Lips
-
పెదవులు గులాబీ రంగులో మెరవాలంటే ..!
చలికాలంలో పెదాలు పొడిబారినట్లుగా అయిపోయవడమే గాక ముఖం, చర్మం కాంతి విహీనంగా మారుతుంది. ఓపక్క పని ఒత్తిడి వల్ల కళ్లకింద నలుపు, ముఖంంపై ముడతలతో అందవిహీనంగా కనిపిస్తుంది. ఇలాంటి వాటిని ఆరోగ్యం కోసం తినే ఫ్రూట్స్‌తో చెక్‌పెడదాం. అదెలాగో చూద్దామా..కీరదోసకాయని చక్రాల్లా కోసుకుని కళ్ళమీద పెట్టుకుంటే కంటి అలసట తగ్గుతుంది. రెండు స్పూన్ల చల్లని పాలలో కాటన్ బాల్స్‌ని ముంచి కళ్ళ చుట్టూ వలయాకారంగా మర్ధించి 20 నిమిషాల తర్వాత చన్నీటితో శుభ్రంగా కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే కంటి కింద నలుపు తగ్గి అందంగా ఉంటాయి. మెడ మురికి పట్టేసినట్లు నల్లగా ఉంటే... నాలుగు టీ స్పూన్ల పుల్లటి పెరుగులో రెండు స్పూన్ల బియ్యప్పిండి కలిపి మెడకు పట్టించి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చర్మానికి పట్టిన నలుపుతోనాటు ముడతలుపోతాయి.టీ స్పూన్ అరటిపండు గుజ్జులో టీస్పూన్ తేనె కలిపిన మిశ్రమాన్ని పెదవులకు రాసి మసాజ్ చేసి గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే నల్లని పెదవులు గులాబీ రంగులోకి మారతాయి.టీస్పూన్ పాల మీగడ, అయిదారు గులాబి రేకులు తీసుకుని పేస్ట్ చేసిన మిశ్రమాన్ని పెదవులకు రాసుకుంటే పెదవులు పొడిబారకుండా మృదువుగా ఉంటాయి. చలికాలంలో లిప్‌స్టిక్ ఎంత తక్కువ వాడితే అంత మంచిది. లిప్ గార్డ్, మీగడ, వెన్న, నెయ్యి వంటివి రాసుకుంటూ ఉంటే పెదవులు పొడిబారకుండా అందంగా ఉంటాయి. టీ స్పూన్ ఆపిల్ గుజ్జులో టీ స్పూన్ అరటిపండు గుజ్జు, అయిదారు చుక్కల తేనె వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ఫేస్ మాస్క్‌లా వేసుకుని 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ముఖంపై ఏర్పడ్డ ముడతలు, జిడ్డు తగ్గి ముఖం మెరుస్తూ కాంతివంతంగా ఉంటుంది. (చదవండి: ఐపీఎల్ ఆటగాళ్ల ‘వేలం'లో మెరిసిన ఆ చిన్నది ఎవరు?) -
పెదవుల నిగారింపుకై.. ఇలా చేస్తే చాలు..!
పెరుగుతున్న ఎండవేడికి చర్మంతోపాటు, పెదవులపై నలుపు రంగు పేరుకుపోతూంటుంది. పెదవులపై చీలికలతో పాటు మెరిసేతత్వం కూడా తగ్గుతుంది. మరి పెదవులు సహజంగా, కోమలంగా ఉండాలంటే ఈ ట్రిక్స్ ట్రై చేయండి..!ఇలా చేయండి..రోజూ ఉదయాన్నే బ్రష్ చేసిన తరువాత.. బ్రష్ మీద కొద్దిగా తేనె వేసి రెండు పెదవులపైన గుండ్రంగా ఐదు నిమిషాలపాటు రుద్దాలి. ఇలా రోజూ చేయడం వల్ల పెదవులపై పేరుకుపోయిన మృతకణాలు తొలగిపోతాయి. మర్ధన వల్ల రక్తప్రసరణ సక్రమంగా జరిగి పెదవులు మృదువుగా మారతాయి.ఉదయం బ్రష్‌తో మర్దన చేసాక, రాత్రి పడుకునేముందు మాయిశ్చరైజర్ తప్పనిసరిగా రాయాలి. ఇందుకోసం.. కొద్దిగా బీట్రూట్ రసాన్ని వేడి చేయాలి. వేడిచేసిన రసంలో అర టీస్పూను కార్న్‌ఫ్లోర్ వేసి ఐదు నిమిషాలపాటు బాగా కలిపి దించేయాలి. తరువాత ఈ మిశ్రమంలో అర టీస్పూను గ్లిజరిన్, పావు టీస్పూను కొబ్బరి నూనె కలిపి ఎయిర్‌టైట్ కంటైనర్‌లో నిల్వచేయాలి. ఈ మిశ్రమం గట్టిపడిన తరువాత పెదవులకు రాసి మర్ధన చేసి పడుకోవాలి. ఉదయం నీటితో కడిగేయాలిఈ రెండింటిని ఒకదాని తరువాత ఒకటి క్రమం తప్పకుండా పాటిస్తే పెదవులు గులాబి రేకుల్లా కోమలంగా పింక్ కలర్లో ఆకర్షణీయంగా కనిపిస్తాయి.ఇవి చదవండి: Beauty Tips: కనురెప్పల సోయగానికై.. ఇలా చేయండి! -
లిప్ ఫిల్లింగ్ ట్రీట్మెంట్ మంచిదేనా? ఫెయిలైతే అంతేనా..!
సెలబ్రెటీల దగ్గర నుంచి సాధారణ యువతీ యువకులు వరకు అందరూ అందం వెంట పరుగులు పెడుతున్నారు. అందుకోసం ఎలాంటి సర్జరీలైన చేయించుకునేందుకు అయినా వెనుకాడటం లేదు. తీరా అవి శరీరానికి పడక ఫైయిలై ప్రాణాల మీదకు తెచ్చకున్న సందర్భాలు ఇటీవల కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అచ్చం అలాంటి ఘటనే యూకేలో ఒకటి చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. యూకేకి చెందిన 24 ఏళ్ల షౌన్నా హారిస్ అనే మహిళ తన పెదాలు అందంగా కనిపించేందుకు లిప్ ఫిల్లర్ ట్రీట్మెంట్ చేయించుకుంది. ఈ ట్రీట్మెంట్ని మొదటగా 18 ఏళ్ల వయసులో 0.51ఎంఎల్ లిప్ ఫిల్లర్ పొందింది. ఆ తర్వాత హారిస్ 24 ఏళ్ల వయసులో మరోక 1ఎంఎల్ ట్రీట్మెంట్ అందుకుంది. మొదటగా చేయించుకున్నప్పుడు బాగానే ఉంది. కానీ రెండోసారి అది తీవ్రమైన దుష్పరిణామాలకు దారితీసింది. సాధారణంగా ఈ ట్రీట్మెంట్ ఫెయిలైతే పెదాలు ఉబ్బడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఆమెకు పెదాలు ఒక విధమైన మంటతో లావుగా అయ్యిపోవడమేగాక శ్వాస సంబంధ సమస్యలు, ముఖమంతా మంట, దద్దర్లు వంటి సమస్యలు ఉత్ఫన్నమయ్యాయి.ఆ బాధ తాళ్లలేక చనిపోతానేమో అనేంత భయానక నరకాన్ని అనుభవించింది. ఓ మూడు రోజుల వరకు బయటకు రాలేకపోయింది. వైద్యులు వెంటనే ఆమె పరిస్థితిని గమనించి చికిత్స చేయగా శ్వాస పీల్చుకోగలిగింది. ఆ సమస్యలు తగ్గుతాయా లేదా అనేది వైద్యలు వెల్లడించలేదు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉంది. ఏదీ ఏమైనా దేవుడిచ్చిన అందం చాలు అనుకుంటే సమస్యలు ఉండవు. ఇలా అందం కోసం ఆర్రులు చాచి లేనిపోని కష్టాలు కొనితెచ్చుకుని పడరాని పాట్లు పడుతుంటారు చాలామంది. అందం మాట దేవుడెరుగు అస్సలు బతుకుతామా అనే సందేహాలు తెప్పించే ఈ కాస్మోటిక్ సర్జరీల జోలికి వెళ్లకపోవడమే మంచిది.ఎందుకు చేస్తారంటే..పెదాలు బొద్దుగా కనిపించేందుకు ఈ లిప్ ఫిల్లింగ్ ట్రీట్మెంట్ చేయించుకుంటారు. మొదటగా 0.5ఎంఎల్ డెర్మల్ ఫిల్లర్ (సగం సిరంజి) తో ప్రారంభిస్తారు. రెండువారాల తర్వాత ఇంకాస్త లావుగా కావాలనుకుంటే మరోసారి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ట్రీట్మెంట్ తర్వాత పెదాల ఆకృతి శాశ్వతం ఉండిపోదు. ఆ లిప్ ఫిల్లర్లు సాధారణంగా 12 నుండి 18 నెలల వరకు ఉంటాయి. మన శరీరం శక్తి ఎంత వేగంగా బర్న్ చేసే దాన్న బట్టి వాటి సైజు తగ్గిపోవడం జరుగుతుంది. ఈ ట్రీటెమెంట్కు కనీసం 21 ఏళ్ల వయసు ఉండాలి. అలాగే పెదాలు లావు తగ్గిపోయాక మళ్లీ వైద్యుడిని సంప్రదించి చేయించుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. ఈ ట్రీట్మెంట్లో పెదాలకు ఇంజెక్షన్లు పడకపోతే శరీరంపై తీవ్ర దుష్పరిణామాలు చూపించే ప్రమాదం కూడా ఉంది. ఈ కాస్మోటిక్ సర్జరీలు ఎంత లగ్జరీయస్తో కూడికున్నవైనా.. తేడా కొడితే ప్రాణం మీదకు వస్తుందనే విషయం మరువద్దు. ఇక ఇక్కడ లిప్ ఫిల్లింగ్ ట్రీట్మెంట్లో ఇచ్చే హైలురోనిడేస్ అనే ప్రోటీన్ ఎంజైమ్ ప్రతిచర్య ఫలితంగానే ఒక్కోసారి ఫెయిలై శరీరంపై పలు దుష్పరిణామాలు చూపిస్తుంది. ఇది పెదవుల్లో సాధారణంగా ఉండే హైలురోనిక్ యాసిడ్‌ను విచ్ఛిన్నం చేసి కావల్సినంత ఆకృతిలో పెదవులు ఉండేలా చేసుకునేందుకు ఈ ట్రీట్మెంట్ చేయించుకుంటారు.గతంలో ఇలానే యూఎస్‌కి చెందిన మహిళ ఇలాంటి శస్త్ర చికిత్స చేయించుకుని కార్టూన్ క్యారెక్టర్ మాదిరిగా ఫేస్ మారిపోయింది. దీంతో ఆమె సోషల్ మీడియా వేదికగా ఆ బాధను వెల్లబోసుకుంది. ఈ లిప్ ఇంజెక్షన్ పడకపోతే మనిషి కోలుకోలేనివిధంగా ఆరోగ్యం దెబ్బతినడం, ముఖం వికృతంగా మారిపోవడం వంటివి జరుగుతాయని నిపుణులు కూడా చెబుతున్నారు. అసలు అవి పడతాయని నిర్థారించక గానీ ఆ ట్రీట్మెంట్ని చేయకూడదని చెబుతున్నారు. -
పెదవులు గులాబీ రేకుల్లా మెరవాలంటే ఇలా చేయండి!
ముఖం అందంగా ఉండాలంటే పార్లర్ల వద్దకే వెళ్లాల్సిన పనిలేదు. మన ఇంట్లో దొరికే వాటితోనే చక్కటి నిగారింపును సొంతం చేసుకోవచ్చు. పైగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అందుకోసం ముఖంపై కాస్త శ్రద్ధ పెట్టి ఇంట్లో ఉంటే సహజసిద్ధమైన వాటిని అప్లై చేసి మచ్చలేని చందమామలా ఉండే ముఖాన్ని సొంతం చేసుకుండి. అందకు ఈ సింపుల్ రెమిడీస్‌ని ఫాలోకండి. రోజూ పెదవులకు కాస్తంత మీగడ రాసి సున్నితంగా మర్దన చేస్తే పెదవులు పగలకుండా గులాబీ రేకుల్లా మెరుస్తాయి. ముఖాన్ని రోజుకు రెండు మూడుసార్లు గోరువెచ్చటి నీటితో కడుక్కుని పొడి టవల్‌తో చక్కగా తుడిచేస్తే మొటిమల వంటివి రావు. లేతకొబ్బరిని మెత్తగా మెదిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకుని, ఆరిన తర్వాత కడిగేసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తుంటే ముఖం చక్కగా అందంగా కనబడుతుంది. రకరకాల షాంపూల బదులు కుంకుడు కాయ రసం లేదా సీకాయ పొడితో తలస్నానం చేయడం వల్ల చుండ్రు, కేశ సంబంధమైన సమస్యలు రాకుండా జుట్టు ఆరోగ్యంగా నిగనిగలాడుతుంది. తల స్నానం పూర్తయిన తర్వాత, చివరి మగ్గు నీటిలో కొంచెం నిమ్మరసం కలిపి తలమీద పోసుకుంటే జుట్టు, చర్మ సమస్యలు రావు. (చదవండి: ఇంట్లోనే ఈజీగా నేచురల్ హెయిర్ డై చేసుకోండిలా..!) -
బొటానికల్ వండర్! మానవ పెదవులు పోలిన మొక్క!
ఈ ప్రకృతిలో ఎన్నో పర్యావరణ అద్భుతాలు ఉన్నాయి. అందులో ఉండే అత్యంత అరుదైన వృక్ష సంపద మానువుడిని విస్తుపోయాలే చేస్తుంది. ఇంతవరకు ఎన్నో వింత మొక్కలు చూసుంటారు. కానీ ఇలా లిప్‌స్టిక్ వేసిన పెదవుల్లా ఉండే అరుదైన మొక్కను గురించి విన్నారా? అదెక్కడుందంటే..? ఇలాంటి మొక్కలు కూడా ఉంటాయా ? అని ఆశ్చర్యపోవద్దు. ఎందుకంటే..? ఇలా మానవ పెదవులు పోలిన మొక్క ఈక్వెడార్, దక్షిణ అమెరికా వంటి దేశాల్లో ఎక్కువగా ఉంటాయి. సైకోట్రియా ఎలాటా లేదా హుకర్స్ లిప్స్ ప్లాంట్‌గా పిలిచే ఈ హాట్ లిప్స్ ప్లాంట్ ఈ భూమ్మీద ఉండే వృక్షజాతుల్లో అత్యంత అరుదైన మొక్కగా పేర్కొనవచ్చు. దీన్ని బొటానికల్ వండర్‌గా పిలుస్తారు. ఈ మొక్క ప్రత్యేకత ఏమిటంటే.. బ్రాక్ట్స్గా పిలిచే ఈ మొక్క ఆకులు ఎర్రటి రంగులో మానవ పెదవుల్లా కనిపిస్తాయి. ఇవి హమ్మింగ్ బర్డ్స్, సీతాకోక చిలుకలు పరాగ సంపర్కంలో ఆకర్షించడానికి ఈ ఎర్రటి ఆకుల భాగమే సహాయపడుతుంది. అయితే ఈ మొక్క ఆకులు ఉన్నంత ఆకర్షణీయంగా వాటి పువ్వులు కనిపించవు. పువ్వులు పూసే ముందే ఇలా పెదవుల ఆకారంలో ఈ మొక్క కనిపిస్తుందట. దీని లోపలి నుంచి నక్షత్రాల ఆకారంలో తెల్లని పువ్వులు పుష్పిస్తాయి. ఇవి అంతగా అట్రాక్టివ్‌గా కనిపించవు. సువాసనలు వెదజల్లే ఈ పువ్వులు డిసెంబర్, మార్చి నెలల్లో పుష్పిస్తాయి. మధ్య అమెరికాలోని ప్రజలు తమ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులకు ప్రేమను వ్యక్తం చేయడానికి ఈ మొక్కను బహుమతిగా ఇస్తారట. మరీ ముఖ్యంగా వేలంటైన్స్ డే రోజు ప్రేమికులు ఈ మొక్కను బహుమతిగా ఇస్తారట. దీని బెరడు, ఆకులను స్థానికులు చర్మ సంబంధ వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు. అయితే ఈ మొక్క ప్రస్తుతం కనుమరుగైపోతున్న జాబితాలో ఉందట. వాతావరణ మార్పులే ఇందుకు కారణమని పర్యావరణ ప్రేమికులు చెబుతున్నారు. భవిష్యత్తు తరాలకు ఈ హుకర్స్ లిప్స్ ప్లాంట్ తెలిసేందుకైనా..ఇది అంతరించిపోకుండా కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. (చదవండి: శీతాకాలంలో స్ట్రాబెర్రీలు తినొచ్చా? బరువు తగ్గుతారా..?) -
ఇదేం పిచ్చి! పెదవులు పెద్దవిగా ఉండాలని ఏకంగా 26కి పైగా..!
జిహ్వకో రుచి పుర్రెకో బుద్ధి..! అన్న సామెతో ఊరికే రాలేదేమో. కొందరు చాలా విచిత్రంగా ఉంటారు. ఎంతలా అంటే? వారితో ఉండే కుటుంబ సభ్యులకు సైతం ఛీ అనిపించేలా జుగుప్సకరంగా ఉంటారు. పోనీ స్నేహితులు, శ్రేయోభిలాషులు నచ్చచెప్పి మారుద్దామన్నా వినరు. తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్లు అన్నట్లుగా మొండిగా ఉంటారు. అలాంటి కోవకు చెందిందే బల్గేరియన్ మహిళ. తాను ప్రత్యేకంగా ఉండాలనకోవడం ఓకే. కానీ మరింత విలక్షణంగా ఉండాలనుకోవడం భరించలేని విధంగా ఉంటుంది. ఇక్కడ ఆమె కూడా అలానే తన పెదాలే అందరికంటే పెద్దగా ఉండాలని ఏం చేసిందో వింట్ షాకవ్వుతారు. అసలేం జరిగిందంటే..బల్గేరియాకు చెందిన ఆండ్రియా ఇవనోవా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. తాను అందరిలోనూ చాలా ప్రత్యేకంగా ఉండాలనుకుంటుంది. ఎంతలా అంటే తనను తాను పూర్తిగా మార్చుకునేంత. అంటే పూర్తిగా ఆమె ఆహార్యం సైతం మారిపోవాలనుకుంటుంది. అందుకోసం సర్జరీలు కూడా చేసుకుని మార్చేసుకుంటుంది. ఏమోందో ఏమోగానీ! ఆమె పెదాలు పెద్దగా ఉండాలనుకుంది. అదికూడా ప్రంపంచంలో అందరికంటే తన పెదాలే పెద్దగా ఉండాలనేది ఆమె కోరిక. అలా ఉంటేనే తాను అందంగా ఉంటానని ఆమె ప్రగాఢంగా నమ్ముతోంది. అందుకోసం 2018 నుంచి పలు క్లినిక్‌లను సంప్రదించి వాటిలో ది బెస్ట్ కాస్మెటిక్ క్లినిక్‌ని ఎంచుకుని మరీ సర్జరీ చేయించుకుంది. ఈ ప్రక్రియను ఆమె 22 ఏళ్ల వయసు నుంచి ప్రారంభించింది. 2019 నాటికి పెదవులకు సంబంధించి సుమారు 15 ఇంజెక్షన్లు తీసుకుంది. అలా ఇప్పటి వరకు దాదాపు 26కు పైగా లిప్ ఇంజెక్షన్లు తీసుకోవడం గమనార్హం. ఈ బ్యూటీ సర్జరీ కోసం ఆమె సుమారు రూ. 20 లక్షల వరకు ఖర్చు చేసింది. అంతేగాదు ఈ పెద్ద పెదాలతో చాలా సంతోషంగా ఉన్నానని, పైగా ఇప్పుడు తాను చాలా అందంగా కనిపిస్తున్నాని చెబుతుండటం విశేషం. ఇప్పుడామె ఆమె అతి పెద్ద బుగ్గలు ఉండాలనుకుంటోందట. ఆ పనిలోనే ఉన్నానని కూడా చెబుతోంది. తాను ఏ సెలబ్రెటీలా ఉండకూడదని కోరుకుంటుందట. ఎప్పటికీ తాను చాలా ప్రత్యేకంగా విలక్షణంగా ఉండేందుకే ఆసక్తి చూపిస్తానని అంటోంది. ఆమె ఇలా అందం కోసం తన శరీరంలో చాలా భాగాలకు ఇలానే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది కూడా. ఇవేం వింత కోరికలో గానీ శరీరం మొత్తం సర్జరీలతో కుళ్లబొడిపుంచుకుంటోంది. పైగా లక్షలు లక్షలు ఖర్చుపెట్టేస్తోంది. అయితే ఇదంతా ఆమె కుటుంబసభ్యులకు అస్సలు ఇష్టం ఉండదట. ఇలా అందం కోసం చేస్తున్న ప్రక్రియలన్నీ ప్రాణాంతకంగా మారుతాయమోనని ఆమె కుటుంబసభ్యులు తెగ ఆందోళన చెందుతున్నారని సమాచారం. కానీ ఇవనోవా మాత్రం ముఖ సౌందర్యం కోసం ఇలాంటి ప్రక్రియలు కొనసాగిస్తానని తెగేసి చెబుతోంది. అంతేగాదు ప్రతి ఏడాది ఇలాంటి బ్యూటీ సర్జరీలు చేయించుకుంటానని అంటోంది. పైగా సోషల్ మీడియాలో తానే ప్రపంచంలోనే అతి పెద్ద పెదవులు కలిగి ఉన్నానంటూ గొప్పలు చెప్పుకుంటోంది. View this post on Instagram A post shared by Andrea Ivanova (@andrea88476) (చదవండి: గంపెడు సంతానం దీర్ఘాయుష్షుకు గ్యారెంటీ కాదు!) -
పెదాలకు ఇది రాసుకుంటే గులాబీ రంగులోకి మారతాయి
హార్మోన్ల మార్పులు, విటమిన్ల లోపం, ధూమపానం, హైపర్ పిగ్మేంటేషన్ వంటి పలు కారణాల వల్ల పెదాలు నల్లగా మారుతుంటాయి. ఆ నలుపుదనం తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు కొబ్బరి నూనె, తేనెలో పంచదార కలపండి. ఈ మిశ్రమాన్ని పెదవులపై స్క్రబ్‌గా ఉపయోగించండి. ఇది పెదవులపై చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. పెదాలను మృదువుగా, అందమైన రంగులోకి మారుస్తుంది. రెగ్యులర్‌గా లిప్‌స్టిక్ వాడేవాళ్ల పెదాలు నల్లగా మారుతుంటాయి. అందుకే లిప్‌స్టిక్‌ను ఎక్కువసేపు ఉంచుకోవచ్చు. బయటి నుంచి రాగానే ఆలివ్ ఆయిల్ లేదా బాదం ఆయిల్‌తో లిప్‌స్టిక్‌ను తొలగించుకోవాలి. విటమిన్ ఈ టాబ్లెట్స్ అనేవి గ్రేట్ రెమెడీగా పనిచేస్తాయి.విటమిన్ ఈ అప్లై చేయడం వల్ల పెదాలు మృదువుగా మారతాయి. గులాబీ నీళ్లను ప్రతిరోజూ పెదాలకు రాసుకోవడం వల్ల లేత గులాబీ రంగులోకి మారతాయి. పెదాలకు లిప్‌బామ్ ఎంచుకునేటప్పుడు ఎస్పీఎఫ్ 30 ఉండేలా చూసుకోవాలి. దీనిని రెగ్యులర్‌గా వాడటం వల్ల మీ పెదాలు అందంగా మెరుస్తాయి. పెదవులు పగిలి బాధ పెడుతుంటేనేతిని కొద్దిగా వేడి చేసి, పెదవులపై మృదువుగా పూయాలి. ఇరవై నిమిషాల పాటు అలానే ఉంచి, గోరువెచ్చని నీటితో కడగాలి. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల సమస్య తగ్గిపోతుంది. స్ట్రాబెర్రీని పేస్ట్‌లా చేసి, అందులో కాస్త పాల క్రీమ్ వేసి కలపాలి. దీన్ని పడుకోబోయేముందు పెదవులకు అప్లై చేసి, ఉదయాన్నే శుభ్రంగా కడుక్కోవాలి. నల్లని పెదవులు ఉన్నవారు తరచూ ఇలా చేస్తూ ఉంటే... నలుపు పోయి, పెదవులు గులాబీ రంగులోకి మారతాయి -
పెదవులపై ఉండే అవాంఛిత రోమాలకు చెక్‌పెట్టండిలా!
చాలామందికి పైపెదవులపైన, గడ్డం వద్ద అవాంచిత రోమాలు వస్తుంటాయి. వాటిని తొలగించుకునేందుకు వాక్సింగ్, థ్రెడింగ్ వంటి నొప్పితో కూడిన ప్రక్రియలను ఆశ్రయిస్తారు. అలాకాకుండా ఇంట్లో ఉన్నవాటితో సహజంగా ఆ అవాంచిత రోమాలను తొలగించుకోవచ్చు. ఎలాంటి నొప్పి ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు పైగా ఈజీగా బయటపడొచ్చు కూడా. ఎలాగో చూద్దాం!. సహజ పద్ధతిలో అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి.. ►పసుపు ఒక టేబుల్ స్పూన్, పాలు ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి. ఆ మిశ్రమాన్ని పై పెదవికి అప్లై చేసి ఆరిన తర్వాత మెత్తగారుద్దండి. వెంట్రుకలు పలచబడటమేగాక తగ్గడం స్టార్ట్ అవుతుంది. ►నిమ్మరసం, పంచాదార మిశ్రమాన్ని అప్లై చేసిన వెంట్రుకలు కుదుళ్లు వదులై త్వరగా పోయే అవకాశం ఉంటుంది. నిమ్మలో ఉండే యాసిడ్లు బ్లీచ్‌లా పనిచేస్తుంది. ఇక షుగర్ స్కిన్ ఎక్స్‌ఫోలియేషన్‌లో సహయపడుతుంది. పొడిచర్మం ఉన్నట్లయితే దీన్ని స్కిప్ చేయండి. ►గుడ్డు తెల్లసొన ఒక టేబుల్ స్పూన్, మొక్కజొన్నపిండి 1/2 టేబుల్ స్పూన్ తీసుకోండి ఈ మిశ్రమాన్ని పెదాలపై అప్లే చేస్తే ఈజీగా వెంట్రుకలు రాలిపోతాయి. ►సెనగపిండి, పాలు ఒక టేబుల్‌స్పూన్ చొప్పున తీసుకుని దాంట్లొ కొంచెం పసుపు వేసుకుని ఆ మిశ్రమాన్ని పెదాలపై రాసి సుమారు 15 నుంచి 20 నిమిషాలు ఉంచి ఆరిపోయాక వేడి నీటితో కడిగేయండి. ►పెరుగు కూడా చక్కటి ఫలితం ఇస్తుంది. పెరుగు, తేనె ఒక టేబుల్ స్పూన్ పసుపు చిటికెడు వేసి కలిపి ఈ మ్రిశ్రమాన్ని అప్లై చేసి 20 నిమిషాలు అలాగే ఉంచండి. ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి ఇక వెంట్రుకలు ఈజీగా రాలిపోతాయి. ఈ చిట్కాలను క్రమం తప్పకుండా చేస్తే గనుకు సుమారు 15 రోజుల్లోనే చక్కటి ఫలితం కనిపిస్తుంది. అలాగే అవాంఛిత రోమాలు ఎక్కువగా ఉన్నవారిని నెల లేదా రెండు నెలల్లో చక్కటి ఫలితం కనిపించి తీరుతుంది. (చదవండి: హెయిర్–డై వేసుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారా!) -
పెదవులు ఆరోగ్యంగా అందంగా కనిపించాలంటే ఇలా చేయండి!
ఏ సమస్యనైనా దాచడం సాధ్యమేమోగానీ... పెదవులకు వచ్చే సమస్యలు ఇట్టే బయటకు కనిపిస్తాయి. దాంతో అనారోగ్యం బయటపడటంతో పాటు అందం కూడా తగ్గుతుంది. ఫలితంగా సెల్ఫ్ ఎస్టీమ్ కూడా తగ్గుతుంది. అందుకే పెదవుల ఆరోగ్యం కాపాడుకోవాలంటే తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలివి... పెదవుల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే... అన్ని పోషకాలు ఉండే సమతుల ఆహారం తీసుకోవాలి. సిగరెట్లు తాగేవారిలో పెదవులు నల్లగా, బండగా మారవచ్చు. అందుకే స్మోకింగ్ అలవాటును వెంటనే మానేయాలి మహిళల్లో లిప్‌స్టిక్ వాడేవారు వాటి కొనుగోలు సమయంలో జాగ్రత్తగా ఉండాలి. అందులో ప్రొపైల్ గ్యాలేట్ అనే రసాయన పదార్థం ఉంటుంది. దాని వల్లనే ప్రధానంగా అలర్జీలు వస్తుంటాయి. లిప్‌స్టిక్ వాడే వారు అది తమకు సరిపడుతుందా లేదా అన్న విషయాన్ని తొలుత పరిశీలించుకుని, తమకు సరిపడుతుందని తేలిన తర్వాతే వాడటం మంచిది నిద్రకు ఉపక్రమించే ముందు లిప్స్టిస్ శుభ్రంగా కడుక్కోవాలి. ఆ టైమ్‌లో పెదవులపై పలుచగా నెయ్యి లేదా బాదం నూనె రాసుకోవచ్చు కొన్ని టూత్‌పేస్ట్‌ల వల్ల కూడా మనకు పెదవులపై దురద రావచ్చు. అలాంటప్పుడు వాటిని ఉపయోగించడం ఆపేయాలి నీరు ఎక్కువగా తాగుతుండాలి. పెదవులు తడి ఆరిపోకుండా చూసుకోవాలి. అయితే నాలుకతో తడపకూడదు. (చదవండి: మచ్చలు లేని ముఖ సౌందర్యం కోసం..బీట్రూట్తో ఇలా ట్రై చేయండి!) -
భార్యతో ఎఫైర్ పెట్టుకున్నాడని కానిస్టేబుల్ ముక్కు, చెవులు కోసిన భర్త!
ఇస్లామాబాద్: తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో ఓ పోలీసు కానిస్టేబుల్ చెవులు, ముక్కు, పెదాలు కోసేశాడు ఆమె భర్త. ఈ సంఘటన పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రం ఝాంగ్ జిల్లాలో ఆదివారం జరిగింది. తన భార్యను బ్లాక్మెయిల్ చేస్తూ అతనితో అక్రమ సంబంధాలు కొనసాగించాలని వేధిస్తున్నాడనే కారణంతో నిందితుడు ముహమ్మద్ లిఫ్తీకర్ తన స్నేహితులతో కలిసి పోలీస్ కానిస్టేబుల్ కాసిమ్ హయత్పై ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు పంజాబ్ పోలీసులు తెలిపారు. ‘తన భార్యతో సంబంధం పెట్టుకున్నాడని కానిస్టేబుల్ కాసిమ్ హతయ్పై లిఫ్తీకర్ అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న బాధితుడిని 12 మందితో కలిసి అపహరించాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి తీవ్రంగా హింసించారు. ఆ తర్వాత పదునైన ఆయుధంతో చెవులు, ముక్కు, పెదాలు కోసేశారు.’ అని పంజాబ్ పోలీసులు వెల్లడించారు. బాధిత కానిస్టేబుల్‌ను ఝాంగ్ జిల్లా ఆసుపత్రికి తరలించామని, ప్రస్తుతం అతడి ఆరోగ్యం విషమంగా ఉందన్నారు. గతనెల పోలీస్ కానిస్టేబుల్ హయత్పై పీపీసీలోని 354(మహిళపై దాడి), 384(దోపిడి), 292(అక్రమ సంబంధం)వంటి సెక్షన్ల కింద కేసు పెట్టాడు ఇఫ్తీకర్. తన కుమారుడిని చంపేస్తానని బెదిరించాడని, అతడి వద్దకు వెళ్లిన తన భార్యపై బలవంతంగా అత్యాచారం చేసి వీడియో తీశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆ వీడియోల ద్వారా వేధింపులకు గురి చేస్తున్నట్లు పేర్కొన్నాడు. ప్రస్తుతం పోలీస్ కానిస్టేబుల్ హయత్పై దాడి కేసులో ఇఫ్తీకర్తో పాటు అతడి అనుచరులను పట్టుకునే పనిలో పడ్డారు పంజాబ్ పోలీసులు. ఇదీ చదవండి: Nancy Pelosi Taiwan Tour: ‘తైవాన్‌లో అడుగుపెడితే మా సైన్యం చూస్తూ ఊరుకోదు’ -
Beauty Tips: బీట్రూట్ రసం, కార్న్ ఫ్లోర్.. గులాబీ రేకుల్లాంటి పెదాలు!
పెదాలు ఆకర్షణీయమైన గులాబీ రంగులో ఉండాలని చాలా మంది కోరుకుంటారు. అలాంటి వారు ఈ కింది చిట్కాలు పాటిస్తే సరి! బ్రష్‌తో ఇలా ►ఉదయాన్నే బ్రష్ చేసిన తరువాత.. బ్రష్ మీద కొద్దిగా తేనె వేసి రెండు పెదవులపైన గుండ్రంగా ఐదు నిమిషాలపాటు రుద్దాలి. ►ఇలా రోజూ చేయడం వల్ల పెదాలపై పేరుకుపోయిన మృతకణాలు తొలగిపోతాయి. ►పెదాలకు మర్ధన జరిగి రక్తప్రసరణ సక్రమంగా అందుతుంది. ►పెదవులు మృదువుగా మారతాయి. బీట్రూట్ రసంతో.. ►ఉదయం బ్రష్‌తో మర్ధన చేసాక, రాత్రి పడుకునేముందు మాయిశ్చరైజర్ తప్పనిసరిగా రాయాలి. ►ఇందుకోసం.. కొద్దిగా బీట్రూట్ రసాన్ని వేడి చేయాలి. ►అలా వేడిచేసిన రసంలో అరటీస్పూను కార్న్‌ప్లోర్ వేసి ఐదు నిమిషాలు కలియబెట్టి తర్వాత దించేయాలి. ►చల్లారిన తరువాత ఈ మిశ్రమంలో అరటీస్పూను గ్లిజరిన్, పావు టీస్పూను కొబ్బరి నూనె కలిపి ఎయిర్‌టైట్ కంటైనర్‌లో నిల్వచేయాలి. ►ఈ మిశ్రమం గట్టిపడిన తరువాత పెదవులకు రాసి మర్ధన చేసి పడుకోవాలి. ►ఉదయం నీటితో కడిగేయాలి. ►ఈ రెండింటిని ఒకదాని తరువాత ఒకటి క్రమం తప్పకుండా పాటిస్తే పెదవులు గులాబిరేకుల్లా కోమలంగా పింక్ కలర్లో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. చదవండి: Apple Cider Vinegar Benefits: యాపిల్ సైడర్ వెనిగర్‌తో లాభాలెన్నో! మచ్చలు, చుండ్రు మాయం! Potassium Deficiency Symptoms: పొటాషియం లోపిస్తే జరిగేది ఇదే! వీటిని తింటే మేలు.. -
దొండపండు లాంటి పెదవుల కోసం
మగువల అందంలో పెదవులు చాలా ప్రత్యేకం. చర్మం రంగు ఏదైనా కానీ.. పెదవుల అందం ఎరుపైతే ఆ ముఖంలో వచ్చే కళ అంతా ఇంతా కాదు. పెదవులు ఎర్రగా, దొండపండులా ఉంటే.. ఆ అందం ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అయితే ఎర్రదనం కోసం రంగు పూసుకోవచ్చు కానీ.. దొండపండు లాంటి పెదవుల కోసం ఏం చెయ్యగలం? మేకప్‌లో భాగంగా చాలా మంది తన పెదవులను హైలెట్ చేసుకోవడానికి..లిప్ గ్లాస్, లిప్ బామ్, లిప్‌స్టిక్.. ఇలా చాలానే వాడుతుంటారు. నిజానికి కొందరి పెదవులు సన్నగా, చిన్నగా, ముడుచుకున్నట్లుగా ఉంటాయి. మరికొందరివి పేలవంగా, కళాహీనంగా కనిపిస్తాయి. లిప్‌స్టిక్ వేసినా అంత అందంగా అనిపించవు. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. బొద్దుగా, ముద్దొచ్చేలా మారవు. అయితే చిత్రంలో కనిపిస్తున్న ‘లిప్ ప్లంపర్’ మేకప్ కిట్‌లో ఉంటే.. సన్నగా, పేలవంగా ఉండే పెదవులను కూడా దొండపండుల్లా మార్చుకోవచ్చు. అదెలా అంటే.. చూడటానికి ట్రిమర్లా ఉన్న ఈ గాడ్జెట్ ముందు భాగంలో (రెడ్ కలర్ కనిపిస్తున్న చోట) పెదవుల ఆకారంతో ఉన్న ఓ రంధ్రం ఉంటుంది. దానిలో పెదవులని ఉంచి మోడ్స్ మార్చుకోవాలి. దీన్ని ముప్ఫై సెకన్స్ పాటు ఉపయోగిస్తే చాలు. ఇందులో హై, మీడియం, లో అనే మూడు మోడ్స్‌తో పాటు.. యాపిల్ లిప్ ఎఫెక్ట్, ఫుల్ లిప్ ఎఫెక్ట్ అనే రెండు ఆప్షన్స్ ఉంటాయి. యాపిల్ లిప్ అంటే కింద పెదవి మధ్యలో నిలువుగా, అందంగా సన్నని గీత ఏర్పడుతుంది. ఫుల్ లిప్ అంటే కింద పెదవి మధ్యలో ఎలాంటి గీత ఏర్పడదు. దీన్ని చార్జింగ్ పెట్టుకుని ఉపయోగించుకోవచ్చు. పెదవుల్లో వచ్చిన ఆ మార్పు 4 నుంచి 10 గంటల వరకూ ఉంటుంది. దీని ధర 27 డాలర్లు. అంటే 1,930 రూపాయలు. భలే ఉంది కదూ! మరి ఇంకెందుకు ఆలస్యం మోడ్స్ మార్చి, ఎఫెక్ట్స్ ప్రయత్నించండి. -
పెదవులు మృదువుగా...
►పెదవులు పొడిబారుతుంటే... కీరదోస ముక్కతో ఐదు నిమిషాల సేపు పెదవుల మీద వలయాకారంగా మర్దన చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం చేస్తే మూడు లేదా నాలుగు రోజుల్లోనే పెదవులు మృదువుగా మారతాయి. ►టేబుల్ స్పూన్ తేనె, గుడ్డులోని తెల్లసొన కలిపి ముఖానికి ప్యాక్‌లా వేయాలి. పది నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. జిడ్డును తొలగించి, ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది ఈ ప్యాక్. ►టీ స్పూన్ పెరుగు, అర టీ స్పూన్ ఆరెంజ్ జ్యూస్ కలిపి ముఖానికి రాయాలి. వేళ్లతో కొద్దిగా మసాజ్ చేసి, ఐదు నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల మలినాలు తొలగి, చర్మం కాంతివంతం అవుతుంది. -
అధరాలంకరణం
పెదవులకు లిప్‌స్టిక్ వాడకం గురించి తెలుసు. చెవులకు, ముక్కుకు ఆభరణాల అలంకరించుకోవడం తెలుసు. కానీ, పెదవులకు కూడా ఆభరణం ధరించడం గురించి విన్నారా? కొత్తగా వచ్చిన ఈ ఆభరణం ఇప్పుడు యువతను ఆకట్టుకుంటోంది. ►జ్యువెల్రీ డిజైనర్లు ఫ్యాషన్ ప్రియుల అభిరుచులను దృష్టిలో పెట్టుకొని వినూత్న డిజైన్లను సృష్టిస్తున్నారు. వీటిలో భాగంగా వచ్చిందే లిప్ జ్యువెల్రీ. ►కొన్ని గిరిజన జాతుల్లో పెదవులను కూడా కుట్టి, ఆభరణాల అలంకరించుకోవడం ఉన్నది. దీనినే కొత్తగా ఇప్పుడు ఫ్యాషన్ జ్యువెల్రీలో సరికొత్తగా ప్రవేశపెట్టారు ఆభరణాల నిపుణులు. ►లిప్ జ్యువెల్రీని కింది పెదవికి తగిలించుకునేలా హుక్ ఉంటుంది. కింది పెదవికి హుక్ ఉన్న ఆభరణాన్ని తొడిగి, కొద్దిగా ప్రెస్ చేసి సెట్ చేయాలి. ► మేకప్ పూర్తయిన తర్వాతనే ఈ ఆభరణాన్ని ఉపయోగించాలి. ►పెదవులను కుట్టి, స్టడ్స్‌తో అలంకరించే ఆభరణాలు కూడా ఉన్నాయి. ►ఆన్లైన్ మార్కెట్లో అధరాలకు అందాన్ని పెంచే ఆభరణాలను కొనుగోలు చేయవచ్చు. డిజైన్, మెటల్‌ను బట్టి ధరలు ఉన్నాయి. -
పెదవి పై నలుపు రంగు వస్తుంటే?!
కొందరికి హార్మోన్లలో మార్పుల వల్ల పై పెదవి మీద వెంట్రుకలు వస్తుంటాయి. లేదంటే పెదవి పై చర్మం నలుపుగా అవుతుంటుంది. ఈ సమస్యకు విరుగుడు ఉంది. ►థ్రెడింగ్, వ్యాక్సింగ్ వంటివి మేలైన పద్ధతులు. వీటితోపాటు.. చర్మం నలుపు తగ్గి, సాధారణ రంగులోకి రావాలంటే.. టొమాటో గుజ్జు రాసి, ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. టొమాటో సహజసిద్ధమైన బ్లీచ్లాగ పనిచేసి అవాంఛిత రోమాలను, నలుపును తగ్గిస్తుంది. ►టీ స్పూన్ తేనెలో అర టీ స్పూన్ నిమ్మరసం కలిపి రాయాలి. పదిహేను నిమిషాలు ఉంచి, వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ►పసుపు, పాలు కలిపి చిక్కటి మిశ్రమం తయారు చేసుకోవాలి. దీనిని పెదవిపై నలుపుగా ఉన్న ప్రాంతంలో రాయాలి. ఆరిన తర్వాత కడిగేయాలి. ►కార్న్ ఫ్లోర్, గుడ్డులోని తెల్లసొన, పంచదార కలిపి చిక్కటి మిశ్రమం తయారుచేయాలి. ఈ మిశ్రమాన్ని రాసి, ఆరిన తర్వాత కడిగేయాలి. వారంలో రెండు సార్లు ఈ విధంగా చేస్తూ ఉంటే పై పెదమి మీద వచ్చే నలుపు, అవాంఛిత రోమాల సమస్య తగ్గుతుంది. ఇంటిప్స్ ►కూరగాయలు తరిగే కటింగ్ బోర్డ్ సరిగ్గా శుభ్రపడకపోతే వాసన వస్తుంటుంది. నిమ్మముక్కతో కటింగ్ బోర్డ్‌ను బాగా రుద్ది, అరగంటపాటు ఆరనివ్వాలి. తర్వాత కడిగేయాలి. ►వంటగదిని ఎంత శుభ్రం చేసినా దుర్వాసన వస్తూనే ఉందంటే సింకు దగ్గర పెట్టే చెత్తబుట్టను పట్టించుకోవడం లేదని అర్ధం. తగినన్ని నీళ్లలో బేకింగ్ సొడా కలిపి, ఆ మిశ్రమాన్ని చెత్తబుట్ట అడుగున పోయాలి. బ్రష్‌తో చెత్తబుట్ట లోపలి భాగాన్ని రుద్ది, గంటపాటు వదిలేయాలి. తర్వాత కడగాలి. మూడు టీ స్పూన్ల వెనీలా ఎసెన్స్ లీటర్ వేడి నీళ్లలో కలిపి చెత్తబుట్ట లోపలి భాగాన్ని శుభ్రపరచాలి. వారానికి ఒకసారైనా ఈ విధంగా చేస్తూ ఉంటే దుర్వాసన దూరం అవుతుంది. ►ఎంత శుభ్రపరిచినా సమస్యగా అనిపించేది రిఫ్రిజరేటర్. ఫ్రిజ్ షెల్ఫ్‌ల్లో పదార్థాలు పడిపోయి ఫంగస్ చేరుతుంటుంది. వారానికి ఒకసారైనా వెనిగర్ కలిపిన గోరువెచ్చని నీళ్లతో ఫ్రిజ్ లోపలి భాగాన్ని తుడవాలి. ఒక డబ్బాలో కొద్దిగా బేకింగ్ సోడా, బొగ్గు లేదా కాఫీ గింజలు వేసి ఫ్రిజ్ లోపల ఒక మూలన ఉంచాలి. -
బ్యూటిప్స్
మృదువైన చర్మం కోసం... ►పెదవులు పొడిబారడం, చిట్లడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. అలొవెరా జెల్ చర్మం పగుళ్లను నివారిస్తుంది. పొడిబారిన పెదవులకు అలొవెరా జెల్‌ని లిప్‌బామ్‌లా రాసుకోవాలి. లేదా రోజ్‌వాటర్‌లో గ్లిజరిన్ కలిపి, పడుకునేముందు పెదవులకు రాసుకోవాలి. పెదవుల చర్మం మృదువుగా మారుతుంది. ►పూలలోని పుప్పొడి, నల్ల నువ్వులు, పసుపుకొమ్ము, బార్లీ గింజలు సమపాళ్లలో తీసుకొని, పొడి చేసి, ఒక డబ్బాలో భద్రపరుచుకోవాలి. ఈ పొడిని కావల్సినంత తీసుకొని, తగినన్ని నీళ్లు కలిపి, ముఖానికి, శరీరానికి పట్టించాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం కాంతివంతం అవుతుంది. ►స్నానానికి ముందు టీ స్పూన్ బాదం నూనె, అర టీ స్పూన్ తేనె కలిపి ముఖానికి, చేతులకు రాసి, మసాజ్ చేయాలి. ఇలా చేస్తే పొడిబారే చర్మం మృదువుగా తయారవుతుంది. ►చర్మం పొడిబారకుండా ఉండాలంటే మృతకణాలను తొలగిస్తూ ఉండాలి. ఇందుకోసం.. కార్న్‌ఫ్లేక్స్‌ని పొడి చేసి, అందులో తేనె, పాలు కలిపి చర్మానికి పట్టించి మర్దనా చేయాలి. మృతకణాలు తొలగిపోయి చర్మం మృదువుగా మారుతుంది. -
ఏడుస్తున్నాడని పెదాలను ఫెవీక్విక్‌తో ...
పట్నా : కడుపున పుట్టిన బిడ్డ పట్ల కన్నతల్లే కర్కశంగా వ్యవహరించింది. సాధారణంగా పిల్లలు ఏడుస్తుంటే...ఆపమని అదిలిస్తాం....బెదిరిస్తాం. అప్పటికీ వాళ్లు ఆపకుంటే ’రెండంటిస్తాం’ అని చెబుతాం. అయితే ఆపకుండా ఏడుస్తున్న కొడుకు నోరు మూయించేందుకు .... ఓ తల్లి...ఏకంగా అతగాడి పెదాలకు ఫెవీక్విక్ (గమ్) రాసి, అంటించేసింది. అయితే ఈ విషయాన్ని గమనించిన తండ్రి... కొడుకును ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. ప్రస్తుతం చిన్నారికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు వెల్లడించడంతో తండ్రి ఊపిరి పీల్చుకున్నాడు. ఈ సంఘటన బిహార్‌లోని చాహాప్రాలో శనివారం చోటుచేసుకుంది. ఈ ఘటనపై బాధిత చిన్నారి తండ్రి మాట్లాడుతూ...’పనుండి బయటికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చాను. నేను వచ్చేసరికి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. బాబు ఏడవడం లేదు. అయితే అతడి నోటి నుంచి నురుగు వస్తోంది. దాంతో ఏం జరిగిందని నా శోభను భార్యను అడిగాను. ఆపకుండా ఒకటే ఏడుస్తున్నాడని, అందుకే కొడుకు ఏడుపు ఆపేందుకు గమ్ రాసినిట్లు చెప్పింది.’ అని పేర్కొన్నాడు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మేకప్‌తో మెరుగులు
వస్త్రధారణకు తగ్గట్టు మేకప్ ఉంటేనే అందంగా కనిపిస్తారు. అయితే, మేకప్ ఎలా ఉండాలంటే... ►సమకాలీన పరిస్థితులను అనుసరిస్తూ ఫ్యాషన్‌లోనూ, మేకప్‌లోనూ ట్రెండ్స్‌ను పరిశీలిస్తూ మేనికి నప్పే సౌందర్య ఉత్పత్తులను మాత్రమే ఎంచుకోవాలి. ►మేకప్‌లో ఫౌండేషన్‌ను ఎక్కువ ఉపయోగిస్తుంటారు. దీని వల్ల జిడ్డు చర్మానికి ఫౌండేషన్ మరింతగా అతుక్కుపోయి, సహజకాంతిని దూరం చేస్తుంది. ►పెదవులకు ముదురు రంగు లిప్‌స్టిక్‌లను వాడితే వయసు పైబడినట్టుగా చూపిస్తాయి. అసహజంగానూ కనిపిస్తాయి. తప్పనిసరై ముదురు రంగు లిప్‌స్టిక్ వాడితే, పైన లిప్‌గ్లాస్ సహజసిద్ధమైనది ఎంచుకోవాలి. ►మేకప్ అంటే పెదవులకు గాఢమైన ముదురు రంగు, కనురెప్పలకు మెరుపులద్దే షిమ్మర్‌ని ఉపయోగించాలనుకోకూడదు. ముఖంలో పెదవులు, కళ్లు, బుగ్గలు.. ఇలా ప్రతి భాగాన్ని అత్యంత జాగ్రత్తగా చిత్రకారుడు బొమ్మను గీసినంత అందంగా తీర్చిదిద్దాలి. ►ఎప్పుడైనా ముఖం సహజమైన మెరుపుతో కనిపించాలి. ఇందుకోసం అత్యంత తక్కువ మేకప్‌ను ఎంచుకోవాలి. -
ఇలా చేస్తే పెదవుల చర్మం పొట్టు రాలదు
మృదువైన పెదవుల కోసం వాతావరణంలో వచ్చిన మార్పు ఫలితానికి మొదట దర్పణంగా నిలిచేది పెదవులే. వేడికాని చలి కాని శరీరం మీద ప్రభావం చూపించి అది బయటకు కనిపించే లోపుగా మొదటి హెచ్చరికను జారీ చేస్తాయి పెదవులు. పొడిబారి, చర్మం పొట్టులా రాలుతుంటే ఇంట్లోనే చేసుకునే ఈ చిన్న ట్రీట్మెంట్లు పెద్ద ఫలితాన్నిస్తాయి.పెదవులు పొడిబారి చర్మం రాలుతుంటే రాత్రి పడుకునే ముందు ఒక స్పూన్ పాల మీగడలో రెండు చుక్కల పన్నీరు, రెండుచుక్కల నిమ్మరసం కలిపి బాగా రంగరించి పెదవులకు రాయాలి. ఇలా క్రమం తప్పకుండా ప్రతిరోజూ రాస్తుంటే వారం రోజుల్లోనే మంచి ఫలితం ఉంటుంది. రెండు చుక్కల తేనె తీసుకుని పెదవుల మీద రాసి కొద్దిసెకన్లపాటు అలాగే ఉంచాలి. తేనె మీద పెట్రోలియం జెల్లీని సున్నితంగా రాయాలి. ఇప్పుడు పెదవుల మీద ఒక వరుస తేనె, దాని మీద పెట్రోలియం జెల్లీ ఉంటుంది. ఇప్పుడు పది లేదా పదిహేను నిమిషాలపాటు అలాగే ఉంచాలి. చివరగా వేడినీటితో పెదవులను శుభ్రం చేయాలి. ఇలా ఐదురోజుల పాటు ప్రతిరోజూ క్రమం తప్పకుండా చేస్తుంటే పెదవుల మీద చర్మం ఎండిపోయి పొరలుగా లేవడం జరగదు. -
అలొవెరా.. టీ బ్యాగ్..
చలికాలం పెదవులు పొడిబారడం సహజంగా జరుగుతుంటుంది. ఈ సమస్యకు విరుగుడుగా.. కొబ్బరినూనె, తేనె కలిపి పెదవులపై రాసి, మసాజ్ చేయాలి. రోజులో 4 –5 సార్లు ఈ విధంగా చేస్తూ ఉంటే పెదవులు పొడిబారడం, పగుళ్ల సమస్యలు తగ్గి, మృదువుగా అవుతాయి. అలొవెరా జెల్ చర్మం పగుళ్లను నివారిస్తుంది. రాత్రి పడుకునే ముందు పొడిబారిన పెదవులకు అలొవెరా జెల్‌ని రాయాలి. లేదా రోజ్‌వాటర్‌లో గ్లిజరిన్ కలిపి, పడుకునేముందు పెదవులకు రాసుకోవాలి. రోజూ ఇలా చేస్తూ ఉంటే పెదవుల చర్మం మృదువుగా అవుతుంది. గోరువెచ్చని నీటిలో టీ బ్యాగ్ ముంచి, పిండి, ఆ బ్యాగ్‌ను పెదవులపై మూడు, నాలుగు నిమిషాల సేపు ఉంచాలి. ఇలా చేయడం వల్ల పెదవుల చర్మంపై తేమ స్థాయి పెరుగుతుంది. దీనివల్ల పెదవులు పొడిబారకుండా ఉంటాయి. ఈ కాలం మృతకణాల సంఖ్య అధికంగానే ఉంటుంది. స్నానం చేసిన తర్వాత పొడి టవల్ని పెదవులపై ఒత్తిపెట్టి, మృదువుగా రుద్దాలి. దీనివల్ల మృతకణాలు సులువుగా తొలగిపోతాయి. తర్వాత లిప్ బామ్ రాసుకోవాలి. -
గులాబీ పెదవుల కోసం...
♦ కొన్ని గులాబీ రెక్కలు, టీ స్పూన్ పాలు, టీ స్పూన్ వెన్న కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునేముందు పెదవుల పై అప్లై చేయాలి. తరచుగా ఈ విధంగా చేస్తే పెదవులు గులాబీరేకల్లా సుతిమెత్తగా తయరవుతాయి. ♦ అర టీ స్పూన్ నిమ్మరసంలో మూడు చుక్కల తేనె, కొద్దిగా గ్లిజరిన్ కలపాలి. ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకని పెదవులపై మసాజ్ చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే పెదవులు పగడాల్లా కాంతులీనుతాయి. గంధంపొడి మాస్క్ టొమాటో రసం – కొద్దిగా, కీరారసం – పావు టీ స్పూన్ నిమ్మర సం – పావు టీ స్పూన్ గంధం పొడి – రెండు టీ స్పూన్లు తయారి: గంధం పొడిలో టొమాటో రసం, నిమ్మరసం, కీరారసం కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ పేస్ట్‌ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కడిగేస్తే చర్మం తాజాగా కాంతులీనుతుంది. -
బ్యూటిప్స్
బాదం నూనె, ఆముదం రెండూకొద్ది కొద్దిగా తీసుకుని మిక్స్ చేసి రాత్రి పడుకునే ముందు పెదవులపై రాసుకోవాలి. దీని వల్ల పెదవులు మృదువుగా తయారవుతాయి.కంటి చుట్టూ నల్లని వలయాలు ఉండి చర్మం ఉబ్బెత్తుగా అవుతుంటే... కొంచెం కొబ్బరినూనె, కొంచెం ఆముదం తీసుకుని రెండింటినీ కలిపి కంటి చుట్టూ వేళ్ళ సహాయంతో వృత్తాకారంలో తిప్పుతూ నెమ్మదిగా మసాజ్ చేసుకోవాలి.ఆయిల్ చర్మంలో ఇంకేంత వరకూ ఇలా చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది.తేనెలో కొంచెం పెరుగు కలిపి తలస్నానం చేసిన తర్వాత తడిగా ఉన్న కేశాల చివర్లకు పట్టించాలి. 5 నిమిషాలపాటు ఉంచుకుని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే కురులు చాలా మృదువుగా అవుతాయి. ఈ సహజ సిద్ధమైన కండిషనర్ను స్కాల్ప్‌కు తగలనివ్వకుండా కురులకు మాత్రమే రాయాలి.అర కప్పు పెరుగులో అర టీ స్పూన్ వెనిగర్ కలిపి చేతులకి, కాళ్లకి మసాజ్చేస్తే మృదువవుతాయి.∙ఆరు టీ స్పూన్ల పెట్రోలియమ్జెల్లీలో రెండు టీ స్పూన్ల గ్లిజరిన్, రెండు టీ స్పూన్ల నిమ్మరసాన్ని కలపాలి. ఈ మిశ్రమాన్ని వారానికి రెండుసార్లు కాళ్ళకి, చేతులకి మాయిశ్చరైజర్‌లా ఉపయోగిస్తే మంచిఫలితం ఉంటుంది. -
మృదువైన పెదవుల కోసం!
వాతావరణం లోని మార్పులు, అనారోగ్యం వల్ల పెదవులు పొడిబారి, మృదుత్వాన్ని కోల్పోతాయి. లిప్‌బామ్స్ ఈ సమస్యకు సరైన పరిష్కారాన్ని ఇవ్వగలవు. లిప్‌బామ్స్ సహజ సిద్ధమైన తేనె, కొబ్బరినూనె, ఆలివ్ ఆయిల్.. వంటివి కలిపి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ∙గాజు గిన్నెలో టేబుల్‌స్పూన్ పెట్రోలియమ్ జెల్లీ వేసి అవెన్‌లో 30 సెకన్లు వేడి చేయాలి. లేదంటే వేడినీటిలో గాజు గిన్నెను ఉంచి పెట్రోలియమ్ జెల్లీని కరిగించాలి. దీంట్లో టీస్పూన్ తేనె కలపాలి. బాగా కలిపిన ఈ మిశ్రమాన్ని ప్లాస్టిక్ డబ్బాలో వేసి ఫ్రిజ్‌లో పది నిమిషాలు ఉంచాలి. తర్వాత అదే డబ్బాను ఫ్రీజర్‌లో ఒక రోజంతా ఉంచి, తర్వాత లిప్‌బామ్‌గా వాడుకోవచ్చు. ∙పెద్ద గిన్నెలో నీళ్లు తీసుకొని, వేడిచేయాలి. దీంట్లో మరో చిన్న గిన్నె అమర్చి టేబుల్ స్పూన్ మైనం, కొబ్బరి నూనె వేసి కలపాలి. మైనం పూర్తిగా కరిగాక దాంట్లో టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలపాలి. మిశ్రమం వేడెక్కాక గిన్నె తీసి, దాంట్లో టీ స్పూన్ తేనె, 8 చుక్కల నిమ్మనూనె కలపాలి. బాగా చిక్కగా ఉన్న ఈ మిశ్రమం చిన్న డబ్బాలోకి తీసుకుని, పూర్తిగా చల్లారాక పెదవులకు రాసుకోవాలి. -
పెదవుల మృదుత్వానికి...
కొంతమందికి తరచుగా పెదవులు చిట్లడం,. పై పొర లేచిపోయి పొట్టు రాలడం జరుగుతుంటుంది. ఇలా ఎందుకు అవుతుందంటే... శరీరంలో వచ్చిన మార్పులను, వాతావరణంలోని మార్పులను పెదవులు ఇట్టే ప్రతిబింబిస్తాయి. ఇందుకు దారితీసే కారణాలు... ♦ కాఫీలు ఎక్కువగా తాగడం, ఆల్కహాలు తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. దీనితో పెదవులు పొడిబారుతాయి. ♦ వాతావరణంలో మార్పు వచ్చినప్పుడు ఆ మార్పును పెదవులు భరించలేవు. ఎక్కువ చలిని, ఎక్కువ వేడిని తట్టుకోలేక తేమ కోల్పోయి పొడిబారతాయి. ♦ పని ఎక్కువైనందువల్ల వచ్చే ఒత్తిడికి శరీర వ్యవస్థలో ఒడిదుడుకులు వస్తాయి. ఆ ప్రభావం మొదట కనిపించేది పెదవులలోనే. ♦ లిప్‌స్టిక్‌ల వల్ల ఇరిటేషన్ వచ్చినా కూడా పెదవులు పొడిబారి, చిట్లుతాయి. ♦ ఏదైనా రుగ్మతకు మందులు వేసుకున్నప్పుడు శరీరం తేమను కోల్పోయినట్లయితే కూడా బయటకు కనిపించే సమస్యల్లో ఇదే మొదటిది. పెదవులకు సాంత్వన చేకూరాలంటే... ఐదు మిల్లీ లీటర్ల గ్లిజరిన్‌లో అంతే మోతాదు నిమ్మరసాన్ని, పన్నీటిని కలపాలి. ఈ మిశ్రమాన్ని ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి పెదవులకు పట్టించాలి. దానంతట అది ఆరే వరకు అలాగే ఉంచాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో పెట్టుకుని మూడు రోజుల వరకు వాడవచ్చు. మరీ ఎక్కువగా పొడిబారినట్లనిపిస్తే రెండు గంటలకొకసారి కాని ఉదయం రెండుసార్లు, సాయంత్రం రెండుసార్లు కాని పట్టించవచ్చు. ♦ ఇవేవీ వీలుకానప్పుడు నీటితోనే మర్దన చేస్తే తాత్కాలికంగా ఉపశమనం కలుగుతుంది. చలికి పెదవులు చిట్లినప్పుడు వేడినీటిలో దూది ముంచి పెదవులకు పట్టించాలి. ఎండలకు చిట్లినట్లయితే దూదితో చల్లటి నీటిని పట్టించాలి. వీలైతే నీటిలోనే వాజలిన్, తేనె ఏదో ఒకటి కొద్దిగా వేసుకోవచ్చు. ♦ లిప్‌స్టిక్ కొనేటప్పుడు అందులో వాడిన పదార్థాల జాబితాను ఒకసారి సరిచూసుకోవడం తప్పని సరి. బ్రాండెడ్ కంపెనీలు తప్పనిసరిగా ఈ లిస్ట్‌ను ప్రచురిస్తాయి. మాయిశ్చరైజర్ ఉన్న లిప్‌స్టిక్‌నే ఎంచుకోవాలి. సాధారణంగా లిప్‌స్టిక్‌లలో గ్లిజరిన్‌తోపాటు యాంటిసెప్టిక్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. ఒకసారి నిర్ధారణ చేసుకోవడం మంచిది. -
బ్యూటిప్స్
కొబ్బరి నూనె, బాదం నూనె సమపాళ్లలో తీసుకుని పొడిబారిన పెదవులకు రాస్తే తేమగా తయారౌతాయి.రెండు కుంకుమ పువ్వు రెక్కల్ని పెరుగుతో కలిపి, రోజుకు రెండు మూడు సార్లు పెదవులకు రాసుకుంటే మంచి రంగులోకి మారతాయి.వారానికి ఒకసారి టూత్‌బ్రష్‌తో పెదవులపై రుద్దితే మృత చర్మం తొలగిపోతుంది. -
సున్నితమైన పెదవుల కోసం
బ్యూటిప్స్ పెదవులు పొడిబారి, పగిలి నిర్జీవంగా కనిపిస్తాయి. ఒక్కోసారి పెదవులపై డెడ్ స్కిన్ ఏర్పడుతుంది. దీనిని బలవంతంగా లాగితే రక్తం వస్తుంది. కాబట్టి ఏ సీజన్ అయినా పెదవులు సున్నితంగా ఉండేలా తగినంత శ్రద్ధ తీసుకోవాలి. ఇంట్లోనే దొరికే పదార్థాలతో కొన్ని చిట్కాలు మీ కోసం.... పుదీనా లేదా కొత్తిమీర రసాన్ని పెదవులకు రాసుకుని ఐదు నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. కొన్ని గులాబీ రేకులను పేస్ట్ చేసి అందులో గ్లిజరిన్ చుక్కలు వేసి రాత్రి పడుకునేటప్పుడు పెదవులకు రాసుకుని ఉదయం కడుక్కోవాలి. ఉదయం లేవగానే పెదవులకు తేనె లేదా పాలమీగడ రాసుకుని పావుగంట సేపు ఉంచుకుని కడిగేయాలి. ఇలా నెలరోజుల పాటు చేస్తే పెదవులు సున్నితంగా ఉండడంతో పాటు గులాబీరంగులోకి వస్తాయి. రాత్రి పడుకునేటప్పుడు కాటన్‌తో పెదవులను తుడుచుకుని కొబ్బరినూనె లేదా వెన్నను అప్లై చేసి రెండుమూడు నిమిషాల పాటు మర్దన చేయాలి. -
కోమల సౌందర్యం
⇔ లిప్‌స్టిక్ వేసే ముందు పెదవులకు సన్‌స్క్రీన్ లోషన్ రాయాలి. పెదవుల మీద చర్మం మరీ సున్నితంగా ఉంటుంది. మిగతా శరీరంతో పోలిస్తే పెదవుల మీద సూర్యకిరణాల తాకిడి మరీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మాత్రపు రక్షణ తప్పనిసరి. ⇔ పెదవులు పొడిబారి చర్మం పొట్టులా రాలే సమస్యతో బాధపడే వాళ్లు లిప్‌కలర్ వేసుకోవాలంటే ముందుగా పెదవులకు లిప్‌బామ్ కాని, కోల్డ్‌క్రీమ్ కాని రాయాలి. ⇔ పెదవుల మీద పొడిబారిన చర్మాన్ని చాలా సున్నితంగా తొలగించాలి. వ్యాక్సింగ్, పళ్లతో కొరకడం వంటివి... ఏది చేసినా సమస్య జటిలమవుతుంది. లిప్‌స్టిక్ వేసుకునే అలవాటున్న వాళ్లు మరింత జాగ్రత్తగా ఉండాలి. మెత్తటి టవల్‌తో పెదవుల మీద మెల్లగా రుద్దుతూ పొడిబారిన చర్మాన్ని వదిలించాలి. ఆ తర్వాత కొద్దిగా కోల్డ్‌క్రీమ్ తీసుకుని పలుచగా రాసి ఆ పైన లిప్‌స్టిక్ వేయాలి. ⇔ పెదవులు మెరవాలంటే లిప్‌స్టిక్ వేసిన తర్వాత లిప్‌గ్లాస్ వేయాలి. పెదవులు సహజంగా ఉన్న రంగులోనే మెరుస్తూ కనిపించాలంటే లిప్‌గ్లాస్ మాత్రమే వాడాలి. ⇔ నిద్రపోయే ముందు లిప్‌స్టిక్ తొలగించడాన్ని ఎట్టి పరిస్థితిలోనూ నిర్లక్ష్యం చేయరాదు. రాత్రంతా లిప్‌స్టిక్ ఉన్నట్లయితే పెదవులు నల్లబడడమే కాక ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. -
పెదవులకు కొత్తిమీర!
బ్యూటిప్స్ పెదవులు నల్లగా ఉన్నాయని బాధపడేవారు ప్రతి రోజూ కొత్తిమీర రసాన్ని పెదవులకు రాసుకుంటే సరి. కొద్ది రోజుల్లోనే పెదవులపై ఉన్న నలుపుదనం పోయి ఎర్రగా మారుతాయి. అలాగే ఎప్పటికప్పుడు పెదవులు పొడిబారకుండా ఆర్గానిక్ లిప్‌బామ్ రాసుకుంటూ ఉంటే మార్పును వెంటనే చూడొచ్చు. చుండ్రుతో బాధపడేవారు వారానికి రెండుసార్లు ఒక స్పూను ఉల్లిపాయ రసాన్ని, రెండు స్పూన్ల కొబ్బరినూనెతో కలిపి మాడుకు రాసుకోవాలి. ఓ అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఉల్లిపాయల్లో ఉండే సల్ఫర్ జుట్టును ఒత్తుగా పెరిగేలా కూడా చేస్తుంది. టేబుల్ స్పూన్ ఎండిన చేమంతుల పొడిలో కోకా బటర్ టేబుల్ స్పూన్, వెన్న రెండు టేబుల్ స్పూన్లు, అప్రికాట్ ఆయిల్ రెండు టీ స్పూన్లు కలపాలి. ఈ మిశ్రమాన్ని పాన్‌లో వేసి ఉడికించి, చల్లారాక జార్లో భద్రపరచాలి. రాత్రి పడుకునేముందు చేతులను శుభ్రపరుచుకొని ఈ మిశ్రమాన్ని రాసుకోవాలి. ఎండవల్ల నలుపుగా మారిన చేతులపై చర్మం సహజ రంగులోకి మారుతుంది. చర్మం మృదువుగా తయారవుతుంది. -
బ్యూటిప్స్
► పెదవులు పొడిబారి ఇరఇరలాడుతుంటే... రెండు చెంచాల వెన్నలో, ఒక చెంచా తేనె కలిపి, ఆ మిశ్రమంతో పెదవుల మీద మృదువుగా మర్దనా చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే... పెదవుల్లో తేమ పెరుగుతుంది. ► పచ్చి పసుపులో నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కడిగేయాలి. ఇది సహజసిద్ధ్దమైన బ్లీచ్ మాదిరిగా ఉపయోగపడుతుంది. ►కమలాపండు తొక్కలను ఎండబెట్టి పొడి చేసి అందులో పెరుగు కలిపి ముఖానికి ప్యాక్ వేసుకుంటే ముఖంమీద మచ్చలు పోతాయి. ►పుదీనా ఆకులను రుబ్బి నీళ్లు కలిపి మాడుకు పట్టించి కొంతసేపటి తరువాత తలస్నానం చేస్తే చుండ్రు సమస్య ఉండదు. ►గుడ్డు తెల్లసొనను తలకు పట్టించి... గంట తరువాత స్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది. -
బ్యూటిప్స్
పెదవులు పొడిబారకుండా ఉండాలంటే చిటికెడు వెన్నలో అయిదారు చుక్కల తేనె కలిపి, రాత్రి పడుకోబోయే ముందు రాసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే పెదవులు మృదువుగా ఉంటాయి.వేడినీళ్లలో వేపాకులు వేసి స్నానం చేస్తే దురద తగ్గుతుంది. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చర్మం నిగనిగలాడుతుంది. టీ స్పూన్ కీరదోసకాయ రసంలో చిటికెడుచందనం కలిపి ముఖానికి పట్టించి, 20 నిమిషాల తరువాత కడిగితే చర్మం నునుపు తేలుతుంది.టీ స్పూన్ తేనెలో కోడిగుడ్డులోని తెల్ల సొన కలిపి, ముఖానికి, మెడకి పట్టించి 20 నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో కడిగితే... జిడ్డు తగ్గి చర్మం అందంగా ఉంటుంది. -
బ్యూటిప్స్
కొన్ని గులాబి రేకులను గంటపాటు పాలలో నానబెట్టాలి. తర్వాత పాలలోంచి తీసేసి, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీనిలో కొద్దిగా పాలక్రీమ్, తేనె కలిపి పెదవులకు పూసి... అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. చిట్లిపోయి ఇబ్బంది పెడుతోన్న పెదవులు మళ్లీ అందంగా, ఆరోగ్యంగా అవ్వడానికి ఇది మంచి చిట్కా. {దాక్షపళ్లను మెత్తగా చిదిమి, కొద్దిగా తేనె కలపాలి. ఈ మిశ్రమంతో పెదవులను రుద్దుకుంటే పగుళ్లు పోయి, పెదవులు మృదువుగా తయారవుతాయి. బీట్రూట్ని మెత్తని పేస్ట్‌లా చేయాలి. ఇందులో కాసింత క్రీమ్, తేనె, రోజ్‌వాటర్ కలిపి పెదవులకు రాయాలి. గంట తర్వాత కడిగేసి, మాయిశ్చరయిజింగ్ క్రీమ్ రాయాలి. అప్పుడప్పుడూ ఇలా చేస్తే... పెదవులు పొడిబారడం, చిట్లటం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. నిమ్మకాయ తొక్కను ఎండబెట్టి పొడి చేయాలి. దీనిలో రోజ్‌వాటర్, తేనె కలిపి... ఆ మిశ్రమంతో పెదవులను బాగా రుద్దాలి. రోజూ ఇలా చేస్తే వారం రోజుల్లో చిట్లిన పెదవులు మామూలుగా అయిపోతాయి. -
పెదవులు గులాబీ రంగు
బ్యూటిప్స్ పెదవులు పగిలి బాధ పెడుతుంటే... నేతిని కొద్దిగా వేడి చేసి, పెదవులపై మృదువుగా పూయాలి. ఇరవై నిమిషాల పాటు అలానే ఉంచి, గోరువెచ్చని నీటితో కడగాలి. రోజూ ఇలా చేస్తే వారం తిరిగేసరికల్లా సమస్య తగ్గిపోతుంది. స్ట్రాబెర్రీని పేస్ట్‌లా చేసి, అందులో కాస్త పాల క్రీమ్ వేసి కలపాలి. దీన్ని పడుకోబోయేముందు పెదవులకు అప్లై చేసి, ఉదయాన్నే శుభ్రంగా కడుక్కోవాలి. నల్లని పెదవులు ఉన్నవారు తరచూ ఇలా చేస్తూ ఉంటే... నలుపు పోయి, పెదవులు గులాబీ రంగులోకి మారతాయి. -
అందమైన అధరాల కోసం...
బ్యూటిప్స్ ♦ ముఖానికి నవ్వు ఎంత అందాన్నిస్తుందో... పెదవుల నాజూకుదనం ఆ నవ్వుకు మరింత అందాన్నిస్తుంది. కొందరి ముఖం చక్కని ఛాయతో ఉన్నా... పెదవులు మాత్రం నల్లగా ఉంటాయి. కొందరికి వాతావరణాన్ని బట్టి నల్లబడి ఇబ్బంది పెడుతుంటాయి. అలాంటప్పుడు ఈ చిట్కాలు పాటిస్తే సరి... ♦ కొన్ని గులాబి రేకులను మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. దీనిలో కొంచెం తేనె, పాలమీగడ, వెన్న వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంతో వారానికి రెండుసార్లు పెదవులను మసాజ్ చేస్తే నలుపు పోతుంది. ♦ గులాబి రేకులను పాలలో వేసి నానబెట్టాలి. తర్వాత పేస్ట్ చేసి తేనె, చిటికెడు కుంకుమపువ్వు కలపాలి. దీన్ని పెదవులకు రాసి, పదిహేను నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ♦ క్యారెట్ రసాన్ని, బీట్రూట్ రసాన్ని సమపాళ్లలో కలిపి దానితో పెదవులపై సున్నితంగా పది నిమిషాల పాటు రుద్దాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. రోజుకోసారి ఇలా చేస్తే రెండు వారాల్లో ఫలితం కనిపిస్తుంది. ♦ దానిమ్మగింజల్ని పేస్ట్ చేసి... అందులో కొద్దిగా పాల మీగడ, రోజ్ వాటర్ వేసి కలపాలి. దీనితో పెదవులను బాగా రుద్ది, ఆరిన తర్వాత కడిగేయాలి. రోజూ ఇలా చేస్తే నలుపు పోయి పెదవులు మంచి రంగులోకి మారతాయి. ♦ చెంచాడు స్ట్రాబెర్రీ జ్యూస్‌లో రెండు చెంచాల పెట్రోలియం జెల్లీ వేసి రోజూ రుద్దుకున్నా ఫలితం ఉంటుంది. -
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోలేదట!
హండ్రెడ్ పర్సంట్ అందంగా ఎవరూ ఉండరు. ఏదో చిన్న లోపం అయినా ఉంటుంది. అలాంటి లోపాలను సరిచేయడానికి ప్లాస్టిక్ సర్జరీ ఉంటుంది. అనుష్కా శర్మ తన పెదాలకు అదే చేయించారనే టాక్ విస్తృతంగా ప్రచారమవుతోంది. ఆ మధ్య ‘బాంబే వెల్వెట్’ సినిమా కోసం ఆమె తన లిప్స్‌కు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారని చెప్పుకుంటున్నారు. తీరా అది వికటించడంతో ఆమె పెదాలు మునుపటికన్నా అందవిహీనంగా తయారయ్యాయని మాట్లాడుకుంటున్నారు. కొన్నాళ్లుగా ఈ వార్తలకు స్పందించని అనుష్క సడన్‌గా ఓ కార్యక్రమంలో ఈ ప్రశ్న అడిగేసరికి అగ్గి మీద గుగ్గిలమయ్యారు. ‘‘నా పెదవులకు కత్తెర పడాల్సిన పని లేదు. ‘బాంబే వెల్వెట్’ సినిమా కోసం ఓ స్పెషల్ టూల్ సాయంతో నా పెదవులకు మేకప్ వేశారంతే. అంతకు మించి ఎటువంటి సర్జరీ జరగలేదు. ఇలాంటి విషయాలు మళ్లీ నా దగ్గర ఎత్తకండి’’ అని కాస్త ఘాటుగానే స్పందించారు అనుష్క. అందాల తార ఇలా విరుచుకుపడటంతో అడిగినవాళ్లు సెలైంట్ అయిపోయారట. -
ప్లాస్టిక్ సర్జరీపై నోరు విప్పిన అనుష్క!
బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ప్లాస్టిక్ సర్జరీ విషయంపై మరోసారి సీరియస్ అయింది. ఏ విషయాన్ని దాచాల్సిన అవసరం తనకు లేదని, ఇక ఈ విషయంపై వదంతులకు ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేయాలని అందరికీ వార్నింగ్ ఇచ్చింది. తాను అనుకున్న విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లుగా బయటకు చెప్పే హీరోయిన్లలో అనుష్క శర్మ ఒకరని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం సుల్తాన్ మూవీ షూటింగ్ తో ఆమె బిజీబిజీగా ఉంటోంది. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుష్క కథానాయిక. అయితే 'బాంబే వెల్వేట్' మూవీ సమయంలో తలెత్తిన వివాదం ఆమెను వెంటాడుతూనే ఉంది. ఫ్యాన్స్ కు నిజాన్ని చెప్పాలని భావించానని అందుకే ఈ విషయంపై మాట్లాడుతున్నట్లు పేర్కొంది. 'అందరిలాగే నేను మనిషినే. నాలో కొన్ని లోపాలుంటాయి. ఎప్పుడూ ఎలాంటి ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోలేదు. ముఖ్యంగా చెప్పాలంటే నా పెదవులపై కత్తికి పని పెట్టించ లేదు' అంటూ వివరణ అనుష్క అంటోంది. బాంబే వెల్వేట్ మూవీ కోసం పెదవులకు సర్జరీ చేయించుకుని మరింత అందంగా తయారైందని కథనాలు వచ్చాయి. అయితే మొదట్లో తనకు మేకప్ గురించి అంతగా అవగాహన లేదని, ఆ తర్వాత తాను ఈ విషయంలో ఎంతో మెరుగయ్యానని చెప్పింది. ఆ మూవీ సమయంలో తాను వాడే మేకప్ కిట్ తో పాటు అందంగా కనిపించడం కోసం ఎన్నో కిటుకులు నేర్చుకున్నానని అసలు విషయాన్ని బయటపెట్టింది. ఈ విషయంపై అంతగా స్పష్టతలేని వాళ్లు, అనవసరంగా లేనిపోని వార్తలు ప్రచారం చేశారని అనుష్క శర్మ చెప్పుకొచ్చింది. -
చలికాలం... మృదువైన చర్మం కోసం...
బ్యూటిప్స్ పెదవులు పొడిబారడం, చిట్లడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. అలొవెరా జెల్ చర్మం పగుళ్లను నివారిస్తుంది. పొడిబారిన పెదవులకు అలొవెరా జెల్‌ని లిప్‌బామ్‌లా రాసుకోవాలి. లేదా రోజ్‌వాటర్ లో గ్లిజరిన్ కలిపి, పడుకునేముందు పెదవులకు రాసుకోవాలి. పెదవుల చర్మం మృదువుగా మారుతుంది. పూలలోని పుప్పొడి, నల్ల నువ్వులు, పసుపుకొమ్ము, బార్లీ గింజలు సమపాళ్లలో తీసుకొని, పొడి చేసి, ఒక డబ్బాలో భద్రపరుచుకోవాలి. ఈ పొడిని కావల్సినంత తీసుకొని, తగినన్ని నీళ్లు కలిపి, ముఖానికి, శరీరానికి పట్టించాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల చలికాలం చర్మం కాంతివంతం అవుతుంది. స్నానానికి ముందు టీ స్పూన్ బాదం నూనె, అర టీ స్పూన్ తేనె కలిపి ముఖానికి, చేతులకు రాసి, మసాజ్ చేయాలి. ఇలా చేస్తే చలికాలంలో పొడిబారే చర్మం మృదువుగా తయారవుతుంది. ఆలివ్ ఆయిల్, అలొవెరా జెల్ సమపాళ్లలో తీసుకొని అందులో కొద్దిగా వెనిలా ఎసెన్స్ కలపాలి. ఈ మిశ్రమాన్ని చలికాలం మాయిశ్చరైజర్‌గా ఉపయోగించవచ్చు. చర్మం పొడిబారకుండా ఉండాలంటే మృతకణాలను తొలగిస్తూ ఉండాలి. ఇందుకోసం..కార్న్‌ఫ్లేక్స్‌ని పొడి చేసి, అందులో తేనె, పాలు కలిపి చర్మానికి పట్టించి మర్దనా చేయాలి. మృతకణాలు తొలగిపోయి చర్మం మృదువుగా మారుతుంది. -
బ్యూటిప్స్
పెదవులు పొడిబారకుండా, మృదువుగా ఉండాలంటే తరచూ లిప్ బామ్ రాస్తుండటం ఎంతో మేలు. అలా అని మార్కెట్లో దొరికే లిప్‌బామ్ వాడితే ఒక్కోసారి సైడ్ఎఫెక్ట్స్ బాధ కూడా తప్పదు. అలా కాకుండా పెదాలు అందంతో పాటు ఆరోగ్యంగానూ ఉండాలంటే హోమ్మేడ్ లిప్‌బామ్ వాడితే మంచిది. దాని తయారీ విధానం చాలా సింపుల్. ఒక టేబుల్ స్పూన్ క్రాన్బెర్రీ జూస్‌లో రెండు టేబుల్ స్పూన్ల పెట్రోలియం జెల్లీ (వ్యాజెలిన్) వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ఓ చిన్న బాటిల్లో నింపి డీప్ ఫ్రిజ్‌లో రెండు రోజుల పాటు ఉంచాలి. అంతే! ఆరోగ్యకరమైన లిప్‌బామ్ రెడీ. వర్షాకాలంలో రోడ్లపై ఉండే నీళ్లలో నడిచినా, ఇంట్లో ఎక్కువగా నీళ్లలో ఉన్నా చాలామంది మహిళలకు పాదాలు పగులుతుంటాయి. కొంతమందికి ఆ పగుళ్ల నుంచి రక్తం కూడా వస్తుంటుంది. అలాంటి వారు రోజూ రాత్రి నిద్రపోయే ముందు పాదాలకు ప్యాక్ వేసుకోవాలి. దానికోసం కరిగించిన ప్యారాఫిన్ వ్యాక్స్‌లో కొద్దిగా ఆవనూనె కలిపి ప్యాక్ వేసుకోవాలి. ఉదయం లేచిన వెంటనే గోరువెచ్చని నీటితో మర్దన చేసుకుంటూ పాదాలను కడిగేసుకోవాలి. ఇలా 10-15 రోజులు రెగ్యులర్‌గా చేస్తే పగుళ్లు లేని మృదువైన పాదాలు మీ సొంతం. -
ముడతల్ని మడిచేయండి
బ్యూటిప్స్ పెదవులు అందంగా ఉండాలని ఏ అమ్మాయికైనా ఉంటుంది. అందుకు ఒక్క లిప్‌స్టిక్ రాసుకుంటేనే సరి కాదు కదా. వాటిని ఆరోగ్యంగా ఉంచుకోవడం కూడా ముఖ్యమే. కాబట్టి పెదాలకు లిప్‌స్టిక్, లిప్‌బామ్ లాంటివి రాసుకునే ముందు స్క్రబ్ చేసుకోవడం మంచిది. అందుకో మంచి ఇంటి చిట్కా. మెత్తని కాఫీ పౌడర్‌లో కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. దాన్ని పెదాలకు మర్దన చేసుకుంటూ రాసుకోవాలి. ఓ 10 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడుక్కొని వెంటనే కొబ్బరి నూనె లేదా ఏదైనా నేచురల్ లిప్‌బామ్ రాసుకోవాలి. దాంతో పెదాలు మృదువుగా తయారవుతాయి. చిన్న వయసులోనే ముఖంపై ముడతలు రావడం ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతోంది. ఆ ముడతలు రావడానికి అనేక కారణాలున్నాయి. మానసిక ఒత్తిడి, ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం, పొడి చర్మం ఇలా ఎన్నో ఉన్నాయి. వీటి నుంచి సత్వర ఉపశమనం పొందాలంటే రోజూ రాత్రి పడుకునే ముందు ముఖానికి నెయ్యి, బాదం నూనె/ కొబ్బరి నూనె కలిపిన మిశ్రమాన్ని రాసుకోవాలి. మరుసటి రోజు ఉదయం లేచిన వెంటనే ముఖాన్ని గోరు వెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అరచేతుల్లాగే వాటి వెనుక భాగం (నకల్స్) కూడా అందంగా మెరవాలని అందరూ కోరుకుంటారు. మరి దానికి పాటించాల్సిన చిట్కా ఒకటుంది. అదే చేతులను నానబెట్టడం. ఓ గిన్నెలో గోరువెచ్చని నీళ్లు పోసి అందులో 5-6 చుక్కల గ్లిజరిన్, కొద్దిగా రోజ్‌వాటర్, ఒక టీ స్పూన్ బేకింగ్ సోడాను వేసి కలుపుకోవాలి. ఆ మిశ్రమంలో రెండు చేతులను 10-15 నిమిషాల పాటు పెట్టి వెంటనే వేరే నీటితో కడిగేసుకోకుండా టవల్‌తో తుడుచుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీటితో చేతులను కడుక్కోవాలి. దాంతో నల్లగా కనపడే నకల్స్ కూడా అందంగా అరచేతి రంగులోకి వస్తాయి. -
క్యూట్ కేర్...
బ్యూటిప్స్ పెదాల చుట్టూ చర్మం నల్లగా మారుతుంది చాలామందికి. అది వేడి వల్ల కానీ, విటమిన్స్ లోపం వల్ల కానీ అయ్యుండొచ్చు. అలాంటి వారు తమ పెదాలు పూర్తిగా ఎరుపురంగులోకి రావడానికి రోజూ స్నానానికి వెళ్లే ముందు వాటిపై టూత్‌పేస్ట్ అప్లై చేయండి. అది ఆరాక మెల్లిగా మర్దన చేసుకుంటూ పెదాలను కడుక్కోవాలి. కొంచెం సమయం తీసుకున్నా సరే ఈ చిట్కా తప్పకుండా మంచి ఫలితాన్నిస్తుంది. అర్జెంట్‌గా పార్టీకి వెళ్లాలి. కానీ ముఖం మాత్రం జిడ్డుగా, కాంతిహీనంగా ఉందని చింతించకండి. పార్టీకి వెళ్లే రెండు గంటల ముందు ముఖానికి నేరేడుపళ్ల ఫేస్‌ప్యాక్ వేసుకోండి. దానికి కావాల్సినవి 4-5 నేరేడుపళ్లు మాత్రమే. నేరేడుపళ్ల గుజ్జులో కాస్త శనగ పిండి కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఓ 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ఫేస్‌వాష్ చేసుకుంటే సరి. అందులోని విటమిన్-సి, మినరల్స్ కారణంగా చర్మం ఆరోగ్యంతో నిగనిగలాడుతుంది. ముఖం తెల్లగా ఉండి అక్కడక్కడా నల్ల మచ్చలు ఉండటం వల్ల తాము అందంగా లేమని బాధపడుతుంటారు యువతులు. అలాంటి వారు ఈ ఇంటి చిట్కాను పాటించి చూడండి. రాత్రి పడుకునే ముందు ఉల్లిరసంలో దూదిని ముంచి నల్లమచ్చలపై అద్దండి. అలా రోజూ చేస్తే మచ్చలు తగ్గుముఖం పడతాయి. -
అందమె ఆనందం
ఎండబెట్టిన ఉసిరికాయలు, కుంకుడు కాయలు, శీకాయల్ని నీటిలో వేసి బాగా మరిగించాలి. తర్వాత చల్లారబెట్టి, సీసాలో వేసి భద్రపర్చుకుని... వారానికోసారి దీనితో తలంటుకుంటే జుత్తు బలంగా తయారవుతుంది. పెదవులు పొడిబారి చిట్లిపోతుంటే... ఆలివ్‌నూనెలో కొంచెం తేనె, చెంచాడు పంచదార కలిపి పెదవులపై మసాజ్ చేసుకోవాలి. రోజూ ఇలా చేస్తూ ఉంటే వారం తిరిగేసరికి అందంగా తయారవుతాయి. -
మృదువైన పెదవుల కోసం...
అందమె ఆనందం వాతావరణం, అనారోగ్యం వల్ల పెదవులు పొడిబారి, మృదుత్వాన్ని కోల్పోతాయి. లిప్‌బామ్స్ ఈ సమస్యకు సరైన పరిష్కారాన్ని ఇవ్వగలవు. లిప్‌బామ్స్ సహజసిద్ధమైన తేనె, కొబ్బరినూనె, ఆలివ్ ఆయిల్.. వంటివి కలిపి ఇంట్లోనే తయారుచేసి, వాడుకోవచ్చు.గాజు గిన్నెలో టేబుల్‌స్పూన్ పెట్రోలియమ్ జెల్లీ వేసి అవెన్‌లో 30 సెకన్లు వేడి చేయాలి. లేదంటే వేడినీటిలో గాజు గిన్నెను ఉంచి పెట్రోలియమ్ జెల్లీని కరిగించాలి. దీంట్లో టీస్పూన్ తేనె కలపాలి. బాగా కలిపిన ఈ మిశ్రమాన్ని ప్లాస్టిక్ డబ్బాలో వేసి ఫ్రిజ్‌లో పది నిమిషాలు ఉంచాలి. తర్వాత అదే డబ్బాను ఫ్రీజర్‌లో ఒక రోజంతా ఉంచి, తర్వాత లిప్‌బామ్‌గా వాడుకోవచ్చు. పెద్ద గిన్నెలో నీళ్లు తీసుకొని, వేడిచేయాలి. దీంట్లో మరో చిన్న గిన్నె అమర్చి టేబుల్ స్పూన్ మైనం, కొబ్బరి నూనె వేసి కలపాలి. మైనం పూర్తిగా కరిగాక దాంట్లో టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలపాలి. మిశ్రమం వేడెక్కాక గిన్నె తీసి, దాంట్లో టీ స్పూన్ తేనె, 8 చుక్కల నిమ్మనూనె కలపాలి. బాగా చిక్కగా ఉన్న ఈ మిశ్రమం చిన్న డబ్బాలోకి తీసుకుని, పూర్తిగా చల్లారాక పెదవులకు రాసుకోవాలి. -
పాటను సీరియస్‌గా తీసుకుంది అప్పుడే!
సంభాషణం: అందమైన స్వరం దేవుడిచ్చిన వరం అంటారు. ఆ వరం పర్ణికకు దక్కింది. బాడీగార్డ్, తెలుగమ్మాయి, నిప్పు, గ్రీకువీరుడు, దేనికైనా రెడీ తదితర చిత్రాల్లో తన పాటతో శ్రోతల మనసులను దోచుకుందామె. పెదవులపై చిరునవ్వును ఎప్పుడూ చెరగనివ్వని ఈ గాయనీమణి తన కెరీర్ గురించి చెబుతోన్న కబుర్లు... మావారి పేరు నిఖిలేశ్వర్... మెరైన్ ఇంజినీర్. నాకెప్పుడూ ఒక భయం ఉండేది... నన్ను అర్థం చేసుకోనివాడు భర్తగా వస్తే ఏంటి పరిస్థితి అని. కానీ అదృష్టం కొద్దీ చాలా మంచి వ్యక్తి దొరికారు. మా ఇంట్లోవాళ్లు, మా అన్నయ్య నన్ను ఎంత ప్రోత్సహించేవారో, అంతకంటే ఎక్కువగా ప్రోత్సహిస్తారు మావారు. అలాంటి జీవిత భాగస్వామి ఉంటే ఏదైనా సాధించగలం! ఎంతైనా ఎదగగలం! కెరీర్ ఎలా ఉంది? బాగుంది. ఇటీవలే ‘రభస’ చిత్రంలో పాడాను. మరికొన్నిటికి పాడుతున్నాను. - ఇప్పటివరకూ ఎన్ని పాటలు పాడారు? తెలుగు, తమిళం, హిందీ, భోజ్‌పురి, లంబాడీ భాషల్లో కలిపి నలభై వరకూ పాడాను. - మీలో ఓ గాయని ఉందని ఎప్పుడు తెలిసింది? మా నాన్నమ్మ లక్ష్మీసుబ్రహ్మణ్యం కర్ణాటక సంగీత విద్వాంసురాలు. దాంతో మూడో తరగతిలోనే ఆవిడ దగ్గర స్వర సాధన మొదలుపెట్టాను. అయితే సరదాగానే నేర్చుకున్నాను తప్ప సింగర్ అయిపోవాలన్న లక్ష్యంతో కాదు. కానీ పదో తరగతిలో రామాచారి గారి దగ్గర చేరాక నా ఆలోచనలు మారిపోయాయి. ఆయన శిష్యులు కొందరు సినిమాల్లో ట్రాకులవీ పాడటం చూసి నాకూ అలా పాడాలన్న కోరిక కలిగింది. దాంతో పాటని సీరియస్‌గా తీసుకోవడం మొదలుపెట్టాను. - తొలిసారి గుర్తింపు ఎప్పుడు వచ్చింది? ‘జీ సరిగమప’లో పాల్గొనే అవకాశం వచ్చింది. దాంతో మంచి గుర్తింపు వచ్చింది. ఇక సూపర్ సింగర్స్ తెచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. - యాంకరింగ్ కూడా చేసినట్టున్నారు? అవును. అనుకోకుండా యాంకరింగ్ అవకాశాలు వచ్చాయి. అన్నీ పాటలకు సంబంధించిన కార్యక్రమాలే కావడంతో ఒప్పుకునేదాన్ని. చాలా షోలు చేశాను. అయితే సింగర్‌ని కావాలన్న అసలు లక్ష్యాన్ని పక్కన పెట్టేస్తున్నానేమోనని భయమేసి యాంకరింగ్‌కి కామా పెట్టాను. - టాలెంట్ షోల పుణ్యమా అని కోకొల్లలుగా సింగర్లు వస్తున్నారు. ఇలాంటప్పుడు సరిపడినన్ని అవకాశాలు వస్తాయంటారా? ఎందుకు రావు! శ్రీకృష్ణ, గీతామాధురి, దీపు, రేవంత్, నేను.... మా అందరికీ అవకాశాలు బాగానే ఉన్నాయి. ఎంతమంది వచ్చినా అవకాశాలు ఇవ్వగలదు మన ఇండస్ట్రీ. లేదంటే నేనివాళ ఇక్కడ ఉండేదాన్నే కాదు. - కానీ బాలు, చిత్రల మాదిరిగా సింగిల్ కార్డులు పడే చాన్స్ లేదు కదా? కావచ్చు. కానీ అవకాశాలైతే ఉన్నాయి కదా! సినిమాకి ఒక్క పాట పాడినా కెరీర్‌కు వచ్చే ఢోకా ఏమీ ఉండదు. అందరికీ చాన్సులు రావాలి. అందరూ బాగుండాలి. - అవకాశాలు మిస్సై బాధపడిన సందర్భాలు ఉన్నాయా? మొదట్లో నేను పాడిన కొన్ని పాటల్ని చివరి నిమిషంలో తీసేసేవారు. బాగా పాడానే, ఎందుకిలా చేశారు అని బాధపడేదాన్ని. అయితే దానికి వాళ్ల కారణాలు వాళ్లకుంటాయి. అప్పట్లో ఇన్లే కార్డు మీద పడే పేరుకి వాల్యూ ఎక్కువ ఉండేది. ఓ పెద్ద సింగరో లేక ముంబై సింగరో పాడితే క్రేజ్ ఏర్పడుతుందని అనుకునేవారు. దాంతో అలా జరిగేది. ఇప్పుడలా లేదు. బయటి వాళ్లకు చాన్స్ ఇచ్చినా, తెలుగువాళ్లతో కూడా బాగానే పాడిస్తున్నారు. బలంగా ఉన్న కోరిక...? ఏ సింగర్‌కైనా తప్పక ఉండే కోరిక... ఇళయరాజా గారి దగ్గర పాడాలని. అయితే అంతకంటే ముందు ఆయన్ని చూడాలని ఉంది. రెండు మూడుసార్లు కలిసే అవకాశం వచ్చినా వేరే షోలు ఉండటం వల్ల మిస్ అయ్యాను. అప్పట్నుంచీ ఆ వెలితి అలానే ఉండిపోయింది. భవిష్యత్ ప్రణాళికలు? నాలెడ్జబుల్ గాయనిగా పేరు తెచ్చుకోవాలి. అంతకంటే ముఖ్యంగా మంచి మనిషి అనిపించుకోవాలి. ఎదగాలంటే టాలెంట్ ఒక్కటీ చాలదు. మంచి ప్రవర్తన కూడా ఉండాలి. నా వరకూ నేను ఎప్పుడూ నా ప్రవర్తనను కనిపెట్టుకుని ఉంటాను. దేవుడి దయ వల్ల ఎప్పుడూ ఏ రిమార్కూ తెచ్చుకోలేదు. అది చాలు నాకు. - సమీర నేలపూడి -
అధరములు అదిరేలా..!!
-
పెదవుల అందం.. అధరహో..
సినీతారలు సహజంగానే సొగసరులు. వారి నగుమోములకు వన్నెనిచ్చేవి పెదవులే. అలాంటి అందాల అధరాలను కోరుకోనిదెవరు? కత్తి పడకుండానే, పెదవులను అందంగా తీర్చిదిద్దే ప్రక్రియ అందుబాటులోకి వచ్చింది. అది కూడా కేవలం ఇరవై నిమిషాల వ్యవధిలోనే. చిన్నపాటి సూదిమందుతో ఇంచక్కా పెదవులను అందంగా మార్చేసుకోవచ్చు. పెదవులకు మెరుగులు దిద్దే అధునాతన కాస్మొటిక్ చికిత్సా విధానమైన ‘ఫిల్లర్ ఇంజెక్షన్’ మన దేశంలోనూ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ సహా మన దేశంలోని నగరాల్లో దీనికి నానాటికీ గిరాకీ పెరుగుతోంది. శస్త్రచికిత్స కంటే ఫిల్లర్ ఇంజెక్షన్ చేయించుకోవడమే మేలని చెబుతున్నారు ‘బ్లు’ స్కిన్ అండ్ కాస్మటాలజీ క్లినిక్ నిర్వాహకురాలు డాక్టర్ నిలయని. ఇలా చేస్తారు.. పెదవుల కింద ఫిల్లర్ ఇంజెక్షన్ చేస్తారు ఇంజెక్షన్ ప్రభావంతో పెదవులు అందమైన ఆకృతిని సంతరించుకుంటాయి ముఖంపైనున్న చిన్నచిన్న ముడతలు, గీతలు తేలికగా తొలగిపోతాయి పద్దెనిమిదేళ్లు నిండిన వారెవరైనా ఈ చికిత్స చేయించుకోవచ్చు అందం కోసం .. ముక్కును అందంగా తీర్చిదిద్దుకునేందుకు రినోప్లాస్టీ విధానం ఉంది. ఇందులో నాన్ సర్జికల్ రినోప్లాస్టీ అయితేనే మంచిదని, ఈ చికిత్స ముప్పయి నిమిషాల్లోనే పూర్తవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక ముదిమిని అదిమిపెట్టి, చర్మ సౌందర్యాన్ని యవ్వనభరితంగా మార్చేందుకు ఫ్రాక్సెల్ లేజర్ ట్రీట్మెంట్ ఉపకరిస్తుంది. బోటాక్స్ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా చర్మాన్ని యవ్వనంతో తొణికిసలాడేలా తయారు చేస్తారు. ఐదారు నెలల వ్యవధిలోనే దీని ఫలితం కనిపిస్తుంది.నుదురు, ముక్కు, నోరు, దవడ ఎముక, మెడ భాగాలకు ఈ చికిత్స చేస్తారు. మెరుపుతీగలా సన్నబడటానికి అల్ట్రా లైపోతో కూడిన ఇంజెక్షన్ లైపోలిసిస్ మేలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ నాన్‌సర్జికల్ ట్రీట్మెంట్ ఫలితాలు మూడు వారాల్లోనే కనిపిస్తాయి. శరీరంలోని అనవసరమైన కొవ్వు మలమూత్రాలు, చెమట ద్వారా బయటకు పోతాయి. - చల్లపల్లి శిరీష -
పెదవులు తడారిపోతాయి ఎందుకు?
ఎంత తడిపినా ఈ కాలంలో పెదవులపై తేమ తగ్గిపోతూంటుంది. దీంతో పగుళ్ళు కూడా వస్తుంటాయి. మృతకణాలు పేరుకుపోతుంటాయి. పెదవుల చుట్టూ చర్మంపై చిన్న చిన్న కురుపుల్లాంటివి కూడా వస్తుంటాయి. ఈ సమస్య నివారణకు.. ఏం చేయాలంటే! కొద్దిగా పంచదార పెదవులపై అద్ది, మృదువుగా రుద్దాలి. తర్వాత నీటితో కడిగి, మంచి లిప్ బామ్ రాయాలి. దీంతో పెదవులు తేమను కోల్పోకుండా ఎక్కువసేపు మృదువుగా ఉంటాయి. రాత్రి పడుకునేముందు నెయ్యి లేదా బాదం నూనె లేదా తేనె రాసుకుంటే మంచిది. వెచ్చని గ్రీన్ టీ బ్యాగ్‌ను ప్రతిరోజూ పెదవులపై 3-4 నిమిషాలు ఉంచితే సహజ సిద్ధమైన తేమ పెదవులకు అందుతుంది. పొడిబారడం, పగుళ్లు రావడం సమస్య తగ్గుతుంది చలికాలంలో దాహం ఎక్కువ అవ్వదు. అలాగని నీళ్లు తక్కువ తాగితే చర్మం డీ-హైడ్రేట్ అవుతుంది. ఫలితంగా పెదవులు పొడిబారు తాయి. చక్కటి మంత్రం... ఎండాకాలంలాగే చలికాలంలోనూ నీరు బాగా తాగాలి పెదవులను పదే పదే నాలుకతో తాకడం, తడుపుకోవడం వల్ల పొడిబారుతాయి. ఈ చెడ్డ అలవాటుకు వెంటనే స్వస్తి పలకండి. పెదవుల పగుళ్లకు విటమిన్ బి - 12 లోపం. ఈ సమస్య ఉంటే సమతుల ఆహారంపై దృష్టిపెట్టడం అవసరం ఎప్పుడూ వాడినవే కాకుండా చలి కాలంలో అదనపు మాయిశ్చరైజింగ్ ఏజెంట్ ఉన్న లిప్ క్రీమ్ వాడాలి. ఇవి చాప్‌స్టిక్స్ రూపంలో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి ఈ కాలాన్ని తట్టుకునేలా లిప్బామ్స్లో జొజొబా, విటమిన్‘ఇ’ ఆయిల్ ఉన్నవీ లభిస్తున్నాయి మేకప్ వేసుకునే వారు మాయిశ్చరైజింగ్ సుగుణాలు ఉన్న లిప్‌స్టిక్‌ను ఎంచుకోవడం ఉత్తమం. అలాగే పడుకోబోయే ముందు లిప్‌స్టిక్ తొలగించి, మాయిశ్చరైజింగ్ లిప్ బామ్ తప్పక రాసుకోవాలి గ్లిజరిన్, పెట్రోకెమికల్ లిప్‌బామ్స్ అస్సలు వాడకూడదు.