Bone strength
-
Health Tips: పిల్లలు, వృద్ధులు ఖర్జూరాలు తరచుగా తింటే!
పిల్లలు, వృద్ధుల ఎముకలు దృఢంగా ఉండాలంటే.. ఈ ఆహార పదార్థాలను వారి డైట్లో చేరిస్తే మంచిది. ►పిల్లలకు ఎదిగే వయసులోనూ, వృద్ధులకూ ఎముకలు దృఢంగా మారాలంటే ప్రతిరోజు కొన్ని ఖర్జూరాలను ఇవ్వాలి. ►ముఖ్యంగా ఎండు ఖర్జూరాలను ప్రతిరోజు రాత్రి నీటిలో నానబెట్టి ఉదయాన్నే గింజలు తీసేయాలి. ►వాటిని మిక్సీ పట్టి పిల్లలతో తాగించడం వల్ల ఎముకలు దృఢంగా మారడమే కాకుండా వారి శరీరానికి పోషకాలు లభిస్తాయి. ఇవి కూడా... ►అదే విధంగా.. రాగులు.. తృణధాన్యాలలో రాగులు కూడా ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకున్నాయి. ►వీటిలో క్యాల్షియం అధికంగా ఉంటుంది కాబట్టి ఎదిగే పిల్లలకు రాగి పిండితో తయారు చేసిన ఆహార పదార్థాలను ఇవ్వడం వల్ల వారు మరింత ఆరోగ్యంగా తయారవుతారు. ►ఇక వీటితోపాటు మఖానాలు, పాలు, పెరుగు , బాదం, జున్ను, ఆకుకూరలు, చేపలు, గుడ్లు, చియా సీడ్స్ వంటివి డైట్లో చేర్చుకోవాలి. ►ఇలా చేస్తే వారు మరింత ఆరోగ్యంగా ఉండటమే కాకుండా.. వారి ఎముకల దృఢత్వాన్ని కూడా పెంపొందించుకోవచ్చన్నది ఆరోగ్య నిపుణుల మాట. చదవండి: Health Tips: బీపీ పెరగడానికి కారణాలేంటి? ఎలా కంట్రోల్ చేసుకోవాలి? Health Tips: బోడ కాకర తరచుగా తింటున్నారా? దీనిలోని లుటీన్ వల్ల.. -
ఎముకల నొప్పులా? అవిశ, సబ్జా, గుమ్మడి గింజల పొడి రోజూ స్పూన్ తీసుకుంటే!
బ్యాక్ పెయిన్, లోయర్ బ్యాక్ పెయిన్, భుజాలు, కీళ్ల నొప్పులు... ఇలా అనేక రకాలుగా ఎముకల బలహీనత వల్ల శరీరంలో నొప్పులు బాధిస్తుంటాయి. కాల్షియం లోపం ఇందుకు ప్రధాన కారణం. ఎముకల నొప్పులు తగ్గాలంటే మంచి ఉపాయం ఒకటుంది. మూడురకాల గింజల పొడుల మిశ్రమం ఎముకల పటిష్టతకు తోడ్పడి నొప్పులు శాశ్వతంగా దూరం అవుతాయి. ఈ మూడురకాల గింజలు తేలిగ్గా మార్కెట్లో దొరికేవే. ఒకసారి ప్రయత్నించి చూడండి. అవిశె గింజలు, సబ్జాగింజలు, గుమ్మడి గింజలు.. ఈ మూడు రకాల గింజల వినియోగం వల్ల చాలా ప్రయోజనం కలుగుతుంది. అవిశ గింజలు (ఫ్లాక్స్ సీడ్స్) ఫ్లాక్స్ సీడ్స్ ఒమెగా 3 పోషకాల గని. కాల్షియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఒమెగా 3 శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. అలాగే వీటిల్లో ఉంటే కాల్షియం ఎముకలను పటిష్టం చేస్తుంది. దీనిలో పుష్కలంగా ఉండే డైటరీ ఫైబర్ అధిక ఆకలిని తగ్గించి శరీర బరువును అదుపులో ఉంచుతుంది. సబ్జా గింజలు (చియా సీడ్స్) సబ్జా గింజలు లేదా చియా సీడ్స్‌లో ప్రొటీన్, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. కాల్షియం, మెగ్నీషియం ఎముకలు పటిష్టంగా ఉండేలా తోడ్పాటు అందిస్తాయి. ఇందులో కూడా ఒమెగా 3 ఉంటుంది. అలాగే చియా సీడ్స్ యాంటీ ఆక్సిడంట్స్‌గా పనిచేస్తాయి. గుమ్మడి గింజలు (పంప్కిన్ సీడ్స్) ఇందులో ప్రొటీన్, ఫైబర్, ఒమెగా 3, మెగ్నీషియం, జింక్ పోషకాలు ఉంటాయి. బాగా శక్తినివ్వడంతో పాటు మీ శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఎలా తయారు చేయాలి? అవిశ గింజలు, చియా సీడ్స్, గుమ్మడి గింజలను సమపాళ్లలో తీసుకుని వేర్వేరుగా వేయించుకోవాలి ఉదాహరణకు ఒకరకం గింజలను 100 గ్రాములు తీసుకుంటే మిగిలిన వాటిని కూడా వంద వంద గ్రాములే తీసుకోవాలి. దోరగా వేగిన తరువాత చల్లార్చి మిక్సీలో వేర్వేరుగా పొడి చేసుకోవాలి. మిక్సీ వేయడం పూర్తయ్యాక మూడు పొడులను కలిపేసుకుని ఒక డబ్బాలో పెట్టుకోవాలి. రోజూ ఈ మిశ్రమం నుంచి టీ స్పూన్ పొడిని మజ్జిగలో కలుపుకొని తాగాలి లేదా అన్నంలోనైనా కలుపుకొని తినొచ్చు. ఇలా కొద్దిరోజులు రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే మీ ఎముకల నొప్పులు, నడుము నొప్పి మాయం అవడమే కాకుండా.. మళ్లీ నొప్పులు రావు. చదవండి: Amarnath Vasireddy: కూర్చోవడం అంటే మరణాన్ని ఆహ్వానించడమే! అన్నం ఎక్కువ తిన్నారో! -
నిర్లక్ష్యం వద్దు.. తగిన చికిత్స లేకుంటే దుష్పరిణామాలు
కరోనా సెకండ్‌వేవ్ తీవ్రత ప్రభావాలు, పరిణామాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా.. దీనితో ముడిపడిన అనారోగ్య సమస్యలు మాత్రం పెరుగుతున్నాయి. కరోనా రోగులు ఏ స్థాయిలో దాని బారిన పడ్డారన్న దానిపై వారు పూర్తిగా కోలుకునే కాలం ఆధారపడి ఉంటుందని వైద్య నిపుణులు, పరిశోధకులు ఇదివరకే తేల్చారు. స్వల్ప, ఒక మోస్తరు, తీవ్ర లక్షణాలు, ఆసుపత్రిలో చేరడం, ఐసీయూ, వెంటిలేటర్‌పైకి వెళ్లడం, స్టెరాయిడ్స్ స్థాయిల వినియోగం వంటి వాటిని బట్టి కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకునేందుకు నెల నుంచి ఆరు నెలలకు పైగా సమయం పడుతుందని అంచనా వేశారు. కీళ్లు, కండరాలు, నరాల వ్యవస్థలపై కోవిడ్ అనంతరం ప్రభావాలు తీవ్రంగా ఉన్నట్టు ఇప్పటికే తేలింది. తాజాగా కోవిడ్ రోగులు ఎముకల్లో పటుత్వాన్ని కోల్పోతున్నారని (బోన్ డెత్– అవాసు్క్యలర్ నెక్రోసిస్ (ఏవీఎన్)) హైదరాబాద్‌లోని ఒవైసీ ఆస్పత్రి, రీసెర్చి క్యాంపస్ వైద్య పరిశోధకులు డాక్టర్ ఆబిద్ అలీఖాన్, డాక్టర్ మజారుద్దీన్ అలీఖాన్‌లు వెల్లడించారు. – సాక్షి, హైదరాబాద్ కరోనా నుంచి కోలుకునే క్రమంలో ఎముకలకు రక్తప్రసారం తగ్గి సూక్ష్మ ఫ్రాక్చర్లతో (ఎముకలు చిట్లడం) కీళ్లు దెబ్బతినే ప్రమాదం ఉన్నట్టుగా తమ అధ్యయనంలో తేలిందని వైద్యులు తెలిపారు. తగిన చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే దుష్పరిణామాలు సంభవిస్తాయని వారు హెచ్చరిస్తున్నారు. మ్యుకార్ మైక్రోసిస్ మాదిరిగానే, కరోనా చికిత్సలో భాగంగా మందులు, ఔషధాలు వంటివి ఎక్కువ మోతాదులో తీసుకోవడం లేదా అవసరం లేకపోయినా ఉపయోగించడం వల్ల ఈ సమస్యలు తలెత్తుతున్నాయని వారు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఈ రకం కేసులు మరింత పెరిగే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యలు వృద్ధులు, వయసు పైబడిన వారిలోనే కాకుండా ఎక్కువ మోతాదులో స్టెరాయిడ్స్ ఉపయోగించిన యువతలోనూ బయటపడొచ్చునంటున్నారు. కోవిడ్ చికిత్స అనంతరం 50, 60 రోజుల్లో ఏవీఎన్ కొందరిలో బయటపడొచ్చని, మరికొందరిలో కనిపించడానికి ఆరు నెలల నుంచి ఏడాది కూడా పట్టొచ్చునని డాక్టర్ ఆబిద్ అలీఖాన్, డాక్టర్ మజారుద్దీన్ అలీఖాన్ వెల్లడించారు. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం ఏవీఎన్‌కు సంబంధించిన లక్షణాలు తొలుత ఎమ్మారై పరీక్షల్లో బయటపడతాయని, తదనంతర పరిస్థితుల్లో ఎక్స్‌రే రేడియోగ్రాఫ్లోనూ గుర్తించొచ్చునని చెప్పారు. దీని మొదటిదశ లక్షణాల్లో భాగంగా నడుం, గజ్జలు, వెన్నెముక, భుజం నొప్పులు కనిపించొచ్చునని, వీటిని నిర్లక్ష్యం చేస్తే సమస్య తీవ్రమై జాయింట్లు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంటుందని తెలిపారు. అందువల్ల తొలిదశలోనే దీనిని గుర్తించి అప్రమత్తమైతే అది తీవ్రస్థాయికి చేరకుండా అరికట్టొచ్చుని స్పష్టం చేశారు. ఎముకల జాయింట్ల నొప్పులు పెరుగుతున్నప్పుడు, ఈ నొప్పులు ఆగకుండా కొనసాగుతున్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా ఆర్థోపెడిక్ డాక్డర్లను సంప్రదించి సరైన చికిత్స చేయించుకోవాలని డాక్టర్ ఆబిద్ అలీఖాన్, డాక్టర్ మజారుద్దీన్ అలీఖాన్ సూచించారు. -
ఉద్వేగంతో ఆ ముప్పు ఎక్కువ..
లండన్ : ఉద్వేగానికి లోనయ్యే వారి ఎముకలు పటుత్వం కోల్పోతాయని తొలిసారిగా ఓ అథ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా మొనోపాజ్ దశలో మహిళలు ఎముకల సాంద్రత మందగిస్తుందని, త్వరగా పెళుసుబారిపోతాయని పేర్కొంది. ఇది వయసుమీరుతున్న మహిళల్లో సహజ జన్యుపరమైన లక్షణమే అయినా మహిళల్లో ఉద్వేగస్థాయిలకు, వారి ఎముకల పటుత్వానికి గల సంబంధాన్ని తాజా అథ్యయనం నిగ్గుతేల్చింది. యాంగ్జైటీ డిజార్డర్లతో మహిళలకు అనారోగ్య సమస్యలు తీవ్రమవడం పెరుగుతోందని, ప్రపంచవ్యాప్తంగా 33 శాతం మంది మహిళలు ఈ తరహా అస్వస్థతలకు లోనవుతున్నారని తెలిపింది. ఉద్వేగానికి లోనయ్యే మహిళల ఆరోగ్యం అంతంతమాత్రమేనని, వారు అనారోగ్యకర అలవాట్లకు లోనవుతున్నారని అథ్యయనానికి నేతృత్వం వహించిన మెస్సినా యూనివర్సిటీ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ ఆంటోనియా కటలానో విశ్లేషించారు. మహిళల్లో ఈస్ర్టోజన్ మందగించినప్పుడు ఎముకలు పటుత్వం కోల్పోతాయని, అయితే ఎముకలు బలహీనపడటానికి ఇదొక్కటే కారణం కాదని, ఉద్వేగం అధికంగా ఉన్న మహిళల్లో ఎముకలు బలహీనపడే రిస్క్ ఎక్కువగా ఉందని చెప్పారు. ఉద్వేగ సమస్యలతో ఉక్కిరిబిక్కిరయ్యే మహిళల్లో విటమిన్ డీ స్ధాయి తక్కువగా ఉన్నట్టు వెల్లడైందన్నారు. ఎముకల ఆరోగ్యానికి, ఉద్వేగ సమస్యలకు సంబంధం ఉందని తమ అథ్యయనంలో తొలిసారిగా స్పష్టమైందని చెప్పారు. -
వయసు పెరుగుతుంటే... ఎముకల పటుత్వం తగ్గుతుంది
నిర్ధారణ వయసు పెరిగే కొద్దీ ఎముకల పటుత్వం లోపించడంతో వార్ధక్య చిహ్నాలు కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పుల రూపంలో బయటపడుతుంటాయి. ఆస్టియోపోరోసిస్‌ను నిర్ధారణ చేయాలంటే... మెడికల్ హిస్టరీ... గతంలో జరిగిన ప్రమాదాలు రక్తసంబంధీకుల ఎముకల సమస్యలు, ఆహారవిహారాల వివరాలు. ఫిజికల్ ఎగ్జామినేషన్ బోన్ డెన్సిటీ టెస్ట్ ఫాక్స్ (ఫ్రాక్చర్ రిస్క్ అసెస్మెంట్ టూల్) లాబొరేటరీ టెస్ట్‌ల్లో భాగంగా రక్తం, మూత్ర పరీక్షల ద్వారా ఎముక పటుత్వం తగ్గడానికి కారణాలను తెలుసుకుంటారు. ఇందులో రక్తంలో క్యాల్షియం స్థాయులు, 24 గంటల పాటు విసర్జించిన మూత్రంలో క్యాల్షియం మోతాదును పరీక్షించడం, థైరాయిడ్ పనితీరు, పారాథైరాయిడ్ హార్మోన్ స్థాయులు, టెస్టోస్టీరాన్ స్థాయులు (మగవారిలో), హైడ్రాక్సి విటమిన్ -డి పరీక్ష, బయోకెమికల్ మార్కర్ టెస్ట్‌లు ఉంటాయి. అవసరమైతే న్యూక్లియర్ బోన్ స్కాన్, సి.టి. స్కాన్, ఎం.ఆర్.ఐ కూడా చేయాల్సి ఉంటుంది.