దమ్ముంటే షూట్ చేయండి.. అయితే...! | Using non-bullet proof car, Parrikar dares enemy to shoot him | Sakshi
Sakshi News home page

దమ్ముంటే షూట్ చేయండి.. అయితే...!

Published Mon, Nov 28 2016 12:04 PM | Last Updated on Mon, Sep 4 2017 9:21 PM

దమ్ముంటే షూట్ చేయండి.. అయితే...!

దమ్ముంటే షూట్ చేయండి.. అయితే...!

పణాజి: రక్షణ శాఖ మంత్రి మనోహరి పారికర్  సంచలన వ్యాఖ్యలు చేశారు.  అధికారిక  బుల్లెట్ ప్రూఫ్ కారును వదిలేసా.. దమ్ముంటే   కాల్చు కోండి అంటూ తన ప్రత్యర్థులకు  సవాల్ విసిరారు.  గోవాలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన ఆయన  తాను బుల్లెట్ ప్రూఫ్  కాని  మామూలు కారులో  ప్రయాణిస్తున్నానని, తనను ఎవరైనా  షూట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు.

తన అధికారిక బుల్లెట్ ప్రూఫ్ అంబాసిడర్  కారు ప్రతి రెండు రోజులకు ఒకసారి ఇబ్బంది పెడుతోందని చెప్పుకొచ్చిన  పారికర్  ఇక దానికి గుడ్ బై చెప్పాల్సిన సమయం వచ్చిందని భావిస్తున్నాన్నారు. అందుకే  మామూలు  వైట్ కారు (బుల్లెట్  ప్రూఫ్ కాని)అడిగానన్నారు. ఎవరైనా తను కాల్చి చంపాలనుకుంటే...షూట్ చేసుకోవచ్చని సవాల్ చేశారు. అయితే కాల్చిన వాళ్లను ప్రాణాలతో ఢిల్లీకి  చేరనివ్వమంటూ   పారికర్  హెచ్చరించారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement