పిల్లలు, వృద్ధుల ఎముకలు దృఢంగా ఉండాలంటే.. ఈ ఆహార పదార్థాలను వారి డైట్‌లో చేరిస్తే మంచిది.
►పిల్లలకు ఎదిగే వయసులోనూ, వృద్ధులకూ ఎముకలు దృఢంగా మారాలంటే ప్రతిరోజు కొన్ని ఖర్జూరాలను ఇవ్వాలి.
►ముఖ్యంగా ఎండు ఖర్జూరాలను ప్రతిరోజు రాత్రి నీటిలో నానబెట్టి ఉదయాన్నే గింజలు తీసేయాలి.
►వాటిని మిక్సీ పట్టి పిల్లలతో తాగించడం వల్ల ఎముకలు దృఢంగా మారడమే కాకుండా వారి శరీరానికి పోషకాలు లభిస్తాయి.
ఇవి కూడా...
►అదే విధంగా.. రాగులు.. తృణధాన్యాలలో రాగులు కూడా ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకున్నాయి.
►వీటిలో క్యాల్షియం అధికంగా ఉంటుంది కాబట్టి ఎదిగే పిల్లలకు రాగి పిండితో తయారు చేసిన ఆహార పదార్థాలను ఇవ్వడం వల్ల వారు మరింత ఆరోగ్యంగా తయారవుతారు.
►ఇక వీటితోపాటు మఖానాలు, పాలు, పెరుగు , బాదం, జున్ను, ఆకుకూరలు, చేపలు, గుడ్లు, చియా సీడ్స్ వంటివి డైట్‌లో చేర్చుకోవాలి.
►ఇలా చేస్తే వారు మరింత ఆరోగ్యంగా ఉండటమే కాకుండా.. వారి ఎముకల దృఢత్వాన్ని కూడా పెంపొందించుకోవచ్చన్నది ఆరోగ్య నిపుణుల మాట.
చదవండి: Health Tips: బీపీ పెరగడానికి కారణాలేంటి? ఎలా కంట్రోల్ చేసుకోవాలి?
Health Tips: బోడ కాకర తరచుగా తింటున్నారా? దీనిలోని లుటీన్ వల్ల..
Comments
Please login to add a commentAdd a comment