి, అమరావతి: ‘ఫిష్ ఆంధ్ర’ అవుట్‌లెట్స్‌కు ఆదరణ మరింత పెరుగుతోంది. ‘ఫిష్ ఆంధ్ర’ అవుట్‌లెట్స్‌కు ఏ రోజు వెళ్లినా కావాల్సిన మత్స్య ఉత్పత్తులు తాజాగా దొరుకుతాయన్న నమ్మకం మాంసాహార ప్రియుల్లో ఏర్పడింది. దీంతో వీటికి విశేష ఆదరణ లభిస్తోంది. తమకు జీవనోపాధి లభించడంతోపాటు తమ ద్వారా మరికొందరికి ఉపాధి కల్పించగలుగుతున్నామని అవుట్‌లెట్స్ నిర్వాహకులు చెబుతుంటే.. శుభ్రమైన వాతావరణంలో తాజా మత్స్య ఉత్పత్తులు లభిస్తున్నాయని వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక వినియోగం పెంచే లక్ష్యంతో.. మత్స్య ఉత్పత్తుల స్థానిక వినియోగం పెంచడమే లక్ష్యంగా ‘ఫిష్ ఆంధ్ర’ పేరిట ప్రభుత్వం బ్రాండింగ్ చేసి ప్రోత్సహిస్తోంది. రాష్ట్రంలో ఏటా 4.36 లక్షల టన్నులున్న మత్స్య ఉత్పత్తుల స్థానిక వినియోగాన్ని 2025 నాటికి కనీసం 15 లక్షల టన్నులకు పెంచాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 70 హబ్‌లను, వాటికి అనుబంధంగా 14 వేల అవుట్లెట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. తొలి దశలో జిల్లాకు ఒకటి చొప్పున ఆక్వా హబ్, వాటికి అనుబంధంగా 4 వేల అవుట్‌లెట్స్, స్పోక్స్, డెయిలీ, సూపర్, లాంజ్ యూనిట్స్‌తో పాటు త్రీవీలర్, 4 వీలర్ కియోస్‌్కలను 60 శాతం సబ్సిడీపై నిరుద్యోగ యువతకు మంజూరు చేసింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,250 అవుట్‌లెట్స్, 70 త్రీ వీలర్, 84 ఫోర్ వీలర్ వెహికల్స్, 62 డెయిలీ, 50 సూపర్, 11 లాంజ్ యూనిట్స్ కలిపి మొత్తంగా 1,527 యూనిట్స్ ఏర్పాటయ్యాయి. తొలుత నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో సముద్ర మత్స్య ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. స్థానికంగా దొరికే చేపలు, రొయ్యలతోపాటు సముద్ర మత్స్య ఉత్పత్తులు సైతం లభిస్తుండటంతో వీటిని కొనేందుకు ఎగబడుతున్నారు. స్పందన చాలా బాగుంది ప్రైవేటు బ్యాంక్‌లో ఉద్యోగం చేసేవాడిని. నెలకు రూ.15 వేలు జీతం వచ్చేది. ప్రభుత్వ ప్రోత్సాహంతో కర్నూలులోని నంద్యాల చెక్‌పోస్ట్ సెంటర్లో 60 శాతం సబ్సిడీతో ఫిష్ ఆంధ్ర అవుట్లెట్ పెట్టుకున్నా. ఆదివారం 200–300 కిలోలు, మిగిలిన రోజుల్లో 50నుంచి 100 కేజీల వరకు మత్స్య ఉత్పత్తులు అమ్ముడుపోతున్నాయి. నాకు ఉపాధి లభించడంతోపాటు మరో నలుగురికి ఉపాధి చూపిస్తున్నా. కాకినాడ నుంచి సముద్ర చేపలు, రొయ్యలు, పీతలు సైతం వస్తున్నాయి. సీ ఫుడ్స్ కోసం క్యూ కడుతున్నారు. సాయంత్రం పూట చేప, రొయ్య తదితర వంటకాలతో వాల్యూ యాడెడ్ యూనిట్ నడుపుతున్న. స్పందన చాలా బాగుంది. సిబ్బంది జీతభత్యాల కింద రూ.56 వేలు చెల్లిస్తున్నా. రూ.60 వేలకు పైగా ఈఎంఐలు కడుతున్నా. అయినా రూ.50 వేల వరకు మిగులుతోంది. – బట్టు రాజశేఖర్, ఫిష్ ఆంధ్ర అవుట్లెట్ నిర్వాహకుడు, కర్నూలు చాలా తాజాగా ఉంటున్నాయి ప్రతి ఆదివారం ఫిష్ ఆంధ్ర అవుట్లెట్కు వస్తున్నా. ఇక్కడ గోదావరిలో మాత్రమే దొరికే చేపలతో పాటు సముద్ర చేపలు, రొయ్యలు కూడా దొరుకుతాయి. చాలా తాజాగా ఉంటున్నాయి. ఎంతో రుచిగా ఉంటున్నాయి. – జి.శ్రీనివాసరావు, పోరంకి, విజయవాడ హైజీనిక్‌గా ఉంటున్నాయి అవుట్లెట్కు ఏరోజు వచ్చినా అన్నిరకాల చేపలు దొరుకుతున్నాయి. చాలా తాజాగా ఉంటున్నాయి. హైజీనిక్‌గా మెయింటైన్ చేస్తున్నారు. – కె.రామయ్య, ఈడుపుగల్లు, పెనమలూరు ఆదరణ పెరుగుతోంది స్థానిక వినియోగం పెంచడం లక్ష్యంగా ఫిష్ ఆంధ్ర పేరిట నాణ్యమైన మత్స్య ఉత్పత్తులను హబ్ అండ్ స్పోక్ మోడల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఇప్పటికే మూడు హబ్‌లతో పాటు 1,500కు పైగా అవుట్‌లెట్స్, ఇతర యూనిట్స్‌ను అందుబాటులోకి తెచ్చాం. ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. గతంతో పోలిస్తే స్థానిక వినియోగం గణనీయంగా పెరిగింది. – కె.కన్నబాబు, కమిషనర్, మత్స్యశాఖ -
నల్లగొండ జిల్లాలో ఫిష్ గ్రూప్ పేరిట సైబర్ మోసం
-
ఆరోగ్యానికి చేపట్టాల్సిందే.. మృగశిర కార్తెలో ఫుల్ డిమాండ్
సాక్షి, అమలాపురం: భారతీయ సంప్రదాయం ప్రకారం ఒక్కో కార్తెలో ఒక్కో రకం ఆహారం తీసుకోవడం ఆనవాయితీ. ఇటువంటి ఆహారపు అలవాట్లు ప్రకృతిలో జరిగే మార్పులకు అనుగుణంగా ఆరోగ్యానికి మేలు చేసేవి కావడం విశేషం. ఒక్కో మాసంలో ఒక్కో రకం ఆహారం తీసుకోవడం గోదావరి వాసులకు సంప్రదాయంగా, ఆనవాయితీగా వస్తోంది. వీటిలో పండ్లు, కూరగాయల వంటి శాకాహారమే కాదు. చేపల వంటి మాంసాహారాలు కూడా ఉన్నాయి. ప్రస్తుత మృగశిర కార్తెలో చేపలు ఆహారంగా తీసుకోవడం కూడా ఈ ఆనవాయితీల్లో ఒకటి. మృగశిర కార్తె రోజుల్లో చేపలు తినడం ఆరోగ్యానికి మేలని నమ్మకం. రోళ్లు పగిలే స్థాయిలో ఎండలను మోసుకొచ్చిన రోహిణీ కార్తె ముగిసిన వెంటనే మృగశిర మొదలవుతుంది. తొలకరి వర్షాలు ఆరంభమవుతాయి. ఈ క్రమంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతుంది. ప్రకృతిలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఫలితంగా అనేక హానికర సూక్ష్మ క్రిముల వంటివి ఉత్పత్తి అవుతాయి. ఇటువంటి వాతావరణంలో రోగ నిరోధక శక్తి తగ్గి జ్వరం, దగ్గు, శ్వాస సంబంధ సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చేపలు ఆహారంగా తీసుకోవడం వల్ల ఇటువంటి అనారోగ్యాల నుంచి కాపాడుకోవచ్చు. ఇది శాసీ్త్రయంగా కూడా నిరూపితమైంది. ఈ సీజన్లోనే హైదరాబాద్‌లో బత్తిని గౌడ్ సోదరులు ‘చేప ప్రసాదం’ ఇస్తూంటారు. దీనివల్ల ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులు తగ్గుతాయని విశ్వసిస్తారు. రుచిలో మిన్న.. గోదారి చేప నెల్లూరు అంటే కేవలం చేపల పులుసు మాత్రమే గుర్తుకు వస్తుంది. అదే గోదారి జిల్లాలంటే పులస చేపల పులుసు ఒక్కటే కాదు.. ఇక్కడ దొరికే రకరకాల చేపలు.. వాటితో తయారు చేసే రకరకాల వంటలు గుర్తుకొస్తాయి. గోదావరి నీటి మాహాత్మ్యమో.. లేక వండటంలో గొప్పతనమో చెప్పలేం కానీ గోదావరి చేప కూరలు తినాల్సిందేనని మాంసాహార ప్రియులు లొట్టలు వేసుకుంటూ చెబుతారు. చందువా వేపుడు పండుగొప్ప ఇగురు కొర్రమేను కూర కొయ్యింగల పులుసు గుమ్మడి చుక్క కోన చేపల డీప్ ఫ్రై వంటివి తింటే జిహ్వ వహ్వా అనాల్సిందే. పెద్ద చేపల్లోనే కాదు.. చిన్న వాటిల్లో కూడా బోలెడు పచ్చి మెత్తళ్ల మామిడి ఎండు మెత్తళ్ల వేపుడు కట్టి చేపలు బొమ్మిడాయిల పులుసు రామల ఇగురు చింతకాయ చిన్న చేపలు చీరమేను కూరలకు ఫిదా కాని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఈ చేపలతో పులుసులు, కూరలు, ఇగురులు, వేపుళ్ల వంటివి చేయడంలో గోదావరి వాసులు సిద్ధహస్తులు. ఇక ఉప్పు చేప పప్పుచారు, ఆర్చిన చేప ఇగురు, టమాటా రసం తినాలే కానీ వర్ణించేందుకు మాటలు చాలవు. ఇవే కాదు జెల్లలు, మాతలు, గొరకలు, బొచ్చు, శీలావతి, మోసు, గోదావరి ఎర్రమోసు, వంజరం, గులిగింతలు, మట్టకరస ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు వంటి నగరాల్లో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఒక్కటే కాదు.. గోదారోళ్ల చేపల పులుసు, గోదావరి చేపల కూరల పేరుతో రెస్టారెంట్లు కూడా వెలిశాయంటే ఇక్కడ వండే రకాలకు ఉన్న డిమాండ్ అర్థం చేసుకోవచ్చు. లెక్కకు మిక్కిలిగా ఔషధ గుణాలు చేపల్లో ఔషధ గుణాలు అపారంగా ఉంటాయి. ఇందులోని ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ గుండెకు ఆరోగ్యాన్నిస్తాయి. రక్తం గడ్డకట్టడాన్ని తగ్గిస్తాయి. చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి. గుండె జబ్బులు, ఆస్తమా తదితర అనారోగ్య సమస్యలకు అడ్డుకట్ట వేయాలంటే చేపలు తినాలని వైద్యులు చెబుతారు. మనిషి తన రోజువారీ కార్యకలాపాలు సాఫీగా సాగించేందుకు మెదడులో న్యూరాన్లతో కూడిన గ్రే మ్యాటర్ ఉంటుంది. చేపలు తింటే ఇది మరింత చురుకుగా పని చేస్తుంది. వయస్సు మీద పడుతున్న సమయంలో మెదడులోని కణాల క్షీణతను నిరోధించడానికి చేపల ఆహారం తోడ్పడుతుంది. దీనివల్ల అల్జీమర్స్ వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. టైప్–1 డయాబెటిస్‌ను నియంత్రిస్తుంది. చేపలు తింటే దృష్టి లోపాలు, అంధత్వం వంటివి తగ్గుతాయి. గర్భిణులు, పిల్లలకు పాలిచ్చే సీ్త్రలకు చేపలు తినడం ఎంతో మేలు. చిన్న పిల్లలకు సరిపడే స్థాయిలో పాలు ఇవ్వలేనప్పుడు బాలింతలకు మెత్తళ్ల కూర వండి పెట్టడం సర్వసాధారణం. అలాగే బైపాస్ ఆపరేషన్ చేయించుకున్న వారికి పచ్చి మెత్తళ్లతో పాటు, ఎండు మెత్తళ్లు, చిన్న చేపలు (చేదు చేపలు) పత్యంగా అందిస్తారు. సొరచేపల ద్వారా శృంగార సామర్థ్యం పెరుగుతుందని నిపుణులు చెబుతారు. చేపలు.. కోకొల్లలు మాంసాహారులకు కార్తెతో సంబంధం లేదు. ఏడాది పొడవునా చేపలను ఆహారంగా తీసుకుంటారు. గోదావరి జిల్లాల్లో కూడా చేపలకు కొదవే లేదు. విస్తారమైన సముద్రం, అఖండ గోదావరితో పాటు నదీపాయలు, డెల్టా పంట కాలువలు, పర్రభూములు, మెట్టలో సాగునీటి చెరువులు, ప్రాజెక్టులు.. ఏజెన్సీని ఆనుకుని ఉండే సహజసిద్ధమైన చెరువులు (ఆవలు).. ఆపై వేలాది ఎకరాల్లో చేపల సాగు.. ఇలా ఎటు చూసినా రకరకాల చేపలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. కొన్ని రకాల చేపలు ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతి అవుతుంటాయి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేపలతో ఎన్నో రకాలుగా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చేపల్లో ఉండే ప్రొటీన్ సులువుగా అరిగిపోతుంది. వృద్ధాప్యంలో సహజసిద్ధంగా వచ్చే రుగ్మతలు చాలా వరకూ దూరమవుతాయి. సహజసిద్ధంగా పెరిగే చేపల్లో మేలు చేసే ప్రొటీన్, ఇతర విలువలు ఉంటాయి. – పిండి సాయిబాబు, విశ్రాంత జంతుశాస్త్ర విభాగాధిపతి, ఎస్కేబీఆర్ కాలేజీ, అమలాపురం -
మృగశిర ఎఫెక్ట్.. కొర్రమీను@ 650
హైదరాబాద్: మృగశిర కార్తెను పురస్కరించుకుని చేపలకు భారీ డిమాండ్ ఏర్పడింది. గురువారం నగరంలోని చేపల మార్కెట్లు వినియోగదారులతో కిక్కిరిశాయి. గ్రేటర్ వ్యాప్తంగా సుమారు 3 లక్షల కిలోల చేపల విక్రయాలు జరిగినట్లు మార్కెట్ వర్గాల అంచనా. మృగశిర కార్తె ఎఫెక్ట్‌తో కొర్రమీను ధరలు విపరీతంగా పెరిగాయి. సాధారణ రోజుల్లో ఈ చేపలు కిలోకు రూ.320 పలుకుతుండగా.. ప్రస్తుతం రూ.500 నుంచి రూ. 650 వరకు విక్రయించారు. బొచ్చ, రవ్వు చేపలను కిలో రూ.120 నుంచి రూ. 150కి, పాంప్లేట్ రూ. 90–120 విక్రయించారు. -
భువనగిరి : వారెవ్వా.. చేప రుచి చూడాల్సిందే..(ఫోటోలు)
-
మీనం.. ధర పతనం
సాక్షి, భీమవరం: ప్రభుత్వానికి డాలర్ల పంట పండించే రొయ్యల రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు చేపల సాగు ఆదుకునేది. ప్రస్తుతం చేపల ధరలు తగ్గి మేత ధరలు ఒక్కసారిగా పెరగడంతో ఆక్వా రైతులు కలవరపడుతున్నారు. చేపలను దిగుమతి చేసుకునే దేశాల్లో చేపల ఉత్పత్తి పెరగడం, ఇక్కడ నుంచి ఎగుమతి అయ్యే చేపలు వాసన వస్తున్నాయంటూ దిగుమతులపై ఆంక్షలు విధించడంతో గత నెల రోజులుగా చేపల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 2.50 లక్షల ఎకరాలో ఆక్వా సాగు చేస్తుండగా, దీనిలో దాదాపు 1.70 లక్షల ఎకరాల్లో చేపల సాగు చేస్తున్నారు. జిల్లాలో కార్పోరేట్ ఫిష్ కల్చర్ ప్రారంభం కావడంతో భూములను లీజుకు తీసుకుని చేపల సాగు చేస్తున్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేపల సాగులో ఎకరాకు ఏడాదికి సుమారు 4 టన్నుల వరకు చేపల దిగుబడి వస్తుండగా ఇక్కడి చేపలను అస్సాం, పశ్చిమబెంగాల్, బీహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. ప్రతి రోజు 200 లారీల చేపలు ఎగుమతి అవుతుంటాయి. డీఓబీ కిలో ధర రూ.19 నుంచి 23కు పెంపు జిల్లాలో రైతులు ఎక్కువగా శీలావతి, కట్ల, ఫంగస్ రకం చేపలను సాగుచేస్తుంటారు. చేపల పెంపకానికి ఎక్కువగా వినియోగించే డీఓబీ, సోయాబీన్, వేరుశెనగ చెక్క ధరలకు ఒక్కసారిగా పెరిగిపోయాయని రైతులు చెబుతున్నారు. డీఓబీ గతంలో కిలో ధర రూ.14 ఉండగా ప్రస్తుతం రూ.19 నుంచి రూ.23 వరకు పెరిగింది. అలాగే వేరుశెనగచెక్క కిలో గతంలో రూ.35 ఉండగా ప్రస్తుతం రూ.43 పెరిగింది. ఇది ఇలా ఉండగా చేపల ధరలు మాత్రం పెరగకపోక పోగా మరింత తగ్గాయని రైతులు వాపోతున్నారు. గతంలో ఫంగస్ చేప కిలో రూ.80 వరకు విక్రయాలు చేయగా, ప్రస్తుతం రూ.74, శీలావతి, కట్ల రకం చేపలు కిలో రూ.100 మాత్రమే ధర పలుకుతున్నాయని చెబుతున్నారు. చేపల సాగుతో లాభాల సంగతి అటుంచి నష్టాలను చవిచూడాల్సివస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో రొయ్యల ధరలు తగ్గితే చెరువుల్లో చేపలు పెంచి ఎంతో కొంత నష్టాలను అధిగమించేవారమని, ప్రస్తుతం చేపల సాగు అంటేనే భయపడాల్సి వస్తోందని చెబుతున్నారు. ఆక్వా సాగుకు ప్రభుత్వం సహకారం అందిస్తున్నా ధర లేకపోవడం, మేత ధరలు పెరగడంతో నష్టాలను అధిగమించలేకపోతున్నట్లు రైతులు చెబుతున్నారు. ఇటీవల అస్సాం వంటి రాష్ట్రాల్లో ఐస్ కొరత కారణంగా నిల్వ ఉంచే చేపలు వాసన రావడంతో దాని ప్రభావం మనపై పడి దిగుమతులు నిలిచిపోయినా దీనిపై విచారణ చేసిన తరువాత దిగుమతులు యథావిధిగా కొనసాగుతున్నాయని చెబుతున్నారు. రూ.100 పైబడి ఉంటేనే ధర గిట్టుబాటు ఆక్వా సాగుకు రాష్ట్ర ప్రభుత్వం చేయూత నిచ్చి అండగా ఉన్నప్పటికీ చేపల ధరలు తగ్గిపోవడం, మేత ధరలు పెరగడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. చేపల ధర కిలో రూ.100 పైబడి ఉంటే రైతులకు గిట్టుబాటు అవుతుంది. – పేరిచర్ల విజయనర్సింహరాజు, చేపల రైతు, పెదగరువు, భీమవరం మండలం నష్టాలను చవిచూస్తున్నాం ఇటీవల చేపల ధరలు తగ్గడంతో నష్టాలను చవిచూడాల్సివస్తున్నది. దీనికితోడు చేపల మేత ధరలు పెరగడంతో రైతులకు గోరుచుట్టుపై రోకలి పోటులా పరిణమించింది. ప్రభుత్వం పూర్తిస్ధాయిలో విద్యుత్ సబ్సిడీ ఇస్తే రైతులకు కొంత ప్రయోజనకరంగా ఉంటుంది. – శాయన సుపర్ణ, చేపల రైతు, ఆకివీడు -
అధిక ఉష్ణోగ్రతలతో ఆక్వా రంగం ఉక్కిరిబిక్కిరి
కైకలూరు: ఆక్వా రంగాన్ని అధిక ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీనికి తోడు రోహిణికార్తెతో గురువారం నుంచి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. చేపలు శీతల జలాచరాలు. వీటికి అనుకూల స్థాయి నీటి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల సెంటీగ్రేట్ నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేట్ మధ్య ఉంటాయి. ఇటీవల జిల్లాలో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల సెంటీగ్రేట్ వరకు పెరిగాయి. ఈ పరిణామం చేపల, రొయ్యల రైతులను కలవరపెడుతోంది. చెరువుల్లో నీరు ఆవిరవడం వల్ల ఉష్ణోగ్రతలు పెరిగి ఆక్సిజన్ లేమి, నీటి కాలుష్యం, విషవాయువుల ఉత్పతి వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. 2.60 లక్షల ఎకరాల్లో సాగు ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలో 1.40 లక్షల ఎకరాల్లో చేపలు, 1.20 లక్షల ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతల ప్రభావానికి చెరువుల్లో ఆక్సిజన్ సమస్యత తలెత్తుతోంది. సేంద్రియ పదార్థాలు చెరువు అడుగు భాగానికి చేరి విషతుల్యమవుతున్నాయి. ప్రధానంగా రాత్రి వేళల్లో కిరణజన్య సంయోగక్రియకు ఆటంకం ఏర్పడుతుంది. చేపల్లో శ్వాసక్రియ సమస్య ఏర్పడి ముట్టెలు పైకెత్తి మృత్యువాతపడుతున్నాయి. వేసవిలో మూడు అడుగుల కంటే నీటిమట్టం తక్కువ ఉన్న చెరువుల్లో చేపల మరణాలు అధికమవుతాయి. సమ్మర్ కిల్ ఎండాకాలంలో వాతావరణంలో సంభవించే మార్పుల వల్ల చేపలు చనిపోవడాన్ని సమ్మర్ కిల్ అంటారు. వేసవిలో సూర్యరశ్మి వల్ల చెరువుపై భాగంలో రెండడుగుల మేర నీరు వేడెక్కుతోంది. వేడి నీరు తేలికగా ఉంటుంది. అడుగు భాగాన చల్లగా ఉన్న నీరు బరువుగా ఉంటుంది. సమ్మర్ కిల్కి దారితీసే ప్రధాన అంశం ఇదే. చెరువుల్లో భౌతిక, రసాయన గుణాలున్న నీటి ఉష్ణోగ్రత, ప్లాంక్టాన్, ఆక్సిజన్, ఉదజని సూచిక విలువలు, కార్బన్ డయాక్సైడ్, అమ్మోనియా వంటి హానికర వాయువులు వివిధ లోతులలో వివిధ స్థాయిల్లో ఉంటాయి. నీటి ఉపరితలం నుంచి అడుక్కు వెళ్లే కొలదీ నీటి ఉష్ణోగ్రత, ఆక్సిజన్ స్థాయి తగ్గిపోతాయి. దీంతో చేపలు మృత్యువాత పడతాయి. నీటి పరీక్షలు చేయించాలి వేసవిలో ఉష్ణోగ్రతల ప్రభావం చేపల సాగుపై పడుతోంది. ప్రధానంగా ఆక్సిజన్ సమస్య ఉత్పన్నమవుతోంది. రైతులు ఆక్సిజన్ మాత్రలను అందుబాటులో ఉంచుకోవాలి. నీటి పరీక్షలు తరచుగా చేయించాలి. పీహెచ్ విలువలు తెలుసుకోవాలి. ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో మత్స్యశాఖ సహాయకులను నియమించింది. అధికారుల సూచనలు, సలహాలు పాటించాలి. – ఎం.భవిత, మత్స్యశాఖ అభివృద్ధి అధికారిణి, కైకలూరు వేసవి వ్యాధులతో జాగ్రత్త వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగటంతో ఆక్సిజన్ సమస్య చెరువుల్లో కనిపిస్తోంది. దీంతో చేపలకు శంఖుజలగ, రెడ్ డిసీజ్, పేను వంటి వ్యాధులు ఎక్కువుగా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రధానంగా కోళ్ల ఎరువులను వేసవిలో మానివేయాలి. రొయ్యల చెరువుల మాదిరిగా చేపల చెరువుల్లోనూ ఆక్సిజన్ ఏరియాటర్లను ఏర్పాటు చేసుకోవాలి. – దండు రంగరాజు, ఆక్వారైతు, కైకలూరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ♦ చెరువులో మూడు అడుగులు లోతులో నీరు తగ్గకుండా చేయాలి. ♦ చేపల చెరువులో ఆక్సిజన్ సమస్య పరిష్కారానికి తెల్లవారుజామున మూడు నుంచి ఆరు గంటల వరకు నీటిని కలయతిప్పుతూ ఉండాలి. ♦ చెరువుల్లో కూడా ఆక్సిజన్ ఉత్పిత్తి చేసే ఏరియాటర్లును ఉపయోగించాలి. ♦ జియోలైట్, కాల్షియం పెరాక్సైడ్, ఆక్సిజన్ డబ్లెట్లు వంటివి అందుబాటులో ఉంచుకోవాలి. ♦ చెరువుల్లో మేతలను సగానికి తగ్గించుకోవాలి. ♦ చెరువుల్లో పాతనీటి స్థానంలో అవకాశాన్ని బట్టి కొత్త నీటిని నింపుకోవాలి. ♦ చెరువుపై పక్షులు ఎక్కువుగా సంచరిస్తుంటే ఎక్కడైనా చేపల మరణించాయా అనే విషయాన్ని గమనించాలి. ♦ ఆక్సిజన్ సమస్యను అధికమించడానికి చెరువులో నీటిని యంత్రాల ద్వారా తిరిగే అదే చెరువులోకి నింపే పద్ధతిని అనుసరించవచ్చు. ♦ చెరువులో నీటి, మట్టి పరీక్షలు ఎప్పటికప్పుడు చేయించాలి. -
కొద్దిలో తప్పించుకున్నాడు కానీ.. షార్క్ నోట్లో కిళ్లీ పాన్ అయ్యేవాడు
ఆయుష్షు మిగిలి ఉందంటే ఇదేనేమో. అమెరికాకు అల్లంత దూరంలో ఉండే హవాయి ద్వీపం సమీపంలో చేపలు పట్టుకునేందుకు వెళ్లిన ఓ వ్యక్తికి ఇప్పుడు ఆయుష్షు అంటే ఏంటో తెలిసివచ్చింది. ఎందుకంటే, మృత్యుఘంటికల శబ్దం విని మరీ వెనక్కొచ్చాడు ఘనుడు. స్కాట్ హరగుచ్చి అనే వ్యక్తి ఇదే ప్రాంతంలో చాన్నాళ్లుగా చేపలు పడుతుంటాడు. "అప్పుడే ఓ చేపను పట్టుకున్నాను. ఇంతలోనే ఓ భయానక శబ్దం వినిపించింది. ఎంతలా అంటే నా గుండె జారిపోయేంత. తిరిగి చూస్తే.. ఓ గోధుమ రంగు టైగర్ షార్క్ నా బోటుపై దాడి చేసింది. నేను ఇవతలివైపు ఉన్నాను కాబట్టి తృటిలో తప్పించుకోగలిగాను." - స్కాట్ హరగుచ్చి, కయాకర్, ఫిషర్ మన్ పసిఫిక్ మహా సముద్రంలో అమెరికాకు పశ్చిమాన 3200 కిలోమీటర్ల దూరంలో ఉండే 137 దీవులను కలిపి హవాయి ఐలాండ్స్ అంటారు. దాదాపు 1200 కిలోమీటర్ల కోస్తా ప్రాంతం ఉండే ఈ దీవుల సమీపంలో నీళ్లు చాలా శుభ్రంగా కనిపిస్తాయి. ఈ నీటిలో ఇలాంటి సంఘటనలు అంతగా జరగవు. ఏడాది మొత్తమ్మీద నాలుగయిదు ఘటనలు కూడా ఉండవు. అయితే అప్పుడప్పుడు దారి తప్పి వచ్చే టైగర్ షార్క్‌లు మాత్రం ఇలాంటి దాడులకు దిగుతాయి. సాధారణంగా షార్క్‌లు బోటుపై దాడి చేయవు. అయితే స్కాట్ హరగుచ్చి దానికి కొద్దిసేపటి ముందు ఓ చేపను పట్టుకున్నాడు. దాన్ని వల నుంచి విడదీసే సమయంలో బ్లీడింగ్ జరిగింది. బహుశా రక్తం వాసనను పసిగట్టిన షార్క్ దాడి చేసి ఉంటుందని భావిస్తున్నారు. A kayaker was fishing over a mile offshore in Windward Oahu, Hawaii, when a tiger shark slammed into his boat. https://t.co/d0QzzJODZT pic.twitter.com/P7GStEQvRx — CNN (@CNN) May 16, 2023 -
అయ్యయ్యో.. చేపలు! లోటస్‌పాండ్ చెరువులో 3 వేలకుపైగా మృతి
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని లోటస్‌పాండ్ అంటేనే అందమైన చెరువు, చుట్టూ పచ్చని మొక్కలు, చెరువులో పెద్ద ఎత్తున కనిపించే వివిధ రకాల చేపలు, తాబేళ్లు, పక్షులు కనిపిస్తుంటాయి. ఏమైందో ఏమో.. ఎవరేం చేశారో తెలియదు.. గడిచిన నాలుగు రోజులుగా చెరువులోని చేపలు వేలాదిగా మృతి చెందుతున్నాయి. చేపలు విలవిల్లాడుతూ గాల్లోకి ఎగురుతూ మృతి చెందుతున్న వైనాన్ని చూసి నిత్యం పార్కు వచ్చే వాకర్లు, సందర్శకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. చెరువులోకి మురుగు నీరు పారడం వల్ల అని కొందరు అంటుంటే, చెరువులో నీళ్లలో ఎవరో విష ప్రయోగం చేశారని ఇంకొందరు ఆరోపిస్తున్నారు. చేపలతో పాటు పెద్ద ఎత్తున ఈ నీళ్లలో వేలాదిగా తాబేళ్లు సైతం ఉన్నాయి. ఇవి కూడా చనిపోతున్నాయి. సంబంధిత అధికారులు మాత్రం నాలుగు రోజుల నుంచి విషయాన్ని గమనిస్తున్నా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. విష ప్రయోగమా? కలుషిత నీరా..? వారం రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి చెరువులోకి పెద్ద ఎత్తున వరద నీరు వచి్చంది. వర్షాలు తగ్గిన తర్వాత కూడా చుట్టు పక్కల ప్రాంతాల్లోని కొంత మంది నివాసితులు తమ సెల్లార్లలో నిండిన వరద నీటిని బయటికి పంపింగ్ చేశారు.ఈ నీరు సైతం చెరువులోకి వచ్చి చేరింది. దీనికి తోడు నిర్మాణంలో ఉన్న కొంత మంది భవన నిర్మాణదారులు బ్లాస్టింగ్‌లో వినియోగించే కెమికల్ వ్యర్థాలను కూడా ఈ చెరువులోకి పంపింగ్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కెమికల్ వ్యర్థాలు అత్యంత ప్రమాదకరంగా ఉంటాయని వాటి వల్లే చేపలు చనిపోయి ఉంటాయని ఇంకొంత మంది భావిస్తున్నారు. శాంపిల్స్ సేకరించిన అధికారులు గడిచిన నాలుగు రోజులుగా చేపలు చనిపోతున్న విషయాన్ని స్థానికులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో పాటు ఎని్వరాన్‌మెంట్ అధికారులు, బయోడైవర్సిటీ, జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులకు ఫిర్యాదు చే శారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఇక్కడ నీటి శాంపిల్స్‌ను తీసుకొని వెళ్లారు. మంగళవారం జలమండలి అధికారుల సైతం పార్కులో పర్యటించి పార్కులోకి మురుగు నీరు రావడం లేదని తెలిపారు. చేపలకు ఆహారం... నిత్యం ఈ పార్కుకు పెద్ద సంఖ్యలో స్థానికులు, సందర్శకులు వస్తుంటారు. వాకింగ్ చేయడంతో పాటు కొంత మంది చేపలకు వివిధ రకాల ఆహార పదార్థాలను వేస్తుంటారు. చేపలకు ఏం ఆహారం వేయాలి, ఎవరు వేయాలి అనే నియంత్రణ ఇక్కడ ఏ మాత్రం లేదు. ఎవరు పడితే వారు వచ్చి వారికి తోచిన ఆహార పదార్థాలను వేసి వెళ్తుంటారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులు చేపలకు బిస్కెట్లు, బన్ను, బ్రెడ్, రొట్టెలు ఇలా ఇష్టమొచి్చన ఆహార పదార్థాలను వేస్తుంటారు. చదవండి: ఐశ్వర్య మృతదేహాన్ని హైదరాబాద్ తరలించేందుకు సహకరిస్తున్నాం -
మహిళ గొంతులో ఇరుక్కున్న చేప!
భద్రాద్రి: ఓ మహిళకు చేప చిక్కగా.. ఇంకో చేప కనిపించడంతో మొదటి చేపను నోటితో పట్టుకుని రెండో దాని కోసం యత్నిస్తుండగా గొంతులోకి వెళ్లడంతో ప్రాణాపాయ స్థితి ఎదురైంది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన గిరిజన మహిళ సీత భద్రాచలంలో పట్టణంలోని గోదావరిలో చేపలు పట్టి అమ్ముతూ జీవనం సాగిస్తోంది. మంగళవారం ఆమె ఒక చేపను నోటితో పట్టుకుని, మరో చేపను పట్టే క్రమంలో నోట్లో పెట్టుకున్న చేప గొంతులోకి జారి అడ్డంగా ఇరుక్కుపోయింది. దీంతో ఓ పక్క ముఖం వాపు వచ్చి ఇబ్బంది పడుతుండగా బంధువులు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈఎన్టీ వైద్యుడు ప్రవీణ్ ఆమె గొంతులో ఇరుక్కున్న చేపను బయటకు తీశారు. సరైన సమయానికి సీతను ఆస్పత్రికి తీసుకుని రావడంతో ప్రమాదం తప్పినట్లయిందని ఆయన తెలిపారు. -
వలకు చిక్కిన ఆస్కార్ జిలేబీ చేప
బుడ్డ పక్కిల నుంచి ఉలసల వరకు.. జిలేబీల నుంచి బొమ్మిడాయిల వరకు.. కట్ల నుంచి కొర్రమీనుల వరకు.. గండి నుంచి గడ్డిమూస వరకు.. బంగారు తీగ నుంచి వంజరం వరకు.. వివిధ రకాల చేపలు. అరుదైనవి.. రుచికరమైనవి.. సహజవాతావరణంలో భారీ సైజ్‌లో పెరిగినవి.. చూస్తేనే చవులూరించేవి.. నోట్లో వేసుకుంటే కరిగిపోయేవి.. ఆహారప్రియుల జిహ్వచాపల్యాన్ని పెంచేవి.. మత్స్యకారులకు కాసుల వర్షం కురిపించేవి.. నిత్యం వేలాదిమందికి జీవనోపాధిని కల్పించేవి అరణియార్ జలాశయంలోని చేపలు. మత్స్యసంపదకు కేరాఫ్‌గా మారింది ఈ ప్రాజెక్టు. ఏడాది పొడవునా సమృద్ధిగా నీరు నిల్వ ఉండడంతో జలపుష్పాలకు జీవం పోస్తోంది. సాక్షి, తిరుపతి డెస్క్: ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో అరణియార్ జలాశయం విశేష చేపలకు ప్రసిద్ధి. ఈ ప్రాజెక్టులో 50 గ్రాముల నుంచి 50 కిలోల బరువు చేప కూడా జీవిస్తుంది. గత ఏడాది నవంబర్‌లో భారీ వర్షాల కారణంగా కొత్తనీరు చేరడంతో చేపల పెంపకం మరింద ఊపందుకుంది. అరుదైన చేపలు జలాశయంలోకి వచ్చిచేరాయి. ఇందులో ఆస్కార్ మీనం పసుపు, బంగారు వర్ణంలో చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అందుబాటులో వివిధ రకాలు.. జలాశయంలో కట్ల, రోహు, మ్రిగల, గ్రాస్ గడ్డి చేప, బంగారుతీగ, జిలేబీ, ఫైలెట్ జిలేబీ, నాటు పక్కిలు, ఉలసలు, బుడ్డపక్కిలు, కొర్రమీనులు, క్రాస్ బీడింగ్ జిలేబీ, రూప్‌చంద్, జెల్లలు ఇలా పలు రకాలు పెరుగుతున్నాయి. 0.25 కేజీ సైజుతో రొయ్యలు కూడా దొరుకుతున్నాయి. రిజర్వాయర్‌లోకి వరద వచ్చినప్పుడు మత్స్యకారులకు భారీ చేపలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల కొప్పేడుకు చెందిన ఓ మత్స్యకార్మికుడి వలలో 26 కిలోల చేప పడింది. నీరు తగ్గిపోతున్నప్పుడు జలాశయం తీరంలో ఏర్పడే గుంతల్లో కొర్రమీనులు లభిస్తున్నాయి. వీటిని మత్స్యకారులు కిలో రూ.200 నుంచి 250కి అమ్ముతున్నారు. వ్యాపారులు కిలో రూ.300 నుంచి రూ.400 వరకు విక్రయిస్తున్నారు. మిగిలిన చేపలు కిలో రూ.100 నుంచి రూ.150కే లభిస్తున్నాయి. వందల కుటుంబాలకు జీవనోపాధి అరణియార్‌లో చేపలు పెంపకం వల్ల పిచ్చాటూరు, నిండ్ర, కేవీబీ పురం, మండలాల్లోని వందలాది మత్స్యకార కుటుంబాలకు జీవనోపాధి లభిస్తోంది. వీరిలో కొందరు చేపలు పట్టేవాళ్లు ఉంటే మరి కొందరు వాటిని బయటకు తీసుకువెళ్లి అమ్ముకునే వాళ్లు ఉన్నారు. 1982లో మత్స్యకేంద్రం ఏర్పాటు అరణియార్‌లో చేపలు ఉత్పత్తిని పెంపొందించడానికి 1982లో మత్స్యకేంద్రం ఏర్పాటు చేశారు. ఇందులో చేప పిల్లలు పెంచేందుకు 19 తొట్లు ఉన్నాయి. వీటిలో ఏటా 15 నుంచి 20 లక్షల చేప పిల్లలను పెంచుతారు. వాటిని అరణియార్‌తో పాటు చుట్టు పక్కల చెరువుల్లో వదులుతుంటారు. భలే డిమాండ్ అరణియార్ చేపల రుచికి చేపల ప్రియులు ముగ్ధులవుతుంటారు. జాలర్లు చేపలతో ప్రాజెక్టు గట్టుపైకి రావడమే ఆలస్యం. ఎగబడి మరీ కొనుగోలు చేసేస్తుంటారు. పిచ్చాటూరుతో పాటు తమిళనాడు, తిరుపతి, చిత్తూరు తదితర ప్రాంతాల వారు సైతం ఇక్కడ నుంచి చేపలను తీసుకెళుతున్నారు. ముఖ్యంగా ఆది, సోమ, మంగళ, బుధ, గురు వారాల్లో డిమాండ్ ఎక్కువ. ఆస్కార్ జిలేబీ అరణియార్ ప్రాజెక్టులో అరుదైన ఆస్కర్ జిలేబీ సోమవారం జాలర్ల వలకు చిక్కింది. పిచ్చాటూరు ఎస్టీ కాలనీకి చెందిన మారయ్య విసిరిన వలలో ఈ చేప పడింది. దీనిపై మత్స్యశాఖ అధికారి నరేంద్రబాబు మాట్లాడుతూ ప్రాజెక్టు సమీపంలోని శేషంపేటలో శేఖర్ అనే రైతు గత ఏడాది కలర్ చేప పెంపంకం చేపట్టాడన్నారు. నవంబర్‌లో కురిసిన భారీ వర్షాలకు శేఖర్ చేపల గుంట మునిగిపోయింది. అందులోని చేపలు కొన్ని అరణియార్ జలాశయంలోకి చేరాయని తెలిపారు. అవే అప్పుడప్పుడు జాలర్లకు చిక్కుతున్నట్లు వెల్లడించారు. -
ఈ చేప వయసు 18కోట్ల ఏళ్లు!
కోట్ల ఏళ్ల క్రితం ఎన్నో అరుదైన జీవజాతులు తెలంగాణ ప్రాంతంలో తమ అస్తిత్వాన్ని చాటుకున్నా యి. ఇక్కడ వెలుగు చూస్తున్న అప్పటి జీవ, వృక్ష జాతుల శిలాజాలు (ఫాసిల్స్) ఈ విషయం స్పష్టం చేస్తున్నాయి. ఆర్కియాలజీ (పురావస్తు పరిశోధన), పేలియంటాలజీ (శిలాజాల పరిశోధన) విభాగాల పరిశోధనల్లో ఇవి బహిర్గతమవుతున్నాయి. జురాసిక్ యుగం కన్నా ముందు యుగమైన ట్రయాసిక్ యుగం నాటి శిలాజాలు కూడా తెలంగాణలో దొరుకుతుండటం గమనార్హం. అనేక అరుదైన శిలాజాలను తెలంగాణ తన గర్భంలో దాచుకుందని, అనేక కొత్త అధ్యాయాలకు తెరతీసే అంతటి చరిత్ర ఇక్కడ దాగి ఉందని పరిశోధకులు అంటున్నారు. – సాక్షి, హైదరాబాద్ వేమనపల్లిలో డైనోసార్ వెన్నుపూస శిలాజాలపై 200 ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. గత చరిత్రకు, ప్రస్తుత తరానికి మధ్య జీవపరిణామ అంశాలను, జీవ వైవిధ్యాన్ని, జీవన స్థితిగతులును తెలియజేసేవే శిలాజాలు. సాధారణంగా ప్రిజర్వ్ (బురద, బంక, మంచులో కూరుకుపోయి ఏర్పడిన శిలాజాలు), ట్రేస్, కార్బన్, మోల్డ్స్, టెట్రిఫైడ్ అనే ఐదు రకాల శిలాజాలు ఉంటాయి. దాదాపుగా ఈ ఐదు రకాల శిలాజాలూ తెలంగాణలో లభ్యమయ్యాయి. ప్రస్తుత భూపాలపల్లి జిల్లా కాటారంలో రింకోసారా జాతికి చెందిన 25 కోట్ల సంవత్సరాల నాటి డైనోసార్ శిలాజాన్ని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) 2000 సంవత్సరంలో వెలికితీసింది. పెద్దపల్లి, మంచిర్యాల, అసిఫాబాద్ ప్రాంతాల్లో కూడా శిలాజ సంపద ఎక్కువగా ఉంది. మంచిర్యాలలోని వేమనపల్లిలో డైనోసార్ వెన్నుపూస (శిలాజం) బయటపడింది. చెన్నూరు అడవుల్లో ఆకుల శిలాజాలను, ఆసిఫాబాద్ జిల్లాలో షెల్ ఫాసిల్స్‌ను, మరోచోట పిల్లి జాతి (పిల్లి, పులి, చిరుత...)కి చెందిన పాద ముద్రల శిలాజాలను పరిశోధకులు గుర్తించారు. మంచిర్యాలలోని జైపూర్‌లో ఓ క్షీరదానికి సంబంధించిన శిలాజం వెలుగు చూసింది. వేమనపల్లి పరిసర ప్రాంతాల్లో జురాసిక్ యుగం నాటి పాదముద్రలు, గోదావరి పరిసర ప్రాంతాల్లో మైక్రో (సూక్ష్మ) ఫాసిల్స్ విరివిగా ఉన్నాయి. వోల్కనిక్ ఎరా (అగ్ని పర్వతాల నుంచి లావా వెలువడి అధిక శాతం జీవజాలం నశించిన సమయం) కు సంబంధించిన ఆరున్నర కోట్ల ఏళ్లనాటి శిలాజాలు దక్కన్ ప్రాంతంలో ఎక్కువగా బయటపడుతున్నాయి. శిలాజాల కోసం తమిళనాడు, కోల్‌కతా, మహారాష్ట్రలో ప్రత్యేకంగా పార్కులు నిర్మించి భద్రపరుస్తున్నారు. రాష్ట్రంలో కూడా ఫాసిల్ పార్క్ ఏర్పాటు చేస్తే అరుదైన సంపదను సంరక్షించవచ్చని, వీటిపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు వీలవుతుందని పలువురు పరిశోధకులు సూచిస్తున్నారు. ఫాసిల్ పార్కు ఏర్పాటు చేయాలి.. మన వద్ద 50 కోట్ల ఏళ్ల నాటి శిలాజ సంపద కూడా ఉంది. అయితే వీటి పరిరక్షణ, ఇతర పరిశోధనల విషయంలో అవసరమైనంత మేర కృషి జరగడం లేదు. ఈ మధ్య కాలంలో పలువురు యువ ఔత్సాహికులు శిలాజాలపై పరిశోధనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల మాదిరి ఇక్కడ కూడా ఫాసిల్ పార్కుల దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. – చక్కిలం వేణుగోపాల్, రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, జీఎస్ఐ 2012 నుంచి పరిశోధనలు.. తెలంగాణలో అనేక అరుదైన శిలాజాలు ఉన్నా యి. నేను 2012లో వీటిపై వ్యక్తిగతంగా పరిశోధనలు ప్రారంభించా. ప్రొఫెసర్లు, ఇతర పరిశోధకుల సహకారంతో నైపుణ్యం సాధించా. ఇప్పటివరకు ఆదిమానవుడి రాతి పనిముట్లు, కోట్ల సంవత్సరాల నాటి డైనోసార్ల అవయవాలకు సంబంధించిన శిలాజాలు సేకరించా. నా పరిశోధనల సంబంధిత సమాచారాన్ని తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్టలోని వర్సిటీల విద్యార్థులకు సెమినార్లు, ప్రదర్శనల ద్వారా తెలియజేస్తున్నా. – సునీల్ సముద్రాల, ఔత్సాహిక పరిశోధకుడు, బేగంపేట, పెద్దపల్లి జిల్లా -
చేపలు పట్టడం కాదు, చేపల శాస్త్రం చదవండి, ఉద్యోగాలు కొట్టండి
ముత్తుకూరు/సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఆక్వా రంగంలో బోధన, పరిశోధన, విస్తరణ అనే మూడు సూత్రాలతో ముత్తుకూరులో మత్స్య శాస్త్ర కళాశాల ఏర్పడింది. రాష్ట్రంలోని ఏకైక కళాశాలగా 30 ఏళ్లు పూర్తి చేసుకుని 31వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. నీలి విప్లవాన్ని దృష్టిలో పెట్టుకుని 1991 ఆగస్ట్ 31వ తేదీన నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి ఈ కాలేజీకి శంకుస్థాపన చేశారు. 1992 డిసెంబర్లో బీఎఫ్ఎస్సీ (బ్యాచ్‌లర్ ఆఫ్ ఫిషరీ సైన్స్) నాలుగు సంవత్సరాల కోర్సు 20 సీట్లతో ప్రారంభమైంది. 1995 మార్చి 10వ తేదీన ఈ కళాశాలకు నూతన భవనం ఏర్పడింది. పీహెచ్డీ స్థాయికి.. దేశంలో మొత్తం 28 మత్స్య కళాశాలున్నాయి. ముత్తుకూరులోని మత్స్య కళాశాల తొలుత తిరుపతిలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో ఉండగా, తర్వాత శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలోకి వచ్చింది. తొలుత బీఎఫ్ఎస్సీ కోర్సులతో మొదలై క్రమంగా ఎంఎఫ్ఎస్సీ, పీహెచ్డీ స్థాయికి ఎదిగింది. శాస్త్రవేత్తలుగా.. అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు మత్స్య శాస్త్రాన్ని బోధిస్తూ విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దుతున్నారు. బోధనతో సరిపెట్టకుండా పరిశోధనలు చేయిస్తూ, సముద్ర ఉత్పత్తులపై సంపూర్ణ అవగాహన కలిగిస్తున్నారు. ఈ కళాశాలకు వెంకటాచలం మండలంలోని తిరుమలమ్మపాళెంలో 73 ఎకరాలు, ఎగువమిట్టలో 47 ఎకరాల భూములున్నాయి. ఎగువమిట్ట భూముల్లో చేపల పెంపకం జరుగుతోంది. విద్యార్థులు ఇక్కడ తరచూ శిక్షణ పొందుతున్నారు. విశాలమైన క్రీడా మైదానం, అనేక దేశ, విదేశీ పుస్తకాలతో లైబ్రరీ, ల్యాబ్, సమావేశ మందిరం, హాస్టళ్లు తదితర సౌకర్యాలతో ఈ కళాశాల యూనివర్సిటీ స్థాయిని సంతరించుకుంది. క్షేత్ర సందర్శన తరగతి గదుల్లో మత్స్య శాస్త్రాన్ని అభ్యసించడమే కాకుండా ఆక్వా సాగు, రైతుల కష్ట, నష్టాలు స్వయంగా తెలుసుకునే నిమిత్తం BFSc నాలుగో సంవత్సరం చదివే విద్యార్థులు ‘ఫివెప్’ (ఫిషరీస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రాం) అనే కార్యక్రమంలో పాల్గొంటారు. 110 రోజులపాటు గ్రామాల్లో నివాసం ఉంటూ రొయ్యలు, చేపల పెంపకం, చెరువుల యాజమాన్యం, మేత వినియోగం, అనారోగ్య సమస్యలు, నివారణ పద్ధతులు, పట్టుబడి తదితర అంశాలపై అవగాహన పెంచుకుంటారు. దీనిపై ఒక నివేదిక రూపొందిస్తారు. అలాగే, ‘ELP’ (ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ ప్రోగ్రాం) అనే కార్యక్రమంలో పాల్గొంటారు. 12 వారాల ఈ కార్యక్రమంలో ఫైనలియర్ విద్యార్థులు రంగు చేపల పెంపకం చేసి, అమ్మకాలు చేస్తారు. చేపలు, రొయ్యల ఊరగాయలు, వడియాలు తయారు చేసి, అమ్మకాలు చేస్తారు. భవిష్యత్‌లో పారిశ్రామికవేత్తలుగా రాణించేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపకరిస్తుంది. కోర్సు సబ్జెక్ట్‌లు BFMSc - విద్యార్థుల సంఖ్య - 154 8 MFMSc - విద్యార్థుల సంఖ్య - 12 6 PHd - 7 3 మెండుగా ఉద్యోగావకాశాలు విద్యార్థులకు బోధనతోపాటు, శిక్షణ, క్షేత్ర సందర్శన చాలా ముఖ్యం. మత్స్య కళాశాలలో చదువు పూర్తి చేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక్కడి కళాశాలలో చదివిన విద్యార్థులు చాలామంది దేశ, విదేశాల్లో కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. – డాక్టర్ రామలింగయ్య, అసోసియేట్ డీన్ ప్రతిపాదన ఉంది మన రాష్ట్రంలో మరో రెండు మత్స్య కళాశాలలు అవసరం. తమిళనాడులో నాలుగు, మహారాష్ట్రలో మూడు మత్స్య కళాశాలలున్నాయి. ఈ కోణంలో మన రాష్ట్రంలోని శ్రీకాకుళం, నరసాపురంలో రెండు మత్స్య కళాశాలలు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉంది. – డాక్టర్ డి.రవీంద్రనాథ్‌రెడ్డి, ఫిషరీస్ డీన్ -
విషాదం: ప్రాణం తీసిన చేపల కూర.. భార్య మృతి.. కోమాలో భర్త!
విషపూరితమైన చేప కూరను తిని ఓ మహిళ మృతిచెందింది. ఆమె భర్త ప్రస్తుతం కోమాలో ఉన్నాడు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన మార్చి 25న మలేషియాలో వెలుగుచూసింది. జపాన్‌లో ఎక్కువగా తినే పఫర్ ఫిష్ రుచికరంగా ఉండటంతోపాటు అత్యంత విషపూరితమైనది. ఇది తెలియక జోహోర్కు చెందిన ఓ వ్యక్తి స్థానిక మార్కెట్ నుంచి పఫర్ ఫిష్‌ను కొనుగోలు చేశాడు. వాటిరి ఇంటికి తీసుకురాగా అతని భార్య లిమ్ సీవ్ గ్వాన్ (83) చేపలను శుభ్రం చేసి కూర చేసింది. ఇద్దరు కలిసి తిన్న తర్వాత తీవ్ర అస్వస్థకు గురయ్యారు. గ్వాన్‌కు ఒంట్లో వణుకు పుట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైంది. ఇవే లక్షణాలు కొంత సమయానికి అతనిలో కూడా ప్రారంభమయ్యాయి. గమనించిన కుమారుడు తల్లిదండ్రులను వెంటనే ఆసుపత్రికి తరలించాడు. అయితే అదే రోజు సాయంత్రం తల్లి లిమ్ సీవ్ గ్వాన్ మరణించింది. పఫర్ ఫిష్ తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయి మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కోమాలో ఉన్న తండ్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. అయితే తన తండ్రి చాలా ఏళ్లుగా చేపల మార్కెట్లోని ఆ షాపు నుంచి ఇలాంటి చేపలను చాలాసార్లు కొన్నారని, ఇలా ఎప్పుడూ జరుగలేదని కుమార్తె తెలిపింది. రుచికరమైన ఈ చేపను కొని తెచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకునే వ్యక్తి తన తండ్రి కాదని అతడు వాపోయింది. ఈ ఘటనపై స్థానిక అధికారులు స్పందిస్తూ.. దంపతులు తిన్న చేపల వివరాలు సేకరించినట్లు తెలిపారు. కాగా పఫర్ ఫిష్‌లో టెట్రోడోటాక్సిన్, సాక్సిటాక్సిన్ అనే ప్రాణాంతక విషపూరితాలు ఉంటాయని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ఫ్రీజ్ చేయడం లేదా వండటం వల్ల చేపలోని ఆ విష పదార్థాలు నాశనం కావని పేర్కొంది. పఫర్ చేపల నుంచి ఈ విష పదార్థాలను ఎలా తొలగించి.. వండాలనే దానిపై శిక్షణ పొంది అత్యంత నిపుణత కలిగిన చెఫ్‌లకు మాత్రమే అనుమతి ఉంటుందని వెల్లడించింది. చదవండి: హిజాబ్ ధరించలేదని యువతులపై పెరుగుతో దాడి.. వీడియో వైరల్ -
‘పాపం..చేప! నా బాధ వారికే తెలుస్తుంది’ ఎయిరిండియాపై పెట్ లవర్ ఫిర్యాదు వైరల్
బెంగళూరు: టాటా యాజమాన్యంలోని ఎయిరిండియాపై ఒక వ్యక్తి ఫిర్యాదు వార్తల్లో నిలిచింది. నా పెంపుడు ఫిష్‌ను విమానంలో తీసుకెళ్లనీయ లేదంటూ బెంగళూరుకు చెందిన హుస్సేన్ ఫిర్యాదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలను స్వయంగా హుస్సేన్ ట్విటర్లో షేర్ చేశారు. దీంతో ఈ చేప కథ వైరల్‌గా మారింది. డిజిటల్ మార్కెటర్ అకిబ్ హుస్సేన్ బెంగళూరు నుండి శ్రీనగర్‌కు ఎయిరిండియా విమానంలో బయలుదేరారు. అత్యవసర విమానంలో హుస్సేన్ తన తల్లిని చూడటానికి వెళుతున్నారు. అయితే తనతోపాటు పెట్ ఫిష్ కంటైనర్‌ను తీసుకెళ్లడంపై సిబ్బంది అభ్యంతరం చెప్పారు. అందులోని నీరు పరిమితికి మించి ఉందంటూ దాన్ని క్యారీచేసేందుకు అనుమతినివ్వలేదు ఎయిర్‌లైన్. దీంతో తన లైఫ్‌లో ఇదో ‘‘చెత్త అనుభవం’’ అంటూ ఎయిరిండియా, టాటా సన్స్ ఎమెరిటస్ ఛైర్మన్ రతన్ టాటాలను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. (ఇండియన్ టెకీలకు గిట్‌హబ్ షాక్: టీం మొత్తానికి ఉద్వాసన) ఈ వివరాలను వరుస ట్వీట్లలో షేర్ చేసిన హుస్సేన్ “ఒక పెట్ లవర్ బాధ మరో పెట్ లవర్‌కు మాత్రమే అర్థం అవుతుంది. కేవలం 50 గా బరువున్న ట్రాన్స్పరెంట్ కంటైనర్‌లో లైవ్ అక్వేరియం తీసుకెళ్లేందుకు బెంగళూరుకు చెందిన ఫ్లైట్ గ్రౌండ్ స్టాఫ్, ఫ్లైట్ ఎక్కనీయలేదు. క్యారీరింగ్ ఛార్జీగా రూ.1,350 జరిమానా చెల్లించేందుకు సిద్ధపడినా అంగీకరించలేదు. దీనిపై చర్య తీసుకొనేది ఎవరంటూ వాపోయాడు. సంవత్సరం పాటు కలిసి బతికాం.. కానీ ఎయిరిండియా కారణంగా బలవంతంగా విమానాశ్రయంలో వదిలివేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. మరోవైపు ఎయిర్‌పోర్ట్‌లో వదిలివేసిన హుస్సేన్ పెంపుడు చేపను ఎయిర్‌లైన్ ఉద్యోగులు బెంగళూరులోని అతని బంధువుకు సురక్షితంగా అప్పగించారుట. (Disney Layoffs: మరో నాలుగు రోజులే, ఉద్యోగులకు ఈమెయిల్ బాంబు!) Pain for loosing a pet after spending 1 year together. Who is gonna take action on this @RNTata2000 Sir ? @airindiain @DGCAIndia @ministry_ca @AviationIndia2 — Aqib Hussain (@askaqibhussain) March 21, 2023 -
అయ్యో.. ఏంటి ఈ దారుణం, లక్షల్లో చేపల మృత్యువాత!
ప్రకృతి అనేది మానవులకి లభించిన అద్భతమైన వరం. అయితే మనమే అభివృద్ధి పేరుతో దాన్ని నాశనం చేసుకుంటున్నాం. ఈ క్రమంలో ప్రకృతి ప్రకోపానికి గురవుతున్నాం. ఆ ఫలితాలే.. ఆకస్మిక వాతావరణ మార్పులు, అకాల వర్షాలు, తుఫాను, భూకంపాలు వంటివి ప్రజల్ని పలకరిస్తూ తీవ్ర నష్టాలను తీసుకొస్తున్నాయి. తాజాగా ఆస్ట్రేలియాలోని ఓ నదిలో లక్షల సంఖ్యలో చేపలు మృత్యువాత పడ్డాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అసలు ఈ దారుణానికి కారణమేంటి, అక్కడ ఏం జరిగింది? వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాలో రెండో పొడవైన నదిగా న్యూ సౌత్‌వేల్స్‌లోని మెనిండీ సమీపం డార్లింగ్ నది పేరు గాంచింది. అయితే ప్రస్తుతం అక్కడ పరిస్థితి దారుణంగా ఉంది. రాష్ట్ర రాజధాని సిడ్నీకి పశ్చిమాన 1,000కిమీ (620 మైళ్లు) దూరంలో ఉన్న ఈ నదిలో ఎటు చూసిన కిలోమీటర్ల మేర చేపలు నిర్జీవంగా తేలియాడుతున్న దృశ్యాలే దర్శనమిస్తున్నాయి. దీన్ని పరిశీలించిన అధికారులు వరద నీరు తగ్గుముఖం, వేడి వాతావరణం కారణంగా నీటిలో ఆక్సిజన్ శాతం పడిపోవడమే భారీ స్థాయిలో చేపల మృత్యువాతకు కారణమని తెలిపారు. 2018, 2019లోనూ ఇదే తరహాల వేల సంఖ్యలో చేపలు చనిపోయాయి. ఇటీవలి వరదల తరువాత నదిలో చేపల సంఖ్య విపరీతంగా పెరిగిందని, ఇప్పుడు వరద తగ్గుముఖం పట్టడంతో భారీ సంఖ్యలో చనిపోతున్నాయని తెలిపారు. ఈ సమస్యను అంచనా వేసేందుకు రాష్ట్ర మత్స్య అధికారులను ఆ ప్రాంతానికి పంపినట్లు ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ వెల్లడించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
ఆ ముల్లు లేనిదే ఖాదీ దారం తయారు కాదంటే నమ్ముతారా?
ముల్లు.. అది గులాబీ ముల్లైనా, పిచ్చి పొదల్లో ముల్లైనా.. చివరికి చేప ముల్లైనా గుచ్చుకుంటుందని భయపడతాం. గులాబీని వాడేటప్పుడు, చేపలు తినేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాం. కానీ పొందూరు ఖాదీ నేతకార్మికులు ఆ ముల్లు లభించక తల్లడిల్లుతున్నారు. వారికి అవసరమైన కృత్రిమ ముళ్ల తయారీకి అనేకమంది ప్రయత్నిస్తున్నారు. అధ్యయనాలు, పరిశోధనలు చేస్తున్నారు. ఆఫ్ట్రాల్ ఒక ముల్లు కోసం ఇన్ని మల్లగుల్లాలా! ఏమిటి దాని గొప్ప? అని వెటకారం చేయకండి.. చిన్న చూపు చూడకండి. ఎందుకంటే ఆ ముల్లు లేనిదే ఖాదీ దారం తయారు కాదు. ఖాదీ వస్త్రాలు ఆ నునుపు, మెరుపు సంతరించుకోలేవు మరి! అలాగని అన్ని చేపల ముళ్లు పనికిరావు. ఖాదీ వస్త్రాల తయారీకి ఉపయోగపడే ముడి కొండపత్తిలోని పొల్లు తీసి శుభ్రం చేసేందుకు వాలుగ చేప ముల్లు మాత్రమే ఉపయోగపడుతుంది. ఆ చేప దవడ పలువరుసతో ఉండే ప్రత్యేకమైన ముల్లు లభించక దాని ప్రభావం ఖాదీ నేతపై పడుతోంది. అందుకే వాలుగ చేప ముల్లును పోలి ఉండేలా కృత్రిమ పరికరం తయారీకి ఒక సీనియర్ సైంటిస్ట్, ఒక యువజన సంఘం, ఖాదీ కార్మికాభివృద్ధి సంఘం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. సాక్షి, శ్రీకాకుళం: పొందూరు ఖాదీ తయారీలో కీలకమైన.. పత్తిని శుభ్రం చేసేందుకు వినియోగించే.. వాలుగ చేప దవడ భాగం అవసరానికి తగినంతగా లభ్యం కావడం లేదా? ఆ చేప ముల్లును సేకరించడం కష్టతరంగా మారిందా..? ఆ ముల్లుకు ప్రత్యామ్నాయాలను రూపొందించే పనిలో సీనియర్ శాస్త్రవేత్తలు దృష్టిపెట్టారా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఏమిటీ వాలుగ.. ఎందుకీ వెలుగు.. వాలుగు చేప.. శాసీ్త్రయ నామం వల్లగో అట్టు. మంచినీటిలో పెరిగే చేప. మిగతా చేపల మాదిరిగా కాకుండా దవడ భాగం విభిన్నంగా ఉంటుంది. దవడలోని ఉండే మృదువైన పళ్లవరసే ఖాదీ వస్త్రం రూపొందించడంలో కీలకం. ఖాదీకి అంత తెలుపు రంగు తీసుకురావడంతో కూడా కీలక పాత్ర దీనిదే. వినియోగం ఎలా.. వాలుగ చేప దవడ భాగాన్ని మత్స్యకారుల నుంచి సేకరిస్తారు. పైదవడను రెండు ముక్కలుగా, కింది దవడను రెండు ముక్కలుగా చేస్తారు. ఆ ముక్కను ఓ చిన్న కర్రకు దువ్వెన మాదిరిగా కడతారు. దాని సాయంతో పత్తిని శుభ్ర పరుస్తారు. ఈ క్రమంలో పత్తి మృదువుగా తయారవడంతో పాటు మరింత తెలుపుగా మారుతుంది. ఎడమ చేతి వా టం ఉన్న నేత కారులు ఎడమ దవడను, కుడి చేతి వాటం ఉన్న వారు కుడి దవడను వినియోగించి పత్తిని శుభ్రపరిచేందుకు వినియోగించడం మరో విశేషం. గతంలో రాజమండ్రి నుంచి.. తొలినాళ్లలో రాజమండ్రి ధవళేశ్వరం నుంచి కరకు సత్యమ్మ అనే మహిళ పొందూరు ఖాదీ కార్యాలయానికి వాలుగ చేప దవడల్ని సరఫరా చేసేవారు. ఆమె మరణాంతరం అక్కడ్నుంచి ముల్లు రావడం లేదు. శ్రీకాకుళం, విజయనగరం పరిసరాల్లోని మత్స్యకారులు అడపాదడపా తెచ్చి విక్రయిస్తున్నారు. ప్రత్యామ్నాయాల రూపకల్పనలో.. ఖాదీ తయారీలో వాలుగ చేప దవడ కీలకం కావడం.. అవసరమైన మేర లభ్యత లేకపోవడంతో ప్రత్యామ్నాయాలపై సీనియర్ శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. మహరాష్ట్ర వార్ధాలోని మహాత్మాగాంధీ ఇన్స్టిట్యూట్ ఫర్ రూరల్ ఇండస్ట్రియలైజేషన్(ఎంజీఐఆర్ఐ) సంస్థకు చెందిన సీనియర్ శాస్త్రవేత్త మహేష్‌కుమార్ ఆధ్వర్యంలోని ఓ బృందం స్టీల్‌తో వాలుగ చేప దవడ మాదిరిగా ఓ పరికరాన్ని రూపొందించింది. దీనిని హైదరాబాద్‌కు చెందిన ఎంఎస్ఎంఈ సంస్థ తయారుచేసింది. ఆ పరికరం పనితీరును పొందూరు ఖాదీ తయారీలో ప్రయోగాత్మకంగా పరిశీలించింది. కానీ వాలుగ చేప దవడతో వచ్చేంత మృదుత్వం ఈ పరికరంతో రాలేదు. నేతన్నల చేతులకు గాయాలవ్వడం.. ఇతర అంశాల కారణంగా ఆ పరికరం వినియోగంలోకి రాలేదు. ●అయినా సీనియర్ సైంటిస్ట్ మహేష్ కుమార్ ప్రత్యామ్నాయాలపై పట్టువిడవలేదు. చేప దవడ మాదిరిగానే ఉండేలా సన్నని ప్లాస్టిక్ సూదుల్ని స్విట్జర్లాండ్‌లో, దవడ భాగాన్ని థాయ్‌లాండ్‌లో రూపొందించి మరో కొత్త పరికరాన్ని రూపొందించారు. కానీ ఈ పరికరం ఖర్చు ఎక్కువగా ఉండడంతో.. ఖాదీ కమిషన్ ఆఫ్ ఇండియా అనుమతి కోసం పంపించారు. ● జిల్లాకు చెందిన పొగిరి జశ్వంత్‌నాయుడు (చైన్నె ట్రిపుల్ ఐటీ, ఐఐఎం అమృత్సర్ పూర్వ విద్యార్థి) బృందం కూడా ప్రత్యామ్నాయ పరికరంపై దృష్టిసారించింది. ఐఐఎం అమృత్సర్ వేదికగా ఐదుగురు సభ్యుల బృందం త్రీడీ టెక్నాలజీ సాయంతో మోడల్‌ను రూపొందించింది. ప్లాస్టిక్‌ది కావడం.. ఇతర అంశాల వల్ల ఇదీ సఫలీకృతం కాలేదు. ఈ బృందం మరిన్ని ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది. ● పొందూరుకు చెందిన ఆంధ్రప్రదేశ్ ఫైన్ ఖాదీ కార్మికాభివృద్ధి సంఘం(ఏఎఫ్‌కేకే) వాలుగ చేప సేకరణకోసం విస్తృతంగా ప్రయత్నిస్తోంది. వాలుగ సేకరణ కష్టంగా మారడంతో దానిని పోలి ఉండే మరో రకం చేపపై దృష్టిసారించారు. హిరమండలం రిజర్వాయర్‌లో వీటిని సేకరించేలా ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ దీని వినియోగంలో కూడా ఇబ్బందులు ఉన్నాయి. త్వరగా విరిగిపోవడం, అరిగిపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో దీనిని వినియోగిస్తున్నారు. ప్రయత్నం చేస్తున్నాం.. పొందూరు ఖాదీలో కీలకమైన వాలుగ చేప దవడ భాగం సేకరణ కష్టతరం కావడంతో ప్రత్యామ్నాయాల దిశగా ఐఐఎం అమృత్సర్ వేదికగా మా టీమ్ దృష్టి సారించింది. ప్రాఫెసర్తో సహా ఐదుగురు సభ్యులు ఓ పరికరాన్ని రూపొందించాం. కొన్ని ఇబ్బందులు గమనించాం. పూర్తి పర్యావరణ హితమైన మెటీరియల్‌తో తయారు చేసేందుకు మా వంతు ప్రయత్నం మేం చేస్తున్నాం. – పొగిరి జశ్వంత్ నాయుడు, స్టేటజీ కన్సల్టెంట్, ఈవై శిక్షణ తీసుకున్నాం.. కృత్రిమ చేప ముల్లుతో పత్తిని శుభ్రం చేసే ప్రక్రియను నేర్చుకునేందుకు హైదరాబాదుకు వెళ్లాం. దీని వినియోగంతో నాణ్యమైన 100 కౌంటు దారం రాదు. ఈ కృత్రిమ ముల్లుతో చేయడం వల్ల చేతి వేళ్లకు గాయాలై రక్తం వచ్చేది. అందుకే దీనిని వినియోగించలేదు. –కాపల కుమారి, చేనేత కార్మికురాలు ఆ రిజర్వాయర్‌లో గుర్తించాం.. విదేశీ సాంకేతికతతో తయారు చేసిన ప్రత్యామ్నాయ పరికరం ఖరీదు రూ.750 వరకు ఉంది. అదే వాలుగ చేప దవడ అయితే కేవలం రూ.25 నుంచి రూ.50 వరకు ఉంది.వాలుగ చేప శాస్త్రీయ నామం వల్లగో అట్టు. ఇది మంచి నీటి చేప. మా అధ్యయానాల్లో వాలు గు చేపలు మడ్డువలస రిజర్వాయర్‌లో విస్తృతంగా ఉన్నాయి. చాలా పెద్ద సైజుల్లోనే లభ్యమవుతున్నాయి. –డాక్టర్ కర్రి రామారావు,జీవవైవిధ్య శాస్త్రవేత్త, డాక్టర్ వీఎస్ కృష్ణా ప్రభుత్వ డిగ్రీ కళాశాల, విశాఖపట్నం కొరత వాస్తవమే.. పొందూరు ఖాదీకి కీలకమైన వాలుగ చేప దవడ కొరత వాస్తవమే. చాలా మంది ప్రత్యామ్నాయాల వేటలో ఉన్నారు. కానీ అవి సఫలీకృతం కాలేదు. మా వంతుగా ఇటీవలే హిరమండలం రిజర్వాయర్‌లో వేరే రకం చేపను వినియోగించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాం. వాలుగుకు ఏదీ సాటి రాదు. –డి.వెంకటరమణ, సెక్రటరీ, ఏఎఫ్‌కేకే, పొందూరు వాలుగుకు ఏదీ సాటిరాదు. పత్తిని శుభ్రం చేసేందుకు వాలుగ చేప దవడకు ప్రత్యామ్నాయం లేదనే చెబుతున్నారు నిపుణులు. ఆ సున్నితత్వం.. ఆ శ్వేతవర్ణం వాలుగుకు ఏదీ సాటిరాదంటున్నారు. విజయనగరం జిల్లా వంగర మండలం మడ్డువలస రిజర్వాయర్‌లో వాలుగ చేపలు ఉన్నాయని జీవవైవిధ్య పరిశోధకులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో వేట సాగించే మత్స్యకారులకు దీని వినియోగంపై విస్తృతమైన అవగాహన కల్పించి వారితో ఒప్పందం కుదుర్చుకుంటే మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆ దిశగా కూడా ఖాదీ బోర్డు ప్రయత్నాలు ప్రారంభించాల్సిన అవసరం ఉందంటున్నారు. -
AP: జాక్‌పాట్ తగిలింది.. వలకు చిక్కిన 600 కిలోల చేప
ఎస్.రాయవరం (అనకాపల్లి జిల్లా): అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం బంగారమ్మపాలెం తీరంలో సోమవారం మత్స్యకారుల వలకు భారీ చేప చిక్కింది. ముక్కుడు టేకుగా పిలిచే ఈ చేప సుమారు 600 కిలోల బరువు ఉంది. దీని విలువ సుమారు రూ.2 లక్షలపైనే. సముద్రంలో వలకు చిక్కిన ఈ చేపను మత్స్యకారులు ప్రాణాలతో ఒడ్డుకు లాక్కొచ్చారు. అంత ఖరీదైన చేపను స్థానికంగా కొనే నాథుడు లేక కాకినాడ, విశాఖపట్నంలోని చేపల వ్యాపారులకు సమాచారం ఇచ్చారు. ఈ రేవులో ఇంత పెద్ద చేప మొదటిసారిగా దొరికిందని, అనుకున్న ధర రాకపోతే చేపను సముద్రంలో విడిచిపెడతామని మత్స్యకారులు చెప్పారు. ప్రస్తుతం శారద, వరాహ నదుల కలయిక మొగలో నీటిలో వల తాడుతో బంధించి ఉంచారు. -
కాసులు కురిపించే ట్యూనా (సూర) చేపలు
సాక్షి, విశాఖపట్నం: కాసులు కురిపించే ట్యూనా (సూర) చేపలు బోటు యజమానుల్లో ఆనందాన్ని నింపుతున్నాయి. కొన్నాళ్ల నుంచి ఇవి సముద్రంలో విరివిగా లభ్యమవుతున్నాయి. ఏడాది పొడవునా వీటి లభ్యత ఉన్నా డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు ట్యూనాలకు సీజన్. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో మరింతగా ఇవి దొరుకుతాయి. మరబోట్లు వలలు వేసి చేపల వేట సాగిస్తారు. కానీ ట్యూనాల కోసం వలలతో కాకుండా గాలం (హుక్)లతో వేటాడతారు. లోతైన సముద్ర ప్రాంతం (డీప్ సీ) ఉన్న చోట ట్యూనాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల సముద్రతీర ప్రాంతానికి దూరంగా ఉండే లోతు ప్రదేశానికి వీటి కోసం మరబోట్లలో వెళ్తుంటారు. విశాఖ హార్బర్ నుంచి అలా సముద్రం లోతు ఎక్కువగా ఉండే బంగ్లాదేశ్ వరకు ట్యూనాల వేటకు వెళ్తారు. మామూలు చేపలవేటకు వారం పది రోజుల అవసరమైతే.. ట్యూనాల వేటకు 25 రోజుల నుంచి నెల వరకు సమయం తీసుకుంటుంది. ట్యూనాల కోసం ప్రత్యేక బోట్లు విశాఖ ఫిషింగ్ హార్బర్లో 700కు పైగా మరబోట్లున్నాయి. వీటిలో 400 వరకు బోట్లు వలలతో చేపలవేట సాగిస్తుంటాయి. మరో 300కు పైగా ట్యూనా చేపల వేట కోసం ప్రత్యేకంగా తయారు చేయించినవి ఉంటాయి. ఈ బోట్లలో 10–12 కిలోమీటర్ల దూరం తాడుకు 600–700 వరకు గాలాలు అమర్చి సముద్రంలో వదిలిపెడ్తారు. ఏడెనిమిది గంటల తర్వాత గాలాలను పరిశీలించుకుంటూ వెళ్తారు. హుక్‌లకు తగిలిన ట్యూనాలను తీసి బోటులో వేస్తారు. ఇలా గాలాలు వేసిన ఒక్కో ప్రాంతంలో ఒకరోజు కంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఒకసారి వేటకు వెళ్తే ఐదు నుంచి 10 టన్నుల వరకు ట్యూనాలు పట్టుబడతాయి. వీటిలో ఐదు నుంచి 80 కిలోల బరువున్నవి ఉంటాయి. కొన్నాళ్లుగా ఇవి రోజుకు 60 టన్నులకు పైగా ట్యూనాలతో హార్బర్‌కు వస్తున్నాయి. టన్ను ట్యూనాల ధర రూ.2 లక్షలు టన్ను ట్యూనా చేపల ధర రూ.2 లక్షలు పలుకుతోంది. చిన్న ట్యూనాలైతే రూ.లక్ష నుంచి లక్షన్నర వరకు కొనుగోలు చేస్తున్నారు. బోటు యజమానుల నుంచి వర్తకులు ఈ ట్యూనాలను కొనుగోలు చేసి కేరళతో పాటు యూరోపియన్ దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. కేరళలో ట్యూనాలను అమితంగా ఇష్టపడతారు. అందువల్ల ఆ రాష్ట్రంలో వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. యూరోపియన్ దేశాల్లో ట్యూనా చేపలను లొట్టలేసుకుని తింటారు. ఈ ట్యూనాల్లో నామాల సూర (స్కిప్ జాక్), కన్ను సూర, రెక్క సూర (ఎల్లో కిన్) వంటివి ఉంటాయి. వీటిలో కన్ను, రెక్క సూరలకంటే నామాల సూరల రేటు తక్కువగా ఉంటుంది. కోనాంలు కూడా.. కొన్నాళ్లుగా ట్యూనాలతో పాటు కొమ్ము కోనాం, బాతు కోనాం తదితర రకాల భారీ చేపలు లభ్యమవుతున్నాయి. ఈ రకాల చేపలు కూడా పెద్ద సైజులో ఉంటాయి. ఇవి కిలో రూ.100 ధర పలుకుతోంది. ట్యూనాలకంటే ఈ కోనాం చేపలు కూడా లభించడం వల్ల బోటు యజమానులకు ఒకింత లాభదాయకంగా ఉంటోందని, లేనిపక్షంలో నష్టాలను భరించాల్సి వస్తుందని ట్యూనా వేట సాగించే బోటు యజమాని కాకి నాని ‘సాక్షి’తో చెప్పారు. -
వెరైటీ వంట: ప్లాస్టిక్ కవర్లో చేపల పులుసు, ఈ బామ్మ ఎలా చేసిందో చూడండి!
ఇటీవల స్మార్ట్‌ఫోన్ వాడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. మొబైల్ చేతిలో ఉంటే చాలు ప్రపంచం నలుమూలలా ఏం జరుగుతున్నా క్షణాల్లో తెలిసిపోతోంది. ఈ క్రమంలో సోషల్ మీడియా వాసుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏం చేసినా వెరైటీగా ప్రయత్నిస్తూ ఆ వీడియోలను నెట్టింట షేర్ చేస్తున్నారు. ఇవి యూజర్లకు నచ్చితే లక్షల్లో లైకులు, వ్యూస్‌తో వైరల్‌గా మారుతుంది. ప్రస్తుతం ఇదొక ట్రెండ్‌గా మారిందనే చెప్పాలి. కట్టెల మంటపై చేపల పులుసు వండుతున్న ఓ పెద్దావిడ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో.. ఒక బామ్మ కట్టెల మంట మీద నీటితో నిండిన ప్లాస్టిక్ బ్యాగ్‌ను ఉంచి వంట చేయడం ప్రారంభించింది. అయితే ఈ వీడియో చూస్తున్న వారంతా మంటపై పెట్టిన ప్టాస్టిక్ కవర్ వెంటనే కరిగిపోతుందని అనుకున్నారు. అయితే అలా జరగలేదు. వేడి ప్రభావం దాని మీద ఏ మాత్రం చూపించ లేదు. కాసేపు తర్వాత ఆ పెద్దావిడ కవర్లో ఉన్న నీటిలో పలు దినుసులు వేస్తూ చేప, కొద్దిగా మిర్చిని జోడిస్తుంది. ఈ వీడియోని ది ఫైజెజ్ అనే ట్విటర్ యూజర్ షేర్ చేయగా ఇప్పటివరకూ 5 లక్షల మందిపైగా వీక్షించారు. దీన్ని చూసిన నెటిజన్ల మదిలో పలు ప్రశ్నలను లేవనెత్తింది. కొంతమంది వినియోగదారులు ప్లాస్టిక్‌లో వంట చేయడం వల్ల క్యాన్సర్ వస్తుందని చెప్పగా, మరికొందరు ప్లాస్టిక్ నిప్పు వేడి తాకగానే కరిగిపోతుంది కదా అయినా ఇది ఎలా సాధ్యమైందని కామెంట్ చేస్తున్నారు. An elementary physics.pic.twitter.com/aqDuNa0Y5G — The Figen (@TheFigen_) February 23, 2023 చదవండి: మిస్టరీగా వైట్‌బాల్.. గాడ్జిల్లా గుడ్డేం కాదు! -
విశాఖపట్నం : మత్స్యకారులకు సిరులు వలకు చిక్కిన కొమ్ముకోనం, సొర (ఫొటోలు)
-
80 కోట్ల మంది కిడ్నీ రోగులు, రిస్కు తగ్గిస్తున్న సముద్ర చేపలు.. కీలక విషయాలు
చమురు చేపలుగా పిలిచే సముద్ర చేపల్ని ఆహారంగా తీసుకుంటే దీర్ఘకాలిక రోగాలు దరిచేరవని ఇప్పటికే శాస్త్రీయంగా రుజువైంది. క్రమం తప్పకుండా చేపలు తినేవారిలో క్యాన్సర్, గుండెపోటు, మధుమేహం వంటి రోగాల బారినపడే ప్రమాదం తక్కువని తేలింది. కాగా, తీవ్రమైన కిడ్నీ రోగాల బారిన పడినవారు సముద్ర చేపల్ని తింటే 8 నుంచి 10 శాతం రిస్క్ తగ్గుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్‌కు చెందిన జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ యూనివర్సిటీ ఈ విషయాన్ని వెల్లడించింది. సాక్షి, అమరావతి: ప్రపంచ జనాభాలో 10 శాతం (80 కోట్ల) మంది తీవ్రమైన మూత్రపిండాల వ్యాధుల (క్రానిక్ కిడ్నీ డిసీజెస్)తో బాధపడుతున్నారు. మూత్రపిండాల వైఫల్యం మనుషుల మరణానికి కూడా దారి తీస్తోంది. ఇలాంటి వారికి సముద్ర చేపలు రిస్క్ తగ్గిస్తున్నాయని తేలింది. సముద్ర చేపల్లో అధికంగా ఉండే ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ మూత్రపిండాల సమస్యల నుంచి ఉపశమనం ఇస్తున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. మొక్కల నుంచి వచ్చే ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ కంటే సముద్ర చేపల్లో ఉండే యాసిడ్స్ ఎక్కువగా ప్రభావితం చూపిస్తున్నాయని ఆస్ట్రేలియాకు చెందిన జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ యూనివర్సిటీ పరిశోధనల్లో తేలింది. సముద్రంలో దొరికే కవ్వలు, కానాగంతలు (కన్నంగదాత), పొలస, మాగ వంటి వందకు పైగా చమురు చేపలు, సముద్రపు మంచి పీతలు తిన్న వారిపై జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ యూనివర్సిటీ పరిశోధనలు జరిపింది. ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే సముద్ర చేపల్ని తినడం వల్ల మూత్రనాళాలు శుభ్రపడతాయని, వాటిలో పేరుకుపోయే రాళ్లు, కొవ్వు పదార్థాలు బయటకు పోతాయని గుర్తించారు. 12 దేశాలకు చెందిన 25 వేల మందికి పైగా కిడ్నీ రోగాల బాధితులపై జరిపిన 19 రకాల అధ్యయనాల ఫలితాలను వర్సిటీ వెల్లడించింది. కచ్చితంగా ఏ చేపలు ఎక్కువగా మూత్రపిండాల వ్యాధుల రిస్క్‌ను తగ్గిస్తున్నాయో చెప్పలేకపోయినప్పటికీ.. వాటిలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ రక్తం స్థాయిలను పెంచడంలో ప్రభావం చూపిస్తున్నాయని గుర్తించారు. వారానికి రెండుసార్లు తింటే.. తీవ్రమైన కిడ్నీ వ్యాధుల బారినపడిన 49 నుంచి 77 ఏళ్ల వయసు వారిపై ఈ పరిశోధనలు జరిపారు. శరీరం బరువు, ధూమపానం, మద్యపానం అలవాటు ఉన్నవారితో పాటు శారీరక దైనందిన కార్యకలాపాలు, గుండె జబ్బులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. అధిక మోతాదులో సముద్ర చేపలు తిన్న వారిపై వివిధ రూపాల్లో పరిశోధనలు జరిపారు. ఈ చేపల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ప్రభావం మూత్రపిండాల వ్యాధుల తీవ్రతను 8నుంచి 10 శాతం వరకు తగ్గించిందని గుర్తించారు. వారానికి కనీసం రెండుసార్లు సముద్ర చేపలు తింటే రోజుకు 250 మిల్లీగ్రాముల కన్నా ఎక్కువగా ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ సమకూరుతున్నట్టు తేల్చారు. అవి కిడ్నీ వ్యాధులు రాకుండా అడ్డుకట్ట వేస్తాయని.. ఒకవేళ కిడ్నీ వ్యాధులతో బాధపడుతుంటే రిస్క్ శాతం తగ్గుతోందని పరిశోధనల్లో వెల్లడైనట్టు శాస్త్రవేత్త డాక్టర్ మట్టిమార్క్ లుండ్ వెల్లడించారు. చమురు చేపలు/సముద్ర చేపలు ఆరోగ్యకరమైన ఆహారంగా సిఫార్సు చేస్తున్నట్టు ఇటీవల వర్సిటీ విడుదల చేసిన జర్నల్‌లో ఆయన పేర్కొన్నారు. -
బిక్కవోలు డ్రెయిన్‌లో డాల్ఫిన్ చేప
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: మండలంలోని ఏపీత్రయం శివారు బిక్కవోలు డ్రెయిన్‌లో గురువారం మధ్యాహ్నం డాల్ఫిన్ చేప స్థానికులకు చిక్కిందని తహసీల్దార్ టి.సుభాష్, జిల్లా ఫారెస్ట్ అధికారి ఐవీకే రాజు తెలిపారు. బిక్కవోలు డ్రెయిన్‌లో డాల్ఫిన్ చేప కనిపించడంతో స్థానికులు తమకు సమాచారం అందించారన్నారు. అక్కడికి వెళ్లి స్థానికుల సహాయంతో ఏపీత్రయం వంతెన సమీపంలో డాల్ఫిన్ చేపను ఆ డ్రెయిన్‌లో విడిచిపెట్టామన్నారు. కొంతసేపటికి అది నీటిలో మునిగిపోయిందన్నారు. జాలర్లు వెదకగా అది చనిపోయినట్లు గుర్తించారు. డాల్ఫిన్ 150 కేజీల బరువు, 1.5 మీటర్ల పొడవు ఉందన్నారు. ఇది సముద్రంలో నుంచి ఇంద్రపాలెంలో గల ఉప్పుటేరు మీదుగా బిక్కవోలు డ్రెయిన్‌లోకి వచ్చి ఉంటుందని తెలిపారు. నిబంధనల ప్రకారం డాల్ఫిన్‌కు శుక్రవారం పోస్టుమార్టం చేస్తారన్నారు. గ్రామంలోని ఏటిగట్టు వద్ద ఉన్న డాల్ఫిన్‌ను చూడటానికి జనం ఎగబడ్డారు. వీఆర్వో జి.అంచిబాబు, ఫారెస్ట్ అధికారులు సిద్ధార్థ, ఉపేంద్రరెడ్డి, వసంతకుమారి పాల్గొన్నారు. చదవండి: రెండురోజుల్లో పెళ్లి.. అంతలోనే యువకుడి షాకింగ్ నిర్ణయం.. ఏం జరిగింది? -
చేపల్లో మహా‘రాణి’లు!.. లొట్టలేసుకుని తింటారు.. ఎందుకంత డిమాండ్?
సాక్షి, విశాఖపట్నం: ఒకప్పుడు అంతగా డిమాండ్ లేని రాణి ఫిష్ చేపలకు ఇప్పుడు మంచి రోజులొచ్చాయి. స్థానిక మార్కెట్లో గులివిందలుగా పిలిచే ఈ చేపలు అధిక డిమాండ్, ధరలతో కొన్నాళ్లుగా మహారాణులయ్యాయి. మత్స్యకారులకు కాస్త ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. లేత ఎరుపు, పసుపు, తెలుపు, బంగారు, నీలి రంగుల చారలతో కంటికి ఒకింత ఇంపుగా కనిపించే ఈ చేపలకు చెన్నై, కేరళ రాష్ట్రాల్లో లొట్టలేసుకుని తింటారు. అరేబియా సముద్రం కంటే బంగాళాఖాతంలో లభించే ఈ చేపలకు రుచి ఎక్కువ. అందువల్ల తమిళనాడు, కేరళ ప్రాంతాల ప్రజలు వీటిని ఎక్కువగా ఇష్టపడతారు. ఒడిశాలోని చిలక ప్రాంతం నుంచి మన రాష్ట్రంలోని కాకినాడ వరకు వీటి లభ్యత అధికంగా ఉంటుంది. నవంబరు నుంచి ఏప్రిల్ వరకు మత్స్యకారులకు సముద్రంలో ఇవి పెద్ద సంఖ్యలో లభ్యమవుతాయి. గతంలో చెన్నై, కేరళల నుంచి వర్తకులు విశాఖపట్నం వచ్చి వీటిని కొనుగోలు చేసి తమ ప్రాంతాలకు ఎగుమతి చేసుకునే వారు. అప్పట్లో ఇక్కడ కిలో రూ.50కి మించి కొనుగోలు చేసే వారు కాదు. అక్కడ కిలో రూ.100కు పైగా విక్రయించుకునే వారు. పైగా ఈ ప్రాంతంలో వీటికి అంతంతమాత్రపు ధరే లభించేది. కానీ కొన్నాళ్లుగా వీటికి మహా రాణి యోగం పట్టింది. కొంతమంది స్థానిక వర్తకులు ఈ రాణి చేపలను ఇక్కడ నుంచి నేరుగా చెన్నై, కేరళలకు ఎగుమతులు చేస్తున్నారు. అక్కడ కిలో రూ.130 వరకు అమ్ముతున్నారు. దీంతో ఇక్కడ రాణి ఫిష్‌కు అనూహ్యంగా మంచి ధర లభిస్తోంది. ఇలా ప్రస్తుతం వీటిని ట్రేడర్లు కిలో రూ.100 వరకు కొనుగోలు చేస్తున్నారు. వీటిలో పెద్ద సైజు రాణి ఫిష్‌ను కిలో రూ.200 ధర కూడా పలుకుతోంది. ఇలా గతంలో అక్కడ అమ్మకం చేసే ధరే దాదాపు ఇక్కడ వస్తోంది. చదవండి: మదనపల్లెలో కశ్మీరీ కుంకుమపువ్వు అసలే వేట గిట్టుబాటు కాక సతమతమవుతున్న మత్స్యకారులు, బోటు యజమానులకు గులివిందల ధర లాభదాయకంగా ఉంటోంది. ఇది మత్స్యకారులకు ఊరటనిస్తోంది. ‘డీజిల్ ధర కొన్నాళ్లుగా మాకు పెను భారంగా మారింది. ఈ తరుణంలో సమృద్ధిగా లభ్యత, మంచి ధరతో గులివందలే ఆదుకుంటున్నాయి.’ అని మైలపిల్లి రాము అనే బోటు యజమాని ‘సాక్షి’తో చెప్పారు. రోజుకు 25–30 టన్నుల రాణి ఫిష్‌లు విశాఖ ఫిషింగ్ హార్బర్‌కు రోజుకు సగటున 150 టన్నుల చేపలు వస్తుంటాయి. వీటిలో ప్రస్తుతం రాణి ఫిష్ (గులివిందలు) చేపలు 25–30 టన్నుల వరకు ఉంటున్నాయి. వీటిలో కొనుగోళ్లు చేయగా మిగిలిన చేపలను కొన్ని రోజులపాటు ఎండబెట్టిన తర్వాత విక్రయిస్తారు.