చాలామందికి పైపెదవులపైన, గడ్డం వద్ద అవాంచిత రోమాలు వస్తుంటాయి. వాటిని తొలగించుకునేందుకు వాక్సింగ్, థ్రెడింగ్ వంటి నొప్పితో కూడిన ప్రక్రియలను ఆశ్రయిస్తారు. అలాకాకుండా ఇంట్లో ఉన్నవాటితో సహజంగా ఆ అవాంచిత రోమాలను తొలగించుకోవచ్చు. ఎలాంటి నొప్పి ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు పైగా ఈజీగా బయటపడొచ్చు కూడా. ఎలాగో చూద్దాం!.
సహజ పద్ధతిలో అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి..
►పసుపు ఒక టేబుల్ స్పూన్, పాలు ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి. ఆ మిశ్రమాన్ని పై పెదవికి అప్లై చేసి ఆరిన తర్వాత మెత్తగారుద్దండి. వెంట్రుకలు పలచబడటమేగాక తగ్గడం స్టార్ట్ అవుతుంది.
►నిమ్మరసం, పంచాదార మిశ్రమాన్ని అప్లై చేసిన వెంట్రుకలు కుదుళ్లు వదులై త్వరగా పోయే అవకాశం ఉంటుంది. నిమ్మలో ఉండే యాసిడ్‌లు బ్లీచ్‌లా పనిచేస్తుంది. ఇక షుగర్ స్కిన్ ఎక్స్‌ఫోలియేషన్‌లో సహయపడుతుంది. పొడిచర్మం ఉన్నట్లయితే దీన్ని స్కిప్ చేయండి.
►గుడ్డు తెల్లసొన ఒక టేబుల్ స్పూన్, మొక్కజొన్నపిండి 1/2 టేబుల్ స్పూన్ తీసుకోండి ఈ మిశ్రమాన్ని పెదాలపై అప్లే చేస్తే ఈజీగా వెంట్రుకలు రాలిపోతాయి.
►సెనగపిండి, పాలు ఒక టేబుల్‌స్పూన్ చొప్పున తీసుకుని దాంట్లొ కొంచెం పసుపు వేసుకుని ఆ మిశ్రమాన్ని పెదాలపై రాసి సుమారు 15 నుంచి 20 నిమిషాలు ఉంచి ఆరిపోయాక వేడి నీటితో కడిగేయండి.
►పెరుగు కూడా చక్కటి ఫలితం ఇస్తుంది. పెరుగు, తేనె ఒక టేబుల్ స్పూన్ పసుపు చిటికెడు వేసి కలిపి ఈ మ్రిశ్రమాన్ని అప్లై చేసి 20 నిమిషాలు అలాగే ఉంచండి. ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి ఇక వెంట్రుకలు ఈజీగా రాలిపోతాయి.
ఈ చిట్కాలను క్రమం తప్పకుండా చేస్తే గనుకు సుమారు 15 రోజుల్లోనే చక్కటి ఫలితం కనిపిస్తుంది. అలాగే అవాంఛిత రోమాలు ఎక్కువగా ఉన్నవారిని నెల లేదా రెండు నెలల్లో చక్కటి ఫలితం కనిపించి తీరుతుంది.
(చదవండి: హెయిర్–డై వేసుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారా!)
Comments
Please login to add a commentAdd a comment