నోమోఫోబియా
మొబైల్ ఫోన్ల వాడకానికి– క్యాన్సర్‌కు మధ్య ఏమైనా సంబంధం ఉందా? ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచవ్యాప్తంగా 5వేలకు పైగా అధ్యయనాలను సమీక్షించింది. ఆస్ట్రేలియన్ రేడియేషన్ ప్రొటెక్షన్ అండ్ న్యూక్లియర్ సేఫ్టీ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఈ సమీక్ష జరిపింది. 1994 నుంచి 2022 సంవత్సరాల మధ్య ఉన్న అధ్యయనాలను తీసుకొని చేసిన సమీక్ష లో ఆసక్తికరమైన అంశాలెన్నో వెలుగులోకి వచ్చాయి.
ప్రపంచంలో 70 శాతం మంది స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. మొబైల్ ఫోన్ల వాడకం వల్ల క్యాన్సర్ రాదు కానీ, అనేక నష్టాలు ఉన్నాయని స్పష్టం చేసింది. వాటిలో..
– రీల్స్ విజృంభణ వల్ల ప్రతి 30 సెకన్లకు రీల్ చొప్పున మారుతూ ఫోన్‌ని అదేపనిగా చూస్తూనే ఉంటారు. దీంతో చూపు తగ్గుతోంది.
– అర్ధరాత్రి దాటుతున్నా మొబైల్ నుంచి వెలువడే కాంతి వల్ల మన శరీరం నిద్రకు అవసరం అయ్యే హార్మోన్‌ను విడుదల చేయదు. దాంతో గాఢ నిద్ర పట్టక పనితీరు మందగిస్తుంది. రోగనిరోధక శక్తి తగ్గి, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది.
– మొబైల్ స్క్రీన్‌ను చూసే క్రమంలో కళ్లు ΄÷డిబారడం, చూపు మందగించడం, తలనొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇవన్నీ కంటిచూపుపై ప్రభావం చూపుతాయి.
– అదేపనిగా స్క్రీన్ చూడటం వల్ల కళ్లు, మెడ కండరాలపై ఒత్తిడి పెరిగి, మానసిక ఆందోళన పెరుగుతుంది.
– కొంతమంది టాయిలెట్‌కు వెళ్లినా, మంచం మీద పడుకున్నా ఫోన్ చూస్తూనే ఉంటారు. ప్రతి దానికీ మొబైల్‌పైనే ఆధారపడే వ్యసనాన్ని ‘నోమోఫోబియా’ అంటారు. అంటే, మొబైల్ లేకుండా ఉండలేకపోవడం.
– అతిగా మొబైల్ వాడటం వల్ల పరధ్యానం వస్తుంది. చేస్తున్న పనిపై ఏకాగ్రత ఉండదు. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, ఇర్విన్ అధ్యయనం గడిచిన 20 ఏళ్లలో మానవుల సగటు ఏకాగ్రత 2.5 నిమిషాల నుండి 47 సెకన్లకు తగ్గిందని తేల్చింది.
– ఎక్కువ స్క్రీన్ సమయం వల్ల పిల్లలలో భావోద్వేగాలు తగ్గిపోతున్నాయి. ఆరుబయట ఆటలు తగ్గిపోతున్నాయి. నిద్ర, ఆకలి మందగించడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. మానసిక, శారీరక ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ సెల్ డేటా ప్రకారం కొన్నాళ్లుగా స్మార్ట్ ఫోన్ అమ్మకాలు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తతరం మళ్లీ బేసిక్ ఫోన్లను కొనడం ప్రారంభించిందనడానికి ఇదో ఉదాహరణ. మెదడును ఉపయోగించకుండా ఫోన్‌లపై ఆధారపడినట్లయితే మెదడు పనితీరు బలహీనంగా మారి, పరిణామంలో కూడా చిన్నదైపోతుందని చాలామంది శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ కంటే మన మెదడు చాలా వేగం, శక్తిమంతమైనది. అందుకే స్మార్ట్‌ఫోన్ అధిక వాడకాన్ని స్మార్ట్‌గా తప్పించేద్దాం.
ఇవి చదవండి: Health: మీకు తెలుసా.. అతి తిండీ కూడా అడిక్షనే!
Comments
Please login to add a commentAdd a comment