Unwanted hair
-
పటికతో ఇలా చేస్తే.. అవాంఛిత రోమాలు మాయం!
ఓ పక్క అవాంఛిత రోమాలతో ముఖం రంగు తగ్గి అసహ్యంగా ఇబ్బందిగా ఉందా?. బయటకు వెళ్లాలన్నా భయపడుతున్నారా? . అలాంటప్పుడూ చక్కటి ఈ హోం రెమిడీలు ఫాలో అయితే సులభంగా సమస్య నుంచి బయటపడొచ్చు. పైగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు కూడా ఉండవు. రాత్రి పడుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడవాలి. ఇప్పుడు మాయిశ్చరైజర్ లేదా గ్లిజరిన్, అలోవెరా జెల్, కొబ్బరి నూనె... వీటిలో ఏదైనా ఒకటి రాసి పది నిమిషాలు మర్దన చేయాలి. తరువాత లైట్ ఆపేసి పది నిమిషాలు శ్వాస మీద దృష్టి కేంద్రీకరించాలి. రోజూ ఇలా చేయడం వల్ల శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ అంది రక్త ప్రసరణ జరుగుతుంది. ఫలితంగా ముఖం మెరుపులీనడమే గాక, చర్మం రంగు కూడా అందంగా మారుతుంది. రెండు టేబుల్ స్పూన్ల పటికపొడిలో టీస్పూను పసుపు, అర టీ స్పూను నిమ్మరసం, టీస్పూను రోజ్ వాటర్ వేసి పేస్టులా కలపాలి. ఈ పేస్టుని ముఖంపైన పూతలా వేయాలి. పూర్తిగా ఆరిన తరువాత వేళ్లతో సర్కిల్స్లా ఐదు నిమిషాలు రుద్దిన తరువాత నీటితో కడిగేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే ముఖం మీద ఉండే అవాంఛిత రోమాలు రాలిపోతాయి. (చదవండి: ఐస్‌వాటర్ ముఖ సౌందర్యాన్ని ఎలా రక్షిస్తుందో తెలుసా!) -
పెదవులపై ఉండే అవాంఛిత రోమాలకు చెక్‌పెట్టండిలా!
చాలామందికి పైపెదవులపైన, గడ్డం వద్ద అవాంచిత రోమాలు వస్తుంటాయి. వాటిని తొలగించుకునేందుకు వాక్సింగ్, థ్రెడింగ్ వంటి నొప్పితో కూడిన ప్రక్రియలను ఆశ్రయిస్తారు. అలాకాకుండా ఇంట్లో ఉన్నవాటితో సహజంగా ఆ అవాంచిత రోమాలను తొలగించుకోవచ్చు. ఎలాంటి నొప్పి ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు పైగా ఈజీగా బయటపడొచ్చు కూడా. ఎలాగో చూద్దాం!. సహజ పద్ధతిలో అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి.. ►పసుపు ఒక టేబుల్ స్పూన్, పాలు ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి. ఆ మిశ్రమాన్ని పై పెదవికి అప్లై చేసి ఆరిన తర్వాత మెత్తగారుద్దండి. వెంట్రుకలు పలచబడటమేగాక తగ్గడం స్టార్ట్ అవుతుంది. ►నిమ్మరసం, పంచాదార మిశ్రమాన్ని అప్లై చేసిన వెంట్రుకలు కుదుళ్లు వదులై త్వరగా పోయే అవకాశం ఉంటుంది. నిమ్మలో ఉండే యాసిడ్లు బ్లీచ్‌లా పనిచేస్తుంది. ఇక షుగర్ స్కిన్ ఎక్స్‌ఫోలియేషన్‌లో సహయపడుతుంది. పొడిచర్మం ఉన్నట్లయితే దీన్ని స్కిప్ చేయండి. ►గుడ్డు తెల్లసొన ఒక టేబుల్ స్పూన్, మొక్కజొన్నపిండి 1/2 టేబుల్ స్పూన్ తీసుకోండి ఈ మిశ్రమాన్ని పెదాలపై అప్లే చేస్తే ఈజీగా వెంట్రుకలు రాలిపోతాయి. ►సెనగపిండి, పాలు ఒక టేబుల్‌స్పూన్ చొప్పున తీసుకుని దాంట్లొ కొంచెం పసుపు వేసుకుని ఆ మిశ్రమాన్ని పెదాలపై రాసి సుమారు 15 నుంచి 20 నిమిషాలు ఉంచి ఆరిపోయాక వేడి నీటితో కడిగేయండి. ►పెరుగు కూడా చక్కటి ఫలితం ఇస్తుంది. పెరుగు, తేనె ఒక టేబుల్ స్పూన్ పసుపు చిటికెడు వేసి కలిపి ఈ మ్రిశ్రమాన్ని అప్లై చేసి 20 నిమిషాలు అలాగే ఉంచండి. ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి ఇక వెంట్రుకలు ఈజీగా రాలిపోతాయి. ఈ చిట్కాలను క్రమం తప్పకుండా చేస్తే గనుకు సుమారు 15 రోజుల్లోనే చక్కటి ఫలితం కనిపిస్తుంది. అలాగే అవాంఛిత రోమాలు ఎక్కువగా ఉన్నవారిని నెల లేదా రెండు నెలల్లో చక్కటి ఫలితం కనిపించి తీరుతుంది. (చదవండి: హెయిర్–డై వేసుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారా!) -
నొప్పిలేకుండా ఇంట్లోనే వ్యాక్సింగ్.. ఈ మెషిన్ ఉంటే భలే సులువు
బ్యూటీ లవర్స్‌కి అన్నింటి కంటే అతిపెద్ద సమస్య అవాంఛితరోమాలే. నెలకోసారి పార్లర్‌కి వెళ్లి వాక్సింగ్ చేయించుకోవడం.. లేదంటే ఇంట్లోనే రకరకాల సాధనాలతో అవాంఛిత రోమాలను తొలగించుకోవడం.. తప్పించుకోలేని సమస్యగా మారుతుంది. అదంతా ఓ విసుగు వ్యవహారం. ఆ సమస్య.. విసుగును కట్ చేస్తుంది ఈ హెయిర్ రిమూవల్ డివైస్. నొప్పి తెలియకుండా.. సమయమూ ఎక్కువ తీసుకోకుండా శాశ్వత పరిష్కారాన్ని అందిస్తుంది. ఈ లేజర్ హెయిర్ రిమూవల్ డివైస్.. అప్‌గ్రేడ్ వెర్షన్స్ లో అందుబాటులోకి వచ్చింది. ఇది కేవలం 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను మాత్రమే విడుదల చేయడంతో చర్మం కందిపోదు, ఎరుపెక్కదు. దీనిలో 5 లెవెల్స్ ఉంటాయి. అయితే సున్నితమైన భాగాలను బట్టి ఆ లెవెల్స్‌ని పెంచుకోవడం, తగ్గించుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. ఇందులో మాన్యువల్ మోడ్‌ని.. ప్రధానంగా బికినీ లైన్, అండర్ ఆర్మ్స్, వేళ్లు, పై పెదవి.. భాగాల్లో రోమాలను తొలగించడానికి ఉపయోగించాలి. దీనిలోని ఆటో మోడ్‌ని.. చేతులు, కాళ్లు, పొట్ట, వీపు వంటి ఏరియాల్లో వెంట్రుకలను తొలగించడానికి యూజ్ చేయాలి. ఇది ఎరుపు, తెలుపు, గ్రే కలర్ వెంట్రుకలను తీయడానికి పనిచేయదు. ఇది కేవలం ఎనిమిది నిమిషాల్లో మొత్తం బాడీని క్లీన్ చేయగలదు. అయితే ముందుగా షేవ్ చేసుకుని.. ఆ తర్వాత ఈ డివైస్‌తో ట్రీట్మెంట్ తీసుకోవాలి. దీన్ని వినియోగించే సమయంలో మెషిన్‌తో పాటు వచ్చే ప్రత్యేకమైన కళ్లజోడును ధరించడం మంచిది. సరిగ్గా నాలుగు వారాల పాటు.. దీని మెనూ బుక్‌ని ఫాలో అవుతూ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. ఈ డివైస్ ధర సుమారు 7,829 రూపాయలు. ఇలాంటి లేటెస్ట్ మోడల్స్‌ని కొనుగోలు చేసే ముందు రివ్యూలు చదివి.. ఆర్డర్ చేయడం మంచిది. -
Beauty: అందుకే అవాంఛిత రోమాలు! ఫైటో ఈస్ట్రోజెన్లు అధికంగా ఉండేవి తింటే..
ప్రస్తుతకాలంలో అవాంఛిత రోమాలతో చాలామంది బాధపడుతున్నారు. అది అందమైన ముఖాన్ని అంద విహీనంగా చేస్తుంది. వాటిని చూసుకున్నప్పుడల్లా స్త్రీలు ఎంతో బాధని అనుభవిస్తుంటారు. సాధారణంగా హార్మోన్ల అసమతుల్యత వల్ల ముఖంపై అవాంఛిత రోమాలు పెరుగుతుంటాయి. ఏది ఏమైనా అవాంఛిత రోమాలు అనేది ఒక దీర్ఘకాలిక సమస్య. దీనికి వాక్సింగ్, షేవింగ్, ఇతర చికిత్సలు చేయించటం వల్ల క్రమంగా మరింత పెరుగుతాయి. దీనికి శాశ్వత పరిష్కారం అంటూ ఏమి లేదు, కానీ కొన్ని సహజ నివారణలు ఉన్నాయి. అవేంటో చూద్దాం... పసుపు ►ఇది మనం ప్రతి రోజు మన వంటల్లో వాడేదే.. పసుపులో ఉండే యాంటీ బాక్టీరియల్ గుణాలు అవాంఛిత రోమాలును తొలగించి ముఖంలో తేజస్సుని, అందాన్ని మరింత రెట్టింపు చేస్తుంది. ►దీన్ని ఆయుర్వేదంలో ఒక ఔషధంలా ఉపయోగిస్తారు. ►పసుపుని శెనగపిండితో కలిపి ఉపయోగిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. ►పసుపు రోమాలను తొలగించటమే కాకుండా వాటి పెరుగుదలను కూడా అదుపులో ఉంచుతుంది. ఇవి కూడా! ►వీటితోపాటుగా ఆరోగ్యకరమైన ఆహారం కూడా ముఖ రోమాలు వదిలించుకోవటంలో సహాయపడుతుంది. ►సరియైన ఆహారం తీసుకోకపోవడం వలన ఇది అధికమయ్యే ప్రమాదముంది. ►ముఖంపై అవాంఛిత రోమాల బెడద తగ్గాలంటే ఫైటో ఈస్ట్రోజెన్లు అధికంగా ఉన్న ఆహారాన్ని తినాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ►ఫైటో ఈస్ట్రోజెన్లు అధికంగా అవిసెగింజలు, సోంపు, అల్ఫాల్ఫాలో ఉంటాయి. చదవండి: Heart Attack: బయట ఫ్రైడ్ రైస్, మంచూరియా, పునుగులు, బోండాలు తరచుగా తింటున్నారా? అయితే.. Pomegranate: 3 నెలల పాటు ప్రతిరోజు తింటే! ఇక తొక్కలు పొడి చేసి నీళ్లలో కలిపి తాగారంటే.. -
పై పెదవి, గడ్డం మీద సన్నని రోమాలు.. శాశ్వతంగా తొలగించుకోవచ్చు!
How To Remove Unwanted Hair : వాతావరణ కాలుష్యం కారణంగా మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత ఎక్కువైంది. ఫలితంగా పై పెదవి, గడ్డం మీద సన్నని రోమాలు కనిపిస్తున్నాయి. వీటిని శాశ్వతంగా తొలగించడానికి నిపుణులైన ట్రైకాలజిస్టు సహాయం తీసుకోవాలి. కోల్‌కతా ట్రైకాలజిస్ట్ డాక్టర్ అతుల్ తనేజా సూచన ఇది. లేజర్ కిరణాలతో చేసే ఈ చికిత్సను ‘లేజర్ హెయిర్ రిడక్షన్’ అంటారు. హార్వర్డ్ మెడికల్ స్కూల్ వైద్య నిపుణులు అభివృద్ధి చేసిన ‘సెలెక్టివ్ ఫొటో థర్మోలిసిస్ విధానం’ ద్వారా ఈ చికిత్స చేస్తారు. లేజర్ కిరణాలు నేరుగా రోమమూలాన్ని మాత్రమే తాకుతాయి. పక్క టిష్యూకి, చర్మానికి ఎటువంటి హాని ఉండదు. లేజర్ పల్స్డ్ లైట్ ఒకేసారి అనేక ఫాలికల్స్‌ను పట్టుకుంటుంది. కాబట్టి చికిత్సకు ఎక్కువ సమయం పట్టదు. ఈ ట్రీట్మెంట్తోపాటుగా గైనకాలజిస్టు, ఎండోక్రైనాలజిస్టు సూచనలు కూడా తీసుకోవాలి. చదవండి: Health Tips: నీటితో పోయేది రాయి దాకా వస్తే... -
నీటి బుడగల వల్లేనా...
నా వయసు 26 సంవత్సరాలు, తరచుగా జుట్టు ఊడుతుంది. అవాంఛిత రోమాలు వస్తున్నాయి. అండాశయంలో నీటిబుడగల వల్ల ఇలాంటి సమస్యలు ఎదురవుతాయని విన్నాను. మా అమ్మ అండాశయంలో నీటిబుడగల సమస్య ఎదుర్కొంది. ఇది జెనెటికల్ ప్రాబ్లం అంటున్నారు. మా అమ్మాయికి రాకుండా ముందస్తు జాగ్రత్తలు ఏమైనా తీసుకోవచ్చా? – కె.వందన, ఏటూరునాగారం నీటి బుడగల సమస్య అంటే ‘పాలిసిస్టిక్ ఓవరీస్ డిసీజ్’ (పీసీఓడీ) అనేది జన్యుపరమైన అంశాలు, హార్మోన్ల అసమతుల్యత, అధిక బరువు వంటి వాటితో పాటు ఇంకా అనేక తెలియని కారణాల వల్ల ఏర్పడుతుంది. జన్యుపరమైన కారణాల్లో తల్లిదండ్రుల్లో సుగర్ వ్యాధి ఉండి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉండి ఉన్నట్లయితే, అది వారి పిల్లల్లో, ఆ జన్యువుల వల్ల నీటి బుడగలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఇలాంటప్పుడు మగవారిలో ఎక్కువగా ఉండే ఎండ్రోజెన్ హార్మోన్ ఆడవారిలో ఎక్కువగా స్రవిస్తుంది. దీనివల్ల అవాంఛిత రోమాలు, జుట్టు ఊడటం, మొటిమలు, పీరియడ్స్ క్రమం తప్పడం వంటి ఎన్నో లక్షణాలు ఉండవచ్చు. జన్యుపరమైన కారణాల వల్ల వచ్చే సమస్యను రాకుండా ఆపలేము. కాకపోతే జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వల్ల వాటి లక్షణాల తీవ్రతను తగ్గించుకోవచ్చు. దీనిలో భాగంగా ఎక్కువ బరువు పెరగకుండా నడక, వ్యాయామాలు, యోగా, ధ్యానం, మితమైన పౌష్టికాహారం తీసుకోవడం వంటివి చెయ్యడం మంచిది. అంతేకాకుండా డాక్టర్‌ను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకుని, కారణం నిర్ధారణ చేయించుకుని, దానికి తగ్గ మందులు ఎక్కువ కాలం వాడుతూ, అవాంఛిత రోమాలకు మందులతో పాటు చర్మవ్యాధి నిపుణుల సంరక్షణలో లేజర్ వంటి కాస్మొటిక్ చికిత్సలు తీసుకోవలసి ఉంటుంది. రాకుండా ముందు జాగ్రత్తలేమీ ఉండవు. నేను నిద్ర తక్కువగా పోతాను. అయితే ఇప్పుడు నేను ప్రెగ్నెంట్. ఈ సమయంలో ఎన్నిగంటలు నిద్ర పోవాలి? ఒకవేళ నిద్ర తక్కువైతే సమస్యలు ఎదురవుతాయా? మంచి నిద్ర కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయాలి? ప్రెగ్నెంట్‌గా ఉన్న సమయంలో బ్యాక్‌పెయిన్, శ్వాస సమస్యల వల్ల నిద్ర సరిగ్గా పట్టదని చెబుతుంటారు. వీటికి అధిగమించడానికి ఏంచేయాలి అనేది తెలియజేయగలరు. – బి.నీరజ, హైదరాబాద్ గర్భిణులు రోజూ రాత్రి ఎనిమిది గంటలు నిద్రపోవడం మంచిది. మధ్యాహ్నం ఒక గంట విశ్రాంతి తీసుకోవడం మంచిది. గర్భిణులలో హార్మోన్లలో మార్పులు, శరీరంలో మార్పుల వల్ల తొందరగా అలసిపోవడం జరుగుతుంది. సరిగా నిద్రపోవడం వల్ల అలసట తగ్గుతుంది. నిద్ర తక్కువైతే రోజంతా చిరాకుగా, మగతగా ఉండటం, తలనొప్పి వంటి సమస్యలు తలెత్తవచ్చు. గర్భం పెరిగి, పొట్ట పెరిగే కొద్దీ నడుం మీద భారం పడి, నడుము నొప్పి, అటూ ఇటూ తిరగడానికి ఇబ్బందితో నిద్ర సరిగా పట్టకపోవడం, పొట్ట, ఊపిరితిత్తుల మీద అదుముతున్నట్లయి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఏర్పడి నిద్ర సరిగా పట్టకపోవచ్చు. గర్భంతో ఉన్నప్పుడు ఎక్కువ బరువు పెరగకుండా చూసుకోవాలి. రాత్రిపూట తొందరగా భోజనం చేసి కనీసం పదిహేను నిమిషాల పాటు మెల్లగా నడవడానికి ప్రయత్నించాలి. పడుకునే ముందు ఒక గ్లాసు వేడి పాలు తాగడం మంచిది. దీనివల్ల బాగా నిద్రపడుతుంది. తల కింద దిండు కొద్దిగా ఎత్తుగా పెట్టుకుని పడుకుంటే, గ్యాస్ ఎక్కువ పైకి రాకుండా, ఊపిరితిత్తులు అదుముకోకుండా బాగా నిద్ర పడుతుంది. ఓరల్ ఐరన్ థెరపీ గురించి వివరంగా తెలియజేయగలరు. ప్రెగ్సెన్సీ సమయంలో ఇది తీసుకోవడం వల్ల ఉపయోగం ఏమిటి?– ఎన్.సరళ, విశాఖపట్టణం ఐరన్ మాత్రలను నోటి ద్వారా తీసుకోవడాన్ని ఓరల్ ఐరన్ థెరపీ అంటారు. సాధారణంగానే ఆడవారిలో ఎక్కువగా రక్తహీనత ఉంటుంది. గర్భం దాల్చిన తర్వాత తల్లి శరీరంలోని మార్పులకు, బిడ్డకు తల్లి ద్వారా పోషకాహారం వెళ్లడానికి రక్తం ఎంతో అవసరం. ఇందులోని హీమోగ్లోబిన్ అనే పదార్థం ఆక్సిజన్‌ను అన్ని అవయవాలకు చేరవేస్తుంది. కాబట్టి ఈ సమయంలో రక్తంలో హీమోగ్లోబిన్ శాతం తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హీమోగ్లోబిన్ పెరగడానికి ఐరన్ అవసరం ఉంటుంది. ఐరన్ మనం తీసుకునే ఆహారం ద్వారా రక్తంలోకి చేరుతుంది. ఇది ఎక్కువగా తాజా ఆకు కూరలు, బఠాణీలు, క్యారెట్, బీట్రూట్ వంటి కూరగాయలు, ఖర్జూరం, అంజీర, దానిమ్మ వంటి పండ్లలో, మాంసాహారంలో ఎక్కువగా దొరుకుతుంది. కానీ తీసుకున్న ఆహారంలో కేవలం 10–20 శాతం మాత్రమే రక్తంలోకి చేరుతుంది. కాబట్టి గర్భిణులు రక్తంలో హీమోగ్లోబిన్ తగ్గకుండా, అలాగే రక్తహీనత ఉన్నప్పుడు కూడా రోజూ ఐరన్ మాత్రలు తీసుకోమని చెప్పడం జరుగుతుంది. హీమోగ్లోబిన్ శాతం బట్టి రోజుకు ఒకటి లేదా రెండు మాత్రలు చొప్పున సూచించడం జరుగుతుంటుంది. ఐరన్ మాత్రల వల్ల కొందరిలో మలబద్ధకం, వికారం, వాంతులు వంటి సమస్యలు ఉండవచ్చు. డా‘‘ వేనాటి శోభ బర్త్‌రైట్ బై రెయిన్బో ,హైదర్‌నగర్ హైదరాబాద్ -
ఈ టైమ్‌లో అవన్నీ చేయవచ్చా?
∙నా వయసు 22 సంవత్సరాలు. నేను ఈమధ్య కాస్త బరువు పెరిగాను. గడ్డం దగ్గర మొటిమలు వస్తున్నాయి. అవాంఛిత రోమాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. దీని గురించి నా స్నేహితురాలికి చెబితే ‘పీసీఓయస్ కావచ్చు’ అంటోంది. ఇది నిజమేనా? ఈ డిజార్డర్ గురించి, నివారణ చర్యల గురించి వివరంగా తెలియజేయగలరు. – యంఎన్, కొవ్వూరు పీసిఓయస్ అంటే Polycystic ovary syndrome (pcos) అందులో గర్భాశయం ఇరువైపుల ఉండే అండాశయాల్లో చిన్న చిన్న ఫాలికల్స్ ఎక్కువగా ఉండి, నీటి బుడగలులాగా ఉంటాయి. ఇవి కొన్ని హార్మోన్ల మార్పుల వల్ల, అధికబరువు, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, జన్యుపరమైన కారణాలతో పాటు ఇంకా ఎన్నో తెలియని కారణాల వల్ల ఏర్పడతాయి. మగవారిలో ఎక్కువగా ఉండే ఆండ్రోజన్, టెస్టోస్టిరాన్ హార్మోన్ pఛిౌటఉన్నవాళ్లలో ఎక్కువగా విడుదల అవుతుంది. దీని ప్రభావం వల్ల బరువు పెరగటం, అవాంఛిత రోమాలు, జుట్టు ఊడటం, మొటిమలు రావటం, పీరియడ్స్ క్రమం తప్పటం, గర్భం దాల్చడానికి ఇబ్బంది వంటి ఎన్నో లక్షణాలు బయటపడతాయి. చిన్న సమస్యగానే భావించి నిర్లక్ష్యం చేస్తే.. చిన్నవయసులోనే బీపి, షుగర్, గుండెజబ్బులు వంటి ఇతర సమస్యలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నిజానికి pఛిౌటస్కానింగ్ ద్వారా మరియు కొన్ని రక్త పరీక్షల ద్వారా నిర్ధారిస్తారు. ఇవి ఎవరికి, ఎందుకు వస్తాయి అని చెప్పలేం. జన్యుపరమైన కారణాల వల్ల, కొందరు సన్నగా ఉన్నా కూడా pఛిౌటరావచ్చు. ఇవి అనేక కారణాల వల్ల వస్తాయి కాబట్టి.. వీటికి నివారణ చర్యలు చెప్పటం కూడా కష్టం. కాకపోతే ఇవి ఇంకా ఎక్కువ పెరగకుండా లక్షణాల తీవ్రతను అదుపులోకి పెట్టుకోవటానికి బరువు పెరగకుండా వ్యాయామాలు, మితమైన డైటింగ్ చెయ్యటం మంచిది. అలాగే వారివారి లక్షణాలను బట్టి డాక్టర్ సలహా మేరకు మందులు వాడవలసి ఉంటుంది. వీరిలో షుగర్ ఉన్నవారిలోలాగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని తగ్గించడానికి కొందరికి షుగర్‌కి వాడే మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. నా వయసు 27 సంవత్సరాలు. నేను అధిక బరువు ఉంటాను. ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్. ఈ టైమ్‌లో డైట్, వ్యాయామాల ద్వారా బరువు తగ్గించుకునే ప్రయత్నం చేయవచ్చా? ఒకవేళ చేసే వీలు ఉంటే ఎలాంటి వ్యాయామాలు చేయాలో తెలియజేయగలరు. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు బరువు తగ్గించుకునే ప్రయత్నాలు మంచిది కాదని మా వారు అంటున్నారు. ఇది ఎంత వరకు నిజం? దయచేసి వివరంగా తెలపండి. – కె.నీలిమ, సంగారెడ్డి అధిక బరువు ఉండటం వల్ల హార్మోన్స్‌లో తేడాలు ఏర్పడి పిరియడ్స్‌లో ఇబ్బందులు, గర్భం దాల్చడానికి ఇబ్బందులు, త్వరగా చిన్నవయసులోనే బీపి, షుగర్, మోకాళ్లనొప్పులు వంటి ఇబ్బందులు వస్తుంటాయి. గర్భం దాల్చిన తర్వాత హార్మోన్ అసమతుల్యత వల్ల అబార్షన్లు, బీపి, షుగర్ పెరిగే అవకాశాలు, కాన్పు సమయంలో కాన్పు తర్వాత ఇబ్బందులు ఉండే అవకాశాలు ఎక్కువ. కాబట్టి బరువు తగ్గి సాధారణ బరువుకి వస్తే పైన చెప్పిన సమస్యల నుంచి బయటపడవచ్చు. బరువు తగ్గడానికి వాకింగ్, యోగా, జాగింగ్ వంటి వ్యాయామాలతో పాటు, మితమైన డైటింగ్ చెయ్యవచ్చు. ఇవన్నీ గర్భందాల్చక ముందే చెయ్యవలసిన పనులు. గర్భం వచ్చిన తర్వాత ఉన్న అధికబరువును తగ్గించడమనేది ఎంతమాత్రం మంచి పని కాదు. కానీ ఇంకా ఎక్కువ బరువు పెరగకుండా చూసుకోవచ్చు. ఆహారంలో అన్నం తక్కువ తీసుకుంటూ.. కూరలు ఎక్కువ తినడం, జంక్‌ఫుడ్, నూనె వస్తువులు, వేపుళ్లు, స్వీట్స్, చక్కెర వంటివి వాడకపోవటం, అరటిపండు, సపోటా వంటి చక్కెర శాతం ఎక్కువగా ఉండే పండ్లను అతి తక్కువగా తీసుకోవటం వంటివి పాటిస్తే ఎక్కువ బరువు పెరగకుండా చూసుకోవచ్చు. అలాగే రోజూ ఉదయం, సాయంకాలం 15 నిమిషాల పాటు సాధారణ వాకింగ్, మీ డాక్టర్ సలహా మేరకు అధికశ్రమలేని చిన్న చిన్న వ్యాయామాలు చేసుకోవచ్చు. చిన్న చిన్న ఇంటి పనులను కూడా చేసుకోవచ్చు. నేను ప్రెగ్నెంట్. నా వయసు 27. నేను ‘మార్నింగ్‌సిక్‌నెస్’ కు గురువుతున్నాను. ఏది తింటున్నా వికారంగానే అనిపిస్తోంది. దీని గురించి డాక్టర్‌ను సంప్రదించాల్సిన అవసరం ఉంటుందా? ‘మార్నింగ్‌సిక్‌నెస్’ పోవడానికి హోమ్రెమిడీల గురించి వివరంగా తెలియజేయగలరు. – జి.భార్గవి, నందిగామ ప్రెగ్నెన్సీ మొదలయిన మొదటి మూడు నెలల్లో, ఎదిగే పిండం దగ్గర నుంచి బీటా హెచ్‌సిజి (ఏఇఎ) అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఇది కొంతమందిలో కొద్దిగా, మరికొందరిలో ఎక్కువగా విడుదల అవుతుంది. దీని ప్రభావం వల్ల ఒక్కొక్కరిలో వికారం, వాంతులు, ఆకలిలేకపోవడం, నీరసం బద్ధకం, ఓపిక లేకపోవడం, నిద్ర ఎక్కువగా ఉండటం, లేదా నిద్రపట్టకపోవడం, కొన్ని రకాల ఆహారపు పదార్థాలు నచ్చకపోవడం, ఎసిడిటీ వంటి ఇబ్బందులు ఉంటాయి. వీటినే మార్నింగ్ సిక్నెస్ అంటారు. ఏఇఎ మోతాదుని బట్టి.. ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి.. మార్నింగ్ సిక్నెస్ లక్షణాలు ఉంటాయి. ఇవి మెల్లగా మూడు నెలలు దాటిన తర్వాత చాలావరకు తగ్గిపోతాయి. ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నప్పుడు త్వరగా జీర్ణమయ్యే ఆహారాన్ని కొద్దికొద్దిగా ఎక్కువసార్లు తీసుకోవాలి. తినే ఆహారంలో నూనె వస్తువులు, వేపుళ్లు, పచ్చళ్లు, కారం, మసాలాలు, కాఫీ, టీ వంటివి తీసుకోకపోవటమే అన్ని విధాల మంచిది. లేదా ఎంత తక్కువ తీసుకుంటే అంతమంచిది. కొబ్బరి నీళ్లు, మజ్జిగ, మంచినీళ్లు, రాగిజావ, పండ్లు, పండ్లరసాలు, పాలు వంటివి ఎక్కువసార్లు తీసుకోవచ్చు. లక్షణాలు మరీ ఎక్కువగా ఉంటే డాక్టర్ సలహా మేరకు.. ఛీ్ఠౌజీn్చ్ట్ఛ, ట్చnజ్టీజీఛీజీn్ఛ వంటి మాత్రలు, వాంతులు బాగా ఎక్కువగా ఉంటే ౌnఛ్చీnట్ఛ్టటౌn మాత్రలు వాడుకోవచ్చు. అంతేకానీ వికారం, వాంతులు అవుతున్నాయని, తినాలని అనిపించడంలేదని తినకుండా ఉండకూడదు. దీని వల్ల ఇంకా గ్యాస్ ఎక్కువగా ఏర్పడి.. లక్షణాల తీవ్రత పెరిగి.. సమస్య మరింత పెద్దదిగా మారవచ్చు. అందుకే వాంతులు అవుతున్నా, ఏదోఒకటి, కొద్దికొద్దిగా తాగుతూ, తింటూ ఉండాలి. మార్నింగ్‌సిక్‌నెస్ లక్షణాలు పెరుగుతూ బాగా ఇబ్బందిగా మారి కళ్లు తిరగడం, బీపీ తగ్గిపోవడం వంటివి ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేసి డాక్టర్ దగ్గరకు వెళ్లకపోతే.. డీహైడ్రేషన్‌లోకి వెళ్లి, ప్రాణాపాయస్థితికి చేరుకునే అవకాశాలూ లేకపోలేదు. ఇంటి చిట్కాలు, డాక్టర్ సలహాలు, మందులు పనిచెయ్యకపోతే.. తప్పనిసరిగా ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యి, అవసరమైన రక్తపరీక్షలు చేయించుకుని సెలైన్స్ పెట్టించుకోవలసి ఉంటుంది. అంతేకానీ నిర్లక్ష్యం ఎంతమాత్రం మంచిది కాదు. డా‘‘ వేనాటి శోభ బర్త్‌రైట్ బై రెయిన్బో హైదర్నగర్హైదరాబాద్ -
స్కూల్లో కళ్లు తిరిగి పడిపోతున్నాడు... ఎందుకిలా?
మా అబ్బాయికి తొమ్మిదేళ్లు. ఇటీవల రెండుసార్లు వాడు స్కూల్లో కళ్లు తిరిగిపడిపోయాడు. డాక్టర్‌కు చూపిస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. మా అబ్బాయి సమస్య ఏమిటో చెప్పండి. – కె. రాంబాబు, నకిరేకల్ మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీ అబ్బాయికి ఉన్న కండిషన్‌ను సింకోప్ అనుకోవచ్చు. అంటే ఉన్నట్టుండి అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడం అన్నమాట. ఇది ఏ వయసువారిలోనైనా రావచ్చు. పిల్లలు ఇలా పడిపోవడం అన్నది తల్లిదండ్రులకు ఎంతో ఆందోళన కలిగించే విషయమే అయినా ఇది చాలా సాధారణం. అయినప్పటికీ ఇలా జరిగినప్పుడు పూర్తిస్థాయి వైద్య పరీక్షలు అవసరం. సాధారణంగా కళ్లుతిరిగి పడిపోవడం (వేసోవ్యాగల్), గుండె సమస్యలు (లయ తప్పడం, అయోర్టిక్ స్టెనోసిస్), ఫిట్స్‌లో కొన్ని రకాలు, తీవ్రమైన నొప్పి వంటి అనేక కారణాలతో ఇలా జరగవచ్చు. అయితే మీ అబ్బాయి విషయంలో మామూలుగా కళ్లు తిరగడం (వేసోవ్యాగల్), ఒక్కసారిగా లేవగానే కళ్లు తిరగడం (ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్) వంటి కారణాలతో ఇది జరిగిందేమోనని భావించవచ్చు. అయినప్పటికీ మీరు ఒకసారి మీ పీడియాట్రిక్ నిపుణుడి ఆధ్వర్యంలో ఇలా కళ్లు తిరిగిపడిపోవడానికి గల కారణాలను కనుక్కోడానికి తగిన పరీక్షలు (ఈసీజీ, ఈఈజీ మొదలైనవి) చేయించాలి. ఇలాంటి పిల్లలకు నీళ్లు ఎక్కువగా తాగించడం, బిగుతుగా ఉండే దుస్తులు (ముఖ్యంగా మెడ వద్ద టైట్‌గా ఉన్నవి) తొడగకుండా ఉండటం మంచిది. పిల్లలను పడుకోబెట్టినప్పుడు తలవైపు కాస్త ఎత్తుగా ఉండేలా చేయడం వంటి జాగ్రత్తలతో ఈ సమస్యను చాలావరకు నిరోధించవచ్చు. ఇంత చిన్న పాపకూ అవాంఛిత రోమాలా...? మా పాప వయసు ఆరేళ్లు. పాపకు ఒళ్లంతా దాదాపు అంగుళం పొడవున్న వెంట్రుకలు ఉన్నాయి. భవిష్యత్తులో ఇవి మరింత పెరుగుతాయేమోనని భయంగా ఉంది. మా పాప సమస్యకు సరైన చికిత్స వివరించండి. – సుభద్ర, టెక్కలి మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీ పాపకు హైపర్ ట్రైకోసిస్ అన్న కండిషన్ ఉన్నట్లు అనిపిస్తోంది. అంటే... అవాంఛిత రోమాలు చాలా ఎక్కువగా, శరీరంలో చాలాచోట్ల ఉండటం అన్నమాట. పిల్లల్లో ఈ కండిషన్ చాలా అరుదు. మీరు చెప్పిన కొద్దిపాటి సమాచారంతో మీ పాపకు ఇవే లక్షణాలు కనిపించే హిర్సుటిజమ్ అనే కండిషన్ ఉండేందుకు అవకాశం తక్కువ.పిల్లల్లో అవాంఛిత రోమాలు ఎక్కువగా ఉంటే... అది దేహంలో కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడం లేదా ఒళ్లంతా ఉండటం, మరికొందరిలో కొంతకాలం పాటే ఉండటం లేదా కొందరిలో శాశ్వతంగా ఉండటం చూస్తుంటాం. కొందరిలో ఇలా వెంట్రుకలు ఎక్కువగా ఉండటం అన్నది పుట్టుకతోనే (కంజెనిటల్) వచ్చే సమస్య కాగా మరికొందరిలో మధ్యలో (అక్వైర్డ్) రావచ్చు. కుటుంబంలో వెంట్రుకలు ఎక్కువగా ఉంటే ఆ లక్షణం పిల్లలకూ రావడం (ఫెమీలియల్), జెనెటిక్, కొన్ని రకాల దీర్ఘకాలిక సమస్యలు, దీర్ఘకాలికంగా కొన్ని మందులు వాడటం, ఎండోక్రైన్ సమస్యల వంటివి అవాంఛిత రోమాలకు కారణం. పుట్టుకతోనే వెంట్రుకలు ఎక్కువగా ఉండేవారికి – అవి తొలగించేందుకు శాశ్వత చికిత్స చేయడం అన్నది కొద్దిగా క్లిష్టమైన సమస్యే. ఇలా అవాంఛిత రోమాలు రావడం అన్నది మధ్యలోనే వచ్చే సమస్య (ఉదాహరణకు దీర్ఘకాలికమైన మందులు, ఎండోక్రైన్ సమస్య, ఆహారలోపాల వల్ల) అయితే, సమస్యకు మూలకారణాన్ని గుర్తించి చికిత్స చేయగలిగితే శాశ్వత పరిష్కారం లభిస్తుంది. అవాంఛిత రోమాలు కేవలం ఒక విధానం విధానం ద్వారానే పూర్తి తొలగించడం సాధ్యం కాదు. ప్లకింగ్, ఎపిలేషన్, ఎలక్ట్రాలిస్, లేజర్థెరపీ వంటి ప్రక్రియలతో వాటిని తీసివేయవచ్చు. అయితే ఎలక్ట్రాలిసిస్, లేజర్ రిమూవల్ వంటి ప్రక్రియలను చిన్న వయసులోనే అనుసరించడం సరికాదు. మీరు ఒకసారి డెర్మటాలజిస్ట్ లేదా కాస్మటాలజిస్ట్ను కలిసి మీ పాప అవాంఛిత రోమాలకు ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయేమో అని నిర్ధారణ చేసుకుని, దాని ప్రకారం తగిన చికిత్స తీసుకోవాలి. గుండె రంధ్రాలు అవే పూడుకుపోతాయా...? మా బాబు పుట్టిన నెల తర్వాత బాగా జలుబుగా ఉన్నట్లు అనిపిస్తే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాం. గుండె లోపల రెండు రంధ్రాలు ఉన్నట్లు డాక్టర్ చెప్పారు. ‘చిన్న వయసు కదా... వాటంతట అవే పూడుకుంటాయి’ అన్నారు. మాకు ఆందోళనగా ఉంది. మా బాబు సమస్య నయమవుతుందా? వివరంగా తెలియజేగలరు. – సంధ్యారాణి, రాజంపేట మీరు బాబుకు గుండెలో రంధ్రాలున్నాయంటూ చెప్పిన వివరాలను బట్టి చూస్తే మీ బాబుకు ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ (ఏఎస్డీ... అంటే గుండె పై గదుల్లోని గోడలో రంధ్రాలు)గాని, వెంట్రిక్యులార్ సెప్టల్ డిఫెక్ట్ (వీఎస్డీ... అంటే గుండె కింది గదుల్లోని గోడలో రంధ్రాలు) గాని ఉండవచ్చు. ఇలా గుండె గదుల్లోని గోడలపై రంధ్రాలు ఉన్న సమస్యతో పిల్లలు నీలంగా మారిపోతూ (సైనోసిస్) ఉంటే అలాంటప్పుడు పిల్లలకు తక్షణం శస్త్రచికిత్స తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో గుండె గదుల గోడలకు రంధ్రాలు ఉండీ, పిల్లలు నీలంగా మారనప్పుడు, శ్వాసకోశానికి సంబంధించిన ఇతరత్రా సమస్యలు ఏవీ లేకుండా తక్షణం శస్త్రచికిత్స అవసరం ఉండకపోవచ్చు. అయితే అలాంటి పిల్లలకు భవిష్యత్తులో ఎలాంటి చికిత్స అవసరమన్నది ఆ రంధ్రాల పరిమాణం, అవి ఉన్న స్థానం మొదలైన అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ రంధ్రాలు వాటంతట అవే మూసుకుపోతాయా లేదా అన్నది కూడా ఆ రంధ్రాల పరిమాణం, అవి ఉన్న స్థానాలను బట్టి ఉంటుంది. ఆ రంధ్రాలు ఉండటం వల్ల వచ్చే ఇతరత్ర సమస్యల (అసోసియేటెడ్ కార్డియాక్ డిఫెక్ట్స్)పైన కూడా ఆధారపడి ఉంటుంది. గుండె పై గదుల మధ్య ఉన్న గోడకు రంధ్రం ఉన్న పిల్లలకు దాదాపు 60 శాతం నుంచి 70 శాతం మందిలో ఆ రంధ్రాలు వాటంతట అవే మూసుకుపోతాయి. గుండె కింది గదుల్లోని గోడకు రంధ్రం ఉన్న పిల్లలకు దాదాపు 30 శాతం నుంచి 40 మందిల్లోనూ ఆ రంధ్రాలు వాటంతట అవే మూసుకుపోవచ్చు. అలాగని గుండె గోడలకు ఉన్న రంధ్రాలన్నీ వాటంతట అవే మూసుకుపోతాయని చెప్పలేం. ఇలా గుండె గదుల మధ్య గోడకు రంధ్రాలు ఉన్న పిల్లలకు తరచూ నెమ్ము రావడం చూస్తుంటాం. అలాంటప్పుడు పిల్లలకు తక్షణ చికిత్స అవసరం. మీరు మీ అబ్బాయిని కనీసం ప్రతి ఆర్నెలకు ఒకసారి పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్‌కు చూపించాలి. ఒకవేళ గుండె గదుల మధ్యనున్న రంధ్రాలు వాటంతట అవే మూసుకోకపోయినా మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అందుబాటులో ఉన్న ఆధునిక వైద్య చికిత్స సహాయంతో – శస్త్రచికిత్స లేదా శస్త్రచికిత్స లేకుండానే మందులతో దాదాపు 90 శాతం నుంచి 95 శాతం సక్సెస్‌రేట్‌తో సమర్థంగా చికిత్స చేయడానికి అవకాశం ఉంది. మీరు మీ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్‌తో ఫాలోఅప్‌లో ఉండండి. డా. రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
మచ్చలను తుడిచేద్దాం...
బ్యూటిప్స్ ప్రతిరోజూ ఉదయం ముందుగా చన్నీటితో ముఖం కడిగి టొమాటో రసం, నిమ్మరసం మిశ్రమాన్ని ముఖానికి రాయాలి (ఒక బాటిల్లో తాజా టొమాటోరసం అంతే మోతాదులో నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో భద్రపరిచి రోజూ వాడవచ్చు). ఈ మిశ్రమాన్ని కాటన్‌తో కాని వేళ్లతో కాని అప్లయ్ చేయాలి. పది నిమిషాలకు లేదా ఆరిన తర్వాత చన్నీటితోనే తుడిచేయాలి. ఇది నేచురల్ స్కిన్‌కి మంచి టోనర్. ఇది ముఖం మీది నల్లమచ్చలతో పాటు అవాంఛిత రోమాలను కూడా తొలగిస్తుంది. మచ్చలను తొలగించడంలో చందనం చక్కగా పని చేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ చందనం పొడిలో తగినంత పన్నీటిని కలిపి ముఖానికి రాయాలి. ఆరిన తర్వాత చన్నీటితో తడిపి వలయాకారంగా రుద్దుతూ కడగాలి. ముఖం మీద ఉన్న మచ్చలు పోవాలంటే నిమ్మకాయ బాగా పని చేస్తుంది. ప్యాక్‌ల కోసం టైం కేటాయించలేని వాళ్లు వంటలోకి పిండేసిన నిమ్మచెక్కను తిరగేసి ముఖానికి రుద్ది పది నిమిషాల తర్వాత చన్నీటితో కడిగితే చాలు. క్రమంగా మచ్చలు చర్మంలో కలిసిపోతాయి. నిమ్మచెక్కను రసం పిండేసిన తర్వాత వెనక్కి తిప్పి చక్కెరలో అద్ది ముఖానికి సున్నితంగా మర్దన చేయాలి. ఇలా ప్రతిరోజూ చేస్తుంటే నల్లమచ్చలు, మొటిమలు అన్నీ పోయి ముఖం క్లియర్‌గా మారుతుంది. రెండు టీ స్పూన్ల పెసరపిండిలో చిటికెడు పసుపు కలిపి, రెండు చుక్కల నిమ్మరసం, ఒక స్పూను పెరుగు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత చన్నీటితో కడగాలి. -
సహజ కాంతి!
బియ్యప్పిండిలో కొద్దిగా పసుపు, నువ్వుల నూనె, కొద్దిగా నీళ్లు కలపాలి. ఈ మిశ్రమాన్ని శరీరానికి పట్టించి, సున్నితంగా రుద్దాలి. తర్వాత శుభ్రపరుచుకోవాలి. అవాంఛిత రోమాలు తగ్గుతాయి. చర్మం మృదువుగా అవుతుంది. పూలలోని పుప్పొడి, నల్ల నువ్వులు, పసుపుకొమ్ము, బార్లీ గింజలు సమపాళ్లలో తీసుకొని, పొడి చేసి, ఒక డబ్బాలో భద్రపరుచుకోవాలి. ఈ పొడిని కావల్సినంత తీసుకొని, తగినన్ని నీళ్లు కలిపి, ముఖానికి, శరీరానికి పట్టించాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల చలికాలం చర్మం కాంతిమంతం అవుతుంది. టీ స్పూన్ టొమాటో గుజ్జు, సెనగపిండి, చిటికెడు పసుపు, అర టీ స్పూన్ నిమ్మరసం కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి, కళ్ల మీద గుండ్రంగా తరిగిన కీరా ముక్కలు ఉంచి ఇరవై నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. తర్వాత ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తుంటే కళ్లకింద నల్లని వలయాలు తగ్గుముఖం పట్టి, ముఖం కాంతిమంతం అవుతుంది.