Laser Hair Removal Devices For Painless Treatment At Home - Sakshi
Sakshi News home page

Hair Removal Devices : కేవలం పదినిమిషాల్లో బాడీ క్లీనింగ్‌..ఈ వ్యాక్సింగ్‌ మెషీన్‌ గురించి తెలుసా?

Published Mon, Jun 26 2023 4:57 PM | Last Updated on Thu, Jul 27 2023 6:41 PM

Laser Hair Removal Devices For Painless Tratment - Sakshi

బ్యూటీ లవర్స్‌కి అన్నింటి కంటే అతిపెద్ద సమస్య అవాంఛితరోమాలే. నెలకోసారి పార్లర్‌కి వెళ్లి వాక్సింగ్‌ చేయించుకోవడం.. లేదంటే ఇంట్లోనే రకరకాల సాధనాలతో అవాంఛిత రోమాలను తొలగించుకోవడం.. తప్పించుకోలేని సమస్యగా మారుతుంది. అదంతా ఓ విసుగు వ్యవహారం. ఆ సమస్య.. విసుగును కట్‌ చేస్తుంది  ఈ హెయిర్‌ రిమూవల్‌ డివైస్‌. నొప్పి తెలియకుండా.. సమయమూ ఎక్కువ తీసుకోకుండా  శాశ్వత పరిష్కారాన్ని అందిస్తుంది. 

ఈ లేజర్‌ హెయిర్‌ రిమూవల్‌ డివైస్‌.. అప్‌గ్రేడ్‌ వెర్షన్స్‌ లో అందుబాటులోకి వచ్చింది. ఇది కేవలం 10 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతను మాత్రమే విడుదల చేయడంతో చర్మం కందిపోదు, ఎరుపెక్కదు. దీనిలో 5 లెవెల్స్‌ ఉంటాయి. అయితే సున్నితమైన భాగాలను బట్టి ఆ లెవెల్స్‌ని పెంచుకోవడం, తగ్గించుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది.



ఇందులో మాన్యువల్‌ మోడ్‌ని.. ప్రధానంగా బికినీ లైన్, అండర్‌ ఆర్మ్స్, వేళ్లు, పై పెదవి.. భాగాల్లో రోమాలను  తొలగించడానికి ఉపయోగించాలి.  దీనిలోని ఆటో మోడ్‌ని.. చేతులు, కాళ్లు, పొట్ట, వీపు వంటి ఏరియాల్లో వెంట్రుకలను తొలగించడానికి యూజ్‌ చేయాలి. ఇది ఎరుపు, తెలుపు, గ్రే కలర్‌ వెంట్రుకలను తీయడానికి పనిచేయదు. 



ఇది కేవలం ఎనిమిది నిమిషాల్లో మొత్తం బాడీని క్లీన్‌ చేయగలదు. అయితే ముందుగా షేవ్‌ చేసుకుని.. ఆ తర్వాత ఈ డివైస్‌తో ట్రీట్‌మెంట్‌ తీసుకోవాలి. దీన్ని వినియోగించే సమయంలో మెషిన్‌తో పాటు వచ్చే ప్రత్యేకమైన కళ్లజోడును ధరించడం మంచిది. సరిగ్గా నాలుగు వారాల పాటు.. దీని మెనూ బుక్‌ని ఫాలో అవుతూ ట్రీట్‌మెంట్‌ తీసుకుంటే సరిపోతుంది. ఈ డివైస్‌ ధర సుమారు 7,829 రూపాయలు. ఇలాంటి లేటెస్ట్‌ మోడల్స్‌ని కొనుగోలు చేసే ముందు రివ్యూలు చదివి.. ఆర్డర్‌ చేయడం మంచిది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement