క్షణాల్లో అందంగా మెరిసిపోవచ్చు.. ఈ ఫేస్‌ప్యాక్‌ వేసుకోండి | Beauty Tips To Get Facial Glow At Home | Sakshi
Sakshi News home page

Beauty Tips: క్షణాల్లో అందంగా మెరిసిపోవచ్చు.. ఈ ఫేస్‌ప్యాక్‌ వేసుకోండి

Published Fri, Dec 8 2023 3:46 PM | Last Updated on Tue, Dec 12 2023 10:55 AM

Beauty Tips To Get Facial Glow At Home - Sakshi

అందంగా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు? దీనికోసం వేలకు వేలు ఖర్చు పెట్టి మరీ ట్రీట్‌మెంట్లు, ఫేస్‌క్రీములు కొంటుంటారు. అయితే ఇంట్లోనే దొరికే వస్తువులతో ఫేషియల్‌ లాంటి గ్లోను సొంతం చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం. 


►మెటిమలు, నల్లమచ్చలు పోవాలంటే... ఒక స్పూను నిమ్మరసంలో అంతే మోతాదులో తేనె కలిపి ముఖానికి రాయాలి. పదిహేను నిమిషాల తర్వాత చన్నీటితో కడగాలి. పొడి చర్మం అయితే నిమ్మరసం బదులు కీరదోస రసం కలుపుకోవచ్చు.

► ఇక లేత కొబ్బరితో ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకుంటే ముఖం చాలా నిగారింపును సంతరించుకుంటుంది. లేత కొబ్బరి తో వేసుకునే ఫేస్ ప్యాక్ స్కిన్‌టోన్‌ను రెట్టింపు చేస్తుంది. 

► కొంచెం నిమ్మరసాన్ని తేనెతో కలిపి ముఖానికి అప్లై చేయండి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటిలో కడగాలి. ఇది చర్మంలోని తేమను పెంచడమే కాకుండా, ఈ మాస్క్ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది.

► కొద్దిగా కాఫీ పౌడర్, కొబ్బరి నూనెను సమపాళ్లలో తీసుకొని అందులో ఒక చెంచా చక్కెర వేసి కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేయండి. ఇది చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడమే కాకుండా మృదువుగా మారుస్తుంది, చర్మం తాజాగా కనిపిస్తుంది.

► ఒక చెంచా తేనెను పెరుగుతో కలిపి ముఖానికి అప్లై చేసి, ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మం కోల్పోయిన తేమను తిరిగి తెస్తుంది.

►చర్మం పొడిబారి నిర్జీవంగా మారుతుంటే... రాత్రి పడుకునే ముందు స్వచ్ఛమైన నెయ్యిని ముఖానికి రాయాలి. ఎగ్‌ ప్యాక్‌ కూడా ప్రయత్నించవచ్చు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement