using
-
స్మార్ట్‌ఫోన్ అధిక వాడకాన్ని.. 'స్మార్ట్'గా తప్పించుకుందాం!
మొబైల్ ఫోన్ల వాడకానికి– క్యాన్సర్‌కు మధ్య ఏమైనా సంబంధం ఉందా? ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచవ్యాప్తంగా 5వేలకు పైగా అధ్యయనాలను సమీక్షించింది. ఆస్ట్రేలియన్ రేడియేషన్ ప్రొటెక్షన్ అండ్ న్యూక్లియర్ సేఫ్టీ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఈ సమీక్ష జరిపింది. 1994 నుంచి 2022 సంవత్సరాల మధ్య ఉన్న అధ్యయనాలను తీసుకొని చేసిన సమీక్ష లో ఆసక్తికరమైన అంశాలెన్నో వెలుగులోకి వచ్చాయి.ప్రపంచంలో 70 శాతం మంది స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. మొబైల్ ఫోన్ల వాడకం వల్ల క్యాన్సర్ రాదు కానీ, అనేక నష్టాలు ఉన్నాయని స్పష్టం చేసింది. వాటిలో..– రీల్స్ విజృంభణ వల్ల ప్రతి 30 సెకన్లకు రీల్ చొప్పున మారుతూ ఫోన్‌ని అదేపనిగా చూస్తూనే ఉంటారు. దీంతో చూపు తగ్గుతోంది. – అర్ధరాత్రి దాటుతున్నా మొబైల్ నుంచి వెలువడే కాంతి వల్ల మన శరీరం నిద్రకు అవసరం అయ్యే హార్మోన్‌ను విడుదల చేయదు. దాంతో గాఢ నిద్ర పట్టక పనితీరు మందగిస్తుంది. రోగనిరోధక శక్తి తగ్గి, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. – మొబైల్ స్క్రీన్‌ను చూసే క్రమంలో కళ్లు ΄÷డిబారడం, చూపు మందగించడం, తలనొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇవన్నీ కంటిచూపుపై ప్రభావం చూపుతాయి. – అదేపనిగా స్క్రీన్ చూడటం వల్ల కళ్లు, మెడ కండరాలపై ఒత్తిడి పెరిగి, మానసిక ఆందోళన పెరుగుతుంది. – కొంతమంది టాయిలెట్‌కు వెళ్లినా, మంచం మీద పడుకున్నా ఫోన్ చూస్తూనే ఉంటారు. ప్రతి దానికీ మొబైల్‌పైనే ఆధారపడే వ్యసనాన్ని ‘నోమోఫోబియా’ అంటారు. అంటే, మొబైల్ లేకుండా ఉండలేకపోవడం. – అతిగా మొబైల్ వాడటం వల్ల పరధ్యానం వస్తుంది. చేస్తున్న పనిపై ఏకాగ్రత ఉండదు. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, ఇర్విన్ అధ్యయనం గడిచిన 20 ఏళ్లలో మానవుల సగటు ఏకాగ్రత 2.5 నిమిషాల నుండి 47 సెకన్లకు తగ్గిందని తేల్చింది. – ఎక్కువ స్క్రీన్ సమయం వల్ల పిల్లలలో భావోద్వేగాలు తగ్గిపోతున్నాయి. ఆరుబయట ఆటలు తగ్గిపోతున్నాయి. నిద్ర, ఆకలి మందగించడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. మానసిక, శారీరక ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం పడుతుంది.కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ సెల్ డేటా ప్రకారం కొన్నాళ్లుగా స్మార్ట్ ఫోన్ అమ్మకాలు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తతరం మళ్లీ బేసిక్ ఫోన్లను కొనడం ప్రారంభించిందనడానికి ఇదో ఉదాహరణ. మెదడును ఉపయోగించకుండా ఫోన్లపై ఆధారపడినట్లయితే మెదడు పనితీరు బలహీనంగా మారి, పరిణామంలో కూడా చిన్నదైపోతుందని చాలామంది శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ కంటే మన మెదడు చాలా వేగం, శక్తిమంతమైనది. అందుకే స్మార్ట్‌ఫోన్ అధిక వాడకాన్ని స్మార్ట్‌గా తప్పించేద్దాం.ఇవి చదవండి: Health: మీకు తెలుసా.. అతి తిండీ కూడా అడిక్షనే! -
నాన్‌స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
ఇటీవల చాలామంది నాన్‌స్టిక్ పాత్రలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. వీటిల్లో అయితే డీప్ ఫ్రైలు చేస్తే ఆయిల్ ఎక్కుపట్టదు. అదీగాక గమ్మున అడుగంటదు, ఈజీగా వంట అయిపోతుందని మహిళలు ఈ పాత్రలకే ప్రాముఖ్యత ఇస్తుంటారు. ఐతే వీటిని అస్సలు ఉపయోగించొద్దని ఇండియన్ కౌన్సిల్ ఆప్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) గట్టిగా హెచ్చరిస్తోంది. వీటి వినియోగం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదమని తెలిపింది. పైగా ఎలాంటి పాత్రలు వాడితే మంచిదో కూడా సూచనలు ఇచ్చిందో అవేంటో సవివరంగా తెలుసుకుందామా!.ఎందుకు మంచిది కాదంటే..నాన్‌స్టిక్ వంటపాత్రలపై చిన్న గీత పడినా దాని మీద ఉన్న టెఫ్లాన్ పైపూత (కోటింగ్)లో నుంచి విష వాయువులు, హానికారక రసాయనాలు వెలువడి ఆహారంలో కలుస్తాయని ఐసీఎంఆర్ తెలిపింది. ఒక్క గీత నుంచి కనీసం 9,100 మైక్రోప్లాస్టిక్ రేణువులు విడుదలవుతాయని పేర్కొంది. గీతలు పడిన నాన్‌స్టిక్ వంటపాత్రలను 170 డిగ్రీల సెల్సియస్ కన్నా అధిక ఉష్ణోగ్రత వద్ద వంట చేసినప్పుడు ఈ ప్రమాదం ఉందని తెలిపింది. కడిగేటప్పుడు నాన్‌స్టిక్ పాత్రలపై బోలెడన్ని గీతలు పడుతుంటాయి. ఈ లెక్కన వీటి నుంచి కొన్ని లక్షల మైక్రోప్లాస్టిక్స్ విడుదలయ్యే ప్రమాదం ఉంది. అవి తెలియకుండానే మనం తినే ఆహారంలో కలిసిపోతాయని పేర్కొంది. అందువల్ల వీటిని వినియోగించటం ఆరోగ్యానికి చాలా ప్రమాదమని వెల్లడించింది. వచ్చే అనారోగ్య సమస్యలు..హార్మోన్లలో అసమతుల్యత, క్యాన్సర్, సంతానోత్పత్తి సమస్యలు వంటివి తలెత్తవచ్చని ఐసీఎంఆర్ పేర్కొంది. నాన్ స్టిక్ వంటపాత్రల బదులు మట్టిపాత్రల్లో వండుకోవటం అత్యంత సురక్షితమని తెలిపింది. మరో ప్రత్యామ్నాయంగా గ్రానైట్ పాత్రలను కూడా సూచించింది. అయితే వాటిపై ఎటువంటి రసాయన పూతలు ఉండవద్దని పేర్కొంది. అలాగే ఫుడ్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు కూడా మంచివేనని తెలిపింది. ఈ మేరక సీఎంఆర్ భారతీయులకు ఆహార మార్గదర్శకాలు అనే పేరుతో ఈ సూచనలను ఇటీవలే విడుదల చేసింది.(చదవండి: ఆస్ట్రేలియాలో ఏం జరుగుతోంది? ఎందుకలా..?) -
బైక్‌పై ఫోన్.. రింగ్ రోడ్డుపై రౌండ్లు తిరుగుతూ కిందపడ్డాడు..!
డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ మాట్లాడితే ప్రమాదాలు జరుగుతాయని అధికారులు హెచ్చరికలు చేస్తుంటారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో కూడా ప్రమాదానికి సెల్‌ఫోనే కారణం.. కానీ ఇది పూర్తిగా విభిన్నం. ఏ వాహనం అతన్ని టచ్ చేయకుండానే బైక్‌పై నుంచి కిందపడ్డాడు. ఈ తీరు చూస్తే తప్పకుండా నవ్వు ఆపుకోలేరు. వీడియోలో చూపిన విధంగా.. ఫోన్ మాట్లాడుతూ ఓ వ్యక్తి బైక్‌ను నడుపుతున్నాడు. కూడలిలో సిగ్నల్ రావడంతో బైక్‌ను నిలిపివేయాల్సిన అవసరం ఏర్పడింది. కానీ ఓ పక్క ఫోన్‌ను చెవి వద్ద పెట్టుకుని మరో పక్క బైక్‌ను అదుపు చేయలేక పోయాడు. రింగు రోడ్డుపై రౌండ్లు తిరుగుతూ కిందపడిపోయాడు. విచిత్రమేమంటే.. కిందపడిపోతున్నా.. అతను సెల్‌ఫోన్ విడవకపోవడం గమనార్హం. Important call ayy untadi 🏃♂️🏃♂️😂😂 pic.twitter.com/JHAJj5LQGj — Pakkinti Uncle (@Idly_Baba) July 18, 2023 ఈ వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. పాపం.. చాలా ముఖ్యమైన కాల్ అనుకుంటా.. కిందపడిపోతున్నా చెవి వద్ద ఫోన్ తీయకుండా మాట్లాడుతున్నాడంటూ కామెంట్లు పెట్టారు. ఇదీ చదవండి: Viral Video: అమ్మా! తల్లి ఏం డేరింగ్?..ఏకంగా సింహంతో ఒకే ప్లేట్లో.. -
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఆకతాయి పని..
సాంకేతిక ప్రపంచంలో సంచలనం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ప్రపంచ వ్యాప్తంగా దీన్ని వివిధ రకాలుగా, వివిధ పనుల కోసం ఉపయోగిస్తున్నారు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి ఆకతాయి పని చేసి అరెస్ట్ అయి కటకటాలపాలయ్యాడో వ్యక్తి. ఇదీ చదవండి: జిమ్నీ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. లాంచింగ్ మే నెలలో కాదు! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ చాట్‌జీపీటీని ఉపయోగించి ఫేక్ వార్తలను రాసినందుకు చైనాలో ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. రైలు ప్రమాదం జరిగి 9 మంది మృతి చెందారని ఫేక్ వార్తా కథనాన్ని పోస్ట్ చేశాడు నిందితుడు. ఈ కథనం బైజియావో అనే బ్లాగ్ కు సంబందించిన ఖాతాలలో ప్రచురితమైంది. 15 వేల మంది ఈ తప్పుడు వార్తను చూశారు. క్లిక్‌బైట్ ద్వారా డబ్బు సంపాదించేందుకే తప్పుడు కథనాలను పోస్ట్ చేసినట్లు నిందితుడు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను దుర్వినియోగం చేసినందుకు ఓ వ్యక్తిని అరెస్టు చేయడం చైనాలో మొదటిసారిగా జరిగింది. ఇదీ చదవండి: Paytm New Features: పేటీఎంలో సరికొత్త ఫీచర్లు.. యూపీఐ బిల్లును పంచుకోవచ్చు! హాంగ్ అనే ఇంటిపేరుతో ఉన్న ఓ వ్యక్తి తప్పుడు సమాచారాన్ని రూపొందించడానికి ఆధునిక సాంకేతిక పద్ధతులను ఉపయోగించుకున్నాడని దానిని సోషల్ మీడియాలో వ్యాప్తి చేసాడని ఉత్తర గన్సు ప్రావిన్స్ పబ్లిక్ సెక్యూరిటీ బ్యూరో WeChatలో పోస్ట్ చేసిన ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. నిందితుడు చేసిన ఆకతాయి పనికి అతనికి ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ సంఘటన చాట్ జీపీటీ వంటి జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దుర్వినియోగాన్ని మరోసారి తెలియజేసింది. -
కోర్ట్ లో టిప్పులు.. యూనిఫామ్ పై QR కోడ్..
-
సెల్ టు హెల్
సాక్షి, హైదరాబాద్ : యువతను సెల్‌భూతం పట్టిపీడిస్తోంది. చేతిలో పెద్ద అణుబాంబుగా తయారైంది. అవసరం లేకపోయినా సెల్ఫోన్లో ఎక్కువ సేపు మాట్లాడటం.. గంటల తరబడి ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్‌లో చాటింగ్స్ చేయడం...రాత్రంతా ఫోన్‌ను పక్కన పెట్టుకుని యూటూబ్‌లో వీడియోలు వీక్షించడం వల్ల అనేక రకాల ఎలర్జీ సమస్యలు తలెత్తుతున్నట్లు హైదరాబాద్‌లోని అశ్వినీ ఎలర్జీ సెంటర్ సర్వేలో తేలింది. ఇందుకోసం దాదాపు వంద మందిపై పరిశోధన చేశారు. వీరిని నాలుగు వారాల పాటు సెల్ ఫోన్ వినియోగానికి దూరంగా ఉంచి శారీరకంగా, మానసికంగా చోటు చేసుకున్న మార్పులను పరిశీలించారు. ఎన్నో సమస్యలు.. సెల్‌ఫోన్ వాడేవారిలో తలనొప్పి, ఏకగ్రాతను కోల్పోవడం, చికాకు, ముక్కు, కంటి నుంచి నీరు కారడం వంటి ఎలర్జీలను గుర్తించారు. ఫోన్కవర్ తయారీలో వాడే నికెల్ రసాయనంతోపాటు సెల్ ఫోన్ నుంచి వెలువడే రేడియేషనే ప్రధాన కారణమని గుర్తించారు. ఈ మేరకు గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ ఈ పరిశోధనా ఫలితాలు వెల్లడించారు. ఆ వివరాల ప్రకారం.. దెబ్బతింటున్న చర్మం.. సెల్‌ఫోన్ వాడకం వల్ల చర్మంపై పగుళ్లు ఏర్పడుతుండగా, నిత్యం స్క్రీన్‌పై చేతివేళ్లు టచ్ చేస్తుండటం వల్ల అవి స్పర్శను కోల్పొతున్నారు. బాధితుల్లో 40 శాతం మంది ఎలర్జీ రైనటీస్(ముక్కు నుంచి నీరు కారడం, ముక్కు బిగుసుకు పోవడం)తో బాధపడుతుంటే, 10 నుంచి 15 శాతం మంది ఎటోపిక్ ఆస్తమా(శ్వాస నాళాలు మూసుకు పోవడం)తో బాధపడుతున్నారు. సెల్‌ఫోన్ నుంచి వెలువడే రేడియేషన్ వల్ల ఫేస్మేకర్ అమర్చుకున్న హృద్రోగులకు కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పిల్లలపై తీవ్ర ప్రభావం... హైదరాబాద్ నగరంలో 1.20 కోట్ల జనాభా ఉండగా.. వీరిలో కోటి మందికిపైగా సెల్‌ఫోన్స్ వినియోగిస్తున్నట్లు ఓ అంచనా. వీరిలో పిల్లలు కూడా ఉంటున్నారు. అవలీలగా పిల్లలు సెల్‌ఫోన్ ఆపరేటింగ్ చేస్తున్నాడని చాలా మంది తల్లిదండ్రులు ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. వాళ్లు ఆపరేట్ చేస్తుంటే చెప్పుకొని మురిసిపోతుంటారు. నిజానికది చాలా ప్రమాదం. పిల్లల సున్నితమైన శరీరంపై సెల్‌ఫోన్ రేడియేషన్ తీవ్రమైన ప్రభావం చూపుతుంది. మొబైల్ కవర్స్ తయారీలో నికెల్ రసాయనంతో కూడిన పూత రాస్తుంటారు. సెల్‌పోన్‌ను చెవులవద్ద, దవడ భాగంలో పెట్టుకుని మాట్లాడడం వల్ల చెవిపోటు, వినికిడి సమస్యతోపాటు దురద, దద్దుర్లు, తలనొప్పి, ముక్కుకారడం, ఆయాసం, చర్మం పొడిబారటం, వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. కొంత మంది తాము చాలా ఖరీదైన ఫోన్ వాడుతున్నాం కాబట్టి తమకు ఎలాంటి రేడియేషన్ సమస్యలు ఉండవని భావిస్తుంటారు. నిజానికి అది తప్పు. ఎంతటి ఖరీదైన ఫోనైనా రేడియేషన్ తప్పదు. సెల్ టవర్ల నుంచి వెలువడే రేడియేషన్ కేవలం ప్రజారోగ్యంపైనే కాకుండా పక్షులు, పిచ్చుకలు, తేనేటీగలు, తుమ్మెదలు వంటి చిరు జీవులపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ సూచనలు పాటించండి.. సెల్ ఈజ్ హెల్ అని తేలిపోయినప్పటికీ..ప్రస్తుతం ఇది జీవితంలో భాగమైంది. ప్రస్తుతం దీన్ని వాడకుండా ఉండలేని పరిస్థితి నెలకొంది. కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే, ఈ ముప్పు నుంచి కొంత వరకు బయటపడొచ్చు. నిరవధికంగా ఎనిమిది గంటల పాటు ఫోన్ మాట్లాడే వారికి చెవుడు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. రెండు మూడు నిమిషాలకు మించి సెల్ఫోన్లో మాట్లాడరాదు. సాధ్యమైనంత వరకు ఎస్ఎంఎస్ చేయడం అలవాటు చేసుకోవాలి. వైర్లెస్ హెడ్ ఫోన్స్, బ్లూటూత్స్ వాడటం ఉత్తమం. చెవికి ఫోన్ దూరంగా ఉంచి మాట్లాడాలి. కారు నడుపుతున్నప్పుడు కానీ, బండి నడుపుతున్నపుడు కానీ సెల్ ఫో న్ యూజ్ చేయకూడదు. లౌడ్ స్పీకర్‌ను ఆన్ చేసి మాట్లాడ కూడదు. పడుకునేప్పుడు సెల్ ఫోన్ తల దగ్గర పెట్టుకోవద్దు. – డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్రావు, అశ్విని ఎలర్జీ సెంటర్ -
ఇంటర్నెట్ను ఎక్కువగా వాడితే...
ఇంటర్నెట్ ఎక్కువగా వాడితే మనిషి సంతోషంగా ఉంటాడంటూ ఒక సర్వే తెలిపింది. అయితే అది వాడే విధానంపై ఆధారపడి ఉంటుందనీ, ఎంతసేపు ఇంటర్నెట్ బ్రౌజ్ చేశామన్నది కాదు, దేని గురించి సెర్చ్ చేశాం అన్నది ముఖ్యమంటున్నారు పరిశోధకులు. నెట్‌ను ఎక్కువగా వాడేవారు చాలా సంతోషంగా ఉంటున్నారనీ యూరప్‌లో దాదాపు లక్ష మందిపై సర్వే చేశామని వారు పేర్కొన్నారు. మనిషి ఎప్పుడూ ఆశావాదే. సంతోషంగా ఉండాలని అనుకుంటాడు. జీవితంలో సంతోషమనేది యూ(U) ఆకారంలో ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఒక వయసు వరకు సంతోషంగా ఉంటారనీ, వయసు పెరిగే కొద్దీ సంతోషంగా ఉండలేరనీ, మళ్లీ వృద్దాప్యంలో సంతోషంగా ఉండే అవకాశం ఉంటుందని సర్వేలో తేలింది. ఆన్లైన్లో ఉండడం వల్ల సామాజిక సంబంధాలు మెరుగుపడతాయని, వారి స్నేహితులు, బంధువులతో నిత్యం టచ్‌లో ఉండటంతో వారు హ్యాపీగా ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. యూరప్‌లోని లక్షమందిపై చేసిన ఈ సర్వేలో వీరి వ్యక్తిగత వివరాలను పరిగణనలోకి తీసుకోలేదని, కేవలం ఆన్లైన్లో ఉండే సమయం, వయసులను మాత్రమే తీసుకున్నామని నార్వేలోని కల్చరల్ యూనివర్సిటీ ఆఫ్ ఓస్లో పరిశోధకులు వెల్లడించారు. యవ్వన వయస్కుల్లో ఈ తేడా కనిపించలేదట. మధ్య వయస్కుల్లోనే ఇంటర్నెట్ ఎక్కువగా వాడేవారు ఆనందంగా ఉన్నారు. ఏం చేస్తే మనిషి సంతోషంగా ఉంటాడు? బాధను దరిచేరనీయకుండా, క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా, సమయపాలన, పాజిటివ్ థింకింగ్ చేయడం. నీతో నువ్వు స్నేహితుడిగా ఉండటం. మద్యపానానికి దూరంగా ఉండటం. మంచి డైట్‌ను పాటించటం. సమయానికి నిద్ర పోవడం. కష్ట సమయాల్లో తమ విషయాలను స్నేహితులు, ఆత్మీయులతో పంచుకుంటే చాలా ఉపశమనం ఉంటుంది. ఇంటర్నెట్ వాడకం వల్ల మధ్య వయస్కుల్లో సంతోషంగా ఉండేవారి సంఖ్య పెరుగుతోందని శాస్త్రవేత్తలు తెలిపారు. జర్మనీకి చెందిన మరో శాస్త్రవేత్త పైన చెప్పిన విషయాలతో ఏకీభవించలేదు. ఇంటర్నెట్ వాడకం వల్ల లాభనష్టాలు రెండూ ఉన్నాయి. మంచి, చెడు విషయాలకు వాడుకోవచ్చని ఇలా అన్నింటిని కలిపి ఇంటర్నెట్ అనే గొడుగు కిందకు చేర్చి కేవలం మంచి మాత్రమే జరుగుతుందని చెప్పలేమని పరిశోధకులు పేర్కొన్నారు. -
స్వైపింగ్ మెషీన్లు అలంకారప్రాయమే
రిజస్ట్రేషన్ శాఖకు 32 మెషీన్ల అందజేత దాదాపు అన్నిచోట్లా వినియోగించని సిబ్బంది పట్టించుకోని డిఐజీ కాకినాడ లీగల్ (కాకినాడ సిటీ) : నగదు రహిత లావాదేవీల కోసమంటూ స్టాంప్స్ అండ్ రిజస్ట్రేషన్ శాఖలో స్వైపింగ్ మెషీన్లు ఏర్పాటు చేసినా, వాటి వినియోగించింది లేదు. స్థిరాస్థి హక్కుదారులు, వాటి కొనుగోలుదారులు ఈసీలు, నకళ్లు తీసుకునేందుకు, ఇతర సేవలు పొందేందుకు జిల్లాలోని 32 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ లక్ష్మీకుమారి ఈ నెల 3న ఈ స్వైపింగ్ మెషీన్లు అందజేశారు.ఈసీలు, నకళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి నుంచి తీసుకున్న నగదుకు రసీదు ఇవ్వాలి.అయినప్పటికీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ఉద్యోగులు వాటిని ఇవ్వడం లేదు. దీనివల్ల ఈసీ, నకలు కోసం దరఖాస్తు చేసుకున్న వారు వారం రోజులపాటు ఈ కార్యాలయం చుట్టూ తిరగక తప్పడం లేదు. స్వైపింగ్ మిషన్ వినియోగంలో ఉంటే లాభమేమిటి? స్వైపింగ్ మెషీన్ రిజిస్ట్రేషన్ శాఖలో వినియోగంలో ఉంటే నగదు లావాదేవీలు జరిపే సమయం బిల్లులో వస్తుంది. సిటిజన్ చార్ట్ ప్రకారం ఈ బిల్లు తీసుకున్న కక్షిదారుడికి కంప్యూటర్ ఈసీ గానీ, నకలు గానీ గంటలోగా ఇవ్వాలి. అదే మాన్యూల్ ఈసీగానీ, నకలు కానీ 24 గంటల్లో అందజేయాలి. ఈ కారణంగా రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులు స్వైపింగ్ మెషీన్‌ను పక్కన పెట్టి నగదు రూపంలో సొమ్ము తీసుకుంటున్నారు. నిర్ధేశిత సమయానికి ఇవ్వకపోతే పరిహారం సిటిజన్ చార్ట్ ప్రకారం నకళ్లు, ఈసీలు ఇవ్వాల్సిన సమయాన్ని ఖరారు చేస్తూ 2013లో జీవో నంబర్ 1054ను ప్రభుత్వం జారీచేసింది. ఈ జీవో ప్రకారం కక్షిదారుడు కంప్యూటర్ ఈసీగానీ, నకలుకుగానీ దరఖాస్తు చేసుకున్న గంటలోగా ఇవ్వకపోతే ఆ ఉద్యోగి ప్రతి గంటకు రూ.10 చొప్పున కక్షిదారుడికి చెల్లించాలి. అలాగే మాన్యూల్ ఈసీగానీ, నకలు గానీ 24 గంటల్లో తిరిగి ఇవ్వకపోతే రూ.50 ఇవ్వాలి. స్వైపింగ్‌ను ఎందుకు ఉపయోగించడం లేదంటే... జిల్లాలో కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్వైపింగ్ మెషీన్ ద్వారా ఈసీలు, నకళ్లు ఇవ్వడం లేదు. కారణం ఏమిటని కక్షిదారులు ప్రశ్నిస్తుంటే.... స్వైపింగ్ మెషీన్ ద్వారా ఈసీలు, నకళ్లు ఇస్తుంటే డైరెక్టుగా కక్షిదారులు ఇచ్చే సొమ్ము ప్రభుత్వ ఖాతాలో జమ అవుతుందని సిబ్బంది బదులిస్తున్నారు. ఆడిట్ జరిగినపుడు ప్రభుత్వ ఖాతాలో ఉన్న సొమ్ము జమ అయినట్టు ఉంటుంది. సబ్ రిజిస్ట్రార్ ఖాతాకు వెళ్లక పోవడంవల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వారు చెబుతున్నారు. దీంతో కొన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల సిబ్బంది స్వైపింగ్ మెషీన్లను పక్కన పెట్టేశారు. ప్రభుత్వ ఖజానాకు ఇలా చిల్లు... 30 ఏళ్ల పైబడినవారు ఈసీ తీసుకుంటే రూ.520 రిజిస్ట్రేషన్‌శాఖకు చెల్లించాలి. 30 ఏళ్ల లోపు వారు ఈసీ తీసుకుంటే రూ.220 చెల్లిస్తే సరిపోతుంది. అయితే నగదు రూపంలో కొన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కక్షిదారుల వద్ద నుంచి రూ.520 ఈసీకు తీసుకుని ప్రభుత్వ ఖాతాకు 30 ఏళ్ల లోపు వ్యక్తి తీసుకున్నట్టు చూపించి రూ.220 మాత్రమే జమ చేస్తున్నారు. ఈ కారణంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. గతంలో తాళ్లరేవు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇలాంటి సంఘటనలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా కక్షిదారుడికి ఈసీ కానీ, నకలు కానీ ఇస్తున్నారు. అయితే వారి వద్ద నుంచి తీసుకున్న నగదును ప్రభుత్వ ఖాతాకు జమ చేయకుండా సిబ్బంది జేబుల్లో వేసుకుంటున్న ఉదంతాలు కూడా ఉన్నాయి. స్వైపింగ్ మెషీన్ ద్వారా లావాదేవీలు నిర్వహిస్తే కక్షిదారుడికి నష్టం ఉండదు. ప్రభుత్వ ఆదాయానికి కూడా గండి పడదు. జిల్లాలో అందజేసిన 32 స్వైపింగ్ మెషీన్లను ఆయా రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వినియోగిస్తున్నారా? లేదా? అనే అంశాన్ని డీఐజీ పట్టించుకుంటే ఈ అక్రమాలను అరికట్టవచ్చు. -
నిర్లక్ష్యపు తుప్పు
అక్కరకు రాని ధాన్యం ఆరబోత యంత్రాలు జిల్లాలో నిరుపయోగంగా 12 డ్రయ్యర్లు రూ.1.92 కోట్ల నిధులు నిరుపయోగం ‘రైతే దేశానికి వెన్నెముక’.. రైతు రాజ్యం రావాలి.. రైతు అభివృద్ధే మా ప్రభుత్వ ధ్యేయం.. అంటూ ఊదరగొట్టే నాయకుల మాటలు చాలా వినసొంపుగా ఉంటాయి. వాస్తవంలోకి వచ్చే సరికి రైతు పరిస్థితి దయనీయంగా మారుతోంది. ఆరుగాలం శ్రమించి.. స్వేదాన్ని పసిడి రూపంలోకి మార్చే అన్నదాతలు పంటను అమ్ముకోవడానికి నానా తిప్పలు పడాల్సి వస్తోంది. రైతుల ప్రయోజనం అంటూ వ్యవసాయశాఖ ద్వారా అందజేసిన ధాన్యం ఆర బోత యంత్రాలు (డ్రయ్యర్లు) ప్రస్తుతం నిరుపయోగంగా పడి ఉన్నాయి. జిల్లాలో పంపిణీ చేసిన 12 ఆరబోత యంత్రాలకు నిర్లక్ష్యపు తుప్పు పట్టడంతో రూ.1.92 కోట్లు నిరుపయోగం అయ్యే పరిస్థితి తలెత్తింది. – రాయవరం ఏటా ఖరీఫ్‌లో పంట చేతికంది వచ్చే సమయంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా అక్టోబరు, నవంబరు నెలల్లో వచ్చే తుపాన్లు కారణంగా పంట వర్షార్పణం అవుతుంది. ఆ సమయంలో వరి పనలు తడవడం, తడిసిన ధాన్యం ఆరబోసుకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. తడిసిన ధాన్యం సరిగ్గా ఆరక పోవడంతో సరైన ధర దక్కక అన్నదాత నష్టపోతున్నాడు. దీంతో రైతులను ఆదుకునేందుకు వ్యవసాయశాఖ ఆరబోత యంత్రాలను సబ్సిడీపై ఇవ్వాలని నిర్ణయించింది. ఇవి రైతులకు ఆశాకిరణంగా నిలుస్తాయనుకుంటే నిరాశకు గురిచేశాయి. నాణ్యతాలోపం..రైతుల అవసరాలకు తగినట్లుగా లేకపోవడంతో అక్కరకు రాకుండా పోయాయి. ఫలితంగా వాటికి నిర్లక్ష్యపు తుప్పు పట్టి పాడైపోయే పరిస్థితికి చేరుకుంటున్నాయి. అప్పట్లో ఏమన్నారంటే.. ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యానికి మద్దతు ధర లభించాలంటే తేమ 17 శాతం ఉండాలి. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మిల్లర్లు కూడా తేమశాతం ఆధారంగానే ధర నిర్ణయిస్తారు. ఈ పరిస్థితుల్లో 17 శాతం ఆరుదలకు ఆరబోత యంత్రాలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని.. గంటసేపు యంత్రం పనిచేస్తే ఐదు టన్నుల ధాన్యం ఆరబోస్తుందని గతంలో వ్యవసాయశాఖ చెప్పిన మాట. అయితే దీనికి విరుద్ధంగా ఇది పనిచేయడంతో రైతులు విముఖత వ్యక్తం చేశారు. ఆరబోత యంత్రం గంటకు రెండు లీటర్ల డీజిల్ అవసరమవుతున్నా..కనీసం ఐదు బస్తాల ధాన్యం కూడా ఆరబెట్టడం లేదు. ఒక బస్తా ధాన్యం ఆరబోతకు రూ.70లు ఖర్చవుతుంది. దీంతో సొసైటీలు ఈ యంత్రాలను మూలనబెట్టాయి. భారీ యంత్రాలను భద్రపర్చేందుకు కూడా వీలు కాక ఆరుబయటే వదిలివేయడంతో తుప్పుపట్టిపోతున్నాయి. రూ.1.92 కోట్లు నిరుపయోగం.. జిల్లాలో ఏటా 2.20 లక్షల హెక్టార్లలో వరిసాగు జరుగుతుంది. తద్వారా ఏటా 10 నుంచి 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుంది. తడిసిన ధాన్యం ఆరబోసుకునేందుకు 2014 రబీలో ధాన్యం ఆరబోత యంత్రాలను వ్యవసాయశాఖ ద్వారా కొనుగోలు చేశారు. జిల్లాలో సోమేశ్వరం, కరప, కాజులూరు, దుగ్గుదూరు, కొంకుదురు, కొమరిపాలెం, చోడవరం, దేవగుప్తం, జెడ్.మేడపాడు, సామర్లకోట, భీమనపల్లి, జి.మేడపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు వీటిని రాయితీపై అందించారు. ఒక్కో ఆరబోత యంత్రం విలువ రూ.16 లక్షలు. ఇందులో సహకార సంఘం రూ.4 లక్షలు చెల్లిస్తే..మిగిలిన రూ.12 లక్షల సొమ్మును రాయితీగా వ్యవసాయశాఖ ద్వారా ప్రభుత్వం ఇచ్చింది. అయితే ఒక్క యంత్రం కూడా పనిచేయలేదు. ఫలితంగా రూ.1.92 కోట్ల సొమ్ము నిరుపయోగమైందనే విమర్శలు విన్పిస్తున్నాయి. -
దమ్ముంటే షూట్ చేయండి.. అయితే...!
పణాజి: రక్షణ శాఖ మంత్రి మనోహరి పారికర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారిక బుల్లెట్ ప్రూఫ్ కారును వదిలేసా.. దమ్ముంటే కాల్చు కోండి అంటూ తన ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. గోవాలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన ఆయన తాను బుల్లెట్ ప్రూఫ్ కాని మామూలు కారులో ప్రయాణిస్తున్నానని, తనను ఎవరైనా షూట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. తన అధికారిక బుల్లెట్ ప్రూఫ్ అంబాసిడర్ కారు ప్రతి రెండు రోజులకు ఒకసారి ఇబ్బంది పెడుతోందని చెప్పుకొచ్చిన పారికర్ ఇక దానికి గుడ్ బై చెప్పాల్సిన సమయం వచ్చిందని భావిస్తున్నాన్నారు. అందుకే మామూలు వైట్ కారు (బుల్లెట్ ప్రూఫ్ కాని)అడిగానన్నారు. ఎవరైనా తను కాల్చి చంపాలనుకుంటే...షూట్ చేసుకోవచ్చని సవాల్ చేశారు. అయితే కాల్చిన వాళ్లను ప్రాణాలతో ఢిల్లీకి చేరనివ్వమంటూ పారికర్ హెచ్చరించారు -
వారసుడి దోపిడి
తండ్రి పేరు చెప్పి తనయుడి దందా పేదల జాగాలపై పైసలేరుకుంటున్న పుత్రరత్నం పట్టాకు పక్కాగా రూ.30 వేల వసూలు ఇంటి స్థలం ఎక్కడ పోతుందోనని బెంగటిల్లుతున్న పేదలు అడిగినంతా ముట్టజెబుతున్న వైనం నాయకులు తమ పిల్లలకు ఆస్తులతోపాటు రాజకీయ వారసత్వం కూడా ఇస్తారని అందరికీ తెలుసు. కానీ కోనసీమలోని ఒక కీలక నేత రాజకీయ వారసత్వాన్నే కాకుండా పేదలను దోచుకునే వారసత్వాన్ని కూడా తనయుడికి అప్పగించినట్టున్నాడు. ఇదివరకు టీడీపీ పాలనలో పనికి ఆహారం పథకం బియ్యాన్ని ఆ నేత బొక్కేశాడు. ఇప్పుడు అతగాడి తనయుడి వంతు వచ్చింది. ఇళ్ల పట్టాల కేటాయింపు పేరుతో ఆ పుత్రరత్నం నిరుపేదలను పీక్కు తింటున్నాడు. పట్టాకో రేటు కట్టి.. అడిగినంతా ముట్టజెప్పాలంటూ దందా చేస్తున్నాడు. ఈ దందాగిరీకి కోనసీమలోని పి.గన్నవరం నియోజకవర్గం కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. సాక్షి ప్రతినిధి, కాకినాడ : నియోజవర్గ కేంద్రమైన పి.గన్నవరంలోని తహసీల్దార్ కార్యాలయం రోడ్డు, చిట్లంకపేట, బోడపాటివారిపాలెం ప్రాంతాల్లోని ఆరెకరాల్లో 699 మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ఐదేళ్ల కిందటే ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా అన్ని అర్హతలూ ఉన్న 224 మందితో ఓ జాబితా కూడా తయారుచేశారు. అయినప్పటికీ ఆ స్థలాలు పల్లంగా ఉండటం, ఇంటి రుణాల మంజూరు తదితర కారణాలతో ఇప్పటివరకూ పట్టాల పంపిణీ జరగలేదు. కానీ, ఎంపిక చేసిన జాబితా మాత్రం రెవెన్యూ నుంచి గృహనిర్మాణ సంస్థకు వెళ్లింది. ఈ విషయం నియోజకవర్గంలోని ముఖ్యనేత పుత్రరత్నం దృష్టిలోకి వచ్చింది. ఆ జాబితాలో ఉన్నవారందరికీ ఇప్పుడు యథాతథంగా పట్టాలు ఇచ్చేస్తే తమకేం లాభమని ఆలోచించాడు. ఇంకేముంది! ఆ జాబితా దుమ్ము దులిపి డబ్బులు దండుకొనేందుకు అనుచరులతో కలిసి మాస్టర్ ప్లాన్ వేశాడు. దండుకునే పథకం వేశాడిలా.. గత ప్రభుత్వ హయాంలో తయారైన జాబితాలో అవకతవకలున్నాయని, దీనిపై రీ సర్వే చేయాలని తన తండ్రి ద్వారా రెవెన్యూ అధికారులకు సిఫారసు చేయించాడు. అందుకు రెవెన్యూ యంత్రాంగం సై అంది. రీ సర్వే మొదలుపెట్టింది. సరిగ్గా ఇదే సమయంలో ఆ పుత్రరత్నం ఆ జాబితా కాపీని తన అనుచరుల చేతిలో పెట్టాడు. వారు ఆయా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్తున్నారు. పట్టా కావాలంటే రూ.30 వేలు ఇవ్వాలంటూ బల వంతపు వసూళ్లకు తెగబడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో రూపొందిన ఆ జాబితాలో ఉన్నవారిలో చాలామంది అప్పటి పాలక పక్షానికి చెందినవారే. జాబితాలో వారిని కొనసాగించాలంటే సొమ్ములు చేతిలో పెట్టాల్సిందేనని ముఖ్యనేత తనయుడి అనుచరులు హుకుం జారీ చేస్తున్నారు. తాజా జాబితా నుంచి కూడా దండుడు గతంలో మంజూరైన 224 పట్టాలకు తోడు ప్రస్తుతం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి సిఫారసుతో మరో 450 మంది జాబితా తయారీలో రెవెన్యూ అధికారులున్నారు. ఇందులో కూడా ఆ ముఖ్యనేత తనయుడు నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే పథకాన్ని రచించాడు. ఒకవైపు అధికారులు సర్వే చేస్తూండగా, మరోవైపు ఆ పుత్రరత్నం వసూళ్ల పర్వానికి శ్రీకారం చుట్టాడు. అతడి అనుచరులు పేదల వద్దకు వెళ్లి రూ.30 వేలు ఇస్తేనే జాబితాలో పేరుంటుందని, లేకుంటే స్థలం రాదని బెదిరించి మరీ దోచేస్తున్నారు. దీంతో తమకు ఎక్కడ స్థలం రాదోనన్న భయంతో పేదలు అప్పులు చేసి మరీ ఆ నేత తనయుడికి ముడుపులు సమర్పించుకుంటున్నారు. ఇప్పటికే వందమంది ఆ ముఖ్యనేత తనయుడి చేతిలో డబ్బులు పెట్టేశారని సమాచారం. ఈ విషయం బయటకు పొక్కితే స్థలం రాకుండా పోతుందని గట్టిగా హెచ్చరించడంతో వారంతా మిన్నకుండిపోతున్నారు. లక్ష్యం.. అక్షరాలా రూ.10 లక్షలు గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఇళ్ల పట్టాల కేటాయింపునకు సంబంధించి, ప్రస్తుతం ఆ ముఖ్య నేత తనయుడి వసూలు లక్ష్యం రూ.10 లక్షలు. ఈ మొత్తాన్ని పేదల నుంచి గుంజేందుకుగానూ.. ఐదేళ్ల క్రితం 224 పట్టాలు పొందినవారిలో సగానికి పైగా అనర్హులేనని తమ అనుచరగణంతో బయట ప్రచారం చేయిస్తున్నారు. ఈ ప్రచారంతో లబ్ధిదారులే తనవద్దకు పరుగెత్తుకు వచ్చి పట్టాలు రద్దు కాకుండా చూడాలంటూ ప్రాధేయపడతారన్నది అతగాడి వ్యూహం. ఇది పక్కాగా వర్కవుట్ అయ్యింది. ప్రస్తుతం పి.గన్నవరం పరిసర ప్రాంతాల్లో సెంటు భూమి ధర రూ.లక్ష పైనే ఉంది. నాటి జాబితా ప్రకారం ఒక్కొక్కరికి రెండు సెంట్ల జాగా వస్తుంది. అంటే లబ్ధిదారులు పొందే స్థలం విలువ రూ.2 లక్షలన్న మాట. దీంతో రూ.30 వేలు సమర్పించుకున్నా రూ.2 లక్షల విలువైన స్థలం వస్తుందని లబ్ధిదారులు ఆశ పడుతున్నారు. సరిగ్గా దీనినే ముఖ్యనేత తనయుడు సొమ్ము చేసుకుంటున్నాడు. -
డోంట్‌వర్రీ...ఇన్వెర్టర్ రెడీ
తక్షణ విద్యుత్‌కు చక్కని పరిష్కారం నగరంలో పెరుగుతున్న ఇన్వర్టర్ల వాడకం ఏడాదికి రూ.నాలుగు కోట్ల వ్యాపారం పాతపోస్టాఫీసు : బయట నిప్పులు కక్కుతున్న సూరీడు. ఇంట్లో ఫ్యాన్ వేసుకుందామంటే పవర్ కట్. పొద్దంతా ఎండ వేడిలో కష్టపడి ఇంటికి చేరుకున్న సగటు వ్యక్తికి కాస్త ఉపశమనం పొందే అవకాశం కనిపించడం లేదు. అర్ధరాత్రి కరెంటు పోయిందా ఇక అంతే సంగతులు. ఇంట్లో చంటిబిడ్డలు ఉంటే ఆ బాధ చెప్పలేనివి కావు. కరెంటు కష్టాల నుంచి గట్టెక్కడానికి సామాన్యులు సైతం ఇన్వర్టర్లను ఆశ్రయిస్తున్నారు. ఒకప్పుడు ధనవంతులకు మాత్రమే పరిమితం అయిన ఇన్వర్టర్లు ఇపుడు మధ్యతరగతికి కూడా అందుబాటులోకి వచ్చింది. ఇళ్లకే కాదు కార్యాలయాలు, వ్యాపార కేంద్రాలు, ఆసుపత్రులు, దుకాణాలు ఇలా ఒకటేమిటి అన్ని చోట్ల ఇన్వర్టర్ల వాడకం పెరిగింది. అత్యాధునిక టెక్నాలజీ ప్రస్తుతం మార్కెట్లో లభ్యం అవుతున్న ఇన్వర్టర్లు అత్యాధునిక సైన్వేవ్ టెక్నాలజీతో తయారైనవి లభిస్తున్నాయి. ఈ పరిజ్ఞానం వల్ల గృహోపకరణాలకు నూరు శాతం కచ్చితమైన విద్యుత్ సరఫరాను అందిస్తాయి. ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాధారణ విద్యుత్ మాదిరిగానే వేవ్స్ రూపంలో విద్యుత్‌ను సరఫరా చేయడం వల్ల గృ హోపకరణాలు ఎక్కువ కాలం మన్నుతాయి. వేవ్ టెక్నాలజీ బ్యాటరీలోని నీటి ప్రవాహాన్ని నియంత్రించి ఇన్వర్టర్లలో కీలకమైన బ్యాటరీ జీవితాకాలాన్ని పెంచుతుంది. సాధారణ ఇన్వర్టర్లతో పోల్చితే సైన్వేవ్ టెక్నాలజీ ఇన్వర్టర్లు 50 శాతం విద్యుత్‌ను ఆదా చేస్తాయి. ఓవర్‌లోడ్ నుంచి రక్షణ కల్పిస్తాయి. ఇన్వర్టర్ల జీవిత కాలం బాగుండాలంటే నాలుగు నుంచి ఆరు నెలలకు ఒకసారి బ్యాటరీలోని డిస్టిల్ వాటర్ లెవెల్ తనిఖీ చేయించాలి. నిర్వహణ తక్కువగా ఉన్న బ్యాటరీకైనా తనిఖీ తప్పనిసరి నాలుగు నుంచి ఆరు నెలలకు ఒకసారి బ్యాటరీ నుంచి ఇన్వర్టర్ల టెర్మినల్స్ వద్ద పెట్రోలియం జెల్లీ పూయాలి లో బ్యాటరీ ఇండికేటర్ వెలిగినపుడు ఇన్వర్టర్ వాడకుండా, ఛార్జింగ్‌లో ఉంచి గ్రీన్ ఇండికేటర్ వచ్చిన తరువాతనే వాడాలి. లేకుంటే కాలిపోతుంది. ఇన్వర్టర్లతో వచ్చిన కంపెనీ మాన్యువల్‌ను ఎప్పటికప్పుడు అనుసరిస్తే బ్యాటరీ, ఇన్వర్టర్ల జీవితకాలం పెరుగుతుంది. అవసరాలకు తగిన విధంగా ఒక ట్యూబ్‌లైట్, ఫ్యాన్ పనిచేయాలంటే 250 వీఏ ఇన్వర్టు అవసరం అవుతుంది. దీనికి 60 ఏహెచ్ బ్యాటరీ అనుసంధానించబడుతుంది. మూడు గంటల పాటు నిరంతరాయంగా పనిచేస్తుంది. దీని ధర సుమారుగా రూ.6 వేల వరకూ ఉంది రెండు ట్యూబ్‌లైట్లు, రెండు ఫ్యాన్లు పనిచేయాలంటే 400 వీఏ ఇన్వర్టర్ అవసరం. దీనికి 100 ఏహెచ్ బ్యాటరీ అమర్చుతారు. సుమారు రెండు గంటల పాటు పనిచేస్తుంది. ధర రూ.10 వేలు మూడు ట్యూబ్‌లైట్లు, మూడు ఫ్యాన్లు ఒక టీవీ పనిచేయాలంటే 650 వీఏ ఇన్వర్టర్ అవసరం అవుతుంది. దీనికి 100, 135, 150 ఏహెచ్ కెపాసిటీ గల ఏ బ్యాటరీ అయినా అమర్చుకోవచ్చు. బ్యాటరీ కెపాసిటీని బట్టి రూ.11 వేల నుంచి రూ.18 వేల వరకూ ఉంది. రెండు నుంచి నాలుగు గంటల సేపు నిర్విరామంగా పనిచేస్తుంది. నాలుగు ట్యూబ్‌లైట్లు, 4 ఫ్యాన్లు, ఒక టీవీ పనిచేయాలంటే 850 వీఏ ఇన్వర్టర్ అవసరం. 100 నుంచి 150 ఏహెచ్ కెపాసిటీ గల ఏ బ్యాటరీ అయినా వాడవచ్చు. కెపాసిటీని బట్టి దీని ధర రూ.14 వేల నుంచి రూ.18 వేల వరకూ ఉంది. రెండు నుంచి నాలుగు గంటలసేపు పనిచేస్తుంది. లక్ష రూపాయల పెట్టుబడితో 1.5టన్ను ఏసీతో పాటు 5 ట్యూబ్‌లైట్లు,5 ఫ్యాన్లు కూడా పనిచేయించవచ్చు. సోలార్ ఇన్వర్టర్లను వినియోగించాలంటే ముందుగా వాటిని ఛార్జిచేయడానికి విద్యుత్‌ను ఉపయోగించాలి. దానివల్ల విద్యుత్ వినియోగంలో తేడా పెద్దగా కనిపించదు. ఎక్కువ సమయం విద్యుత్‌కు అంతరాయం ఏర్పడితే బ్యాటరీలు రీఛార్జ్ కావడం కష్టమే. దీనికి విరుగుడుగా సోలార్ ఇన్వర్టర్లు మార్కెట్లో లభ్యం అవుతున్నాయి. మామూలు వాటితో పోల్చితే ఖరీదు అధికంగానే ఉన్నా జీవితకాలం పాటు ఇబ్బందులు లేకుండా వినియోగించుకోవచ్చు. పర్యావరణానికి ముప్పు వాటిల్లే అవకాశమే లేని సోలార్ ఇన్వర్టర్ల వినియోగానికి ప్రభుత్వం రాయితీ కూడా ఇస్తోంది. అమ్మకాలు ఇలా... పవర్‌కట్ అధికంగా ఉన్న రోజుల్లో ఏడాదికి నగర వ్యాప్తంగా ఐదు నుంచి ఏడు కోట్ల వరకూ అమ్మకాలు జరిగాయి. ప్రస్తుతం పవర్ కట్ తక్కువగా ఉన్నా ఏడాదికి సుమారుగా మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. పాత వినియోగదారులు తమవద్దనున్న పాత ఇన్వర్టర్లను రిప్లేస్మెంట్ చేయించుకుని ఉపయోగించుకొంటున్నారు. లోకల్‌మేడ్ ఇన్వర్టర్ల కంటే బ్రాండెడ్ ఇన్వర్టర్స్కే ప్రాధాన్యం ఇస్తున్నారు. -
డ్రోన్ ద్వారా క్లినికల్ శాంపిల్స్ చేరవేత
-
డ్రోన్ ద్వారా క్లినికల్ శాంపిల్స్ చేరవేత
న్యూయార్క్: ప్రపంచంలో దాదాపు వందకోట్ల మంది ప్రజలు ఆరోగ్య సౌకర్యాలకు దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా కొండ కోనల్లో, అటవి ప్రాంతాల్లో నివసించే గిరిజనులు సకాలంలో వైద్య సౌకర్యాలు అందక అకాల మృత్యువాత పడుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఆరోగ్య కేంద్రాలకు వెళ్లాలంటే పదుల కిలోమీటర్లు కాలి నడకన వెళ్లాల్సిందే. అప్పుడప్పుడు వైద్య బృందాలు ఆయా ప్రాంతాలకు వెళ్లి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నా, వారికి సరైన ల్యాబ్ సౌకర్యాలు అందుబాటులో ఉండడం లేదు. మరి ఇలాంటి పరిస్థితులో పరిష్కార మార్గం ఏమిటీ? దీనికి మిచిగాన్‌లోని వాయు ఏరియల్ సొల్యూషన్స్ కంపెనీ ఓ మంచి పరిష్కార మార్గాన్ని కనుగొన్నది. మారుమూల ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల్లోని ల్యాబ్‌లకు క్లినికల్ ల్యాబ్ శాంపిల్స్‌ను డ్రోన్ల ద్వారా పంపించవచ్చని ఆచరణాత్మకంగా నిరూపించింది. గత జూలై 27వ తేదీన ఆఫ్రికాలోని ఓ మారుమూల ప్రాంతంలో ప్రజల నుంచి సేకరించిన బ్లడ్ శాంపిల్స్‌ను డ్రోన్ ద్వారా సెంట్రల్ ల్యాబ్‌కు పంపించింది. ప్రపంచంలో క్లినికల్ శాంపిల్స్‌ను ఓ చోటు నుంచి మరో చోటుకు చేరవేయడానికి డ్రోన్‌ను ఉపయోగించడం ఇదే తొలిసారి. దీనికి సంబంధించిన వీడియోను వాయు ఏరియల్ సొల్యూషన్స కంపెనీ ఇప్పుడు విడుదల చేసింది. రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ తమ కస్టమర్లకు సరకులను చేరవేయడానికి డ్రోన్లను ఉపయోగించవచ్చని ఇది వరకే చాటిచెప్పాయి. అయితే డ్రోన్లను ఉపయోగించడం వల్ల ప్రయోజనాలతోపాటు ప్రమాదాలు కూడా పొంచి ఉండడంతో వివిధ దేశాల ప్రభుత్వాలు అందుకు తగిన అనుమతులు మంజూరు చేయడం లేదు. సామాన్య ప్రజల అవసరాల కోసం డ్రోన్లను వినియోగించడాన్ని అనుమతించినట్లయితే డ్రోన్లను ఉపయోగించి టైస్టులు దాడులకు పాల్పడే ఆస్కారముందనేది ప్రభుత్వాల ఆందోళన. -
మహిళా గూఢచారులతో భారత పురుషులకు ఎర!
భారత పురుషులకు ఎరవేసేందుకు పాక్ గూఢచార సంస్థ.. ఐఎస్ఐ కొత్త పంథాను ఎంచుకుంది. సోషల్ మీడియా ద్వారా మహిళా గూఢచారులను రంగంలోకి దింపుతోంది. గతంలో నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనపై, ఆ రాష్ట్రంలో ఇతర లక్ష్యాలపై దాడి చేసేందుకు అప్పట్లో నేపాల్ ఐఎస్ఐ ప్రయోగ కేంద్రాలనుంచి మహిళా గూఢచారులను ఇండియాలోకి ప్రవేశపెట్టారు. ఇప్పుడు సామాజిక మాధ్యమాలనే ఆ జిహాదీలు ఆయుధాలుగా వాడుకుంటూ ఇండియాలోని పురుషులకు ఎరవేస్తున్నారు. ఇటీవలి కాలంలో మహిళా గూఢచారుల కేసులు వెలుగు చూడటంతో పోలీసు నిఘా ముమ్మరం చేశారు. 2014 ఆగస్టు నుంచి నవంబర్ వరకు ఫిరోజ్ పూర్ కంటోన్మెంట్ ప్రాంతంలో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ భారతీయులు కావడం వారి అనుమానాలకు మరింత బలాన్నిచ్చింది. నిందితులను పోలీసులు విచారించగా కొత్త కోణాలు వెలుగుచూశాయి. ఇండో పాక్ చెక్ పోస్టు దగ్గరి గుస్సేన్ వాలా ప్రాంతాన్నిమహిళా గూఢచారులు రెండుసార్లు సందర్శించినట్లు తెలిసింది. వీరిద్దరినీ విడివిడిగా ట్రాప్ చేసిన ఐఎస్ఐ ఏజెంట్ జయ మిశ్రాతో వీరికి సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. ఇద్దరు నిందితుల్లో ఒకరు మధ్యప్రదేశ్ భోపాల్ జిల్లాకు చెందిన 43 ఏళ్ల శివ్ నారాయణ్ చంద్రవంశం గానూ, మరొకరు 35ఏళ్ల అర్జున్ మాలవ్యగాను గుర్తించారు. ఈ నిందితులిద్దరూ ఐఎస్ఐ మహిళా ఏజెంట్ జయ మిశ్రాతో ఇంటర్నెట్ లో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నట్లు ఫిరోజ్ పూర్ పోలీస్ సీనియర్ సూపరింటెండెంట్ చెబుతున్నారు. ఐఎస్ఐ ఏజెంటుగా ఉన్న ఆ మహిళా గూఢచారి లాహోర్ లో ఓ క్లినిక్ నిర్వహిస్తోందని, ఆమె నల్లతేళ్లతో తయారు చేసిన ఔషధాలను సమాజసేవ కోసం వినియోగిస్తోందని పోలీసుల దర్యాప్తులో తేలింది. సో... భారత పురుషులు మహిళల పేర్లు కనిపించగానే కనెక్ట్ అయిపోకుండా సామాజిక మాధ్యమాల్లో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సిందే మరి.