తియ్యగా తగ్గించుకోండి
పంచదారకు బదులు అనేక స్వీట్ల తయారీలో కర్జూరాలను వాడుతుంటాము. స్వీట్‌గా ఉండే ఈ ఖర్జూరాల్లో అనేక ఆరోగ్య సుగుణాలు ఉన్నాయి. డేట్స్ తింటూ పొట్ట తగ్గించుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం...
►బరువు తగ్గాలంటే ఉదయాన్నే పరగడుపున ఖర్జూరాలు తినాలి. ఉదయాన్నే క్యాలరీలు ఎక్కువగా ఉండే ఖర్జూరాలు తింటే రోజంతా ఆకలి లేకుండా యాక్టివ్‌గా ఉంటారు. రాత్రి సమయాల్లో ఖర్జూరాలు తినకూడదు. ఇవి అంత సులభంగా అరగవు. పరగడుపున ఖర్జూరాలు తినడం వల్ల శరీరానికి పోషకాలు చక్కగా అందుతాయి. దీనిలోని ఐరన్ హిమోగ్లోబిన్ స్థాయులను పెంచుతాయి.
►ఉదయాన్నే డేట్స్ తినడం వల్ల జీవక్రియలు సక్రమంగా జరిగి అధిక మొత్తంలో క్యాలరీలు ఖర్చవుతాయి. డేట్స్‌ను ఓట్స్‌తో కలిపి స్మూతీ, షేక్స్ చేసుకుని తాగితే కడుపు నిండుగా ఉండి ఆకలి వేయదు. ఫలితంగా ఇతర పదార్థాలు ఏమి తినలేం. ఫలితంగా తక్కువ క్యాలరీలతో శరీర బరువు నియంత్రణలో ఉంటుంది.
► ఖర్జూరాలలో విటమిన్ బి6 ఉంటుంది. ఇది శరీరంలో సెరొటోనిన్, నోర్‌పైన్‌ఫ్రైన్ అనే హ్యాపీ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. దీంతో డిప్రెషన్, ఒత్తిడి, ఇతర మానసిక సమస్యలు తగ్గుతాయి. నిత్యం ఖర్జూరాలను తినడం వల్ల ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు.
ఖర్జూరాలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
ఖర్జూరాలు అంటే చాలా మంది ఇష్టమే ఉంటుంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే ఖర్జూరాలను రోజుకు 3 చొప్పున తినడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి
►ఇందులోని యాంటి ఆక్సిడెంట్లు అనేక అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి. కెరోటినాయిడ్స్ గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతాయి.
►అదే విధంగా కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
► ఫ్లావనాయిడ్స్ లోని యాంటి ఇన్‌ఫ్లామేటరీ గుణాలు మధుమేహం, కాన్సర్ ముప్పును తగ్గిస్తాయని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
► ఇందులోని ఫినోలిక్ ఆసిడ్ సైతం గుండె సంబంధిత వ్యాధులను దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
► ఖర్జూరాల్లో కాపర్, సెలీనియం, మెగ్నీషియం ఎక్కువ. ఎముకలను బలంగా ఉంచడంలో తోడ్పడతాయి.
► ఖర్జూరాల్లోని కోలిన్, విటమిన్ బి జ్ఞాపకశక్తిని పెంపొందించడంలో తోడ్పడతాయి. అల్జీమర్స్ తగ్గిస్తాయి. కాబట్టి వీటిని తరచుగా తినడం మేలు.
►ఖర్జూరాలు నిద్రలేమిని దూరం చేస్తాయి.
► మహిళల్లో హిమోగ్లోబిన్ శాతం తక్కువ ఉన్నవాళ్లు ఖర్జూరాలు తింటే మంచిది.
►గర్భిణీలకు ఖర్జూరం తినిపిస్తే మంచిదని చెబుతుంటారు పెద్దలు. గర్భిణులు వీటిని తినడం వల్ల ఇందులోని ఫైబర్ కారణంగా పైల్స్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
బ్యూటీ టిప్స్
టేబుల్ స్పూను పటిక పొడిలో తగినంత రోజ్ వాటర్‌ను వేసి పేస్టులా కలుపుకోవాలి. ఈ పేస్టుని ముఖానికి, మెడకు రాసుకుని మర్దన చేయాలి. పదిహేను నిమిషాలపాటు మర్దన చేసిన తరువాత నీటితో కడిగేయాలి. ముఖాన్ని తడిలేకుండా శుభ్రంగా తుడిచి, మాయిశ్చరైజర్ రాసుకోవాలి. వారానికి రెండుసార్లు ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖ సంబంధిత సమస్యలు తగ్గుముఖం పడతాయి.
Comments
Please login to add a commentAdd a comment