
పెదవులు పొడిబారితే ముఖమే అందహీనంగా మారుతుంది. అందుకే చాలామంది అధరాలను మృదువుగా మార్చుకోవడానికి ఏదైనా చిట్కా ఉందా అని అడుగుతుంటారు. అలాంటి వారికి ఈ లిప్‌బామ్ ఉత్తమ ఎంపిక. దీని పేరు ‘కోలరెన్ స్క్వాలేన్ + అమైనో యాసిడ్స్ లిప్ బామ్’. దీన్ని ఎక్కువసార్లు అప్లై చేయాల్సిన పనిలేదు. ఒక్కసారి అప్లై చేసుకుంటే చాలాసేపటి వరకూ నిలిచి ఉంటుంది.
దీన్ని పెదవులకే కాదు మోచేతులు, గోళ్లు వంటి పగుళ్లు ఉన్న భాగాల్లో అప్లై చేస్తే వెంటనే మృదువుగా మారతాయి. దీన్ని సులభంగా ఎక్కడికైనా తీసుకుని వెళ్లేలా చిన్నగా రూపొందించడంతో, క్యారీ చేయడం చాలా తేలిక. ఈ లిప్ బామ్‌ని రాత్రి పూట అప్లై చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
మొటిమలకు చెక్ పెట్టేద్దాం ఇలా..
అందానికి ప్రాధాన్యమిచ్చేవారు ముఖం మీద చిన్న మొటిమ వచ్చినా, మచ్చ పడినా అసలు తట్టుకోలేరు. వెంటనే దాన్ని తగ్గించుకోవడానికి బ్యూటీ పార్లర్ బాట పడుతుంటారు. ప్రస్తుత సాంకేతికత అలాంటి సమస్యలను ఇట్టే దూరం చేస్తుంది. ఇంట్లోనే స్వయంగా, సులభంగా, తమకు తామే ట్రీట్‌మెంట్ చేసుకునే విధంగా గాడ్జెట్స్‌ను పరిచయం చేస్తోంది.
అందులో భాగమే ఈ స్కిన్ కేర్ డివైస్. చిత్రంలోని ఈ మినీ మెషిన్.. మచ్చలను, మొటిమలను, చర్మంపై రంధ్రాలను పోగొట్టి, ముఖాన్ని మృదువుగా మారుస్తుంది. ఇది బ్లూకలర్ లైట్ థెరపీతో మొటిమల్లోని బ్యాక్టీరియాను నిర్మూలించి, వాటి కారణంగా ఏర్పడిన మచ్చలను వేగంగా తగ్గిస్తుంది.
దీనిలోని నీలం రంగు లైట్ 415 నానోమీటర్ల తరంగదైర్ఘ్యంతో వెలుగుతూ, 0.5 మిల్లీమీటర్ల మేరకు చర్మం లోతుల్లోకి చొచ్చుకుని వెళ్లి, ముఖాన్ని శుభ్రపరుస్తుంది. సున్నితమైన చర్మానికి కూడా ఇది చక్కటి ట్రీట్‌మెంట్ అందిస్తుంది. అయితే ఈ లైట్ థెరపీ తీసుకునేటప్పుడు కళ్లకు ప్రత్యేకమైన కళ్లజోడును కచ్చితంగా ధరించాలి. ఈ కళ్లజోడు డివైస్‌తో పాటు లభిస్తుంది.
మెషిన్‌కి ఉన్న లైట్ హెడ్ మీద, 44 హై–ఇంటెన్సిటీ ఎల్‌ఈడీ బల్బులు ఉంటాయి. ఈ గాడ్జెట్ చర్మాన్ని బిగుతుగా మార్చడంతో పాటు రకరకాల అలర్జీలను తగ్గిస్తుంది. ఇక ఆయిలీ స్కిన్ ఉన్నవారికి ఇది పర్ఫెక్ట్ డివైస్ అని చెప్పుకోవచ్చు. దీనిలోని కాంతి చర్మంపై పేరుకున్న జిడ్డును తొలగిస్తుంది. అలాగే దీనిలోని కంటిన్యూస్, పల్సేటింగ్ అనే రెండు మోడ్స్ ఉంటాయి.
మనకు కావలసిన రీతిలో 1 నిమిషం, 3 నిమిషాలు, 5 నిమిషాలు, 12 నిమిషాల వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ డివైస్ 120 నిమిషాల పాటు నిరంతరాయంగా పని చేయగలదు. చార్జింగ్ పెట్టుకుని దీన్ని వైర్‌లెస్‌గా కూడా వినియోగించుకోవచ్చు. ఫేస్ క్రీమ్, సీరమ్ వంటివి అప్లై చేసుకున్నాక ఈ ట్రీట్‌మెంట్ తీసుకోవడం ఉత్తమం.
(చదవండి: ప్రెగ్నెన్సీలో ఎలాంటి మల్టీ విటమిన్ టాబ్లెట్స్ బెస్ట్..!)
Comments
Please login to add a commentAdd a comment