టొరంటోలో పాదచారులపై కాల్పులు | Greektown shooting leaves three dead and 12 injured | Sakshi
Sakshi News home page

టొరంటోలో పాదచారులపై కాల్పులు

Published Tue, Jul 24 2018 3:11 AM | Last Updated on Tue, Jul 24 2018 3:11 AM

Greektown shooting leaves three dead and 12 injured - Sakshi

ఘటనాస్థలిలో ఓ మహిళకు రక్షణగా నిలిచిన పోలీసు అధికారిణి

టొరంటో: కెనడాలోని టొరంటోలో పాదచారులపై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, పలువురికి గాయాలయ్యాయి. నిందితుడు పోలీసుల కాల్పుల్లో మరణించాడు. ముఖానికి నల్లటి ముసుగు ధరించిన ఓ వ్యక్తి టొరంటోలోని గ్రీక్‌టౌన్‌లో ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ పాదచారులపై కాల్పులు జరిపాడు. దుండగుడు దాదాపు 20 నుంచి 30 రౌండ్ల కాల్పులు జరిపి ఉండొచ్చని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాల్పులు జరుగుతుండగానే సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని దుండగుడిపై కాల్పులు జరిపారు. అయితే అక్కడి నుంచి పారిపోయిన ఆ దుండగుడు కొద్ది దూరంలో శవమై కనిపించినట్లు పోలీసులు తెలిపారు. కాల్పులు జరపడానికి కారణాలు ఇంకా తెలియదని, ఘటనపై విచారణ చేపడుతున్నట్లు వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement