shoot him
-
టొరంటోలో పాదచారులపై కాల్పులు
టొరంటో: కెనడాలోని టొరంటోలో పాదచారులపై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, పలువురికి గాయాలయ్యాయి. నిందితుడు పోలీసుల కాల్పుల్లో మరణించాడు. ముఖానికి నల్లటి ముసుగు ధరించిన ఓ వ్యక్తి టొరంటోలోని గ్రీక్టౌన్లో ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ పాదచారులపై కాల్పులు జరిపాడు. దుండగుడు దాదాపు 20 నుంచి 30 రౌండ్ల కాల్పులు జరిపి ఉండొచ్చని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాల్పులు జరుగుతుండగానే సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని దుండగుడిపై కాల్పులు జరిపారు. అయితే అక్కడి నుంచి పారిపోయిన ఆ దుండగుడు కొద్ది దూరంలో శవమై కనిపించినట్లు పోలీసులు తెలిపారు. కాల్పులు జరపడానికి కారణాలు ఇంకా తెలియదని, ఘటనపై విచారణ చేపడుతున్నట్లు వివరించారు. -
దమ్ముంటే షూట్ చేయండి.. అయితే...!
పణాజి: రక్షణ శాఖ మంత్రి మనోహరి పారికర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారిక బుల్లెట్ ప్రూఫ్ కారును వదిలేసా.. దమ్ముంటే కాల్చు కోండి అంటూ తన ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. గోవాలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన ఆయన తాను బుల్లెట్ ప్రూఫ్ కాని మామూలు కారులో ప్రయాణిస్తున్నానని, తనను ఎవరైనా షూట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. తన అధికారిక బుల్లెట్ ప్రూఫ్ అంబాసిడర్ కారు ప్రతి రెండు రోజులకు ఒకసారి ఇబ్బంది పెడుతోందని చెప్పుకొచ్చిన పారికర్ ఇక దానికి గుడ్ బై చెప్పాల్సిన సమయం వచ్చిందని భావిస్తున్నాన్నారు. అందుకే మామూలు వైట్ కారు (బుల్లెట్ ప్రూఫ్ కాని)అడిగానన్నారు. ఎవరైనా తను కాల్చి చంపాలనుకుంటే...షూట్ చేసుకోవచ్చని సవాల్ చేశారు. అయితే కాల్చిన వాళ్లను ప్రాణాలతో ఢిల్లీకి చేరనివ్వమంటూ పారికర్ హెచ్చరించారు